60 - వైవస్వత మనువు సృష్టి

సూత ఉవాచ :-

తతో మన్వంతరేఽతీతే చాక్షుషే దైవతైః సహ

వైవస్వతాయ మహతే పృథివీరాజ్యమాదిశత్

తస్మాద్వైవస్వతాత్పుత్ర జజ్ఞిరే దశ తత్సమాః

ఇక్ష్వాకుశ్చ నృగశ్చైవ ధృష్టః శర్యాతిదేవ చ

నరిష్యంతస్తథా ప్రాంశుశర్నాభాగో దిష్ట ఏవ చ

కరూషశ్చ పృషధశ నవైతే మానవాః సుతాః

బ్రహ్మణా తు మనుః పూర్వం చోదితస్తు ప్రబోధితమ్

యష్టుం ప్రచక్రమే కామం హయమేధేన భూపతిః

అథాకరోత్పుత్రకామః పరామిష్టిం ప్రజాపతిః

మిత్రావరుణయోరంతే అనలాహంతిమేవయత్

తత్ర దివ్యాంబరధరా దివ్యాభరణభూషితా

దివ్యసంహననా చైవ ఇలా ఆజ్ఞ ఇతి శ్రుతమ్

తామీలేవ్యథ హోవాచ మనుః దండధరస్తతః

అనుగచ్ఛస్వ భద్రం తే తమిలా ప్రత్యువాచ హ

ధర్మయుక్తమిదం వాక్యం పుత్రకామం ప్రజాపతిమ్

మీత్రావరుణయోరంశే జాతాస్మి వదం వర

తయోః సకాశం యాస్యామి మాఽతో ధర్మో హతోఽవధీత్

ఏవముక్తా పునర్దేవీ తయోరంతికమాగమత్

గత్వాంతికం వరారోహో ప్రాజంలిర్వాక్యమబ్రవీత్

అంశేఽస్మిన్యువయోర్జితా దేవో కిం కరవాణి వామ్

మనువైవాహముక్తాస్మి అనుగచ్ఛస్వ మామితి

తథా తు బ్రువనీ సాధ్వీమిజామాశ్రిత్య తావుభౌ

దేవా చ మిత్రావరుణావిదం వచనమూచతుః

అనేన తవ ధర్మజ్ఞే ప్రశ్రయేన దమేన చ

సూతుఁడిట్లు చెప్పెను.

చాక్షుష మన్వంతరము దేవతలతో సహితముగా గడచినది. మహాత్ముఁడైన వైవస్వతునకు బ్రహ్మ పృథ్వీరాజ్యమొసంగెను. ఆ వైవస్వతునకు - తత్తుల్యురయిన పదిమంది కుమారులు. వారు-ఇక్ష్వాకుడు, నృగుఁడు, ధృష్ణుఁడు, శర్యాతి, నరీష్యంతుఁడు, ప్రాంశుఁడు, నాభాగుఁడు, దిష్ణుఁడు, కురూషుఁడు, పృషధ్రుండును. వీరు మానవులుగా సంస్కృతులు (3) బ్రహ్మ పూర్వము ప్రచోదనము మొనర్చి, ప్రబోధ చేసిన యట్లు తన యభిప్రాయము ననుసరించి వైవస్వతుఁడు అశ్వమేధయాగముచేయ సంకల్పించెను. పుత్రుకాముఁడై ప్రభువు మిక్కిలి యిష్టమైన యజ్ఞము నాచరించేను. మిత్రావరుణులకు తదుద్దీష్ట స్థలమున అనలాహుతి నాచరించెను. అందు, దివ్యాంబరధరయు, దివ్యాభరణ భూషితయు, దివ్య సంహననయునగు ‘ఇల’ పుట్టెను, అనీ శ్రుతియందున్నది. దండ ధరుఁడయిన మనువు ఆమెతో మాటలాడెను-నీకు భద్రమగుగాక నన్ననుసరించి రమ్ము. ఇల -పుత్రకాముఁడయిన ప్రజాపతీతో ధర్మ యుక్తమయిన యీ వాక్యమును పలికెను. “ప్రాజ్ఞులలో శ్రేష్ఠుఁడా ! మిత్రావరుణుల యంశమున పుట్టితిని. వారి సన్నిధికి పోయెదను. అందుచే ధర్మము హతము కాకుండు గాక”, ఈ విధముగా పలికి ఆ. దేవీ మీత్రా వరుణుల కడకేగెను. వారి దగ్గరకు వెళ్ళి దోసిలొగ్గి యిట్లు పలికెను,” “నేను మీ యిర్వుర యొక్క యంశవలనఁబుట్టితిని. మీకు నేనేమి చేయుదును”. మనువు నాతో నన్ననుసరించుమని చెప్పెను”. ఇట్లు ‘ఇల’ పలికిన వేనుక, మిత్రావరుణులిద్దరు ఈ వాక్యము పలికిరి. “ఓ సుశ్రోణి ! ఓ వరవర్ణిని !. ఓ ధర్మజ్ఞురాలా ! భవదీయ వినయము చేతను; ఇంద్రియ నిగ్రహము చేతను, సత్యము చేతను సంప్రీతులమయితిమి.

సత్యేన చైవ సుశ్రోణి ప్రీతౌ స్వౌ వరవర్ణిని

ఆవయోస్త్వం మహాభాగే ఖ్యాతం కన్యే ప్రయాస్యసి

సుద్యుమ్న ఇతి విఖ్యాతస్లీషులోకేషు పూజితః

జగత్ప్రియో ధర్మశీలో మనోర్వంశవివర్ధనః

మానవః స తు సుద్యుమ్నః స్త్రీభావగమత్ర్పభుః

సా తు దేవీ వరం ల్వ నివృత్తా పితరం ప్రతి

బుధేనోత్తరమాసాద్య మైథునాయోపమంత్రితా

సోమపుత్రాద్భుధాచ్ఛాస్యామైలో జజ్ఞే పురూరవాః

బుధాత్మా జనయిత్వా తు సుద్యుమ్నత్వం పునర్గతాః

సుద్యుమ్నస్య తు దాయాదాస్త్రయః పరమధార్మికాః

ఉత్కలశ్చ గయశ్చైన వినతశ్చ తథైవ చ

ఉత్కలస్యోత్కలం రాష్ట్రం వినతస్యాపి పశ్చిమమ్

దిక్పూర్వా తస్య రాజరేర్గయస్య తు గయాపురీ

ప్రవిడ్డే తు మనౌ తస్మిన్ ప్రజాః సృష్ట్వా దివాకరమ్

దశధా తదధాత్ క్షత్రమకరోత్పృథివీమిమామ్

ఇక్ష్వాకురేవ దాయాదో భాగం దశమమాప్తవాన్

కన్యాభావాత్తు సుద్యుమ్నే నైవభాగమవాప్తవాన్

వశిష్ఠవచనాచ్చాతతిషానే మహాద్యుతిః

ప్రతిష్ణాం ధర్మరాజస్య సుద్యుమ్నస్య మహాత్మనః

ఏతచ్భుత్వా తు ఋషయః పప్రచ్ఛుః సూరజం ప్రతి

మానవః స తు సుద్యుమ్నః స్త్రీభావమగమత్కథమ్

సూత ఉవాచ :-

పురా మహేశ్వరం ద్రష్టుం కుమారాః సనకాదయః

ఇలావృతం సమాజగ్ముర్దడర్భశుర్వృషభధ్వజమ్

నీవు ఖ్యాతిని పొందెదవు. నీవు సుద్యుమ్నవుగా మూఁడు లోకముల యందు వీఖ్యాతవు పూజితవు నగుదువు. నీవు జగత్రియవు, ధర్మశీలవు, మనువంశ వివర్ధినివియుఁకాగలవు (14) అనిరి. మీత్రావరుణుల నుండి వరమును పొంది ఆమె తండ్రి కడకరిగెను. మనువు కుమారుఁడయిన సుద్యుమ్నుడు మరల స్త్రీ భావమును పొందెను. తరువాత బుధుఁడామెను వచ్చి కలిసి మైథునమునకు ఆమంత్రిత నొనర్చెను. సోమ (చంద్రుని) పుత్రుఁడగు బుధుని వలన ‘ఇల’ పురూరవుని కనెను. బుధుని వలన కుమారునిఁగనిన తరువాత, ఆమె సద్యుమ్నునీ రూపము సందెను. సుద్యుమ్నునకు మువ్వురు వారసులు, వారు పరమ ధార్మికులు. వారు - ఉత్కలుఁడు, గయుఁడు, వినతుఁడు. ఉత్మలుఁడు ఉత్కల రాష్ట్రమును, పశ్చిమదేశమును వినతుఁడు, పొందిరి. పూర్వ దిశయందున్న, గయా పట్టణమును రాజర్షియైన గయుఁడు పొందెను. ప్రజలను సృష్టించిన తరువాత మనువు సూర్యుని ప్రవేశించీ, భూమీ నంతటీని దశభాగముల వీభజించెను. ఈ పృధివిని దశధాక్షత్త మొనర్చెను. దాయాదియయిన ఇక్ష్వాకుఁడు పదవ భాగమును పొందెను. (20) సుద్యుమ్నుడు కన్యగా నుండుటచే యీ రాజ్య విభాగమున నెట్టి భాగమును పొందలేదు. వసిష్టుని వచనమున మహాద్యుతియైన ప్రద్యుమ్నుఁడు ప్రతిష్టానమున ప్రభువయ్యెను. మహాత్ముఁడు ధర్మరాజునునైన సుద్యుమ్నుని ప్రతిష్ఠను గూర్చి విని ఋషులు సూతజుని “మానవుఁడయిన సుద్యుమ్నుఁడు స్త్రీ భావమెట్లు పొందే నని యడిగిరి. సూతుఁడిట్లు చెప్పెను. పూర్వము వృషభద్వజుఁడయిన మహేశ్వరుని దర్శింప సనకాదికుమారులు ఇలా వృతమునకు వచ్చిరి.

ఉమయా రమమాణం తం విలోక్య పిహితే స్థలే

ప్రతిజగ్ముస్తతసర్వే వ్రీడితాఽభూచ్చివాప్యథ

ప్రోవాచ వచనం దేవీ ప్రియహేతోః ప్రియం ప్రియా

ఇమం మమాశ్రమం దేవ యః పుమానం ప్రవేక్ష్యతి

భవిష్యతి ధ్రువం నారీ స తుల్యాప్సరసాం శుభా

తత్ర సర్వాణి భూతాని పిశాచాః పశవశ్చ యే

స్త్రీభూతాః సహ రుద్రేణ క్రీడంత్యప్సరసో యథా

ఉమావనం ప్రవిష్టస్తు స రాజా మృగయాం గతః

పిశాచైః సహ భూతైస్తు రుద్రే స్త్రీభావమాస్థితే

తస్మాత్స రాజా సుద్యుమ్నః స్త్రీభావం లబ్ధవాన్ పునః

మహాదేవ ప్రసాదాచ్చ మానవత్వ మవాప్తవాన్

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే మధ్యభాగే వాయుప్రోక్తే వైవస్వతమనోః సృష్టిర్నామ షష్టితమోఽధ్యాయః

వృషభధ్వజుఁడయిన శివుఁడు ఉమతో వివిక్త ప్రదేశమున రమించు చుండుట చూచిరి. అందరు వెనుకకు మరలిపోయిరి. వారిని చూచి శివ(పార్వతి) సిగ్గునొందెను. ప్రియురాలయిన ఉమ ప్రియునితో తనకు ప్రియము కారణముగా నిట్లనెను. “ఓ ప్రభూ ! పురుషుడెవ్వడీ యాశ్రమమును ప్రవేశించునో, ఆతఁడు అప్సరఃకన్యాతుల్యయయిన స్త్రీ యగును”, అనెను. అందుచే అచ్చటి పిశాచములు, సర్వభూతములు, జంతువులు స్త్రీలయిరీ, వారందరు రుద్రునితో అప్సరసలవలె క్రీడించుదురు. ఆరాజు వేటకై ఉమా వనమును ప్రవేశించే పిశాచములతో సహా సర్వభూతములు రుద్రునితో సహితముగా స్త్రీ భావమును పొందగా, అప్పుడు ఆ హేతువు వలన సుద్యుమ్నుండు స్త్రీ భావమును పొందెను. మరల మహాదేవ ప్రసాదము వలన ఆ ప్రభువు మానవత్వము పొందెను.

ఇది మహాపురాణము వాయుప్రోక్తమునయిన బ్రహ్మాండపురాణమున, మధ్యమభాగమున, వైవస్వతమనువు సృష్టి యనెడు అరువదవ అధ్యాయము.