53 - సగరచరిత్రము - సాగరుల వినాశనము

జైమినిరువాచ :-

తేషు తత్ర నివిష్టేషు వాసవేన ప్రచోదితః ।

 జహార తురగం వాయుస్తత్క్షణేన రసాతలమ్ ॥

అదృష్టమశ్వం తైః సర్వైరపహృత్య సదాగతిః ।

అనయత్తత్పఠా రాజన్ కపిలస్యాంతికం మునేః ॥

తతః సమాకులాస్సర్వే వినష్టే శ్వే సృపాత్మజాః ।

 పరీత్య వసుధాం సర్వాం ప్రమార్గంతస్తురంగమమ్ ॥

అపశ్యంతో యజ్ఞపశుం దుఃఖం మహదవాప్నువన్ ॥

తతోయోధ్యాం సమాసాద్య ఋషిభిః పరివారితామ్ ।

దృష్ట్వా ప్రణమ్య పితరం తస్మై సర్వం న్యవేదయన్ ॥

పరీత్య పృథ్వీమస్మాభిర్నివిషే వరుణాలయే ।

రక్ష్యమాడేపీ పశ్యద్భిః కేనాపి తురగో హృతః ॥

ఇత్యుక్తసైరుషావిష్టస్తానువాచ నృపోత్తమః ।

 ఓ ప్రయాస్యధ్యమధర్మిషాః సర్వేనావృత్తయే పునః ॥

కథం భవద్భిర్జీవద్భిః వీనషో వై దురాత్మభిః ।

తురగేణ వినా సత్యం నేహాగమనమస్తి వః ॥

తతః సమేత్య తస్మాత్రే సంప్రయాతాః పరస్పరమ్ ।

ఊచుర్న దృశ్యత్కేద్యాపి తురగః కి ప్రకుర్మహే ॥

 వసుధా విచితాస్మాభిః సశైలవనకాననా ।

 న చాపి దృశ్యతే వాజీ తద్వారాపి న కుత్రచిత్ ॥

తస్మాదళేః సమారభ్య పాతాలావధి మేదినీమ్ ।

విభజ్య ఖాత్వా పాతాళం వివిశామ తురంగమమ్ ॥

ఇతి కృత్వా మతం సర్వే సాగరాః క్రూరనిశ్చయాః ।

 నిచఖుర్భూమీమంభోధేస్తటాదారభ్య సర్వతః ॥

తైః ఖన్యమానా వసుధా రరాస భృశవిహ్వలా ।

చుక్రుశుశ్చాపి భూతానీ దృష్ట్వా తేషాం విచేష్టితమ్ ॥

తతస్తే భారతం ఖండం ఖాత్వా సంక్షిప్య భూతలే ।

భూమేర్యోజనసాహస్రం యోజయామాసురంబుధే ॥

ఆపాతాలతలం తే తు ఖనంతో మేదినీతలమ్ ।

చరంతమశ్వం పాతాళే దదృశుః నృపనందనాః ॥

సంప్రహృష్టాస్తతః సర్వే సమేత్య చ సమంతతః ।

  సంతోషాజ్ఞహసుః కేచిన్ననృతుఃశ్చ ముదాన్వితాః ॥

జైమిని యిట్లనియెను.

వారచటికీ చేరగా ఇంద్రునిచే ప్రచోదితుఁడయిన వాయుదేవుఁడు తత్క్షణముననే పాతాళలోకమునకు ఆయాగాశ్వమును అపహరించుకొని పోయెను. రాజపుత్రులందరికీని కనపడకుండగనే, వాయుదేవుఁడా యశ్వమును అపహరించీ మహామునియైన కపిలుని యొక్క సమీపమునకు తీసికొనివచ్చెను. అంతట అశ్వము కనబడనందున నృపాత్మజులందరు కలవర మొందిరి. ఆ గుఱ్ఱమును వెదకుచు వారు ప్రపంచము నంతటిని చుట్టుముట్టిరి. వారు పర్వతములు నగరులు అరణ్యములు గల భూమినంతటిని వెదకి వెదకి యజ్ఞపశువయిన గుఱ్ఱమును కనక అత్యంత దుః ఖమొందిరి. అంత వారు ఋషులచే పరివృతమయిన యయోధ్యను చేరిరి. తండ్రిని దర్శించిరి. నమస్కరించరీ. సర్వము. నేతనికి నివేదించిరి. “ప్రపంచమంతయును తిరిగిన పిమ్మట మేము సముద్రమును (వరుణాలయమును) ప్రవేశించితిమీ. మేము ఆ యశ్వమును కన్నాకుగా రక్షించుకొని వచ్చుచున్నను, ఎవ్వండో దానిని దొంగిలించు కొని పోయెను”. ఇట్లు వారు చెప్పగా నృపోత్తముఁడు క్రోధాకులుఁడై) అధర్మ పారాయణులారా! ఇచ్చటి నుండీ వెడలిపొండు. తిరిగి మీరు రావద్దు. మీరు జీవించి యుండగా నా గుఱ్ఱము ఓ దురాత్ములారా ! ఎట్లు వినష్టము కాగలదు? తురగము లేకుండ మీరిచ్చటకు వచ్చుటలేదు. ఇదీ సత్యము”, అనెను. అంత వారందరు కూడికానీ, ఆ ప్రదేశము నుండి బయల్వెడలిరి. వారు పరస్పరము “ఇప్పుడు కూడ గుట్టము మనకు కనంబడకపోయినచో మనమేమి చేయుదుము” సశైల కానన యుతముగా నీ వసుంధర నెల్ల గాలించితీమీ. గుఱ్ఱము కానరాలేదు సరి! దాని సంబంధమయిన వార్త కూడ తెలియలేదు.అందుచే సముద్రముతో సొరంభించి, పాతాళము వరకు త్రవ్వి భూమిని విభజించెదము. మనమో పాతాళలోకమున ప్రవేశింతుము. గుఱ్ఱము కొఱకై వెదకుదుము”. అని యీ వీధముగా నిశ్చయించుకొని, క్రూరనిశ్చయులయిన సగరసుతులు సముద్రముయొక్క తటముతో ఆరంభించి సర్వత్రభూమిని త్రవ్వి పోసిరి,వారు త్రవ్వుచుండగా వసుధ అధికముగా విహ్వలయై ఉద్విగ్నమయ్యెను. సాగరుల క్రూర చేష్టితమును దిలకించి సర్వభూతములు దుః ఖమున రోదించెను. అంతవారు భారతఖండమును త్రవ్వి, భూతలమున దానిని చిమ్మీపారవైచి భూమిపై ఒక వేయి యోజనముల ప్రదేశమును సముద్రమునకు కలిపిరి. పాతాళము వరకు భూతలమును త్రవ్వగా, నృపనందనులు పాతాళమున సంచరించు అశ్వమును చూచిరి. వారధికానంద భరితులైరీ, అందరు కలిసికొనిరి. సంతోషమున నవ్వుకొనిరి. అతిగర్వముతో కొందరు వికట నృత్యముల నాచరించిరి.

దదృశుశ్చ మహాత్మానం కపిలం దీప్తతేజసమ్ ।

 వృద్ధం పద్మాసనాసీనం నాసాగ్రన్యస్తలోచనమ్ ॥

ఋజ్వాయతశీరోగ్రీవం పురోవిషబ్దవక్షసమ్ ।

స్వతేజసాభిసర పరిపూర్ణేన సర్వతః ॥

 ప్రకాశ్యమానం పరితో నివాత్మప్రదీపవత్ ।

 స్వాంతప్రకాశితాశేషవిజ్ఞానమయవిగ్రహమ్ ॥

సమధిగతచిత్తం తు నిభృతాంబోధిసన్నిభమ్ ।

 ఆరూఢయోగం విధివధ్యేయసంలీనమానసమ్ ॥

యోగీంద్రప్రవరం శాంతం జ్వాలామాలమివానలమ్ ।

 విలోక్య తత్ర తిష్ఠంతం విమృశంతః పరస్పరమ్ ॥

ముహూర్తమివ తే రాజన్ సాధ్వసం పరమం గతాః ।

 తతోఖయమశ్వహర్త్తి సాగరాః కాలచోదితాః ॥

 పరివప్రుడ్డురాత్మానః కపిలం మునిసత్తమమ్ ।

 తతస్తం పరివార్యోచుళ్చోరోలియం నాత్ర సంశయః ॥

 అశ్వహర్తా తతో హ్యేష వధ్యో.స్మాభిరురాశయః ।

 తం ప్రాకృతవదాసీనం తే సర్వే హతబుద్ధయః ॥

 ఆసన్నమరణాశ్చక్రుర్ధర్షితం మునిమంజసా ।

జైమిని రువాచ:-

 తతో మునిగదీనాత్మా ధ్యానభంగప్రధర్షితః ॥

క్రోధేన మహతావిష్టశ్చక్షుభే కపిలస్తథా ।

ప్రచచాల ధురాధర్షో ధరిత సైద్దురాత్మభిః ॥

వ్యజృంభత చ కల్పాంతే మరుద్భిరివచానలః ।

తస్య చార్జవగంభీరాద్వపుషః కోపపావకః ॥

దిధక్షురివ పాతాలాంల్లోకాన్సాంకర్షణానలః ।

 శుశుభే ధర్షణక్రోధపరామర్శవిదీపితః ॥

ఉన్మీలయత్తదా నేత్రే వహ్నిచక్రసమద్యుతిః ।

తదాక్షిణీ క్షణం రాజన్ రాణేతాం సుభృశారుణే ॥

 పూర్వసంధ్యాసముదితౌ పుష్పవంతావీవాంబరే ।

 తతోప్యుద్వర్తమానాభ్యాం నేత్రాభ్యాం నృపనందనాన్ ॥

ప్రకాశించు తేజస్వి, వృద్ధుఁడు, పద్మాసనాసీనుఁడు, నాసాగ్రమున నిక్షిప్తము చేసిన దృష్టి కలవాఁడు, ఋజువై విశాలమయిన శిరోగ్రీవము: కలవాఁడు, ముందునకు పొడుచుకొని వచ్చిన వక్షస్థలము కలవాడు, తన తేజస్సుచే, పరిపూర్ణముగా నంతటను వ్యాపించియున్న వాఁడు, సర్వత్ర గాలిలేనిచోట (నీవాతప్రదేశమున) నుంచీన దీపమువలె, స్వాతంప్రకాశితమైన     అశేషవిజ్ఞానమయవిగ్రహుఁడు సమాధిగతచిత్తుఁడు, నిభృతాంబోధితుల్యగంభీరుండు, ఆరూఢయోగుఁడు, వీధిననుసరించి ధ్యేయమయిన పరమాత్మయందు విలీనమనస్క్యుడు, యోగీంద్ర శ్రేష్ఠుఁడు, శాంతుఁడు, జ్వాలామాలాపరీవానలుఁడు,          మహాత్ముఁడునునయిన         కపిలుని          చూచిరి. కొంతకాలమాతనిం గూర్చి పరస్పరము పారాలో చించుకొనిరి. ఒకముహూర్తకాలము వారు హృదయములో నధికసాధ్వసమునందిరీ, అంత, కాలమృత్యుచోదితులై సాగరులు ఈతఁడే అశ్వమును. దొంగిలించినవాఁడు. ఇంక ఆ విషయమున సంశయము లేదు. అని ఆ మహామునిని వారు చుట్టిముట్టిరి.ఇతఁడు అశ్వహర్త, దురాశయుం డు; అందుచే మనకాతండు వధ్యుఁడు. ఆతడు సామాన్యునివలె ఆసీనుఁడై యున్నాడు. అనీ దుష్టబుద్ధులయిన వారందరు. ఆసన్న మరణులయి, క్రుద్ధులయి మహామునినీ వెంటనే ధర్షించిరి.

జైమినీ ఇట్లు పలికెను.

అంత అదీనాత్ముఁడు, ధ్యానభంగముచే ప్రధర్షితుఁడు, అయిన కపిలుఁడు అత్యంత క్రోధావిష్ణుఁడయి, అధికముగా సంక్షుణ్ణుఁడయ్యెను. ఆ దురాత్ములచే ధర్షితుఁడయి ధురాధరుఁడు అసామాన్యుఁడునైన కపిలుఁడు కంపించెను. కల్పాంతమున వీయు ప్రచండప్రభంజనమువలె, అర్ణవగంభీరమయిన ఆతని శరీరమునుండి కోపపావకుఁడు విజృంభించెను.సముద్రసదృశమై ఆతని శరీరము నుండి విజృంభించిన అగ్ని ఆదిశేషుని ముఖము నుండి వెల్వడిన సంకర్షణాగ్ని తుల్యమై పాతాళమును దహింపగోరునట్లు విజృంభించెను. సాగరులాచరించిన ధరణ క్రోధ పరామర్శలచే ఆ మహర్షి క్రోధము ప్రదీపితమై ప్రకాశించెను. ఆతనీ నేత్రములయున్మీలనముచే వహ్నిచక్రసమద్యుతివలే అగ్నిచక్రము బయల్వెడలెను. ఆతని నేత్రములు అరుణారుణ దీప్తములయ్యెను, ఉషస్సమయమున ఆకాశమునప్రకాశించు సూర్యునివలె చంద్రునివలె ఒకదాని తరువాత, నొక్కటి ప్రకాశించెను. కల్పాంతమున ఉద్వర్తమానములైన నేత్రములతో ఆతడు నృపనందనులను వీక్షించెను.

అవైక్షత స గంభీరః కృతాంతః కాలపర్యయే ।

 కుద్ధస్య తస్య నేత్రాభ్యాం సహసా పావకాతిర్చిషః ॥

 నిశ్చదురభితో దీక్షు కాలాగ్నిరివ సంతతాః ।

సధూమకవలోదగ్రాః స్ఫులింగౌఘముతో ముహుః ॥

 మునీక్రోధానలజ్వాలాః సమంతాదావ్యనశుద్దిశః ।

 వ్యాలోదరోగ్రకుహరాజ్వేలోస్తన్నేత్ర నిర్గతాః ॥

 విరేజుర్నిభృతాంబోథెర్బడబాగ్నేరివార్చిషః ।

 క్రోధాగ్నిః సుమహారాజ జ్వాలావ్యాప్తదిగంతరః ॥

 దగ్జాంశ్చకార తాత్సర్వానావృణ్వానో నభస్తలమ్ ॥

స శబ్దముద్ర్భాంతమరుత్రకోపవివర్తమానానలధూమజాలైః ।

మహీరజోభిశ్చ నితాంతముద్ధతైః సమావృతం లోకమభూదృశాశురమ్ ॥

తతః స వహ్నిర్విలిఖన్నివాభితః సమీరవేగాభిహతాభిరంబరమ్ ।

 శిఖాభిరుర్వీశసుతానశేషతో దదాహ సద్యః సురవిద్విషస్తాన్ ॥

 మిషతః సర్వలోకస్య క్రోధాగ్ని సమృతే హయమ్ ।

 సాగరాంస్తానశేషేణ భస్మసాదకరోత్స తామ్ ॥

 ఏవం క్రోధాగ్నినా తేన సాగరః పాపచేతసః ।

 జజ్వలుః సహసా దావే తరవో నీరసా ఇవ ॥

దృష్ట్వా తేషాం తు నిధనం సాగరాణాం దురాత్మనామ్ ।

 అన్యోన్యమబ్రువన్ దేవో విస్మితా ఋషిభిః సహ ॥

అహో దారుణపాపానాం విపాకో న చిరాయితః ।

 దురంతః ఖలు లోకేశిస్మిన్నరోణామసదాత్మనామ్ ॥

యది మే పర్వతాకారా నృశంసాః క్రూరబుద్ధయః ।

యుగపద్విలయం ప్రాప్తాః సహసైవ తృణాగ్నివర్ ॥

 ఉద్వేజనీయా భూతానాం సర్భిరత్యంతగర్హీతాః ।

ఆజీవాంతంమీ హర్తుం దిష్ట్యా సంక్షయమాగతాః ॥

ఆతడు కృతాంతునివలే సగంభీరుండై దిలకించెను. అతని కృద్ధనేత్రముల నుండి పావకాగ్ని స్ఫులింగములు సర్వదిశలకు కాలాగ్నివలె వ్యాపించెను. కానీ నుండీ ధూమము స్ఫులింగములు మాటిమాటికి ప్రజ్వరిల్లెను. ఋషీనేత్రముల నుండి వ్యాపించిన క్రోధానల జ్వాలలు భయంకర సర్పోదరకుహురము నుండి వెల్వడిన విష జ్వాలలవలె ప్రకాశించెను. ఆ అనలార్చిదీప్తులు సముద్రము నుండి వెల్వడిన బడబాగ్ని జ్వాలల వలె నుండెను. మహర్షి క్రోధాగ్ని జ్వాలలతో దిగంతరమెల్ల వ్యాపించెను, సాగరపుత్రులను దహించెను.  పెద్ద శబ్దముతో ఉద్ర్భాంతమైన వాయువు యొక్క ప్రకోపము వలన సుళ్లు తిరుగు అగ్ని జ్వాలలచే ధూమపు పంక్తులచే మహీరజస్సుచే, అధికముగా పైకి లేచి వ్యాపించిన అగ్నిచే లోకమంతయు భయోద్విగ్నమయ్యెను. అంత, సమీరవేగముచే వహ్నిజ్వాలలు, ఆకాశమును సర్వత్ర తాకుచున్నట్లుండెను. ఆ యగ్ని జ్వాలలు దేవతా విరోధులయిన రాజకుమారుల నెల్లరను వెంటనే దహించి వదలిపెట్టేను. సర్వలోకములు చూచుచుండగా, కపిల మహర్షి క్రోధాగ్ని అశేష సాగరసుతులను భస్మ మొనరించెను. ఒక్క ఆ యాగీయాశ్వమును మాత్రము మిగిల్చెను, ఈ విధముగా పాపచేతస్కులయిన సాగరులు కపిలుని క్రోధాగ్నిచే నీరసమయిన (ఎండిన) చెట్లు ఎట్లు వెంటనే అగ్నిచే దహింపఁబడునో అటు దహించు కొనిపోయిరీ దురాతులయిన సాగరుల యొక్క మరణమును చూచిన దేవతలు ఋషులతో కలిసి విసితులై పరస్పరము సంభాషించుకొనిరి. “అహా! దారుణ పాపకర్ములయిన సగరపుత్రుల విపాకము చిరకాలము పట్టలేదు. నిజముగా, దురాత్ములు లోకమున దురంతమును పొందితీరవలెను. పర్వతాకారులయినను, నృశంసులు,క్రూరబుద్దులు, వెంటనే తృణాగ్నివలె, యొకే సమయమున యుగపత్ విలయమును పొందిరి. వారు సజ్జనులయిన జీవదూతముల కెల్లను ఆజీవమును ఉద్వేగమును అత్యంత గర్హితమునైన బాధను కలిగించిరి. అదృష్టవశమున వారు సర్వనాశనము పొందిరి.

పరోపతాపి నితరాం సర్వలోకణగుప్సితమ్ ।

 ఇహ కృత్వా శుభం కర్మ కః పుమాన్ విందతే సుఖమ్ ॥

విక్రోశ్య సర్వభూతాని సంప్రయాతాః స్వకర్మభిః ।

బ్రహ్మదండహతాః పాపా నీరయం శాశ్వతః సమాః ॥

తస్మాత్సదైవ కర్తవ్యమ్ కర్మ పుంసాం మనీషిణామ్ ।

 దూరతశ్చ పరిత్యాజ్యమిచరల్లోకనిందితమ్ ॥

కర్తవ్యః శ్రేయసే యత్నో యావజ్జీవం విజ్ఞానతా ।

 నాచరేత్ కస్యచిద్రోహం అనిత్యం జీవనం యతః ॥

అనిత్యోఇయం సదా దేహః సంపదళ్చించంచలాః ।

సంసారశ్చాతినిస్సారః తత్కథం విశ్వసేద్బుధః ॥

 ఏవం సురమునీంద్రేషు కథయత్సు పరస్పరమ్ ।

 మునిక్రోధేంధనీభూతా వినేశుః సగరాత్మజః ॥

 నిర్దగ్ధదేహాః సహసా భువం విష్టభ్య భస్మధా ।

 అవాపుర్నిరయం సద్యః సాగరాస్తే స్వకర్మభిః ॥

సాగరాంస్తానశేషేణు దగ్ధ్వ తత్రోధలో నలః ।

 క్షణేన లోకానఖిలానుద్యతో దగ్గుమంఇసా ॥

 భయభీతా తతో దేవాః సమేత్య దివి సంస్థితాః ।

 తుష్టువుస్తే మహాత్మానం క్రోధాగ్నిశమనార్దినః ॥

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమాభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే

సగరచరితే సాగరవినాశోనామ త్రిపంచాశత్తమోధ్యాయః॥

పరులకత్యంతముపతాపమును       గల్గించునదీ,   సర్వలోక జుగుప్సితమయినదియునగు అశుభకార్యమునాచరించు పాడేవఁడు సుఖమును పొందును? పాపులయిన సాగరులు, స్వకర్మలచే, సర్వభూతజాలమును గట్టిగా నేదీంచిరి. వారందరు బ్రహ్మదండముచే చంపఁబడిరి. వారొనరించిన దుష్టక్రియలచే వారు నరకమునకు పోయిరి. అందు శాశ్వతీస్సమాః జీవితమును వెళ్లబుత్తురు. అందుచే ఉత్తమమైన కర్మ ఇప్పుడే బుద్ధిమంతులు సలుపవలయును, లోక నిందీతములయిన కార్యములు దూరముగా పరిత్యజింపఁబడదగినవి. విజ్ఞానిచే, యావజ్జీవము శ్రేయస్సు కొఱకు యత్నమాచరింపఁబడవలెను. ఎవ్వనికిని ఏ మాత్రపు ద్రోహమయినను ఆచరింపరాదు. ఏలయన, జీవితమనిత్యము కదా ! ఈ శరీరము కూడ ఎల్లప్పుడును అనిత్యము సంపదలో చంచలములు. సంసారము నిస్సారమయినది. పండితుఁడైన వాడేట్లు వీనిని విశ్వసింపగలఁడు! ఈవిధముగా దేవతలు మునీంద్రులు పరస్పరము భాషించుకొనిరి. మునియైన కపిలుని యొక్క క్రోధమనెడు అగ్నికి సాగరులు ఇంధనములై నశించిరి. నిర్దస్త్ర దేహులయిన సాగరులు, వేంటనే, వారి భస్మముచే భూమిని విషభ్య మొనర్చి, స్వకర్మలచే సాగరులు వెంటనే నరకము నొందిరి. సాగరుని కుమారులను అశేషముగా దహించిన వెనుక, ఆ మహర్షి క్రోధజమయిన అగ్ని క్షణములో లోకముల నన్నింటిని దగ్ధముచేయ నుద్యత మయ్యెను. దివి యందున్న దేవతలు, భయభీతులయిరి, వెంటనే కపిలుని సమీపించిరి. మహాత్ముడయిన ఆ మహర్షిని, క్రోధాగ్ని శమనార్థము స్తోత్రమాచరించిరి.

 ఇది వాయుప్రోక్తమైన బ్రహ్మాండపురాణమున మధ్యమభాగమున తృతీయ ఉపోద్ఘాతపాదమున సగరచరితమున సాగరవినాశనమను ఏబదిమూఁడవ అధ్యాయము.