బ్రహ్మాండ మహా పురాణము
33 - తైలోక్యవిజయమంత్రకవచము
సగర ఉవాచ :-
శ్రుతం సర్వం మునిశ్రేష్ఠ కీర్త్యమానం త్వయా విభో ।
కవచం వద సర్వత్ర త్రైలోక్య విజయప్రదమ్ ॥
వసిష్ఠ ఉవాచ :-
శృణు వత్స ప్రవక్ష్యామి కవచం పరమాద్భుతమ్ ।
మంత్రం చ సిద్ధిదం శశ్వత్సాధకానాం సుఖావహమ్ ॥
గోపీజనపదస్యాంతే వల్లభాయ సముచ్చరేత్ ।
స్వాహాంతోఽయం మహామంత్రో దశార్ణో భుక్తిముక్తిదః ॥
సదాశివస్త్వస్య ఋషిః పంక్తిశ్చంద ఉదాహృతమ్ ।
దేవతా కృష్ణ ఉదితో వినియోగోఽఖిలాప్తయే ॥
త్రైలోక్యవిజయస్యాథ కవచస్య ప్రజాపతిః ।
ఋషిశ్చందశ్చ జగతీ దేవో రాజేశ్వరః స్వయమ్ ॥
త్రైలోక్యవిజయప్రాప్తా వినియోగః ప్రకీర్తితః ।
ప్రణవో మే శిరః పాతు శ్రీకృష్ణాయ నమః సదా ॥
పాయాత్కపాలం కృష్ణాయ స్వాహేతి సతతం మమ ।
కృష్ణేతి పాతు నేత్రే మే కృష్ణ స్వాహేతి తారకామ్ ॥
హరయే నమ ఇత్యేష భ్రూలతాం పాతు మే సదా ।
ఓం గోవిందాయస్వాహేతీ నాసికాం పాతు సంతతమ్ ॥
గోపాలాయ నమో గండం పాతు మే సతతం మనుః ।
క్లీం కృష్ణాయ నమః కర్ణా పాతు కల్పతరుర్మమ ॥
శ్రీo కృష్ణాయ నమః పాతు నిత్యం మేఽధర యుగ్మకమ్ ।
ఓం గోపీశాయ స్వాహేతీ దంతపంక్తిం మమావతు ॥
శ్రీకృష్ణేతి రదచ్ఛిద్రం పాతు మే త్ర్యక్షరో మనుః ।
ఓం శ్రీకృష్ణాయ స్వాహేతి జిహ్వికాం పాతు మే సదా ॥
రామేశ్వరాయ స్వాహేతి తాలుకం పాతు మే సదా ।
రాధికేశాయ స్వాహేతి కంఠం మే పాతు సర్వదా ॥
నమో గోపీగణేశాయ గ్రీవాం మే పాతు సర్వదా ।
ఓం గోపేశాయ స్వాహేతి స్కంధౌ పాతు సదా మమ ॥
నమః కిశోరవేషాయ స్వాహా పృష్ఠం మమావతు ।
ఉదరం పాతు మే నిత్యం ముకుందాయ నమో మనుః ॥
హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ స్వాహా కరౌ పాతు సదా మమ ।
ఓం విష్ణవే నమః స్వాహా బాహుయుగ్మం మమావతు ॥
సగరుఁడిట్లభ్యర్థించెను :-
‘గోపీజన’ పదము యొక్క తుదను ‘వల్లభాయ’ అని సముచ్చరించవలెను. అయ్యది ‘స్వాహా’తో అంతము కావలెను. ‘గోపీజన వల్లభాయ స్వాహా” ఇది పది వర్ణముల మంత్రము. ఇది భుక్తిదము. ముక్తిదము. ఈ మంత్రమునకు ఋషి సదాశివుఁడు, ‘పంక్తి’ ఛందస్సు. దేవత కృష్ణుం డుగా చెప్పఁబడినది. తద్వినియోగము. ‘సర్వాప్తి’ కొఱకు. త్రైలోక్య విజయమను కవచమునకు ఋషి ప్రజాపతి, ఛందస్సు జగతి. (పండ్రెండక్షరములు) దేవత స్వయముగా రాజేశ్వరుండే త్రైలోక్య విజయప్రాప్తి వినియోగముగా కీర్తింపఁబడినది. (ఇఁక న్యాసము చెప్పఁబడుచున్నది). ఓం కృష్ణాయనమః మమ శివః పాతు. కృష్ణాయ స్వాహా మమతారకాం హరయే నమః. హే కృష్ణ పాతుమే నేత్రే కృష్ణాయస్వాహా మమతారకం పాతు. హరయే నమః భ్రూలతాంపాతు సదా ఓం గోవిందాయ స్వాహా ! మమ నాసికాం సతతం పాతు, గోపాలాయ నమః మమ గండం సతతం పాతు. క్లీం కృష్ణాయ నమః మమ కర్జీ కల్పతరుః పాతు. (కల్పవృక్షము కరముల రక్షించుగాక). ఓం కృష్ణాయనమః నిత్యం మే అధరయుగ్మకం పాతు. (పెదవుల జంటను రక్షించుగాక!) ఓ గోపీశాయ స్వాహా ! మమ దంతపంక్తిం అవతు. త్ర్యక్షర మంత్రమయిన ‘శ్రీకృష్ణ’ నా దంతముల మధ్య నున్న ఛిద్రమును రక్షించుగాక. (నోటిని) ‘ఓం కృష్ణాయ స్వాహా’ మే జిహ్వికాం పాతు (నాలుకను) రక్షించుగాక, రామేశ్వరాయ స్వాహా ! మే తాలుకం సదా పాతు. రాధికేశాయ స్వాహా! మే కంఠం పాతు సర్వదా, నమో గోపీగణేశాయ స్వాహా. మే గ్రీవాం సదా పాతు, (కంఠమును) ఓం గోపేశాయ నమః స్వాహా ! మే స్కంధౌ సదా పాతు. (భుజములను) నమః కిశోరవేషాయ స్వాహా! మమ పృష్ఠం సదా పాతు (వీపును) ముకుందాయ స్వాహా! మే ఉదరం పాతు సదా (కడుపును) హ్రీం, శ్రీం, క్లీం కృష్ణాయ స్వాహా ! మే కరౌ పాతు సర్వదా. ఓం విష్ణవే నమః స్వాహా ! మమ బాహు యుగ్మం పాతు. (15)
ఓం హ్రీం భగవతే స్వాహా నఖపంక్తిం మమావతు ।
నమో నారాయణాయేతి నఖరంధ్రం మమావతు ॥
ఓం హ్రీం శ్రీం పద్మనాభాయ నాభిం పాతు సదా మమ ।
ఓం సర్వేశాయ స్వాహేతి కేశాన్మమ సదాశఽవతు ॥
నమః కృష్ణాయ స్వాహేతి బ్రహ్మరంధ్రం సదాఽవతు ।
ఓం మాధవాయ స్వాహేతి భాలం మే సర్వదాఽవతు ॥
ఓం హ్రీం శ్రీం రసికేశాయ కటిం మమ సదాఽవతు ।
నమో గోపీజనేశాయ ఊరూ పాతు సదా మమ ॥
ఓం నమో దైత్యనాశాయ స్వాహేత్యవతు జానునీ ।
యశోదానందనాయే నమేంతో జంఘకేఽవతు ॥
రాసారంభప్రియాయేతి స్వాహాంతో హ్రీం మమావతు ।
వృందాప్రియాయ స్వాహేతి సకలాంగాని మేఽవతు ॥
పరిపూర్ణమనాః కృష్ణః ప్రాచ్యాం మాం సర్వదాఽవతు ।
స్వయం గోలోకనాథో మామాగ్నేయ్యాం దిశి రక్షతు ॥
పూర్ణబ్రహ్మస్వరూపశ్చ దక్షిణే మాం సదాఽవతు ।
నైరృత్యాం పాతు మాం కృష్ణః పశ్చిమే పాతు మాం హరీః ॥
గోవిందః పాతు వాయవ్యాముత్తరే రసికేశ్వరః ।
ఐశాన్యాం మే సదా పాతు బృందావనవిహారకృత్ ॥
వృందాప్రాణేశ్వరః శశ్వత్ పాతు మామూర్ధ్వదేశతః ।
సదైవ మామధః పాతు బలిధ్వంసీ మహాబలః ॥
జలే స్థలే చాంతరిక్షే నృసింహః పాతు మాం సదా ।
స్వప్నే జాగరణే చైవ పాతు మాం మాధవః స్వయమ్ ॥
సర్వాంతరాత్మా నిర్లిప్తః పాతు మాం సర్వతో విభుః।
ఇతి తే కథితం భూప సర్వాఘౌఘవినాశనమ్ ॥
త్రైలోక్యవిజయం నామ కవచం పరమేశితుః ।
మయా శ్రుతం శివముఖాత్ప్రవక్తవ్యం న కస్యచిత్ ॥
గురుమభ్యర్చ్య విధివత్కవచం ధారయేత్తు యః ।
కంఠే వా దక్షిణే బాహౌ సోఽపి విష్ణుర్నసంశయః ।
ఓం హ్రీం భగవతే స్వాహా ! మే నఖపంక్తిం సదా పాతు. (గోళ్లవరుసను) నమో నారాయణాయ స్వాహా ! మే నఖరంధ్రమవతు ఓం శ్రీం పద్మనాభాయ స్వాహా మే నాభిం సదావతు. ఓం సర్వేశాయ స్వాహా మమకేశాన్ అవతు. నమః కృష్ణాయ స్వాహా మమ బ్రహ్మరంధ్రం సదావతు. ఓం మాధవాయ స్వాహా మమ ఫాలభాగం సదావతు. ఓం హ్రీం శ్రీం రసికేశాయ స్వాహా కటిం మమ అవతు. ఓం నమో గోపీజనేశాయ స్వాహా ఊరూ మమ పాతు. (తొడలు) ఓం నమో దైత్యనాశాయ స్వాహా మమ జానునీ అవతు. (పిక్కలు) ఓం యశోదానందనాయ స్వాహా మమ జంఘకే, అవతు. ఓం రాసారంభ ప్రియాయ స్వాహా మమ హీం అవతు (సిగ్గు అభిమానము). ఓం వృందా ప్రియాయ స్వాహా సకలాంగాని మే అవతు. ఓం పరిపూర్ణమనాః కృష్ణః ప్రాచ్యాం మాం సదావతు (తూర్పుదిక్కు), స్వయం గోలోకనాథో మాం ఆగ్నేయ్యాం దిశి రక్షతు. (22) పూర్ణ బ్రహ్మ స్వరూపః దక్షిణే మాం అవతు. కృష్ణః నైరుత్యాం మాం పాతు. హరిః మాం పశ్చిమే పాతు. గోవిందః మాం వాయవ్యాం పాతు. రసికేశ్వర ఉత్తరే. మాం పాతు. బృందావనవిహారకృత్ ఐశాన్యాం మే. పాతు. వృందాప్రాణేశ్వరః ఊర్ద్వదేశతః పాతు (పై నుండి రక్షించుగాక). బలిధ్వంసీ మహాబలః సదా. మాం అధః పాతు. నృసింహః మాం జలే, స్థలే, అంతరిక్షే పాతు. మాధవః - మాం స్వయం స్వప్నే జాగరణే చ పాతు. సర్వాంతరాత్మా నిర్లిప్తః మాం సర్వతోవిభుః పాతు. ఓ రాజా! ఈ విధముగా నీకు సమస్త పాప సంఘ వినాశనకరమయిన కవచమును చెప్పితినీ, ఇది త్రైలోక్య విజయ నామకవచము. పరమేశ్వరుఁడయిన శివుని ముఖము నుండి నేను వింటిని. ఎవ్వనికి చెప్పరాదు. ఎవ్వఁడు గురువును అభ్యర్చించి విధి పూర్వకముగా కందము నందుగాని, దక్షిణ బాహువు నందుగానీ, ఈ కవచమును ధరించునో అతఁడు విష్ణువు. సంశయములేదు.
స సాధకోఽవద్యత్ర తత్ర వాణీరమే స్థితే ।
యదిస్యాత్సిద్ధకవచో జీవన్ముక్తో న సంశయః ॥
నిశ్చితం కోటివర్షాణాం పూజాయాః ఫలమాప్నుయాత్ ।
రాజసూయసహస్రాణి వాజపేయశతాని చ ॥
మహాదానాని యాన్యేవ భువశ్చాపి ప్రదక్షిణా ।
త్రైలోక్యవిజయస్యాస్య కలాం నార్హంతి షోడశీమ్ ॥
ప్రజోపవాసనియమాః స్వాధ్యాయాధ్యయనే తథా । స్నానం చ సర్వతీర్ధేషు నాస్యార్హంతి కలామపి ॥
సిద్ధత్వమవరత్వం చ దాసత్వం శ్రీహరేరపి ।
యదిస్యాత్సిద్ధకవచః సర్వం ప్రాప్నోతి నిశ్చితమ్ ॥
స భవేత్సద్దకవచో దశలక్షం జపేత్తు యః ।
యో భవేత్సిద్ధకవచో వీజ స భవేత్ ధ్రువమ్ ॥
రాజ్యం దేయం శిరో దేయం ప్రాణా దేయాశ్చ భూపతే ।
ఏతత్తు కవచం వత్స న దేయం సంకటేఽపి చ ॥
మయా ప్రకాశితం యత్తే చైతేషాం త్రాణకారణాత్ ।
మమాజ్ఞాకరణాచ్చైవ తద్విద్ధి కులభాస్కర ।
ఇదం ధృత్త్వా తు కవచం చక్రవర్తీ భవాన్ భవ ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే భార్గవచరితే త్రయస్త్రింశత్తమోఽధ్యాయః ॥
ఎచ్చట భక్తి తత్పరుఁడయి ఈ కవచ సాధకుఁడు నివసించునో అచ్చట లక్ష్మీ సరస్వతులు స్థిరముగా నివసింతురు. ఎవ్వడీ ‘కవచ సిద్దిని పొందునో యతఁడు జీవన్ముక్తుఁడు. సంశయము లేదు. కోటీ సంవత్సరములు పూజచేసిన ఫలమును పొందనగును. బహు సహస్ర రాజసూయ యాగములనుగాని, వందలాది వాజపేయ యాగములను గాని, మహాదానములని యొవ్వి పేరు పడ్డవో యట్టివిగాని, భూప్రదక్షిణమునుగాని, చేసినను, త్రైలోక్య విజయనామక కవచము నుపాసించిన వచ్చు ఫలితములో పదియారవ భాగమునకయినను అర్హులు కారు. (32) వ్రతోపవాస నియమములుకాని, స్వాధ్యాయాధ్యయనములుగానీ, సర్వ తీర్థముల యందు స్నాన మాచరించుటకాని పదీయారవభాగమునకయినను నర్హములు కావు. కవచోపాసనమున సిద్దీ పొందిన సాధకుఁడు, సిద్ధత్వము, అమరత్వము, శ్రీహరి యొక్క దాసత్వము సర్వము నిశ్చయముగా పొందును. దశలక్ష సంఖ్య ఈ మంత్రజపము చేసినట్టిఁడు సిద్ధకవచుడగును. సిద్ధ కవచుఁడయినపొండు నిశ్చయముగా విజయవంతుఁడగును ఓ రాజా! రాజ్యమునయిన నీయవచ్చును, శిరస్సులైన నొసఁగవచ్చును. ప్రాణములనయిన నీయవచ్చును, ఓ వత్స, ఎట్టి విపత్పరిస్థితులలోనైనను ఈ కవచము . నీయరాదు. ఓ కులభాస్కర ! వంశోద్దీపక ! వీరందరిని రక్షించుటకై నాచే నియ్యది నీకు ప్రకాశిత మయినదీ అదీకాక నీవు నా యాజ్ఞను ఆచరించుటవలన ఓయీ! ఈ కవచమును నీవు ధరించి, చక్రవర్తి వగుదువు.
ఇది వాయుప్రోక్తమయిన శ్రీ బ్రహ్మాండ మహా పురాణమున మధ్యమభాగమున, తృతీయోపాద్ఘాతపాదమున భార్గవచరిత్రయందు ముప్పదిమూఁడవ అధ్యాయము.
Summary of chapter 71 of the Brahmānda Mahā Purana is as follows:
This radiant chapter chronicles the emergence of the Yadu dynasty, founded by the virtuous prince Yadu who received his father's special blessings for his nobility and spiritual wisdom. It traces the flourishing branches of the Yādavas, who were destined to welcome the supreme lord himself into their royal clan. The devout heart rejoices in reading these sacred genealogies, knowing that every branch of this lineage was sanctified by divine presence.