బ్రహ్మాండ మహా పురాణము
4 - ఉపసంహారపాదమున, “బ్రహ్మాండావర్తమను”
ఋషయ ఊచుః :-
శ్రుతం సుమహదాఖ్యానం భవతా పరికీర్తితమ్ ।
ప్రజానాం మనుభిః సార్థం దేవానాం ఋషిభిః సహ ॥
పితృగంధర్వభూతానాం పిశాచోరగరక్షసామ్ ।
దైత్యానాం దానవానాం చ యక్షిణామేవ పక్షిణామ్ ॥
అత్యద్భుతాని కర్మాణి వివిధా ధర్మనిశ్చయాః ।
విచిత్రాశ్చ కథాయోగా జన్మ చాగ్యమనుత్తమమ్ ॥
తతథ్యమానమస్మాకం భవతా శక్షయా గినా మనః కర్ణసుఖం సౌతే ప్రీణాత్యమృతసన్నిభమ్॥
ఏవమారాధ్య తే సూతం సత్కృత్య చ మహర్షయః ।
ప్రప్రచ్భుః సత్రిణః సర్వే పునః సర్గప్రవర్తనమ్ ॥
కథం సూత మహాప్రాజ్ఞ పునః సర్గః ప్రపత్స్యతే ।
జంధేషు సంప్రలీనేషు గుణసామ్యే తమోమయే ॥
వికారేషవిసృప్తేషు హ్యష్యత్తే చాత్మని స్థితే ఆప్రవృతే బ్రహ్మణా తు సహసా యోజ్యరేస్తదా ॥
కథం ప్రపత్యతే సర్గస్తన్నః ప్రబ్రూహి పృచ్ఛతామ ।
ఏవముక్తస్తతః సూతస్తదాసౌ లోమహర్షణః ॥
వ్యాఖ్యాతుముపచక్రామ పునః సర్గప్రవర్తనమ్ ।
అత్రవో వర్తయిష్యామి యథా సర్గః ప్రపత్స్యతే ॥
పూర్వవత్స తు విశ్లేయః సమాసాత్తన్నిబోధత ।
దృషైనైవానుమేయం చ తర్కం వక్ష్యామి యుక్తితః ॥
తస్మాద్వాచో నివర్తంతే త్వప్రాప్య మనసా సహ ।
అవ్యక్తవత్పరోక్షత్వాద్ధహణం తద్దురాసదమ్ ॥
వికారైః ప్రతిసంసృషో గుణః సామ్యేన వర్తతే ।
ప్రధానం పురుషాణాం చ సాధర్యేణేవ తిష్ఠతి ॥
ధర్మాధర్మా ప్రతీయేతే హ్యావ్యక్తి ప్రాణినాం సదా ।
సత్త్వమాత్రాత్మకో ధర్మో గుణే సత్వే ప్రతిష్ఠితః ॥
తమోమాత్రాత్మకో ధర్మో గుడే తమసి ।
తిష్ఠతి అవిభాగేన తావేమో గుణసామ్యే స్థితావుబౌ ॥
సర్వం కార్యం బుద్ధిపూర్వం ప్రధానస్య ప్రపత్స్యతే ।
అబుద్ధిపూర్వం క్షేత్రజ్ఞ అధిషాస్యతి రాన్ గుణాన్ ॥
ఏవం తానభిమానేన ప్రపత్స్యతి పుసస్తదా ।
యదా ప్రవర్తితవ్యం తు క్షేత్రక్షేత్రజ్ఞయార్ద్వయోః ॥
భోజ్యభోక్తృత్వసంబంధాః ప్రపత్స్యంతే చ తావుశా తస్మాదక్షరమవ్యక్తం సామ్యే స్థిత్వా గుణాత్మకం ॥
క్షేత్రజ్ఞాధిష్ఠితం తత్ర వైషమ్యం భజతే తు తత్ ।
తతః ప్రపత్స్యతే వ్యక్తం క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ద్వయోః ॥
ఋషులు పలికిరి:
మీ చే వర్ణింపబడిన సుమహాఖ్యానము వింటిమీ. మనువులతో బాటు ప్రజల యొక్క అత్యద్భుతములయిన కృత్యములను, ఋషులతో సహితము దేవతల అద్భుత క్రియలను పితృ దేవతల యొక్క గంధర్వుల యొక్క భూతముల యొక్క పిశాచముల యొక్క సర్పముల యొక్క రాక్షసుల యొక్క దైత్యుల యొక్క దానవుల యొక్క యక్షుల యొక్క పక్షుల యొక్క అద్భుతములయిన కృత్యములను వివిధములయిన ధర్మ నిశ్చయములను విచిత్రములయిన కథా యోగములను జన్మ వృత్తాంతములను మీ మధుర మయిన హక్కులతో విని మనస్సులకు కర్ణములకు అమృత సన్నిభమయిన ప్రీతినీ పొందితిమీ-4.
సూతుని ఈ విధముగా ఆరాధించి, మహర్షులు సత్కరించి ఆ సత్రము నందున్న వారందరు మరల సృష్టి (సర్గమును) గూర్చి ప్రశ్నించిరి.
“ఓ సూత! మహాప్రాజ్ఞ! సృష్టి క్రమము మరల ఎట్లు ప్రారంభించును అన్ని బంధములు నాశనము చేయబడి, సర్వతః తమస్సులో అంధకారములో విలీనమయి యుండ, వికారములు విస్పష్టములై యుండ, అవ్యక్తమునందు ఆత్మ స్థితమైయుండ, అనుభవయోగమున వివిధ వస్తు పరికరములతో బ్రహ్మ యొక్క సృజన క్రియ ఆరంభము. కాక యుండ, సృష్టి ఎట్లు ప్రారంభమగును? మాకు చెప్పుము.
ఇట్లడుగబడి లోమ హర్షణుఁడు సృష్టి క్రమమును మరల చెప్ప ప్రారంభించెను.-8. ఈ సందర్భములో సృష్టి క్రమము ఎట్లు జరుగునో చెప్పెదను, ఇదీ యంత చూచిన దానిని బట్టి అనుమానముతో గ్రహించవలెను. దానికి తర్కమును చేప్పెదను-10. (దృ షేనైహనుమేయం చ తర్కం వక్ష్యామీ యుక్తితః) అవ్యక్తుఁడయిన బ్రహ్మ అపరోక్షుఁడు, ఆతని గ్రహణము అసాధ్యము. 1) ఏలనన? వేదవాక్కులు గూడమనస్సుతోబాటు వెళ్లి యాయవ్యక్తమును బ్రహ్మను చేరలేక తిరిగి వచ్చును. 2) కావున ఆపరోక్షమైన బ్రహ్మ చేరనలనికాదు.-11. వికారములతో ప్రతి ఇష్టమైన గుణము సమముగానుండును. ప్రధానము పురుషుల సాధర్మ్యముతోనేయుండును.-12. ఎల్లప్పుడు ప్రాణుల ధర్మాధర్మములు అవ్యక్తమున ప్రలీనమగును, సత్త్వగుణమున సత్త్వమాత్రాత్మమైనధర్మము ప్రతిష్టితమైనది.-13. తమోగుణము తమోమాత్రాత్మ కథర్మముండును. ఆయా రెండు అవిభాగముగా గుణసామ్యముననుండును. ప్రధానము యొక్క సమస్తకార్యము బుద్ధి పూర్వకమెవర్తిల్లును. అబుద్ధిపూర్వకముగా క్షేత్రజ్ఞుడు ఆగుణములనధిష్ఠింపగలడు -15. క్షేత్రక్షేత్రజ్ఞులు భయలు ప్రవర్తిపదగినప్పుడు జీవుడాగుణములనభిమానించి ప్రవర్తించును. అప్పుడు వారురిద్దరు బోజ్యభోక్తృత్వ సంబంధములనందుదురు. కావున అక్షరమైన అవ్యక్తము సామ్యముననుండి గుణాత్మకమగును. క్షేత్రజ్ఞాధిష్ఠితమై గుణసామ్యవైషమ్యమమును బొందును. దానివలన క్షేత్రక్షేత్రజ్ఞులు వ్యక్తము ప్రవర్తిల్లును-18.
క్షేత్రజ్ఞాధిష్ఠితం సత్త్వం వికారం జనయిష్యతి ।
మహదాద్యం విశేషాంతం చతుర్వింశగుణాత్మకమ్ ॥
క్షేత్ర జ్ఞస్య ప్రధానస్య పురుషస్య ప్రవర్యతః ఆదిదేవః ప్రధానస్యానుగ్రహాయ ప్రచక్షతే ॥
అనాద్యే వరముత్పాదౌ ఉభౌ సూక్ష్మా తు తో స్కృతౌ ।
అనాదిసంయోగయుతో సర్వం క్షేత్రజ్ఞమేవ చ ॥
అబుద్ధిపూర్వకం యుక్తమశక్షౌ తు వరౌతదా ।
తత్పత్యయమమోఘం చ ఛీతావుదకమత్స్యవత్ ॥
ప్రవృత్తపూర్వౌ తో పూర్వం పునః సర్వం ప్రపత్స్యతే ।
అజ్ఞాః గుజైః ప్రవర్తంతే రజ:సత్త్వతమోఽభిధైః ॥
ప్రవృత్తికాలే రజసొభిపన్నో మహత్వభూతాదివిశేషతాం చ ।
విశేషతాం చేంద్రియతాం చ యాతి గుణావసానౌషధిభిర్మనుష్య ॥
సత్యాభిధాయినస్తస్య ధ్యాయినః సన్నిమిత్తకమ్ ।
రజః సత్త్వతమోవ్యక్తా విధర్మాణః పరస్పరమ్ ॥
ఆద్యంతం వై ప్రపత్స్యంతే క్షేత్రమజ్ఞాంబు సర్వశః ।
సంసిద్ధకార్యకరణం ఉత్పద్యంతే భిమానినః ॥
సర్వే సత్త్వా ప్రపద్యంతే హ్యవ్యక్తాత్పూర్వమేవ చ ।
ప్రాకృతా యే త్వసువహాః సాధకాశ్చాష్యసాధకాః ॥
అసంశాంతాస్తు తే సర్వే స్థానప్రకరణైః సహ కార్యోణి ప్రతిపత్స్యంతే ఉత్పత్సంతే
పునః పునః ॥
గుణమాత్రాత్మకావేవ ధర్మాధర్మౌ పరస్పరమ్ ।
ఆరప్యంతే పొ చాన్యోన్యం వరేణానుగ్రహేణ వా ॥
శర్వస్తుల్యప్రసృష్ట్యర్థం సర్గాదెయాతి విక్రియామ్ ।
గుణాస్త్రం ప్రతిధీయంతే తస్మాత్తత్రస్య రోచతే ॥
గుణాస్తే యాని కర్మాణి ప్రాక్సృష్ట్యాం ప్రతిపేదిరే ।
తెన్యేవ ప్రతిపద్యంతే సృష్యామాసాః పునః పునః ॥
హిస్రాహింసే మృదుక్రూరే ధర్మాధర్మావృతానృతే ॥
తద్భాషితాః ప్రపద్యంతే తస్మాతతస్య రోచతే ॥
మహాభూతేషు నానాత్వమిండియాగ్గేషు మూర్తీషు ।
విప్రయోగశ్చ భూతానాం గుణేభ్యః సంప్రవర్తతే ॥
ఇత్యేష వో మయా ఖ్యాతః పునః సర్గః సమాసతః ।
సమాసాదేవ వక్ష్యామి బ్రహ్మణ్థ సముద్భవమ్ ॥
అవ్యక్తాత్కారణాత్తస్మాన్నిత్యాత్సదసదాత్మకాత్ ।
ప్రధానపురుషాభ్యాం తు జాయతే చ మహేశ్వరః ॥
స పునః సంభావయితో జాయితే బ్రహ్మ సంజ్ఞతః ।
సృజతే చ పునర్లోకానభిమానగుణాత్మకాస్ ॥
అహంకారస్తు మహతస్తస్మాద్భూతాని చాత్మనః ।
యుగపత్ సంప్రవర్తంతే భూతాన్యేవేంద్రియాణి చ ॥
క్షేత్రజ్ఞాధిష్ఠితమయిన సత్త్వగుణము మహత్తుతో నారంభించి, విషమ భూతముల యొక్క తుది వరకు చతుర్వింశ గుణాత్మకమును ఉత్పత్తి చేయును. -19 క్షేత్రజ్ఞుఁడు, ప్రధానుఁడు, పురుషుడు వ్యవహరింపనారంభింప ఆది దేపుండు ప్రధానుని ఆశీర్వదించునందురు. (అర్థము సరిగా లేదు 21-23 వణకు)
మరల మరల సృజింపఁబడి గుణములు పూర్వ జన్మమందలి హరీ గుణములచే మరల. పొందును-31. హింస, అహింస, మృదుత్వము, క్రూరత్వము, ధర్మము, అధర్మము, అనృతము సత్యము. కాని యేగుణములు పూర్వ జన్మమున కలవో వానినే తిరిగీ. పొందును. పూర్వ లక్షణముల వలన ఆ గుణములే వారికి రుచించును.-32. మహాభూతముల యందలి ఇంద్రీయుము లందలీ, భౌతిక రూపముల యందలి నా నాత్వము, భూతముల యందలి విప్రయోగము - ఇవీయన్నియు గుణముల వలన ప్రవర్తించును -33. ఈ విధముగా ప్రతీ సర్గము క్రమముగా సూక్ష్మముగానాచే చెప్పబడినది. ఇంక సంక్షిప్తముగా బ్రహ్మ యొక్క సముద్భవమును కూడ చెప్పెదను. -34 అవ్యక్తము నుండి, కారణము నుండి, దాని నుండి, సత్ అసత్ నుండి ప్రధానుని వలన పురుషుని వలన మహేశ్వరుం డు పుట్టును. -35 ఆతఁడు బ్రహ్మ సంజ్జితుఁడై మరల సంభావితమగును. అతఁడే లోకములను మరల సృజించును. అయ్యవి డు పుట్టాను. నేవీ, ఆలు అభిమానగుణాత్మకములు. -36. అహంకారము మహత్తు నుండి పుట్టినది. మరల దాని వలన భూతములుత్పన్నములయినవి. భూతములు ఇంద్రియములు ఒకే సమయమున ఆత్మ నుండి పుట్టినవి.
భూతభేదాశ్చ భూతేభ్య ఇతి సర్గః ప్రవర్తతే ।
విస్తరావయవస్తేషాం యథాప్రజ్ఞం యథాశ్రుతమ్ ॥
కీర్త్యతో వో యథాపూర్వం తథైవాప్యుపధార్యతామ్ ॥
ఏతచ్భుత్వా నైమిషేయాస్తదానీం లోకోత్పత్తిం సుస్థితిం చాప్యయం చ ॥
తస్మిన్ సత్రేఽవభృథం ప్రాప్య శుద్ధాః పుణ్యం లోకమృషయ ప్రాప్నువంతి ॥
యథా యూయం విధినా దేవతాదీనిష్టా చైవావళ్ళడం ప్రాప్య శుద్దో ॥
త్యక్త్వా దేహానాయుషోఽoతే కృతార్థాః పుణ్యంలోకం ప్రాప్య మోదధ్వమేవమ్ ॥
ఏతే తే నైమిషేయా వై దృష్ట్వా స్పృష్ట్వా చ వై తదా ।
జగ్ముత్చావభృథస్నాతాః స్వర్గం సర్వే తు సత్రిణ ॥
వీప్రాస్తథా యూయమపి దృష్ట్వా బహువిధైర్మఖైః ।
ఆయుంతే తతః స్వర్గం గంతార స్థ ద్విజోత్తమాః ॥
ప్రక్రియా ప్రథమః పాదః కథాయాస్తు పరిగ్రహః ।
అనుషంగ ఉపోద్ఘాత ఉపసంహార ఏవ చ ॥
ఏవమేవ చతుఃపాదం పురాణం లోక సమ్మతమ్ ।
ఉవాచ భగవాన్ సాక్షాద్వాయుర్లోకపోతే రతః ॥
నైమిషే సమాసాద్య మునిభ్యో మునిసత్తమ ।
తత్రసాదం చ సంసిద్ధం భూతోత్పత్తిలయాన్వితమ్ ॥
ప్రాధానికీమిమాం సృష్టిం తథైవేశ్వరరారీతామ్ ।
సమ్యగ్వోదీత్వా మేధావీ న మోహమధిగచ్ఛతి ॥
ఇదం యో బ్రాహ్మణో విద్వానీతిహాసం పురాతనమ్ ।
శృణుయాచ్ఛావయేద్వాపి తథాధ్యాపయతేఽపీ చ ॥
స్థానేషు స మహేంద్రస్య మోదతే శాశ్వతీః సమాః ।
బ్రహ్మసాయుజ్యగో భూత్వా బ్రహ్మణా సహ మోదతే ॥
తేషాం కీర్తిమతాం కీర్తిం ప్రజేశానాం మహాత్మనామ్ ।
ప్రథయన్ పృథివీశానాం బ్రహ్మభూయాయ గచ్ఛతి ॥
ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం వేదైశ్చ సంమితమ్ ।
కృష్ణద్వైపాయనేనోక్తం పురాణం బ్రహ్మవాదినా ॥
మన్వంతరేశ్వరాణాం చ యః కీర్తిం ప్రథయేదిమాం ।
దేవతానాం ఋషీణాం చ భూరిద్రవిణతేజసామ్ ॥
స సర్వై ర్ముచ్యతే పాపైః పుణ్యం చ మహదాప్నుయాత్ ।
యశ్చదం శ్రావయేద్విద్వాన్ సదా పర్వణీ పర్వణి ॥
ధూతపాప్మా జితస్వర్ణో బ్రహ్మభూయాయ కల్పతే ।
యశ్చేదం శ్రావయేచ్ఛైర్జే బ్రాహ్మణాన్ పాదమంతతః ॥
అక్షేయం సర్వకామీయం పిత్యంస్తచ్చోపతిష్ఠతే ।
యస్మాత్పురా హ్యాణంతీదం పురాణం తేన చోచ్యతే ॥
భిన్నభిన్నమయిన భూతములు భిన్న భూతముల వలన పుట్టినవి. ఈ విధముగ సృష్టి ప్రవర్తనము వానిని గూర్చిన వివరము ఇంతకు పూర్వము నేను విని యెఱింగినంత మీకు చెప్పితిని. నేను చెప్పిన విధముగా ఆ సృష్టి క్రమమును మీ మనస్సుల జ్ఞప్తి యుంచుకొనుడు. లోకోత్పత్తిని, దాని సుస్థితిని, దాని వ్యయమును, నైమిశారణ్య మహర్షులు వినీరి. సత్రమున (యాగశాల యందు) అవభృతమాచరించిరి. పవిత్రులయిరి. శుద్ధులయి పుణ్యలోకముల పొందుదీరీ. -39, ఆ విధముగనే మీరలు యథావీధి దేవతల ఆర్చింపుడు. అవభృథస్నానమాచరింపుఁడు శుద్ధులగుడు ఆ యుష్యాంతమున దేహములను పరిత్యజించి కృతార్థత్వమొంది పుణ్యలోకములను పొంది ఈ విధముగా నానందింపుఁడు. -40 ఈ నైమి శేయులు, సత్రిణః! సత్ర యజ్ఞమాచరించినవారు స్పషా (స్పృశించి) (?) చూచి, అవభృథ స్నాతులయి స్వర్గమున కరిగిరి. -41 ఓ బ్రాహ్మణులారా! మీరు కూడా నా విధముగా వివిధములయిన మఖములను (యజ్ఞముల) నాచరించిన తరువాత, మీ జీవితాంతమున మీరు స్వర్గమునకు తప్పక పోవుదురు. -42. కథా స్వీకరణమునకు ప్రక్రియ ప్రథమ - పాదము. మిగిలిన భాగములు - అనుషంగము, ఉపోద్ఘాతము, ఉపసంహారము. -43. లోకహితమున నా సక్తుఁడయి భగవానుడయిన సాక్షాద్వాయువు నైమిశమున యజ్ఞ శాలనుపొంది నాలుగు భాగములలో గూడిన ఈ పురాణమును చెప్పెను.
ఈ ప్రధాన సృష్టిని పూర్తిగా అవగాహన చేసికొని అట్లే ఈశ్వరకాతీతమయిన సృష్టినెంగిన మేధావి అజ్ఞానమును పొందడు. భగవత్రసాదమును పొందును భగవత్రసాదమును పొందును.
ఓ బ్రాహ్మణులారా!
ఎవ్వరీ పురాతనముయిన ఇతి హాసమును విందురో, ఇతరులకు వినిపింతురో, బోధింతురో, వారు మహేంద్ర స్థానములందు పెక్కు సంవత్సరములు బ్రహ్మతోడి సాయిజ్యమును పొంది బ్రహ్మతో సహ మొదింతురు-48. ప్రజా ప్రభువుల యొక్క మహాత్ముల యొక్క పృథివీశుల యొక్క కీర్తిమంతుల కీర్తిని ప్రస్తుతించు వారు బ్రహ్మ భూయత్వమును మోక్షమును పొందుదురు. బ్రహ్మ ఐదీయైన కృష్ణ ద్వైపాయనునిచే (వ్యాసర్షిచే) ప్రోక్తమైన ఈపురాణము ధన్యము, యశస్కరము, ఆయుష్యమిచ్చునది, వేద సమ్మితమైనది. అత్యంతైశ్వర్యము, తేజము గలిగిన మన్వంతరేశ్వరుల యొక్క కీర్తిని దేవతల కీర్తిని ఋషీశ్వరుల కీర్తిని, ఎవరు కీర్తింతురో వారు పాపముల నుండి విముక్తులయ్యెదరు. అనంతమైన పుణ్యమును పొందెదరు.
ఏ పండితుఁడు ప్రతి పర్వము నందు దీనిని చదివి వినిపించునో, ఆతఁడు వీధూతపాపుడయి మోక్షమును పొందును. ఎవడు ఈ బ్రహ్మాండ పురాణమును శ్రాద్ధమున బ్రహ్మణులకు వినిపించునో అది పితరులకు చెందును సర్వ కామములను సమకూర్చును. శాశ్వత, శుభములనొసంగును. ఇది ప్రాచీనమైనదగుట పురాణము. ఇప్పటికిని నిలిచి యుండినందున పురాణమనబడును.
నిరుక్తమస్య యోవేద సర్వపాపైః ప్రముచ్యతే ।
తథైవ త్రిషు వర్ణేషు యేమనుష్యా అధీయతే ॥
ఇతిహాసమిమం శ్రుత్వా ధర్మాయ విదధే మతిమ్ ।
యావంత్యస్య శరీరేషు రోమకూపాని సర్వశః ॥
తావత్కోటిసహస్రాణి వర్నాటి దీవి మోదతే ।
బ్రహ్మసాయుజ్యగో భూత్వా దేవతైః సహ మోదతే ॥
సర్వపాపహరం పుణ్యం పవిత్రం చ యశస్వి చ ।
బ్రహ్మా దదౌ శాస్త్రమిదం పురాణం మాతరిశ్వనే ॥
తస్మాచ్చోశనసా ప్రాప్తం తస్మాచ్చాపి బృహస్పతిః ।
బ్రహస్పతిస్తు ప్రోవాచ సవిత్రే తదనంతరమ్ ॥
సవితా మృత్యవే ప్రాహ మృత్యుశ్చంద్రాయ వై పునః ।
ఇంద్రశ్చాపి వసిష్ణాయ సోపి సారస్వతాయ చ ॥
సారస్వతప్రిధామ్నేఽథ త్రిధామా చ శరద్వతే ।
శరద్వాంస్తు త్రివిష్టాయ సోంతరిక్షాయ దత్తవాన్ ॥
చర్షిణే చాంతరీక్ష వై సోఽపి తయ్యారుణాయ చ ।
త్రయ్యారుణాద్ధనంజయః స వై ప్రాదా కృతంజయే ॥
కృతంజయాత్ తృణాంజయో భరద్వాజాయ సోషఽథ ।
గౌతమయ భరద్వాజః సోఽపి నీర్యంతరే వునః ॥
నీర్యంతరస్తు ప్రోవాచ తథా వాజశ్రవాయ వై ।
స దదౌ సోమశుష్మాయ స చాదాతృణబిందవే ॥
తృణబిందుస్తు దక్షాయ దక్షః ప్రోవాచశక్తయే శక్తేః పరాశరశ్చాపి గర్భస్థ శ్రుతవానిదమ్ ॥
పరాశరాతుకర్ణః తస్మాత్ ద్వైపాయనః ప్రభుః ।
ద్వైపాయనాత్పునశ్చాపి మయా ప్రాప్తం ద్విజోత్తమ ॥
మయా చైతత్ పునః ప్రోక్తం పుత్రాయామితబుద్ధయే ।
ఇత్యేవ వాక్యం బ్రహ్మాదిగురూణాం సముదాహృతమ్ ॥
నమస్కార్యాశ్చ గురవః ప్రయత్నేన మనీషిభిః ।
ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం సర్వార్థసాధకమ్ ॥
పాపఘ్నం నియమేనేదం శ్రోతవ్యం బ్రాహ్మణోః సదా ।
సతుచౌ చాపి పాపాయ నాప్యసంవత్సరోషితే ॥
నాశ్రద్దగానేఽవిదుషే నాపుత్రాయ కథంచన ।
సాహితాయ ప్రదాతవ్యం పవిత్రమిదముత్తయమ్ ॥
అవ్యక్తం వై యస్య యోనిం వదంతి వ్యక్తం దేహం కాలమేతం గతిం చ ।
వహ్నిర్వక్షం చంద్రసూర్యౌ చ నేత్రే దిశః శ్రోత్రే ప్రణమాహుళ్ళ వాయుమ్ ॥
పురాణ శబ్దము యొక్క శాల్జికార్థమెఱింగిన యతఁడు సర్వ పాపముల నుండి విముక్తుడగును. అట్లే త్రివర్ణముల వారీ ఇతిహాసమును చదివిన పాపముక్తులగుదురు. ఈ ఇతి హాసమును విని, ఎవడు తన మనస్సును ధర్మా చరణమునకు నీయోగించునో అతఁడు తన శరీరమున రోమకూపములు సర్వశః. ఎన్ని కోట్ల సంఖ్య నుండునో, అన్ని వేల సంవత్సరములు బ్రహ్మ సాయుజ్యమును పొంది, అతఁడు దేవతలతో ఆనందించును -57. ఈ శాస్త్రము పవిత్రమయినది, పుణ్య ప్రదమైనది యశః కరము పాప హరమైనది. ఈ పురాణమును బ్రహ్మ వాయు దేవునకు (మాతరిశునకు) ఒసంగెను. అతని నుండి ఉశనసుడు దీనిని పొందెను, ఆతని వలన బృహస్పతి పొందెను. అంత బృహస్పతి దీనిని సూర్యునకు (సవితకు) ప్రవచించెను -59, సప్త దీనిని మృత్యువునకు చెప్పెను. మృత్యువు ఇంద్రునకు . చెప్పెను. ఇంద్రుడు వసిషునకును వసిషుఁడు సారస్వతునకు. చెప్పెను. -60. సారస్వతుఁడు త్రిధామునకు చెప్పెను. త్రిధాముఁడు శారద్వతునకు శారద్వతుఁడు శ్రీవిష్ణునకును, త్రివిష్ణుండో అంతరిక్షునకు నొసంగేను-61, అంతరిక్షుఁడు చర్పునకు, చర్యుడు త్రయ్యారుణునకు, వివరించెను. త్రయ్యారుణుని నుండి. ధనంజయుఁడు పొందెను. ధనంజయుఁడు కృతంజయున కొసంగెను.. కృతంజయుని వలన తృణంజయుఁడు తృణంజయుఁడు భారద్విజునకు చెప్పెను. భరద్వాజుఁడు గౌతమునకు చెప్పెను. గౌతముఁడు దానిని నిర్యంతరునకొసంగెను -63. నిరంతరుఁడు. వాజశ్రవునకు చెప్పెను. వాజశ్రవుఁడు సోమశుష్యునకొసంగెను సోమశుష్యుఁడు తృణ బిందువనకొసంగెను తృణ బిందువు దక్షునకిచ్చెను దక్షుఁడు శక్తికి చెప్పెను. గర్భస్థుఁడయిన పరాశరుఁడు శక్తి వలన వినెను. పరాశరుని నుండి జాతుకర్ణుడు వినేను జాతు కర్ణుని నుండి ద్వైపాయనుడు వినెను (వ్యాసుఁడు) ద్వైపాయనుని వలన బ్రాహ్మణోత్తమ! నేను పొందితిని - 66. నేను అమిత బుద్ధి మంతుడయిన పుత్రునకు చేప్పితిని. ఈ వాక్యమే బ్రహ్మ మొదలుకొని గురువులకు చెప్పబడినది. -69. ఇదీ ధన్యము యశస్కరము పుణ్యము ఆయుష్యము సర్వార్థసాధకము పాపఘ్నము. పండితులు బుద్ధిమంతులు గురువులకు ప్రయత్న పూర్వకముగ నమస్కరించవలేను బ్రాహ్మణులచే నీయ్యది నీయమపూర్వకముగా విన వలసినదీ. పవిత్రము ఉత్తమమైనదియునగు నీ పురాణమును అశుచులకు, పాపులకు, విశ్వాస హీనులకు, పండితులు కానివారికి, అధమ పక్షము ఒక సంవత్సరమయినను చదువని శిష్యునకు నీయరాదు, తన కుమారుని వంటి వాడు కానీ వాని కీయరాదు. అపోతున కీయరాదు. ఇది పవిత్రము ఉత్తమము. బ్రహ్మకు నమస్కారము. ఉత్తములలో నుత్తముఁడైనవానికి వర ప్రదాతకు అవ్యక్త యోనునకు నమస్కృతులు. అతడు సూర్యలోక ప్రతిష్టితుఁడు. ఆతడే యజ్ఞ స్వభావుడు. ఆతఁడు దేవతలకు ప్రభువు ప్రజాసృష్టి కర్త. అతనికి ఆరంభము యోని(కారణము) అవ్యక్తమని చెప్పుదురు. ఈ కాలము, గతి రెండును అతని వ్యక్త దేహము. వహ్ని అతని ముఖము. సూర్యుడు చంద్రుడును ఆతని నేత్రములు. దిక్కులాతని శ్రోత్రములు వాయువు ఆతని ఘాణము (ప్రాణము)
వాచో వేదా అంతరిక్షం శరీరం క్షితిః పాదాస్తారకా రోమకూపాః ॥
సర్వాణీ ద్యౌర్మస్తకాని త్వథో పై విద్యాశ్చైవోపనిషద్యస్య పుచ్ఛమ్ ॥
తం దేవదేవం జననం జనాసాం యజ్ఞాత్మకం సత్యలోకప్రతిషమ్ ।
వరం వరాణాం వరదం మహేశ్వరం బ్రహ్మాణమాదిం ప్రయతో నమస్యే ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే ద్వాదశసాహస్యాం సంహితాయాం ఉత్తరభాగే చతుర్థ ఉపసంహారపాదే బ్రహ్మాండావర్తం నామ చతుర్దోధ్యాయః ॥
అతని వాక్కులు వేదములు అంతరిక్షమాతని శరీరము క్షితి (భూమి) పాదములు. రోమకూపములాతని నక్షత్రములు, యావదాకాశమాతని శిరస్సు. విద్యలు, ఉపనిషత్తులాతని పుచ్ఛము. ఆ దేవదేవునికి జనులకు జనన స్థానమైన వానికి, యజ్ఞాత్మకునకు, సత్యలోక ప్రతిష్ఠితునకు, వరములకు వరమైన వానికి వరదుఁడయిన మహేశ్వరునకు బ్రహ్మకు ఆది ప్రథమ వ్యక్తికి నమస్కారము.
ఇదీ వాయుప్రోక్తమైన బ్రహ్మాండ మహా పురాణమున ద్వాదశసాహస్ర సంహితయందు ఉత్తర భాగమున, ఉపసంహార పాదమునందు బ్రహ్మాండావర్తమను చతుర్థాధ్యాయము
సూచన ఇంతవరకు అమవాదకర్త డా॥ దివాకర్ల రామమూర్తి.
సంపూర్ణము.
Summary of chapter 116 of the Brahmānda Mahā Purana is as follows:
Bringing the core Upasaṃhāra Pāda to a majestic culmination, this chapter sings of the dawn of a new cosmic cycle, as the supreme creator breathes forth the embryonic cosmic egg once more. It describes the revival of universal elements, the emergence of primordial intelligence, and the joyful awakening of life to begin another grand cycle of spiritual evolution. The pious reader overflows with devotion, offering endless gratitude to the eternal lord who continuously nurtures all worlds through infinite cycles of grace.