బ్రహ్మాండ మహా పురాణము
41 - భార్గవచరితము
వసిష్ఠ ఉవాచ :-
దృష్ట్వా పితుర్వరం ఘోరం తత్పుత్రాస్తే శతం త్వరా ।
వారయామాసురత్యుగ్రం భార్గవం స్వదలైః పృథక్ ॥
ఏకైకాక్షౌహిణీయుక్తాః సర్వే తే యుద్ధదుర్మదాః ।
సంగ్రామం తుములం చక్షుః సంరభాస్తు పితుర్వధాత్ ॥
రామస్తు దృష్ట్వా తత్పుత్రాన్ శూరాన్ రణవిశారదాన్ ।
పరశ్వధం సమాపోయ యుయుధ తైశ్చ సంగరే ॥
తాం సేనాం భగవాన్ రామః శతాక్షౌహిణ సమితాం ।
నిజఘాన త్వరాయుక్తో ముహూర్తద్వయమాత్రతః ॥
నిశ్శేషితం స్వసైన్యం తు కుఠారేణేవ లీలయా ।
దృష్ట్వా రామేణ తే సర్వే యుయుధుర్వీర్యసంవతాః ॥
నానావిధానీ దివ్యని ప్రహరంతో మహౌజసః ।
పరితో మండలం చక్రుర్భార్గవస్య మహాత్మనః ॥
అథ రామోపి బలవాంస్తేషాం మండలమధ్యగః ।
విరేజే భగవాన్ సాక్షాద్యథా నాభిస్తు చక్రగా ॥
నృత్యనివాడౌ విరరామ రామః శతం పునస్తే పరితో భ్రమంతః ।
రేజశ్చ గోపీగణమధ్యసంస్థ కృష్ణోయథా తాః పరితో శ్రమంత్య ॥
తదా తు సర్వే ద్రుహిణప్రధానాః సమాగతాః స్వస్వవిమానసంస్థితాః ।
సమాకిరన్నందనమాల్యవర్యై సమంతతో రామమహీనవీర్యమ్ ॥
యః శస్త్రపాదోదుదతిష్ఠత ధ్వనిరంకారగర్భోదినమస్పృశన వై ।
శౌర్యత్రికస్యేవ శరక్షతానీ భాంతీవ యద్వన్నఖదంతపాతాః ॥
క్రందంతి శక్షతక్షతాంగా గాయంతీ యద్వతీల గీతవిజ్ఞాః ।
ఏవం ప్రవృత్తం నృపయుద్ధమండలం పశ్యంతి దేవాళ్ళశవిసితాక్షాః ॥
తతస్తు రామోవనిపాలపుత్రాన్ జిఘాంసురాశా వివిధాగ్రపూగైః ।
పృథక్సకారాతిబలాంస్తు మండలాద్విచ్ఛిద్య పంక్తిం ప్రభురాత్తచాపః ॥
ఏకైకశస్తాన్నీజఘాన వీరాన్ శతం తపో పంచ తతః పలాయితాః ।
శూరో వృషాస్యో వృషశూరసేనౌ జయధ్వజశ్చాపి విభిన్నధైర్యాః ॥
మహాభయేనాథ పరీతచిత్తా హిమాద్రిపాదాంతరకాననం చ ।
పృథగ్గతాస్తే సుపరీప్సవో నృపాన కోపి కాంస్విద్దదృశే భృశార్తః ॥
వసిష్ఠుఁడు చెప్పెను.
కార్తవీర్యుని నూర్గురు కొమరులు, తమ తండ్రి వధను చూచి వెంటనే అత్యుగ్రుఁడైన రాముని వారివారీ బలములతో అడ్డగించిరి. వారందరు ఒక్కొక్క అక్షౌహిణీ సంఖ్య సేనతో గూడినవారు, యుద్ధము నందు దుర్మదులు, పితృవధ వలన రామునితో తుములమయిన యుద్ధ మాచరించిరి. రాముడు శూరులు, రణ విశారదులును నయిన కార్తవీర్యుని పుత్రులను చూచి, పరశువును పట్టుకొని వారితో యుద్దము నందు పోరాడెను. శతాక్షౌహిణీ సంయుతమయిన వారి సేనను రాముఁడు ముహూర్తద్వయ సమయములోనే అత్యంత వేగయుక్తుఁడై చంపేను. తమ సైన్యమంతయు సులభముగా లీలగా నిశ్శేషముగా కుఠారముచే చంపఁబడుట చూచి వారు అందరు వీర్యసంయుతులై నానావిధదివ్యప్రహారములతో మహాపరాక్రమతేజముతో మహాత్ముఁడయిన భార్గవుని చుట్టుముట్టి చక్రమండలముగా యుద్దము చేసిరీ. అంత బలవంతుడు భగవంతుం డునగు రాముండు వారీ మండల మధ్యగుఁడై చక్రమునకు మధ్య నుండు నాభిగా ప్రకాశించెను. శతసంఖ్య గల కార్తవీర్యుని కుమారులు ఆతని చుట్టును పరిభ్రమించుచుండ, రాముఁడు వారిలో నొక్కకనికి అభిముఖుఁడై, బృందావనమున గోపికలతో రాసక్రీడా సమయమున నృత్యము చేయు కృష్ణుని చుట్టు తిరుగు గోపికల మధ్య నున్న వాని వలె నగుపించెను. ఆ సమయమున బ్రహ్మ నాయకుఁడుగా దేవతలు తమతమ విమానముల యందుండి, అహీనశౌర్యవీర్యుఁడైనరాముని చుట్టును నెల్లెడల నందనవనపుష్పమాల్యవర్షములనుజల్లిరి. ఆయుధముల సంఘర్షణమున హుంకారముతో నుత్పన్నమైనధ్వనీ ఆకాశము నంటెను శరములవలనగలిగిన పుండ్లు నఖములతో దంతములతో చేయబడినట్టివిగా నగుపించెను. శస్త్రములచే గాయములు పడి దెబ్బలు తినిన వారి యొక్క ఆక్రందనలు గోలలు ఉచ్చైస్స్వరముతో గీతములాలపించు గాయకుల పాటలవలె నుండెను. ఈ విధముగాప్రవృత్తమయిన నృపయుద్దమండలమును విస్మయముచే విప్పారిన నేత్రములతో దేవతలు చూచిరి. అంత రాముఁడు కార్తవీర్యుని కుమారులను, వివిధ అస్త్రసముదాయముతో చంపవలయునని కోరి, అతి శౌర్యవంతుఁడు తన చావమును చేతపట్టి అతిబలవంతులనెల్లరను విడగొట్టి వేలోక పంక్తిగా చేసెను. ఆ వీరులను ఒకోక్కని రాముఁడు చంపెను. ఆ కుమార శతములో నైదుగురు ధైర్యము వీడి పలాయితులైరి. వారు శూరుఁడు, వృషాస్యుఁడు, వృషశూరుడు, వృషసేనుఁడు, జయధ్వజుఁడును. మహాభయపరీతచిత్తులు, ప్రాణమును రక్షించుకొనుఁగోరికతో, వారు హిమాద్రి పొదాంతర కాననమున పరువిడి విడివడి యొక్కొక్క రోక్కొక్క వైపునకు వెడలిపోయిరి. భృశార్హులయిన వారిలో నేయొక్కండును తరువాత కంటికగపడలేదు.
రామోపి హత్వ నృపచక్రమణో రాజ్ఞః సహాయార్థముపాగతం చ ।
సమన్వితోసావకృతవ్రణేన సస్నౌ ముదా గత్య చ నర్మదాయామ్ ॥
స్నాత్వా నిత్యక్రియాం కృత్వా సంపూజ్య వృషభధ్వజమ్ ।
ప్రతస్థే ద్రష్టుముర్వీళ శివం కైలాసవాసినమ్ ॥
గురుపల్నీముమాంచాపి సుతా స్కందవినాయకౌ ।
మనోయాయీ మహాత్మాసావకృతవ్రణసంయుతః ॥
కృతకార్యో ముదా యుక్తః కైలాసం ప్రాప్య తత్క్షణమ్ ।
దదర్శ తత్ర నగరీం మహతీమలకాభిధామ్ ॥
నానామణిగణాకీర్ణభవనైరుపశోభితామ్ ।
వానారూపధరైర్యక్షేః శోభితాం చిత్రభూషణైః ॥
నానావృక్షసమాకీర్ణార్వనైశ్చోపవనైర్యుతామ్ ।
దీర్తికాభిః సుదీరాభిస్తడాగైశ్చోపశోభితామ్ ॥
సర్వతోప్యావృతాం బాహ్యే సీతయాలకనందయా ।
తత్ర దేవాంగనాస్నానముక్తకుంకుమపింజరమ్ ॥
తృషావిరహితాశ్చాంభః పిబంతీ కరిణో ముదా ।
యత్ర సంగీతసన్నాదాః శ్రయంతే తత్ర తత్ర హ ॥
గాంధర్వైరపురోభిశ్చ సతతం సహకారిభిః ।
తాన్ దృష్ట్వా భార్గవో రాజన్ ముదా పరమయా యుతః ॥
యమౌ తదూర్ధ్వ శిఖరం యత్రశైవపరం గృహమ్ ।
తతో దదర్శ రాజేంద్రః స్నిగ్ధచ్ఛాయం మహావటమ్ ॥
తస్యాధస్తాదరావాసం సుసేవ్యం సిద్ధసంయుతమ్ ।
దదర్శ తత్ర ప్రాకారం శతయోజనమండలమ్ ॥
నానారత్నాచీతం రమ్యం చతుర్ద్వారం గణావృతమ్ ।
నందీశ్వరం మహాకాలం రక్తాక్షం వికటోదరమ్ ॥
పింగలాక్షం విశాలాక్షం విరూపాక్షం ఘటోదరమ్ ।
మందారం భైరవం బాణం రురుం భైరవమేవ చ ॥
వీరకం వీరభద్రం చ చండం భృగిం రిటైం ముఖమ్ ।
సిద్ధేంద్రనాథరుద్రాంశ్చ విద్యాధరమహోరగాన్ ఈఈ
భూతప్రేతపిశాచాంశ్చ కూష్మాండాన్ బ్రహ్మరాక్షసాన్ 1।
వేతాలాన్దానవేంద్రాంశ్చ యోగీంద్రాంశ్చ జటాధరాన్ ॥
యక్షకింపురుషాంశ్చైవ డాకినీయోగినీస్తథా ।
దృష్ట్వా నంద్యాజ్ఞయా తత్ర ప్రవిష్టోంతర్ముదాన్వితః ॥
కార్తవీర్యునకు సహాయార్థము వచ్చిన నృపమండలిని రాముఁడు చంపి, అకృతవణునితో కలిసికొని, నర్మదకు వచ్చి సంతోషముతో స్నానమాచరించెను. స్నానమాడి నిత్యక్రియల నాచరించి, వృషభధ్వజుఁడయిన యీశ్వరు నారాధించి, కైలాస వాసియైన శివుని దర్శించుటకు ఓ రాజా ! రాముఁడు బయలుదేరెను. అందు రాముఁడు గురుపత్నియైన ఉమను, కుమారులయిన స్కందవినాయకులను, కూడ చూడగా మనోగతితో అకృతవప్రణసహితుఁడై యరిగెను. కృతకార్యుఁడు, సంతోష సంభరితుండునగు రాముఁడు వెంటనే కైలాసమును చేరి, అచ్చట గొప్ప నగరమయిన అలకాభీదను, నానా మణిగణాకీర్ణభవనములచే నుపశోభితమైన దానిని చూచేను. విచిత్ర భూషణములతో నానా రూపములు దాల్చి ప్రకాశించు యక్షులతో శోభిల్లునదీ నానా వృక్ష సమాకీర్ణమైనదీ, ఉపవనములతో కూడియున్నది. దీర్షికలతో (దిగుడు బావులతో) సుదీర్ఘములయిన తటాకములతో విలసిల్లునట్టిది, సీతయను నామాంతరముతో నొప్పు అలకనందచే బాహ్యమున ఆ వృతమై యున్నట్టిది యునగు ఆ నగరము చూచెను. (అలకనందకడ) దప్పిక లేకపోయినను, ఏనుగులు ఆ నదీ జలములఁద్రాగేను, ఆ నదీ జలములు దేవాంగనలు స్నానము చేసి విడిచి వెళ్లిన కుంకుమలతో పింజర వర్ణములగుట ఆ ఏనుగులు పింజర వర్ణము నొందినవి. గంధర్వులు అప్సరలు కలిసి పాడునట్టి సంగీత నాదము లచ్చట విననగును. వీని నన్నింటిని చూచి భార్గవరాముఁడు అత్యంత ముదాన్వితుఁడయ్యెను. ఎచ్చట శైవ పరమయిన గృహమున్నదో తదూర శిఖరమునకు రాముఁడు వెళ్లెను. అందు రాముఁడు దట్టమయి చల్లనీ స్నిగ చ్చాయమగు మహావటమును చూచేను. ఆ వటము క్రింద ఉత్తమమైన ఆవాసము, సు సేవ్యము, సిద్దులతో కూడికొని యున్నది. అచ్చట నొక ప్రాకారమును రాముఁడు చూచెను. అది శతయోజనమండలము నానారత్నోచితము, రమ్యము, చతుర్ద్వారములు కలదీ, గణావృతము. అట నందీశ్వరుని, మహాకాలుని, రకాక్షుని, వికటోదరునీ, పింగళాక్షుని, విశాలాక్షుని, విరూపాక్షుని, ఘటోదరుని, మందారుని, భైరవునీ, బాణుని, రురుని, వీరకునీ, వీరభద్రుని, చండుని, భృగిని, నీటిని, ముఖుని, సిద్దేంద్రనాథుని, రుద్రులను విద్యాధరులను, మహోరగములను భూతప్రేత పిశాచాదులను, కూష్మాండులను, బ్రహ్మ రాక్షసులను, వేతాళులను, దానవేంద్రులను, యోగీంద్రులను, జటాధరులను, యక్షులను కింపురుషులను, డాకినులను, యోగినులను రాముడు చూచెను. హృదయాంతర్ముదాన్వితుఁడై నందీశ్వరు నాజ్ఞతో లోనికి ప్రవేశించెను.
దదర్శ తత్ర భువనైరావృతం శివమందీరమ్ ।
చతుర్యోజనవిస్తీర్ణం తత్ర ప్రాగ్ద్వారసంస్థితౌ ॥
దృష్ట్వా వామే కార్తికేయం దక్షే చైవ వినాయకమ్ ।
ననామ భార్గవస్తా ద్వౌ శిషతుల్యపరాక్రమౌ ।
పారదప్రవరాస్తత్ర క్షేత్రపాలాశ్చ సంస్థితాః ।
రత్నసింహాసనస్థాశ్చ రత్నభూషణభూషితాః ॥
భార్గవం ప్రవేశంతం తు హ్యపుచున్ శివమందిరమ్ ।
వినాయకో మహారాజ క్షణం తిపేత్యువాచ హ ॥
నిద్రితో హ్యుమయా యుక్తో మహాదేవో దునేతి చ ।
ఈశ్వరాజ్ఞాం గృహీత్సాహమత్రాగత్య క్షణాంతరే ॥
త్వయా సార్ధం ప్రవక్ష్యామి భాతస్తిషాత్ర సాంప్రతమ్ ।
వీనాయకవశ్చైవం శ్రుత్వా భార్గవనందనః ॥
ప్రవర్తుముపచక్రామ గణేశం త్వరయాన్వీతః ।
రామ ఉవాచ :-
గత్వా హ్యంతఃపురం భ్రాతః ప్రణమ్య జగదీశ్వరౌ॥
పార్వతీ శంకరౌ సద్యో యాస్యామీ నీజమందిరమ్ ।
కార్తవీర్యః సుచంద్రశ్చ సపుత్రణలబాంధవః ॥
అన్యే సహస్రశో భూపాః కాంభోజాః పప్లవాః శక్తాః ।
కాస్యకుబ్ధాః కోమలేశా మాయావంతో మహాబలాః ॥
నీహతాః సమరే సర్వే వుయా శంభుప్రసాదతః ।
తమిషం ప్రణీపత్యైవ యాస్యామీ స్వగృహం ప్రతి ॥
ఇత్యుక్త్వా భార్గవస్తత్ర తణ్ణి గణపతేః పురః ।
ప్రోవాచ మధురం వాక్యం భార్గవే స గణాధీపః ॥
వినాయక ఉవాచ :-
క్షణం తిష్ఠ మహాభాగ దర్శనం తే భవిష్యతి ।
అద్య విశ్వేశ్వరో భ్రాతర్భవానా సహ వర్తతే ॥
స్త్రీపుంసోర్యుక్తయోస్తాత సహైససస్టయోః ।
కరోతి సుఖభంగం యో నరకం ప ప్రజేద్ధృవమ్ ॥
అందు చతుర్యోజన విస్తీర్ణము గలిగి, ప్రాగ్ద్వారముతో కూడి, భువనములతో ఆవృతమయి, యొప్పు శివమందిరమును రాముఁడు చూచెను. ప్రాగ్ద్వారమున కార్తికేయ వినాయకులు ఆసీనులై యుండిరి. కార్తికేయుఁడు హిమభాగమునను, వినాయకుడు కుడివైపున నుండిరి. శివతుల్యపరాక్రములయిన వారిరువురను చూచి రాముఁడు నమస్కరించేను. శ్రేష్టులగు, ఈశ్వర పార్శ్యదులను అందును క్షేత్రపాలురను, చూచెను, వారు రత్న సింహాసనస్థులు, రత్నభూషణ భూషితులు. శివమందీరమును ప్రవేశింపఁ బోవు రామునితో వినాయకుడిట్లు భాషించేను. “ఓ మహానుభావ, క్షణము నిలువుము. ఇప్పుడు మహాదేవుఁడు ఉమతో నిద్రించుచున్నాడు. నేనో ఈశ్వరాజ్ఞను గ్రహించీ క్షణకాలంలో వచ్చి నీతోకలిసి ప్రవేశింపగలను. సోదరా ! ఇప్పుడు, క్షణము నిలుష్పము”అని. భార్గవనందనుఁడు వినాయకుని పలుకులు విని, తొందరతో కూడుకొని గణేశునీతో రాముఁడు పలుకనారంభించెను.
రాముడనేను :
ఓ సోదరా ! ఇచ్చట నుండి లోనికరీగీ, జగదీశ్వరులయిన పార్వతీపరమేశ్వరులకు నమస్కరించి వెంటనే తిరిగి వచ్చి నీజమందిరమునకుం బోయెదను. కార్తవీర్యుఁడు, సుచంద్రుఁడును, సపుత్రబలభాంధవులతో శంభు ప్రసాదమున యుద్ధములో చంపండిరి. అంతీయకాక ఇతరులయిన అన్యభూపతులు సహస్రశః, కాంభోజులు, పహ్లవులు, శకులు, కాన్యకుబ్ధులు, కోశలులు, మాయావంతులు, మహాబలురు యుద్ధమున శంభు ప్రసాదవశమున నెల్లరును హతమొనర్పఁబడిరి. అందుచే నేనా ఈశ్వరునకు నమస్కరించి స్వగృహమున కరిగెదను. ఇట్లు పలికి భార్గవుం డు గణపతి ముందు నిలబడెను. గణాధిపుఁడు భార్గవునితో మధురవాక్యములతో నిట్లు పలికెను.
వినాయకుఁడనేను :
మహానుభావ ! ఒక్క క్షణకాలము నిలువుము. నీకు దర్శనమగును. సోదరా ! ఇప్పుడు విశ్వేశ్వరుఁడు భవానీతో సహ నున్నాడు. ఏకాసనసంస్థితులయి స్త్రీ పురుషులున్న సమయాన సుఖ భంగమాచరించిన వాఁడు నరకమునొందును. ఇది నిశ్చయము.
విశేషతస్తు పీతరం గురుం వా భూపతిం ద్విజమ్ ।
రహస్యం సముపాసీనం న పశ్యేదితీ నిశ్చయః ॥
కామతో కామతో వాపి పశ్యేద్యః సురతోన్ముఖమ్ ।
స్త్రీవిచ్ఛేదో భవేత్తస్య ధ్రువం సప్తసు జన్మసు ॥
శ్రోణిం వక్షఃస్థలం వక్షం యః పశ్యతి పరస్త్రియః ।
మాతుర్వాపి భగినా దా దుహితుః స నరాధమః ॥
భార్గవ ఉవాచ :-
అహో శ్రుతమపూర్వం కిం వచనం తవ వక్రతః ।
భౌంత్యా వినిర్గతం వాపి హాస్యార్థమథవోదితమ్ ॥
కామినాం సవికారాణామేతచ్ఛాస్తనిదర్శనమ్ ।
నిర్వికారస్య చ శిశోర్న దోషః కశ్చిదేవ హి ॥
యాస్యామ్యంతఃపురం భ్రాతస్తవ కిం తిష్ఠ బాలక! ।
యథాదృష్టం కరిష్యామి తత్ర యత్సమయోచితమ్ ॥
తతైవ మాతా తాతశ్చ త్వయా సామ నిరూపితౌ ।
జగతాం పితరౌ కౌ చ పార్వతీపరమేశ్వరౌ ॥
ఇత్యుక్త్వా భార్గవో రాజన్నంతగ్దంతుం సముద్యతః ।
వినాయకస్తదోళాయ వారయామాస సత్వరమ్ ॥
వాగ్యుద్ధం చ తయోరానీన్మిథో హస్తవికర్షణమ్ ।
దృష్ట్వా స్కందస్తు సంభ్రంతో బోధయామాస తౌ తథా ॥
బాహుభ్యాం ద్వౌ సముద్ధృహ్య పృథగుత్సారితా తథా ।
అథ కుదో గణేశాయ భార్గవః పరవీరహా ।
పరశ్వథం సమాద్య సంప్రక్షేప్తుం సముద్యతః ॥
తం దృష్ట్వా (చ) గజాననో భృగువరం క్రోధాత్క్షిపంతం త్వరా స్వాత్మార్థం పరశుం తదా నిజకర్ణోద్ధృత్య వేగేన తు ।
భూర్లోకం (చ) భువః స్వరపి తస్యోర్ధ్వం మహద్వైజనం లోకం చాపి తపోథ సత్యమపరం వైకుంఠమప్యానయత్ ॥
తస్యోర్ధ్వం చ విదర్శయన్ భృగువరం గోలోక మీశాత్మజో, నిష్పాత్యాధరలోకసప్తకమపీతం దర్శయమాస చ ।
ఉద్ధృత్యాథ తతో హి గర్భసలిలే ప్రక్షిప్తమాత్రం త్వరా, భీతం ప్రాణపరీపుమానయదధో
తత్రైవ తత్రోస్థితః ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే భార్గవచరితే ఏకచత్వారింశత్తమో ధ్యాయః॥
అంతియేకాక, పితరుని, కాని, భూపతిని కాని, బ్రాహ్మణుడు రహస్యముగానుపాసీనులై యున్నను చూడరాదని ధర్మ నిశ్చయము. కామయుతుఁడు కాని కామరహితుఁడు కాని, సురతోన్ముఖుఁడయిన యొకనిని, వేటోకడు చూచినచో, ఆతఁడు ఏడు జన్మాంతరములు స్త్రీ విచ్ఛేదము నొందును. ఇది ధ్రువము. పరస్త్రీ యొక్క కాని, తల్లి యొక్క కాని, సోదరి యొక్క కాని, కుమార్తె యొక్క కాని, పిరుందలను, వక్షః స్థలమును వక్రమును ఎవఁడు చూచునో అతఁడు నరాధముఁడు.
భార్గవుఁడిట్లనెను :
ఆహో ! అపూర్వము, ఇంతకుంబూర్వము చెప్పఁబడని దుష్టవచనములు నీ ముఖము నుండి వింటిని. ఆ పలుకులు భ్రాంతిచే చేప్పం బడినవా? లేక పరిహాసము కోలుకొట్లాడితివా? సవికారులు, కాములునయిన వారి విషయమై ఈ వాక్యములు నిదర్శనములు కాని నిర్వికారునకు, పసిబిడ్డకు నెచ్చటను దోషము కాదు. సోదరా ! నేనంతఃపురమున కరిగెదను. ఓ బాలక! నీవూరకొనుము. అక్కడ చూచిన దానిని బట్టి, తత్సమ యోచితముగ వర్తించెదను. మన తండ్రి తల్లి యందున్నారు నీవు నిరూపించితివి కదా ! పార్వతీ పరమేశ్వరులు యావత్ జగతికీ తల్లిదండ్రులని ఈ విధముగా పలికి భార్గవ రాముఁడు లోనికి పోవ సముద్యతుఁడయ్యెను. అంత వినాయకుఁడు లేచి యాతనిని వెంటనే వారించెను. అంత వారిరువురకు వాగ్యుద్ధమయ్యెను, చేతులతో గెంటుకోనిరి. అడ్డగించుకొనిరి. స్కందుఁడు ఇది చూచి సంక్రాంతుఁడై వారిరువురకు వారి దోషమును తెలియచెప్పెను. వారిరువురను చేతులతో పట్టుకొని విడదీసి గెంటెను. పరవీరనాశకుడయిన భార్గవుఁడు క్రుద్దుఁడయ్యెను. పరశ్వధమును తీసికొని గణేశ్వరునిపై విసర సముద్యుతుఁడయ్యెను. వినాయకుఁడు భార్గవుఁడు కోపముతో తనపై గదను వేయబూనుట చూచెను. అప్పుడు గణేశుఁడు భార్గవుఁడు తనపై పరశును విక్షేపింప బూనుకొన, వెంటనే తన కరముతో భార్గవుని ఎత్తే వెంటనే ఆతనిని భూర్లోకము, భువర్లోకము, స్వర్లోకము, తపోలోకము, ఊర్థ్వలోకము, మహర్లోకము, జనలోకము, సత్యలోకము, తీసికొనిపోయి వైకుంఠమునకు తెచ్చెను. ఈశ్వర సుతుఁడు గోలోకమును భార్గవునకు చూపెను. అచ్చటి నుండి క్రిందకు అధోలోకములకు పడవైచి ఏడు పాతాళలోకముల చూపెను. అచ్చటి నుండి యతనిని ఊర్థ్వలోకములకు నెత్తి, అచ్చటి నుండి వెంటనే జలమధ్యములో విసరెను. భార్గవుఁడు భీతుఁడయ్యెను. తన ప్రాణమును రక్షించుకొన ఆత్రము వహించెను. అంత గణేశుఁడు రాముని పూర్వము నిలుచుండి యున్న స్థానమునకుఁ దీనికొని వచ్చి నిలిపెను.
ఇదీ వాయుప్రోక్త బ్రహ్మాండమహాపురాణమునందు మధ్యమభాగమున, తృతీయ ఉపోద్ఘాతపాదమున భార్గవచరితమున నలుబది యొకటవ అధ్యాయము.
Summary of chapter 79 of the Brahmānda Mahā Purana is as follows:
In verses dripping with supreme spiritual devotion, this chapter presents the glorious hymn composed by Parashurāma in praise of lord Shiva and mother Pārvatī to seek forgiveness and divine grace. It expresses deep philosophical truths regarding the non-dual reality of the divine parents who sustain the universe. Chanting these holy verses, the devotee's mind is cleansed of all impurities and filled with radiant peace and devotional bliss.