52 - సగరచరిత్రము - యాజ్ఞాశ్వమోచనము

జైమిని రువాచ :-    

త్యక్త్వా పుత్రం స ధర్మాత్మా సగరః ప్రేమ తర్గతమ్

ధర్మశీలే తదా బాలే చకారాంశుమతి ప్రభుః

ఏతస్మిన్నేవ కాలే తు సుమర్యాస్తనయా నృప

 వవృధుః సంఘశః సర్వే పరస్పరమనువ్రతాః

వజసంహనః క్రూరా నిర్దయా నిరపత్రపాః

 అధర్మశీలా నితరామేకధర్మాణ ఏవ చ

ఏకకార్యాభినిరతాః క్రోధనా మూడచేతసః

అధృష్యాః సర్వభూతానాం జనోపద్రవకారిణః

వినయాచారసన్మార్గనిరపేక్షా సమంతతః

 భజాధిరే జగత్సర్వమసురా ఇవ కామతః

విధ్వస్తయజ్ఞసన్మార్గం భువనం ఛైరుపద్రుతమ్

నిఃస్వాధ్యాయవషట్కారం బభూవార్తం విశేషతః

విధ్వస్యమానే సుభృశం సాగరైర్వరదర్పితైః

 ప్రక్షోభం పరమం జగ్ముర్దేవాసురమహోరగాః

ధరా సా సాగరాత్రాంతా న చలాపి తదా చలా

తపఃసమాధిభంగశ్చ ప్రబభూవ తపస్వినామ్

హవ్యకవ్యపరిభ్రష్టాస్త్రిదశాః పితృభిస్సహ

 దుఃఖేన మహవిషా విరించిభవనం యయుః

తత్ర గత్వా యధాన్యాయం దేవాః శర్వపురోగమాః

 శశంసః సకలం తసై సాగరాణాం విచేష్టితమ్

తచ్ఛ్భత్వా వచనం తేషాం బ్రహ్మలోకపితామహః

 క్షణమంతర్మనా భూత్వా ఉగాద సురసత్తమః

దేవాః శ్రుణుత భద్రం వో వాడీమవహితా మమ

వినక్ష్యంత్యచారేడైవ సాగరా నాత్ర సంశయః

కాలం కంచిత్రతీక్షధ్వం తేన సర్వం నీయమ్యతే

నిమిత్తమాత్రమన్యత్తు స ఏవ సకలేశితా

 తస్మాద్యుష్మద్ధితార్థాయ యద్వక్ష్యామి సురోత్తమాః

 సర్వైర్భవద్భిరధునా తత్కర్తవ్యమతంద్రితైః

జైమిని ఇట్లు చెప్పెను :

ధర్మాత్ముండు ప్రభువునునయిన సగరుఁడు అసమంజసుని బహిష్కరించి, అతని యందలి ప్రేమను ధర్మశీలుఁడు బాలుఁడునయిన  అంశుమంతుని యందు నిక్షేపించెను. తత్సమయముననే సుమతికుమారులు అందరు పరస్పరమనువ్రతులై సంఘశః వృద్ధి పొందిరి. వారు వజ్రశరీరులు : క్రూరులు : నిర్దయులు : లజ్జారహితులు : అధర్మశీలురు : వారందరు ఒకే ధర్మ స్వభావులు. వారేకైకకార్యము నందే అభినిరతులు. వారు క్రోధశీలురు. మూఢచేతస్కులు. వారితరులచేజయింపఁబడ నసాధ్యులు. సర్వభూతములకు, జనములకు నుపద్రవకారకులు. వినయము, ఆచారము, సన్మార్గమును, అపేక్షించరు. పాటింపరు. వారు రాక్షసులవలె వారికిష్టము వచ్చినట్లు ప్రపంచము సంతటిని బాధించిరి. యజ్ఞ సన్మార్గయుతమయిన భువనము విధ్వస్తమయినది. ఉపద్రవము కల్గినది. దేశము స్వాధ్యాయ రహితము, యజ్ఞ హవిస్సులు లేమి నీర్గత వషట్కారము, విశేషముగా ఆర్తిమంతము నయినది. వరదర్పితులయిన సగరపుత్రులచే అంతయు పూర్ణముగా విధ్వస్తము కాగా, దేవతలు అసురులు, మహోరగులు పరమ ప్రక్షోభము నొందిరి. సాగరాక్రాంతమయిన భూమి కదలనిదైనను చలించిపోయెను. తపస్వులకు తపస్సమాధి భంగమయ్యెను. హవ్యములు, కవ్యములు పరిభ్రష్టములయిన త్రిదశులు పితృ దేవతలతోసహా మహాదుఃఖపరీవిష్ణులైరి. బ్రహ్మలోకమున కరిగిరీ. దేవతలందరు యధాన్యాయము ఇంద్రుని పురస్కరించుకొని బ్రహ్మలోకమున కరిగి, ఆ బ్రహ్మకు సాగరుల యొక్క దుశ్చేష్టితముల నెల్లను విన్నవించిరి. వారి పలుకులు పితామహుం డయిన బ్రహ్మ వినెను. క్షణకాలమంతర్మనస్కుండయ్యెను. తరువాత సురసత్తముఁడు దేవతలతో నిట్లు పలికెను. “దేవతలార ! ఆలకింపుఁడు. మీకు మంగళమగు; నేను పలుకు పలుకులను అవహితులై శ్రద్దగా వినుఁడు. సాగరులందరు అచిరకాలమున నాశనము పొందుదురు. అందు సందేహము లేదు. మీరో కొంతకాలము ప్రతీక్షించవలెను. ఓపిక పట్టుడు. తత్కాలమున సర్వము నియమింపఁబడును. మిగిలిన వన్నియు నిమిత్తమాత్రములు. ఆ కాలమే సర్వప్రభువు. అందుచే, ఓ సురోత్తములారా ! మీ హితము కొఱకు నేను చెప్పునట్టిది మీరందరు ఇప్పుడు అతంద్రితులై ఏమరుపాటులేక చేయవలయును.

విష్ణోరంశేన భగవాన్ కపిలో జయతాం వరః

 జాతో జగద్థితార్దయ యోగీంద్రప్రవరో భువి

అగస్త్యపీతసలిలే దివ్యదర్షశతావధి

 ధ్యాయన్నాస్తేధునాంభోధావేకాంతే తత్ర కుత్రచిత్

గత్వా యూయం మమాదేశాత్ కపిలం మునిపుంగవమ్

ధ్యానావసానమిచ్ఛంతస్తిష్ఠధ్వం తదుపహ్వయే

సమాధివిరతౌ తస్య స్వాభిప్రాయమశేషతః

నత్వా తస్మై వదిష్యద్వం స వః శ్రేయో విధాస్యతి

సమాధిభంగశ్చ మునేర్యథా స్యాత్సాగరైః కృతః

 కురుధ్వం చ తథా యూయం ప్రవృత్తిం విబుధోత్తమాః

జైమిని రువాచ :-

ఇత్యుక్తాస్తేన విభుథాస్త్రం ప్రణమ్య పితామహమ్

 గత్వా త్వం విబుధశ్రేష్ఠం తే కృతాంజలయోబ్రువన్

దేవా ఊచుః :-

ప్రసీద నో మునిశ్రేష్ఠ వయం త్వాం శరణం గతాః

ఉపద్రుతం జగత్సర్వం సాగరైః సంప్రణశ్యతి

 త్వం కిలాఖిలలోకానాం స్థితిసంహారణకారణః

విష్ణోరంతేన యోగీంద్ర స్వరూపీ భువి సంస్థితః

పుంసాం తాపత్రయార్షానామార్తీనాశాయ కేవలమ్

స్వేచ్ఛయా ధృతో దేహో న తు త్వం తపతాం వరః

మనసైవ జగత్సర్వం స్రష్టుం సంహర్తుమేవ చ

విధాతుం స్వేచ్ఛయా బ్రహ్మన్ భవాణ్చక్నోత్యసంశయమ్

త్వం నో ధాతా విధాతా చ త్వం గురుస్వం పరాయణమ్

 పరిత్రాతా త్వమస్మాకం వినివర్తయ చాపదమ్

శరణం భవ విప్రేంద్ర విప్రేంద్రాణాం విశేషతః

సాగరైర్గహ్యమానానాం లోకత్రయనివాసినమ్

నను వై సాత్త్వికీ చేష్టా భవతీహ భూదృశామ్

త్రాతుమర్హసి తస్మాత్వం లోకానస్మాంశ్చ సువ్రత

 న చేదకాలే భగవన్ వినక్ష్యంత్యఖిలం జగత్

జైమిని రువాచ :-

ఇత్యుక్తః సకలైర్దేవైరున్మీల్య నయనే శనైః

విలోక్య తానువాచేదం కపిలః సూనృతం వచః

 స్వకర్మణైవ నిర్దగ్ధః ప్రవినజక్ష్యంతి సాగరాః

జయస్వభావులలో శ్రేష్ఠుఁడు భగవంతుఁడునయిన కపిలుడు జగత్తు యొక్క హితము కొఱకు విష్ణుని యొక్క అంశతో పుట్టేను. ఆతఁడు భువిలో యోగీంద్ర ప్రవరుఁడు. అగస్త్య మహర్షిచే త్రాగబడిన సముద్రములో ఎచ్చటనో ఒకచోట ఏకాంతప్రదేశమున ధ్యాన మాచరించు చున్నాఁడు. మీరు నా యాదేశానుసారము ముని పుంగవుఁడయిన కపిలుని కడకు వెళ్లుఁడు. తద్ద్యానావసానము కోరుచు తత్సమీప ప్రదేశమున. కూర్చుండియుండుడు, ఆతఁడు సమాధిని విరమించిన తరువాత, మీరాతనికి నమస్కరీంచి మీయభిప్రాయమును అశేషముగా చెప్పుడు, ఆతం డు మీకు శ్రేయస్సాచరించును. ఓ విబుధోత్తములు లారా ! సాగర సుతులచే నా మహర్షి సమాధికి భంగమెట్లు జరుగగలదో యట్టి ప్రవృత్తి మీరాచరింపుఁడు.”

జైమిని ఇట్లనెను ;

విబుధులివిధముగా చెప్పఁబడిరి. వారు పితామహునకు నమస్కరించి కపిలమహర్షి కడకేగిరి. విబుధ శ్రేష్ఠుఁడయిన యాతనికి దేవతలు కృతాంజలురయి ఇట్లు విన్నవించుకొనిరి.

 దేవతలిట్లనిరి :

ఓ మునిశ్రేష్ఠ ! మాకు ప్రసన్నుఁడవగుము. మేము నిన్ను శరణుపొందితిమి. సాగరకుమారులచే జగత్సర్వము ఉపద్రవమొంది నశించునున్నద.ఇ నీవో ! ఓ మహర్షీ ! విష్ణువు యొక్క యంశమున యోగీంద్ర స్వరూపుడవై భువి యందుంటివి. నీవే యీ ప్రపంచము యొక్క . స్థితిసంహరణ కారణమవు నీవు వట్టి తపస్వులలో శ్రేష్ఠుఁడవే కావు. తాపత్రయార్తిచే బాధపడు ప్రజల యొక్క మూర్తిని కేవలము నాశనము చేయుటకు స్వేచ్చగా నీ దేహమును ధరించితివి. నీవు ఓ మహర్షీ ! మనస్సుచే తలంచు మాత్రము చేతనే, సర్వలోకమును సృష్టించుటకు సంహరించుటకు తిరిగి సృష్టించుటకు ఓ బ్రహ్మర్షీ ! నీవే స్వేచ్ఛయా శక్తుఁడవు సంశయము లేదు. (24) నీవు మాకు ధాతవే కాదు, విధాతవు, గురుఁడవు : మాకు ఆధారభూతుఁడవైన పరాయణుఁడవు, మాకు పరిత్రాతవు. ఆపదను తొలగించుము. విప్రేంద్రుల శ్రేషుఁడవయిన విప్రేంద్ర మాకు శరణ్యుఁడవు కమ్ము. లోకత్రయమున నీవసించు వారలెల్లరు సాగరులచే దహింపబడుచున్నారు. నీవంటి వారిక్రియలు సాత్వికీచేష్టలుగా నుండును. అందుచే మమ్ము రక్షింప అర్జుఁడవు. అందుచే ఓ సువ్రత ! లోకములను మమ్ము రక్షించుము. కానిచో అఖిల జగత్తు ఓ భగవాన్ అచిరకాలములో వినష్టమొందగలదు.

 జైమిని ఇట్లనెను.

సకల దేవతలిట్లు విజ్ఞావింప, మెల్లగా నేత్రములను ఉన్మీలించి కప్పి మహర్షి వారలనుచూచి సూనృతమైన వచస్సునిట్లు పలికెను. సాగరులు స్వకర్మముచే నిర్ధగులై వసించెదరు.

కాలే ప్రాప్తే తు యుష్మాభిః స తావత్పరిపాల్యతామ్

అహం తు కారణం తేషాం వినాశాయ దురాత్మనామ్

భవిష్యామి సురశ్రేష్ఠా భవతామర్థసిద్ధయే

మమ క్రోధాగ్ని వీప్లుష్టాః సాగరాః పాపచేతసః

భవిష్యంతు చిరేణైవ కాలోపహితబుద్ధయః

తస్మాద్ధతజ్వరా దేవా లోకాశ్చైవాకుతోభయాః

భవంతు తే దురాచారాః క్షిప్రం యాస్యంతి సంక్షయమ్

తద్యూయం నిర్భయా భూత్వా ప్రజధం స్వాం పురీం ప్రతి

 కాలం కంచిత్ ప్రతీక్షధ్వం తతో భీష్టమవాప్స్యథ

కపిలేనైవముక్తాస్తే దేవాః సర్వే సవాసవాః

తం ప్రణమ్య తతో జగ్ముః ప్రతీతాగ్నిదివం ప్రతి

ఏతస్మిన్నంతరే రాజా సగరః పృథివీపతిః

వాజిమేధం మహాయజ్ఞం కర్తుం చక్రే మనోరథమ్

అహృత్య సర్వసంభారాన్వాసిషానుమతే తదా

ఔర్వాద్యైః సహితో వీపైర్యథావద్దీక్షితో భవత్

దీక్షాం ప్రవిష్ణో నృపతిః పాయసంచారణాయ వై

పుత్రాన్సర్వోన్ సమాహూయ సందిదేశ మహాయశాః

సంచారయిత్వా తురగం పరీత్య పృథివీతలే

క్షిప్రం మమాంతీకం పుత్త్రాః పునరాహర్తుమర్హథ

జైమిని రువాచ :-

తతస్తే పితురాదేశాత్తమాదాయ తురంగమమ్

పరిచంక్రమయాయాసుః సకలే క్షితిమండలే

 వీధీచోదనమైవాశ్వః స భూమౌ పరివర్తితః

న తు ద్విగ్విజయార్ధాయ కరాదానార్థ మేవ చ

పృథివీ భూభుజా తేన పూర్వమేవ వినిర్జితా

నృపాశ్చోదారవీర్యేణ కరదాః సమరే కృతాః

 తతస్తే రాజతనయా నిన్తయే లవణాంబుధే

భూతలే వివీశుః హృష్టాః పరివార్య తురంగమమ్

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే సగరచరితే అశ్వమోచనో నామ ద్విపంచాశత్తమోధ్యాయః

కాలమాసన్నము కావలెను. మీరంతవరకు ప్రతీక్షించుచుండవలెను. దురాత్ములయిన వారలయొక్క వినాశనమునకు నేనే కారణము కాగలను. ఓ సురశ్రేష్ఠ మీ యొక్క కార్యసిద్ధి కొఱకు నా క్రోధాగ్నిలో దగ్గులయి పాప చేతస్కులయిన సగర సుతులు కాలోపహతబుద్ధులై మరణింతురు. ఆ కారణమున దేవతలకు, లోకములకు బాధలు తొలగును. ఇంక పొరికి భయమెక్కడిది? దురాచారులయిన వారు వెంటనే సంక్షయమును పొందుదురు. అందుచే మీరు నీర్భయులుకండు. మీరు మీ నగరములకు తిరిగి పొండు. కొంతకాలము ఓపికతో ప్రతీక్ష చేయుం డు, అంత మీరభీష్టమును పొందగలరు.” కపీలుఁడిట్లు చెప్పగా దేవతలందరు ఇంద్రునితోసహా, ఆ మహర్షికి నమస్కరించి, సంతోషించి హృదయబాధాగ్ని శమింప స్వర్గమున కరిగిరి. ఈ మధ్య కాలములో పృథివీపతియైన సగరుఁడు, వాజమేధమను మహాయజ్ఞమును ఒనర్చుటకు కోర్కెవహించెను. వసిషానుమతితో సర్వ సంభారములను సమకూర్చి, ఔర్వాది విప్రులతో గూడికొని యథాశాస్త్రము సగరుఁడు దీక్షితుఁడయ్యెను. నృపతి అశ్వమేధ దీక్ష వహించెను, పుత్రులందరను పిలిచి, మహాయశస్వి యశ్వ సంచారజమునకు ఆజ్ఞాపించెను. పృథివీతలము నందంతటను తురగమును యజ్జీయాశ్వమును సంచరింపఁజేసి ఓ పుత్రులారా ! వెంటనే మీరందరు నాకడకు రానర్హులు” అనెను.

జైమిని ఇట్లు పలికెను.

అంత వారు తమ పితురాదేశమున తురంగమును గైకొని సకల క్షితిమండలము నంతటిని పరిచంక్రమణ మొనర్చిరి. వేద వీధి కొఱకు  అశ్వము భూమినంతయు పరివర్తించి తిరిగునట్లుచేయను. అందునకే కానీ, దిగ్విజయార్థము కాదు, కరగ్రహణము (పన్నుకట్టడము)నకు గానీ ఇతర పదార్థముల కొఱకు గాని కాదు. ఏలయన భూమి యంతయు నీంతకు పూర్వమే రాజుచే జయింపఁబడెను. ఆ రాజు ఉదారవీర్యముచే  రాజులందరు సమరములందే కృత కరదానులైరి. అంత రాజతనయులు నీరు లేని లవణాంబుధి యందు భూతలమున ప్రవేశించిరి. తురంగమును పరివర్తించి సంతుష్టులయిరి.

ఇది వాయుప్రోక్తమహాబ్రహ్మాండపురాణము, మధ్యమభాగమున, తృతీయ ఉపోద్ఘాతపాదమున సగరచరిత్రమున యజ్ఞాశ్వమోచనమను ఏబది రెండవ అధ్యాయము.