1 - ఉపసంహార పాదః

శ్రుత్వా పాదం తృతీయంతు క్రాంతం సూతేన ధీమతా

 తతశ్చతుర్థం పప్రచ్ఛుః పాదం వై ఋషిసత్తమాః

 ఋషయ ఊచుః

పాదః క్రాంతస్తృతీయోయమనుషంగేణ నస్త్వయా

 చతుర్థం విస్తరాత్పాదం సంహారం పరికీర్తయః

 మన్వంతరాణి సర్వాణి పూర్వాణ్యేవాపరైః సహ

 సప్తర్షిణామథైతేషాం సాంప్రతస్యాంతరే మనోః

విస్తరావయవం చైవ నిసర్గస్య మహాత్మనః

 విస్తరేణానుపూర్వ్యాచ సర్వమేవ బ్రవీపి నః

 సూత ఉవాచ

భవతాం కథయిష్యామీ సర్వమేతద్యథాతథమ్

 పాదం త్విషం ససంహారం చతుర్థం మునిసత్తమాః

మనోర్వైవస్వతస్యేమం సాంప్రతస్య మహాత్మన

 విస్తరేణానుపూర్వ్యా చ నిసర్గం శృణుత ద్విజాః

 మన్వంతరాణాం సంక్షేపం భవిష్యః సహ సప్తభిః

ప్రలయం చైవ లోకానాం బ్రువతో మే నిబోధత

 ఏతాస్యుక్తిని వై సమ్య కృప్తసప్తసు పై ప్రజాః

 మన్వంతరాణి సంక్షేపాచ్ఛృణుతానాగతాని మే

 సావర్ణస్య ప్రవక్ష్యామి మనోర్వైవస్వతస్య హ

 భవిష్యస్య భవిష్యం తు సమాసాత్తన్నిబోధత

 అనాగతాశ్చ సప్తవ స్మృతాస్త్విహ మహర్షయః

కౌశికో గాలవశ్చైవ జామదగ్న్యశ్చ భార్గవః

 ద్వైపాయనో వసిష్ఠశ్చ కృపః శారద్వతస్తథా

 ఆత్రేయో దీప్తిమాంశ్చైవ ఋష్యశృంగస్తు కాశ్యపః

 భరద్వాజస్తథా ద్రౌణిరశ్వత్థామా మహాయశాః

ఏతే సప్త మహాత్మానో భవిష్యాః పరమర్షయః

 సుతపాశ్చామితాభాశ్చ సుఖాశ్చైవ గణాస్త్రయః

 తేషాం గణస్తు దేవానా మేకైకో వింశకః స్మృతః

నామతస్తు ప్రవక్ష్యామి నిబోధధ్వం సమాహితాః

 ఋతుస్తపశ్చ శుక్రశ్చ కృతిర్నేమిః ప్రభాకరః

 ప్రభాసో మాసకృద్ధర్మస్తేజోరశ్మికి క్రతుర్విరా

 అర్చిష్మాన్ ద్యోతనో భానుర్యశఃకీర్తిర్భుధో ధృతిః

 వింశతిః సుతపా హ్యేతే నామభిః పరికీర్తితాః

ప్రభుర్వీభుగ్విభాసశ్చ జేతా హంతా రీహా ఋతుః

బుద్ధిమంతుఁడైన సూతుని వలన మూఁడవ పాదము విని, ఋషి సత్తములతనీ నాలుగవ పాదమును గూర్చి అడిగిరి.

ఋషీశ్వరులిట్లడిగిరి.

 మాయందలి దయచే నీవు తృతీయ పాదమును చెప్పితిని. ఇక చతుర్ధమైన సంహార పాదమును విస్తరముగా కీర్తించుము. మాకు మన్వంతరము లన్నింటిని గూర్చి చెప్పుము. పూర్వము వచ్చినవి తరువాత వచ్చినవి యైన మన్వంతరములగూడ చెప్పుము. సప్తరుల గూర్చి, ప్రస్తుత మన్వంతరమందలి మహాత్ముని యొక్క సృష్టిని గూర్చి అన్ని భాగములను విస్తరముగా క్రమాను బద్ధముగా, మాకు చెప్పుము.

సూతుఁడిట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

            యథాతథముగా దానీనంతటిని మీకు చెప్పెదను మునీ సత్తములారా! ఉప సంహార పాదమైన ఈ చతుర్థమును చెప్పెదను, బ్రాహ్మణులారా! ఆలకింపుఁడు ప్రస్తుతమనువు వైవస్వతుఁడు ఆతఁడు మహాత్ముఁడు, సృష్టినంతటిని వివరముగా క్రమ బద్ధముగా వినుఁడు.

నేను వివరింప, భవిష్యత్ సప్తమన్వంతరముల సంగ్రహమును లోకముల పంచము యొక్క ప్రళయమును వినుఁడు ఈ మన్వంతరములు చక్కగా చెప్పబడినవి. సప్త మన్వంతరములలో పుట్టిన ప్రజల గూర్చి చెప్పితిని. భవిష్యత్మన్వంతరముల గూర్చి నా వలన వినుఁడు. వైవస్వతుని కుమారుఁడయిన సావర్ణమనువు యొక్క వివరములు చెప్పెదను, భవిష్యత్తు సంక్షేపముగా తెలిసికొనుఁడు. భవిష్యత్తునందలి ఋషులు 7. ఏడుగురుగా సంస్కృతులు వారు  అనుశికవంశుజుడుగాలవుడు,  జమదగ్ని వంశజుడు భార్గవుడు, ద్వైపాయునుడైన వసిష్టుడు శరద్వంతుని పుత్రుడు కృపుడు అత్రివంశజుడైన దీప్తిమంతుడు  కాశ్యపవంశజుడైన ఋష్యశృంగుడు,  ద్రోణపుత్రుడైన అశ్వత్థామ, వీరు ఏడుగురు భవిష్యత్కాలముల పరమర్పులు. దేవతలు మూఁడు విధములుగా నుందురు.  సుతపులు అమితాభులు సుఖులు, వీరిలో ఒక్కొక్క వర్గము 20 మంది దేవులను కలిగియుండును. వారి నామములను - ప్రత్యేకముగా చెప్పెదను. సమాహితులై వారి నేఱుంగుఁడు. సుతప వర్గపు. వారు - ఋతువు, తపుఁడు, శుక్రుఁడు, కృతి, నేమీ, ప్రభాకరుండు, ప్రభాసుఁడు, మసకృత్తు, ధర్ముడు, తేజుండు, రశి, క్రతువు, విరాట్, అర్చిష్మంతుఁడు, ద్యోతనుడు, భానుఁడు, యశస్సు, కీర్తి, బుధుఁడు, ధృతి, ఈ విధముగా ఈ ఇరువది సుతపులను నామములచే పరికీర్తితులు. అమితాభ వర్గమునకు చెందిన ఇరువది దేవతలు - ప్రభువు, విభువు, విభాసుఁడు, జేత, హంత, అరిహ, ఋతువు

సుమతిః ప్రమతిర్ధీప్తిః సమాభ్యతో మహో మహాస్

 దేహీ మునిగినః సోష్టా సమః సత్యశ్చ విశ్రుతః

 ఇత్యేతే హ్యమితాభాస్తు వింశతిః పరికీర్తితాః

దమో దానీ ఋతః సోమో విత్తం వైద్యో యమో నిధి

  హోమో హవ్యం హుతం దానం దేయం దాతా తపః శమః

ధ్రువం స్థానం విధానం చ నీయమశ్చేతి వింశతిః

 సుభా హ్యేతే సమాఖ్యాతాః సావద్దే ప్రథమంతరే

 మారీచస్యైవ తే పుత్రాః కశ్యపస్య మహాత్మనః

 సాంప్రతస్య భవిష్యంతి షష్టిర్దేవాస్తదంతరే

 సావర్ణస్య మనోః పుత్రా భవిష్యంతి నవైవ తు

 విరజాశ్చార్వరీవాంశ్చ నిర్మోకార్యాస్తథా పరే

నవ చాన్యేషు వక్ష్యామి సావర్ణేష్వంతరేషు వై

 సావర్ణమనవశ్చాన్యే భవిష్యా బ్రహ్మణః సుతాః

 మేరు సావర్ణితస్తే వై చత్వారో దివ్యదృష్టయః

 దక్షస్య తే హి దౌహిత్రా: క్రియాయాః దుహితుః సుతాః

మహతా తపసా యుక్తా మేరుపృష్ఠ మహౌజసః

 బ్రహ్మాదిభిస్తే జనతా దక్షీణేవ చ ధీమతా

 మహర్లోకం గతా వృత్తా భవిష్యా మేరుమాశ్రితాః

 మహానుభవాస్తే పూర్వం జజ్ఞిరే చాక్షుషేంతరే

 జజ్ఞిరే మనవస్తే హి భవిష్యానాగతాంతరే

ప్రాచేతసస్య దక్షస్య దౌహిత్రా మనవస్తు యే

సావర్ణ నామతః పంచ చత్వారః పరమర్షిజాః

 సంజ్ఞాపుత్రస్తు సావర్ణిరేకో వైవస్వతస్తథా

 జ్యేష్ఠః సంజ్ఞాసుతో నామ మనుర్వైవస్వతః ప్రభుః

 వైవస్వతేంతరే ప్రాప్తి సముత్పత్తిస్తయోః శుభా

 చతుర్ధ శైతే మననః కీర్తితాః కీర్తివర్ధనాః

 వేదేస్మృతా పురాణే చ సర్వే తే ప్రభవిష్ణవః

ప్రజానాం పతయః సర్వే భూతానాం పతయః స్థితాః

తైరియం పృథివీ సర్వా సప్తద్వీపా సపత్తనాః

పూర్ణం యుగ సహస్రం వై పరిపాల్యో నరేశ్వరై:

 ప్రజాభిస్తపసా చైవ విస్తరిస్తేషు వక్ష్యతే

 చతుర్దశైతే విజ్ఞేయాః సర్గాః స్వాయంభువాదయః

మన్వంతరాధికారేషు వర్తకతే త్ర సకృత్ సకృత్

 వినివృత్తాధికారాస్తే మహర్లోకం సమాశ్రితాః

సుమతీ, ప్రమతి, దీప్తి, సమాఖ్యాతుఁడు, మహస్సు, మహాత్ముడు, దేహి, ముని, ఇనుఁడు పోష్ట సముఁడు, సత్యుఁడు, విశ్రుతుం డు; వీరిరువదిమందీ అమితాభులు. వారు క్రమముగా చెప్పబడిరి. సుఖవర్గపు ఇరువది మందియు  దాముఁడు, దాని, ఋతుం డు, సోముఁడు విత్తుఁడు, వైద్యుడు, యముడు, నిధి . హోముఁడు, హవ్యుఁడు హుతుఁడు, దానుఁడు, దేయుఁడు దాత, తపుఁడు శముడు, ధ్రువుఁడు, స్థానుండు విధానుఁడు మరియు నీయముఁడు. వీరిరువది మంది, సుఖ వర్గమువారుగా సావర్ణుని ప్రథమ మన్వంతరమువారుగా చెప్పఁబడిరి. వారు మహాత్ముఁడు మారీచుఁడునయిన కశ్యపునిసుతులు. ఆ మన్వంతరమున కశ్యపునకు అరువది దేవతలు కలుగుదురు. అతఁడే ప్రస్తుత మనువు. సావర్ణి మనువునకు తొమ్మండుగురు పుత్రులుదయింతురు. వారు - విరజుఁడు, అర్వరీవంతుఁడు, నీరోకుండు మరియు ఇతరులు ఇతర సావర్ణ మన్వంతరమున ఇతర నవ సుతులను చెప్పెదను. ఇతరులయిన సావర్ణమనువులు, బ్రహ్మ యొక్క భవిష్యత్కుమారులగుదురు. వారు నలుగురు. వారికి దివ్య దృష్టి కలదు. వారు మేరు సావర్ణి మొదలగువారు. వారు దక్షుని యొక్క దౌహిత్రులు - కూతురయిన క్రియ యొక్క కుమారులు వారు మేరు పృష్టమున గొప్ప తపస్సుచే యుక్తులు. వారికి గొప్ప మహస్సు కలదు. వారు బ్రహ్మాదులచే జననమొందిరి, ధీమంతుఁడైన దక్షునిచే నుద్భవించిరి. వారు, మరణించి, మహర్లోకమునకరుగుదురు. వారు మేరువు నాశ్రయింతురు భవిష్యత్మనువులగుదురు. మహానుభావులయిన వారు చాక్షుషమన్వంతరమున - పూర్వము పుట్టిరి. వారంతట వారే భవిష్యనన్వంతరమున జన్మించెదరు . ప్రాచేతసుఁడయిన దక్షుని యొక్క దౌహిత్రులయిన, ఆమనువులలో ఐదుగురు సావర్ణులని నామకరణము చేయఁబడిరి. నలుగురు పరమ ఋషులకుఁబుట్టిరి. ఒకడయిన సావర్ణి వైవస్వతునకు పుట్టిన సావర్ణి కుమారుఁడు. సంజ్ఞ యొక్క జ్యేష్ఠ సుతుఁడు మనువు ఇతఁడు వైవస్వతుని కుమారుఁడు. వారి యొక్క శుభంకరమయిన సముత్పత్తి వైవస్వత మన్వంతరము సంప్రాప్తమయినప్పుడు కీర్తివర్ధనులగుదురు. ఈ పదునాల్గురు మనువులు వేదములందు, స్కృతులయందు, పురాణములయందు, కీర్తింపబడిరి. వారందరు శక్తిమంతులు, ప్రభవిష్ణుపులు వారందరు ప్రజలయొక్క పతులు. అంత్యకాక సర్వ భూతములకును పతులు. సప్త ద్వీపయుతము, సపట్టణము నయిన ఈ పృథివియంతయు. పూర్వము యుగ. సహస్రము ఈ నరేశ్వరులచే పాలింపఁదగినది. వారి యొక్క విస్తృత వర్ణనము, వారి ప్రజలతో తపస్సుతో గూడ చెప్పబడును. స్వాయం భువులయిన మనువులు పదునాలుగురు. వారు ఒక్కొక్కసారి మన్వంతరాధికారమును వహింతురు. వారి యధికారము విని వృత్తముకాగా .వారు మహర్లోకమునాశ్రయింతురు.

 సమతీతాస్తు యే తేషామష్టౌ షట్ చ తథా పదే

 పూర్వేషు సాంప్రతశ్చాయం శాస్త్రి వైవస్వతః ప్రభుః

యే శిష్టాస్తాన్ ప్రవక్ష్యామి సహ దేవర్షిదానవైః

 సహ ప్రజా నిసర్గేణ సర్వాం స్తే నాగతాన్ ద్విజః

 వైవస్వతనిసర్గేణ తేషాం జ్ఞేయస్తు విస్తరః

 అనూనా నా తిరిక్తాస్తే యస్మాత్సర్వే వివస్వత

పునరుక్తబహుత్వాత్తున వక్ష్యే తేషు విస్తరమ్

మన్వంతరేషు భావ్యేషు భూతేష్వపి తథైవ చ

 కులీకులే నిసర్గాస్తు తస్మాజ్జ్జీయా విభాగశః

తేషామేవహి సిద్ధ్యర్ధార్ధం విస్తరేణ క్రమేణ చ

 దక్షస్య కన్యా ధర్మిష్ణా సువ్రతా నామ విశ్రుతా

 సర్వకన్యావరిషా తు జ్యేషా యా వీరిణీ సుతా

 గృహీత్వా తాం పీతా కన్యాం జగామ బ్రహ్మణ్ఖండికే

 వైరాజస్థముపాసీనం ధర్మేణ చ భవేన చ

 భవధర్మసమీపస్థం దక్షం బ్రహ్మాభ్య భాషత

 దక్షకన్యా తవేయం వై జనయిష్యతి సువ్రతా

చతురో వై మనూన్ పుత్రాంశ్చాతుర్వర్ణ్యకరాన్ శుభాన్

 బ్రహ్మతో వచనం శ్రుత్వా దక్షో ధర్మో భవస్తదా

 తాం కన్యాం మనసా జగ్ముస్త్రయస్తే బ్రహ్మణా సహ

 సత్యాభిధ్యాయినాం తేషాం సద్యః కన్యా వ్యజాయత

 సదృశానూపత స్తే షాం చతురో వై కుమారకాన్ సంసిద్ధాః

కార్యకరణే సంభూతాస్తే శ్రీయాన్వితాః

ఉపభోగసమర్టైశ్చ సద్యోజులైః శరీరకై:

 తే  దృష్ట్వా తాన్ స్వయం భూతాన్ బ్రహ్మ వ్యాహారిణస్తదా

 సంరబద్ధా వై వ్యకర్షంత మమ పుత్రో మమేత్యుత

 అభిధ్యాయాత్మనోత్పన్నానచుర్వైతే పర్సరమ్

 యో యస్య వపుషా తుల్యో భజతాం సతతం సుతమ్

యస్య యః సదృశశ్చాపి రూపే. వీర్యే చ మానతః

 తం గృహ్లాతు స భద్రం వో వర్ణతో యస్య యః సమః

ధ్రువం రూపం పితుః పుత్రః సో నురుధ్యతి సర్వదా

 తస్మాదాత్మసమః పుత్రః పితు ర్మాతుశ్చ వీర్యతః

 ఏవం తే సమయం కృత్వా సర్వేషాం జగృహుః సుతాన్

వారియందు ఆరుగురు గతించిరి; మిగిలినహారు ఎనమండుగురు. పూర్వ మనువుల యందు, ప్రస్తుత మనువుల యందు, వైవస్వతమనువు శాసించును. దేవతలలో, ఋషులలో, దానవులలో మిగిలినవారిని గూర్చి చెప్పెను. ఓ బ్రాహ్మణులారా! మీకు భవిష్య జ్ఞానములను గూర్చి, వారి సంతానములతో సహా చెప్పెదను. వైవస్వత మనువు యొక్క విస్తర వర్ణనము దాహరణముతో వారి వివరము నెఱుంగవలయును. ఏలయన వారందరు వైవస్వతమనువు కంటే తక్కువ వారు కారు. అధికులునుకారు. పునరుక్తి బహుత్వము వలన మన్వంతరముల వివరములను భూతములయినవి కాని భావ్యములయినవి కాని వచింపను, అందుచే, కులముల యొక్క సంసృష్టి విభాగశః తెలిసి కొనవలయును. వాని యొక్క సిద్ద్యర్ధము విస్తరముగా క్రమముగా తెలిసికొనవలయును. 38. దక్షుని కన్య ధర్మిష్ణ సువ్రతా నామమున ప్రసిద్ధ. కన్యలందరియందు ఆమె వరిష్ఠ, వీరిణి యొక్క జ్యేష్ఠ సుత. తండ్రి ఆతని కన్యను తీసికొని బ్రహ్మకడకేగెను. (బ్రహ్మ వైరాజుఁడు) బ్రహ్మ ధరునితో భవునితో సేవింపబడుచు నందుండెను. ధర్మ భవుల సమీపమున కూర్చుండి యున్న దక్షునితో బ్రహ్మయిట్లనెను. 'ఈ నీ కూతురయిన సువ్రత నలుగురు కుమారులను కనును. వారు నలువురు మనువులు నాలుగు వర్ణముల శుభ ధర్మములను నిర్వహింతురు, బ్రహ్మ యొక్క పలుకులు విని దక్షుఁడు, ధర్ముడు, భవుఁడు - ఈ మువ్వురు మనసా బ్రహ్మతో సహా ఆ కన్యను చేరిరి.  కన్యను చేరిరి.

వెంటనే ఆ కన్య సదృశానురూపులయిన నలుగురు కుమారులను సత్యాభిధానులను కనెను. పుట్టిన వెంటనే ఆ కుమారులు కార్యముల నాచరించుటకు సంసిద్ధులయిరి. వారు శ్రీతో అన్వితులు, ఉప భోగ సమర్థశరీరులు; సద్యోజాతులయి వేదములుచ్చరించునట్టి వారిని చూచి, బ్రహ్మయు ఇతరులును ఆశ్చర్య చకితులైరి. 'ఇతడు నాపుత్రుఁడు, నొపుత్రుఁడు అని వారిని పోరు తమ ప్రక్కకు ఆకర్షించుకోనిరి, తమకు పోరుద్భవించినట్లుగా ఊహించి వారిట్లనిరీ' ఎవఁడు శరీర స్వభావముచే తుల్యుఁడో అతఁడు కుమారుఁడు, ఎవఁడు సదృశరూప వీర్యుఁడో అతనిని గ్రహింతుము గాక ఎవనికి ఎవఁడు సముఁడో వర్ణముచే నతఁడాతనిని గ్రహించునుగాక. మనకు భద్రమగుగాక. తండ్రి తోటి సమానమయిన రూపమునతని పుత్రుఁడనుకరించును. అందుచే ఆత్మ సముఁడు పుత్రుఁడు. వీర్యము వలన పితృమాతల సముఁడు నగును. ఈ విధముగా సమయము నేర్పరచుకొని అందరు సుతులను గ్రహించిరి. .

చాక్షుషస్యాంతరేఖ తీతే ప్రాప్తే వైవస్వతస్య హ

 రుచేః ప్రజాపతేః పుత్రో రౌచ్యో నామాభవత్సుతః

 భూత్యాముత్పాదితో యస్తు భౌత్యో నామ కవేః సుతః

 వైవస్వతే తరే జాతో ద్వౌ మనూ తు వివస్వతః

 వైవస్వతో మనుర్యశ్చ సావర్ణోయశ్చ వై శ్రుతః

జ్ఞేయః సంజ్ఞాసుతో విద్వాన్మనుర్వైవస్వతః ప్రభుః

సువర్ణాయాః సుతశ్చాత్యః స్మతో వైవస్వతో మనుః

సావర్ణమనవో యే చ చత్వారస్తు మహర్షిజాః

 తపసా సంభృతాత్మానః స్వేషు మన్వంతరేషు వై

 భవిష్యేషు భవిష్యంతి సర్వకార్యార్థసాధకాః

ప్రథమే మేరు సావర్ణోర్దక్షపుత్రస్య వై మనోః పరా మరీచిగర్భాశ్చ సుధర్మాణశ్చ తే త్రయః

 సంభూతాశ్చ మహాత్మానః సర్వే వైవస్వతేంత

 దక్షపుత్రస్య పుత్రాస్తే రోహితస్య ప్రజాపతే

 భవిష్యంతి భవిష్యాస్తు ఏకైకో ద్వాదశో గణ

 ఐశ్వరశ్చ గ్రహో రాహుః వాకుర్వంశస్తథైవ చ

 పారా ద్వాదశ విజేయా ఉత్తరాంసు నిబోధత

 వాజిపో వాణిజిచ్చేవ ప్రభూతిశ్చ కకుద్యథ

దధిక్రావా విపక్వశ్చ ప్రజీతో విజయో మధుః

 ఉతథ్యోత్తమకా ద్వౌ తు ద్వాదశైతే మరీచయః

సుధర్మాణస్తు వక్ష్యామి నామతస్తాన్ నిబోధత

 వర్ణస్తథాథగర్విశ్చ భురణ్యే ప్రజనో మీత:

 అమితో ద్రవకేతుశ్చ జంభో థాజస్తు శక్రకవి

 సునేమిద్ద్యుతయశ్చైవ సుధర్మాణః ప్రకీర్తితాః

తేషామింద్రస్తదా భావ్యో హ్యద్బుతో నామ నామతః

స్కందో సౌ పార్వతీయో వై కార్తికేయస్తు పావకిః

 మేధాతిథిశ్చ పౌలస్త్యో వసుః కశ్యప ఏవ చ

 జ్యోతిష్మాన్భాగ్యవాంశ్చైవ ద్యుతిమానంగీరాస్తథా

 వసినశ్చైవ వాసిష్ఠ ఆత్రేయో హవ్యవాహనః

సుతపాః పౌలహశ్చైవ సప్తతే రోహితే తరే

 ధృతికేతుర్దీప్తికేతుః శాపహస్తనిరామయా

పృథుశ్రవాస్తథా నీకో భూరిద్యుమ్నో బృహద్యశః

 ప్రథమస్య తు సావర్జర్నవ పుత్రాః ప్రకీర్తితాః

 దశమేశ్వథ పర్యాయే ధర్మపుత్త్రస్య వై మనోః 

ద్వితీయస్య తు సావర్ణేర్భావ్యస్యైహాంతరే మనోః

చాక్షుషమన్వంతరమతీతమయి వైవస్వత మన్వంతరము ఆరంభముకాగా రేచ్యుఁడను కుమారుఁడు, ప్రజాపతియైన రుచికి పుట్టెను. భూతీవలన, కవికి పుత్రుఁడుగా పుట్టినయతఁడు భౌత్యుఁడు. వైవస్వతమన్వంతరమున వివస్వంతునకిరువురు మనువులు పుట్టిరి. ఒకఁడు వైవస్వతమనువుగా ప్రసిద్ధుఁడు; రెండవవాఁడు సావర్ణునిగా ప్రసిద్ధుఁడు. విద్వాంసుఁడయిన వైవస్వత మనువును సంజ్ఞా కుమారునిగా జ్ఞాపకముంచుకొనవలెను. మిగిలిన రెండవ వైవస్వతమనువు సువర్ణకుమారుఁడుగా నేఱుంగవలెను. సావర్ణి మనువులు నలుగురు, వారు మహర్షి జాతులు తపస్సుచే సంభృతాత్ములు వారు వారిమన్వంతరములందు స్వ కార్యార్థ సాధకులగుదురు. ప్రథమ మన్వంతరమున మూఁడు వర్ణములుగా దేవతలు పుట్టెదరు. అప్పుడు దక్షుని యొక్క కుమారుఁడయిన మేరుసావర్ణి మనువగును. ఆ త్రివర్గము-పరులు, మరీచిగర్భులు, మరియు సుధర్మోణులు, వైవస్వతాంతరమున మహాత్ములందరు దయింతురు. వారందరు దక్ష పుత్రుని పుత్రులు, ప్రజాపతియైన రోహితుని పుత్రులు. ఒక్కొక్క వర్గము నందు పండ్రెండుగురుందురు. వారు భవిషత్కాల దేవతా గణములు. ఐశ్వరుడు, గ్రహమైనరాహువు వంశుఁడు మరియు పారులయిన ఎనిమిది గ్రహములు  'పారులు' ద్వాదశులుగా తెలియవలెను. మిగిలిన వారి నేరంగుఁడు. పండ్రెండుగురు మారీచులు  క్రమముగా వాజీపుఁడు, వాజిజిత్తు, ప్రభూతి, కకుద్మి, దధిక్రావంతుఁడు, విపక్వుఁడు, ప్రణీతుఁడు, విజయుడు మధువు, ఉతథ్యుఁడు, ఉత్తమకుఁడును. సుధర్మాణులను చెప్పెదను సొమముల బట్టి వారినెలుంగుఁడు. వర్ణుడు అథగర్వి, భురణ్యుఁడు, ప్రజనుఁడు, అమితుఁడు, అశితుఁడు, ద్రవకేతువు,జంభుఁడు, అజుండు, శక్రకుఁడు, సునేమీ, మరియు ద్యుతయుఁడు సుధర్మాణులుగా ప్రకీర్తితులు, వారిలో ఇంద్రుఁడు భవిష్యత్తులో 'అద్భుత' నామకుం డగును. ఈ అద్బుతుఁడే స్కంధుడు, పార్వతీ సుతుఁడు, కార్తికేయ నామాంతరుఁడు. వేరొక నామము.పావకీ. రోహిత మన్వంతరమునందలి ఏడుగురు ఋషులు- పులస్య వంశీయుఁడయిన మేధాతిథి, కాశ్యప వంశీయుఁడయిన. వసువు, భృగువంశ్యుఁడయిన జ్యోతిష్మంతుఁడు, అంగీరస వంశ్యుడయిన ద్యుతిమంతుఁడు, వసిష్ఠ సంతతివాఁడయిన వసినుఁడు, అత్రి వంశీయుఁడయిన హవ్య వాహనుఁడు, పులహ వంశీయుండైన సుతపుఁడు ఈ క్రింద చెప్పఁబడిన వారు ప్రథమ సావర్ణి యొక్క తొమ్మండుగురు కుమారులుగా ప్రకీర్తితులు: ధృతి కేతువు, దీప్తి కేతువు, శాపుఁడు, హస్తుఁడు, నిరామయుఁడు, పృథుశ్రవసుఁడు, అనీకుఁడు, భూరిద్యుమ్నుడు, మరియు బృహద్యశుం డు. మన్వంతరము యొక్క పదియవ పర్యాయమున మనువు రెండవసావర్ణి. ఇతఁడు భవిష్యత్మన్వంతరమున ధర్మునీ పుత్రుడు.

సుధామనో విరుద్ధాశ్చ ద్వాదేవ తు గణౌ స్మృతౌ

దీప్తిమంతశ్చ తే సర్వే శతసంఖ్యాశ్చ తే సమాః

 ప్రాణానాం యచ్ఛతం ప్రోక్తం ఋషిభిః పురుషేతి వై

 దే వాస్తే వై భవిష్యంతి ధర్మపుత్రస్య వై మనో

 తేషా మింద్రస్తథా విద్వాన్ భవిష్యః శాంతిరుచ్యతే

 హవిష్మాన్ పౌలహః శ్రీమాన్ సుకీర్తిశ్చాథ భార్గవః

 ఆపోమూర్తిస్థధాత్రేయో వసిష్ఠశ్చాపవః స్మృతః

పౌలస్త్యో ప్రతిమశ్చాపి నాభాగశ్చైవ కాశ్యపః

అభిమన్యుశ్చాంగీరసః సప్తతే పరమర్షయః

సుక్షేత్రశ్చోత్త మౌజాశ్చ భూరిసేనశ్చ వీర్యవాన్

 శతానీకో నిరామిత్రో వృషసేనో జయద్రథ:

 భూరిద్యుమ్నః సువర్చాశ్చదశైతే మానవాః స్మృతాః

ఏకాదశే తు పర్యాయే సావర్ణే వై తృతీయకే

నిర్వాణరతయో దేవాః కామగా పై మనోజవా

 గణాస్త్వేతే త్రయః ఖ్యాతా దేవతానాం మహాత్మనామ్

ఏకైకస్త్రింశతస్తేషాం గణస్తు త్రిదివొకసామ్

 మాసస్యాహాని త్రింశత్తు యాని పై కవయో విదు:

 నిర్వాణరతయో దేవా రాత్రయస్తు విహంగమాః

గణస్తృతీయా యః ప్రోకే దేవతానాం భవిష్యతి

 మనోజవా ముహూర్తాస్తు ఇతి దేవాః ప్రకీర్తితాః

ఏతే పో బ్రహ్మణః పుత్రాః భవిష్యా మానవాః స్మృతాః

 తేషామింద్రో వృషా నామ భవిష్యః సురరాట్ తతః

 తేషాం సప్త ఋషీంశ్చాపి కీర్యమానాన్నిబోధతు

హవిష్మాన్ కాశ్యపశ్చాపీ వపుష్మాంశ్చవ భార్గవః

 ఆరుణీశ్చ తథాశ్రేయో వసిష్ణో నగ ఏవ చ

 పుష్టిరాంగీరసో ప్లేయః పౌలస్యో నిశ్చరస్తథా

పౌలహో హ్యతి తేజాశ్చ దేవా హ్యేకాదశేంతదేశ

సర్వవేగః సుధర్మా చ దేవానీకః పురోవహః

 క్షేమధర్మా గ్రహేషశ్చ ఆదర్శః పౌండ్రకో మరుః

సావర్ణస్య తు తే పుత్రాః ప్రాజాపత్యస్య వై నవు

 ద్వాదశే త్వథ పర్యాయే రుద్రపుత్త్రస్య పై మనోః

 చతుర్థో రుద్రసావర్ణో దేవాంస్తస్యాంతరే శ్రుణుః

 సుధామానులు, విరుద్ధులు అను రెండు గణములు గలవు. వారందరు దీప్తి మంతులు, వారు ఒక వంద మంది. ఋషులు చెప్పిన 100 (నూరు) ప్రాణములు (పురుషులుగా) వారు మనుదేవులు,ధర్మ పుత్రులు. వారికి భవిష్యదింద్రుఁడు విద్వాంసుఁడు ‘శాంతి నాయకు’డు. సప్త మహరులు - పౌలహ వంశీయుడు హవిష్మంతుఁడు, భృగు వంశీయుఁడయిన సుకీర్తి, ఆత్రి వంశీయుఁడయిన ఆపోమూర్తి, వసిష్ఠ వంశీయుఁడు ఆపవుఁడు, పౌలస్త్య వంశజుఁడు అప్రతీముఁడు, కాశ్యప వంశీయుఁడైన నా భాగుఁడు, ఆంగీరసుఁడయిన అభిమన్యుడును. చెప్పఁబోవునట్టి పదిమందియు మనుపుత్రులు - సుక్షేత్రుఁడు, ఉత్తమౌజుడు, భూరిసేనుఁడు ,వీర్యవంతుఁడు ,శతానీకుఁడు, సువర్చసుఁడును. మూఁడవ సావర్ణి యొక్క పదునొకండవ మన్వంతరమును మహాత్ములయిన దేవతల యొక్క గణములు మూలం డుగా ప్రఖ్యాతములు నీర్వాణరతులు, కామగులు, మరియు మనోజవులు. దేవతల యొక్కయీ మూడు గుణములు ప్రఖ్యాతము త్రి దివొకసులయిన యీ యొక్కొక్క దేవతా గణములలో ముప్పది దేవతలుందురు. నెలకగు ముప్పది పగటి ప్రొద్దులు దేవతా గణమును - 'నిర్వాణరతులు'. రాత్రిముప్పది ప్రొద్దులు విహంగములనీయు కవు లందరు. మనోజవులని మూఁడవ గణముగా చెప్పుఁబడినవారు,ముహూర్తుములు. ఈ విధముగా దేవతలు ప్రకీర్తింపబడిరి.

వీరందరిని బ్రహ్మ యొక్క భవిష్యన్మానస కుమారులుగా నెంతురు. వీరికి ఇంద్రుఁడు సురరాట్ వృష నాముఁడుగా కీర్తింపఁ ".బడును. వారి సప్తర్సులను చెప్పద నెలలుంగుఁడు వారు - కాశ్యపుడయిన హవిష్మంతుఁడు, భృగువంశీయుడయిన వపు షంతుఁడు, అత్రివంశజుఁడు ఆరుణి, వషిష్ణవంశీయుఁడయిన నాగుఁడు, అంగీరసవంశయుఁడుగా తెలిసికొనవలసిన పుష్టి, పౌలస్త్యుని వంశీయుఁ డు నిశ్చకుఁడు మరియు పౌలహుఁడయిన అతితేజుడును. పండ్రెండవ మన్వంతరమున మనువు రుద్రుని యొక్క కుమారుఁడగును. చతుర్ధ సావర్ణుఁడు రుద్ర సావర్ణఁడగును. మన్వంతరమునందలి దేవతల గూర్చి వినుఁడు.

ఈ మన్వంతరమున భవిష్య ద్దేవతలు, పంచగణములుగా చెప్పఁబడిరి.-83. వారు, హరితులు, రోహితులు, సుమనులు, సుకర్మాణులు, మరియు సుతారులు

పంచైవ తు గజాః ప్రోక్తా దేవతానామనోగతాః

 హరీతా రోహితాశ్చైవ దేవాః సుమనసస్తథా

 సుకర్మాణః సుతారశ్చ విద్వాంశ్చవ సహస్రదః

 పర్వతోనుచరశ్చైవ అపాశుశ్చ మనోజవః

 ఊర్జా స్వాహా స్వధా తారా దశైతే హరితాః స్మృతాః

 తపో జ్ఞానీ మృతిచ్చెవ వర్చా బంధుశ్చ యః స్మృతః

 రజశ్చైవ తు రాజశ్చ స్వర్ణపాదస్తథైవ చ

పుష్టిర్విధిశ్చ వై దేవా దశైతే రోహితాః స్మృతాః

 తుషితాధ్యాస్తు యే దేవాస్త్రయస్త్రింశతకీర్తితాః

 తే వై సుమనసో వేద్యాన్నిబోధత సుకర్మణః

 సుపర్వా వృషభః పృష్టా కపిద్యుమ్నవిపశ్చత:

విక్రమశ్చ క్రమశ్చైవ విభృతః కాంత ఏవ చ

 ఏతే దేవాః సుకర్మాణః సుతరాంశ్చ నిబోధత

 వర్షీ దీవ్యస్తథాంజిష్ణో వర్చస్వీ ద్యుతిమాన్ కవిః

 శుభో హవిః కృతప్రాప్తి ర్వ్యాపృతో దశమస్తథా

 సుతారా నామతస్వేతే దేవా వై సంప్రకీర్తితాః

 తేషా మింద్రస్తు విషైయో ఋతధామా మహాయశాః

ద్యుతీర్వసిష్ఠపుత్రస్తు ఆత్రేయః సుతపాస్తథా

 తపోమూర్తస్త్వాంగిరసస్తపస్వీ కాశ్యపస్తథా

 తపోధనశ్చ పౌలస్త్యః పౌలహశ్చ తపోరతిః

 భార్గవః సప్తమస్తేషాం విజ్ఞేయస్తు తపోధృతిః

 ఏతే సప్తర్షయః సిద్దా అంత్యే సావర్ణికేంతయే

దేవవానుపదేవశ్చ దేవశ్రేషో విదూరథః

 మిత్రవాన్ మిత్రసేనోథ చిత్రసేనో హ్యమిత్రహా

 మిత్రబాహుః సువర్చాశ్చ ద్వాదశస్య మనోః సుతా

 త్రయోదశే తు పర్యాయే భావ్యే రౌత్యేంతరే పునః

 త్రయ ఏవ గణాః ప్రోక్తా దేవానాం తు స్వయంభువా

బ్రాహ్మణో మానసాః పుత్రాస్తే పా సర్వే మహాత్మనః

 సుత్రామాణః సుధర్మాణః సుకర్మాణశ్చ తే త్రయః

 త్రిదశానాం గణాః ప్రోక్తా భవిష్యాః సోమపానామ్

త్రయస్త్రింశద్దేవతా యాః పృథగిజ్యాస్తు యాజ్ఞికైః

 అజ్యేన పృషదాజ్యేన గ్రహశ్రేష్ఠేన చైవ హ

ఈ క్రింద పేర్కొనబడిన 10 మందియు హరితులుగా స్మరింపఁబడుదురు. వారు - విద్వాంసుడు, సహస్రదుఁడు, పర్వతుఁడు, అనుచరుఁడు, అపాశువు, మనోజవుఁడు, ఊర్జుఁడు, స్వాహుఁడు, స్వథ, తారుఁడు.

తపుఁడు, జ్ఞాని, మృతి, వర్చసుడు, బంధుఁడు, రసుఁడు, రాజు స్వర్గపాదుఁడు, పుష్టి, వీధి, ఈ పదిమంది రోహితులుగా స్మృతులు. తుషితునితో ఆరంభించి చెప్పబడిన 33 (ముప్పది ముగ్గురు) సుమనసులుగా తెలిసికోనవలెను, ఇక సుకర్మాణులను తెలిసికొనుడు. వారు సుపర్వుఁడు, వృషభుఁడు, పృష్ఠుఁడు, కపి, ద్యుమ్నుఁడు, విపశ్చితుఁడు, విక్రముఁడు, ప్రముఁడు, విభృతుఁడు, కాంతుం డు, ఈ దేవతలు సుతారులు పూర్తిగా నెఱుంగుడు. వరుఁడు, దివ్యుఁడు, అంజిష్ణుండు,, వర్చస్వి ద్యుతీమంతుఁడు, కవి, శుభుఁడు, హవీ, కృతప్రాప్తి, వ్యాపృతుఁడు, వీరు సుతారులుగా నామతః ప్రకీర్తితులు.. వారిలో అధికముగా మహాయశుఁడు, ఋతధాముఁడు, ఇతఁడు వారలకు ఇంద్రుఁడు. సావర్ణులలో తుది ఏడుగురు, మన్వంతరములందు ఈ దిగువ పేర్కొనిన ఏడుగురు ఋషులు గొప్ప కార్యముల సాధించినవారు. - వసిష్టుని కొడుకయిన దృతి అత్రీవంశమునకు చెందిన సుతపుడు, ఆంగీరుని వంశమునకు చెందిన తపోమూర్తీ కాశ్యపుఁడయిన తహారతి ఏడవవాఁడు, తపోధృతి, ఇతఁడు భృగువంశమునకు చెందినవాఁడు, సావర్ణమనువు యొక్క యంతరమున వీరు సప్తర్షులే.

దేవవానుఁడు, ఉపదేవుఁడు, దేవశ్రేషుఁడు, విదూరథుఁడు, మిత్రవంతుఁడు, మిత్ర సేనుఁడు, చిత్రసేనుఁడు, అమిత్రపుఁడు, మిత్రబాహువు, సువర్చసుఁడు - పండ్రెండుగురు మనువుయొక్క సుతులు. భవిష్యత్ త్రయోదశ రౌచ్యమన్వంతరమున స్వయంభువు మూడే దేవత గణములను పేర్కొనెను. వారందరు బ్రహ్మగారి మానస పుత్రులు. వారందరు మహాత్ములు సుత్రామాణులు, సుధర్మాజులు సుకర్మాణులు. ఈ మూఁడు దేవతా గణములు చెప్పఁబడినవి వారందరు సోమపాయులు. వారిలో సుత్రామణులు మువ్వురు వారే ముప్పది మూఁడు దేవతలు, వారందరు యాజ్ఞికులచే పూజింపఁబడుదురు.

యే వై దేవాస్త్రయస్త్రింశతృథక్త్వేన నిబోధత

 సుత్రామాణః ప్రయాజ్యాస్తు ఆజ్యశా యే తు సాంప్రతమ్

 సుకర్మాణే నుయాజ్యాఖ్యాః పృషదాజ్యానస్తు యే

 ఉపయ్యా క సుధర్మాణః ఇతి దేవాః ప్రకీర్తితాః

 దివస్పతిర్మహాసత్వస్తేషామిర్రదో భవిష్యతిః

 పులహాత్మజపుత్రాస్తే విజేయాస్తు రుచేః సుతాః

అంగిరాశ్చైవ ధృతిమాన్ పౌలస్త్యోష్యవ్యయస్తు సః

 పౌలహస్తత్త్వదర్శీ చ భార్గవశ్చ నిరుత్సుకః

 నిప్రకంప్యస్తథా శ్రేయో నిర్మోహః కాశ్యపస్తథా

 సుతపాశ్చవ వాసిష్ఠః సప్తతే తు త్రయోదశ

 చిత్రసేనో విచిత్రశ్చ నయో ధర్మో ధృతో భవః

 అనేకః క్షత్రవిద్ధశ్చ సురసో నిర్భయో దశ

రౌచ్య స్యేతే మనోఃపుత్రాః హ్యంతరే తు త్రయోదశ

 చతుర్దశే తు పర్యాయే భౌత్యస్యాష్యంతరే మనోవి

 దేవతానాం గణాః పంచ ప్రోక్తా యేషు భవిష్యతి

చాక్షుషాశ్చ పవిత్రోత్స కనిషా ఖాజితాస్తథా

 వాచా వృద్ధాశ్చ ఇత్యేతే పంచ దేవగణాః స్మృతి:

 నిషాద్యాః స్వరాః సప్త సప్త తొన్విద్ధి చాక్షుషాన్

 బృహదాద్యాని సామాని కనిషాన్సప్త శాన్విదుః

సప్తలోకాః పవిత్రాస్తే భాజితాః సప్తసింధవః

 వాచో వృద్దానృషిన్పిద్దీ మనోః స్వాయంభువస్య యే

 సర్వే మన్వంతరేంద్రాశ్చ విజేయాః తుల్యలక్షణాః

 తేజసా తపసా బుద్ద్యా ఇలశ్రుతపరాక్రమై:

త్రైలోకేశ్ యాని సత్త్వాని గతిమంతి ధ్రువాణీ చ

 సర్వశః స్వైర్గుణైస్తాని ఇంద్రాస్తేభిభవంతి వై

 భూతాపవాదినో హృష్టా మధ్యస్థా భూతవాదినః

వారు ప్రత్యేకముగా నేతితో పృషదాజ్యముతో (పేరుకొన్న నేయి పాలతో కలిసిన) గ్రహశ్రేషునితో (సూర్యునితో) పూజింపఁ బడవలయును. సుత్రామాణులు ప్రయాజ్యులని. కూడ చెప్పబడుదురు. వారే ఇప్పుడు ఆజ్యమును గ్రహింతురు, సుత్రామాణులు అనుయాజ్యులనీ కూడ పిలువబడుదురు. ఏలయన వారు పృషదాజ్యమును గ్రహింతురు కనుక. ఆ సుధర్మాణులు. ఉపయాజ్యులుగా ప్రకీర్తితులు. ఈ విధముగా దేవతలు ప్రకీర్తితులు.

 మహాసత్తుఁడయిన దివస్పతి వారికీ ఇంద్రుఁడగును. పులహాత్మజుని యొక్క పుత్రులు రుచి కుమారులుగా తెలియవలెను. త్రయోదశ. మమన్వంతరమునందు ఏడుగురు ఋషులు - అంగిరస వంశ్యుండైన ధృతిమంతుఁడు, పులస్త్యవంశమునకు చెందిన అవ్యయుఁడు, పౌలహవంశీయుఁడయిన తత్వదర్శి, భార్గవవంశ్యుఁడయిన నీరుత్సుకుఁడు, అత్రీవంశీయుఁడయిన నిష్ణుకంపుఁడు, కాశ్యప వంశీయుడయిన నిర్మోహుఁడు వసిష్ణవంశ్యుఁడయినసుతపుడు.వీరు పదమూడవ మన్వంతరమున ఋషులు, పదమూడవ మన్వంతరమున ఈ క్రింది వారు రౌచ్యమనువు కుమారులు. వారు పది మందీ, వారు -చిత్రసేనుఁడు, విచిత్రుఁడు, నయుఁడు, ధర్ముఁడు, ధ్రుతుఁడు, భవుఁడు, అనేకుఁడు, క్షతవీదుఁడు, సురసుఁడు, నిర్భయుండును. వీరు రౌచ్యుని మహాపుత్రులు. భౌత్యుని యొక్క పదు నాల్గవ మన్వంతరమున, దేవతలలో ఐదు గణములుండునని చెప్పఁబడినది. చాక్షుషులు, పవిత్రులు, కనిష్టులు, భాజతులు వాచి వృద్ధులును - స్వరములు ఏడు. అవి నిషాదముతో ప్రారంభీంచును. వానీని సప్త చాక్షుషములని యెఱుంగుఁడు. బృహదాద్యములయిన సప్త సామములను, ఏడు కనిష్టములుగా వెలుంగుఁడు, ఏడు లోకములు పవిత్రములు. మీ. ఆ ఏడు సముద్రములు భ్రాజితములు-108 వాచావృద్దులయిన ఋషులను, స్వాయంభవమనువు యొక్క మన్వంతరములు గనెఱుంగుఁడు, మన్వంతరమందలి సర్ప ఇంద్రులును తుల్య లక్షణులని యెఱుంగవలెను. తేజస్సుచే, తపస్సుచే, బుద్దిచే-బల-శ్రుతి, పరాక్రమములచే సమాన లక్షణులు. మూడు లోకములయందు చరాచరములు స్థిరా స్థిరములునయిన సత్యములను ఇంద్రులు జయింతురు. అందరికంటే ఘనులు ఇంద్రులు భూతాపవాదీనులు, భూతవాదీనులు, హృష్టులు, మధ్యస్థులు.

భూతాపవాదీనః శక్తాస్త్రయో వేదాః ప్రవాదినాం

 అగ్నీధ్రః కాశ్యపశ్చైవ పౌలస్త్యో మగధశ్చ యః

 భార్గవో హ్యగ్ని బాహుశ్చ శుచిరాంగిరసస్తథా

 శుక్రశ్చివ తు వాసిష్ఠః పౌలహో ముక్త ఏవ చ

ఆత్రేయః శ్వాజితః ప్రోక్తో మనుపుత్రానతః శ్రుణు

 ఉదుర్గురుశ్చ గంభీరో బుద్ధః శుద్ధః శుచిః కృతీ

ఊర్జస్వీ సుబలశైవ భౌత్యస్యేతే మనోః సుతా:

 సావర్ణి మనవో హ్యేతే చత్వారో బ్రహ్మణః సుతాః

 ఏకో వైవస్వతశ్చైవ సావర్లో మనురుచ్యతే

 రౌద్యో భౌత్యశ్చ యౌ తాతౌ మతౌ పౌలహభార్గవౌ

భౌత్యస్యైవాధిపత్యే తు తూర్ణం కల్పస్తు పూర్యతే

సూత ఉవాచ

నిఃశేషేషు తు సర్వేషు తదా మన్వంతరేష్వీహ

 అంతేనేక యుగే తస్మిన్ క్షీణే సంహార ఉచ్యతే

 సప్తతే భార్గవా దేవా అంతే మన్వంతరే తదా

"భుక్త్వా త్రైలోక్యమధ్యస్థా యుగాఖ్యా హ్యేకసప్తతీః

పితృభిర్మనుభిః సార్ధం క్షీణే మన్వంతరే తదా

 అనాధారమిదం సర్వం త్రైలోక్యం వై భవిష్యతి

 తతః స్థానాని శుభ్రాణి స్థానీనాం తానీ వై తదా

 ప్రభ్రశ్యంతే విముక్తిని తారా ఋక్ష గ్రహైస్తథా

 తతస్తేషు వ్యతీతేషు త్రైలోక్య స్యేశ్వరేష్విహ

 సంప్రాప్తేషు మహర్లోకం యస్మిస్తే కల్పవాసినః

 అజీతాద్యా గణా యత్ర ఆయుష్మంతశ్చతుర్దశ

 మన్వంతరేషు సర్వేషు దేవాస్తే వై చతుర్దశః

సశరీరాశ్చ శ్రూయంతే జనలోకే సహాయగాః

 ఏవం దేవేష్వతీతేషు మహర్లోకాజ్ఞనం ప్రతి

  భూతాదిష్వవశిషేషు స్థావరాంతేషు తేషు వై

 శూన్యేషు లోకస్థానేషు మహాంతేషు భవాదిషు

 దేవేషు చ గతేషూర్ధ్వం సాయుజ్యం కలవాసినమ్

 సంహృత్య శాస్త్రతో బ్రహ్మా దేవర్షపితృ దానవాన్

 సంస్థాపయతి వై సర్గమహర్దృష్ట్వా యుగక్షయే

 చతుర్యుగసహస్రాంతమహర్యద్ బ్రహ్మణో విదుః

 రాత్రిం యుగ సహస్రాంతాం తే హోరాత్రవిదో జనాః

  నైమిత్తికః ప్రాకృతికో యశ్చైచవాత్యంతికోర్ధతః

భూతాపవాదీనులు శక్తులు ప్రవాదులకు మూడు వేదములు, భౌత్యమన్వంతరమున ఏడుగురు ఋషులు-అగ్నీధ్రుఁడు, ఇతఁడు కాశ్యప వంశీయుఁడు, పులస్త్య వంశీయుడయిన మాగధుఁడు, భృగు వంశీయుఁడయిన అగ్ని బాహువు, ఆంగీరసవంశీయుఁడు శుచి, వసిష్ఠ వంశీయుడయిన శుక్రుఁడు. పులహ వంశీయుఁడయిన యుక్తుఁడు, అత్రి వంశీయుఁడని చెప్పబడిన స్వజితుఁడును.

ఇక మనుని పుత్రులను వినుము, వారు ఉరుఁడు, గురుఁడు, గంభీరుఁడు, బుద్ధుడు, శుద్ధుఁడు, శుచి, కృతి, ఊర్జస్వి, మరియు సుబలుఁడు. ఈ నలుగురు సావర్ణి మనువులు బ్రహ్మ కుమారులు వివస్వంతుని కుమారుఁడు సావర్ణి మనువుగా చెప్పబడును. మనువులైన రౌచ్యుఁడు, భౌత్యుండు, పులహుని భార్గవుని కొమరులుగా క్రమముగా భావింపఁబడుదురు.

 భౌత్యుని కాలమున కల్పము వెంటనే పూర్ణమగును

 సూతుఁడిట్లు చెప్పెను.

బహుచతుర్యుగముల తుదను, మన్వంతరములు గడచి పోయిన వెనుక, సర్వము నిశ్శేషముకాగా దానిని సంహారమందురు. మన్వంతరమున భార్గవ వంశజులయిన ఏడుగురు, దేవతలు, మూడు లోకములందు, చతుర్యుగ కాలములనుభవించి గతించెదరు. పితరులతో మనువులతో సహా మన్వంతరము క్షీణింప, త్రైలోక్యము సర్వము అనాధార మగును. అంత స్థానికుల (మూఁడు లోకములనధివసించు మహావ్యక్తులు) శుభ్రములైన స్థానములు నక్షత్రముల నుండి, ఋక్షముల నుండి, గ్రహముల నుండి విడివడి ప్రభ్యశ్యములగును. త్రిలోక్యేశ్వరులు గతింప, త్రైలోక్యంపుటధిపతులు, అజితులు, మరియు ఇతరులైన పదునాలుగు గణముల దేవతలు నివసించ మహర్లోకమున కరుగుదురు. (వారా కల్పవాసులు) అనగా అజితారులు చిరకాల వాసులు. (కల్పములో నుండి యుండువారు) వారే, నిజమయిన సర్వ మన్వంతరములందుండు చతుర్ధశ దేవ తాగణములు. వారు వారి అనుచరులతో సహా, జనలోకమున సశరీరులని చెప్పబడుదురు. ఈ విధముగా జనలోకమునకు మహర్లోకము నుండి దేవతలకు, అహంకారము ఇతరములయిన ప్రధాన హేతువులు మిగిలియుండును. స్థావర వస్తువులు అంతమునొంద, భూలోకము మొదలు మహర్ లోకము వరకు గల లోక స్థానములు శూన్యము కాగా, దేవతలు పైకి (ఉరద్ధ లోకములకు) చన, అది కల్పవాసినులు సాయుజ్యము చెందుకాలము. దేవతలను, ఋషులను, పితరులను దానవులను బ్రహ్మ (సంహృత్య) ఉపసంహరించి (సృష్టిని) యుగాంతమున తన కాలపరిణామమును గ్రహించి, తన సృష్టికి సమాప్తము చేయును. అది ఒక్క రోజు బ్రహ్మకగును బ్రహ్మ దీవా రాత్రులదెలిపినవారు. బ్రహ్మకు చతుర్యుగ సహస్రాంతము ఒక పగలు, రాత్రి 4 చతుర్యుగ సహస్రాంతము అగునని చెప్పుదురు.

త్రివిధః సర్వభూతానామిత్యేష ప్రతిసంచరః

బ్రాహ్మో నైమిత్తికస్తస్య కల్పదాహః ప్రసంయమః

ప్రతిసర్గే తు భూతానాం ప్రాకృతః కరణక్షయః

 జ్ఞానాచ్చాత్యంతికః ప్రోక్తః కారణానామసంభవః

తతః సంహృత్య తాన్ బ్రహ్మా దేవాంగ్రైలోక్యవాసినః

 ప్రహరాంతే ప్రకురుతే సర్గస్య ప్రలయం పునః

 సుషుపుర్భగవాన్ బ్రహ్మా ప్రజాః పంహరతే తదా

 తతో యుగసహస్రాంతే సంప్రాప్తి చ యుగక్షయే

తత్రోన్మస్థాః ప్రజాః కర్తుం ప్రపేదే స ప్రజాపతిః

 తదా భవత్యనావృష్టి సంతడా శతవార్షికీ

 తయా యాన్యప్పసారాణి సత్తాని పృథివీతలే

 తాన్యేవాత ప్రలీయంతే భూమిత్వముపయాంతి చ

 సప్తరశ్మీరథో భూత్వా ఉదతిష్ఠద్విభావసుః

 అసహ్య రశ్మిర్భగవాన్ పిబత్యంభోగభస్తిభిః

హరితా రశ్మయస్తస్య దీప్యమానాస్తు సప్తతిః

 భూయ ఏవ వివర్తంతే వ్యాప్నువంతోంఐరం శనైః

 భౌమం కాష్ఠంధనం తేజో భృశమద్భిస్తు దీప్యతే

 తస్మాదుదకళ్ళత్సూర్యస్తపతీతి హి కథ్యతే

 నావృష్ట్యా తపతే సూర్యో నావృష్ట్యా పరిషీచ్యతే

  నావృష్ట్యా పరివిశ్యత వారిణి దీప్యతే రవిః

తస్మాదపః పిబన్యో వై దీష్యతే రవిగంబరే

 తస్య తే రశ్మయః సప్త పిబంత్యంభో మహార్ణవాః

తేనాహారేణ సందీప్తాః సూర్యాః సప్త భవంత్యుత

తతస్తే రశ్మయః సప్తసూర్యభూతాశ్చతుర్దశమ్

 చతుర్లోకమిమం సర్వం దహంతి శిఖినస్తదా

 ప్రాప్నువంతి చ తాభిస్తు హ్యూర్ధ్వం చాధశ్చ రశ్మిభిః

 దీప్యం భాస్కరాః సప్త యుగాంతాగ్నిప్రతాపినః

తే వారిణి ప్రదీప్తాశ్చ బహుసాహస్రరశ్మయః

 స్వం సమావృత్య తిష్ఠంతి నిర్దహంతో వసుంధరామ్

 తతస్తేషాం ప్రతాపేన దహ్యమానా వసుంధరా

 సాదీనద్యర్ణవా పృథ్వీ నిస్నేహా సమపద్యత

 దీప్తాభిః సంతతాభిశ్చ చిత్రాభిశ్చ సమంతతః

 అధశ్బోర్ద్యం చ తిర్యక్ చ సంరుద్దా సూర్యరశ్మిభిః

 సర్వ భూతముల ప్రతిసంచరము మూఁడు విధములు - ప్రతి సంచరమనఁగా విలయనము (వీలయము, నాశము) నిర్వాణములు. మువ్విధములు. నైమిత్తికము (కొన్ని సంవత్సరముల కొక్కక్కసారి వచ్చునది). ప్రాకృతికము ప్రకృతికి సంబంధించినది. 3వది - ఆత్యంతీకము (తుదిని కలునది) సర్వ భూతమల నైమిత్తిక ప్రళయము, బ్రహ్మచే కల్పాంతమున కల్గించు దహనము (కల్పదాహము). - ఈ ప్రసంయమము (నిగ్రహణము, పరిత్యజనము) ప్రతీ సర్గమున కలుగును. కరణముల సంక్షయము (సాధనోపాయముల) నాశనము

ప్రతి సర్గలో జరుగుట ప్రాకృత మనంబడును. జ్ఞానము వలన ఆత్యంతీకమనబడినది. కారణముల యొక్క అసంభవము (లేమి కలుగమి) (జ్ఞానోదయమువలని ప్రళయము ఆత్యంతీకము. ఏలయన ఇది కారణములేమి) ప్రహరము 16వ దీవాభాగము. ప్రహరాంతమున బ్రహ్మ దేవతలను నాశనము చేయును. ఈ దేవతలు త్రైలోక్యవాసులు. బ్రహ్మ మరల సృష్టి నారంభించును. బ్రహ్మతన యొక్క సుషుప్తియందు ప్రజలను సంహరించును. యుగ సహస్రాంతమున యుగక్షయము సంప్రాప్తము కాగా ప్రజాపతి (బ్రహ్మ) ప్రజలను ఆత్మస్థులను చేయుట కారంభించును. (తనలో విలయమొనర్చుకొనును, అప్పుడు సంతత శతవార్షికి (నూరేండ్లుండునదియైన . అనావృష్టి కలుగును. దాని వలన, స్వల్ప సారములు (స్వల్ప శక్తిమంతములు) అయిన సత్వములు, తమంతట తామే భూమిలో కలిసిపోవును. అంత సప్తరశ్మి (సూర్యుఁడు) తన ఏడు రశ్ములతో తన రథముననుదయించును. అసహ్యము (భరింప శక్యములుకాని) లైన రశ్ములుగల భగవాన్ రవి నీటిని త్రాగును. అతని డెబ్బది 1) హరితకిరణములు ప్రకాశించుచు మెల్లమెల్లగా నాకాశమున వ్యాపించి వివర్తముజెందును. భౌమమైన అగ్ని యొక్క తేజము కాష్ఠములను ఇంధనములను, నీటితోనే(పచ్చతనముతోనే) మిక్కిలిగా దహించును (వెల్లును). అందుచేతనే ఉదకభృత్తయిన సూర్యుండు తపించునని చెప్పుదురు. నా వృష్యా తపతే సూర్యః నా వృష్ట్యా పరిషీచ్యతే వృష్టిలేక సూర్యుడు (మండుచు) వెలుగడు. వృష్టిలేక తడుపబడడు వృష్టిలేక పరివేశము జెందడు. అనా వృష్టియప్పుడు సూర్యుడు తపించును. అందుచే సూర్యుడు నీటితో ప్రజ్వలించును. సూర్యుని సప్తరశ్ములు నీరు త్రాగి దీప్తములగును. మహాసముద్రము నుండి ఆ యేడు రుశ్ములు నీటిని త్రాగును. నీటిచే ప్రజ్జ్వలింప జేయంబడి, సూర్యులేడుగురు అగుదురు. అంత సూర్యులయిన యా యేడు రశ్ములు చతుర్దశలను దహించును చతుర్లోకమును సూర్యఖులై దహించును. ఆ. కిరణములతో ఏడుగురు సూర్యులు ఊర్థ్వమును అధః ప్రదేశమును తిరుగును, యుగాంతమందలి అగ్ని ప్రతాపముతో సప్త భాస్కరలు ప్రకాశింతురు. ఆ నీటిచే ప్రదీప్తములయిన సప్తరశ్ములు బహు సాహస రశ్ములతో తమనుజుట్టి సర్వ స్వమును పరివ్యాపించి వసుంధరను దహించుచుండును ఆ సప్తరశ్ముల ప్రతాపముచే దహ్యమానమయిన వసుంధర అద్రులతో, నదులతో అర్ణవములతో నిస్నేహమై రగులనట్టిది) యుండును.

సూర్యాగ్నీవాం ప్రవృద్ధాసం సంసృష్టానాం పరస్పరమ్

 ఏకత్వముపయాతానాం ఏకజ్వాలా భవత్యుత

 సర్వలోక ప్రణాశశ్చ సోగ్ని ర్భూత్వాఖను మండలీ

 చతుర్లోకమిదం సర్వం నిర్దహత్యాలు తేజసా

 తతః ప్రలీనే సర్వసింజంగమే స్థావరే తథా

 నిర్వృక్షా నిస్తృణా భూమి కూర్మపృష్ఠసమా భవేత్

 అంబరీషమివాభాతి సర్వమష్యభిలం జగత్

సర్వమేవ తదర్చిరీః పూర్ణం జాజ్వల్యతే ఘనః

 భూతలే యాని సత్తాని మహోదధిగతాని చ

 తతస్తాని ప్రలీయింతే భూమిత్వముపయాంతిచ

ద్వీపాశ్చ పర్వతాశ్చైవ వర్షాణ్యథ మహోదధిః

సర్వం తద్భస్మసాచ్చక్రే సర్వాత్మా పావకస్తు సః

సముద్రేభ్యో నదీభత్చ పాతాలేభ్యశ్చ సర్వశః

పిబత్యపః సమిధోగ్నిః పృథివీమాశ్రీతో జ్వలన్

 తతః సంవర్థితః శైలానతిక్రమ్య గ్రహాంస్తథా

 లోకాన్ సంహరతే దీప్తో ఘోరః సంవర్తకోనలః

 తతః స పృథివీం భిత్త్వా రసాతలమశోషయత్

 నిర్గహ్యాంతే తు పాతాలం వాయులోకమథాదహతి

 అధస్తాత్ పృథివీం దగ్గ్వా తూర్థ్వం స దహతో దీవమ్

 యోజనానాం సహస్రాణి ప్రయుతాన్యర్బుదానీ చ

 ఉదతిష్ణన్ శిఖాస్తస్య హ్వ్య సంవర్తకస్య తు

 గంధర్వాంశ్చ పిశాచాంశ్చ సముహోరగరాక్షసాన్

 తదా దహతి సందీప్లో గోలకం చైవ సర్వశః

భూర్లోకం తు భువర్లోకం స్వర్లోకం చ మహస్తథా

 హోరో దహతి కాలాగ్నిదేవం లోకచతుష్టయమ్

 వ్యాస్తేషు తేషు లోకేషు తిర్యగూర్వమధాగ్నినో

 తత్తేజః సమనుప్రాప్య కృత్నం జగదిదం శనైః అయోగుడనిభం సర్వం తదా హ్యేవం ప్రకాశతే

 తతో గజకులాధారాస్తటిద్భి సమలంకృతాః

ఉత్తిష్ఠంతి తదా హోరా వ్యోమ్ని సంవర్తకాః ఘనాః

కేచిన్నీలోత్పలశ్యామాః కేచిత్కుముదసన్నిభాః

 కేచిద్వైడూర్యసంకాశాః ఇంద్రనీలనిభాః పరే  

సూర్యరశ్ములు, సంతతము ప్రవృద్ధములై ప్రజ్వలించునవి, పరస్పరము సంస్పృష్టములగుచున్నవియు అన్నియును ఏకత్వమును పొందినట్టివియునగు సూర్యాగ్నులు ఏకజ్వాలయగును  అయ్యది సర్వలోక ప్రణాశకరము. ఆ యగ్ని అనుమండలీభూత వలయగతులతో . వృద్ధి పొంది తన యొక్క తేజస్సుచే ఈ సర్వ చతుర్లోకమును వెంటనే భస్మాసాత్కృతి యొనర్చును అంత స్థావరములు, జంగమములు అన్నియును ప్రలీనముకాగా ఈ భూమి వృక్షరహితము, నిస్త్రృణమునయి తాబేటి- షృష్ణము (వీపు) వలెనగును. సర్వము ఆ సూర్యాగ్ని జ్వాలలచే పూర్ణమయి అంబరీషమువలే ఒక ఘనమయిన అగ్ని కందుకమువలె జగత్తంతయు నగును ప్రపంచమంతయు ప్రజ్జ్వలించు (కాగిన) పెనము వలెనగును. భూతల మండలి సర్వ సత్వములు, సముద్రాంతరములయిన ప్రాణులు అన్నియును ప్రలయము చెంది, బూడిదయై మట్టిగా పరిణమించును  ద్వీపములు, పర్వతములు, వరములు మహాసముద్రము ఈ అన్నింటిని సర్వాత్ముఁడయిన పావకుఁడు భస్మసోత్కరించును. సమిద్ధమగు (ప్రజ్జ్వలించు). అగ్ని పృథివిని ఆశ్రయించి, జ్వలించుచు సముద్రముల నుండి, నదుల " నుండి పాతాళము నుండి సర్వశః నీటిని త్రాగును. అభివృద్ధి పొందిన యీ సంవర్తకమైన అగ్ని దీప్తము, ఘోరమునై, శైలములను గ్రహములను అతిక్రమించి సంవర్థితమునై లోకాలనన్నింటిని సంహరించును. అంత, భూమిని భేదించుకొని రసాతలము ప్రవేశించి శోషిల్లజేసి సంవర్తకాన్ని పాతాలమును పొయులోకమును దహించి విడిచిపెట్టును. అయ్య పృథివినీ దహించి, ఊర్థ్వమున దివమును దహించును ఆసంవర్తకాన్నీ యొక్క అనేకములయిన జిహ్వా (శిఖలు) సహస్త్రములు, ప్రయుతములు, అర్బుదములయిన {అసంఖ్యేయ) యోజనములవరకు పైకి పెరుగును. అధికముగా ప్రజ్జ్వలితమైన అగ్నీ గంధర్వులను, పిశాచములను, పాములతో గూడిన రాక్షసులను, దహించును, ఆ యగ్ని పూర్తిగా, భూగోళ లోకమును, భువర్లోకమును, స్వర్లోకమును, మరియు మహర్లోకమును దహించును, అయ్యది కాలాగ్నియై లోక చతుష్టయమును ఘోరముగా దహించును. లోకములన్నియు, పైన క్రింద పక్కన సర్వత్ర ఈ అగ్నిచే వ్యాప్తములై సంవర్తకములైన ఘనములు (మేఘములు) పైకి లేచును. యావద్వీశ్వము తదగ్ని యొక్క తేజము వ్యాపించి శనైః (నెమ్మదిగా) పెద్ద అయోగుడతుల్యమయి ప్రకాశించును. అంత సంవర్తక మేఘములు ఆకాశమున విజృంభించును. అయ్యవి కొన్ని గజకుల (సమూహముల) ఆకారములు; అవి విద్యుల్లతలచే ప్రకాశించును. కొన్ని జ్వాలలు నీలోత్పల శ్యామములు, కొన్ని కుముద సన్నిభములు కొన్ని వైడూర్య మణి సంకాశములు మరికొన్ని ఇంద్రనీలతుల్యములు.

శంఖ కుందనిభాశ్చాన్యే జాత్యంజన నిభాస్తథా

 ధూమ్రవర్ణా ఘనాః కేచిత్ కేచిత్పీతాః పయోధరాః

 కేచిద్రాసభవర్ణాభా లాక్షారససాభాస్తథా

 మనళ్ళిలాభాస్త్వపరే కపోతాభాస్తథాంబుదాః

 ఇంద్రగోపనిభాః కేచిధ్ధరితాలనిభాస్తథా

చాషపత్రనిభాః కేచిదుత్తిష్ఠంతి ఘనా దీవి

 కేచిత్సురవరా కారాః కేచిన్దజకులోపమాః

 కేచిత్పర్వతసంకాశా: కేచిత్ స్థలనిభా ఘనాః

 క్రీడాగారనిభాః కేచిత్ కేచితి మీనకులోపమా

 బహురూపా ఘోరరూపా హోరస్వరనినాదినః

 తదా జలధరాః సర్వే పూరయంతి నభస్తలమ్ః

తతస్తే జలదా ఘోరరావిణ్ భాస్కరాత్మకాః

 సప్తథా సంవృతాత్మానస్తమగ్నిం శమయంత్యుత

 తతస్తే జలదా వర్షం ముంచంతి చ మహాఘవత్

 సుఘోరమశివం సర్వం నాశయంతి చ పావకమ్

 ప్రవృషైశ్చ తథాత్యర్ధం వారణా పూర్యతే జగత్

 అదిస్తేజోభిభూతం చ తదాగ్నిః ప్రవిశత్యపః

 నష్ట చాగ్నె వర్షగతే పయోదాః పావకోద్భవాః

 ప్లావయంతో జగత్సర్వం బృహలపర్భివైః

ధారాభి: పూరయంతీమం చోద్యమానాః స్వయంభువా

అన్యే తు సలీలోఫైస్తు వేలామభిభవంత్యపి

 సాదిద్వీపాంతరం పీతం జలమన్నేషు తీష్ఠతి

పునః పతతి భూమౌ తత్పయోధస్తాన్నభర్తలే

 సంవేష్టయతీ హోరాత్మా దీవి వాయుః సమంతతః

 తస్మిన్నేకార్ణవే ఘోరే నష్ట స్థావర జంగమే

 పూర్ణ యుగసహస్ర వై నిఃశేషః కల్ప ఉచ్యతే

అథాంభసా వృతే లోకే ప్రాహురేకార్ణవం బుధాః

 అథ భూమిర్జలం ఖం చ వాయుశ్చకార్ణవే తదా

 నష్ట నరేంధభూతే తు ప్రాజ్ఞాయత నకించన

 పార్థివాస్వథ సాముద్రా ఆపో దైవ్యాశ్చ సర్వశః

 అసరంత్యో ప్రజంత్యైక్యం సలిలాభ్యాం భజంత్యుతః

 ఆగతాగతికే చైవ తదా తత్సలిలం స్మృతమ్

(కొన్ని విశిఖ జ్వాలలు) శంఖములతో, మల్లెలతో తుల్యములు, కొన్ని జాత్యంజన నిభములు (నల్లని కాటుక వలె నున్నవి), ధూమ్ర వర్ణములయిన మేఘములుకొన్ని, (కొన్ని, సంవర్తక మేఘములు పీత వర్ణములు) కొన్ని మేఘములు గాడిదల వర్ణములు కలవి, కొన్ని మేఘములు లక్క వర్ణములు, కొన్నీ మనళ్ళిలా సదృశములు, ఇతరములైన మేఘములు పావురముల వర్ణములు కలవి. కొన్ని సంవర్తక మేఘములు మిణుగురు పురుగుల వర్ణములు- కలవి, కొన్ని హరితాలనిభములు కొన్ని క్రీడాగార తుల్యములు కొన్ని మీనకుల వర్గములతోనుపమింపఁదగినవి, కొన్ని చాషపత్రనిభములు. అట్టి సంవర్తక మేఘములు ఆకసమునకేగును. కొన్ని సంవర్తక మేఘములు ఉత్తమపట్టణ సదృశములు. కొన్నింటిని ఏనుగుల గుంపులతో పోల్చవచ్చును. కొన్నీ మేఘములు పర్వతోషమములు. కొన్ని విశాల భూతల వర్ణ సదృశములు కొన్ని క్రీడాగార నీభములు. మేఘములకు భిన్న భిన్న ఆకారములు కలవు. అవి ఘోర రూపములు కొన్ని, భయంకర గర్జనలను స్వరముల నినదించును. సంవర్తక మేఘము నభస్తలమును నిండియుండును. తరువాత (ఈమేఘములు) భయంకర నినాదములు చేయుచు, ఏడు విధములై, సూర్యాత్ములై, అగ్నిని శమింపచేయును (చల్లార్చును) ఆ మేఘములు ద్రోణవృష్టి గురియును ఆ మేఘములు సుఘోరము, అశివమునయిన అగ్నిని నాశనమొనర్చును. అత్యంతముగా వర్షించిన నీటితో జగత్తు నిండిపోవును.సీటిచే స్వకీయమైన తేజస్సు అభిభూతమయిన అగ్ని నీటి యందు ప్రవేశించును. వర్షముచే అగ్ని నష్టము కాగా, పావకోద్భవములయిన పయోదములు బృహజ్జల పరీవాహములచే జగత్తు నంతటినీ ముంచెత్తి బ్రహ్మప్రబోధింపఁబడి (మేఘములు) ధారలచే నీ భూమిని నింపును. ఇతర మేఘములు సముద్ర తీరమును సలీలౌఘములచే ముంచెత్తును. పర్వతములను ద్వీపములను ముంచెత్తి జలముండును. మరల నభస్తలమునుండి పయోధరముల నుండి భూమి యందు నీరు పడును భయంకరమైన వాయువు ఆకాశమున నంతటను వ్యాపించియుండును స్థావర జంగమ సత్త్వములన్ని ఘోరముగా నష్టమై ఆ ఏకార్ణవమయిన నీటియందు వినాశనముచెంద, పూర్ణముగా యుగసహస్రము నీండగా, దానిని నిశేష కల్పమందురు. అంత నీటిచే ఆవృతమయిన లోకమును బుధులు ఏకార్ణవమందురు. అంత, భూమి, జలము, ఆకాశము వాయువు ఏకార్ణవమగును. అన్నీ నాశనము కాగా (చల్లారగా) సర్వము అంధీభూతమై

ప్రచ్ఛాద్యతి మహీమేతామర్ణవాఖ్యం తు తజ్జలమ్

 ఆభాతి యస్మాత్తదాతి భౌశబ్దో వ్యాప్తిదీప్తిషు

భస్మ సర్వమనుప్రాప్య తస్మాదంభో నిరుచ్యతే

 నానార్వే చైవ శీఘ్రే చ ధాతుర్వై 'అర' ఉచ్యతే

 ఏకార్ణవే తదా హ్యో వై న శీఘస్తేన తా నరా

 తస్మిన్ యుగసహస్రాంతే దివసే బ్రాహ్మణో గతే

 తావంతం కాలమేవం తు భవత్యేకార్ణవం జగత్

 తదా తు సర్వే వ్యాపారా నివర్తంతే ప్రజాపతే

 ఏకమేకార్ణవే తస్మిన్నష్ట స్థావరజంగమే

 తదా స భవతి బ్రహ్మా సహస్రాక్షః సహస్రపాత్

 సహస్రశీర్షా సుమనః సహస్రపాత్ సహచక్షుర్వదనః సహస్త్రవాక్

 సహస్రబాహుః ప్రథమః ప్రజాపతిస్త్రయీమయో యః పురుషో నిరుచ్యతే

 ఆదిత్యవర్ణో భువనస్య గోప్తా అపూర్వ ఏకః ప్రథమస్తురాషాట్

హిరణ్యగర్భః పురుషో మహాన్ వై సంపర్యతే వై రజస్వ పరస్తాత్

 చతుర్యుగసహస్రాంతే సర్వతః సలీలాప్లుతే

 సుషుపురప్రకాశేపు సరాత్రిం కురుతే ప్రభుః

 చతుర్విధాయదాశేతే ప్రజాః సర్వా లయం గతాః

పశ్యంతి తం మహాత్మానం కాలం సప్త మహర్షయః

జనలోకం వివర్తిస్తే తపసా లబ్ధచక్షుష్క

 భ్ళగ్వాదయో మహాత్మానః పూర్వే వ్యాఖ్యాతలక్షణాః

సత్యాదీన్ సప్త లోకాన్వై తే హి పశ్యంతి చక్షుషా

 బ్రహ్మాణం తే తు పశ్యంతి సదా బ్రాహ్మీషు రాత్రిపు

సప్తర్షయః ప్రపశ్యంతీ స్వప్నం కాలం స్వరాత్రిషుః

కల్పానాం పరమేష్టిత్వాత్తస్మాదాద్యః స పర్యత

 స స్రష్టా సర్వభూతానాం కల్పాదిషు పునః పునః

ఏవమేవ శయిత్వా తు హ్యాత్మన్యేవ ప్రజాపతి

 అథాత్మని మహాతేజాః సర్వమాదాయ సర్వకృత్

తతః స వసతే రాత్రీం తమస్యేకార్ణవే జలే

యొప్ప, ఏది భూమియో ఏదీ జలమో ఏది గాలియో ఏదియు స్పష్టముగా కనబడక యుండును. భూ సంబంధమైనవి, సముద్ర జల సంబంధములు, అంతియేకాక దైవ్యములు, (దేవతా సంసృష్టికరములు) అన్నియును చైతన్యరహితములయి (అసరంత్యః) కదలాడక ఏకములు 'సలిలమను' పేరునుమరల పొందును. అప్పుడా సలిలముగతాగతికము లేనిదీగా స్మరింపఁబడును. అర్ణవమనీ పిలువఁబడు నీరు ఈ భూమినంతటిని నిండి యుండును. 'భా' అనుపదము వ్యాప్తికి, దీప్తికి (ప్రకాశమునకు) వాడబడును. ఈ నీరు భస్మమును. సర్వమును పూర్తిగా పరివ్యాపించి, ప్రకాశించును. అందుచే నీరు. అంభస్సు అని పిలువబడినది. ఆ (అర్) ధాతువు, నానాత్వము, శీఘ్రము అను అర్థములనుపయోగింపఁబడును. ఆ సముద్రపు ఏకార్ణవత్వము శీఘ్రముగా కాదు అందుచే అవి సరములు అయినవి. అర్ ధాతువు శ్రీఘత్వార్ధకము. వెంటనే కాకుండుటచే  నరులయినవి. బ్రహ్మ యొక్క సహస్ర చతుర్యుగములు గడచిపోగా అంతకాలం. జగత్తు ఏకార్ణవమగును. అప్పుడు. ప్రజాపతి యొక్క సర్వవ్యాపారములు ఆగిపోవును. (నివర్తంతే) ఆ ఏకమయిన ఏ కార్ణవమున స్థావర జంగమ వస్తువులన్నియు నందు నశింపగా బ్రహ్మ సహస్రాక్షుఁడు సహస్రపాదుఁడునగును. త్రయీ మయుం డుగా చెప్పబడిన ప్రథమ ప్రజాపతి పురుషుఁడు, సహస్ర శీరుండు, సుమనస్క్యుడు, సహస్ర పాదుఁడు, సహస్ర నేత్రుఁడు, సహస్ర వదనుఁడు, సహస్రవాక్కు సహస్ర పాదుఁడు, సహస్ర బాహువు గా చెప్పఁబడినాఁడు. ఆతఁడు ఆదిత్య వర్ణుఁడు, సర్వ ప్రపంచ రక్షకుం. డు, అద్వితీయుడు. (అపూర్వుఁడు). ప్రథమతురాట్ (అందరిని జయించిన (మించిన) మొదటివాఁడు, హిరణ్యగర్భుఁడు, మహాపురుషుం డు, రజోగుణమునకు దూరమైన వాడుగా అతఁడు వర్ణింపఁబడినాడు. చతుర్యుగ సహస్రాంతమున, సర్వత్ర సలిలము ఆవృతమయియుండ ఆప్రభువు సుషుప్తియందభిలాషుడగును. అతఁడు ప్రకాశమును (వెలుగును) కోరని కారణమున రాత్రి సౌతఁడు సృష్టించును. అండజ స్వేదజాదీ చతుర్విధజీవగణము ఆతనిలో లీనమయి ఆతని యందుండి పోవునట్టి మహాత్ముని కాలుని సప్తర్షులు చూచెదరు, భృగ్వాదులు వారి పూర్వపు లక్షణములు పూర్వమే చెప్పఁబడినవి. వారు (ఆసప్తమహరులు) సత్యాదులను, సప్తలోకములను స్వచక్షువులతో చూచెదరు. బ్రహ్మ యొక్క రాత్రి కాలములందు వారు. బ్రహ్మను చూచెదరు. రాత్రుల నిద్రించు 'కాలుని సప్తరులు చూచెదరు.

ఆతడు కల్పములకు పరమేష్టియగుట, ఆతడే ఆద్య సష్ట ప్రజాపతి. ఆ విధముగా పండుకొని తానే సర్వము గ్రహించి ఆ మహాత్ముం డు తన యందుంచుకొనును. ఆతఁడు సర్వకృత్. అంత సర్వకృత్ అయిన ప్రజాపతి, ఏకము ఏకార్ణవమయిన సముద్రమున, చీకటిలో నుండును.

తతో రాత్రిక్షయే ప్రాప్తే ప్రతిబుద్ధః ప్రజాపతిః

 మనఃసిసృక్షయా యుక్తః సర్గాయ నిదధే పునః

 ఏవం స లోకే నిర్వృత్త ఉపశాంతే ప్రజాపతౌ

 బ్రాహ్మీ నైమిత్తికే తస్మిస్ కల్పితే వై ప్రసంయమే

 దేహైర్వియోగః సత్త్వానాం తస్మిన్ వై కృత్స్నశః స్మృతః

 తతో దధేషు భూతేషు సర్వేష్వాదిత్యరశ్మిభిః

 దేవర్షిమనువర్యేషు తస్నిన్నంబుప్లవే తదా

 గంధర్వాదీని సత్త్వానీ పిశాచాంతానీ సర్వశః

 కల్పాదావప్రతపానీ జనమేవాశ్రయంతి వై

 తిర్యగ్యోనీని నరకే యాని యాని గతాన్యపి

 తదా తాన్యపి దగ్గాని ధూతపాపాని సర్వశః

 జలే తాన్యుపపద్యంతే యావత్సంప్లవతే జగత్

 వ్యష్టాయాం చ రజస్యాం తు బ్రహ్మణ్కో వ్యక్తయోనినని

 ఊయంతే హి పునస్తాని సర్వభూతాని కృత్స్నశః

 ఋషయో మనవో దేవాః ప్రజాః సర్వాశ్చతుర్విధాః

తేషామపి చ సిద్దానాం నిధనోత్పత్తిరుచ్యతే

 యథా సూర్యస్య లోక్కేసిన్నుదయాస్తమనే స్మృత

 తథా జన్మనిరోధశ్చ భూతానామిహ దృశ్యతే

 ఆభూతసంప్లవాత్తస్మాద్భవః సంసార ఉచ్యతే

యథా సర్వాణి భూతానాం జయంతే వర్షణేష్విహ

స్థావరాదీని నియమాత్కల్పే కల్పే తథా ప్రజాః

యథాస్త్రావృతులింగాని నానారూపాణి పర్యయే

 దృశ్యంతే తాని తాన్యేవ తథా బ్రహ్మద్యురాత్రిషు

ప్రత్యాహారే విసర్గ చ గతిమంతీ ధ్రువాణి చు

  నిష్క్రమంతే విశంతే చ ప్రజాః కాలే ప్రజాపతిమ్

బ్రహ్మాణం సర్వభూతాని మహాయోగం మహేశ్వరమ్

 స స్రష్టా సర్వభూతానాం కల్పాదిషు పునః పునః

 వ్యక్తావ్యక్తి మహాదేవస్తస్య సర్వమిదం జగత్

 యథా శుభేన త్వశుభేన చైవ తత్రైవ తత్రైవ వివర్తమానాః

 మర్యాస్తు దేహాంతరభావితత్వాద్రవేర్వశాదూర్థ్యమధశ్చరంతీ

అంత రాత్రి సమాప్తముకాగా ప్రజాపతీ నిద్ర నుండి మేల్కొనును. ఆతని మనస్సు సృష్టింపవలెనని ప్రేరేపింప నతఁడు సృష్టింప కోరిక పూనును. ఈ విధముగా ప్రజాపతి లోకములను సృష్టించి ప్రశాంతుఁడు అయిన తరువాత బ్రహ్మకు సంబంధించిన నైమిత్తికమయిన విలీనము కలుగును. అప్పుడు సర్వ భూతములు, దగ్గములయిన శరీరముల నుండి విడి వడునని జ్ఞాపకముంచుకొనవలెను. సర్వ భూతములు సూర్య కిరణములచే దగ్గభూతములు కాగా, దేవతలు, యోగులు, మనువులు ఆ ఏకార్ణవజలప్లావమున గంధర్వులు, మొదలగు సత్త్వములు, పిశాచములతో సహ, సర్వశః నశించును. కల్పదావముచే ప్రతప్తములు కాని వారు కల్పాదీని జనలోకమునాశ్రయంచి నరకమును పొందియున్న ఏ యే తిర్యగ్యోనులును ఉన్నవో యవి యన్నియు దగ్ధములయిపోవును. పాపము నుండి నీర్జూతములగును. విశ్వమంతయు జలప్లుతమై యున్నంత కాలము ఆసత్త్వములన్నియు నీటి యందు నిమజ్జనము చెందియుండును. రాత్రి పోయి సంధ్య వచ్చిన పిమ్మట ఆ సత్త్వములన్నియు అ వ్యక్త యోనియయిన బ్రహ్మ నుండి జన్మించును . ఋషులు మనువులు, దేవతలు, ప్రజలు, మొదలగు చతుర్విధ వ్యక్తులు అందరు మరల పుట్టెదరు. సిద్ధులు కూడా జనన మరణములు కలిగియుందురని చెప్పబడినది. లోకమున సూర్యుని ఉదయము అస్తమయము కలుగునట్లు సర్వ భూతముల జనన మరణములు క్రమముగా జరుగును. సర్వ భూతముల యొక్క పునర్జన్మ, నాశనానంతరము “సంసార” మనంబడును. వరానంతరము వృక్షాది సర్వజీవరాశులు ఎట్లు తిరిగి యుద్భవించునో, అట్లే స్థావరములు మొదలయినవి ప్రజలు నీయమానుకూలముగా, ప్రతీ కల్పమందు. పుట్టును. ఋతువులు, ఋతువులననుసరించి వివిధ లక్షణములు కలుగు నట్లే బ్రహ్మ యొక్క పగళ్లయందు రాత్రులందు లక్షణములు చూడనగును. సర్వ భూతములు స్థావరములు జంగమములు బ్రహ్మను ప్రజాపతిని, కాలములో వినోశసమయమున చేరును సృష్టి సమయమున వానీ నుండి వచ్చును. ఆతఁడు మహా ప్రభువు అనంత యోగి కల్పాదుల యందు పునః పునః సర్వ భూతములనోతడు సృజించును. ఆప్రభువు వ్యక్తుఁడు అవ్యక్తుఁడును, మహేశ్వరుడు ఆతనీదే ఈ జగత్తంతయూ ఆతఁడే మొదట నీటిని సృజించెను. ఆ నీరు భూమీ యొక్క తలమునకు పూర్వము వచ్చినట్లే వచ్చి చేరును. అవి పైకి క్రిందికి సూర్యుని వలన పోవును.

యే చాపీ దేవా మనవః ప్రజేశా అన్యేపి యే, స్వర్ణ గతాశ్చ సిద్ధాః

 తద్భావితాః ఖ్యాతివచ్చ ధర్యా పునర్విసర్గేణ భవంతీ సత్త్వాః

 అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి కాలమాభూతసంప్లవమ్

మన్వంతరాణి యాని స్యుద్యోఖ్యాతాని మయా ద్వీజా@

సహ ప్రజానిసర్గేణ సహ దేవైశ్చతుర్ధశ

 పా యుగాఖ్యా సహస్రం తు సర్వాణ్యేవాంతరాణి వై

 అస్యాః సహస్ర ద్వే పూర్తే విశేషః కల్ప ఉచ్యతే

 ఏతద్ బ్రాహ్మమహరిజ్ఞేయం తస్ససంభ్యాం నిబోధత

 నిమేషతుల్యమాత్రా పొ కృతా లబ్దక్షణేన తు

 మానుషాక్షినమేషాస్తు కాషా పంచదశ స్మృతాః

 నవ క్షణస్తు పంచైవ వింశత్కాషా తు తే త్రయః

ప్రస్థా సప్తోదకాశ్చవ సాధీకాస్తు లవః స్మృతః

 లవాస్త్రింశత్కలా జేయా ముహూర్తస్త్రింశతః కలాః

 ముహూర్తాస్తు పునస్త్రింశదహోరాత్రమితి స్థితి

 అహోరాత్రం కలానాం తు అధికాని శతాని షట్

 తాశ్చైవ సంఖ్యలో జేయాశ్చంద్రాదిత్యగతిర్యధా

 నిమేషా దశ పంచైవం కాషాస్త్రింశతః కలాః

త్రింశత్క ముహూర్తం తు దశభాగం కలా స్మృతమ్

 చత్వారింశత్కలాః పంచ ముహూర్త ఇతి సంజ్ఞతః

 ముహూర్తాశ్చలపాశ్చాపి ప్రమాణజై: ప్రకల్పితా:

 తథానేనాంభసశ్చాపి ఫలాన్యథ త్రయోదశ

 మాగఖేనైవ మానేన జలప్రళే విధీయతే

 ఏతే వారాప్లుతప్రస్థాశ్చత్వారో నాలికోచ్చయః

హేమమాషైః కృతచ్ఛిద్రశ్చతుర్భిశ్చతురంగులైః    

            అట్లే మానవులు పారొనరించిన శుభాశుభకర్మల వలన పైకి క్రిందికి పోవుదురు. ఆ మానవులు వారి యొక్క తనువు యొక్క మార్పులలో ఒక శరీరము నుండి వేడొక శరీరమునకు ఇందు నందుందిరుగుచు పోవుదురు.

 అందు దేవతలు మనువులు, ప్రజాప్రభువులు స్వర్గగతసిద్ధులు ఇతరులు కూడ నుందురు. పరిణామము చెంది, వారిచే సృజింపబడి ధర్మవంతులు తమ చరిత్రను (కీర్తిని) అనుసరించి వారు జన్మము చెందుదురు.

అందుచే, ఇకముందు, “ఆభూత సంప్లవమును” గూర్చి వివరించెదను. (ఆ భూత సంప్లవమును గూర్చి చెప్పుటకు కొలము, కాల గుణమును గూర్చి చెప్పఁబడినది) ఓ బ్రాహ్మణులారా! రానున్న మన్వంతరములను. ప్రజా సృష్టితో, దేవతాసృష్టితో వివరించితిని. మొత్తము పదు నాలుగు మన్వంతరములు అవీ సహస్ర చతుర్యుగ కాలము వ్యాపించును. ద్వీసహస్ర చతుర్యుగములు పూర్తి కాగా దానిని “విశేష కల్ప” మందురు. దీనిని బ్రహ్మ యొక్క ఒక రోజుగా (తద్గణనమును బట్టి) యెఱుంగవలెను-దాని సంఖ్యను తెలియుడు . లబ్దక్షణము నిమేష్యష (కనురెప్పపాటుకాల)ముతో సమానము (నిమేషము మనిషి కనురెప్పపాటు కాలము). పది యైదు నిమేషములు ఒక కాష్ఠ, తొమ్మిది నిమేషములు ఒక క్షణము లేదా 5 నిమేషములోక క్షణము  నిమేషములు-ఒక కాష్ఠ  కాష్ఠలు ఒక ప్రస్థ  ప్రస్థములు ఒక ఉదకము.  ఇంకొకటి కలిపినరి ప్రస్థములు ఒక లవ. 30 లవలు ఒక కలయగును. 30 కలలు ఒక ముహూర్తము 30 ముహూర్తములు ఒక పగలు రాత్రి. ఇది స్థితి , ఒక పగలు, ఒక రాత్రి కలిసీ (3X30) = 900 కలలు, సూర్య చంద్రుల గతులను బట్టి వానిని తెలిసికొన వలెను.  15 నిమేషములు ఒక కాష్ఠ యగును. 30 కాష్ఠలు ఒక కల యగును. 30 కలలు ఒక ముహూర్తము. (వేళిక ప్రమాణమును బట్టి) కల ముహూర్తములో పదియవ భాగముగా జ్ఞాపక ముంచుకొనవలెను 45 కలలు ఒక ముహూర్తమగును. ఈ విధముగా ముహూర్తములు లవములు. వానితో పరిచయమున్న వారిచే పరిగణింపబడినవి. "అట్లే మాగధుల మానముచే 13. పలముల నీరు ఒక జల ప్రస్థమగును. నీటితో నింపిన 4.ప్రస్థలు ఒక “నాలి కోచ్చయ"మగును. అది 4 అంగుళముల నాలుగు బంగారు మినపగింజలచే రంధ్రములు చేయబడిన గుల్లవంటి దీనిని నీటిలో వేసిన పట్టునంతటి కాలము నాలికోచ్చయముగా వచ్చును). పగలు రాత్రులు  సమానమయిన రోజులలో రెండు నాలికలు ముహూర్తమగును ఈ గణనము సూర్యుని యొక్క చిత్రమయిన గమనమునుబట్టి ఎప్పుడునుండును.

సమాహని చ రాత్రౌ చ ముహూర్తావై ద్వినాలికాః

 రవేర్గతివిశేషేణ సర్వేష్వే తేషు నిత్యశః

 అధికం షట్శతం యచ్చ కలానాం ప్రవిధీయతే

 తదహర్మానుషం జేయం నాక్షత్రం తు దశాధికమ్

సావనేన తు మానేన అబోలియం మానుషః స్కృతః

ఏతద్దీవ్యమహారాత్రమితి శాస్త్రవినిశ్చయ

 అహ్నానేన తు యా సంఖ్యా మాసర్వయనవార్షికీ తదా

 బద్ధమిదం జ్ఞానం సంజ్ఞయా హ్యుపలక్షితమ్

కలానాం తు పరిమాణం కలా ఇత్యభిదీయతే

యదహో బ్రహ్మణః ప్రోక్తం దివ్యా కోటీ తు సా స్మృతా

 శతానాం చ సహస్రాణి దశ ద్విగుణీతాని చ

 నవతీం చ సహస్రాణి తథైవాన్యాని యానీ తు

 ఏతచ్ఛృత్వా తు ఋషయో విస్మయం పరమాద్భుతమ్

 సంఖ్యాసంభజనం జ్ఞానమపృచ్ఛనుతరాం తదా

ఋషయ ఊచుః

సంప్రకాలనమానం తు మానుషేణైవ సమ్మతమ్

 మానేన శ్రోతుమిచ్ఛామః సంక్షేపార్థపదాక్షరమ్

 తేషాం శ్రుత్వా స దేవస్తు వాయుర్లోకహితే రతః

 సంక్షేపాబ్దివ్యచక్షుష్వాత్ ప్రోవాచ వచనం ప్రభుః

 ఏతే రాత్ర్యహనీ పూర్వం కీర్తితే త్విహా లౌకికే

 తొసాం సంఖ్యాథ వర్షాగ్రం బ్రాహ్మీ వక్ష్యామ్యహఃక్షయే

 కోటీశతాని చత్వారీ వర్షాణి మానుషాణి తు

 ద్వాత్రింశచ్చ తథా కోట్యః సంఖ్యాతాః సంఖ్యయా ద్విజై

 తథా శతసహస్రాణి ఏకోననవతి పునః

 అశీతిశ్చ సహస్రాణి ఏష కాలః ప్లవస్య తు

 మానుషాజ్యేన సంఖ్యాతః కాలో హ్యాభూతసంప్లవః

 సప్తసూర్యప్రదగేషు తదా లోకేషు తేషు వై

 మహాభూతేషు లీయంతే ప్రజాః సర్వాశ్చతుర్విధా

 సలిలేనాపతే లోకే నష్ట స్థావరజంగమే

 వినివృత్తే చ సంహారే ఉపశాంతే ప్రజాపతో

 నిరాలోకే ప్రదగ్ధే తు నైశేన తమసా వృతే

 600 కలల కంటే అధికమయిన కాలము ఏది కలదో దానిని మానుషదీనముగా తెలిసికొనవలెను. నక్షత్ర సంబంధమైన దినము (పశిలిజిబెలిజ్ ఫిజీగి) అంతకంటే మటీ పది కలలను అధికముగా కలిగియుండును. ఇదీ సావన మాసానుగుణముగా ఒక సంవత్సరము మానుషముగా గణింపబడును. అది “దివ్య మహోరాత్ర” రాత్రి పగలు కలసిన మాసమని శాస్త్ర నిశ్చయము. ఈ దినమును అనుసరించియే మాసములు, అయనములు, ఋతువులు, సంవత్సరములు గణింపవలయును. ఈ విజ్ఞానము పదప్రయోగము (పద నిర్మాణము) దానిపై ఆధారపడి యున్నవి. కలల యొక్క పరిమాణము కల యని చెప్పబడును. బ్రహ్మకు ఒక దీనముగా చెప్పబడినది, దేవతాగణన సంఖ్యను బట్టి ఒక కోటి, 20 లక్షల 90 వేల రోజులు.

ఈ కాల గణనమును ఋషులు వినినారు ఆశ్చర్యపడినారు. పరమాద్భుతమనినారు. తరువాత సంఖ్యాసంభజనమునకు సంబంధించిన జ్ఞానమును గూర్చి యడిగినారు.

 ఋషులిట్లడిగిరి.

కొలతలు, గణనమును మేము మానుష గణానాదులలో వినగోరుచున్నాము. ఆ కథనము సంక్షేపార్థపదాక్షరముగా నుండగోరెదము. లోకహిత రతుఁడయిన వాయుదేవుఁడు ఆ ఋషుల పలుకుల వినెను. దివ్య చక్షుషము కారణముగా సంక్షేపముగా వాయు ప్రభువు పలికెను. బ్రహ్మ యొక్క రాత్రి పగలు ఇంతకు పూర్వము వివరింపఁబడెనట. సంవత్సరము నందలి రోజులను సాధారణ మానమున గణించు బ్రహ్మ యొక్క దీనక్షయమునకు ఎన్ని రోజులో గణించి చెప్పెదను, 4,32,89,80,000 నాలుగు వందల ముప్పటి రెండు కోట్ల ఎనుబది తొమ్మిది లక్షల ఎనుబది వేల మానుష సంవత్సరములు. ఇదియే లక్ష ప్రలయ కాల ప్రమాణము. ఈ విధముగా బ్రాహ్మణులు కాల మానమును గణించిరి.

సర్వ లోకము 7 గురు (సప్త) సూర్యులచే దగ్గ పటలము చేయబడినప్పుడు చతుర్విధములయిన సర్వ ప్రజలు (భూత జాలము అంతయు) మహా భూతముల యందు విలీనమైపోవును. ప్రపంచమంతయు జల ప్రలయ నిమగ్నమై స్థావర జంగమములు నష్టముకాగా, ప్రలయ ప్రవృత్తి సమాప్తము కాగా ప్రజాపతి ఉపశాంతుడు కాగా, వెలుతురన్నది లేక సర్వము ప్రదగ్ధమై నిశాకాలతమః పటలముచే ఆ వృతమై యుండగా,

ఈశ్వరాధిష్ఠితే త్వస్మింస్తదా హ్యేకార్ణవే కిల

 తావదేకార్ణవే జ్ఞేయం యావదాసీదహః ప్రభోః

రాత్రిస్తు సలీలావస్థా నివృత్తి వాప్యహాః స్మృతమ్

అహోరాత్రస్తథైవాస్య క్రమేణ పరివర్తతే

ఆభూతసంప్లవో హ్యేష అహో రాత్రః స్మృతః ప్రభో

త్రైలోక్య యాని సత్తాని గతిమంతీ ధ్రువాడి చl

 ఆభూతేభ్యః ప్రలీయంతే తస్మాదాభూతసంప్లవః

 అతీతా పర్తమానాశ్చ తథైవానాగతాః ప్రజా

దివ్యసంఖ్యా ప్రసంఖ్యాత అపరార్థగుణీకృత పదార్థం ద్విగుణం చాపీ పరమాయుః ప్రకీర్తితమ్

ఏతావాన్షితికాలస్తు హ్యాజ స్యేహ ప్రజాపతే

స్థిత్యంతం ప్రతిసర్గశ్చ బ్రహ్మణః పరమేష్ఠినః

యథా వాయుప్రవేగేన దీపారిరుపశామ్యతిః తథైవ ప్రతిసర్గేణ బ్రహ్మా సముపశామ్యతి

తథా స్వప్రతిసంసృష్ట మహదాదౌ మహేశ్వరే

మహత్పలీయతే వ్యక్తి గుణసామ్యం తతో భవేత్

ఇత్యేష వః సమాఖ్యాతో మయా హ్యాభూతవిప్లవన

బ్రహ్మనైమిత్తికో హ్యేష సంప్రక్షాళనసంయమ

సమాసేన సమాఖ్యాతో భూయః కిం వర్ణయామి వః

 య ఇదం ధారయేన్నిత్యం శృణుయాద్వాష్య భీ క్ష్ణశః

కీర్తయేత్ వర్జయేద్వాపి మహతీం సిద్ధిమాప్నుయాత్

ఇతిశ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే ఉత్తరభాగే చతుర్థ ఉపసంహారపాదే

 అభూతసంప్లవాఖ్యవర్ణనం నామ ప్రథమోధ్యాయః

సర్వము ఈశ్వరాధిష్టితమై యుండ అదియే ఏ కార్ణవము సంభవించుటకు. కాలము ఆ ఏకార్ణవము యొక్క విస్తృతి బ్రహ్మ యొక్క రోజుతో సమానవ్యాపృతి గలిగినది రాత్రి సలిలావస్థ చెందును. (అచంచలమయి యుండును). ఆ సలిలావస్థ నివృత్తమయిన నది ప్రగలుగా స్మరింపఁబడును. ఆ బ్రహ్మరోజులలో పగళ్లు రాత్రులు ఒక దాని వెంట నొకటి వచ్చును. పరమాత్ముని యొక్క అహోరాత్రమును “ఆభూత సంప్లవమందురు” ప్రపంచము నందు త్రిలోకముల యేయే గతి మంత్రములు ధ్రువములు నైన, సత్త్వములు కలవో అవి భూతములలో సంప్రతనమగును.

భూత కాలమందలి, వర్తమాన కాలమందలి, రానున్న (అనాగత) . కాలమందలి ప్రజలు. ఈ విధముగా విలీనమగుదురు.

అపరార్థ గుణీకృతమయిన దివ్య సంఖ్య చెప్పబడినది. అపరార్థమనఁగా ఒకటీ తరువాత 7 సున్నలుగల సంఖ్య 1,0000000). (పరార్థమనగా 16 అంకెలు గల సంఖ్య (100,000,000,000,000,000) అపరార్థమనగానంతకన్న మించిన (18 సున్నాలుగల 19 అంకెలు గల సంఖ్యనోపును చూ (Aple Dictionary) పరమాత్మకు పరార్థ ద్వయకాలవత్సరములు పరమాయువు చెప్పబడినది.

అజుఁడయిన ప్రజాపతికిని ఆయువు ఇంత మాత్ర కాలము. ఈ ఏవంవిధ) స్థిత్యంతరమున పరమేష్ఠియయిన బ్రహ్మకు ‘ప్రతిసర్గ” కలుగును. (Realisouption) జంఝామారుతము యొక్క వేగమునకు దీపము ఆరిపోవునట్లు ప్రతి సర్గమున బ్రహ్మగారు ప్రశాంతి చెందుదురు.

బ్రహ్మ తాను సృష్టించిన మహత్తులో (పరమేశ్వరునిలో) విలీన మగును. ఈ మహత్తు అవ్యక్తమున లీనమగును. తరువాత సత్వ రజస్తమోగుణములు సామ్యత్వము బొందును.

ఈ విధముగా మీకు ఓ (బ్రాహ్మణులారా!) ఆభూత విప్లవమును గూర్చి చెప్పితిని, నీటితో బ్రహ్మ యొక్క సంప్రక్షాళన సంయమము నైమిత్తిక (సంప్రలీన) సంఘటనము.

మీకు సంక్షేపముగా నిది చెప్పితిని. ఇంక నేమి మీకు వర్ణింతును? ఎవ్వడు దీనిని జ్ఞాపక ముంచుకొనునో, నిత్యము వినునో, వర్ణించునో, యతుఁడు గొప్ప స్థితిని పొందును.

ఇది మహా పురాణము, వాయు ప్రోక్తమునయిన బ్రహ్మాండ పురాణములో ఉత్తర భాగమున, చతుర్థ ఉపసంహారపాదమున ఆభూతసంప్లవాఖ్యవర్ణనమను ప్రథమాధ్యాయము సమాప్తము.