49 - సగర దిగ్విజయము

జైమిని రువాచ :-

అథానుజ్ఞాయ సగరో వసిష్ఠమునిసత్తమమ్

 బలేన మహతా యుక్తో విదర్భానభ్యవర్తత 

తతో విదర్భరాట్ తస్మై స్వసుతాం ప్రీతిపూర్వకమ్

కేశిన్యాఖ్యామనుపమామనురూపాం న్యవేదయత్

స తస్యా రాజశార్దూలో విధివద్వహ్నిసాక్షికమ్

శుభే ముహూర్తే కేశిన్యాః పాణిం జగ్రాహ భూమిపః

 స్థిత్వా దినాని కచితిద్మహే తస్యాతిసతృతః

విదర్భరాజ్ఞా సంమంత్ర్య తతో గంతుం ప్రచక్రమే

అనుజ్ఞాతస్తతస్తేన పారిజరైశ్చ సతృతః

 నిఝుమ్య తత్పురాద్రాజా శూరసేనానుపేయివాన్

సంభావితస్తతశ్చైవ యాదవైర్మాతృసోదరైః

 ధనౌఫెసర్పితనైశ్చ మధురాయా ఏనిర్యయా

ఏవం స సగరో రాజా విజిత్య వసుధామీమామ్

కరైశ్చ స నృపాన్ సర్వాంశ్చక్రే సంకేతగానపి

తతోనుమాన్య నృపతీన్నిజరాజ్యాయ సానుగాన్

అనుజట్లే నరపతిః సమస్తాననుయాయినః

తతో బలేన మహతా స్కంధావారసమన్వితః శనైరపీడయన్ దేశాన్

స్వరాజ్యముపజగ్మివాన్

సంభావ్యమానశ్చ ముహురుపదాభిరనేకశః నానాజనపదైస్తూర్ణమయోధ్యాం సముపాగమత్

తదాగమన మాజ్ఞాయ సాగరః సబలో జనః నగరీం తామలంచక్రే  మహోత్సవసమత్సుకః

తతః సా నగరీ సర్వ కృతకేతుకమంగళా

సిక్తసంమృష్టభూభాగా పూర్ణకుంభశతావృతా

సముచితధ్వజశతా పతాకాభిరలంకృతా

సర్వత్రాగరురూపాధ్యా విచిత్రకుసుమోజ్వలా

సద్రత్నతోరణోత్తుంగగోపురాట్టాలభూషితా

 ప్రసూనరాజవర్షైశ్చ స్వలంకృతమహాపథా

జైమిని ఇట్లు చెప్పెను :  

మునిసత్తముఁడయిన వసిష్ఠుని ఆజ్ఞనుగొని సగరుఁడు మహా సైన్యబలముతో గూడికొని విదర్భదేశముపై దండెత్తెను. అంత, విదర్భరాజు, కేశినీ నామము కలిగినదియు, సౌందర్యమున అనన్యమయినదియు, సగరునకన్ని విధముల ననుకూలమయినదియు నగు తనకుమార్తెను ప్రీతిపూర్వకముగా ఆతనికి సమర్పించెను. ఆమెనుశుభముహూర్తమున రాజశార్దూలుఁడయినరాజు వీధిమంతముగా నగ్ని సాక్షికముగా వివాహ మాడేను. (3) విదర్భరాజుచే అత్యంత సత్పతి నొంది కొన్ని దినములాతని భవనమునందుండి విదర్భరాజువలన అనుమతింపఁబడి సగరుఁడు బయలుదేరెను. పారిబర్హులచే సత్కరింపబడి, అందుండిబయలువెడలి రాజు శూరసేనదేశమును సమీపించెను. తనమాతృసోదరులైన యాదవులచే గౌరవింపఁబడెను. ధనౌఘములచే నర్చింపఁబడెను. అందుండి(మధురనుండీ) సగరుఁడు బయలుదేరెను. ఈ విధముగా సగరుఁడు భూమినంతటిని జయించెను. వారందరాతనీ సూచనలనంది సామంతులయిరి. రాజునకు కప్పములు చెల్లించిరి. అంతసగరుండుతనసామంతులను,తన్ననుసరించి వచ్చునట్టివారిని వారివారి రాజ్యములకేగ ననుమతించెను.(10)తరువాత గొప్పదియయినసంధావారముతో కూడికొనీ గొప్ప సైన్యముతోదేశములను పీడింపకయే సగరుఁడు స్వరాజ్యమును చేరెను.త్రోవలో గ్రామజనులచే మాటిమాటికి గౌరవింపఁబడుచు, సగరుఁడు వెంటనే అయోధ్యానగరమును చేరేను. సగరుని యొక్క రాకనెటింగి పురజనులధికోత్సాహపరవశులయిరీ: మహోత్సవములు నగరమునప్రవర్తిల్లేను.నగరమలంకరింపబడెను. భూభాగమంతయును నీటిచే తడుపబడినది.పరిశుభ్రముగా తుడువబడినది. పూర్ణకుంభశతములచే నిండియుండెను. విజయ ధ్వజ శత పతాకలచే నలంకరింపఁబడినది. నగరమంతటను అగరు గంధ వాసీతము. విచిత్రములయిన కుసుమముల యలంకరణముచే నుజ్వలముగానుండెను, గోపురములు అట్టాలకములు సద్రత్నతోరణములచే భూషింపఁబడినవి. పూవులతో పేలాలతో మహాపథము రాజవీధులు అలంకరింపఁబడినవి.

మహోత్సవ సమాయుక్తా ప్రతిగేహమభూత్పురీ

 సంపూజితాశేషవాస్తుదేవతాగృహమాలినీ

దిక్చక్రజయినో రాజ్ఞః సందర్శనముదాన్వితైః

 పౌరజానపదైర్ఘృష్టైః సర్వతః సమలంకృతా

తతః ప్రకృతయః సర్వే తదంతఃపురవాసినః

వారకాంతాకదంబైశ్చ నగరీభిశ్చ సంవృతాః

అభ్యాయయుస్తతః సర్వే సమేత్య పురవాసినః

 స తైః సమేత్య నృపతిర్లజ్ఞాశీర్వాదసత్రియః

బధిరీకృతదిక్చకో జయశబ్దేన భూరిణా

 నానావాదిత్రసంహొషమిశ్రేణ మధురేణ చ

సతృత్య నాన్యథాయోగం సహితస్తర్ముదాన్వితైః

ఆనందయన్ ప్రజాః సర్వః ప్రవివేశ పురోత్తమమ్

 వేదఘోషైః స మధురైర్రాహ్మణెరభినందితః

సంస్తూయమానః సుభృశం సూతమాగధవందిభిః

జయశభైశ్చ పరితో నాసోజనపదేరితైః

కలవాలరవోని శ్రవీణావేణుతలస్వనైః

గాయద్భిర్గాయకజనైరృత్యడ్భిర్గణికాజనైః

అన్వీయమానో విలసచ్వేతచ్చత్రవిరాజితః

వికీర్యమాణః పరితః సల్లోజకుసుమోతరైః

పురీమధ్యామవిశత్స్యపురీమివ వాసవః

 దృష్టిపూతేన గంధేన బ్రాహ్మణానాం చ వర్మనా

జగామ మధ్యే నగరం గృహం శ్రీమదలంకృతమ్

ఆవరుహ్య తతో యానాదార్యాభ్యాం సహితో ముదా

ప్రవివేశ గృహం మాతుః హృష్టపుష్టజనాయుతమ్

పర్యంకస్థాముపాగమ్య మాతరం వినయావృతః

తత్పాదౌ సంస్కృతన్మూర్ధ్నా ప్రణామమకరోత్తదా

సాభినంద్య తమాశీర్భిర్ఘర్షగద్గదయా గీరా

 ససంభ్రమమ్ సముత్థాయ పరిష్వజత చాత్మజమ్

 సహర్షం బహుధాశీరిరభ్యనందదుభే సుషే

స తాం సంభావ్య కథయా తత్ర స్థిత్వా చిరాదివ

అనుజ్ఞాతస్తయా రాజా నిశ్చకామ తదాలయాత్

తతః సానుచరో రాజా శ్వేతవ్యజనవీజితః

పట్టణమంతట ప్రతిగృహము మహోత్సవ సమాయుక్తమైనది. వాస్తుదేవతల పూజించు నట్టి గృహ పరంపరగలదైనది. దిక్చక్రమును జయించి వచ్చిన రాజును దర్శింప వలెననెడి కుతూహలముతో పౌరజానపదులు నగరముసర్వత్ర నలంకరించిరి. అంత మంత్రులు, అంతఃపుర నివాసులు, వారకాంతాకదంబములు నగరవాసులు - అందరు వచ్చి సర్వతః సంవృతులైయుండిరి. రాజు వారందరిని కలిసికొని, ఆశీర్వాద సత్క్రియలనంది  గొప్పగొప్పజయనినాదములతో దీక్చక్రముబధిరీకృతముకోగా, నానావిధములయిన వాద్యవిశేషముల సంఘాషతో మధురమయ శబ్దములతో, నిండిన నగర ప్రజానీకమును యథాయోగము సత్కరించి సంతోషముతో నిండిన ప్రజలతోపురోత్తమమును ప్రవేశించెను. సమధుర ములయినవేదసూక్తములతో బ్రాహ్మణులభినందించిరి. సూతులచే మాగధులచే వందులచే అధికముగా రాజు సంస్తూయమానుఁడయ్యెను. నానాజన పదులు చేయు జయ శబ్దములతో కూడికొని, కరూలరవోన్మిశ్రమయిన వీణావేణుతల ధ్వనులతో కూడికొని,సంగీతమాలపించు గాయకులతో నృత్యమాచరించుగడికాజనములతో, కూడికొని, ప్రకాశించుతెల్లనిఛత్రములచే ప్రకాశించుచు, సర్వత్ర సల్లాజకుసుమోత్కరములచే కూడి కొని,, ఇంద్రుఁడు అమరావతిని ప్రవేశించు నట్లు రాజు అయోధ్యా నగరమును ప్రవేశించెను. దోషద్భక్షమాదమునుండి పవిత్రీ కరింపఁబడిన వీథులలో పవిత్రవాసనాగంధములతో, బ్రాహ్మణులుముందునడువగా రాజు నగరమధ్యమున సమలంకృతమయిన గృహముగూర్చి వెడలెను. భార్యాద్వయముతో, సంతోషముగ ఆరాజుతన యానమునుండి దిగెను. అంత హృష్ట పుష్ట జనులతో గూడియున్న తల్లి యొక్క భవనమును రాజు ప్రవేశించేను. వినయాన్వితుఁడై తల్లియొక్కపర్యంకమును సమీపించి, శిరస్సుతో తల్లిపాదములను సంస్కృశించి, రోజు ప్రణామమొనర్చెను. ఆమె ఆశీస్సులతో - హర్ష గద్దదమయిన వాక్కులతో అభినందించి, వెంటనే సంభ్రమముతోలేచి, కుమారుని కౌగిలించుకొనెను. హరానందపూర్ణమై కోడండ్ర నిద్దరపు అనేకాశీస్సులచే నభినందించెను. రాజు బహువీధకథనములతో తల్లిని గౌరవించి, చిరకాలమందుండెను. ఆమెచే అనుజ్ఞనీయబడి ఆయాలయము నుండి బయలుదేరెను. సానుచరుఁడై తెల్లని వింజామరలచే వీచబడుచు,

సురరాజ ఇవ శ్రీమాన్సభాం సమగమచ్చనైః

 సంప్రవిశ్య సభాం దీవ్యామనేకనృపసేవితామ్

నత్వా గురుజనం సర్వమాశీర్భిశ్చాభినందీతః

 సింహాసనే శుభే దివ్యౌ నిషసాద నరేశ్వరః

సంసేవ్యమానశ్చ నృపైర్నానానాజనపదేశ్వరైః

నానావిధాః కథాః కుర్వన తత్ర నృపసత్తమః

సంప్రియమాణః సుతరోమువాస సహ బంధుభిః

 ప్రతిజ్ఞాం పాలయిత్వైవం జీతదిజుండలో నృపః

అన్వతిష్ఠద్యధా న్యాయమర్థత్రయముదారధీః

స్వప్రభావజీతాశేషవైరిదీజ్మండలాధిపః

ఏకాతపత్రాం పృథివీమన్వశాసద్వృషో యథా

స్వర్యాతస్య పితుః పూర్వం పరిభావమమర్షితః

స యాం ప్రతీఙ్ఞామారూఢస్తాం సమ్యకపరిపూర్య చ

సప్తద్వీపాళినగరగ్రామాయతనమాలినీమ్

జిత్వా శత్రూనశేషేణ పాలయామాస మేదినీమ్

ఏవం గచ్ఛతి కాలే చ వసిష్ణో భగవాన్ ఋషిః

అభ్యాజగామ తం భూయో ద్రష్టుకామో జనేశ్వరమ్

తమాయాంతమతీప్రేక్ష్య మునివర్యం స సంభ్రమః

 ప్రత్యుజ్ఞగామార్ధహస్తః సహితస్తెరపైరృపః

అర్ఘ్యపాద్యాదిభిః సమ్యక్పూజయిత్వా మహామతిః

ప్రణామమకరోత్తసై గురుభక్తిసమన్వితః

ఆశీర్వర్ధయిత్వా తం వసిష్టః సగరం తరా

ఆస్యతామితి హోవాచ సహ సర్వైర్నరేశ్వరైః

 ఉపావిశత్తతో రాజా కాంచనే పరమాసనే

మునినా సమనుజ్ఞాతః సభార్యః సహ రాజభిః

 ‘ఆపవ’స్తు నృపశ్రేష్ఠముపాసీనముపహ్వరే

ఉవాచ శ్రుణ్వతాం రాజ్ఞాం శనైర్మృద్వక్షరం వచః

 వసిష్ఠ ఉవాచ :-

కుశలం నను తే రాజన్ బాహ్యేష్వాభ్యంతరేషు చ

మంత్రిష్వపత్యవర్గేషు రాజ్యే వా సకలేధునా

దిష్ట్యా చ వీజితాః సర్వే సమగ్రబలవహానాః

సురరాజయిన యింద్రునివలె శనైశ్శనైః సభకు చేరెను. అది దివ్యమయినసభ అనేకులు నృపులు సేవించుచుండిరి. ఆ సభలో ప్రవేశించి, గురుజనులకు నమస్కరించెను, వారాశీస్సులచే నభినందించిరి. అంత శుభంకరమయినది దీవ్యమయినదియునగు సింహాసనమునందు నరేశ్వరుఁ డయిన రాజు ఆసీనుఁడయ్యెను. నానా జనపదేశ్వరులచే సేవింపఁబడుచు, నానావిధములయిన కథాప్రసంగములఁజేయుచు, సంప్రియమాణుండై, బంధువులతో గూడి, నృపవర్యుఁడందుండెను. జితదిజృండలుఁడయినరాజు, తన ప్రతిజ్ఞను పరిపాలించెను. అంత ఉదారధీమంతుఁ డయినరాజు ఆచారముననుసరించి ధర్మ అర్థ కామములను అర్థత్రయముననుసరించెను. (35)తన పరాక్రమముచే శత్రుమండలిని జయించేను. షృథివీనీ ఏకాతపత్రముగా పాలించెను. విష్ణువువలె భూమినేలెను. పూర్వము తండ్రికి కలిగిన పరిభవముచే క్రుద్ధుఁడయి తనప్రతిజ్ఞను నిర్వహించెను. సప్తద్వీపాబ్దినగర గ్రామాయతన మాలిని యైన భూమిని సర్వశత్రువుల జయించి, మహీపతి పాలించెను. ఇట్లు కొంతకాలము గడచెను. “జనేశ్వరుం డయిన రాజును చూడగోరి, ఋషి సత్తముఁడు, మహర్షియునైన వసిష్ఠుడు వచ్చెను, వచ్చునట్టి ఆ మహర్షిని చూచీ, ససంభ్రముఁడై అర్ఘ్యపాద్యముల గ్రహించి, సామంతులతో కూడి నృపుండు ఎదురుగా నేతెంచి పూజించెను. గురుభక్తి సమన్వితుఁడై ఆతనికి నమస్కరించెను. సగరుని ఆశీస్సులచే వృద్ధిపొందించి, నిలుచుండియున్న ఆ రాజును సామంతులను కూర్చుండుడు - ఆసీనులగుఁడని వసిష్ణుఁడు పలికెను. అంత మునిచే ఆజ్ఞాపింపఁ బడి కాంచనమయిన పరమాసనమున భార్యాయుతుఁడై రాజు ఆసీనుఁడయ్యెను. రాజులును ఉపవిష్టులయిరి. అంత ‘ఆపవుఁడు’ వసిష్ఠుఁడు  మెల్లగా రాజులందరు వినుచుండ నిట్లనెను.

వసిష్ఠుఁడనెను :

ఓ రాజా ! బాహ్యాభ్యంతరములలో నీకు కుశలమే కదా ! మంత్రులందు, అమాత్యవర్గమునందు, రాజ్యమునందంతటనుసుఖమేకదా! అదృష్టవశమున సమగ్రబలవాహనములతో నీశత్రువులందరు నీచే జయింపఁబడిరి.

అయత్నేనైవ యుద్ధేషు భవతా రిపవో హి యత్

దిష్ట్యా రూఢప్రతిజ్ఞేన మమ మానయతా వచః

 అరయస్యక్తధర్మాణస్వయా జీవవిసర్జితాః

 తాన్విజిత్యేతరాన్ జేతుం పునర్దిగ్విజయేచ్ఛయా

 గతస్సవాహనబలసమిత్యశృణవం వచః

 జితదిజ్మండలం భూయః శ్రుత్వా త్వాం నగరస్థితమ్

ప్రీత్యామాగతోద్రష్టుమిదానీం రాజసత్తమ

జైమిని రువాచ :-

వసిష్టేనైవముక్తస్తు సగరః తాలజంఝజీత్

కృతాంజలిపుటో భూత్వా ప్రత్యువాచ మహామునిమ్

సగర ఉవాచ :-

కుశలం నను సర్వత్ర మహర్షే నాత్ర సంశయః

 కల్యాణాభిముఖాః సర్వే దేవతాశ్చమునే నిశమ్

భవాన్త్యాయతి కల్యాణం మనసా యస్య సంతతమ్

తస్య మే చోపసర్గాశ్చ సంభవంతి కథం మునే !

 భవతానుగృహీతోస్మి కృతార్థశ్చాధునా కృతః

యన్మాం ద్రష్టుమిహాయాతః స్వయమేవ భవాంగురో

యన్మహ్యమాహ భగవాన్వీపక్షవిజయాదికమ్

తత్తథానుష్ఠితం కింతు సర్వం భవదనుగ్రహాల్

 భవత్రసాదతః సర్వం మన్యే ప్రాప్తం మహీక్షితామ్

అన్యథా మమ కా శక్తిః శత్రూన్ హంతుం తథావిధాన్

అనల్పీకురుతే ఫల్యం యన్మే వ్యవసితం భవాన్

 జైమిని రువాచ :-

ఏవం సంభావితః సమ్యక్ సగరేణ మహామునిః

అభ్యనుజ్ఞాయ తం భూయః ప్రజగామ నిజాశ్రయమ్

వసిష్టే తు గతే రాజా సగరః ప్రీతమానసః

అయోధ్యాయామభివసన్ ప్రశశాసాభిలాం భువమ్

భార్యాభ్యాం సముపేతాభ్యాం రూపశీలగుణాదిభిః

అప్రయత్నముగా సులభముగా నీ శత్రువులు జయింపఁబడిరి. శపథము వహించి, నీశత్రువులచే నీ పలుకులను గౌరవించి, వారీపూర్వ ధర్మములను (అధికారములను)పరిత్యజింపచేసితివి. వారలను సజీవులనుగా విడిచితివి. వారినీ జయించీన తరువాత ఇతరులను జయించు కోరికలతో, మరల దిగ్విజయేచ్ఛవహించి నీ బలముతో వాహనములతో భూమండలమును జయింప బయలుదేరితివనీ వింటిని. ఓ రాజసత్తమ!  ఇప్పుడు నిన్ను ప్రీత్యా చూచి పోవుదమని వచ్చితిని.

 జైమిని ఇట్లు చెప్పెను.

 ఈ విధముగా వసిష్టులు చెప్పుగా, తాలజంఘుని జయించిన సగరుఁడు చేతులు జోడించి, మహామునికిట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

సగరుఁడనెను :

నీజముగా నేను సర్వత్ర కుశములగా నుంటిని. సందేహము లేదు. దేవతలందరును మాకు అనుకూలురు. ఓ మహామునీ ! మహర్షు లయిన తమరు ఎల్లప్పుడు మా కళ్యాణమునకై యభిలషింప కష్టములు ప్రమాదములు మాకెట్లు కలుగును? మీచే ననుగ్రహీతుఁడను. కృతార్థుఁడనయితిని. మీరే స్వయముగా నన్ను చూడగోరి వచ్చుటచే ధన్యుఁడను విపక్షవిజయాధికమును గూర్చి యేది మమ్ము గూర్చి మీరు వచించితిరో, ఆది యట్లు అనుష్టింపఁబడినది. సర్వము మీ యనుగ్రహ ప్రభావము. మీ ప్రసాదమువలననే సర్వము మహీక్షితులకు నగును.  లేకున్నచో అట్టి గొప్ప శత్రువులను జయించుటకు నాకు శక్తి యెక్కడిది? ఫలము అల్పమయినను మొక్క వేసిన వానికి అధికమయిన ప్రీతిని చేకూర్చును కదా !

జైమిని ఇట్లనెను :

సగరునిచే నీవిధముగా గౌరవింపఁబడి, మహర్షి వసిష్ఠుఁడు రాజునుండి సెలవుగొని, తనయాశ్రమమున కరిగెను. వసిష్ఠులు వెడలిన తరువాత ప్రీతమానసుఁడై సగరుఁడు రూపశీలగుణాన్వితభార్యాద్వితయముచే కూడికొని సమస్త ప్రపంచమును అనుశాసించెను.

బుభుజే విషయాన్రమ్యాన్యథాకామం యథాసుఖమ్

సుమతీః కేశినీ చోభే వికసద్వదనాంబుజే

 రూపౌదారగుణోపేతే పీనవృత్తపయోధరే

 నీలకుంచితకేశాధ్యే సర్వాభరణభూషితే

సర్వలక్షణసంపన్నే నవయౌవనగోచరే

ప్రియే సన్నిహితే తస్య నిత్యం ప్రియహితే రతే

స్వాచారభావశేషాదిభిర్జహ్రతుస్తన్మనోనిశమ్

 స చాపి భరణోత్కర్ష ప్రతీతాత్మా మహీపతిః

రమమాణో యథాకామం సహ తాభ్యాం పురే వసత్

అన్యేషాం భువి రాజ్ఞాం తు రాజశబ్లో న చాప్యభూత్

గుణేన చా భవత్తస్య సగరస్య మహాత్మనః

అల్ఫోలిపి ధర్మః సతతం యథా భవతి మానసే

రాజ్ఞస్తస్యార్థకామౌ తు న తథా విపులావపి

అలుబ్ధమానసోర్థం చ భేజే ధర్మమపీడయన్

తదర్ధమేవ రాజేంద్ర కామం చాపీడయంస్తయోః

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే సగరదిగ్విజయో నామైకోనపంచాశత్తమోధ్యాయః

యధాకామముగా యథాసుఖమముగా రమ్యములయిన విషయముల రాజు అనుభవించెను. అతని భార్యలు, సుమతి కేశినులు వికసద్వద నాంబుజలు. రూప ఔదార్యాది గుణములు గలవారు. పీనవృత్తపయోధరలు. నీలకుంచితకేశాన్యలు, సర్వాభరణభూషితలు. సర్వలక్షణ సంపన్నలు, నవయౌవన గోచరలు. ఆతని కాప్రియద్వయము సన్నిహితమై యుండ నీత్యము ప్రియము నందే సంగతి. వారు తమ ఆచారములచే భావములచే చేష్టాదికములచే ఎల్లప్పుడారాజుయొక్క మనస్సును గ్రహించిరి. మనస్సునందానందించి, పాలనము ఆనందదాయకము కాగా, వారితో (ఆభార్యలతో) యథా కామము ఆతఁడు రమించెను. అయోధ్యయందే వసించెను. ‘రాజు’ అను పదము ఇతర రాజులయెడ అన్వర్ధము కాదు గుణముచే సగరుని యందన్వర్థమయ్యెను. (రంజయతీతిరాజా) అల్పమైనను ధర్మము ఆతడి మనస్సు నందెట్లుండెనో, రాజునకు అర్థకామములట్లు లేవు. ఆతఁడు మనస్సు నందు అలుబ్ధుఁడు. ఆతఁడు, ధర్మమునకబాధకముగ ఐశ్వర్యము ననుభవించెను. అందుచేతనే రాజు ధర్మార్థములకు వ్యతిరిక్తముగనే కామము ననుభవించెను.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమున మధ్యమభాగమున, తృతీయ ఉపోద్ఘాతపాదమున సగరదిగ్విజయమును నలుబది తొమ్మిదవ అధ్యాయము