బ్రహ్మాండ మహా పురాణము
19 – చక్ర రాజ రథ జ్ఞేయ చక్ర రథ పర్వస్థ దేవతా నామ ప్రకాశనం
అగస్త్యఉవాచ :-
చక్రరాజరథేంద్రస్య యాః పర్వాణి సమాశ్రితాః।
దేవతా ప్రకటాభిఖ్యాస్తాసామాఖ్యాం నివేదయ॥
సంఖ్యాశ్చ తాసామఖిలా వర్ణభేదాంశ్చ శోభనాన్।
ఆయుధాని చ దివ్యానీ కథయ స్వ హయానన॥
హయగ్రీవ ఉవాచ :-
నవమం పర్వదీప్తస్య రథస్య సముపస్థితాః ।
దశ ప్రోక్తాః సిద్ధిదేవ్యస్తాసాం నామాని మచ్చృణ॥
అణిమా మహిమా చైవ లఘిమా గరిమా తథా।
ఈశితా వశీతా చైవ ప్రాప్తిః సిద్ధిశ్చ సప్తమీ॥
ప్రాకామ్యముక్తిసిద్ధేశ్చ సర్వకామాభిధా పరా।
ఏతా దేవ్యశ్చతుర్భాహ్వ్యో జపాకుసుమసన్నిభాః॥
చింతామణికపాలం చ త్రిశూలం సిద్ధికజ్జలమ్।
దధానా దయయా పూర్ణా యోగిభిశ్చ నిషేవితాః ॥
తత్ర పూర్వార్ధభాగే చ బ్రహ్మాద్య అష్ట శక్తయః।
బ్రాహ్మీమాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా॥
వారాహీ చైవ మాహేంద్రీ చాముండా చైవ సప్తమీ।
మహాలక్ష్మీష్టమీ చ ద్విభుజాః శోణవిగ్రహాః॥
కపాలముత్పలం చైవ బిభ్రాణా రక్తవాససః।
అథ వాన్యప్రకారేణ కేబిద్ధ్యానం ప్రచక్షతే॥
బ్రహ్మాదిసదృశాకారా బ్రహ్మాదిసదృశాయుధాః।
బ్రహ్మాదీనాం పరం చిహ్నం ధారయన్త్యః ప్రకీర్తితాః॥
తాసామూర్థ్వస్థానగతాం ముద్రా దేవ్యో మహాత్తరాః॥
ముద్రవీరచనాయుక్తైర్హస్తై కమలకాంతిభిః ।
దాడిమీపుష్పసంకాశాః పీతాంబరమనోహరాః॥
చతుర్భుజా భుజద్వంద్వధృతచర్మకృపాణకాః।
మదరక్త విలోలాక్ష్యస్తాసాం నామాని మచ్చృణు ॥
సర్వసంక్షోభిణీ చైవ సర్వవిద్రావిడీ తథా।
సర్వాకర్షణకృన్ముద్రా తథా సర్వవశంకరీ॥
సర్వోన్మాదనముద్రా చ యష్టిః సర్వమహాంకుశా।
సర్వఖేచరీకా ముద్రా సర్వబీజా తథా పరా॥
సర్వయోనిశ్చ నవమీ తథా సర్వత్రిఖండికా ।
సిద్ధిబ్రాహ్మ్యాదిముద్రాస్తా ఏతాః ప్రకటశక్తయః॥
భండాసురస్య సంహారం కర్తుం రక్తరథే స్థితా।
యా గుప్తాఖ్యాః పూర్వముక్తాస్త్రసాం సామాని మచ్ఛృణు॥
కామకర్షణికా చైవ బుద్ధ్యాకర్షణికా కలా।
అహంకారాకర్షిణీ చ శబ్దాకర్షణికా కలా॥
స్పర్శాకర్షణీకా నిత్యా రూపాకర్షణికా కలా।
రసాకర్షణికా నిత్యా గ్రంథాకర్షణీకా కలా॥
చిత్తాకర్షణికా నిత్యా ధైర్యాకర్షణికా కలా।
స్మృత్యాకర్షణికా నిత్యా నామాకర్షణికా కలా॥
బీజాకర్షణికా నిత్యా చాత్మాకర్షణికా కలా।
అమృతాకర్షణీ నిత్యా శరీరాకర్షిణీ కలా॥
ఏతాః షోడశ శీతాంశుకలా రూపాశ్చ శక్తయః।
అష్టమం పర్వ సంప్రాప్తా గుప్తా నామ్నా ప్రకీర్తితాః॥
విద్రుమద్రుమసంకాశా మందస్మితమనోహరా ।
చతుర్భుజాస్త్రినేత్రాశ్చ చంద్రార్కమకుటోజ్జ్వలా॥
చాపబాణౌ చర్మఖఢ్గౌ దధానా దివ్యకాంతయ।
భండాసురవధార్థాయ ప్రవృత్తాః కుంభసంభవః॥
సాయంతనజ్వలద్దీపప్రఖ్యచక్రరథస్య తు।
సప్తమే పర్వణి కృతావాసా గుప్తతరాభిధాః॥
అనజ్గమదనానజ్గమదనాతురయా సహ ।
అనజ్గలేఖా చానజ్గవేగానజ్గoకుశాపి చ॥
అనజ్గమాలింగ్య పరా ఏతా దేవ్యో జపాత్విషః।
ఇక్షుచాపం పుష్పశరాన్ పుష్పకందుకముత్పలమ్॥
బిభ్రత్యోఽదభ్రవిక్రాంతిశాలిన్యో లలితాజ్ఞయా।
భండాసురమభిక్షుద్ధాః ప్రజ్వలుత్య ఇవ స్థితాః ॥
అథ చక్రరథేంద్రస్య షష్ఠం పర్వ సమాశ్రితాః।
సర్వసంక్షోభిణీముఖ్యా సంప్రదాయాఖ్యయా యుతా:॥
వేణీకృతకచస్తోమాః సిందూరతిలకోజ్జ్వలా।
అతితీవ్రస్వభావశ్చ కాలానలసమత్విష ॥
వహ్నిబాణం వహ్నిచాపం వహ్నిరూపమనీం తథా!
వహ్నిచక్రాఖ్యఫలకం దధానా దీప్తవిగ్రహా॥
అసురేంద్రం ప్రతి క్రుద్ధాః కామభస్మసముద్భవాః।
ఆజ్ఞాశక్తయ ఏవైతా లలితాయా మహౌజసః॥
సర్వసంక్షోభిణీ చైవ సర్వవిద్రావిణీ తథా ।
సర్వాకర్షణికా శక్తిః సర్వాహ్లాదినికా తథా॥
సర్వసంమోహినీ శక్తిః సర్వస్తంభనశక్తికా।
సర్వజృంభణశక్తిశ్చ సర్వోన్మాదనశక్తికా॥
సర్వార్థసాధికా శక్తిః సర్వసంపత్తిపూరణీ।
సర్వమంత్రమయీ శక్తిః సర్వద్వంద్వక్షయంకరీ॥
ఏవం తు సంప్రదాయానాం నామాని కథితాని వై।
అథ పంచమ పర్వస్థా కుతోత్తీర్ణా ఇతి స్మృతాః॥
తాశ్చస్ఫటిక సంకాశాః పరశుం పాశమేవ।
గదాం ఘంటాం మణిం చైవ దధానా దీప్తవిగ్రహాః॥
దేవద్విషమతిక్రుద్ధా భ్రుకుటీకుటిలాననాః ।
పితాసామపి నామాని సమాకర్ణయ కుంభజ॥
సర్వసిద్ధిప్రదా దేవీ సర్వసంపత్ర్పదా తథా।
సర్వప్రియంకరీ దేవీ సర్వమంగలకారిణీ ॥
సర్వకామప్రదా దేవీ సర్వదుఃఖవిమోచనీ,।
సర్వమృత్యుప్రశమనీ సర్వవిఘ్ననివారిణీ,॥
సర్వాంగ సుందరీ దేవీ సర్వసౌభాగ్యదాయినీ।
దశైతాః కథితా దేవ్యో దయయా పూరితాశయాః॥
చక్రే తురీయపర్వస్థా ముక్తాహారసమత్విషః।
నిగర్భయోగినీ నామ్నా ప్రథితా దశకీర్తితాః।
సర్వజ్ఞా సర్వశక్తిశ్చ సర్వైశ్వర్యప్రదా తథా॥
సర్వజ్ఞానమయీ దేవీ సర్వవ్యాధివినాశినీ।
సర్వాధారస్వరూపా చ సర్వపాపహరా తథా।
సర్వానందమయీ దేవీ సర్వరక్షాస్వరూపిణీ.।
దశమీ దేవతా జ్ఞేయా సర్వేప్సితఫలప్రదా॥
ఏతాశ్చతుర్భుజా జ్ఞేయా వజ్రం శక్తిం చ మరమ్।
చక్రం చైవాభిబిభ్రాణా భండాసురవధోద్యతాః॥
అథ చక్రరథేంద్రస్య తృతీయం పర్వ సంశ్రితాః।
రహస్యయోగినీ నామ్నా ప్రఖ్యాతా వాగధీశ్వరాః॥
రక్తాశోకప్రసూనాభా బాణకార్ముకపాణయః ।
కవచచ్ఛన్నసర్వాంగ్యో వీణాపుస్తకశోభితాః॥
వశీనీ చైవ కామేశీ భోగినీ విమాలా తథా।
అరుణా చ జవిన్యాఖ్యా సర్వేశీ కాలినీ తథా॥
అష్టావేతాః స్మృతా దేవ్యో దైత్యసంహారహేతవః।
అథ చక్రరథేంద్రస్య ద్వితీయం పర్వ సంశ్రితాః ॥
చాపబాణౌ పానపాత్రం మాతులుంగం కృపాణికామ్।
తిప్రక్రిపీఠనిలయా అష్టబాహుసమన్వితా॥
ఫలకం నాగపాశం చ ఘంటాం చైవ మహాధ్వనిమ్।
బిభ్రాణా మదిరామత్తా అతీగుప్తరహస్యకాః. ॥
కామేశీ చైవ వజ్రేశీ భగమాలిన్యథాపరా।
తిస్ర ఏతాః స్మృతా దేవ్యో భండే కోపసమన్వితా॥
లలితాసమమహాత్మ్యా లలితాసమతేజసః।
ఏతాస్తు నిత్యం శ్రీదేవ్యా అంతరజ్గాః ప్రకీర్తితా ॥
అథానఛమహాపీడే రథమధ్యమపర్వణి పరితో రచితా।
వాసాః ప్రోక్తాః పంచదశాక్షరాః ॥
తిథినిత్యాః కాలరూపాః విశ్వం వ్యాజ్యెవ సంస్థితాః ।
భండాసురాదిదైత్యేషు ప్రక్షుబ్ధభ్రకుటీతటాః॥
దేవీసమనిజాకారా దేవీసమనిజాయధావి।
జగతాముపకారాయ వర్తమానా యుగే యుగే॥
తాసాం నామానీ మత్తస్త్వమవధారయ కుంభజ।
కామేశీ భగమాలా చ నిత్యక్లిన్నా తథైవ చ॥
భేరుండా వహ్నివాసిన్యో మహావజ్రేశ్వరీ తథా।
దతీ చ త్వరీతా దేవీ నవమీ కులసుందరీ॥
నిత్యా నీలపతాకా చ విజయా సర్వమంగలా।
జ్వాలామాలినికా చిత్రే దశ పంచ చ కీర్తితాః॥
ఏతాభిః సవితా దేవీ సదా సేవైకబుద్ధిభిః।
దుష్టం భండాసురం జేతుం నిర్యయౌ పరమేశ్వరీ॥
శ్రీ బ్రహ్మాండ మహాపురాణమున ఉత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున శ్రీ చక్రరాజరథ జేయచక్రరథ పర్వతస్థదేవతలను పందొమ్మిదవ యధ్యాయము॥
ఆగస్త్యుడనెను: చక్రరాజరథేంద్రము యొక్క పర్వములనాశ్రయించిన ప్రసిద్ధ దేవతల పేరులను జెప్పుము-1, ఓహయగ్రీవా! వారి సమస్త సంఖ్యలను, శోభనములైన వర్ణభేదములను వారి దివ్యాయుధములను జెప్పుము-2 హయగ్రీవుడనెను. దీప్తమైన (ప్రకాశించిన) యారథము యొక్క తొమ్మిదవ పర్వమును (అంతస్తును) ఆశ్రయించియున్నదేవతలు పదిమంది సిద్ధిదేవులు (దేవతా స్త్రీలు) నావల్ల వారి నామముల వినుము-3. అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ఈశిత, వశీత, ప్రాప్తి సిద్ధి-4. ప్రాకామ్యముక్తి సిద్ధి. తరువాతిది సర్వకామాభిధ. ఈ స్త్రీ దేవతలు నాలుగు బాహువులు గలవోరు. జపాకుసుమము వలె ఎఱ్ఱనైనవారు-5. చింతామణిని, కపాలమును, త్రిశూలమును, సిద్దికజ్జలమును నాలుగు చేతులలో ధరింతురు. దయతో నిండిన వారు. యోగులతో సేవింపబడినవారు-6. అచట పూర్వార్ధ భోగమున (మొదట సగభాగమున) బ్రహ్మాది (బ్రాహ్మాది) అష్టశక్తులుందురు వారు. బ్రాహ్మీ మహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మహేంద్రీ, చాముండా (ఏడవది)-7. ఎనిమిదవది మహాలక్ష్మి వీరందరును రెండు భుజములు గలవారు. ఎఱ్ఱని యాకారముగలవారు పుట్టెను, కలువను, ధరించినవారు. ఎఱ్ఱని చీర గట్టినవారు-రీ. లేదా! కొందరు వేరొక విధముగా వీరీ ధ్యానమును జెప్పుదురు. బ్రహ్మాదుల బోలిన యాకారములు గలవారు-9. బ్రహ్మాదుల పరమచిహ్నమును ధరించువారినిగా నీప్రీదేవతలను జెప్పుదురు. వారి యొక్క శిరసానముననున్న స్త్రీ దేవతలు మీక్కిలి గోప్పవారు-10. ముద్రా విరచనలతో గూడి కమలకాంతిగల చేతులతో, దానిమ్మపలకాంతిగలిగి పీతాంబరములతోను మనోహరలు-11, నాలుగు భుజములు గలవారు రెండుభుజములలో చర్మమును ఖడ్గమును ధరించినవారు మదముచే నేరుపెక్కివీలోలములైన కన్నులు గలవారు. వారి నామములనానుండి వినుము-12. సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షణకన్ముద్రా {అందరినాకర్షించు ముద్రలు జుషగలది). సర్వవశంకరీ-13. సర్వోన్మాదనముద్రా (సర్వులనున్మత్తులగా జేయుముద్రల జూపగలది). యష్టి కట్టేవలైసన్నగా నున్నది), సర్వమహాంకుశా, సర్వఖేచరికాముద్రా, సర్వబీజా, సర్వయోని (తొమ్మిదవది), సర్వత్రిఖండికా, సిద్దిబ్రహ్యాది ముద్రలుగలవారు. ఈ వీరందరు ప్రకటశక్తులు. (ప్రకటించుకొన్న శక్తులు)-15, భండాసుర సంహారము జేయుటకు రక్తరథమున నున్నవారు, పూర్వము చెప్పబడిన గుప్తనామముగలవారి నామములను వినుము-16, కామాకర్షణీకయైన కళ, బుద్ధ్యాకరణీకయైనకళ, అహంకారాకర్షిణికాకళ, శబ్దాకర్షణీకాకళ, గంధాకర్షణీకాకళ-18, చిత్తాకర్షణీకాకళ, ధైర్యాకర్షణీకాకళ, స్మృత్యార్షణీకాకళ, నామాకర్షణికాకళ-19. బీజాకర్షణికా కళ, ఆత్మాకర్షణీకాకళ, అమృతాకర్షణీ కళ, శరీరాకర్షణీకళ-20. ఇవీ పదునారు. చంద్రకలా రూపమైన శక్తులు (వీరందరూ నిత్యలు) అష్టమ పర్వమును జేరి దాగియున్న శక్తులు పేరుతో జెప్పబడిరి-21. పగడపు చెట్టు బోలినవారు (ఎఱ్ఱనీ వారు) చిరునవ్వుతో మనమును హరించువారు. నాలుగు భుజములు గలవారు మూడుకన్నులు గలవారు, చంద్రసూర్యులు కిరీటమున బ్రకాశించువారు-22. ధనువులు, బోణములు, చర్మము, ఖడ్గము వీనిని నాలుగు భుజములలో ధరించువారు. దీవ్యమైన కాంతిగలవారు. ఓయగస్త్యా! వీరుభండాసురవధకై పూనినవారు-23. సాయంకాలమున మండుచున్న (వెలుగుచున్న) దీపముతో. సమానముగానున్న చక్రరథముయొక్కయేడవ పర్వమున నుండి మిక్కిలి రహస్యముగానున్న పేరులుగలవారు-24 అనంగమదనా, అనంగమదనాతురా, అనంగలేభా, అనంగవేగా, అనంగాంకుశా-25. అనగాలింగనపరా- ఈ స్త్రీ దేవతలందరు జపాకుసుమము వలె నెల్లనైనవారు. వీరు చెళకువింటినీ, పుష్పబాణములను, పూలచెండును, కలువపూవును-26. ధరించుచున్న వారై మహాపరాక్రమశాలీనులై లలితా దేవీ యాజ్ఞచే భండాసురినీపై కోపించి మండుచున్నవారి వలెనున్నారు-27. ఆ తరువాత చక్రరథశ్రేష్ఠము యొక్క ఆరవ పర్వమునాశ్రయించినవారు సర్వసంక్షోభిణీ మొదలైన వారు సంప్రదాయ నామముతో గూడినవారు-28. తలవెంట్రుకల నన్నంటిని జడలుగానల్లుకోన్నవారు. సిందూర తిలకముతో నుజ్జ్వలముగా నున్నవారు. మిక్కిలి తీవ్రమైన స్వభావము గలవారు కాలాన్నీ బోలుకొంతులు గలవారు-29. అగ్నిబాణమును, అగ్నీధనువును, అగ్నిరూపమైన ఖడ్గమును అగ్నిచక్రమను ఫలకము (డాలు)ను, ధరించుచున్నవారు. మండుచున్నయగ్నులవంటి యాకారములుగలవారు-30. రాక్షసేంద్రుడైన భండాసురునిపై కోపించినవారు. కాముని భస్మనుండి బుట్టినవారు-వీరు లలితాపరమేశ్వరీయొక్క మహాతేజస్వినులైన శక్తులు-81. సర్వసంక్షోభిణీ శక్తి, సర్వవిద్రావీణీశక్తి, సర్వాకర్షణికా శక్తి, సర్వావోదనికా శక్తి-82. సర్వసంమోహినీ శక్తి, సర్వస్తంభనశక్తి, సర్వజృంభణశక్తి, సర్వోన్మాదనశక్తి-33, సర్వద్వంద్వక్షయంకరీ శక్తి,-34, ఈ విధముగా సంప్రదాయ శక్తి నామములు చెప్పబడినవి. ఆ తరువాత ఐదవ పర్వముననున్న శక్తులు “కులోత్తీర్ణలు” అనుబడిరి-35. వారు స్పటికమువలె నిర్మలకాంతిగలవారు పరశువును, పాశమును, గదను, ఘంటను, మణిని, ధరించినవారు. కాంతితో వెలిగిన విగ్రహములు గలవారు-36, దేవద్వేషియైన భండాసురునిపై మిక్కిలికోపించి కుటిలముగానున్న కనుబొమ్మలుగల ముఖములుగలవారు.ఓ యగస్త్యా! వీరి నామములను గూడ వినుము-37. సర్వసిద్దప్రదాదేవి, సర్వసంపత్ర్పదోదేవి, సర్వప్రియంకరాదేవి, సర్వమంగళకారిణీదేవి-38. సర్వకామ ప్రదాదేవి, సర్వదుఃఖవిమోచనీదేవి-39 సర్వమృత్యుప్రశమనీదేవి, సర్వవిఘ్ననివారిణీదేవీ, సర్వాంగసుందరీదేవి, సర్వసాభాగ్యదాయినీదేవి-40. ఈ పదుగురు స్త్రీ దేవులు. దయతోనిండిన యాశయములుగలవారు. చక్రమున నాలుగవ పర్వమున నున్నవారు ముత్యాలహారములపంటి కాంతులు గలవారు-41. నిగర్భయోగినీ నామముతో ప్రసిద్ధులైనవారు పదుగురనబడినారు. సర్వజ్ఞాదేవి సర్వశక్తిదేవి, సర్వైశ్యర్యప్రదాదేవి-42. సర్వసర్వజ్ఞానమయీదేవి, సర్వవ్యాధివినాశినీదేవి, సర్వాధారస్వరూపాదేవి, సర్వపాపహరాదేవి-43. సర్వానందమయాదేవి, సర్వరక్షాస్వరూపిణీ దేవి, పదవదేవత సర్వేప్సిత ఫలప్రదాయినియని తెలియవలె-44. వీరు నాలుగుభజములు గలవారు, వజ్రమును, శక్తిని, తోమరమును, చక్రమును సాలుగుభుజములలో ధరించినవారు, భండాసురుని వధింపబయలుదేరిన వారు-45, ఆ తరువాత చక్రరథష్టము యొక్క మూడవ పర్వమునాశ్రయించిన వారు రహస్య యోగినీ నామముతో ప్రసిద్ధలు. వాగధీశ్వరులు-46. రక్తాశోకపుష్పముల వంటి కాంతి గలవారు. బాణములు, ధనువులును చేతులందుగలవారు, సర్వాంగములను కవచములతో గప్పికొన్నపోరు. వీణా-పుస్తకములు ధరించి ప్రకాశించుపొరు-47. వశీని, కామేశ, భోగినీ, విమలా, అరుణా, జవినీ, సర్వేశీ, కాలినీ-48. ఈ యెనమండుగురు రాక్షస సంహారకారణలైన స్త్రీదేవులనబడిరి, ఆ తరువాత చక్రరథశ్రేష్ఠము యొక్క రెండవ పర్వమునాశ్రయించినవారు-49. ధనుర్బాణములను పానపాత్రమును మాదీఫలమును, ఖడ్గమును ధరించినవారు. ముగ్గురు మూడు పీఠములపై గూర్చున్నవారు. ఎనిమిది బాహువులుగలవారు-50. ఫలకమును(డాలు) సాగపాశమును మహాధ్వనిగల ఘంటసు, ధరించినవారు, మదిరచే మత్తెక్కిన వారు, మిక్కిలిదాచిపెట్టబడిన రహస్యముగలవారు-51, కామేశీ, వజేశీ, భగమాలనీ, ఈ మువ్వురు భండాసురునిపై కోపముగలిగిన స్త్రీ దేవులు-52. లలితా దేవితో సమానమైన మహాత్మ్యముగలవారు. లలితా దేవితో సమానమైన తేజముగలవారు. వీరు నిత్యము శ్రీదేవికి అంతరంగులుగా బిలువబడిరి-5. ఆ తరువాత ఆనందమహాపీఠమున రథమధ్యమ పర్వమున నంతటను ఆవాసము నేర్పరచుకోన్నవారు, పంచదశాక్షరులుగా జెప్పబడిరీ-54. తీథులందు నీత్యస్వరూపలు. కాలస్వరూపలై విశ్వమంతయు పోషించియున్నోరు. భండాసురాధీ రాక్షసుల విషయమై కోపముతో మిక్కిలి క్షోభనుజెందిన కనుబొమ్మలు గలవారు-55. లలితాదేవితో సమానమైన నిజాకారములుగలవారు. ఆమెతో సమానమైన తమయాయుధములు గలవారు, ప్రతియుగమున జగములకుపకారముజేయుటకే (యిచట) ఉంటున్నవారు-56. ఓయగస్త్యా! వారిపేరులను సానుండి వినుము, కామేశీ, భగమాలా, నిత్యక్లిన్నా-57: భేరుండా, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, దతీ త్వరితా, కులసుందరీ (తొమ్మిదవది)-58. నిత్యా, నీలపతాకా, విజయా, సర్వమంగలా, జ్వాలామాలినికా, చిత్రా-అని పదియైదుగురు-59, ఎల్లప్పుడు సేవైకతత్పరటైన యీ దేవతలతో గూడిన లలితా పరమేశ్వరి భండాసురుని జయించుటకు బయలుదేరినది-60.
మంత్రినాథా మహాచక్రే గీతిం చక్రే రథోత్తమే।
సప్తపర్వాణి చోక్షాని తత్ర దేవ్యశ్చ తాః శృణు॥
గేయచక్రరథేపర్వమధ్యపీఠనికేతనా ।
సంగీతయోగినీ ప్రోక్తా శ్రీదేవ్యా అతివల్లభా॥
తదేవ ప్రథమం పర్వ మంత్రిణ్యాస్తు నివాసభూః।
అథ ద్వితీయపర్వస్థా గేయచక్రే రథోత్తమే ॥
రతిః ప్రీతిర్మనోజా చ వీణాకార్ముకపాణయ: ।
తమాలశ్యామలాకారా దానవోన్మూలనక్షమాః॥
తృతీయపర్వసంరూడా మనోభూబోణదేవతా।
ద్రావిణీ శోషిణీ చైవ బంధినీ మోహినీ తథా॥
ఉన్మాదినీతి పంచెతో దీప్తకార్ముక పాణయః ।
తత్ర పర్వణ్యధస్తాత్తు వర్తమానా మహౌజస॥
కామరాజశ్చ కందర్పో మన్మథో మకరధ్వజః।
మనోభవః పంచమః స్యాదేశే త్రైలోక్యమోహనాః॥
కస్తూరీతిలకోల్లాసి (మా)లాముక్తావిరాజితాః ।
కవచచ్ఛన్నసర్వాంగాః పశప్రసవత్విష॥
పంచకమా ఇమే ప్రోక్తా భండాసురవధార్థినః।
గేయచక్రరథేంద్రస్య చతుర్థం పర్వ సంశ్రితాః॥
బ్రాహ్మీముఖ్యాస్తు పూర్వోక్తా శ్చండికా త్వష్టమి పరాః।
తత్ర పర్వణ్యధస్తాచ్చ లక్ష్మీశ్చైవ సరస్వతీ ॥
రతి: ప్రీతిః కీర్తిశాంతీ పుష్టిస్తుష్టిశ్చ శక్తయః ।
ఏతాశ్చ క్రోధరక్తాక్ష్యో దైత్యం హంతుం మహాబలమ్॥
కుంతచక్రధరాః ప్రోక్తాః కుమార్యః కుంభసంభవ।
పంచమం పర్వ సంప్రాప్తా వామాద్యాః ఫోడశాపరాః॥
గీతిం చక్రూరధేంద్రస్య తాసాం నామాని మచ్ఛృణుః ।
వామా జ్యేష్ఠా చ రౌద్రీచ శాంతిః శ్రద్దా సరస్వతీ ॥
శ్రీభూశక్తిశ్చ లక్ష్మీశ్చ సృష్టిశ్చైవ తు మోహినీ।
తథా ప్రమాథినీ చౌశ్వసినీ వీచిస్తథైవ చ॥
విద్యున్మాలిన్యథ సురానందాథో నాగబుద్ధికా।
ఏతాస్తు కురవిందాభా జగత్ క్ష్యోభణలంపటాః॥
మహాసరస మన్నాహమాదధానాః పదేపదేశ్ ।
వజ్రకంకటసంఛన్నా అట్టహాసోజ్జ్వలాః పరే:॥
వజ్రదండౌ శతఘ్నీం చ సంబిభ్రాణా భుశుండికాః॥
అథ గీతికథేంద్రస్య షష్ఠం పర్వ సమాశ్రితాః।
అసితాంగప్రభృతయో భైరవాః శస్త్రభీషణాః॥
త్రిశిఖం పానపాత్రం చ బిభ్రాణా నీలవర్చసః।
అసితాంగో రురుశ్చండః క్రోధ ఉన్మత్త భైరవః॥
కపాలీ భీషణశ్చైవ సంహారశ్చాష్టభైరవాః ।
అథగీతి రథేంద్రస్య సప్తమం పర్వ సంశ్రితా:॥
మాతంగీ సిద్ధలక్ష్మీశ్చ మహామాతంగీకాపీ చ।
మహతీ సిద్ధలక్ష్మీశ్చ శోణా బాణధనుర్ధరా॥
తస్యైవ పర్వణోఽధస్తాద్గణపః క్షేత్రపస్తథా।
దుర్గాంబా బటుకశ్చైవ సర్వే తే శస్త్రపాణయః॥
తత్రైవ పర్వణోఽధస్తాలక్ష్మీ శ్చైవ సరస్వతీ! శంఖః ।
పద్మో నిధిశ్చైవ తే సర్వే శస్త్రపాణయః॥
లోకద్వీషం ప్రతి క్రుద్ధా భండం చండపరాక్రమమ్.।
శక్రాదయశ్చ విష్ణ్వంతా దశ దిక్చక్రనాయకాః॥
శక్తిరూపాస్తత్ర పర్వణ్యధస్తాత్కృతసంశ్రయా:।
వజ్రే శక్తిం కాలదండమసిం పాశం ధ్వజం తథా॥
గదాం త్రిశూలం దర్భాస్త్రం వజ్రం చ దధతస్త్వమీ।
సేవంతే మంత్రినాథాం తాం నిత్యం భక్తి సమన్వితాః॥
భండాసురాన్ దుర్గురూడాన్నిహంతుం విశ్వకంటకాన్ ।
మంత్రినాథాశ్రయద్వారా లలితాజ్ఞాపనోత్సుకాః॥
గీతిచక్రరథోపాంతే దిక్పాలా: సంశ్రయం దదు: ।
సర్వేషాం చైవ దేవానాం మంత్రిణీ ద్వారతః కృతా ॥
విజ్ఞాపనా మహాదేవ్యా కార్యసిద్ధిం ప్రయచ్ఛతి,।
రాక్షీ విజ్ఞాపనా చేతి ప్రధానద్వారతః కృతా॥
యథా ఖలు ఫలప్రాప్తి: సేవకానాం హి జాయతే।
అన్యథా కథమేతేషాం సామర్థ్యం జ్వలితౌజసః॥
అప్రధృష్యప్రభావాయాః శ్రీ దేవ్యా ఉపసర్పణే ।
సాహి సంగీతవిద్యేతి శ్రీదేవ్యా అతివల్లభా॥
నాతిలంఘతి చ క్వాపి తదుక్తం కార్యసిద్ధిషు।
శ్రీదేవ్యాః శక్తిసామ్రాజ్యే సర్వకార్యాణి మంత్రిణీ॥
అకర్తుమన్యథాకర్తుం కర్తుం చైవ ప్రగల్భతే ।
తస్మాత్సర్వేపి దిక్పాలాః శ్రీదేవ్యా జయకాంక్షిణః॥
తస్యాః ప్రధానభూతాయాః సేవామేవ వితన్వతే॥
ఇతి శ్రీలలితాదేవ్యాశ్చక్రరాజరథోత్తమే।
పర్వస్థితానాం దేవీనాం నామాని కధీతాన్యలమ్॥
భండాసురస్య సంహారే తస్యా దివ్యాయుధాన్యపి।
ప్రోక్తాని గేయచక్రస్య పర్వదేవ్యశ్చ కీర్తితాః, ॥
ఇమాని సర్వదేవీనాం నామాన్యాకర్ణయంతి యే।
సర్వపాపవినిర్ముక్తాస్తే స్యుర్విజయినో నరాః॥
ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానే
శ్రీచక్రరాజరథజ్ఞే (గే)యచక్రరథపర్వస్థదేవతానామప్రకాశనం నామైకోనవింశోఽధ్యాయః॥
మహాచక్రరథోత్తమమున మంత్రినాథ గానమును జేసినది. అచట దేవి యొక్క సప్తద్వారములు చెప్పబడినవి. వానిని వినుము-61. గేయ చక్ర రథమున పర్వమధ్యనున్న పీఠమును నివాసముగా జేసికొన్నది సంగీతయోగిని యనబడినది. ఆమె శ్రీ దేవికి అతిప్రియురాలు.-62. అదే మొదటి పర్వము. మంత్రిణికి నివాసస్థానము. ఇక గేయచక్రరథశ్రేష్ఠమున రెండవ పర్వముననున్నవారు. రతీ, ప్రీతి, మనోజ వీరు వీణను ధనువును చేతులలో ధరించినవారు. కానుగ చెట్టు వలె నల్లనియాకారములు గలవారు, రాక్షసులను న్మీలించుటకు సమర్థలు-64. మూడవ పర్వముననున్నవారు. మన్మథబాణ దేవతలు. ద్రావిణీ, శోషిణీ, బంధినీ, మోహినీ-65, ఐదవది ఉన్మాదినీ వీరు వెలుగుచున్న ధనువును చేత ధరించినవారు. అచటి పర్వమున క్రిందుగా నున్నవారు. మహాతేజములుగలవారును-66, కామరాజు, కందర్పుడు, మన్మథుడు, మకరధ్వజుడు ఐదవవాడు మనోభవుడు. వీరు త్రైలోక్యమోహనులు-67. ముల్లోకములలో తిలకాయమానముగా (శ్రేష్ఠముగా) నున్న మాలలతోడి ముత్యములతో ప్రకాశించినవారు, శరీరమంతయు కవచమును గప్పికొన్నవారు, మోదుగు పూవు కాంతిగలవారు-68. వీరిని పంచకాములందురు. భండాసురుని వధింపగోరుదురు. ఇక గేయచక్రరథ శ్రేష్ఠము నాశ్రయించిన వారు-69. బ్రాహ్మీ మొదలగు పూర్వము చెప్పబడినవారు. ఎనిమిదవయామె చండిక శ్రేష్టమైనది. అచటి పర్వమున క్రిందుగా లక్ష్మీ, సరస్వతీ (20) రతి, ప్రీతి, కీర్తి, శాంతి, పుష్టి, తుష్టి - అనుశక్తులు, వీరు కోపమున నెఱ్ఱనైన కన్నులు గలవారు. ఓయగస్త్యా మహా బలుడైన భండాసురుని జంపుటకు-71. బల్లెములను చక్రములను ధరించిన కుమారికలు (కన్యలుగా చెప్పబడినారు. ఇక ఐదవ పర్వమును జేరిన “వామా” మొదలగు పదునారుగురు మరొకవారు-72. వారు రథశ్రేష్టమునకు గీతమును జేసిరి. వారి నామములను నా నుండి వినుము. వామా, జ్యేషా, రౌద్రీ, శాంతి, శ్రద్దా, సరస్వతీ-73. శ్రీభూశక్తి, లక్ష్మీ, సృష్టి, మోహినీ, ప్రమాథినీ, ఆశ్వసినీ, వీచి-74. విద్యున్మాలిని, సురానందో, నాగ బద్దీకా వీరు తుంగముస్తల రంగుగలవారు. జగమును క్షోభింపజేయుటలో నిమగ్నలు-75. అడుగడుగునను మహా సరసమైన అన్నాహమును (ఖాద్యవి శేషమును) తీసికొనువారు. వజ్రకవచముచే కప్పబడినవారు. కొందరు పెద్ద పెద్ద నవ్వులతో గొప్పగా నొప్పినవారు. వజ్ర దండములను, శతఘ్నిని (నూరుగురనుజంపునాయుధము) -భుశుండికలను (ఆయుధ విశేషము) ధరించినవారు-76. ఇక, గేయచక్రరథ శ్రేష్ఠముయొక్క యావ పర్వము నాశ్రయించినవారు- అసితాంగుడు మొదలగు భైరవులు. వారు శస్త్రములచే భయంకరులు-77. త్రిశీఖమును (త్రిశూలమును) పాన పాత్రమును, ధరించినవారు. నీలకాంతి గలవారు. అసితాంగుడు, రురుడు, చండుడు, క్రోధుడు, ఉన్మత్త భైరవుడు-78. కపాలీ, భీషణుడు, సంహారుడు - అని యేనమండుగురు భైరవులు. ఇక, గేయచక్రరథ శ్రేష్ఠము యొక్క యేడవ పర్వము నాశ్రయించిన వారు-79. మాతంగీ, సిద్ధలక్ష్మీ, మహామాతంగీకా, మహతీ సిద్ధలక్ష్మీ, శోణా - వీరు బాణ ధనుర్ధరలు-80. ఆ పర్వము యొక్క క్రిందనే గణపుడు, క్షేత్రపుడు, దుర్గాంబ, బటుకుడు నుందురు. వీరందరు శస్త్ర పాణులు.-61. అచటీ పర్వము యొక్క . క్రిందనే లక్ష్మి, సరస్వతియు, శంఖుడు, పద్ముడు, నిధియును. ఉందురు. వీరందరు శస్త్రములు చేతగలవారు-82. లోకద్వేషియైన భండాసురునిపై కోపము గలవారు. ఇంద్రుడు మొదలు విష్ణువు వరకు గల దేవతలు పది దీక్కులయధిపతులు-83. శక్తి రూపులై అచటి పర్వము క్రింద నాశ్రయమునందినవారు. వజ్రము నందలి శక్తిని, కాలదండమును, ఖడ్గమును, పాశమును, ధ్వజమును-64. గదను, త్రిశూలమును, దర్భాస్త్రమును, వజ్రమును వీరు ధరింతురు. నిత్యము భక్తి సమన్వితలై మంత్రినాథను సేవింతురు-85. వీరు మిక్కిలి { దౌష్ట్యమును వహించి విశ్వకంటకులైన భండాసురులను జంపుటకు మంత్రి నాథాశ్రయముద్వారా లబితా పరమేశ్వరికి జ్ఞాపకము చేయుటలో మిక్కిలి యుత్సాహపడుచున్నవారు.-66. గేయ చక్ర రథ సమీపమున దీక్పాలురు ఆశ్రయమునిచ్చిరి. సర్వ దేవతలకును మంత్రిణి ద్వారముగా జేయబడినది-67. మంత్రిణి ద్వారా మహాదేవికి జేసిన దేవతల విజ్ఞాపనము కార్య సిద్ధినిచ్చును. సేవకులు తమ రక్ష కొఱకై ప్రధాన ద్వారమున చేసిన విజ్ఞాపన సఫలమగును. అట్లే మంత్రిణి ద్వారమున జేసిన తమ రక్షకొకైన విజ్ఞాపన కార్యసిద్ధిని బొంది సఫలమగును. అట్లుగానిచో ప్రజ్వలితతేజస్కుడై తిరస్కరింపరాని ప్రభావముగల శ్రీదేవి యొక్క సమిపము జేరుటకు దేవతలకు సామర్థ్యమెక్కడిది? ఆమె మంత్రిణీ) సంగీత విద్య. కావున శ్రీదేవికి అతి ప్రియురాలు-87-90. ఆమె చెప్పినది కార్యసిద్ధిలో నెక్కడను ఉల్లంఘింపబడదు. శ్రీదేవి యొక్క శక్తి సామ్రాజ్యమున సమస్త కార్యములు మంత్రిడియే-91. ఒక కార్యమును జేయుటకును, చేయమికిని, వేరొక తీరుగా జేయుటకును మంత్రిణి సమర్గురాలు. కావున సర్వదిక్పాలురు శ్రీదేవి యొక్క జయమును గోరువారై ఆమెకు ప్రధాన భూతురాలైన మంత్రిని సేవింతురు.-92. ఈ విధముగా శ్రీ లలితా దేవి యొక్క చక్రరాజరథ శ్రేష్ఠమున పర్వములలో నున్న స్త్రీ దేవతలయొక్క నామములు చెప్పబడినవి-95. భండాసురుని సంహారమున నామె యొక్క దివ్యాయుధములు చెప్పబడినవి. గేయ చక్రముయొక్క పర్వదేవతలు గూడ చెప్పబడిరీ-94. ఈ సర్వ స్త్రీ దేవుల యొక్క నామములు విన్ననరులు సర్వపాప వినిర్ముక్తులై విజయులగుదురు -95.
ఇది శ్రీ బ్రహ్మాండ మహా పురాణముననుత్తర భాగమున హయగ్రీవాస్యసంవాదమున లలితోపాఖ్యానమున శ్రీ చక్రరాజరథ జేయ చక్రరథపర్వస్టదేవతానామప్రకాశనమను పందొమ్మిదవయధ్యాయము.
Summary of chapter 131 of the Brahmānda Mahā Purana is as follows:
In rapid succession, this chapter details the total annihilation of five prominent demon commanders who mounted a coordinated assault on the Sakti army. It describes the precise and formidable response of the divine mother's commanders, who neutralized the enemy's dark illusions with radiant weapons of truth. The faithful reader contemplates the triumph of spiritual clarity, offering prayers of gratitude to the supreme mother for dispelling darkness.