బ్రహ్మాండ మహా పురాణము
23 - కురండాదిపంచసేనాపతివధో
అథాశ్వారూఢయాక్షిస్తే కురండే భండదానవః।
కుటిలాక్షమిదం ప్రోచే పునరేవ యుయుత్సయా॥
స్వప్నేపి యన్న సంభావ్యం యన్న శ్రుతమితః పురా ।
యచ్చ నో శంకితం చితే తదేత త్కష్టమాగతమ్॥
కురండదుర్మదౌ సత్త్వశాలినౌ భ్రాతరౌ హితా।
దుష్టదాస్యాః ప్రభావోఽయం మాయావిన్యా మహత్తరః॥
ఇతః పరం కరంకాదీన్ పంచ సేనాధినాయకాన్।
శతమక్షౌహిణీనాం చ ప్రస్తాపయ రణాంగణే॥
తే యుద్ధదుర్మదాః శూరాః సంగ్రామేషు తనుత్యజః।
సర్వథైవ విజేష్యంతే దుర్విదగ్ధవిలాసినీమ్॥
ఇతి భండవచః శ్రుత్వా భృశం చ త్వరయాన్వితః।
కుటిలాక్షః కరంకాదీనాబుహావ చమూపతీన్॥
తే స్వామినం నమస్కృత్య కుటిలాక్షేణ దేశితాః।
అగ్నౌ ప్రవీష్ణవ ఇవ క్రోధాంధాః నిర్యయుః పురాత్॥
తేషాం ప్రయాణనిఃసాణరణితం భృశదుఃసహమ్।
అకర్ణ్య దిగ్గజాస్తూర్ణం శీర్ణకర్ణా జుఘూర్ణిరే॥
శతమక్షౌహిణీనాం చ ప్రాచలత్కేతుమాలకమ్।
ఉత్తరంగతురంగాది బభౌ మత్తమతంగజమ్।
హ్రేషమాణహయాకీర్ణం క్రందద్భటకులోద్భమ్।
బృహమాణగజం గర్ణద్రధచక్రం చచాల తత్॥
చక్రనేమిహతక్షోణీరేణుక్షపితరోచిషా ।
బభూవే తుహినాసారచ్ఛన్నేనేవ వివస్వతా॥ ధూలీమయమివాశేషమభవద్విశ్వమండలమ్।
క్వచిచ్ఛబ్ధమయం చైవ నిఃసాణకఠినస్వనైః॥
ఉద్భూతైర్దూలికాజాలైరాక్రాంత దైత్యసైనికాః।
ఇయత్తయాతః నేనాయాః సంఖ్యాపి పరిభావితా॥
ధ్వజా బహువిధాకారా మీనవ్యాలాదిచిత్రితాః।
ప్రచేలుర్థూలికాజాలే మత్స్యా ఇవ మహోదధో॥
తానాపాతత ఆలోక్య లలితా సైనికం ప్రతి ।
విత్రేసురమరాః సర్వే శక్తీనాం భంగశంకయా॥
తే కరేజ్క ముఖాః పంచ సేనాపతయ ఉద్ధతాః।
సర్పీణీం నామ సమరే మాయాం చక్రుర్మహీయసీమ్॥
తైః సముత్పతితా దుష్టా సర్పిణీ రణశాంబరీ।
ధూమ్రవర్ణా చ ధూమ్రోష్టీ ధూమ్రవర్ణపయోధరా॥
మహోదధిరివాత్యంతం గంభీరకుహరోదరీ ।
పురశ్చచాల శక్తీనాం త్రాసయంతీ మనో రణే॥
కద్రూరివాపరా దుష్టా బహుసర్పవిభూషణా।
సర్పాణాముద్భవస్థానం మాయామయశరీరిణామ్॥
సేనాపతీనాం నాసీరే వేల్లయంతీ మహీతలే।
వేల్లితం బహుధా చక్రే ఘోరారావవిరావిణీ॥
తథైవ మాయయా పూర్వం తేఽసురేంద్ర వ్యజీజయన్ ।
కరంకాద్యా దురాత్మానః పంచ పంచశ్వకాముకాః॥
అథప్రవవృతే యుద్ధం శక్తీనామమరద్రుహామ్।
అన్యోన్యవీరభాషాభిః ప్రోత్సాహితఘనక్రుధామ॥
అత్యంతసంకులతయా న విజ్ఞాతపరస్పరాః।
శక్తయో దానవాశ్చైవ ప్రజహ్రుః శాస్త్రపాణయః॥
అన్యోన్యశస్త్రసంఘట్టసముత్థిత హుతాశనే।
ప్రవృత్తవిశీఖస్రోతః ప్రచ్ఛన్నహరిదంతరే॥
బహురక్తనదీపూర హ్రియమాణమతంగజే ।
మాంసకర్దమనిర్మగ్ననిష్పందరథమండలే॥
వికీర్ణకేశశైవాలవిలసద్రక్తనిర్ఘరే।
అతినిష్ఠురవిధ్వంసిసింహనాదభయంకరే॥
రజోంధకారతుములే రాక్షసీతృప్తిదాయినీ।
శస్త్రీశరణి(ణ) విచ్చిన్న దైత్యకంఠోత్థి తాసృజీ॥
ప్రవృత్తే ఘోరసంగ్రామే శక్తీనాం చ సురద్విషామ్।
అథ స్వబలమాదాయ పంచభిః ప్రేరితా సతీ॥
సర్పిణీ బహుధా సర్పాన్ విససర్జ శరీరతః॥
తక్షకర్కోటసమా వాసుకిప్రముఖత్విషః।
నానావిధవపుర్వర్ణ నానాదృష్టిభయంకరాః॥
నానావిధవిషజ్వాలా నిర్దగ్ధభువనత్రయా।
దారదం వత్సనాభం చ కాలకూటమథాపరమ్॥
సౌరాష్ట్రం చ విషం ఘోరం బ్రహ్మపుత్ర మథాపరమ్।
ప్రతిపన్నం శౌక్లి కేయమన్యాన్యపి విషాణి చ॥
వ్యాలైః స్వకీయవదనైర్విలోలరసనాద్వయైః।
వికిరంతః శక్తీసైన్యే విసస్రుః సర్పణీ తనోః॥
ధూమ్రవర్ణా ద్వివదనా సర్పా అతిభయంకరా।
సర్పీణ్యా నయనద్వంద్వాదుత్థితాః క్రోధదీపితాః॥
పీతవర్ణాస్త్రిఫణకా దంష్ట్రాభిర్వికటాననాః।
సర్పిణ్యాః కర్ణకుహరాదుత్థితాః సర్పకోటయః॥
అగ్రే పుచ్చే చ వదనం ధారయంతః ఫణాన్వితము।
ఆస్యాదా నీలవపుషః సర్పణ్యా ఫణినోఽభవన్॥
అన్యైశ్చ బల (అన్యాశబలవర్ణాశ్చ) వర్ణాశ్చ చతుర్వక్త్రా శ్చతుష్పదాః।
నాసికావివరాత్తస్యా ఉద్గతా ఉగ్రరోచిషః॥
లంబమానమహాచర్మావృత్తస్థూలపయోధరాత్।
నాభికుండాచ్చ బహవో రక్తవర్ణా భయానకా॥
హాలాహలం వహంతశ్చ ప్రోత్థితాః పన్నగాధిపా।
విదశస్తః శక్తిసేనాం దహన్తో విషవహ్నిభి॥
బధ్నంతో భోగపాశైశ్చ నీఘ్నంతః ఫణమండలైః।
అత్యంతమాకులాం చక్రుర్లలితేశీచమూమమీ॥
ఖండ్యామనా అపి ముహుః శక్తీనాం శస్త్రకోటిభిః ॥
ఉపర్యుపరివర్ధన్తే సపిండప్రవిసర్పీణః।
నశ్యంతి బహవః సర్పా జయంతే చాపరే పునః
ఏకస్య నాశసమయే బహవోఽన్యే సముత్థితాః।
మూలభూతా యతో దుష్టా సర్పిణీ న వినశ్యతి॥
అతస్తత్కృతసర్పాణాం నౌశే సర్వాంతరోద్భవః।
తతశ్చ శక్తిసైన్యానాం శరీరాణి విషానలైః॥
దహ్యమానాని దుఃఖేన విప్లుతాన్యభవన్రణే।
కింకర్తవ్యవిమూడేషు శక్తిచక్రేషు భోగిభిః॥
పరాక్రమం బహువిధం చక్రుస్తే పంచ దానవాః।
కరీన్ద్రీ గర్ధభశతైర్యుక్తం స్యందనమాస్థితః॥
చక్రేణ తీక్షణధారేణ శక్తిసేనామమర్దయత్।
వజ్రదంతాభిధశ్చాన్యో భండదైత్యచమూపతిః॥
వజ్రబోణాభిఘాతేన హోష్ట్రతో పారణం వ్యధాత్।
అథ వజ్రముఖశ్చైవ చక్రిమంతం మహత్తరమ్॥
ఆరుహ్య కుంతధారాభిః శక్తిచక్రమమర్దయత్ ।
వజ్రదంతాభిధాఽనోన్యశ్చమూనామధిపో బలి॥
గ్రుధ్రయుగ్మరథారూఢః ప్రజహార శిలీముఖైః।
తై: సేనాపతిభిర్దుష్ట్రైః ప్రోత్సాహితమధాహావే॥
శతమక్షౌహిణీనాం చ నిపపాత్రికహేలయా ।
సర్పిణీ చ దురాచారా బహుమాయాపరిగ్రహా॥
క్షణేక్షణే కోటిసంఖ్యాన్ విససర్ణ ఫణాధరాన్।
తథావికలితం సైన్యమవలోక్య రుషాకులా॥
నకులీ గరుడారూఢ సా పపాత రణాజిరే ।
ప్రతప్తకనకప్రఖ్యా లలితాతాలుసంభవా॥
సమస్తవాజ్మయాకారదంతైర్వజ్రమయైర్యుతా।
సర్పీణ్యభిముఖం తత్ర విససర్ల నిజం బలమ్ ॥
తయాధిష్ఠితతుంగాంసః పక్షవిక్షిప్తభూధరః।
గరుడః ప్రాచలద్యుద్దే సుమేరువ జంగమః॥
సర్పిణీమాయయా జాతాన్ సర్పాన్ దృష్ట్వా భయానకాన్।
క్రోధరల్లేక్షణం వ్యాప్తం నకులీ విదథే ముఖమ్॥
అథ శ్రీనకులీదేవ్యా ద్వాత్రింశద్దంతకోటయః।
ద్వాత్రింశత్కోటయో జాతా నకులాః కనకప్రభా:॥
ఇతస్తతః ఖండయంతః సర్పిణీసర్పమండలమ్।
నిజదంష్ట్రా విమర్ధన సాతయంతశ్చ తద్విషమ్॥
వ్యభ్రమన్ సమరే ఘోరే విషఘ్నః స్వర్ణబభ్రమః॥
ఉత్కర్ణాః క్రోధసంపర్కార్టూనితాశేషలోమకాః।
ఉత్ఫుల్లా నకులా వ్యాప్తవదనా వ్యరశన్నహీన్॥
ఏకైకమాయాసర్పస్య బభ్రురేకైక ఉద్గతః।
తీక్ష్ణదంతనిపాతేన ఖండయామాస విగ్రహమ్॥
భోగిభోగసృతైరక్తైః సృక్కిణీ శోణతాం గతే।
లీహంతో నకులా జీహ్వాపల్లవైః పుప్లుపుర్మృఢ॥
నకులైర్దశ్యమానానామత్యంతచటులం వపుః।
ముహుః కుండలీతైర్భోగైః పన్నగానం వచేష్టత॥
నకులావలిదష్టానాం నష్టాసూనాం ఫణాభృతామ్।
ఫణిఖారసముల్కీర్ణా మణయో వ్యరుచన్రణే॥
నకులాఘాతసంకీర్ణ ఫణాచక్రైర్వినిర్గతైః।
ఫణయస్తన్మహాద్రోహావహ్నిజ్వాలా ఇవాబభుః॥
ఏవంప్రకారతో బభ్రుమండలైరవఖండితే।
మాయామయే సర్పజాలే సర్పిణీ కోపమాదదే॥
తయా సహ మహద్యుద్ధం కృత్వా సా నకులేశ్వరీ।
గారుడాస్త్రమతిక్రూరం సమాధత్త శిలీముఖే॥
తాద్గారుడాస్త్రముద్దామజ్వాలాదీపితదిజ్ముఖమ్।
ప్రవిశ్య సర్పిణీదేహం సర్పమాయాం వ్యశోషయత్ ॥
మాయాశక్తోర్వినాశేన సర్పీణీ విలయం గతాః।
క్రోధం చ తద్వినాశేన ప్రాప్తాః పంచ చమూవరా॥
యద్బలేస సురాన్ సర్వాన్ సేనాన్యస్తేఽవమేనిదే।
సా సర్పిణీ కథాశేషం నీతా నకులవీర్యత॥
అతః స్వబలనాశేన భృశం క్రుద్ధాశ్చమూచరాః।
ఏకోద్యమేన శస్త్రౌఘైర్నకులీం తామవాకిరన్॥
ఏకైవ సా తాప్యరథా పంచభిః పృతనేశ్వరీ।
లఘుహస్తతయా యుద్ధం చక్రే వై శస్త్రవర్షిణీ॥
పట్టి శైర్ముసలైశ్చైవ భిందిపాలైః సహస్రశః।
వజ్రసారమయేర్దంతైర్వ్యదశన్మర్మసీమసు॥
తతో హాహారుతం ఘోరం కుర్వాణాదైత్యకింకరాః।
ఉదగ్రదంశనకులైర్నకులైరాకులీకృతాః॥
ఉత్పత్య గగనాత్మేచిద్ఘోరచీత్కారకాణ।
దంశంతస్తథ్విషాం సైన్యం సకులాః ప్రజ్వలక్రుధః॥
కర్ణేషు దష్ట్వా నాసాయామన్యే దష్టాః శిరస్తటే।
పృష్టతో వ్యదశన్ కేచిదగత్య వ్యాకృతక్రియాః॥
వికలాశ్ఛిన్నవర్మాణో భయవిస్రస్తశస్త్రీకాః।
నకులైరభిభూతిస్తే న్యపతన్నమరధ్రుహ॥
కేచిత్ప్రవిశ్య నకులా వ్యాప్తాన్యాసాని వైరిణామ్।
భోగిభోగాని వాకృష్య వ్యదశనససోతలమ్॥
అన్యే కర్ణేష నకులాః ప్రావిశన్ దేవవైరిణామ్।
సూక్ష్మరూపాం విశంతిస్మ నానారంధ్రాని బభ్రవ॥
ఇతి త్రైరభిభూతాని నకులైరవలోకయన్।
నిజసైన్యాని దీనాని కరజ్మ: కోపమాస్థితః॥
అన్యేపి చ చమూనాథా లఘుహస్తా మహాబలః॥
ప్రతిబభ్రు శరస్తోమాన్ వవృషుర్వారిదా ఇవ।
దైత్యసైన్యపతిప్రౌడకోదండోత్థాః శిలీముఖాః॥
బభూణ్రాం దంతకోటీషు కఠోరాఘట్టనం వ్యధు
చమూపతిశరవ్యూహైరాహతేభ్యః పరఃశతైః।
బభ్రూణాం వజ్రదంతేభ్యో విశ్చమ హుతాశనః ॥
పంచాపీ తే చమూనాథవిసృష్టైరేకహేలయాః।
స్పురత్పలైః శరకులైర్బభ్రుసేనాం వ్యమర్డయన్।
ఇతస్తతశ్చమూనాథవిక్షిప్తశరకోటిభిః॥
విశీర్ణగాత్రా నకులా నకులీం పర్యవారయన్ ॥
అథ సా నకులీ వాణీ వాజ్మయ స్యైకనాయకా।
నకులానాం పరావృత్యా మహాంతం రోషమాశ్రితా
అక్షీణనకులం నామ మహాస్త్రం సర్వతోముఖమ్।
వహ్నిజ్వాలాపరీతాగ్రం సందధేశార్జ్గధన్వని॥
తదస్త్రతో వినిష్ఠ్యూతా నకులాః కోటిసంఖ్యకాః।
వజ్రాంగా వజ్రలోమానో వజ్రదంష్ట్రా మహాజవా॥
వజ్రసారాశ్చ నిబిడా వజ్రజలభయంకరా।
వజ్రకారైర్నఖైస్తూర్ణం దారయంతో మహీతలమ్॥
వజ్రరత్నప్రకాశేన లోచనేనాపి శోభితాః।
వజ్రసంపాతసదృశా నాసా చీత్కారకారిణః॥
మర్ధయంతి సురారాతీసైన్యం దశనకోటిభిః।
పరాక్రమం బహువిధం తేనీరే తే నిరేనసః॥
ఏవం నకులకోటీభిర్వజ్రఘోరైర్మహాబలైః।
వినష్టాః ప్రత్యవయవం వినేశుద్దానవాధమాః॥
ఏవం వజ్రమయెర్బభ్రుమండలైః ఖండితే బలే॥
శతాక్షౌహిణికే సంఖ్యే తే స్వమాత్రావశేషితాః।
అతిత్రాసేన రోషేణ గృహీతాశ్చ చమూవరాః॥
సంగ్రామమధికం తేనుః సమాకృష్టశరాసనాః॥
తైః సమం బహుధాయుద్ధం తన్వానా నకులేశ్వరీ।
పట్టిశేన కరంకస్య చిచ్ఛేద కఠినం శిరః॥
కాకవాశితముఖ్యానాం చతుర్ణామపి వైరిణామ్।
ఉత్పత్యోత్పత్య తార్ క్ష్యేణవ్యలునాదసినా శిరః ॥
తాదృశం లాఘవం దృష్ట్వా నకుల్యా శ్యామలాంబికా ॥
బహు మేనే మహా సత్త్వాం దుష్టాసురవినాశినీమ్।
నిజాంగదేవతత్త్వం చ తస్యై శ్యామాంబికా దదౌ॥
లోకోత్తరే గుణే దృషే కస్య న ప్రీతిసంభవః।
హతశిష్టా భీతభీతా నకులీశరణం గతాః।
సాపీ తాన్ వీక్ష్య కృపయా మా భైష్టేతి విహస్య చ ।
భవద్రాజ్ఞే రణోదంతమశేషం చ నిబోధత॥
తయైవం ప్రేషితాః శీఘ్రం తదాలోక్య రణక్షితిమ్।
ముదితాస్తే పునర్భీత్యా శూన్యకాయాం పలాయితాః॥
తదుదంతం తతః శ్రుత్వా భండశ్చండో రుషాభవత్॥
ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్యసంవాదే శ్రీలలితోపాఖ్యానే కరంకాది పంచసేనాపతివధో నామ త్రయోవింశోఽధ్యాయః॥
ఇక శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తర భాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున శ్రీలలితోపాఖ్యానమున కరంకాది పంచసేనాపతివధమను నిరువదిమూడవయధ్యాయము.
అశ్వారూఢశక్తి కురండుని జంపగా భండాసురుడు మరలనామెతో యుద్దముజేయగోరి కుటిలాక్షునితో నిట్లనెను-1. స్వప్నములోను సంభవముగానిది, ఇంతకుపూర్వమెవ్వరును విననిది, నా మనమునగూడ శంకీంపనిదియైన యీ కష్టము వచ్చిపడినది-2. కురండ దుర్మదులు మహాబలవంతులైన సోదరులు. నాకు హితులు, వారిరివురు చంపబడిది. ఇది మాయావిని, దుష్టదాసియైన దేవియొక్క మిక్కలి గొప్పనైన ప్రభావము-3. ఇకముందు కరంకుడు మొదలైన యైదుగురు సేనానాయకులను నూరక్షౌహిణుల సైన్యమును రణభూమికి బంపుము-4. వారు యుద్దదర్మదులు, శూరులు, యుద్ధములలో శరీరములనైనను వదలుదురు. వారన్ని విధములుగా దుష్టవిలాసినియైన యామెను జయింపగలరు-5. అను నీ భండాసురుని మాటలు విని మిక్కిలి తొందరతో కుటీలాక్షుడు కురంకుడు మొదలగు సేనాసోయకులను బీలిచెను-6. వారు స్వామియైన భండాసురునకు నమస్కరించి, కుటిలాక్షునిచే నిర్దేశింపబడినవారై, అగ్నిలో ప్రవేశించబోవువారీవలే క్రోధాంధులై శూన్యకపురమునుండి బయలు వెడలిరి-7. వారీ జైత్రయాత్రా పటహధ్వని మిక్కిలిసహింపనలవి గాకున్నది. దానిని విని దిగ్గజములు వెంటనే చెవులు బ్రద్దలుగాగా తిరిగినవీ-8. నూరు అక్షౌహిణులసైన్యము బయలుదేరినది. దానికి జెండోలు మాలలుగానున్నది. ఎత్తైన సముద్ర తరంగమువలె తురంగములు మదించిన గజములును కదలుచు ప్రకాశించినవి-9. సైన్యము సకిలించు గుఱ్ఱములతో నిండినది. భట సమూహములు జయజయధ్వానములు జేయుచున్నవి. ఏనుగలు ఘీంకరించుచున్నవి. రధచక్రములు సింహములవోలె గర్జించుచున్నవి. ఈ సైన్యమంతయు కదలినది-10. రథ చక్రములయంచుల తాకిడికి భూరేణువులతో సూర్యుడు గప్పబడుచున్నాడు-11. సమస్త విశ్వమండలము ధూళితో నిండినది. ఒకప్పుడు కఠినమైన పటహధ్వనులతో విశ్వమండలము శబ్దమయముగూడనగుచున్నది-12. పై కెగసిన ధూళులతో రాక్షస సైనికులాక్రమింపబడిరి. దానివలన సేనసంఖ్య యింతటిదని భావింపబడినదీ-13. చేపలు సర్పములు మొదలగువానిచే చిత్రింపబడిన బహువిధాకారముల జెండాలు ధూళికాజాలమున మహాసముద్రమున చేపలవోలె నెక్కువగా గదిలీనవి-14. లలితాసైన్యముపైకి వెళ్లు రాక్షససేనలను జూచి శక్తులకు భంగమువాటిల్లు నేమో యను శంకతో దేవతలు భయపడిరి-15. కరంకుడు మొదలగు నైదురుగు దైత్య సేనాపతులుధ్ధతులై (విజృంభించి) యుద్ధమున సర్పిడి యనుమహామాయను సృష్టించిరి-16. సేనాపతులచేప్రయోగింపబడిన దుష్టమైన రణమాయ సర్పిడి ధూమ్రవర్ణ, ధూమ్రోష్టి ధూమ్రవర్ణ స్తనములుగలది-17. మహాసముద్రమువలె మిక్కిలీలోతైన గుహవంటి కడుపుగలది. అదీ రణమున శక్తుల మనమును భయ పెట్టుచు ముందుకు కదలినది-18. అది రెండవ కద్రువ (నాగమాత)వలె నున్నది, దుష్టురాలు. అనేక సర్పములలంకారములుగా గలది. మాయామయ శరీరములుగల సర్పము లామెనుండి పుట్టుసు-19. అది భూమిపై సేనాపతుల ముందర వంకరగా బ్రాకుచున్నది. తరువాత భయంకరముగా నడచుచు తన వంకరగా బ్రాకుటను అనేక విధములుగా జూపెను-20. పూర్వము రాక్షసనాయకులు అట్లే మాయతో జయించిరి. కరంకుడు మొదలగు దురాత్ములు ఐదుగురు పంచత్వమును (మరణమును) గోరుకొనుచున్నారు-21. తరువాత రాక్షసులకును, శక్తులకును యుద్ధము జరిగెను. వారు పరస్పర వీరాలాపములతో క్రోధముల గొప్పగా రెచ్చగొట్టుకొనిరీ-22. మిక్కిలి దొమ్మీగా యుద్దము జరుగుటచే శక్తులు-దానవులును ఒండొరుల దేలీయకుండిరి. శస్త్రముల చేత ధరించి పరస్పరము గొట్టుకొనుచుండిరి-23. ఒండొరుల శస్త్రముల యొరపిడి వలన మంటలు రేగినవి. ఆ మంటల ప్రవాహముచే దిగంతరములు గప్పబడినవి-24. బహురక్త. నదులు పొంగి పొరులటచే పోనీలో ఏనుగలు కొట్టుకొనీ పోవుచున్నవి. మాంసపుబురదలో మునిగీ రథముల గుంపులు కదలలేకున్నవి-25. వ్యాపించిన హతుల వెంట్రుకలనేడు నాచుతో రక్తనదులు విలసించుచున్నవి. అతనిష్ఠురముగా ధ్వంసముజేయు యోధుల సింహనాదములు భయంకరముగానున్నవి-26. ధూళితో నంధకారము నిండి యెదుట గనబడుటలేదు. రణరంగము రాక్షసస్త్రీలకు తృప్తినిచ్చినట్లుగా, శస్త్రధారుల బాణముతో దేగిన రాక్షసకంఠములు రక్తధారల జిమ్మినవి-27. ఈ విధముగ శక్తులకును, రాక్షసులకును హోరసంగ్రామము జరిగినదీ, అంత కరంకుడు, మొదలగు నైదుగురు, రాక్షస సేనాపతులు తమ బలములదెచ్చి సర్పీణీమాయను బ్రేరేపించిరి. వెంటనే యాసర్సీడి తన శరీరమునుండి బహువిధ సర్పముల సృజించెను-28. ఆ సర్పములు తక్షకునితోను కర్కోటకునితోను సమానములు. వాసుకి మొదలగువారి కాంతి గలవి, నానావిధ శరీర వర్ణములు గలవి. నానా దృష్టులచే భయంకరములు-29. సానావిధ విషజ్వాలలచే భువనత్రయమును గాల్చువారు. దారదము, వత్సనాభము, కాలకూటము-30. సౌరాష్ట్రము, బ్రహ్మపుత్రము, ప్రతీపన్నము, శౌక్తికేయము, (ఇవియన్నియు నాయా భయంకర సర్పవిషములు). ఇతర విషములు-31. వీనిని సర్పములు తమముఖములనుఁడి చంచలములైన రెండు నాలుకలచే శక్తి సైన్యముపై వెదజల్లుచు సరి తనువునుండి వ్యాపించినవి-32. ధూమ్ర వర్ణములు గలిగి రెండు ముఖములుగల సర్పము లతీభయంకరములు. అవి సర్పీణీయొక్క రెండు కన్నుల నుండి బుట్టినవి. కోపముచే మండిపోవునవి-33. పచ్చని వర్ణములు గలిగి, మూడుపడగలు గలిగి, కోరలతో వికటమైన ముఖములు గలవి. ఇవి సర్పిణీయొక్క చెవిరంధ్రముల నుండి బుట్టిన కోట్ల సర్పములు-34. ముందును వెనుకను పడగతో గూడిన ముఖమును ధరించునవి, ఆస్యాదములు, నల్లని శరీరముగలవీయు నైన సర్పములు సర్పీజీ నుండి బుట్టినవి. (సర్పిడి పడగ నుండి బుట్టినవి)-35. మరికొన్ని చిత్రవర్ణములు గలిగి నాలుగు ముఖములు, నాలు పాదములును గలిగినవి. ఇవి భయంకర కాంతిగలవి. సర్పిడి యొక్క ముక్కు రంధ్రము నుండి బుట్టినవి-36. సర్పీణియొక్క వ్రేలాడుచున్న పెద్ద చర్మముచే చుట్టబడిన స్తనమునుండియు, నాభికుండమునుండియు, రక్తవర్ణములు, భయంకరములు-37. హాలాహలమును ధరించునవియైన సర్పరాజములు బయలుదేరినవి. అవి శక్తిసేనను బ్రవేశీంచి కరచుచు, విషాగ్నులతో దహించుచున్నవి-38. భోగపాశములతో బంధించుచున్నవి. పడగల సమూహముతో జంపుచున్నవి. ఇవి యీ విధముగా శ్రీలలితా దేవి సైన్యమును మిక్కిలి వ్యాకుల పరచినవీ-39. శక్తులయొక్క కోట్ల కొలది శస్త్రములచే మాటిమాటికీ నరకబడుచున్నప్పటికీనీ-40. గుంపులు గుంపులుగా బ్రాకుచున్నవే పైపైగా వర్ధిల్లుచుండును. బహుసర్పములు నశించును. కాని మరల బహుసర్పములు బుట్టును-41. ఒక సర్పము నశించునపుడు వేరైన బహుసర్పములు బయలు వెడలును. పోనికి మూలభూతయైన సర్పడి నశింపకుండుట దీనికి కారణము-42. అందువల్లనే సర్పీజీ తాను సృష్టించిన సర్పములు చావగా వెంటనే సరాంతరములు (వేరొక సర్పములు) బయలువెడలుచున్నవి. దానివలన శక్తసైన్యములో శరీరములు విషాగ్నిచే కాలుచుండగా దుః ఖముతో యుద్దము నుండి పారిపోయినవి, శక్తి సైన్యచక్రములకు ఏమిచేయుటకును పాలుపోలేదు-44. అపుడు ఐదుగురు కరంకాదులు తమ పరాక్రమమును బహువిధముగా జురి, కరీంద్రి యనువాడు నూరు గాడిదల బూన్చినరథము నెక్కి-45. వాడియైన యంచుగల చక్రముతో శక్తిసేనను మర్ధించెను. భండాసుర సేనాపతియైన వజ్రదంతుడనువాడు-46. వజ్రమువంటి బాణముల దెబ్బిలతో ఒంటెనుండి యుద్ధము జేసెను. వజ్రముఖుడనువాడు చక్రములు గల మహారథమునెక్కి-47. బల్లెపు టంచులతో శక్తి సైన్య చక్రమును మర్దించెను. వజ్రదంతుడను మరొక బలవంతుడైన రాక్షస సేనాపతీ-48. రెండు గ్రద్దల రథమునెక్కి బాణములతో గొట్టెను. ఆ సేనాపతులు ప్రోత్సహింపగా. నూరక్షౌహిణుల దైత్య సైన్యము ఒక్క విలాసముగా శక్తి సైన్యముపై బడెను. దురాచారయై సర్పిణీయు బహుమాయల పరిగ్రహించినదై. క్షణక్షణమున కోట్లకొలది సర్పములను సృజించెను. గరుడారూఢయైన నకుల ఆ విధముగా వికలితమైన శక్తినైన్యమును జూచి రోషవ్యాకులమై. రణరంగమున దూకెను. కాచిన బంగారువన్నెగల యానకుతి శ్రీ లలితాదేవి యొక్క దవడల నుండి బుట్టినదీ. సమస్త వాజ్మయరూప మైనది. వజ్రమయ. దంతములతో నున్నది. ఆమె సర్పిడికభిముఖముగా తనబలమును నడిపించెను. ఆమెను తన యెత్తైన భుజములపై నెక్కించుకొనీ రెక్కలతో కొండలనుగూడ కదలింపజేయుచు నడచునట్టి మేరుపర్వత మాయన్నట్లున్న గరుడుడు యుద్ధమునకు బయలుదేరెను. సర్పీడీమాయచే బుట్టిన భయంకర సర్పముల జూచి కోపముతో కన్నులెళ్లుచేసి యానకుని ముఖమును దెరచెను . శ్రీనకులీ దేవికి ముప్పది రెండు దంతముల కోటులు(మొనలు)న్నవి, వానినుండి బంగారు వన్నెగల ముప్పది రెండు కోట్ల నకులములు - (ముంగీసలు) బుట్టినవి. ఇటునటు సర్పిడీసర్పమండలమును ఖండించుచు తన కోరలతో గొరీకి మర్దించి వాని విషమును ధ్వంసముచేయుచు విషధాతుకములై బంగారు ముంగిసలు ఆభయంకర రణమున మిక్కలి తిరుగాడినవి. చెవులు పైకి నిక్కబొడిచినవి. కోపించుటచే వెంట్రుకలన్నియు నిక్కబోడిచీకొన్నవి. కొంతయుట వికసించినట్లున్నవి. ఇట్టి ముంగీసలు నోళ్లను దెరచి సర్పములను గఱచినవి. ఒక్కొక్కమాయా సర్పమునకొక్కొక్క ముంగిస బయలు వెడలినది. తమ తమ ఐడీ పండతో సర్పముల యాక్షారములను ముక్కలు చేసినవి, పాముల పడగల నుండి సభించిన రకములచే ముంగిసల పెదవుల చివరలు ఎల్లనైనవి. చిగురాకులవంటి నాలుకలతో పెదవుల నాకుచు రణమున దూకినవి, ముంగీసలచే కొలకబడుచున్న సర్పముల శరీరములు చంచలములైనవి. మాటిమాటికీ పడగలతో జుట్టకొనుచు పాములు మరణ వికార చేష్టలు చేసినవి. ముంగీసల గుంపులతో గవబడీ ప్రాణములు గోలుపోయిన పాముల పడగల నుండి దొరలిన మణులు రణమున ప్రకాశించినవి. ముంగీసలచే గొణుకబడి రక్తముల స్రవించు పాములపడగలు శక్తిద్రోహ వహ్నిజ్వాలల బ్రకాశించినవి. ఈ విధముగా ముంగీసల గుంపుతో సర్పీజీమాయ మాయాసర్పజాలమంతయు ముక్కలు ముక్కలు చేయబడగా సర్పిడికి కోపము వచ్చినది. అపుడా నకులేశ్వరీ యామె (సర్పీణితో మహాయుద్ధమును జేసి బాణమున నతిక్రూరమైన గరుడాస్త్రమును సంధానించెను, ఆ గరుడాస్త్రము తన గొప్ప జ్వాలలచే దిబ్ముఖములన్నీంటి గాల్చి సర్పిడీ దేహమును ప్రవేశించి సర్వమాయను శోషింపజేసినది. మాయాశక్తి నశించుటచే సర్పిడి సంపూర్ణముగా నశించినది. దాని నాశముచేత నాయైదుగురు సేనాపతులు కోపమునందిరి. ఆమె బలమున వారు దేవసేనలను అవమానించిరి. ఆమె యిప్పుడు నకుల పరాక్రమముచే కథాశేషమునందినది (చచ్చినది). కావున తన బలము నశించుటచే మిక్కిలి రోషమునంది ఒక్కుమ్మడిగా శస్త్రసముహములను శ్రీనకులేశ్వరిపై గుమ్మరించిరి. గరుడారూఢయైన యాసేనా నాయిక యొక్క తయే యెదుగురురాక్షస సేనాపతులతో చరుకైన హస్తనైపుణ్యముతో శస్త్రముల వర్షించుచు యుద్ధము జేసెను. పట్టేశములు, ములసములు (రోకళ్లు) భీందిపాలములు (హస్తప్రమాణపుగుదీయ) (ఇవి వేలకొలది). వీనితో బాదీ యుద్ధము చేసెను. వజ్రసారములైన దంతములతో నకులములు మర్మస్థలములలో గరచినవి. దానితో 'హాహాయని యరచుచు రాక్షసకింకరులు భయంకరముగా గరచు నకుములధాటికి వ్యాకులురైరి. ముంగీసలు కొన్ని యాకాశమునుండి యెగిరిదూకి చీత్కారములు చేయు చున్నవి. కొన్ని మండుచున్న కోపములు గలవై శత్రువులసైన్యమును గఱచుచున్నవీ. కొన్ని శత్రువుల చెవులయందు కరచినవి. మరికొన్ని శిరోభాగమున గరచినవి. కొన్ని వీపున కరచినవి. కొన్ని వచ్చి వికార చేష్టలు చేసినవీ. వానిచేత సైనికులు చిరిగిన కవచములు గలవారై వీకలులై భయముతో తమ శస్త్రములను నేలకు జారవిడిచిరి. కొన్ని పాముల యొక్క తెరిచిన ముఖములను గాని పాముల పడగలనుగాని బాగుగా గట్టిగా లాగీ వారి నాలుకలను కరచినవి. కొన్ని నకులములు రాక్షసుల చెవులలో ప్రవేశించినవి, సూక్ష్మరూపములైన, నకులములు శత్రువుల నాసా రంధ్రములలోనికి ప్రవేశించి కరచి బాధించినవి. ఈ విధముగాకనకులములతో తిరస్కరింపబడి దీక్కులేని సైన్యముల జూచి కరంకుడు కోపము వహించెను. తక్కిన సేనాపతులు గూడ మహాబలులై. చురుకైన చేతులతో మేఘములవలి ప్రతి ముంగీసపై బాణవర్షముల గురిపించిరి. దైత్యసేనాపతలు వింటినుండి ప్రయోగింపబడిన బాణములు ముంగీసల దంతముల చివరలతో గట్టిగా తాకి తీవ్రమైన యెరపిడిని జేసినవి. సేనాపతుల నూటికి మించిన బాణముల సమూహములచే గొట్టబడిన ముంగీసల వజ్రదంతముల నుండి యగ్ని జ్వాలలు) బయలువెడలెను. ఆయైదుగురు సేనాపతులు ఒక్కుమ్మడిగా విడువబడినవియు. మెఱయుచున్న ములుకులుగల బాణముల సమూహములతో నకులసేనను మగ్గించిరి. ఇటునటుసేనాపతులవేసిన కోట్ల బాణములచే చీలిన శరీరములు గల నకులములు నకులేశ్వరి జుట్టినవి. ఆ తరువాత ఆ నకులియైన వాణి వాజ్మయమున కంతటకేకనాయికమైనది. ఆమె నకులములన్నియు మరలివచ్చుటచే రోషము వహించినది. అక్షీణ “నకుల" మను మహాస్త్రమును, తన శార్జధనువున సంధించెను. అది అగ్ని జ్వాలలతో జుట్టబడిన యగ్రముగలిగి సర్వతోముఖముగ బోవునది. దానినుండి. కోటీ సంఖ్యలతో నకులములు బయలువెడలినవి. అవి వజ్రాంగములు, వజ్రమువంటి వెంట్రుకలు గలవి. వజ్రమువంటికోరలు గలవి. మిక్కలి వేగములు గలవి. వజ్రసారభూతములు. ఇవి దట్టముగానై వజ్రపువలవలె భయంకరములై వజ్రాకారములైన గోళ్లతో వేగముగా భూతలమును జీల్చుచున్నవి. వజ్రరత్నప్రకాశముగల కన్నుతో గూడ బ్రకాశించినవి, వజ్రము పడునట్లు మీద బడినవి. ముక్కుతో చీత్కారమును జేసినవి. తమ దంతముల కోటులతో రాక్షస సైన్యమును మర్ధించినవి. ఏపాపములేక పవిత్రములైన యవీ తమ బహువిధ పరాక్రమమును విస్తరింపజేసినవి. నకుల కోటులచే ప్రత్యవయవముగా వినష్టములై యారాక్షసాధములు విశేషముగా నశించిరి. ఈ విధముగా వజ్రమయములైన నకుల సమూహములచే నూరక్షౌహిణుల రాక్షస సైన్యము ముక్కముక్కలుగా జేయబడగా . పంచసేనాపతులు మాత్రము మిగిలిరి. వారిలో భయమును ఆ తిరోషమును గలవారై ధనువులను లాగి అధికమైన యుద్దమును జేసరి. వారితో యుద్ధము జేయుబడుచు నకులేశ్వరీ పట్టిశ్రమను నాయుధముచేత ఒకని చేతిని, మరియొకని కఠిన శీరమును ఖండించేను, గరుడుడు, ఎగిరెగిరి కాకపొతుడు (కాకీవలే అరచువాడు) మొదలగు నలుగురి శత్రువుల శిరములను కత్తితో ఖండించెను. శ్యామలాంబిక నకులియొక్క యా రణనైపుణ్యమును జూచినదీ. దుష్టరాక్షస వినాశినియై మహాసత్త్వయైన యానకులిని శ్యామలాంబిక - మిక్కిలి బహుమానించెను, తనయంగదేవతాశ్వమును ఆమెకనుగ్రహించెను, లోకోత్తర-గుణమును జూచిన యెవరికి ప్రీతీకలుగదు? అందరికీని ప్రీతికలుగును. చావగా మీగిలిన వారు భీతభీతులై నకులదేవిని శరణు పొందిరి ఆమెయు వారిని దయతోజుచి, భయపడకుడు అని, నవ్వి యా రాజునకు ఈ రణవార్తనంతయు దెలుపుడు అని పంపెను. ఆమెతో నిట్లు పంపబడి, రణభూమిని జూచి, తాము బ్రతికితిమని సంతసించి, మరల భీతితో శూన్యకనగరిలోనికి బరువెత్తిరీ. తరువాత వారివార్తను విని భండాసురుడు కోపముతో భయంకరుడయ్యెను.
ఇది శ్రీ బ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున శ్రీలలితోపాఖ్యానమున కరంకాదిపంచసేనాపతివధమను నిరువదిమూడవయధ్యాయము.
Summary of chapter 135 of the Brahmānda Mahā Purana is as follows:
This deeply moving chapter celebrates the incredible valor of goddess Bālā Tripura Sundarī, the youthful nine-year-old manifestation of the supreme mother. Impelled by pure love for her mother, she entered the battlefield and single-handedly destroyed the thirty-two sons of Bhandāsura in divine combat. The devoted heart melts with affection and awe, witnessing how divine innocence and pure devotion possess boundless power to conquer all evil.