30 - యజ్ఞక్రియా ప్రవర్తనము యొక్కఆరంభము (యజ్ఞనిరసనముచే వసురాజుయొక్కపతనము)

శాంశపాయనీ రువాచ :-

కథం త్రేతాయుగముఖే యజ్ఞస్య స్మాత్ర్పవర్తనమ్

పూర్వం స్వాయంభువే సర్గే యథావత్తచ్చ బ్రూహి మే

అంతర్హితాయాం సంధ్యాయాం సార్థం కృతయుగేన వై

కాలాఖ్యాయాం ప్రవృత్తాయాం ప్రాప్తే త్రేతాయుగే తదా

ఔషధీషు చ జాతాసు ప్రవృత్తే వృష్టి సర్జనే

ప్రతిష్ఠితాయాం వార్తాయాం గృహశ్రమపరే పునః

వర్ణాశ్రమవ్యవస్థానం కృతవంతశ్చ సంఖ్యయా

సంభాకాంస్తాంస్తు సంభృత్య కథంయజ్ఞః ప్రవర్తితః

ఏతచ్భుత్వాఽబ్రవీత్సూతః శ్రూయతాం శాంశపాయనే

యథాత్రేతాయుగముఖే యజ్ఞస్యస్యాత్ప్రవర్తనమ్

పూర్వం స్వాయంభువే సర్గే తద్వక్ష్యామ్యానుపూర్యతః

అంతర్హితాయాం సంధ్యాయాం సార్ఘం కృతయుగేన తు

కాలాఖ్యాయాం ప్రవృత్తాయాం ప్రాప్తే త్రేతాయుగే తదా

ఔషధీషు చ జాతాసు ప్రవృత్తే వృష్టిసర్జనే

ప్రతిష్ఠితాయాం వార్తయాం గృహాశ్రమపరేషు చ

వర్ణాశ్రమవ్యవస్థానం కృత్వా మంత్రాంస్తు సంహతాన్

మంత్రాంస్తాన్యోజయిత్వాఽథ ఇహాముత్ర చ కర్మసు

తదా విశ్వభుగీంద్రశ్చ యజ్ఞం ప్రావర్తయత్ర్పభుః

దేవతైః సహితైః సర్వైః సర్వసంభారసంవృతైః

తస్యాశ్వమేధే వితతే సమాజగ్ముఃర్మహర్షయః

శాంశపాయనుఁడిట్లు చెప్పెను :

త్రేతాయుగారంభమున స్వాయంభువ మన్వంతరమున పూర్వము యజ్ఞములయొక్క ఆరంభమెట్లు జరిగినది. దానిని నాకు యథావత్తు చెప్పుము. (సంధ్య - రెండు యుగముల మధ్యకాలము) కృతయుగముతో సంధ్య అంతర్షితము కాగా (జరిగిపోగా) త్రేతా యుగారంభమున ‘కాలాఖ్య’ము ఆరంభముకాగా, వర్షము యొక్క సృష్టి ఆరంభమయి ఔషధముల యొక్క మొక్కల యొక్క పుట్టుక ఆరంభమగుడు వ్యవసాయము కృషి పూర్తిగా సంస్థాపితమయినది. ప్రజలు గృహస్థాశ్రమమున ప్రతిష్ఠితులయిరి. వర్ణాశ్రమ విభజనము ప్రవృత్తముయ్యెను. అట్టి సమయమున సర్వ సంభారములను సమకూర్చుకొని యెట్లు యజ్ఞమారంభమయ్యెను? (4) దానిని విని సూతుఁడిట్లు చెప్పెను. ఓ శాంశపాయనా ! త్రేతా యుగము యొక్క ఆరంభమున యజ్ఞమెట్లు ప్రవర్తితమయ్యెనో వినుము. (5) పూర్వము స్వాయంభువమన్వంతరమున యజ్ఞమెట్లు ఆరంభమయినదో అనుపూర్వకముగ చెప్పెదను. రెండు యుగముల మధ్య కాలము అయిన సంధ్య సాగిపోయెను. త్రేతాయుగారంభమున ‘కాలాఖ్య’ వర్తింప ప్రారంభమయ్యెను, వర్షము యొక్క సృష్టి జరిగెను; ఔషధాదుల యొక్క పుట్టుక సంభవించెను. వ్యవసాయము కృషీవలత్వము సంపూర్ణముగా ప్రతిష్ఠితములయ్యెను. గృహస్థాశ్రమమునకు ప్రజలనురక్తులయిరీ. వర్ణవిభజనము, ఆశ్రమవిభజనము జరిగిన తరువాత, మంత్రములు సంతతములయ్యెను. చక్కగా సమకూర్పఁబడెను. పారా మంత్రములను ఇహాముత్ర సుఖప్రదములగు కర్మలయందు ప్రయోగించిరి. అప్పుడు వీశ్వభుక్కయిన ఇంద్రుఁడు యజ్ఞములను ప్రవర్తింపఁజేసెను. (9) దేవతలతో సహితముగా సర్వయజ్ఞసంభారములను సంభృతము చేసికొని యజ్ఞముల (ప్రజలు) ఆరంభించరీ. మహర్షులు విస్తృతమయిన యశ్వమేధము గొప్పగా ప్రవర్తింపఁబడ వచ్చిరి. (10)

యజంతం పశుభిర్మేధైరూచుః సర్వే సమాగతిః

కర్మవ్యగ్రేషు ఋత్విక్షు సంతతే యజ్ఞకర్మణి

సంప్రగీథేషు సర్వేషు సామగేష్వథ సుస్వరమ్

పరిక్రాంతేషు లఘుషు హ్యధ్వర్యుర్వృషభేషు చ

ఆలబ్ధేషు చ మేధ్యేషు తథా పశుగణేషు చ

హవీష్యగ్నౌ హూయమానే బ్రాహ్మణైశ్ఛాగ్నిహోత్రిభిః

ఆహూతేషు చ సర్వేషు యజ్ఞభాక్షు క్రమాత్తదా

య ఇంద్రియాత్మికా దేవాస్తదా తే యజ్ఞభాగినః

తద్యజంతే తదా దేవాన్ కల్పాదిషు భవంతి యే

అధ్వర్యవః ప్రైషకాలే వ్యుత్థితా వై మహర్షయః

మహర్షయస్తు తాన్ దృష్ట్వా దీనాన్ పశుగణాంస్తదా

ప్రప్రచ్ఛురింద్రం సంభూయ కోఽయం యజ్ఞవిధిస్తవ

అధర్మో బలోవానేష హింసాదర్మేప్సయా తతః

తతః పశువధశ్చైష తవ యజ్ఞే సురోత్తమ

అధర్మో ధర్మఘాతాయ ప్రారబ్ధః పశుహింసయా

నాయం ధర్మోహ్యధర్మోఽయం న హింసాధర్మ ఉచ్యతే

ఆగమేన భవాన్ యజ్ఞం కరోతు యదిహేచ్ఛనీ

విధిదృష్టేన యజ్ఞేన ధర్మేణాశ్యపసేతునా

యజ్ఞబీజైః సురశ్రేష్ఠ యేషు హింసా న విద్యతే

త్రివర్షం పరమం కాలముషితైరప్రరోహిభిః

అచ్చటకు సమాగతులైన పోరెల్లరు యజ్ఞయాగ్య పశువులతో యజ్ఞము చేయుచున్న వాని నడిగ్రీ. ఋత్విక్కులందరు యజ్ఞ సంబంధమయిన కర్మలయందు వ్యగ్రులైయుండిరి. సామగానముల సామగులు అందరు సుస్వరముతో నిమగ్నులయి యుండిరి, ఆధ్వమ్యులు వెంటనే క్రియా కలాపముల నారంభించిరీ, యజ్ఞమునకు సంపాదింపఁబడిన అర్హమైన పశుసంతతి అంతయు ఖండింపఁబడి కొట్టఁబడగా, అగ్నిహోత్రులయిన బ్రాహ్మణులచే హవిః ప్రదానములు జరుపఁబడుచుండ యజ్ఞభాగముల గ్రహించుటకు క్రమముగా దేవతలందరు ఆహూతులయిరి. ఇందీ యాత్మకులయిన దేవతలందరు యజ్ఞభాగముల స్వీకరించుచుండిరి. (ఇంద్రియాత్మికులు శబ్ద స్పర్శ రస రూప గంధముల కధిదేవతలగు వారందరు). కల్పము యొక్క ఆదియందున్న దేవతల నెల్లరను వీరు (ఋత్విక్కులు - యజ్వులు) పూజించిరి. అధ్వర్యులు, మహర్షులు, సోమరసమును పిండు. (పైషకాలే) కాలమున లేచి నిలువఁబడిరి. దీనములయిన పశుగణములను చూచి, వారందరు (అధ్వర్యులు) సమకూడి “కోఽయం యజ్ఞ విధిస్తవ) ఓ యింద్రా ! నీ యజ్ఞవిధి యెట్టిది అని యడిగిరీ. ఇదీ అధికమైన అధర్మము. పాపయుతము. ఈ యజ్ఞము అహింసాధర్మము నందుఁ గూడిన కోరికచే వ్యాప్తమయినది. ఓ సురోత్తమ ! నీ యజ్ఞము పశువధతో కూడి యున్నది. (17) ఈ పశుహింసచేతను ధర్మము విఘాతము చేయుటకు అధర్మయజ్ఞము ఆరఖమయినది. ఇది ధర్మము కాదు. ఇది అధర్మము. హింస ఎన్నడును ధర్మముగా చెప్పబడదు. (18) ఓ పూజ్యుం డా ! ఆగమము ననుసరించి నీవు యజ్ఞమాచరింపగోరితివేని, విధినిర్దిష్టములయిన విధానములకు వ్యతిరిక్తము కాకుండ యజ్ఞ మాచరింపుము. వేదముల యందు నిర్ణయించిన విధులకనుగుణముగా యజ్ఞము నాచరింపుము. (19) ఓ దేవత శ్రేష్ఠుఁడా! మూడు సంవత్సరముల కాలము యజ్ఞ బీజముల ఉంచవలయును.

ఏష ధర్మో మహాప్రాజ్ఞ ! విరించివిహితః పురా

ఏవం విశ్వభుగీంద్రస్తు ఋషిభిస్తత్త్వదర్శిభిః

తదా వివాదః సుమహానీంద్రస్యాసీన్మహర్షిభిః

జంగమస్థావరైః కైర్హి యష్టవ్యమితి చోచ్యతే

తే తు భిన్నా వివాదేన తత్త్వముక్త్వా మహర్షయః

సంధాయ వాక్యమింద్రేణ ప్రప్రచ్చుః ఖేచరం వసుమ్

మహాప్రాజ్ఞ కథం దృష్టస్త్వయా యజ్ఞవిధిర్నృప !

ఔత్తానపాదే ప్రబ్రూహి సంశయం నో నుద ప్రభో !

శ్రుత్వా వాక్యం వసుస్తేషామవిచార్య బలాబలమ్

వేదశాస్త్రమనుస్మృత్య యజ్ఞతత్వమువాచ హ

యథోపనీతైర్యష్టష్యమితిహోవాచ పార్ధివః

యష్టవ్యం పశుభిర్మేద్యైరథ బీజైః ఫలైరపి

హింసాస్వభావో యజ్ఞస్య ఇతి మే దర్శనాగమౌ

యథేహా దేవతామంత్రా హింసాలింగా మహర్షిభిః

దీర్ఘేణ తపసా యుక్తైర్దర్శనైస్తారకాదిభిః

తత్ప్రమాణాన్మయా చౌక్తం తస్మాత్తత్ ప్రాప్తుమర్హథ

యది ప్రమాణం తాన్యేవ మంత్రవాక్యాని వై ద్విజా!

తథా ప్రవర్తతాం యజ్ఞాహ్యన్యథా వోఽనృతం వచః

ఏవం కృతోత్తరాస్తే వై యుక్తాత్మాన స్తపోధనాః

అవశ్యభావితం దృష్ట్వా తమథో వాగ్యతాఽభవన్

అయ్యవి అంకురింపఁకూడదు. (మొలకలు రాగూడదు). అప్పుడు యజ్ఞ మాచరించవలయును. అట్టి బీజముల యందు ప్రాణ నష్టముండనందున హింస యుండదు. ఓ మహాప్రాజ్ఞ, ఇది పూర్వము విరించీ విహిత ధర్మము. తత్య దర్శులయిన ఋషులీ విధముగా విశ్వభుక్కయిన ఇంద్రుని అడిగిరి, (21) అప్పుడు ఇంద్రునకు మహర్పులతో నొక పెద్ద వివాదము జరిగెను. జంగముల చేతను స్థావరముల చేతను (చరాచర జీవులచే) ఏ విధముగా యజ్ఞము జరుపఁబడవలయును? (22) తత్త్వమును వివరించి ఆ మహర్షులు వివాదము చేత మిక్కిలి ఖిన్నులైరీ. ఇంద్రునితో నొక అంగీకారమునకు వచ్చి వారు (ఆ ఋషులు) ఆకాశచరుఁడయిన వసు మహారాజునడిగిరీ. (23) ఓ మహారాజ ! ఓ మహాప్రాజ్ఞ ! యజ్ఞవిధి యెట్లు నీచే చూడఁబడినది? ఓ ప్రభూ ! ఉత్తానపాద కుమార ! వివరించి మా సంశయమును రూపు మాపుము, (24) వసువు ఆ ఋషుల వాక్యములను వినెను. ఆ వసువు బలాబలములనుం మంచి చెడ్డలను విమర్శింపకుండగనే, వేదశాస్త్రములను మను స్కృతులను అనుసరించి, యజ్ఞతత్త్వమును గూర్చి చెప్పెను. (25) పార్థివుఁడయిన వస్తువు ఇట్లు చెప్పెను. యథోపవీతములయిన (తీసికొని రాబడిన) వస్తువులచే యజ్ఞ మాచరింపవలెను. మేధ్యములయిన పశువులచే లేదా బీజములతో లేదా ఫలములతో యజ్ఞ మాచరించ వలయును. (26) ‘యజ్ఞమునకు హింస సహజము’ ఇది నా ధర్మ నిర్ణయము, అంతీయే కాదు, దర్శన గ్రంథములు ఆగము గ్రంథముల యందు చెప్పం బడినదీదీయే. దేవతలు ఎట్లో అట్లే మంత్రములు కూడ హింసా లింగములు (హింసా సంజ్ఞలు). ఇదియే దీర్ఘకాలము తపసా యుక్తులయిన మహరులచే, హరి దర్శన గ్రంథముల బట్టి తారక గ్రంథముల ననుసరించి, ఇతర మంత్రములను బట్టి చెప్పఁబడినది. (27,28) దాని నాధారముగా ప్రమాణముగా గ్రహించి చెప్పఁబడినది. అందుచే ఓ బ్రాహ్మణులారా ! ఆ మంత్రములను వారి వాక్యములను మీరు ప్రమాణముగా గ్రహించినచో ఓ ఋషులారా ! యజ్ఞములను ప్రవర్తింపనీయుఁడు. అన్యథా యైనచో మీ వచనములసత్యమగును. (29) ఈ విధముగా కృతోత్తరులై, యుక్తాత్ములు, తపోధనులు అవశ్యము జరుగవలయుననుట యెంచి, వాదించుట మానిరి. (30)

ఇత్యుక్తమాత్రే నృపతిః ప్రవివేశ రసాతలమ్

ఊర్ధ్వచారీ వసుద్భూత్వా రసాతలచరోఽభవత్

వసుధాతలవాసీ తు తేన వాక్యేన సోఽభవత్

ధర్మాణాం సంశయచ్ఛేత్తా రాజూ వసురధోగతః

తస్మాన్న వాచ్యమేకేన బహుజ్ఞేనాపి సంశయే

బహుద్వారస్య ధర్మస్య సూక్ష్మా దూదతరా గతిః

తస్మాన్న నిశ్చయాద్వక్తుం ధర్మః శక్యస్తు కేనచిత్

దేవానృషీనుపాదాయ స్వాయంభువమృతే మనుమ్

తస్మాదహింసా ధర్మస్య ద్వారముక్తం మహర్షిః

ఋషికోటిసహస్రాణి స్వతపోభిర్దీవం యయుః

తస్మాన్న దానం యజ్ఞం వా ప్రశంసంతి మహర్షయః

ఉంఛమూలఫలం శాకముదపాత్రం తపోధనాః

ఏతద్దత్వా విభవతః స్వర్గే లోకే ప్రతిష్ఠితాః

అద్రోహశ్చాష్యలోభశ్చ తపో భూతదయాదయః

బ్రహ్మచర్యం తథా సత్యమనుక్రోశః క్షమా ధృతిః

సనాతనస్య ధర్మస్య మూలమేతద్దురాసదమ్

శ్రూయంతే హి తపఃసిద్ధాః బ్రహ్మక్షత్రాదయోఽనఘాః

ప్రియవ్రతోత్తానపాదౌ ధ్రువో మేధాతిథిర్వసుః

సుధామా వీరజాశ్చైవ శంఖః పాండ్యజ ఏవ చ

ప్రాచీనబర్హిః పర్జన్యో హవిర్దానాదయో నృపాః

ఇట్లు పలికిన వెంటనే వసు నృపతి రసాతలము ప్రవేశించెను. ఊర్ధ్వచారియైన రాజు రసాతల చరుఁడయ్యెను. (ఈ పురాణము ననుసరించి, జంతుహింసను బలపరచుటచే రాజు రసాతలము ప్రవేశించుట జంతుహింస యెంతగా నిషేధింపఁబడినదో వ్యక్తమగుచున్నది.) ఆ వాక్యముచే వసుధాతల వాసియతఁడుయ్యెను. ధర్మవిషయ సంశయముల నిర్ణయించు వసురోజు అధోమోసియ రసాతలగతుఁడయ్యెను. (32) అందుచే, బహు విషయములతో నొకఁడు పరిచితుఁడైనను బహుజుఁడయినను, సంశయ విషయమున నొక్కడేదియును చెప్పరాదు. ధర్మము బహు ద్వారములు గలది, ధర్మము యొక్క సూక్ష్మభావగ్రహణము అవశ్యమైనదీ. (33) అందుచే నొక్కనిచే ధర్మ విషయమున నిశ్చయమిది యని చెప్పుటకు దేవతలకు ఋషులకు శక్యము కాదు. ఈ విషయమున స్వాయంభువ మనువోక్కడే అపవాదము, (34) (జంతు హింసతోఁ గూడిన యజ్ఞాదుల కర్మమార్గము కంటే జ్ఞానము మార్గము యొక్క శ్రేష్ఠత్వము చెప్పఁబడుచున్నది.) అందుచే ధర్మమునకు ద్వారము అహింసయని మహరులచే చెప్పబడినది. సహస్ర కోటీ మహరులు స్వకీయమయిన తపస్సులచే స్వర్గమున కరిగిరి. (35) అందుచే మహార్పులు దొనమునుగాని యజ్ఞమునుగాని ప్రశంసింపరు. తపోధనులు, ఉంఛవృత్తితో సంపాదించిన మూలములను, ఫలములను, శాకములను, ఉదకపాత్రను వారీ శక్త్యనుసారముగా నిచ్చి స్వర్గలోకమున వారు సుప్రతిష్ఠితులయిరి. అద్రోహము, అలోభము, తపస్సు, భూతదయ, దమము, బ్రహ్మచర్యము, సత్యము, అనుక్రోశము (డాలీ) క్షమ, ధృతీ ధైర్యము) ఇవియన్నియు సనాతన ధర్మమునకు మూలములు. వానిని సాధించుట కష్టము. (38) చాలామంది అనఘులు బ్రాహ్మణక్షత్రియాదులు తపస్సిద్ధులున్నారని వినబడుచున్నది (తెలియుచున్నది). వారు ప్రియవ్రతుఁడు, ఉత్తానపాదుం డు, ధ్రువుఁడు, మేధాతిథి వసువు, సుధాముఁడు, విరజుఁడు, శంఖుఁడు, పాండ్యజుఁడు, ప్రాచీనబర్షి పర్జన్యుఁడు, హవిరానుఁడు మొదలగు రాజులు. (40)

ఏతే చాన్యే చ బహవః స్వైస్తపోభిర్దివం గతాః

రాజర్షయో మహాసత్త్వా యేషాం కీర్తి ప్రతిష్ఠితా

తస్మాద్విశిష్యతే యజ్ఞత్తపః సర్వైస్తు కారణైః

బ్రహ్మణా తపసా సృష్టం జగద్విశ్వమిదం పురా

తస్మాన్నాన్వేతి తద్యజ్ఞస్తపోమూలమిదం స్కృతమ్

ద్రవ్యమంత్రాత్మకో యజ్ఞస్తపస్త్వనశనాత్మకమ్

యజ్ఞేన దేవానాప్నోతి వైరాం తపసా పునః

బ్రహ్మం తు కర్మ సన్న్యాసాద్వైరాగ్యాత్ప్రకృతేర్ణయమ్

జ్ఞానాత్ర్పాప్నోతి కైవల్యం పంచైతా గతయః స్మృతాః

ఏవం వివాదః సుమహాన్యజ్ఞస్యాసీతువర్తనే

దేవతానాం ఋషీణాం చ పూర్వం స్వాయంభువేంఽతరే

తతస్తమృషయో దృష్ట్వా హాతం ధర్మబలేన తు

వహార్వాక్యమనాదృత్య జగ్ముః సర్వే యథాగతమ్

గతేషు ముని సంఘేషు దేవా యజ్ఞం సమాప్నువన్

యజ్ఞప్రవర్తనం హ్యేవమాసీత్స్వాయంభువేంఽతరే

తతః ప్రభృతి యజ్ఞోఽయం యుగైప్సహ వివర్తితః

ఇతి శ్రీ బ్రహ్మాందే మహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ద్వితీయేఽనుషంగపాదే యజ్ఞప్రవర్తనం నామ త్రింశత్తమోఽధ్యాయః

వారి వారి తపస్సులచే దీవమును పొందిన వారెందరో ఉన్నారు. వారు రాజర్షులు, మహాసత్త్వులు. వారి కీర్తి సుప్రతిష్ఠితము. (41) అందుచే అన్ని కారణములచే, తపస్సు యజ్ఞము కంటే శ్రేష్ఠము. తపస్సు చేతనే బ్రహ్మచే ఈ సమస్త విశ్వము పూర్వము సృజింపఁబడినది. (42) అందుచే యజ్ఞము తపస్సు ననుసరింపదు. ఈ ప్రపంచమంతయును తపో మూలము. యజ్ఞ సంభారములు, మంత్రములు యజ్ఞమునకు మూలములు. (ద్రవ్యమంత్రాత్మకము. యజ్ఞము). తపస్సు అనశనాత్మకము. (ఆహార విసర్జన మనశనము). (43) యజ్ఞము నాచరించుట వలన దేవతలను పొందును. తపస్సు వలన ‘వైరాజ’ మొందును, కర్మ సన్న్యాసము వలన (సర్వ కామ్య వస్తు పరిత్యాగము) బ్రాహ్మకర్మ సాధింతురు. ప్రకృతి యొక్క విజయము వైరాగ్యము వలన గలుగును. (44) జ్ఞానము వలన కైవల్యము నొకడు పొందును. ఇది ఐదుగతులు మార్గములు చెప్పఁబడినవి. ఈ విధముగా దేవతలకు ఋషులకు మధ్య యజ్ఞమునుగూర్చీ పెద్ద వివాదము జరిగెను. పూర్వము స్వాయంభువ మన్వంతరమున నీ వివాదము జరిగెను. ఋషీశ్వరులు వసురాజును చూచిరి. ధర్మ బిలముచే సాతఁడు హతుఁడాయ్యెను. ముని సంఘములు వెడలిపోయెను. దేవతలు యజ్ఞమాచరించిరి. స్వాయంభువమన్వంతరమున నీ రీతిగా యజ్ఞము ప్రారంభమయ్యెను. యుగ క్రమమున నీ యజ్ఞము వివర్తితమయినది. పరిణామమును పొందినది.

ఇదీ పొయుప్రోక్తమయిన శ్రీ బ్రహ్మాండపురాణమున పూర్వభాగమున ద్వితీయానుషంగపాదమున యజ్ఞారంభమనెడి ముప్పదవ అధ్యాయము.