బ్రహ్మాండ మహా పురాణము
32 - భార్గవ చరితము
వసిష్ఠ ఉవాచ :-
బ్రహ్మణో వచనం శ్రుత్వాస ప్రణమ్య జగద్గురుమ్ ।
ప్రసన్నచేతాః సుభృశం శివలోకం జగామ హ ॥
లక్షయోజనమూర్ద్వం చ బ్రహ్మలోకాద్విలక్షణమ్ ।
అథ నిర్వచనీయం చ యోగిగమ్యం పరాత్పరమ్ ॥
వైకుంఠో దక్షిణే యస్మాద్గౌరీలోకశ్చ వామతః ।
యదధో ధ్రువలోకశ్చ సర్వలోకపరస్తు సః ॥
తపోవీర్యగతీ రామః శివలోకం దదర్శ చ ।
ఉపమానేన రహితం నానాకౌతుకసంయుతమ్ ॥
వసంతి యత్ర యోగీంద్రాః సిద్ధాః పాశుపతాః శుభాః ।
కోటీకల్పతపఃపుణ్యాః శాంతా నిర్మత్సరా జనః ॥
పారిజాతముఖైర్వృక్షైః శోభితం కామధేనుభిః ।
యోగేన యోగీనా సృష్టం స్వేచ్ఛయా శంకరేణ ఏ ॥
శిల్పినాం గురుణా స్వప్నే న దృష్టం విశ్వకర్మణా ।
సరోవరశతైర్దివ్యైః పద్మరాగవిరాజితైః ॥
శోభితం చాతి రమ్యం చ సంయుక్తం మణివేదిభిః సువర్ణరత్నరచితప్రాకారేణ సమావృతమ్ ॥
అత్యూర్ధ్వమంబరస్పర్శి స్వచ్ఛం క్షీరనిభం పరమ్ ।
చతుర్ద్వారసమాయుక్తం శోభితం మణివేదిభిః ॥
రక్తసోపానయుకైశ్చ రత్నస్తంభకపాటకైః ।
నానాచిత్రవిచిత్రైశ్చ శోభితైః సుమనోహరైః ॥
తన్మధ్యే భవనం రమ్యం సింహద్వారోపశోభితమ్ ।
దదర్శ రామో ధర్మాత్మా విచిత్రమివ సంగతః ॥
తత్ర స్థితౌ ద్వారపాలౌ దదర్శాతీభయంకరౌ ।
మహాకరాళదంతాస్యౌ వికృతారక్తలోచనౌ ॥
దగ్ధశైలప్రతీకాశౌ మహాబలపరాక్రమౌ ।
విభూతిభూషితాంగౌ చ వ్యాఘ్రచర్మాంబరౌ చ తౌ ॥
వసిష్టుఁడిట్లు చెప్పెను.
రాముఁడు బ్రహ్మ వచనములను వినెను. జగద్గురువును నమస్కరించెను. అత్యధికముగా ప్రసన్నమనస్కుఁడయ్యెను. శివలోకమున కరిగెను. అయ్యది ఊర్థ్వమున లక్షయోజనముల దూరము. బ్రహ్మలోకము కంటే విలక్షణమయినది. అది వర్ణింపఁబడుటకు వీలులేనిది. అదీ అనిర్వచనీయము. అది యోగులచే పొందశక్యమైనది, అది పరాత్ పరమయినది. అత్యుత్కృష్టమైన దాని కంటేను నుత్కృష్టమయినది. దానికి వైకుంఠము దక్షిణమున నున్నది; మఱి గౌరీలోకము వామభాగమున గలదు. ధ్రువలోకము దానికి దిగువ నున్నది. ఆ శివ లోకము అన్ని లోకముల కంటెను పరముగా నున్నతముగా నున్నది. తపస్సు యొక్క వీర్యగతి గలిగినరాముఁడు శివలోకమును దర్శించెను. అయ్యది ఇంకొక వస్తువుతో సమభావమున నుపమించుటకు వీలులేనీదీ. అదీ యద్వితీయమైనది. నానా విధ కుతూహల జనకములయిన వస్తు సముదాయముతో నిండి యున్నట్టిది అందు యోగీంద్రులు సిద్ధులు శుభంకరులైన పాశుపతదీక్షాపరులు కోటికల్పములు తపస్సుచేసి పుణ్యులైనవారు అతిశాంతులు, నిర్మత్సరులు అయిన జనములు నీవసింతురు. (5) అయ్యదీ పారిజాతములు మందారములు మున్నగు వృక్షముల చేతను కామధేనువుల తోడను శోభించునది. యోగీశ్వరులకు యోగియైన శంకరునిచే నయ్యదీ తదిచ్చయా సృజింపఁబడినది. శిల్పులకు గురువైన విశ్వకర్మచే నాశివలోకము కలలో నయినను చూడబడలేదు. దీవ్యములయిన సరోవర సహస్రములతోడను, పద్మరాగమణుల చేతను వీరాజిల్లునదీ. అతిరమ్యములయిన మణిమయ వేదికలతో కూడియున్నది. సువర్ణముచేతను, రత్నములచేతను నిర్మితమయిన ప్రాకారముచే నదీ సమావృతమై శోభిల్లును. అదీ అంబరమునంటునట్టిది. అయ్యది క్షీరమువలె అతీధవళమైనది. దానికి నాలుగు ద్వారములు కలవు. అది మణిమయవేదికలతో కూడినది. రత్నమయమై రక్తవర్ణశోభితములయిన సోపానములు కలది. స్తంభములు రత్నస్తంభమయము. తలుపులు (కవాటములు) నానావిచిత్రములయిన చిత్రములచే నలంకృతమే మనోజ్ఞ సౌందర్య విభాసితములు. వాని మధ్య నొక భవనము. రమ్యమైనది. సింహద్వారముచే నుపశోభితము ధర్మాత్ముఁడైన రాముఁడు దానిని వీక్షించేను. విచిత్రములతో గూడిన దానిని దర్శించినట్లుగా రాముఁడు తలపోసెను. అందున్న ద్వారపాలుర నిరువురను రాముఁడు చూచెను. ఆ ద్వార పాలకులతిభయంకరులు. భయంకరములయిన దంతములతోడి వదనములు కలవారు. వికారాకారులు. ఎఱ్ఱని నేత్రములు కలవారు. తగులబడ్డ శైల సదృశులు. మహాబల పరాక్రములు. వారు విభూతి భూషిత శరీరులు. వ్యాఘ్రచర్మముల వస్త్రములుగా దాల్చినవారు.
త్రిశూలపట్టిశధరౌ జ్వలంతౌ బ్రహ్మతేజసా ।
తౌ దృష్ట్వా మనసా భీతః కించిదాహ వినీతవత్ ॥
నమస్కరోమి వామీశౌ శంకరం ద్రష్టుమాగతః ।
ఈశ్వరాజ్ఞాం సమాదాయ మామథాజ్ఞప్తుమర్హథ ॥
తౌ తు తద్వచనం శ్రుత్వా గృహీత్వాంఽజ్ఞాం శివస్య చ । ప్రవేష్టుమాజ్ఞాం దదతురీశ్వరానుచరౌ చ తౌ ॥
స తదాజ్ఞామనుప్రాప్య వివేశాంతఃపురం ముదా ।
తత్రాతీరమ్యాం సి ద్ధౌ ఘైః సమాకీర్ణాం సభాం ద్వీజః ॥
దృష్ట్వా విస్మయమాపేదే సుగంధబహుళాం విభో । తత్రాపశ్యచ్ఛివం శాంతం త్రినేత్రం చంద్రశేఖరమ్ ॥
త్రిశూలశోభితకరం వ్యాఘ్రచర్మవరాంబరమ్ ।
విభూతిభూషితాంగం చ నాగయజ్ఞోపవీతినమ్ ॥
ఆత్మారామం పూర్ణకామం కోటిసూర్యసమప్రభమ్ ।
పంచాననం దశభుజం భక్తానుగ్రహవిగ్రహమ్ ॥
యోగజ్ఞానే ప్రబ్రువంతం సిద్ధేభ్యస్తర్కముద్రయా ।
స్తూయమానం చ యోగీంద్రైః ప్రమథప్రకరైర్ముదా ॥
భైరవైర్యోగినీభిశ్చ వృతం రుద్రగణైస్తథా ।
మూర్ద్నా నమామ తం దృష్ట్వా రామః పరమయా ముదా ॥
వామభాగే కార్తికేయం దక్షిణే చ గణేశ్వరమ్ ।
నందీశ్వరం మహాకాలం వీరభద్రం చ తత్పురః ॥
క్రోడే దుర్గాం శతభుజాం దృష్ట్వా నత్వాథ తామపి । స్తోతుం ప్రచక్రమే విద్వాన్గిరా గధ్గదయా విభుమ్ ॥
నమస్యే శివమీశానం విభుం వ్యాపకమవ్యయమ్ ।
భుజంగభూషణం చోగ్రం నృకపాలస్రగుజ్జ్వలమ్ ॥
యో విభుః సర్వలోకానాం సృష్టిస్థితివినాశకృత్ ।
బ్రహ్మాదిరూపధృగ్జ్వేష్ఠస్తం త్వాం వేద కృపార్ణవమ్ ॥
వారు త్రిశూలములను పట్టిస మను ఆయుధములను ధరించినవారు. అయినను బ్రహ్మతేజస్సుచే ప్రజ్వలించు మొగములు కలవారు. వారిని రాముఁడు చూచెను. మనస్సులో భయపడెను. అయినను, అత్యంత వినయభావ శోభిత వినీతునివలె స్వల్పముగా నిట్లు పలికెను. ‘ఓ భగవత్స్వరూపులారా ! ఈశులారా ! మీకు నమస్కరించుచున్నాను. శంకరుని దర్శింప వచ్చితిని. మీరు నా రాక ఈశ్వరునకు దెలిపి , తదాజ్ఞను గ్రహించి ఆ శంకరుఁడెట్లు ఆనతిచ్చునో అట్లాచరింపనరులరు” అనేను. వారాతని వచనములు వినిరీ. శివుని కడ నుండి తదాజ్ఞను గ్రహించి వచ్చిరి. ఆ ఈశ్వరానుచరద్వంద్వము రామునికి ప్రవేశింప ఆజ్ఞ నొసంగిరి. రాముఁడు వారి ఆజ్ఞను గ్రహించి, అంతఃపురము లోనికి సంతోషముతో ప్రవేశించేను. అందు, రమ్యమయినది, సిద్ధసంఘములచే సమాకీర్ణమయినదియు, సుగంధబాహుళ్యముచే పరిమళించునదియునగు ప్రపంచవిభుని సభను దిలకించి రాముఁడు విస్మయావిష్ణుఁడయ్యెను. ఆ సభలో శాంతుని, త్రినేత్రుని, చంద్రశేఖరము కలవానిని, త్రిశూలముచే శోభిల్లు హస్తము గలవానిని, వ్యాఘ్ర చర్మ శ్రేషాంబరము దాల్చిన వానిని, విభూతిచే విభూషింపఁబడిన శరీరావయవములు కలవానిని, నాగ యజ్ఞోపవీతములు దాల్చిన వానిని, ఆత్మారాముని, పూర్ణకామునీ, కోటిసూర్య సమప్రభా భాసితుని, పంచ ముఖములు గలవానిని, దశభుజ శోభితుని, భక్తుననుగ్రహించు విగ్రహము కలవానిని, సిద్దులకు యోగమును జ్ఞానమును ‘తర్కముద్ర”తో నుపన్యసించువానిని, యోగీంద్రులు ప్రమథప్రకరులు సంతోషముతో స్తోత్రము చేయునట్టి వానిని, భైరవులచే, యోగినులచే, రుద్రగణములచే పరివృతుఁడై యున్నవానిని శివుని చూచి అత్యంత ముదాన్వితుఁడై శిరసా రాముఁడు నమస్కరించెను. రాముఁడు, ఈశ్వరుని వామభాగమున కార్తికేయుని, దక్షిణమున గణేశ్వరుని, నందీశ్వరుని, మహాకాలునీ, ముందుగా వీరభద్రుని, తొడపై శతభుజాలంకృతయైన దుర్గాదేవిని చూచి, వారందరకు నమస్కరించెను. తరువాత విద్వత్సంపూర్ణమైన గాద్గదికవాక్కుతో వారిని స్తోత్రముచేయ ఆరంభీంచెను. విభునికి, శివునికి, ఈశానునికి, సర్వవ్యాపకునికి అవ్యయునికి, భుజంగభూషణునికి, ఉగ్రునికీ, నర కపాల మాల ధరించీ జ్వలించువానికి నమస్కరించుచున్నాను. ఎవ్వఁడు సర్వలోకములకు విభుఁడో, సృష్టి స్థితి వినాశకారకుఁడో బ్రహ్మాది దేవతల రూపము ధరించిన వారిలో జ్యేష్ఠుఁడో, అట్టి కృపాసముద్రునిగా నిన్నెఱుంగుదును.
వేదా న శక్తా యం స్తోతుమవాఙ్మానసగోచరం ।
జ్ఞానబుద్ధ్యోరసాధ్యం చ నిరాకారం నమామ్యహమ్ ॥
శక్రాదయః సురగణా ఋషయే మనవోఽసురాః ।
న యం విదుర్యథాతత్త్వం తం నమామీ పరాత్పరమ్ ॥
యస్యాంశేన సృజంత్యేతే లోకాః సర్వే చరాచరాః ।
లీయంతే చ పునర్యస్మింస్తం నమామి జగన్మయమ్ ॥
యస్యేషత్కో పసంభూతో హుతాశో దహతేఽఖిలమ్ ।
సోర్ధ్వలోకం సపాతాళం తం నమామి హరం పరమ్ ॥
పృథ్వీపవనవహ్న్యం భోనబోయజ్వేందుభాస్కరాః ।
మూర్తయేఽష్టౌ జగత్పూ జ్యాస్తం యజ్ఞం ప్రణమామ్యహమ్ ॥
యః కాలరూపో జగదాదీకర్తా పాతా పృథగ్రూపధరో జగన్మయః । హర్తా పునారుద్రవపుస్తథాంతే తం కాలరూపం శరణం ప్రపద్యే ॥
ఇత్యేవముక్త్వా స తు భార్గవో ముదా పపాత తస్యాంఘ్రిసమీప ఆతురః ।
ఉత్థాప్య తం వామకరేణ లీలయా దద్రే తదా మూర్ద్నీ కరం కృపార్ణవః ॥
ఆశీర్భిరేనం హ్యభినంద్య సాదరం నివేశయామాస గణేశపూర్వతః ।
ఉవాచ పామామభివీక్ష్య చాప్సు మాం కృపార్ధ్రదృష్ట్యాఽఖీలకామపూరకః ॥
శివ ఉవాచ :-
కస్త్వం వటో ! కస్య కులే ప్రసూతః కిం కార్య ముద్దిశ్య భవానీహాగతః ।
వినిర్దిశాహం తవ భక్తిభావతః ప్రీతః ప్రపద్యం భవతో మనోగతమ్ ॥
ఇత్యేవముక్తః స భృగుర్మహాత్మనా హరేణ విశ్వార్త్రీ హరేణ సాదరమ్ ।
పునశ్చ నత్వా విబుధాం పతిం గురుం కృపాసముద్రం సముపాచ సత్వరమ్ ॥
పరశురామ ఉవాచ :-
భృగోశ్చాహం కులే జాతో జమదగ్ని సుతో విభో ।
రామో నామ జగద్వంద్యం త్వామహం శరణం గతః ॥
యత్కార్యార్థమహం నాథ తవ సాన్నిధ్యమాగతః ।
తంప్రసాధయ విశ్వేశ వాంఛితం కామమేవ మే ॥
వాజ్మనస్సుల కగోచరమయిన వానికి, ఎవనిని వర్ణింప వేదము లశక్తిమంతములో అతనికి నమస్కారము. జ్ఞాన బుద్దుల కసాధ్యమైన వానికి నిరాకారునకు నమస్కారము. ఇంద్రాదులు, సురగణములు, ఋషీశ్వరులు, మనువులు, రాక్షసులు - ఏ పరాత్పరుని యొక్క యాథార్థమును తెలియజాలరో ఆతనికి నమస్కరింతును. ఎవని యొక్క యంశచే సర్వలోకములు చరాచర ప్రపంచము సృజింపఁబడుచున్నదో, మరల నేవని యందు ఆ సృష్టింపబడినది సర్వము లీనమగుచున్నచో, జగన్మయుఁడయిన యాతనికి నమస్కరించుచున్నాను, ఏ ప్రభుని యొక్క ఈషతోపకారణముగా హుతాశనుఁడు పుట్టెనో - ఏ యగ్ని ఊర్థ్వలోకమును పాతాళమును దహించునో, ఆహరునకు ఆపరాత్పరునకు నమస్కరించుచున్నాను. (30) పృథ్వీ పవనుఁడు, వహ్ని, అంభస్సు, నభము, యజ, చంద్రుఁడు, సూర్యుడు. అను నీ యెనిమిది జగత్పూజ్య మూర్తులెవ్వనివో ఆ యజ్ఞస్వరూపునకు అష్టమూర్తియైన హరునకు నమస్కరించుచున్నాను. ఎవ్వఁడు కాలరూపుఁడో, జగదాదికర్తయే, పృథ గ్రూపము ధరించి లోకసరంక్షకుఁడో, ఎవడు రుద్ర రూపముదాల్చి సర్వమును నాశనము చేయునో, అట్టి కాలరూపుఁడయిన హరుని శరణు జొచ్చెదను. (32) అని ఈ విధముగా పలికి భార్గవుఁడు ఆత్రముగా హరుని అంఘ్ర సమీపమున పడి సాష్టాంగ ప్రణామ మాచరించేను. ఈశ్వరుఁడు వామకరముతో అతనిని లీలతో లేవదీసి సంతోషముతో ఆ కరుణార్ణవుఁడు తన దక్షిణకరమును ఆతని శిరస్సున నుంచెను. ఆదరముగా ఆతనిని ఆశీస్సులతో నభినందించెను. ఆతనిని గణేశ్వరుని ముందు కూర్చుండబెట్టేను. కృపార్ధ్ర దృష్టితో సర్వకామములను తీర్చు పరమేశ్వరుఁడు ఉమాదేవిని చూచి, ఆతనితోనిట్లనెను.
శివుఁడిట్లనెను.
ఓ బ్రహ్మచారి ! నీవెవఁడవు? ఎవని యొక్క కులమున పుట్టితివి? ఏ కార్యమునుద్దేశించి నీవిచ్చటకు వచ్చితివి? దానిని కూర్చి చెప్పుము. నీ భక్తి భావముచే మిక్కిలి ఆనందించితిని. నీ మనస్సులో నేదియున్నదో దానిననుగ్రహించెదను ! అని ఈ విధముగా విశ్వము యొక్క ఆర్తిని తొలగించు మహాత్ముఁడయిన హరునిచే పలుకబడి భార్గవుడు మరల నమస్కరించి, విబుధులకధిపతియు, కృపా సముద్రుఁడయిన శివునితో సత్వర మిట్లనెను. (పరశురాముఁడిట్ల)నెను. భృగువంశీయుఁడను జమదగ్ని కుమారుఁడను. పేరు రాముఁడు జగద్వంద్యుఁడవయిన నిన్ను శరణుజొచ్చితిని. ఏ కార్యము కోరకు నీ సాన్నిధ్యమున కరుగుదెంచితినో, ఓ విశ్వేశ నావాంఛితమయిన కామమును నెరవేర్పుము. (38)
మృగయామాగతస్యాపి కార్తవీర్యస్య భూపతేః ।
ఆతిథ్యం కృతవాన్ దేవ జమదగ్నిః పితా మమ ॥
రాజా తం స బలాల్లోభాత్పాతయామాస మందధీః ।
సా ధేనుస్తం మృతం దృష్ట్వా గవాం లోకం జగామ హ ॥
రాజా న శోచన్మరణం పితుర్మమ నిరాగసః ।
జగామ స్వపురం పశ్చాన్మాతా మే పారుదద్భృశమ్ ॥
తజ్జ్ఞాత్వా లోకవృత్తజ్ఞో భృగుర్నః ప్రపితామహః ।
ఆజగామ మహాదేవ హ్యహమప్యాగతో వనాత్ ॥
మయా సహ సుదుఃఖార్తాన్ భాతృన్ మాత్రా సహైవ మే ।
సాంత్త్వయిత్వా స మంత్రజ్జోఽజీవయత్పితరం మమ ॥
అనాగతే భృగౌ మాతుర్దుఃఖేనాహం ప్రకోపితః ।
ప్రతిజ్ఞాం కృతవాన్దేవ ! సాంత్వయన్మాతరం స్వకామ్ ॥
త్రిఃసప్తకృత్వో యదురస్తాడితం మాతురాత్మనః ।
తావత్సంఖ్యమహం పృథ్వీం కరిష్యే క్షత్రవర్జితామ్ ॥
ఇత్యేవం పరిపూర్ణాం మే కర్తా దేవో జగత్పతిః ।
మహాదేవో హ్యతో నాథస్త్వత్సకాశమిహాగతః ॥
వసిష్ఠ ఉవాచ :-
ఇత్యేవం తద్వచః శ్రుత్వా దృష్ట్వా దుర్గాముఖం హరః ।
బభూవానమ్రవదనశ్చింతయానః క్షణం తదా ॥
ఏతస్మిన్నంతరే దుర్గా విస్మితా ప్రాహసద్భృశమ్ ।
ఉవాచ చ మహారాజ భార్గవం వైరసాధకమ్ ॥
తపస్విస్ ద్విజపుత్ర ! క్షాం నిర్భూపాం కర్తుమిచ్ఛస్ ।
త్రిఃసప్తకృత్వః కోపేన సాహసస్తే మహాన్ వటో ! ॥
హంతుమిచ్ఛసి నిఃశస్త్రః సహస్రార్జునమీశ్వరమ్ ।
భ్రూభంగలీలయా యేన రావణోఽఫి నిరాకృతః ॥
నా తండ్రి జమదగ్ని వేటకై యరణ్యమునకు వచ్చిన కార్తవీర్య భూపతికి ఆతిథ్యమొసంగెను. మందబుద్ధియయిన యారాజు లోభగుణమువలన తనబలములతో నాతండ్రిని పడగొట్టెను. మాతండ్రిని మృతి పొందినవానిగా జూచి, ఆ ధేనువు గోలోకమునకు పోయేను. దోషరహితుఁడయిన నా తండ్రిని చూచి కార్తవీర్యుడు విచారింపలేదు. స్వనగరమున కరిగెను. తరువాత మా మాత అత్యంత దీనముగా రోదించెను. లోక వృత్తము నెంగినవాఁడు, నా ప్రపితామహుఁడగు భృగువు వచ్చెను. వనము నుండి నేనునప్పుడే వచ్చితిని. నాతో సహితముగా దుఃఖార్తులయిన సోదరులను, మా అమ్మను ఓదార్చి, ఆ మంత్రజ్ఞుండు నొ తండ్రిని బ్రతికించెను. (43) భృగువు యొక్క రాకకు పూర్వము నా మాతృ దుఃఖముచే మిక్కిలి క్రుద్ధుఁడనయితిని. మా అమ్మను ఓదార్చుచు నేనొక ప్రతిజ్ఞను చేసియుంటిని. మా తల్లి దుఃఖముచే ఇరువది యొక్కమారు ఉరమును గొట్టుకొనెను. ఆ యిరువదియొక్కమారు భూమినంతటిని క్షత్ర రహితముగ చేసెదను అని ప్రతిజ్ఞ జేసితిని. జగత్పతియైన మహాదేవుఁడు నా ప్రతిజ్ఞను పరిపూర్తి గావించును. ఓ ప్రభూ ! అందు నిమిత్తము నేను నీ సకాశమునకు వచ్చితిని అనెను.
వసిష్ఠుఁడిట్లనెను.
రాముని పలుకులను విని దుర్గాదేవి ముఖమును చూచి, నమ్రవదనుఁడై శివుఁడు ఒక క్షణ కాలము ఆలోచించెను. (47) అంతలో, ఆశ్చర్యపడిన దుర్గాదేవి చాలసేపు నవ్వుకోనేను. తరువాత భార్గవుఁడయిన రామునితో వైరసాధనమును గూర్చి మాటాడెను. ఓ ద్విజ పుత్ర ! ఓ తపస్వీ ! కోపముతో ఇరువది యొక్క మారు భూమిని క్షత్రియ రహితముగ చేయగోరి మహా సాహస కార్యమాచరించితివి. ఈశ్వర సదృశం డయిన కార్తవీర్యార్జునుని శస్త్ర రహితముగా చంపఁగోరితివీ, ఆ కార్తవీర్యుఁడో తన కనుబొమ్మయొక్క చలనము మాత్రమున సులభముగా రావణుని నిరాకృతునిగ జేసెను.
తస్మై ప్రదత్తం దత్తేన శ్రీహరేః కవచంపురా । శక్తిరత్యర్థవీర్యా చ తం కథం హంతుమిచ్ఛసి ॥
శంకరః కరుణాసిద్ధః కర్తుం చాప్యన్యథా విభుః ।
న చాన్యః శంకరాత్పుత్ర సత్కార్యం కర్తుమీశ్వరః ॥
అథ దేవ్యా అనుమతిం ప్రాప్య శంభుర్ధయార్ణవః ।
అభ్యధాత్భద్రయా వాచా జమదగ్నిసుతం విభుః ॥
శివ ఉవాచ :-
అద్యప్రభృతి విప్ర త్వం మమ స్కందసమో భవ ।
దాస్యామీ మంత్రం దివ్యం తే కవచం చ మహామతే ॥
లీలయా యత్ప్రసాదేన కార్తవీర్యం హనిష్యసి ।
త్రిఃసప్తకృత్వో నిర్భూపాం మహీం చాపి కరిష్యసి ॥
ఇత్యుక్త్వా శంకరస్తస్మై దదౌ మంత్రం సుదుర్లభమ్ ।
త్రైలోక్యవిజయంనామ కవచం పరమాద్భుతమ్ ॥
నాగపాశం పాశుపతం బ్రహ్మాస్త్రం చ సుదర్లభమ్ ।
నారాయణాస్త్రమాగ్నేయం వాయవ్యం వారుణం తథా ॥
గాంధర్వం గారుడం చైవ జృంభణాస్త్రం మహాద్భుతమ్ ।
గదాం శక్తిం చ పరశుం శూలం దండమనుత్తమమ్ ॥
శస్త్రాస్త్రగ్రామమఖిలం ప్రహృష్ట: సంబభూవ హ ।
నమస్కృత్య శివం శాంతం దుర్గాం స్కందం గణేశ్వరమ్ ॥
పరిక్రమ్య యయౌ రామః పుష్కరం తీర్థముత్తమమ్ ।
సిద్ధం కృత్వా శివోక్తం తు మంత్రం కవచ ముత్తమమ్ ॥
సాధయామాస నిఖిలం స్వకార్యం భృగునందనః ।
నిహత్య కార్తవీర్యం తం ససైన్యసకులం ముదా ।
వినివృత్తో గృహం ప్రాగాత్సితుః స్వస్య భృగూద్వహః ॥
ఇతి శ్రీ బ్రహ్మాండ మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే భార్గవ చరితేద్వాత్రింశత్తమోఽధ్యాయః॥ పూర్వమాతనికి దత్తాత్రేయుడు శ్రీహరి కవచమును, వీర్యవంతమయిన శక్తిని ఒసంగియుండెను. ఆతనిన ఎట్లు నీవు చంపఁగా కాంక్షింతువు! శంకరుఁడు కరుణాసిద్ధుఁడు. ఆతడే చేయుటకు, చేయకుండుటకు (ఇంకొక విధముగా చేయుటకు) ప్రభువు. ఓ బిడ్డా ! శంకరుని కంటే వేఱొకఁడెవఁడు తత్కార్యము నాచరించుటకు శక్తుఁడు కాఁడు. (52) అనెను. అంత దేవి యొక్క అనుమతిని పొంది, దయార్ణవుఁడయిన శంభువు జమదగ్ని సుతునితో మంగళకర వాక్యము లిట్లు పలికెను.
శివుఁడిట్లనెను.
ఈ రోజు నుండి ఓ విప్ర ! నీవు నాకు స్కందసముఁడవు కమ్ము. ఓ మహామతీ ! దివ్యమయిన మంత్రమును కవచమును నీకిచ్చెదను. అలవోకగా నీవు వాని ప్రభావ ప్రసాదమున కార్తవీర్యుని చంపఁగలవు. నీవీ భూమీనీ కూడ ఇరువది యొక్క మారు భూపతి రహితముగ చేయగలవు. త్రైలోక్య విజయమను కవచమును, పరమాద్భుతమయిన నాగపాశమును, సుదుర్లభమయిన పాశుపతమును, బ్రహ్మాస్త్రమును నారాయణాస్త్రమును, ఆగ్నేయాస్త్రమును, వారుణాస్త్రమును, గాంధర్వాస్త్రమును,గరుడాస్త్రమును, మహాద్భుతమయిన జృంభణాస్త్రమును, గదను, శక్తిని, శూలమును, దండమును, ఉత్తమమయిన శస్త్రాస్త్ర గ్రామము నొసంగెదను. వీని నన్నింటిని గ్రహించి రాముఁడు మిక్కిలి సంతుష్టుల డయ్యెను. శాంతుఁడయిన శివునకు, దుర్గకు, స్కందునకు, గణేశ్వరునకు నమస్కరించి, రాముఁడు ఉత్తమ తీర్థమయిన పుష్కరమునకు బయలు దేరి వెళ్లాను, శివోక్తమయిన ఉత్తమ మంత్ర కవచములను సిద్దము చేసికొని భృగునందనుఁడు స్వకార్యము నంతటిని సాధించేను. కార్తవీర్యుని ససైన్యముగా, స్వకుల బాంధవ యుతముగా సంతోషముగా చంపి, ముందుగా భృగువు తన తండ్రి గృహమునకు తిరిగి వచ్చెను.
ఇది వాయుప్రోక్తము మహాపురాణమునయిన బ్రహ్మాండపురాణమునందు మధ్యభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున భార్గవచరితమున ముప్పది రెండవ అధ్యాయము.
Summary of chapter 70 of the Brahmānda Mahā Purana is as follows:
In a moment of profound spiritual brilliance, this chapter describes king Yayāti's sudden realization that worldly desire is never quenched by gratification, just as fire is never extinguished by ghee. The narrative portrays his graceful renunciation of youth and kingdom, and his final discourse on dispassion before departing for holy penance in the forest. The seeking soul is deeply moved by his wisdom, resolving to turn away from transient senses and seek eternal peace.