19 - ఫ్లక్షద్వీప వర్ణనము

సూత ఉవాచ :-

ప్లక్షద్వీపం ప్రవక్ష్యామి యథావదిహ సంగ్రహాత్ ।

శ్రుణుతేమం యథాతత్వం బ్రువతో మే ద్విజోత్తమాః ॥

జంబుద్వీపస్య విస్తారార్డ్విగుణస్తస్య విస్తరః ।

విస్తారాద్ద్విగుణశ్చాస్య పరిణాహసః సమంతతః ॥

తేనావృతసముద్రో వై ద్వీపేన లవడోదరః ।

తత్ర పుణ్యా జనపదాళ్చిరాన్న ప్రియతే జనః ॥

కుత ఏవ చ దుర్భిక్షం జరావ్యాధిభయం కుతః ।

తత్రాపి పర్వతాః పుణ్యాః పత్తేవ మణిభూషణాః ॥

రత్నాకరాస్తథా నద్యప్రాసాం సామాని చ బ్రువే ।

ప్లక్షద్వీపాదిషు త్వేషు సప్త సప్త తు పంచసు ॥

ఋజ్వయతాః ప్రతిదేశం నివిష్టా వర్షపర్వతాః ।

ప్లక్షద్వీపే తు వక్ష్యామి సప్తద్వీపాన్ మహాబలాన్ ॥

గోమేదకోఽఖత్ర ప్రథమః పర్వతో మేఘ సన్నీభః ।

ఖ్యాయతే యస్య నామ్నా తు వర్షం గోమేదసంజ్ఞాతమ్ ॥

ద్వితీయః పర్వతశ్చంద్రః సర్వౌషధిసమన్వితః ।

అశ్విభ్యామమృతస్వార్థమోషధ్యో యత్ర సంభృతాః ॥

తృతీయో నారదో నామ దుర్గశైలో మహోచ్చయః ।

శత్రాచలే సముత్పన్నో పూర్వం నారదపర్వతో ॥

చతుర్ధస్తత్ర వైశైలో దుందుభిరామ నామతః ।

ఛందమృత్యుః పురాతస్మిన్ దుందుభిః సాదితః సురైః ॥

సూతుఁడిట్లు చెప్పెను :

ఇక ముందు ఉన్నదున్నట్లుగా ప్లక్ష ద్వీపమును గూర్చి పంగ్రహముగా చెప్పెదను. ఓ బ్రాహ్మణోత్తములారా ! నేను యథాతత్త్వముగా చెప్పు దీనిని గూర్చి వినుఁడు. (1) జంబూద్వీపము యొక్క విస్తృతీ కంటే ఇదీ రెండితలు. దాని చుట్టు కొలత దాని విస్తారమునకు రెండింతలు. (2) లవణ సముద్రము ఆ ద్వీపముచే ఆ వృతమయి యున్నది. అందలి జనపదములు (పల్లెలు, పట్టణములు) పుణ్యములయినవి. ప్రజలందు చిరకాలమునకు కానీ మృతినొందరు. [3) ఇటి వారికి దుర్భిక్షమెక్కడిది; జరావ్యాధుల వలన భయమొక్కడిది? అందు సప్త పుణ్య పర్వతములు కలవు. ఆ పర్వతములు మణులచే, కూడియున్నవి. (మణులచే నలంకృతములు) (4) అందు రత్నాకరములు (రత్న స్థానములు) కలవు. అందు నదులును కలవు. వాని నామములను చెప్పెదము. పక్ష ద్వీతము మొదలయిన యాయైదింటియందు, సప్త పర్వతములు కలవు. అవి వంకర లేక ఋజువుగా నున్నవి; దీర్ఘములు; ఆవి వర్ష పర్వతవులు ప్రతీదీశ యందున్నవి. ఆ ప్లక్షద్వీపము నందు మిక్కిలి శక్తిమంతములయిన ఉపద్వీపములున్నవి వానిని గూర్చి చెప్పెదను. (6) వానిలో మొదటిది గోమేదక పర్వతము. అది మేఘ సన్నిభము. దాని పేరును బట్టియే ఆ ద్వీపమునకు గోమేదక ద్వీప సంజ్ఞ కలిగినది. (7) రెండవదీ చండ్రపర్వతము. అది సర్వెషధీ సంపన్నము. అమృతము కోతలకిందుండియే అశ్వనీ దేవతలు ఓషధులను సంపాదించిరి. (8) మూఁడవది ‘నారద’ మను వర్వతము. ఇది చాల నున్నతమైనది. దుర్గమము. పూర్వ మీ షర్వతమునందే నారదుఁడు పర్వతంఁడు పుట్టిరి. నాలుగవ పర్వతము దుందుభి నామకము. ఈ పర్వతము నందే పూర్వము ఇచ్ఛామరణ వరము పొందిన దుందుభియను రాక్షసులని దేవతలు చంపిరి. (10)

రజ్జుదేలోరుకామం యః శాల్మల్చీసుధాకతకృత్ ।

పంచమం సోమకో నాకు దేవైధ్యత్రామృతం పురా ॥

సంభృతం చాహృతం చైవ మాశుఠఢీ గరుత్మతా ।

షష్ణస్తు సుముతో పోమ సప్తమర్షభ ఉచ్యతే ॥

హిరణ్యాక్షో వరాహేణ తస్మిన శైలే నిషదితః  ।

మైభాజః సప్తమస్తత్ర శ్రాజిష్ణుః స్ఫటికో మహాన్ ॥

అర్చీర్భీర్భాజతే యస్మాద్వైజస్తేన సంస్కృత ।

తేషాం వర్షాణి వక్ష్యామీ నోమతస్తు యథాశ్రమమ్ ॥

గోమేదం ప్రథమం వర్షం సామ్నా శాంతభయం సతమ ।

చంద్రస్య శశిరం నామ నారదస్య సుభోదయమ్ ॥

ఆనందం దుందుభేర్వర్షం సోమకస్య శివ స్మృతమ్ ।

గ క్షేమకం వృషభస్యాపి వైఖోజస్య ధ్రువం తథా ॥

ఏతేషు దేవగంధర్వః సిద్దాశ్చ సహచారణైః ।

వీహరంతో రమంతే చ దృశ్యమానాశ్చ త్రైః సహ ॥

తేషాం సద్యస్తు సప్తవ ప్రతీవర్షం సముద్రగాః ।

సామతస్తాః ప్రవక్ష్యామి సప్తగంగో స్తపోధనాః ॥

అనుతప్తా సుఖీచైవ విపాశా త్రిదివా క్రముః ।

అమృతా సుకృతా చైవ సప్తతాః సరితాం వరః ॥

అభిగచ్ఛంతి తా నద్యస్తాభ్యశ్చాన్యాః సహస్రశః ।

బహూదకా హ్యోఘవత్యో యతో వర్షతి వాసవః ॥

ఈ రాక్షసునకు త్రాటి ఉయ్యేలలో శాల్మలీ వృక్షము నుండి యూగుటకు నభిలాష. అదియే యాతనికి మరణమును తెచ్చెను. పంచమ పర్వతము సోమకము. అందే పూర్వము దేవతలు అమృతమును సంభృతము చేసిరి (సంపాదించిరి), ఆయమృతము తల్లికొఱకు గరుడుడు (ఇచ్చట నుండీయే) తెచ్చెను. (12) అవది సుమన పర్వతము. ఈ పర్వతమునందే హిరణ్యాక్షుఁడు పూర్వము వరాహముచే చంపఁబడెను. ఏం డవ పర్వతము వైభోజము. అయ్యది ప్రకాశవంతమయినది. చాల ఉన్నతమయినది; అది స్పటిక శిలామయము. (స్ఫాటికము). అయ్యది కాంతులచే ప్రకాశించుటచే వైభ్రాజ పర్వతముగా స్మరింపఁబడుచున్నది. దాని ఉపవర్షములను పోని నామములను క్రమముగా చెప్పేదను. (14) మొదటి ఉపవర్షము గోమేదము. ఇయ్యది ‘శాంతభయము’ అన్న పేరితో స్మరింపఁబడుచున్నది. చంద్రపర్వతపు ఉపవర్షము శిశిర నామకము. నారద పర్వతోషవరము సుభోదయము. (15) దుందుభి పర్వతపు టుపవర్షము ‘ఆనందము’. సోమక పర్వతోషవరము ‘శివము’ వృషభ పర్వతము యొక్క ఉపవర్షము క్షేమకము. (సుమనాః). వైభ్రాజ పర్వతోపవర్షము ధ్రువనామకము (16) ఈ ఉపవర్షము లన్నింటియందు దేవతలు, గంధర్వులు సిద్దులు చారణులతో సహితముగా విహరింతురు. రమింతురు. వారితో సహ వారు దర్శనీయులు (కనంబడుదురు). ప్రత్యుపవర్షము నందును సప్తనదులు గలవు. అవియన్నియు సముద్రగాములు; ఓ తపోధనులారా ! ఈ సప్త గంగల నామములు చెప్పెదను. (18). ఆ శ్రేష్ఠములయిన నదులు అనుతప్త, సుఖీ, విపాశా, త్రిదివ, క్రము, అమృత, సుకృతయునునవి. సహస్ర సంఖ్యలో అనేక నదులు వానితో గలియును. అవి యన్నియు బహూదకములు; ఆ నదులు ఇంద్రుఁడు వర్షించు ప్రదేశముల నుండి పారును. (20)

తాః పిబంతీ సదా హృష్టా నదీజనపదాస్తు తే ।

శుభాః శాంతభయాశ్చైవ ప్రముదం శైశీరాః శివాః ॥

ఆనందాశ్చ సుఖాశ్చైవ క్షేమకాశ్చ ధ్రువైః సహ ।

వర్ణాశ్రమాచారయుతా ప్రజాస్తేష్వవధిష్ఠితాః ॥

సర్వే త్వరోగాః సుబలాః ప్రజ్ఞాశ్చామయవర్జితాః ।

అవసర్పిణీ న తేష్వస్తి తథైవోత్సర్పిణీ న చ ॥

న తత్రాప్తి యుగావస్థా చతుర్యుగకృత క్వచిత్ ।

త్రేతాయుగసమః కాలః సర్వదా తత్ర వర్తతే ॥

ఫ్లక్షద్వీపాదిషు జేయః పంచస్వేతేషు సర్వశః ।

దేశస్యానువిధానేన కాలస్యానువీధాః స్మృతాః ॥

పంచవర్ష సహస్రాణి తేషు జీవంతి మానవాః ।

సురూపాశ్చ సువేషాశ్చ హ్యరోగా బలినస్తథా ॥

సుఖమాయుర్బలం రూపమారోగ్యం ధర్మ ఏవ చ ।

ప్లక్షద్వీపాదిషు జేయః శాకద్వీపాంతికేషు వై ॥

ప్రక్షద్వీపః పృథుః శ్రీమాన్సర్వతో ధనధాన్యవాన్ ।

దివ్యౌషధి ఫలోపేతః సర్వౌషధివనస్పతిః ॥

ఆవృతః పశుభిస్సర్వై గ్రామ్యారడ్యైః సహస్ర శః ।

జంబూవృక్షేణ సంఖ్యాతస్తస్య మధ్యే ద్విజోత్తమాః ॥

ప్లక్షో నామ మహావృక్షస్తస్య నామ్నా స ఉచ్యతే ।

స తత్ర పూజ్యతే స్థానే మధ్యే జనపదస్య హ ॥

సంహృష్ణులయిన ఆ నదీ ప్రాంతముల వసించు జానపదులు ఆ నదుల నీటిని త్రాగుదురు. ఆ జానపదులు - శుభంకరులయిన శాంత భయులు, ఆనందప్రదులైన శైశిరులు, శివులు, ఆనందులు, సుఖులు, క్షేమకులు, ధ్రువులు. అందు అధిష్ఠితులయిన ప్రజలు, వర్ణాశ్రమాచార యుతులు. (22) అందరు రోగ రహితులు, సుబలులు; ప్రజలందరు రోగరహితులు అందులో (ఆ ప్రజలలో) అవసరిణులు (అనఁగా వర్ణాచారముల యందు భ్రష్టులయిన వారు) గానీ ఉత్సరీణులు (వర్ణాచారములను గర్వముతో ముల్లంఘించి వర్తించిన పోరు) గాని లేరు, (23) చతుర్యుగములచే నియమితములయిన యుగ సంబంధి అవస్థలచ్చట లేవు. త్రేతా యుగముతో తుల్యమయిన కాలమందు నీళ్యముగా నుండును. (24) ప్లక్షద్వీపాదుల యందీ పరిస్థితులు కలవని యెఱుంగవలయును. దేశము యొక్క అనువిధానము ననుసరించియే కాలము యొక్క అనువిధానముండునని యెలంగవలయును. (25) ఈ వరములందుండు జనములు, ప్లక్ష ద్వీపముతో మొదలిడి శక ద్వీపము వఱకు, సురూపులు, సువేషులు, అరోగులు, బలవంతులు, సుఖులు, ఆయుర్బలం కలవారు, ఆరోగ్యము ధర్మము కలవారు; ఐదువేల యేండ్లు ఆయుర్గా యము కలవారని యెఱుంగవలయును. (27) ప్లక్ష ద్వీపము చాల పెద్దదీ; ధనవంతమయినదీ; ధాన్యవంతమయినది. దేవతా సంబంధమయిన ఔషధములతో ఫలములతో కూడినది; అందు సర్వౌషదీవృక్ష సంతానము కలదు. ఓ బ్రాహ్మణులారా ! వేలకొలది గ్రామ్య పశువులు, ఆరణ్య పశువులావర్షమున కలవు. దానీ మధ్య ఒక గొప్ప వృక్షము కలదు. అది ప్లక్ష వృక్షము (మట్టి) ఆ పేరుతో నది. పిలువఁబడినది. జనపదముల మధ్య ఆ వృక్షము అందు పూజింపఁబడును; అయ్యది జంబూ వృక్షముతో సమానముగా చెప్పబడినది. (30)

స చాపీక్షురసోదేన ప్లక్షద్వీపః సమావృతః ।

ప్లక్షద్వీపసమేనైవ వైపుల్యాద్విస్తరేణ తు ॥

ఇత్యేవం సంనివేశో వః ప్లక్షద్వీపస్య కీర్తితః ।

ఆనుపూర్వ్యాత్ సమాసేన శాల్మలం తు నిబోధత ॥

తతస్తృతీయం వక్ష్యామి శాల్మలమ్ ద్వీపముత్తమమ్ ।

శాల్మలేన సముద్రస్తు ద్వీపేనేక్షురసోదకః ॥

ప్లక్ష ద్వీపస్య విస్తారాద్ద్విగుణీన సమావృతః ।

తత్రాపి పర్వతాః సప్త విజ్ఞేయా రత్నయోనయః ॥

రత్నాకరాస్తథా నద్యస్తేషాం సర్వేషు సప్తసు ।

ప్రథమః సూర్యసంకాశః కుముదో నామ పర్వతః ॥

సర్వధాతుమయైః శృంగైః శిలాజాలసమాకులైః ।

ద్వితీయః పర్వతశ్చాత్ర హ్యుత్తమో నామ విశ్రుతః ॥

హరితాలమయైః శృంగైర్డివమావృత్య తిష్ఠతి ।

తృతీయః పర్వతస్తత్ర బలాహక ఇతి స్మృతః ॥

జాత్యంజనమయైః శృంగై ఠీవమావృత్య తిష్ఠతి ।

చతుర్థః పర్వతో ద్రోణో యత్ర సావై మహౌషధీః ॥

విశల్యకరణే చైవ మృతసంజీవనీ తథా ।

కంకస్తు పంచమస్తత్ర పర్వతః సుమహోదయః ॥

నిత్యపుష్టఫలో పేతో వృక్ష వీరుత్సమావృతః ।

షష్ఠస్తు పర్వతస్తత్ర మహిషో మేఘసన్నిభః ॥

ప్లక్ష ద్వీపము ఇక్షురసోదకములచే నొప్పిన సముద్రముచే నావృతము. విపులత్వమున, విస్తారమున ప్లక్ష ద్వీపముతో తుల్యమైనది యీ సముద్రము. (31,32) ఇట్లు ప్లక్ష ద్వీపము యొక్క యునికి మీకు మొదటి నుండియు వివరింపఁబడినది. ఇక మూఁడవది, ద్వీపములలో నుత్తమమైనదీ శాల్మల ద్వీపము గూర్చి చెప్పెదను. శాల్మల ద్వీపముచే ఇక్షురసోదక సముద్రము ఆవృతమయినది. అయ్యదీ పక్ష ద్వీపమునకు రెండింతలు ఆయతనము కలది. అందునుఁగూడ ఏడు పర్వతములు కలవు. ఆ యేడు పర్వతములు రత్నములకు జన్మ స్థానములు. (34) ఆ యేడు ఉపవర్షములందలి నదులు కూడ ప్రశస్తములయిన రత్నములకు ఆకరములు. మొదటి పర్వతము కుముదము. అయ్యది కాంతిలో సూర్యునితో సమానమయినది. దాని శృంగములు సర్వధాతుమయములు; శిలాజాల సమాకులములు. రెండవ పర్వతము ‘ఉత్తమ’ మను నామముతో చాల ప్రసిద్దమయినదీ, అయ్యదీ హరీతొలి మయమయిన శృంగములతో ఆకాశము నాచరించి యున్నది. (36) మూడవ పర్వతము బలాహకమను నామముతో ప్రసిద్దమయినది. అయ్యదీ జాత్యంజనమయములైన శిఖరములతో ఆకాశమునంటీయున్నది. (అంజనము) కాటుక. జాత్యంజనము = ఉత్తమ అంజనము). (37) నాలుగవది ద్రోణ పర్వతము, ఇందు మహౌషధులు కలవు. విశల్యకరణి, మృతసంజీవని అను ఓషధులందు లభించును. కంకము ఐదవ పర్వతము, అదీ మీక్కిలి యున్నతమయినది. (సమహోదయము). ఇందు నిత్యపుష్ప ఫలోపేతములయిన వృక్షలతలు కలవు. ఆవ పర్వతము మహిషము. అది మేఘ సన్నిభము. (40)

యస్మినోఽగ్నిర్నివసతీ మహిషో నామ వారీజః ।

సప్తమః పర్వతస్తత్ర కకుద్మోన్ నామ భాష్యతే  ॥

తత్ర రత్నాన్యనేకానీ స్వయం రక్షతి వాసవః ।

ప్రజాపతిముపాదాయ ప్రజాభ్యో విధివత్స్వయమ్ ॥

ఇత్యేతే పర్వతాః సప్త శాల్మలే మణిభూషణాః ।

తేషాం వర్షాణి వక్ష్యామీ సప్తవ తు శుభాని వై ॥

కుముదస్య స్మృతం శ్వేతముత్తమస్య చ లోహితమ్ ।

వలాహకస్య మూతం ద్రోణస్య హరితం స్కృతమ్ ॥

కంకస్య వైద్యుతం నామ మహిషస్య చ మానసమ్ ।

కకుదః సుప్రదం నామ సప్తతాని తు సప్తథా ॥

వర్షాణి పర్వతాంశ్చైవ నదీస్తేషు నిబోధత ।

జ్యోతిః శాంతిస్తథా తుషా చంద్రా శుక్రా విమోచనీ ॥

నిర్వతిః సప్తమీ తాసాం ప్రతివర్షం తు తాః స్మృతాః ।

సాం సమీపగాశ్చాన్యాః శతశోథ సహస్రశః ॥

న సంఖ్యాం పరిసంఖ్యాతుం శక్నుయాత్కోపి మానవః ।

ఇత్యేష సన్నివేశో వః శాల్మలస్య ప్రకీర్తితః ॥

ప్రక్షవృక్షేణ సంఖ్యాతస్తస్య మధ్యే మహాద్రుమః ।

శాల్మలిరిపులస్కంధస్తస్య నామ్నా స ఉచ్యతే ॥

శాల్మలస్తు సముద్రేణ సురోదేన సమావృతః ।

విస్తారాచ్ఛాల్మలస్యైవ సమేన తు సమంతతః ॥

ఆరవ పర్వతము మహిష నామకము. అది మేఘజము. మేఘమువలె నుండును. దాని యందు నీటిని పుట్టించు మహిషమను అగ్ని యుండును. (41) ఏడవ పర్వతము కకుద్మంతము, అందు ప్రజల నుండి ఇంద్రుఁడు అనేకములయిన రత్నములను సంపాదించి రక్షించును. తన కోఱకు వానినుంచుకొనును. వానితో ప్రజాపతిని సమీపించును. (42) ఇట్లు శాల్మల ద్వీపమునందే ఏడు పర్వతములు కలవు. అవి మణి భూషితములు. వాని యందలి ఉపవర్షములను పేర్కొందును. అవి కూడ ఏఁడు. శుభవంతములు. (43) కుముద పర్వతపు ఉపవర్షము శ్వేతము. ఉత్తమ పర్వతపు ఉపవర్షము లోహితము. వలాహక పర్వతపు ఉపవర్షము జీమూతము. ద్రోణ పర్వతపవర్షము హరితము. (44) కంక పర్వతోపవరము వైద్యుతము. మహిష పర్వతోపవర్షము మానసము. కకుదము యొక్క ఉపవర్షము సుప్రదము. అందు ఏడు ఉపవర్షములు సప్త పర్యత సంబంధములు కలవు. (45) వానియందలి నదులను గూర్చి యెఱుంగుము. అయ్యవి జ్యోతి, శాంతి, తుష్ట, చంద్ర, శుక్ర, విమోచని, నిర్వతి అనునవి యేడు. ప్రత్యుపవర్షము నందు వానిని నదులుగా స్మరింతురు. కానీ సమీపమున వందలాది వేలాది ఎన్నో ఇతర నదులు కలవు. (46,47) ఏ మానవుండు వాని సంఖ్యను చేప్పగా శక్తుఁడుకాఁడు. ఇట్లు శాల్మ సన్నివేశము మీ కోకు కీర్తింపఁబడినది. (48) దాని మధ్యముననొక గొప్ప శాల్మలీ వృక్షము కలదు. దానికి ప్లక్ష వృక్షముతో సాటి చెప్పెదరు. దానికి (శాల్మలికి) విపుల సుంధము కలదు. విపుల శాఖలు కలవు. దాని పేరనే ఆ వర్షము వ్యవహరింపఁబడినది. (49). శాల్మల ద్వీపము నాల్గువైపుల సముద్రముచే నావృతమయి యున్నది. ఆ సముద్రము సురోదము మద్యయుతము దాని విస్తీర్ణముననది శాల్మలితో సమానమయినది. (50)

ఉత్తరేషు చ ధర్మజ్ఞా ద్వీపేషు శ్రుణుత ప్రణతాః ।

యథాశ్రుతం యథాన్యాయం బ్రువతో మే నిబోధత ॥

కుశద్వీపం ప్రవక్ష్యామి చతుర్థం తు సమాసతః ।

సురోదకః పరివృతః కుశద్వీపేన సర్వతః ॥

శాల్మలస్య తు విస్తారార్ద్విగుణేన సమంతతః ।

సఫైవ చ గిరీంస్తత్ర వర్జ్యమానాన్నిబోధత ॥

కుశద్వీపే తు విశ్లేయః సర్వతో విద్రుమశ్చయః ।

ద్వీపస్య ప్రథమస్తస్య ద్వితీయో హేమపర్వతః ॥

తృతీయో ద్యుతిమాస్నోమ జీమూతసదృశోగిరిః ।

చతుర్థః పుష్పవాన్నామ పంచమస్తు కుశేశయః ॥

షష్ణో హరీగిరిర్నామ సప్తమో మందరః స్మృతః ।

మందా ఇతి హ్యపాం నామ మందరో దారణాదయమ్ ॥

తేషామంతరవిష్కంభో ద్విగుణః ప్రవిభాగతః ।

ఉద్భిదం ప్రథమం వర్షం ద్వితీయం వేణుమండలమ్ ॥

తృతీయం వై రథాకారం చతుర్థం లవణం స్మృతమ్ ।

పంచమం ధృతిమద్వర్షం షష్ఠం వర్షం ప్రభాకరమ్ ॥

సప్తమం కపిల సామ సర్వే తే వర్షభావక ।

ఏతేషు దేవ గంధర్వాః ప్రజాస్తు జగదీశ్వరాః ॥

విహరంతి రమంతే చ హృష్యమాణాస్తు సర్వశః ।

న తేషు దస్యపః సంతి మ్లేచ్చజాతయ ఏవ చ ॥

ఓ ధర్మజ్ఞులారా ! ఇఁక ఉత్తరదిశ ద్వీపము లందలి ప్రజలఁగూర్చి వీనుఁడు. నేను విన్న విధముగా వచింతును. తద్విషయమును యథా న్యాయముగా తెలిసికొనుఁడు, (51) నాల్గవదియైన యాద్వీపమును గూర్చి ప్రవచించేదను. కుశద్వీపము సురోదకమను సురసముద్రముచే నావృతమయినది. అయ్యది. విస్తీర్ణమున శాల్మల ద్వీపమునకు రెండింతలు. (52) అందు ఏడు పర్వతములున్నవి. వానిని వర్ణించేదను తెలిసి కొనుఁడు. (53) విద్రుమ పర్వతము కుశద్వీపమున మొదటి పర్వతముగా నెఱుంగవలెను, ఇంక రెండవనది హేమ పర్వతము. (54) తృతీయము ద్యుతిమంతమను పేరు గలిగినది. అయ్యటీ మేఘ సదృశమయిన పర్వతము, నాలుగవది పుష్పవంతమనునది. ఐదవది కుశేశయ నామకము. (55) ఆరవది హరిగిరి. సప్తమము మందరము. మందరమనఁగా నీరు. ఆ పర్వతము నీటిని చేధించును. లేదా చొచ్చుకొని పోవును గాన మందరమను పేరు వచ్చినది. (56) వాని యొక్క ఆంతరమయిన (విష్కంభః) వ్యాసము దాని ప్రవిభాగము కంటే రెండితలు. మొదట ఉపవర్షము . ఉద్భిదము; రెండవది వేణుమండలము. (57) తృతీయమైన ఉపవర్షము రథాకారము. నాలుగవది లవణము. ఐదవది ధృతిమద్వర్షము. ఆరవద్వీపము ప్రభాకరము. (58) ఏడవదీ కపిల నామకము. ఈ సర్వ వరముల యందు దేవతలు, దేవగంధర్వులు ఆ వర్షములను పవిత్రీకర్షించువారు. ఆ వర్షపు ప్రజలు జగదీశ్వరులు, (సర్వప్రభువులు). (59) అత్యంత హర్షముతో వారా వర్షమున సర్వత్ర విహరింతురు, క్రీడింతురు; అందు దొంగలుగాని మ్లేచ్ఛజాతుల వారు కాని లేరు. (60).

గౌరప్రాయో జనః సర్వః క్రమాచ్చ మ్రియతే తథా ।

తత్రాపి నద్యః సప్తైవ ధూతపాపా శివా తథా ॥

పవిత్రా సంతతిశ్చైవ విద్యుద్దంభా మహీ తథా ।

అన్యాస్తాభ్యోపరిజ్ఞానాః శతశోథ సహస్రశః ॥

అభిగచ్ఛంతి తాః సర్వా యతో వర్షతి వాసవః ।

ఘృతోదేన కుశద్వీపో బాహ్యతః పరివారితః ॥

విశ్లేయః స తువిస్తారాత్ కుశద్వీపసమేన తు ।

ఇత్యేష సన్నివేశో వః కుశద్వీపస్య కీర్తితః ॥

క్రౌంచద్వీపస్య విస్తారం వక్ష్యామ్యహమతః పరమ్ ।

కే కుశద్వీపస్య విస్తారాత్ ద్విగుణః స తు వై స్మృతః ॥

ఘృతోదకసముద్రో వై క్రౌంచద్వీపేన సంయుతః ।

తస్మిన్ ద్వీపే నగశ్రేష్ఠః క్రౌంచస్తు ప్రథమో గిరీః ॥

క్రౌంచాశ్చరో వామనకో వామనాదంధకారకః ।

అంధకారాత్పరశ్చాపి దివావున్నాడు పర్వతః ॥

దీపావృతః పరశ్చాపి ద్వివిదో గిరిసత్తమః ।

ద్వీవిదాత్పరతశ్చాపి పుండరీకో మహాగిరిః ॥

పుండరీకాత్పరశ్చాపి ప్రోచ్యతే దుందుభి స్వనః ।

ఏతే రత్నమయాః సప్త క్రౌంచద్వీపస్య పర్వతాః ॥

బహుపుష్పఫలోపేతనానావృక్షలతావృతాః ।

పరస్పరేణ ద్విగుణా విస్తృతా హర్షవర్ధనాః ॥

అచ్చటి ప్రజలెల్లరు శ్వేతవర్టులు. వారెల్లరు క్రమముగా మరణించేదరు. (పెద్దల తరువాత పిన్నలు మృతి చెందుదురు). అచ్చటి నదులు కూడ ఏడు మాత్రమే - అవి - ధూతపాష, శివ, పవిత్ర, సంతతి, విద్యుత్, దంభ, మహి. ఇవికాక వందలు వేలు నదులున్నవి. అవి అసంజ్ఞాతములు. (62) ఆ నదులన్నియు నెందు పాసవుఁడు వర్షించునో తత్పదేశాభిముఖముగ ప్రవహించును. కుశద్వీపము వెలుపల యంతయు ఘృత సముద్రముతో పరీవృతమయినది. ఆ ఘృత సముద్రము కుశ ద్వీపముతో సమానమయిన విస్తీర్ణము కలిగి యున్నదని తెలియవలయును. ఈ విధముగా కుశద్వీపము యొక్క సన్నివేశము మీకు కీర్తింపఁబడినది. (64) ఇటు తరువాత క్రౌంచ ద్వీపము యొక్క విస్తారమును చెప్పెదను. ఇయ్యది కుశద్వీప విస్తారమునకు రెండింతలు. (65) మృతోదక సముద్రము క్రౌంచ ద్వీపముతో కూడి యున్నది. ఆ ద్వీపము నందు ప్రథమ పర్వతము, నగశ్రేష్ఠము క్రౌంచ పర్వతము. (66) క్రౌంచము తరువాత నున్నదీ వామనము. ఆ వామనమే అంధకారము. అంధకారమునకు తరువాత ‘దీవావృత్’ అను పర్వతము కలదు. (67) ఆదివావృత పర్వతమునకు తరువాత ద్వివిద పర్వతము. ద్వివిదమునకు తరువాత పుండరీకమను మహాగీరి కలదు. (68) పుండరీకము దాటిన వెనుక దుందుభిస్వన మను పర్వతము కలదు. ఇవి క్రౌంచ ద్వీప పర్వతములు. ఇవి యేడు. ఇవి యన్నియు మహార్హములయిన రత్నములతో గూడినవి. అయ్యవి బహుపుష్ప ఫలో పేతములయిన నానా విధ వృక్ష లతాదులతో గూడినవి. అవి ఒక్కొక్కటి రెండవ దానికంటే రెండింతలు విస్తృతి కలిగినవి. అందలి జనులకవి ఆనందవర్థకములు. (70)

వర్షాణి తత్ర వక్ష్యామి నామతస్తాన్నిబోధత ।

క్రౌంచస్య కుశలో దేశో వామనస్య మనోనుగః ॥

మనోనుగాత్పరశ్చోష్ణస్తృతీయం వర్షముచ్యతే ।

ఉష్ఠాత్పరః పీవరకః పీవరాదంధకారకః ॥

అంధకారాత్పరశ్చాపి మునిదేశః స్మృతో బుధైః ।

మునిదేశాత్పరశైవ ప్రోచ్యతే దుందుభిస్వనః ॥

సిద్ధచారణ సంకీర్ణో గొరయో జనః స్మృతః ।

తత్రాపి సద్యః సప్తవ ప్రతివర్షం స్మృతాః శుభైః ॥

గౌరీ కుముద్వత్ చైవ సంధ్యా రాత్రిర్మనోజవా ।

ఖ్యాతిశ్చ పుండరీకా చ గంగాః సప్తవిధాః స్మృతాః ॥

తాసాం సహస్రశశ్చానా నదో యాస్తు సమీపగాః ।

అభిగచ్ఛంతి తాః సర్వా విపులాః సబహూదకాః ॥

క్రౌంచద్వీపః సముద్రేణ దధిమందోదకేన తు ।

ఆవృతః సర్వతః శ్రీమాన్ క్రౌంచద్వీపసమేన తు ।

ప్రక్షద్వీపాదయో హ్యేతే సమాసేన ప్రకీర్తితాః ।

తేషాం నిసర్గో ద్వీపానామానుపూర్యేణ సర్వశః ॥

న శక్యో విస్తరాద్వక్తుం దివ్యవర్షశతైరపి ।

నిసర్గో యః ప్రజానాం తు సుహారో యశ్చ తాసు వై ॥

శకద్వీపం ప్రవక్ష్యామీ యథావదిహ నిశ్చయాత్  ।

శృణుధ్వం తు యథాతథ్యం బ్రువతో మే యథార్థవత్ ॥

ఇంక అందలి ఉషవరములను నామతః పేర్కొందును. వాని నెలుంగుము. క్రౌంచమునకు పరిసర ప్రదేశము కుశలము. వామనము మనోనుగము. ఉష్ణము మూఁడవ వర్షము. ఇదీ మనోనుగము తరువాత నున్నది. ఉష్ణము తరువాత పీవరక వర్షము. అంధకారము పీవరకము తరువాత నున్నది. అంధకారమునకు తరువాత ‘మునిదేశము’ ఆ మునీదేశవరము తరువాత దుందుభిస్వనము చెప్పబడినది. (73) సిద్దచారణులందుండుప్రజలు. వారందరు గౌరవర్ణశరీరులుగా తలంపఁబడుదురు. అచ్చటకూడ నదులు ఏడు మాత్రమే. ప్రతివర్షమున ఏడేసి నదులు. అవి శుభప్రదములు. (74) ఆ ఏడు నదులు - గౌరీ, కుముద్వతి, సంధ్యా, రాత్రి మనోజవ, ఖ్యాతి, పుండరీక, ఇవి ‘సప్తగంగలు’గా స్మరింపబడినవి. (75) పొనికి సమీపమున ప్రవహించు అన్యములయిన నదులు సహస్ర సంఖ్యలో నున్నవి. అవి యన్నియు విపులములయిన నదులు. వానియందు నీరధికము. (76) శ్రీమంతమయిన క్రౌంచద్వీపము అన్ని దిక్కుల యందు ద్రవత్వ రూపములోనున్న పెరుగు సముద్రముతో ఆవృతమయి యున్నదీ. (77) ఈ దధీమండోదక సముద్రము విస్తీర్ణమున క్రౌంచ ద్వీపముతో సమానము. ప్లక్ష ద్వీపములు మొదలయినవి స్థూలముగా కీర్తింపఁబడినవి. వానిని క్రమశః అను పూర్వకముగా వాని హాని లక్షణములతో విపులముగా వర్ణించుటకు దేవమానము ననుసరించి వంద యేండ్లకు కూడ శక్యము కాదు. అందలి జనముల పుట్టుకను గూర్చి సంహారమును గూర్చి వర్ణించుట కష్టము. ఇఁక శక ద్వీపమును అదియున్నట్టి విధమును చెప్పెదను. యథార్థ కథనము చేయుచుండ మీరందరు వినుఁడు. (80)

క్రౌంచద్వీపస్య విస్తారాద్ద్విగుణస్తస్య విస్తరః  ।

పరివార్య సముద్రం స దధిమండోదకం స్థితః ॥

తత్ర పుణ్యా జనపదాశ్చిరాత్తు ప్రియతే జనః ।

కుత ఏవ చ దుర్భిక్షం జరావ్యాధీభయం కుతః ॥

తత్రాపి పర్వతాః శుభైః సప్తవ మణిభూషణాః ।

రత్నాకరాస్తథా సద్యస్తేషాం నామాని మే శృణు ॥

దేవర్షిగంధర్వయుతః ప్రథమో మేరురుచ్యతే ।

ప్రాగాయతః స సౌవర్ణో హ్యుదయో నామ పర్వతః ॥

వృద్ద్యర్థం జలదోస్తత్ర ప్రభవంతి చ యాంతి చ ।

తస్యాపరేణ సుమహాన్ జలధారో మహాగిరః ॥

యతో నిత్యముషాదత్తే వాసవః పరమం జలమ్ ।

తతో వర్షం ప్రభవతి వర్షాకాలే ప్రజాస్విహ ॥

తస్యోత్తరే రైవతకో యత్ర నిత్యం ప్రతిష్ఠితమ్ ।

రేవతీ దీవి నక్షత్రం పితామహకృతో విధీః ॥

తస్యాపరేణ సుమహాన్ శ్యామో నామ మహాగిరిః ।

తస్మాత్ శ్యామత్వమాపన్నాః ప్రజాః పూర్వమీమాః కిల ॥

తస్యాపరేణ సుమహాన్ రాజతోస్తగిరిః స్మృతః ।

తస్యాపరే చాంబికేయో దుర్గశైలో మహాగిరిః ॥

ఆంబికేయాత్పరో రమ్యః సర్వేషధిసమన్వితః ।

కేసరీ కేసరయుతో యతో వాయుః ప్రజాపతిః ॥

శకద్వీపము విస్తృతిలో క్రౌంచ ద్వీపమునకు రెండింతలు. అయ్యదీ దధిమండోదకము (సముద్రము - పెరుగు పాల నీటితో గూడినది) పరీవృతమయి యున్నది. (81) అందలి జనపదములు చాలపుణ్యవంతములు. అందలి జనులు చిరకాలము జీవించి మరణింతురు. వారికి దుర్భిక్షము లేదు. ముసలితనము వలన, వ్యాధుల వలన భయములేదు. (82) అందు కూడ సప్త పర్వతములు, అవీ మణి భూషితములు, శుభ్రములు, ఆ నదీ సప్తకము రత్నాకరము (రత్నములతో నొప్పునవి). వాని నామముల నాలకించుము. (83) మొట్టమొదటగా మేరువును గూర్చీ చెప్పుచున్నాను. అది దేవరులతో గంధర్వులతో కూడియున్నది. ఇక ఉదయపర్వతము. సువర్ణమయము. తూర్పుగా వ్యాపించి యున్నది. (84) వర్షించుకోకు జలములకై మేఘములచ్చటి కరుగును. అందుండి వర్షింపఁబోవును. దానికి పశ్చిమమున జలధార యనేడు మహాపర్వతము కలదు, (85) అందుండియే ఇంద్రుఁడు (వాసవుండు) ఎల్లప్పుడు అధికముగా జలమును గ్రహించును. అందువలన వర్గాకాలములలో ప్రజల కిందు సువృష్టి కలుగును. (86) దాని కుత్తర భాగమున రైవతకమున్నది. అందు బ్రహ్మచే విధింపఁబడి ఆకాశమున రేవతీ నక్షత్రము నిత్యము ప్రతిష్టితమై యున్నది. (87) ఆ పర్వతమునకు తరువాత శ్యామమను పర్వతము కలదు. అదీ చాల గొప్ప పర్వతము. దాని నీడను (ఛాయను) బట్టియే యందలి జనులు శాశ్వతముగా. శ్యామత్వమును పొందియుండిరి. (88) దానికి పశ్చిమముగా ప్రకాశించునది అస్తగిరి. దానికి పశ్చిమముగా “దుర్గశైలము” కలదు. ఈ దుర్గశైలము అంబికేయునకు చెందినది. (89) ఆంబికేయ పర్వతమునకు పరమున రమ్యము సర్వెషధి సమన్వితము ‘కేసరి’ అను పర్వతము కలదు. ఇందుండియే వాయువు ప్రజాపతి కేసరయుతుఁడయ్యెను. (90)

ఉదయాత్రథమం వర్షం మహత్తజ్జలదం స్మృతమ్ ।

ద్వితీయం జలధారస్య సుకుమారమితి స్మృతమ్ ॥

రైవతస్య చ కౌమారం శ్యామస్య చ మణీవకమ్ ।

అస్తస్యాపి శుభం వర్షం విజ్ఞేయం కుసుమోత్తరమ్ ॥

అంబికేయస్య మోదకం కేసరస్య మహాద్రుమమ్ ।

ద్వీపస్య పరిమాణం తు హ్రస్వదీర్ఘత్వమేవ చ ॥

క్రౌంచద్వీపేన విఖ్యాతం తస్య కేతుర్మహాద్రుమః ।

శాకో నామ మహోత్సేధస్తస్య పూజ్యా మహానుగాః ॥

తత్ర పుణ్యా జనపదాశ్చాతుర్వర్ణ్యసమన్వితాః ।

నద్యశ్చాపి మహాపుణ్యా గంగాః సప్తవిధాస్తథా ॥

సుకుమారీ కుమారీ చ నలినీ వేణుకా చ యా ।

ఇక్షుళ్ళ వేణుకా చైవ గభస్తిః సప్తమీ తథా ॥

నద్యాశ్చానా పుణ్యజలాః శీతతోయవహాః శుభాః ।

సహస్రశః సమాఖ్యాతా యతో వర్షతి వాసవః ॥

న తాసాం సామధేయాని పరిమాణం తథైవ చ ।

శక్యం వైపరీసంఖ్యాతుం పుణ్యాస్తాః సరీదుత్తమాః ॥

తాః పిబంతి సదా హృష్ణా నదీర్జనపదాస్తు తే ।

శాంశపాయన విస్తీర్లో ద్వీపోఽసౌ చక్రసంస్థితః ॥

నదీజలైః ప్రతిచ్ఛన్నః పర్వతైశ్చాభ్రసన్నీభైః ।

సర్వధాతువిచిత్రైశ్చ మణీవిద్రుచుభూషితైః ॥

ఉదయ పర్వతము నుండి ప్రథమ వరము గొప్పది. దానిని జలదమని స్మరించేదరు. రెండవ వరము (ఉపఖండము) జలధార సంబంధమయినది. ‘సుకుమార’ మని స్మరించెదరు. (91) రైవతక వర్షము కౌమారము; అది శ్యామ పర్వతము యొక్క మడీవకము. అస్త పర్వతము యొక్క శుభంకర వర్షము కుసుమోత్తరమని తెలియనగును. (92) అంబికేయ పర్వతము యొక్క యుపఖండము మోదకము. కేసర పర్వతము యొక్క యుపఖండము మహోద్రుమము. ఈ ద్వీపము యొక్క ప్రస్వత్వము, దీర్ఘత్వములు, మొదలగు పరిమాణములు క్రౌంచ ద్వీపము యొక్క పరిమాణములుగనే గణింపవలయును. ఆ ఖండము యొక్క కేతువు (పతాకము - చిహ్నము) ‘శాక’ నామము కలది; అదీ యెక్కువ ఎత్తు. దాని ననుసరించు పూజ్యులు చాలా మంది యున్నారు. అయ్యది పూజింపఁదగినది. తత్సంబంధులయిన జనపదులు పవిత్రులు; వారందరు చాతుర్వర్య సమన్వితులు; అందలి నదులు కూడ గంగవలె మహాపుణ్య ప్రదములు, అయ్యవి సప్తవిధములు. (93,95) ఆ యేడును సుకుమారీ, కుమారీ, నలిని, వేణుక, ఇక్షువు, వేణుక, ఏడవది గభస్తి (96) ఇతరములయిన సహస్ర సంఖ్యా నదులున్నవి. అవి పుణ్యములు; చల్లని నీటితో కూడినవి; శుభంకరములు; అవి ఉత్తమనదులు; అందున వాసవుఁడు వర్షించును. (97) వాని యొక్క నామధేయములు కాని, పరిమాణములు కాని వర్ణించుటకు (వివరించుటకు) శక్యముకాదు. ఆ నదీమతల్లులన్నియును ఉత్తమ సరిత్తులు. (98) ఓ శాంశపాయన ! తత్పదేశమందలి సంహృష్ణులయిన జనపదులు ఎల్లప్పుడు నదీ జలముల త్రాగుదురు, ఆ వర్షము చాల విస్తీర్ణము కలది; అయ్యది యొక చక్రము వలెనున్నది. (99) తత్పదేశము నదీజలములచే పర్వతములచే ప్రతిచ్ఛన్నము. ఆ పర్వతములు ఆకాశ సదృశములు; అయ్యవి సర్వధాతువులచే విచిత్రములుగా నుండును; అయ్యవి విద్రుమములచే సుభూషితములు. (100)

నగర్చైవ వివిధైః సీతైర్జనపదైరపి ।

వృక్షేః పుష్పఫలోపేతైః సమంద్ధనధాన్యవాన్ ॥

క్షీరోదేన సముద్రేణ సర్వతః పరివారీతః ।

శాకద్వీపస్య విస్తారాత్సమేన తు సమంతతః ॥

తస్మిన్ జనపదాః పుణ్యాః పర్వతాః సరితః శుభాః ।

వర్ణాశ్రమసమాకీర్ణా దేస్తే సప్త వై స్మృతాః ॥

న సంకరశ్చ తేష్వస్తి వర్ణాశ్రమకృతః క్వచిత్ ।

విపర్యయో గతేష్వస్తి కాలాత్స్వాభావికం పరమ్ ॥

న తేషు లోభో మాయా వా హీర్ష్యాసూయాకృతః కుతః ।

విపర్యయే గష్వస్తి కాలాత్స్వాభావికం పరమ్ ॥

కరావాప్తిర్న తేష్వస్తి న చ దండో న దండకాః ।

స్వధర్మేణేవ ధర్మజ్ఞాస్తే రక్షంతి పరస్పరమ్ ॥

ఏతావదేవ శక్యం వైతస్మిన్ ద్వీపే ప్రభాషితుమ్ ।

ఏతావదేవ శ్రోతవ్యం శాకద్వీపనివాసినామ్ ॥

పుష్కరం సప్తమం ద్వీపం ప్రవక్ష్యామి నిబోధత ।

పుష్కరేణ తు ద్వీపేన వృతః క్షీరదకో బహిః ॥

శాకద్వీపస్య విస్తారాధ్విగుణేన సమంతతః ।

పుష్కరే పర్వతః శ్రీమానేక ఏవ మహాశీలః ॥

చిత్రైః మణిమయైః శృంగైః శిలాజాలైః సముచ్ఛ్రితః ।

ద్వీపస్య తస్య పూర్వార్థే చిత్రసానుః స్థితో మహాన్ ॥

అయ్యది వివిధములయిన నగరములచే నొప్పినది; ఆ నగరములు జనపదులచే ప్రకాశవంతములు; అందలి వృక్షములు పుష్ప ఫలోపేతములు; ఆ ప్రదేశమంతయు ధనధాన్య సమృద్ధము. (101) క్షీరసముద్రోదకములచే సర్వత్ర పరివీతము. ఆ సముద్రము తద్విస్తీర్ణమున శాకద్వీపముతో సమానమైనది, (102) అందలి జనపదములు పుణ్యములు; పర్వతములు, నదులు, శుభవంతములు; అందలి ప్రజలు వర్ణాశ్రమ వ్యవస్థలచే కూడినవారు, అయ్యవి ఏడు, (103) ఆ ఉపవర్షములయందు వర్ణాశ్రమ సంకరము ఎచ్చటను లేదు. ధర్మము అవ్యభిచరితము; ప్రజలు సుభితులు; (104) వారీ యందు లోభము కాని, మాయకాని, ఈర్షకాని, అసూయకాని ఎచ్చటను లేదు. వారి యందు దారిద్ర్యము లేదా విపర్యయము లేదు. సర్వము సహజ సిద్దము; కాలానుగతము. (105) వారికి పన్నులు లేవు; దండము (శిక్ష) లేదు. దండించేవారును లేరు. స్వధర్మమును పాటించుచు, ధర్మజ్ఞులయిన వారందరు పరస్పరము రక్షించుకొందురు. (106) ఆ ఉప వర్షమును గూర్చి యింత మాత్రమే చెప్పుటకు వీలగును. శాకద్వీప వాసులంగూర్చీ ఏతన్మాత్రమే వినదగినది. (107) ఏడవ ఉపవర్షము పుష్కరము. దానిని గూర్చి చెప్పెదను ఎఱుంగుము; క్షీరసముద్రము వెలుపల పుష్కరోపఖండమును ఆవరించియున్నది. (108) అయ్యది విస్తీర్ణమున అంతటను శాకద్వీపముకంటే రెండితలున్నది. పుష్కర పర్వతము మంగళకరమయినది; అందు ఒక్కటే మహాశీల కలదు. అందు శిఖరములు కలవు; ఆ శృంగములు మణి మయములు; అది చాల ఉన్నతమయినది; అది నానా వర్ణచిత్ర శోభితము. తూర్పు భాగమున ఆ పర్వతము వివిధములయిన సానువులు కలిగియుండెను. (110)

స మండలసహస్రాణీ విస్తీర్ణః పంచవింశతిః ।

ఊర్ధ్వం చైవ చతుస్రాంశోత్సహస్రాణి మహీతలాత్ ॥

ద్వీపార్ధస్య పరిక్షిప్తః పర్వతో మానసోత్తరః ।

స్థితో వేలాసమీపే తు నవచంద్ర ఇవోదితః ॥

యోజనాసోం సహస్రాణి ఊర్ధ్వం పంచాశదుచ్ఛితః ।

తావదేవ చ విస్తీర్ణః సర్వతః పరిమండలః ॥

స ఏవ ద్వీపపశ్చార్డే మానసః పృథివీధరః ।

ఏక ఏవ మహాసారః సన్నివేశో ద్విధా కృతః ॥

స్వాదూదకేనోదధినా సర్వతః పరివారితః ।

పుష్కరద్వీప విస్తారాత్ విస్తీర్లో సౌ సమంతతః ॥

తస్మిన్ ద్వీపే స్మృతే ద్వౌ తు పుణ్యా జనపదౌ శుభౌ ।

అభితో మానసస్యాథ పర్వతస్య తు మండలే ॥

మహావీతం తు యద్వర్షం బాహ్యతో మానసస్యతత్ ।

తస్యైవాభ్యంతరేణాపి ధాతకీఖండముచ్యతే ॥

దశవర్షసహస్రాణి తత్ర జీవంతి మానవాః ।

అరోగా సుఖబాహుళ్యా మానసీం సిద్ధిమాస్థితాః ॥

సమమాయుశ్చ రూపంచ తస్మిన్ వర్షద్వయే స్మృతమ్ ।

అధమోత్తమా న త్వేషస్తి తుల్యాస్తే రూపశీలతః ॥

న తత్ర దస్యుర్ధమకో నేర్ష్యాసూయాభయం తథా ।

నిగ్రహో న చ దండోస్తి న లోభో న పరిగ్రహః ॥

అది చాల విస్తీర్ణత కలిగినది. ఇరువది యైదు వేల యోజనముల విస్తీర్ణము, అనేకములయిన మండలములు కలది, అది భూభాగము నుండి 25 సహస్ర యోజనముల ఎత్తు లేచినది. (111) మానసోత్తరమను పర్వతశాఖ వర్షము యొక్క అర్ధభాగము నావరించియున్నది. అయ్యది సముద్రతీరమున ఉదయించిన నవచంద్రునివలె నున్నది. (112) అయ్యది ఆకాశములోనికి ఏబదివేల యోజనముల యెత్తుగా నున్నది. అది సర్వతః చుట్టును అంతియే విస్తీర్ణమును వహించి యున్నది. (113) ఆ ద్వీపము యొక్క పశ్చారము నందదియే మానస పర్వతమని పేరొందియున్నది. అదీ యొక్కటియే సారవంతమయిన పర్వతము రెండింటిగా నున్నది. (114) ఆ పర్వతము నాలుగు పక్కల తియ్యని నీరుగల సముద్రముచే నావృతము. నాలుగు పక్కల యందు ఆ సముద్రము పుష్కర ద్వీపమంతటి విస్తీర్ణము కలిగి యున్నది. (115) ఆ ద్వీపమున స్మరింపఁదగిన రెండు శుభవంతములయిన జనపదములు కలవు. అయ్యవి మానస పర్వతపు శాఖాద్వయమునకును ఎదురుగా నున్నవి. (116) మహావీతమను ద్వీపము మానస పర్వతమునకు బాహ్య భాగమున నున్నది, దాని యొక్క అభ్యంతరమున ధాతకీ ఖండమున్నదని చెప్పుదురు. (117) అందు మానవులు పదివేల సంవత్సరముల కాలము ఆరోగ్యవంతులై, రోగరహితులై, సుఖబాహుళ్యమును కలిగి మనస్సంబంధమైన సిద్దీ నాశ్రయించి జీవింతురు. (118) ఆ వర్షముల రేండింటి యందు జనములు సమానమైన ఆయువుతో రూపముతో, నుందురు. వారి యందు అధమోత్తములు లేరు. రూపముచే శీలముచే వారందరు సములు. (119) అచ్చట దొంగలు కాని దుండగులు కానీ లేరు. అందు ఈర్ష్య కానీ అసూయకాని లేదు. అందు భయము లేదు. అచట నిగ్రహము కాని దండముకాని లేదు. అందు లోభము లేదు; వస్తు పరిగ్రహము లేదు. (120)

సత్యానృతం న తత్రాస్తి ధర్మాధర్మే తథైవ చ ।

వర్ణాశ్రమౌ వా వార్తె మౌ పాశుపాల్యం వణిక్పథః ॥

త్రయీ విద్యా దండనీతిః శుశ్రూషా శిల్పమేవ చ ।

వర్షద్వయే సర్వమేతత్పుష్కరస్య న విద్యతే ॥

న తత్ర వర్షం నవ్యో వా శీతోష్ణం చాపి విద్యతే ।

ఉద్భిదాన్యుదకాన్యత్ర గిరిప్రస్రవణాని చ ॥

ఉత్తరాణాం కురూణాం చ తుల్యకాలో జనస్తథా ।

సర్వర్తుసుసుఖస్తత్ర ఇరాక్రమవివర్జితః ॥

ఇత్యేష ధాతకీ ఖండే మహావాతే తథైవచ ।

ఆనుపూర్యాద్విధిః కృత్స్నః పుష్కరస్య ప్రకీర్తితః ॥

స్వాదూదకేనోదధినా పుష్కరః పరీవారితః ।

విస్తారాన్మండలాచ్చైవ పుష్కరస్య సమేన తు ॥

ఏవం ద్వీపాః సముద్రిస్తు సప్త సప్తభిరావృతాః ।

ద్వీపస్యానంతరేయస్తు సాముద్రస్తత్సమస్తు సః ॥

ఏవం ద్వీపసముద్రాణాం వృద్ధిరజేయా పరస్పరాత్ ।

అపాం చైవ సముద్రేకోత్సాముద్ర ఇతి సంజ్ఞాతః ॥

విశంతీర్నివసంతస్మినజా యస్మాత్ చతుర్విధాః ।

తస్మాద్వర్షమితి ప్రోక్తం ప్రజాసాం సుఖదం యతః ॥

ఋష ఇత్యేష రమణే వృషశక్తిప్రబంధనే ।

రతిప్రబంధనాత్సిద్ధం వర్షం తత్తేషు తేన వై ॥

అచ్చట సత్యాసత్యములు లేవు; ధర్మా ధర్మములు లేవు. అందరు సత్యవంతులు. ధర్మనిషులు వర్ణాశ్రమములు లేవు. వ్యవసాయ పరిశ్రమకాని, పశుపాల్యము (పశువులను పెంచుట) కాని వ్యాపార మార్గములు కాని లేవు. (121) పుష్కర వర్ష ద్వయము నందెల్ల త్రయీ విద్య, దండనీతి, శుశ్రూష, శిల్పవిద్యయు లేవు. (122) అచ్చట వర్షము లేదు. నదులు లేవు; శీతోషములు కాని లేవు. అందు భూమీ నుండి పైకి పెల్లుబికి వచ్చు నీటి ధారలు కాని, గీరి ప్రసవణములు కానీ (కోండయేళ్లు) లేవు. (123) ఉత్తర కురుదేశముల యందు కాలపరిస్థితులు సమానములు. జనులు సర్వ ఋతువుల యందు సుఖులు, జరాక్రమము ముసలితనము లేదు. (124) ఈ విధముగనే ధాతకీ ఖండమునందు, మహావీతము నందుండును. పుష్కర ఖండము నందలి స్థితి క్రమముగా వర్ణింపఁబడినది. (125) పుష్కరఖండము స్వాదూదకములు కల సముద్రముచే పరివృతమైయున్నది. సముద్రము విస్తారము చేతను పరిధిచేతను పుష్కరఖండమునకు సమానము. (126) ఈ విధముగో సప్త వరములు సప్త సముద్రములచే ఆవృతమయి యున్నవి. ఈ వర్షమునకు ప్రక్కనేయున్న సముద్రము ఖండము వాటితో సమానమయినది. (127) ఈ విధముగా ద్వీపములయొక్క సముద్రములయొక్క పరస్పర వృద్దీ తెలిసికొనవలయును. “జలసముద్రేకాత్ సముద్రః” అని సముద్రము సంశ్లేత మయినదీ, (128)  (అనగా ఎల్లప్పుడు నీటితో నిండి యుండినది). ఈ చిన్న ఖండము వర్షమని పిలువబడినది. ఏలయన అందు చతుర్విధ ప్రజలు ప్రవేశింతురు; నివసింతురు, అయ్యదీ ప్రజలకు సుఖదము. (129) ‘ఋష్’ ధాతువునకు రమణే (క్రీడించుట) అర్థము. ‘వృష్’ అను ధాతువునకు “శక్తినిగూర్చుకొనుట” అని అర్థము. ఈ ఉపవర్షము నందలి జనములకు రమించుటలో వారీ శక్తులను పెంపొందించుటయందు, రతి క్రీడలయందు వీలు కలిగించుటచే అదీ వర మయినది.

శుక్లపక్షే చంద్రవృద్ధ్యా సముద్రః పూర్యతే సదా ।

ప్రక్షీయమాణే బహుళే క్షీయతేఽస్తమీతే ఖగే ॥

ఆపూర్యమాణో హ్యుదధిః స్వత ఏవాభీపూర్యతే ।

తథోపక్షీయమాణేఽపి స్వాత్మన్యేవావకృష్యతే ॥

ఉఖాస్థమగ్నిసంయోగదుద్రిక్తం దృశ్యతే యధా ।

మహోదధీగతం తోయం స్వత ఉడ్రిచ్యతే తథా ॥

అన్యూన్నతిరీక్షాంశ్చ వర్థశ్యాపో హ్రసంతి చ ।

ఉదయాస్తమయ త్విందే పక్షయోః శుక్షకృష్ణయోః ॥

క్షయవృద్ధిత్వముదధేః సోమవృద్ధిక్షయాత్ పునః ।

దశోత్తరాణి పంచైవ హ్యంగులాని శతాని చ ॥

అపొం వృద్ధిః క్షయో దృష్టః సాముద్రాణాం తు పర్వసు ।

ద్వీరాషత్వాత్స్మ్రృతా ద్వీపాః సర్వతశోదకావృతాః ॥

ఉదకస్యాయనో యస్మాత్తస్మాదదుధిరుచ్యతే ।

అపర్వాణఘుగిరయః పర్వభిః పర్వతాః స్మృతాః ॥

ప్రక్షద్వీపే తు గోమేధః పర్వతసేవ చోచ్యతే ।

శాల్మలీః శాల్మలీ ద్వీపే పూజ్యతే సుమహావ్రతైః ॥

కుశద్వీపే కుశస్తంభస్తస్య నామ్నా స ఉచ్యతే ।

క్రౌంచద్వీపే గిరీః క్రౌంచో మధ్యే జనపదస్య హ ॥

శాకద్వీపే ద్రుమః శాకస్తస్య వామ్నా స ఉచ్యతే ।

న్యగ్రోధః పుష్కరద్వీపే తత్రత్యైః స నమస్కృతః ॥

శుక్లపక్షమున చంద్రుని యొక్క వృద్ధితో సముద్రము ఎప్పుడు పూరింపబడును. బహుళ పక్షమున చంద్రుఁడు క్షయింప క్షీణత్వము నొంద) సముద్రము క్షీణించును. (తగ్గును) (131) సముద్రము తనంతట తానే పూరింపఁబడును. అట్లే తగ్గినప్పుడయ్యదియే తనంతట తగ్గును. (తగ్గుట లోపలికి పోవుట. అభివృద్ధి నొందుట కెరటములతో గట్టుపైకి పొంగివచ్చుట), (132) (ఉఖా = కాగుడుబిందీ) (బాయిలర్) కాగుడు బీందిలోని నీరు అగ్ని సంయోగమున ఉద్రిక్తమై పొంగి కనిపించునట్లే మహోదధిలోని నీరు, తనంతటతానే ఉద్రిక్తమగును. (183) శుక్ల కృష్ణ పక్షములయందు చంద్రుండుదయించి అస్తమించు సమయములలో సముద్రపు నీటి యొక్క ఆధిక్య న్యూనత్వములు సహజములయిన నీటి మొత్తముల కంటే నెక్కువయు గావు తక్కువయుగావు. (134) చంద్రుని యొక్క వృద్ది క్షయముల వలన సముద్రము యొక్క వృద్ధిక్షయములు 510 అంగుళములు. (135) పర్వముల యందు సముద్ర సంబంధపు నీటి యందు వృద్ధి క్షయములు కాననగును. సర్వత్ర నీటిచే ఆవరింపం బడిన ఖండములు (ద్వీపములు) ద్వీపములందురు. ఏలయన ద్వీపక్షత్వముచేత (అనఁగా నీరు రెండు ప్రక్కలనుండుటచే). (136) ఉదకస్య అయనం స్థానమగుట ఉదధీ అని చెప్పబడినది. పర్వములు గనుపులు లేని పర్వతములు గీరులు గాను, గనుపులు (పర్వములు) గలిగినవి పర్వతములుగాను స్మరింపఁబడినవి. (137) ప్లక్ష ద్వీపము నందలి గోమేధము ఆకారణము చేతనే పర్వతమని చెప్పబడినది. శాల్మలీ ద్వీపము నందు శాల్మలీ వృక్షము (బూరుగు ప్రత్తిచెట్టు) సుమహావ్రతులచే పూజింపఁబడుచున్నది.

మహాదేవః పూజ్యతే తు బ్రహ్మా త్రిభువనేశ్వరః ।

తస్మిన్నవసతి బ్రహ్మా సాధ్యైః సార్థం ప్రజాపతిః ॥

ఉపాసంతే తత్ర దేవాస్త్రయస్త్రింశన్మహర్షిభిః ।

స తత్ర పూజ్యతే చైవ దేవైర్దేవోత్తమోత్తమః ॥

జంబూద్వీపాత్రవర్తంతే రత్నాని వివిధాని చ ।

ద్వీపేషు తేషు సర్వేషు ప్రజానాం క్రమతస్తు వై ॥

సర్వతో బ్రహ్మచర్యేణ సత్యేన చ దమనేచ ।

ఆరోగ్యాయుఃప్రమాణాభ్యాం ప్రమాణం ద్విగుణం తతః ॥

ఏతస్మిన్ పుష్కరద్వీపే యదుక్తం వర్షకద్వయమ్ ।

గోపాయతి ప్రజాస్తత్ర స్వయంభూర్జడపండితామ్ ॥

ఈశ్వరో దండముద్యన్య బ్రహ్మా త్రిభువనేశ్వరః ।

స విష్ణుసచివో దేవః సః పితా స పితామహః ॥

భోజనం చాప్రయత్నేన తత్ర స్వయముపస్థితమ్ ।

షడ్రసం సుమహావీర్యం భుంజతే తు ప్రజాః సదా ॥

కుశద్వీపమున కుశస్తంభము పూజింపఁబడును. అందుచేతనే తన్నామమున కుశద్వీపమని పిలువఁబడును. క్రౌంచద్వీపమున జనపదము నకు మధ్యను క్రౌంచ పర్వతము కలదు. శాకద్వీపమున ముఖ్య వృక్షము శాకము, అందుచే నది శాక ద్వీపమనంబడినది. పుష్కర ద్వీపమున న్యగ్రోధము (మఱ్ఱిచెట్టు) అచ్చటి నివాసులచే నమస్కరింపఁబడును. (140) మహాదేవుఁడు, త్రిభువనేశ్వరుఁడు నయిన బ్రహ్మ అందు పూజింపఁ బడును. ప్రజాపతియయిన బ్రహ్మ సాధ్యులతో సహితమందు నివసించును. (141) అచ్చట ముప్పది ముగ్గురు దేవుతలు మహరులతో సహా పూజ చేయుదురు. దేవోత్తమోత్తముఁడు ప్రభువునయిన దేవుఁడు, దేవతలచే నచ్చట పూజింపఁబడును. (142) వివిధములయిన రత్నములు జంబూద్వీపము నుండి ప్రవర్తించును (అచ్చట గనుల నుండి త్రవ్వుటచే కల్గినవి). ఆ ద్వీపములన్నింటి యందు, ప్రజల యొక్క క్రమము ఇతః పూర్వము చెప్పఁబడిన ద్వీపములయందలి జనుల క్రమము కంటే ద్వీగుణము (రెండితలు) సర్వత్ర బ్రహ్మచర్య వ్రతముచే సత్యముచే దమముచే ఆరోగ్య ఆయుః ప్రమాణములు రెండింతలు (144) పుష్కర ద్వీపములో చెప్పఁబడిన రెండు వరములలో (ఖండములలో) స్వయంభువుఁడయిన బ్రహ్మ పండితులను అపండితులను ఇరువురను రక్షించును. (145) ఈశ్వరుఁడు, త్రిభువనేశ్వరుఁడు బ్రహ్మయ్యిన పరమేశ్వరుఁడు, దండమునెత్తి ప్రజలను రక్షించును ఆతఁడే విష్ణువు; ఆతఁడే సచీవుఁడు; ఆతఁడే దేవుఁడు; ఆతఁడే తండ్రి ఆతఁడే పితామహుడు. అచ్చట అప్రయత్నముగా భోజనముపస్థితము. ప్రజలందెల్లప్పుడు షడ్రసము, సుమహావీర్యము నయిన భోజనము ననుభవింతురు.

పరేణ పుష్కరస్యార్థే ఆవృత్యావస్థితో మహాన్ ।

స్వాదూదకసముద్రస్తు సమంతాత్ పరివేస్ట్య తమ్ ॥

పరేణ తస్య మహతీ దృశ్యతే లోకసంస్థితిః ।

కాంచనీ ద్విగుణా భూమిః సర్వా హ్యేకశిలోపమా ॥

తస్యాపరేణ శైలశ్చ పర్యాసాత్పరిమండలః ।

ప్రకాశశ్చాప్రకాశశ్చ లోకాలోకః స ఉచ్యతే ॥

ఆలోకస్తస్య చార్వాకు నీరాలోకస్తతః పరమ్ ।

యోజనానాం సహస్రాణి దశ తస్యోచ్ఛయః స్మృతః ॥

తావాంశ్చ విస్తరస్తస్య పృథివ్యాం కామగశ్చ సః ।

ఆలోతో లోకవృత్తిస్లో నిరాలోకో హ్యతాకికః ॥

లోకార్డే సంమితా లోకా నిరాలోకాస్తు బాహ్యతః ।

లోకవిస్తారమాత్రం తు హ్యలోకః సర్వతో బహిః ॥

పరిచ్ఛిన్నః సమంతాచ్చ ఉదకేనావృతస్తు సః ।

ఆలోకాత్పరతశ్చాపి హ్యండ మావృత్య తిష్ఠతి ॥

అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపా చ మేదినీ ।

భూగ్లోకోఽథ భువర్లోకః స్వర్లోకోఽథ మహస్తథా ॥

జనస్తపస్తథా సత్యమేతావాంల్లోకసంగ్రహః ।

ఏతావానేవ విజేయో లోకాంతశ్చైవ యః పరః ॥

కుంభస్థాయీ భవేద్యాదృక్పతీచ్యాం దీశీ చంద్రమాః ।

ఆదితః శుక్లపక్షస్య వపుశ్చాండస్య తద్విధమ్ ॥

పుష్కర ద్వీపము యొక్క అర్ధభాగమునందు, తీయ్యని నీరములతో (స్వాదూదకములతో) మహాసముద్రము ఆవరించి యున్నది. ఆ సముద్రమంతటను పరివర్తించియున్నది. (148) దానిని దాటి, గొప్పదియైన లోకమగుపించును. అదీ యంతయు బంగారుభూమి. ఆ భూమి యంతయు ఒకే యొక రాఖీ పలకతోనుపమింప వీలుగా నుండును. అయ్యది సముద్రముకంటే రెండురెట్లు, దానికి పై భాగమున కోనల యందు వలయముగా నున్న ప్రపంచము ఒక పర్వతము. అయ్యదే కాంత కాననగును. కొంత కానబడదు. దానిని ‘లోకాలోక’ మందురు. (లోకము = కనుపడునది అలోకము = కానరానిది) (150) ఆ పర్వతము యొక్క ముందరీ బాగము ప్రకాశవంతముగా నుండును; దాని యొక్క రెండవ భాగము అంధకారము (చీకటి) దాని మౌన్నత్యము దశసహస్ర యోజనములుగా భావింతురు. (151) దాని యొక్క విస్తృతి కూడ నంతియే. భూమి యందు నది తన యిచ్చ వచ్చినట్లు పోగలదు, దాని యందలి ప్రకాశవంతమయిన భాగము లోకవృత్తితో నిండి యుండును. ప్రకాశరహితమయిన భాగము అలౌకికమయినది. (152) ప్రకాశవంతమయిన అర్ధభాగములో లోకములన్నియు సంమీతములు నిండియున్నవి, అంధకార బంధుర లోకములు బాహ్యములు, ఈ చీకటి భాగము ప్రకాశవంతమయిన భాగమునకు చుట్టును బాహ్యమును ఆవరించియుండును. (153) అది అంతటను పరిచ్ఛిన్నము; అది ఉదకముచే ఆవృతమయి యున్నది. ఆ లోక ప్రపంచమునకు వెలుపల ప్రదేశమంతయు విశ్వాండమును ఆవరించి యున్నది. (154) ఈ లోకములు, సప్త ద్వీపావృతమయిన భూమీ, భూర్లోకము, భువర్లోకము స్వర్లోకము మహర్లోకము జనలోకము, సత్యలోకము, తపోలోకము విశ్వాండము నందున్నవి. లోనున్న లోకముల గూర్చి యింతవరకే తెలియనగును. ఇంతవట్టే తెలిసికొననగును. (156) మొదట శుక్లపక్షమున పడమటి దీక్కున, చంద్రుఁడు ఒక కుంభముమందున్నట్లుండును, విశ్వాండము యొక్క శరీరము అట్లేయుండును. (157)

అండానామీదృశానాం తు కోట్యో జ్ఞేయాః సహస్రశః ।

తిర్యగూర్థ్వమరో వాపి కారణస్యావ్యయాత్మనః ॥

ధరణోః ప్రాకృతైస్తత్రదావృతం ప్రతి సప్తభిః ।

దశాధిక్యేన చాన్యోన్యం ధారయంతి పరస్పరమ్ ॥

పరస్పరావృతాః సర్వే ఉత్పన్నాశ్చ పరస్పరమ్ ।

అండస్యాస్య సమంతాత్తు సన్నివిష్ణో ఘనోదధిః ॥

సమంతాత్తు వనోదేన ధార్యమాణః స తిష్ఠతి ।

బాహ్యతో ఘనతో యస్య తీర్యగూర్థ్వం తు మండలమ్ ॥

ధార్యమాణం సమంతాత్తు తిష్ఠతే యస్య తేజసా ।

అయోగుడనీభవాహ్నః సమంతాన్మండలాకృతిః ॥

సమంతాఝానవాతేన ధార్యమాణః స తిష్ఠతి ।

ఘనపాతం తథాకతో దధానః ఖలు తిష్ఠతి ॥

భూతాదీశ్చ తథాకోశం భూతాదిశ్చాష్యసౌ మహాన్ ।

మహాంశ్చ సోఽప్యనంతేన హ్యవ్యక్తేన తు ధార్యతే ॥

అనంతమపరివ్యక్తం దశధా సూక్ష్మమేవ చ ।

అనంతమకృతాత్మానమనాదినిధనం చ యత్ ॥

అనిత్యం పరతోఽరమనాలందిమనామయమ్ ।

వైకయోజనసాహసం విప్రకృష్టమనావృతమ్ ॥

తమ ఏవ నిరాలోకమమర్యాదమదైశికమ్ ।

దేవానామప్యవిదితం వ్యవహారవివర్జితమ్ ॥

ఇట్టి విశ్వాండములు పైన, క్రింద, ప్రక్కన, వేలాది కోట్ల సంఖ్యలో గలవని యెఱుంగవలయును. వానికి కారణము అవ్యయమయిన ఆత్మ, ప్రకృతి నుండి పరిణమించిన సప్త ధరణులచే పై విశ్వాండములలో ప్రతిదియు ఆవరింపఁబడియున్నది. అవి 10 లేక ఎక్కువ సంఖ్యలో సమూహముగా నుండీ యొక్కొక్క దానిని ధరించును రక్షించును. (159) అవియన్నియు పరస్పరము ఆవృతములై యున్నవి. అవి యన్నియు పరస్పరముత్పన్నములైనవి. ఈ విశ్వాండము యొక్క చుట్టును ఘనోదధి చుట్టుకొని యున్నది (ఘనోదధి - ఘనీభూత జలయుత సముద్రము) (160) అది యంతటను “వనోదముచే ధార్యమాణమయి స్థిరముగా నున్నదీ, ఘనీభూతమయిన జలము యొక్క మండలము, చుట్టును, పైనను, ప్రక్కను వెలుపల తేజో మండలముచే ధైర్యమాణమై యున్నది. ఈ తేజో రూపమయినది గుండ్రముగా అయోగుడ (ఇనుప బంతివలె) మువలెనున్నది. దాని ఆకారము మండలాకృతి, (161,163) అంతటను ఘనమౌతముచే ధరింపఁబడి యున్నదీ, ఘనవాతము అట్లే ఆకాశము దానిని భరింపం గా ఆ విశ్వాండమున్నది. భూతాది (విశ్వాండము) ఆకాశము మహత్తు మొదలగునవి అనంతుఁడు అవ్యక్తమునైన పరమాత్మచే ధరింపఁబడుచున్నవి. (ఆత్మ ఆధారభూతముగా నున్నది). (164) అదీ అనంతము అపరివ్యక్తము అది పది విధములుగా సూక్ష్మమయినదీ, అదీ అనవధికము; అధీ అకృతాత్మానము అదీ అనాది. అనంతము (అక్షరము). (పరమాత్మతో పోల్చినచో) అదీ అఘోరము (భయంకరమైనది కాదు), అది అనాలంబము; అదీ అనామయము (రోగరహితము) అయ్యది యనేక యోజన సహస్ర దూరమున నున్నది. అదీ అనావృతము (గూఢము కాదు). అదీ తమస్సు దానికి కాంతి లేదు. అది నిరవధికము; అది దేవతలకు కూడా తెలియదు. దానియందెట్టి వ్యవహారము (అక్రీయయు) లేదు. (167)

తమసోంతే చ విఖ్యాతమాకాశాంతే హ్యభాస్వరమ్ ।

మర్యాదాయామనంతస్య దేవస్యాయతనం మహత్ ॥

త్రిదశానామగమ్యం తత్థ్సానం దివ్యమీతి శ్రుతిః ।

మహతో దేవదేవస్య మర్యాదాయా వ్యవస్థితాః ॥

చంద్రాదిత్యావధప్రాతు మే లోకాః ప్రతిభ బుధైః ।

తే లోకా ఇత్యలిహితా జగతశ్చ న సంశయః ॥

రసాతలతలాస్సప్త సప్లైవోర్ధ్వతలాశ్చ యే ।

సప్తస్కంధస్తథా వాయోః సబ్రహ్మసదనా ద్విజః ॥

ఆపాతాలాద్దివం యావదత్ర పంచవిధా గతిః ।

ప్రమాణమేతజ్ఞగత ఏష సంసారసాగరః ॥

అసాద్యంతాం ప్రజంత్యేవ నైకజాతిసముద్భవాః ।

విచిత్రా జగతః సా వై ప్రకృతిర్బహ్మణః స్థితా ॥

యచ్చేహ దైవికం వాథ నిసర్గం బహువిస్తరః ।

అతీంద్రియైర్మహాభాగైః సిద్దెరపిన లక్షితః ॥

పృథివ్యంబ్వాగ్నివాయూనాం నభసస్తమసస్తథా ।

మానసస్య తు దేహస్య అనంతస్య ద్వీజోత్తమాః ॥

క్షయో వా పరిణామో వా అంతో వాపి న విద్యతే ।

అనంత ఏష సర్వత్ర ఏవం జ్ఞానేషు పఠ్యతే ॥

తస్య చోక్తం మయా పూర్వం తస్మిన్నామానుకీర్తనే ।

యః పద్మనాభనామ్నా తు తత్కార్త్న్యేన చ కీర్తితః ॥

అయ్యది తమస్సునకు తుదిభాగమని ప్రసిద్ధి. ఆకాశాంతము నందునది ప్రకాశింపదు. అయ్యది మర్యాదకు లోనయియున్నది (మర్యాద - పరిమితి - హద్దు). అయ్యదీ అనంతుని యొక్క మహదాయతనము. (168) ‘అయ్యది శ్రీదశులకు (దేవతలకు) కూడ పొంద శక్యము కానీది. అది దివ్యమని వేదము చెప్పుచున్నది. మహాత్ముఁడు దేవదేవుఁడయిన యాతని పరిధిలో (పాలనములో) నున్నది. (168) చంద్రునికి సూర్యునికి (అధస్తాత్) క్రిందుగా ఏ లోకము లున్నవో యవి పండితులకు తెలియును. అవియే లోకములుగా చెప్పఁబడినవి. అందు సంశయము లేదు. (బుధులకు తెలిసిన ప్రదేశములకే లోకములందురు) (170) రసాతలమునకు క్రిందన్ను లోకములు ఏడు. వానికి పై నున్న లోకములు కూడ ఏడే. ఓ బ్రాహ్మణులారా ! బ్రహ్మసదనముతో సహా వాయువునకు 7 స్కంధములు గలవు. (171) ఇట్లు పాతాళము నుండి దీపమువలకు దానిగతి యైదు విధములు. ఇదియే విశ్వము యొక్క ప్రమాణము; అదీయే సంసార సాగరము యొక్క యునికి. (172) అనేక జాతుల నుండి సముద్భవించినవారు ఆద్యంతములేని స్థితిని పొందుదురు. జగముయొక్క ఆగతియు బ్రహ్మయొక్క ప్రకృతియు విచిత్రమైనది. దైవికమో లేక నిసర్గమో యయిన బ్రహ్మసృష్టి చాల విస్తృతమయినది. అతీంద్రియులు మహాభాగులు నయిన సిద్దులచే కూడ నలక్షితమయినది. (174) ఓ ద్వీజోత్తములార ! అగ్నికి గాని, వాయువునకు గాని, ఆకాశమునకుఁగాని, చీకటికిగాని, మనస్సునకు గానీం అనంతుని శరీరమునకుగాని (అచ్చట) క్షయముకానీ, మార్పుకాని, అంతముకాని లేదు. సర్వత్ర అదీ అనంతము. జ్ఞానుల యందీ విధముగనే పఠింపఁబడుచున్నది. ఇంతకు బూర్వము దేవతల నామములఁబేర్కొనుచు నతని నామము నాచే చెప్పబడినది. ఆతఁడే పద్మనాభుఁడన్న నామములో విశేషముగా కీర్తింపం బడినవాఁడు. (177)

స ఏవ సర్వత్ర గతః సర్వస్థానేషు పూజ్యతే ।

భూమౌ రసాతలే చైవ ఆకాశే పవనేసలే ॥

అర్థవేషు చ సర్వేషు దివి చైవ న సంశయః ।

తథా నభసి విజ్ఞేయ ఏష ఏవ మహాద్యుతిః ॥

అనేకథా విభక్తాంగో మహాయోగీ జనార్దనః ।

సర్వలోకేషు లోకేశ ఇజ్యతే బహుథా ప్రభుః ॥

ఏవం పరస్పరోత్పన్నా ధార్యతే చ పరస్పరమ్ ।

ఆధారాధేయభావేన వికారాస్తేఽవికారిణః ॥

పృథ్వాదయో వికారాస్తే పరిచ్ఛిన్నాః పరస్పరమ్ ।

పరస్పరాధికైశ్చైవ ప్రవిష్టాస్తే పరస్పరమ్ ॥

యస్మాత్సౄష్టాస్తు తేఽన్యోన్యం తస్మాత్ ఛైర్యముపాగతాః ।

ప్రాగాసన్నవిశేషాస్తు విశేషోన్యవిశేషణాత్ ॥

పృథివ్యాద్యాస్తు వహ్యంతాః పరిచ్ఛిన్నాస్త్రయస్తు తే ।

గుణోపచయ సారేణ పరిచ్ఛేదో విశేషతః ॥

శేషాణాం తు పరిచ్ఛేదః సౌక్ష్యా స్నేహ విభావ్యతే ।

భూతేభ్యః పరతత్తేభ్యో వ్యాలోకా సా ధరా స్మృతా ॥

భృతాన్యాలోక ఆకాశ పరిచ్చిన్నాని సర్వశః ।

పాత్రే మహతి పాత్రాణి యథైవాంఽతర్గతాని తు ॥

భవంత్యన్యోన్యహీనాని పరస్పరసమాశ్రయాత్ ।

తథాహ్యాలోక ఆకాశే భేదాన్త్వంతర్గతా మతాః ॥

ఆతఁడు సర్వవ్యాపి. సర్వస్థానముల యందు పూజింపఁబడును. భూమీ యందు, రసాతలము నందు, ఆకాశమునందు, వాయువు నందు, అగ్నియందు అన్ని సముద్రములయందు, స్వర్గము నందు పూజింపఁబడును; ఇందు సంశయము లేదు. అట్లే ఆకాశము నందు విశ్లేయుఁడు. ఆతఁడే మహాద్యుతి. (179) అనేక విధముగా విభజింపఁబడిన అంగములు కలవాడు, మహాయోగి; జనార్దనుఁడు; సర్వ లోకములకు ప్రభువు లోకేశుఁడు; ఆ ప్రభువు బహువిధముల అన్ని ప్రపంచములందు పూజింపఁబడును. (180) ఈ విధముగా పరస్పరము త్పన్నములయిన లోకములు ఒండొరులను ధరించుచున్నవి. అవిహారియైన యీ పరమాత్మకు ఆధారాధేయ భావములచే వికారములు, (181) పృధ్యాదులు వికారములు (కార్యములు). అవి పరస్పరము విచ్చిన్నములు. అవి పరస్పరమాధిక్యము గలిగినవి. అవి యన్యోన్య మొక దానిలో నొకటి ప్రవీష్టములై యున్నవి. (182) అవి పరస్పరము సృష్టించబడిన వగుటచే, అయ్యవీ స్టైర్యమును (స్థిరత్వమును) గలిగి యున్నవి. ఆదిని వానికి విశేషములు లేవు. వానికి ఇతరములయిన వానిని గూర్చి చెప్పునవగుట విశేషములని పేరు వచ్చినదీ, (183) భూమితో ఆరంభించి వహ్నితో నంత మొందు మూఁడు భూతములు పరిచ్చిన్నములు (పరిమితములు; గుణోపచయ సారము చేతనవి పరిచ్ఛేదము నందినవి. ప్రత్యేకత్వ విపోత స్వరూప లక్షణత్వములు కలిగినవి). (184) వాని యొక్క లక్షణములు ఊహింపఁబడలేదు. ఇతర భూతముల విడిచి భూమీ వ్యాలోకముగా స్మరీంపఁబడినది. (వ్యాలోకము అనఁగా ఒక ప్రత్యేక ప్రకాశము అనవచ్చును.) (185) ఒక పెద్ద పాత్రలో చిన్న పాత్రలిమిడీ పరస్పరము లీనమైయుండినట్లు ఆకాశమునందు ఇతర భూతలు ఆకాశ సంబంధమయిన కాంతిలో అంతర్లీనములయి యున్నవి. (187)

కృత్స్నాన్యేతానీ చత్వారి హ్యన్యోన్యస్యాధికానీ తు ।

యావదేతాని భూతానీ తావదుత్పత్తిరుచ్యుతే ॥

తంతూనామివ సంతారో భూతేష్వంతర్గతో మతః ।

ప్రత్యాఖ్యాయ తు భూతానీ కార్యోత్పత్తిర్న విద్యతే ॥

తస్మాత్పరిమితా భేదాః స్మృతాః కార్యాత్మకాస్తు తే ।

కారణాత్మకాస్తథైవ స్యురేదా యే మహదాదయః ॥

ఇత్యేష సన్నివేశో వై మయా ప్రోక్తో విభాగశః ।

సప్తద్వీపసముద్రాధ్యో యాథాతథ్యేన వై ద్వీజాః ॥

విస్తరాన్మండలాశ్చైవ ప్రసంఖ్యానేన చైవహి ।

వైశ్వరూపప్రధానస్య పరిణామైకదేశికః ॥

అధిష్ఠితం భగవతా యస్య సర్వమిదం జగత్ ।

ఏవం భూతగణాః సప్త సన్నివిష్టాః పరస్పరమ్ ॥

ఏతావాస్ సన్నివేశస్తు మయా శక్యః ప్రిభాషితుమ్ ।

ఏతావదేవ శ్రోతవ్యం సన్నివేశే చ పార్దివే ॥

సప్త ప్రకృతయస్త్వేతా ధారయంతి పరస్పరమ్ ।

తాసహం పరిమాణేన న సంఖ్యాతుమిహోత్సహే ॥

అసంఖ్యాతాః ప్రకృతయస్తిర్యగూర్థ్వమథస్తథా ।

తారకాసన్నివేశశ్చ యావద్దివ్యానుమండలమ్ ॥

పర్యాయసన్నివేశస్తు భూమేస్తదసుమండలః ।

అత ఊర్థ్వం ప్రవక్ష్యామీ పృథివ్యా వై విచక్షణాః ॥

ఇతి బ్రహ్మాండే మహాపురాణే వాయు ప్రోక్తే పూర్వభాగే ద్వితీయేఽనుషంగపాదే ప్లక్షాదిద్వీపవర్ణనం నామైకోనవింశతితమోఽధ్యాయః ॥

ఈ నాలుగు భూతములు ఒకదానీకంటే నొకటి శ్రేష్ఠతరములు. ఎంతకాలమీ భూతములుండునో అంతవరకు ఉత్పత్తి జరుగుచుండును. (188) దారపు కాండిలో దారములు చుట్టినట్లు వివిధములయిన భూతములు ఒక దానిలో నొకటి మలచియున్నట్లు భావింపఁబడినది. భూతములను ప్రత్యాఖ్యానము చేసిన (విడిచిపెట్టి) కార్యోత్పత్తి యుండనే యుండదు. (189) అందుచే కార్యములయందలి భేదములు పరిమితములని చెప్పఁబడినవి. మహదాదుల కారణాత్మక భేదములు అంతిమము. (190) ఓ బ్రాహ్మణులారా ! సప్త ద్వీపములు, సముద్రములు మొదలగు వానీయొక్క సన్నివేశములు యథాతథముగ విభాగశః నాచే వర్ణింపబడినవి. (191) విశ్వరూపుఁడయిన ప్రధానుని యొక్క పరిణామైక దేశికము నాచే విపులముగా వర్ణింపబడినవి. మండలములు కూడ విస్తారముగా పేరుపేరున వర్ణింపఁబడినవి. (192) భగవంతుఁడయిన పరమేశ్వరునిచే నీ జగత్తు సర్వమధిష్ఠితమై యున్నది. ఇట్లు ఏడుగా నున్న భూతములు ఒండొంటిలో ప్రవిష్టములై యున్నవి. (193) ఇంతవరకే ప్రపంచ సన్నివేశమును గూర్చి చెప్పుటకు నాకు శక్తి గలదు. పృథివీ సంబంధమయిన దానిని గూర్చి ఇంత మట్టుకే సన్నివేశములు శ్రోతవ్యములు. (194) ఈ సప్తప్రకృతులు పరస్పరము ధరించుచున్నవి. వాని యొక్క ప్రమాణముల గూర్చి గాని, విస్తృతుల గూర్చి గానీ నేను చెప్పజాలను. పై నున్నవి, క్రింద నున్నవి, ప్రక్కలందున్నవియునగు ప్రకృతులసంఖ్యేయములు, తారకాసన్నివేశములు ఆకాశమండలముల నున్నవి. భూమి యొక్క పర్యాయ సన్నిశము భూమండలాకారమున నున్నది. అందుచే పండితులారా ! భూమిని గూర్చి (మిగిలినది) చెప్పెదను.

ఇది వాయుప్రోక్త బ్రహ్మాండ మహాపురాణమునందు, పూర్వభాగమున ద్వితీయానుషంగపాదమున ప్లక్షద్వీప వర్ణనము పేదింటిదీ 19వ అధ్యాయము.