32-  యుగప్రజాలక్షణము ఋషి ప్రవర వర్ణనము

సూత ఉవాచ :-

యుగేషు యాస్తు జాయంతే ప్రజాస్తా మే నిబోధత

 ఆసురీ సర్పగాంధర్వా పైశాచీ యక్షరాక్షసీ

యస్మిన్ యుగే చ సంభూశిస్తాసాం యావచ్చ జీవితమ్

పిశాచాసుర గంధర్వా యక్షరాక్షసపన్నగాః

 పరిణాహోచ్చ్రయైస్తుల్యా జయంతే హ కృతే యుగే

షణ్ణవత్యంగుళోత్సేధో హ్యష్టానాం దేవజన్మనామ్

స్వేనాంగుళప్రమాణేన నిష్పన్నేన చ పౌష్టికాత్

 ఏతత్ స్వాభావికం తేషాం ప్రమాణమితి కుర్వతే

 మనుష్యా వర్తమానాస్తు యుగం సంధ్యాంశకేష్వివ

 దేవాసురప్రమాణం తు సప్తసప్తాంగులాదసత్

అంగుళానాం శతం పూర్ణమష్ట పంచాశదుత్తరమ్

 దేవాసుర ప్రమాణం తు ఉచ్చ్రయాత్కలిజైఃస్మృతమ్

 చత్వారశ్చాప్యశీతిశ్చ కలిజైరంగుతైః స్మృతః

 స్వేనాంగుళిప్రమాణేన ఊర్థ్వమాపాదమస్తకాత్

 ఇత్యేష మానుషోత్సేధో హ్రసతీహ యుగాంశకే

 సర్వేషు యుగకాలేషు అతీతా నాగతేష్విహ

 స్వేనాంగుళిప్రమాణేన అష్టతాలః స్మృతో నరః

 ఆపాదతలమస్తిష్కో నవతాలో భవేత్తు యః

సంహతాజానుబాహుస్తు ససురైరపి పూజ్యతే

గవాశ్వహస్తినాం చైవ మహిషస్థావరాత్మనామ్

సూతుఁడిట్లు చెప్పెను :-

యుగములయందెవ్వరెవ్వరు పుట్టుదురో వారిని గూర్చి నావలనఁదెలిసికొనుము. వారు ఆసురులు, సర్పజాతులు, గాంధర్వులు, పైశాచులు, యక్షులు రాక్షసులు. (1) వారే యుగములందు పుట్టుదురో, వారి జీవిత ప్రమాణమెంతయుండునో తెలిసికొనుము. పిశాచులు, ఆసురులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు వీరందరు కృతయుగమున పుట్టుదురు. వారి యెత్తు, పరిణామము (వారి శరీర స్థౌల్యములు) సమానము. దేవజన్ములయిన యీ అష్ట ప్రజ్ఞాశాఖలు, వారివారి అంగుళ ప్రమాణములబట్టి 92 అంగుళముల ఎత్తువారు. ఇయ్యదీ వారి శరీర పోషణమును బట్టి కలుగును. ఇదీ వారి స్వాభావిక ప్రమాణముగా గ్రహింపఁబడును. (4) సంధ్యాంశకమందు వర్తించు మనుష్యులు దేవజన్ముల ఉన్నతీకంటే ఏడుపడు అంగుళ ప్రమాణము ఎత్తు తక్కువ (5) (వారు కురుచ వారు) దేవాసురుల శరీర ప్రమాణము 158 అంగుళములుగా కలియుగమున పుట్టిన వారు తలంతురు. (6) కలియుగములో పుట్టినవారు వారు ఉన్నతి తలనుండి పాదము వరకు వారి యంగుళ ప్రమాణములను బట్టి ఎనుబది నాలుగు అంగుళములు. (7) మానవుల యెత్తు యుగాంశకయుగమునందు (యుగముల మధ్య కాలములో) అన్నియుగ కాలముల యందు భూత భవిష్యత్కాలముల తగ్గుచుండును. (8) స్వకీయాంగుళి ప్రమాణమును బట్టి నరుఁడు ‘అష్టతాల’ ప్రమాణము కలవాఁడు. ఈ గణమాతని యంగళుముల బట్టి ఆపాద తలమస్తిష్కము ఎవ్వడు ‘నవతాల’ ప్రమాణుఁడు అగునో ఆతని బాహువులు మోకాళ్ల వరకు దీర్ఘములు ఆతనినీ దేవతలు కూడా పూజింతురు. వారి వారి కర్మననుసరించి (క్రమముగా) భిన్నభిన్న యుగములలో ఆవుల యొక్క గుఱ్ఱముల యొక్క ఏనుగుల యొక్క మహిషముల యొక్క స్థావరముల యొక్క (ఉ త్సేధములు) ఎత్తులు ఈ పనిచే హ్రసత్వమును వృద్ధిత్వమును పొందుచుండునని గ్రహింపవలెను.

కర్మణైతేన విజ్ఞేయే హ్రసవృద్ధీ యుగే యుగే

 షట్సప్తత్యంగులోత్సేధః పశూనాం కకుదస్తు వై

అంగుళాష్టశతం పూర్ణముత్సేధః కరిణాం స్మృతః

అంగుళానాం సహస్రం తు చత్వారింశాంగులైర్వినా

 పంచాశతో యవానాం చ ఉత్సేధః శాఖినాం స్మృతః

 మానుషస్య శరీరస్య సన్నివేశస్తు యాదృశః

తల్లక్షణస్తు దేవానాం దృశ్యతే తత్త్వదర్శనాత్

 వృద్ధ్యాతిశయయుక్తశ్చ దేవానాం కాయ ఉచ్యతే

తథా సాతిశయశ్చైవ మానుషః కాయ ఉచ్యతే

 ఇత్యేతే వై పరీక్రాంతా భావా యే దివ్యమానుషాః

పశూనాం పక్షిణాం చైవ స్థావరాణాం చ సర్వశః

గావో హ్యజావయోఽశ్వాశ్చ హస్తినః పక్షిణో నరాః

ఉపయుక్తాః క్రియాస్వేతే యజ్ఞయాస్విహా సర్వశః

 దేవస్థానేషు జాయంతే తద్రూపా ఏవ తే పునః

యథాశయాపభోగాస్తు దేవానాం శుభమూర్తయః

 తేషాం రూపానురూపైస్తు ప్రమాణైః స్థాణుజంగమైః

మనోజ్ఞై సత్ర భావైస్తే సుఖినో హ్యుపపేదిరే

అతః శిష్టాన్ ప్రవక్ష్యామి సతః సాధూంస్తథైవ చ

సదితి బ్రహ్మణః శబ్దః తద్వంతో యే భవంత్యుత

 సాక్షాత్యాద్భ్రహ్మణస్త్వేతౌ తేన సంతః ప్రచక్షతే

పశువుల మూపురములు 76 అంగుళముల ఎత్తు. ఏనుగుల యొక్క ఉత్సేధము (ఎత్తు - ఉన్నతి) మొత్తము 108 అంగుళములని చెప్పబడినది. చెట్లయొక్క ఉత్సేధము (ఎత్తు - ఉన్నతి) మొత్తము 108 అంగుళములని చెప్పబడినది. చెట్లయొక్క పొడుగు (ఉత్సేధము) 1000 అంగుళములు 40 అంగుళములు మరియు 50 యవలు అనఁగా (ఒకయవ = 1/4 అంగుళము; 50 యవలు = 12 యవలు. 1000 - 40 + 12 1/2 = 947 1/2 అంగుళములు) మనుష్య శరీర సంస్థితి యెట్టిదో దేవతల శరీర సన్నివేశము తాదృశమైనది. తత్త్వమును గూర్చి ఆలోచించిన దానిని గ్రహింపవచ్చును. బుద్ధి విశేషణమున తన్ను ఏదియు అతీశయించనట్టి శరీరము దేవతల శరీరమనంబడును. అట్లే తన్ను అతిశయించుటకు వేటీకటి గల్గినట్టిదీ మానుష కాయముగా చెప్పుదురు. ఈ విధముగా దివ్యమానుషుల భావములు వర్ణింపబడినవి. (14,15) సర్వత్ర పశువులు, పక్షులు, స్థావరములు (స్థిరముగా నుండునవి) ఉపయుక్తములైనవి. ఉదాహరణమునకు ఆవులు, మేకలు, గొఱ్ఱలు, అశ్వములు, ఏనుగులు, పక్షులు మరియు వృక్షములు. ఇవి యజ్ఞాదులయిన పవిత్ర కర్మల యందుపయుక్తములు. అందుచే అన్ని విధముల అవి యజ్ఞముల కర్షములు. అవి దేవస్థానములందు (దేవతా దేహముల యందు) పుట్టినవి. అందునయ్యవి తద్దేవతా రూపముల నున్నవి (17) దేవతల యొక్క శుభ స్వరూపములు (మూర్తులు) యథా శయోపభోగములు (కోరుకొన్నట్టి యూహానుకూలముగా ననుభవింపఁదగినవి.) స్థావరములు జంగమములు నైనట్టివి, సుందరములైనట్టివియు నగు వానితో సుఖమొందిరి (ప్రజలు), అయ్యది రూపానురూపములకు ప్రమాణములకు తగినట్టివి. ఇక సత్పురుషులు, సాధువుల గూర్చి వివరించెదను ‘సత్’ అనుపదము బ్రహ్మనుగూర్చి చెప్పును. అది కలిగినవారు ‘సంతః’ ఇది బ్రహ్మతో వారు పొందిన తాదాత్మ్యము ననుసరించి వారికి బ్రహ్మతోడి తాదాత్మ్యము చెప్పును.

 దశాత్మకే యే విషయే కారణే చాష్టలక్షణే

 న క్రుధ్యంతి న హృష్యంతి జితాత్మానస్తు తే స్మృతాః

సామాన్యేషు చ ధర్మేషు తథా వైశేషికేషు చ

 బ్రహ్మక్షత్రవీశో యస్మాద్యుక్తాస్తస్మాద్ద్విజాతయః

 వర్ణాశ్రమేషు యుక్తస్య స్వర్గతౌ సుఖచారిణః

శ్రౌతస్మార్తస్య ధర్మస్య జ్ఞానార్థర్మజ్ఞ ఉచ్యతే

 విద్యాయాః సాధస్సాధుర్భ్రహ్మచారీ గురోరితః

గృహాణాం సాధనాచ్చైవ గృహస్థః సాధురుచ్యతే

సాధనాత్తపసోఽరణ్యే సాధుర్వైభానసః స్మృతః

 యతమానో యతిః సాధుః స్మృతో యోగస్య సాధనాత్

ఏవమాశ్రమ ధర్మాణాం సాధనాత్సాధవః స్మృతాః

 గృహస్థో బ్రహ్మచారీ చ వానప్రస్థో యతిస్తథా

అధ దేవా న పితరో మునయో న చ మానుషాః

అయం ధర్మో హ్యయం నేతి విందంతే భిన్నదర్శనాః

ధర్మాధర్మావిహ ప్రోక్తౌ శబ్దవేతౌ క్రియాత్మకౌ

కుశలాకుశలం కర్మ ధర్మాధర్మావీహ స్మృతమ్

ధారణార్థో ధృతిశ్చైవ ధాతుః శబ్ధే ప్రకీర్తితః

అధారణామహత్వే చ అధర్మ ఇతి చోచ్యతే

అథేష్టప్రాపకో ధర్మ ఆచార్యైరుపదిశ్యతే

 అధర్మశ్చానిష్టఫలోహ్యాచార్యైరుపదిశ్యతే

జ్ఞానేంద్రియకర్మేంద్రియవిషయాస్వాదనననుసరించి (దశేంద్రియము) యెవ్వరు కోపగింపరో, సంతోషింపరో, వారు జీతాత్ములు ఇంద్రియముల (వ్యాపారముల) జయించినవారు. నియతేంద్రియులు. అష్టలక్షణకారణముల జయించినవారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు సాధారణము లయిన సామాన్య ధర్మముల యందు, వైశేషిక ధర్మముల యందు, నీయుక్తులగుట వలన ‘ద్వీజులు’ అంరురీ. (రెండు సార్లు పుట్టిరి), తన వర్ణనమునకు, ఆశ్రమమునకు నియుక్తములయిన ధర్మముముల యందు నియుక్తుఁడు, స్వర్గ స్థితి యందు ధర్మముల నాచరించుచు, శ్రౌత స్మార్త ధర్మముల జ్ఞానము వహించి యుండుటచే నతఁడు ధర్మజుడని పిలువబడును. (23) బ్రహ్మచారి (విద్యార్థి) గురువు గారి హితముకోరి, గురువు యొక్క క్షేమమునకు పని చేయుచు, విద్యా సాధనకు ప్రయత్నము చేయునతఁడు సాధువు అనంబడును. తన గృహమునకు కావలసిన సాధనముల సంపాదించుటచే గృహస్టు సాధువనంబడును. (24) వైఖానసుఁడు (ఆరణ్య యతి) అరణ్యమున తపస్సుచే శక్తిని సాధించుటచే నతఁడు సాధువనంబడును. యోగసాధనము వలన యతమానుఁడు (ప్రయత్నించు) యతి సాధువు.  (25) ఈ విధముగా బ్రహ్మచారీ, గృహస్థు, వైఖానసుఁడు, యతి - వీరందరు వారికి సంబంధమయిన జీవితములందు ధర్మమును సాధించిన వారగుట సాధువులు. దేవతలుగాని పితృదేవతలు (పితరులు) కాని, మునులుగాని, మనుష్యులుకాని, విభిన్న ధర్మ దర్శనములుండుటచే, “ఇది ధర్మము, ఇది అధర్మము” అని గ్రహింపలేదు. (27) ఇచ్చట చెప్పఁబడిన ధర్మాధర్మ శబ్దములు క్రియాత్మకములు (శ్రుతి స్మృతుల విధింపఁబడిన పవిత్ర కర్మలు). పవిత్రమైన కర్మ (కుశల) ధర్మము; అపవిత్రము (అకుశలము) అయిన కర్మ అధర్మము. ధాతువు “ధృ” ధారణార్థమున నుపయోగింపబడినది (ధారణ పోషణములు ధర్మార్థములు) అధారణము వలన అధర్మ మనంబడినది.

 వృద్ధాశ్చాలోలుపాశ్చైవ త్వాత్మవంతో హ్యదాంభికాః

సమ్యగ్వినీతా ఋజవస్తానాచార్యాన్ప్రచక్షతే

స్వయమాచరతే యస్మాత్ ఆచారం స్థాపయత్యపి

ఆచినోతి చ శాస్త్రాణి ఆచార్య స్తేన చోచ్యతే

ధర్మజ్ఞైర్విహితో ధర్మః శ్రాతః స్మార్తో ద్విధా ద్విజేః

దారాగ్నిహోత్రసంబంధాద్ధ్విధా శ్రాతస్య లక్షణమ్

స్మార్తో వర్ణాశ్రమాచారైర్యమైః సనీయమైః స్మృతః

పూర్వేభ్యో వేదయిత్వేహ శ్రాతం సప్తర్షయోఽబ్రువన్

ఋచో యజుంషి సామాని బ్రహ్మణోంఽగాని చ శ్రుతిః

 మన్వంతరస్యాత్తస్య స్మృత్వాఽచారాన్మనుర్ణగౌ

తస్మాత్స్మార్తః స్మృతో ధర్మో వర్ణాశ్రమవిభాజకః

 స ఏష వివిధో ధర్మః శిష్టాచార ఇహోచ్యతే

శేషశబ్దః శిష్ట ఇతి శేషం శీష్టం ప్రచక్షతే

 మన్వంతరేషు యే శిష్టా ఇహ తిష్ఠంతి ధార్మీకాః

మనుః సప్తర్షయశ్చైవ లోకసంతానకారణాత్

ధర్మార్థంయే చ తిష్ఠంతి తాన్ శిష్టాన్వై ప్రచక్షతే

మన్వాదయశ్చ యేఽశిష్టా యే మయా ప్రాగుదీరితాః

తైః శిష్టైశ్చరితో ధర్మః సమ్యగేవ యుగే యుగే

త్రయీ వార్తా దండనీతిర్య వర్ణాశ్రమాస్తథా

శిష్టైరాచర్యతే యస్మాన్మనునా చ పునః పునః

మనము కోరునట్టి దానిని పొందిపఁజేయునది ధర్మము. దాని నాచార్యులు బోధింతురు. అనిష్టఫలదమయిన అధర్మమును గూర్చి కూడ ఆచార్యులుపదేశింతురు. (30) ఎవరు వృద్ధులో, అలోలుపులో (అలుబ్ధులో) ఆత్మ నిగ్రహము కలవారో, అదాంభికులో, గురుకులక్లేశ మనుభవించి చక్కగా విద్యాభ్యాసమొనర్చియుండిరో, ఋజువర్తనులో వారిని ఆచార్యులందరు. (31) ఎవఁడు ధర్మమును స్వయముగా నాచరించునో, అచారమును స్థాపన మొనర్చునో, సర్వశాస్త్రములను పరిపూర్ణముగా నధ్యయనము చేయునో, అతనినే ఆచార్యుఁడందురు. (32) శ్రాతము, స్మార్తము అని ధర్మము ధర్మజ్ఞులైన ద్వీజులచే ద్వీవీధముగా వీధింపఁబడినది. శ్రాత ధర్మము వివాహ విధులకును అగ్నిహోత్రార్చనమునకు సంబంధించినది. (33) స్మార్త ధర్మము వర్ణాశ్రమాచారములకు, యమములకు, నియమములకు సంబంధించినది. పూర్వఋషుల నుండి ధర్మము నెత్తింగిన తరువాత సప్తర్షులు శ్రాత ధర్మమును ప్రవచించిరి. (34) ఋక్కులు, యజుస్సులు, సామములు; శ్రుతి బ్రహ్మకంగములు. ఇవీ శ్రుతికి అవయవములు : గడచిపోయిన మన్వంతరములందలి ఆచారములను స్మరించి మనువు లానురచించిన స్మృతిని ప్రవచించెను. (35) అందుచే వర్ణాశ్రమ ధర్మ విభాజకము స్మృతి ధర్మమని స్మరింపఁడినది. వివిధ రూపమున యీ ధర్మమే శిష్యాచారముగా చెప్పుఁదడుచున్నది. శేష శబ్దమే శిష్టమని, శేషమునే శిష్టముగా జెప్పుదురు. మన్వంతరములలోని శిష్టులు ధార్మికులుగా నీటనుందురు, (37) మనువు, సప్తర్షులు, లోక సంతానకారణమున ధర్మార్గముండువారు. వీరిని శిష్టులని చెప్పుదురు. (38) మన్వాదులును, నేను పూర్వము చెప్పినవారునైన శిష్టులచే ప్రతి యుగమున ధర్మము బాగుగనే యాచరింపబడినది.

పూర్వైః పూర్వగతత్వాచ్చ శిష్టాచారః స సాత్వతః

దానం సత్యం తపో జ్ఞానం విద్యేజ్యా వ్రజనం దయా

అష్టౌ తాని చరిత్రాణి శిష్టాచారస్య లక్షణమ్

శిష్టా యస్మాచ్చరంత్యేనం మనుః సప్తర్షయస్తు వై

మన్వంతరేషు సర్వేషు శిష్టాచారస్తతః స్మృతః

 విజ్ఞేయః శ్రవణాచ్చ్రౌతః స్మరణాత్స్మార్త ఉచ్యతే

ఇజ్యా వేదాత్మకః శ్రౌతః స్మార్తో వర్ణాశ్రమాత్మకః

ప్రత్యంగానీ చ వక్ష్యామి ధర్మస్యేహతు లక్షణమ్

దృష్ట్వా తు భూతమర్థం యః పృష్టో వై న నిగూహతి

 యథా భూతప్రవాదస్తు ఇత్యేతత్సత్యలక్షణమ్

బ్రహ్మచర్యం జపో మౌనం నిరాహారత్వమేవ చ

ఇత్యేత్తపసో రూపం సుఘోరం సుదురాపదమ్

 పశూనాం ద్రవ్యహవిషామృక్సామయజుషాం తథా

ఋత్విణాం దక్షిణానాం చ సంయోగో యజ్ఞ ఉచ్యతే

ఆత్మవత్సర్వభూతేషు యా హితాయాహితాయ చ

 ప్రవర్తతే సమా దృష్టిః కృత్స్నాప్యేషా దయా స్మృతా

ఆక్రుష్టో నిహతో వాపీ నాక్రోశేద్యో న హంతి చ

 వాజ్మనఃకర్మబిర్వేత్తి తితిక్షైషా క్షమా స్కృతా

స్వామినా రక్ష్యమాణానాముత్సృష్టానాం చ సంభ్రమే

 పరస్వానామనాదానమలోభమీతి కీర్త్యతే

త్రయి (వేదములు మూఁడు) వార్త (వ్యవసాయము) దండనీతి (ధర్మ నిర్ణయము) యజ్ఞాచరణము వివిధ వర్ణాశ్రమాచారములు అన్నియును  శిష్టులచేతను మనువుచేతను పునః పునః ఆచరింపఁబడినవగుట అవిసాత్వతములైన శిష్టాచారములు, దానము, సత్యము, తపము, జ్ఞానము, విద్య, యజ్ఞము విద్య, సన్న్యాసము, (తనగమనము) దయ ఈ యెనీమీది లక్షణములు శిష్టాచార లక్షణములు. శిష్టులు మనువు సప్తర్షులు వీని నాచరించియుండుటచే నివి సమస్త మన్వంతరములలో శిష్టాచారములు అనబడినవి. శ్రవణముచే శ్రాత మెఱుంగవలయును. స్మరణమున స్మార్తము నెఱుంగవలయును. వేదాత్మకము యజ్ఞాత్మకము నయినది శ్రాతధర్మము. ప్రజల యొక్క వర్ణ ధర్మములకు ఆశ్రమ ధర్మలకు సంబంధించినది స్మార్తము. ప్రతి భాగమునకు సంబంధించిన ధర్మము యొక్క ప్రత్యంగమును చెప్పెదను. (44) ఒక విషయమును దర్శించి దానిని గూర్చి ప్రశ్నించినప్పుడు దానిని కప్పి పుచ్చక జరిగినది జరిగినట్లు వచించుట సత్యము. బ్రహ్మచర్యము, జపము, మౌనము, నిరాహారత్వము ఈ లక్షణములతో గూడినది తపస్సు. ఇది చాల కఠినమయినదీ. సుఖోరము, దానిని సాధించుట చాల కష్టము. (46) పశువులు నేయి (హవిస్సు) ఋక్సామయజుర్మంత్రములు, ఋత్విక్కులు, దక్షిణలు (ఇవి యజ్ఞ సంభారములు) వీని సంయోగమే యజ్ఞము. (47) సర్వ ప్రాణుల హితాహీత విషయములలో తనతో సమానముగా సర్వస్వ ప్రేమతో వర్తించుట దయ. నిందింపఁబడినను, లేదా కొట్టఁబడినను, తిరిగి(48) తిట్టక, తిరిగి కొట్టక, త్రికరణ శుద్ధిగా వాక్కుచేగానీ మనస్సుచే గాని, కర్మచేగాని ప్రతిక్రియ నాచరింపని వ్యక్తి యోర్పు క్షమా గుణము. యజమానులచే రక్షింపఁబడినవారిని కానీ, పరిత్యజింపఁబడినట్టివారిని కానీ, ఒడలు తెలియని మైకమున విడిచినవి గానియైన ఇతరుల వస్తువులను, ముట్టకుండుట గ్రహింపకుండుట అలోభగుణము.

మైథునస్యాసమాచారో న చింతా నానుజల్పనమ్

నివృత్తిర్భ్రహ్మచర్యం తదచ్ఛిద్రం తప ఉచ్యతే

ఆత్మార్థం వా పరార్థం పొ చేంద్రియాజీహ యస్య వై

మిథ్యా న సంప్రవర్తంతే శమ స్యైతత్తు లక్షణమ్

దశాత్మకే యో విషయే కారణే చాష్టలక్షణే

 న కృద్ధ్యేత ప్రతిహతః న జీతాత్మ విభావ్యతే

యద్యదీష్టతమం ద్రవ్యం న్యాయేనైవాగతం చ యత్

 తత్తద్గుణవతే దేయమిత్యేతద్దానలక్షణమ్

దానం త్రివిధమిత్యేతత్ కనిష్ఠజ్యేష్ఠమధ్యమమ్

 తత్ర నైశ్రేయసం జ్యేష్ఠం కనిష్ఠం స్వార్థసిద్ధయే

కారుణ్యాత్సర్వభూతేషు సంవిభాగస్తు మధ్యమః

శ్రుతిస్మృతిభ్యాం విహితో ధర్మో వర్ణాశ్రమాత్మకః

శిష్టాచారావిరుద్ధశ్చ ధర్మ: తత్సాధుసంవతః

అప్రద్వేషో హ్యనిష్టేషు తథేష్టస్యాభినందనమ్

ప్రీతితాపవిషాదేభ్యో వినివృత్తిర్వీరక్తతా

 సన్న్యాసః కర్మణాం న్యాసః కృతానామకృతైస్సహ

కుశలాకుశలానాం తు ప్రహాణం న్యాస ఉచ్యతే

అవ్యకా యే విశేషాస్తే వికారేఽస్మిన్నచేతనే

చేతనాచేతనాన్యత్వవిజ్ఞానం జ్ఞానముచ్యతే

 ప్రత్యంగానాం తు ధర్మస్య త్విత్యేతల్లక్షణం స్కృతమ్

మైథున వ్యాపారమున ఆసక్తి చూపకుండుట, స్త్రీ సంభోగమును గూర్చి యాలోచింపకుండుట, దానిని గూర్చి వాగకుండుట, వీని నుండి నివర్తించు రూపమైన బ్రహ్మచర్యము అచ్ఛిద్రమైన ‘తప’ ముగా చెప్పబడుచున్నది. ఆత్మార్ధము కాని పరార్థముకాని జ్ఞానేంద్రియములు మిథ్యగా ప్రవర్తింపకుండుట శమము. (ఇంద్రియ నిగ్రహము శమము) జ్ఞానేంద్రియ పంచకము యొక్క కర్మేంద్రియ పంచకము యొక్క యెనిమిది కారణముల నుండి ప్రతిహతుఁడు కాగా నెవ్వఁడు కోపగించండో, అతఁడు జీతాత్ముఁడు. ఇంద్రీయ వ్యాపారముల కవష్టంభము కల్గినచో కోపమూసని పోఁడు జీతాత్ముఁడు). (53) తనకు మిక్కిలీ ప్రియతమమైనదీ, న్యాయ మార్గమున సంపాదించినదియునగు ద్రవ్యమును గుణవంతుఁడైన యర్థికిచ్చుట దానము. (54) దానము కనిష్టము, జ్యేష్ఠము, మధ్యమము అని త్రివిధము వీనిలో మోక్షమునకై యిచ్చునది జ్యేష్ఠము. తన యొక్క నీచమయిన స్వార్థమును సాధించుట కొఱకు నొసంగబడినది కనిష్ఠమయినది. నీచదానము. ప్రాణుల యెడ దయతో నిచ్చునదిమధ్యమ దానము. నాలుగు వర్ణముల వారికి నాలుగు ఆశ్రమముల వారికి ధర్మము ప్రత్యేకముగా శ్రుతి స్మృతులచే విహితమయినది. (56) ఏది శిష్టాచారమునకు విరుద్దమయినదీ కాదో, అదీ కూడ ధర్మమే. అయ్యది విద్వద్వరేణ్యులయిన సాధుజనులకు సమ్మతమయినది. (57) ఒకని కిష్టము లేని వస్తువులయందు విద్వేషము లేకుండుట, ఇష్టమయిన దానిని అభినందించుట, ప్రీతి శాప విషాదముల నుండి వినివృత్తి విరక్తత. (58) కృతాకృతములతయిన కర్మల నుండి సన్న్యాసము. బాగోగులను విడుచుట సన్యాస యనంబడును. ఈ వికారముచేతనమై యుండ నా విశేషములవ్యక్తములగును.(?) చేతనా చేతనములకు వేరైన (జీవజగదతీతమైన) దానినీ దెలిసికొనుట జ్ఞానమనబడును, గత స్వాయంభువ మన్వంతరమున ధర్మతత్త్వజ్ఞులైన ఋషులు, ధర్మప్రత్యంగలక్షణముగా వీనిని స్మరించిరి.

ఋషిభిర్ధర్మతత్త్వజ్ఞేః పూర్వం స్వాయంభువేంఽతరే

 అత్ర వో వర్ణయిష్యామి విధిం మన్వంతరస్య యః

తథైవ చాతుర్హోత్రస్య చాతుర్విద్యస్య చైవ హి

 ప్రతిమన్వంతరే చైవ శ్రుతీరన్యా విధీయతే

ఋచో యజూంషి సామాని తథా చ ప్రతిదైవతమ్

ఆభూతసంప్లవస్యాపి వర్జైకం శతరుద్రీయమ్

విధిర్హౌత్రస్తథా స్తోత్రం పూర్వవత్సంప్రవర్తతే

ద్రవ్యస్తోత్రం గుణస్తోత్రం ఫలస్తోత్రం తథైవ చ

చతుర్థమాభిజనకం స్తోత్రమేతచ్చతుర్విధమ్

మన్వంతరేషు సర్వేషు యథా దేవా భవంతి యే

ప్రవర్తయతి తేషాం వై బ్రహ్మా స్తోత్రం చతుర్విధమ్

ఏవం మంత్రగణానాం తు సముత్పత్తిశ్చతుర్విధా

అధర్వర్గ్యజుషాం సామ్నాం వేదేషివ పృథక్ పృథక్

ఋషీణాం తప్యతాముగ్రం తపః పరమదుష్కరమ్

మంత్రాః ప్రాదుర్బభూవుర్హీ పూర్వమన్వంతరేష్విహ

 అసంతోషాద్భయాదుఃఖాత్సుఖచ్ఛోకచ్చ పంచధా

ఋషీణాం తారకాఖ్యేన దర్శనేనేన యదృచ్ఛయా

ఋషీణాం యదృషిత్వం హి తద్వక్ష్యామీహ లక్షణైః

అతీతానాగతానాం చ పంచధా త్వృషిరుచ్యతే

 అత స్త్వృషీణాం వక్ష్యామీ తత్ర హ్యర్షసముద్భవమ్

మన్వంతరాచారమును, అట్లే చతుర్హోత్ర చతుర్విద్యల యొక్క ప్రకారమును మీకు వర్ణించెదను. (61,62) ప్రతి మన్వంతరము నందు వేరు విధమయిన (అన్యా) శ్రుతి విధింపఁబడును. (62) ప్రతి మన్వంతరమున దేవతలు విధింపఁబడినట్లు ఋక్కులు, యజస్సులు, సామములు విధింపఁబడును. సర్వ భూతములు వినాశనము నొందినను, హోత్రస్తోత్ర విధానము శతరుద్రీయము వదలీ పూర్వమువలెనే ప్రవర్తించును. (63) స్తోత్రము నాలుగు విధములు : ద్రవ్య స్తోత్రము (ద్రవ్య ప్రశంస) గుణ స్తోత్రము (గుణ ప్రశంస) ఫల స్తోత్రము (ఫల ప్రశంస) 4 ఆభిజనక స్తోత్రము (అభిజనుల స్తుతి), సర్వ మన్వంతరము లందు బ్రహ్మ దేవతలకు సంబంధించి ఈ చతుర్విధ స్తోత్రములను ప్రవర్తింపఁజేయును. ఈ విధముగనే మంత్రగణముల సముత్పత్తియు చతుర్విధముగా నుండును. (66) తీవ్రతరమయిన పరమ దుషరతపస్సాచరించు ఋషులకు, అధర్వవేద ఋగ్వేద, యజుర్వేద సామవేదముల మంత్రములు, వేరువేరుగా (ఏడివిడిగా) పూర్వ మన్వంతరంబు లందువలె ప్రాదుర్భవించును. అయ్యప్ ఐదు విధములుగా గోచరించును :- (1) అసంతోషము వలన (2) భయము వలన (3) దుఃఖము వలన 4 సుఖము వలన (5) శోకము వలన (68) ఈ మంత్రములు యదృచ్ఛయా వాని యంతటనవియే తారకుఁడను పేరుగల ఋషి యొక్క దర్శనమున కనిపించును (ప్రాదుర్భవించును) ఆ ఋషీశ్వరుల యొక్క ఋషిత్వమును ఇట లక్షణములతో చెప్పెదను. (69) అతీతానాగతులలో (పూర్వ ఋషులలో భవిష్యత్ ఋషులలో) పంచవిధ ఋషులు కలరు. అందుచే ఆర్ష సముద్భవమయిన ఋషుల యుత్పత్తం గూర్చి చెప్పెదను. (ముందు వచ్చు వర్ణనములలో సవ్తర్షుల ఆవిర్భావ విధానము వర్ణింపఁబడును).

 గుణసామ్యే వర్తమానే సర్వసంప్రలయే తదా

అవిభాగే తు వేదానామనిర్దేశ్య తమోమయే

అబుద్ధిపూర్వకం తద్వై చేతనార్దే ప్రవర్తతే

 చేతనా బుద్ధిపూర్వం తు చేతనేన ప్రవర్తతే

ప్రవర్తతే తథా ద్వౌ తు యథా మత్స్యోదకే ఉభే

చేతనాధిష్ఠితం సత్వం ప్రవర్తతి గుణాత్మకమ్

కారణత్వాత్తథా కార్యం తదా తస్య ప్రవర్తతే

విషయో విషయిత్వాచ్చ అర్దేఽర్థత్వాతథైవ చ

కాలేన ప్రాపణీయేన భేదాస్తు కరణాత్మకాః

సంవిధ్యంతి తదా వ్యక్తాః క్రమేణ మహదాదయః

మహతశ్చాప్యహంకారస్తస్మాద్భూతేంద్రియాణి చ

భూతభేదాశ్చ భూతేభ్యో జజ్ఞిరే స్మ పరస్పరమ్

సంసిద్ధకార్యకరణః సద్య ఏవ వ్యవర్తన

యథోల్ముకాత్తు త్రుటయః ఏకకాలాద్భవంతి హి

తథా వివృత్తాః క్షేత్రజ్ఞాః కాలేనైకేన కారణాత్

యథాంధకారే ఖద్యోతః సహసా సంప్రదృశ్యతే

తథా వివృతో హ్యవ్యక్తాత్ఖద్యోత ఇవ సంజ్వలన్

న మహాన్సశరీరస్తు యతైవాయమవర్తన

తత్రైవ సంస్థితో విద్వాన్ ద్వారశాలాముఖే విభుః

 మహాంస్తు తమసః పారే వైలక్షణ్యాద్విభావ్యతే

గుణములన్నియు సామ్య స్థితిలో నుండ, సర్వప్రళయము సంప్రవృత్తమైయుండ, వేదములు అవిభాగములై యుండ, నిర్దేశించుటకు శక్యముకానీ తమోమయమై సర్వమునుండ అబుద్ది పూర్వకముగ చేతనము కొఱకే కార్యములు జరుగును. చేతనాబుద్ధిపూర్వము చేతనము చేత ప్రవర్తించును. (ప్రధానము). సదసదభిచారశక్తిచేతనే. (72) బుద్ది, సదసదభిచార శక్తి రెండును చేపలు (మత్స్యములు) నీటియందు ప్రవర్తించునట్లు వ్యవహరించును. చేతనాధిష్ఠితము గుణాత్మకమయిన సత్వము (చరించు వస్తువుల సత్వము)పనిచేయును. అట్లే కారణము వలన కార్యము ప్రవర్తిల్లును. విషయములు విషయిత్వము వలనను, అర్థత్వము వలన అర్థము (74) పని చేయును. (అర్ధ జనక లక్షణము. శబ్దములందు లేక యర్థము కలుగనీయట్లు), కరణీయములయిన భేదములు కాలము ననుసరిచి తత్తత్సమయమున పొందదగినవి. తరువాత క్రమముగా మహత్తు మొదలగునవి వ్యక్తములగును. (75) అహంకారము మహత్తు నుండియు, అహంకారము నుండి భూతేంద్రియములు, భూత భేదములు భూతముల నుండి పరస్పరము జనించెను. (76) (కరణము కారణముగా మారినది. కరణము (జ్ఞానేంద్రియము) అన్న అర్థము వచ్చు పాదము నందలి యర్థమును నిగూహ పరచుచున్నదీ?) కార్యకరణము యొక్క సంసిద్ది (ఇంద్రియము) తనంతటనది వెంటనే వివర్తతత్త్వమును (మార్పును) పొందును. నిప్పురవ్వలు, నెరుసులు అగ్ని నుండి యొకేమారు పైకి ఎటులు వచ్చునో, అట్లే క్షేత్రజ్ఞులు (ప్రత్యేకపు జీవులు) ఒకే కాలమున ఒకే కాగణమున ఉపాదాన కారణము నుండి పుట్టునో ఏ విధముగా ఖద్యోతము (మిణుగురు పురుగు) ఆకస్మికముగా అంధకార ప్రాయమయిన చీకటిలో కనబడునో (క్షేత్రజ్ఞుడు) అవ్యక్తము నుండి దృశ్యమానమగును. అయ్యటీ చాల పెద్దదీ (మహాన్) శరీరము కలిగియుండును. (79) తద్విభువు విద్వాంసుఁడు; ద్వారశాలా ముఖమున నుండును. (అంటే మహాశరీరుడై మహాతమస్సునకు పారమున, మహత్తు లక్షణత్వమున భావింపఁబడును కాననగును).

 తత్రైవ సంస్థితో విద్వాంస్తమసోంఽత ఇతి శ్రుతిః

బుద్ధిర్వివర్తమానస్య ప్రాదుర్భూతా చతుర్విధా

జ్ఞానం వైరాగ్యమైశ్వర్యం ధర్మశ్చేతి చతుష్టయమ్

 సంసిద్ధికాన్యథైతాని విజ్ఞేయాని నరస్య వై

స మహాత్మా శరీరస్య వైవర్తాత్సిద్ధిరుచ్యతే

 అనుశేతే యతః సర్వానక్షేత్రజ్ఞానమథాపి వా

పురిషత్వాచ్చ పురుషః క్షేత్రజ్ఞానాత్స ఉచ్యతే

 యస్మాద్ బుద్ధ్యానుశేతే చ తస్మాద్బోధాత్మకః స వై

సంసిద్ధయే పరిగతం వ్యక్తావ్యక్తమచేతనమ్

ఏవం వివృత్తః క్షేత్రజ్ఞః క్షేత్రజ్ఞానాభిసంహితః

వివృత్తిసమూలం తు బుద్ధ్యా వ్యక్తమృషిః స్వయమ్

 పరం హర్షయతే యస్మాత్పరమర్షిత్వమస్య తత్

గత్యర్ధాదృషతేర్దాతోర్నామనీర్వృతిరాదితః

 యస్మాదేవ స్వయం భూతస్తస్మాచ్చాష్యృషితా స్మృతా

ఈశ్వరాత్ స్వయముద్భూతా మానసా బ్రహ్మణః సుతాః

 యస్మాదుత్పద్యమానైస్తైర్మహాన్పరిగతః పరః

యస్మాదృషంతి తే ధీరాః మహాంతం సర్వతో గుణైః

 తస్మాన్మహర్షయః ప్రోక్తా బుద్ధేః పరమదర్శినా

ఈశ్వరాణాం సుతస్తేషాం మానసా ఔరసాశ్చ వై

 అహంకారం తపశ్చైవ ఋషంతీ ఋషితాం గతాః

అతఁడచ్చటనే విద్వాంసుఁడయిన యతఁడు తమస్సుయొక్కయంతరమున నుండును. అని శ్రుతి. అయ్యది (అవ్యక్తము). తన్ను మార్పు నొందించుకొనిన తరువాత బుద్ది చతుర్విధముగా ప్రాదుర్భవించెను. జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, ధర్మము అనునవి నాలుగు. వీనిని మానవుని తరింపఁజేయునట్టి. సంసిద్దీకరములని యేలుంగవలయును. (82) అతఁడు మహాత్ముఁడు. శరీరపుమార్పు (వివర్తము) వలన సిద్ది. ఆతఁడు శరీరము నందు శయనించునుగోన పురుషుడనంబడెను. క్షేత్ర సంబంధమయిన జ్ఞానముచే ఆతఁడు క్షేత్రజ్ఞుండనంబరగిను, ఆతఁడు లోపల (శరీరములో) నుండును గోన ఆతఁడు బోధాత్మకుఁడు. (84) వ్యక్తా వ్యక్తమగునచేతనము సంసిద్దికి పరిగతము ఈ విధముగా క్షేత్రజ్ఞు డు వీవృత్తుఁడు. క్షేత్రజ్ఞానాభీసంహితుడు. క్షేత్ర జ్ఞానముతో గూడిన). (85) ఏవృత్తి సమకాలముననే బుద్దీతో స్వయంవ్యక్తుడు ఋషి ఆతఁడు (పరం హర్షయతే) మిక్కిలి సంతసించువాడు, సంతసింపచేయువాడు గావున పరమరీ (86) గత్యర్థక ‘ఋష్’ ధాతువు నుండి ఈ నామము కలిగినది. తనంతట తానే పుట్టినందువలన ఋషిత (ఋషిత్వము) కలిగినది. (87) వారు ఈశ్వరుని వలన స్వయముగా నుద్భూతులయిరి. అందుచే వారు బ్రహ్మమానస పుత్రులు. పుట్టిన వెనుక వారందరు “మహత్తు” ను పరీవృతులయి చుట్టు ప్రదక్షిణ మాచరించిరి. ఆత్మభువులయిన వారు తమ గుణ పరంపరచే మహత్తు చుట్టు తిరుగుటచే “మహర్షులు” గానయిరి. వారు బుద్ధి యొక్క పరమ దర్శనులుగా చెప్పఁబడిరి. వీరు ఈశ్వరునకు మానస పుత్రులు ఔరసులు కూడ (పుట్టినవారు). వారు అహంకారమునకు, తపస్సునకు పరులగుట (దూరులగుట) వారు ఋషిత్వమును పొందిరి.

తస్మాత్సప్తర్షయస్తే వై భూతాధౌ తత్త్వదర్శనాత్

ఋషిపుత్రా ఋషీకాస్తు మైథునాద్గర్భసంభవాః

తన్మాత్రాణి చ సత్యం చ ఋషంతే తే మహౌజసః

 సప్తర్షయస్తతస్తే చ పరసత్యస్య దర్శనాః

ఋషీకాణాం సుతాస్తే స్యుర్విజ్ఞేయా ఋషిపుత్రాకాః

 ఋషంతి తే ఋతం యస్మాద్విశేషాంశ్చైవ తత్త్వతః

తస్మాత్సప్తర్షయస్తేపి శ్రుతేః పరమదర్శనాత్

అవ్యక్తాత్మా మహానాత్మాఽహంకారాత్మా తథైవ చ

భూతాత్మాచేంద్రియాత్మా చ తేషాం తత్ జ్ఞానముచ్యతే

 ఇత్యేతా ఋషిజాతీస్తా నామభిః పంచ వై శృణు

భృగుర్మరీచిరత్రిశ్చ హ్యంగిరాః పులహః క్రతుః

 మనుర్ధక్షో వశిష్ఠశ్చ పులస్త్యశ్చేతి తే దశ

బ్రహ్మణో మానసాహ్యేతే ఉద్భూతాః స్వయమీశ్వరాః

 పరత్వేనర్షయో యస్మాత్ స్మృతాస్తస్మాన్మహర్షయః

ఈశ్వరాణాం సుతాహ్యేతే ఋషయస్తాన్ నిబోధత

 కావ్యో బృహస్పతిశ్చైవ కశ్యపశ్చ్యవనస్తథా

ఉతథ్యో వామదేవశ్చ అపాస్యశ్చోశిజస్తథా

 కర్దమో విశ్రవాః శక్తోర్వాలఖిల్యాస్తథార్వతః

ఇత్యేతే ఋషయః ప్రోక్తాస్త్రపసాచర్షితాం గతాః

 ఋషిపుత్రానృషీకాంస్తు గర్భోత్పన్నాన్నిబోధత

భూతాదుల యందు తత్త్వమును కనుగొని యుండుటచే వారు సప్తర్షులు అయిరి. ఋషీకులు ఋషిపుత్రకులు. వారు మైథునమున (భార్యా భర్త యోగమున) కలిగిరి.  మహాతేజస్వులయిన యా ఋషులచే తన్మాత్రలు, సత్యము కూడ తెలిసికొనఁబడినవి. అందుచే సప్తర్షులు సత్యమును (పరమ సత్యమును) దర్శించిరి. (92) వారు ఋషీకుల యొక్క పుత్రులు. వారిని ఋషి పుత్రులనుగా గ్రహింపవలయును. ఈ ప్రపంచము (విశ్వము) యొక్క అద్భుత సత్యము ఋతము. వారు అసత్యమును విశేషములను గ్రహించిన వారగుట ఋషి పుత్రములయిరి. (93) ఆ ఋషులు వేదము నిజముగా చూచిన వారగుట వారు సప్తర్షులు. (1) అవ్యక్తాత్మ (2) మహాన్ ఆత్మ (3) అహంతాత్మ (4) భూతాత్మ ఋక్షజాతులు. [5) ఇంద్రియాత్మ అను నైదు ఋషిజాతులు. (94,95) భృగువు, మరీచి, అత్రి, అంగీరుఁడు, పులహుఁడు, క్రతువు, మనువు, దక్షుడు, వశిష్ఠుఁడు, పులస్త్యుఁడు. ఈ పదిమందీ బ్రహ్మమానసపుత్రులు. స్వయమీశ్వరులు, పరమరులుగాన మహరులనబడిరి. (97) ఈ క్రిందఁ జెప్పఁబడు ఋషులు ఈశ్వర సుతులు; కావ్యుఁడు (శుక్రుఁడు), బృహస్పతి, కశ్యపుడు, చ్యవనుఁడు, ఉతథ్యుడు, వామదేవుఁడు, అపాస్యుడు, ఉషిజుడు, కర్దముడు, విశ్రవసువు, శక్తి, వాలఖిల్యులు, అర్తవులు. (99) ఈ ఋషీశ్వరు లందరు ఋషిత్వ స్థితిని తపస్సుచే పొందిరి. ఋషీకులు - ఋషుల పుత్త్రులు. యోని జాతులని యెఱుంగుము.

వత్సరో నగృహూశ్చైవ భరద్వాజస్తథైవ చ

ఋషిర్దీర్ఘతమాశ్చైవ బృహదుక్థః శరద్వతః

వాజశ్రవాః శ్రుతిశ్చైవ వశ్యాశ్వశ్చ పరాశరః

దధీచః శంశపాశ్చైవ రాజ వైశ్రవణస్తథా

ఇత్యేతే ఋషికాః ప్రోక్తాస్తే సత్యాదృషితాం గతాః

ఈశ్వరా ఋషయశ్చైవ ఋషికాశ్చైవ తే స్మృతాః

ఏతే మంత్రకృతః సర్వే కృత్స్నశస్తాన్నీబోధత

భృగుః కావ్యః ప్రచేతాశ్చ ఋచీకో హ్యాత్మవానపి

ఔర్వోఽథ జమదగ్నిశ్చ విదః సారస్వతస్తథా

ఆర్షిషేణో యుధాజిచ్చ వీతహష్యసువర్చసౌ

వైన్యః పృధుర్దివోదాసో బాధ్యశ్వో గృత్స్నశౌనకా

 ఏకోనవింశతి ర్హ్వేతే భృగవో మంత్రవాదినః

అంగిరా వైద్యగశ్చైవ భరద్వాజోఽథ బాష్కలిః

 ఋతవాకస్తథా గర్గః శిని; సంకృతిరేవ చ

పురుకుత్సశ్చ మాంధాతా హ్యంబరీషస్తథైవ చ

యువనాశ్వః పౌరకుత్సస్త్రసదస్యుశ్చ దస్యుమాన్

ఆహార్యో హ్యజమీఢశ్చ తుక్షయః కపిదేవ చ

 వృషాదర్భో వీరూపాశ్వః కణ్వశ్చైవాథ ముద్గలః

ఉతథ్యశ్చ సనద్వాజస్తథా వాజశ్రవా అపి

అయాస్యశ్చక్రవర్తీ చ వామదేవ స్తథైవ చ

వత్సరుఁడు, నగృహుఁడు, భరద్వాజుఁడు, దీర్ఘతముడు, బృహదుదుక్థుడు, శరద్వతుండు, వాజశ్రవుఁడు, శ్రుతి, వశ్యాశ్వుడు, పరాశ రుఁడు, దధీచుఁడు, శంశపుఁడు, వైశ్రవణుఁడు (రాజు) వీరందరిని ఋషకులందురు. వారు ఋషత్వమును వారీ సత్యత్వము వలన పొందిరి. వారినే ఈశ్వరులని, ఋషులని, ఋషికులని జ్ఞాపకముంచు కొందురు.  వారందరు మంత్రకర్తలు. వారి నందరినీ పూర్తిగా సెలుంగుము, భృగువు, కావ్యుడు, ప్రచేతసుఁడు, ఋచీకుఁడు, ఆత్మవంతుఁడు (104) ఔర్వుఁడు, జమదగ్ని, విదుఁడు, సారస్వతుఁడు, అరిషేణుడు, యుథొజిత్తు, వీతూవ్యుఁడు, సువర్చసుఁడు, వైశ్యుఁడు, పృథువు, దివోదాసుఁడు, బాధ్యశ్వుఁడు, గృత్నుఁడు, శౌనకుఁడు. వీరు 19గురు భృగువులు. ఆ ఋషులందరు మంత్రవాదులు.  (106) అంగిరుఁడు, వైద్యగుడు, భరద్వాజుడు, భాషలీ, ఋతపోకుడు, గర్ణుండు, శ్రీని, సంకృతి, పురుకుత్సుడు, మాంధాత, అంబరీషుఁడు, యువనాశ్వుఁడు, పౌరకుత్సుడు, త్రసదస్యుఁడు, దస్యుమంతుఁడు, ఆహార్యుఁడు, అజమీడుఁడు, తుక్షయుఁడు, కపి, వృషాదర్భుడు, వీరూపాశ్వుండు, కణ్వుడు, ముద్గలుఁడు, ఉతథ్యుఁడు, సనద్వాజుఁడు, వాజశ్రవసుఁడు, ఆయాస్యుఁడు, చక్రవర్తి, హమదేవుఁడు, అసిజుఁడు

అసిజో బృహదుక్ధశ్చ ఋషిర్దీర్ఘతమాస్తథా

కక్షీవాంశ్చ త్రయస్త్రింశత్స్మతా హ్యంగిరసా వరాః

ఏతే మంత్రకృతః సర్వే కాశ్యపాంస్తు నిబోధత

కాశ్యపశ్చైవ వత్సారో నైధ్రువో రైభ్య ఏవ చ

అసితో దేవలశ్చైవ షడేతే బ్రహ్మవాదినః

అత్రిరవ్యననశ్చైవ శ్యావశ్వశ్చ గవిష్ఠిరః

ఆవిహోత్రఋషిర్దీమాంస్తథా పూర్వాతిథిశ్చ సః

 ఇత్యేతే చాత్రయః ప్రోక్తా మంత్రకారా మహర్షయః

వశిష్టశ్చైవ శక్తిశ్చ తథైవ చ పరాశరః

చతుర్ధ ఇంద్రప్రమతిః పంచమశ్చ భరద్వసుః

షష్ఠశ్చ మైత్రావరుణిః కుండినః సప్తమస్తథా

 ఇతి సప్త వశిష్టాశ్చ విజ్ఞేయా బ్రహ్మవాదినః

విశ్వామిత్రస్తు గాధేయో దేవరాతస్తథోద్గలః

తథా విద్వాన్మధుచ్ఛందా ఋషిశ్చాన్యోఽఘమర్షణః

అష్టకో లోహితశ్చైవ కతః కోలశ్చ తావుభౌ

దేవశ్రవాస్తథారేణుః పూరణోఽథ ధనంజయః

త్రయోదశైతే ధర్మిష్ఠా విజ్ఞేయాః కుశికా వరాః

అగస్త్యోయో దృధాయుశ్చ విఘ్నవాహస్తథైవ చ

బ్రహ్మిష్ఠాoగతపా హ్యేతే త్రయః పరమకీర్తయః

 మనుర్వైవస్వతశ్చైవ ఐలో రాజా పురూరవాః

క్షత్త్రియాణాం చరావేతౌ విజ్ఞేయో మంత్రవాదినౌ

భలందనశ్చ వత్సశ్చ సంకీలశ్చైవ తే త్రయః

బృహదుక్థుడు, దీర్ఘతముఁడు, కక్షీవంతుఁడు ఈ ముప్పది మూఁడుగురు మహర్షులు అంగీరస ఋషి వంశ శ్రేష్ఠులు. (111) వీరందరు మంత్రకర్తలు. ఇక కాశ్యప వర్గ ఋషుల నెఱుంగుము. కాశ్యపుఁడు, వత్సారుఁడు, నైధ్రువుఁడు, రైభ్యుఁడు, అసితుఁడు, దేవలుఁడు, ఈ ఆరుగురు బ్రహ్మవాదులు. ఆత్రీ, అవ్యసనుఁడు, శావాశ్వుండు, గవిష్ఠిరుఁడు, ఆవీహోత్రుఁడు, ధీమంతుఁడు, పూర్వాతిధి వీరిని అత్రి సంబంధు లందురు. వీరందరు మహరులు, మంత్రకారులు. (114) వశిష్ఠుఁడు, శక్తి, పరాశరుఁడు, నాలుగవవాఁడు ఇంద్రప్రమతి, పంచముఁడు భరద్వసుఁడు, మైత్రావరుణి ఆడవవాఁడు, ఏడవవాఁడు కుండీనుఁడు, వీరు ఏడుగురు వశిష్ఠ వంశోద్భవులు. వీరందరిని బ్రహ్మ దులుగా నెఱుంగుము. గాధి కుమారుఁడయిన విశ్వామిత్రుండు, దేవరాతుఁడు, ఉద్దలుఁడు, విద్వాంసుడైన మధుచ్చందుఁడు, అఘమర్షణుఁడు, అష్టకుర డు, లోహితుఁడు, కతుఁడు, కోలుఁడు, దేవశ్రవసువు, రేణువు, పూరణుఁడు, ధనంజయుఁడు ఈ పదిముగ్గురు కుశికవంశమందలి ధర్మిష్ణులయిన ఉత్తమ వ్యక్తులని యెఱుంగవలయును. అగస్త్యుఁడు, అయుడు, దృఢాయువు, ఇద్మ.హుఁడు ఈ మువ్వురు బ్రహ్మిష్ణులు, బ్రహ్మను గూర్చిన తపస్సు నందు నియుక్తులు. వీరికి ఉత్తమ తపస్సు కలదు ప్రసిద్దమయిన కీర్తి కలదు. వైవస్వతుని కుమారుఁడయిన మనువు, ఐలుఁడయిన పురూరవరాజు వీరిరువురు ఉత్తమక్షత్రియులు. మంత్రములను గనుగొనినవారు (మంత్రవాదులు).

ఏతే మంత్ర కృత్చశ్చైవ వైశ్యానాం ప్రవరాః స్మృతాః

ఇత్యేషా నవతిః ప్రోక్తా మంత్రా యైరృఋషిభిః కృతాః

బ్రాహ్మణాః క్షత్త్రియా వైశ్యా ఋషిపుత్రాన్నిబోధత

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ద్వితీయేఽనుషంగపాదే యుగప్రజాలక్షణమృషిప్రవరవర్ణనం చ నామ ద్వాత్త్రింశత్తమోఽధ్యాయః

బలందనుఁడు, వత్సుఁడు, సంకీలుఁడు ఈ మువ్వురును మంత్రకారులు. అంతియకాక వైశ్యులలో వీరు మిక్కిలి శ్రేష్ఠులుగా స్మరింపం బడుచున్నారు. ఈ విధముగా ఋషులచే సమకూర్పబడిన (చేయబడిన - చూడబడిన) మంత్రములు తొంబది. ఆ ఋషీశ్వరులు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కూడ. ఋషి పుత్త్రకులయిన వీరల నెఱుంగుము.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండ మహాపురాణ మందలి పూర్వభాగము నందలి ద్వితీయానుషంగపాదమున యుగప్రజాలక్షణము, ఋషి ప్రవర వర్ణనము అను ముప్పది రెండవ అధ్యాయము.