బ్రహ్మాండ మహా పురాణము
1 - మధ్యమ భగము ఋషిసర్గ వర్ణనము
శాంశపాయన ఉవాచ:-
పాదః ప్రోక్తో ద్వితీయస్తు అనుషంగేన నస్త్వయా ।
తృతీయం విస్తరాత్పాదం సోపోద్ఘాతం ప్రవర్తయః
సూత ఉవాచ:-
కీర్తయిష్యే తృతీయం వః సోపోద్ఘాతం సవిస్తరమ్ ।
పాదం సముచ్చయాద్వీపా గదతో మే నిబోధత ॥
మనోర్వైవస్యతస్యేమం సాంప్రతం తు మహాత్మనః ।
విస్తరేణానుపూర్వ్యా చ నిసర్గం శృణుత ద్విజాః ॥
చతుర్యుగైకసప్తత్యా సంఖ్యాతం పూర్వమేవ తు ।
సహదేవగణేశైవ ఋషిభిర్దానవైస్సహా ॥
పితృగంధర్వయక్షేశ్చ రక్షోభూతమహోరగైః ।
మానుషైః పశుభిశ్చైవ పక్షిభిః స్థావరైః సహ ॥
మన్వాదికం భవిష్యాంతమాఖ్యానెర్బహుభిర్యుతమ్ ।
వక్ష్యే వైవస్వతం సర్గం నమస్కృత్య వివస్వతే ॥
ఆద్యే మన్వంతరేజి తీశాః సర్గప్రావర్తకాస్తు యే ।
స్వాయంభువేంత పూర్వం సప్తాసన్యే మహర్షయః ॥
చాక్షుషస్యాంతరేతీనే ప్రొస్తే వైవస్వతే పునః ।
దక్షస్య చ ఋషీణాం చ భృగ్వాదీనాం మహౌజసామ్ ॥
శాపాన్మహేశ్వరస్యాసీత్రాదుర్భావో మహాత్మనామ్ ।
భూయః సప్తర్షయస్త్వేవముత్పన్నాః సప్తమానసాః ॥
పుత్తత్వే కల్పితాశ్చైవ స్వయమేవ స్వయంభువా ।
ప్రజాసంతానకృఢసైరుత్పదదిర్మహాత్మభిః ॥
పునః ప్రావర్తితః సర్గో యథాపూర్వం యథాక్రమమ్ ।
తేషాం ప్రసూతిం వక్ష్యామీ విశుద్దజ్ఞానకర్మణామ్ ॥
సమాసవ్యాసయోగాభ్యాం యథావదనుపూర్వశః ।
యేషామన్వయసంభూతైర్లోకోయం సచరాచరః ॥
పునరాపూరితః సర్వో గ్రహనక్షత్రమండితః ॥
శాంశపాయనుఁడు అభ్యర్థించెను.
ద్వితీయపాదము తదనుబంధముతో (అనుషంగ) నీవు మాకు వివరించితివి. దయతో మూఁడవపాదమును తదుపోదాతపాదముతో సవిస్తరముగా మాకు వర్ణింపుము.
సూతుఁడిట్లనెను.
ఉపోద్ఘాత సహితముగా మూఁడవ పాదమును సవిస్తరము ససముచ్చయముగ వివరించెదను. ఓ బ్రాహ్మణులారా ! నేను చెప్పుచుండగా గ్రహింపుఁడు. ఓ ద్విజులోధా ! మహాత్ముఁడైన వైవస్వత మనువు యొక్క ఇప్పటి సర్గ క్రమమును గూర్చి ఆనుపూర్వికముగను, విస్తరముగాను ఆలకింపుఁడు. ఈ ప్రస్తుత మన్వంతరము 4 యుగముల యొక్క డెబ్బది యొకండు భాగములుగా పూర్వమే చెప్పఁబడినది. వీవస్వతునకు నమస్కరించి, వైవస్వత మనువు యొక్క సర్గమును (సృష్టిని) మనువుతో నారంభించి, భవిష్యాంతము వరకు, అనేకములయిన ఆఖ్యానములతో గూడియున్నదానిని, మీకు వివరించెను. ఈ ఆఖ్యానములు దేవతల ఋషుల, దానవుల, పితరుల, గంధర్వుల, యక్షుల, రాక్షసుల, భూతముల, మహోరగముల, మానవుల, జంతువుల, పక్షుల యొక్క విషయములను స్థావరములతో సహితముగా చెప్పెదను. స్వాయంభువమనువు కాలములో సృష్టిని మొట్టమొదట ఆరంభించిన ఆ సప్తమహా ఋషులు గతించిరి. చాక్షుష మన్వంతరము అతీతమై మరల వైవస్వత మన్వంతర మారంభమైనప్పుడు, ఈశ్వరుని యొక్క శాపముచే, దక్షుండు, మహౌజసులు మహాత్ములు నయిన భృగ్వాదులు మరల ప్రాదుర్భవించిరి. ఈ విధముగా పునర్జన్మ నొందిన సప్తర్షులు స్వాయంభువుఁడయిన బ్రహ్మయొక్క మానసపుత్రులుగా నంగీకరింపఁబడిరి. స్వయంభువుఁడే వారిని పుత్రులుగా స్వయము కల్పించెను. పునరుత్పన్నులయిన మహాత్ములచే యథాక్రమము యథాపూర్వము సృష్టి ప్రజాసంతానము ఆచరించిన వారిచే జరుపఁబడెను. ఆ జ్ఞానకర్ముల యొక్క విశుద్ధమయిన ప్రసవమును (ప్రసూతిని) చెప్పెదను. ఆనుపూర్వికముగ ఉన్నదున్నట్లే సంక్షేపముగ విస్తారముగ చెప్పెదను. చరాచరములయిన భూతములతో కూడియున్న యీ విశ్వమంతయు వారి యొక్క యన్వయము నందుదయించిన వారిచే నిండి యున్నది. గ్రహ నక్షత్ర మండితమై పునః అంతరిక్షమేర్పడెను.
ఋషయః ఊచుః :-
కథం సప్తర్షయః పూర్వముత్పన్నాః సప్త మానసాః ।
పుత్రత్వే కల్పితాశ్చైవ తన్నో నిగద సత్తమ ॥
సూత ఉవాచ :-
పూర్వం సప్తర్షయః ప్రోక్తా యే వై స్వాయంభువేంఖిత ।
మనోరంతరమాసాద్య పునర్వైవస్వతం కిల ॥
భవాభిశాపసంవిద్ధా అప్రాపాస్తే తదా తపః ।
ఉపపన్నా జనే లోకే స కృతాగమనిస్తు తే ॥
ఊచుః సర్వే సదాన్యోన్యం జనలోకే మహర్షయః ।
ఏత ఏవ మహాభాగా వరుణే వీతశేఖధ్వరే ॥
సర్వే షయం ప్రసూయామశ్చాక్షుషస్యాంతరే మనోః ।
పితామహాత్మజాః సర్వే తన్నః శ్రేయో భవిష్యతి ॥
ఏవముక్తా తు తే సర్వే చాక్షుషస్యాంతరే మనో।
స్వాయంభువేంతరే ప్రాప్తః సృష్ట్యర్థం తే భవేన తు ॥
జజ్ఞిరే మా పునస్తే వై జనలోకాదిహాగతః ।
దేవస్య మహతో యజ్ఞో వారుణీం బిభ్రతస్తనుమ్ ॥
బ్రహ్మణో జుహ్వతః శుక్రమగ్నౌ పూర్వం ప్రజేపయా ।
ఋషయో జజ్ఞిరే దీర్తే ద్వితీయమితి నః శ్రుతమ్ ॥
భృగ్వంగిరా మరీచిశ్చ పులస్త్యః పులహః క్రతుః ।
అత్రిశ్చైవ వసిష్ఠశ్చ హ్యష్టా తే బ్రహ్మణః సుతాః ॥
తథాస్య వితతే యజ్జీ దేవాః సర్వే సమాగతాః ।
యజ్ఞాంగానీ చ సర్వాణి వషట్కారళ్ళ మూర్తిమాన్ ॥
మూర్తిమంతి చ సామాని యజూంషి చ సహస్రశః ।
ఋగ్వేదశ్చాభవత్తత్ర యశ్చ క్రమవిభూషితః ॥
యజుర్వేదశ్చ వృత్తాధ్య ఓంకోరవదనోజ్వల ।
స్థితో యజ్ఞార్థసంపృక్తః సూక్తబ్రాహ్మణమంత్రవాన్ ॥
సామవేదశ్చ వృత్తాధ్యః సర్వగేయపురస్సరః ।
విశ్వావస్వాదిభిః సార్థం గంధర్వైః సంభృతోభవత్ ॥
ఋషులు అడిగిరీ :
“ఓ సత్తమ! బ్రహ్మకు మానస పుత్రులుగా పూర్వముదయించిన సప్తర్షులు బ్రహ్మగారిచే మరల నతని పుత్రులుగా నెట్లు కల్పించుకొనంబడిరో చెప్పఁగోరెదము.
సూతుఁడిట్లు చెప్పెను.
స్వాయంభువ మన్వంతరమున ఏ సప్తరులు చెప్పబడిరో, వారు వైవస్వత మన్వంతరమును చేరిరి. ఈశ్వర శాప సంవిద్దులయిరి. అందుచే వారు పూర్వమాచరించిన తపః ప్రభావమును పొందలేకపోయిరి. జనలోకమును చేరి పోరందుండిరి. ఆ జనలోకము నుండి యొకే యొక మారు వారు తిరిగి రాగలరు. జనలోకమున మహర్షులు పరస్పరము మిట్లు చెప్పుకొనిరి. చాక్షుష మన్వంతరమున, పవిత్రమయిన వరుణ యజ్ఞము జరుపబడిన తరువాత మనము అందరము తత్సవిత్ర వ్యక్తులముగా జన్మించెదము. అదియే మనయొక్క శ్రేయస్సునకు (కీర్తికి) కారణమగును. స్వాయంభువ మన్వంతరమున శప్తులయిన మహరులందరు ఇట్లు చెప్పుకొని చాక్షుష మన్వంతరమున వారందరు సృష్టి కొణుకు పుట్టిరి. వారు జనలోకము నుండి తిరిగి వచ్చిరి. మరల జన్మించిరి. వారు, వరుణుని యొక్క భౌతికరూపము దాల్చిన మహాదేవుఁడయిన వరుణుని యజ్ఞమున, పుట్టిరి. బ్రహ్మ పుత్రులను పొందవలయునను కోరికతో తన శుక్రమును అగ్నిలో హోమము చేసి యజ్ఞమును ఆచరించుచుండ ఋషులు ద్వీతీయజన్మమమును పొందిరని మేము ఏంటీమీ. వారు బ్రహ్మయొక్క యెనిమిది మంది కుమారులు. భృగువు, అంగీరసుఁడు, మరీచి, ఫులస్త్యుఁడు, పులహుఁడు, క్రతువు, అత్రి, వసిష్ణుఁడు. వితతమయిన యీ యజ్ఞమునకు దేవతలందరు వచ్చిరి. ఆ విధముగనే, అన్ని యజ్ఞాంగములందుండెను. సామమంత్రములు మూర్తిమంతములయ్యెను. వేలాది యజుర్మంత్రములు మూర్తిమంతములయినవి. క్రమబద్ధపదములచే నలంకృతమయి ఋగ్వేదము ప్రత్యేక మూర్తితో నందు ప్రత్యక్షమయ్యెను, వృత్తములతో భూషితమయిన యజుర్వేదము, ఓంకార వదనోజ్జ్వలమయి, యజ్ఞార్థమయిన సూక్త బ్రాహ్మణ మంత్రములతో సంపృక్షమై సంస్థితమై యుండెను. సామవేదము వృత్తములతోనొప్పి సర్వగేయ పురస్సరమయి విశ్వావసు మొదలయిన గంధర్వులతో కూడికొని యచ్చట సంస్థితమై యుండెను.
బ్రహ్మవేదస్తథా ఘోరైః కృత్వా విధిభిరన్వితః ।
ప్రత్యంగిరసగైశ్చ ద్వీశరీరశిరోభవత్॥
లక్షణా విస్తరాః స్తోభా నీరుక్తస్వరభక్తయః।
ఆశ్రయస్తు వషట్కారో నిగ్రహప్ర గ్రహావవి ॥
దీప్తిమూర్తిలిలాదేవీ దిశశ్చ సదిగీశ్వరాః ।
దేవకన్యాశ్చ పత్మ్యశ్చ తథా మాతర ఏవ చ ॥
ఆయయుః సర్వ ఏవైతే దేవస్య యజతో మభే ।
మూర్తిమంతః సురూపాఖ్యా వరుణస్య వపుర్భృతః ॥
స్వయంభువస్తు నా దృష్ట్వా రేతః సమపతత్భువీ ।
బ్రహ్మర్షభావినోబర్థస్య విధానాచ్చ న సంశయః ॥
ధృత్వా జుహావ హస్తాభ్యాం సుషేణ పరిగృహ్య చ।
ఆస్రవజుహుయాం చక్రే మంత్రవచ్చ పితామహః ॥
తతః స జనయామాస భూతగ్రామం ప్రజాపతిః ।
తస్యార్వాక్రేజసశ్చైవ జట్లే లోకేషు తైజసమ్ ॥
తమసా భావి యాష్యత్వం యథా సత్త్వం తథా రజః ।
ఆజ్యస్థాల్యాముపాదాయ స్వశుక్రం హుతవాంశ్చ హ ॥
శుక్రీ హుశేఖథ తస్మింస్తు ప్రాదుర్భూతా మహర్షయః ।
జ్వలంతో వపుషా యుక్తాః స్వప్రభావైః స్వర్గుణె: ॥
హతే చాగ్నౌ సకృచ్ఛకే జ్వాలాయా నిసృతః కవి: ।
హీరణగర్భస్తం దృష్ట్వా జ్వాలాం భీత్వా వినిర్గతమ్ ॥
భృగుస్తమితి చోవాచ యస్మాత్తస్మాత్స వై భృగుః ।
మహాదేవస్తథోద్భూతో దృష్ట్వా బ్రహ్మాణమబ్రవీత్ ॥
మమైష పుత్రకామస్య దీక్షితస్య త్వయా ప్రభో ।
విజజే ప్రథమం దేవ మమ పుత్రో భవత్యయమ్ ॥
తథేతి సమనుజ్ఞాతో మహాదేవః స్వయంభువా ।
పుత్రచ్వే కల్పయామాస మహాదేవస్తదో భృగుమ్ ॥
వారుణా భృగవస్తస్మాత్తదపత్యం చస ప్రభుః ।
ద్వితీయం చ తతః శుక్రమంగారేష్వజుహోత్ర్పభుః ॥
అంగారేష్వంగిరోంగాని సంహతాని తతోంగిరాః ।
సంభూతిం తస్య తాం దృష్ట్వా వహ్నిర్బ్రహ్మాణమబ్రవీత్ ॥
బ్రహ్మవేదము (అధర్వవేదము) ఘోరములయిన విధులతో కూడుకొని అందు ప్రత్యక్షమయ్యెను. ప్రత్యంగిరుల యోగముచే నయ్యది రెండు శరీరములతో (ద్విశరీరః) నుండెను. ఈ క్రింద వివరింపఁబడిన వేదపాఠ లక్షణములు భౌతిక స్వరూపముతో నందు ప్రత్యక్షము : లక్షణా - (ఒక పదమునకు సజాతి పదమో సమాన పదమో వాడుట), విస్తరము - (సంక్షిప్తస్యా గ్రతో స్యైవ వాక్యస్యార్థి గరీయసః, సువిస్తార తో వాచో భాష్యభూతాభవంతియే. (సిద్దాంత) స్తోము (సామవేదములో ఉక్త ఆశ్చర్యార్థకము). నిరుక్తము (వేదపదార్థ నిర్ణయము). స్వరభక్తి (అజ్స్వరోచ్చారణము). ఆశ్రయము, వషట్కారము, నిగ్రహము, ప్రగ్రహము (సంధికి లొంగనీ అచ్చు) ఈ క్రింద చెప్పఁబడిన దేవతామూర్తులు వ్యక్తిగతముగా నచ్చట సాక్షాత్కరించిరీ, దీప్తిమతియైన ఇలా దేవత (భూదేవత), దిశలు, సర్వదిగీశ్వరులతో సహా, దేవకన్యలు దేవతల భార్యలు, తల్లులు స్వయముగా వచ్చిరి. వరుణుఁడు స్వరూపొఖ్యమైన స్వశరీరమును ధరించి యజ్ఞమును నాచరించుచుండ, పైని చెప్పఁబడిన సౌందర్యశరీర రూపమున దాల్చిన వారందరు వచ్చిరి. వారందరు సౌందర్యముతో తేజస్సుతో భాసించుచుండిరి. వారిని చూచి స్వయంభువుఁడైన బ్రహ్మయొక్క రేతస్సు భూమిపై పడెను. ఇందు సంశయము లేదు. ఇయ్యదీ బ్రహ్మర్షి భావియైన ప్రయోజనార్థము జరిగినది. పితామహుఁడు ఆ రేతస్సును, రెండు చేతులతో సువముచే పట్టుకొనీ (ధరించి) హోమమాచరించెను. యజ్ఞోపసాధనమయిన స్రువముతో రేతస్సును గ్రహించి, అయ్యది స్రవించుచుండగా మంత్రవిధిగా మంత్రము నుచ్చరించుచు హోమము చేసెను. అంత ప్రజాపతి భూతగ్రామమును సృష్టించెను. ఆ ప్రజాపతి తన యొక్క అర్వాక్రేజస్సుచే (కాంతిచే తైజస బ్రహ్మను ప్రపంచమున సృజించెను. స్పష్టముగా లేదు. ఏదో కొంత లోపమున్నట్లున్నది. తమస్సు చేయాప్యత్వము (గడుపదగుట), సత్త్వమెట్రోరజస్సుగూడనట్లే తన రేతస్సును ఆజ్య స్టాలిలో గ్రహించి హోమక్రియ నాచరించెను. శుక్రముచే హోమము చేయబడ అప్పుడే మహార్పులావిర్భవించిరి. వారు ప్రజ్వలించు శరీరులు. వారు స్వప్రభావయుక్తులు, స్వగుణవంతులు. స్వప్రభాగుణములచే ప్రదీప్తులు. హోమ రూపమున శుక్రము అగ్నిలో హుతము చేయబడ ఆ హోమజ్వాల నుండి కవి (శుక్రుం డు) బహిర్గమించెను. (35) జ్వాలను ఛేదించుకొని ఆవిర్భవించు శుక్రుని చూచి హిరణ్యగర్బుఁడు (బ్రహ్మ) “నీవు భృగువు” అనెను. బ్రహ్మ యట్లనుటచే నతఁడు భృగువయ్యెను. మహాదేవుండంత ఆవిర్భవించెను. బ్రహ్మను చూచేను, ఇట్లనెను. “ఓ దేవ! నేను పుత్రుని కోరితిని. దీక్షితుం డను. నీచే ఆహ్వానింపఁబడితిని. ఓ ప్రభో ! మొదట పుట్టిన యీతఁడు నా కుమారుఁ డగును. 'అట్లే యగుగాక' అని స్వయంభువునిచే మహాదేవుఁడు సమనుజ్ఞాతుడయ్యెను. అంత మహాదేవుఁడు భృగువును పుత్రునిగా నొందెను. అందుచే భృగువులు వారుణులు (వరుణునికి సంబంధించినవారు) ఆ ప్రభువాతని కుమారుఁడు, రెండవసారి అంగారములపై నిప్పుకణికలపై బ్రహ్మ హోమము చేసెను. అంగిరసుని అంగములు దృఢముగా సంహతములు (కూర్చబడినవి). అందుచే నతఁడంగిరసుఁడయ్యెను. ఆతని పుట్టుకను జూచీ వహ్ని బ్రహ్మతో ఇట్లనెను.
రేతోధిస్తుభ్యమేవాహం ద్వితీయోయం మమాస్త్వితి ।
ఏవమస్త్వితి స్కోప్యుక్తో బ్రహ్మణా సదసస్పతిః ॥
జగ్రాహాగ్నిస్వంగిరస ఆగ్నేయా ఇతి నః శ్రుతమ్ ।
షట్ కృత్వా తు పునః శుక్రే బ్రహ్మణా లోకకారీణా ॥
హుతే సమభవంస్తస్మిన్యద్ బ్రహ్మాణ ఇతి శ్రుతీః ।
మరీచిః ప్రథమం తత్ర మరీచిభ్యః సముస్థితః ॥
క్రతో తస్మిన్కతుర్జజ్ఞే యతస్తస్మాత్స వై క్రతుః ।
అహం తృతీయ ఇత్యత్రీస్తస్మాదత్రిః స కీర్త్యతే ॥
కేశైస్తు నిచితైర్భూతః పులస్త్యస్తేన స స్మృతః ।
కేశైర్లంబై: సముద్భూతస్తస్మాత్స పులహః స్మృతః ॥
వసుమధ్యాత్సముత్పన్నో వశీ చ వసుమాన్ స్వయమ్ ।
వసిష్ఠ ఇతి తత్త్వజ్ఞః ప్రోచ్యతే బ్రహ్మవాదిభిః ॥
ఇత్యేతే బ్రహ్మణః పుత్రాః మానసాః షణ్ముహర్షయః ।
లోకస్య సంతానకరా యేరియా వర్థితాః ప్రజాః ॥
ప్రజాపతయ ఇత్యేవం పర్యంతే బ్రహ్మణఃసుతాః ।
అపరే పితరో నామ ఏవైరేవ మహర్షిభిః ॥
ఉత్పాదితా దేవగణాః సప్త లోకేషు విశ్రుతాః ।
అజేయాశ్చ గణాస్సప్త సప్త లోకేషు విశ్రుతాః ॥
మారీచ్ భార్గవాశ్చైవ తథైవింగీరసోపరే ।
పౌలస్యాః పౌలహాశ్చైవ వాసిషాశ్చైవ విశ్రుతాః ॥
ఆత్రేయాశ్చ గణాః ప్రోక్తాః పితౄణాం లోకవర్ధనాః ।
ఏతే సమాసతః ఖ్యాతాః పునరన్యే గణాస్త్రయః ॥
అమర్తాశ్చాప్రకాశాశ్చ జ్యోతిష్మంతశ్చ విశ్రుతాః ।
తేషాం రాజ యమో దేవో యమైర్విహతకల్మషః ॥
అపరం ప్రజాసాం యతయస్తాఇణుధ్వమతంద్రితాః ।
కశ్యపః కర్దమః శేషో విక్రాంతః సుశ్రవాస్తథా ॥
బహుపుత్రః కుమారశ్చ వివస్వాన శుచివ్రతః ।
ప్రచేతసోరిష్టనేమీర్భహుళశ్చ ప్రజాపతిః ॥
ఇత్యేవమాదయోకు న్యేపి బహవో పై ప్రజేశ్వరాః ।
కుశోచ్చయా వాలఖిల్యాః సంభూతాః పరమర్షయః ॥
మనోజవాః సర్వగతాః సర్వభోగాశ్చతేభవన్ ।
జాతాశ్చ భస్మనోహ్యన్యే బ్రహ్మర్షి గణసమ్మతాః ॥
“నీ యందు రేతస్సు నుంచినది నేను. అందుచే ఈ రెండవది నా కుమారుఁడు అగుగాక. “తధాస్తు (అట్లే యగుగాక" అనీ సదసత్పతియైన వహ్ని బ్రహ్మచే సమాధాన మీయఁబడెను. అగ్ని ఆతనిని కుమారునిగా నంగీకరించెను. అందుచే అంగీరసుల వారసులు (అనుయాయులు) ఆగ్నేయుల రని మేము ఏందుము. లోక కర్తయైన బ్రహ్మ ఆ రేతస్సును మరల ఆరుభాగములుగా చేసెను. పోనీ నగ్నిలో హోమరూపమున నుంచేను. తన్మూలముననే బ్రహ్మలు ఉద్భవించిరని వేదములలో చెప్పబడినది. ప్రథమతః కిరణముల నుండి మరీచి సముత్తితుఁడు. ఆ క్రతువు నందు 'ఋషి క్రతువు’ పుట్టెను. అందుచే అది క్రతువనఁబడెను. 'అహం తృతీయః” నేను మూఁడవ వాఁడ' ననుచు ఋషి అత్రీ జన్మించెను. అందుచే నతఁడు 'అత్రీ' అని పేరు పొందెను. ఇక నాలుగవ ఋషి తన కేశములను విరజిమ్ముకొనుచు పుట్టెను. అందుచే నతఁడు ‘పులస్త్యుఁడని' పిలుపఁబడుచున్నాఁడు. ఐదవ ఋషి దీర్ఘములయిన కేశములతో పుట్టెను. అందుచే అతఁడు పులహుడనీ జ్ఞాపక ముంచుకొనఁబడెను. అవ ఋషీ వసువుల మధ్య నుండి పుట్టేను. ఆతఁడు స్వయముగా పశి. అంతియేకాక ధనమున కధిపతి. (వసుమాన్). అందుచే నతనిని వసిష్ఠుడనీ బ్రహ్మవాదులనిరి. ఆ బ్రహ్మవాదులు యథార్థవిషయపరిజ్ఞాతలు. (తత్త్వజ్ఞులు). ఈ విధముగా ఈ యాలుగురు మహర్చులును బ్రహ్మ మానస పుత్రులు. వారు లోక సంతానకారులు. ఈ ప్రజలందరు వారిచే వర్ణితులు. బ్రహ్మగారీ సుతులను ప్రజాపతులందురు. పితరులును ఈ మహరుల వలననే కలిగిరి (పుట్టిరీ). సప్తలోకముల యందు విశ్రుతములయిన దేవగణములు వారిచే (ఆ యార్డురు మహరులచే ఉత్పాదింపఁబడిరి. ఆ దేవగణములు జయింపఁబడని వారు (అజేయులు). వారు సంఖ్యచే నేఁడుగురు. సప్తలోకముల యందు ప్రసిద్ధులు. వారు మరీచులు, భార్గవులు, ఆంగిరసులు, పౌలస్త్యులు, పౌలహులు, వాసిష్టులు, ఆత్రేయులు. అని చెప్పఁబడుదురు. వారు పితృ లోకములను వృద్ధిపరతురు. వారంరదు క్రమముగా సమాసతః చెప్పఁబడిరి. అంతియేకాక మరల ఇతరులు మూఁడు గణముల వారున్నారు. వారు అమర్తులు, అప్రకాశులు, జ్యోతిష్మంతులు అని విశ్రుతులు. పొరీ రాజు యముఁడు. ఆ యముఁడు “యమాది” గుణములచే కల్మషరహితుఁడు. ఇతర ప్రజాపతులున్నారు. వారిని గూర్చి శ్రద్ధగా వినుఁడు. వారు కశ్యపుఁడు, కర్ణముఁడు, శేషుఁడు, వీక్రాంతుఁడు, సుశ్రవుండు, బహుపుత్రుఁడు, కుమారుఁడు, వీవస్వంతుఁడు, శుచివ్రతుఁడు, ప్రచేతసుఁడు, అరిష్టనేమి, బహులుఁడు. మరికొందరు ప్రజాపతి, కుశోచ్చయుఁడు, వాలఖిల్యులు వీరు మహాఋషులు. వారు మనోజవులు. వారెచ్చటకయిన పోగలిగిన సర్వగతులు, వారు సర్వభోగులు. ఇంకొక బ్రాహ్మగణ సంఘము భస్మము నుండి పుట్టేను. వారందరు బ్రహ్మర్షిగణముగా అంగీకృతులు.
వైఖానసా మునిగణాస్తపఃశ్రుతపరాయణాః ।
న స్తో ద్వావస్య చోత్పన్నావశ్వినౌ రూప సంమతౌ ॥
వీదుర్జన్మర్క్షరజసో తథా తన్నేత్రసంచరాత్ ।
అన్యే ప్రజానాం పతయః శ్రోత్రేభ్యస్తస్య జజ్ఞిరే ॥
ఋషయో రోమకూపేభ్యస్తథా స్వేదమలోద్భవాః ।
అయనే ఋతవో మాసార్ధమాసాః పక్షసంధయః ॥
వత్సరా యే త్వహోరాత్రాః పిత్తం జ్యోతీశ్చ దారుణమ్ ।
రౌద్రం లోహితమిత్యాహుర్లోహితం కనకం స్మృతమ్ ॥
తత్తైజసమితి ప్రోక్తం ధూమాశ్చ పశవః స్మృతాః ।
యేర్చిషస్తస్య తే రుద్రాస్తథాదిత్యోః సముద్గతాః ॥
అంగారేభ్యః సముత్పన్నా అర్చిషో దివ్యమానుషాః ।
ఆదిభూతోస్య లోకస్య బ్రహ్మా త్వం బ్రహ్మసంభవః ॥
సర్వకామదమిత్యాహుస్తథా వాక్యముదాహరన్ ।
బ్రహ్మా సురగురుస్తత్ర త్రిదశైః సంప్రసాదితః ॥
ఇమే వై జనయిష్యంతో ప్రజాః సర్వాః ప్రజేశ్వరాః ।
సర్వే ప్రజానాం పతయః సర్వే చాపి తపస్వినః ॥
తత్రసాదాదిమాంశ్లోకాన్ ధారయేయురిమాః క్రియాః ।
తద్వంశవర్థనః శశ్వత్తవ తేజోవివర్ధనః ॥
భవేయుర్వేదవిద్వాంసః సర్వే వాక్పతయస్తథా ।
వేదమంత్ర ధరాః సర్వే ప్రజాపతిసముద్భవాః ॥
శ్రయంతు బ్రహ్మ సత్యం తు తపశ్చ పరమం భువి ।
సర్వే హి వయమేతే చ తవైవ ప్రసవః ప్రభో ॥
బ్రహ్మ చ బ్రాహ్మణాశ్చైవ లోకాశ్చైవ చరాచరాః ।
మరీచిమాదితః కృత్వా దేవాశ్చ ఋషిభిః సహ ॥
అపత్యానీతి సంచిత్య తే పశ్యే కామయామహే ।
తస్మిన్ యజై మహాభాగా దేవాశ్చ ఋషయశ్చ యే ॥
ఏతే త్వదంశసంభూతాః స్థానకాలాభిమానినః ।
తవ తేనైవ రూపేణ స్థాపయైయురిమాః ప్రజాః ॥
యుగాదినిధనాశ్చాపి స్థాపయంతు ఇతి ద్విజాః ।
తతోబ్రవీల్లోకగురుః పరమిత్యభిధారయన్ ॥
ఏతదేవ వినిశ్చిత్య మయా సృష్ణా న సంశయః ।
భవతాం వంశ సంభూతాః పునరేతే మహర్షయః ॥
వైఖానసమునిగణములు తపస్సునకు వేదవిజ్ఞానమున కధికముగా పరాయణులు. రూప సంపన్నులయిన అశ్వనీదేవద్వయము వారి నాసిక నుండి పుట్టిరి. వాని నేత్ర సంచలనము నుండి ఋక్షరజుఁడు పుట్టెనని వారెరుంగుదురు. ఇతర ప్రజాపతులు ఆతని చెవుల నుండి పుట్టిరి. కొందఱు ఋషులు వారీ రోమకూపముల నుండి పుట్టిరి. కొందడో వారీ స్వేద మలము నుండి పుట్టిరి. అయన ద్వయముఁ (ఉత్తరాయణ, దక్షిణాయనములు) ఋతువులు, మాసములు, అర్థమాసములు, పక్షసంధులు అన్నీయు వాని నుండి పుట్టెను. సంవత్సరము లోని అహోరాత్రములు, ఆకాశమున ప్రకాశించు జ్యోతులు వాని దారుణమైన పిత్తము. వారాతని రక్తము రౌద్ర(రుద్ర సంబంధ మందురు. ఆతని రక్తము 'కనకము'గా జ్ఞాపక ముంచుకొనఁబడుచున్నది. అయ్యదియాతని 'తైజస'మని ప్రోక్తము. ఆతని ధూమములు జంతువులుగా స్మృతము. ఆతని నుండి ఉత్పన్నములయిన అర్చులు రుద్ర సంబంధములయినవి. అట్లే పండ్రెండుగురు ఆదిత్యులు. సముత్పన్నులైరి. అంగారముల నుండి (నిప్పుకణములనుండి) దివ్యములు మానుషములునయిన అర్చులు పుట్టినవి. అంత దేవతలకు గురువైన బ్రహ్మ దేవతలచే సంప్రసాదితుఁడు. ఈ వాక్యములు వారాడిరి. ఈ ప్రపంచమున నీవు ఆదీభూతుఁడవు. నీవు బ్రహ్మ నుండి పుట్టిన బ్రహ్మవు. నీవే సర్వకామ దుం డవు. ఈ ప్రజేశ్వరులు సర్వ ప్రజలను పుట్టించెదరు. వారందరు ప్రజాపతులు : వారందరు తపస్వినులు. వారి ప్రసాదము వలన, (అనుగ్రహము వలన) ఈ పవిత్ర క్రియలు లోకమును ధరించును (రక్షించును) తద్వంశ వర్థనులు నీ యొక్క తేజస్సును నిరంతరము వృద్ధి పొందించువారు. ప్రజాపతులకుదయమొందిన వారెల్లరు వేదవిద్వాంసులు, వాక్పతులు, వేదమంత్రధారులు అగుదురు. వారందరు సత్యమయినట్టిది, పరమమయినదియునగు తపస్సునయన బ్రహ్మమము నాశ్రయింతురు. మేమందరము వీరందరు ఓ ప్రభూ నీ సంతానము. బ్రహ్మ బ్రాహ్మణులు, చరాచరములయిన లోకములు, దేవతలు, మరీచి ప్రథముఁడుగా గల ఋషులు వీరందరు నీ సంతానము. మేము నీ సంతానమగుటకు కోరుదుము. మహా భాగులైన దేవతలు, ఋషులు, యజ్ఞము నందున్న వారందరు, నీ వంశము నుండి పుట్టినవారే, వారందరు స్థానకాలాభిమానులు (దేశకాలములతో సమైక్యభావమొందుదురు). ఈ ప్రజలందరు నీ రూపముననే సంస్థితులు, బ్రాహ్మణులు యుగారంభములను యుగాంతములను స్థాపించెదరుగాక. ఈ వాక్యములు విని దేవగురుఁడు చక్కగా నవధారణముచేసి (యోచించి) ఇట్లనెను. ఈ విధముగా నిశ్చయము చేసిన తరువాతనే మీ వంశ సంభూతులయిన మహర్షులు నాచే సృజింపఁబడిరి. దీనిని గూర్చి యెట్టి సంశయము లేదు.
తేషాం భృగోః కీర్తయిష్యే వంశం పూర్వం మహాత్మనః ।
విస్తరేణానుపూర్వ్యా చ ప్రథమస్య ప్రజాపతేః ॥
భార్యే భృగోరప్రతిమే ఉత్తమాభిజనే శుభే ।
హిరణ్యకశిపోః కన్యా దీప్యో నామ పరిశ్రుతా ॥
పులోమశ్చైవ పౌలోమీ దుహితా వరవర్ణినీ ।
భృగోస్త్వజనయట్టివ్యా పుత్తం బ్రహ్మవిదాంవరమ్ ॥
దేవాసురాణా మాచార్యం శుక్రం కవివరం గ్రహమ్ ।
శుక్ర ఏవోశనా నిత్యమతః కావ్యోపి నామతః ॥
పితృణాం మానసీ కన్యా సోమపానాం యశస్వినీ ।
శుక్రస్య భార్యా గౌర్నామ విజజే చతురస్సులిన్ ॥
త్వష్టా చైవ వరత్రీ చ శందామర్కొచ తావుభౌ ।
తేజసాదిత్యసంకాశా బ్రహ్మకల్పా: ప్రభావతః ॥
రజతః ప్రథురశ్మిశ్చ విద్వాన్యశ్చ బృహంగీరాః ।
వరత్రిణః సుతా హ్యేతే బ్రహ్మిషా దైత్యయాజః ॥
ఇజ్యాధర్మవినాశార్థం మనుమేత్యాభ్యయాజయత్ ।
నీరస్యమానం వై ధర్మం దృఫ్ట్వేంద్రో మనుమబ్రవీత్ ॥
ఏపై రేవ తు కామం త్వాం ప్రాపయిష్యామి యాజనమ్ ।
శ్రుత్వేంద్రస్య తు తద్వాక్యం తస్మాద్దేశాదపాక్రమన్ ॥
తిరోభూతేషు రేష్విందో మనుపత్నీమచేతనాం ।
గ్రహేణ మోచయిత్వా చ తతశ్చానుసార తామ్ ॥
తత ఇంద్రవినాశాయ యతమానాన్మునీంస్తు ఆన్ ।
ఈనాగన్ పునర్దృష్ట్వా దుష్టానింద్రో విహాస్య తు ॥
తతస్తానదహత్కథో వేద్యఛే దక్షిణే తతః ।
తేషాం తు ధృష్యమాణానాం తత్ర శాలావృకైః సహ ॥
శీర్షాణి న్యపతంస్తానీ ఖర్జూరా హ్యభవంస్తతః ।
ఏవం వరత్రిణః పుత్రా ఇంద్రేణ నీహతాః పురా ॥
జయంత్యాం దేవయానీ తు శుక్రస్య దుహితాభవత్ ।
త్రిశిరా విశ్వరూపస్తు త్వష్టుః పుత్త్రోభవన్మహాన్ ॥
వారిలో ముందుగా మహాత్ముఁడు, ప్రజాపతులలో మొట్టమొదటివాఁడునయిన భృగునీ గూర్చీ కీర్తించెదను. ఆతనిఁగూర్చి సవిస్తరముగ, ఆనుపూర్విగా వర్ణించెదను. భృగువున కిద్దరు భార్యలు. వారుత్తములు. ఉత్తమాభిజాత్యము కలవారు. వారు మంగళకరులు. వారిలోనోకతే ‘దివ్యనామధేయ. హిరణ్యకశిపుని కూతురు. రెండవది పౌలోమి. ఆమె వర వర్జిని. అత్యంత సౌందర్యవతి. పులోముని యొక్క దుహిత దివ్య భృగున కొక కుమారుని గనెను. ఆ పుత్రుఁడు బ్రహ్మ విద్వరులలో శ్రేష్ఠుఁడు. ఆతఁడే శుక్రుఁడు. దేవతలకు గురువు అసురులకు గురువు. ఆతం డొక గ్రహము. మనీషావంతులలో నుత్తముఁడు. (కవివరుండు), శుక్రుఁడే ఉశనుఁడు. ఆతఁడు కావ్యుఁడను నామమున నిత్యము విశ్రుతుఁడు. సోమపులైన పితరుల యొక్క మానసీకన్య నామమున గోవు. 'గౌర్నా మమున ప్రసిద్ధురాలు. యశస్వినీ, ఆమె శుక్రుని భార్యయయ్యెను. ఆతనికి నల్గురు కుమారులను కనెను. వారు త్వష్ట - 2 వరతీ3 శండుండు4 మరుఁడు, వారు తేజస్సుచే ఆదిత్యతుల్యులు. ప్రభావముచేత బ్రహ్మ సదృశులు, వరీత్రికుమారులు - రజతుఁడు ష్పడువు; రశ్ని: విద్వాంసుఁడయిన బృహంగీరుఁడు. వరత్రి యొక్క కుమారులు బ్రహ్మీస్థులు, దైత్యులకు యజ్ఞములజేయించువారు. (ఇజ్య) యజ్ఞధర్మము యొక్క వినాశము కొఱకు, వారు మనువును చేరిరీ, యజ్ఞములను (విపరీతవిధులతో) ఆచరింపజేసిరి. ధర్మము తిరస్కరింపబడుచుండెను. దాని నింద్రుఁడు చూచి మనువుతో నిట్లనియెను. “వీరిచేతనే నేను నీ యజ్ఞమును సక్రమముగా నాచరింపఁజేసెదను.” ఇంద్రునీ ఈ పలుకులు విని, ఆ వరత్రి కుమారులు ఆ ప్రదేశము నుండి తొలగిపోయిరి. వారు తీరోభూతులు కాగా, ఇంద్రుఁడు మనుపత్ని కడకు వచ్చెను. ఆమే అచేతనమైపడియుండెను. దుష్ట గ్రహవశము నుండి ఆమే కతఁడు మోక్షము గలించెను. పిదప వారల నీంద్రుడు అనుసరించెను. అంత, ఆ మునీంద్రులు ఇంద్రుని ఏనాశనము కొఱకు ప్రయత్నించిరి. వచ్చిన దుష్టులగు వారలను జూచి యింద్రుఁడు నవ్వెను. తరువాత ఇంద్రుఁడు క్రుద్దుఁడయ్యెను. వారలను యజ్ఞవేది యొక్క దక్షిణ భాగమున దగ్గపటలము చేసెను. అచ్చట వారు వారి యొక్క శాలావృకములతో (కుక్కలతో - నక్కలతో, తోడేళ్ళతో) ఎదుర్కొనిరి. అట్లు ఇంద్రుని వారెదుర్కొనినను వారీ శీర్షములు నేలకురాలినవి. అవి ఖర్జూర వృక్షములయినవి. ఈ విధముగా వరత్రి పుత్రులు ఇంద్రునిచే పూర్వము నిహతులయిరి. శుక్రునికి దుహితగా జయంతి యందు దేవయాని జన్మించెను. విశ్వరూపుఁడను నామాంతరము గల త్రిశిరుఁడు, త్వష్టయొక్క జ్యేష్ఠకుమారుఁడు.
యశోధరాయాముత్పన్నో వైరోచన్యాం మహాయశాః ।
విశ్వరూపానుజశ్చైవ విశ్వకర్మా చ యః స్మృతః ॥
భృగోస్తు భృగవో దేవాః జజ్ఞిరే ద్వాదశాత్మజాః ।
దివ్యానుసుషువే కన్యా కావ్యసైనుజా ప్రభోః ॥
భువనో భావనశ్చైవ అంత్యశ్చోంత్యాయనస్తథా ।
క్రతుః శుచిః సమూర్ధా చ వ్యాజశ్చ వసుదశ్చ యః ॥
ప్రభవశ్చావ్యయశ్చైవ ద్వాదశోధిపతిః స్మృతః ।
ఇత్యేతే భృగవో దేవాః స్మృ; ద్వాదశ యజ్ఞయాః ॥
పౌలోమజనయత్పుత్రం బ్రహ్మిష్ఠం వశినం ద్విజమ్ ।
వ్యాదితః సోలిష్టమే మాసి గర్భః క్రూరేణ రక్షసా ॥
చ్యవనాచ్చ్యవనః సోథ చేతనాత్తు ప్రచేతనః ।
ప్రచేశాశ్చ్యవనః క్రోధాద్దగ్గవాస్ పురుషాదకాన్ ॥
జనయామాస పుత్రా ద్వౌ సుకన్యాయాం స భార్గవః ।
అప్రవానం దధీచం చ తావుభౌ సాధుసమ్మతో ॥
సారస్వతః సరస్వత్యాం దధీచస్యోదపద్యత ।
ఋచీ పత్నీ మహాభాగా అప్రవానాస్య నాహుషీ ॥
తస్యామౌర్వఖుషిర్జల్లే ఊరుం బిళ్వ మహాయశాః ।
ఔర్వస్యాసీదచీకస్య దీప్తాగ్నిసమతేజసా ॥
జమదగ్నిర్భచీకస్య సత్యవత్యామజాయత ।
భృగోశ్చరువిపర్యాసే రౌద్రవైష్ణవః పురా ॥
జమనాద్వైష్ణవస్యాగ్నేర్థమదగ్నీరజాయత ।
రేణుకా జమదగ్నేశ్చ శక్రతుల్యపరాక్రమమ్ ॥
బ్రహ్మక్షత్తమయం రామం సుషువేమితతేజసమ్ ।
జీర్వస్యాసేత్పుత్రశతం జమదగ్నిపురోగమమ్ ॥
తేషాం పుత్రసహస్రాణి భార్గవాణాం పరస్పరాత్ ।
ఋష్యేతరేషు వై బాహ్యా బహహో భార్గవాః స్మృతాః ॥
వత్సా విదొ ఆర్ట్షిషేణా యస్కా వైన్యాశ్చ శౌనకాః ।
మిత్రేయుః సప్తమాహ్యేతే పక్షా జ్ఞేయాస్తు భార్గవాః ॥
విరోచనుని కూతురయిన యశోధరయందు (విశ్వకర్ముడు) పుట్టెను. ఆతఁడు మహాయశశ్శాలి. విశ్వరూపుని యొక్క తమ్ముడు. శుక్రునీ యొక్క అనుజయయిన దివ్య, యొక కుమార్తెను కనెను. భృగువునకు పండ్రెండుగురు దేవులైనకుమారులు కలిగిరి. భువనుడు, భావనుడు, అంత్యుడు, అంత్యాయనుడు, క్రతువు, శుచి, స్వమూర్దా, ప్యాజుడు, వసుదుడు, ప్రభవుడు, అవ్యముడు, పండ్రెండవవాడు అధిపతి. వారందరు భృగువులుగా ప్రసిద్ధులు. వారు దేవతలు. యజ్ఞారులు. పౌలోమి బ్రహ్మీష్ణుఁడయిన కుమారుని కనెను, ఆతఁడు పరిపూర్ణవశీ (యింద్రియ నిగ్రహముగల) బ్రాహ్మణుఁడు. ఆతఁడు గర్భస్థుఁడై యుండగా నొక క్రూరుఁడయిన రాక్షసునిచే అష్టమ మాసమున పగల్చబడెను. అప్పుడాతడు గర్భము నుండి జారిపడెను. అందుచే నతఁడు చ్యవనుడయ్యెను. ఆతఁడే ప్రచేతనుఁడు కూడ. ఏలయన ఆతఁడు సచేతసుడగుట. ప్రచేతసుడను నామాంతరము గలిగిన చ్యవనుఁడు పురుషులను చంపితిను పురుషాదకులయిన రాక్షసులను చంపెను. భార్గవుఁడయిన చ్యవనుఁడు సుకన్యవలన ఇరువురు పుత్రులం గనెను. ఆ యిరువురు (1) ఆప్రవానుఁడు. (2) దధీచుండును. వారిరువురు సాధు సమ్మతులు. దధీచుని కుమారుఁడు సారస్వతుఁడు. ఆతఁడు సరస్వతి వలనఁగలిగెను. మహా భాగమైన “ఋచి” నహుషుని కూతురు. ఆమె అప్రవానుని భార్య. మహర్షియైన ఔర్వుఁడు సుప్రసిద్ధుఁడు. ఆతఁడు ఋచికి ఊరువును చీల్చుకొని పుట్టెను. ఔర్వుని కుమారుఁడు ఋచీకుఁడు. ఆతం డు దీప్తాన్నీ సదృశ తేజో విశేషుఁడు. ఋచీకునకు సత్యవతి యందు జమదగ్ని జన్మించెను. భృగుఁడొసంగిన “చెరువు” (యజ్ఞప్రసాదము) యొక్క విపర్యాసము (మార్పు) వలన ఆ చెరువులు రౌద్ర వైష్ణవ సంబంధములయినవి. విష్ణు సంబంధమైన అగ్నిని మ్రింగుట వలన జమదగ్ని పుట్టెను. రేణుక రాముని జమదగ్ని వలన కనెను. ఆతఁడమీత తేజస్కుండు. శక్రతుల్య పరాక్రముఁడు. ఆతనికి బ్రహ్మ క్షత్రమయమయిన తేజస్సు కలదు. ఔర్వునకు జమదగ్ని మొదలుకొని నూర్గురు కుమారులు కలరు. భార్గవులలో పరస్పర సంబంధము వలన పుత్ర సహస్రములు కలిగిరి. ఇతర ఋషులలో కూడ బాహ్య భార్గవులు చాల మంది కలరు. వత్సులు, విదులు, ఆర్జిషేణులు, యాస్కులు, వైన్యులు, శానకులు, మిత్రేయులు వీరు ఏడవ గణమువారు వీరందరిని భార్గవులుగా తెలిసికొనవలెను.
శ్రుణుతాంగీరసో వంశమగ్నేః పుత్త్రస్య ధీమతః ।
యస్యాన్వవాయే సంభూతా భారద్వాజాః సగౌతమాః ॥
దేవాశ్చాంగిరసో ముఖ్యోస్త్విషిమంతో మహౌజసః ।
సురూపా చైవ మారీచీ కార్దమీ చ తథా స్వరాట్ ॥
పథ్యా చ మానవీ కన్యా తీస్తో భార్యా హ్యథర్వణః ।
అథర్వణస్తు దాయాదాస్తాసు జాతాః కులోద్వహాః ॥
ఉత్పన్నా మహతా చైవ తపసా భావితాత్మనః ।
బృహస్పతిం సురూపాయాం గౌతమం సుషువే స్వరాట్ ॥
అయాస్యం వామదేవం చ ఉతథ్యముజీతం తథా ।
ధృష్టిః పుత్రస్తు పథ్యాయాః సంవర్తశ్చైవ మానసః ॥
కితవశ్చాష్యయాస్యస్య శరద్వాంశ్చాప్యుతథ్యజః ।
అథోజిజో దీర్ఘతమా బృహదుర్గో వామదేవజః ॥
ధృష్ణః పుత్రః సుధన్వా తు ఋషభశ్చ సుధన్వనః ।
రథకారాః స్మృతా దేవా ఋభవో యే పరిశ్రుతాః ॥
బృహస్పతేర్భరద్వాజో విశ్రుతః సుమహాయశాః ।
బృహస్పతేర్యవీయాంసో దేవా ఆంగీరసాః స్మృతాః ॥
ఔరసాంగిరసః పుత్రాః సురూపాయాం విజజ్ఞిరే ।
అధార్యాయుధనుర్ధక్షో దమః ప్రాణస్తథైవ చ ॥
హవిష్యాంశ్చ హవిష్ణుశ్చ ఋతః సత్యశ్చ తే దశ ।
అయాస్యాశ్చాష్యతథ్యాశ్చ పామదేవాస్తథాశీజాః ॥
భారద్వాజాః సాంకృతయో గర్గాః కణ్వరథీతరాః ।
ముద్దవో విష్ణువృద్దాశ్చ హరితాః కషయస్తథా ॥
తథా రూక్షభరద్వాజా ఆర్షభాః కితవస్తథా ।
ఏతే చాంగీరసాం పక్షా విజ్ఞేయా దశ పంచ చు॥
ఋష్యంతరేషు వై బాహ్యా బహవోంగిరసః స్మృతాః ।
మరీచేరపి వక్ష్యామి భేదముత్తమపూరుషమ్ ॥
యస్యాస్వపోయే సంభూతం జగత్థావరజంగమమ్ ।
మరీచిరాపశ్చకమే నాభిధ్యాయన్ ప్రజేప్సయా ॥
పుత్రః సర్వగుణోపేతః ప్రజావాన్ ప్రభవేదితీ ।
సంయుజ్యాత్మానమేవం తు తపసా భావితః ప్రభుః ॥
అగ్ని యొక్క పుత్రుడై ధీమంతుఁడయిన అంగీరసునీ వంశమును గూర్చి వినుము. ఈతని వంశమునందే భారద్వాజులు గౌతములతో సహా పుట్టిరి. అంగీరసుని వంశమునకు సంబంధించిన ముఖ్యతములయిన దేవతలు మహజసులు, త్వషిమంతులు(కాంతిమంతులు). మారీచుని కుమార్తెయైన సురూప, కర్దముని కూఁతురైన స్వరాట్, మనువు దుహితయిన పథ్య అను మువ్వురు అథరుణుని యొక్క భార్యలయిరి. వారి యందు అథర్వణునకు దాయాదులు, కులోద్వహులు పుట్టరి. వారు వంశమును వృద్ధిపరచిరి. వారు గొప్ప తపస్సుచే భావితాత్ములు సయిరి. సురూపకు బృహస్పతి యుదయించెను. గౌతముని ఆయాస్యుని, వామదేవునీ, ఉతథ్యుని మరియు ఉశీతిని స్వరాట్ కనెను. పథ్య యొక్క కుమారుఁడు ధృష్టి వారి మానసపుత్రుఁడు సంవర్తుఁడు. అయాస్య కుమారుఁడు కీలవుఁడు. శరద్వంతుఁడు ఉతథ్యుడుదయించెను. దీర్ఘతముఁడు ఉతికి కలిగెను. వామదేవునకు బృహదుక్తుఁడు కలిగెను. సుధన్వుఁడు ధృష్టి కుమారుడు, ఋషభుఁడు సుధన్వుని కొమరుఁడు. రధకారులు దేవతలుగా పరిగణింపబడుదురు. వారే ఋషభులుగా లోకవిదితులు. విశ్రుతుఁడు (ఖ్యాతిమంతుఁడు) అయిన భరద్వాజుఁడు బృహస్పతి కుమారుఁడు. బృహస్పతి కంటే చిన్నవారయిన దేవతలు ఆంగీరసులుగా విదితులు. వారు ఆంగీరసుని ఔరసపుత్రులు. సురూపయందు జనించిరి. ఆధారి, ఆయువు, దనుఁడు, దక్షుండు, దముఁడు, ప్రాణుఁడు, హవిష్యంతుఁడు, హవిష్ణువు, ఋతుఁడు, సత్యుఁడు నీరు పదిమంది. ఆంగీరసుని వంశగణములు పదియైదుగా నెఱుంగవలయును. ఆ గణములు అయాస్యులు, ఉతథ్యులు వామ దేవులు, ఔశిజులు, భారద్వాజులు, సాంకృతులు, గర్గులు, కణ్వులు, రధీతరులు, ముద్గలులు, విష్ణువృద్ధులు, హితులు, కపులు, రూక్షులు భరద్వాజులు, ఆరభులు, కితవులు, బాహ్యాంగిరో గణములు చాల ఇతర ఋషులలో కలవు. ఉత్తమ పురుషులతో గూడి యున్న మరీచుని వంశమును గూర్చి చెప్పెదను. ఆతని వంశములో జగత్తు నందలి స్థావర జంగమములన్నియును సంభూతములు. మరీచి నీటిని ప్రేమించెను. ప్రజోత్పత్తినికోరీ ఆతఁడు వానిని గూర్చీ ధ్యానించెను (భావించెను) “సర్వగుణోపేతుఁడయిన పుత్రుఁడు సంతానవంతుఁడయిన పుత్రుఁడు కలుగవలెను” అని ఆతఁడు భావించేను. భగవత్సంయోగమునందాతఁడు నీమగ్నుఁడయ్యెను. ఆ ప్రభువు తపస్సుచే పవిత్రీకృతుఁ డయ్యెను.
ఆహతాశ్చ తతః సర్వా ఆపః సమభవం స్తదా ।
తాసు ప్రణిహితాత్మానమేకం సో జనయత్ర్పభుః ॥
పుత్తమప్రతిమం నామ్నారిష్టనేమిం ప్రజాపతిమ్ ।
పుత్రం మరీచిస్తపసి నిరతః సోప్స్వతీతపత్ ॥
ప్రధ్యాయ హి సతీం వాచం పుత్రార్థి సలిలే స్థితః ।
సప్తవర్షసహస్రాణి తతః సోప్రతిమో భవత్ ॥
కశ్యపః సవితుర్విద్వాంస్తేజసా బ్రహ్మణా సమః ।
మన్వంతరేషు సర్వేషు బ్రహ్మణాంశేన నిజాయతే ॥
కన్యానిమిత్తమత్యుక్తో దక్షిణ కుపితః ప్రభుః ।
అపిబత్స తదా కశ్యం కశ్యం మద్యమివోచ్యతే ॥
హోస్యే కశిర్షి విజ్జీయో పోర్మమనః కశ్యముచ్యతే ।
కశ్యం మద్యం స్కృతం విషైః కశ్యపానాం తు కశ్యపః ॥
కశతీ నామ యద్వాదో వాచా క్రూరముదాహృతమ్ ।
దక్షాభిశప్తః కుపితః కశ్యపస్తేన సో భవత్ ॥
తస్మాచ్చ కశ్యపాయోక్తో బ్రహ్మణా పరమేష్ఠినా ।
తస్మై ప్రాచేతసో దక్షః కన్యాస్తా: ప్రత్యపాదయత్ ॥
సర్వాశ్చ బ్రహ్మవాదన్యః సర్వా వై లోకమాతరః ।
ఇత్యేతమ్భషిసర్గం తు పుణ్యం యో వేద వారుణమ్ ॥
ఆయుష్మానుణ్యవాన్ శుద్ధః సుఖమాప్నోతి శాశ్వతమ్ ।
ధారణాచ్ఛ్రవణా ద్వాపి సర్వపాపైః ప్రముచ్యతే ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే
ఋషిసర్గవర్ణనం నామ ప్రథమో ధ్యాయః ॥
అంత జలములు తాడితమయ్యెను. ఆ ప్రభువు వాని యందు ఒక కుమారుని కలిగించెను. ఆతని హృదయము ధ్యానము నందు నిమగ్నమయ్యెను. ఆ కుమారుఁడప్రతిముఁడు. ఆతఁడు ప్రజాపతి ఆతని నామ మరిష్టనేమీ. తపో నిమగ్నుఁడయిన మరీచి, నీటిలో తపస్సాచరించు కుమారుని పొందెను. పుత్రార్జీమైన యాతఁడు సలిలమందు సంస్థితుఁడై యుండెను, పవిత్రమయిన వాక్కునే ధ్యానము చేయుచుండెను. ఆతఁడా నీటీ యందు ఏడువేల యేండ్లుండెను. అందుచేతనతఁడప్రతీముడు (సాటిలేని వాఁడాయెను) కశ్యపుఁడు సప్తృతుల్యుఁడు. తేజస్సుచే బ్రహ్మతో సమానుడు. అతఁడు విద్వాంసుఁడు. ప్రతి మన్వంతరమునందు నతఁడు బ్రహ్మగారి యంశముతో పుట్టును. దక్షుఁడు తన కూతుండ్ర విషయమై అత్యుక్తి పరుఁడయ్యెను. బ్రహ్మ కుపితుఁడయ్యెను. ఆతఁడు కశ్యమును త్రాగెను. కశ్యమనఁగా మద్యము. 'కశి' అను పదము హాస్యమను నర్థమొసంగునదిగా గ్రహింపవలెను. “కశ్యమను పదమునకు- వాజ్మనస్సులని అర్థము విప్రులు కశ్యమును మద్యమనీరీ. కశ్యమును త్రాగుటవలన ఆతఁడు కశ్యపుఁడయ్యెను. ‘కశము’ అను పదము క్రౌర్యమునకు ఉచ్చరింపఁబడుటచేతను దక్షునిచే శపింపం బడియతఁడు కుపితుఁడగుటచేతను, ఆతఁడు కశ్యపుఁడయ్యెను. ఆ కారణముచేతనే, పరమేష్టి యయిన బ్రహ్మచే సూచింపఁబడుటచే ప్రచేతసుని కుమారుఁడయిన దక్షుఁడు తన కుమార్తెలను వానికిచ్చి వివాహము చేసెను. వారందరు బ్రహ్మవాదీనులు. లోకమాతలు. ఈ విధముగా నెవ్వం డు ఋషీశ్వరుల సృష్టి నేఱుంగునో (పవిత్రమయిన వరుణునకు సంబంధించిన విషయమును) ఆతఁడు పుణ్యవంతుఁడు, పరిశుద్ధుఁడు, ఆయుష్మంతుఁడునై, శాశ్వతమయిన సుఖము నొందును. ఈ విషయమును జ్ఞాపకముంచుకొనినను, వీనినను ఆ వ్యక్తి సర్వపాప విముక్తుఁ డగును.
ఇది వాయుప్రోక్తమయిన శ్రీ బ్రహ్మాండమహాపురాణమున మధ్యమభాగమున తృతీయమైన ఉపోద్ఘాతపాదమున ఋషిసర్గవర్ణనమను ప్రథమాధ్యాయము.
Summary of chapter 39 of the Brahmānda Mahā Purana is as follows:
This sacred opening chapter of the second part reverently introduces the seven holy seers, the Saptarṣis, who shine as eternal pillars of divine wisdom across the cosmic epochs. It lovingly details their celestial origin, their spiritual penance, and their sacred duty in maintaining universal order under the compassionate guidance of the supreme creator. The devoted reader is inspired by the unyielding spiritual discipline of these ancient masters, who continuously meditate upon the supreme reality to sustain cosmic dharma.