బ్రహ్మాండ మహా పురాణము
21 - ఔర్వ పరశురాముల సంవాదము
వసిష్ఠ ఉవాచ :-
ఇత్థం ప్రవర్తమానస్య జమదగ్నేర్మహాత్మనః ।
వర్షాణి కతిచిద్రా జన్వ్యతీయుడమితౌజసః ॥
రామోఽపి సృపశార్దూల సర్వధర్మభృతాం వరః ॥
వేదవేదాంగతత్త్వజ్ఞః సర్వశాస్త్రవిశారదః ।
పిత్రోశ్చకార శుశ్రూషాం వినీతాత్మా మహామతిః॥
ప్రీతిం చ నిజచేష్టాభిరన్వహం పర్యవర్తయత్ ।
ఇత్థం ప్రవర్తమానస్య వర్షాణి క తిచిన్నృపా ।
పిత్రోః శుశ్రూషయానైషీద్రామో మతిమంతాం వరః ॥
స కదాచిన్మహాతేజాః పితామహగృహం ప్రతి ।
గంతుం వ్యవసితో రాజన్దైవేన చ నియోజితః ॥
నిపీడ్య శిరసా పిత్రోశ్చరణౌ భృగుపుంగవః ।
ఉహచ ప్రాంజలీర్భూత్వా సప్రశ్రయమిదం వచః ॥
కంచిదర్ధమహం తాత! మాతరం త్వాం చ సాంప్రతమ్ ।
విజ్ఞాపయితుమిచ్ఛామి మమ తచ్చ్రోతుమర్హథ ॥
పితామహమహం ద్రష్టుముత్కంఠతమనాశ్చిరమ్ ।
తస్మాత్తత్పార్శ్వమధునా గమిష్యే వామనుజ్ఞయా ॥
ఆహూతశ్చాసకృత్తాత సోత్కంఠం ప్రీయమాణయా ।
పితామహ్యా బహుముఖైరీచ్ఛంత్యా మమ దర్శనమ్ ॥
పితౄన్పితామహస్యాపి ప్రియమేవ ప్రదర్శనమ్ ।
మద్యం తేన తత్పార్శ్యం గంతుం మామనుజానత ॥
వశిష్ఠ ఉవాచ:-
ఇతి తస్య వచః శ్రుత్వా సంభ్రాంతం సముదీరితమ్ ।
హర్షేణ మహాతా యుక్తౌ సాశ్రునేత్రా బభూవతుః ॥
తమాలింగ్య మహాభాగం మూర్ద్య్నుపాఘ్రాయ సాదరమ్ ।
అభినంద్యాశిషా తాత హ్యుభౌ తావిదమాహతుః ॥
వసిష్ఠుఁడు చెప్పెను.
ఈ విధముగా మహాత్ముఁడు మహాతేజస్వీ యయిన జమదగ్ని ప్రవర్తించుచుండ, ఓ రాజా ! బహు సంవత్సరములు గడచెను. ఓ నృపశార్దూల ! రాముఁడు సర్వధర్మ భృతులలో శ్రేష్ఠుఁడు. వేద వేదాంగ తత్త్వజ్ఞుఁడు; సర్వశాస్త్ర విశారదుఁడు. మహామతి యయిన రాముడు వినీతాత్ముఁడయి పీతరులకు సేవ చేసెను. తన ప్రవర్తనచే ప్రీతీని కలిగించుచు వర్తించేను. కొన్ని సంవత్సరములిట్లు పితృ శుశ్రూషచే రాముఁడు మతిమంతులలో శ్రేష్ఠుఁడయిన వాఁడు కాలము గడిపెను. ఇట్లుండగా, ఒకప్పుడు మహాతేజస్వి రాముఁడు, దైవముచే నియోజితుఁడయి పితామహ గృహమునకు పోవ దలంచెను. భృగు పుంగవుఁడయిన రాముఁడు శిరస్సు తండ్రి యొక్క పాదములపై నుంచి నమస్కరించి, బద్దాంజలియై వినయ పూర్వముగా ఇట్లు పలికెను. ఓ తండ్రీ ! నీకు, తల్లికిని, ఇప్పుడొక విషయము విజ్ఞాపించుకొన కోరుచున్నాను. మీరు దయతో వినంగోరెదను. తాతగారిని (పితామహుని) చూడవలయునని ఉత్కంఠతమనస్కుడనై యుంటినీ. అందుచే మీ అంగీకరాముచే తాతకడకు వెళ్లేదను. ఆత్రముగా నభిలాషతో పలుమార్లు తాత రమ్మని పిలిచేను. ప్రీత మనసయైన పితామహి కూడ పిలిచెను. నన్నుగని బహు ముఖము లందగోరినది. నిజముగా' తండ్రినీ పితామహనీ చూచుట మిక్కిలి ప్రియవు కదా. అందుచే నేను వారల కడకుఁ బోవుటకు మీరుభయులు అనుచురింపఁగోరెదను.
వసిష్ఠుఁడిట్లు పలికెను.
అత్యంత సంభ్రాంతముగా (ఉత్సుకతతో) చేప్పఁబడిన ఆతని పలుకులు విని తల్లిదండ్రులు ఆనందాశ్రువులచే నిండిన నేత్రములు గల పొరయిరి. ఆ పూజ్యుడయిన రాముని ఆలింగనము చేసికొని మూర్ధమును సాదరముగా మూస్కొని ఆశీస్సులిడి, ఆభినందించి వారిరువురు నీట్లు పలికిరి. (12)
పితామహగృహం తాత ప్రయాహి త్వం యథాసుఖమ్ ।
పీతామహపీతామహ్యో ప్రీతయే దర్శనాయ చ ॥
తత్ర గత్వా యథాన్యాయం త్వం శుశ్రూషాపరాయణః ।
కంచీత్కాలం తయోర్వత్స ప్రీతయే నస తధ్గృహే ।
స్థిత్వా నాతిచిరం కాలం తయోర్భూయోఽప్యనుజ్ఞయా ॥
అత్రాగశ్చ మహాభాగ క్షేమేణాస్మద్దిధృక్షయా ॥
క్షణార్ధమపి శక్తాః స్థో న వినా పుత్త్రదర్శనమ్ ।
తస్మాత్పితామహగృహే న చిరత్థ్సాతు మార్హసి॥
తదాజ్ఞయాథ వాపుత్త్ర ప్రపితామహసన్నిధిమ్ ।
గతోఽపీ శీఘ్రమాగచ్చ క్రమేణ తదనుజ్ఞయా ॥
వసిష్ఠ ఉవాచ:-
ఇత్యుక్తస్తౌ పరిక్రమ్య ప్రణమ్య చ మహామతిః ।
పితరావస్యనుజ్ఞాప్య పీతమహగృహం తతః ॥
స గత్వా భృగువర్యస్య ఋచీకస్య మహాత్మనః ।
ప్రవివేశాశ్రమం రామో మునిష్యోపశోభితమ్ ॥
స్వాధ్యాయఘోషైర్విపులైః సర్వతః ప్రతీనాదితమ్ ।
ప్రశాంతవైరసత్త్వాడ్యం సర్వసత్వమనోహారమ్ ॥
ప ప్రవిశ్యాశ్రమం రమ్యమృచీకం స్థితమాసనే ।
దదర్శ రామో రాజేంద్ర స పీతామహమగ్రతః ॥
జాజ్వల్యమానం తపసా ధిష్ణ్యష్ణ్యస్థమివ పానకమ్ ।
ఉపాసితం సత్యవత్యా యథా దక్షిణయాఽధ్వరమ్ ॥
స్వసమీపముపాయాంతం రామమాలోక్య తౌ నృప ।
సుచిరం తం విమర్శేతాం సమాజ్ఞాపూర్వదర్శనౌ ॥
కోఽయమేష తపోరాశీః సర్వలక్షణపూజితః ।
బాలోఽయం బలవానాతి గాంభీర్యాత్ప్రశ్రయేణ చ ॥
ఏవం తయోశ్చింతయతో: సహర్షం హృది కౌతుకాత్ ।
ఆససాద శనై రామః సమీపే వినయాన్వితః ॥
స్వనామగోత్రే మతీమానుక్త్వా పిత్తోర్ముదాన్వితః ।
సంస్పృశంశ్చరణౌ మూర్ద్నా హస్తాభ్యాం చాభ్యవాదయత్ ॥
తతస్తౌ ప్రీతమనసౌ సముత్థాప్య చ సత్తమమ్ ।
ఆశీర్భిరభినందేతాం పృథక్పృథగుభావపి ॥
నాయనా పీతామహా గృహమునకు సుఖముగా వెళ్లిరమ్ము, పితామహునీ యొక్కయు పితామహి యొక్కయు ప్రీతి కోలకు దర్శనము కొలికును, అక్కడకు వెళ్లుము. సంప్రదాయమును న్యాయముననుసరించీ శుశ్రూషాపరాయణుఁడవై కొంతకాలము వారి గృహమున వారి యానందము కొఱకుండుము. ఎక్కువ కాలమందుండక, మరల పోరియొక్క ఆంగీకారముతో ఇచ్చటకు నన్ను చూడవలయునను కోరికతో సుఖముగా రమ్ము, పుత్త్ర దర్శనము లేకుండగ నిన్ను చూడక అర క్షణమయినను యుండలేను. అందుచే తాతగారింట ఎక్కువ కాలముండవలదు. (16) తాతయొక్క ఆజ్ఞానుసారము ప్రపితామహుని సన్నిధికి వెళ్లినను, నాయనా, త్వరగా ప్రపితామహుని అంగీకరాముతో శీఘ్రముగా తీరిగి రమ్ము. (17)
వసిష్ఠుఁడిట్లు చేప్పెను.
వారీ విధముగా పలుక, మహామతియైన రాముడు వారికి ప్రదక్షిణము చేసి నమస్కరించి, పితరులచే అనుజ్ఞాపింపబడి పితామహ గృహమున కరిగేను. (18) రోముఁడు దియలుదేరి భృగువంశ శ్రేష్ఠుఁడు మహాత్ముఁడు నైన ఋచీకుని ఆశ్రమమును ప్రవేశించేను.. ఆ యాశ్రమము ముని శిష్యోపశోభితము, వేదాధ్యయన ఫషల యొక్క విపులత్వముచే సర్వత్ర ప్రతిధ్వనులీనుచుండెను. సహజ వైరము వీడి ప్రశాంతముగా వర్తించు జంతువులచే కూడియున్నది. సమస్త జంతువులచే మనోహరముగా నున్నది. గమ్యమయిన ఆశ్రమమును రాముఁడు ప్రవేశించి, ఎదురుగా మున్ముందు రాముఁడు ఆసనమున కూర్చుండియున్న పితామహుని చూచేను. ఋచీకుడు, దిష్టస్థుఁడు (మహాగ్ని గుండమున నున్న) అగ్నిహోత్రునీవలె, తన తపస్సుచే జ్వాజ్వల్యమానముగా ప్రకాశించుచుండెను. దక్షిణ చేతను కూడియున్న మహాయజ్ఞము వలే సత్యవతిచే (పితామహీచే) ఉపాసింపఁబడుచుండెను. (22) ఆ యిద్దరు తమ్ము సమీపించుచున్న రాముని పోరు చాలసేపు వీమర్శతో ఇంతకు పూర్వమెన్నడును చూడబడనీ వానివలె పదేపదే పరిశీలించిరి. “ఎవ్వఁడీ తపోరాశి ? సర్వరిక్షణ పూజితుఁడు. లుండయినను గోంభీర్యముచే, వినయాదీ లక్షణములచే బలవంతుఁడుగా ప్రకాశించుచున్నోఁడు”, అనీ ఫోరనుకొనుచుండగా ఆనందముతో, కౌతుకముతో రోముఁడు మెల్లగా వారి సమీపమునకు వినాయాన్వితుఁడై యరిగి, మతిమంతుఁడయిన యతఁడు స్వనామగోత్ర ప్రవరను) చెప్పి, సంతోషాత్ముఁడయ పితామహుల పాదములను శిరస్సుచే హస్తద్వయముచే స్పృశించి అభివాడి మేనర్చెను,
తమాశ్లిష్యాంకమారోప్య హరాశ్రుప్లుతలోచనౌ ।
వీక్షంతౌ తన్ముఖాంభోజం పరం హర్షమవాపతం: ॥
తతః సుభోపవిష్టం తమాత్మవంశసముద్భవమ్ ।
అనామయమపృచ్ఛేతాం తావుభౌ దంపతీ తదా ॥
పితరౌ తే కుశలినో వత్స కిం భ్రాతరస్తథా।
అనాయాసేన తే వృత్తిర్వర్తతే చాథ కర్హచిత్ ॥
సమస్తాభ్యాం తతో రాజిన్నాచచక్షే యాథోదితః ।
తథ స్వాసుగతం పిత్రోర్భాతౄజం చైవ చేష్టితమ్ ॥
ఏవం తయోర్మహారాజు సత్ప్రీతీజనీతైర్గుణైః ।
ప్రియమాణోఽవసద్రామః పీతుః పీత్రోర్నివేశనే ॥
స తస్మిన్ సర్వభూతానాం మనోనయసనందనః ।
ఉపాస కతిచిన్మాసాంస్తచ్భుశ్రూషాపరాయణః ॥
అథాసుజ్ఞాప్య తౌ రాజన్ భృగువత్యో మహామనాః । పితామహగురోర్గంతుడీమీషాశ్రయమాశ్రమమ్ ॥
స తాభ్యాం ప్రీతియుక్తాభ్యామాశీర్భిరభినందితః ।
యధాచాభ్యాం ప్రదీష్టేన మయావౌర్వాశ్రమం ప్రతీ ॥
తం నమస్కృత్య విధ్వచ్చ్యవనం చ మహాతపాః ।
సప్రహర్షం తదజ్ఞాతః ప్రయయావాశ్రమం భృగోః ॥
స గత్వా మునీముఖ్యస్య భృగోదాద సుతలమ్ ।
దదర్శ శాంతచేతోభిర్మునీలీకి సర్వతోమృతమ్ ॥
సుస్నిగ్ధశీతలచ్ఛాయైః సర్వత్తగుణాన్వీతైః ।
తరుభిః సంవృతం ప్రీతః ఫలపుష్పోతన్వీతైః ॥
నానాఖగకులోర్రావైర్మనఃశ్రోత్రసంభావహైః ।
భ్రహ్మఘో షైశ్చ వివిధైః సర్వత ప్రతినాదితమ్ ॥
సమంత్రాహుతిహోమోత్థధూమగంధేన సర్వతః ।
నీరస్త నీలీలాఘోషం పహాంతరవిసర్పిణా ॥
అంత వారిద్దరు ప్రేతమనస్కులైరి. ఈముని లేవనెత్తీరి. ఆతనినీ ఆశీస్సులచే అశీనందనములచే ముహుర్ముహుః ముంచెత్తిరీ, వివిధరీతుల నాతనీని వారభినండిరచిరీ. హోరాత్రువులచే నీండిన నేత్రములతో ఓ రోజో ! ఆతఁడు తన్నడిగిన పొనీకెల్ల రాముడు ప్రతి సమాధాన మొసంగెను. తరుషోత తన యెక్క తన సోదరుల యొక్క తల్లితదండ్రుల యొక్క కార్యకలాపవతిల గూర్చి చెప్పెను. వారిరువురకు ప్రీతి గలిగించు గుణములతో తాతగారీ నివేశమున రాముడు వసించేను. (32) ఆయాశ్రమమున సర్వభూత నయనానందనుఁడై రాముఁడు శుశ్రూషణ పరారుణుండై కొన్ని మాసములు వసించెను. తరువాత భృగువంశ శ్రేష్ఠుఁడయిన రాముఁడు, పీతామహుల అంగీకారముతో తాతగారి తండ్రి నివాసమగు నాశ్రమమునకు సోవతలంచెను. (34} ప్రీతి యుక్తులున లోతపోదుల ఆశీస్సులచే నళినండితఁడరు వారు నిర్దేశించిన విధముగా తాతతండ్రియైన ఔర్వరి ఆశ్రమమునకు రాముఁ డరిగేను. చ్యవనమహరీకి (?) విధిపూర్వకముగా నమస్కరీంచి మహాగుణ సంపన్నుఁడయిన రాముఁడు ఆతనిచే అనుష్టాతుఁడయి భృగువుయెక్క ఆశ్రమమునకు వర్ష పూర్ణుఁడై యరిగెను. భృగు మహర్షుల ఆశ్రమ మండలము ప్రవేశించెను. ఆయాశ్రమము శాంత మనస్కులయిన మునికులతో సర్వత్ర నిండియుండేనం. మనోహరము, శీతలము, సర్వర్లు గుణాన్వితము, నలరున ఛాయలతో నిండి, ఫలపుష్పసమన్వితములు నయిన వృక్షములచే సంవృతమయినది, నానావిధములయిన పక్షకులముల రవములచే మనస్సుకు, చెవులకు సుఖమును గలిగించునది సర్వత్ర వివిధములయిన వేదఘోషలచే ప్రతీర్వనీంచుచున్నది. మంత్రములయిన ఆహుతుల వలనఁగలిగిన సర్వత్ర వ్యాపించిన ధూమగంధముచే సమస్త వేప సమూహమును చెదరగొట్టు చుండెను.
సమిత్కుశాహరైర్దండమేఖలాజినమండితైః ।
అభితః శోభితం రాజన్రమైన్యర్మునికుమరకైః ॥
ప్రసూనజలసంపూర్ణపాత్రహస్తాభీరంతరా ।
శోభితం మూనీకన్యాలీశ్చరంతీభికత స్తతః ॥
సపోతహరిణీయపోథైర్విసంభడవశంకీభిః ।
ఉటజోంగణతర్యంతో తరుచ్ఛాస్వధిష్ఠితమ ॥
రోమపథతః పరామృష్టియూధసాక్షికమత్ర్పదైః ।
ప్రారబ్ధతాండవం కేకీమయూరైర్మధురస్వరైః ॥
ప్రవికీర్ణకణోద్దేశం మృగశబ్ధైస్సమీపగైః ।
అనాలీధాతపచ్ఛాయాశుష్యన్నీవారరాశిలీ: ।
హూయమానానలం కాలే పూజ్యమానాతిథివ్రజమ్ ॥
అభ్యస్యమానచ్ఛందౌఘం చింత్యమానాగమోదీతమ్ ।
పఠ్యమానాభిలస్మార్తం శ్రాతార్థప్రవిచారణమ్ ॥
ప్రారబ్ధపితృదేవేణ్యం సర్వభూతమనోహరమ్ ।
తపస్వీజనభూయిష్ఠముకాపురుషసేవితమ్ ॥
తపోవృద్ధీకరం పుణ్యం సర్వసత్త్వసుభాస్పదమ్ ।
తపోధనానందకరం బ్రహ్మలోకమవాపరమ్ ॥
ప్రసూనసౌరభభ్రామ్యన్మధుపారావనాదీతమ్ ।
సర్వతోవీజ్యమానేన వివిధేన నభస్వతా ।
ఏవంవిధగుణోపేతం పశ్యన్నాశ్రమముత్తమమ్ ॥
ప్రవివేశ వినీతాత్మా సుకృతీ వామరాలయమ్ ।
సంప్రవిశ్యాశ్రమోపాంతం రామః స్వప్రపితామహమ్ ॥
దదర్శ పరీతో రాజన్మునిశిష్యశతావృతమ్ ।
వ్యాఖ్యానవేదికామధ్యే నివిష్టం కుశవిష్టరే ॥
సితశ్శశ్రుజటాకూర్చబ్రహ్మసూత్రోపశోభితమ్ ।
వామేతరోరుమధ్యస్త వామజంఘేన జానునా ॥
యోగపట్టేన సంవీతస్వదేహమృషిపుంగవమ్ ।
వ్యాఖ్యానముద్రావీలసత్సవ్యపాణితలాంబుజమ్ ॥
సమిధలను కుశలను తీసికొనివచ్చు ముని కుమారకులు మేఖలతో అజినములతో నలంకృతులయిరి. వారిచే ఆశ్రమము సర్వత్ర శోభిల్లుచుండెను. పుష్పములతో జలసంపూర్ణ పాత్ర హస్తములతో ఇటునటు సంచరించుముని కన్యలచే ఆశ్రమము శోభించుచున్నది. ఆశ్రమ పర్ణశాలా సమీపమందలి తరుచ్ఛాయలందు, పిల్లలతో కూడిన హరిణములు విశ్వాస పూర్వకముగా శంకా రహితముగా పరుండియున్నవి. ఆడ నెమళ్లు మగ నెమళ్లు మధుర షడ్జమ నాదములతో నృత్యము చేయుచుండెను. ఋష్య మృగములు (ఒకజాతి లేళ్లు) గుంపులు గుంపులుగా, తిన్న ఆహారమును నెమరు వేయుచు ఆమర నృత్యములకు సాక్షులుగా నిలబడి యుండెను. ఆ మయూరములు ఆ లేళ్ల కమితమయిన ఆనందమును గలిగించుచుండెను. ఆ యాశ్రమములో నీవారధాన్యములు చల్లబడినవి. నీవార ధాన్యముల ప్రోగులు ఎండలో వృక్షచ్ఛాయలో ఎండ వేయం బడినవి. ఆధాన్యము ప్రక్కనే సంచరించుచు లేడికూనలు సయితము వానిని ముట్టకుండెను. ఆశ్రమములో హోమములు సకాలమున జరుగుచుండెను. గౌరవనీయులయిన యతిధులు ఆహ్వానింపఁబడుచుండిరి. వేదాధ్యయనము అభ్యసింపబడుచున్నది. అంతీయేగాక ఆగమోదీత ధర్మ విషయాదికమెల్ల వినుర్శింపఁబడుచుండెను. స్మార్తము వల్లె వేయబడుచున్నది. శ్రాతార్థము విచారింపఁబడుచున్నది. దేవతల యొక్క పితృదేవతల పూజాదికము లారంభమైనవి. ఆ తపోవనము సర్వభూతమనోహరముగా నుండెను. అందేందుచూచిన తపస్విజనులుండిరి. కాపురుషులు లేరు. ఆశ్రమము తపోవృద్ధీకరము. పుణ్యప్రదము, సర్వసత్త్వ సుఖాస్పదము. రెండవ బ్రహ్మలోకము వలె తపోధనుల కెల్లరకు నానందకరమయినది. పుషసౌరభ భ్రామ్య మధుపముల యొక్క నాదముచే ప్రతిధ్వనించుచున్నది. వీచునట్టి పలు విధములయిన వాయువులతో సర్వత్ర మనోజ్ఞము. ఇట్టి వివిధ గుణములతో కూడియున్న ఉత్తమమయిన ఆశ్రమమును రాముఁడు చూచెను. వినయగుణ పూరితాత్ముఁడై యా యాశ్రమమును దేవతలు సుకృతులు ప్రవేశించు అమరాలయము వంటి దానిని రాముఁడు ప్రవేశించెను. ఆశ్రమమును ప్రవేశించి స్వప్రపితామహుని దర్శించేను. ఆ మహర్షి చుట్టును ముని శిష్య శతము కూర్చుండియుండెను. వ్యాఖ్యాన వేదిక యొక్క మధ్య కుశాసనమున మహర్షి ఉపవిష్ణుఁడై యుండెను. ఆ మహర్షి తెల్లనీ మీసములు, గడ్డము, జటలు, కూర్చము. బ్రహ్మసూత్రము మొదలగు వానిచే ప్రకాశించుచుండెను. అతఁడు పద్మాసనస్థుఁడై యుండెను. ఆతని శరీరము యోగపట్టముచే సంవీతము. వ్యాఖ్యా ముద్రతో విలసిల్లు ఆతని దక్షిణ పాణితలంబుజము వెలుగుచుండెను.
యోగపట్టోపరిన్యస్తవిభ్రాజద్వామపాణికమ్ ।
సమ్యగారణ్యవాక్యానాం సూక్ష్మతత్త్వార్థసంహితమ్ ॥
వివృత్య మునిముఖేభ్యః శ్రావయంతం తపోనిధిమ్ ।
పితుః పితామహం దృష్ట్వా రామస్తత్ర మహాత్మనః ॥
శనైరీవ మహారాజసమీపం సముపాగమత్ ।
తమాగతముపాలక్ష్య తత్ర్పభావప్రధర్షితాః ॥
శంకామవాపుర్మునయో దూరాదేవాఘేలా నృప ।
తావద్భగురమేయాత్మా తదాగమనతోషితః ॥
నివృత్తాన్యకథాలాపస్తం పశ్యన్నాస పార్థివ ।
రామోఽపి తముపాగమ్య వినయావనతాననః ॥
అవందత యథాన్యాయముపేంద్ర ఇవ వేధసమ్ ।
అభివాద్య యథా న్యాయం ఖ్యాతిం చ వినయాన్వితః ॥
తాంశ్చ సంభావయామాస మునీన్రామో యథావయః ।
తైశ్చ సర్వైర్ముదోపేతైరాశీర్భిరభివర్ధితః ॥
ఉపానివేశ మేధావీ భూమౌ తేషామనుజ్ఞయా ।
ఉపవీష్టం తతో రామమాశీర్భిoరభినందితమ్ ॥
ప్రప్రచ్ఛ కుశలప్రశ్నం తమాలోక్య భృగుస్తథా ।
కుశలం ఖలు తే వత్స పిత్రోశ్చ కిమనామయమ్ ॥
భ్రాతృణాం చైవ భవతః పితుః పిత్రోస్తథైవ చ ।
కిమర్థమాగతోఽత్ర త్వమధునా మమ సన్నిధిమ్ ॥
కేనాపి వా త్వ మాదిష్టః స్వయమేవాథ వాగతః ।
తతో రామో యథాన్యాయం తస్మై సర్వమశేషతః ॥
కథయామాస యత్పృష్టం తదా తేన మహాత్మనా ।
పితుర్మాతుశ్చ వృత్తాంతం భ్రాతృణాం చ మహాత్మనామ్ ॥
పితుః పిత్రోశ్చ కౌశల్యం దర్శనం చ తయోర్నృప ।
ఏతదన్యచ్చ సకలం భృగోః సప్తశ్రయం ముదా ॥
న్యవేదయద్యధాన్యాయమాత్మనశ్చ సమీపితమ్ ।
శ్రుత్తైతదఖిలం రాజన్ రామేణ సముదీరితమ్ ॥
యోగ పట్టముపై ప్రకాశించు ఆతనీ వామ హస్తముంచబడి యుండెను. ఆరణ్యవాక్యముల యొక్క సూక్ష్మమయిన అర్ధము యొక్క తత్వము వివరించి ముని ముఖ్యులకు ఆ తపోనిధి వినిపించుచుండెను. మహాత్ముఁడైన తండ్రి యొక్క తాతగారిని చూచి రాముఁడు మెల్లగా ఆతని సమీపమున కరిగెను. మునీశ్వరుని చేరు రాముని చూచి దూరమున నుండియే ఆతని ప్రభావప్రధర్షితులై మునులందరు శంకను పొందిరి. ఆ భృగు మహర్షి రాముని ఆగమమున సంతోషించెను. ఇతరములయిన కథాలాపములను కట్టి పెట్టి ఆతనినీ చూచుచునే యుండిపోయెను. రాముఁడాతనిని సమీపించెను. వినయము చేతను వంచిన ఆసనముతో సంప్రదాయ న్యాయము ననుసరించి, ఉపేంద్రుఁడు బ్రహ్మకు వలె నమస్కరించెను. భృగుపతియయిన ఖ్యాతికి యధాన్యాయము రాముఁడు నమస్కరించి వినయాన్వితుఁడై మునులకు వారి వారి వయఃక్రమము ననుసరించి నమస్కరించెను. వారందరిచే రాముఁడు సంతోషముగా ఆశీస్సులచే అభినందింపఁబడెను. (61) వారియొక్క యనుజ్ఞను బడసి మేధావియైన రాముఁడు నేలపై కూర్చుండెను. రాముఁడు నేలపై కూర్చున్న పిమ్మట, అచ్చటి వారందరిచే, ఆశీస్సులచే నభినందింపఁబడిన తరువాత, భృగువు ఆతనిని చూచి కుశల ప్రశ్నలడిగెను. వత్స ! నీవు కుశలమే కదా ! నీ పితరుల ఆరోగ్యవంతులే కదా ! నీ సోదరులకు, నీ తండ్రి తండ్రికి క్షేమమే కదా? ఇప్పుడు ఇక్కడకు నా వద్దకు ఏ పనిని పురస్కర్టించుకొని వచ్చితివి? ఎవ్వరిచే నయినను ఆదేశింపఁబడి వచ్చితివా? లేక నీవే స్వయముగా కోరి వచ్చితివా? అని అడుగబడి, యాతనికి న్యాయము నతిక్రమించక సర్వమును పూర్తిగా వివరించెను. అడిగిన దేల్లయు వివరించెను. తల్లి యొక్క తండ్రి యొక్క మహాత్ములయిన సోదరుల యొక్క తండ్రిగారి తండ్రి యొక్క కుశలము దర్శనమును గూర్చి చెప్పెను. భృగువును ప్రేమ గౌరవ పురస్పరముగా ఇతరములయిన సకల విషయములను గూర్చీ రాముఁడు విన్నవించెను. ఆతఁడేమి వాంఛించెనో కూడ రాముఁడు చెప్పెను. భృగువు రామునిచే సముదీరితమైన డెల్ల వీనెను. (68)
తం చ దృష్ట్వా విశేషేణ భృగుః ప్రీతోఽభ్యనందత ।
ఏవం తస్య ప్రియం కుర్వన్నుత్కృష్టైరాత్మకర్మభిః ॥
తత్రాశ్రమేఽవసద్రామో దీనాని కతిచిన్నృప ।
తతః కదాచిదేకాంతే రామం మునివరోత్తమః ॥
వత్సా అగచ్చేతి తం రాజన్నుపాహ్వయదుపహ్వయే ।
సోఽభిగమ్య తమాసీనమభివాద్య కృతాంజలిః ॥
తస్థౌ తత్పురతో రామః సుప్రీతేనాంతరాత్మనే ।
ఆశీర్భీరభినంద్యాథ భృగుస్తం ప్రీతమానసః ॥
ప్రాహ నాధిగతాశంకం రామమాలోక్య సాదరమ్ ।
శ్రుణు వత్స వచో మహ్యం యత్త్వాం వక్ష్యామి సాంప్రతమ్ ॥
హితార్థం సర్వలోకానాం తవ చాస్మాకమేవ చ ।
గచ్ఛ పుత్త్ర మమాదేశాధ్ధిమవంతం మహాగిరిమ్ ॥
అధునైవాశ్రమాదస్మాత్తపసే ధృతమానసః ।
తత్ర గత్వా మహాభాగ కృత్వాశ్రమపదం శుభమ్ ॥
ఆరాధయ మహాదేవం తపసా నియమేన చ ।
ప్రీతిముత్పాద్య తస్య త్వం భక్త్యానన్యగయా చిరాత్ ॥
శ్రేయో మహదవాప్నోషి నాత్ర కార్యా విచారణా ।
తరసా తవ భక్త్యా చ ప్రీతో భవతి శంకరః ॥
కరిష్యతి చ తే సర్వం మనసా యద్యదిచ్ఛసి ।
తుష్టే తస్మిన్ జగన్నాథే శంకరే భక్తవత్సలే ॥
అస్త్రగ్రామమశేషం త్వం వృణు పుత్త్ర యథేప్సితమ్ ।
త్వయా హితార్థం దేవానాం కరణీయం సుదుష్కరమ్ ॥
విద్యతేఽభ్యధికం కర్మ శస్త్రసాధ్యమనేకశః ।
తస్మాత్త్వం దేవదేవేశం సమారాధయ శంకరమ్ ॥
భక్త్యా పరమయా యుకస్తతోఽభీష్టమవాప్స్యసి ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయోపోద్ఘాతపాదే
ఏకవింశతి తమోఽధ్యాయః ॥
రాముని పలుకులు వీనీ, ఆతని ప్రేమతో వీక్షించి, భృగువు ప్రీతిమంతుఁడై యాతనిని విశేషముగా నభినందించేను, ఈ విధముగా ఉత్కృష్టములయిన కార్య కలాపములచే తాతగారికి ప్రీయ మాచరించుచు, కొన్ని దినములు రాముఁడు ఆశ్రమము నందుండెను. ఒకనాఁడు ఏకాంతముగా మునీ వోత్తముఁడు “నాయనా ! ఇటు రమ్ము" అనీ రాముని ఏకాంత ప్రదేశమునకు పిలిచెను. వచ్చి, ఆసీనుడైయున్న మునికి కృతాంజలియై నమస్కరించి ఆతని ముందు రాముఁడు నిలబడి యుండెను. భృగువు, సంతుష్టమయిన యంతరాత్మచే ఆశీస్సులచే నతనిని అభినందించి శంకారాహితుఁడై యున్న రాముని సాదరముగా నాలోకించి, వత్స ! ఇప్పుడు నిన్ను గూర్చి నేనేమి వచింప నుంటినో వినుము. ఇది సర్వలోకము యొక్క క్షేమము కోకు, నీ క్షేమమునకు, మా క్షేమమునకును. నాయనా ! నా ఆదేశమును గ్రహించి, మహాగీరియైన హిమవంతమున కరుగుము, (74) ఇప్పుడే ఈ ఆశ్రమము నుండి తపస్సాచరింప ధృతమనస్కుండపై హిమాలయమున కరుగుము. పూజ్యుఁడో అందొక శుభమైన ఆశ్రము పదమును నిర్మించుకోనుము. తపస్సు చేతను, నియమము చేతను మహాదేవుని ఆరాధించుము. అనన్య,తుల్యమయిన తపస్సుచే అచిరకాలములో మహాదేవునకు ప్రీతిని పుట్టించుము. నీవు గొప్ప శ్రేయస్సును పొందెదవు. ఇంక నీవు ఆలోచింపవలసిన పనిలేదు. నీ యొక్క భక్తికి శంకరుఁడు వెంటనే ప్రీతుఁడగును. ఆ మహాదేవుఁడు మనసా నీ వేది కోరుదువో నీ కోటకు దానిని చేయగలఁడు, భక్తవత్సలుడు, జగన్నాథుఁడు, అయిన ఆ శంకరుఁడు సంతోషింపగా, పుత్త యథేప్సితమయిన అస్త్ర సముదాయమును సర్వస్వమును నీవు వరమడుగుము. దేవతల యొక్క హితము కొఱకు, నీవు చేయవలసిన, దుష్కర మయిన కరణీయము, అనేకములయిన శస్త్రముల చేతనే సాధ్యమునగు నభ్యధికమయిన కర్మ కలదు. అందుచే నీవు దేవ దేవేశుఁడయిన శంకరుని సమారాధనము చేయుము ! అత్యుత్కృష్టమయిన భక్తితో గూడుకొని నీవు నీ యభీష్టమును పొందగలవు.
ఇది వాయు ప్రోక్తమునయిన బ్రహ్మాండమహాపురాణమున మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున ఇరువది యొకటవ అధ్యాయము.
Summary of chapter 59 of the Brahmānda Mahā Purana is as follows:
This awe-inspiring chapter extols the mighty ruler Mandhātri, whose boundless righteousness and empire extended across the entire earth bounded by the seas. It recounts his extraordinary birth, unmatched valor, and supreme devotion, portraying him as a ideal sovereign who protected his subjects like a loving father. The devout reader marvels at his spiritual greatness, realizing that true power is found only in complete alignment with divine righteousness.