20 - అధోలోక వర్ణనము

సూత ఉవాచ :-

అధః ప్రమాణమూర్ధ్వం చ వక్ష్యమాణం నిబోధత

పృథివీ వాయురాకాశమాపో జ్యోతిశ్చ పంచమమ్

అనంతా ధాతవో హ్యేతే వ్యాపకాస్తు ప్రకీర్తితాః

జననీ సర్వభూతానాం సర్వసత్వధరా ధరా

నానాజనపదాకీర్ణ నానాధిష్టానషత్తనా

నానాసదనదీ శైటా సైకణాటసమాకులా

అనంతా గీయతే దేవీ పృథివీ బహువిస్తరా

నదీనదసముద్రస్థాస్తథా క్షుద్రాశ్రయస్థితాః

పర్వరాశసంస్థాశ్చ అంతర్భూమిగతాశ్చ యాః

ఆపోనంతా హి విశ్రేయాస్తధాగ్నిః సర్వలోకగః

అనంతః పఠ్యతే చైవ వ్యాపక సర్వసంభవః

తథాతాళమసాలేణ్యం రమ్యం నావాశ్రయం సుతమ్

అనంతం పఠ్యతే చైవ వాయుశ్చాకాశసంభవః

ఆపః పృథివ్యాముదకే పృథిష్యుపరి సంస్థితాః

ఆకాశశ్చాపరమథ పునర్భూమిః పునర్జలమ్

ఏవం మతమనంతస్య భౌతికస్య న విద్యతే

పరస్పరైః సోపచీతా భూమిశైవ నిబోధత

భూమిర్జలమథాకాశమితి మాయాపరంపరా

స్థితియేషా తు విఖ్యాతా సప్తమేస్మినసాతలే

దశయోజనసాహస్రమేకం భౌమం రసాతలమ్

సూతుఁడు చెప్పెను :

భూమియొక్క వాయువుయొక్క ఆకాశముయొక్క నీటియొక్క యైదవదయిన అగ్నియొక్క ప్రమాణముల నెరుంగుము. మును ముందు వాని ప్రమాణములను చేప్పెదను. (ఇవీ యింతకు పూర్వమే సప్రమాణముగా చెప్పబడినవి). ఈ భూతములు అనేకములయిన (అనంతమయిన) ధాతువులతో గూడినవి, అవి సర్వ వ్యాపకములుగా చెల్లుచున్నవి. జీవించుచున్న సర్వజీవులకు (సత్త్వములకు) తల్లి భూమీ అయ్యది సర్వ జీవులను భరించును; సర్వ జంతువులను భరించును. ఈ భూమి సానా విధములయిన జనపదములచే ఆకీర్ణమై యున్నది. అట్లే పత్తనములతో, కూడియున్నది. దానియందు ననేక విధములయిన నదనదీ శైలములున్నవి; అనేకములయిన జాతులతో నిండియున్నది. (3) దేవతా స్వరూపయయిన పృథివి బహువిస్తరయనుచు, నదీనద సముద్రములు గలిగి నదనియు, అవి క్షుద్రాశ్రయములతో గూడియున్నవనీయు అనంతగా కీర్తింపం బడినది. (4) జలములు కూడననంతములనీయే యెఱుంగవలెను. నదులలోని నీరు, సెలయేళ్లలోని నీరు, సముద్రములోని నీరు, గుంటలలోని నీరు, పర్వతోపరిభాగమున నున్న నీరు, ఆకాశము నందున్న నీరు, అంతర్భూమి గత జలములు అనంతములని గ్రహింపవలెను. అట్లే అగ్నిభూతము అది అన్నీ లోకముల ఆవరించియున్నది. ఇయ్యది సర్వ సంభవమై, సర్వా వ్యాపకముగా చెప్పబడినది. (5) అట్లే ఆకాశముకూడ, వర్ణింపశక్యము కానిది, రమ్యము, నానాశ్రయముగా అనంతముగా స్మరింపఁబడినది. (6) ఆకాశము నుండి వాయువు పుట్టినదీ, జలములు భూమియందు భూమ్యుపరీయందు నున్నవి. భూమి జలములయు పరీభాగమునున్నదీ. (7) ఆకాశము కంటే పెద్దదేదియును లేదు. తరువాత పెద్దది భూమి; తరువాత నీరు. భౌతికముల విషయమై అనంతమైన స్థితి యొండు లేదనెడి అభిప్రాయము కలదు. (8) భూతముల యొక్క పరస్పర సంబంధమున భూమి ఉపచీయమాన మగును. (వృద్ధి పొందును). భూమి, ఆపస్సు, ఆకాశముల యొక్క ఆయా పరంపర తెలిసినదియే సప్తమ రసాతలములో నీ స్థితి ప్రఖ్యాతమైనది. (9) రసాతలము దశసహస్ర యోజనముల దూరము భూమిని గలిగియున్నది. (10)

సాధుభిః పరిసంఖ్యాతమేకైకేనైవ విస్తరమ్

ప్రథమం త్వతలం నామ సుతలం తు తతః పరమ్

తతస్తలాతలం విద్యాడతలు బహువిస్తరమ్

తతోఽద్వాక్చ తలం నామ పరతశ్చ రసాతలమ్

ఏతేషామష్యధోభాగే పాతాలం సప్తమం స్కృతమ్

కృషభౌమళ్ళ ప్రథమో భూమిభాగః ప్రకీర్తితః

పాండుభూమిర్ద్వితీయస్తు తృతీయో నీలమృత్తికః

పీతఖామః చతుర్ధస్తు పంచమః శర్కరామయః

షష్టః శిలామయో జేయః సౌవర్ణః సప్తమః పృతః

ప్రథమేసింస్తలే ఖ్యాతమసురేంద్రస్య మందిరమే

సముచేరింద్రశత్రోశ్చ మహానాడస్య చాలనమ్

పురం వ శంకు కషణ కబంధస్య చ మందిరమ్

రసాతలము ఒకదానికంటే నోకటి వీరోలతరమైనదని సాధువులు పరిగణించిరి. మొదట రసాతలము అతలము తరువాత విద్యాతలము. అది బహు విస్తృతమైనది, తరువాతీది తలాతలము, అతలము (ఎతలం?) చాల విస్తీర్ణము కలది. దానికి క్రిండంగా తల (రసాతల) మున్నది (ఇదీ మహాతలము కానోపు) దాని తరుపోత రసాతలమున్నది. అది పాతాళము అని పాంపవలేను. వానిలో ప్రథమమైన భూమి భాగము నల్లని భూమిగా కృష్ణభూమిగా) ప్రకీర్తితము. (13) రెండవది పాండుభూమి. నాలుగవది పీతభూమి; ఇంక నైదవది గులకరాలతో గూడిన శర్మరా భూమి. (14) ఆవది శిలామయము. ఏడవది సౌవర్ణభూమి. ఇంద్ర శత్రువు అసురేంద్రుఁడు సయిన నముచీ యొక్క మందిరము ప్రథమమున రసాతలమున నున్నదీ. (15) మహానాథుని యొక్క మందిరము, శంకుకర్ణుని యొక్క నగరము, కబంధుని భవసము - ఇవి మొదటి రసాతలమున నున్నవి. (16)

నిష్కులాదస్య చ పురం ప్రహృష్టజనసంకలమ్

రాక్షసస్య చ భీమస్య శూలడంతస్య చాలయమ్

లోహితాక్షకళింగానాం నగరం శ్వాపదస్య చ

ధనంజయస్య చ పురం, నగేంద్రస్య మహాత్మనః

కాళియస్య చ నాగస్య నగరం కౌశికస్య చ

ఏవం పురసహస్రాణి నాగదానవరక్షసామ్

తలే జ్ఞేడవి ప్రథమే కృష్ణభామే న సంశయః

ద్వితీయే సుతలే విప్రాః దైత్యేంద్రస్య చ రాక్షసః

మహాణభస్య చ తథా నగరప్రథమస్య తు

హయగ్రీవస్య కృష్ణస్య నీకుంభస్య చ మందిరమ్

శంఖాఖ్యస్య చ దైత్యస్య నగరం గోముఖస్య చ

రాక్షసస్య చ నీలస్య మేఘస్య కదనస్య చ

ఆలయం కుకుపాదస్య మహాషీషస్య చాలయమ్

కంబలస్య చ నాగస్య పురమశ్వతరస్య చ

కద్రూపుత్రస్య చ పురం తక్షకస్య మహాత్మనః

ఏవం పురసహస్రాణి నాగదానవరక్షసామ్

ద్వితీయేఽస్మిన్ తలే విప్రాః పాండుభామే చ సంశయః

తృతీయే తు తలే ఖ్యాతం ప్రహ్లాదస్య మహాత్మనః

అనుహ్లాదస్య చ పురం పురమగ్నిముఖస్య చ

తారకాఖ్యస్య చ పురం పురం త్రిశిరసస్తథా

శిశుమారస్య చ పురం త్రిపురస్య తథాపురమ్

పురంజనస్య దైత్యస్య హృష్టపుష్టజనాకులమ్

చ్యవనస్య చ విజ్ఞేయం రాక్షసస్య చ మందిరమ్

రాక్షసేంద్రస్య చ పురం కుంభిలస్య ఖరస్య చ

ప్రహృష్ట జనములతో నిండిన నిష్కలాదుని పురము, రాక్షసుఁడయిన భీముని భవనము, శూలదంతుని భవనము, లోహితాక్షుల కాళింగుల భవనము, శ్వాపదుని యొక్క నగరము, ధనంజయుని యొక్క మహాత్ముఁడయిన నాగేంద్రునియొక్క నగరము, కాళీయునీ నగరము, కౌశికుని నగరము, (కలవు) ఇట్లే సాగుల యొక్క దానవుల యొక్క రాక్షసుల యొక్క నగరములు సహస్ర సంఖ్యలో కృష్ణ భూమియైన మొదట రసాతలము నున్నవనీ యెఱుంగవలయును. (19) రెండవ రసాతలమయిన సుతలమున (ఓ బ్రాహ్మణులారా) దైత్యులకు రాక్షసులకు మొదటి ప్రభువైన మహాజంభుని నగరము, హయగ్రీవుడయిన కృష్ణుని నగరము నికుంభుని మందిరము, శంఖ నామకునీ, గోముఖుని యొక్క పురము, రాక్షసులయిన నీలుని యొక్క మేఘుని యొక్క కదనుని యొక్క పురము, కుకుపాదుని యొక్క ఆలయము, మహోషీషుని యొక్క ఆలయము, కంబలుడు అను సర్పము యొక్క నగరము, అశ్వతరుని నగరము, మహాత్ముడయిన కద్రుని కుమారుఁడయిన తక్షకుని నగరము, ఇట్లే ఓ బ్రాహ్మణులారా! సర్పములకు, దానవులకు, రాక్షసులకు సంబంధించిన నగరములు. వేలాదిగా పాండు భౌమ వర్ణము గల నేల గల రెండవ రసాతలమున కలవు. తృతీయ రాసాతలమున మహాత్ముఁడయిన ప్రహ్లాదుని నగరము అనుహ్లాదుని నగరము, అగ్ని ముఖుని నగరము, తారకాఖ్యుని నగరము. అట్లే శ్రీశిరసునీ నగరము, శిశుమారుని పురము, త్రిపురుని నగరము, దైత్యుఁడయిన పురం జనుని నగరము - ఇవి యన్నియు హృష్టపుష్ట జనాకులములు (27) రాక్షసుఁడయిన చ్యవనుని పురము, కుంభీలుని ఖరుని పురము, కలవని యుంగవలేను. (28)

విరాధస్య చ క్రూరస్య పురములాముఖస్య చ

హేమకస్య చ నాగస్య తథా పాండురకస్య చ

మణినాగస్య చ పురం కపిలస్య చ మందరమ్

నందకస్యోరగపతేర్విశాలాక్షస్య మందిరమ్

ఏవం పురసహస్రాణి నాగదానవరక్షసామ్

తృతీయేఽస్మింస్తలే విప్రా నీలభౌమే న సంశయః

చతుర్రే దైత్యసింహస్య కాలనేమేర్మహాత్మనః

గజకర్ణస్య చ పురం, నగరం కుంజరస్య చ

రాక్షసేంద్రస్యచ పురం సుమాలేః బహువిస్తరమ్

ముంజస్య లోకనాథస్య వృకవక్రస్య చాలయమ్

బహుయోజనవిస్తీర్ణం బహుపక్షిసమాకులమ్

నగరం వైనతేయస్య చతుర్థేఽస్మిన్ రసాతలే

పంచమే శర్కరాభౌమే బహుయోజనవిస్తరమ్

విరోచనస్య నగరం దైత్యసింహస్య ధీమతః

వైద్యుతస్యాగ్నిజిహ్వస్య హిరణ్యాక్షస్య చాలయమ్

పురం చ విద్యుజిహ్వస్య రాక్షసేంద్రస్య ధీమతః

సహామేఘస్య చ పురం రాక్షసేంద్రస్య మాలినః

కిర్మీరస్య చ నాగస్య స్వస్తికస్య జయస్య చ

ఏవం పుర సహస్రాణి నాగదానపరక్షసామ్

పంచమేఽసింస్తలే జ్ఞేయం శర్కరానిచయే సదా

షష్ఠీ తలే దైత్యపతేః కేసరే నగరోత్తమమ్

సుపర్వణః పులోమ్నశ్చ నగరం మహిషస్య చ

రాక్షసేంద్రస్య పురం సురోషస్య మహాత్మనః

తత్రాస్తే సురమాపుత్రః శతశీర్తో ముడా యుతః

మహేంద్రస్య సఖా శ్రీమాన్ వాసుకిర్నామ నాగరాట్

ఏవం పురసహస్రాణి నాగదానవరక్షసామ్

షష్టే తలేఽస్మిన్ విఖ్యాతే శిలాభౌమే రసాతలే

సప్తమే తు తలే జ్ఞేయం పాతాళే సర్వపశ్చిమే

ఉల్కాముఖుని నగరము, క్రూరుడైన విరాధుని నగరము, హేమకుడయిన నాగుని పురము, అట్లే పాండురకుని పురము, మణినాగుని పురము, కపిలునీ మందిరము, సర్పరాజయిన నందకుని నగరము, విశాలాక్షుని మందిరము. (30) ఓ బ్రాహ్మణులారా ! ఇట్లే నాగదానవరాక్షసుల వేలకొలది నగరములు నీలపృథ్వీతో గూడియున్న తృతీయ రసాతలమున కలవు. (31) ఇక నాలుగవ రసాతలమున, దైత్యులలో సింహుఁడు మహాత్ముఁడగు కాలనేమి యొక్క గజకర్ణుని యొక్క కుంజరునీ యొక్క నగరములు. (31) రాక్షసేంద్రుఁడయిన సుమాలుని పురము బహు విస్తారమయినది. లోకనాథుఁడయిన ముంజుని యొక్క పురము, వృకవక్రుని పురము, వైనతేయుని యొక్క పురము. బహు పక్షులతో కూడినదీ, బహు యోజనవిస్తీర్ణమును కలది. ఇవి యన్నియు చతుర్థ రసాతలమున కలవు, ఇక పంచమ రసాతలమున, గులకరాలతో ఇసుకతో గూడిన బహుజన విస్తీర్ణమునమన్న భూమియందు బుద్ధిమంతుఁడు దైత్యసింహుఁడునయిన విరోచనుని యొక్క నగరము కలదు. (35) అంతియేకాక విద్యుదగ్నిజిహ్వలు కలిగిన హిరణ్యాక్షుని ఆలయము, రాక్షసేంద్రుఁడు ధీమంతుఁడును నయిన విద్యుజిహ్వుని యొక్క నగరము. (36) సహమేఘుని పురము, రాక్షసేంద్రుఁడయిన మాలినీ యొక్క పురము, నాగుండయిన కిర్మీరుని యొక్క స్వస్తికుని యొక్క జయుని యొక్క పురములు కలవు. ఈ విధముగా నాగదానవ రాక్షసుల యొక్క వేయి పురములు గులకరాలతో ఇసుకతో గూడిన భూమిగల పంచమ రసాతలమున గలవని యెఱుంగ వలయును. (38) ఇక ఆఱవ రసాతలమున నగరోత్తమమయిన కేసరి నగరము కలదు. ఆ కేసరీ దైత్యుల కధిపతి సుపర్వణుని యొక్క పులోముని యొక్క మహిషుని యొక్క మహాత్ముఁడు రాక్షసేంద్రుఁడు నయిన సురేషుని యొక్క నగరము కలదు. అచ్చటనే శతశీర్పుఁడు అయిన సురమాపుత్రుఁడు సంతోషముగా నుండును. (40) నాగరాజయిన వాసుకి శ్రీమంతుఁడు మహేంద్రుని యొక్క స్నేహితుఁడు అందే యుండును. (41) ఇట్లు నాగదానవ రాక్షసుల యొక్క వేలాది సగరములు విఖ్యాతము శీలాభూమియునయిన షష్ణరసాతలమున నుండును.

పురం బలేః సముదితం నరనారీగజాకులమ్

అసురాశీవిషైః పూర్ణం సుభితైః దేవశత్రుభిః

ముచుకుందస్య దైత్యస్య తత్రైవ నగరం మహత్

అనేకైర్దితిపుత్రాణాం సముదీర్లైర్మహాపురైః

తథైవ నాగనగరైర్యుతిమద్భిః సహస్రశః

దైత్యానాం దానవానాం చ సముదీర్ణైః మహాపురైః

ఉదీర్లెరాక్షసావాసైరనేకైశ్చ సమాకులమ్

పాతాలాంతే చ విప్రేంద్ర విస్తీర్ణబహుయోజనే

ఆస్తే రక్తారవిందాక్షో మహాత్మా హ్యణరామరః

ధౌతశంభోదరవపుర్నీలవాసా మహాబలః

విశాలభోగో ద్యుతిమాంశ్చిత్తమాల్యదరో బలీ

రుక్మశృంగావదాతేన దీప్తాసేన విరాజతా

ప్రభుర్ముఖసహస్రణ శోభతే చైకకుండలీ

స జిహ్వామాలయా దీపో లోల్వలొనలార్చిషా

జ్వాలామాలాపరిక్షిప్తః కైలాస ఇవ లక్ష్యతే

సతు నేత్రసహస్రణ ద్విగుణేన విరాజతా

బాలసూర్యాభతాత్రేణ శరీరస్నిగ్ధపాండునా

తస్య కుందేందువర్ణస్య నేత్రమాలా విరాజతే

తరుణాదిత్యమాలేవ శ్వేతపర్వతమూర్ధని

వికరాలోచ్ఛ్రితతనుర్లక్ష్యతే శయనాసనే

బలీయొక్క నగరము సప్తమరసాతలమున సున్నదని యెఱుంగ వలెను. ఇదియే తుది రసాతలము. (42) ఇయ్యది యన్ని ప్రపంచములకు చివరనున్నది. ఇయ్యది ఆనంద పరిపూరితులయిన నరనారీగణసమాకులము. ఇదీ అసురలతో నాగములతో కూడి యున్నది. సుఖులైన దేవశత్రువులతో గూడినది. (43) అందే దైత్యుఁడయిన ముచికుందుని గొప్ప పురము కలదు. అయ్యది అనేకులయిన దితిపుత్రులతో విరాజమాన మయిన నగరములతో, అట్లే కాంతి మంతము లయిన వేలకొలదీ నాగవరుల యొక్క దైత్యుల యొక్క దానవులయొక్క సముదీర్ణములయిన నగరములతో ప్రకాశములయిన అనేక రాక్షసావాసములచే సమాకులము. ఓ విప్రేంద్రులారా! బహు యోజనముల వరకు విస్తీర్ణమైన పాతాళాంతము (46) అందు మహాత్ముఁడు నాగములకు రాజును నయిన శేషుఁడు వసించును. అతఁడు రకారవిందాక్షుఁడు. జరామరణములు లేనివాఁడు; ఆతనీ శరీరము కడుగబడిన శంభోదరము వంటిది. ఆతఁడు నీలవసనముల ధరించును. ఆతఁడు మహాబలుడు. (47) ఆతని భౌతిక శరీరము చాల పెద్దది. ఆతఁడు ద్యుతీమంతుఁడు; వీవీధ వర్ణములు గల పూవుల మాల్యములను ధరించును. మిక్కిలి ఐలవంతుఁడు. బంగారు పర్వత శృంగమువలె తెల్లనైన, ప్రకాశవంతమయిన ముఖముతో విరాజిల్లును. (48) ఆ నాగ ప్రభువు ముఖ సహస్రములతో శోభించిన కుండలి (సర్పము). ఆతఁడు చలించునట్టి అగ్నిజ్వాలల వంటి జిహ్వామాలలచే ప్రకాశవంతుఁడు. (49) ఆతఁడు ద్విసహస్ర నేత్రములతో జ్వాలామాలలచే ఆ వృతమయిన కైలాసమువలె కనఁబడును. బాల సూర్యునితో తుల్యమయిన తామ్రవర్ణముతో, నేత్రములు శోభిల్లును. చంద్రుని వలెను శరీరము మల్లెవలె విరాజిల్లును. (51) ఆ నేత్రములతో నతఁడు బాలసూర్యుల మాలవలె శ్వేతపర్వత శిఖరమున ప్రకాశించును.

విస్తీర్ణ ఇవ మేదిన్యాం సహస్రశిఖరో గిరిః

మహానాగైర్మహాభోగైర్మహావిజ్ఞైర్మహాత్మభిః

ఉపాస్యతే మహాతేజా మహానాగపతిః స్వయమ్

స రాణా సర్వ నాగానాం శేఖనంతో మహాద్యుతిః

సా వైష్ణవీ వ్యవహృతిర్మర్యాదా యా వ్యవస్థితా

సప్తవమేతే కథితా వ్యవహార్యా రసాతలోకి

దేవాసురమహావాగరాక్షసాధ్యుషితాః సదా

అతఃపరమనాలోకమగమ్యం సిద్ధసాధుభిః

దేవానామష్యవిదితం వ్యవహారవీవక్షయా

పృధ్వంబువహ్నివాయూనాం నభసశ్చ ద్వీజోత్తమాః

మహత్వమృషిభిశ్చైవం వర్జ్యతే నాత్ర సంశయః

అత ఊర్థ్వం ప్రవక్ష్యామి సూర్యచంద్రమసోర్గతిమ్

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ద్వితీయేఽనుషంగపాదేఽధోలోకవర్ణనం నామ వింశతి తమోఽధ్యాయః

ఆతనికి అధికమయిన శరీరము కలదు. ఆ శరీరముతో తన శయనమున పండుకొని, ఆతఁడు భూమిపై అతి విస్తీర్ణము గలిగిన సహస్ర శిఖరములు గల పర్వతము వలెదోచును. ఈ మహానాగము, తాను స్వయముగా మహాతేజస్వి యయ్యు, మహ-విజ్ఞానవంతులు, మహా భోగములు (పడగలు) కలవారు, మహానాగులు నైన మహాత్ములచే సేవింపఁబడు చుండును. ఆతఁడే సర్వ నాగములకు రాజు. ఈతఁడు అనంతుఁడు, శేషుఁడు. అనంతద్యుతిమంతుఁడు. (54) అయ్యది విష్ణుని వ్యవహృతి (గొప్పకార్యము). అదియే పాతాళమునకు సుస్థాపితమయిన అవధి (హదు. ఈ విధముగా వర్ణించుటకు వీలయిన సప్త రసాతలములు చెప్పబడినవి. (55) అందు (ఆ రసాతలముల) దేవతల, అసురులు మహా నాగములు మరియు రాక్షసులు నివాసము చేయుచున్నారు. ఇంతకుమించి సిద్ధులకు సాధువులకు తెలియదు. (56) అయ్యది దేవతలకు కూడ తెలియదు. వ్యవహార వివక్షచే ఓ బ్రాహ్మణులారా ! మాచే భూమ్యాది పంచ భూతముల గోప్పందనము నిస్సందేహముగ వివరింపఁబడినది. తన్మహత్వము ఋషులచే నీ విధముగా వర్ణింపఁబడినది, అందు సంశయములేదు. ఇక ముందు సూర్యచంద్రుల యొక్క గతిని (గమనమును) చెప్పెదను.

ఇది వాయుప్రోక్తము, మహాపురాణమునయిన బ్రహ్మాండ పురాణమందలి పూర్వభాగమునందలి ద్వితీయానుషంగ పాదమున అధోలోక వర్ణనమను నిరువదవ అధ్యాయము.