71 - వృష్ణివంశవర్ణనము

సూత ఉవాచ :-

సాత్వతాజ్జజ్ఞిరే పుత్రా: కౌశల్యాయాం మహాబలాః ।

భజమానో భజిర్దివ్యో వృష్టిర్దేవావృథోంఽధకః ॥

 మహాభోజశ్చ విఖ్యాతో బ్రహ్మణ్యస్సత్యసంగరః ।

తేషాం హి సర్గాశ్చత్వారః శ్రుణుధ్యం విస్తరేణ వై ॥

భజమానస్య సృంజయ్యో బాహ్యకా చోపబాహ్యకా ।

 సృంజయస్య సుతే ద్వే తు బాహ్యకే తే ఉదావహత్ ॥

 తస్య భార్యే భగిన్యౌ తే ప్రసూతే తు సుతాన్ బహూన్ ।

 నిమ్లోచిః కింకణశ్చైవ ధృష్టిః పరపురంజయః ॥

 తే బాహ్యకాయాం సృంజయ్య భజమానాద్విజజ్ఞిరే ।

 అయుతాజిత్సహస్రజిచ్ఛతాజిదితి నామతః ॥

 బాహ్యకాయాం భగిన్యాం తే భజమానాద్విజజ్ఞిరే ।

తేషాం దేవావృధో రాజా చచార పరమం తపః ।

పుత్రః సర్వగుణోపేతో మమ భూయాదితి స్మ హ ॥

 సంయోజ్యాత్మానమేవం స పర్ణాశజలమస్పృశత్ ॥

 సా చోపస్పర్శనాత్తస్య చకార ప్రియమాపగా ।

 కల్యాణత్వాన్నరపతేస్తస్య సా నిమ్నగోత్తమా ॥

 చింతయాభిపరీతంగీ జగామాథవినిశ్చయమ్ ।

నాభిగచ్ఛామి తాం నారీం యస్యామేవం విధః సుతః ॥

 భవేత్సర్వగుణోపేతో రాజ్ఞో దేవావృధస్య హి ।

 తస్మాదస్య స్వయం చాహం భవామ్యద్య సహవ్రతా ॥

 జజ్ఞే తస్యాః స్వయం హృత్థ్సొ భావస్తస్య యథేరీతః ।

 అధ భూత్వా కుమారీ తు సా చింతాపరమేవ చ ॥

 వరయామాస రాజానం తామియేష స పార్థివః ।

తస్యామాధత్త గర్భే స తేజస్వినముదారధీః ॥

సూతుఁడిట్లు చెప్పెను. సాత్వతునకు కౌశల్యయందు మహాబలురయిన కుమారులుదయించిరి. వారు -భజమానుఁడు, భజి, దీవ్యుఁడు వృష్టి దేవవృథుఁడు, అంధకుఁడు మరియు మహాభోజుఁడు, వారందరు ప్రసిద్ధులు. సవ్యసంగరులు, బ్రాహ్మణపోషకులు వారివంశీయులు చతుర్వర్గీయులు, వారినీ గూర్చి సవిస్తరముగా వీనుఁడు, భజమానునీ కుమారుడు సృజంయుఁడు సృంజయునకు ఇరువురు కుమార్తెలు; వారి నాతఁడు బాహ్యకునకిచ్చి వివాహ మొనర్చెను. అక్క చెల్లెండ్రయిన ఆభార్యలిరువురికి చాలమంది కుమారులుదయించిరి. పొరు-నిమ్లోచి, కొంకణుఁడు, ధృష్టి పరపురంజయుఁడు. వారు భజమానునకు మనుమలుగను, సృంజయుని కుమార్తెకు కొమరులుగనుపుట్టిరి. బాహ్యకుని మొదటి భార్య అయుతజిత్తు సహస్రజిత్తు శతజిత్తు అనుముగ్గురు కుమారుల (గనెను. సాత్వతునికుమారులలో రాజయిన దేవావృధుఁడు తీవ్రమయిన తపస్సును సర్వగుణో పేతుఁడయిన కుమారుఁడు నాకు పుట్టుగాక యనుకోరికతో ఆచరించెను. యోగాభ్యాసమున నిమగ్నుఁడై పర్ణాశజలములను స్పృశించెను? రాజు కళ్యాణగుణవంతుఁడగుట ఆ నది ఆతని స్పర్శచే ప్రియమాచరించెను (జలాచమనముచేయుటచే)ఆనది చింతచేపరీతాంగియై తుదకిట్లు నిశ్చయమునకువచ్చెను “రాజయినదేవవృధునకు, ఎవరెయందు తద్వీధమయినకుమారుఁడు గలుగునో ఆమెకు(ఆస్తీకి) ఎదురేగను (వ్యతిరేకముగాను) అందుచే నేనే యాతని భార్యనయ్యెదను.” ఆమెహృదయములో వాంఛించిన విధముగా భావముత్పన్యమయ్యెను, ఆమెకుమారిగానై చింతాపరవశుఁడయిన రాజును ప్రేమించెను. ఆరాజును ఆమెవరించెను.. ఆరాజు ఆమెనంగీకరించెను. ఆమెవల్లనుదారుఁడైన రాజు తేజస్వియైన కుమారునికొఱకు గర్భాధానముచేసెను. (ఆమెతోకలిసెను).

అథ సా నవమే మాసి సుషువే సరితాం వరి ।

పుత్తం సర్వగుణోపేతం బిభుం దేవావృథస్తదా ॥

 తత్ర వంశ పురాణజ్ఞా గాథాం గాయంతి వై ద్విజాః ।

గుణాన్ దేవావృధస్యాపి కీర్తయంతో మహాత్మనః ॥

యథైవ శృణుమో దూరాత్సంపశ్యామస్తథాంతీకాత్ ।

 బభ్రుః శ్రేష్ఠో మనుష్యాణాం దేవైః దేవావృధః సమః ॥

 పురుషాః పంచషష్టిశ్చ సహస్రాణి చ సప్తతిః ।

 యేమృతత్వమనుప్రాప్త బభ్రోర్దేవావృధాదపి ॥

 యజ్వా దానపతిర్దిరో బ్రహ్మణ్యః సత్యవాగ్బుధః ।

 కీర్తిమాంశ్చ మహాభోజః సాత్వతానాం మహారథః ॥

తస్యాన్వవాయః సుమహాన్భోజా యే భువి విశ్రుతాః ।

గాంధారీ చైవ మాద్రీ చ ధృష్టేర్ఫార్యే బభూవతుః ॥

 గాంధారీ జనయామాస సుమిత్రం మిత్రనందనమ్ ।

 మాద్రీ యుధాజితం పుత్రం తతో మీడ్వాంసమేవ చ ॥

అనమిత్రం శినం చైవ తావుభౌ పురుషోత్తమౌ ।

అనమిత్రసుతో నిఘ్నో నిఘ్నస్య ద్వౌ బభూవతుః ॥

 ప్రసేనశ్చ మహాభాగః సత్రాజిచ్చ సుతావుభౌ ।

తస్య సత్రాజితః సూర్యః సఖా ప్రాణసమోఽభవత్ ॥

 స కదాచిన్నిశాపాయే రథేన రథినాం వరః ।

 తోయం కూలాత్సముద్ధర్తుముపస్థాతుం యయౌ రవిమ్ ॥

 తస్యోపతిష్ఠతః సూర్యం వివస్వానగ్రతః స్థితః ।

 సుస్పష్టమూర్తిర్భగవాంస్తేజోమండలవాన్ విభుః ॥

 అథ రాజా వివస్వంతమువాచ స్థితమగ్రతః ।

యథైవ వ్యోమ్ని పశ్యామి త్వామహం. జ్యోతిషాం పతే ॥

 ఆ నదీలలామ తొమ్మిదవమాసమున సర్వగుణోపేతుఁడయనకుమారు బభ్రుని. దేవవృధుని వలనఁగనెను. తద్వంశమును గూర్చి పురాణజ్ఞులయిన ద్విజులు గాథను గానము చేసిరి. వారు మహాత్ముఁడైన దేవవవృధునియొక్క గుణములను కీర్తించిరి. దానివల్ల దూరదేశము నుండి వచ్చిన గాథలు వినినట్లే. సమీపస్థులవలే అతనిని జూచితిమి. మానవులలో బభ్రువు శ్రేష్ఠుఁడు; దేవవృథుఁడు దేవతలతో సమానుఁడు. బభ్రునివలన దేవవృధునివలన అమృతత్వమును (మోక్షమును) పొందినవారలు డెబ్బదివేలయరువదిమంది. సాత్వతవంశ్యుఁడగు మహాభోజుం డు, యజ్ఞములనాచరించిన వాఁడు, దానపతి, ధీరుండు, బ్రహ్మణ్యుఁడు, సత్యవాక్యపరిపాలకుఁడు పండితుఁడు, కీర్తిమంతుఁడు మరియు మహారథి. ఆతని వంశము చాలగొప్పది. ఆరాజులందరు భోజులు గా భువినీప్రఖ్యాతులైరి. ధృష్టికిగాంధారి, మాద్రీయనునీర్వురు భార్యలు, గాంధారికి సుమిత్రుం డుదయించెను. ఆతఁడు మిత్రానందకరుఁడు. మాది యథాచిత్తును మీడ్వంతుని అవమిత్రుని శినిని కనెను. వీరు పురుషోత్తములు (?)అనమిత్రుని సుతుఁడు నీఘ్నుఁడు. నీఘ్నునకు ఇరువురు పుత్రులు. వారు ప్రసేనుఁడు, సత్రాజిత్తును వారు మహాభాగులు.  ఆసత్రాజిత్తునకు సూర్యుఁడు ప్రాణసమ సఖుఁడయ్యెను. ఒకప్పుడు. తెల్లవారుజామున (నీశాపాయే)రథికులలోశ్రేష్ఠుఁడునయిన సత్రాజిత్తు తనరథముతో నదీతీరమున సూర్యునిగూర్చి ప్రాతరుపస్థానమొనర్ప స్నానమున కరిగెను.ఆతఁడు తనపూజ, నొనర్చుచుండ వివస్వంతుఁడయిన సూర్యుఁడు ఆతనియెదుటనీలిచెను. ఆభగవత్స్వరూపము మీక్కిలి స్పష్టముగనుండెను. జ్యోతిషాంపతియైన సూర్యునీమండలము మిక్కిలి జాజ్వల్య మానముగా కాంతివంతముగానుండెను. తన ముందు నిల్చియున్న సూర్యునితో సత్రాజిత్తిట్లనెను "ఓ జ్యోతిష్పతీ! నిన్ను ఆకాశమున నున్నవిధముగనే చూచుచున్నోను.

 తేజోముండలినం చైవ తథైవాప్యగ్రతః స్థితమ్ ।

కో విశేషో వివస్వంస్తే సఖ్యేనోపగతస్య వై ॥

 ఏతచ్ఛృత్వా స భగవాన్ మణిరత్నం స్యమంతకమ్ ।

 స్వకంఠాదపముచ్యాథ బబంధ నృపతేస్తదా ॥

 తతో విగ్రహవంతం తం దదర్శ నృపతిస్తదా ।

 ప్రీతిమానథ తం దృష్ట్వా ముహూర్తం కృతవాద్కథామ్ ॥

 తమభిప్రస్థితం భూయో వివస్వంతం స సత్రజిత్ ।

 ప్రోవాచాగ్నిసవర్ణం త్వాం యేన లోకః ప్రపశ్యతి ॥

 తదేతన్మణిరత్నం మే భగవాన్దాతుమర్హసి ।

 స్యమంతకం నామ మడిం దత్తవాంస్తస్య భాస్కరః ॥

 స తమాముచ్య నగరీం ప్రవివేశ మహీపతిః ।

 విస్మాయిత్వాథ తతః పురీమంతఃపురం యయౌ ॥

స ప్రసేనాయ తద్దివ్యం మణిరత్నం సమంతకమ్ ।

 దదౌ భ్రాత్రే నరపతిః ప్రేమ్ణా సత్రాజిదుత్తమమ్ ॥

 స్యమంతకో నామ మణిర్యస్మిన్ రాష్ట్రే స్థితో భవేత్ ।

 కామవర్షీ చ పర్జన్యో న చ వ్యాధిభయం తథా ॥

 లిప్సాం చక్రే ప్రసేనాతు మణిరత్నం స్యమంతకమ్ ।

గోవిందో న చ తం లేభే శక్తోఽపి న జిహార చ ॥

 కదాచీన్మృగయాం యాతః ప్రసేనస్తేన భూషితః ।

 స్యమంతకకృతే సీంహాద్వధం ప్రాప సుదారుణమ్ ॥

జాంబవాన్ ఋక్షరాజస్తు తం సింహం నిజఘన వై ।

 ఆదాయ చ మణిం దివ్యం స్వబిలం ప్రవివేశ హ ॥

తత్కర్మ కృష్ణస్య తతో వృష్ణ్యంధకమహత్తరాః ।

మణిం గృధ్నోస్తు మన్వానాస్తమేవ విశశంకీరే ॥

            ఆతేజో మండలముతోడనే నాముందును నిలంబడితివి. ఓవివస్వంత! స్నేహితునిగా నన్ను చేరి నప్పుడు ఏవిశేషమున్నది “అని ఆ పలుకులు భగవంతుఁడైన సూర్యుడువిని తనకంఠ భాగమునుండి మణిరత్నమయిన స్యమంతమును తీసి సత్రాజిత్తుయొక్క కంఠమున కట్టెను ఉంచెను. అంతరాజుమూర్తిమంతునిగా (విగ్రహవంతునిగా)సూర్యుని చూచెను. ఆతనినిచూచి ప్రీతిమంతుఁడై యాతనితో సత్రాజిత్తు. ఒకముహూర్తాకోలము ప్రసంగించాను. మరల బయలుదేరిన సూర్యునితో సత్రాజిత్తు భగవాన్! ఈఉత్తమమణిరత్నమును నాకొసంగగా నీకే తగినది. ప్రజలు అగ్నిసవర్ణమయిననిన్నుఈరత్నమునందే చూచెదరు” అనెను. సూర్యుఁడాతనికి సమంతకమను మణినొసంగెను. రాజుఆమణిని ధరించి,నగరమునుప్రవేశించెను. దానితో తన పట్టణమునంతటిని అంతఃపురమును ఆశ్చర్యచకితులను చేసి అంతఃపురముప్రవేశించేను? సత్రాజిత్తు ఆదివ్యమయిన మణిరత్నమయిన స్యమంతకమును ప్రేమతో సోదరుఁడయిన ప్రసేనున కొసంగెను. సమంతకమను మణీ యేరాష్ట్రమందుండునో, పర్జన్యుఁడు వలసినప్పుడు వర్షించును. వ్యాధిగాని భయముకానీ యుండదు. ఆమణిరత్నమయన సమంతకమును ప్రసేనుని నుండి.గోవిందుఁ డు అభిలాషించెను. కాని దానినీ నతఁడు పొందలేదు. గోవిందుడు శక్తిమంతుఁడయినను బలాత్కారముగా దానిని గ్రహింపలేదు. ఒకప్పుడు ప్రసేనుఁడుఆ మణినీ ధరించీ,వేటకొకరిగెను, ఆ స్యమంతకమణి కొఱకోతఁడు సింహమువలన మరణమునొందెను. ఋక్షరాజయినజాంబవంతుఁడు ఆసింహమునుచంపి ఆమణితో తన నివాసమయిన పర్వత బిలమును ప్రవేశించెను.వృష్టి అంధక వంశీయులయిన పెద్దలు, ప్రసేనునిమరణకర్మ మణినీ ఆశించిన కృష్ణునిదే యనీ తలఁచీ ఆతనినీసంశయించిరి.

మీధ్యాపవాదం తేభ్యస్తం బలవానరిసూదనః ।

అమృష్యమాణో భగవాన్వనం స విచచార హ ॥

 స తు ప్రసేనో మృగయామచరద్యత్ర చాప్యథ ।

 ప్రసేనస్య చ పదం గ్రాహ్యం పురం పౌరాప్తకారిభిః ॥

 ఋక్షవంతం గిరివరం వింధ్యం చ నగముత్తమమ్ ।

అన్వేషయన్పరిశ్రాంతః స దదర్శ మహామనాః ॥

 సాశ్వం హతం ప్రసేనం తం నావీందత్తత్ర వై మణిమ్ ।

 అథ సింహః ప్రసేనస్య శరీరస్యావిదూరతః ॥

 ఋక్షేణ నిహతో దృష్టః పదైః రృక్షస్య సూచితః ।

 పదైరన్వేషయామాస గుహామృక్షస్య యాదవః ॥

 మహత్యంతర్బిలే వాణీం శుశ్రావ ప్రమదేరితామ్ ।

 ధాత్ర్యా కుమారమాదాయ సుతం జాంబవతో ద్విజాః ।

 క్రీడయంత్యాథ మణినా మారోదీరిత్యుదీరితమ్ ॥

ధాత్యువాచ :-

ప్రసేన మవధీల్సింహః సింహో షోంబవతా హతః ॥

 సుకుమారక మారోదీస్తవ హ్యేష స్యమంతకః ।

 వ్యక్తీకృతశ్చ శబ్దః స తూర్ణం చాపి యయౌ బిలమ్ ॥

 అపశ్యచ్చ బిలాభ్యాశే ప్రసేనమవదారితమ్ ।

ప్రవిశ్య చాపి భగవాన్స ఋక్షబిలమంజసా ॥

 దదర్శ ఋక్షరాజనం జాంబవంతముదారధీః ।

యుయుధే వాసుదేవస్తు బిలే జాంబవతా సహ ॥

 బాహుభ్యామేవ గోవిందో దివసానేకవింశతిమ్ ।

 ప్రవిష్ట చ బీలం కృష్ణే వసుదేవపురస్సరాః ॥

పునర్ద్వారవతీం చైత్య హతం కృష్ణం న్యవేదయన్ ।

వాసుదేవస్తు నిర్జిత్య జాంబవంతం మహాబలమ్ ॥

            బలవంతుఁడు, అరిసూదనుఁడు భగవంతుఁడగు కృష్ణుఁడు వారివలని మిధ్యాపవాధమును భరింపలేక ప్రసేనవృత్తాంతముగ్రహింప అరణ్యమున వెదకుచు సంచరించెను. తనకు ఆప్తులయిన కొందరు పురజనులతో ప్రసేనుడెచ్చట మృగయార్థము (వేటకొఱకు) తీరిగెనో, ఎందు ప్రసేనుని కాలిఅడుగులజాడగలదో అయరణ్యమున గోవిందుడు తిరిగి చూచెను.భల్లూకములుగలిగిన కొండను వింధ్యపర్వతమును వెదకుచు అలసిపోయి ఆమహామనీషి అశ్వముతో కూడ హతుఁడైన ప్రసేనుని చూచెను, కానీఆమణినందు పొందలేక పోయెను. ప్రసేనునీయొక్కకళేబరమున కనతి దూరములో సింహము(ఋక్షేణ భల్లూకముచే చంపఁబడుటచూచెను. ఆమహాఋక్షముయొక్క అడుగులచే సూచీత మయినవాడననుసరించి కృష్ణుఁడు అన్వేషింప ఋక్షరాజుయొక్క గుహ సమీపమున కరిగెను. ఆ పెద్దగుహాంతరమునుండి స్త్రీలే నాడబడుపలుకులను నతఁడు వీనేను. ఆధాత్రి(పనికత్తె). జాంబవంతునీయొక్కబొడ్డతో ఆమణితోకూడనాడు చుండెను. ఆమె మారోదీః! ఏడువకుము అని పల్కుచుండెను, ధాత్రి ఇట్లనెను. సింహము ప్రసేనునీ చంపెను. సింహమును జాంబవంతుఁడు చంపెను. ఓఅందాలబరిణా ! ఏడువకుము, ఆ స్యమంతకము నీదయినది”. ఆ పదములు సుస్పష్టముగ నుండెను. ఆతఁడు వెంటనే గుహలోని కరిగెను. ఆ బిలముయొక్క సమీపమున ప్రసేనుని శరీరఖండములను నతఁడు చూచెను. వెంటనే ఋక్షరాజు బీలమున కృష్ణుఁడు ప్రవేశించెను. ఉదారధీ యైన కృష్ణుఁడు, ఋక్షరాజయిన జాంబవంతుని చూచెను. ఆజాంబవంతునితో బిలమునందు బాహువులతో ఇరువదియొక్క దినములు వాసుదేవుఁడు యుద్ధముచేసెను. కృష్ణుఁడు బీలముప్రవేశింపగా, వాసుదేవునితో ఆరణ్యమునకువచ్చిన వారు ద్వారవతికి తిరిగివెడలిరి. “కృష్ణుఁడు మరణించె”నని నివేదించిరి. వాసుదేవుండు మహాబలవంతుం డైన జాంబవంతునీ జయించి.

 లేభే జాంబవతీం కన్యాం ఋక్షరాజస్య సమ్మతామ్ ।

 భగవతేజసా గ్రస్తో జాంబవాన్ ప్రసభం మణిమ్ ॥

 సుతాం జాంబవతీమాశు విష్వక్సేనాయ దత్తవాన్ ।

మణిం సమంతకం చైవ జగ్రాహాత్మవిశుద్ధయే ॥

 అనునీయరక్షరాజం తం నిర్యయౌ చ తదా బిలాత్ ।

 ఏవం చ మణిమాహృత్య విశోధ్యాత్మానమాత్మనా ॥

దద్రౌ సత్రాజితే రత్నం మణిం సాత్వతసన్నిధౌ ।

 కన్యాం పునర్జాంబవతీమువాహ మధుసూదనః ॥

 తస్మాన్మిధ్యాభిశాపాత్తు వ్యశుద్యన్ మధుసూదనః ।

ఇమాం మిథ్యాభిశప్తిం యః కృష్ణస్యేహ వ్యపోహితామ్ ॥

 వేద మిథ్యాభిశప్తిం స నాభిస్పృశతి కర్హిచిత్ ।

 దశత్వాసన్సత్రజీతో భార్యాస్తస్యాయుతం సుతాః ॥

 ఖ్యాతిమంతస్త్రయస్తేషాం భంగకారస్తు పూర్వజః ।

వీరో వాతపతిశ్చైవ తపస్వీ చ బహుప్రియః ॥

 అథ వీరమతీ నామ భంగకారస్య తు ప్రసూః ।

 సుషువే సా కుమారీస్తు తిస్రో రూపగుణాన్వితాః ॥

సత్యభామోత్తమా స్త్రీణాం ప్రతినీచ దృఢవ్రతా ।

 తథా తపస్వినీ చైవ పితా కృష్ణాయ తాం దదౌ ॥

న చ సత్రాజితః కృష్ణో మణిరత్నం స్యమంతకమ్ ।

అదత్త తదుపశ్రుత్య భోజేన శతధన్వనా ॥

 తథాహి ప్రార్థయామాస సత్యభామామనిందితామ్ ।

 అక్రూరో ధనమస్వచ్ఛన్మణిం చైవ స్యంతకమ్ ॥

సత్రాజితం తతో హత్వా శతధన్వా మహాబలః ।

 రాత్రౌ తం మణిమాదాయ తతోఽక్రూరాయ దత్తవాన్ ॥

ఆతని నెమ్మికూతురయిన జాంబవతిని పొందెను. భగవంతుఁడైన కృష్ణునితేజస్సుచే నభిభూతుఁడయి జాంబవంతుఁడు వెంటనే మణిని పుత్రికామణియైన జాంబవతిని విష్వక్సేనునకు (కృష్ణునకు)ఇచ్చెను. ఆత్మవిశుద్ధీకోఆకు మణిని సమంతకమణిని కృష్ణుఁడు గ్రహించెను. భల్లూకరాజును తృప్తిపరచి ఆబిలమునుండివెలుపలికిబయలుదేరెను. ఈ విధముగామీథ్యాపవాదమునుండి మధుసూదనుఁడు పరిశుద్ధుఁడయ్యెను. ఎవ్వడీకృష్ణుని మిధ్యాపవాదమును తెలిసికొనునోఆతఁడెన్నడును మిథ్యాపవాదములకు లోనుగాఁడు. సత్రాజిత్తునకు పదిమంది భార్యలు,పదివేలమంది కుమారులు కలరు. వారిలో ముగ్గురు కీర్తిమంతులు వారిలో పెద్దవాఁడు. భంగకారుఁడు; వాతపతిమహావీరుఁడు; తపస్వి అందరికినీబహుప్రీయుం డు. భంగకారునీ తల్లి వీరమతి ఆమెకుముగ్గురుకుమార్తెలు. వారురూపగుణాన్వితలు. సత్యభామస్త్రీలలోనుత్తమురాలు, ఆమె ప్రతీనీ వ్రతముల యందుదృఢనీష్ఠ గలిగినది. ఆమెపవిత్రురాలు తపస్వినీ ఆమేనాతనితండ్రీకృష్ణునకిచ్చి వివాహమాచరించెను. కృష్ణుఁడుసత్రాజిత్తునుండీ మణిరత్నమైన స్యమంతమును గ్రహింపలేదు. (అక్రూరుఁడు ధనమోహమున. ఆ స్యమంతకమణిని అభిలషించెను) భోజవంశీయుఁడైన శతధన్వుఁడు. అనీంగీత శీలయైన సత్యభామను మణి నొసంగుమనీకోరెను. మహాబలుఁడయిన శతధన్వుఁడు తరువాత సత్రాజిత్తుని రాత్రివేళ చంపి, రత్నమును తీసికొనిపోయి అక్రూరునకొసంగెను.

 అక్రూరస్తు తదా రత్నమాదాయ స నరర్షభః ।

సమయం కారయాంచక్రే బోధ్యో నాన్యస్య చేత్యుత ॥

 వయమభ్యుపయోత్స్యామః కృష్ణేనత్వాం ప్రధర్షితమ్ ।

 మమవై ద్వారకా సర్వా వశే తిష్ఠత్యసంశయమ్ ॥

 హతే పితరి దుఃఖార్తా సత్యభామా యశస్వినీ।

  ప్రయయౌ రథమారుహ్య నగరం వారణావతమ్ ॥

 సత్యభామా తు తద్వృత్తం భోజస్య శతధన్వనః ।

 భర్తుర్నివేద్య దుఃఖార్తా పార్వస్థాశ్రూణ్యవర్తయత్ ॥

 పాండవానాం తు దగ్దానాం హరిః కృత్వోదక క్రియామ్ ।

కల్యార్దే చైవ భ్రాతృణాం న్యయోజయత సాత్యకిమ్ ॥

తతస్త్వరితమాగత్య ద్వారకాం మధుసూదనః ।

 పూర్వజం హలీనం శ్రీమానిదం వచనమబ్రవీత్ ॥

హతః ప్రసేనః సింహేన సత్రాజిచ్ఛతధన్వనా ।

 స్యమంతకో మార్గణీయస్తస్య ప్రభురహం ప్రభో ॥

 తదారోహ రథం శీఘ్రం భోజం హత్వా మహాబలమ్ ।

 స్యమంతకం మహాబాహో సామాన్యం.వో భవిష్యతి ॥

తతః ప్రవృత్తే యుద్ధే తు తుములే భోజకృష్ణయోః ।

శతధన్వా తమక్రూరమవైక్షత్సర్వతోదిశమ్ ॥

 అనాలబ్ధావహారౌ తు కృత్వా భోజజనార్ధనౌ ।

శక్తోఽపి శాఠ్యాద్ధార్ధిక్యో నాక్రూరోఽ భ్యుపద్యత ॥

ఉపయాతే తతో బుద్ధిం భూయశ్చక్రే భయాన్వీతః ।

యోజనానాం శతం సాగ్రం హృదయా ప్రత్యపద్యత ॥

 విఖ్యాతా హృదయా నామ శతయోజనగామీనీ ।

భోజస్య బడబా దివ్యా యయా కృష్ణమయోధయత్ ॥

 క్షీణాం జవేన హృదయామధ్వనః శతయోజనే ।

 దృష్ట్వా రధస్య తాం వృద్ధిం శతధన్వా సముద్రవత్ ॥

 పురుష శ్రేష్ఠుఁడయిన అక్రూరుఁడు ఆ రత్నముగ్రహించి శతధన్వునితో నొకసమయమును చేసికొనెను. ఈ విషయమితరులకెవ్వరికిని తెలియరాదు. దానివలన ధనము మనమీర్వురముపయోగించుకొందము. ఒకవేళ కృష్ణునిచే నీవు చంపఁబడిన, ద్వారకయంతయు నిస్సంశయముగా నా వశము నందుండగలదు” అనీ. తండ్రి చంపఁబడగా యశస్వినియైన సత్యభామ, రథమారోహణముచేసి వారణావతమున కరిగెను. సత్యభామ తన తండ్రియొక్క వధాదికమయిన దుఃఖవార్తను భోజుఁడయిన శతధన్వునీ వృత్తాంతమును. తన భర్తకు నెఱింగించెను. దుఃఖార్తయే యాతని పార్శ్వముననుండి కన్నీరుకార్చెను. లక్షాగృహమున దగ్గులైన పాండవులకు కృష్ణుఁడు ఉదకక్రియలాచరించి, సాత్యకినీ సోదరులయొక్క కళ్యాణార్థము నీయోగించెను. అంత, మధుసూదనుఁడు వెంటనే ద్వారకకు వచ్చి తనయన్నగారయినబలరామునితో ఇట్లుచెప్పెను. ప్రసేనుని సింహము చంపెను. శతధన్వుఁడు సత్రాజిత్తును చంపెను. స్యమంతకమణిని వెదుకవలెను, ఓ సోదరా! దాని అధికారిని 'నేను. అందుచే, వెంటనే రథము నారోహంచి, మహాబలుఁడయిన భోజుని చంపిన ఓ మహాబాహో ! స్యమంతకమణీ మనకు సామాన్యమయినదగును” అనెను. అంత భోజకృష్ణుల మధ్య తుముల మయినయుద్ధమయ్యెను. అక్రూరుని కొఱకు శతధన్వుఁడు ఎల్లవైపులను చూచెను. కృష్ణభోజులకు మధ్య యెట్టి సంధినీ చేయకయే శక్తిమంతుఁడైనను అక్రూరుఁడు శాఠ్యముచే అచ్చటకు చేరలేదు(?) శతధన్వుఁడు భయాన్వితుఁడయ్యెను, అతఁడు. అందుండి పోవందలంచెను (హృదయ శతధన్వునీఅశ్వము) తన అశ్వమయిన ‘హృదయ’పై 100 యోజనములు పరువెత్తెను. శతయోజనగామిని అని పేరు పొందినదాతని “హృదయ”యను గుఱ్ఱము. అదియొక (బడబ)దివ్యాశ్వము, కృష్ణునితో నతఁడు యుద్ధము చేసెను.

తతస్తస్యా హయాయాస్తు శ్రమాత్ఖేదాచ్చ వై ద్విజాః ।

సముత్పేతురథ ప్రాణాః కృష్ణో రామమథాబ్రవీత్ ॥

 తిష్టస్వేహ మహాబాహో దృష్టదోషా మయా హయా ।

 పద్భ్యాం గత్వా హరిష్యామీ మణిరత్నం స్యమంతకమ్ ॥

 పద్భ్యామేవ తతో గత్వా శతధన్వానమచ్యుతః ।

 మిథిలోపవనే తం వై జఘాన పరమాస్త్రవిత్ ॥

 స్యమంతకం న చాపశ్యర్ధత్వా భోజం మహాబలమ్ ।

 నిర్వృతం చాబ్రవీత్కృష్ణం రత్నం దేహీతి లాంగలీ ॥

 నాస్తితి కృష్ణశ్చోవాచ తతో రామో రుషాన్వితః ।

ధిక్ శబ్దపూర్వమసకృత్ప్రుత్యువాచ జనార్ధనమ్ ॥

 భ్రాతృత్వాన్మర్షయామ్యేష స్వస్తి తేస్తు ప్రజామ్యహమ్ ।

 కృత్యం న మే ద్వారకయా న త్వయా న చ వృష్ణిభిః ॥

 ప్రవివేశ తతో రామో మిధిలామరిమర్దనః ।

సర్వకామైరుపహృతైర్మైధిలేనైవ పూజితః ॥

 ఏతస్మిన్నేవ కాలే తు బబ్రుర్మతిమతాం వరః ।

 నానారూపాన్ క్రతూన్ సర్వానాజహార నిరర్గలాన్ ॥

 దీక్షామయం స కవచం రక్షార్థం స వివేశ హ ।

 సమంతకకృతే ప్రాజ్ఞో గాందినీజో మహామనాః ॥

 అక్రూర యజ్ఞా ఇతి తే ఖ్యాతాస్తస్య మహాత్మనః ।

బహ్వన్నదక్షిణాః సర్వే సర్వకామప్రదాయినః ॥

 అథ దుర్యోధనో రాజా గత్వాఽథ మిథిలాం ప్రభుః ।

 గదశిక్షాం తతో దివ్యాం బలభద్రాదవాప్తవాన్ ॥

ప్రయాణించి తొందరగా శతయోజనముల దూరము 'హృదయ' అశ్వము అలసిపోవుట గమనించి, శతధన్వుడు రథమును వీడి పరుగిడ మొదలిడెను.. అంత ఆగుఱ్ఱము యొక్క ప్రాణములు శ్రమచేతను, బాధచేతను ఓబ్రాహ్మణులారా ! ఆకాశమును చేరెను. అప్పుడు కృష్ణుఁడు రామునితో నిట్లనెను. “హేమహాబాహో ! ఇచ్చట ఆగుము. ఈ గుఱ్ఱము నందు ఏదియో దోషమున్నట్లగుపించుచున్నది. నడచిపోయి మణిరత్నమైన సమంతకమును హరించెదను. “పరమాస్త్రవీదుఁడు అచ్యుతుఁడు నడచిపోయి శతధన్వుని మిథిలోపవనమున చంపెను. ఆతని కడ నతఁడు స్యమంతకమును చూడలేదు.మహాబలుఁడయిన భోజుని చంపి కృష్ణుఁడు వచ్చిన తరువాత, “రత్నము నాకిమ్ము” అని బలరాముడనెను. 'లేద' ని కృష్ణుఁడనెను. అంతబలరాముఁడు రోషాన్వితుఁడై ధిక్ 'ఛీ' యని పలుసార్లని కృష్ణునితో నిట్లనెను “నీవు సోదరుడవగుట నీ దోషమును క్షమించితినీ. నీకు స్వస్తి యగుగాక నేను పోవుచున్నాను. ఇంక నాకు ద్వారకతోగాని, నీతోగాని వృష్టికులజులతో గాని ఏపనీయులేదు”. అని, అరిమర్ధనుడయిన రాముఁడు మిథిలప్రవేశించెను. సర్వకాంక్షితములతో కానుకలతో రాముఁడు. మిథిలాప్రభువుచే పూజింపఁబడెను. ఆసమయముననే మతిమంతులలో శ్రేషుఁడయిన (బభ్రువు)అక్రూరుఁడు. నానారూపములయినక్రతువులను అనేకములను నిరర్గళుండై యొనరించెను. ప్రాజ్ఞుఁడు, మహాత్ముఁడు గాందినీసుతుఁడయిన అక్రూరుఁడు, దీక్షామయకవచమును రక్షార్థము వహించెను. ఆ మహాత్ముని యజ్ఞములు అక్రూరయజ్ఞములని ఖ్యాతి వహించెను. ఆ యజ్ఞములలో బహ్వన్నము, దక్షిణలు అధికము. అందు కోరిన డెల్ల నీ యబడినది. అంత రాజయిన దుర్యోధనుఁడు మిథిలానగరమున కరిగి దివ్యమయిన గద, శిక్షను బలభద్రుని వలన పొందెను.

 ప్రసాద్య తు తతో రామో వృష్ణ్యంధకమహారథైః ।

 ఆనీతో ద్వారకామేవ కృష్ణేన చ మహాత్మనా ॥

 అక్రూరశ్చాంధకైః సార్ధమథాయాత్పురుషర్షభః ।

 యుద్దే హత్వా తు శత్రుఘ్నం సహ బంధుమతా బలీ ॥

 సుయజ్ఞతనయాయాం తు నరాయాం నరసత్తమౌ ।

 భంగకారస్య తనయా విశ్రుతౌ సుమహాబలౌ ॥

 జజ్ఞాతేంఽధకముఖ్యస్య శక్రఘ్నో భంధుమాంశ్చ తౌ।

 వధే చ భంగకారస్య కృష్ణో న ప్రీతిమానభూత్ ॥

 జ్ఞాతిభేదభయాద్భీతస్తముపేక్షితవానథ ।

అపయాతే తతోఽ క్రూరే నావర్షాత్పకశాసనః ॥

 అనావృష్ట్యా హతం రాష్ట్రమభవద్భహుధా యతః ।

 తతః ప్రసాదయామాసురక్రూరం కకురాంధకాః ॥

 పునర్ద్వారపతీం ప్రాప్తి తదా దానపతా తథా ।

ప్రవవర్ష సహస్రాక్షః కుక్షౌ జలనిధేస్తతః ॥

 కన్యాం వై వాసుదేవాయ స్వసారం శీలసమ్మతామ్ ।

 అక్రూరః ప్రదదౌ శ్రీమాన్ప్రీత్యర్థం మునిపుంగవాః ॥

 అథ జిజ్ఞాయ యోగేన కృష్ణో బభ్రుగతం మణిమ్ ।

 సభామధ్యే తదా ప్రాహ తమక్రూరం జనార్దనః ॥

 యత్రద్రత్నం మణివరం తవ హస్తగతం ప్రభో ।

తత్ప్రయచ్ఛ స్వమానార్హ మయి మానార్యకం కృథాః ॥

 షష్టివర్షగతే కాలే యద్రోషోఽభూత్తదా మమ ।

సుసంరూఢోఽ సకృత్ర్పాప్తస్తదా కాలాత్యయో మహాన్ ॥

తతః కృష్ణస్య వచనాత్సర్వసాత్వత సంసది ।

 ప్రదదౌ తం మణిం బభ్రురక్లేశేన మహామతిః ॥

రాముఁడు తరువాత ప్రసన్నుడయ్యెను.మహారథులయినవృష్ఠంధక వీరులతో కృష్ణుడు బలరాముని ద్వారకకు తీసికొనివచ్చెను. పురుషర్షధం డయిన అక్రూరుఁడు అంధకులతో సహితుడై యుద్ధమున శత్రుఘ్నుని బంధుమంతునితో సార్థము చంపి ద్వారకకువచ్చేను. సుయజ్ఞ తనయ యయిన 'నర' యందు భంగకారునకు విశ్రుతులు, సుమహాబలులు నరసత్తములుఅయిన శత్రుఘ్న బంధుమంతులు పుట్టిరి.. బంధకారునీవధవలన కృష్ణుఁడు ప్రీతిమంతుఁడుకాలేదు. (అంధకవంశమునముఖ్యుడు భంగకారుఁడు). జాతిభేద భయమున భీతినొంది కృష్ణుఁడు అక్రూరునీ ఉపేక్షించెను. అక్రూరుఁడు ద్వారకనుండి (సమంతకమణితో) వెడలిపోవ, ఇంద్రుఁడు వర్షింపమానెను. అనావృష్టి వలన రాష్ట్రము బహుధా బాధపడెను. అంత కుకురాంధకులు అక్రూరునీ ప్రసన్నుని చేసిరి. దానపతియయినఅక్రూరుఁడు ద్వారకకు తిరిగిరాగా, సహస్రాక్షుఁడయిన యింద్రుఁడు తనహృదయమందున జలధీ నుండీ పుష్కలముగావర్షించేను. ఓ మునిపుంగవులారా!. అక్రూరుఁడు శ్రీకృష్ణుని ప్రీతికొలకు,శీలసమ్మత మైన తనతోబుట్టువును.వాసుదేవునకొసంగెను. అంత అక్రూరుని యందు స్యమంతక మణి యున్నదనిగ్రహించి జనార్ద నుఁడు అక్రూరునితో సభామధ్యమున“మణిశ్రేష్ఠమయిన యే రత్నము నీహస్తగతమయియున్నదో దానిని నాకిమ్ము నాయందు అనార్యమయిన దేనిని ఆచరింపకుము. అరువది సంవత్సరములు గడచినవి. నాయందప్పుడు సంరూఢమయి ఏదోషమున్నదో అది అనేకపర్యాయములు నీవొనరించిన యసత్కార్యములవలన,నున్నది చాలకాలమునిగిపోయినది”అనెను, అంతసర్వ సాత్వత సభలో కృష్ణునియొక్క పలుకుల వలన, మహామతియైన అక్రూరుఁడు బాధారహితముగ మనస్సులోనే క్లేశమొందక మణినీ కృష్ణునీ కొసంగెను. అంత అరిందముఁడైన కృష్ణుఁడు బభ్రు(అక్రూరుని) హస్తములనుండి ఆర్జవప్రాప్తమైన మణిని గ్రహించి సంహృష్టమనస్కుడై, సంతుష్టుఁడై అక్రూరునకు మరల దానిని కృష్ణుం డొసంగెను.

తతస్తమార్జవప్రాప్తం బభ్రోర్హస్తాదరిందమః ।

 దదౌ హృష్టమనాస్తుష్టస్తం మణింబభ్రతే పునః ॥

 సకృష్ణహస్తాత్సంప్రాప్య మణిరత్నం స్యమంతకమ్ ।

 అబద్ధ్య గాందినీపుత్రో విరరాజాంశుమానివ ॥

 ఇమాం మిథ్యాభిశప్తిం యో విశుద్ధిమపి చోత్తమామ్ ।

 వేద మిథ్యాభిశప్తిం యో విశుద్ధిమపి చోత్తమామ్ ॥

 అనమిత్రాచ్ఛినిర్జజ్ఞే కనిష్టాదృష్టినందనాత్ ।

 సత్యవాన్ సత్యసంపన్నః సత్యకస్తస్య చాత్మజః ॥

 సాత్యకిర్యుయుధానశ్చ తస్య భూతిః సుతోఽభవత్ ।

 భూతేర్యుగంధరః పుత్ర ఇతి భౌత్యః ప్రకీర్తితః ॥

 మాడ్యః సుతస్య జజ్ఞే తు సుతో వృష్ణిర్భుధాజితః ।

జజ్ఞాతే తనయౌ వృష్ణేః శ్వఫల్కశ్చిత్రకశ్చ యః ॥

 శ్వఫల్కస్తు మహారాజో ధర్మాత్మా యత్ర వర్తతే ।

 నాస్తి వ్యాధిభయం తత్ర నచా వృష్టభయం తథా ॥

 కదా చిత్కాశీరాజస్య విభోస్తు ద్విజసత్తమాః ।

 త్రీణి విషయాడి విషయే నావర్షత్పాకశాపనః ॥

స తత్ర వాసయామాస శ్వఫల్కం పరమార్చితమ్ ।

 శ్వఫల్కపరివాసేన ప్రావర్షత్పాకశాసనః ॥

శ్వఫల్మ కాశీరాజస్య సుతాం భార్యామవిందత ।

 గాందినీం నామ గాం సాహి దదౌ విప్రాయ నిత్యశః ॥

 సా మాకురుదరస్థా వైబహూన్ వర్షశతాన్కిల ।

 నివసంతీ న వై జజ్ఞే గర్భస్తాం తాం పితాఽబ్రవీత్ ॥

 జయస్వ శీఘ్రం భద్రం తే కిమర్థం వాపి తిష్ఠసి ।

ప్రోవాచ వైవం గర్భస్థా సా కన్యా గాం దినే దినే ॥

 మణిరత్నమయిన యాస్యమంతకమును కృష్ణుని హస్తమునుండి పొంది అక్రూరుఁడు దానిని ధరించి సూర్యునివలె ప్రకాశించెను. విశుద్దము ఉత్తమమునయిన యీ మిథ్యాభిశప్తికమైన వృత్తాంతమును ఎవ్వఁడెఱుంగునో, తెలిసికొనునో) ఆతఁడు మీథ్యాపవాదము నెన్నడును పొందఁడు. వృష్టియొక్క కనిష్ఠ కుమారుఁడయిన అవమిత్రునకు 'సీని'జన్మించెను. అతని కుమారుఁడు సత్యకుఁడు ఆతఁడు సత్యవంతుఁడు, 'సత్యసంపన్నుఁడు. సత్యకునకు కలిగినవాడు యుయుధానుఁడు ఆతనికి భూతి కుమారుడు భూతికుమారుఁడు యుగంధరుఁడు ఆతఁడు భౌత్యుఁడుగా ప్రశస్తిబడసెను. వృష్టి యుధాజిత్తుకుమారుఁడు. యుథాజిత్తు మాడియొక్కసుతుఁడు, శ్వఫల్క్యుడు,చిత్రకుఁడును సృష్టియొక్క కుమారద్వయము. ధర్మాత్ముఁడయిన శ్వఫల్కుండేటనుండునోఅనావృష్టిభయముగాని, వ్యాధిభయముగాని యందు లేదు, ఓబ్రాహ్మణులారా! ఒకప్పుడు ఇంద్రుఁడు,శక్తిమంతుఁడయిన కాశిరాజుయొక్క దేశమున మూఁడుసంవత్సరములు వర్షింపలేదు. కాశీరాజు శ్వఫలుని చక్కగా పూజించి కాశీ యందు నివసింపఁజేసెను, శ్వఫలునీయునికిచే ఇంద్రుఁడందు వర్షించేను.శ్వఫల్కుడు కాశీరాజుయొక్క సుతను భార్యగా పొందెను. ఆమెపేరు - గాందిని, ఆమెప్రతిదినమొక గోవును బ్రాహ్మణునకుదానముచేసెను. ఆగాందిని ఆమెల్లిగర్భమున పెక్కువందల లేండ్లుండిపోయేనని చెప్పుదురు. ఆమబయటికి రాలేదు. ఆమెగర్భమునందుండగనే ఆమెతోతండ్రీ“ నీకు భద్రమగాక,వెంటనేపుట్టుము. ఎందులకీనందుండెదవు" అనెను, గర్భస్థయైన యాకన్య ఇట్లు పలికెను.” నీవు ప్రతిదినము నోక గోవు నోసంగినచో మూడేండ్లలో నేను దయించెదను.” అనెను. ఆమె తండ్రి ‘యట్లే' యనెను. ఆమె కోరికను పరిపూర్తిచేసెను.

  యది దద్యాస్తతో గర్భాద్బహిః స్యాం హాయనైస్త్రిభిః ।

తథేత్యువాచ శాం తస్యాః పితా కామమపూరయత్ ॥

 దాతా యజ్వా చ శూరశ్చ శ్రుతవానతిధిప్రియః ।

 తస్యాః పుత్రః స్మృతోఽ క్రూరః శ్వాఫల్కో భూరీదక్షిణః ॥

 ఉపమంగుస్తథా మంగుర్మృ దురశ్చారిమేజయః ।

గిరిరక్షస్తతో యక్ష, శత్రుఘ్నోఽథారిమర్దనః ॥

ధర్మవృద్ధః సుకర్మా చ గంధమాదస్తథాపరః ।

ఆవాహప్రతీవాహౌ చ వసుదేవా వరాంగనా ॥

 అక్రూరాధౌగ్రసేన్యాం తు సుతౌ ధ్వౌ కులనందనౌ ।

 దేవవానుపదేవశ్చ బజ్ఞాతే దేవసన్నిధౌ॥

 చిత్రకస్యాభవన్ పుత్రాః పృథుర్వీపృథురేవ చ ।

 అశ్వగ్రీవోఽ శ్వవాహశ్చ సుపార్వకగవేషజౌ ॥

 అరిష్టనేమిరశ్వాస్యః సువర్మా వర్మభృత్తథా ।

అభూమిర్బహుభూమిశ్చ శ్రవిష్టాశ్రవణే స్త్రీయౌ ॥

 సత్యకాత్కాశీదుహితో లేభే యా చతురః సుతాన్ ।

 కుకురం భజమానం చ శుచీం కంబలబర్షిషమ్ ॥

 కకురస్య సుతో వృష్టిః వృష్ణేస్తు తనయోభవత్ ।

కపోతరోమా తస్యాథ విలోమాఽవిభవదాత్మజః ॥

 తస్యాసేత్తుంబురుసఖా విద్వాన్పుత్రోఽధకః కిల ।

 ఖ్యాయతే యస్య నామాన్యచందనోదకదుందుభిః ॥

 తస్యాభిజిత్తతః పుత్ర ఉత్పన్నస్తు పునర్వసుః ।

 అశ్వమేధం తు పుత్రార్థమాజహార నరోత్తమః ॥

 తస్య మధ్యేఽతిరాత్రస్య సదోమధ్యాత్సముచ్చ్రితః ।

 తతస్తు విద్వాన్ ధర్మజ్ఞో దాతా యజ్వా పునర్వసుః ॥

శ్వఫల్కుని వలన ఆమె కుమారుఁడు అక్రూరుఁడు. ఆతఁడు దాత, యజ శూరుఁడు, వేదవిద్వాంస్తుడు అతిథిప్రియుఁడు (వీరుకాక ఆమె కీతర సంతతి కూడ కలదు). ఉపమండు, మంగుడు, మృదురుడు, అరీమేజయుండు గిరిరక్షుఁడు యక్షుడు, శత్రుఘ్నుడు, అరీమర్ధనుడు, ధర్మవృద్ధుడు సుకర్ముడు, గంధమాదుడు ఆవాహుఁడు మఱియు ప్రతివాహుఁడు, వసుదేవ అమెవరాంగన, అక్రూరెగ్రసేనిలకు ఇరువురు కుమారులు. వారు వంశదీపకులు. దేవసన్నిభులు, వారు దేవవంతుఁడు, అనుపదేవుఁడును, చిత్రకునకు 10 మంది కుమారులు - పృథువు, వీపృథువు, అశ్వగ్రీవుఁడు, అశ్వవాహుఁడు, సుపార్శ్వకుఁడు, గవేషణుఁడు, అరిష్టనేమి, అశ్వాస్యుఁడు, సువర్మ, వర్మభృత్ అభూమీ బహుభూమి. శ్రవిష్ణ శ్రావణులు అను నలుగురు కుమార్తెలు. కాశీరాజుకూతురు నలురుకుమారులకనెను. వారు కుకురుఁడు, భజమానుఁడు, శుచి, కంబలబర్లీషుడు. కుకురుని కుమారుడు వృత్తి, వృష్టియొక్కతనయుఁడు కపోతరోముఁడు విలోముఁడు కపోతరోముని కొమరుఁడు. రోమకుని కుమారుఁడు అధకుఁడు. ఇతఁడు తుంబురుసఖుఁడు; విద్వాంసుఁడును. ఇతనికీ చందనోదకదుందుభి అనీవేరొకనామము. ఇదికూడ ప్రసిద్ధము. ఆతని కుమారుఁడు అభిజిత్తు; అభిజిత్తు కుమారుఁడు పునర్వసువు ఈ మహారాజు (అభిజిత్తు) పుత్రార్థము అశ్వమేధ మాచరించెను. ఆ యాగము జరుగుచుండ అతిరాత్రమాచరించుచుండ, సభామధ్యమున పునర్వసు ఉదయించెను. ఆకారణమున పునర్వసు విద్వాంసుఁడు,ధర్మజ్ఞుం డు, దాత, యజ్వయయ్యెను. తరువాత అభిజిత్తునకు మటియిద్దరు కొమరులు కలిగిరీ.

తస్యాథ పుత్త్రమిథునం బభూవాభిజితః కిల ।

 ఆహుకశ్చాహుకీ చైవ ఖ్యాతౌ మతిమతాం వరౌ ॥

ఇమాం చోదాహరంత్యత్ర శ్లోకాన్ప్రతి తమాహుకమ్ ।

సోపాసంగానుకర్షాణాం సధ్వజానాం వరూధినామ్ ॥

 రథినాం మేఘఘోషాణాం సహస్రాణి దశైవ తు ।

 నాసత్యవాదీ చాసీత్తు నాయజ్ఞో నాసహస్రదః ॥

 సాశుచిర్నాప్యధర్మాత్మా నావిద్వాన్న కృశోఽభవత్ ।

ఆర్ద్రకస్య ధృతిః పుత్ర ఇత్యేవమనుశుశ్రుమ ॥

 స తేన పరివారేణ కిశోరప్రతీమాన్ హయాన్ ।

ఆశీతిమశ్వనీయుతాన్యాహుకోఽ ప్రతిమో వ్రజన్ ॥

 పూర్వస్యాం దిశి నాగానాం భోజస్య త్వతిభావయన్ ।

రూప్యకాంచనకక్షాణాం సహస్రాణ్యేకవింశతిః ॥

 తావంత్యేవ సహస్రాణి ఉత్తరస్యాం తథా దిశి ।

 భూమిపాలస్య భోజస్య ఉత్తిష్ఠేత్కింకణీ కిల ॥

 ఆహుకశ్చాప్యవంతీషు స్వసారం త్వాహుకీం దదౌ ।

 ఆహుకాత్కాశ్యదుహితుర్ద్వౌపుత్రా సంబభూవతుః ॥

 దేవకశ్చోగ్రసేనశ్చ దేవగర్భసమావుభూ ।

దేవకస్య సుతా వీరా జజ్ఞిరే త్రిదశోపమాః ॥

 దేవవానుపదేవశ్చ సుదేవో దేవరక్షితః ।

 తేషాం స్వసారః సప్తాఽసన్వసుదేవాయ తా దదౌ ॥

 ధృతదేవోపదేవా చ తథాన్యా దేవరక్షితా ।

 శ్రీదేవా శాంతిదేవా చ సహదేవా తథాపరా ॥

 సప్తమీ దేవకీ తాసాం సానుజా చారుదర్శనా ।

నవోగ్రసేనస్య సుతాః కంసస్తేషాం తు పూర్వజః ॥

 న్యగ్రోధశ్చ సునామా చ కంకశంకుసుభూమయః ।

 సుతనూ రాష్ట్రపాలశ్చ యుద్దతుష్టశ్చ తుష్టిమాన్ ॥

 వారిరువురు ఆహుకుఁడు, ఆహుతియు. ప్రసిద్ధులు. శ్రేష్ఠులు మతిమంతులు. ఆహుకుని గూర్చి యీ క్రింది శ్లోకము నుదహరించెదరు“ఆతని దశ సహస్ర సంఖ్యల రథములు మేఘఘోషాన్వితములు కలవు. అయ్యప్ ఉపసంగములతో (అమ్ముల పొదులతో) అనుపసంగములతో (యాక్సిలేటర్స్), ధ్వజములతో, వరూధములతో, ఉపపన్నములై యున్నవి. ఆతనీ రాజ్యములో అసత్యవాదులు లేరు. యజ్ఞము లాచరింపనీవారు లేరు; వేలాది నాణెములను దానముగా నొసంగని వారు లేరు. అశుచిమంతుఁడు, అధర్మాత్ముండు, అవిద్వాంసుఁడు, కృశీభూతుఁడు కానీ లేం డు. ఆర్ధకుని పుత్రుఁడు ధృతి, (ఆర్ధకుడు ఆధుకుఁడు కావచ్చు?) అని విందుము  ఆహుకుఁడు తనపరివారముతో, ఎనుబది లక్షల కిశోర సన్నిభములయిన హయములతో, అప్రతిముఁడై తూర్పుదేశాభిముఖముగా దండయాత్ర కరిగెను. అంతీయసంఖ్యఏనుగుల బలముగల భోజుని -అతిశయించెను. ఈదండయాత్రలో ఏనుగుల బంధించుటకు అతఁడు బంగారముతో వెండితో చేయబడిన, ఇరువది యొక్క వేయి (బంగారు) తాళ్లను పొందెను. ఉత్తరిదిగ్విజయయాత్రలో భోజునివలన ఇరువదియొక వేయి ఏనుగుల ఘంటలను గొనెను. తన్మూలమున ఆతని యాత్ర కింకిణీ ధ్వనియుతమయ్యెను.  ఆహుకుఁడు తన సోదరియైన ఆహుకినీ అవంతీ యువరాజునకు వివాహమున నొసంగెను. కాశీ రాజు కూతునకు ఆహుకునకు ఇరువురు పుత్రులు పుట్టిరి.వారు దేవకుఁడు, ఉగ్రసేనుఁడు. వారుభయులు దేవగర్భసమానులు. దేవతలతో నుపమింపఁదగిన వీరులైన కుమారులు దేవకునకు కలిగిరి. వారు దేవవంతుఁడు, ఉపదేవుఁడు, సుదేవుఁడు, దేవరక్షితుఁడును. వారికి ఏడుగురుచెల్లెండ్రు వారిని వసుదేవునకిచ్చి వివాహముచేసిరి. వారు - ధృతదేవ, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవ, శాంతిదేవ, సహదేవ - వారి యందరిలో చిన్నదీ దేవకి. ఆమె చారుదర్శన, ఉగ్రసేనునకు తొమ్మండ్రు కుమారులు. వారిలో పెద్ద కంసుఁడు. పైవారు కంసుని చెల్లెండ్రు - న్యగ్రోధ, సునామా, కంకా, శంకు, సుభూమి, సుతను, రాష్ట్రపాల, యుద్ధతుష్ట తుష్టిమంతుడు పుత్రులు.

 తేషాం స్వసారః పంచైవ కంసా కంసవతీ తథా ।

సుతనూ రాష్ట్రపాలీ చ కంకా చైవ వరాంగనా ॥

 ఉగ్రసేనో మహాపత్యో వ్యాఖ్యాతః కుకురోద్భవః ।

కుకురాణామిమం వంశం ధారయన్నమీతౌజసామ్ ॥

 ఆత్మనో విపులం వంశం ప్రజావాంశ్చ భవేన్నరః ।

భజమానస్య పుత్రస్తు రథముభ్యో విదూరథః ॥

 రాజాధిదేవః శూరశ్చ విదూరథసుతోఽభవత్ ।

 తస్య శూరస్య తు సుతా జజ్ఞిరే బలవత్తరాః ॥

 వాతశ్చైవ నీవాతశ్చ శోణితః శ్వేతవాహనః ।

 శమీ చ గదవర్మా చ నీదాంతః ఖలు శత్రుజిత్ ॥

 శమీపుత్రః ప్రతిక్షత్రః ప్రతిక్షత్రస్య చాత్మజః ।

 స్వయంభోజ: స్వయంభోజార్దృదికః సంబభూవ హ ॥

 హృదికస్య సుతాస్త్వాసన్ దశ, భీమ పరాక్రమాః ।

కృతవర్మాగ్రజస్తేషాం శతధన్వా తు మధ్యమః ॥

 దేవబాహుస్సుబహుశ్చ భిషక్ శ్వేతరథశ్చయః ।

 సుదాంతశ్చాధిదాంతశ్చ కనకః కనకోద్భవః ॥

 దేవవాహోస్సుతో విద్వాన్ జజ్ఞే కంబలబరిషః ।

 అసమౌజాః సుతస్తస్య సుసమౌజాశ్చ విశ్రుతః ॥

అజాతపుత్రాయ తతః ప్రదదావసమౌజసే ।

సుచంద్రం వసురూపం చ కృష్ణ ఇత్యంధకాః స్మృతిః ॥

 అంధకానామిమం వంశం కీర్తయేద్యస్తు నిత్యశః ।

ఆత్మనో విపులం వంశం లభతే నాత్ర సంశయః ॥

అశ్మక్యాం జనయామాస శూరం వై దేవమీధుషమ్ ।

 మారిష్యాం జజ్ఞిరే శూరోద్భోజాయాం పురుషా దశ ॥

వారికి చెల్లెండ్రు ఐదుగురు. కంస, కంసవతీ, సుతనూ, రాష్ట్రపాలీ, కంకా ఉగ్రసేనునకు చాలసంతతి. అందుచే కుకురోద్భవమయిన వంశము వర్ణింపఁబడినది. తేజస్వంతులయిన కుకురుల యొక్క యీ వంశమును. నెంగినవారు విపులమైన స్వీయవంశమును ప్రజలను (బిడ్డలను) కలిగియుందురు. భజమానుని పుత్రుఁడు విదూరథుఁడు. ఇతఁడు రథికులలో ముఖ్యుడు. శూరుఁడు విదూరథుని కొమరుం డు అతఁడు రాజాధిరాజయ్యను. శూరునకు బలవత్తరులయిన కుమారులు గలిగిరి. వారు చాతుఁడు, నివాతుఁడు, శోణితుఁడు, శ్వేతవాహనుఁ డు, శమి, గదవర్మ, నీదాంతుఁడు; ఇతఁడు శత్రుజిత్తు, శమీపుత్రుఁడు, ప్రతిక్షత్రుఁడు. ప్రతిక్షత్రుని కుమారుఁడు స్వయంభోజుఁడు. హృదికు డు స్వయంభోజుని కుమారుఁడు హృదీకునీ కుమారులు పదిమంది, వారు భీమపరాక్రములు.వారిలో జ్యేష్ణుఁడు కృతవర్మ. శతధన్వుడు వారీలోమధ్యముఁడు మరియితరులు-దేవబాహువు, సబాహువు, భిషక్, శ్వేతరథుఁడు; సుధాంతుడు, అధింతుఁడు, నకుఁడు, కనకోద్భవుఁడు దేవబాహువునకు కంబలబర్టీ కుమారుడు అతఁడు విద్వాంసుఁడు, అసమౌజసుఁడు ఆతనికుమారుఁడు వేడొకసుతుఁడు సుసమౌజుండు. అతఁడు మిక్కిలి ప్రఖ్యాతుఁడు. పుత్రులు కలుగని అసమజుసునకు, కృష్ణుఁడు సుచంద్రుని వసురూపుని కుమారులుగా నొసంగెను. ఆ విధముగా అంధకులు సంస్మరింపఁబడిరి.  అంధకుల యొక్క యీ వంశమును నిత్యము కీర్తించిన, వారు తమకు విపులమయిన. వంశమును పొందుదురు. సంశయములేదు. అశ్మకి యందు శూరుడు దేవమీఢునీ కనెను. శూరునివలన మారిషి యందు పదిమంది పుత్రులు పుట్టిరి. పూరిషి భోజవంశమునకు చెందినది. పుట్టర్, మారిషి భజవంశమునకు చెందినది.

వసుదేవో మహాబాహుః పూర్వమానకదుందుభిః ।

జజ్ఞేతస్య ప్రసూతస్య దుందుభిః ప్రాణదద్దివి ॥

ఆనకానాం చ సంహ్రదః సుమహానభవద్దివి ।

 పపాత పుష్పవర్షం చ శరస్య భవనే మహత్ ॥

 మనుష్యలోకే కృత్నోఽపి రూపే నాస్తి స భువి ।

యస్యాసీత్పురుషాగ్ర్యస్య కాంతీశ్చంద్రసమో యథా ॥

 దేవభాగస్తతో జజ్ఞే తతో దేవశ్రవాః పునః ।

 అనాధృష్టీర్వృకశ్చైవ నందనశ్చైవ సృంజయః ॥

 శ్యామః శమీకో గండూషః స్వసారస్తు వరాంగనాః ।

 పృథాచ శ్రుతదేవా చ శ్రుతకీర్తిః శ్రుతశ్రవాః ॥

 రాజాధిదేవీ చ తథా పంచైతా వీరమాతరః ।

పృథాం ధుహితరం శూరః కుంతిభోజాయ వై దదౌ ॥

తస్మాత్సాతు స్మృతా కుంతీ కుంతిభోజాత్మజా పృథా ।

కురువీరః పాండుముఖ్యస్తస్మాద్భార్యామవిందత ॥

 పృథా జజ్ఞే తతః పుత్రాంస్త్రీనగ్నిసమతేజసః ।

 లోకేఽ ప్రతిరథాన్వీరాఞ్చక్రతుల్యపరాక్రమాన్ ॥

 ధర్మాద్యుధిష్ఠిరం పుత్రం మారుతాచ్చ వృకోదరమ్ ।

 ఇంద్రాద్ధనంజయం చైవ పృధా పుత్రానజీజనత్ ॥

 మాద్రవర్యాం తు జనితావశ్వనావితీ విశ్రుతమ్ ।

 నకుల సహదేవశ్చరూపసత్త్వగుణాన్వితా ॥

 జజ్ఞే తు శ్రుతదేవాయాం తనయో వృద్ధశర్మణః ।

 కరూషాధిపతేర్వేరో దంతవక్త్రో మహాబలః ॥

 కైకయాచ్చ్రుతికీర్త్యాం తు జజ్ఞే సంతర్దనో బలీ ।

 చేకితానబృహత్క్షాత్రౌ తథైవాన్యౌ మహాబలౌ ॥

ముందుగా మహాబాహులైన వసుదేవుఁడు పుట్టెను. ఈతఁడు ఆనకదుందుభిగా ప్రసిద్ధుఁడు. ఏలయన ఆతఁడు పుట్టినప్పుడు ఆనకముల మహాధ్వానము ఆకసమున మ్రోగేను. మషుష్యలోకమునందంతటను ఆతనితో రూపసౌందర్యమున సమానుఁడు లేడు. ఆతని (ఆ పురుషాగ్రేసరుని). కాంతి చంద్రసమముగ నుండెను. ఆతని నుండీ తరువాత క్రమముగా దేవభాగుఁడు, దేవశ్రవసుఁడు, అనాధృష్టి, వృకుఁడు, నందకుం డు, సృంజయుఁడు, శ్యాముఁడు, శమీకుఁడు, గండూషుఁడును జనించిరి. ఐదుగురు వరాంగనలు చేల్లెండ్రు. వారు పృథా, శ్రుతదేవా, శ్రుతికీర్తి, శ్రుతశ్రవ, రాజాధిదేవీ. ఈ యైదుగురు వీరమాతలు. శూరుడు తనకుమార్తెయయినప్పథను, కుంతి భోజునకు నొసంగెను. అందుచేతనే కుంతి కుంతిభోజాత్మజగా పృథగా స్మరింపఁబడు చున్నది. కురువీరుఁడయిన పాండుముఖ్యుండు ఆమెను భార్యగా పొందెను. తరువాత పృథ అగ్నిసమ. తేజస్వులయిన మువ్వురు పుత్రులను కనెను. యముని వలన (ధర్మునివలన) యుధిష్ఠిరుని, వాయువు వలన వృకోదరనీ, ఇంద్రుని వలన ధనంజయుని పుత్రులుగా బడసెను, మాద్రవతి వలన అశ్వనీదేవతలుదయించిరని విశ్రుతీ, పోరు నకులుఁడు, సహదేవుఁడును; వారు రూపసత్త్వ గుణాన్వితులు. శ్రుతదేవయందు వృద్ధశర్మ కుమారుఁడు. అతడు కరూషాధిపతికి వీరుఁడు మహాబలుఁడైన దంతవక్రుఁడు. శ్రుతికీర్తియందు కైకయప్రభువు సంతర్దనుని కనెను, ఆతఁడు బలవంతుఁడు. అట్లే ఇంకొక జంట చేకితాన భృహక్షత్రులు మహాబలురు పుట్టిరి.

 విందానువిందోహవంత్యౌ భ్రాతరౌ సుమహాబలౌ ।

శ్రుతశ్రవాయాం చైద్యస్తు శిశుపాలో బభూవ హ ॥

దమఘోషస్య రాజర్షేః పుత్రో విఖ్యాతపౌరుషః ।

 యః పురా స దశగ్రీవః సంబభూవారిమర్ధనః ॥

 వైశ్రవణానుజస్తస్య కుంభకర్ణోఽనుజస్తథా ।

పత్న్యస్తు వసుదేవస్య త్రయోదశ వరాంగనాః ॥

పౌరవీ రోహిణీ చైవ మదిరా చాపరా తథా ।

తథైవ భద్రవైశాఖీ సునామ్నీ పంచమీ తథా ॥

 సహదేవా శాంతిదేవా శ్రీదేవా దేవరక్షితా ।

 ధృతదేవోపదేవా చ దేవకీ సప్తమీ తథా ॥

 సుగంధా వనరాజీ చ ద్వే చాన్యే పరిచారికే ।

రోహిణీ పౌరవీ చైవ బాహ్లీకస్యానుజాఽభవత్ ॥

 జ్యేష్ఠా పత్నీ మహాభాగదయితాఽఽ నకదుఃదుభేః ।

 జ్యేష్టం లేభే సుతం రామం సారణం హి శఠం తథా ॥

దుర్దమం దమనం శుభ్రం పిండారకకుశీతకౌ ।

చిత్రాం నామ కుమారీం చ రోహిణ్యష్టౌ వ్యజాయత ॥

 పుత్రౌ రామస్య జజ్ఞాతే విజ్ఞాతా నిశఠోల్ముకౌ ।

పార్శ్వీచ పార్శ్వమర్దీ చ శీశుః సత్యధృతిస్తథా ॥

 మందబాహ్యోఽథ రామాణాం గిరికో గిరిదేవ చ ।

 శుల్కగుల్మోఽతిగుల్మశ్చ దరిద్రాంతక ఏవ చ ॥

 కుమార్యశ్చాపి పంచాన్యా నామతస్తా నిబోధత ।

అర్చిష్మతీ సునందా చ సురసా సువచాస్తథా ॥

 తథా శతబలా చైవ సారణస్య సుతాస్త్విమాః ।

భద్రాశ్వో భద్రగుప్తిశ్చ భద్రవిష్టస్తథైవ చ ॥

మహాబలురయిన విందానువిందులు సోదరులు. అవంతిప్రభువునకు పుట్టిరి (రాజాధిదేవికి కుమారులుగా). చేది. ప్రభువయిన శిశుపాలుం డు శ్రుతశ్రవకు రాజర్పియునైన వీఖ్యాత పౌరుషుఁడు దమఘోషునకు పుట్టెను. అతని శౌర్యము సుప్రఖ్యాతము. పూర్వమీతఁడు దశశిరస్కుడయిన రావణుఁడు. ఆ రావణుఁడు అరిమర్ధనుఁడు ఆతఁడు (రావణుఁడు) వైశ్రవణుని యొక్క అనుజుఁడు కుంభకర్ణుఁడీతనియనుజుఁడు వసుదేవునకు పదుమువ్వురు పత్నులు. వారువరాంగనలు. వారు- పౌరవి, రోహిణి, మదిర, భద్ర, వైశాఖీ (ఐదవది) సుమానిని (తరువాత) సహదేవ, శాంతిదేవ, శ్రీదేవ దేవరక్షిత ధృతదేవ ఉపదేవ, దేవకి (ఏడవది) వీరు ఆతని (వసుదేవుని భార్యలే). సుగంధ, వనరాజి పరిచారికలయిన ఇరువురు కన్యలు ఆతనికీభార్యలయిరి. రోహిణి పౌరవిలు బాప్తీకునచెల్లెండ్రు,మహాభాగయైన రోహిణీ ఆనకదుందుభియొక్క జ్యేష్ఠపత్ని. రోహిణీ రాముని, సారణుని, : శరుని, దుర్గముని, దమనుని, శుక్రుని, పిండారకుని, కుశీతకుని కనెను. అంతీయేకాక, చిత్రయనునట్టి కుమారీకను రోహిణీ కనెను.నిశరుఁడు,ఉల్ముకుఁ . డు,రామునిప్రసిద్దకుమారులు, అట్లే, పార్వి,పార్వమర్ధి, శిశు,సత్య,ధృతి. మందబాహుడుఅనువారుకూడ రాముని కుమారులు. గిరిక,గిరి, శుల్క గుల, అతిగుల,దరిద్రాంతక -అనువారు సారణునికుమారులు. సారణునకు ఐదుగురు కూతులు కూడ కలరు. వారినామముల నేఱుంగుఁ డు.వారు అర్చిష్మతి, సునంద, సురసా, సువచా, శతబలా, వీరు సారణుని కూతుండ్రు భద్రా, భద్రగుప్తుడు,భద్రవిష్ణుడు భద్రబాహువు, భద్రరథుఁ డు భద్రకల్పుఁడు,సుపార్వకుఁడు, కీర్తిమంతుఁడు రోహితాశ్వుఁడు. అనువారు శరుని కుమారులు.

భద్రబాహుర్భద్రరథో భద్రకల్పస్తథైవ చ ।

 సుపార్శ్వకః కీర్తిమాంశ్చ రోహితాశ్వః శఠాత్మజాః ॥

 దుర్మదస్యాభిభూతశ్చ రోహిణ్యాః కులజాః స్మృతాః ।

నందోపనందౌ మీత్రశ్చ కుక్షిమిత్రస్తథా బలః ॥

 చిత్రోపచిత్రౌ కృతకస్తుష్టిః పుష్టిరథాపరః ।

మదీరాయాః సుతా ఏతే వసుదేవాద్విజజ్ఞీరే ॥

 ఉపబింబోఽథ బింబశ్చ సత్త్వదంతమహౌజసౌ ।

చత్వార ఏతే విఖ్యాతాః భద్రాపుత్రా మహాబలాః ॥

వైశాల్యామదధాచ్చౌరిః పుత్రం కౌశికముత్తమమ్ ।

 దేవక్యాం జజ్ఞిరే సౌరేః సుషేణ: కీర్తిమానవీ ॥

 ఉదర్షిర్భద్రసేనశ్చ ఋజుదాయశ్చ పంచమః ।

షష్ఠో హి భద్రదేవశ్చ కంసః సర్వాన్ జఘాన తాన్ ॥

 అథ తస్యామవస్తాయాం ఆయుష్మాన్ సంబభూవ హ ।

 లోకనాథః పునర్విష్ణుః పూర్వం కృష్ణః ప్రజాపతిః ॥

 అనుజాతాఽభవత్కృష్ణాతుభద్రా భద్రభాషిణీ ।

 కృష్ణా సుభద్రేతి పునర్వాఖ్యాతా వృష్టినందినీ ॥

సుభద్రాయాం రథీ పార్థాదభిమన్యురజాయత ।

వసుదేవస్య భార్యాసు మహాభాగాసు సప్తసు ॥

 యే పుత్రా జజ్ఞిరే శూరా నామతస్తాన్నిబోధత ।

 పూర్వాద్యాః సహదేవాయాం శూరాద్వై జజ్ఞిరే సుతాః ॥

 శాంతిదేవా జనస్తష్బంబం శౌరేర్జజ్ఞే కులోద్వహమ్ ।

అగావహో మహాత్మా చ వృకదేవ్యా మజయాయత ॥

 శ్రీదేవాయాం స్వయం జజ్ఞే మందకో నామ నామతః ।

ఉపాసంగం వసుం చాపి తనయౌ దేవరక్షితా(తా) ॥

దుర్మదుని కుమారుఁడు అభీభూతుఁడు. వీరందరు రోహిణి యొక్క కులజులుగా ప్రసిద్దులు. నందుఁడు, ఉపనందుఁడు, మిత్రుఁడు, కుక్షీమిత్రుడు బలుఁడు, చిత్రుఁడు, ఉపచిత్రుఁడు, కృతకుఁడు, తుష్టి, పుష్టి-వీరందరు మదిరయొక్క కుమారులు. వారు మదిరకు వసుదేవుని వలన కలిగిరి. బింబుఁడు, ఉపబింబుఁడు, సత్త్వదంతుఁడు, మహౌజసుఁడు- వీరు నల్వురు మహాబలులుగా విఖ్యాతలు. అంతియేకాక భద్రయొక్క  పుత్రులుగా ప్రసిద్ధులు. వైశాలి యందు వసుదేవునకు (శౌరి) ఉత్తముఁడయిన కౌశికుని కనెను. శారికి (వసుదేవునకు) దేవకి, వలన సుషేణుఁ డు, కీర్తిమంతుఁడు ఉదర్శీ, భద్రసేనుఁడు పంచముఁడు ఋజుదాయుఁడు, భద్రదేవుఁడు - అను ఆర్గురు పుట్టిరి. వారినందరను కుంసుఁడు చంపెను. ఇట్టి యవస్థ యందు లోకనాథుఁడయిన విష్ణువు ఆయుష్మంతుడగు కృష్ణుండుగా మరల నొకమారు పుట్టెను. ఆమె తరువాత భద్రభాషిణియైన సుభద్ర కలిగెను. వృష్టివంశ నందనీయైన యీమె కృష్ణా సుభద్రయనీ ఖ్యాతిపొందెను. మహారథియైన యభిమన్యుఁ - డు సుభద్రకు పార్థునీవలనఁగలిగెను. వసుదేవునిభార్యలు మహాభాగలునైన ఏడుగురియందు, శూరులయిన వారెవ్వరు జన్మించిరో వారిని గూర్చి తెలిసికొనుము. పూర్వుఁడు - మతి యితరులు, సహదేవుని కుమారులుగా వసుదేవునకు జన్మించిరి. శాంతి దేవుఁడు, శౌరి వంశోద్వహుఁడైన. జనస్తంభుని కనెను. వృకదేవి యందు మహాత్ముడయిన ఆగావహుఁడుదయించెను. శ్రీదేవికి మందకుఁడను కుమారుఁదయించెను. ఉపసంగుఁ, డు, వాసువు అను ఇరువురు పుత్రులను దేవరక్షితుఁడు కనెను, వీరు మొత్తము పదిమంది పుత్రులు. కంసుఁడు వీరిని కూడ చంపించెను.

 ఏవం దశ సురాస్తస్య కంసస్తానప్యఘాతయత్ ।

విజయం రోచనం చైవ వర్ధమానం చ దేవలమ్ ॥

  ఏతాన్మహాత్మనః పుత్రాన్ సుషావ శిశిరావతీ ।

సప్తమీ దేవకీ పుత్రం సునామానమసూయత ॥

గవేషణం మహాభాగం సంగ్రామే చిత్రయోధినమ్ ।

 శ్రాద్ధదేవ్యాం పురోద్యానే వనే తు విచరన్ద్విజాః ॥

 వైశ్యాయామదధాచ్ఛౌరిః పుత్రం కౌశికమవ్యయమ్ ।

సుగంధీ వనరాజీ చ శౌరేరాస్తాం పరిగ్రహౌ ॥

 పుండ్రశ్చ కపిలశ్చైవ సుగంధ్యాశ్చాత్మజౌ తు తౌ।

 తయో రాజాభవత్పుండ్రః కపిలస్తు వనం యయౌ ॥

 అన్యస్యామభవద్వీరో వసుదేవాత్మజో బలీ ।

జరా నామ నిషాదోఽసౌ ప్రథమః సధనుర్ధరః ॥

 విఖ్యాతో దేవభాగ్యస్య మహాభాగః సుతోభవత్ ।

 పండితానాం మతం ప్రాహుర్దేవశ్రవసముద్భవమ్ ॥

 అశ్మక్యాం లభతే పుత్రమనాధృష్టిర్యశస్వినమ్ ।

 నివృత్తశత్రుం శత్రుఘ్నం శ్రాద్ధదేవం మహాబలమ్ ॥

 వ్యజాయత శ్రాద్ధదేవో నైషాదిర్యః పరిశ్రుతః ।

 ఏకలవ్యో మహాభాగో నిషాదైః పరివర్ధితః ॥

 గండూషాయాసపత్యాయ కృష్ణస్తుష్టోఽదదాత్సుతౌ ।

 చారుదేష్ణం చ సాంబం చ కృతాస్త్రౌశస్తలక్షణౌ ॥

 రంతిశ్చ రంతిపాలశ్చ ద్వౌ పుత్రౌ నందనస్య చ ।

 వృకాయ వై త్వపుత్రాయ వసుదేవః ప్రతాపవాన్ ॥

సౌమిం దదౌ సుతం వీరం శౌరిః కౌశికమేవ చ ।

సృంజయస్య ధనుశ్చైవ విరజాశ్చ సుతావిమౌ ॥

శిశిరావతి, విజయుఁడు, రోచనుఁడు, వర్ధమానుఁడు, దేవలుఁడు అను మహాత్ములను పుత్రులనుగా కనెను. ఏడవభార్య దేవకి మహాభాగం - డు సునాముఁడునయిన గవేషణునీ కనెను, ఆతఁడు యుద్ధములయందు విచిత్రశక్తిగల యోధుడు. ఓ బ్రాహ్మణులారా ! పూర్వమున పురోద్యానముల సంచరించుచు వసుదేవుఁడు వైశ్య యందు శ్రద్దాదేవిని, అవ్యయుఁడయిన కుశీకుఁడను పుత్రుని కనెను. సుగంధియు, వనరాణియుకూడ శారియొక్క భార్యలు. పుండ్రుఁడు కపిలుఁడు సుగంధి కుమారులు. వీరిరువురిలో పుండ్రుఁడు రాజయ్యేను. కపిలుఁడు . వనమున కరిగెను. వసుదేవునకు వేతాక స్త్రీ యందు వీరుఁడు బలవంతుఁడు నయిన కుమారుండుదయించెను. ఆతఁడు నిషాదుఁడు," ఆతనికి జరుఁడని నామకరణము చేయబడెను. ఆతఁడు ధనుర్ధరులలో నగ్రేసరుఁడు. విఖ్యాతుఁడయిన. మహాభాగుఁడు దేవభాగ్యుని యొక్క సుతుఁడు. దేవశ్రవసు వలన కలిగిన కుమారుని పండిత గౌరవనీయునిగా దలంచిరి. అనాదృష్టి అశ్మకి యందు వీరుడయిన శ్రాద్ధదేవుడను పుత్రుని కనెను. ఆతఁడు. యశస్వి. ఆతఁడు నీవృత్త శత్రుఁడు. శత్రువులఁ జంపినవాఁడు. మహాబలుఁడును. మహాభాగుండయిన ఏకలవ్యుఁడు శ్రాద్ధ దేవునకు జనించెను. ఈతఁడు నిషాదులచే (పెంపు) పరివర్ణింపఁబడెను. అందుచేనతఁడునైషాది యయ్యెను. కృష్ణుఁడు తన కుమారులయిన చారుదేష్ణుని, సాంబుని, సంతానములేని గండూషాషునకు దత్తతగా నొసంగెను. సాంబచారుదేషులు అస్త్రశస్త్ర విద్యలయందారితేరినవారు. రంతి, రంతిపాలుఁడు నందనుని పుత్రద్వయము. ప్రతాపవంతుఁడైన వసుదేవుఁడు అపుత్రుఁడయిన వృకునకు, వీరుఁడైన సౌమీనిని ప్రతాపవంతుఁడైన కౌశికుని పుత్రులుగా నొసంగును. ధనుఁడు వీరజసుఁడు సృంజయుని యొక్క కుమారులు. శ్యామునకు పిల్లలు లేరు.

అనపత్యోఽ భవచ్చ్యామః శమీకస్తు వనం యయౌ ।

 జుగుప్పమానో భోజత్వం రాజర్షిత్వమవాప్తవాన్ ॥

 య ఇదం జన్మ కృష్ణస్య పఠతే నియతవ్రతః ।

 శ్రావయేద్భ్రాహ్మణం వాఽపి సమహత్సుఖమవాప్నుయాత్ ॥

  దేవదేవో మహాతేజాః పూర్వం కృష్ణః ప్రజాపతిః ।

విహారార్థం మనుష్యేషు జజ్ఞే నారాయణః ప్రభుః ॥

 దేవక్యాం వసుదేవేన తపసా పుష్కరేక్షణః ।

చతుర్బాహుస్తు సంజజ్ఞే దివ్యరూపశ్రీయాన్వితః ॥

 ప్రకాశ్యో భగవాన్ యోగీ కృష్ణో మానుషతాం గతః ।

 అవ్యక్తి వ్యక్తలింగశ్చ స ఏవ భగవాన్ ప్రభుః ॥

నారాయణో యతశ్చక్రే వ్యయం చైవావ్యయం హి యత్ ।

దేవో నారాయణో భూత్వా హరిదాసీత్సనాతనః ॥

 యోశిoఽబుజాచ్ఛాదిపురుషం పురా చక్రే ప్రజాపతిమ్ ।

 అదితేరపి పుత్రత్వమేత్య యాదవనందనః ॥

 దేవో విష్ణురితి ఖ్యాతః శక్రాదవరజోఽ భవత్ ।

 ప్రాసాదయన్యం చ విభుం హ్యదిత్యాః పుత్రకారణే ॥

 వధార్థం సురశత్రూణాం దైత్యదానవరక్షసామ్ ।

 యయాతివంశజస్యాథ వసుదేవస్య ధీమతః ॥

 కులం పుణ్యం యతో జన్మ భేజే నారాయణః ప్రభుః ।

సాగరాః సమకంపంత చేలుశ్చ ధరణీధరాః ॥

 జజ్వలుస్త్వగ్నిహోత్రాణి జాయమానే జనార్దనే ।

శివాశ్చ ప్రవవు ర్వాతః ప్రశాంతమభవద్రజః ॥

 జ్యోతీంష్యభ్యధికం రేజుర్జాయమానే జనార్దనే ।

 అభిజిన్నామ నక్షత్రం జయంతీ నామ శర్వరీ ॥

ముహూర్తో విజయో నామ యత్ర జాతో జనార్దనః ।

 అవ్యక్తః శాశ్వతః కృష్ణో హరిర్నారాయణః ప్రభుః ॥

 శమీకుడు భోజ వంశ్యమున పుట్టిన తన్ను కలంకునిగా తలంచుకొని రోజర్షిత్వము వహించి యరణ్యమునకరిగెను, నియమపూర్వకముగ ఎవ్వరీ కృష్ణుని జన్మను గూర్చి చదివెదరో, లేదా బ్రాహ్మణునిచే చదివించెదరో, వారు మహాసుఖమును పొందుదురు. దేవదేవుఁడు, మహాతేజుఁడు, ప్రజాసృష్టికర్త యైన కృష్ణుఁడు మనుష్యులయందు విహరింపగోరి తానుదయించెను ఆతఁడేనారాయణుఁడు, పుష్కరేక్షణుఁడైన, ప్రభువు వసుదేవునకు దేవకియందు, చతుర్బాహువులతో దివ్యరూపశ్రీతోగూడి, వారి తపః ఫలమున, భగవంతుడు యోగియునైన కృష్ణుఁడు మానుషత్వమును పొంది ప్రకటీకృతుఁడయ్యెను. ఆ భగవంతుఁడయిన ప్రభువు, అవ్యక్తుఁడు వ్యక్తిలింగుడును. అవ్యయుఁడు అయిన యతఁడు వ్యయునిగా వారాయణుఁడయ్యెను. సనాతనుఁడు. అయిన హరి నారాయణుఁడయి దేవుఁడయ్యెను. పూర్వమతఁడే ప్రజాపతిగా పద్మయోనినీ సృజించెను. అదితికి పుత్రుఁడయి, యాదవ నందనుఁడు విష్ణువుగా ఖ్యాతినిగనీ ఇంద్రునకు అవరజుఁ (సోదరుఁడయ్యెను. దేవతలందరు అదితికి పుత్రుఁడుగా నుద్భవించిన విష్ణుని ప్రసన్నునిచేసికొనిరి. (ప్రార్థించిరి). యయాతి వంశీయుఁడు ధీమంతుఁడునయిన వసుదేవునకు సురశత్రువులయిన దైత్య దానవ రాక్షసులను వధించుటకు నారాయణుఁడు జన్మను చెందెను. వసుదేవుని కులము నారాయణుని జన్మతోపుణ్యవంతమయ్యెను. జనార్దనుఁడదయించెగా సముద్రములు కంపించినవి. పర్వతములు కదలాడినవి. (203) అగ్నిహోత్రములు ప్రజ్వలించినవి. నారాయణుఁడు జన్మించెను. మంగళకరములయిన వాయువులు వీచినవీ, భూరజస్సు అణఁగి ప్రశాంతమైనది. (204) ఆకాశమున జ్యోతిశ్చక్రమత్యంతముగా ప్రకాశించినది. జనార్దనుడు దయించినదీ అభిజిన్నామనక్షత్రమున. ఆనాటిరాత్రి జయం జయంతి అను పేరుగలది. ముహూర్తము విజయము. అవ్యక్తుఁడు, శాశ్వతుఁడు కృష్ణుఁడు హరి నారాయణప్రభువు.

జజ్ఞే తథైవ భగవాన్ మాయయా మోహయన్ ప్రజాః ।

 ఆకాశాత్పుష్పవృష్టిం చ వవర్ష త్రిదశేశ్వరః ॥

 గీర్భిర్మంగళయుక్తాభిస్తువంతో మధుసూదనమ్ ।

మహర్షయః సగంధర్వా ఉపతస్థుః సహస్రశః ॥

వసుదేవస్తు తం రాత్రౌ జాతం పుత్రమధోక్షజమ్ ।

 శ్రీవత్సలక్షణం దృష్ట్వా హృది దివ్యైః స్వలక్షణైః ॥

 ఉవాచ వసుదేవస్తం రూపం సంహర వై ప్రభో ।

 భీతోఽహం కంసతస్తాత తస్మాదేవం బ్రవీమ్యహమ్ ॥

మమ పుత్రా హతాస్తేన జ్యేష్ఠాస్తేఽ ద్భుత దర్శనాః ।

 వసుదేవ వచః శ్రుత్వా రూపం సంహృతవాన్ ప్రభుః ॥

 అనుజ్ఞాతః పితా త్వేనం నందగోపగృహం నయత్ ।

 ఉగ్రసేనగృహేఽతిష్ఠద్యశోదాయై తదా దదౌ ॥

 తుల్యకాలం తు గర్భిణ్యౌ యశోదా దేవకీ తథా ।

యశోదా నందగోపస్య పత్నీ సా నందగోపతేః ॥

 యామేవ రజనీం కృష్ణో జజ్ఞే వృష్ఠికులే ప్రభుః ।

 తామేవ రజనీం కన్యా యశోదాయాం వ్యజాయత ॥

 తం జాతం రక్షమాణస్తు వసుదేవో మహాయశాః ।

ప్రాదాత్పుత్త్రం యశోదాయై కన్యాం తు జగృహే స్వయమ్ ॥

దత్త్వేమం నందగోపస్య రక్షేమమితి చాబ్రవీత్ ।

సుతస్తే సర్వకళ్యాణో యాదవానాం భవిష్యతి ॥

 అయం స గర్భో దేవక్యా మమ క్లేశాన్ హరిష్యతి ।

 ఉగ్రసేనాత్మజాయాథ కన్యామానకదుందుభిః ॥

 నీవేదయామాస తదా కన్యేతి శుభలక్షణా ।

స్వసుస్తు తనయం కంసో జాతం నైవావధారయత్ ॥

ప్రజలను మాయచే మోహపరచుచు నారాయణుడుద్భవించేను. ఇంద్రుఁడు ఆకాశమునుండి పుష్పవరమును కురిపించెను. మంగళ యుక్తములయినవాక్కులచే మహరులు గంధర్వులతోకూడి సహస్రసంఖ్యలో మధుసూదనుని స్తోత్రము చేయుచుండిరి. ఆరాత్రి పుత్రుఁడుగా పుట్టిన శ్రీవత్సలక్షణుఁడైన అధోక్షజుని దివ్యములయిన లక్షణములతోచూచీ హృదయములో వసుదేవుఁడు “ప్రభో ! నీ రూపమునుపసంహరింపుము. ఓ తండ్రీ ! కంసుని వలన భయపడితిని అందుచే ఇట్లు చెప్పుచుంటిని. ముందుగా పుట్టిన అద్భుత దర్శనులు జ్యేష్ఠులునయిన సౌతనయులు అతనిచే చంపఁబడిరి” అనెను. వసుదేవుని వాక్కులు వినీ ప్రభువు తన రూపమునుపసంహరించుకొనెను. ఆతనిచే అనుజ్ఞాతుఁడై తండ్రియైన వసుదేవుఁడతనినీ నందగోపుని గృహమునకు తీసికొనిపోయెను. నందుఁడు ఉగ్రసేన గృహమందుండెను. అప్పుడు యశోదకు కృష్ణుని నిచ్చెను. యశోదయు. దేవకియు ఒకే సమయమున గర్భిణులయిరి. యశోద నందగోపవ్రజమున కధిపతీ యయిన నందునీభార్య. వృష్ఠికులమున నే రాత్రి ప్రభువయినకృష్ణుఁడు జన్మించెనో ఆరాత్రియందే కన్య యశోదకుజన్మించెను. మహాయశస్వి వసుదేవుఁడు పుట్టి నఆబిడ్డను రక్షించుచు,యశోదకాపుత్రునొసంగే తాను కన్యను గ్రహించెను. ఆబిడ్డను. ఇచ్చి, ఈ బిడ్డను రక్షింపుమనీ నందగోపునితో పలికెను. నీ కుమారుఁడు యాదవులకు సర్వకళ్యాణదుఁడు కాగలఁడు. ఇతఁడు దేవకీబిడ్డ. నాయొక్క దేవకియొక్క క్లేశములను తోలగించును. అంత ఆనకదుందుభియగు వసుదేవుఁడు ఉగ్రసేనకుమారుఁడయిన కంసునకు శుభలక్షణ కన్య ఉదయించినదని నివేదించెను, తన సోదరికి కుమారుఁ: డు పుట్టెనని కంసుఁడెఱుంగఁడు, దుష్టాత్ముడైన కంసుఁడు ఆబిడ్డను వసుదేవునకు సంతోషముగా నొసంగి -

అథ తామపిదుష్టాత్మా హ్యుత్ససర్ణ ముదాన్వీతః ।

తవైషాహి యథా కన్యా తథా మమ న సంశయః ।

 నహన్మీమాం మహాబాహో వ్రజత్వేషా యథారుచి ॥

 కన్యా సా వవృధే తత్ర వృష్ణిసద్మని పూజితా ।

 పుత్రవత్సాలయామాస దేవీ దేవీం ముదా తదా ॥

 తమేవం విధినోత్పన్నమాహుః కృష్ణం ప్రజాపతిమ్ ।

 ఏకాదశా తు జజ్ఞే వై రక్షార్థం కేశవస్య హ ॥

 ఏతాం చైకాగ్రమనసః పూజయిష్యంతి యాదవాః ।

 దేవదేవో దివ్యవపుః కృష్ణః సంరక్షితోఽనయా ॥

 ఋషయః ఊచుః :-

కిమర్ధం వసుదేవస్య భోజ: కంసో నరాధిపః ।

జఘాన పుత్రాన్ బాలాన్వై తన్నో వ్యాఖ్యాతుమర్హసి ॥

సూత ఉవాచ :-

శృణుధ్వం వై యథా కంసః పుత్రానానకదుందుభేః ।

 జాతాజ్ఞాతాంస్తు తాన్ సర్వాన్నిషిపేష వృథామతిః ॥

 భయాద్యథా మహాబాహో జాతః కృష్ణో వివాసితః ।

 యథా చ గోషు గోవిందః సంవృద్ధః పురుషోత్తమః ॥

ఉద్వాహే కిల దేవకా వసుదేవస్య ధీమతః ।

సారథ్యం కృతవాన్ కంసో యువరాజస్తథాఽ భవత్ ॥

  తతోఽoతరిక్షే వాగాసీద్దివ్యాఽ భూద్యస్య కస్యచిత్ ।

 కంసస్య నామమాత్రేణ పుష్కలా లోకసాక్షిణీ ॥

 యామేతాం వహసే కంస రథేన ప్రియకారణాత్ ।

తస్యా యశ్చోష్టమోగర్భః స తే మృత్యుర్భవిష్యతి ॥

 తాం శ్రుత్వా వ్యధితో వాణీం తదా కంసో వృథామతిః ।

 నిష్కృష్య ఖడ్గం తాం కన్యాం హంతుకామాఽభవత్తదా ॥

“ఈ బాల నీ కూతురైనట్లే నా కూతురు కూడ. సంశయములేదు. ఓ మహాబాహో ! ఈమెను నేను. చంపను. ఆమె యథేష్టముగా ఇష్టమున్నచోటికి పోనిమ్ము” అనెను. ఆకన్య వృప్తిగృహమున పూజింపబడుచు వృద్ధి పొందెను. దేవకీ ఆ బాలను (దేవిని) పుత్రునివలె సంతోషాన్వితయై సంరక్షించెను. కృష్ణుడుగా ప్రజాపతి పుట్టెనని ప్రజలనుకొనిరి. ఆమెను యాదవులందరు కృష్ణుని రక్షించుటకు పుట్టినదని శ్రద్దతో తలంచెదరు. యాదవులందరామెను ఏకాగ్రమనస్సులతో పూజించెదరు. దేవదేవుని యొక్క దివ్యమైన శరీరము ఆమెచే రక్షింపబడినది. ఋషులిట్లడిగిరి. భోజవంశ్యుఁడైన కంసుఁడు వసుదేవుని యొక్క పిల్లలయిన పుత్రుల నేకారణముచే చంపెనో వ్యాఖ్యానింపగోరెదము. సూతుఁడిట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఆనక దుందుభియైన వసుదేవునీ పుత్రులను పుట్టినంతమాత్రముననే అందరినీ మూఢమతియై కంసుఁడు ఏల చంపెనో వినుఁడు. కృష్ణుఁడు పుట్టినంతటనే భయముచే నివాసాంతరమునకు గొంపోవఁబడెను. ఎట్లు గోవులలో పురుషోత్తముఁడయిన గోవిందుండు సంవృద్దుఁ డయ్యెనో. వీనుడు. దేవకీ వసుదేవుల వివాహము నందు, కంసుఁడు సారథ్యమువహించెను. అప్పుడాతఁడు యువరాజు అప్పుడాకాశమున ఎవనిదో తెలియరానీదొక వాక్కు వినిపించెను. అదియొకదిష్యవాక్కు కంసనామోచ్చారణమాత్రముచే పుష్కలమై లోకసాక్షిణియై యెల్లరు వినిరి. ఓ కంస ! ఎవలెను నీవు ప్రేమకారణమున రథమున తీసికొని పోవుచుంటివో ఆమెయొక్క అష్టమగర్భము నీకు మృత్యువగును” ఆ వాక్యమును విని వ్యథీమతియైన కంసుఁడు వెంటనే ఖడ్గమును చూసి ఆమెను చంపవలెనను కొనెను.

తమువాచ మహాబాహుర్వసుదేవః ప్రతాపవాన్ ।

 ఉగ్రసేనాత్మజం కంసం సౌహృదాత్ప్రణయేన వా ॥

 న శ్రియం క్షత్రియో జాతు హంతుమర్హసి కశ్చన ।

ఉపాయః పరిదృష్టోఽత్ర మయా యాదవనందన ॥

 యోఽస్యాః సంజాయతే గర్భో హ్యష్టమః పృథివీపతే ।

 తమహం తే ప్రయచ్ఛామి తత్ర కుర్యా యథాక్రమమ్ ॥

 న త్విదానీం యథేష్టం త్వం వర్తేథా భూరిదక్షిణ ।

 సర్వానష్యథ వా గర్భాన్ పృథజ్నేష్యామి తే వశమ్ ॥

ఏవం మిథ్యా నరశ్రేష్ఠ వాగేషా న భవిష్యతి ।

ఏవముక్తోఽనునీతః స జగ్రాహ వచనం తదా ॥

 వసుదేవశ్చ తాం ధార్యామవాప్య ముదితోఽభవత్ ।

 కంసస్తస్యావధీత్పుత్త్రాన్ పాపకర్మా వృథామతిః ॥

 ఋషయ ఊచుః:-

క ఏషవసుదేవస్తు దేవకీ చ యశస్వినీ ।

 నందగోపస్తు కస్త్వేష యశోదా చ మహాయశాః ॥

 యో విష్ణుం జనయామాస యంచ రాతేత్యభాషత ।

యా గర్భం జనయామాస యా వైనంచాభ్యవర్ధయత్ ॥

 సూత ఉవాచ :-

పురుషః కశ్యపస్త్వాసీదదితీస్తత్ప్రియా తథా ।

కశ్యపో బ్రహ్మణోoఽశశ్చ పృథివ్యా అదితిస్తథా ॥

 నందో ద్రోణః సమాఖ్యాతో యశోదా చ ధరాఽభవత్ ।

 అథ కామాన్మహాబాహుః దేవక్యాః సంప్రవర్ధయన్ ॥

 అచరత్స మహీం దేవః ప్రవిష్టో మానుషీం తనుం ।

 మోహయన్ సర్వభూతాని యోగాత్మా యోగమాయయా ॥

అంత మహాబాహుఁడు, ప్రతాపవంతుఁడు నయిన వనుదేవుఁడు స్నేహముతో ప్రణయభావముతో, ఉగ్రసేనాత్మజుఁడయిన కంసునితో “క్షత్రియుఁడెన్నడును స్త్రీని చంపరాదు. ఈ విషయములో నొక ఉపాయము ఓ యాదవనందన, నాకు తోచినది ఓ పృధివీపతీ ! ఆమె యెన్మిదవ గర్భమును నేను తెచ్చినీకిచ్చెదను అప్పుడాబిడ్డను యథాక్రమ మాచరింపుము. యజ్ఞపు దక్షిణల విశేషముగా నొసంగు దయామతీ, ఇప్పుడు నీవు. యథేష్టముగా జేయకుము. లేదా ప్రతి శిశువును ప్రత్యేకముగా నీవశ మనోర్చెదను, ఓ! నరశ్రేష్ఠ. ఈ విధముగా. నయనచో ఆ ఆకాశవాక్కు కూడ అసత్యము-కాదు”. అని చెప్పి కంసు. ననునయించెను. ఆ పొక్కు నాతడంగీకరించేను. వసుదేవుఁడు. భార్యను చేరి ముదితుఁ. డయ్యెను. దుర్మార్గుఁడు పాపకర్ముఁడునయిన కంసుఁడు వసుదేవపుత్రులను.వధించెను. ఋషులిట్లు ప్రశ్నించిరి. వసుదేవుడెవడు? యశస్వినియైన దేవకి యెవరు? సందగోపుఁడెవఁడు? యశస్వురాలయిన యశోద యెవతే?ఎవ్వరు విష్ణువుని కనీరి, తాతా! యని యెవనిని సంబోధించినారో ఎవరుగర్భమునధరించిరో వారెవ్వరు? అని. సూతుఁడిట్లు ప్రత్యుత్తర మిచ్చెను. పురుషుఁడు కశ్యపుఁడయ్యెను. అదితి ఆకశ్యపుని ప్రియ ప్రకృతి. కశ్యపుఁడు బ్రహ్మాంశుఁడు, అదితి పృథ్వియొక్కయంశము. నందుఁడు ద్రోణుఁడుగా చెప్పఁబడినాఁడు. యశోద ధర.మహానుభావుఁడు (హరి) దేవకియొక్క కోర్కెలను సంప్రవర్థనమొనరించెను. ఆ ప్రభువు మానుషీతనువును ధరించి భూమిని సర్వభూతములను- యోగాత్ముడైన ప్రభువు యొక్కయోగమాయచే మోహమొందఁజేసి సంచరించెను. వృప్తికుల మందు ధర్మము నష్టము కాగా స్వయముగా ధర్మవ్యవస్థాపనమునుచేయుటకు, అసురులయొక్కప్రణాశనముకొఱకు ఆవిర్భవించెను.

నష్టే ధర్మే తథా జజ్ఞే విష్ణుర్వృష్ణికులే స్వయమ్ ।

 కర్తుం ధర్మవ్యవస్థానమసురాణాం ప్రణాశనమ్ ॥

 వైదర్భీ రుక్మిణీ కన్యా సత్యా నగ్నజిత్తస్తథా ।

సత్రాజితః సత్యభామా జాంబవత్యపి రోహిణీ ॥

 శైబ్యా ధన్యోని దేవీనాం సహస్రాణి చ షోడశ ।

చతుర్ధశ తు తే ప్రోక్త గణస్త్వప్సరసాం దీవి ॥

 విచార్య దేవైః శక్రేణ విశిష్టాస్త్విహ ప్రేషితాః ।

పత్న్యర్థం వాసుదేవస్య ఉత్పన్నా రాజవేశ్మసు ॥

 ఏతాః పత్న్యో మహాభాగా విష్వక్సేనస్య విశ్రుతాః ।

 ప్రద్యుమ్నుశ్చారుదేష్ణశ్చ సుదేవః శరభస్తథా ॥

 చారుశ్చ చారుభద్రశ్చ భద్రచారుస్తథాపరః ।

 చారువిద్యశ్చ రుక్మిణ్యాం కన్యా చారుమతీతథా ॥

 సానుర్భానుస్తథాక్షశ్చ రోహితో మంత్రవిత్తథా ।

జరోంఽ ధకస్తామచక్రౌ సౌభరిశ్చ జరంధరః ॥

 చతస్రో జజ్ఞిరే తేషాం స్వసారో గరుడధ్వజత్ ।

 భానుః సౌభరికా చైవ తామ్రపర్ణీ జరంధరః ॥

 సత్యభామా సుతా ఏతే జాంబవత్యాః ప్రజాః శృణు ।

 భద్రశ్చ భద్రగుప్తశ్చ భద్రచిత్రస్తథైవ చ ॥

 భద్రబాహుశ్చ విఖ్యాత: కన్యా భద్రవతీ తథా ।

 సంబోధనీ చ విఖ్యాతా జ్ఞేయా జాంబవతీసుతాః ॥

 సంగ్రామజిచ్చ శతజిత్తథైవ చ సహస్రజిత్ ।

 ఏతే పుత్రాః సుదేవ్యాం చ విష్వక్సేనస్య కీర్తితాః ॥

 వృకో వృకాశ్వో వృకజిద్వృజినీ చ వరాంగనా ।

మిత్రబాహుః సునీథశ్చ నాగ్నజీత్యా ప్రజాస్త్వీహ ॥

 ఏవమాదీని పుత్రాణాం సహస్రాణి నిబోధత ।

 ప్రయుతం తు సమాఖ్యాతం వాసుదేవస్య యే సుతాః ॥

విదర్భ రాజ దుహిత రుక్మిణి;సత్య నగ్నజిత్తుయొక్క కూతురు. సత్రాజిత్తు కూతురు సత్యభామ (వీరందరుకృష్ణునిభార్యలు )జాంబవతీ,రోహిణీ, శైబ్య-మరియు 16 వేలతికనభామలు,కూడకృష్ణునియొక్క ధన్యభామినులు. ఇంతకు పూర్వముచ తుర్దశదేవతాస్త్రీలనుగూర్చిచెప్పఁబడినది. ఇంద్రుం డు దేవతలతో నాలోచించి వసుదేవునకు భార్యలగుటకు దేవతాప్సరఃస్త్రీలలో విశిష్టులయిన వారి నీచ్చటకుపంపెను. వారందరురాజవేశ్మల రాజకుటుంబములలో జన్మించిరి. మహాభాగలైనయీస్త్రీలు విష్వక్సేనుని భార్యలుగా ప్రఖ్యాతలు. రుక్మిణికుమారులు. ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుం డు, సుదేవుఁడు, శరభుఁడు, చార్యుడు, చాగుభద్రుఁడు, భద్రాచారుఁడు మరియు చారువిద్యుఁడు. రుక్మిణి కూతురు చారుమతి. సత్యభాము కుమారులు- సానుఁడు, భానుఁడు, అక్షుఁడు, రోహితుఁడు, మంత్రవిత్తు జరుఁడు, అంధకుడు, తామచక్రి, సౌభరి, జలంధరుఁడు; గరుడధ్వజుం డయిన కృష్ణునకు నలుగురుకూతులు. - భానుసౌభరీకా తామ్రపర్ణీ జరాంధర; ఇంక జాంబవతీ సంతానమును గూర్చి వినుము- భద్రుఁడు, భద్రగుప్తుడు, భద్రచిత్రుఁడు, భద్రబాహుఁడును.. వీరు కుమారులు, భధ్రవతీ, సంబోధినీ, జాంబవతి యొక్క కుమార్తెలు. సంగ్రామజిత్, శతజిత్తు, సహస్రజిత్తు. వీరు విష్వక్సేనునకు సుదేవి వలన కలిగినవారు. నాగ్నజితి కుమారులు - వృకుఁడు, వృకాశ్వుఁడు, వృకజిత్తు, మిత్రబాహుం డు మరియు సునీథుఁడు. వరాంగనయైన వృజినీ నాగ్నజితికుమార్తె. వీరు మరి ఇతరులు - మొత్తము వేయిమంది కుమారులుగా వెలుంగుము. వాసుదేవుని కుమారులు ప్రయుత సంఖ్యలో చెప్పఁబడిరి.

 ఆయుతాని యథాష్టౌ చ శూరాః రణవిశారదాః ।

జానార్ధనస్య వంశో వః కీర్తితోఽయం యథాతథమ్ ॥

 బృహతీ పురుభార్యాసీత్ సుమధ్యా సుగతిస్తథా ।

 కన్యా వా బృహదుక్థస్య శైనేయస్య మహాత్మనః ॥

 తస్యాః పుత్రాస్తు విఖ్యాతాస్త్రయః సమితిశోభనాః ।

ఆనందః.కనకః శ్వేతః కన్యా శ్వేతా తథైవ చ ॥

 ఆగావహస్య చిత్రశ్చ శూరశ్చిత్రరథశ్చ యః ।

 చిత్రసేనః స్మృతశ్చాస్య కన్యా చిత్రవతీ తథా ॥

 తుంబశ్చ తుంబవర్చాశ్చ జాతౌ తుంబస్య తావుభౌ । 

ఉపాసంగసుతౌ ద్వౌ తు వజ్రారః క్షిప్ర ఏవ చ ॥

 భూరీంద్రసేనో భూరిశ్చ గవేషణసుతానుభౌ ।

 యధిష్టిరస్య కన్యాయాం సుధనుస్తస్య చాత్మజః ॥

కాశ్యాం తు పంచ తనయాంల్లేభే సాంబాత్తరస్వినః ।

 సత్యప్రకృతయో దేవాః పంచ వీరాః ప్రకీర్తితాః ॥

 త్రిస్రః కోట్యస్తు పౌత్రాణాం యాదవానాం మహాత్మనామ్ ।

సర్వమేవ కులం యచ్చ వర్తంతే చైవ మే కులే ॥

 విష్ణుస్తేషాం ప్రమాణే చ ప్రభుత్వే చ వ్యవస్థితః ।

 నిదేశస్థాయిభిస్తస్య బధ్యంతే సురమానుషాః ॥

 దేవాసురాహవహతా అసురా యే మహాబలాః ।

ఇహోత్పన్నా మనుష్యేషు బాధంతే తే తు మానవాన్ ॥

 తేషాముత్సాదనార్థాయ ఉత్పన్నా యాదవే కులే ।

 సముత్పన్నం కులశతం యాదవానాం మహాత్మనామ్ ॥

 ఇతి ప్రసూతిర్వృష్ణీనాం సమాసవ్యాసయోగతః ।

 కీర్తితా కీర్తనీయా స కీర్తిసిద్ధమభీప్సతా ॥

 ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్త మధ్యమఖాగే ఏకసప్తతితమోఽధ్యాయః॥

వారిలో ఎనిమివేలమంది రణవిశారదులు. శూరులును. జనార్దనునీ వంశము యథాతథముగా వర్ణింపబడినది. బృహతీ పురుని యొక్క భార్య. సుమతీ, సుమధ్యయును కూడనట్లే. బృహతి (?) బృహదుక్తుని కూతురు. బృహదుక్తుఁడు మహాత్ముఁడైన శీనీ యొక్క కుమారుఁడు ఆమె కుమారులు ప్రఖ్యాతులు, సమితి శోభనులు. వారు ఆనందుడు, కనకుఁడు, శ్వేతుండును. ఆమెకు శ్వేత కూతురు కలదు. చిత్రుఁడు, శూరుం డు, చిత్రరథుఁడు ఆగావహునీ కొమరులు. ఆతని కొక కూతురు కలదు ఆమెచిత్రవతి. (ఆమెయేచిత్రసేన? తుంబునకు ఇరువురు సుతులు. తుంబుఁడు తుంబవర్చసుఁడు వజ్రరుఁడు, క్షిప్రుఁడు - ఉపాసంగుని పుత్రులు. గవేషణుని కుమారులు - భూరీంద్రసేనుఁడు, భూరియు సుధానుఁడత(?)ని కుమారుఁడు. అతఁడు యుధిష్ఠిరకన్యయందుపుట్టెను. కాశ్య(కాశీరాజదుహిత) సాంబునివలన ధైర్యశీలురయిన యైదుగురు తనయులను కనెను, వీరు సత్యతో ప్రకాశించు వీరులుగా గౌరవింపఁబడిరి. మహాత్ములైన యాదవుల పౌత్రులు మూఁడుకోట్లు. ఆ వంశమంతయు, వంశములో నుండువారు అందరు ప్రభువైన విష్ణుని రక్షణలో నున్నారు. సురలు మనుష్యులు ఆతని నిదేశమునకు బద్దులు దేవాసురుల యుద్ధము లందు ఏయసురులు వధింపఁబడిరో వారు మనుష్యులలో పుట్టి మానవులను బాధింతురు. వారివినాశనముకొఱకు యాదవకులములో మరల జన్మించిరి. అందుకొఱకై ఒక వంద మహాత్ములైన యాదవకులజులు సముత్పన్నులైరి. ఇది వృష్టివంశీయుల ప్రసూతి. సూక్ష్మముగా వివరముగా చెప్పఁబడినది, కీర్తి సిద్దిని కోరువారు వారిని కీర్తింపవలెను.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమున మధ్యమభాగమున డెబ్బది యొకటవ అధ్యాయము.