బ్రహ్మాండ మహా పురాణము
31 - హైహయ రాజ వధ విషయమై బ్రహ్మ పరశురాముని శివుని దర్శించుమనుట
సగర ఉవాచ :-
బ్రహ్మపుత్త్ర మహాభాగ వద భార్గవచేష్టితమ్ ।
యచ్చకార మహావీర్యో రాజ్ఞః క్రుద్ధో హి కర్మణా ॥
వసిష్ఠ ఉవాచ :-
గతే తస్మిన్ మహాభాగే భృగౌ పితృపరాయణః ।
రామః ప్రోవాచ సంక్రుద్థోఽ ముంచఞ్చ్వాసాన్ముహుర్ముహుః॥
పరశురామ ఉవాచ :-
అహో పశ్యత మూడత్వం రాజ్ఞోహ్యుత్పథగామినః ।
కార్తవీర్యస్య యో విద్వాంశ్చక్రే బ్రహ్మవధోద్యమమ్ ॥
దైవం హి బలవన్మన్యే యత్ర్పభావాచ్ఛరీరిణః ।
శుభం వాప్యశుభం సర్వే ప్రకుర్వంతి విమోహితాః ॥
శృణ్వంతు ఋషయ స్సర్వే ప్రతిజ్ఞా క్రియతే మయా ।
కార్తవీర్యం నిహత్యాజౌ పితుర్వైరం ప్రసాదయే ॥
యదీ రాజా సుర్రెస్సర్వైరీంద్రాద్య్రైర్దానపై స్తథా ।
రక్షిష్యతే తథాప్యేనం సంహరిష్యామి నాన్యథా ॥
ఏవముక్తం సమాకర్ణ్య రామేణ సుమహామాత్మనా ।
జమదగ్నిరువాచేదం పుత్రం సాహసభాషిణమ్ ॥
జమదగ్ని రువాచ :-
శృణు రామ ప్రవక్ష్యామి సతాం ధర్మం సనాతనమ్ ।
యచ్ఛ్రుత్వా మానవాః సర్వే జయంతే ధర్మకారిణః ॥
సాధవో మే మహాభాగాః సంసారాన్మోక్షకాంక్షిణః ।
న కస్మైచిత్ప్రకుప్యంతి నిందితాస్తాడితా అపి ॥
క్షమాధనా మహాభాగా యే చ దాంతాస్తపస్వినః ।
తేషాం చైవాక్షయా లోకాః సతతం సాధుకారిణామ్ ॥
యస్తు దుష్టైస్తు దండాద్యైర్వచసాఽపీ చ తాడితః ।
న చ క్షోభమవాప్నోతి స సాధుః పరికీర్త్యతే ॥
తాడయేత్తాడయంతం యో న చ సాధుః స పాపభాక్ ।
క్షమయాఽర్హణతాం ప్రాప్తః సాధవో బ్రాహ్మణా వయమ్ ॥
నరనాథవధే తాత పాతకం సుమహద్భవేత్ ।
తస్మాన్నివారయే త్వాద్య క్షమాం కురు తపశ్చర ॥
సగరుఁడిట్లు చెప్పెను.
పూజ్యుఁడవైనయో బ్రహ్మపుత్ర ! పరశురామ చేష్టితమును వివరింపుము. రాజొనర్చిన కర్మచే క్రుద్ధుఁడయి మహావీర్యుఁడయిన రాముఁ డేమి చేసెను?
వసిష్ఠుఁడిట్లు చెప్పెను.
మహాభాగుఁడైన భృగువర్యుఁడు వెడలిన తరువాత, సంక్రుద్దుఁడు పితృ పరాయణుఁడు నయిన రాముఁడు పదేపదే దీర్ఘోచ్చ్వాసల విడుచుచు ఇట్లనెను. పరశురాముడిట్లనెను. “అహో ! సత్పథమును వీడి ఉత్పథగామియైన రాజయిన కార్తవీర్యుని మూఢత్వము ! విద్వాంసుఁ డయినను ప్రత్యక్షముగా బ్రహ్మవధోద్యమము గోచరించెను. దైవము బలవంతమయినదని తలంతును. ఏలయన తత్ర్పభావమున శరీరధారులు మోహింపఁబడి శుభాశుభకర్మల నాచరింతురు. (4) ఋషులందరు నాచే నొనర్పఁబడిన ప్రతిజ్ఞ విందురుగాక కార్తవీర్యుని యుద్ధములో. జయించి పితృవైరమును ప్రసాధించేదను. ఒకవేళ రాజయిన కార్తవీర్యుఁడు సర్వదేవతలచే ఇంద్రాదులచే, అట్లే దానవులచే రక్షింపఁబడినచో, అప్పటికిని ఆతనిని సంహరించేదను. వేకటిలేదు. (6) ఈ విధముగా రాముఁడు పలికిన వాక్యములను సుమహాత్ముఁడయిన జమదగ్ని ఆలకించి సాహస భాషణము ధైర్యముగా నొనర్చిన పుత్త్రునితో నిట్లనెను.
జమదగ్ని పలికెను.
ఓ రామ ! సజ్జనుల యొక్క సనాతన ధర్మమును వచించుచున్నాను వినుము. దీనిని విని యెఱింగి మానవులందరు ధర్మకార్యాచరణు లయ్యెదరు. ఎవరు సాధువులో మహాభాగులో సంసారము నుండి మోక్ష మాకాంక్షింతురో, వారెవనీదేనయిన నిందింపఁబడినను, కొట్టబడినను, ఏ ఒక్కనీపై కోపగింపరు? (9) మహాభాగులైన తపస్వినులు ఇంద్రియ నిగ్రహము కలవారు. క్షమాధనులు. అట్టి సాధుకారీణులకు అక్షయ లోకములు సంతతము లభించును. ఎవఁడు దుష్టులచే గాని, దండాదులచేతగాని వాక్కుచేగాని తాడితుడైనను అతఁడు క్షోభము నొందడో ఆతఁడు సాధువు తననుగొట్టుచున్న వానిని కొట్టువాడు సాధువు కాదు. పాపి. మనమో సాధువులము, బ్రాహ్మణులము. క్షమాగుణమున తత్థానము నందితిమీ. వత్సా ! కార్తవీర్య భూపతిని చంపుటవలన సుమహాపాతకము కలుగును. ఆ కారణమున నిన్ను తత్కార్యము నుండి నివారించుచున్నాను. క్షమ వహింపుము, తపస్సాచరింపుము.
వసిష్ఠ ఉవాచ :-
ఏవం పిత్రా సమాదిష్టం విజ్ఞాయ నృపనందన ।
రామః ప్రోవాచ పితరం క్షమాశీలమరిందమమ్ ॥
పరశురామ ఉవాచ :-
శృణుతాత మహాప్రాజ్ఞ ! విజ్ఞప్తిం మమ సాంప్రతమ్ ।
భవతా శమ ఉద్దిష్టః సాధూనాం సుమహాత్మనామ్ ॥
స శమః సాధుదీనేషు గురుష్వీశ్వరభావనైః ।
కర్తవ్యో దుష్టచేష్టేషు వ శమః సుఖదో భవేత్ ॥
తస్మాదస్య వధః కార్యః కార్తవీర్యస్య వై మయా ।
దేహ్యాజ్ఞాం మాననీయాద్య సాధయే వైరమాత్మనః ॥
జమదగ్ని రువాచ :-
శృణురామ మహాభాగ వచో మమ సమాహితః ।
కరిష్యసి యథా భావి తథా నైవాన్యథా భవేత్ ॥
ఇతో వ్రజత్వం బ్రహ్మాణం పృచ్ఛ తాత హితాహితమ్ ।
స యద్వదిష్యతి విభుస్తత్కర్తా నాత్ర సంశయః ॥
వసిష్ఠ ఉవాచ :-
ఏవముక్తః స పితరం నమస్కృత్య మహామతిః ।
జగామ బ్రహ్మణో లోకమగమ్యం ప్రాకృతైర్జనైః ॥
దదర్శ బ్రహ్మణో లోకం శాతకౌంభవినిర్మితమ్ । స్వర్ణప్రాకారసంయుక్తం మణిస్తంభైర్విభూషితమ్ ॥
తత్రాపశ్యత్సమాసీనం బ్రహ్మోణముమితౌజసమ్ ।
రత్నసింహాసనే రమ్యే రత్నభూషణభూషితమ్ ॥
సిద్ధేంద్రైశ్చ మునీంద్రైశ్చ వేష్టితం ధ్యానతత్పరైః । విద్యాధరీణాం నృత్యం చ పశ్యంతం సహితం ముదా ॥
తపసాం ఫలదాతారం కర్తారం జగతాం విభుమ్ ।
పరిపూర్ణతమం బ్రహ్మ ధ్యాయంతం యతమానసమ్ ॥
గుహ్యయోగం ప్రవోచంతం భక్తబృందేషు సంతతమ్ ।
దృష్ట్వా తమవ్యయం భక్త్యా ప్రణనామ భృగూద్వహః ॥
స దృష్ట్వా వినతం రామమాశీర్భిరభినంద్య చ ।
పప్రచ్ఛ కుశలం వత్స కథమాగమనం కృథాః ॥
వసిష్ఠుడిట్లనెను.
ఓ నృపనందన ! ఇట్లు తండ్రిచే నాజ్ఞాపింపఁబడినది తెలిసికొని, రాముఁడు క్షమాశీలుఁడు అరిందముఁడు నయిన పితరునితో నిట్లనెను. పరశురాముఁడిట్లు పలికెను. మహాప్రాజ్ఞుఁడవైన ఓ తండ్రీ ! ఇప్పుడు నా విజ్ఞప్తిని ఆలకింప గోరెదను. సుమహాత్ములయిన సాధువుల విషయమై మీరు క్షమా ధర్మమును ప్రతిపాదించితీరీ. ఆ శమ భావము సాధువుల యెడ, దీనులయెడ, గురువులయెడ ఈశ్వర భావముతో ఆచరింప దగినది, దుష్ట చేష్టల నొనర్చు పొరీయెడ క్షమాభావము సుఖమొసంగునదికాదు. అందుచే కార్తవీర్యుని వధ నాకు కర్తవ్యమైనది. మాననీయులలో ప్రప్రథముఁడవయిన ఓ తండ్రీ ! ఆత్మీయ వైరమును సాధించుటకు ఆజ్ఞ నొసంగుము.
జమదగ్ని ఇట్లు ప్రత్యుత్తర మిచ్చెను.
ఓ రామ ! ఓ మహాభాగ నా వాక్కులను సమాహిత మనస్సుతో అవధారణా పూర్వకముగ ఆలింపుము. భవిష్యత్తు అనివార్యము అట్లే చేయుదువు. విధికి అన్యముగా జరుగదు కదా ! ఇచ్చటి నుండి నీవు బ్రహ్మకడ కరుగుము. వత్సా ! హితాహితమును యోగ్యతా యోగ్యతను బ్రహ్మను అడుగుము. విభుడేమి చెప్పునో దాని నాచరింపుము. అందు సందేహింపవలసినది లేదు.” అనెను.
వసిష్ఠుడిట్లనెను.
తండ్రిచే నిట్లు చెప్పబడి తండ్రికి నమస్కరించి మహామతియైన రాముఁడు ప్రాకృతులయిన (సామాన్యులయిన) జనుల కగమ్యమైన బ్రహ్మ లోకమున కరిగెను. (20) బ్రహ్మలోకము నాతఁడు దర్శించెను. అది శాత కుంభము (బంగారము)చే నిర్మింపబడినది బంగారపు ప్రాకారములతో కూడియున్నది. మణులచే కూర్చబడిన స్తంభములచే విభూషితము. అందు రత్నభూషణ భూషితము, రమ్యమునైన రత్న సింహాసనమున కూర్చుండియున్న అమితతేజః పుంజుఁడయిన బ్రహ్మను రాముఁడు చూచెను. బ్రహ్మ సిద్ధులలో శ్రేష్ఠులయిన వారితో, ధ్యాన తత్పరులయిన మునీంద్రులచే పరివేష్టితుండై యుండెను. ఆతఁడో విద్యాధర స్త్రీల యొక్క నృత్యమును సుస్మితముతో సంతోషముగా దర్శించు చుండెను. (23) తపస్సులకు ఫలము లొసంగువాఁడు, జగత్తునకు కర్తయైనవాఁడు, పరబ్రహ్మము గూర్చీ ధ్యానించువాఁడు, మనస్సంయమనము గలవాఁడు, విభుఁడు, భక్త బృందములకు రహాస్యతమమయిన గుహ్య యోగమును నుపన్యసించుచున్నవాఁడు, అవ్యయుఁడు అయిన బ్రహ్మనుచూచి, భృగూద్వహుఁడయిన రాముఁడు, భక్తితో నమస్కరించెను. బ్రహ్మ వినయముతో నమస్కరించిన రాముని చూచెను. ఆశీస్సులతో నభినందించెను. కుశలమును గూర్చి యడిగెను. వత్సా ! నీ విచ్చటకు వచ్చిన కారణమేమి” అని యడిగెను. (26)
సంపృష్టో విధినా రామః ప్రోవాచాఖిలమాదితః ।
వృత్తాంతం కార్తవీర్యస్య పితుః స్వస్య మహాత్మనః ॥
తచ్ఛృత్వా సకలం బ్రహ్మా విజ్ఞాతార్ధోఽపి మానద ।
ఉవాచ రామం ధర్మిష్ఠం పరిణామసుఖావహమ్ ॥
ప్రతిజ్ఞా దుర్లభా వత్స యాం భవాన్కృతవాన్రుషా ।
సృష్టిరేషా భగవతః సంభవేత్కృపయా వటో ॥
జగత్సృష్టం మయా తాత సంక్లేశేన తదాజ్ఞయా ।
తన్నాశకారిణీ చైవ ప్రతిజ్ఞా భవతా కృతా ॥
త్రిఃసప్తకృత్వో నిర్భూపాం కర్తు మిచ్ఛసి మేదినీమ్ ।
ఏకస్య రాజ్ఞో దోషేణ పితుః పరీభవేన చ ॥
బ్రహ్మక్షత్రీయవిట్ శూధ్రైః సృష్టిరేషా సనాతనీ ।
ఆవిర్భూతా తిరోభూతా హరేరేవ పునః పునః ॥
అవ్యర్థా త్వత్పరిజ్ఞా తు భవిత్రీ ప్రాక్తవేన చ ।
యద్వాయాసేన తే కార్యసిద్ధిర్భవితుమర్హతి ॥
శివలోకం ప్రయాహి త్వం శివస్యాజ్ఞామవాప్నుహి ।
పృథివ్యాం బహవో భూపాః సంతి శంకరకింకరాః ॥
వినైవాజ్ఞాం మహేశస్య కో వా తన్హంతుమీశ్వరః ।
బిభ్రతః కవచాన్యంగే శక్తిశ్చాపి దురాసదాః ॥
ఉపాయం కురు యత్నేన జయబీజం శుభావహమ్ ।
ఉపాయే తు సమారబ్ధే సర్వే సిద్ద్యంత్యుపక్రమాః ॥
శ్రీకృష్ణమంత్రం కవచం గృహ్ణ వత్స గురోర్హరాత్ ।
దుర్లంఘ్యం వైష్ణవం తేజః శివశక్తిర్వీజేష్యతి ॥
త్రైలోక్యవిజయం నామ కవచం పరమాద్భుతమ్ ।
యథాకథం చ విజ్ఞాప్య శంకరం లభ దుర్లభమ్ ॥
ప్రపన్నః సగుణైస్తుభ్యం కృపాలుర్దీనవత్సలః ।
దివ్యపాశుపతం చాపి దాస్యత్యేవ న సంశయః ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే భార్గవచరితే ఏకత్రింశత్తమోఽధ్యాయః ॥
బ్రహ్మచే ప్రశ్నింపఁబడి రాముడు మొదటి నుండియు జరిగిన కార్తవీర్యుని వృత్తాంతమును, మహాత్ముఁడైన తండ్రి విషయమును మీనరించెను. (27) మానద ! సర్వము తెలిసినవాడయ్యు బ్రహ్మ రాముని పలుకులను విని, ధర్మిష్ణుఁడయిన రామునితో తుదకు సుఖావహ పరిణామమును గూర్చు విషయమును వివరించెదను. ఓ వత్స ! కోపముతో నీవు చేసిన ప్రతిజ్ఞ దుర్లభము. ఓ వటూ ! ఈ సృష్టి యంతయు భగవత్కృపచే సంభవించును. తద్భగహానుని ఆజ్ఞచే, అత్యధిక క్లేశముతో ఈ జగత్తు నాచే సృష్టింపఁబడినది. నీవు చేసిన ప్రతిజ్ఞయో తత్సృష్టికి నాశకారిడీ. ఒకే యొక రాజు యొక్క దోషముచే తండ్రికి జరిగిన పరిభవముచే భూమండలము నంతటిని (త్రిఃసప్తకృత్) ఇరువది యొక్కమార్లు భూపతి రహితముగ చేయకోరుదువు. (31) బ్రహ్మ క్షత్రీయ వైశ్య శూద్రులతో నీ సృష్టి మిక్కిలి సనాతనమయినదీ. అయ్యది హరికారణముగ మాటిమాటికి ఆవిర్భవించినది. తిరోభూతమయినదీ (హరి నుండి కలిగినది. హరి యందే విలీనమయినది) విశ్వము యొక్క ప్రాక్తనమైన ఈ సూత్రముచే నీ ప్రతిజ్ఞ వ్యర్థమయినదీ కాదు. అధవా, ఆయాసపురస్సరముగ నీ కార్యసిద్ధి యగుటకు నీరుండవు. నీవు శివలోకమున కరుగుము. శివాజ్ఞను పొందుము. భూలోకమున శంకర కింకరులయిన రాజులెందరో కలరు. అందుచే, తన్మహేశ్వరుని ఆజ్ఞలేక ఆ రోజులను చంపుటకివ్వం డు శక్తిమంతుఁడు? ఆ భూపతులు శరీరములందు కవచములను శక్తిని ధరించెదరు. వారు దురాసదులు పారితరులక సాధ్యులు జయమునకు బీజము శుభావహమునునైన ఉపాయమును పొందుటకై యత్నము చేయుము. ఉపాయముతో నారంభింపఁబడిన సర్వకార్యములు సిద్ధి నొందును. ఓ బిడ్డా ! గురువరము వలన శ్రీకృష్ణ మంత్ర కవచమును వహింపుము. దుర్లంఘ్యమయిన వైష్ణవ తేజమును శివశక్తీ జయించును. (37) “త్రైలోక్య విజయ”మను పేరి పరమాద్భుతమయిన కవచమును, ఎట్లో కష్టపడి దుర్లభుఁడయిన శంకరునకు విజ్ఞాపనముచేసి పొందుము. నీ గుణములచే ప్రసన్నుండయి దీనవత్సలుఁడయిన ఈశ్వరుడు కృపాలుఁడై దివ్యమయిన పాశుపతమునైన నీయగలడు. సందేహము లేదు.” (39) అనెను.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమునందు మధ్యభాగమున తృతీయోపాద్ఘాత పాదమున భార్గవచరితము నందు ముప్పది యొకటవ అధ్యాయము.
Summary of chapter 69 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter details the event-filled life of king Yayāti, a powerful monarch of the Lunar line whose life was a dramatic journey through worldly pleasure and spiritual awakening. It recounts his royal conquests, his divine marriage, and the strange turn of destiny that brought him premature old age. The devout reader follows his life story with keen spiritual interest, observing the eternal play of karma and divine grace guiding a soul toward final truth.