44 - భార్గవచరితము

వసిష్ఠ ఉవాచ :-

రాజన్నేవం భృగుర్విద్వానశ్యఞ్నపదాన్ ఐహూన్ ।

 సమాజగామ ధర్మాత్మా కృతవ్రణసమిన్వతః ॥

 నిలిల్యుః క్షత్రియాః సర్వే యత్ర తత్ర నిరీక్ష్య తమ్ ।

ప్రజంతం భార్గవం మార్గే ప్రాణరక్షణతత్పరాః ॥

 అథాససాద రాజేంద్ర రామః స్వపితురాశ్రమమ్ ।

 శాంతసత్త్వసమాకీర్ణం వేదధ్వనినినాదితమ్ ॥

యత్ర సింహా మృగాః గావో నాగమార్జారమూషికాః ।

 సమం చరంతీ సంహృషా భయం త్య్వ సుదూదతః ॥

 యత్ర ధూమం సమీక్ష్యేవ హ్యగ్నిహోత్రసముద్భవమ్ ।

 ఉన్నదంతి మయూరాశ్చ నృత్యంతి చ మహీపతే ॥

 యత్ర సాయంతనే కాలే సూర్యస్యాభిముఖం ద్విజైః ।

 జలాంజలీవృత్తిపదిక క్రియతే భూర్ణబావిలా ॥

యత్రంతేవాసిభిర్నీత్యం వేదాః శాస్త్రాణి సంహితాః ।

 అభ్యష్యంతే ముదా యుక్తాధ్యహ్మచర్యవ్రతే స్థితైః ॥

 అథ రామః ప్రసన్నాత్మా పశ్యన్నాశ్రమ సంపదమ్ ।

ప్రవివేశ శనై రాజన్నకృతవ్రణసంయుతః ॥

 జయ శబ్దం వమః శబ్దం ప్రోచ్ఛరదీంతృజైః ।

 ద్వీతైశ్చ సత్కృతో రామః పరం హర్షముపాగతః ॥

 ఆశ్రమాభ్యంతరే తత్ర సంప్రదిశ్య నిజం గృహమ్ ।

దదర్శ పితరం దామో జమదగ్నిం తపోనిధిమ్ ॥

 సాక్షాతృగుమివాపీనం నిగ్రహానుగ్రహక్షమమ్ ।

 పపాత చరతోపాంతే హ్యాష్టాంగాలీలగీతావనీః ॥

 రామోహం తవ దాసోస్మి ప్రోచ్చరన్నితి భూపతే ।

 జగ్రాహ చరణి చాపి విధివత్ సజ్జవాగ్రణీః ॥

 అథమాతుళ్ళ చరణావభివాద్య కృతాంజలిః ।

 ఉవాచ ప్రణతో వాక్యం తయోః సంహర్షకారణమ్  ॥

 రామ ఉవాచ :-

పీతస్తవ ప్రభావేన తపసోతి దురాసదః ।

కార్తవీర్యో హతో యుద్దే పపుత్త్రబలవాహనః ॥

వసిష్ఠుడు పలికెను.

విద్వాంసుఁడు ధర్మాత్ముఁడునయిన భార్గవుఁడు అకృతవ్రణంనీతో కూడి బహుజనపదములను చూచుచు గృహోన్ముఖుఁడయి బయలుదేరెను. ప్రాణ రక్షణ తత్పరులయి ఆతనిని చూచి క్షత్రియులందరు దాగుకొనిరి. అంత భార్గవుఁడు శాంతియుతమయిన జంతువులతో కూడి వేదధ్వనితో వ్యాప్తమైయున్న స్వపిత్తాశ్రమమును చేరుకొనెను. ఆశ్రమమున సింహములు, మృగములు, ఆవులు, సర్పములు, మార్జారములు, మూషికములు అన్నీ పరస్పర విరోధ జంతువులు సంతుష్టములయి, సహజ భయమును దూరముగ పారద్రోలి సమభావమున సంచరించుచుండెను, హోమాగ్ని హోత్రముల నుండి వెలువడిన ధూమమును చూచి వెమిళ్లు మేఘములను భావమున బిగ్గరగా క్రేంకారరవములు చేయుచున్నవి. నృత్యము లాడుచున్నది. సాయంతనములందు బ్రాహ్మణులచే అర్పింపఁబడిన సూర్యునకభీముఖముగా నీయఁబడిన అర్ఘ్యజలములతో నేల ఆర్థముగ నుండెను. ఆ ప్రదేశమున బ్రహ్మచర్య వ్రతము నాచరించు శిష్యగణముచే వేదములు, శాస్త్రములు, సంహితలు సంతోషముగ అభ్యసింపం బడుచుండెను. అంత రాముఁడు ఆశ్రమ. సంపదను దర్శించుచు, ప్రసన్నాత్ముఁడై అకృతేవణునితో సంయుతుఁడై మెల్లగా సాశ్రమమును ప్రవేశించేను. బ్రాహ్మణ విద్యార్థులు 'జయ' శబ్దములొనర్చిరి. ద్విజులు నమశ్శబ్దములుచ్చరించిరి. వానిని విని రాముఁడత్యంత హర్షము నొందెను. ఆశ్రమాభ్యంతరమునందలి స్వగృహమును ప్రవేశించి తపోనిధీ తండ్రియునైన జమదగ్నిని రాముఁడు దర్శించేను. ఆతఁడు సాక్షాత్ భృగుమహర్షివలె విగ్రహానుగ్రహ సమర్ధుఁడు, రాముఁడు తండ్రి చరటోషాంతము సాష్టాంగోలింగితభూమియై నమస్కలించి, “వేము రాముఁడను. మీరదాసుఁ డను ఆనుచు సాష్టాంగ మాచరించెను. సజ్జపొగడియయిన రాముఁడు తండ్రి పాదములు పట్టుకొనెను. తరువాత తల్లి చరణ పద్మములను పట్టుకొని నమస్కరించి, అంజలీ బదుఁడయి తల్లిదండ్రులకు ఆనందకారణముగా రాముడిట్లనెను. ఓ జనకా ! పొందుటకు సాధ్యముకానీ గొప్పదియైన నీ తపః ప్రభావమున కార్తవీర్యుఁడు యుద్ధమున పుత్రబలవాహనములతోబాటు చంపఁబడెను.

యస్తే పరాధం కృతవాన్ దుష్టమంత్రిప్రచోదితః ।

తస్య దండో వయా దత్తః ప్రసహ్య మునిపుంగవ ॥

 భవంతం తు నమస్కృత్య గతోహం బ్రహ్మణోంతికమ్ ।

 తం నమస్కృత్య విధివత్వకార్యం ప్రత్యవేదయమ్ ॥

స మాముహచ భగవాఞ్చిత్వా వృత్తాంతమాదితః ।

 ప్రజ స్వకార్యసిధ్యర్థం శివలోకం పనాతనమ్ ॥

 శ్రుత్వాహం తద్వచస్తాత సమస్కృత్య పితామహమ్ ।

 గతమౌఞ్చివలోకం వై పారదర్శనకాంక్షయా ॥

 ప్రవిశ్య తత్ర భగవన్నుమయా సహితః శివః ।

 నమస్కృతో మయా దేవో వాంఛితార్థప్రదాయకః ॥

తదగ్రే నిఖిలః స్వీయో వృత్తాంతో వినివేదితః ।

మయా సమాహితధియా స సర్వం శ్రుతవానపి ॥

శ్రుత్వా విచార్య తత్సర్వం దదౌ మహ్యం కృపాన్వితః ।

త్రైలోక్యవిజయం సామ కవచం పర్వసిద్ధిదమ్ ॥

 తల్లబౌ తం నమస్కృత్య పుష్కరం సముపాగతః ।

 తత్రాహం సాదత్వా తు కవచం హృష్టమానసః ॥

కార్తవీర్యం నిహత్యాజా జీవలోకం పునర్గతః ।

 తత్ర తౌ తు మయా దృష్టి ద్వారీ స్కందనినాయకౌ॥

  తౌ నమస్కృత్య ధర్మ ప్రవేష్టుం చోద్యతో భవమ్ ।

 న మామవేక్ష్య గణపో విశదతీం త్వరయాన్వితమ్ ॥

  వారయామాస సహసా నాద్యావసర ఇత్యథ ।

 మమ తేన పితస్తత్ర వాగ్యుద్ధం హస్తకర్షణమ్ ॥

 సంజాతపరశుక్షేపముతో భూత్ భృగునందన ।

 స తజ్జ్ఞాత్వా సముద్గృహ్య మామధర్థ్వమేవ చ ॥

 కరేణ భామయామాస పువశ్చానీతహాంస్తతః ।

 తం దృష్ట్వాతిక్రుధా క్షిప్తః కుఠారో ఏ మయా తతః ॥

దంతో నిపతితస్తస్య తతో దేవ ఉపాగతః ।

 పార్వతీ తత్ర రుష్టా భూత్రదా కృష్ణ ప్రమాగతః ॥

 రాధయా సహితస్త్వసానునీతా వరం దదౌ ।

మహ్యం కృష్ణో జగామాథ తేవ మైత్రీ విధాయ చ ॥

 ఆతఁడు దుష్టుఁడయిన తన మంత్రిచే ప్రచోదితుఁడయి నీకపకార మొనర్చెను. ఆతనికి ఓ మునిపుంగవా ! అరదండన మొసంగితిని. మీకు నమస్కరించి బ్రహ్మ యొద్ద కరీగీతిని విధివంతముగా బ్రహ్మకు నమస్కరించి నా కార్యమంతయు నివేదించితిని. మొదటి నుండియు జరిగిన వృత్తాంతము సంతయు వాలకించి భగవానుఁడయిన బ్రహ్మ” స్వకార్య సిద్ధి కొఱకు సనాతనమయిన శివలోకమునకు నీ వరుగుము” అని పలుకగా విని ఆతని యజ్ఞ ననుసరించి, పితామహునకు నమస్కరించి, ఈశ్వర దర్శనాభిలాషిన శివలోకమున కరిగితీని శివలోకము ప్రవేశించితినీ అందు ఉమాసహితుఁడయిన భగవానునకు వాంఛిత ప్రదాతకు నమస్కరీంచితిని. అతని ముందు స్వీయచత్తాంతమును సమస్తమును నివేదించితిని. భగవానండు ప్వస్థచిత్తముతో పర్వము వృత్తాంతము నాలకించెను. వీని ఆధతయు, ఆలోచించి,కృపాన్వితుడయి, సర్వసిద్ధిదమందున త్రైలోక్యవిజయనామ కవచమును నాకోసబసు. దానిని స్వీకరించి, నమస్కరించి, పుష్కరమును (తీర్థమును జేరితిని. ఆందు హృష్ణమాపసు డనై కవచమును సాధించినవి. యుద్ధమున కార్తవీర్యుని జయించితిని. మరల శివలోకమున కరిగితీని. శివలోకమున జ్వరప్రదేశమున విరుషుడను చూచితిని. వారు స్కందవినాయకులు. వారికి నమస్కరించితిని. ఓ ధర్మజ్ఞ ! లోనికి ప్రవేశింప నుద్యమించితిని. గణపతి త్వరగా ప్రవేశింపబోవు నన్ను చూచి, “ఇప్పుడు సమయము కాదు' అని వెంటనే నివారించేను. ఓ తండ్రి ! ఆతతో వాగ్యుద్దమయినది. చేతులతో పెనుగులాడుకోంటీమిం, తరువాత పరశును విసరుట యయ్యెను, గణపతీ అదిరేటింగి నన్ను చేతితో పట్టుకొని పన్ను క్రిందకు ఫైకి త్రిప్పి క్రిషి, తరువాత మరల నన్ను ముందు నేనున్న ప్రదేశమునకు తెచ్చి నిలిపెను. ఆతనిని చూచి అతిక్రుద్ధుఁడ సయితిని. కుఠారమును నాతనిపైకి విసరీతిని. తన్మూలమున గణపతీ దంతమూఁడి నేలకు రాలేను. అంతలో ప్రభువచ్చటికి వచ్చెను. పార్వతీ అచ్చట చాల కోపించెను. అంత రాధతో సహితముగ కృష్ణుఁడు వచ్చెను. పార్వతీ రాధతో సహితముగా కృష్ణునిచే అనునయంపఁబడెను. కృష్ణుఁడు నాకు వరమొసంగేను. కృష్ణుఁడు పార్వతితో స్నేహమును కలిగించి వెడలిపోయేను.

 తతః ప్రణమ్య దేవేశౌ పార్వతీపరమేశ్వరౌ ।

 ఆగతస్తవ సాన్నిద్ధ్యమఋతవ్రణసంయుతః ॥

 వసిష్ఠ ఉవాచ :-

ఇత్యుక్త్వా భార్గవో రామో వీరరామ చ భూపతే ।

 జముడిగ్నిటువాదం రామం శత్రువీజరణమ్ ॥

జమదగ్ని రువాచ :-

క్షత్రహత్యాభిభూతస్త్వం తానద్దోషోపశాంతయే ।

 ఫ్రాయశ్చిత్తం తతస్తాపద్యభవత్కర్తుమర్హసి ॥

 ఇత్యు క్తః ప్రాహ పితరం రామో మతిమతాం వరః ।

 ప్రాయశ్చిత్తం త తద్యోగ్యం త్వం మే నిర్దేషుమర్హసి ॥

 ప్రతైశ్చ నీయమైశ్చైవ కర్షియన్ దేహమాత్మనః ।

 శాకమూలఫలాహారో ద్వాదశాబ్దం తపశ్చర ॥

వసిష్ట ఉవాచ :-

ఇత్యుక్తః ప్రణీపత్యైనం మాతరం చ భృగూద్వహః ।

 ప్రయయౌ తపసే రాజన్నకృతవ్రణసంయుతః ॥

 స గత్వా పర్వతవరం మహేంద్రవరీకర్షణ ।

 కృత్వా శ్రమపదం తస్మింస్తపస్తేపే సుదుశ్చరమ్ ॥

 ప్రతైస్తపోభిర్నియమైర్దేవతారాధనైరపి ।

 నిన్యే వరాణి కలిచిధ్రామస్తస్మిన్ మహామనాః ॥

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే ఫాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే

 సగరోపాఖ్యానే భార్గవచరితే చతుశ్చత్వారింశత్తమో ధ్యాయః ॥

తరువాత దేవేశ్వరులయిన పార్వతీ పరమేశ్వరులకు నేను నమస్కరించీ అకృతప్రణునితో కూడి నీ దగ్గరకు వచ్చితిని.

వసిష్టుఁడిట్లనెను.

ఇట్లు పలికి భార్గవ రాముఁడూరకుండెను. శత్రునిబర్హణుఁడయిన రామునితో జమదగ్ని ఇట్లు పలికెను.

 జమదగ్ని యనెను :-

క్షత్రియ హననముచే నీకు పాపము సంక్రమించినది. తద్ధోషముపశాంతించుటకు, ప్రాయశ్చిత్తము యథాశాస్త్రము చేయవలసి యున్నది. ఇట్లు చెప్పఁబడి తండ్రిచే, మతిమంతులలో శ్రేష్ఠుఁడయిన రాముఁడు “తద్యోగ్యమయిన ప్రాయశ్చిత్తమును నిర్దేశించుటకు నీవే అర్హుఁడవు” అనెను.

నాయనా ! వ్రతములచే నియమములచే స్వదేహమును కృశింపజేసి, శాకమూలఫలాహారివై పండ్రెండు సంవత్సరములు తపమాచరింపు మనెను.

 వసిష్ఠుఁడిట్లునుడివెను.

తండ్రిచే నిట్లుచెప్పఁబడి భృగూద్వహుఁడయిన రాముఁడు తల్లికి తండ్రికి నమస్కరించి, అకృతవణునితోకూడి అరికర్షణుఁడయిన రాముఁడు పర్వతవరమయిన మహేంద్రగిరి కరిగి, అచ్చట ఆశ్రమమును నేర్పరచుకొని, అందు సుదుశ్చరమయిన తపమాచరించెను. వ్రతములచే, తపస్సులచే, నియమములచే, దేవతారాధనలనే మహామనీషి రాముఁడందు కొన్ని సంవత్సరములు గడిపెను.

ఇది వాయుప్రోక్తము మహాపురాణమునైన బ్రహ్మాండపురాణమునందు మధ్యమభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున సగరోపాఖ్యానమున భార్గవచరితలో నలుబది నాలుగవ అధ్యాయము.