26 - విషంగపలాయనం

దశాక్షౌహిణికాయుక్తః కుటిలాక్షోఽపి వీర్యవాన్

 దండనాథాశరైస్తీక్ష్ణై రణే భగ్న పలాయితః

 దశాక్షౌహిణికంసైన్యం తయా రాత్రౌ విసాశీతమ్

 ఇమం వృత్తాంతమాకర్ణ్య భందః క్షోభమథాయయౌ

 రాత్రౌ కపటసంగ్రామం దుష్టానాం నిర్జరద్రుహామ్

 మంత్రిణీదండనాథా చ శ్రుత్వా నిర్వేదమాపతు:

 అహో బత మహత్కష్టం దైత్యైర్దేవ్యాః సమాగతమ్

 ఉత్తానబుద్ధిభిర్దూరమస్మాభిశ్చలితం పుర:

 మహాచక్రరధేంద్రస్య న జాతం రక్షణం బలైః

 ఏతం త్వవసరం ప్రాప్య రాత్రౌ దుష్టైః పరాకృతమ్

 కో వృత్తాంతోఽభవత్తత్ర స్వామిన్యా కిం రణః కృతః

 అన్యా వా శక్తయస్తత్ర చక్రుర్యుద్ధం మహాసురైః

 విమ్రష్టవ్యమిదం కార్యం ప్రవృత్తిస్తత్ర కీదృశీ

 మహాదేవ్యాశ్చ హృదయే కః ప్రసంగః ప్రవర్తతే

 ఇతి శంకాకులాస్తత్ర దండనాథాపురోగమాః

 మంత్రిణీం పురతః కృత్వా ప్రచేలుర్లలితాం ప్రతి

 శక్తిచక్రచమూనాథాః సర్వాస్తాః పూజితా ద్రుతమ్

 వ్యతీతాయాం విభావర్యాం రథేంద్రం పర్యవారయన్

 అవరుహ్య స్వయానాభ్యాం మంత్రిణీదండనాయికే

అధస్తాసన్యమావేశ్య తదో రురుహతూరథమ్

 క్రమేణ నవ పర్వాణి వ్యతీత్య త్వరితక్రమైః

 తత్తత్సర్వగతైః శక్తిచక్రైః: సమ్యజ్ నివేదితైః

 అభజేతాం మహారాజ్ఞిం మంత్రిణీదండనాయికే

 తే వ్యజిజ్ఞపతాం దేవ్యా అష్టాంగస్పృష్టభూతలే

మహాప్రమాదః సమభూదితి నః శ్రుతమంబికే

 కూటయుద్ధప్రకారేణ దైత్యైరపకృతం ఖలైః

 స దురాత్మ దురాచారః ప్రకాశసమరాత్త్రసన్

 కుహకవ్యవహారేణ జయసిద్ధిం తు కాంక్షతి

 దైవాన్న: స్వామినీగాత్రే దుష్టానామమరద్రుహామ్

 శరాదికపరామర్శో న జాతస్తేన జీవతి

 ఏకావలంబనం కృత్వా మహారాజ్ఞి భవత్పదమ్

వయం సర్వా హి జీవామః సాధయామః సమిహితమ్

 అతోఽస్మాభిః ప్రకర్తవ్యం శ్రీమత్యంగస్య రక్షణమ్

 మాయావినశ్చ దైత్యేంద్రాస్తత్ర మంత్రో విధీయతామ్

 ఆపత్కాలేషు జేతవ్యా భండాద్యా దానవాధమా

 కూటయుద్ధం న కుర్వంతి న విశంతి చమూమిమామ్

 తథా మహేంద్రశైలస్య కార్యం దక్షిణదేశతః

 శిబిరం బహువిస్తారం యోజనానాం శతావధి

 వహ్ని ప్రాకారవలయం రక్షణార్థం విధీయతామ్

 అస్మత్సేనానివేశస్య ద్విషాం దర్పశమాయ చ

 శతయోజనమాత్రస్తు మధ్యదేశః ప్రకల్ప్యతామ్

వహ్ని ప్రాకారచక్రస్య ద్వారం దక్షిణతో భవేత్

 యతో దక్షిణదేశస్థం శూన్యకం విద్విషాం పురమ్

 ద్వారే చ బహవః కల్ప్యాః పరిరావారా ఉదాయుధాః

  నిర్గచ్ఛతాం ప్రశిశతాం జనానాముపరోధకాః

అనాలస్యా అనిద్రాశ్చ విధేయాః సతతోద్యతాః

ఏవం చ సతి దుష్టానాం కూటయుద్ధం చికీర్షితమ్

 అవేలాసు చ సంధ్యాసు మధ్యరాత్రిషు చ ద్విషామ్

అశక్యమేవ భవతి ప్రౌఢమాక్రమణం హఠాత్

 నోచేద్దురాశయా దైత్యా బహుమాయాపరిగ్రహాః

 పశ్యతోహరవత్సర్వం విలుఠంతి మహద్బలమ్

 మంత్రిణ్యా దండనాథాయ ఇతి శ్రుత్వా వచస్తదా

 శుచిదంతరుచా ముక్తా వహంతీ లలితా బ్రవీత్

 భవతీనామయం మంత్రశ్చారుబుద్ధ్యా విచారితః

57

అయం కుశలధీమార్గో నీతియేషా సనాతనీ

 స్వచక్రస్య పురో రక్షాం విధాయ దృఢమానసైః

 పరచక్రాక్రమః కార్యో జిగీషిర్మహాజనైః

 ఇత్యుక్త్వా మంత్రిణీదండనాథ సా లలితేశ్వరీ

 జ్వాలామాలినికాం నీత్యామాహూయేదమువాచ హ

 వత్సే త్వం వహ్నిరూపాసి జ్వాలామాలామయాకృతిః

 త్వయా విధీయతాం రక్షా బలస్యాస్య మహీయసః

 శతయోజనవిస్తారం పరివృత్య మహీతలమ్

 త్రింశద్యోజనమున్నద్ధం జ్వాలాకారత్వమావ్రజ

 ద్వారయోజనమాత్రం తు ముక్త్వాన్యత్ర జ్వలత్తనుః

వహ్ని జ్వాలాత్వమాపన్నా సంరక్ష సకలం బలమ్

 జ్వాలామాలినికాం నిత్యామిత్యుక్త్వా లలితేశ్వరీ

 మహేంద్రోత్తరభూభాగం చలితుం చక్ర ఉద్యమమ్

 సాచ నిత్యానిత్యమయీ జ్వలజ్జ్వలామయాకృతిః

 చతుర్దశీతిథమయీ తథేతి ప్రణనామ తామ్

 తయైవ పూర్వనిర్దిష్టం మహేంద్రోత్తరభూతలమ్

కుండలీకృత్య జజ్వాల శాలరూపేణ సా పునః

 నభోవలయజంబాలజ్వాలామాలామయాకృతిః

 బభాసే దండనాథాయ మంత్రినాథచమూరపీ

 అన్యాసామపి శక్తీనాం మహతీనాం మహద్బలమ్

 విశంకటోదరం సాలం ప్రవివేశ గతక్లమా

 రాజచక్రరథేంద్రం తు మధ్యే సంస్ధాప్య దండినీ

 వామపక్షే రథం స్వీయం దక్షిణే శ్యామలారథమ్

పశ్చాద్భాగే సంపదేశం పురస్తాఛ్చ హయాసనామ్

 ఏవం సంవేశ్య పరీతశ్చక్రరాజరథస్య చ

 ద్వారే నివేశయామాస వింశత్యక్షౌహిణీయుతామ్

జ్వలద్దండాయుధోదగ్రాం స్తంభినీం నామ దేవతామ్

యా దేవీ దండనాథాయా విఘ్నదేవీతి విశ్రుతా

 ఏవం సురక్షితం కృత్వా శిబిరం యోత్రిణీ తథా

 పూషణ్యుదితభూయిష్ఠే పునరుద్దముపాశ్రయత్

 కృత్వా కిలకిలారావం తతః శక్తిమహాచమూ:

 అగ్నిప్రాకారకద్వారాన్నిర్జగామ మహారవా

ఇత్థం సురక్షితం శ్రుత్వా లలితా శిబిరోదరమ్

 భూయః సంజ్వరమాపన్నః ప్రచండో థండదానవ

 మంత్రయిత్వా పునస్తత్ర కుటిలాక్ష పురోగమై:

 విషంగేణ విశుక్రేణా (ణ) సమమాత్మసుతైరపి

 ఏకౌఘస్య ప్రసారేణ యుద్ధం కర్తుం మహాబలః

 చతుర్బాహుముఖాన్ పుత్రాంశ్చతుర్జలధిసన్నిభాన్

చతురామ్యద్ధకృత్యేషు సమాహూయ స దానవః

 ప్రేషయామాస యుద్ధాయ భందశ్చండక్రుధా జ్వలన్

 త్రింశత్సంఖ్యాశ్చ తత్పుత్రా మహాతాయా మహాబలః

 తేషాం నామాని వక్ష్యామి సహకర్ణయ కుంభ

 చతుర్బాహుశ్చకోరాక్షస్తృతీయస్తు చతుఃశీరా:

వజ్రఘోషశ్చోర్ద్వకేశో మహాకాయో మహాహనుః

 మఖశత్రుర్మఖస్కందీ సింహఘోషః సిరాలక:

 లడునః పట్టసేనశ్చ పురాజిత్ పూర్వమారకః

స్వర్గశత్రుః స్వర్గబలో దుర్గాఖ్యః స్వర్గకంటకః

 అతిమాయో బృహన్మాయ ఉపమాయశ్చ వీర్యవాన్

 ఇత్యేతే దుర్మదాః పుత్రా భండదైత్యస్య దుర్ధియః

 పితుః సదృశదోర్వీర్యాః పితుః సదృశవిగ్రహాః

ఆగత్య భండచరణావభ్యవందత భక్తితః

 తానుద్వీక్ష్య ప్రసన్నాభ్యాం లోచనాభ్యాం సదానవః

సగౌరవమిదం వాక్యం బభాషే కులఘాతకః

 భో భో మదీయాస్తనయా భవతాం కః సమో భువి

 భవతామేవ సత్త్వేన జీతం విశ్వం మయా పురా

శక్రస్యాగ్నేర్యమస్యాపి నిరృతేః పాశినస్తథా

 కచేషు కర్షణం కోపాత్ కృతం యుష్మాభిరాహవే

 అస్త్రాణ్యపి చ శస్త్రాణి జానీథ నిఖిలాన్యపి

జాగ్రత్స్యేవ హి యుష్మాసు కులభ్రంశోఽయమాగత:

 మాయావినీ దుర్లలితా కాచిత్స్తీ యుద్ధదుర్మదా

 బహుభిః స్వసమానాభీ: సీభిర్యుక్త హీనస్తి నః

 తదేనాం సమరేఽవశ్యమాత్మవశ్యాం విధాస్యథ

 జీవగ్రాహం చ సా గ్రాహ్యా భవద్భీర్జ్వలదాయుధైః

 అప్రమేయప్రకోపాంధాన్యుష్మానేకాం స్త్రీయం ప్రతి

 సంప్రేషణమనౌచిత్యం తధాప్యేష విధేః క్రమః

 ఇమమేకం సహధ్వం చ శౌర్యకీర్తివిపర్యయమ్

 ఇత్యుక్త్వా భండదైత్యేంద్రస్తాన్ ప్రహైషీద్రణం ప్రతి

 ద్విశతం చౌక్షౌహిణీనాం తత్సహాయతయాఽహినోత్

 ద్విశత్యక్షౌహిణీసేనాముఖ్యస్య తిలకాయితా

బద్ధభ్రుకుటయః శస్త్రపాణయో నిర్యయుర్గృహాత్

 నిర్గమే భంగపుత్రాణాం భూః ప్రకంపమలంబత

 ఉత్పాతా వివిధ జాతా విత్రస్తం చాభవజ్జగత్

 తాన్ కుమారాస్ మహాసత్త్వాన్ లాజవర్షైరవాకిరన్

 వీథీషు యానైశ్చలితాన్ పౌరవృద్ధపురంధ్రయ:

 వందినో మాగధాశ్చైవ కుమారాణాం స్తుతిం వ్యధు:

 మంగలారార్తికం చక్రుర్ద్వారే ద్వారే పురాంగనాః

భిద్యమానేవ వసుధా కృష్యమాణమివాంబరమ్

 ఆసీత్తేషాం వినిర్యాణీ ఘూర్ణమాన ఇవార్ణవః

 ద్విశత్యక్షౌహిణీసేనాం గృహీత్వా భండసూనవః

క్రోధోద్యద్భ్రకుటీక్రూరవదనా నిర్యయుః పరాత్

 శక్తి సైన్యాని సర్వాణి భక్షయామః క్షణాద్రణే

 తేషామాయుధచక్రాణి చూర్ణయామః శితైః శరైః

 అగ్నిప్రాకారవలయం శమయామశ్చ రంహసా

దుర్విదగ్ధాం తాం లలితాం బందీకుర్మశ్చ సత్వరమ్

 ఇత్యన్యోన్యం ప్రవల్గంతో వీరభాషణహోషణైః

 ఆసేదురగ్ని ప్రాకారసమిపం భండసూనవః

 యౌవనేన మదేనాంధా భూయసా రుద్ధదృష్టయః

 భ్రుకుటీకుటిలాశ్చక్రుః సింహనాదం మహత్తరమ్

 విదీర్ణమివ తేనాసీద్భ్రహ్మాండం చండిమసృశ

 ఉత్పాతవారిదోత్సృష్టఘోరనిర్ఘాతరంహసా

 ఏతస్యాననుభూతస్య మహాశబ్దస్య డంబరః

క్షోభయామాస శక్తీనాం శ్రవాంసీ చ మసాంసి చ

 ఆగత్య తే కలకలం చక్రుః సార్థం స్వసైనికైః వివిధాయుధసంపాతమూర్ఛద్వైమాసికచ్ఛటమ్

చతుర్భాహుముఖాన్ భూత్వా భండదైత్యకుమారకాస్

 ఆగతాన్ యుద్ధకృత్యాయ బాలా కౌతూహలం దధే

 కుమారీ లలితాదేవ్యాస్తస్యా నీకటవాసినీ

 సమస్తశక్తిచక్రాణాం పూజ్యా విక్రమశాలినీ

 లలితాసదృశాకారా కుమారీ కోపమాదదే

యా సదా నవ వర్షేన సర్వవిద్యామహాఖనిః

 బాలారుణతను:శ్రోణీ శోణవర్ణవపుర్లతా

 మహారాజ్ఞీ పాదపీఠే నిత్యమాహితసన్నిధి:

 తస్యా బహిశ్చరాః ప్రాణా యా చతుర్ధం విలోచనమ్

తానాగతాన్ భండసుతాన్ సంహరిష్యామి సత్వరమ్

 ఇతి నిశ్చిత్య బాలాంబా మహారాజ్ఞ్యై వ్యజిజ్ఞపత్

 మాతర్భండమహాదైత్యసూనవో యోద్ధుమాగతాః

తైః సమం యోద్ధుమిచ్ఛామి కుమారిత్వాత్సకౌతుక

స్ఫురస్తావివ మే బాహూ యుద్ధకండూయయానయా

 క్రీడా మమైషా హస్తవ్యా న భవత్యా నివారణైః:

 అహం హి బాలికా నిత్యం క్రీడనేష్వనురాగిణీ

 క్షణం రణక్రీడయా చ ప్రీతిం యాస్యామి చేతసా

 ఇతి విజ్ఞాపితా దేవీ ప్రత్యువాచ కుమారికామ్

 వత్సే త్వమతిమృద్వంగీ నవవర్షా నవక్రమా

 నవీనయుద్దశీక్షా చ కుమారీ త్వం మమైకీకా

 త్వాం వినా క్షణమాత్రం మే న నిశ్వాసః ప్రవర్తతే

 మమోచ్చ్వసితవాసి న త్వం యాహి మహాహవమ్

 దండినీ మంత్రిణీ చైవ శక్తయోఽన్యాశ్చ కోటిశ:

 సంత్యేవ సమరే కర్తుం వత్సే త్వం కిం ప్రమాద్యసి

 ఇతి శ్రీ లలితాదేవ్యా నిరుద్ధాపి కుమారికా

 కౌమారకౌతుకావిష్టా పునర్యుద్ధమయాచత

 సుదృఢ నిశ్చయం దృష్ట్వా తస్యాః శ్రీలలితాంబికా అనుజ్ఞాం కృతవత్యేవ గాఢమాశ్లిష్య బాహుభిః

 స్వకీయకవచాదేకమాచ్ఛిద్య కవచం దదౌ

 స్వాయుధేభ్యశ్చాయుధాని వితీర్య విససర్ణ తామ్

 కర్ణీరథం మహారాజ్ఞ్యా చాపదందాత్సముద్ధృతమ్

 హంసయుగ్యశతైర్యుక్తమారురోహ కుమారికా

తస్యాం రణప్రవృత్తాయాం సర్వపర్వస్థదేవతా

 బద్ధాంజపుటా నేము: ప్రధృతాసిపరంపరా:

 తాభిః ప్రణమ్యమానా సా చక్రరాజరథోత్తమాత్

 అవరుహ్య తలే సైన్యం వర్తమానమగాహతు

తామాయాంతీమథో దృష్ట్యాకుమారీం కోపపాటమ్

 మంత్రిణీదండనాథే చ సభయం వాచమూచతుః

కిం భర్తృదారికే యుద్ధే వ్యవసాయః కృతస్త్వయా

 అకాండే కిం మహారాజ్ఞ్యా ప్రేషితాసి రణం ప్రతి

తదేతదుచితం నైవ వర్తమానేఽపి సైనికే

 త్వం మూర్తం జీవితమసి శ్రీదేవ్యా బాలికే యతః

నివర్తస్వ రణోత్సాహాత్ ప్రణామస్తే విధీయతే

ఇతి తాభ్యాం ప్రార్థితాఽపి ప్రాచలద్ధృడనిశ్చయా

 అత్యంతం విస్మయావిష్టే మంత్రిణీదండనాయికే

 సహైవ తస్యారక్షార్థం చేలతుః పార్శ్వయోర్ద్వయోః

అథాగ్నివరణద్వారా తాభ్యామసుగతా సతీ

 ప్రభూతసేనాయుక్తాభ్యాం నిర్జగామ కుమారికా

 సనాథశక్తిసేనానాం సర్వాసామనుగృహ్ణాతీ

 ప్రణామాంజలిజాలాని కర్ణీరథకృతాసన

 భండస్య తనయాన్ దుష్టానభ్యద్రవదరిందమా

తస్యాః ప్రాదేశికం సైన్యం కుమార్యా న హి విద్యతే

 సర్వం హి లలితాసైన్యం తత్సైన్యం సమజాయ

 తతః ప్రవవృతే యుద్దమత్యుద్ధతపరాక్రమమ్

 వవర్ష శరజాలానీ దైత్యేంద్రేషు కుమారికా

భండాసురకుమారెస్తైర్మహారాజ్ఞికుమారికా

 యద్యుద్ధమతనోత్తత్తు స్పృహణీయం సురాసురైః

 అత్యంతవిస్మితా దైత్యకుమారా నవవర్షిణీమ్

 కర్ణీరథస్థామాలోక్య కిరంతీం శరమండలమ్

 క్షణే క్షణే బాలికయా క్రియమాణం మహారణమ్

వ్యజిజ్ఞపన్ మహారాజ్ఞ్యై భ్రమంత్య పరిచారికాః

 మంత్రిణీదండనాథే చ న తార విజహతూరణే

ప్రేక్షకత్వమనుప్రాప్తే తూష్ణీమేవ బభూవతు

సర్వేషాం దైత్యపుత్రాణామేకరూపా కుమారీకా

 ప్రత్యేకభిన్నా దదృశే బింబమాలేవ భాస్వతః

సాయకైరగ్నిచూడాలైస్తేషాం మర్మాణి భిందతీ

 రక్తోత్పలమివక్రోధసంరక్తం భిభ్రతీ ముఖమ్

ఆశ్చర్యం బ్రువతో వ్యోమ్ని పశ్యతాం త్రిదివౌకసామ్ సాధువాదైర్బహువిధైర్మంత్రిణీదండనాథయోః

అర్చ్యమానా రణం చక్రే లఘుహస్తా కుమారికా

 ద్వితీయం యుద్ధదివసం సమస్తపి సా రణే

ప్రకాశయామాస బలం లలితాదుహితా నిజమ్

 అస్త్రప్రత్యస్త్రమోక్షేణ తాన్ సర్వానపి భిందతీ

నారాయణాస్త్రమోక్షేణ మహారాజ్ఞికుమారీకా

 ద్విశత్యక్షౌహిణీ సైన్యం భస్మసాదకరోత్ క్షణాత్

 అక్షౌహిణీనాం క్షయతః క్షణాత్కోపముపాగతాః

ఆకృష్టగురుధన్వాన స్తే ఽపతన్నేకహేలయా

 తతః కలకలే జాతే శక్తీనాం చ దివౌకసామ్

యుగపత్రింశతో బాణానసృజత్సా కుమారికా

 హస్తలాఘవమాశ్రిత్య ముక్తేశ్చంద్రార్ధసాయకైః

 త్రింశతా త్రింశతోభండపుత్రాణామాహతం శిర:

 ఇతి భండస్య పుత్రేషు ప్రాప్తేషు యమసాదనమ్

 అత్యంత విస్మయావిష్టో వవృషుః పుష్పమభ్రగా:

 సా చ పుత్రీ మహారాజ్ఞ్యా, విధ్వస్తాసురసైనికా

 మంత్రిణీదండనాథాభ్యామాలింగ్యత భృశం ముదా

 తస్యాః పరాక్రమోన్మేషైర్నృత్యంత్యో జయదాయిభిః

 శక్తయస్తుములం చక్రుః సాధువాదైర్జగత్రయమ్

 సర్వాశ్చ శక్తిసేనాన్యో దండనాథాపురఃసరాః

తదాశ్చర్యం మహారాజ్ఞ్యై నివేదయితుముద్గతాః

తాభిర్నివేద్యమానాని సా దేవీ లలితాంబికా

 పుత్రీభుజావదానిని శ్రుత్వా ప్రీతిం సమాయయౌ

 సమస్తమపితచ్చక్రం శక్తీనాం తత్పరాక్రమైః

అదృష్టపూర్వైర్దేవేషు విస్మయస్య వశం గత

ఇతి శ్రీబ్రహ్మాండమహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్వసంవాదే లలితోపాఖ్యానే

భండపుత్రవధో నామ షడ్వింశోఽధ్యాయః

ఇక శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున భండపుత్రవధమను నిరువదియారవయధ్యాయము .

పది యక్షౌహిణుల సైన్యముతో గూడి వీర్యవంతుడైన కుటిలాక్షుడు, దండనాథ యొక్క వాడియైన బాణములతో రణమున భగ్నుడై పారిపోయెను. రాత్రి యందామె చేత పది యక్షౌహిణుల సైన్యము ధ్వంసము చేయబడినదీ. తరువాత నీ వృత్తాంతమును విని భండాసురుడు క్షోభమును జెందెను. రాత్రియందు దుష్టులైన రాక్షసుల కపట యుద్దమును విని మంత్రిణియు దండనాథయు నిర్వేదమును (హేయత్వ బుద్ధిని) బొందిరి, ఆశ్చర్యము అయ్యో! దానవులతో దేవికి మిక్కిలి కష్టము వచ్చిపడినది. పైకి వెలిగిన బుద్ధిగల మేమెదుట ముందుకు సుదూరముగా దాడి వెడలితిమి. మహాచక్రరథేంద్రము యొక్క రక్షణము సైన్యముల చేత జరుగలేదు. ఈ యవసరము దీసికొనీ రాత్రిలో దుష్టులు పరాక్రమించిరి, అక్కడ ఏ వృత్తాంతము జరిగినది! స్వామిని ఏ రణము జేసినది! ఇతర శక్తులేమైన నచట మహాసురులతో యుద్ధము చేసిరా? . ఈ కార్యము విమర్శింపదగినది. అచట ప్రవృత్తి యెట్టిది? మహాదేవి యొక్క యెదలో ఏ ప్రసంగమున్నది? - అని యచట దండనాథ మొదలగువారు శంకచే ఆకులురు. వెంటనే మంత్రిణిని ముందడుకొని లలితా దేవి కడకు కదలిరీ. రాత్రి గడషగనే ఆ సమస్త శక్తి చక్రము యొక్క సేనానాయకురాళ్లు పూజింపబడినవారై వేగముగా రథేంద్రమును చుట్టుముట్టిరీ-రీ. మంత్రిణీ - దండ సాయికలు తమ యానము (వాహనముల) నుండి దిగి క్రింద సైన్యము నావేశించి చక్కపరిచి యపుడు రథమునెక్కిరి. ఆయా పర్వముల నుండు శక్తి చక్రములు లలిత. యునీకీనీ నివేదింపగా వేగమైన నడకలతో క్రమముగా తొమ్మిది పర్వములను దాటి. మంత్రిణీ దండనాయికలు మహారాజ్ఞిని జేరి సేవించిరి. భూమిపై సాష్టాంగముగా బడి నమస్కరించి యీ విధముగా విజ్ఞాపనము చేసిరి. ఓ అంబికే! మహా ప్రమాదము వాటిల్లినదని వింటీమి. నీచ రాక్షసులు కూట యుద్ధ ప్రకారమున నపకారము జేసిరి. ఆ దురాత్ముడు, దురాచారుడు పగటి యుద్ధమునకు భీతిల్లి కపట వ్యవహారముతో జయసిద్దిని గోరుచున్నాడు . దైవ వశమున మనస్వామిని యొక్క శరీరముపైన బాణములు మొదలగునవి తాకుట జరుగలేదు. కావున వాడు జీవించియున్నాడు. ఓ మహారాజ్ఞి! నీ పాదమునొక్కదానినే యాధారముగా జేసికాని మేమందరము జీవించుచున్నాము. కోరిన దానిని సాధించుచున్నాము. కావున మేము శ్రీమతి యొక్క యంగరక్షణము జేయవలసియున్నది. దానవేంద్రులు మాయావులు. కావున అటువైపుగా మంత్రము. ఆలోచనము, మాయా నివారక మంత్రము)ను ప్రయోగింపుడు, ఆపత్సమయములలో భండాసురుడు మొదలగు రాక్షసాధములను జంపవలెను, " అపుడు వారు. కపట , యుద్ధమును జేయరు. ఈ మనసేనలో బ్రవేశింపరు. మహేంద్రశైలము యొక్క దక్షిణ భాగముగా నూరు -- యోజనముల వరకు విస్తరించిన శిబిరమును నిర్మింపవలెను. మన సేనా నివాసమునకు రక్షణకై గుండ్రని వహ్నిప్రాకారమును నిర్మింపవలెను. దాని వలన శత్రువుల మదము శాంతించును. నూరు యోజనముల పరిమాణమున ప్రాకార మధ్యప్రదేశము నేర్పరుపవలె, వహ్ని ప్రాకార చక్రమునకు ద్వారము దక్షిణమువైపు నుండి యుండవలె. కారణము. శత్రువుల పరమైన శూన్యకపురము . -అందు దక్షిణ దేశముననున్నది. ద్వేరమున ఆయుధములనెత్తి సిద్ధముగానున్న పెక్కు పరివారముల నీయోగింపవలె. వారు వచ్చువారినీ, పోవువారిని అడ్డుకొందురు. వారికి అలసట యుండదు. నిద్రమత్తులుండవు. ఎప్పుడును సంసిద్దులుగా నుందురు. ఈ విధముగా జేసినచో, అసమయములగు సంధ్యలలోను, మధ్యరాత్రులలోను ఆ దుష్టదానవులు చేయదలచీన కపట యుద్ధము సాధ్యపడదు. అకస్మాత్తుగా . హరి ప్రౌఢమైన యాక్షణము సంభవముగాదు . అట్లుకానిచో దురాశచే బహు మాయ. అవలంబించిన దైత్యులు. పశ్యతోహరునివలె (చూచుచుండగనే దొంగిలించువాని (కంసాలి) వలే) మన మహాసైన్య బలము నంతయు హరించి వైచెదరు. మంత్రిణి యొక్కయు దండనాథ యొక్కయు నీ మాటలను విని స్వచ్ఛమైన దంత కాంతిచేత ముత్యముల వెదజల్లుచు లలితా దేవి యిట్లనెను. మీ యొక్క యీ మంత్రాలోచనము చక్కని బుద్దీతో చేయబడినది. ఇదియే కుశలమైన బుద్ధి యొక్క మార్గము. ఇది ప్రాచీనమైన నీతి. జయింపగోరు మహాజనులు దృఢమనస్కులై తమ సైన్య చక్రము యొక్క రక్షణము జేయవలెను. తరువాత పరసైన్య చక్రము సక్రమింపవలెను, ఈ విధముగా మంత్రి-దండనాధలతో జెప్పి శ్రీ లలితా పరమేశ్వరి జ్వాలామాలినికయను నిత్యాశక్తిని బిలిచి యిట్లనెను. హే వత్సే! నీవు అగ్ని స్వరూపవు. జ్వాలామాలామయము నీయాకారము. నీవే మహాసైన్య బలమును రక్షింపుము. నూరు యోజనముల . విస్తారమైన భూతలమునావరించి ముప్పది యోజనములు పైకి క్కినవైన జ్వాలామాలలయాకారమును వహింపుము. ద్వారప్రదేశమునందు యోజన మాత్రము వదిలి తక్కిన చోట నంతటను మండుచున్న శరీరము గలిగి అగ్ని జ్వాలా రూపమునంది సమస్త బలమును (సైన్యమును) రక్షింపుము. జ్వాలామాలినీకానిత్యాశక్తితో నిట్లు చెప్పీ లలితేశ్వరి మహేంద్ర పర్వతము యొక్క యుత్తర భాగమునకు బోవయత్నము జేసెను. ఆ నీత్యాశక్తి నీత్యయయి, (నాశనములేనిదై} మండుచున్న జ్వాలలే తన యాకారముగా గలది. చతుర్దశీతిథమయి - అట్లే చేసెదనని యామెకు నమస్కరించెను. లలితా దేవీ పూర్వమే చేప్పిన మహేంద్ర పర్వతము యొక్క ఉత్తర భూ భాగమును చుట్టుముట్టి యా జ్వాలా మాలినీ ఒక శాలము రూపమున (సైనిక నివాసము వలే) ప్రకాశించెను. (అది భయంకర అగ్ని జ్వాలలచే రక్షింబడుచున్నట్లుండెను. ). దండనాథ యొక్కయు మంత్రీనాథ యొక్కయు సైన్యము గూడ ఆకాశమండలమునుకుబారీన జ్వాలా మాలామయమైన యాకారముగలదై ప్రకాశించెను. (జ్వాలలు ఆకాశమునంటి ప్రకాశించెను). ఏ మాత్రము శ్రమ లేకయే తక్కిన మహాశక్తుల యొక్క మహా బలమును అగ్ని జ్వాలా రక్షితమైన శాలమున ప్రవేశించెను, దండినీ శక్తి రాజచక్రరథమును మధ్యన నుండజేసెను. తన రథమును ఎడమ భాగమున నుంచేను. దక్షిణ భాగమున శ్యామలాదేవి రథమును నుండజేసెను. పశ్చిమ భాగమున సంపదీశ్వరిని, ముందున హయాసనను, ఈ విధముగా చక్ర రాజరథము యొక్క చుట్టును శక్తులను వాని రథములతో నుండజేసెను. ద్వారమున స్తంభిని యను దేవత నుండజేసెను. ఆమె యిరువది యక్షౌహిణుల సేనగలది. మండుచున్న దండాయుధములతో భయంకరమైనది. ఈమె దండనాథయొక్క వీఘ్నదేవిగా ప్రసిద్దీజెందినది. పగ్గపు త్రాడు ధరించిన దండనాథ సేనా శిబిరమును సురక్షితముగాజేసి సూర్యుడుదయింపగనే మరల యుద్దమారంభించెను, శక్తి మహాసేన కిలకిలా రావముజేసి అగ్ని ప్రాకారకద్వారము నుండి మహాధ్వనులతో బయలువెడలినది. ఈ విధముగా లలితా సైన్య మధ్య భాగము సురక్షితమని విని భండాసురుడు మరల సంజ్వరమును బొందెను. కుటిలాక్షుడు మొదలగు మంత్రులతో, విషంగునితోను, విశుక్రునితోను, ఆత్మసుతులతో గూడ సమముగా సమాలోచనము జరిపెను. మహా బలుడైన భండుడు తన పుత్రులందరినీ ఒకే గుంపుగా ప్రయోగించి యుద్ధము జేయదలచేను. నాలుగు సముద్రములతో సమానులు, యుద్ధ కృత్యములతో చతురులునైన చతుర్బాహువు మొదలగు పుత్రులను బీలిచి భండాసురుడు భయంకరక్రోధమున మండిపడుచు యుద్ధమునకు బంపెను, ఆతని పుత్రులు ముప్పదుగురు. మహాకాయులు, మహాబలులు. ఓ అగస్త్యా! వారి నామముల జెప్పెద వినుము. చతుర్బాహువు, చకోరాక్షుడు, చతుఃశిరుడు మూడవవాడు వజ్రహోషుడు, ఊర్వకేశుడు, మహాకాయుడు, మహాహనువు. మఖశత్రువు, మఖస్కందీ, సీంహఘోషుడు, సీరాలకుడు, లడునుడు, పట్టి సేనుడు, పురాజిత్, పూర్వమారకుడు-48. స్వర్గశత్రువు, స్వర్గబలుడు, దుర్గుడు, స్వర్ణ కంటకుడు, అతిమాయుడు, బృహన్మాయుడు, ఉపమాయుడు, వీర్యవంతుడు , ఈ వీరు దుర్మదులు దుర్బుద్దులునైన భండాసురుని పుత్రులు. తండ్రితో సమానమైన దుష్టపరాక్రమము గలవారు, తండ్రితో సమానమైన యాకారము గలవారు. వారు వచ్చి భండాసురుని పొదములకు. భక్తితో నమస్కరించిరి. వారిని చూచి ప్రసన్నమైన కన్నులతో ఆ కులఘాతకుడైన భండాసురుడు సగౌరవముగా నీ మాటలు పలికెను. ఓనా పుత్రులారా! మీకీ భూమిలో సమానులెవరు. మీ యొక్క బలముచేతనే పూర్వమునేను విశ్వమును జయించితిని-52. మీరు రణమున కోపముతో ఇంద్రుని యొక్కయు, అగ్ని యొక్కయు, యముని యొక్కయు, నీరృతియొక్కయు, వరుణని యొక్కయు సీగలను బట్టిలాగితీరీ-53. మీ సమస్త శస్త్రాస్త్రములును మీరును మేలుకొని యుండగనే యీ కులభ్రంశము వచ్చినదని తెలిసికొనుడు-54, మాయామిని, దుష్ట సౌందర్యముగలది, యుద్ద దుర్మదయునగు. నొకానొకగ్రీ, తనతో సమానమైన బహు స్త్రీలతో గూడినదై మసలను. జంపుచున్నది-55. కావున నీమేను యుద్దమున మీ వశము జేసికొనుడు. మండుచున్నయాయుధములుగల మీరు ఆమెను సజీవముగా బట్టుకొనవలె-56. అపరిమితకోపాంధ్యముగల మీమ్ములనొక స్త్రీ పైకి బంపుట యనుచితమే! ఐనను. ఇది విధి యొక్క క్రమము, తప్పలేదు-57. ఈ మీ శౌర్యకీర్తవ్యతిరేకము నొక్కదానిని సహింపుడు.  అని చెప్పి భండాసురుడు తన పుత్రులను యుద్దమునకు బంపెను. రెండు వందల  యక్షౌహిణీ సైన్యములను గూడ వారికి తోడుగానంపెను-58. రెండు వందల యక్షావోడీ సేనాముఖమునకు తీలకమువలె నున్నవారై, కనుబొమ్మలు ముడిచి శస్త్రములను చేత ధరించి భండపుత్రులు గృహమునుండి వెడలిరీ-55. భండ పుత్రులు బయలుదేరినపుడు భూమి. కంపించినది. అనేకములైన యుత్పాతములుగలిగినవి, జగమంతయు భయమందెను-60, వీధులలో తమ తమ వాహనములలోనికివెళ్లుచున్న .. మహాబలులైన యా కుమారులపైన పౌరులలోని ముసలి ముత్తైదువలు పేలాలను జల్లిరి-61. వందిమాగధులు కుమారుల స్తుతించిరి. ద్వార ద్వారమున పుర స్త్రీలు మంగళహారతులిచ్చిరి-62. వారు బయలు వెడలినప్పుడు భూమీ భేదింపబడుచున్నట్లుండెను. ఆకాశము లోగబడుచున్నట్లుండెను. సముద్రము సుళ్లు త్రిప్పబడుచున్నట్లుండెను-63. భండాసుర పుత్రులు రెండు వందల యక్షౌహిణీ సేనల  దీసికొని కోపముతో పైకి కనుబొమ్మల ముడిపెట్టినవారై క్రూరముఖములతో పురము నుండి బయలువెడలిరి-64 రణములో క్షణమున శక్తి సేసలనన్నింటిని భక్షింతుము, వారీయాయుధ సమూహములను వాడి బాణములతో చూర్ణము చేసెదము-65, అగ్ని ప్రాకారవలయమును వెంటనే చల్లార్చెదము. ఆ తరువాత వెంటనే దుశ్చతురయైన లలితను బందీగా జేసెదము-66. ఈ విధముగా పరస్పరము వీర భాషణ - హోషణలతో అశ్వధారల సడిపించుచు భండాసుర కుమారులు అగ్ని ప్రాకార సమిపమనకు జేరిరీ-67. యౌవనముతోను మదముతోను అంధులై బొమ్మముడులు వైచుటచే కుటిలముఖులుగా నుండి మిక్కిలి గొప్ప సింహనాదమును జేసిరి-68. అది ఉత్పాత కాలమేఘము నుండి పడిన భయంకరమైన పిడుగు పొటు వలె నుండెను.  ఆ  సింహనాదముతో బ్రహ్మాండము బ్రద్దలైనట్లయ్యెను-69. అపూర్వమైన యీ మహాశబ్దము యొక్క విజృంభణము శక్తుల యొక్క చెవులను మనస్సులను క్షోభింపజేసెను-70. ఆ విధముగా తమ సైనికులతో బాటు వచ్చి వివిధాయుధములతో గొట్టుటచే వైమానికుల సమూహమును మూర్చిల్ల చేయుచు కలకలము  జేసిరి-71. చతుర్బాహుముఖులుగా నయి యుద్దము జేయవచ్చిన రాక్షసకుమారులను జూచీ బాలాశక్తి మిక్కిలి కౌతూహలమును వహించెను-72. ఆమె కుమారి. ఆ లలితాదేవి సమీపమున నుండునది. సమస్త శక్తి మండలములకును పూజ్యురాలు. పరాక్రమ శాలినీ-73. లలితతో సమానమైన యాకారముగల యా కుమారి కోపము వహించెను. ఆమె నవవరవలే సర్వ విద్యలకు మహాఖనీ-74. బాల సూర్యునివలె నెఱ్ఱని గుండ్రని పిరుదులుగలది. ఎఱ్ఱని తీవవంటి శరీరముగలది. మహారాజ్ఞి యొక్క పాద పీఠమున నిత్యము తన సన్నిధానముగలది-75, ఆమె. లలితకు బహిశ్చరములైన ప్రాణముల స్వరూపము. నాలుగవ విలోచనమున్ను. “ఆ వచ్చిన భండాసుర పుత్రులను వేగముగా జంపెదను"-76. అని బాలాంబ నిశ్చయించి మహారాజ్ఞికి ఈ విధముగ విన్నవించెను. మాతా! భండమహాసుర పుత్రులు యుద్దమునకు వచ్చిరి-77. కుమారి నగుట వలన ఉత్సాహము గలదానిపై వారితో యుద్ధము జేయదలంతును. ఈ యుద్ధ కుండూతితో నా భాహువులు కదలుచున్నట్లున్నవి-78. ఇదీ నా కొకయాట. నా కడ్డు దగిలి నీవు వారిని చంపవలదు. నేను బాలికను గదా! నాకు నిత్యము ఆటలయందు మక్కువ యెక్కువ-79. క్షణ కాలము రణక్రీడచే చిత్తమున భీతినందెదను- అనీ బాలాంబ విన్నవించగనే దేవి కుమారికి మారుబలికెను-80. ఓ చిన్నదానా - నీవు మిక్కిలి సుకుమారాంగివి. తొమ్మిది యేడులదానివి. క్రొత్త క్రమము (నడక) కలదానపు. కొత్తగా యుద్ధ శిక్షయు నేర్చిన దానవు. నీవు నాకొక్కగా నొక్క కుమారివి-81. నీవు లేకుండగా నాకొక్క క్షణము గడవదు. సో ప్రాణమే నీవు. నీవు యుద్ధమునకు బోకుము-82. దండిని, మంత్రిణి మొదలగు  తక్కిన శక్తులు యుద్ధము జేయుటకు  కోట్లకొలదియున్నారు. ఓ చిన్నదానా!  ఎందులకేమరుపాటు నందెదవు-83. అని శ్రీ లలితాదేవిచే నివారింపబడినను కుమారిక తన కౌమారకుతూహలమున సావేశితురాలై యుద్ధము జేసెదనని మరల అడిగెను-84. ఆమె సుదృఢమైన నిశ్చయమును జూచి.శ్రీ లలితాంబిక బాహువులతో కుమారిని గాఢముగా గౌగిలించుకొని యనుమతించేను-85. తనకవచము నుండి యొక కవచమును దీసి యామెకిచ్చెను. తన యాయుధముల నుండి యా యుధములను గూడ నిచ్చి యా కుమారిని రణమునకు బంపెను-86. మహారాజై యొక్క ధనుర్గండమునుండి వెలువడిన కర్జీరథమును కుమారిక యధిరోహించెను. ఆ రథమునకు నూరు హంసలు వాహనములు-87. ఆమె రణమునకు బూనుకొనగా, డానియన్ని పర్వములందుండు దేవతలు ధరింపబడిన ఖడ్గపంక్తులతో చేతులు జోడించి నమస్కరించిరీ-88. వారు నమస్కరించుచుండగా ఆ కుమారి చక్రరాజరథోత్తమము నుండి దిగిభూమీ మీదనున్న సైన్యమును బ్రవేశించెను-89. కోపముతో నెరుపెక్కీ క్రిందుగా వచ్చుచున్న కుమారిని జూచి మంత్రిణీ దండనాథలు భయముతో. నిట్లనిరి-90. ఓ భర్తృదారికా (యజమాని బిడ్డా!) నీవు యుద్ధము జేయనెందులకు యత్నింతివి? తప్పని పరిస్థితిలో మహారాజ్ఞచే రణమునకు బంపబడితివా? -91. సైనికులుండగా నిది నీకుతగదు, ఓ బోలాంబికా! నీవు శ్రీదేవికి ఆకారము దాల్చిన జీవితమవు-92. నీకు నమస్కారము జేసెదము. రణము నుండి మరలిపొమ్ము - అని మంత్రీజీ దండనాథల యిరువురిచే బ్రార్థింపబడినను కుమారీ దృఢ నిశ్చయమై రణమునకే కదలెను-93. మిక్కిలి యాశ్చర్యమునందీన మంత్రీడీదండనాథలు ఆమె రక్షణకై యామె యిరుపక్కల తోడు వెడలిరి-94. గొప్ప సేనలతో మంత్రిణీదండనాథలు వెంటరాగా అగ్నియావరణ ద్వారా కుమార్ బయలువెడలెను-95, కర్ణీరథము నధిష్టించిన కుమారికి సేనానాయికలతోబాటు సేనలన్నీయు ప్రణామాంజలిని ఘటింపగా నామె వారి ననుగ్రహించెను-96. శత్రుదమనయైన కుమారి దుష్టులైన భండాసుర పుత్రులను పారద్రోలెను. ఆమె సైన్యము ప్రాదేశ మాత్రము (బొటన వేలు చూపుడు వ్రేలును చాచినంత) కొలత, దాదాపు (పదియంగుళములు) లేదు. కాని లలితా సైన్యమంతయు నామె సైన్యమయ్యెను. ఆ తరువాత అత్యుద్ధత పరాక్రమముగల యుద్ధము జరిగెను-98. కుమారిక రాక్షసరాజులపై బాణ సమూహమును వర్షించెను. మహారాజ్ఞికుమారిక భండాసురకుమారులతో చేసిన యుద్ధము సురాసురలకు గూడ కోరికోరి చూడదగినదిగా నుండెను -99. తొమ్మిదేండ్ల వయస్సు గలిగీ కర్జీ రథము నెక్కి బాణమండలమును, వర్షించు కుమారిని చూచి రాక్షస కుమారులు మిక్కిలి యాశ్చర్యమును జెందిరీ-100, భ్రమించుచున్న (తిరుగుచున్న) పరిచారికలు క్షణక్షణము బాలికచే చేయబడుచున్న మహా యుద్ధమును మహారాజ్ఞికీ పిన్నవించిరీ-101. మంత్రిణీదండనాథలు మాత్రము. ఆమెను రణమున నొంటరిగా వదలలేదు. కాని చూపరులుగానై యూరకనే యుండిరి-102. ఆమెరాక్షస పుత్రులందరికినీ ఒకే రూపముగలదయ్యెను. సూర్యునియొక్క బింబపంక్తివలె ప్రతీ యొక్కనికొక్కొకటిగా కనబడినదీ-103. ఎల్లకలువవలె ఎటుపెక్కిన ముఖముగలదై అగ్ని జ్వాలలుగల బాణములతో రాక్షసుల మర్మములను భేదించుచున్నదీ-104. ఆకాశమున జూచుచున్న దేవతలు, మంత్రదండనాథలును. “ఆశ్చర్యము; బాగు బాగు” - అని మెచ్చుకొనుచుండిరి-105. వారితో పూజింపబడుచున్నదై చురుకైన చేతులతో కుమారీక యుద్ధము చేసెను. రెండవ యుద్ద దీవస మంతయు రణమున-106. అస్త్రములకు ప్రత్యస్త్రములను ప్రయోగించుచు ఆ రాక్షసులందరిని ఛేదించుచు ఆ లలితా పుత్రిక తన బలమంతయు ప్రకాశింపజేసెను-107. మహారాజ్జీ కుమారీ నారాయణాస్త్ర ప్రయోగముతో రెండు వందల యక్షౌహిణీ సైన్యమును క్షణకాలములో భస్మము చేసెను-108. అక్షౌహిణులు క్షీణించుటచే తత్క్షణము కోపమునంది లాగిన ధనువులు గలవారై యొక్క మాటున పైబడిరీ-109. అంత శక్తులలోను, దేవతలలోను కలకలము రేగెను. వెంటనే కుమారి ముప్పది బాణముల నొక్కమారు వదిలేను-110. చేతి నైపుణ్యముతో వదిలిన ముప్పడి అర్ధచంద్రబాణములతో భండాసురుని ముప్పదీపుత్రుల తలలు తెగిపడెను-111. ఈ విధముగా భండపుత్రులు యమసదనమునందగా (మరణింపగా) మీక్కిలి యాశ్చర్యమునందీన యాకాశగామీ దేవతలు పుష్పవర్షము గురిపించిరి-112. సమస్తాసురసైన్యమును భండపుత్రులను జంపిన మహారాష్టీపుత్రియైన కుమారికను మంత్రిణీదండనాథలు మిక్కిలి సంతోషముతో నాలింగనము జేసికొనిరి-113. జయము నిచ్చిన యామె పరాక్రమ వికాసములచేత నాట్యము చేసిరి. శక్తులు సాధువాదములచే (బాగు బాగు అను మొప్పులతో) మూడు జగములను ఏకము జేసిరీ-114. శక్తి సేనానులందరు దండనాథలను ముందడుకొని ఆయాశ్చర్యమును మహారాజ్ఞికి నివేదింప బయలుదేరిరీ-115. వారు నివేదించిన తన పుత్రీయొక్క భుజ పరాక్రమ కీర్తులను విని లలితాంబిక మిక్కిలి సంతసమునందెను-116. దేవతలలో గూడ మున్నెన్నడు చూడని కుమారి పరాక్రమములకు అక్కడి శక్తి మండలమంతయు ఆశ్చర్యపశమైపోయెను-117.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్య సంవాదమున శ్రీలలితోపాఖ్యానమున ఇరువదియారవ యధ్యాయము.