బ్రహ్మాండ మహా పురాణము
67 - ధన్వంతరిజననాది వర్ణనము
ఆయోః పుత్రా మహాత్మానః పంచైవాసన్మహాబలాః ।
స్వర్భానుతనయాయాం తే ప్రభాయాం జజ్ఞిరే నృపాః ॥
నహుషః ప్రథమస్తేషాం క్షత్రవృద్ధస్తతః స్మృతః ।
రంభో రజిరనేనాశ్చ త్రిషు లోకేషు విశ్రుతః ॥
క్షత్రవృద్ధాత్మజశ్చైవ సునహోత్రో మహాయశాః ।
సునహోత్రస్య దాయాదాః త్రయః పరమధార్మికాః ॥
కాశః శలశ్చ ద్వావేతా తథా గృత్సమదః ప్రభుః ।
పుత్త్రో గృత్సమదస్యాపి శునకో యస్య శౌనకః ॥
బ్రాహ్మణాః క్షత్రియాశ్చైవ వైశ్యాః శూద్రాస్తథైవ చ ।
ఏతస్య వంశే సంభూతో విచిత్రైః కర్మభిర్ద్విజాః ॥
శలాత్మజో హ్యార్ష్టిషేణః శిశిరస్తస్య చాత్మజః ।
శౌనకాశ్చార్ష్టిర షేణాశ్చ క్షత్రోపేతా ద్విజాతయః ॥
కాశ్యస్య కాశీపో రాజా పుత్రో దీర్ఘతపాస్తథా ।
ధన్వశ్చ దీర్ఘ తపసో విద్వాన్ ధన్వంతరిస్తతః ॥
తపసోంతే మహాతేజా జాతో వృద్ధస్య ధీమతః ।
అథైవమృషయః ప్రోచుః సూతం వాక్యమిదం పునః ॥
ఋషయ ఊచుః :-
కశ్చ ధన్వంతరిర్దేవో మానుషేష్విహ జజ్ఞివాన్ ।
ఏతద్వేదితుమిచ్ఛామస్తన్నో బ్రూహి పరంతప ॥
సూత ఉవాచ :-
ధన్వంతరేః సంభవోఽయం శ్రూయతామిహ వై ద్విజాః ।
స సంభూతః సముద్రాంతే మధ్యమానేఽమృతే పురా ॥
ఉత్పన్నః కలశాత్పూర్వం సర్వతశ్చ శ్రీయా వృతః ।
సద్యః సంసిద్ధకార్యం తం దృష్ట్వా విష్ణురవస్థితః ॥
అబ్ఞస్త్వమితి హోవాచ తస్మాదబ్జస్తు స స్మృతః ।
అబ్ఞః ప్రోవాచ విష్ణుం తం తనయోఽస్మి తవ ప్రభో ॥
ఆయువు పుత్రులైదుగురు. మహాత్ములు. మహాబలులు. వారందరు రాజులు. స్వర్భానుకూతురయిన ప్రభకు జన్మించిరి. ఆ యైదుగురిలో నహుషుఁడు పెద్దవాఁడు. క్షత్రవృద్ధుఁడాతని తరువాతవాఁడు, రంభుఁడు, రాజు, అనేనసుఁడు వీరు మూడు లోకముల యందును ప్రసిద్ధులు. క్షత్రవృద్ధుని కుమారుఁడు సునహోత్రుఁడు. ఇతఁడు మహాయశుఁడు. సునహోత్రునకు ముగ్గురు కుమారులు. వారు పరమ ధార్మికులు. (3) ఆ మువ్వురు కాశుఁడు, శల్యుడు, గృత్సమదుఁడు. గృత్సమదునీ కుమారుడు శునకుఁడు. ఆతనీ కుమారుఁడు శౌనకుఁడు. వారొనర్చిన విచిత్రములయిన కర్మలచే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వారి వంశములో పుట్టిరి. ఆస్ట్రీ షేణుఁడు శలుని కుమారుఁడు. ఆతనికుమారుఁ డు. శిశిరుడు. శౌనకుఁడు ఆర్షి షేణుఁడు క్షత్రియులతో గూడిన బ్రాహ్మణులు. కొశ్యునకు కౌశిపతియైన కుమారుడు. అతనిపేరు దీర్ఘతపుం డు. ధన్వుఁడు దీర్ఘ తపసుని కుమారుఁడు. ఆతనికి పండితుఁడైన ధన్వంతరీ పుట్టెను. ఈ ధన్వంతరీ చాల తెలివైనవాఁడు. వృద్ధుఁడయిన రాజునకు ఆతని తపస్సునకు తరువాత కలిగెను. అంత ఋషులు సూతునితో నిట్లనిరి. ఋషీశ్వరులిట్లు అడిగిరి. ధన్వంతరి యెవరు? ఆతఁ డెట్లు మానవులలో జన్మించెను. దానినీ ఎఱుంగగోరుచున్నాము. ఓపరంతప! ఆతని గూర్చి మాకు చెప్పుము. సూతుఁడిట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ బ్రాహ్మణులారా ! ధన్వంతరి జననమును గూర్చి ఆలకింపుఁడు. పూర్వము సముద్రము అమృతము కొఱకు మధింపఁబడుచుండ, తత్సముద్ర మధ్యమున నాతడు పుట్టెను. మొట్టమొదట కలశమునకు ‘బూర్వమే’ యాతఁడు జన్మించెను. ఆతఁడు సర్వతః శ్రీతో (కాంతి పరివేషముతో) ఆవరింపఁబడియుండెను. ఆతఁడు తన కార్యమును సంసిద్దము చేయుటచూచి, ఆ ప్రక్కనే నిల్చుండియున్నవాఁడు “నీవు నీటి నుండి పుట్టితివి” అనెను. అందుకే ఆతఁడు ‘అబ్దుఁడు’గా పరిగణింపఁబడెను. అబుండు విష్ణునితో నేను నీపుత్రుఁడనయితిని”.
విధత్స్వ భాగం స్థానం చ మమ లోకే సురోత్తమ ।
ఏవముక్తః స దృష్ట్వా తు తథ్యం ప్రోవాచ స ప్రభుః ॥
కృతో యజ్ఞవిభాగస్తు దైతేయైర్హి సురైస్తథా ।
వేదేషు విధియుక్తం చ విధిహోత్రం మహర్షిభిః ॥
న శక్యమిహ హోమం వై తుభ్యం కర్తుం కదాచన ।
అర్వాక్సూతోఽపి హే దేవ తన మంత్రో న వై ప్రభో ॥
ద్వితీయాయాం తు సంభూత్యాం లోకే ఖ్యాతిం గమిష్యసి ।
అణిమాదియుతాం సిద్ధిం గతస్తత్ర భవిష్యసి ॥
ఏతేనైవ శరీరేణ దేవత్వంప్రాప్స్యసి ప్రభో ।
చా(చ) తుర్మంతైరృత్రైర్ఘృవ్యైర్యక్ష్యంతే త్వాం ద్విజాతయః ॥
అథ వా త్వం పునశ్చైవ హ్యాయుర్వేదం విధాస్యసి ।
అవశ్యభామీ హ్యర్థోఽయం ప్రాగ్దృష్టస్తబ్జయోనీనా ॥
ద్వితీయం ద్వాపరం ప్రాప్య భవితా త్వం న సంశయః ।
తస్మాత్తస్మై వరం దత్త్వా విష్ణురంతర్ధధే తతః ॥
ద్వితీయే ద్వాపరే ప్రాప్తే సౌనహోత్రః సకాశిరాట్ ।
పుత్రకామస్తపస్తేపే నృపో దీర్ఘతపాస్తథా ॥
అబ్జం దేవం తు పుత్రార్థే హ్యారిరాధయిషురృపః ।
వరేణ ఛందయామాస తతో ధన్వంతరిర్నృపమ్ ॥
నృప ఉవాచ :-
భగవన్యది తష్టస్త్వం పుత్రో మే గతిమాన్భవే! ।
తథేతి సమనుజ్ఞాయ తత్రైవాంతరధాత్ర్పభుః ॥
తస్య దేహే సముత్పన్నో దేవో ధన్వంతరిస్తథా ।
కాశీరాజో మహారాజు సర్వరోగప్రణాశనః ॥
ఆయుర్వేదం భరద్వాజాత్ప్రాప్యేహ సభిషక్క్రియమ్ ।
తమష్టథా పునర్వ్యస్య శిషేభ్యః ప్రత్యపాదయత్ ॥
ధన్వంతరిసుతశ్చాపి కేతుమానితి విశ్రుతః ।
అథ కేతుమతః పుత్రో జజ్ఞే భీమరథో నృపః ॥
ఓ సురోత్తమ’ నాకొక భాగమును, స్థానమును ప్రపంచములో కల్పింపుము". అనీ అడుగబడి, ప్రభుఁడైన విష్ణువు ధన్వంతరి మధ్య విషయము నాలోచించి యజ్ఞవిభాగమును దీతీకుమారులచేతను దేవతలచేతను చేయబడినది. మహర్షులు వేదములు విధియుక్తమయిన హోమములు చేసిరి. అందుచే నీకై హోమమును చేయుట ఎన్నటికీన శ్యకము కాదు. నీవు వేదములకు తరువాత జన్మించి యుండుటచే నీకు, నీయుక్తమైన, మంత్రములేదు. ఇంక నీరెండవయవతారమును లోకమున ఖ్యాతిగాంచెదవు. నీకుఅణిమాదియుతమైన సిద్ధి కలుగును. ఓ ప్రభో! నీవీ శరీరముతోడనే దేవతాస్థితిని పొందుదువు. బ్రాహ్మణులు నాలుగు వేదములతో చతుర్విధ మంత్రములతో ఘృతముతో, హోమద్రవ్యములయిన ఆవునేయి, పెరుగు మొదలయిన గవ్యములతో నిన్ను పూజింతురు. (17) నీవుమరియొకసారి ఆయుర్వేదమును కావింతువు. ఈసన్నివేశములు కార్యములు మున్ముందుగనే బ్రహ్మ దర్శించెను. తప్పకనీవు ద్వితీయ ద్వాపర యుగమున జన్మింతువు. అందుచేఈవరమునుప్రసాదించిన తరువాత విష్ణువు అంతర్థానముచెందెను. ద్వితీయద్వాపరమువచ్చినది.రాజయిన దీర్ఘతపుఁడు కాశీరాజయ్యెను. ఇతఁడు సౌనహోత్రుఁడు ఈదీర్ఘతపుఁడు పుత్రకాముఁ డై తపస్సాచరించెను. రాజు ధన్వంతరీని పుత్రునికొఱకు ఆరాధింపదలచేను.అంతధన్వంతరి నీవు ఇష్టమైన వరమును కోరుకొనుమనెను. రాజు ఇట్లనెను. ఓ ప్రభూ ! నాయెడ సంతుష్ఠుఁడవైన నీవు నాకు కుమారుఁడ వగుము, నాకు గతీదాతవగుము, 'అట్లే యని ధన్వంతరి యచ్చటనే అంతర్జానుఁడయ్యెను. తరువాత ఆతని దేహము నుండీ దేవుఁడయిన ధన్వంతరీ సముత్పన్నుడయ్యెను. ఆతఁడు కాశీరాజు సర్వరోగ ప్రనాశకుం డు. ఆతఁడు భరద్వాజునీ కడ భిషక్కీయా యుతముగ ఆయుర్వేదమునేర్చెను. ఆతఁడు ఎనిమిది భాగములుగా ఆయుర్వేదమును విభజించి శిష్యులకొసంగెను. ధన్వంతరిసుతుఁడు కేతుమంతుఁడు. ఆకేతుమంతునకు భీమరథుఁడను కుమారుఁడు కలిగెను.
పుత్రో భీమరథస్యాపి జాతో ధీమాన్ ప్రజేశ్వరః ।
దివోదాస ఇతి ఖ్యాతో వారాణస్యధిపోఽ భవత్ ॥
ఏతస్మిన్నేవ కాలే తు పురీం వారాణసీం పురా ।
శూన్యాం నివేశయామాస క్షేమకో నామ రాక్షసః ॥
శప్తా హి సా పురీ పూర్వం నికుంభన మహాత్మనా ।
శూన్యా వర్షసహస్రం వై భవిత్రీతి పునః పునః ॥
తస్యాం తు శప్తమాత్రాయాం దివోదాసః ప్రజేశ్వరః ।
విషయాంతే పురీం రమ్యాం గోమత్యాం సన్నివేశయత్ ॥
ఋషయః ఊచుః :-
వారాణసీం కీమర్థం తాం నీకుంభః శప్తకాన్పురా ।
నీకుంభశ్చాపి ధర్మాత్మా సిద్ధక్షేత్రం శశాప యః ॥
సూత ఉవాచ :-
దివోదాసస్తు రాజర్షిర్నగరీం ప్రాప్య పార్థివః ।
వసతే చ మహాతేజాః సీతాయాం వై నరాధిపః ॥
ఏతస్మిన్నేవ కాలే తు కృతధారో మహేశ్వరః ।
దేవ్యాః స ప్రియకామస్తు వసన్వై శ్వశురాంతికే ॥
దేవాజ్ఞయా పారిషదా విశ్వరూపాస్తపోధనాః ।
పూర్వోక్తరూపసంవేషైస్తోషయంతీ మహేశ్వరీమ్ ॥
హృష్యతే తైర్మహాదేవో మేనా నైవ తు తుష్యతి ।
జుగుప్మతే సా నిత్యం వై దేవం దేవీం తథైవ చ ॥
మమ పార్శ్వే త్వనాచారస్తవ భర్తా మహేశ్వరః ।
దరిద్రః సర్వథైవేహ హా కష్టం లజ్జతే న వై ॥
మాత్రా తథోక్తా వచసా స్త్రీస్వభావాన్న చక్షమే ।
స్మితం కృత్వా తు వరదా హరపార్శ్వమథాగమత్ ॥
విషణ్ణవదనా దేవీ మహాదేవమభాషత ।
నేహ వస్యామ్యహం దేవ నయ మాం స్వం నివేశనమ్ ॥
భీమరథుని పుత్రుఁడు ధీమంతుఁడు. ప్రజాధిపతి యయ్యెను. ఆతఁడు దివోదాసుఁడని ఖ్యాతిపొందెను. ఆతడు వారాణసికి అధిపతి యయ్యెను. ఆ కాలమునందే క్షేమకుఁడను రాక్షసుఁడు శూన్యమయిన వారణాసీ పురినీ నివాసముగా నేర్పరచెను. అంతకు పూర్వము మహాత్ముడయిన నీకుంభునిచే ఆ వారాణసీపురము ఈ పట్టణము వెయ్యి యేండ్లు జనరహితమయిన శూన్యపురముగా నగును” అని పదేపదే శపింపఁబడెను. ఆ నగరము శపింప బడినప్పుడు రాజు దివోదాసు. ఆతఁడు తన రాజ్యపు సరిహద్దులో గోమతీనదీతీరమున రమ్యమయిననగరమును స్థాపించేను. ఋషులిట్లడిగిరి. పూర్వము నికుంభుఁడు వారాణసీ పురము నేల శపించెను? ధర్మాత్ముఁడయిన నికుంభుఁడు సిద్ధక్షేత్రమయిన వారాణసీ క్షేత్రము నేల ‘శపించెను’ సూతుఁడిట్లు సమాధాన మొసంగేను. రాజర్షియైన దివోదాసు అభివృద్ధిమంతమైన ఆ పట్టణమును చేరి యందు నివసించెను. ఆ కాలముననే మహేశ్వరుఁడు భార్యను స్వీకరించెను. తనభార్యయయిన ఉమకు ప్రీతి కలిగింప గోరి మహేశ్వరుడు తన మామయొక్క సమీపమున నివసించేను. (32) పరమేశ్వరుని ఆజ్ఞ ననుసరించి విశ్వరూపులు, తపోధనులు నయిన పారిషదులు (ఈశ్వరకింకరులు)వివిధ రూపములు దాల్చి మహేశ్వరీయైన ఉమాదేవిని సంతోషపెట్టుచుండిరి. (33) వారీవలన మహాదేవుఁడు సంతుష్టుం డయ్యెను కానీ మేనక మాత్రము సంతోషించలేదు. ఆమె మహేశ్వరుని మహేశ్వరిని గుప్పతో చూచెను. ఆమె తన కూతురయిన ఉమతో మహేశ్వరునకు నాయందు ఉత్తమ ఆచారము లేదు. (ఉత్తమ ప్రవర్తనలేదు). దరిద్రుఁడు. ఆతఁడు ప్రతివిషయమున కోపి అయ్యో ! సిగ్గుపడడు అని యనెను. తనతల్లి యిట్లు చెప్పగా పార్వతి ఆ పలుకులను సహించలేదు. అయ్యది స్త్రీ స్వభావలక్షణమగుట వరములిచ్చు ఆతల్లి వీచారవదనయై మహేశ్వరునితో “ఓ ప్రభూ! నేనిక్కడ నివసింపను. నీ సొంత నిపాసనమునకు నన్ను తీసికొనిపొమ్ము” అనెను. (37)
తథోక్తస్తు మహాదేవః సర్వాన్ లోకాన్నిరీక్ష్య హ ।
వాసార్థం రోచయామాస పృథివ్యాం తు ద్విజోత్తమాః ॥
వారాణసీం మహాతేజాః సిద్ధక్షేత్రం మహేశ్వరః ।
దివోదాసేన తాం జ్ఞాత్వా నివి ష్టాం నగరీం భవః ॥
పార్శ్వస్థం స సమాహూయ గణేశం క్షేమమబ్రవీత్ ।
గణేశ్వర ! పురీం గత్వా శూన్యాం వారాణసీం కురు ॥
మృదునాచాభ్యుపాయేన అతివీర్యః స పార్థివః ।
తతో గత్వా నికుంభస్తు పురీం వారాణసీం పురా ॥
స్వప్నే సందర్శయామాస మంకనం నామతో ద్విజమ్ ।
శ్రేయస్తేఽహం కరిష్యామి స్థానం మే రోచయానఘ ॥
మద్రూపాం ప్రతిమాం కృత్వా నగర్యంతే నివేశయ ।
తథా స్వప్నే యథా దృష్టం సర్వం కారీతవాన్ ద్విజః ॥
నగరీద్వార్యనుజ్ఞాప్య రాజానం తు యథావిధి ।
పూజా కు కృత్వా నగర్యంతే నివేశయ ।
తథా స్వప్నే యథా దృష్టం సర్వం కారీతాన్ ద్వీజః ॥
నగరీద్వార్యనుజ్ఞాప్య రాజానం తు యథావిధి ।
పూజా తు మహతీ చైవ నిత్యమేవ ప్రయుజ్యతే ॥
గంధైర్దూ పైశ్చ పాల్యైశ్చ ప్రేక్షణీయైస్తథైవ చ ।
అన్నప్రదానయుక్తైశ్చ హ్యత్యద్భుతమివాభవత్ ॥
ఏవం సంపూజ్యతే తత్ర నిత్యమేవ గణేశ్వరః ।
తతో వరసహస్రాణి నాగరాణాం ప్రయచ్ఛతి ॥
పుత్రాన్హి రణ్యమాయూoషి సర్వకామాంస్తథైవ చ ।
రాజ్ఞస్తు మహిషీ శ్రేష్టా సుయశా నామ విశ్రుతా ॥
పుత్రార్థమాగతా సాధ్వీ రాజ్ఞా దేవీ ప్రచోదితా ।
పూజాం తు విపులాం కృత్వా దేవీ పుత్రానయాచత ॥
పునః పునరథాగత్య బహుశః పుత్రకారణాత్ ।
న ప్రయచ్ఛతి పుత్రాంస్తు నీకుంభః కారణేన తు ॥
ఆ విధముగా చెప్పబడి, మహాదేవుఁడు సర్వలోకములను పరీక్షించి (ఓబ్రాహ్మణులారా!) పృథివీయందు నివాసమేర్పరచుటకు తలంచెను. మహా తేజస్వియయి మహేశ్వరుఁడు సిద్ధక్షేత్రమయిన వారాణాసి నెఱింగెను. అయ్యది దివోదాసుచే ఆక్రమింపఁబడి యున్నది. అంత పార్వస్టుం డయిన గణేశ్వరుని పిలిచి భవుఁడు గణేశ్వరా ! నీవు వారణసీపురమున కరుగుము, మృదువైన ఉపాయముచే దానిని శూన్యము చేయుము. ఆ నగరపు రాజు అతివీర్యుఁడు అనెను. పూర్వము నీకుంభుఁడు వారాణసీ పురమున కరిగెను. స్వప్నము నందు ‘మంకన’ యను బ్రాహ్మణుని చూచెను. ఆతనితో 'నీకు శ్రేయస్సు నాపాదింతును ఓ పాపరహీత ! నా కొక మంచి ప్రదేశమును చూడుము, మద్రూపముయిన ప్రతీమ నొకదానిని చేసి నగర్యంతమునందు, ద్వారమున స్థాపించుము”. అట్లేస్వప్నములో చూచినటులనా సర్వము నాతఁడొనర్చెను. యథావిధి నగరీ . ద్వారమున ప్రతిమను స్థాపించెను. ప్రతిదినము మహా వీభవమున పూజను గంధ, ధూపములతో, కర్పూరముతో అన్నదానముతో ప్రేక్షణీయములయిన వస్తువులతో పూజ జరిగెను. అత్యద్భుతముగా గణేశ్వరుడు ఈ విధముగా ప్రతిదినము పూజింపబడెను. ఆతఁడు నగరవాసులకు. అనేకములయిన వరముల నొసంగును, పుత్రులను, బంగారమును, ఆయువును, కోరినకోరికచెల్ల నొసంగును, రాజు యొక్క మహిషీ 'సుయశ' యను నామమున విశ్రుతయైనది, సాధ్వి, యోగ్యురాలు రాజుచే ప్రచోదింపఁబడి పుత్రులకోకచ్చటకు వచ్చెను. అత్యధికముగా పూజనాచరించి దేవి పుత్రులనర్థించెను. ఆమె పుత్రార్థము పలుమార్లు దర్శించెను. నికుంభుఁడామెకు (వెనుకనున్న) కారణముచే పుత్రుల నొసంగలేదు. (49)
క్రుధ్యతే యది రాజా తు తతః కించిత్ ప్రవర్తతే ।
అథ దీర్ఘేణ కాలేన క్రోధో రాజానమామీశత్ ॥
భూతం త్వదం మహద్ద్వారి నాగరాణాం ప్రయచ్ఛతి ।
ప్రీత్యా వరాంశ్చ శతశో న కించిన్నః ప్రయచ్ఛతి ॥
మామకైః పూజ్యతే నిత్యం నగర్యాం మమ చై వతు ।
స యాచితశ్చ బహుశో దేవ్యా మే పుత్రకారణాత్ ॥
న దదాతి చ పుత్రం మే కృతఘ్నో బహుభోజనః ।
అతో నార్హతి పూజాం తు మత్సకాశాత్ కథంచన ॥
తస్మాత్తు నాశయిష్యామి తస్య స్థానే దురాత్మనః ।
ఏవం తు స వినిశ్చిత్య దుర్మా రాజకిల్బిషీ ॥
స్థానం గణపతేస్తస్య నాశయామాస దుర్మతిః ।
భగ్నమాయతనం దృష్ట్వా రాజానమశపత్ ప్రభుః ॥
యస్మాద్వినాపరాధం మే త్వయా స్థానం వినాశితమ్ ।
అకస్మాత్తు పురీ శూన్యా భవిత్రీ తే నరాధిప ॥
తతస్తేన తు శాపేన శూన్యా వారాణసీ తదా ।
శప్త్వా పురీం నీకుంభస్తు మహాదేవమథానయత్ ॥
శూన్యాం పురీం మహాదేవో నిర్మమే పదమాత్మనః ।
తుల్యాం దేవ విభూత్యా తు దేవ్యాశ్చైవ మహామనాః ॥
రమతే తత్ర వై దేవీ హ్యైశ్వర్యాత్సా తు విస్మితా ।
దేవ్యా క్రీడార్థమీశానో దేవో వాక్యమథాబ్రవీత్ ॥
నాహం వేశ్మ విమోక్ష్యామి హ్యవిముక్తం హి మే గృహమ్ ।
ప్రహస్తై నామథోవాచ హ్యవిముక్తం హిమే గృహమ్ ।
తస్మాత్తదవిముక్తం హి ప్రోక్తం దేవేన వైస్వయమ్ ॥
నాహం దేవి గమిష్యామి త్వన్యత్రేదం విహాయ వై ॥
మయా సహ రమస్వేహ క్షేత్రే భామిన్యనుత్తమే ।
తస్మాత్తదవిముక్తం హి ప్రోక్తం దేవేన వై స్వయమ్ ॥
ఏవం వారాణసీ శప్తా హ్యవిముక్తం చ కీర్తితా ।
యస్మిన్ వసేద్భవో దేవః సర్వదేవనమస్కృతః ॥
రాజు కోపించినచో నప్పుడేదో (వినాశకరమయిన) కార్యము చేయవచ్చుననుకొనెను. చాలకాలమునకు రాజును కోపమాశ్రయించేను. “నగర ద్వారస్థమయిన భూతము వందలకొలదీ వరములను నగరవాసుల కొసంగుచున్నది. కాని మాకేమియు నొసంగుటలేదు. (51) ఈ నగరమున నయ్యది నాప్రజలచే నిత్యము పూజింపఁబడుచున్నది. ఆతఁడో రాణిచే పుత్రుల కొఱకు పెక్కు పర్యాయములు పూజింపఁబడెను. పుత్రుల నాకిచ్చుటలేదు. అయ్యది కృతఘ్నము బహుభోజన ప్రియమైనది. అందుచే నా వలన పూజ లొందుట కర్ఘమైనదీభూతము కాదు. అందుచే ఆదుర్మార్గునియొక్క నివాసమును నాశనము చేసెదను.” అనీ రోజు నీశ్చయించుకొని దురాత్ముడు కిల్బిషుఁడైన రాజు గణపతి యొక్క స్థానమును నాశనము చేసెను. తద్భవనము భగ్నమగుట చూచీ ఈశ్వరుఁడు రాజును శపించెను. (55) “నాయందే దోషములేకయే నీవు నా స్థానమును వినాశన మొనరించితివి. ఓ రాజా ! నీ నగరము ఆకస్మికముగా జనశూన్యము కాగలదు” అనెను. ఆ శాపముచే వారాణసి శూన్యమయ్యెను. తరువాత. నీకుంభుఁడు మహాదేవు నచ్చటకు తీసికొని వచ్చెను, మహాత్ముఁడైన మహాదేవుఁడు, శూన్యమైన నిర్జనమైన యా నగరమును దేవ విభూతితో నైశ్వర్యవంతముగా దేవీనగరముగా చేసెను. దానిని చూచీ. దేవి ఆశ్చర్య పడెను. దానిని. తన భార్యకు తనకు నీవాసమొనర్చెను. దేవి యందు క్రీడించేను. తన మనస్సు నందు లగ్న మొనర్చెను, అంత ఈశ్వరుఁడు దేవితో నిట్లనెను, “నేనీ నీవాసమును త్యజింపను. నీజముగా నా నివాసము అవిముక్తము. నవ్వుచు ఆమెతో నతఁడు నా నివాసము అవిముక్తము. దీనిని విడిచి, ఓ దేవి నేనింకొకచోటున కరుగను. ఓ పూజ్యకాంత్యుజ్ఞలమయిన దేవీ, ఈ క్షేత్రమునందు నాతో నీవు రమించుము. అందుచేతనే భగవానుఁడు స్వయముగా దీనిని అవిముక్త మనీనాఁడు. (61) ఈ విధముగా వారాణసి శపింపఁబడినది. అవిముక్తముగా కీర్తినొందినది సర్వదేవనమస్కృతుఁడయిన దేవుడిందు వసించును. (62)
యుగేషు త్రిషు ధర్మాత్మా సహ దేవ్యా మహేశ్వరః ।
అంతర్దానం కలౌ యాతి తత్పురం తు మహాత్మనః ॥
అంతర్హితే పురే తస్మిన్ పురీ సా వసతే పునః ।
ఏవం వారాణసీ శప్తా నివేశం పునరాగతా ॥
భద్రసేనస్య పుత్రాణాం శతముత్తమధన్వినామ్ ।
హత్వా నివేశయామాస దివోదాసో నరాధిపః ॥
భద్రసేనస్య రాజ్యం తు హతం తేన బలీయసా ।
భద్రసేనస్య పుత్రస్తు దుర్మదోగామ నామతః ॥
దివోదాసేన బాలేతి ఘృణయా స వివర్జితః ।
దివోదాసాద్దృషద్వత్యాం వీరో జజ్ఞే ప్రతర్దనః ॥
తేన పుత్రేణ బాలేన ప్రహృతం తస్య వై పునః ।
వైరస్యాంతం మహారాజ తదా తేన విధిత్సతా ॥
ప్రతర్దనస్య పుత్రౌ ద్వే వతో గర్గశ్చ విశ్రుతౌ ।
వత్సపుత్రో హ్యలర్కస్తు సన్నతీస్తస్య చాత్మజః ॥
అలర్కం ప్రతి రాజర్షం శ్లోకో గీతః పురాతనైః ।
షష్టివర్షసహస్రాణి షష్టివర్షశతాని చ ॥
యువ రూపేణ సంపన్నో హ్యలర్క: కాశిసత్తమః ।
లోపాముద్రాప్రసాదేన పరమాయురవాప్తవాన్ ॥
శాపస్యాంతే మహాబాహుర్హత్వా క్షేమకరాక్షసమ్ ।
రమ్యామావాసయామాస పురీం వారాణసీం నృపః ॥
సన్నతేరపి దాయాదః సునీథో నామ ధార్మికః ।
సునీథస్య తు దాయాదః క్షైమాభ్యో నామ ధార్మికః ॥
క్షేమస్య కేతుమాన్ పుత్రః సుకేతుస్తస్య చాత్మజః ।
సుకేతుతనయశ్చాపి ధర్మకేతుర్తి శ్రుతః ॥
ధర్మకేతోస్తు దాయాదః సత్యకేతుర్మహారథః ।
సత్యకేతుసుతశ్చాపి విభుర్నామ ప్రజేశ్వరః ॥
ధర్మాత్ముడయిన మహేశ్వరుఁడు తనభార్యతో మూఁడుయుగములిందు నివసించేను. ఆ మహాత్ముని పురము కలియుగమున నంతర్ధానము నొందును. (63) ఆ పట్టణ మంతర్షితముకాగా మరల ఆ పట్టణము నిర్మింపఁబడెను. ఈ విధముగా వారాణసి శపింపఁబడి మరల నిర్మిం పఁబడెను. (64) నరాధిపుఁడయిన దివోదాసు ఉత్తముధానుష్కలయిన భద్రసేనుని యొక్క నూర్గురు పుత్రులను చంపి పట్టణమును నిర్మించెను. బలవంతుఁడయిన ఆతఁడు భద్రసేనుని రాజ్యమును హతమొనర్చెను. భద్రసేనుని కుమారుఁడొకఁడు దుర్మదుఁడనువాఁడు బాలుడని దయచే దివోదాసుఁడాతనిని విడిచిపుచ్చెను. దివోదాసునకు దృషద్వతి యందు ప్రదర్ధనుఁడను వీరుఁడుద్భవించెను. ఓ మహారాజ ! వైరమును తీర్చు కొనఁ గోరి బృహత్సేనుని కుమారు డాతనిని ఎదుర్కొనెను. ప్రతర్దనునకు ఇద్దరు పుత్రులు. వారు వత్సగరులు చాల విశ్రుతులు. వత్సుని కుమారుఁడు అలర్కుఁడు. అలర్కునికుమారుఁడు సన్నత. (69) రాజర్షియైన అలర్కుని గూర్చి యీ శ్లోకము. పురాతనులచే చెప్పబడినది. కాశి సత్తముఁడయిన అలర్క్యుడు అరువదివేల సంవత్సరములు, అరువది వందల సంవత్సరములు యువకుఁడు, రూప సంపన్నుఁడు సౌందర్య వంతుఁడు. లోపాముద్ర యొక్క అనుగ్రహముచే నతఁడు పరమాయువునుపొందెను. శాపాంతమునందు మహాబాహుఁడయినరాజు క్షేమక రాక్షసుని చంపీ రమ్యమయిన వారాణసీపురిని మరల నివాసయోగ్య మొనర్చెను. (72) సన్నతుని యొక్క దాయాదుఁడు సునీథుఁడు, అతఁడు చాల ధార్మికుఁడు. సునీథుని యొక్క దాయాదుఁడు క్షేమాఖ్యుఁడు. ఆతఁడు మిక్కిలి ధార్మికుఁడు. క్షేమునకు కేతుమంతుఁడు పుత్రుఁడు. ఆతనికి సుకేతువు పుత్రుఁడు. సుకేతుని కుమారుఁడు ధర్మకేతువని ప్రఖ్యాతుఁడు. ధర్మకేతువుని పుత్రుఁడు మహారథుఁడయిన సత్యకేతువు. సత్యకేతుని కుమారుఁడు వీభువు అతఁడు ప్రజేశ్వరుఁడు. విభుని పుత్రుఁడు సువిభుఁడు. సువిభుని కుమారుఁడు సుకుమారుఁడు.
సువిభుస్తు విభోః పుత్రః సుకుమారస్తతః స్మృతః ।
సుకుమారస్య పుత్రస్తు ధృష్టకేతుః సుధార్మికః ॥
ధృష్టకేతోస్తు దాయాదో వేణుహోత్రః ప్రజేశ్వరః ।
వేణుహోత్రసుతశ్చాపి గార్గో వై నామ విశ్రుతః ॥
గార్గ్యస్య గర్గభూమిస్తు వంశో వత్సస్య ధీమతః ।
బ్రాహ్మణాః క్షత్రియాశ్చైవ తయోః పుత్రాః సుధార్మికాః ॥
వీక్రాంతా బలవంతశ్చ సింహతుల్యపరాక్రమాః ।
ఇత్యేతే కాశ్యపాః ప్రోక్తా రజేరపి నిబోధత ॥
రజేః పుత్రశతన్యాసన్పంచ వీర్యవతో భువి ।
రాజేయమీతి విఖ్యాతం క్షత్రమింద్రభయావహమ్ ॥
తదా దేవాసురే యుద్ధే సముత్పన్నే సుదారుణే ।
దేవాశ్చైవాసురాశ్చైవ పితామహమథాబ్రువన్ ॥
ఆవయోర్భగవన్ యుద్ధే విజేతా కో భవిష్యతి ।
బ్రూహి నః సర్వలోకేశ శ్రోతుమిచ్ఛామహే వయమ్ ॥
బ్రహ్మోవాచ :-
యేషామర్థాయ సంగ్రామే రజిరాత్తాయుధః ప్రభుః ।
యోత్స్యతే తే జయిష్యంతే త్రీంల్లోకాన్నాత్ర సంశయః ॥
రజిర్యతస్తతో లక్ష్మీర్యతో లక్ష్మీస్తతో ధృతిః ।
యతో ధృతీస్తతో ధర్మో యశోధర్మస్తతో జయః ॥
తే దేవా దానవాః సర్వే తతః శ్రుత్వా రజేర్జయమ్ ।
అభ్యయుర్జయమీష్యంతః స్తువంళో రాజసత్తమమ్ ॥
తే హృష్టమనసః సర్వే రాజానం దేవదానవాః ।
ఊచురస్మజ్ఞయాయ త్వం గృహాణ వరకార్ముకమ్ ॥
రజిరువాచ :-
అహం జేష్యామి భో దైత్యా దేవాఞ్చత్రపురోగమాన్ ।
ఇంద్రో భవామి ధర్మాత్మా తతో యోత్స్యే రణాజిరే ॥
సుకుమారుని పుత్రుఁడు ధృష్టకేతువు. ఇతఁడు మంచి ధార్మికుఁడు, ధృష్టకేతుని దాయాదుఁడు వేణుహోత్రుఁడు. ఇతఁడు మహారాజు, వేణుహోత్రుని కుమారుఁడు గార్థుఁడు. ఇతఁడు చాల ప్రఖ్యాతుఁడు. గార్థుని కుమారుఁడు గర్గభూమి. ఇదీ ధీమంతుఁడయిన వత్సుని యొక్క వంశక్రమము. వారి కుమారులు బ్రాహ్మణులు, క్షత్రియులు, వారందరు ధార్మికులు. విక్రాంతులు, బలవంతులు, సింహ తుల్య పరాక్రములు. వీరందరు కాశ్యపులుగా చెప్పఁబడిరి. ఇంక రజి. యొక్క వారసులను కూడ ఎఱంగుఁడు. (79) వీర్యవంతుఁడగు రజికి ఐదువందల కుమారులు. ఈ క్షత్రియ సమూహమంతయు రాజేయమనీ విఖ్యాతము, ఇంద్రుఁడు వీరనిన భయపడెను. ఆ సమయమున భయంకరముగ దేవాసురలకు మధ్య యుద్ధము సముత్పన్నము కాగా దేవతలు అసురులు బ్రహ్మనడిగిరి. “మాకు మధ్య గలిగిన యుద్ధములో నెవ్వరు విజయులగుదురు? ఓ జగ్రత్పభు ! మాకు చెప్పుము. మేము వీనఁగోరుచున్నాము” అనిన బ్రహ్మ ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. “ఎవరి కొఱకు రజి ఆయుధములుగ్రహించి యుద్దముచేయునోఆతఁడు మూఁడులోకములను జయించును. ఇందుసంశయములేదు.” ఎందు రజియుండునోఅందులక్ష్మీయుండును. ఎందులక్ష్మి యుండునో అందుధృతియుండును. ఎందుధృతియుండునోఅందుధర్మము. ఎందుధర్మమే యం.జయము, రజియొక్కవిజయమునుగూర్చి వీనినదేవతలు రాక్షసులు రాజసత్తమునికడకనిగిరి. జయమునభిలషించుచు ఆతనినీ స్తోత్రముచేసిరి. ఆదేవతలుదానవులు మనస్సులలో సంహృష్ణులయి ఇట్లనిరి. “మా విజయము కొఱకు నీవు నీవరధనువును స్వీకరింపుమని”పలికిరి. రజి ఇట్లనెను. ఎదురుగా వచ్చిన ఇంద్రుని దైత్యులారా! దానవులారా!నేను జయించెదను.ధర్మాత్ముఁడనై యింద్రుఁడ నయ్యెదను. అందుచే యుద్ధభూమిలో నేను యుద్ధము చేసెదను”.
దానవా ఊచుః :-
అస్మాకమింద్రః ప్రహ్లాదస్తస్యార్ధే విజయామహే ।
అస్మింస్తు సమయే రాజంఘిష్ఠేథాం దేవనోదితే ॥
స తడేతి బ్రువన్నేవ దేవైరష్యభినోదితః ।
భవిష్యసీంద్రో జిత్వేతి దేవైరపి నియంత్రితః ॥
జఘాన దానవాన్ సర్వాన్యేఽవధ్యా వజ్రపాణయః ।
స విప్రనష్టాం దేవానాం పరమశ్రీః శ్రియం వలీ ॥
నిహత్య దానవాన్ సర్వానాజహార రజిః ప్రభుః ।
తం తథాహ రజిం తత్ర దేవైః సహ శతక్రతుః ॥
రజీపుత్రోఽహమిత్యుక్త్వా పునరేవాబ్రవీద్వచః ।
ఇంద్రోఽసి రాజన్ దేవానాం సర్వేషాం నాత్ర సంశయః ॥
యస్యాహ మింద్రః పుత్రస్తే ఖ్యాతిం యాస్యామి శత్రుహన్ ।
స తు శక్రవచః శ్రుత్వా వంచితస్తేన మాయయా ॥
తథేత్యేవాహ వై రాజా ప్రియమాణః శతక్రతుమ్ ।
తస్మింస్తు దేవసదృశే దివం ప్రాప్తే మహీపతౌ ॥
దాయాద్యమింద్రాదాజహురాచార్యతనయా రజేః ।
తానీ పుత్రశతాన్యస్య తచ్చ స్థానం శచీపతేః ॥
సమాక్రానంత బహుధా స్వర్గలోకం త్రివిష్టపమ్ ।
తతః కాలే బహుతిథే సమతీతే మహాబలః ॥
హతరాజ్యోఽ బ్రవీచ్చక్రో హతభాగో బృహస్పతిమ్ ।
బదరీఫలమాత్రం వై పురోడాశం విధత్స్వ మే ॥
బ్రహ్మర్షే యేన తిష్ఠేయం తేజసాప్యాయితస్తతః ।
బ్రహ్మన్ కృశోఽహం విమనా హృతరాజ్యో హృయతాసనః ॥
హతౌజా దుర్భలో యుద్ధే రజిపుత్రేః ప్రసీద మే ।
బృహస్పతిరువాచ :-
యద్యేవం చోదితః శక్ర త్వయాస్యాం పూర్వమేవ హి ॥
నాభవిష్యత్త్వత్ప్రి యార్థమకర్తవ్యం మమానఘ ।
దానవులనిరీ :-
మాయొక్క ఇంద్రుఁడు ప్రహ్లాదుడు. ఆతని కొఱకు యుద్దమును జేసి మేము జయించెదము. మా ప్రభువుచే నంగీకృతమయిన యంగీకారము (సమయము)ననుసరింపుము. ఆతఁడింకను “తథేతి” అట్లేజరుగుగాక యని యనక పూర్వమే అతఁడు దేవతలచే నభిమంత్రితుఁడయ్యెను”, యుద్ధమున జయించి ఇంద్రుఁడవయ్యెదవు”. అని. ఆతఁడు దేవతలచే కూడ నాహ్వానింపఁబడెను. వజ్రపాణులయి అవధ్యులయిన దానవులనెల్లరను నాతడు చంపెను. ఇంద్రియ నిగ్రహుఁడు సర్వశ్రీమంతుఁడునయిన రజిరాజు దానవులను చంపి విప్రనష్టమయిన దేవతలయొక్క సంపదను పరిగ్రహించేను,దేవతలతోకూడి ఇంద్రుఁడు రజీతో ఇట్లనెను. నేను రజియొక్క కుమారుడను” అనీ మరలనిట్లుపలికెను, “ఓ రాజా! సర్వదేవతలకు నీవు ఇంద్రుండవు.. అందు సందేహములేదు. ఓశత్రునాశకా! ఓ రాజా! నేను నీకుమారుఁడనగుట ఇంద్రపుత్రునిగా ఖ్యాతి గాంచెదను”. ఆతఁడు ఇంద్రుని వాక్యములు విని ఆతనీమాయచే వంచితుఁడై అట్లే యగుగాక” యని ప్రీతమనస్కుడై రాజు ఇంద్రునితోననెను. అంత, దేవతలతో సమానముగా రాజు స్వరమును పొందగా, రజియొక్క ఆచార్యుని తనయులు ఇంద్రభాగములో తమవంతు భాగమును గ్రహించిరి. తరువాత ఆతని శతసంఖ్యపుత్రులు శచీపతి స్థానమును అనేక పర్యాయములు త్రివిష్టపమయిన స్వర్గలోకమును సమాక్రమించిరి. తరువాత, చాలకాలము గడిచినది. మహాబలుఁడు, హతరాజ్యుఁడు, అయిన ఇంద్రుండు బృహస్పతితో ఇట్లు పలికెను”. బదరీపత్ర ప్రమాణమంతయైన పురోడాశమును నాకు విధించుము. ఓ బృహస్పతీ ! తిరిగి తేజస్సుచే రాజ్యమును పొందు వరకు జీవించి యుండెదను. ఓ బ్రాహ్మణ ! నేను మిక్కిలి కృశించితిని. విమనస్కుండ నైతిని రాజ్యము పోయినది. ఆసనము (ధర్మాసనము) హతమైనది. రజి కుమారులచే నేను యుద్ధమున దుర్భలుడనయితి?. హత తేజుఁడను. నా యందు ప్రసన్నుఁడవు కమ్ము”. అన బృహస్పతి ప్రత్యుత్తరమిట్లిచ్చెను. ఓ ఇంద్రా! నీవే యింతకు పూర్వము నన్నర్ణించియుండిన నీకొఱకై చేయబడనీ పని నాయందేదియును లేదు.
ప్రయతిష్యామి దేవేంద్ర త్వద్ధీతార్థం మహాద్యుతే ॥
యజ్ఞభాగం చ రాజ్యం చ అచిరిత్ప్రా తిపత్స్యసే ।
తథా శక్ర గమిష్యామీ మాభూతే విక్లవం మనః ॥
తతః కర్మ చకారాస్య తేజఃసంవర్థనమ్ మహత్ ।
తేషాం చ వృద్ధిసంమోహమకరోద్బుద్ధిసత్తమః ॥
తే యదా తు సుసమ్మూఢా రాగాన్మతో విధర్మిణః ।
బ్రహ్మద్విషశ్చ సంవృత్తా హతవీర్యపరాక్రమాః ॥
తతో లేభేఽసురైశ్వర్యమైంద్రస్థానం తథోత్తమమ్ ।
హత్వా రజసుతాన్ సర్వాన్ కామక్రోధపరాయణాన్ ॥
య ఇదం చ్యవనం స్థానాత్ప్రతిష్టాం చ శతక్రతోః ।
శ్రుణుయాచ్చ్రావయేద్వాపి న సుదౌరాత్యమాప్నుయాత్ ॥
ఇతి శ్రీమత్ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే ధన్వంతరిసంభవాది వర్ణనం నామ సప్తషష్టితమోఽధ్యాయః ॥
ఓ మహాద్యుతీ దేవేంద్ర ! నీహితార్థము నేను ప్రయత్నించేదను. యజ్ఞభాగమును, రాజ్యమును, అచిరకాలములో పొందెదను. అందుచే, ఇంద్ర ! ఇంక నేను వెళ్లేదను. నీ మనస్సు విక్లబము చేసికొనకుము”. అంత ఆతనియొక్క తేజస్సును వృద్ధి పొందించు గొప్ప కర్మ నాచరించెను. బుద్ధిసత్తముఁడయిన బృహస్పతి, రజి యొక్క కుమారులకు వృద్ధిమోహమును (అజ్ఞానమును) చేసెను. వారు ఎప్పుడు సమ్మూడులయిరో అప్పుడే రోగాన్మత్తులు, విధర్మిణులు, బ్రాహ్మణవిరోధులు ద్వేషులు నయి హతవీర్యులు, హతపరాక్రములునైరి. తరువోత దేవతలు అసురైశ్వర్యములను ఉత్తమమైన ఇంద్ర స్థానమును పొందిరి. కామక్రోధపరాయణులయిన రజికుమారుల నెల్లరను చంపి పూర్వ స్థానమును దేవతలు పొందిరి, ఎవ్వరీశతక్రతుని యొక్క పరిచ్యుతిని పునఃప్రతిష్టానమును విందులో వినిపింతురో వారిరువురు దౌరాత్యస్థానమును పొందరు.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమున మధ్యమభాగమున తృతీయోపోద్ఘాతపాదమున ధన్వంతరిసంభవాదీవర్ణనమయిన అరువది యేడవ అధ్యాయము.
Summary of chapter 105 of the Brahmānda Mahā Purana is as follows:
This technical yet deeply spiritual chapter calculates the exact mathematical durations of Manvantaras, Yugas, and divine years, demonstrating the vast mathematical precision underlying creation. It teaches that human lifespans are but tiny sparks within these vast cosmic ages governed by the divine will. The devoted soul absorbs this wisdom to cultivate profound humility and detachment from worldly timelines.