బ్రహ్మాండ మహా పురాణము
34 - వ్యాస శిష్యోత్పత్తి
వాయురువాచ:-
ఋషయస్తద్వచః శ్రుత్వా సూతమహుస్తదుత్తరమ్ ।
కథం వేదాః పునర్వ్యస్తాస్తన్నో బ్రూహి మహామునే ॥
సూత ఉవాచ :-
ద్వాపరే తు పురావృత్తే మనోః స్వాయంభువాంతరే ।
బ్రహ్మా మునుమువాచేదం రక్ష వేదం మహామతే ॥
పరివృత్తం యుగం తాత స్వల్పవీర్యా ద్వీజాతయః ।
సంవృతా యుగదోషేణ సర్వే చైవ యథాక్రమమ్ ॥
తస్య మానం యుగవశాదల్పం చైవ హి దృశ్యతే ।
దశసాహస్రభాగేన హ్యవశిష్టం కృతోదితమ్ ॥
వాయతేజోబలం చాల్పం సర్వం చైవ ప్రణశ్యతి ।
వేదక్రియా హి కార్యాః స్యుర్మాభూద్వేదవినాశనమ్ ॥
వేదే నాశమనుప్రాప్తే యజ్జో నాశం గమిష్యతి ।
యజ్ఞే నష్టే వేదనాశస్తతః సర్వం ప్రణశ్యతి ॥
ఆద్యో వేదశ్చతుష్పాదః శతసాహస్ర సంమితః ।
పునర్దశగుణః కృష్ణో యజ్ఞో వై సర్వకామధుక్ ॥
ఏవముక్తస్తథోత్యుక్త్వా మనుర్లోకహితే రతః ।
వేదమేకం చతుష్పాదం చతుర్థి వ్యభజత్ర్పభుః ॥
బ్రహ్మణో వచనాత్తాత లోకానాం హితకామ్యయా ।
తదహం వర్తమానేన యుష్మాకం వేదకల్పనమ్ ॥
వాయువు పలికెను :
ఆ వాక్యములను ఋషులు వినిరి. వారు సూతునిట్లడిగిరి. “వేదము లేట్లు మరల వ్యస్తములుగాజేయబడినవి.. వివిధ భాగములుగా విభజింపఁబడినవి. ఓ మహామునీ ! మా కొఱకు దానిని చెప్పుము” అని.
సూతుఁడిట్లనియెను.
స్వాయంభువమనువు తరువాత మరల వచ్చిన ద్వాపరయుగమున మనువుతో బ్రహ్మయిట్లనెను. “ఓ మహామతీ ! వేదమును రక్షించు’ అని, యుగము మారినది. ఓ ప్రియతమ ! ద్వీజన్ములయిన బ్రాహ్మణులు అలవీర్యులయిరి. వారందరు యుగము యొక్క దోషముచే సంవతు లయిరి. యుగవశముననే దానీ మానము (పరిమితి కాలము) అల్పమయినది. కృతయుగమున చెప్పఁబడినదెల్ల దశసహస్ర భాగము మాత్రమే మిగిలియున్నది. [4) శక్తి తేజస్సు బలము సర్వము నశించును. (తగ్గిపోయినది). ప్రతి విషయము నశించును. వేదక్రియలు నిర్వహింపం బడవలసి యున్నది. అయినను వేదమునకు వినాశనము కాకుండుగాక ! వేదము సోశనము నొందిన యజ్ఞములు నాశనము చెందును. యజ్ఞములు నష్టములు కాగా వేదనాశనము కలుగును. సర్వము నశించును. (6) మొదట వేదము 4 పాదములు, అయ్యది శత సహస్ర (లక్ష) (మంత్రములుగా)ముగా నున్నది. మరల కృష్ణ యజుర్వేదము (అప్పుడు) (ఇప్పుడున్న దానికంటె) పదింతలు. యజ్ఞము సర్వకామముల నొసంగునది కదా ! ఇట్లు చెప్పఁబడీ లోకహితము నందాసక్తి గలిగిన మనువు “అట్లగుగాక ! అనెను. అంత ప్రభువు ఏకైకమయిన వేదమును నాలుగు భాగములుగా విభజించెను. (8) బ్రహ్మయొక్కవచనమును బట్టియు, లోకమునకు హితము నాచరించు కోర్కెచే నేను మీకు వర్తమాన మన్వంతరము ననుసరించి, వేదకల్పనము (విభజనమును) గూర్చి వివరించెదను.(9)
మన్వంతరేణ వక్ష్యామి వ్యతీతానాం ప్రకల్పనమ్ ।
ప్రత్యక్షేణ పరోక్షం పై తన్నిబోధత సత్తమాః ॥
అస్మిన్ యుగే తదా వ్యాసః పారాశర్యః పరంతపః ।
ద్వైపాయన ఇతిఖ్యాతో విష్ణోరంశః సనాతనః ॥
బ్రహ్మణా చోదితః సోస్మిన్ వేదం వక్తుం ప్రచక్రమే ।
అథ శిష్యాన్ ప్రజగ్రాహ చతురో వేదకారణాత్ ॥
జైమినిం చ సుమంతుం చ వైశంపాయనమేవచ ।
చతుర్థం పైలమేతేషాం పంచమం లోమహర్షణమ్ ॥
ఋగ్వేదశ్రావకం పైలమగ్రహీద్వీధీవద్ధ్విజాః ।
యజుర్వేదప్రవక్తారం వైశంపాయనమేవ చ ॥
జైమినిం సామవేదార్థశ్రావకం సోఽన్వ పద్యత ।
తథైవాధర్వవేదస్య సుమంతుం ఋషిసత్తమమ్ ॥
ఇతీహాసపురాణస్య కల్పవాక్యస్య చైవ హి ।
మాం చైవ ప్రతీజగ్రాహ భగవానీశ్వరః ప్రభుః ॥
ఏక, ఆసీద్యజుర్వేదస్తం చతుర్థి వ్యకల్పయత్ ।
చాతుర్హోత్రముభూత్తస్మిం స్తేన యజ్ఞమకల్పయత్ ॥
ఆధ్వర్యవం యజుర్భిస్తు ఋగ్భిర్హోత్రం తథైవ చ ।
ఔద్గాత్రం సామభిశ్చక్రే బ్రహ్మత్వం చాప్యథర్వభిః ॥
తతః స చ ఋచ ఉద్ధృత్య ఋగ్వేదం సమకల్పయత్ ।
హోతృకం కల్పయత్తేన యజుర్వేదం జగత్పతిః ॥
గడచిన మన్వంతరములతోడి (యుగ) ప్రకల్పమును జెప్పెదను. ఓ జ్ఞానులారా! ప్రత్యక్షముగనో పరోక్షముగనో దానిని వినుడు. (10) ఈ యుగమున పరాశర సుతుఁడు, పరంతపుఁడు, ద్వైపాయనుఁడనీ సుప్రతిష్ఠితుఁడు నయిన వ్యాసుఁడు సనాతనుఁడు. విష్ణుని యొక్క యంశము.(11) బ్రాహ్మణులచే ప్రచోదీతుఁడయి యతఁడు ఈ యుగమున వేదమును వచించుటకు మొదలిడెను. అంత వేదముల (సంరక్షించుటకు)వ్యాసుఁడు నలుగురు శిష్యులను గ్రహించెను. వారు జైమినీ, సుమంతుఁడు, వైశంపాయనుఁడు, ఫైలుఁడు నాలుగవవాఁడు. ఐదవ శిష్యుఁడు లోమహరుణుఁడు. (13) ఆచారము ననుసరించి (విధివత్) ఋగ్వేదమును (వినుటకు) అధ్యయనము చేయుటకు శిష్యునిగా పైలునీ వ్యాసుఁడు గ్రహించెను. యజుర్వేద ప్రవక్తనుగా వైశంపాయనుని గ్రహించెను. సామవేదమునకు శిష్యునిగా (సామవేద మంత్రార్థములకు) వ్యాసుఁడు జైమినిని గ్రహించెను. ఋషిసత్తముఁడయిన సుమంతుని అధర్వ వేదాధ్యయనమునకు శిష్యునిగా గ్రహించెను. భగవంతుఁడు ఈశ్వరుం డు నయిన వ్యాస ప్రభువు ఇతిహాసములు, పురాణములు, కల్ప వాక్యములకు (సూతుఁడనైన నన్ను గ్రహించెను. (16) ఒకటే యొకటి యజుర్వేదము. దాని నాతఁడు నాలుగుగా చేసెను. అందు చాతురోత్రములు (నాలుగు విధములయిన యజ్ఞవిధులు) కలవు. ఆ విధుల ననుసరించి వ్యాసుడు యజ్ఞమును కల్పించెను. (17) ఆ ఋత్విక్కులు నల్లురు (హోత, ఆధ్వర్యువుడు, ఉదాత, బ్రహ్మ) (ఆధ్వర్యవము (ఆధ్వర్యోః ఇదమ్) యజుర్వేద సంబంధమైనవి). ఆధ్వర్యవమును యజుర్వేద మంత్రములచేతను, హోత్రమును ఋగ్వేదమంత్రముల చేతను, ఔద్దాత్రమును సామముల చేతను, ఇఁక బ్రహ్మత్వమును (ఋత్విగధ్యక్షుఁడు) ఆధర్వ వేద మంత్రములచేతను యజ్ఞకార్యమును నిర్వహింప వ్యాసుడు నియమించెను. (18) తరువాత ఋగ్వేద మంత్రములు గ్రహించి (ఉద్దృత్య) వ్యాసుఁడు ఋగ్వేదమును రచించెను. (సమకూర్చెను) హోతృక మంత్రముల గ్రహించి వ్యాసుఁడు యజుర్వేదమును సంకలన మొనర్చెను. (19)
సామభిః సామవేదం చ తేనౌద్గాత్రమకల్పయత్ ।
రాజ్ఞాస్త్వథర్వవేదేన సర్వకర్మాణ్యకారయత్ ॥
ఆఖ్యానైశ్చాప్యుపాఖ్యానైర్గాథాభిః కల్పజోక్తిభిః ।
పురాణసంహితాం చక్రే పురాణార్థవిశారదః ॥
యచ్ఛిష్టం తు యజుర్వేదే తేన యజ్ఞమయుంజత ।
యజనాత్స యజుర్వేద ఇతి శాస్త్ర వినిశ్చయః ॥
పాదానాముద్ధతత్వాచ్చ యజూంషి విషమాణి చ ।
శతేనోద్ధతవీర్యస్తు ఋత్విగ్భిర్వేదపారగైః ॥
ప్రయుజ్యతే హ్యశ్వమేధస్తేన వా పుష్యతే తు సః ।
ఋచో గృహీత్వా పైలస్తు వ్యభజత్తు ద్విధా పునః ॥
ద్వే కృత్వా సంహితే చైవ శిష్యాభ్యామదదాద్విభుః ।
ఇంద్రప్రమతయే చైకాం ద్వితీయాం బాష్కలాయ చ ॥
చతస్రః సంహితాః కృత్వా బాష్కలో ద్విజసత్తమః ।
శిష్యానధ్యాపయామాస శుశ్రూషాభిరతాన్ హితాన్ ॥
సామ మంత్రముల గ్రహించి సామవేదమును సమకూర్చెను. తన్మూలమున ఔద్గాత్రమును కల్పించెను. అధర్వవేదము మూలమున రాజు యొక్క విధులను ఘటించెను. (20) ఆఖ్యానముల చేతను, ఉపాఖ్యానముల చేతను, గాథల చేతను కల్పముల యందలి ఉక్తుల చేతను, పురాణార్థ విశారదుఁడైన వ్యాసుఁడు పురాణ సంహితను రచించెను. (21) పురాణ సంహితలలో చెప్పగా మిగిలిన దెల్లను యజుర్వేదమున సమకూర్చి వ్యాసుడు యజ్ఞమును యోజనము చేసెను. యజనముల వలన యజుర్వేదమని. శాస్త్ర నిర్ణయము. (22) యజుర్వేద మంత్రముల యందలి పాదములు, మిక్కిలి పొడవైన వగుట (ఉద్ధతత్త్వాత్) యజుర్వేద మంత్రములు విషమములు (క్లిష్టములు). ఈ వేదము అత్యంత వీర్యవంతమయిన దగుట, ఈ వేదమును పరీక్షుణ్ణముగా నేర్చిన నూర్గురు ఋత్విక్కులచే (23) అశ్వమేధ యాగము కూడ ప్రయోగింపఁబడినది దానిచే పరీవృద్ధి చెందింపబడినది. ఋగ్వేద మంత్రమును గ్రహించి, పైలుఁడు దానిని మరల రెండు వర్గములుగా విభజించెను. (24) రెండు, సంహితలను రచించిన పిమ్మట, విశిష్ఠుఁడైన ఆ ఆచార్యుఁడు తన యిరువురు శిష్యులకు నప్పగించెను. ఒకదానిని ఇంద్రప్రమతికి, రెండవ దానీనీ బాష్కలునకు. (25) ద్విజసత్తముఁడయిన బాష్కలుడు నాలుగు సంహితలను రచించెను. తన్ను శుశ్రూష చేయుటకాత్రముగా నున్నవారు, తన క్షేమమును కోరినట్టివారును నయిన తన శిష్యులకు అధ్యాపనము చేసెను. (26)
బోధ్యాం తు ప్రథమాం శాఖాం ద్వితీయామగ్నిమాతరమ్ ।
పారాశరీం తృతీయాం తు యజ్ఞావల్క్యమథాపరామ్ ॥
ఇంద్రప్రమతిరేకాం తు సంహితామృషిసత్తమః ।
అధ్యాపయన్ మహాభాగం మాండూకేయం యశస్వినమ్ ॥
సత్యస్రవస్రమగ్ర్యం తు పుత్రం స తు మహాయశాః ।
సత్యస్రవాః సత్యహితం పుత్రమధ్యాపయద్విభుః ॥
సోఽపి సత్యహితః పుత్రం పునరధ్యాపయద్ద్విజాః ।
సత్యమిశ్రం మహాత్మానం సత్యధర్మపరాయణమ్ ॥
అభవంస్తస్య శిష్యా వై త్రయస్తు సుమహౌజసః ।
సత్యశ్రీయాశ్చ విద్వాంసః శాస్త్రగ్రహణతత్పరాః ॥
శాకల్యః ప్రథమస్తేషాం తస్మాదన్యో రధీతరః ।
భాష్కలీశ్చ భరద్వాజ ఇతీ శాఖాప్రవర్తకాః ॥
దేవమిత్రస్తు శాకల్యో జ్ఞానాహంకారగర్వితః ।
జనకస్య స యజ్ఞే వై వినాశమగమద్ద్విజాః ॥
శాంశపాయన ఉవాచ :-
కథం వినాశమగమత్సమునిర్జ్ఞానగర్వితః ।
జనకస్యాశ్వమేథే తు కథం వాదోఽభ్యజాయత ॥
కీమర్థం వాఽభవద్వాదః కేన సార్థమథాపి వా ।
ఏతత్సర్వం యథావృత్తమాచక్ష్వ విదితం తవ ॥
ఆ నాలుగు సంహితలలో మొదటిశాఖ బోధము, రెండవ శాఖ అగ్నిమాతరము, మూడవశాఖ పారాశరి, ఇంక నాలుగవది యాజ్ఞవల్క్యశాఖ. ఋషి సత్తముఁడయిన ఇంద్రప్రమతి ఒక శాఖను అధ్యాపనము చేసెను. ఆతఁడు మహాభాగుడు యశస్వంతుడునగు మాండూకేయునకు అధ్యాపనము చేసెను. (28) మహా యశస్వియయిన ఋషి తన జ్యేష్ణ కుమారుఁడైన సత్యస్రవసునికి గల పెను. ప్రసిద్ధుఁడయిన సత్యప్రవసుఁడు సత్యపోతుఁడను తన కుమారున కధ్యాపనము చేసెను. సత్యహితుఁడు తన కుమారుఁడయిన సత్యశ్రీకి గల పెను. ఆ సత్యశ్రీ మహాత్ముఁడు, సత్యధర్మ పరాయణుఁడు. సత్యశ్రీకి ముగ్గురు శిష్యులు. వారు మహా మేధావులు. విద్వాంసులు, శాస్త్రార్ధసారమును గ్రహింపవలయునను ఆత్రము గలవారు. (30) వారిలో ప్రథముడు శాకల్యుఁడు. ఇంకోకఁడు రథోతరుఁడు. ఇక మూఁడవవాఁడు భరద్వాజుఁడు. భారద్వాజుఁడు బాష్కలుని కుమారుఁడు. ఈ మువ్వురు వేద సంహితలను ప్రవర్తింపఁజేసిరి. శాకల్యుఁడు దేవమిత్రుఁడుగా ప్రఖ్యాతుఁడు. శాకల్యుఁడు జ్ఞానాహంకార గర్వితుఁడు. ఓ బ్రాహ్మణులారా ! ఆతఁడు శాకల్యుఁడు. జనకుని యజ్ఞ సమయమున వినాశనమొందెను. (మరణించెను). శాంశపాయనుఁడు ఇట్లు పలికెను. “జ్ఞాన గర్వితుఁడయిన యా ముని యెట్లు జనకుని క్రతువున వినాశనము నొందెను? వాదమెట్లు జరిగెను? అయ్యది యెందులకు జరుగవలసి వచ్చెను? ఎవనితో వాదము జరిగినది? వీనినన్నింటిని నీవెఱుంగుదువు గాన, యథావృత్తము జరిగినది జరిగినట్లుగా సర్వము చెప్పుము.” (35)
సూత ఉవాచ :-
జనకస్యాశ్వమేధే తు మహానాసీత్సమాగమః ।
ఋషీణాం హి సహస్రాణి తత్రాజగ్మురనేకశః ॥
రాజర్షేర్జనకస్యాథ తం యజ్ఞం హి దిదృక్షపః ।
ఆగతాన్భ్రాహ్మణాన్ దృష్ట్వా జిజ్ఞాసాస్యాభవత్తతః ॥
కోన్వేషాం బ్రాహ్మణశ్రేష్ఠః కథం మే నిశ్చయో భవేత్ ।
ఇతి నిశ్చిత్య మనసా బుద్ధిం చక్రే జనాధిపః ॥
గవాం సహస్రమాదాయ సువర్ణమధికం తతః ।
గ్రామాన్రత్నాని దాసీశ్చ మునీన్ ప్రాహ నరాధిపః ॥
సర్వానహం ప్రపన్నో వః శిరసా శ్రేష్ఠభాగినః ।
యదేతదాహృతం విత్తం యో వా శ్రేష్ఠ తమో భవేత్ ॥
తస్మై తదుపనీతం మే విత్త విత్తం ద్విజోత్తమాః ।
జనకస్య వచః శ్రుత్వా ఋషయస్తే శ్రుతిక్షమాః ॥
దృష్ట్వా ధనం మహాసారం ధనగృధ్నా జిఘృక్షవః ।
ఆహ్వయాంచక్రిరేఽన్యోన్యం వేదజ్ఞానమదోల్బణాన్ ॥
మనసా గతవిత్తాస్తే మమైతద్ధనమిత్యుత ।
మమైతన్నతవేత్యన్యో బ్రూహి వా కిం వీకత్థసే ॥
ఇత్యేవం ధనదోషేణ వాదాంశ్చక్రురనేకశః ।
అధాన్యస్తత్ర వై విద్వాన్ బ్రహ్మణస్తు సుతః కవిః ॥
యాజ్ఞవల్క్యో మహాతేజాస్తపస్వీ బ్రహ్మవిత్తమః ।
బ్రహ్మణోంఽశసముత్పన్నో వాక్యం ప్రోవాచ సుస్వరమ్ ॥
సూతుఁడు చెప్పెను.
జనకుని అశ్వమేధమున విద్వాంసుల సమాగమము గొప్పది జరిగెను. వేలాది ఋషీశ్వరులు వచ్చియుండిరి. (36) పోరందరు రాజర్షియైన జనకునీ యజ్ఞమును చూడగోరిరి. వచ్చిన బ్రాహ్మణులను చూచి జనకునకు జిజ్ఞాస కలిగెను. వీరందరీలో బ్రాహ్మణ శ్రేష్ఠుఁడెవ్వఁడు? నేనెట్లో నిశ్చయమును చేయగలుగుదును? అని యెంచు జనాధిపునకొక యూహ తోచెను. (38) అంత (బహుమతులుగా) ఆ రోజు ఒక సహస్రము ఆవులును, అంతకుమించు సువర్ణమును, గ్రామములను, రత్నములను, దాసీ జనములను తెచ్చెను. అంత రాజు మునులకు ఇట్లు ప్రకటించెను. “ఓ ఉత్తమ బ్రాహ్మణులారా ! మీకందరకు శిరస్సు వంచి నమస్కరించుచున్నాను. తీసికొనీ రాబడిన ఈ నా విత్తమంతయు మీలో శ్రేష్ఠతమునకని యేతరంగుఁడు.” (41) ఆ వేదవిదులయిన ఋషీశ్వరులు జనకుని పోక్యములు వినిరి. మిక్కిలి విలువయైన ధనమును చూచిరి. వేద విదులయిన బ్రాహ్మణులు ధనము గ్రహీంపఁదలంచిరి. ఆశాపరులయిరి. వారందరు వేదవిజ్ఞాన మదోన్మత్తులయి యొండొరులను వాదములకు పిలిచిరి. వారందరు మనసా గత విత్తులు ‘ఆధనము సోది ఆ విత్తము నీదికాదు అనీ ఒండొరులకు స్వోత్కర్షతో చెప్పుకొనిరి. ఇంకొకఁడు ‘ఎందులకీట్లు గొప్పలాడెదవు?’ అనీ యీ విధముగా అనేకులు అనేక విధములుగా ధన దోషమున వాదములాడుకొనిరి. (43) కానీ యక్కడ వేలోక విద్వాంసుం డు, బ్రహ్మ కుమారుఁడు, ద్రష్ట యున్నాడు. ఆతఁడు యాజ్ఞవల్క్యుఁడు మహాతేజస్వి. బ్రహ్మవిత్తముఁడు, బ్రహ్మయొక్క యంశము నుండి సముత్పన్నుఁడు. ఆతఁడు సుస్వరమున ఒక వాక్యము పలికెను. (45)
శిష్యం బ్రహ్మవిదాం శ్రేష్ఠం ధనమేతత్ గృహాణ వై ।
నయస్వ చ గృహం వత్స మమైతన్నాత్ర సంశయః ॥
సర్వవాదేష్వహం వక్తా నాన్యః కశ్చిత్తు మత్సమః ।
యో వాన ప్రీయతే విద్వాన్ సమాహ్వయతు మా చిరమ్ ॥
తతో బ్రహార్ణవః క్షుబ్డః సముద్ర ఇవ సంప్లవే ।
తానువాచ తతః స్వస్థో యాజ్ఞవల్క్యో హసన్నివ ॥
క్రోధం మా కార్ష్ట విద్వాంసో భవంతః సత్యవాదినః ।
వదామహే యథాశక్తి జిజ్ఞాసంతః పరస్పరమ్ ॥
తతోఽభ్యుపగతాస్తేషామ్ వాదాః శబ్ధైరనేకశః ।
సహస్రధా శుభైరర్థైః సూక్ష్మదర్శనసంభవైః ॥
లోకే వేదే తథాఽధ్యాత్మవిద్యాస్థానైరలంకృతైః ।
సంత్యుత్తమగుణైర్యుక్తా నృపస్యాపిపరీక్షకాః ॥
వాదాః సమభవంస్తత్ర ధనహేతోర్మహాత్మనామ్ ।
ఋషయస్త్వేకతః సర్వే యాజ్ఞవల్క్యస్తథైకతః ॥
సర్వే తే మునయస్తేన యాజ్ఞవల్క్యేన ధీమతా ।
ఏకైకశస్తతః పృష్టా నైవోత్తమథాబ్రువన్ ॥
స విజిత్య మునీన్ సర్వాన్ బ్రహ్మరాశిర్మహామతీః ।
శాకల్యమితి హోవాచ వాదకర్తారమంజసా ॥
శాకల్య వద వక్తవ్యం కిం ధ్యాయన్నవతిష్ఠసే ।
పణస్తు యజమానేన బద్ధో నీతో యథా ధృతః ॥
అంత యాజ్ఞవల్క్యుఁడు, బ్రహ్మవిదులలో శ్రేష్ఠుడు, శిష్యుఁడు నయిన వానితో “ఈ ధనమును తీసికొనుము. మన యింటికి తీసికొని వెళ్లుము. ఓ శిష్యా ! అయ్యది నాది. అందు సందేహము లేదు. అన్నీ వాదముల యందు నేనే వక్తను. నాతో సముఁడైనవాఁడెవ్వడింకొకఁడు లేడు. దీని నెవ్వఁడంగీకరింపఁడో ఆ విద్వాంసుఁడు వెంటనే నన్ను వాదమునకు పిలువవచ్చును” అనెను. (47) ఆ సమయమున ప్రళయ కాలమున సముద్రమువలె ఆ విద్వద్వరేణ్యార్ణవము సంక్షోభము నొందెను. అంత స్వస్థుఁడయి, యాజ్ఞవల్క్యుడు వారిని నవ్వుచున్న వానివలె యిట్లనెను. ఓ పూజ్య విద్వాంసులారా! కోపమొందకుఁడు. మీరందరు సత్యవాదులు. మనము ఒండొరుల నవగాహనము చేసికొనీ యథాశక్తి వాదము సల్పుదము. ఉత్తమ గుణయుక్తులను రాజు పరీక్షకులనుగా నియమించెను. అంత వాదములు చెలరేగెను. అనేక విధముల శబ్దములతో వేలకొలదీ శుభార్ధ ప్రతిపాదనలతో, పరిశీలనా శక్తి సంపన్నమయిన సూక్ష్మ దర్శనముతో, లోకము నుండి, వేదము నుండి అధ్యాత్మ విద్యా స్థానముల నుండి అలంకృతమయిన విధములతో వేదములు జరిగెను. ఇయ్యది ధన హేతుకముగా జరిగెను. ఋషులందరొక పక్షమున, యాజ్ఞవల్క్యులు ఒక్కొరోక పక్షమున (52) ఆ మునులందరు, ధీమంతుఁడైన యాజ్ఞవల్క్యునిచే ఒక్కొక్కరు ప్రత్యేకముగా పృచ్ఛింపబడిరి. కాని యెవ్వరును సమాధాన మొసంగలేదు. బ్రహ్మవిద్యారాశి, మహాయతీయు నైన యాజ్ఞవల్క్యుడు, ఋషీశ్వరుల నెల్లరను వాదమున జయించి, వాదకర్తయైన శాకల్యునీతో వెంటనే ఇట్లనెను. ఓ శాకల్య ! వక్తవ్యమును వచింపుము. ఎందులకీ వేదో ధ్యానించుచు నుండి పోయెదవు. (ఎవరి కోఱకు యజ్ఞము జరుగుచున్నదో ఆ రాజు) యజమాన్యుడు ఒక పందెము (పణము) నిడెను. ఆ పణము నేను గ్రహించితిని. (55)
ఏవం స ధర్షితస్తేన రోషాత్తామ్రాస్యలోచనః ।
ప్రోవాచ యాజ్ఞవల్క్యం స పురుషం మునిసన్నీధౌ ॥
త్వమస్మాంస్తృణవత్కృత్వా తథైవాన్యాన్ద్విజోత్తమాన్ ।
విద్యాధనం మహాసారం స్వయంగ్రాహం జిఘృక్షసి ॥
శాకల్యేనైవముక్తస్తు యాజ్ఞవల్క్యస్తమబ్రవీత్ ।
బ్రహ్మిష్ఠానాం బలం విద్ధి విద్యాతత్త్వార్థదర్శనమ్ ॥
కామస్యార్థేన సంబంధస్తేనార్థం కామయామహే ।
కామప్రశ్నధనా విప్రాః కామప్రశ్నం వదామహే ॥
పణశ్చైవాస్య రాజర్షేస్తస్మాన్నీతం ధనం మయా ।
ఏతచ్చృతా వచస్తస్య శాకల్యః క్రోధమూర్చితః ॥
యాజ్ఞవల్క్యమథోవాచ కామప్రశ్నార్థకృద్వచః ।
బ్రూహీదానీం మయోద్ధిష్టాన్కామప్రశ్నాన్ యథార్థతః ॥
తతః సమభవద్వాదః తయోర్ర్బహ్మవిదోర్మహాన్ ।
సాగ్రం ప్రశ్నసహస్రం తు శాకల్యః సోఽకరోత్తదా ॥
యాజ్ఞవల్క్యోఽబ్రవీత్సర్వఋషీణాం శ్రుణ్వతాం తదా ।
శాకల్య స్త్వాస నిర్వాదో యాజ్ఞవల్క్యస్తమబ్రవీత్ ॥
ప్రశ్నమేకం మమాపి త్వం శాకల్య వద కామీకమ్ ।
పణప్రాప్యస్య వాదస్య బ్రువతోర్మృత్యురత్ర వై ॥
సుసూక్ష్మజ్ఞానసంయుక్తం సాంఖ్యయోగమథాపీ వా ।
అధ్యాత్మస్య గతిం ముఖ్యాం ధ్యానమార్గమథాపి వా ॥
ఈ విధముగా ఎదుర్కొని ధర్షింపబడగా శాకల్యునీ ముఖము నేత్రములు కోపముచే తామ్రవర్ణము నందెను. తన శిష్యులతో ననుసరింపం బడి శాకల్యుఁడు మునుల సన్నిధి యాజ్ఞవల్క్యునితో నిట్లనెను. “మమ్మందరను, ఉత్తమ బ్రహ్మవిదులను గడ్డి పలకలవలె తృణీకరించి, నీవు స్వయముగా మహాసారవంతమయిన విద్యాధనమును, స్వయంగ్రహముగా గ్రహింపగోరుచుంటివి. ఇట్లు శాకల్యునిచే పలుకబడి యాజ్ఞవల్క్యుం డిట్లనెను. “బ్రహ్మి ష్టులబలము విద్యాతత్త్వార్ధదర్శనమని యెఱుంగుము. బ్రహ్మ యందు నిమగ్నమయిన ధ్యానము గలవారు బ్రహ్మీష్ణులు. కోరిక ధన సంబంధమయినది. అందుచే ధనము మేము కోరుదుము, విప్రులు కామప్రశ్నధనులు. (వారికేది కావలసిన దాని నడుగువారు). అందుచే కోరినట్లుగా కామ ప్రశ్ననడగుదుము. (59) రాజర్షియైన జనకుడిడిన పణమిది. అందుచేతనే ఆ ధనము నాచే గ్రహింపఁబడినది. ఈ యాజ్ఞ వల్క్యుని పలుకులు విని శాకల్యుఁడు క్రోధోదగ్రుఁడయ్యెను. (60) తనకు తోచినట్లుగా నడుగుటకు శాకల్యుఁడు యాజ్ఞవల్క్యునిట్లడిగెను. “ఇపుడు నాచే నుద్దిష్టములయిన కామప్రశ్నలకు యథార్థతః ప్రత్యుత్తరమిమ్ము”. మహాబ్రహ్మ విదులయిన వారిరువురి మధ్య అప్పుడు వాదము చెలరేగెను. సహస్రాధికప్రశ్నలను శాకల్యుఁడు వేసెను. ఋషులందరు వినుచుండిరి. యాజ్ఞవల్క్యుడు వానికి సమాధానమిడెను. ఇంక శాకల్యునకు వేలుప్రశ్నలుగానీ వాదముగాని లేదయ్యెను. అప్పుడు యాజ్ఞవల్క్యుడతనితో “ఓ శాకల్య ! నేనడుగు ప్రశ్నకొక్కదానికైన సమాధాన మిమ్ము” ఈ వివాదములో సమాధాన మీయకున్నచో మృత్యువు పణము” అనెను. (64)
అథ సంచోదితః ప్రశ్నో యాజ్ఞవల్క్యేన ధీమతా ।
శాకల్యస్తమవిజ్ఞాయ తథా మృత్యుమవాప్తవాన్ ॥
ఏవం స్కృతః స శాకల్యః ప్రశ్నవ్యాఖ్యానపీడితః ।
ఏవం వివాదః సుమహానాసీతేషాం ధనార్థినామ్ ॥
ఋషీణాం ఋషిభిః సార్ధం యాజ్ఞవల్క్యస్య చైవ హి ।
యాజ్ఞవల్క్యో ధనం గృహ్య యశో విఖ్యాయ చాత్మనః ।
జగామ వై గృహం స్వచ్ఛం శిష్యైః పరివృతో వశీ ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే పూర్వ భాగే ద్వితీయేఽనుషంగపాదే
వ్యాసశిష్యోత్పత్తివర్ణనం నామ చతుస్త్రింశత్తమోఽధ్యాయః ॥
సూక్ష్మ జ్ఞాన సంయుక్తమయినది సాంఖ్యమా? యోగమా? ఏది మిక్కిలి ముఖ్యతరమయినది? ఆధ్యాత్మికజ్ఞానపథమా? లేక ధ్యాన మార్గమా? అనెను. (65) ధీమంతుఁడయిన యాజ్ఞవల్క్యుని చేత సంచోదితమయిన ప్రశ్నమునకు శాకల్యుఁడు ప్రత్యుత్తరము తెలియకుండెను. అప్పుఁడాతఁడు మృత్యువొందెను. (66) ఈ విధముగా శాకల్యుఁడు ప్రశ్న వ్యాఖ్యానపీడితుఁడు. ధనార్డులలో నీ విధముగా పెద్ద వివాదము జరిగెను. ఋషులలో, ఋషులతో కూడికొని యాజ్ఞవల్క్యునకు వాదము జరిగెను. యాజ్ఞవల్క్యుడు ధనమును తన యశస్సును స్థాపించుకొని గ్రహించెను. తన శిష్యులలోఁగూడికొని అనంత నిగ్రహముతో యాజ్ఞవల్క్యుడు ఇంటి కరిగెను.
ఇది వాయుప్రోక్తము, మహాపురాణము నయిన బ్రహ్మాండ పురాణమందలి పూర్వభాగమందలి ద్వితీయానుషంగపాదమున వ్యాస శిష్యోత్పత్తి వర్ణనమను ముప్పది నాలుగవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 34 of the Brahmānda Mahā Purana is as follows:
The narrative respectfully turns to the grand spiritual heritage of the venerable sage Vyāsa, who out of supreme compassion divided the single Veda to preserve it for future generations. It affectionately lists his glorious disciples, illustrating how the sacred river of knowledge was gracefully channeled into various streams to bless the entire world. The devout reader is filled with immense gratitude for these ancient masters, whose tireless spiritual labors have ensured that the light of divine truth remains forever accessible.