29 - యుగచక్రము యుగస్వభావములు

ఋషిరువాచ :-

చతుర్యుగానీ యాన్యాసన్పూర్వం స్వాయంభువేoఽతరే

తేషాం నిసర్గం తత్త్వం చ శ్రోతుమిచ్ఛామి విస్తరాత్

సూత ఉవాచ :-

పృథీవ్యాధి ప్రసంగేన యన్మయా ప్రాగుదీరీతమ్

తేషాం చతుర్యుగం హ్యేతత్ తద్వక్ష్యామి నిబోధత

సంఖ్యయేహ ప్రసంఖ్యాయ విస్తరాచ్చైవ సర్వశః

యుగం చ యుగభేదశ్చ యుగధర్మస్తథైవ చ

యుగసంధ్యాంశకశ్చైవ యుగసంధానమేవ చ

షట్ప్రకాశయుగాఖ్యైషా తాం ప్రవక్ష్యామి తత్త్వతః

లౌకికేన ప్రమాణేన నిష్పాద్యాబ్ధం తు మానుషమ్

తేనాబ్ధేన ప్రసంఖ్యాయై వక్ష్యామీహ చతుర్యుగమ్

నిమేషకాలతుల్యం హి విద్యాల్లఘ్వక్షరం చ యత్

కాష్ఠా నిమేషా దశ పంచ చైవ త్రింశచ్చ కాష్ఠా గణయేత్కలాం తు

త్రింశత్కలాశ్చాపి భవేన్ముహూర్తస్త్రైస్త్రింశతో రాత్ర్యహనీ సమేతే

అహోరాత్రౌ విభజతే సూర్యో మానుషలౌకికౌ

తత్రాహః కర్మచేష్టాయాం రాత్రీః స్వప్నాయ కల్పతే

పిత్యై రాత్ర్యహనీ మాసః ప్రవిభాగస్తయోః పునః

కృష్ణపక్ష స్త్వహస్తేషాం శుక్లః స్వప్నాయ శర్వరీ

త్రింశద్యే మానుష్కా మాసాః పిత్ర్యో మాసస్తు స స్మృతః

శతాని త్రీణి మాసానాం షష్ట్యా చాష్యధికాని వై

పీత్ర్యః సంవత్సరో హ్యేష మానుషేణ విభావ్యతే

మానుషేణైవ మానేన వర్షాణాం యచ్ఛతం భవేత్

పితౄణాం త్రీణి వర్షాణి సంఖ్యాతానీహ తాని వై

స్వాయంభువ మన్వంతరమునకు పూర్వముకల చతుర్యుగముల స్వభావమును గూర్చి తత్త్వమును గూర్చి విస్తరముగా వినఁగోరుచున్నాను. సూతుఁడిట్లు ప్రత్యుత్తర మొసంగెను. పూర్వము పృథివ్యాది ప్రసంగపశమున నే చెప్పిన విషయములో చతుర్యుగముల గూర్చి యున్నది. నేనదీ మరల చెప్పెదను. వినుఁడు తెలిసికొనుఁడు. (2) నాలుగు యుగములఁ గూర్చి చెప్పునప్పుడందు ఆరు విషయములున్నవి, యుగము, యుగభేదము {యుగములలోని తార తమ్యము) యుగధర్మము (యుగముల యొక్క ప్రత్యేక లక్షణములు) యుగసంధ్య (యుగముల సంధీ) యుగాంశకము (యుగము యొక్క భాగము) యుగసంధానము (రెండు యుగముల కలయిక) వీనిని యథార్థముగా (తత్త్వతః) వివరముగా విస్తరించెదను. ప్రతి విషయము వివరించెదను, అంతియేకాక పోని వాని సరియైన సంఖ్యను కూడ (లెక్క గణనము) ఎచ్చటేచ్చట నవసరమో అందు చెప్పెదను. (4) లౌకిక గణనము ననుసరించి మానుష సంవత్సరమును లెక్కించిన తరువాత, నాలుగు యుగములను మానుష సంఖ్యా గణనమున చేప్పెదను. (5) కాష్ఠ ఒక్క రెప్పపాటు కాలము. కాష్ట (కాలగణన మానమున అల్పిష్టమైనది) ఒక లఘ్వక్షరము నుచ్చరించుటకు పట్టుకాలము కూడ కొష్టముగానే గ్రహింపవలయును 15 నిమేషములు ఒక కాష్ఠము, 50 కాష్ఠములు ఒక కల 30 కలలు ఒక ముహూర్తము. పగలు రాత్రి కలిసి ముప్పది ముహూర్తములు, అవి రెండును ఒండొంటికి సమానముగా నుండును. (6) మానుష లౌకికములయిన దివారాత్రములను సూర్యుఁడు విభజించును. (7) అందు కర్మలాచరించుటకు పగలు, రాత్రి నిద్రకును కల్పింపబడినవి. పితరుల యొక్క పగలు, ఒకరాత్రి ఒక (మానుష) మాసమగును. మరల వానిలోని ప్రవీభాగము నీతీరున నుండును. కృష్ణపక్షము వారికి పగలు; శుక్లపక్షము వారికి రాత్రి. (ఆ రాత్రి వారి నిద్రకు) ముప్పది మానవుల మాసములు పితరుల కొకమాసము 360 మానవ మాసములు పితరుల కొక సంవత్సరమగును, (10) మానవ గణనమును బట్టియయిన యొక వంద సంవత్సరములు పితరులకు మూడు సంవత్సరముల పదమాసములు. కాలగణన ప్రమాణము అల్పమైన కాలగణనము కొష్ఠము. అది ఒక రెప్పపాటు కాలము.

15 నిమేషములు - ఒక కాష్ఠము. 30 కాష్ఠలు = ఒక కల

30 కలలు ఒక ముహూర్తము. 30 ముహూర్తములు ఒక పగలు, ఒక రాత్రి

30 రోజులు ఒక నెల; ఇది పితరులకు ఒక పగలు. ఒక రాత్రి

30 మానవ మాసములు - పితరుల కొక నెల

360 మానవ మాసములు - పితరుల కొక సంవత్సరము.

వంద మానవ సంవత్సరములు పితరులకు మూడు సంవత్సరముల పదిమాసములు

మానవ ఉత్తరాయణము = (6 మాసములు) = ఇది దేవతల కొక పగలు

మానవ దక్షిణాయనము = (6 మాసములు) = దేవతల కొక రాత్రి

ఒక మానవ సంవత్సరము = దేవతల ఒక పూర్తి రోజు (ఒక పగలు = ఒక రాత్రి)

30 మానవ సంవత్సరములు = దేవతలకొక మాసము

360 మానవ సంవత్సరములు = దేవతల కొక సంవత్సరము

3030 మానవ సంవత్సరములు = ఒక సప్తర్షి సంవత్సరము

9090 మానవ సంవత్సరములు = ఒక ధ్రువ సంవత్సరము

360000 మానవ సంవత్సరములు = దేవతలకు వేయి సంవత్సరములు

దశ చైవాధికాః మాసాః పితృసంఖ్యేయసంజ్ఞితాః

లౌకికేనైవ మానేన హ్యబ్ధోయో మానుషః స్మృతః

ఏతద్దీవ్యమహోరాత్రం శాస్రస్యాన్నిశ్చయో గతః

దివ్యే రాత్ర్యహనీ వర్షం ప్రవిభాగస్తయోః పునః

అహస్తత్రోదగయనం రాత్రిః స్యాద్ధక్షిణాయనమ్

యే తే రాత్ర్యహనీ దివ్యే ప్రసంఖ్యానం తయోః పునః

లౌకిక గణనమును బట్టి యేదీ క మానుష సంవత్సరముగా స్మరింపఁబడునో, అయ్యది దేవతలకొక పగలు ఒకరాత్రేయును. ఈ విధముగా శాస్త్రములయందు నిశ్చయింపఁబడినది. దీవ్యమైన (దేవతా సంబంధమైన) ఒక పగలు, ఒక రాత్రియు కలిసి ఒక సంవత్సర మగును. వానిలోను ఇంకను విభాగములు కలవు. అవి యిట్లుండును. (13) సూర్యుని ఉత్తరగమనము పగలు, దక్షిణ గమనము రాత్రీ యగును. ఇది దేవతలకు దేవతల దివారాత్రములం గూర్చిన లెక్కలివిధముగా నుండును. (14)

త్రింశద్యానీ తు వర్షాణి దివ్యో మాసస్తు స స్మృతః

యన్మానుషం శతం విధ్ధి దివ్యా మాసాస్త్రయస్తు తే

దశ చైవ తథాఽహాని దివో హ్యేష విధిః స్మృతః

త్రీణి వర్షశతాన్యేవ షష్టివర్షాణి యాని తు

దివ్య సంవత్సరో హ్యేష మానుషేణ ప్రకీర్తితః

త్రీణి వర్షసహస్రాణి మానుషాణీ ప్రమాణతః

త్రింశదన్యాని వర్షాణి మతః సప్తర్షవత్సరః

నవ యాని సహస్రాణి వర్షాణాం మానుషాణి తు

అన్యాని నవతిశ్చైవ ధ్రువః సంవత్సరఃస్మృతః

షడ్వింశతిసహస్రాణి వర్షాణి మానుషాణి తు

వర్షాణాం తు శతం జ్ఞేయం దివ్యో హ్యేష విధిః స్మృతః

త్రీణ్యేవ నియుతాన్యాహుః వర్షాణాం మానుషాణి తు

షష్టిశ్చైవ సహస్రాణి సంఖ్యాతాని తు సంఖ్యయా

దివ్యవర్షసహస్రం తు ప్రాహుః సంఖ్యావిదో జనాః

ఇత్యేవం ఋషిభిర్గీతం దివ్యయా సంఖ్యయా త్విహ

దివ్యేనైవ ప్రమాణేన యుగసంఖ్యాప్రకల్పనమ్

చత్వారి భారతే వర్షే యుగాని కవయోఽబ్రువన్

కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చేతి చతుష్టయమ్

పూర్వం కృతయుగం నామ తతస్త్రేతా విధీయతే

ద్వాపరం చ కలిశ్చైవ యుగాన్యేతాని కల్పయేత్

చత్వార్యాహుః సహస్రాణి వర్షాణాం చ కృతం యుగమ్

తస్య తావచ్ఛతీ సంధ్యా సంధ్యాంశః సంధ్యయా సమః

ముప్పదీ మానుష సంవత్సరములు ఒక దేవతల మాసము. ఒక వంద మానుష సంవత్సరములు మూఁడు దేవతా మాసములు, పదీదేవ దీనములకు సమానమని తెలియనగును. దీనినే దేవతా గణన మానముగా జ్ఞాపక ముంచుకొనవలెను. మానవుల లెక్కలను అనుసరించి, 360 సంవత్సరములు ఒక దివ్య సంవత్సరముగా ప్రకీర్తితము. (15, 16) 3030 మూడు వేల ముప్పది మానుష సంవత్సరములు ఒక సప్తర్షి సంవత్సరముగా భావింపఁబడినది. [17) మానవ ప్రమాణములను లెక్కలను బట్టి తొమ్మిదివేల తొంబదీ (9090) సంవత్సరములు ఒక ధ్రువ సంవత్సరముగా స్మరింపఁబడినది. (18) మానుష సంబంధమైన షడ్వింశతి సహస్ర వత్సరములను (26000) ఒక వంద సంవత్సరములకు సమానముగా తెలియవలయును. ఇయ్యదియే దేవతా గణనముగా నేలుంగవలయును. (19) 366000 అయిన మానుష వరములు ఒక వేయి దేవతా సంవత్సరములు. ఏవం విధమయిన గణనముతో పరిచయము గలవారీట్లు చెప్పుదురు. (20,21) ఈ విధముగా దేవతాసంవత్సర గణనమును గూర్చి ఋషులు కీర్తించిరి. ఇంక యుగ సంవత్సర ప్రమాణమును దేవతా గణనము ననుసరించి చెప్పెదను. (22) కవయః - పండితులు, బుధులు) (భారత వర్షమునందే యీ యుగ సంఖ్యను నియమించుట ఆశ్చర్యముగా నున్నది.) భారత వరమున నాలుగు యుగములు గలవని విద్వాంసులు చెప్పిరి. అవి (1) కృతయుగము (2) త్రేతాయుగము (3) ద్వాపరయుగము (4) కలియుగములు. మొదటిది కృతయుగము తరువాత త్రేతాయుగము చెప్పబడినది. తరుపోత ద్వాపరకలియుగములు. వీనిని యుగములుగా లెక్కింపవలెను. (24) కృతయుగమునకు 4000 సంవత్సరములు. నాలుగు వందల కృతయుగములు ఒక సంధ్య. సంధ్యతో సమానమైనదే సంధ్యాంశము.

ఇతరేషు ససంధ్యేషు ససంధ్యాంశేషు చ త్రిషు

ఏకన్యాయేన వర్తంతే సహస్రాణి శతాని చ

త్రీణి ద్వే చ సహస్రాణి త్రేతాద్వాపరయోః క్రమాత్

త్రిశతీ ద్వీశతీ సంధ్య సంధ్యాంశౌ చాపి తత్సమౌ

కలిం వర్షసహస్రం తు యుగమాహుః ద్విజోత్తమాః

తస్యైకశతికా సంధ్యా సంధ్యాంశః సంధ్యయా సమః

తేషాం ద్వాదశ సాహస్రి యుగసంఖ్యా ప్రకీర్తితా

కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చైవ చతుష్టయమ్

అత్ర సంవత్సరా దృష్టా మానుషేణ ప్రమాణతః

కృతస్య తావద్వక్ష్యామి వర్షాణి చ నిబోధత

సహస్రాణాం శూన్యాహుః చతుర్ధశ హి సంఖ్యయా

చత్వారింశత్సహస్రాణి తథాఽన్యాని కృతం యుగమ్

తథా శతసహస్రాణీ వర్షాణి దశ సంఖ్యయా

అశీతిశ్చ సహస్రాణీ కాలస్త్రేతాయుగస్య సః

సప్తవ నియుతాన్యాహుర్వర్షాణాం మానుషేణ తు

వింశతిశ్చ సహస్రాణి కాలః స ద్వాపరస్య చ

తథా శతసహస్రాణి వర్షాణాం త్రీణి సంఖ్యయా

షష్టిశ్చైవ సహస్రాణి కాలః కలియుగస్య తు

ఏవం చతుర్యుగే కాలమితైః సంధ్యాం శకైః స్మృతః

నియతాన్యేవ షడ్వింశాన్నిరసాని యుగాని వై

చత్వారింశత్తథా త్రీణి నియుతానీషా సంఖ్యయా

వింశతిశ్చ సహస్రాణి స సంధ్యాంశశ్చతుర్యుగః

ఏవం చతుర్యుగా ఖ్యానాం సాధికా హ్యేకసప్తతిః

కృతత్రేతాదియుక్తానాం మనోరంతరముచ్యతే

ఇతర యుగముల సంధ్యలలోను సంధ్యాంశలలోను ఒకే సిద్దాంతములలోను సహస్రములు శతములు వర్తించును. (26) త్రేతా ద్వాపర యుగములు క్రమముగా మూఁడువేల వత్సరములు రెండు వేల వత్సరములు, మూడు వందల యేండ్లు రెండు వందల యేండ్లు క్రమముగా , సంధ్యా సంధ్యాంశలు కలిగియున్నవి. సంధ్యా సంధ్యాంశలు సమానములు: ద్విజోత్తములు కలియుగము ఒక వెయ్యి సంవత్సరములు అని చెప్పుదురు. దాని సంధ్య ఒక వంద సంవత్సరములు. సంధ్యాంశ సంధ్యతో సమానము. (28) నాలుగు యుగముల యందలి సంవత్సర సంఖ్యకలిసి, 12000 పండ్రెండు వేల దివ్యవత్సరములుగా చెప్పబడినది. ఆ నాలుగు యుగములు కృత త్రేతా ద్వాపర కలియుగములు.(29) ఈ విషయములో సంవత్సరములు మానుష ప్రమాణము ననుసరించి సరిచూడబడినవి. కృతయుగము యొక్క సంవత్సరములు చెప్పెదను. వానిని తెలిసికొనుము. (30) కృతయుగము 1440,000 మానుష సంవత్సరములు, త్రేతాయుగమునకు 1080,000 మానుష సంవత్సరములు, ద్వాపరయుగమునకు, 720,000 మానుష సంవత్సరములు. అట్లే కలియుగమునకు 360,000 మానుష సంవత్సరములు (34) ఈ పురాణము ననుసరించి యుగముల వత్సరపరిమితి

యుగము  మానుష వత్సరములు

కృతయుగము            1440,000

త్రేతాయుగము           1080,000

ద్వాపరయుగము       720,000

కలియుగము             360,000

సంధ్యా సంధ్యాంశములతో మొత్తము          360,000 వత్సరములు

సంధ్యా సంధ్యాంశలతో 4320,000 సంవత్సరములు. (35, 36) ఈ విధముగా కృతవ్రేతాది నాలుగు యుగముల సంఖ్యను 71 మన్వంతర మందురు. (37)

మన్వంతరస్య సంఖ్యాం తు వర్షాగ్రేణ నిబోధత

త్రింశత్కోట్యస్తు వర్షాణాం మానుషేణ ప్రకీర్తితాః

సప్త షష్టిస్తథాన్యాని నియుతాన్యధికాని తు

వింశతిశ్చ సహస్రాణి కాలోఽయం సాధికం వినా

మన్వంతరస్య సంఖ్యైషా సంఖ్యా విద్భిర్త్విజైః స్మృతా

మన్వంతరస్య కాలోఽయం యుగైః సార్ధం చ కీర్తితః

చతుఃసాహస్రయుక్తం వై ప్రాకృతం తత్కృతం యుగమ్

త్రేతాశిష్టం ప్రవక్ష్యామి ద్వాపరం కలిమేవ చ

యుగపత్సమయేనార్థో ద్విధా వక్తుం న శక్యతే

క్రమాగతం మయా హ్యేతత్తుభ్యం నోక్తం యుగద్వయమ్

ఋషివంశప్రసంగేన వ్యాకులత్వాత్తథైవ చ

అత్ర త్రేతాయుగస్యాదౌ మనుః సప్తర్షయశ్చ మే

శ్రౌతం స్మార్తం చ తే ధర్మం బ్రాహ్మణానుప్రచోదితమ్

దాదాగ్నిహోత్రసంబంధమృగ్యజుఃసామసంహితమ్

ఇత్యాదిలక్షణం శ్రౌతం ధర్మం సప్తర్షయోఽభువన్

పరంపరాగతం ధర్మం స్మార్తం ఊచారలక్షణమ్

వర్ణాశ్రమాచారయుతం మనుః స్వాయంభువోఽబ్రవీత్

సత్యేన బ్రహ్మచర్యేణ శ్రుతేన తపసా చ వై

తేషాం తు తప్తతపసా ఆర్షేణోపక్రమేణ తు

సప్తరీణాం మనోశ్చైవ హ్యాద్యే త్రేతాయుగే తథా

మన్వంతర వర్ష సంఖ్య నెజుంగుఁడు. ఒక మన్వంతరములో మానుష గణనమును బట్టి 306,720,000 (ముప్పదికోట్లు అరవదియేడు లక్షల యిరువది వేల సంవత్సరములు). ఇంతకంటే నధికముగా లేదు. ఈ మన్వంతర ప్రమాణ గణనము, సంఖ్యా గణనముతో పరిచితులైన బ్రాహ్మణులచే స్మరింపఁబడినది. ఈ విధముగా మన్వంతరకాల సంఖ్య యుగములతో సహా కీర్తింపఁబడినది. (38,40) (మొదటి త్రేతాయుగమున, ఆ మంత్రములు తారకముతో (ఓంకారముతో) ఇతర నిదర్శనములతో వాని యంతట యవియే అబుద్ధి పూర్వకముగా, ఎట్టి ప్రయత్నము లేక సప్తర్షులకు, మనువునకు అభివ్యక్తము లయ్యెను. ఇది యంతయు, వారాచరించీన ప్రాకృతమయిన కృతయుగము నాలుగువేల సంవత్సరములతో యుక్తమయినది. ఇక మిగిలిన త్రేతాయుగ ద్వాపరయుగ కలియుగముల గూర్చి చెప్పెదను. (4) ఈ విషయము యుగపత్ (ఒకేసారి) చెప్పు వీలుకాదు. ఈ విషయము రెండు విధముల (ద్వీధా) చెప్పఁబడుటకు వీలులేదు. అదీ సంప్రదాయాను గుణముగ, క్రమముగా, యుగద్వయము ముందే నాచే చెప్పంబడలేదు, (42) నేను ఋషివంశ ప్రసంగముతో వ్యాకులముగా నుండుటచే అయ్యదీ చెప్పబడలేదు. త్రేతాయుగారంభమున ! మనువు, సప్తర్షులు వివిధ ధర్మములు చెప్పిరి. బ్రహ్మచే ప్రబోధితములయిన శ్రాతధర్మమునుఁ (శ్రుతులలో వేదములలో చెప్పఁబడిన ధర్మములు), సప్తరులు చెప్పిరి. అవి పెట్టిన పోరాగ్నిహోత్ర సంబంధములు; ఋక్ యజుస్సామ సంహితములు. (ఇవి శ్రేత ధర్మములుగా లక్షితములు). వీనిని సప్తర్షులు చెప్పిరి, పరంపరాగతధర్మము ఆచారలక్షణము, వర్ణాశ్రమాచార యుతములు స్వాయంభువుడైన మనువు చెప్పెను. వీనినాతఁడు సత్యముతో బ్రహ్మచర్యముతో శ్రుతితో అనుష్టానములతో సహితముగా చెప్పెను. (46)

అబుద్ధిపూర్వకం తేషామక్రియాపూర్వమేవ చ

అభివ్యక్తాస్తు తే మంత్రాస్తారకాద్యైర్నిదర్శనైః

ఆదికల్పే తు దేవానాం ప్రాదుర్భూతాస్తు యాః స్వయమ్

ప్రణాశేష్యథ సిద్ధీనామన్యాసాం చ ప్రవర్తనమ్

ఆసన్ మంత్రా వ్యతీతేషు యే కల్పేషు సహస్రశః

తే మంత్రా వై పునస్తేషాం ప్రతీభాయాముపస్థితాః

ఋచో యజుంషి సామాని మంత్రాశ్చాధర్వణాని తు

సప్తర్షిభిస్తు తే ప్రోక్తాః స్మార్తం ధర్మం మనుర్జగౌ

త్రేతాదౌ సంహితా వేదాః కేవలా ధర్మసేతవః

సంరోధాదాయుషశ్చైవ వర్త్యంతే ద్వాపరేషు వై

ఋషయస్తపసా వేదాన్ద్వాపరాదిష్వధీయతే

అనాదినీధినా దివ్యాః పూర్వం సృష్టాః స్వయంభువా

సధర్మాః సవ్రతాః సాంగా యథా ధర్మం యుగే యుగే

విక్రియంతే సమానార్థా వేదవాదా యథాయుగమ్

ఆరంభయజ్ఞాః క్షత్త్రాశ్చ హవిర్యజ్ఞా విశస్తథా

పరిచారయజ్ఞాః శూద్రాస్తు జపయజ్ఞా ద్విజోత్తమాః

తదా ప్రముదితా వర్ణా స్త్రేతాయాం ధర్మపాలితః

క్రియావంతః ప్రజావంతః సమృద్ధాః సుఖినస్తథా

బ్రాహ్మణాననువర్తంతే క్షత్రియాః క్షత్రియాన్ విశః

వైశ్యానువర్తినః శూద్రాః పరస్పరమనువ్రతాః

శుభాః ప్రవృత్తయస్తేషాం ధర్మా వర్ణాశ్రమాస్తథా

సంకల్పితేన మనసా వాచోక్తేన స్వకర్మణా

త్రేతాయుగే చ విఫలః కర్మారంభః ప్రసిద్ధ్యతి

ఆయుర్మేధా బలం రూపమారోగ్యం ధర్మశీలతా

తపస్సు చేతను వారియొక్క ఆర్షధర్మ క్రీయాచరణాదుల పురస్కారము చేతను నయినది. (47,48) ఆసిద్దులు (ఆధ్యాత్మిక శక్తులు, తత్ఫలితములు) మొదటి కల్పమున తమంతటతామే దేవతలకు సాక్షాత్కరించినట్టివి, సప్తర్షులకు మనువునకు ప్రాదుర్భవించెను. "పూర్వపు సిద్దులు ప్రణాశనము చెందినవి. ఇతర సిద్దులు ఫలింప ఆరంభమైనవి. గతించిన కల్పముల ఆవిర్భవించిన మంత్రములు, మరల నయ్యవి (మంత్రములు) వారి ప్రతిభతో సముపస్థితములయినవి. (49,50) ఋగ్వేద మంత్రములు, యజుస్సులు, సామవేదమంత్రములు మరియు ఆధర్వణమంత్రములు సప్తర్షులు వచించిరి. (ప్రోక్తములు, చెప్పుఁబడినవి). స్మార్త ధర్మమును (స్మృతియందు చెప్పబడిన ధర్మమును) మనువు వివరించెను. (51) త్రేతాయుగము యొక్క ఆరంభమున, అవిభక్తములయిన వేదములు (వేద సంహితలు) కేవలము ధర్మసేతువులు. (ధర్మము నకు ప్రమాణములు). వానీ యొక్క సంక్షేపణమున అనంతకాలమున ద్వాపరాదులయందు అవి పరిత్యక్తములు. (52) ద్వాపరాదీ యుగములలో ఋషులు వారియొక్క తపోబలముచే వేదముల నధ్యయన మాచరించిరి. వేదములు అనాదులు. ఆదిలేనివి. శాశ్వత సిద్దములు, అవి అవినాశనములు. అవి దివ్యములు. అవి స్వయంభువుఁడైన బ్రహ్మచే పూర్వము ఆవిర్భవింపఁబడినవి (సృష్టములు - ఇది విరుద్దము). (53) ఆ వేదములు సధర్మములు సవ్రతములు సాంగములు ధర్మాను గుణముగా ఋషులచే నధ్యయనము చేయబడుచుండెడివి. యుగాను గుణముగా సమానార్థము లైనను వేదవాదములు మారుచుండెను. క్షత్రియులు ఆరంభ యజ్ఞులు, వైశ్యులు హవిర్యజ్ఞులు. శూద్రులు పరిచారమే యజ్ఞముగా గలవారు. ద్వీజోత్తములు జపయజ్ఞము కలవారు. (55) అప్పుడు, త్రేతాయుగమున, అన్ని వర్ణముల వారు సంతుష్టులు. వారందరు ధర్మపాలితులు. ధర్మమును రక్షించినవారు. (పొలిత ధర్ములు), వారు క్రీయావంతులు (ధర్మక్రియల నాచరించిరి) సంతాన వంతులు, సంపత్సమృద్దులు; సౌఖ్యవంతులు. (56) క్షత్రియులు బ్రాహ్మణుల ననుసరించిరి. క్షత్రియులను వైశ్యులు అనుసరించిరి. వైశ్యులను శూద్రులనువర్తించిరి. ఒండొరులు పరస్పర అనుప్రతులుగా నుండిరి. (57) వారీ కార్య కలాపములు శుభవంతములు, అట్లే వారీ వర్ణములు ఆశ్రమములు శుభవంతములు. వారు మనసా కర్మణా వాచా పరిశుద్దులు. (58) త్రేతాయుగమున కర్మారంభములు ఫలరహితములు కావు. సిద్దిప్రదములు; ఆయుర్దాయము, మేధాబలము, సౌందర్యము (రూపము) ఆరోగ్యము, ధర్మశీలము అందరికీ సర్వ సాధారణ విషయములు. ఆ త్రేతాయుగమున వివిధ వర్ణాశ్రమముల వ్యవస్థను బ్రహ్మ యొనరించెను. (60)

సర్వసాధారణా హ్యేతే త్రేతాయాం వై భవంత్యుత

వర్ణాశ్రమవ్యవస్థానం తేషాం బ్రహ్మా తదాఽకరోత్

పునః ప్రజాస్తు తా మోహాధర్మాస్తానప్యపాలయన్

పరస్పరవిరోధేన మనం తాః పునరభ్యయుః

పునః స్వాయంభువో దృష్ట్వా యాథాతథ్యం ప్రజాపతిః

ధ్యాత్వా తు శతరూపాయాం పుత్రౌస ఉదపాదయత్

ప్రియవ్రతోత్తానపాదౌ ప్రథమౌతౌ మహీక్షితౌ

తతఃప్రభృతి రాజాన ఉత్పన్నా దండధారిణః

ప్రజానాం రంజనాచ్చైవ రాజానస్తేఽభవనృపాః

ప్రచ్ఛన్నపాపస్తైర్యే చ న శక్యోస్తు నరాధిపైః

ధర్మరాజః స్మృతస్తేషాం శాస్తా వైవస్వతో యమః

వర్ణానాం ప్రవీభాగాశ్చ త్రేతాయాం సంప్రకీర్తితాః

సంభృతాచ్చ తదా మంత్రా ఋషిభిః బ్రహ్మణః సుతైః

యజ్ఞాః ప్రవర్తితాశ్చైవ తదా హ్యేవ తు దేవతైః

యామశుక్రార్జితశ్చైవ సర్వసాధనసంభృతైః

సార్థం విశ్వభుజా చైవ దేవేంద్రేణ మహౌజసా

స్వాయంభువేంఽతరే దేవైర్యజ్ఞస్తైః ప్రాక్ ప్రవర్తితః

సత్యం జపస్తపో దానం త్రేతాయా ధర్మ ఉచ్యతే

తదా ధర్మ సహస్రాంతేఽహింసాధర్మః ప్రవర్తతే

జాయంతే చ తదా శూరా ఆయుష్మంతో మహాబలాః

వ్యస్తదండా మహాభాగా ధర్మిష్ఠా బ్రహ్మవాదినః

పద్మపత్రాయతాక్షాశ్చ పృథూరస్కా: సుసంహతాః

మరల, ప్రజలు తమ అవివేకము (మోహము) వలన, పరస్పర విరోధభావమున ధర్మములనాచరించిరి. వారు మరల మస్తువును సమీపించిరి. (61) స్వాయంభువ మనువు, ప్రజాపతి. (ప్రజల కధిపతి). ఆతఁడు తల్డితీయొక్క యాథాతథ్యమును ఉన్న విధానమును చూచి, ధ్యానించెను. శతరూప యందు ఇరువురు పుత్రులను గనెను. (62) వారు ప్రియవ్రతుఁడు. ఉత్తానపాదుడును. వారు ప్రథమముగా రాజులు (మహీక్షితిద్వయము). అది మొదలు రాజులుదయించిరి. వారు దండ ధారులు. న్యాయ ధర్మముల పాలించిరి. (63) ప్రజారంజనము వలన పోరు నృపులయిరి. వారు ప్రజలను రంజించిరి. తుష్టి పరచిరి. ప్రచ్ఛన్న (రహస్య) పాపులయిన వారినీ ఆ నరాధిపులు వశవర్తులను చేసికొన శక్తులు కాలేదు. (64) వైవస్వతుఁడు (సూర్యసుతుఁడు) అయిన యముఁడు ధర్మరాజు. ఆతనిని పొరలు ధర్మనియంతగా (శాస్తగా) తలంచిరి. వర్ణముల యొక్క విభజనము త్రేతాయుగమున చెప్పబడినది. (65) అప్పుడే బ్రహ్మ సుతులయిన ఋషులు మంత్రములను సేకరించిరి. అప్పుడే యజ్ఞములు దేవతలచే ఆరంభింపఁబడినవి. (ఆచరింపఁబడినవి). (66) స్వాయంభువమన్వంతరమున సర్వసాధనములను సమకూర్చుకోనీ వానితో దేవతలు పూర్వము యజ్ఞమారంభించిరి. ఈ యజ్ఞ సాధన సామాగ్రి యమునిచే శుక్రునిచే, విశ్వభుజునిచే, శక్తిమంతుఁడైన దేవేంద్రునిచే సంపాదింపఁబడినవి. సత్యము, మంత్రము జపము, తపస్సు, ధర్మము (దానము) అనునది త్రేతాయుగ ధర్మములు. ధర్మ సహస్రాంతమున (యజ్ఞములు ఒకవేయి చేసిన తరువాత) అహింసా ధర్మము ప్రవర్తింప ఆరంభమగును. అప్పుడే శూరులు ఆయుష్మంతులు, మహాబలులు పుట్టుదురు. (69) ఆ మహాభాగులు వ్యస్తదండులు. ఎట్టి దండన రూప శిక్షలు లేనివారు. వారందరు ధర్మిష్ఠులు, బ్రహ్మవాదులు, పద్మపత్రాయతాక్షులు, విశాలమయిన వక్ష స్థలములు కలపోరు, పోరి యవయవములు (ఇంద్రియము) లన్నియును సుపుష్టములు, సుందరములు. (70)

సింహాతంకా మహాసత్వా మత్తమాతంగగామినః

మహాధనుర్ధరాశ్చైవ త్రేతాయాం చక్రవర్తినః

సర్వలక్షణసంపూర్ణా న్యగ్రోధపరిమండలాః

న్యగ్రోధో తౌతౌ స్మృతౌ బాహూ వ్యామో న్యగ్రోధ ఉచ్యతే

వ్యామేనైవోచ్చ్రయో యస్య సమ ఊర్ధం తు దేహినః

సమోచ్చ్రయపరీణహో జ్ఞేయో స్యగ్రోధమండలః

చక్రం రథో మణిర్భార్యా నీదిరశ్వో గజస్తథా

సప్తైతాని చ రత్నాని సర్వేషాం చక్రవర్తినామ్

చక్రం రథో మణిః ఖడ్గశ్చర్మ రత్నం చ పంచమమ్

కేతుర్నిధిశ్చ సప్తైవ ప్రాణహీనాని చక్షతే

భార్యా పురోహితశ్చైవ సేనానీ రథకృచ్చ యుః

మంత్ర్యశ్వః కలభశ్చైవ ప్రాణినః సప్తకీర్తితాః

రత్నాన్యేతాని దివ్యాని సంసిదాని మహాత్మనామ్

చతుర్దశ విధేయాని సర్వేషాం చక్రవర్తినామ్

విష్ణోరంశేన జాయంతే పృథివ్యాం చక్రవర్తినః

మన్వంతరేషు సర్వేషు అతీతాఽనాగశేష్వివ

భృతభృత్యాని యానీహ వర్తమానాని యాని చ

త్రేతాయుగే చ తాన్యత్ర జాయంతే చక్రవర్తినః

త్రేతాయుగమున చక్రవర్తులు సింహములకే భయమును గలిగించు శక్తిమంతులు వారు శౌర్యవంతులు మత్తమాతంగ గాములు, మహా ధనుర్ధరులు. చక్రవర్తులు సర్వ లక్షణ సంపూర్ణులు; మఱి చెట్టంతటి శరీరపు చుట్టుకొలత గలవారు. మచెట్టంతటి బాహువులు గలవారు. మట్టిచెట్టంతటి వక్షస్థల వైశాల్యము గలవారు. (72) వారి యెత్తు మఱిచెట్టు వైశాల్యముతో సమానము. కాగా సమానమైన యెత్తు వైశాల్యము (చుట్టుకొలత) గల మట్టిచెట్టువలె పోరుందురని తెలియపలెను. (73) చక్రము, రథము, మణి, భార్య, ఐశ్వర్యము (నిధి) అశ్వము, ఏనుగు. ఇవీ సప్త రత్నములు. సర్వ చక్రవర్తుల రత్నములు (74) (ప్రపంచములో) ప్రాణహీనములయిన చక్రము, రథము, మణి, ఖడ్గము, శ్రేష్ఠ కవచము, పతోక, నిధి అను నీయేడును చక్రవర్తుల రత్నములుగా చెప్పుదురు, (75) ప్రాణీమంతములయిన భార్య, పురోహితుఁడు, సేనాని రథముల చేయుపోడు (రథకృత్) మంత్రి, అశ్వము, గజము (ఏనుగు) అను నేడును. చక్రవర్తుల రత్నములుగా చెప్పబడినవి. (76) ఈ రత్నములు దివ్యములు, మహాత్ములచే పొందఁబడినవి. (సుహాత్ములకు స్వయం సిద్దములు) ఈ పదునాలుగు రత్నములు చక్రవర్తుల కందరకు సమకూర్పదగినవి. (విధిగా కల్పింపబడఁ దగినవి) (77) పృథివి యందు చక్రవర్తులు విష్ణ్వంశమున పుట్టుదురు. జరిగిన మన్వంతరముల రాబోవు మన్వంతరముల నీది సత్యము. (78) చక్రవర్తులు గడచిన మన్వంతరముల పట్టిరి. వర్తమానమున నుండిరి. భవిష్యత్తున నుండగలరు. (79)

భద్రాణీమానీ తేషాం వై భవంతీహ మహీక్షితామ్

అత్యద్భుతాని చత్వారి బలం ధర్మః ముఖం ధనమ్

అన్యోన్యస్యావిరోధేన ప్రాప్యంతే తు నృపైః సమమ్

అర్ధో ధర్మశ్చ కామశ్చ యశో విజయ ఏవ చ

ఐశ్వర్యేణానిమాద్యేన ప్రభుశక్త్యా తథైవ చ

శ్రుతేన తపసా చైవ మునీనభిభవంతి వై

బలేన తపసా చైవ దేవదానవమానవాన్

లక్షణైశ్చైవ జాయంతే శరీర స్థైరమానుషైః

కేశాః స్నిగ్ధా లలాటోచ్చా జిహ్వా చాస్య ప్రమార్జనీ

తామ్రప్రభోష్ఠనేత్రాశ్చ శ్రీవత్సాశోర్ధ్వరోమశాః

ఆజానుబాహవశ్చైవ తామహస్తాః కలౌ కృశోః

న్యగ్రోధపరిణాహాశ్చ పింహ స్కంధాస్తు మేహనాః

గజేంద్రగతయశ్చైవ మహాహనవ ఏవ చ

పాదయోశ్చక్రమత్స్యౌతు శంఖపద్మే తు హస్తయోః

పంచాశ్రీతిసహస్రాణితే రాజంత్యజరా సృపాః

అంగగతయస్తేషాం చతసశ్చక్రవర్తినామ్

అంతరిక్షే సముద్రే తు పాతాళే పర్వతేషు చ

ఇజ్యాదానం తపః సత్యం త్రేతాయాం ధర్మ ఉచ్యతే

తదా ప్రవర్తతే ధర్మో వర్ణాశ్రమవిభాగశః

మర్యాదాస్థాపనార్థం చ దండనీతికి ప్రవర్తతే

రాజుల విషయములో ఈ క్రింద చెప్పఁబోవునవి అత్యద్భుతముగాను శ్రేష్ఠములుగాను నుండవలయును. బలము (సైన్యము, శక్తి) ధర్మము (యోగ్యత గుణము) సౌఖ్యము, ధనము. (80) అర్థము, ధర్మము, కామము, యశస్సు, విజయము పరస్పరము విరోధము లేకయే నృపులచే పొందఁదగినవి. ఐశ్వర్యము చేతను, అమామహిమాద్యష్టసిద్దులచేతను, ప్రభుశక్తి చేతను, శ్రుతేన (విద్యాధిక్యము చేతను) తపస్సు చేతను రాజులు మునులను కూడ అధిగమించెదరు. (82) వారు (నృపులు) దేవతలను, దానవులను మానవులను బలము చేతను తపస్సు చేతను, కోరత్వము చేతను మీంచెదరు. వారు అమానుషములయిన శరీర స్ధములయిన లక్షణములచే కూడ జన్మించెదరు. (83) హరి శిరోజములు మృదువులు. లలాటములున్నతములు; ప్రమార్జనీ లక్షణము (పరిశుద్ధత్వము కలిగిన) జిహ్వ ఓష్ఠము నేత్రములు తామ్రప్రభ కలిగియుండును; వక్ష స్థలము శ్రీవత్స లాంఛితము; రోమములు (జగత్తు) పైకెగసి. యుండును. (84) వారు ఆజానుబాహువులు (మోకాళ్లనందుచేతులు గలవారు) హస్తములు తామ్ర వర్ణములు; నడుము భాగము సన్నము, న్యగ్రోధ పరిణాహము శరీర ఫౌల్యము. చేతులు పొడవుగా నుండును. వారు సింహ సంధులు; వారి మేహనము సింహమేహన తుల్యము. (85) వారీ గమనము (గతి) గజేంద్ర తుల్యము, పొరీ దవడలు (హనువులు) పెద్దవి. పాదములయందు చక్ర రేఖలు, మత్స్యరేఖలు కలవారు. హస్తముల యందు శంఖ పద్మ రేఖాలాంఛనులు. (86) ఎనుబదియైదువేల సంఖ్యగల రాజులున్నారు. ముసలితనములేకయే వారు ప్రకాశింతురు. చక్రవర్తుల గతులు ఆకాశమున, సముద్రమున, పాతాళమున, పర్వతములందు అడ్డులేనట్టివి. యజ్ఞాచరణము, దానము, తపము, సత్యము, ధర్మము రాజులకు త్రేతాయుగమున ప్రసిద్దములు. ధర్మము వర్ణాశ్రమ పద్దతిని అనుసరించి ప్రవర్తిల్లును. మర్యాదా స్థాపనార్థము దండనీతి ప్రవర్తించును. (87)

హృష్టపుష్టాః ప్రజాః సర్వా అరోగాః పూర్ణమానసాః

ఏకో వేదశ్చతుష్పాదస్త్రేతాయుగవిధౌ స్మృతః

త్రీణి వర్షసహస్రాణి తదా జీవంతి మానవాః

పుత్రపౌత్రసమాకీర్ణ మ్రియంతే చ క్రమేణ తు

ఏష త్రేతాయుగే ధర్మః త్రేతాసంధ్యాం నిబోధత

త్రేతాయుగస్వభావానాం సంధ్యా పాదేన వర్తతే

సంధ్యపాదః స్వభావస్తు సోంఽశపాదేన తిష్ఠతి

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తీ పూర్వభాగే ద్వీతీయేఽనుషంగపాదే సంఖ్యావర్తోసామైకోనత్రింశత్తమోఽధ్యాయః

ప్రజలందరు సంతుష్టులు. ఆనందవంతులు. బలవంతులు; రోగరహితులు, ఆనంద పూర్ణమానసులు. త్రేతాయుగమున-వేదమొక్కటి. నాలుగు పాదములు కలిగినది. ఆ కాలమున మానవులు మూఁడువేలసంవత్సరములు ఆయుర్దాయము కలవారు. పుత్ర పౌత్రులను గలిగినవారు. ఆయుః క్రమము ననుసరించి మరణించువారు. ఇదీ త్రేతాయుగ ధర్మమని యెఱుంగునది. ఇఁక త్రేతాయుగమున సంధ్యను గూర్చి యెఱుం గుఁడు. త్రేతాయుగములలో సంధ్య నాలుగవ భాగమే ప్రవర్తిల్లును. ఇంకను త్రేతాయుగ సంధ్యాంశలో సంధ్యా లక్షణములలో నొక పాదమునకు దీగంజారినవి.

ఇదీ వాయుప్రోక్తము, మహాపురాణమునయిన బ్రహ్మాండపురాణమున పూర్వభాగమున ద్వితీయానుషంగపాదమున సంఖ్యావర్తనమనెడి ఇరువదితొమ్మిదవయధ్యాయము.