11 - సమిద్వర్ణనము

బృహస్పతి ఉవాచ :-

రాజతం రాజతాక్తంవా పితృణాం పాత్రముచ్యతే

రాజతస్య కథా వాపి దర్శనం దానమేవ చ

 అనంతమక్షయం స్వర్గే రాజతే దానముచ్యతే

 పితృనేతేన దానేన సత్పుత్రాస్తారయంత్యుత

 రాజతే మీ స్వధా దుగ్గా పాత్రే తైః పృథివీ పురా

 స్వధాం వా పార్థిభిస్తాత తస్మిన్ దత్తం తదక్షయమ్

 కృష్ణాజినస్య సాన్నిధ్యం దర్శనం దానమేవ చ

 రక్షోఘ్నం బ్రహ్మవర్చస్యం పశూనుత్రాంశ్చ తారయేత్

 కనకం రాజతం పాత్రం దౌహిత్రం కుతుహస్తిలాః

 వస్తూని పావనీయాని త్రిదండీయోగ ఏవ వా

శ్రాద్ధకర్మణ్యయం శ్రేషో వీధీర్భోహ్యః సనాతనః

 ఆయుఃకీర్తిప్రజైశ్వర్యప్రసంతతివర్థనః

 దిశి దక్షిణపూర్వస్యాం వేదిస్థానం నివేదయేత్

 సర్వతోరత్నిమాత్రం చ చతురస్రం సుసంస్థితమ్

 వక్ష్యామి విధివత్ స్థానం పితృణామనుశాసితమ్

 ధన్యమాయుష్యమారోగ్యం బలవర్ణవివర్ధనమ్

తత్ర గర్తాస్త్రయః కార్యాస్తయో దండాశ్చ ఖాదిరాః

 అరల్నీమాత్రాస్తే కార్యా రజతైఃప్రవిభూషితాః

 తే వితస్త్యాయతా గర్తాః సర్వతశ్చతురంగులాః

ప్రాగ్దాక్షిణముఖానుర్యాల్సిరానసుషిరాంస్తథా

 అద్భిః పవిత్రయుక్తాలి పాదయేత్సతతం శుచిః

పయసాహ్యాజగన్యేన శోధనం చాదిరేవ చ

 సతతం తర్పణంహ్యేతతృప్తిర్భవతి శాశ్వతీ

 ఇహవాముత్రచ వశీ సర్వకామసమన్వితః

 ఏవంత్రిషణస్నాతో యేఖర్చయేత్రయతః పితన్

 మంత్రేణ విధివత్ సమ్యగశ్వమేధఫలం లభేత్

 తాబ్ధాపయేదమావాస్యాం గర్తానై చతురంగులావ్

 శ్రీఃసప్తసంస్థాస్తే యజ్ఞాఫ్రేలోక్యం ధార్యతే తు యః

 తస్య పుష్టిస్తథైశ్వర్యమాయుః సంతతిరేవ చ

 దీవి చ భ్రాజతే లక్ష్యా మోక్షం చ లభతే క్రమాత్

పాప్మాపహం పావనీయం హ్వశ్వమేధఫలం లభేత్

 అశ్వమేధఫలం హ్యేతద్ద్విజైః పంస్కృత్య పూజితమ్

 మంత్రం వక్ష్యామ్యహం తస్మాదమృతం బ్రహ్మనిర్మితమ్

దైవతేభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవ చ

 నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ భవత్యుత

 ఆద్యే వసానే శ్రాద్ధస్య త్రిరావృత్తం జపేత్సదా

బృహస్పతి ఇట్లు చెప్పెను.

పితృదేవతలకు ఉపయోగించు పాత్రలు వెండివి కాని వెండి మలాము (పూత) చేసినవి కాని యుపయోగింపవలెనని చెప్పఁబడినది. రజత పాత్రలని చెప్పిన మాత్రం చేతను, వాని దర్శనము చేతను, వాని దానము చేతను, పితరులకు అనంతము అక్షయము నయిన లాభము స్వర్గమున కలుగును. ఈ రజతపాత్రల దానముచే ఉత్తమములయిన పుత్రులు పితరులను తరింపఁజేయుదురు. (1,2) పూర్వమందు భూమి (గో రూపమున నుండగా) పాలు పిదుకఁబడినప్పుడు, 'స్వధ' వారలచే (దోగ్గలచే) రజత పాత్రలలో పితుకబడినది. అది 'స్వధ'కా నిండు వేలొకటి కానిండు, ఓ వత్సా! ఏయది ఆ వెండి పాత్రలలో వారలచే నీయబడినను అయ్యది అక్షయమయిన ప్రయోజనమును నొసంగును. (3). కృష్ణాజినము తత్సమీపమున నున్నను, దాని దర్శనము కానీ, దాని దానము కాని రాక్షసులను నాశన మొనరించును. అంతీయకాక యది. బ్రహ్మవర్చ:ప్రభ నొసంగును. పశువుల యొక్క పుత్రుల యొక్కయు తారణమును కలిగించును. (4) కనకపాత్ర, రజతపాత్ర, తీలలు. (తామ్రపాత్ర) దీనము నందలి యెనిమిదవ ముహూర్తము, దర్భలు, తెల్ల నువ్వులు, సన్న్యాసుల చేతనుండు) త్రిదండి - ఇవి యితర వస్తువులను గూడ పావనము చేయు పవిత్ర వస్తువులు. శ్రాద్ధకర్మ యందిది శ్రేష్ఠము, బాహ్యము సనాతనమునైన విధి. ఇయ్యది ఆయువును, కీర్తిని, సంతానమును, ఐశ్వర్యమును, ప్రజ్ఞను, సంతతిని వృద్ధి పరచును. (6) దక్షిణ పూర్వది శల మధ్య ఆగ్నేయమున) వేడిని నిర్మించవలెను. (అరత్ని చిటికిన వ్రేలి తుది నుండి మోజేతి వరకు గల మధ్యనున్న దూరము). ఆ వేదిక అరత్నిమాత్ర చతురస్రమయి యుండవలయును. భుజములు 'అరల్నీ' పరిమితము కావలెను. అది సుసంస్థితమై యుండవలెను. (7) విధి పూర్వకముగా అనుశాసితమయిన పితరుల స్థానమును చెప్పెదను. అయ్యది ఆయురారోగ్యై శ్వర్యము కలిగించును. అయ్యది బలమును శరీరకాంతిని వృద్ధి పరచును. (8) అందు మూఁడు గర్తములు (గుంటలు). త్రవ్వవలెను. ఖాదీర మను కట్టితో మూఁడు దండములు నిర్మింపఁబడవలెను. ఆ దండముల పొడవు 'అరత్ని ప్రమాణము కలిగి యుండవలెను. అయ్యవి రజత పతాకలతో ప్రవీభూషితములు కావలెను. (9) ఆర్తలు వితస్త్యాయతములు, అనఁగా - పండ్రెండంగుళముల పొడవు (జేనెడు) వీతస్త్యము. ఆ గుంటలు ఒక జానెడు లోతుండవలెను. నాలుగు భుజములును నాలుగంగుళములు సర్వత్ర యుండ వలయును. ఆగ్నేయ దీశాముఖముగా గర్తమునుకావించవలయును. ఆగర్తములు స్థిరముగా రంధ్రము లేనివిగా నుండవలయును. (10) శ్రాద్ద మాచరించువాఁడు పరిశుభ్ర వస్త్రములను దాల్పవలయును. మనస్సున శుద్ధుఁడుగా నుండవలెను. పరిశోధకముచే నతఁడు గర్తములను పవిత్రము లొనర్పవలయును. (దర్బలచే కట్టబడిన పవిత్రము) ఆ దర్భలతో సమకూర్చిన పవిత్రమును కుడిచేతి ఉంగరపు వ్రేలికి ధరింపవలెను. గర్తము యొక్క శోధనమును మేకపాలతోకానీ, ఆవుపాలతోకానీ, నీటితోకానీ చేయవలయును. (11) తర్పణము ఎప్పుడు నీటితో సలుపవలెను. తన్మూలమున ఇహపరముల తృప్తి కలుగును. శ్రాద్ధకర్తకు ఆత్మ నిగ్రహమున్నచో, ఆతని కెన్నియో కోరికలుండియున్నను, ఆతఁడు నదిలో మూఁడు మార్లు స్నానమాచరించి, తరువాత పితరులను త్రికరణశుద్ధిగా మంత్రములను వీధివదుచ్చరించుచు ఆచరించి ఆతఁడు అశ్వమేధ యాగమాచరించిన ఫలము నొందును. (12,13) చతురంగుళ పరిమితమయిన గర్తములను అమావాస్యనాఁడు చేయవలయును. ఆ యజ్ఞములు ఇరువది యొకటి. ఆయజ్ఞములు ఇరువదియేడు సంస్థలు వానిచే త్రైలోక్యము ధరింపబడును. తత్కర్తకు పుష్టి, యైశ్వర్యము, ఆయువు, సంతతి కలుగును. ఆతని విభవముచే నతం డు స్వర్గమున ప్రకాశించును. క్రమముగా మోక్షము నొందును. (15) పవిత్రీకరణానంతరము పూజ గాలించిన పాపములు తొలఁగును. తత్పూజ వలన అశ్వమేధఫలము నతఁడందును. బ్రాహ్మణులు పరిశుద్దులై ఆచరించిన అశ్వమేధఫలము లందుదురు. (16) అందుచే అమృతతుల్యమైనది, బ్రహ్మచే నిర్మితమయినదియునగు మంత్రమును చెప్పెదను. ఆ మంత్రమును శ్రాద్ధకర్త శ్రాద్ధారంభమునను, సమాప్తమునను, మూఁడు సార్లు జపింపవలెను. “దైవతేభ్య పితృభ్యశ్చ, మహాయోగిభ్య ఏవ చ నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ భవత్యత ఆద్యేవసానే శ్రాద్ధస్య శ్రీరావృత్తం జపేత్సదా.”

పిండనిర్వపణే వాపి జపేదేతం సమాహితః

 క్షిప్రమాయాంతి పితరో రక్షాంసి ప్రద్రవంతి చ

పిత్ర్యం తు త్రిషు కాలేషు మంత్రోమియం తారయత్యుత

 పఠ్యమానః సదా శ్రాద్ధే నీయతైర్ర్బహ్మవాదిభిః

 రాజ్యకామో జపేదేశం సదా మంత్రమతండ్రితః

వీర్యశార్యార్థసత్వాశీరాయుర్బుద్ధివివర్ధనమ్

ప్రీయంతః పితరో యేన జపేన నియమేన చ

సప్తార్చిషం ప్రవక్ష్యామి సర్వకామప్రదం శుభమ్

అమూర్తీనాం సమూర్తీనాం పితౄణాం దీప్తతేజసాం

 నమస్యామి సదా తేషాం ధ్యానినాం యోగచక్షుషామ్

ఇంద్రాదీనాం చ నేతారో దశమారీచయోస్తథా

సప్తర్షణాం పితృణాం చ తాన్ నమస్యామి కామదాస్

 మస్వాదీనాం చ నేతారః సూర్యచంద్రమసోస్తథా

 తాన్ నమస్కృత్య సర్వాన్ వై పితృమత్సు విధిష్వపి

 నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్నోశ్చ పిత్యనథ

 ద్యావాపృధివ్యోశ్చ సదా నమస్యామి కృతాంజలిః

 దేవర్షిణాం చ నేతారః సర్వలోకనమస్కృతాః

 త్రాతారః సర్వభూతానాం నమస్యామి పితామహాన్

 ప్రజాపతేర్గవాం వహ్నేః సోమాయచ యమాయ చ

 యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామీ కృతాంజలిః

 పితృగణేభ్యః సప్తభ్యో నమో లోకేషు సప్తసు

 స్వయం భువే నమశ్చైవ బ్రహ్మణే యోగచక్షుషే

 ఏతదుక్తం చ సప్తార్చర్బహ్మర్షిగణసేవితమ్

పవిత్రం పరమం హ్యేతచ్ఛ్రీమద్రోగవినాశనమ్

పిండ ప్రదాన సమయమున పిండ ప్రదాత (శ్రాద్ధకర్త) సమాహీతచిత్తుడై యీ మంత్రమును జపింపవలయును. పితరులు వెంటనే వచ్చేదరు. రాక్షసులు పలాయితులగుదురు. శ్రాద్ధకాలమున నీ మంత్రము నియతులయిన బ్రహ్మవాదులచే పరింపఁబడినచో, ఈ మంత్రము పితరులతో భూత భవిష్యద్వర్తమానకాలముల సంబంధము కలిగిన వారినేల్లరను తరింపఁజేయును. (20) రాజ్యకాముఁడయిన వాడీ మంత్రమును అతంద్రితుఁడయి, శ్రద్దాయుతుడై జపింపవలయును. ఇయ్యది వీర్యము, శౌర్యము, అర్జము, సత్త్వము, ఆశీస్సు, ఆయువు బుద్ది అన్నింటిని వృద్ధి పరచును. (21) నేనిప్పుడు. “సప్తార్చిష” మంత్రమును ప్రవచించుచున్నాను. ఇది శుభంకరమయినది. సర్వకామప్రదము. నీయమపూర్వకముగా సదా జపించుటచే పితరులు ప్రీతిమంతులగుదురు. (22) 'సప్తార్చిష మంత్రము. అమూర్తి మంతులు, మూర్తిమంతులు, ప్రకాశవంతమయిన తేజస్సు కలవారు ధ్యానులు, యోగచక్షుష్కులు అయిన పితరులకు నమస్కరించుచున్నాను. (23) వారు ఇంద్రాదులకు నాయకులు అట్లే దక్ష మారీచులకు, సప్తరులకు నేతలు. అట్టి కామదులయిన పితరులకు నమస్కరించుచున్నాను. మన్వోదులకు నాయకులు, సూర్య చంద్రులకు నాయకులు, పితరులకు సంబంధించిన విధుల యందు పితరులయిన వారందరకు నమస్కరించెదను, (25) కృతాంజలుఁడనై నక్షత్రముల యొక్క గ్రహముల యొక్క వాయువుయొక్క, అగ్ని యొక్క ద్యావాపృథ్వుల యొక్క పితరులకు నమస్కరించుచున్నాను. నేను పితరులకు నమస్కరించు చున్నాను. వారు దేవర్పులకు నేతలు; వారు సర్వలోక నమస్కృతులు, వారు సర్వభూత ముల సంరక్షకులు. వారికి నమస్కరించు చున్నాను. కంజలీబద్ధుఁడనై ప్రజాపతికి, ధేనువులకు, అగ్నీకి, సోమునకు, యమునకు, యోగేశ్వరేశ్వరులకు' పితామహులకు నమస్కరించు చున్నాను. సప్త లోకములందున్న సప్త పితృగణములకు యోగ చక్షుష్కుండయిన స్వయంభువునకు నేను ననమస్కరించుచున్నాను. (29) దీనిని ప్రార్చిష మంత్రమందురు. ఇది బ్రహ్మర్షి గణసేవితము. పవిత్రమయినది. ఉత్కృష్టమయినది. శ్రీమంతమయినది. సర్వరోగ వినాశన కరమయినది.

ఏతేన విధినా యుక్తస్త్రీన్వరాన్ లభతే నరః

అన్నమాయుః సుతాంశ్చైవ దదతే పితరో భువి

భక్త్యా పరమయా యుక్తః శ్రద్ధధానో జితేంద్రియః

సప్తార్చిషం జపేద్యస్తు నిత్యమేవ సమాహితః

సప్తద్వీపసముద్రాయాం పృథివ్యామేకరాడ్భవేత్

యత్కించిత్ పచ్యతే గేహే భక్ష్యం వా భోజ్యమేవ వా

అనివేద్య న భోక్తవ్యం తస్మిన్నాయతనే సదా

క్రమశః కీర్తయిష్యామి బలిపాణ్యతఃపరమ్

యేషు యజ్ఞఫలం ప్రోక్తం తన్మే నిగదతః శృణు

పలాశే బ్రహ్మవర్చస్త్వమశ్వత్థ వసుభావనా

సర్వభూతాధిపత్యం చ ప్రక్షే నిత్యముదాహృతమ్

పుష్టిః ప్రజాశ్చ న్యగ్రోథే బుద్ధిః ప్రజ్ఞా ధృతిః స్మృతిః

రక్షోఘ్నం చ యశస్యం చ కాశ్మరిపాత్ర ముచ్యతే

సౌభాగ్యముత్తమం లోకే మాధూకే సముదాహృతమ్

ఫల్గుపాత్రేషు కుర్వాణః సర్వాన్కామానవాప్నుయాత్

పరాం ద్యుతిమథార్కే ను ప్రాకాశ్య చ విశేషతః

బైల్వే లక్ష్మీం తథా మేధాం నిత్యమాయుస్తథైవ చ

క్షేత్రారామతదాగేషు సర్వసస్యేషు చైవ హ

వర్షత్యజసం పర్జన్యో వేణుపాత్రేషు కుర్వతః

ఏతేష్వేవ సుపాత్రేషు భోజనాగ్రమశేషతః ఈఈ

సదా దద్యొచ్చ యజ్ఞానాం సర్వేషాం ఫలమాప్నుయాత్

పితృభ్యః పుష్పమాల్యాని సుగంధాని చతత్పరః

దా దద్యాత్రియాయుక్తః స విభాతి దివాకరః

గుగ్గులాదీం స్తథా ధూపాన్ పితృభ్యో యః ప్రయచ్ఛతి

యుక్తాన్మధుసరిర్భ్యాం సో గ్నిష్టోమఫలం లభేత్

ధూపం గంథగుణోపేతం కృత్వా పితృపరాయణః

లభతే చ సుశర్మాణి ఇహ చాముత్ర చోభయోః

దద్యాదేవం పితృభ్యస్తు నిత్యమేవ హ్యతంద్రితః

ఏతద్విధి యుక్తుఁడయిన నరుఁడు మూఁడు వరములను పొందును. అన్నమును, ఆయువును, సుతులను, పితరులు ప్రసాదింతురు. ఉత్కృష్టమయిన భక్తితో కూడుకొని, శ్రద్ధావంతుఁడై, జితేంద్రియుడై నిత్యము సమాహిత చిత్తముతో సప్తార్చిష' మంత్రమును నెవ్వఁడు జపించునో, యతఁడు సప్తద్వీప సముద్రయుతమయిన పృధ్వీ యందు, ఏకరాట్ (ఏకచ్ఛత్రాధిపతి) అగును. ఆతని గృహమున భక్ష్యము కాని భోజ్యము కాని యేది యేమాత్రము వండబడినను, పితరులకు నివేదనము చేయబడకుండగ భుజించరాదు. (33,34) ఇంక పితరులకు అలీనోసంగఁదగిన పాత్రములను క్రమముగా వివరించుచున్నాను. వేనీ యందు పితృబలి యొసంగిన శాస్త్రముల యందు పితృయజ్ఞ ఫలములు వక్కాణింపం బడినవో వానిని చెప్పుచుంటిని వినుము, పలాశ పత్రమున సమకూర్చిన దొన్నెలో పితరులకు బలీ యొసంగీన తత్పలితము బ్రహ్మవర్చస్సు. రావి ఆకునందు (అశ్వత) బలీ యొసంగిన వసుభావనము కలుగును. (వసు - ధనము) ధనము కలుగును. (35) ప్లక్ష వృక్షపు (మట్టి) టాకుల యందు బలి యొసంగిన సర్వ భూతముల యందు నీత్యాధిపత్యము ఫలము. (36) న్యగ్రోధ వృక్షపుటాకులను దొన్నెలనుగా వాడిన (న్యగ్రోధముమట్టి) పుష్టి, సంతానము, బుద్ధి, ప్రజ్ఞ, ధృతి, స్మృతి ఫలితములుగా కలుగును. కాశ్మీరీ వృక్షపుటాకులతో బలీపాత్రలు దొన్నెలు కావించిన రాక్ష సవినాశనము కలుగును యశస్సు లభించును. మాధూక పత్రపు దొన్నెలలో పితృదేవతలకు బలియొసంగిన (మధూకము - అశోకము). ప్రపంచమున సౌభాగ్యము ఫలితము. (37) ఫట్లు జిల్లేడు పత్ర పాత్రములలో పితృదేవతలకు బలి యొసంగిన పరంద్యుతయును ప్రకాశమును ఫలితములు. (మారేడు) బిల్వపత్ర పాత్రమున పితరులకు బలి యొసంగిన ఆ శ్రాద్ధ కర్తకు ఐశ్వర్యము బుద్దీబలము, ఆయుర్ధాయము ఫలితముగా గలుగును. (39) క్షేత్రారామ తడాకముల యందు సర్వ సస్యముల యందు, వేణు పాత్రమున (వెదురుతో చేసిన పాత్ర) యందు పితృబలు లొసంగిన, మేఘుఁడెల్లప్పుడును వర్షించును, పైని చెప్పఁబడిన పాత్రముల యందు బలి యొసంగవలయును. సర్వ యజ్ఞములు నొనర్చిన ఫలము కలుగును. సుగంధ యుతములయిన పుష్పమాల్యములను పితరుల కొసంగవలెను. ఆతఁడు సూర్యునీ భంగి సదా ప్రకాశించును. పితరులకు గుగ్గులము మొదలయిన వానిని ధూపములను నెవఁడు మధుసర్పులతో (తేనెనేతులతో) సమర్పించునో, ఆతఁడు అగ్నిష్టోమాదు లాచరించిన ఫలితము బొందును. (42,43) పితృ పరాయణుఁడయి మంచి గంథముతో గూడిన ధూపమును పితరుల కొసంగీన ఇహో ముత్రములందు శుభములు పొందును. పితరులకు శ్రద్ధతో అతంద్రితుఁడై కర్త సర్వము సమర్పింప వలయును.

దీపం పితృభ్యః ప్రయతః సదా యస్తు ప్రయచ్ఛతి

 గతిం చాప్రతీతం చక్షుస్తస్మాత్స లభతే శుభమ్

 తేజసా యశసా చైవ కాంత్యా చాపి బలేన చ

 భువీ ప్రకాశో భవతి భాజతే చ త్రివిష్టపే

 అప్సరోభిః పరివృత విమానాశ్రే చ మోదతే

 గంధపుషైశ్చ ధూపైశ్చ జపాహుతిభిరేవ చ

ఫలమూలనమస్కారైః పితృణాం ప్రయతః శుచిః

 పూజాం కృత్వా ద్వీజానశ్చాత్ పూజయేదన్నసంపదా

 శ్రాద్ధకాలేషు నియతం వాయుభూతాః పితామహాః

 అవిశంతి ద్విజాన్ శ్రేషాన్ తస్మాదేతత్ బ్రవీమి తే

వస్రరత్నప్రదానైశ్చ భక్షి పేరైస్తథైవ చ

గోభిరశ్వైస్తథాగ్రామైః పూజయేద్ద్విజసత్తమాన్

భవంతి సీతరః ప్రీతాః పూజితేషు ద్వీజాతిషు

తస్మాద్యత్నేన విధివత్పూజయేత ద్విజాన్ సదా

సవ్యోత్తరాభ్యాం పాణిభ్యాం కుర్యాదుల్లేఖనం ద్వీజః

ప్రోక్షణం చ తతః కుర్యాద్రాద్ధకర్మణ్యతండ్రితః

 దర్భాన్ పిండాన్ తథా భక్ష్యానుష్పాణి వీవీధాని చ

 గంధదానమలంకారమేకైకం నిర్వవేద్బుధః

 పేషయిత్వంజనం సమ్యగ్విశ్వేషాముత్తరోత్తరం

 అభ్యంగం దర్భపింజూలైస్తిభిః కుర్యాద్యథావిధి

 అపసవ్యం పితృభ్యశ్చ దద్యారంజనముత్తమమ్

 నిహత్య జాసు సర్వేషాం వస్త్రార్థం సూత్రమేవ వా

 ఖండనం ప్రేక్షణం చైవ తథైవోల్లేఖనం ద్విజః

 సకృద్దేవపితృణాంస్యాత్పిణాం త్రిభిరుచ్యతే

 ఏకం పవిత్రం హస్తేన పితృన్సర్వాన్ సకృత్ సకృత్

 చైలమంత్రేణ పిండేభ్యో దత్వాదర్శాంజినే హితమ్

పవిత్రమనస్కుడై యెవ్వఁడు ప్రయత్నపూర్వకముగా పితరులకుదీపము నొసంగునో అతఁడు అప్రతిమ మయినది శుభమయినదియునగు దృష్టిని పొందును. ఉత్తమగతిని పొందును. (45) భూమి యందు ప్రకాశము నొందీ స్వర్ణమున ప్రకాశించును. (46) ఆతఁడు అప్పరోగణములచే పరివృతుఁడయి విమానాగ్రములందు ఆనంద మనుభవించును. గంధపుష్పములచేతను, జపములచేతను, హోమములచేతను, ఫలమూల నమస్కారముల చేతను, పితరులకు ప్రయత్నపూర్వకముగ పూజనొనరించి, తరువాత బ్రాహ్మణులకు అన్న మొసంగి పూజింపవలెను. శ్రాద్ధ కాలములందు వాయుభూతులయిన పితామహులు (వాయువులో సంచరించు తాతలు మొదలగువారు), శ్రేష్ఠులయిన బ్రాహ్మణులను ఆదేశింతురు. అందుచేనిట్లు చెప్పుచున్నాను. (49) శ్రాద్ధ కాలమున ద్వీజసత్తములను, వస్త్ర దానమున, రత్నప్రదానమున, భక్ష్యములచే, మధుర పానీయములచే, గోదానములచే, గ్రామ దానములచే, కర్త పూజింపవలయును. (50) ద్వీజాదులు పూజింపఁబడిన పీతరులు సంప్రీతులగుదురు. అందుచే విధి పూర్వకముగా ప్రయత్నముచేసి ద్విజులను పూజింపవలెను. (51) బ్రాహ్మణుఁడు కుడి యెడమ చేతులతో ఉల్లేఖనము చేయవలెను. (కుడిచేతిపై ఎడమచేతి నుంచి నేలమీఁద రాయవలయును. ఇది ఉల్లేఖనము) తరువాత నీటితో ప్రోక్షణము చేయవలయును. తరువాత శ్రాదకరు. అతంద్రీతుండై ఆచరించవలెను. (52) దర్భలను, పిండములను, భక్ష్యములను, వివిధములయిన పుష్పములను, గంధములను, అలంకారములను, వీనినన్నింటిని పితృశ్రాద్దమునకు భక్తుఁడైన శ్రాద్ధకర్త సమకూర్చుకొని యుండ వలయును. (53) యజ్ఞోపవీతమును దక్షిణ భుజము నుంచి (దండముల అపసవ్యము చేసికొని) పితరులకు మంచి రకమయిన 'కాటుక'ను (కంటికి పెట్టుకొనునట్టిదీ) సమర్పింపవలయును. కాటుకను చక్కగా చేసి, అభ్యంగమును (స్నానమును) దర్భల చివరలచే (నీరుచల్లి) యధావీధి మూడు మార్లు చేయవలయును. అపసవ్యముగా యజ్ఞోపవీతమును మార్చుకొని పితరులకు కాటుకను సమర్పింపవలేను. నేలకు వంగి వస్త్రమును, యజ్ఞోపవీత సూత్రమును కూడ సమర్పింపవలెను. (58) ఓ బ్రాహ్మణులారా ! ఖండనము (కోయుట - త్రేంచుట) ప్రోక్షణము దర్భలతో నీరములను చల్లుట, ఉల్లేఖనము చేతితో నేలమీఁద రాసి పరి శుభ్రము చేయుట. మొదలగునవి దేవ పితరులకు ఒక్కమారును, స్వపితరులకు మూఁడు సార్లును చేయవలెను. (56)

సదా సర్పిస్తిలైర్యుక్తాం స్త్రీన్ పిండాన్ నిర్వవేద్భువి

 జాను కృత్వా తథా సవ్యం భూమౌ పితృపరాయణః

పితౄన్ పితామహాంశ్చైవ తథైవ ప్రపితామహాన్

 ఆహూయ చ పీతస్పాంచః పితృతీర్థన యత్నతః

 పిండాన్ పరిక్షిపేత్సమ్యగపసవ్యమతంద్రితః

 అన్నాద్యైరేవ ముఖ్యైశ్చ భక్యైశ్చైవపృథగ్వీద్వైః

 పృథఙ్మాతామహానాం తు కేనిదిచ్ఛంతి మానవాః

త్రీన్సిండాసానుపూర్యేణ సాంగుష్ఠాన్ పుష్టివర్ధనాన్

జాన్వంతరాభ్యాం యత్నేన పిండాన్ దద్యాత్ యథాక్రమమ్

 సవ్యోత్తరాభ్యాం పాణిభ్యాం ధారార్థం మంత్ర ముచ్చరన్

నమో వః పితరః శోషాయేతి సర్వమతంద్రితః

 దక్షిణస్యాం తు పాణిభ్యాం ప్రథమం పిండముత్సృజేత్

నమో వః పితరః సౌమ్యః పఠన్నేవమతంద్రితః

సవ్యోత్తరాభ్యాం పాణిభ్యాం ధర్మేర్ధం సమతంద్రితః

 ఉలూఖలస్య లేఖాయాముదపాత్రావసేచనమ్

 క్షామం సూత్రం నవం దద్యాచ్ఛోణం కార్పోసకం తథా

పతోర్ణం పట్టసూత్రం చ కౌశేయం పరివర్జయేత్

 వర్జయేద్యక్షణం యజ్ఞే యద్యష్యహతవస్త్రజామ్

 న ప్రీణంతి తఖైతాని దాతుశ్చాప్యహితం భవేత్

శ్రేష్ఠమాహుఫ్రికకుదమంజనం నిత్యమేవ చ

 కృషేభ్యశ్చ వీలైన్డేలం యంత్రాత్సుపరిరక్షితమ్

 చందనాగురుజీ చోభే తమాలోశీరపద్మకమ్

 ధూపశ్చ గుగ్గులః శ్రేష్ఠస్తురుష్క శ్వేత ఏవ చ

 శుక్లాః సుమనసః శ్రేషాస్తథా పద్మోత్సలోని చ

 గంధరూపోపపన్నాని చారణ్యాని చ కృత్స్నశః

తథా హి సుమ నాడీరూపికాస్మకురండికా

 పుష్పాణి వర్ణనీయాని శ్రాద్ధకర్మణి నిత్యశః

 తథా గంధాదపేతానీ చోగ్రగంధాని యాని చ

 వర్ణనీయాని పుష్పాణి పుష్టిమన్వీచ్ఛతా సదా

 ద్వీజాతయో యథోద్దిష్టా నియతాః స్యురుధజ్ముఖాః

పితృ పరాయణుఁడయిన శ్రాద్ధకర్త మూడు పిండములను భూమిపై సమర్పింపవలయును. ఆ పిండములు నేతితో తిలలతో కూడి యుండవలెను. భూమిపై మోకాలు వంచీ సవ్యముగా యజ్ఞోపవీతమును ధరించవలెను. (58) పితరులను, పితామహులను, ప్రపితామహులను, అట్లే ప్రాచీన పితరులను ఆ శ్రాద్ధకర్త తప్పక ఆహ్వానించవలేను. ఆతఁడు ప్రయత్న పూర్వకముగా శ్రద్దగా పితృ తీర్థమును పిండములపై చల్లవలయును. ఆ పితృ తీర్థమును అపసవ్యముగా నర్పించవలయును. కొందరు మాతామహులకు వేరుగా వండిన వంటకములతో శ్రాద్ద మాచరింపఁ గోరుదురు. వారు పుష్టి వర్ణకములయిన వారలను అంగుష్ఠముచే నొక్కి పట్టి మూఁడు పిండముల ప్రదానము చేయవలయును. పోరా పిండములను తమ రెండు చేతులను మోకాళ్ల మధ్య నుంచీ యథాక్రమము పెట్టవలయును, ఎడమ చేయి కుడిచేతి మీద పెట్టి ధార నిడుచు మంత్రము నుచ్చరించవలయును. (62) ప్రథమ పిండమును, దక్షిణ దోశను రెండు చేతులతో 'నమోవః పితరః శోషాయ” ఇతి (అని) మంత్రము నుచ్చరించుచు పెట్టవలయును. (63) 'నమోవః పితరః సౌమ్యః' అని జాగ్రత్తగా నుచ్చరించుచు సవ్యోత్తరముగా (పై విధముగా) నుంచిన రెండు చేతులతో పిండముల నొసంగవలెను. (64) శ్రద్ధతో రెండు చేతులతో ఉలూఖలము (రోతి) యొక్క లేఖ యందు ఉదకపాత్ర నుండి నీటిని చల్లవలయును. నవక్షామ సూత్రమును, (క్రొత్త సిల్కు దారమును) జనపనార లేక ప్రత్తిదారమును సమర్పింపవలేను. (65) పతోర్ణము (ఉతికిన వస్త్రములు) రంగుబట్టను, కౌశేయము (ఒక విధమయిన సిల్కును) విసర్జించవలయును. (ధరింపరాదు). యజ్ఞము నందు అహత వస్త్రమును (క్రొత్తగా మగ్గము నుండి తెచ్చి తడుపక యుంచిన దానిని) వదలవలె. (66) ఈ వస్తువులు పీతరులకు తృప్తి కలిగింపవు. త్రికకుత్ సంబంధమయిన కాటుక శ్రేష్టమని చెప్పుదురు. {67) ఈ క్రింది వస్తువులు శ్రాద్ధమునకు శ్రేష్ఠములయినవి - నల్లనీ నువ్వుల నుండి గానుగాడి తీసి జాగ్రత్తగా నుంచిన నూనే, చందనము, అగరు, తమాలము, ఉశీరము (వట్టి వేరు) ఉత్పలములు. గుగ్గులధూపము, శ్వేత తురుషుము (పరీమళ మొసంగు ధూపవస్తువు) తెల్లని పువ్వులు శ్రేష్ఠములు. అట్లే పద్మోత్పలములును. (69) అరణ్య జాతములు, మంచి రూపము, మంచి వాసన (పరిమళము) గలిగిన పువ్వులు శ్రేష్ఠములు. అట్లే స్మరకుండికలు, పొడుగాటి కాడ కలిగిన పూలును శ్రేష్ఠములు. వాసనలు లేనివి, వెగటు (ఉగ్ర) వాసనలు గలిగిన పూవులు పుష్టిని వాంఛించు వారిచే శ్రాద్ధ కర్మలో పరిత్యాజ్యములు. (71) శ్రాద్ధమునకు ఆహ్వానింపఁబడిన బ్రాహ్మణులు (భోక్తలు) తప్పక ఉత్తరమువైపు ముఖము కలిగి కూర్చుండవలెను.

పూజయేద్యజమానస్తు విధివద్దక్షిణాముఖః

 తేషామభిముఖోదద్యాద్దర్భాన్పిందాంశ్చ యత్నతః

 అనేన విధినా సాక్షాదర్చితాః స్యుః పితామహాః

హరితా వై స పింజాలాః పుష్టాః స్నిగ్ధః సమాహితాః

 రశ్నిమాత్రాః ప్రమాణేన పితృతీర్ణేన సంస్కృతాః

 ఉపమూలే తథా నీలా విష్ణరార్థం-కుశోత్తమాః

 తథా శ్యామాకనీవారాః దూర్వా చ సముదాహృత

 పూర్వం కీర్తిమతాం శ్రేషో బభూవాశ్వః ప్రజాపతిః

 తస్య బాలో నిపతితా భూమౌ కాశత్వమాగతిః

 తస్మార్టేయాః సదా కాశాః శ్రాద్ధకర్మసు పూజితాః

 పిండనిర్వపణం తేషు కర్తవ్యం భూతిమిచ్ఛతా

 ప్రజాః పుష్టిద్యుతిప్రజ్ఞాకీర్తికాంతిసమన్వితః

 భవంతి రుచిరా నిత్యం విపాపానోఘ వర్జితాః

 సకృదేవాస్తరేద్దర్భాన్నిండాళే దక్షిణాముఖః

 ప్రాగక్షిణాగ్రాన్నియతో విధిం చాప్యత వక్ష్యతి

న దీనో నాపి వా కుద్దే న చైవాన్యమునా నరః

 ఏకత్ర చాదాయ మనః శ్రాద్ధం కుర్యాత్సమాహితః

నిహాన్మి సర్వం యదమేధ్యవద్భవేత్ ప్రతాశ్చ సర్వే సురదానవా మయా

రక్షాంసి యక్షాః సపిశాచసంఘా హతా మయా యాతుధానాశ్చ సర్వే

 ఏతేన మంత్రేణ తు సంయతాత్మా తాం పై వేదిం సకృదుల్లిఖ్య ధీరం

 శివాం హి బుద్ధిం ధ్రువమిచ్ఛమానః క్షిపేద్ద్విజాతిర్దిశ ముత్తరాం గతః

 ఏవం పిత్ర్యం దుష్టమంత్రం హి యస్య తస్యాసురా వర్జయంతీ హ సర్వే

 యస్మిన్ దేశ పర్యతే మంత్ర ఏష తం వై దేశం రక్షసా వర్జయంతి

 అన్నప్రకారానశుచీనసాధూన్నంవీక్షతే నో స్పృశంశ్చాపి దద్యాత్

 పవిత్ర పాణిశ్చ భవేన్న వా హి యః పుమాన్న కార్యస్య ఫలం సమశ్నుతే

యజమాని దక్షిణాభిముఖుఁడై కూర్చుండి విధివత్తుగా పూజాదులను సలుపవలెను. వారలకభిముఖుఁడై ప్రయత్న పూర్వకముగా దర్భలపై పిండముల నుంచవలెను. (73) ఈ విధముగా శ్రద్ధగా చర్చించినచో పితామహాదులు (పితరులు) యదార్థముగా నర్చింపఁబడిన వారగుదురు. పచ్చగా నున్నచో కుశలు ఆసనములకు శ్రేష్టము. అవి ఒక మర్మర ధ్వని చేయవలయును. అయ్యవీ దృఢముగా, వంపులు లేక నీడుపుగా,మెత్తగా, గాజు రంగుతో (పింజలాః) ఉండవలయును. కుశలు ఓరల్ని ప్రమాణము గలిగి యుండవలెను. (పిడిమూరెడు పొడవు) అయ్యప్ పితృ తీర్థము యొక్క సేచనమున సంస్కృతములు కావలెను. అయ్యవీ మొదలు నందు (మూలమున) నీలవర్ణములై యుండవలెను. అట్టివి కుశలలో శ్రేష్టములు. (75) శ్యామాకములు, నీవారములు, దూర్వలు కూడ చెప్పబడినవి. పూర్వము కీర్తిమంతులలో శ్రేష్ఠుఁడయిన అశ్వుడు ప్రజాపతియయ్యెను. (76) ఆతని శిరోజములు (వెండ్రుకలు) నేలమీఁద పడి కాశలయినవి. రెల్లుగడ్డిపోచ అందుచే కాశలు పవిత్రశ్రాద్ధ క్రియలందు గౌరవింపఁ బడినవి. (77) అందుచే 'కాశలను శ్రాద్ధ కర్మలందు ఉపయోగింపవలయును. సంపత్తును నభిలషించినవాఁడు ఆ రెల్లుకసవుపై (కాశలపై) పిండముల సమర్పింపవలయును. తన్మూలమున సంతతిని - పుష్టిని, ద్యుతిని, ప్రజ్ఞను, కీర్తిని, కాంతిని పొందుదురు. (78) వారెప్పుడు (రుచిరులు) అందమైన వారగుదురు. పాపము నుండి విముక్తు లగుదురు. వారు అఘవర్జితులు. పిండముల కొఱకు దక్షిణాభిముఖుఁడై (కర్త) యొకేయొక సారి దర్భలను పరుచవలయును. దర్భల యొక్క ఆగ్రములు ప్రాగ్దాక్షిణముగా నుండవలెను. తత్సంబంధమయిన విధిని చెప్పుచున్నాడు. శ్రాద్ధకర్త దీనుఁడు కానీ కోపి కానీ కాకూడదు. ఆతఁడు అనన్యమనస్కుడై యుండవలెను. ఆతఁడు మనస్సును ఒకచోటనే కేంద్రీకరించి పవిత్ర హృదయముతో శ్రాద్దము నాచరించవలెను. (80) (81) మంత్రము ఆమంత్రార్థమిది. “అపవిత్రమైన దానిని నేను నాశనము చేయుదును. అసురులు దానవులు నాచే చంపఁబడిరి. రాక్షసులు, యక్షులు, పిశాచ సంఘములు, యాతుధానులు నాచే చంపఁబడిరి.” (81) శ్రాద్ధకర్త ఈ మంత్రముతో సంయతాత్ముఁడయి, చక్కగా వేదిని ఒక మారు ఉల్లేఖనము (తుడువ) చేయవలయును. బుద్ధి మంతుఁడయినవాఁడు, మంగళమును కోరువాఁడు అయిన శ్రాద్ధకర్త ఉత్తరదిశగా తిరిగి దర్భను (ఉల్లేఖనము చేసిన దానినీ) విసర్జించవలయును. (82) అసురులు పితృమంత్రము నుచ్చరించిన యజమానిని చూచి, విడిచి పోవుదురు. ఎందీ మంత్రముచ్చరింపఁబడినదో ఆ ప్రదేశమును వీడి రాక్షసులు పోవుదురు. (83) కర్త అశుచిమంతము, అసాధువు, అయిన అన్నము చూడకూడదు. స్పృశింపను కూడదు. చేతియందు (ప్రోలియందు) పవిత్రము పూనకయున్నచో ఆ కర్త శ్రాద్ధ క్రియ యొక్క ఫలితముననుభవింపజాలఁడు.

అనేన విధినా నిత్యం శ్రాద్ధం కుర్యాద్ధి యః సదా

 మనసా కాంక్షతే యద్యతత్తద్దద్యుః పితామహాః

పితరో హృష్టమనసో రక్షాంసి విమనాంసి చ

భవంత్యేవం కృతే శ్రాద్ధే నిత్యమేవ ప్రయత్నతః

 శూద్రాః శ్రాద్ధేష్వవిక్షీరం బల్వజా ఉపలాస్తథా

 వారణాశ్చాతువాలాశ్చ అడ్వా వర్ష్యాశ్చ నిత్యతః

ఏవమాదీన్యయజ్ఞాని తృణాణి పరివర్జయేత్

అంజనాభ్యజనం గంధానూతప్రణయనం తథా

 కాశైః పునర్భవైః కార్యమశ్వమేధఫలం లభేత్

 కాశాః పునర్భవా యే చ ఐర్షిణో హ్యుపబర్షిణః

 ఇత్యేతే పితరో దేవా దేవాశ్చ పితరః పునః

 పుష్పగంధవిభూషాణామేష మంత్ర ఉదాహృతః

 ఆహృత్య దక్షిణాగ్నిం తు హోమార్థం వై ప్రయత్నతః

 అన్యార్ధే లౌకికం వాపి జుహుయాత్ కర్మసిద్ధయే

 అంతర్విధాయ సమిధస్తతో దీప్తా విధీయతే

 సమాహితేన మనసా ప్రణీయాగ్నిం సమంతతః

 అగ్నయే కవ్యవాహాయ స్వధా అంగీరసే నమః

 సోమాయ వై పితృమతే స్వధా అంగిరసే పునః

 యమాయ వైవస్వతయే స్వధా నమ ఇతిధ్రువమ్

ఇత్యేతే హోమమంత్రోస్తు త్రయాణామనుపూర్వతః

 దక్షిణేనాగ్నయే నిత్యం సోమాయోత్తరత స్తథా

 ఏతయోరంతరే నిత్యం జుహుయాద్వై వివస్వతే

ఉపహారః స్వధాకారస్తథైవోల్లేఖసం చ యత్

 హోమజప్యే నమస్కారః ప్రోక్షణం చ విశేషతః

 బహుహవ్యేంధనే చాగ్నౌ సుసమీద్ధే తథైవ చ

 అంజనాభ్యంజనం చైవ పిండనిర్వపణం తథా

ఎవడు ఎల్లప్పుడు ఈ విధి ననుసరించి శ్రాద్ధము నాచరించునో ఆతఁడేమేమిమీ హృదయమున వాంఛించునో పితరులు వాని నెల్ల నొసంగెదరు. నిత్య మీ విధముగా ప్రయత్న పూర్వకముగా శ్రాద్ధమును దోష రహితముగ నాచరించిన పితరులు మనస్సున సంహృష్ణులగుదురు. రాక్షసులు విమనస్కులయ్యేదరు. (86) శ్రాద్ధకర్మ లందు ఈ క్రింది వానిని ఎప్పుడును పరిత్యజించవలయును. శూద్రులను గొఱ్ఱపాలను బల్వజ, వారణ లను తృణములను ఉపలములను కలువపుగుండు సముద్ర సంబంధమైన ఉతువాలములను 'లడ్డులను - ఇవి అయజ్ఞ వస్తువులు. " వీనిని పరిత్యజించవలెను. (87) కన్నులకు కాటుSక పెట్టుకొనుట, అభ్యంగన స్నానమాచరించుట, గంధములను (అత్తరువులను) వాడుట, సూత్ర ప్రణయనము సూదితో వస్త్రములను కుట్టుట - మొదలగు వానిని శ్రాద్ధకర్త పరిహరించవలేను. కోసిన మరల చిగిర్చి పెరుగునట్టి కాశలతో పవిత్ర శ్రాద్ధకర్మ నాచరించవలయును. తన్మూలమున అశ్వమేధ యాగము నాచరించిన ఫలమును పొందును, పువ్వులను ' సమర్పించునప్పుడు, అత్తరుల (గంధముల) అలదునపుడు, ఆభరణములను ధరించునప్పుడీ క్రింది మంత్రమును చెప్పవలయును. "కాశా పునర్భవా యే చ బరిలో హ్యుపపర్షిణః ఇత్యేతే పితరో దేవా దేవాశ్చ పీతరః పునః పుష్పగంధ విభూషాణా మేషమంత్రఉదాహృతం” (90) ఈ విధముగా పితరులు దేవతలు : దేవతలు పితరులు. కర్మ సిద్ధి కొఱకు కర్త హోమము నాచరించవలయును. హోమమునకు ప్రయత్న పూర్వకముగా " (తప్పక) దక్షిణాగ్ని నుపయోగింపవలయును. ఇతర కర్మల యందు లౌకికాగ్నిని ఉపయోగింపవచ్చును. (91) సమీధలను హోమగుండములో లోపల వేయవలయును. తరువాత అగ్నిని వాని చుట్టును నుంచవలయును. తరువాత సమాహితమయిన మనస్సుతో అగ్ని నంతటను ప్రజ్జ్వలింపం జేయవలయును. మూఁడగ్నులకు క్రమముగా నీమూఁడు మంత్రములు చెప్పవలెను. 1.అగ్మయే స్వకవ్యవవాహాయ స్వధా అంగిరసే నమః. 2. సోమాయ వై పీతృమతే స్వధా అంగీరసే నమః, 3. యమాయ వైవస్వతయే స్వధా నమ ఇతిధ్రువమ్ (94) అగ్నికి హోమమెల్లప్పుడు దక్షిణముగను, సోమునకు ఉత్తరముగను, వైవస్వతునకు (యమునకు) ఆ రెండింటికి మధ్యమము గను హోమము చేయవలెను. (95) ఉపహారము స్వధాకారము, ఉల్లేఖనము, హోమజపములు, నమస్కారము, ప్రోక్షణము, అనేకములైన హవ్యేంధనములు, అంజనా భ్యంజనములు, పిండనిర్వపణము - వీనిని బాగుగా ప్రజ్వరిల్లినయగ్నిలో వేల్చవలె.

  అశ్వమేధఫలం చైతత్సమిద్ధే యత్కృతం ద్విజైః

 క్రియా సర్వా యథోద్దిష్టాః ప్రయత్నేన సమాచరేత్

 బహుహష్యేందనే చాన్నౌ సుసమీధే విశేషతః

వీధూమే లేలిపోనే చ హోతవ్యం కర్మసిద్దయే

 అప్రబుద్దే సమిద్ధే వా జుహుయార్యో హుతాశనే

 యజమానో భవేదంధః సోముత్రేతి కో నః శ్రుతమ్

 అల్పేంధనో వా రూక్షాగ్నిర్విస్ఫులింగశ్చ సర్వతః

 జ్వాలాధూమాపసవ్యశ్చ స తు వహ్నిరసిద్ధయే

 దుర్గంధశైవ నీలశ్చ కృష్ణశవ విశేషణః

 భూమీం వగాహతే యత్ర తత్ర విద్యాత్పరాభవత్

అర్చిష్మాన్ పిండితశిఖః సర్ఫికాంజనసన్నిభః

 స్నిగ్ధః ప్రదక్షిణశ్చైవ వహ్నిః స్యాత్ కార్యసిద్ధయే

 నరనారీగణేభ్యశ్చ పూజాం ప్రాప్నోతి శాశ్వతీం

 అక్షయం పూజిస్తేన భవంతి పితరోగ్ధయః

 బిల్వోదుంబరపత్రాణి ఫలాని సమిధస్తథా

శ్రాధే మహాపవిత్రాణి మేధ్యాని చ విశేషతః

పవిత్రం చ ద్విజశ్రేషాః శుద్ధయే జన్మ కర్మణామ్

 పాత్రేషు ఫలముద్దిష్టం యన్మయా శ్రాద్ధకర్మణి

తదేవ కృత్స్నం విజ్ఞేయం సమిత్సు చ యథాక్రమమ్

కృత్వా సమాహితం చిత్తమాగ్నేయం వై కరోమ్యహమ్

 అనుజ్ఞాతః కురుష్వేతి తథైవ ద్విజసత్తమైః

ఘృతమాదాయ పాత్రే చ జుహయాద్ధవ్యవాహనే

 పలాశప్లక్షన్యగ్రోధప్రక్షాశ్వవికంకతాః

 ఉదుంబరస్తథా బిల్వశ్చందనో యజ్ఞయాశ్చ యే

 సరలో దేవదారుశ్చ శాలశ్చ ఖదిరస్తథా సమిదర్దే

 ప్రశస్తాః స్యురేతే వృక్షా విశేషతః

 గ్రామ్యాః కంటకైనశ్చైవ యజ్ఞియా యే చ కేచన

 పూజితా సమిదర్థం తే పితౄణాం వచనం యథా

శ్రాద్ధ క్రియలన్నియు యథోద్దిష్టముగా శ్రద్దతో చేయవలెను. (98) శ్రాద్ధకర్మ సిట్టించుకోకు, కర్త, పవిత్రాగ్ని యందు, అధికమయిన నేతితో, సమిధలతో, అగ్నీ బాగుగా ప్రజ్జ్వలించునట్లు, అగ్నీ హోత్రము ధూమముతో కప్పబడి యుండని విధముగ, హోమము చేయవలయును. (99) హోమజ్వాలలు ప్రజ్జ్వలింపవలెను. యజమాని, అగ్ని ప్రజ్జ్వలింపకుండ హోమము చేసినచో, ఇహాముత్రములందు (ఇప్పుడు తరువాతను) అంధుం డగును. ఇయ్యది నిజముగా మాచే శ్రుతము. (పెద్దలు చెప్పగా విందుము) (100) అల్పమయిన ఇంధనము (సమిధలు) గలిగిన వహ్ని కానీ, సర్వత్ర జ్వాలలు లేని అగ్ని కానీ, రూక్షాగ్నికాని, జ్వాలలు ధూమము అపసవ్యముగా వెలువడినను అగ్నిహోత్రుఁడు కోరిక లొసంగఁడు. అది అసిద్దాగ్ని. (101) దుర్గంధయుత మయినదియు, నీలవర్ణము కలదియు, కృష్ణ వర్ణము కలిగినదియునగు అధోముఖ జ్వాలలో భూమి వైపు వెలుంగునదియునగు అగ్ని పరాభవమును గలిగించునది యని యెఱుంగవలెను. (102) అర్చిష్మంతము (జ్వాలలు కలిగినది) పిండిత శిఖలు కలిగినది పైనీ జ్వాలాగ్రములు వలయములుగా వెలుంగునది, నేతితో చేసిన అంజన (కాటుక) తుల్యమయినది. స్నిగ్ధమయినది, ప్రదక్షిణముగ కదలు శీఖలు కలిగినదియునగు వహ్ని కార్య సిద్ది కొకు సహకరించును. (103) (కర్త) నరనారీ గణముల నుండీ, శాశ్వతమయిన పూజల నందును. అక్షయము శాశ్వతమునయిన ప్రయోజనము కోలకు యజమానీ పీతృగణములను అగ్నినీ పూజింప వలయును. (104) బిల్వముల యొక్క ఉదుంబరముల యొక్క పత్రములు ఫలముల సమిధలు శ్రాద్ధ క్రీయ యందు మహా పవిత్రములు మేధ్యములు. (105) ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! (దర్బలతో జేసిన) పవిత్రము జన్మకర్మలను పవిత్రీకరించునది. పాత్రముల యందు శ్రాద్ధకర్మలాచరించిన ఎట్టి ఫలితము కలుగుననినాచే చెప్పఁబడినదో, క్రమముగా అట్టి ఫలమే సమిధల సేకరించుట వలన కలుగునని గ్రహింపవలయును, (ఆయా వృక్ష సమిధలనుపయోగించిన ఫలితము). కర్త చిత్తము సమాహితము చేసికొని, అగ్నీ సంబంధమైన కర్మను చేయుచున్నాను - అనగా “అనుజ్ఞాతుఁడవై కర్మ చేయుము” అని చెప్పవలెను. 'తథైవ' అట్లే అనుజ్ఞాతుఁడవై 'కురుష్వ' చేయుము - అని ద్విజసత్తములచే ఆజ్ఞాపింపఁబడి, పాత్రమునందు నేతిని తీసికొనీవచ్చీ అగ్నిహోత్రము నందు హోమము చేయవలెను. (107) పలాశము, ప్రక్షము, న్యగ్రోధము, ప్లక్షము, అశ్వత్తము, వికంకతము, అంతియేకాక, సరళము, దేవదారు, శాలము, ఖదీరము - కూడ సమిధలకరములు. ఇవి ప్రశస్తములు కూడ. ముండ్లచెట్లు, గ్రామములలో లభించునవి, కూడ పితృదేవతల వచనముల బట్టి యజ్ఞములలో సమిధల కొఱకు గౌరవీంపఁబడుచున్నవి.

సమిద్భిః షట్పలేయాభిర్జుహుయాద్యో హుతాశనమ్

 ఫలం యత్కర్మణస్తస్య తన్మే నిగదతః శృణు

 అక్షయం సర్వకామీయమశ్వమేధఫలం హి తత్

 శ్లేష్మాంతకో నక్తమాలః కపిత్థః శాల్మలిస్తథా

 నీపో విభీతకశ్చైవ శ్రాద్ధకర్మణి గరితాః

 చిరబిల్వస్తథా కోలస్తిందుకః శ్రాద్ధకర్మణి

ఐల్వజః కోవిదారశ్చ పర్జనీయాః సమంతతః

శకునానాం నివాసాంశ్చ వర్జయేత మహ్రుహాన్

 స్వరేతి చైవ మంత్రాణాం పితృణాం వచనం యథా

 స్వాహేతి చైవ దేవానాం యజ్ఞకర్మణ్యుదాహృతమ్

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే

 శ్రాద్దకల్పే సమీద్వర్ణనం నామ ఏకాదశోధ్యాయః

షట్పల వృక్షముల సమిధలతో అగ్నిని హోమము చేయవలయును. వాని వలని ఫలమెట్టిదో నేచెప్పెదను వినుఁడు, (112) (తత్పలము)  అక్షయము; సర్వకామము లొసంగునదీ. అశ్వమేధ యజ్ఞతుల్య ఫలమయినది. (113) శ్రాద్ధకర్మ యందు క్రిందఁజెప్పబడునట్టి వృక్ష సమిధలను పరిత్యజించవలెను. శ్లేషాంతకము - నక్తమాల, కపిత్తము (వెలగ), శాల్మలీ, నీపము (కడిమీ) విభీతకము. చిరబిల్వము - కోలము - తిందుకు - వృక్షములు నిషిద్ధములు. (114) అట్లే బల్వజము, కోవిదారము, సర్వత్ర వర్జ్యములు. పక్షులు గూడు కట్టుకొని నివసించు వృక్షములను సమిధలకై పరిత్యజించవలెను. తత్తుల్యమైన ఇతర వృక్షములు యజ్ఞములకు పనికి రావు. వానీని నిషేధించవలెను. (115) పితృ శ్రాద్ధ కర్మ యందలి మంత్రములందు, ‘స్వధా’ అను పదమును దేవతల యజ్ఞ కర్మలందు 'స్వాహా' అను పదమును కలిపి చెప్పుట ఉదాహరింపఁబడినది. (116)

ఇది వాయుప్రోక్తమయిన మహాపురాణమగు బ్రహ్మాండ పురాణమున మధ్యభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున, శ్రాద్ధకల్పము నందలి సమీద్వర్ణనమను ఏకాదశాధ్యాయము సమాప్తము.