బ్రహ్మాండ మహా పురాణము
1 - ప్రథమాధ్యాయము
నమో నమః క్షయే సృష్టౌ స్థితౌ సత్త్వమయాయ వా ।
నమో రజస్తమః సత్త్వత్రిరూపాయ స్వయంభువే ॥
జితం భగవతో తేన హరిణా లోకధారిణా ।
అజేన విశ్వరూపేణ నిర్గుణేన గుణాత్మనా ॥
బ్రహ్మాణం లోకకర్తారం సర్వజ్ఞమపరాజితమ్ ।
ప్రభుం భూతభవిష్యస్య సాంప్రతస్య చ సత్పతిమ్ ॥
జ్ఞానమప్రతీమం తస్య వైరాగ్యం చ జగత్పతేః ।
ఐశ్వర్యం చైవ ధర్మశ్చ సద్భిః సేవ్యం చతుష్టయమ్ ॥
ఇమాన్నరస్య వై భావాన్నిత్యం సదసదాత్మకాన్ ।
అవింశకః పునస్తాన్వై క్రియాభావార్థమీశ్వరః ॥
లోకకృల్లోకతత్వజ్ఞో యోగమాస్థాయ యోగవిత్ ।
అసృజత్సర్వభూతాని స్థావరాణి చరాణి చ ॥
తమహం విశ్వకర్మాణం సత్పతిం లోకసాక్షిణమ్ ।
పురాణాఖ్యానజిజ్ఞాసుర్గచ్ఛామి శరణం విభుమ్ ॥
పురాణం లోకతత్వార్థమఖిలం వేదసంమీతమ్ ।
ప్రశశంస స భగవాన్ వసిష్టాయ ప్రజాపతిః ॥
తత్త్వజ్ఞానామృతం పుణ్యం వసిష్ఠో భగవాన్ ఋషిః ॥
పౌత్రమధ్యాపయామాస శక్తేః పుత్రం పరాశరమ్ ॥
పరాశరశ్చ భగవాన్ జాతూకర్ణ్యమృషిం పురా ।
తమధ్యాపితవాన్జివ్యం పురాణం వేదసంమితమ్ ॥
అధిగమ్య పురాణం తు జాతూకర్ణో విశేషవిత్ ।
ద్వైపాయనాయ ప్రదదౌ పరం బ్రహ్మ సనాతనమ్ ॥
సృష్టి స్థితి లయములయందు స్వశక్తియుతుడై సత్త్వమయుడయినవానికి లేదా సత్త్వ రజస్తమములను త్రిగుణరూపము గల స్వయంభువ్వు డయిన పరమాత్మకు నమస్కారము. (1) భగవంతుఁడు, లోకములను భరించువాడు, పుట్టనివాడు, విశ్వరూపుడయినవాఁడు,నిర్గుణుఁడు, గుణాత్ముఁడు నయిన హరీ జయించు గాక. (2) సృష్టికర్త, లోకకర్త, సర్వజ్ఞుఁడు, అపరాజితుఁడు, భూతభవిష్య ద్వర్తమానములకు ప్రభువు, సత్పతియునైన వానికి నమస్కారము. (3) జగత్పతియైన యాతని యప్రతిమానమైన జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, ధర్మము. ఈ నాలుగు గుణములు సజ్జనులు సేవింపదగినవి, (4) సదసదాత్మకములయిన యీ నరునీ భావములను, శంకారహితుఁడై తానే మరల క్రియా భావార్ణము కోటకు (లోకమున క్రియారూపమున ప్రత్యక్షింపఁజేయుటకు) ప్రభువు, సర్వసమర్థుడాతఁడే. (5) లోకకర్త, లోకతత్వజ్ఞుఁడు యోగవిదుఁడు సయిన ఆతఁడే (ఆ ఈశ్వరుఁడే) యోగమును పొంది స్థావరములు (కదలనివి) చరములు (కదలునట్టువి. మార్పునొందునట్టివి) అయిన సర్వభూతములను సృజించెను. (6) విశ్వకర్ముఁడు, లోకసాక్షి, సత్పతి, పురాణములను, ఆఖ్యానములను నేటింగినవాఁడు, సర్వవ్యాపియు నయన యా యీశ్వరుని శరణము నొందుచున్నాను (7) వేదసమ్మితము (వేదములలోని విషయములతో గూడినది) లోకముల యొక్క యధార్థ జ్ఞానయుతము నయిన పురాణమును భగవానుఁడయిన ప్రజాపతి వసిష్ఠుని కొఱకు చెప్పెను (8) తత్త్వజ్ఞానామృతము, పుణ్యమునయిన పురాణమును భగవంతుఁడు, ఋషీయునైన వసిష్ఠుఁడు, శక్తి పుత్రుడు, మనుమఁడు నయిన పరాశరుని చదివించెను (పరాశరునకు విద్య గఱపెను) (9) భగవానుడయిన పరాశరుఁడు, పూర్వము, వేదసమ్మితము దివ్యమునయిన పురాణమును, జాతకర్ణుఁడను ఋషికి గఱపెను (10) సర్వ విశేషములను నెటింగీన జాతకర్ణుఁడు, పురాణమును నేర్చుకొని, పరమము బ్రహ్మతుల్యము, సనాతనము నయిన పురాణమును ద్వైపాయనునకు (వ్యాసునకు) నొసంగెను. (11)
ద్వైపాయనస్తతః ప్రీతః శిష్యేభ్యః ప్రదదౌ వశీ ।
లోకతత్వవిధానార్థం పంచభ్యః పరమాద్భుతమ్ ॥
విఖ్యాపనార్థం లోకేషు బహ్వర్థం శ్రుతిసమ్మతమ్ ।
జైమినిం చ సుమంశుం చ వైశం పాయనమేవ చ ॥
చతుర్థం పైలవం తేషాం, పంచమం లోమహర్షణమ్ ।
సూతమదృతవృత్తాంతం వినీతం ధార్మికం శుచిమ్ ॥
అధీత్య చ పురాణం చ వినీతో లోమహర్షణః ।
ఋషిణా చ త్వయా పృష్ఠః కృతప్రజ్ఞః సుధార్మికః ।
వసిష్ఠశ్చాపి మునిభిః ప్రణమ్య శిరసా మునీన్ ।
భక్త్యా పరమయా యుక్త కృత్వా చాపి ప్రదక్షిణమ్ ॥
అవాప్తవిద్యః సంతుష్టః కురుక్షేత్రముపాగమత్ ।
సత్రే స వితతే యత్ర యజమానానృషీన్ శుచీన్ ।
వీనయేనోపసంగవ్య సత్రిణో రోమహర్షణమ్।
విధనతో యథాశాస్త్రం ప్రజ్ఞయాతిగామ హ ॥
ఋషయశ్చాపి తే సర్వే తదానీం రోమహర్షణమ్ ।
దృష్ట్వా పరమసంహృష్టాః ప్రీతాః సుమనసస్తథా ॥
సత్కారైరర్చయామాసురర్ఘ్యపాద్యాదిభిస్తతః ।
అభివాద్య మునీన్ సర్వాన్ రాజాజ్ఞామభిగమ్య చ ॥
ఋషిభిస్తేరనుజ్ఞాతః పృష్టస్సర్వమనామయమ్ ।
అభిగమ్య మునీవ్సర్వాం స్తేజో బ్రహ్మ సనాతనమ్
సదస్యానునుతే రమ్యే స్వాస్తీర్ణే సముపావిశత్ ।
తరువాత ప్రీతుఁడు ఇంద్రియ నిగ్రహుఁడునైన వ్యాసుడు పరమాద్భుతమైన లోక తత్త్వవిధానము నెఱింగించుటకును, శ్రుతి సమ్మతమయి అనేకార్థములతో కూడియున్న పురాణమును లోకములందు విస్తరింపజేయుటకు, జైమిని, సుమంతుఁడు, వైశంపాయనుఁడు, పైలుడు లోమహర్షణుం డు, అను తన యైదుగురు శిష్యులకు నోసంగెను. వినీతుఁడయిన రోమహర్షణుఁడు, ఆశ్చర్య జనకమయిన చరిత్ర కలపొఁడు, బాగుగా విద్యా వ్యాసంగము చేసినవాఁడు, ధార్మికుఁడు, శుచిమంతుఁడు, అయిన సూతుని పురాణముల జదివించెను. సుధార్మికుఁడు కృత ప్రజుఁడునై వసిషాదీమునులచే నడుగబడి, మునులకు నమస్కరించి అత్యంతమయిన భక్తి యుక్తుఁడయి ఆ ఋషీశ్వరులకు ప్రదక్షిణ మాచరించి సమస్త విద్యలను నేర్చి, సంతుష్టుఁడై కురుక్షేత్రమును చేరెను. అచ్చట సత్రయాగము జరుగుచుండెను. అచ్చటి ఋషులను యజమానులును వినయ పురస్సరముగా సమీపించెను. సత్రయాగమునందలి వారు రోమహర్షణుని విధివంతముగా యథాశాస్త్రముగా చేరిరి. అప్పుడా ఋషీశ్వరులందరు రోమహర్షణుని సందర్శించి పరమసంతుష్టులు, సంప్రీతులు, సుమనస్కులు నయిరీ. అర్ఘ్యపాద్యాది సత్కారములచేనతని పూజించిరి. ఋషీశ్వరుల కెల్లరకు నమస్కరించి, రాజానుమతిని పొంది, ఆ ఋషీశ్వరులచే అనుగృహీతుఁడై యతఁడు క్షేమ సమాచారములడుగ బడెను. ఆతఁడు బ్రహ్మతేజస్సుగలిగి సనాతనులయిన ఋషీశ్వరులను చేరి, సదస్సుచే చనుమతింపబడి రమ్యమయిన తన ఆసనమున నుపవిష్ణుఁ డయ్యెను.
ఉపనిష్టే తదా తస్మిన్మునయః శంసితవ్రతాః ।
ముదాన్వీతా యధాన్యాయం వినయస్థాసమాహితాః ॥
సర్వే తే ఋషయశ్చైవం పరివార్య మహావ్రతం ।
పరమప్రీతిసంయుక్తా ఇత్యూచుః సూతనందనమ్ ॥
స్వాగతం తే మహాభాగ దిష్ట్యా చ త్వాం నిరామయమం ।
పశ్యామ ధీమన్నత్రస్థాః సువ్రతం మునిసత్తమమ్ ॥
అశూన్యా మే రసాద్యైవ భవతః పుణ్యకర్మణః ।
భవాంస్తస్య మునేసూత వ్యాసస్యాపి మహాత్మనః ॥
అసుగ్రాహ్యః సదా ధీమన్ శిష్యః శిష్యగుణాన్వితః ।
కృతబుద్ధిశ్చ తే తత్త్వమనుగ్రాహ్యతయా ప్రభో ॥
అవాష్య విపులం జ్ఞానం సర్వతశ్ఛిన్నసంశయః ।
పృచ్ఛతాం నః స్సదా ప్రాజ్ఞ సర్వమాఖ్యాతుమర్హసి ॥
తదిచ్ఛామః కథాం దివ్యం పౌరాణీం శ్రుతిసంమితాం ।
శ్రోతుం ధర్మార్థయుక్తాం తు ఏతత్ వ్యాసాచ్ఛృతం త్వయా ॥
ఏవముక్తస్తడా సూశస్త్వృషిభిర్వినయాన్వితః ।
ఉవాచ పరమప్రాజ్ఞో వినీతోత్తరముత్తమమ్ ॥
ఆసనమున నుపవిష్ణుఁడయిన వెనుక, పూజ్యవ్రతులు, సంతోష సమన్వితులు, వినయవంతులు, సమాహిత చిత్తులు (22) నయిన ఆ మునీశ్వరులందరు, మహావ్రతుఁడయిన సూతుని చుట్టు చేరిరి. పరమ ప్రీతియుతులై సూతనందను గూర్చీ యిట్లు వారు పలికిరీ, (23) ఓ మహాభాగ! నీకు స్వాగతము. ఇచ్చట నున్న మేమెల్లరము మా యదృష్టముచే సువ్రతుఁడవు, ముని సత్తముఁడవు నయిన నీన్ను కుశలునిగా చూడగలుగుచున్నాము. (24) పుణ్యకర్మాచరణుఁడవయిన నీరాక వలన మనోరథము లన్నీయు పరిపూర్ణములయినవి, ఓ సూత! మహాత్ముడయిన వ్యాసునకు కూడ నెల్లప్పుడు అనుగ్రహ పాత్రుడవు (25) ఓ ధీమంతుఁడా! నీవాతనికి శిష్యుఁడవు; శిష్యగుణపూర్ణుఁడవు; పరినిష్టమైన బుద్ధిమంతుఁడవు; ఆ మహావిద్వత్సభుని యను (26) గ్రహమున నీవు విపుల జ్ఞాన మందితివి. సంశయ రహితుఁడవయితివి మేము అడుగు చున్నాము. ఓ ప్రాజ్ఞ! మాకు సర్వమును చేప్ప సమర్థుఁడవు, (27) ఏయది నీవు వ్యాసుని వలన విని యింటివో, సనాతనము దీవ్యము, శ్రుతి సమ్మతము, ధర్మార్జయుతము నయిన ఆ కథను వినఁగోరుచున్నాము. (28) ఇట్లు మునులచే పలుకబడి, వినయాన్వితుఁడయి, పరమ ప్రాజ్ఞుఁ డయిన సూతుఁడు ఉత్తమము, పాండిత్య గర్భితమునయిన సమాధాన మొసంగెను.
ఋషేః శుశ్రూషణం యచ్చ తస్మాత్ ప్రజ్ఞా చ యా మమ ।
యసాచుశ్రూషణార్థం చ తత్పత్యమిలి నిశ్చయః ॥
ఏవం గతేర్థే యచ్ఛక్యం మయా వక్తుం ద్విజోత్తమాః ।
జిజ్ఞాసా యత్ర యుష్మాకం తదజ్ఞాతుమిహార్హథ ।
ఏతత్రుత్వా తు మునయో మధురం తస్య భాషితమ్ ।
ప్రత్యూచుస్తే పునః సూతం బాష్పపర్యాకులేక్షణమ్ ॥
భవాన్ విశ్లేషకుశలో వ్యాసం సాక్షాత్తు దృష్టవాన్ ।
తస్మాత్వం సంభవం కృత్స్నం లోకస్యేమం విదర్శయ ॥
యస్య యస్యాన్వయే యే మే తాంస్తానిచ్ఛామ వేదితుమ్ ।
తేషాం పూర్వం విసృష్టిం చ విచిత్రం త్వం ప్రజాపతేః ।
సత్కృత్య పరిపృష్ఠః స మహాత్మా రోమహర్షణః ॥
విస్తరేణానుపూర్వ్యా చ కథయామాస సత్తమః ।
సూత ఉవాచ -
మో మేద్వైపాయనప్రీతః కథాం వై ద్విజసత్తమాః ॥
పుణ్యామాభ్యాతవాన్విఫ్రాస్తాం వై వక్ష్యామ్యనుక్రమాత్ ।
పురాణం సంప్రవక్ష్యామి యదుక్తం మాతరిశ్వవా ॥
ష స్టేన మునిభిః పూర్వం నైమిషీయైర్మహాత్మభిః ।
సర్గశ్చ ప్రతిసర్గశ్చ నంతో మన్వంతరాణి చ ।
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణమ్ ।
ప్రక్రియా ప్రథమః పాదః కథాయాం స్యాతురిగ్రహః ॥
అనుషంగ ఉపోద్ఘాతు ఉపసంహార ఏవ చ ।
ఏవం పాదాస్తు చర్వారః సమాసాత్ కీర్తితా మయా ॥
ఋషియైన ప్యాసునకు శుశ్రూష చేయుట, ఆ మహర్షి వలన నేను ప్రజ్ఞనొందుట, ఇయ్యది యాతని శిష్యరికము వలన గలిగిన విజ్ఞానమన్నదియు సత్యము, నిశ్చయము. (30) ఓ ద్వీజోత్తములారా! నా విజ్ఞాన శుశ్రూష ఇట్లు లభించినదగుట, నేను చెప్పుట కెయ్యది శక్యమో, మీకు దేనిని తెలిసికొనవలయునను ఆసక్తి యున్నదో, అయ్యది మీరు నా కాజ్ఞాపింప నరలు.” ఆ మధురమయిన యాతని (31) సమాధానమును: విని మునులు సంతోషబాష్పపర్యాకులేక్షణుఁడయిన సూతునితో నిట్లు మరల పలికిరి. (32). “ఓ వన్యవర! నీవు విశేష కుశలుండవు. వ్యాసుని ప్రత్యక్షముగా చూచితివి. అందుచే ఈ సర్వ ప్రపంచము యొక్క సంభవప్రకారమును విపులముగా నిర్దేశింపుము. (33) ఏ. ఏ వంశముల యందు ఎవ్వరెవ్వర్తిని గూర్చి తెలిసికొనుటకు కోరుచుంటిమో, ప్రజాపతి వలన వాల యొక్క విచిత్రమయిన పూర్వ సృష్టిని గూర్చి వివరింపుము. అని. సత్కరించి అడుగగా (34) ఉత్తముఁడయిన రోమహర్షణుఁడు మొదటి నుండియు సవిస్తరముగా చెప్పెను. సూతుండు పలికెను.
ఓ ద్వీజసత్తములార! నాయందు ప్రీతుడై కృష్ణాద్వైపాయనుండయిన (35) వ్యాసుఁ డేపుణ్యనుయిన కథను చెప్పియుండెనో, అనుక్రమములో దానిని వివరించెదను. నైమిశారణ్యము నందలి మహాత్ములయిన మునులు. అడుగగా తరశ్వుడు. (వాయువు) వారికి (36) ఏ పురాణము వచించేనో దానీనీ మీకు చెప్పెడను. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరములు; వంశానుచరితములు (37) అను ఐదు లక్షణములు కలిగినది పురాణము.
· సర్గము: సృష్టి పరమాత్మ యొక్క మాయా విలాసముచేత అవ్యాకృతతత్వము; దానినుండి మహతత్త్వము- దాని నుండిఅహంకారము; దాని నుండి సూక్ష్మ భూతములు జనించుట,
· ప్రతిసర్గము-: హిరణ్యగరుడసు-ప్రథమ జీవునియొక్క మానస పుత్రులైన మరీచ్యాది ప్రజాపతుల వలన జరిగిన చరాచర భూతసృష్టి
· వంశము-: ప్రజాపతుల నుండి సృష్టి క్రమములో సాగిన ఆయా ఋషుల రాజుల వంశములు.
· మన్వంతరములు: స్వాయంభువుడు మున్నగు మనువులు, వారివారి పాలనలో గల విషయములు, ఆయా మన్వంతరములలోని సప్తర్షులు - ప్రధానమునులు మున్నగు వారిని గూర్చిన విషయముల ప్రతిపాదనము.
· వంశానుచఠితము: ఆయా రాజవంశములలో జనించిన రాజుల పాలనాదికముల గూర్చిన కథలు.
ప్రక్రియ మొదటి పాదము. ఇందు కథ భాగముసంగ్రహముగ వర్ణింపఁబడును అనుషంగము, ఉపోద్ఘాతము, ఉపసంహారము అను నాలుగు పాదములు సంక్షేపముగా నాచే చెప్పబడినవి.
వక్ష్యామి తత్పురస్తాత్తు విస్తరేణ యథాక్రమమ్।
ప్రథమం సర్వశాస్త్రాణాం పురాణం బ్రహ్మణా శ్రుతమ్ ॥
అనంతరం చవక్షేభ్యో వేదాస్తస్య వినిఃసృతాః।
అంగాని ధర్మశాస్త్రం చ వ్రతాన్ని నియమాస్తథా ॥
అవ్యక్తం కారణం యత్తన్నిత్యం సదసదాత్మకమ్।
మహదాడి విశేషాంతం సృజామీతి వినిశ్చయః॥
అండం హిరణ్మయం చైవ బ్రహ్మణః సూతిరుత్తమా ।
అండస్యావరణం వార్థిరపామపి చ తేజసా ॥
వాయునా తస్య వాయోశ్చ ఖేన భూతాదినా తతః ।
భూతాదిర్మహతా చైవ అవ్యక్తేతీనావృతో మహాన్ ॥
అంతర్వర్తి చ భూతానామండమేవోషవర్ణితమ్
నదీనాం పర్వతానాం చ ప్రాదుర్భావోత్ర పఠ్యతే ॥
మన్వంతరాణాం సర్వేషాం కల్పానాం చైవ వర్ణనమ్ ।
కీర్తనం బ్రహ్మవృక్షస్య బ్రహ్మజన్మ ప్రకీర్త్యతే ॥
వానిని మరల యథాక్రమముగా విస్తరముగా చెప్పెదను. మొట్టమొదట సర్వశాస్త్రముల యొక్క పురాణమును (చరిత్రను) బ్రహ్మ వినెను.(40) తరువాత ఆ బ్రహ్మ ముఖము నుండి వేదములు, అంగములు; ధర్మశాస్త్రములు, వ్రతములు, నియమములు వెలువడినవి. (41) “కారణము నీత్యమునైన అవ్యక్తము, సత్, అసదాత్మకమై యొప్పు మహత్తత్త్వాది విశేషము వరకు బ్రహ్మ సృజించేదనను వినిశ్చయము పొందెను.” (42) హిరణ్మయమైన యండము యొక్క ఆవరణమయిన నేను బ్రహ్మయొక్క సంతానమును నీటీతోడ సముద్రము, తేజస్సుచే, పోయువుచే, తరువాత ఆ వాయువు యొక్క భూతాదికములచేతను, భూతాదులు మహత్తత్వముచేతను, అవ్యక్తము చేతను అధికముగా ఆవృతములులైనవి. (44) భూతములు వానిలోగల అండము వర్ణింపఁబడినది. అంత నదుల యొక్క పర్వతముల యొక్క పుట్టుక కూడ చెప్పబడును. (45) సర్వ మన్వంతరముల యొక్క కల్పముల యొక్క వర్ణనము, బ్రహ్మవృక్షము యొక్క ప్రశస్తి, బ్రహ్మ జన్మ వివరింపఁబడును. (46)
అతః పరం బ్రహ్మణశ్చ ప్రజాసర్గోపవర్ణనమ్।
అవస్థాశ్చాత్ర కీర్త్యనే బ్రాహ్మణో వ్యక్తజన్మనః ॥
కల్పానాం సంభవశ్చైవ జగతః స్థాపనం తథా ।
శయనం చ హరేరప్సు పృథివ్యుద్దరణం తథా ॥
స విశేషః పురాదీనాం వర్ణాశ్రమవిభాజనమ్ ।
ఋక్షాణాం గ్రహసంస్థానాం సిద్ధానాం చ నివేశనమ్ ॥
యోజనానాం యథా చైవ సంచరో బహువిస్తరః ।
స్వర్గస్థానవిభాగశ్చ మర్త్యాణాం శుభచారీణామ్ ॥
వృక్షాణామౌషధీనాం చ వీరుధాం చ ప్రకీర్తనమ్ ।
దేవతానాం ఋషీణాం చ ద్వే సృతీ పరికీర్తతే ॥
ఆమాదీనాం తరూణాం చ సర్జనం వ్యంజనం తథా ।
పశూనాం పురుషాణాం చ సంభవః పరికీర్తితః ॥
తథా నిర్వచనం ప్రోక్తం కల్పస్య చ పరిగ్రహః ।
నవ సర్గః పునః ప్రోక్తా బ్రహ్మణో బుద్ధిపూర్వకాః ॥
త్రయో యే బుద్ధిపూర్వొస్తు తథా యల్లోకకల్పనమ్ ।
బ్రహ్మణోవయవేభ్యశ్చ ధర్మాదీనాం సముద్భవః ॥
యే ద్వాదశ ప్రసూయనే ప్రజాకల్పే పునః పునః ।
కల్పయోరన్తరే ప్రోక్తం ప్రతిసంధిశ్చ యస్తయోః ॥
తమోమాత్రావృతత్వాత్తు బ్రహ్మణో ధర్మసంభవః ।
సత్వోదిక్తాచ్చ దేహాచ్చ పురుషస్య చ సంభవః ॥
తథైవ శతరూపాయాం తయోః పుత్రాస్తతః పరమ్ ।
ప్రియవ్రతోత్తానపాదౌ ప్రసూత్యాకృతయః శుభాః ।
కీర్యస్తే ధూమపాపానస్రైలోక్య యే ప్రతిష్ఠితాః ।
రుచేః ప్రజాపతేశ్చోర్వామాక్యూం మిథునోద్భవః ॥
ప్రసూర్యామపి దక్షస్య కన్యానముద్భవః శుభః ।
దాక్షాయణీషు వాప్యూర్ధ్వం శబ్దాదాసు మహాత్మనః ॥
ధర్మస్య కీర్త్యతే సర్గః సాత్త్వికస్తు సుభోదయః ।
తథా ధర్మస్య హింసాయాం తామసో శుభలక్షణః ॥
ఆ తరువాత బ్రహ్మయొక్క ప్రజాసృష్టి వర్ణనము, అవ్యక్త జన్ముఁడైన బ్రహ్మయొక్క అవస్థలును వర్ణింపబడినవి. (47) కల్పముల యొక్క పుట్టుక, తరువాత జగత్తు యొక్క స్థాపనము, విష్ణువు నీటియందు శయనించుట, తరువాత పృథివీ యొక్క యుద్ధరణము వర్ణింపబడినవి. (48) విశేషముగా పురములు మొదలగు వానియొక్క సర్గము, వర్ణాశ్రమ విభజనము, వక్షత్రముల యొక్క గ్రహాముల యొక్క సంస్థానము, సిద్ధుల యొక్క నివాసము, (49) బహువిస్తారముగా. వానియొక్క సంచారము, శుభచరిత్రులయిన మర్యులకు స్వర్గస్థానమందలి విభాగము,(50) వృక్షములయొక్క ఔషధులయొక్క లతల యొక్క వర్ణనము, దేవతలయొక్క ఋషులయొక్క సృష్టిద్వయము వర్ణింపబడినవి. (51) ఆత్ర వృక్షముల యొక్క సృష్టి, వానీయొక్క వ్యాపనము, పశువుల యొక్క పురుషులయొక్క సంభవము కీర్తింపబడినది. (52) కల్పములయొక్క నిర్వచనము తత్పరిగ్రహము చెప్పబడినది. బ్రహ్మ బుద్ధిపూర్వకములయిన తొమ్మిది సృష్టులు మరల వచింపబడినవి. {53) అట్లే బ్రహ్మ బుద్ధి పూర్వకము లయిన మూఁడు లోకముల సృష్టి, బ్రహ్మయొక్క యవయవముల నుండి ధర్మము మొదలయినవి సముద్భవించుట (54) ప్రజాకల్పము నందు మాటిమాటికీ ఏ పండ్రెండు కల్పములు పుట్టినవో, యవి చెప్పబడినవి.' అంతియుకాక రెండు కల్పముల యొక్క అంతరము నందలి యే ప్రతిసంధీ కలదో యది చెప్పబడినది. (55). తమస్సుచే నా వృత్తములగుటవలన బ్రహ్మము నుండి అధర్మము పుట్టుట, సత్వోద్రిక్తమయిన దేహము నుండి పురుషుఁడు పుట్టుట (56) అట్లే తరువాత, శతరూపయందు బ్రహ్మకు పుత్రులుదయించుట, తరువాత శుభాకృతులయిన ప్రియ వతోత్తానపాదుల జననము కీర్తింపబడినవి. {57)వారు పాపరహితులు; లోకములయందు ప్రతిష్ఠితులు. తరువాత రుచియను ప్రజా ప్రతికి ఆ కూతియందు మిథునము కలుగుట (58) దక్షునకు కన్యలుదవమందుట, దాక్షాయణులయందు గాని వారికి పూర్వము శబ్దాదుల యందు (వేదాదులయందు) గోప్పదియగు ధర్మము యొక్క కీర్తికొఱకు సాత్వికము సుభోదయము యొక్క సృష్టి అట్లే అధర్మము యొక్క హింస యందు, తామసము అశుభ లక్షణము యొక్క పుట్టుక వర్ణింపబడినది.
భృగ్వాదీనాం ఋషీణాం చ ప్రజాసర్గోపవర్ణనమ్ ।
బ్రహ్మర్షేశ్చ వశిష్ఠస్య యత్ర గోత్రానుకీర్తనమ్ ॥
ఆగ్నేః ప్రజాయాః సంభూతిః స్వాహాయాం యత్ర కీర్యతే ।
పితృణాం ద్వీపకారాణాం స్వధాయాం తదనస్తరమ్ ॥
పితృవంశప్రసంగేన కీర్యతే చ మహేశ్వరాత్ దక్షస్య ।
శాపః సత్యాళ్ళ భృగ్వాదీనాంచ ధీమతామ్ ॥
ప్రతిశాపశ్చ దక్షస్య రుద్రాదద్భుతకర్మణః ।
ప్రతిషేధశ్చష వైరస్య డీర్యతే దోషదర్శనాత్ ॥
మన్వంతరప్రసంగేన కాళాఖ్యానం చ కీర్త్యతే ।
ప్రజాపతేః కర్దమస్య కన్యాయాః శుభలక్షణమ్ ॥
ప్రియవ్రతస్య పుత్రాణాం కీర్యతే యత్ర విస్తరః ।
తేషాం నియోగో ద్వీపేషు దేశేషు చ పృథక్ పృథక్ ॥
స్వాయంభువస్య సర్గస్య తతళ్ఛిష్యనుకీర్తనమ్ ।
వర్షాణాం చ నదీనాం చ తద్భేదానాం చ సర్వశః ఈ
ద్వీపభేదసహస్రాణామంతర్భావశ్చ సప్తసు ।
విస్తారాస్ మండలం చైవ జంబూద్వీపసముద్రయోః ।
ప్రమాణం యోజనాశ్రేణ కీర్యస్తే పర్వతైస్సహ ।
హిమవాన్ హేమకూటశ్చ నిషదో మేరురేవ చ ।
నీలః శ్వేతశ్చ శృంగీ చ కీర్త్యన్యే సప్త పర్వతాః ॥
తేషామంతరవిష్కంభా ఉచ్ఛాయాయామవిస్తరాః ॥
కీర్యన్యే యోజనాశ్రేణ యే చ తత్ర నివాసినః ।
భారతాధీన వర్షాణి నదీభిః పర్వతైస్తథా ॥
భూత్చైశ్చోపనివిష్టాని గతిషద్భిర్యవైస్తథా ।
జంబూద్వీపాదయో ద్వీపాః సముద్రైస్పషభిర్యృతాః ॥
భృగువు మొదలయిన ఋషులయొక్క ప్రజో(సంతానోత్పత్తి వర్ణనము, బ్రహ్మర్షియైన వసిష్టుని యొక్క గోత్రకీర్తనము. (61) స్వాహాదేవి యండు మొట్టమొదట సంతానోత్పత్తియు వర్ణింపబడినవి, తరువాత ద్వివిధముల నొప్పిన పితరులయొక్క యుత్పత్తి 'స్వధ' యండు కలుగుట (62) మహేశ్వరునివలన పితృవంశ ప్రసంగము వలన దక్షుని శాపము, ధీమంతులయిన భృగ్వాడుల ప్రతిశాపములు సత్యమగుట, (63) అధ్బుతకర్ముడయిన రుద్రుని వలన, దోష ధర్శనము వలన, దక్షుడు వైరమును విరమించుట (64) మన్వంతర ప్రస్తావనచేత కాలాఖ్యానము వర్ణింపబడినది. ప్రజాపతియైన కర్గముని కన్యయొక్క శుభలక్షణము (65) ప్రియవ్రతుని పుత్రులయొక్క చరిత్ర విస్తారముగాను వర్ణింపబడినది. ఆ ప్రియవ్రతుని పుత్రులను వేరువేరుగా వివిధ ద్వీపముల యందు నియోగీంచుట (66) తరువాత స్వాయంభువ మనువు యొక్క పుట్టుకను, వర్షములయొక్క (దేశభాగములయొక్క నదులయొక్క వాని వాని భేదములయొక్క అంతటనుగల, ద్వీపభేధసహస్రములయొక్క వావి యంతర్భాగములయిన ఏడింటియందు, పర్వతములతోసహా యోజన సంఖ్యా ప్రమాణములు వర్ణింపబడును. హిమవంతుఁడు, హేమకూటము, నిషధము, మేరువు, నీలము, శ్వేతము, శృంగియను సప్తపర్వతములు కీర్తింపఁబడును. (69) వారి మధ్య రేగిన ఉన్నతములయిన విష్కంభములు (అవరోధములు) వర్ణింపఁబడును; (70) బుష్టిని కేంద్రీకరించి యచ్చట నివసించు వారు వర్ణింపబడుదురు; భారతదేశము మున్నగు వరములు, నదులతో పర్వతములతో సంచరించునట్టివి, సంచరింపనట్టి భూతములతో గూడినవియునైన, సప్తసముద్రములచే వావృతములయిన జంబూద్వీపాది ద్వీపములు వర్ణింపబడును.
తతః స్వర్ణమయీ భూమిర్లోకాలోకశ్చ కీర్త్యతే ।
సప్రమాణా ఇమే లోకాః సప్తద్వీపా చ మేదినీ ॥
రూపాదయః ప్రకీర్యస్తే కరుణాఫ్రకృతైస్పహ ।
సర్వే చైతత్ఫధానస్య పరిణామైకదేశికమ్ ॥
పర్యాయపరిమాణం చ సంక్షేమేణాత్ర కీర్త్యతే ।
సూర్యాచంద్రమసోశ్చైన పృథివ్యాశ్చాష్యశేషతః॥
ప్రమాణం యోజనాగ్రేణ సాంప్రవైరభిమానిభిః ।
మహేంద్రాధ్యాశ్శుభాః పుణ్యా మానసోత్తరమూర్ధని॥
అత ఊర్ధ్వగతితో సూర్యస్యాలోవచక్రపత్ ।
నాగవీథ్యక్షవీథ్యేశ్చ లక్షణం చ ప్రకీర్త్యతే॥
కోష్ఠయోర్లేఖయోశ్చైవ మండలానాం చ యోజనైః ।
లోకాలోకస్య సంధ్యాయా అహ్నో విషువతస్తథా ।
లోకపాలాః స్థితాశ్చోర్ద్వం కీర్త్యనే తే చతుర్దిశమ్ ।
పితౄణాం దేవతానాం చ పంథానౌ దక్షిణోత్తరౌ॥
గృహిణాం న్యాసిగాంచోక్తో రణసత్త్వసమాశ్రయః ।
కీర్తతే చ పదం విష్ణోర్థర్మాణ్యా యత్ర చ స్థితాః ॥
సూర్యాచంద్రమసోచ్చారో గ్రహాణాం జ్యోతిషాం తథా ।
కీర్యతే ధువసామర్థ్యాత్ ప్రజానాం చ శుభాశుభమ్॥
బ్రహ్మణా నిర్మితః సౌరః సాదనార్థే చ స స్వయమ్ ।
కీర్త్యతే భగవాన్యేన ప్రసర్పతి దివః క్షయమ్ ॥
తరువాత బంగారుతో గూడిన భూమి, లోకాలోకములు, వానివాని విస్తీర్ణ ప్రమాణములతో, సప్తద్వీప పరివృత్తమయిన భూతలము,(73) సాధనములయిన ప్రకృతులతో (లోక) రూపాదులు, కీర్తింపబడును. ఏ తత్సర్వము ప్రధానుఁడయిన పరమేశ్వరునియొక్క పరిణామములో నొక్క భాగము మాత్రమే. (74) తరువాత ఒకదాని తరువాత వేటేకదాని (లోకాలోకాదులయొక్క. విస్తీర్ణాదులు సంక్షేపముగా కీర్తింపఁబడును. సూర్యచంద్రుల యొక్క భూమియొక్క ప్రమాణము వర్తమాన స్థితి నెఱింగిన అభిమానులచే యోజనాది ప్రమాణ పురస్సరముగా కీర్తింపఁబడును. మానస సరోవర పుట్టుత్తర శిఖరమున పుణ్యములు శుభంకరములునైన మహేంద్రము మున్నయినవి కలవు. (77) దాని నుండి సూర్యునియొక్క ఆలాత చక్రమువలె (నిప్పుతో కూడిన ఒక కాష్ఠమును గుండ్రముగా త్రిప్పిన నేర్పడు జ్వోలోవలయమండలము అయాత చక్రము). నుండు నాగవీధి యొక్క అక్షవీధి యొక్క లక్షణము (నాగవీధి - అశ్వనీ భరణి కృత్తికలో చంద్రుడు సంచరించు మార్గము. అక్షము - జ్యోతిశ్చక్రము సప్తర్ష్యాదుల పథము) వర్ణింపబడును. కోష్ఠముల యొక్క రేఖల యొక్క మండలముల యొక్క ప్రమాణములు, లోకాలోకముల యొక్క సంధ్యయొక్క విషువంతమయిన అహ్నముయొక్క స్థితి కీర్తింపబడును. (78) నాలుగు దిక్కుల యూర్థ్వమందున్న లోకపాలురు, దక్షిణోత్తర దిశలయందున్న పితృదేవతల యొక్క దేవతల యొక్క మార్గములు (79) రజోగుణ సత్త్వ గుణ సమాశ్రితులయిన గృహస్థులయొక్క సన్న్యాసుల యొక్క ప్రవృత్తి, ధర్మాదు లెందున్నవో యచ్చటి విష్ణుపదస్థితి అభివర్ణింపబడును. (80) సూర్యచంద్రులయొక్క ఆకాశ స్థిత గ్రహములయొక్క సంచారము ప్రజలయొక్క శుభాశుభములు శక్తిమంతముగా కీర్తింపఁబడును. (81) బ్రహ్మ స్వయముగా సూర్యమండలమును (సౌరమును) నిర్మించేను. ఆతనిచేతనే పగలు క్షయము పొందును. అది వర్ణింపఁబడినది.
స రథోధిష్ఠితో దేవైరాదీత్యైః ఋషిభిస్తథా ।
గంధర్వైరప్సరోభిశ్చ గ్రామణీసర్పరాక్షసైః॥
అపాం సారమయాత్స్యందాత్ కథ్యతే చ రసస్తథా ।
వృద్ధిక్షయౌ చ సోమస్య కీర్యేతే సోమకారితౌ ॥
సూర్యాదీసం స్యందనానాం ధ్రువాదేవ ప్రవర్తనమ్ ।
కీర్త్యతే శిశుమారస్య యస్య పుచ్ఛే ధ్రువః స్థితః ॥
తారారూపాణి సర్వాణి నక్షత్రాణి గ్రహైస్సహ ।
నివాసా యత్ర కీర్త్యస్తే దేహసాం పుణ్యకర్మణామ్ ॥
సూర్యరశ్మిసహస్రం చ వర్షశీతోష్ణవిశ్రవః ।
ప్రతిభాగశ్చ రశ్మీనాం సౌమతః కర్మతీర్థతః ॥
పరిమాణం గతీశ్చోక్తా గ్రహాణాం సూర్యసంశ్రయాత్ ।
వేశ్యారూపాత్పధానస్య పరిమాణో మహద్భవః ॥
పూరూరవస ఐలస్య మాహాత్మ్యస్యానుకీర్తనమ్ ।
పితృణాం ద్వీపకారాణాం మాహాత్యం వామృతస్య చ ॥
తతః పర్వాణి కీర్త్యస్తే పర్వణాం చైవ సంధయః ।
స్వర్గలోకగతానాం చ ప్రాప్తానాం చాప్యధోగతిమ్ ॥
పితృణాం ద్విప్రకారాణాం శ్రాద్ధీనానుగ్రహో మహాన్ ।
యుగసంఖ్యాప్రమాణం చ కీర్యతే చ కృతం యుగమ్ ॥
త్రేతాయుగే చాపకర్సాద్ వార్తాయాః సంప్రవర్తనమ్ ।
వర్ణానామాశ్రమాణాం చ సంస్థితిః ధర్మతస్తథా ॥
వజప్రవర్తనం చైవ సంపాదో యత్ర కీర్త్యతే ।
ఋషీణాం వసునా సార్ధం వసోశ్చాధః పునర్గతిః ॥
శబ్దత్వం చ ప్రధానాత్తు స్వాయంభువమ్భతే మనుమ్ ॥
ప్రశంసా తపసతోక్తా యుగావస్థాశ్చ కృత్స్నశః ।
ద్వాపరశ్చ కలేశ్చాపి సంక్షేపేణ ప్రకీర్తనమ్ ॥
మన్వంతరం చ సంఖ్యా చ మానుషేణ ప్రకీర్తితా ।
మన్వంతరాణాం సర్వేషామేతదేవ చ లక్షణమ్ ల్।
అతీతానాగతానాం చ వర్తమానం చ కీర్త్యతే ।
తథా మన్వంతరాణాం చ ప్రతిసంధానలక్షణమ్ ॥
సర్వనాయకుడయిన యాతఁడు దేవతలతో, ఆదిత్యులతో, ఋషులతో, గంధర్వులతో, అప్సరసలతో సర్వరాక్షసులతో, రథము నధిష్టించెను. (83) నీటియొక్క సారభూతమయిన స్యందనము వలన రసము వర్ణింపబడును. సోమలతాకారులయిన వారిచే సోమలత యొక్క వృద్ధి క్షయములు (84) సూర్యాదుల స్యందనముల యొక్క ధ్రువత్వము వలన ప్రవర్తనము, దానీయొక్క పుచ్ఛమునందు. శింశుమారము యొక్క నిశ్చల స్థితియు, (85) వార్తా రూపములయిన గ్రహములతోడి సర్వనక్షత్రములు, అచ్చట పుణ్యకర్ములయిన దేవతల నివాసము. (86) వర్ణింప బడును. సూర్యరశ్ముల యనేక విధత్వము, శీతోష్ణ స్థితుల విస్తారము, నామములబట్టి, కర్మనుబట్టి, తీర్ధములబట్టి రశ్ములయొక్క ప్రవిభాగము (87) వానీ పరిమాణము, సూర్యునాశ్రయించుకోనీ గ్రహములయొక్క గతులు వర్ణింపబడినవి. వేశ్య రూపము వలన ప్రధానునికి గొప్ప పరిణామము కలుగుట. (88) ఇల వంశమునకు సంబంధించిన పురూరవుని యొక్క మాహాత్మ్యము, పితరులయొక్క అమృతముయొక్క ద్విప్రకార (రెండు విధములయిన) మయిన మహాత్మ్యము (89) తరువాత పర్వములు, పర్వముల సంధులు, స్వర్గ లోకమును పొందినవారు, అధోలోకమును పొందినవారు నయిన ద్విప్రకార పితరులకు సంబంధించిన శ్రాద్ధములచే నగు గొప్ప అనుగ్రహము, యుగ సంఖ్యా ప్రమాణము కృతయుగము కీర్తింపబడును (91) త్రేతాయుగము
చనిన తరువాత జీవీకల యొక్క (వార్తలయొక్క) సంప్రవర్తనము, ధర్మము ననుసరించి వర్ణముల యొక్క ఆశ్రమముల యొక్క సంస్థితీయు, (92) వజ్రము యొక్క సముద్భవము, తద్విషయ సంవాదము, వస్తువుతో సహితముగా ఋషుల యొక్క ప్రవర్తనము, తరువాతి వస్తువునకు మరల అధోగతి గలుగుట, స్వాయంభువ మనువు మరణీంప ప్రధానము వలన మనువుచ్చరింపబడుట (93) తపస్సు యొక్క ప్రశంస, సంపూర్ణముగా యుగము నందలి యవస్థలు, ద్వాపరము, కలియుగముల గూర్చి సంక్షేప కథనములు (94) మన్వంతరములు, తత్సంఖ్య మర్త్య ప్రమాణమున కీర్తింపబడినవి. ఇతర మన్వంతరముల స్వభావము కూడ నిట్టి లక్షణమే కలిగియుండుట. (95) జరిగినట్టిది, రానున్నది, వర్తమానము అట్లే మన్వంతరములు పునః పునరాగమమనెడి ప్రతిసంధానము వర్ణింపబడును.
అతీతానాగతానాం చ ప్రోక్తం స్వాయంభువే తతః ।
ఋషీణాం చ గతిః ప్రోక్తా కాలజ్ఞానగతిస్తథా॥
దుర్గసంఖ్యాప్రమాణం చ యుగవార్తాప్రవర్తనం ।
త్రేతానాం చక్రవర్తీనాం లక్షణం జన్మ చైవ హి ॥
ప్రమతేశ్చ తథా జన్మ అథో కలియుగస్య వై।
అంగునైద్రాసనం చైవ భూతానాం యచ్చ చోచ్యతే ॥
శాఖానాం పరిసంఖ్యానం శిష్య ప్రాధాన్యమేవ చ ।
వాక్యం సప్తవిధం చైవ ఋషిగోత్రానుకీర్తనమ్ ॥
లక్షణం సూతపుత్రాణాం బ్రాహ్మణస్య చ కృత్స్నతః ।
వేదానాం వ్యసనం చైవ వేదవ్యాసైర్మహాత్మభిః ॥
మన్వంతరేషు దేవానాం ప్రజేశానాం చ కీర్తనం ।
మన్వంతరక్రమశ్చైవ కాలజ్ఞానం చకీర్త్యతే ॥
దక్షస్య చాపి దౌహిత్రాః ప్రియాయా దుహితుః శుభాః ।
బ్రహ్మాదిభిస్తే జనతా దక్షేణైవ చ ధీమతా ॥
సావర్ణాశ్చాత్ర కీర్యన్యే మనవో మేరుమాశ్రితాః ।
ధ్రువస్యౌత్తానపాదస్య ప్రజాసర్గోపవర్ణనమ్ ॥
చాక్షుషస్య మనోః సర్గః ప్రజానాం వీర్యవర్ణనమ్ ।
ప్రభుణా చైవ వైన్యేన భూమిదోహప్రవర్తతా ॥
పాత్రాణాం పయసాం చైవ వత్సానాం చ విశేషణమ్ ।
బ్రహ్మాదిభిః పూర్వమేవ దుగ్ధ చేయం వసుంధరా ॥
దశభ్యశ్చ ప్రచేతోభ్యో మారిషాయాం ప్రజాపతేః।
దక్షస్య కీర్త్యతే జన్మ సమస్యాంశేన ధీమతః ॥
జరిగిపోయినది, జరుగనున్నట్టిది పూర్వము బ్రహ్మకోటకు చెప్పబడినది ఋషులయొక్క కాలజ్ఞానగతి, దుర్గసంఖ్యా (97) ప్రమాణము, యుగముల సంబంధమైన చరిత్ర ప్రవర్తనము త్రేతాయుగ సంబంధమైన చక్రవర్తుల లక్షణము, జన్మ (98) తరువాత ప్రమతి యొక్క పుట్టుక, కలియుగ స్వభావము, భూతముల అంగుళములు హ్రస్వత్వము నొందుట, (99) వేదాదుల శాఖల ప్రతిసంఖ్యానము, శిష్యుల ప్రాధాన్యము, సప్త విధమయిన వాక్యము, ఋషుల గోత్రముల కీర్తనము (100) సూత పుత్రుల యొక్క బ్రాహ్మణుని యొక్క లక్షణములు సర్వము మహాత్ములయిన వేదవ్యాసులచే వేదముల సంబంధమయిన వ్యసనము, (101) మన్వంతరముల యందు దేవతల యొక్క ప్రజా ప్రభువుల యొక్క కీర్తనము, మన్వంతరముల క్రమము, కాలజ్ఞానము వర్ణింపబడును. (102) దక్షుని కూతురయిన ప్రియకు పుట్టిన శోభంకరులయిన దౌహిత్రులు, బ్రహ్మాదుల చేతను ధీమంతుఁడయిన దక్షుని చేతను సంభవించిరి. (103) మేరు పర్వతము నాశ్రయించుకొనియున్న సావర్గాది మనువులు, ఉత్తానపాదుని కుమారుఁడయిన ధ్రువుని యొక్క సంతానోత్పత్తి, (104) చాక్షుష మనువు యొక్క సృష్టి ప్రజల యొక్క వీర్యవర్ణనము, భూమిని పిదుక ప్రవర్తించిన ప్రభువైన వైన్యునిచే పాత్రలయొక్క పాలయొక్క వత్సలయొక్క విశేషము, బ్రహ్మాదులచే పూర్వమే యీ భూమి పిదుకబడినది. (106) ప్రజాపతి వలన మారీష యందు పుట్టిన పదుగురైన ప్రచేతసులచే ధీమంతుఁడయిన దక్షునియొక్క జన్మ సమాంశేన కలుగుట వర్ణింపబడినది.
భూతభవ్యభవేశత్వం మహేంద్రాణాం చ కీర్త్యతే ।
మన్వాదికా భవిష్యంతి ఆఖ్యానైరృహంభిరావృతాః ॥
వైవస్వతస్య చ మనోః కీర్త్యతే సర్గవిస్తరః ।
బ్రహ్మాదికోశ ఉత్పత్తీర్పగ్వాదీనాం చ కీర్త్యతే ॥
వినిష్కృష్య ప్రజాసర్లే చాక్షుషస్య మనోః శుభే ।
దక్షస్య కీర్యతే సర్గో ధ్యానాద్వైవస్వతాన్తరే ॥
నారదః కృత సంవాదో దక్షపుత్రాన్ మహాబలాన్ ।
నాశయామాస శాపాయ మానసో బ్రహ్మణః సుతః॥
తతో దక్షోసృజత్కన్యా వైరిణా నామ విశ్రుతాః ।
మరుత్రవాహే మరుతో దివ్యాం దేవ్యాం చ సంభవః ॥
కీర్త్యతే మరుతాం చాత్ర గణాస్తే సప్త సప్తకాః ।
దేవత్వమీంద్రవాసేన వాయుస్కంధేషు చాశ్రమః ॥
దైత్యానాం దానవానాం చ యక్షగంధర్వరక్షసాం ।
సర్వభూతపిశాచానాం యక్షాణాం పక్షివీరుధాం ॥
ఉత్పత్తయశ్చాపురసాం కీర్యస్తే బహువిస్తరాక్ ।
మార్తండమండలం కృత్నం జన్మైరావతహస్తినః ॥
వైనతేయసముత్పత్తిస్తథా రాజ్యాభిషేచనమ్ ।
భృగూణాం విస్తరశ్చోక్తస్తథా చోంగిరసామపి ॥
కశ్యపస్య పులస్త్యస్య తథైవాతైర్మహాత్మనః ।
పరాశరస్య చ మునేః ప్రజాసాం యత్ర విస్తరః ॥
తిస్రః కన్యాసు కీర్యస్తే యాసు లోకాః ప్రతిష్ఠితాః ।
ఇచ్ఛాయా విస్తరశ్చోక్త ఆదిత్యస్య తతః పరమ్ ॥
మహేంద్రులయొక్క శ్రీకాల ప్రభుత్వము, అనేకములయిన ఆఖ్యానములతోగూడియున్న మనువు మొదలయిన వారి వృత్తాంతములు (108), వైవస్వత మనువు యొక్క పుట్టును విస్తరముగాను, భగ్వాదులయొక్క బ్రహ్మాదులయొక్క కోశోత్పత్తియు, (109) కీర్తింపబడును. మనువయిన చాక్షుషుని యొక్క శుభంకరమయిన ప్రజాసృష్టి యందు ప్రాయశ్చిత్త మొనర్చుటయు, వైవస్వత మన్వంతరమున ధ్యానమువలన దక్షునియొక్క పుట్టుక (110) వర్ణింపబడును. బ్రహ్మమానస సుతుడయిన సొరదుఁడు మహాబలులయిన దక్ష పుత్రులతో వాదించి, వారిని శాపమున నాశన మొనరించెను. (111) అంత దక్షుఁడు వైరిణలు అను పేరుతో ప్రఖ్యాతలయిన కన్యలను సృజించెను. దేవీ యయిన దీతి యందు మరుత్ప్రవాహమున మరుత్తు దయించెను. (112). ఆ మరుత్తుల గణములు సప్తసప్తకములు. (నలుబది తొమ్మండ్రు); ఇంద్రపాసముచే, వాయు స్కంధముల యందు దేవత్వమును పొందుట, (113) దైత్యుల యొక్క దానవుల యొక్క యక్షగంధర్వ రక్షసుల యొక్క సర్వభూత పిశాచముల యొక్క యక్షుల యొక్క పక్షుల యొక్క లతల యొక్క (114) అప్సరసల యొక్క యుత్పత్తులు బహు విస్తరముగా కీర్తింపఁబడినవి. యావత్ మార్తాండ మండలము, ఐరావత గజముయొక్క జన్మ, (115) వినతొ కుమారుఁడయిన గరుత్మంతుని యుత్పత్తి, ఆతని రాజ్యభిషేచనము, మహాత్ములయిన భృగువంశీయుల యొక్కయు అట్లే ఆంగిరసుల యొక్క (116) కశ్యపుని యొక్క పులస్త్యునియొక్క అత్రీయొక్క పరాశర మునీశ్వరుని యొక్క సంతానము విస్తృతముగా వర్ణింపఁబడినది. (117) ఎవ్వటేలయండు లోకములు సుప్రతిష్ఠితములైయుండెనో అట్టి ముగ్గురు కన్యలు వర్ణింపం బడిరి. తరువాత ఇచ్ఛయొక్క ఆదిత్యుని యొక్క యుత్పత్తులు విస్తరముగా వర్ణింపఁబడినవి.
కింకువిచ్చరితం ప్రోక్తం ధ్రువస్యైవ నిబర్హణమ్ ।
బృహద్బలానాం సంక్షేపాదీక్ష్వాక్వాద్యాః ప్రకీర్తితాః ॥
నిత్యాదీనాం క్షితీశానం పలాండుహరణాదిభిః ।
కీర్త్యతే విస్తరాత్సర్గో యయాత్రపి భూపతేః॥
యదువంశసముద్దేశో హైహయస్య చ విస్తరః ।
క్రోధాదనంతరం చోక్తస్తథా వంశస్య విస్తరః 11
జ్యామఘస్య చ మాహాత్యం ప్రజాసర్గశ్చ కీర్త్యతే ।
దేవవృధస్యాంధకస్య ధృష్టశ్చాపి మహాత్మనః ॥
అనిమీత్రాన్వయశ్చైవ విశోర్శిభ్యాభిశంసనమ్ ।
విశోధమనుసంప్రాప్తిర్మణిరత్నస్య ధీమతః ।
సత్రాజితః ప్రజాసర్గో రోజరేర్దేవమీరుషః ।
శూరస్య జన్మ చాప్యుక్తం చరితం చ మహాత్మనః ॥
కంసస్యాపి చ దౌరాత్మ్యమేకో వంశ్యాత్సముద్భవః ।
పోసుదేవస్య చేవ్యూం విష్ణోరమితతేజసః ॥
అనంతరమృషేస్సర్గః ప్రజాసర్గోపవర్ణనమ్ ।
దేవాసురే సముత్పన్నే విష్ణునా స్త్రీవధే కృతే ॥
సంరక్షతా శక్రవధం శోషః ప్రాప్తః పురా భృగోః ।
భృగుశ్చోత్తాపయామాస దివ్యాం శుక్రస్య మాతరమ్ ॥
దేవానాం చ ఋషీణాం చ సంక్రమాద్వాదశాహృతః ।
నారసింహప్రభృతయః కీర్యస్తే పాపనాశనాః॥
శుక్రేణారాధనం స్థాణోర్ఘోరేణ తపసా తథా ।
వరప్రదానకృత్తేన యత్ర శర్వస్తవః కృతః॥
కింకువిచ్చరితము, ధ్రువునియొక్క విసోశనము, బృహద్బలులయిన ఇక్ష్వాకు వంశాదుల చరిత్ర సంక్షేపముగా చెప్పబడినది. (119) పలాండుహారణాదులచే (పలాండు - అనగా - ఉల్లిపాయ యనియున్నది. పలాండు నామక దేశముండి యుండవచ్చును) 'నిశీ' మొదలయిన రోజుల యొక్క చరిత్ర, యయాతి భూపతియొక్కపుట్టుకయు విస్తరముగా వర్ణింపబడినది. (120) యదువంశ చరిత్ర సంపూర్ణముగా, హైహయుల చరిత్ర విస్తృతముగా, ఆతని వంశ చరిత్ర తరువాత క్రోధునీ తరువాత వీపులముగొను చెప్పబడినవి. (121) జ్యామఘుని యొక్క మాహాత్మ్యము ప్రజాసర్గము, దేవవృథుఁడయిన అంధకునియొక్క మహాత్ముడయిన దుష్టియొక్క అని మిత్రుని యొక్క అన్వయము, విశుని గూర్చీ మిధ్యా ప్రశంస, విశోధునితో ననుసరించి పొందబడిన ధీమంతుఁడయిన మణిరత్నుని చరిత్ర (123) రాజర్షియైన దేవమీఢునకు సత్రాజితుని వలన సంతానోత్పత్తి శూరుని యొక్క జన్మయు, ఆ మహాత్ముని చరిత్రము చెప్పబడినవి. (124).ఒకే వంశములో సముద్భవించిన కంసుని దుర్మోర్థత, వాసుదేవునికి దేవకియందు అమిత తేజస్వి యయిన విష్ణుని సముద్భవము, (125) అనంతరము ఋషి సంతానము ప్రజాసృష్టి వర్ణింపబడెను. విష్ణువుచే స్త్రీ వధ యాచరింపబడుటయు, దేవాసురులు పుట్టుటయు, ఇంద్ర వధను సంరక్షించు విష్ణువు భృగుని వలన శాపము పొందుట, (126) దివ్యమైన శుక్రుని తల్లిని భృగుడు లేపుట, (127) దేవతలయొక్క ఋషులయొక్క ప్రవేశము వలన బృహస్పతి నుండి అపహృతులయిన పాపనాశనులు నారసింహా ప్రభృతులు వర్ణింపఁబడిరి. (128) శుక్రుడు తరువాత ఘోరతపముచే స్థాణుఁడయిన ఈశ్వరు నారాధించుట, వర ప్రదానముచే నీశ్వరుఁడా శుక్రునిచే స్తోత్రము చేయబడుట.
అనన్తరం చ నిర్దిష్టం దేవాసురవిచేష్టితమ్ ।
జయంత్యా సహ శక్రేణ యత్ర శుక్రో మహాత్మని ॥
అసురాన్మోహయామాస శక్రరూపేణ బుద్ధిమాన్ ।
బృహస్పతిశ్చ తం శుక్రం శశాప స మహాద్యుతిః ॥.
ఉక్తం చ విష్ణోర్మాహాత్మ్యం విష్ణోర్జన్మని శబ్యతే ।
తుర్వసుశ్చాత్ర దౌహిత్రో యవీయాన్యో యద్రభూత్ ॥
అనుద్రుహ్యాదయః సర్వే తధా తత్తనయా నృపాః ।
అనువంశ్యో మహాల్మినస్తేషాం పార్థివసత్తమాః ॥
కీర్యస్తే యత్ర కారిస్త్యేన భూరిద్రవిణతేజసః ।
ఆతిథ్యస్య తు విప్రరేః సప్తధా ధర్మసంశ్రయాత్ ॥
బార్హస్పత్యం సూరిభిశ్చ యత్ర శాపముపావృతం ।
హరవంశయశః స్పర్శః శంతనోర్వీర్యశబ్దనమ్ ॥
భవిష్యతాం తథా రాజ్ఞాముపసంహారశబనమ్ ।
అనాగతానాం సంఘానాం ప్రభూణాం చోపవర్ణనమ్ ॥
భౌత్యస్యాంతే కలియుగే క్షీణే సంహారవర్ణనమ్ ।
నైమిత్తికాః ప్రాకృతికాః యదైవాత్యంతికాః స్మృతాః ।
వివిధః సర్వభూతానాం కీర్త్యతే ప్రతిసంచరః ।
అనాదృష్టిర్భాస్కరస్య మౌర సంవర్తకానలః ॥
సాంఖ్యే లక్షణముద్దిష్టం తతో బ్రహ్మ విశేషతః ।
భువాదీనాం చలోకానాం సప్తానాం చోపవర్ణనమ్ ॥
అపరార్థాపరైశ్చైవ లక్షణం పరికీర్యతే ।
బ్రహ్మణో యోజనాగ్రేణ పరిమాణవినిర్ణయః ॥
తరువాత దేవాసుర విచేష్ఠితములు “జయంతి” తో సహా శుక్రుడు నిర్దేశించి చెప్పుట, (130) మహాత్ముడు బుద్ధిమంతుఁడయిన శుక్రుడు ఇంద్రుని రూపమున రాక్షసులను మోహపెట్టెను; మహాద్యుతి మంతుడయిన బృహస్పతి శక్రుని శపించెను. మొదలగునట్టివి, (131) విష్ణువు యొక్కమాహాత్యము, విష్ణుని జన్మాదికములు చెప్పబడినవి. దౌహిత్రుఁడయిన తుర్వసుడు, యదువునకు చిన్నవాఁడయ్యెను. తరువాత అనుద్రుహ్యాదు లయిన నృపులందరాతనీ తనయులయిరి. వారందరు వారీ యనువంశ్యులు, మహాత్ములు, పార్థివ సత్తములు. (133) వీరందరు కీర్తింపబడిరి. అధిక ద్రవ్య తేజుడయిన విప్రర్షియొక్క ఆతిథ్యము సప్తవిధములయిన ధర్మము నాశ్రయించి యుండుట, సూర్యవర్యులచే బృహస్పతియొక్క శాపము సముపాహరింపబడుటయు, హరవంశము యొక్క స్వల్పకథనము, శంతనుని యొక్క శౌర్యకథనము (135) రాబోవు రాజులయొక్క యుపసంహారకథనము, అనాగతములయిన సంఘముల యొక్క ప్రభువులయొక్క వర్ణనము (136) భూతములు నశింపఁగా కలియుగము . క్షీణింపగా సంహార వర్ణనము, సైమిత్తికములు, ప్రాకృతీకములు, ఆత్యంతికములు వర్ణింపబడినవి. (137) సర్వభూతముల యొక్క సంచారము, శాసించుటకు ధర్షించుటకు శక్యముకాని, భాస్కరునియొక్క ప్రళయకాలాగ్ని, (138) సాంఖ్యశాస్త్రమున లక్షణము, విశేషముగా బ్రహ్మముగూర్చి, సప్తభువనముల యొక్క లోకములయొక్క వర్ణనము (189) దోషమాచరించిన వారియొక్క దోషమాచరింపని వారియొక్క లక్షణములు బ్రహ్మయొక్క యోజన ప్రమాణముల పరిమాణ నిర్ణయము వర్ణింపబడినవి.
కీర్యస్తే చాత్ర నిరయాః పాపానాం రౌరవాదయః ।
సర్వేషాం చైవ సత్వాసం పరిణామవిర్ణయః ॥
బ్రహ్మణః ప్రతిసంసర్గాత్ సర్వసంసారపర్ణనమ్ ।
గతిరూఢమధశ్చాక్తా ధర్మాధర్మసమాశ్రయా ॥
కలేకల్పే చ భూతానాం మహతామపి సంక్షయమ్ ।
అసంఖ్యయా చ దుఃఖాని బ్రహ్మణశ్చాష్యనిత్యతా ॥
దౌరాత్మ్యం చైవ భోగానాం సంహారస్య చ కష్టతా ।
దుర్లభత్వం చ మోక్షస్య వైరాగ్యాది దోషదర్శనాత్ ॥
వ్యక్తావ్యక్తం పరిత్యజ్య సత్వం బ్రహ్మణి సంస్థితమ్ ।
నానాత్వదర్శనాచ్ఛుద్ధస్తవస్తత్ర నివర్తతే ॥
తతస్తాపత్రయాత్. లీతో రూపార్థో హి నిరజంనః ।
ఆనందం బ్రహ్మణః ప్రాప్య న బిజేతి కుతశ్చన ॥
కీర్త్యతే చ పునః సర్గో బ్రహ్మజోలిన్యస్య పూర్వవత్ ।
కీర్యస్తే జగతశ్చాత్ర సర్గప్రలయవిక్రియాః ॥
ప్రవృత్తయశ్చ భూతానాం ప్రసూతానాం ఫలాని చ ।
కీర్యతే ఋషివర్గస్వ సర్గః పాపప్రణాశనః ॥
ప్రాదుర్భావో వసిష్ఠస్య శక్తీర్జన్మ తథైవ చ ।
సౌదాసార్థిగ్రహశ్చాస్య విశ్వామిత్రకృతేన తు ॥
పరాశరస్యచోత్పత్తి రదృశ్యంత్యాం తథా విభో ।
సంజజ్ఞే పితృకన్యాయాం వ్యాసశ్చాపి మహామునిః ॥
శుకస్య చ తథా జన్మ సహపుత్రస్య ధీమతః ।
పరాశరస్య ప్రద్వేషో విశ్వామిత్రఋషీం ప్రతి ॥
పాపులకు రౌరవాదులయిన నరకములు, సర్వజీవులకు పరిణామ నిర్ణయము, (141) బ్రహ్మయొక్క సృష్టిచే జనన మరణాత్మకమయిన సంసారము, ధర్మాధర్మముల నాశ్రయించియున్నఁ గలుగు ఊర్ధ్వాధోగతులు, (142) ప్రతికల్పమునందు గొప్ప భూతముల యొక్క సముదాయము కలుగుట, అసంఖ్యాకములయిన దుఃఖములు, బ్రహ్మకు కూడ నీత్యత్వము లేకపోవుట (143) భోగముల యొక్క దౌత్యము, వాని యుప సంహారము నందలి కష్టము వైరాగ్యము నొంది వస్తువు నందలి దోష దర్శనము వలన మోక్షము కలుగుట, ఆ మోక్షము యొక్క దుర్లభత్వము, (144) వర్ణింపబడును. వ్యక్తి వ్యక్తములను పరిత్యజించి. సత్త్వము (ఆజన్మసిద్దమయిన బలధైర్యాదులు) బ్రహ్మయందు సుస్థితమై యుండుట, వర్ణింపబడును. నానాత్వమును (అనేక జంతువులుగా పుట్టి మరణించుటలు కనుగొనినందున) శుద్దమయిన స్తుతి తొలగిపోవును. (145) తరువాత ధనపుత్రదారేషణలను తాపత్రయము వలన నిరంజనుఁడు (ఎట్టిదోషములు లేనివాఁడు - పవిత్రుఁడు) రూపమును గోరును; బ్రహ్మ వలన ఆనందము నొంది యెవరివలనను ఎందును భీతి నొందడు. (146) వేటిక బ్రహ్మ యథా పూర్వము మరల సృజించుట, జగత్తు యొక్క సృష్టి ప్రళయములు కీర్తింపబడును. (147) భూతముల యొక్క ప్రవృత్తులు (ప్రవర్తించు విధానములు) ఫలముల యొక్క ప్రభావము, పాపముల నాశనము చేయు ఋషి సముదాయము యొక్క సృష్టి వర్ణింపబడును. (148) శక్తికి వసిష్ఠుఁడు పుట్టుట, విశ్వామిత్రుడు కారణముగా వశిష్ఠునకు సౌదాసాస్టిగ్రహములు కలుగుట. అదృశ్యంతీ శక్తి భార్య. ఆమె గర్భవతిగా నుండగా నొక రాక్షసుఁడామెను మ్రింగెను. తరువాత పరాశరుం డొమెకు పుట్టెను. అదృశ్యంతి యందు పరాశరుఁడు వసిష్ఠునకు పుట్టుట, పరాశరునికి కన్యక యందు వ్యాసమహాముని పుట్టుట, ఆ వ్యాసునకు తరువాత శుకుఁడు కలుగుట, విశ్వామిత్ర ఋషి యందు పుత్రునితో సహితముగా పరాశరునకు ద్వేషము కలుగుట.
వసిష్టసంభృతిశ్చాగ్నేర్విశ్వామిత్రజిఘాంసయా ।
దేవేన విధినా విప్ర విశ్వామిత్రహితైషిణా ॥
సంతాన హేతోర్విభునా గీర్ణస్కంధేన ధీమతా ।
ఏకం వేదం చతుష్పాదం చతుర్దా పునరీశ్వరః ॥
తథా బిభేద భగవాన్ వ్యాసః శార్వాదనుగ్రహాత్ ।
తస్య శిష్యప్రశిషైశ్చ శాఖా వేదాయుః కృతాః ॥
ప్రయోగే ప్రహ్వలో నైవ యథా దృష్టః।
స్వయంభువా ఓ పృష్టవంతో విశిష్టాస్తే మునయో ధర్మకాంక్షిణః॥
దేశం పుణ్యమభీప్సంతో విభునా తద్దితైషిణా ।
సునాభం దివ్యరూపాభం సప్తాంగం శుభశంసనమ్॥
ఆనెపమ్యమీదం చక్రం వర్తమానమతండ్రితాః ।
పృష్ఠతో యాత నీయస్తతః ప్రాప్స్యథ పాటితమ్॥
గచ్ఛతస్తస్య చక్రస్య యత్ర నేమిర్విశీర్యతే ।
పుణ్యః స దేశో మన్తవ్యః ప్రత్యువాద తదా ప్రభుః॥
ఉక్త్వా చైవమృషీన్సర్వానదృశ్యత్వముపాగమత్ ।
గంగాగర్భం యజొహారా నైమిషేయాస్తథైవ చ ॥
ఈశీరే చైవ సత్రేణ మునయో నైమిషే తదా ।
మృతే శరద్వతి తథా తస్య చోత్థాపనం కృతమ్ ।
ఋషయో నైమిషేయాశ్చ రయయ పరయా యుతః ॥
నిఃసీమాంగామిమాం కృత్వా కృష్ణం రాజానమాహరత్ ।
ప్రీతిం చైవ కృతాతిథ్యం రాజానం విధివత్తదా ॥
విశ్వామిత్రుని చంపవలయునని వసిష్ఠుఁడగ్ని సంధానము చేయుట, విశ్వామిత్రుని హితైషియైన దేవవిధిచే (నది తప్పుటయు)(152) సంతానము కొఱకు ధీమంతుఁడు గీర్ణస్కంధుఁడు నైన వ్యాసునిచే చతుష్పాదమయిన ఏకవేదమును ఈశ్వరానుగ్రహముచే భగవానుడయిన వ్యాసుఁడు నాలుగు భాగములుగా విభజించెను. (153) ఆతని శిష్యులచే ప్రశిష్యులచే వేదశాఖలు అయుత సంఖ్యగా జేయబడినవి. (154) స్వయంభువుఁడైన బ్రహ్మచే చూడబడినట్లు ధర్మమును కాంక్షించు మునులు ప్రయోగమునందు విధేయులు, సంతుష్టవంతులు. విశిష్ఠులు. (155) దేశమునకు హితమునుకోరు ఆ ప్రభువైన వ్యాసునిచే సుసాభము, దివ్యరూపము గలిగినది, సప్తాంగము, శుభమును సూచించునట్టిదీ, ఉపమింప వీలుకానిదియు, నయిన చక్రము పరివర్తించుచుండ, జాగరూకత వహించి, దానిని వెన్నంటి ప్రయాణింప నిశ్చయులయిన మహరులు ఛిన్నమైన దానిని చేరిరి, (157) అప్పుడు వ్యాస భగవానుఁడు, పరివర్తించుచు పోవుచున్న ఆ చక్రము నేమి (పట్టా - చక్రమునకు వేసెడు ఇనుప పటా) యే దేశమున నేలపడునో ఆ దేశము పుణ్యమయినదని యెంచవలయునని చెప్పెను. (158) ఈ విధముగా ఋషులకుఁజెప్పి వ్యాసుఁడు అంతర్జానుఁడయ్యెను. యవాహారులు నైమీషీయులు నయిన ఋషులు గంగా (గర్భం)తీరమున యజ్ఞము (సత్రము)ను నైమిషము సందు చేయు సమర్థులయిరి, (159,160) శరద్వతీనది నష్టముకాగా దానిని నైమీషమునందున్నవారు, పరమ దయాపరులునయిన ఋషులు ప్రత్యుత్థానము చేసిరి. తిరిగి ప్రవహింప జేసిరి. (161) ఆ భూమిని నిస్సీమముగా అతివిస్తారముగాజేసి, రాజయిన కృష్ణుని తీసికొని వచ్చిరి. ప్రీతీతో - విధివంతముగా రాజునకాతిథ్య మొసంగిరి.
అన్తః సర్గగతః క్రూరః స్వర్భానురసురో హరన్ ।
ద్రుతే రాజని రాజాను మద్రతే మునయస్తతః ॥
గంధర్వరక్షితం దృష్ట్వా కలాపగ్రామకేతనమ్ ।
సన్నిపాతః పునస్తస్య తథా యజ్ఞే మహర్షిభిః॥
దృష్ట్వా హిరణ్మయం సర్వం విపాదస్తస్య తైరభూత్।
తదా వై నైమిషేయాసాం సత్రే ద్వాదశవార్షికే ॥
తథా వివదమనైశ్చ యదుః సంస్థాపితశ్చ తైః ।
జనయిత్వా త్వరణ్యం వైయదుపుత్రమథాయుతమ్॥
సమాపయిత్వా తత్పత్తం పోయుం తే పర్యుపాసత ।
ఇతి కృత్యసముద్దేశః పురాణాంశోపవర్జితః ॥
అనేనానుక్రమేణేవ పురాణం సంప్రకాశతే ।
సుఖమర్థః సమాసేన మహానప్యుపలక్ష్యతే ॥
తస్మాత్సమాసముద్దిశ్య వక్ష్యామి తవ విస్తరమ్ ।
పాదమాద్యమిదం సమ్యగ్ యోధీతే విజితేంద్రియః ॥
తేనాధీతం పురాణం స్యాత్సర్వం నాస్త్యత్ర సంశయః ।
యో విద్యాచ్చతురో వేదాన్ సాంగోపనిషదాస్ ద్వీజః॥
ఇతిహాసపురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ ।
విభేత్యల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరీష్యతి ॥
అభ్యసన్నిమమధ్యాయం సాక్షాత్రోక్తం స్వయంభువా ।
నాపదం ప్రాప్య ముహ్యేత యథేషాం ప్రాప్నుయాద్గతిమ్ ॥
యస్మాత్పురా హ్యభూచ్ఛైతత్పురాణం లేన తత్సృతమ్ ।
నీరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే ॥
అతశ్చ సంక్షేపమిమం శ్రుణుధ్వం నారాయణః సర్వమిదం పురాణమ్ ।
సంసర్గ కాలేపి కరోతి సర్గం సంహారకాలే చ న వాస్తి భూయః॥
ఇతి శ్రీబ్రహ్మాండమహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ప్రథమే ప్రక్రియాపాదే కృత్యసముద్దేశో నామ ప్రథమోధ్యాయః॥
ఆతిథ్యాదికములయిన యనంతరము సర్గగతుఁడు క్రూరుఁడు రాక్షసుఁడునైన స్వర్భానుఁడు (రాహువు) వెంటనే రాజును హరింప, రాజాను రక్తులయిన మునులంతట (163) (కలాపము = ఒక భూషణము; 25 పేటలు గల స్త్రీల యొడ్డాణము) అట్టి స్త్రీ భూషణ సముదాయము పతాకగా గలది గంధర్వులచేత సురక్షితమైనదియు దానిని (మునులు) చూచిరి; ఆ రాజు అందు పడుట జూచిరి. యజ్ఞము నందు ఋషులచే సర్వము హిరణ్మయముగా చూడబడ, దానిని గూర్చి వారికి వివాదము కలిగెను. నైమిషమునందున్న వారు ద్వాదశవర్ష సత్రము నందు (165) వివాద మొందు వారిచే యదువు సంస్థాపింపబడెను. యదు పుత్రుడయిన అయుతుని సృజించి (166) (ఆ ఋషులు) తత్సత్రమును సమీపించి వాయుదేవుని వారుపాసించిరి. ఇట్లు పురాణ నిర్మాణ ప్రయోజనాంశములు వర్ణింపబడినవి. (167) ఈ విధముగానే సుబోధకరమైన అర్థముతో గొప్పదియైనను సంక్షేపముగా నిరూపింపబడును. ప్రకాశించును. (168) అందుచే తత్సమాసము (సంక్షేపకథనము) నుద్దేశించి తరువాత విస్తరముగ చెప్పెదను. ఇది మొదటిపాదము. దీనినెవ్వడు విజితేంద్రియుఁడై (169) చక్కగా నధ్యయనము చేయునో, అతనిచే నీపురాణమంతయు సమగ్రముగా న ధీతమయినది కాగలదు. ఇందు సంశయము లేదు. సాంగోపాంగముగా ఉపనిషత్సహితముగా నాల్లువేదములను సమ్యక్కుగా నధ్యయనము చేసి యెటింగీన ద్విజుడు(లు) ఇతిహాస పురాణ సహితముగా వేదమును చక్కగా వివరింపవలయును. వేదములయెడ అల్పజ్ఞానము గలిగిన వాని వలన “అయ్యో । ఈతఁడు నన్నపాహరించునే” యని వేదము భయమొందును. (171) స్వయం భువుఁడైన బ్రహ్మచే సాక్షాత్రోక్తమయిన యీ యధ్యాయమును అధ్యయనముచేసి ఎవ్వడు ఆపదనొంది బాధపడడు సరికదా యథేచ్చా బద్దమయిన సద్ధతిని పొందును. (172) ఈ విధముగా నీ పురాణము పూర్వము జరిగినది, ఇయ్యది వేదాంతమయిన నిరుక్తతుల్యమయిన దనియు దీనిని తెలిసి సంస్మరించినవాఁడు సర్వపాపముల నుండి విముక్తుడగును. (173). అందుచే సంక్షేపముగా చెప్పబడిన యీ పురాణమును ఆలకింపుఁడు. ఈ పురాణమంతయు నారాయణుఁడే. సంసర్గ (జనన) కాలమందైనను సర్గమును పొందును; సంహార కాలము నందిది మరల కలుగదు.
వాయుప్రోక్తమయిన బ్రహ్మాండపురాణమునందు ప్రక్రియాపాదమయిన ప్రథమభాగము గ్రంథ సముద్దేశము నాబడు, ప్రథమాధ్యాయము సమాప్తము.
Summary of chapter 1 of the Brahmānda Mahā Purana is as follows:
This sacred opening chapter gracefully bows to the supreme creator and introduces the glorious scope of the divine text. It humbly recounts how the primordial lord Brahmā originally revealed this cosmic knowledge, which was subsequently passed down through illustrious sages like Vasishtha and Vyāsa. The devout narrative then unfolds at the holy sacrificial gathering where the venerable sage Lomaharshana is respectfully approached by the earnest Ṛshis, setting the stage for the recitation of the eternal mysteries of the cosmos and the divine paths of righteousness.