2 - ద్వితీయాధ్యాయము

ప్రత్యవోచచన్పునః సూతమృషయస్తే తపోధనాః ।

కుత్ర సత్రం సమభవత్తేషామద్భుతకర్మణామ్ ॥

కియస్తం చైవ తత్కాలం కథం ఛ సమవర్తత ।

ఆచచక్షే పురాణం చ కథం తత్సప్రభంజనః ॥

ఆచభ్యౌ విస్తరేణేవ పరం కౌతూహలం హీనః ।

ఇతి సంచోదితః సూతః ప్రత్యువాచ శుభం వచః ॥

శ్రుణుధ్వం యత్ర తే ధీరాః మేనిదే సత్రముత్తమమ్ ।

యావత్తం చాగవత్కాలం యథా చ సమవర్తత ॥

సిసృక్షమాణీ విశ్వం హి యజతే విసృజత్పురా ।

సత్రం హి తేఽతి పుణ్యం చ సహస్రపరివత్సరాన్ ॥

తపో గృహపతేర్యత్ర బ్రహ్మా చైవాభవత్స్వయమ్ ।

ఇడాయా యత్ర పత్నీత్వం శామీత్రం యత్ర బుద్ధిమాన్ ॥

మృత్యుశ్చక్రే మహాతేజాస్తస్మిన్ సత్రే మహాత్మనామ్ ।

విబుధాశ్చాషిరే తత్ర సహస్రపరివత్సరాన్ ॥

భ్రమతో ధర్మచక్రస్య యత్ర నేమిరశీర్యత ।

కర్మణా తేన విఖ్యాతం నైమిషం మునిపూజితమ్ ॥

తపోధనులయిన యా మునీశ్వరులు సూతుని గూర్చి మరల నడిగిరి- “అద్భుతక్రియా సంపన్నులయిన వారి సత్రయాగము ఎక్కడ జరిగినది? ఎంతకాలము జరిగినది? ఏ విధముగా జరిగినది? వాయదేవుఁడయిన (ప్రభంజనుఁడు) ఆ పురాణము ఎట్లు చెప్పెను. (2) దానిని వినవలయునని మాకు చాల కుతూహలముగా నున్నది”. ఆని ప్రచోదింపబడి మంగళకరమయిన వాక్యమునీట్లు పలికెను. (3) ఆ బుద్దిమంతులెల్లరేచ్చట యజ్ఞము నాచరించుటయుత్తమమయి నదీగాఁదలఁపోసిరో, ఎంత కాలమాయాగము జరిగినదో, అయ్యాగమెట్లు ప్రవర్తమానమైనదో వినుఁడు. (4) పూర్వము బ్రహ్మ విశ్వమును సృజింపదలచి సత్రయాగమును సహస్ర వంపూర్ణ సంవత్సరములు చేసెనో యది ఆతీ పుణ్యమయినది. (5) అచ్చట బ్రహ్మ స్వయముగా తపో గృహపతి యాయెను (యజమాని యయ్యెను) 'ఇడ' పత్నీత్వ మొందెను, బుద్ధిమంతుఁడయిన బ్రహ్మ మృత్యువును శామిత్రము నొనర్చెను. (శామీత్రమనఁగా యజ్ఞమున పశువును బంధించుట, లేదా యజ్ఞసంబంధమయిన యొక పాత్ర). (6) ఆ మహాత్ముల యజ్ఞమునందు దేవతలు (విబుధులు) సహస్ర సంపూర్ణవర్షములుండిరి. (7) భ్రమించుచున్న ధర్మచక్రము యొక్క నేమి (పట్టా) యెచ్చట పడెనో అయ్యదియే మునిజన పూజిత మయిన ప్రఖ్యాత నైమిషమయినది. (8)

యత్ర సా గోమతీపుణ్యా సిద్దచారణసేవితా ।

రోహిణీ స సుతా తత్ర గోమతీ సా భవత్ క్షణాత్ ॥

శక్తిర్ణ్యేష్థా సమభవద్వసిష్ఠస్య మహాత్మనః ।

అరుంధత్యాః సుతాయాత్రాదానముత్తమతేజసః ॥

కల్మాషపాదో నృపతిర్యత్ర శక్తశ్చ శక్తినా తత్ర ।

వైరం సమభవద్విశ్వామిత్రవసిష్ఠయోః ॥

అదృశ్యంత్యాం సమభవన్మునిర్యత్ర పరాశరః ।

పరాభవో వసిష్ఠస్య యస్య జ్ఞానే హ్యావర్తయత్ ॥

తత్ర తే మేనిదే శైలం నైమిషే బ్రహ్మవాదినః ।

నైమిషం జజ్ఞిరే యస్మాన్నేమిషీయాస్తతః స్మృతాః ॥

తత్పత్తమభవత్తేషాం సమా ద్వాదశ ధీమతాం ।

పురూరవసి వీక్రాస్తే ప్రశాసతి వసుంధరామ్ ॥

అష్టాదశ సముద్రస్య ద్వీపానశ్నన్ పురూరవాః ।

శుతోష నైవ రత్నానాం లోభాదితి హి నః శ్రుతమ్ ॥

ఊర్వశీ చకమే తం చ దేవదూతప్రచోదితా ।

ఆజహార చ తత్సత్రముర్వశ్యా సహ సంగతః ॥

తస్మిన్నరపతో సత్రే నైమిషీయాః ప్రచరే ।

యం గర్భం సుపువే గంగో పొదకాధీప్తతేజసమ్॥

తత్తుల్యం పర్వతే న్యస్తం హిరణ్యం సమపద్యత ।

హిరణ్మయం తతశ్చక్రే యజ్ఞవాటం మహాత్మనామ్ ॥

విశ్వకర్మా స్వయం దేవో భావనో లోకభావనః ।

స ప్రవిశ్య తతః సత్రే తేషామమితతేజసామ్ ॥

సిద్దులచే చారణులచే సేవితమైన పుణ్యప్రదమైన గోమతీ యుండెనో స్వసుతతో గూడిన రోహిణి యచ్చట గోమతిగా క్షణములో నయ్యెను. (9) మహాత్ముడు, ఉత్తమ తేజస్వి యయిన వశిష్ఠునకు అరుంధతివలన శక్తి యాత్రాదానముగా జ్యేష్ట సుతుడుగా నయ్యెను. (10) ఇంద్రుని యొక్క శక్తితో నేచ్చట కల్మషపాద నృపతికీ వైరము కలిగెనో యచ్చటనే విశ్వామిత్ర వసిష్ఠులకు వైరము కలిగెను. (11) అదృశ్యంతి యందు ఎచ్చట పరాశరముని పుట్టెనో అక్కడ వసిష్ఠునకు జ్ఞానమున పరాభవము కలిగెను. (12) బ్రహ్మవిదులు నైమిషము నందు శైలము నొకదానిని తలంచిరి. నైమిషమున పొరుండిరి. అందుచేతనే తరువాత నైమిషేయులు అని గుర్తింపబడిరి. (13) పరాక్రమవంతుఁడయిన పురూరవుడు భూమిని పాలీంచుచుండ, ఆ నైమిషీయులను మహాత్ములకు పండ్రెండువత్సరములు అచ్చట సత్రము జరిగెను. (14) పురూరవుడు అష్టాదశ సముద్రముల యందలి ద్వీపముల ననుభవించుచు, రత్న లోభమువలన సంతోషము పొందలేదని మేము వింటిమీ. (15) దేవదూత ప్రచోదితమయిన యూర్వశీ ఆ మహారాజును కామించేను. ఊర్వశితో కూడీ యాతఁడే సత్రమును హరించేను. (16) నైమీషీయులు నరపతీ మయన పురూరవునితో సత్రమాచరించిరి. పావకుని వలన గంగ ప్రకాశవంతమయిన బిడ్డను గనెను. (17) కొంత శుక్షమును పర్వతకూటము నందుంచెను. తత్తుల్య యయిన హిరణ్యము కలిగెను. తరువాత విశ్వకర్మ. యజ్ఞవాటిని హిరణ్మయముగా చేసెను. స్వయంభు వుఁడు, లోకభావనుఁడు విశ్వకర్మ (బ్రహ్మ) ఆ తేజస్వంతుల యొక్క యజ్ఞమును ప్రవేశించీ

 ఐడః పురూరవా భోజే తం దేశం మృగయా చరన్ ।

తం దృష్ట్వా మహదాశ్చర్యం యజ్ఞవాటం హిరణ్మయమ్ ॥

లోజేన హతవిజ్ఞానస్తదా దాతుముపాక్రమత్ ।

నైమిషేయాస్త్రతస్తస్య చక్షుధురపతిం భృశమ్ ॥

నిజఘ్నుశ్చాపి తం క్రుద్ధాః కుశవజెర్మనీషిణః ।

తపోనిషాశ్చ రాజనం మునయో దేవచోదితాః ॥

కుశషజై ర్వినిషిష్ఠః స రాజా వ్యజహాన్ తనుమ్ ।

ఓర్వశయై ప్రతస్తస్య యుద్ధం చక్రే నృసో భువి ।

నహుషస్య మహాత్మానం పితరం యం ప్రచక్షతే ।

స ష్వవభృథీష్వేవ ధర్మశీలో మహీపతిః ॥

ఆయురాయభవాయాగ్యమస్మిన్ సత్రే నరోత్తమః ।

శాంతయిత్వా తు రాజాసం తదా బ్రహ్మవిదస్తథా ॥

సత్రమారేభిరే కర్తుం పృథ్వీవత్పాత్మమూర్తయః ।

బభూవ సత్రే తేషాం తు బ్రహ్మచర్యం మహాత్మనామ్ ॥

విశ్వం సిసృక్షమాణానాం పురా విశ్వసృజామివ ।

వైఖానసైః ప్రియసఖైర్వాలఖిలైర్మరీచిభిః ॥

అజైశ్చ మునిభిర్జాతం సూర్యవైశ్వానరప్రభః ।

పితృదేవాప్పరఃసిద్ధార్గంధర్వోరగచారణే:

భారతైః శుశుభే రాజా దేవైరింద్రసమో యథా ।

స్తోత్రశస్రః గృహైర్దేవానీతనిత్యైశ్చ కర్మభిః ॥

ఆనర్చుః స్మ యథాజాతి గంధర్వాదీన్ యథావిధి ।

ఆరాధనే స సస్మార తతః కర్మాంతరేషు చ॥

ఇడ కుమారుఁడు పూర్వరవుడు. వేటకై చరించుచు ఆ ప్రదేశమును చేరెను, ఆశ్చర్య కారణము హిరణ్మయము నయిన యజ్ఞవాటికను చూచీ, విజ్ఞానము నశించగా లోభగుణముచే ఆ హీరణ్యమును గ్రహింప నా రాజు ప్రారంభించెను. నైమిషీయులయిన మహరులు ఆ రాజు నేడ నధికముగా కోపించిరి. (21) తపస్సు నందు నిష్ణులయినవారు బుద్ధిమంతులు దేవచోదితులు నయిన మునులు క్రుదులై కుశవజ్రములచే నా రోజును చంపిరి. (22) కుశవజ్రములచే చితుకగొట్టబడి యారాజు తనువును వీడెను. తరువాత ఊర్వశీ పుత్రులు మునులతో భువీయందు యుద్ధము చేసిరి. (28) ఎవనిని నహుషుని మహాత్ముడైన తండ్రిగా చెప్పుదురో ఆతఁడు ధర్మశీలుఁడు, మహీపతి; అనేకములయిన యజ్ఞము లొనరించి అవభృథస్నానములనేకము లాచరించినవాడు. (24) (ఆయువు - పురూరవునకు ఊర్వశీకి పుట్టిన కుమారుఁడు). ఆతడచ్చటికి , వచ్చెను. ఊర్వశీ కుమారులు భయపడి పలాయనము చిత్తగించిరి. రాజును శాంతపరచి, తరువాత బ్రహ్మవిదులయిన, మహర్పులు (25) పృథ్వీ వలె వత్సాత్మభూతులయినవారు, సత్రము నాచరించుటకు ఆరంభించిరి. ఆ మహాత్ముల కాయాగములో బ్రహ్మచర్యము కలిగెను. (26) పూర్వము విశ్వమును సృజించు కోరిక గలిగిన వీశ్వసష్టలవలె వైఖానసులతో, ప్రియ సఖులతో, వాలఖిల్యులతో, మరీచులతో, అజులతో, మునులతో నచ్చట సూర్యునియొక్క అగ్నియొక్క ప్రభవం కాంతి పుట్టెను. (27) పితృదేవతలు, అప్సరసలు, సిద్దులతో, గంధర్వులతో, ఉరగులతో, చారణులతో, భారతులతో, రాజు దేవేంద్రుఁడు వెళ్లినట్లే ప్రకాశించెను. స్తోత్ర శస్త్రములచేత గృహములచేత దేవతలను, పితృకర్మలచే పితరులను, ఆయా జాతులను గంధర్వులను వారివారి జాత్యుచిత విధిని ఆరాధించిరి. ఆరాధనమునకు తరువాత కర్మాంతరముల యందును వారినిస్మరించిరి.

జగుః సామాని గంధర్వా ననృతుశ్చాపురోగణాః ।

వ్యాజహుర్మునయో వాచం చిత్రాక్షరపదాం శుభామ్ ॥

మంత్రాది తత్ర విద్వాంసో జజపుశ్చ పరస్పరమ్।

వితండావచనైశ్చైవ నిజఘ్నుః ప్రతివాదినః ॥

ఋషయశ్చైవ విద్వాంసః శబ్దార్థన్యాయకోవిదాః ।

న తత్ర హారీతం కించిద్వివీశుః బ్రహ్మరాక్షసాః ॥

నైవ యజ్ఞహరా దైత్యా నైవ వాజముఖాస్త్రియః ।

ప్రాయశ్చిత్తం దరిద్రం చ న తత్ర సమజాయత॥

శక్తిప్రజ్ఞా క్రియాయోగైర్వివిధాశీష్వనుష్ఠితః ।

ఏవం చ వవృదే సత్రం ద్వాదశాబ్దం మనీషిణామ్ ॥

ఋషీణాం నైమిషీయాణాం తదభూదివ వజ్రణః ।

వృద్ధాద్యా ఋత్విజో వీరా జ్యోతిషోమాన్ పృథక్ పృథక్ ॥

చక్రిరే పృష్ఠగమనాః సర్వానయుతదక్షిణాన్ ।

సమాప్తయణో యస్తే వాసుదేవం మహాధిపమ్ ॥

ప్రప్రచ్ఛురమితాత్మానం భవద్భిర్యదహం ద్విజః ।

ప్రచోదితః స్వవంశాఢం స చ తానబ్రవీత్ ప్రభుః ॥

శిష్యః స్వయంభువో దేవః సర్వం ప్రత్యక్షదృగ్వశీ ।

అణిమాదిభిరషాభిః సూక్ష్మారంగై స్సమన్వితః ॥

తిర్యగ్వాతాదిభిర్వర్తే సర్వాన్ లోకాన్ బిభర్తి యః ।

సప్తస్కంధా భృతాః శాఖాః సర్వతోమాజరాజరాన్ ॥

విషయైర్మరుతో యస్య సంస్థితాః సప్తసప్తకాః ।

వ్యూహత్రయాణాం సూతానాం కుర్వన్ సత్రం మహాబలం ॥

గంధర్వులు సోమములను పాడిరి; అప్సరోగణములు నృత్యము చేసిరి. చిత్రములయిన అక్షరములతో పదములతోగూడి శుభంకరమైన వాచమును మునులు చెప్పిరి. (31)అచ్చట విద్వాంసులు మంత్రాదులను పరస్పరము జపించిరి; ప్రతీవాదులను వితండవచనములచే చంపిరి. (52) ఋషులును విద్వాంసులు, వ్యాకరణ శాస్త్రము నందు న్యాయ (తర్క శాస్త్రము నందు విద్వాంసులు. అచ్చటేదియును దొంగలింపబడలేదు; మతి' బ్రహ్మరాక్షసులు ప్రవేశింపలేదు. (33) యజ్ఞమును హరించెడు దైత్యులు లేరు; వాజముఖలయిన స్త్రీలు లేరు. ప్రాయశ్చిత్తముకాని యెట్టి వస్తువు యొక్క అభావము కాని యిచ్చట లేదు. (34) శక్తి, ప్రజ్ఞ, క్రియ, యోగము మొదలయిన వివిధములయిన ఆశీస్సులు అనుష్ఠింపబడినవి. ఆ మహా మేధావుల యజ్ఞము/పండ్రెండు సంవత్సరములీ విధముగా వృద్ధిపొందినది. (35) పృష్ఠగమనాః : అనుసరించవచ్చువారు అయుత దక్షిణాః - (Undesturbed) అచంచల ప్రజ్ఞకలవారు : పూర్వమీంద్రునికివలే, నైమిషారణ్యమందలి ఋషులకు, పండితులు, పాండిత్య వృద్దులు, ఆద్యులు, వీరులు, ఋత్విజుల యిరి; వారు సుప్రతిష్ఠిత ప్రజ్ఞగల వారలను జ్యోతిమ మాచరించిన వారలను వేరువేరుగా వారి ననుసరించు నట్టి వారినిగా జేసిరి. (37) యజ్ఞము సమాప్తమయినది; అమితాత్ముడు (సర్వజ్ఞుడు) మహాధీపుఁడు, నయిన వాసుదేవునిట్లు వారడిగిరి “స్వవంశాల్డమీ ద్విజుఁడు మీచే ఏ కారణమున ప్రచోదింపబడియెనో వివరింపుమని, ప్రభువయిన వాసుదేవుఁడు చెప్పెను. (38) స్వయంభువుడయిన శిష్యుడు, సర్వము ప్రత్యక్షముగా దర్శించువాఁడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు. అణీమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము మొదలుగా గల సూక్ష్మములయిన అష్టాంగములతోఁగూడి యున్నవాఁడు (33) చరాచర ప్రపంచము నంతటిని సప్తవిధ స్వకీయ రశ్ములను బంధించి యుండువాడు, ప్రతికూల పవనములచే సర్వలోకములను వర్షములచే భరించువాఁడు, భూతవ్యూహత్రయమును సర్వేంద్రియ వ్యాప్తిచే ధరించువాడు.

తేజసశ్చాప్యుపాయానాం దధాతీహ శరీరిణః ।

ప్రాణాద్యా వృత్తయః పంచ ధారణాసాం స్వవృత్తిభిః ॥

పూర్యమాణశ్శరీరాణాం ధారణం యస్య కుర్వతే ।

ఆకోశయోనిర్ద్విగుణః శబ్దస్పర్శసమన్వితః ॥

పాచోరణిః సమాభ్యతో శబ్దశాస్త్రవిచక్షణేః ।

భారత్యా క్షణయా సర్వాన్మునీనహోదయన్నివ ॥

పురాణజ్ఞాః సుమనసః పురాణాశ్రయుక్తయా ।

పురాణనీయతా విప్రాః కథామకథయద్విభుః ॥

ఏతత్సర్వం యథావృత్తమాఖ్యానం ద్వీజసత్తమాః 1

ఋషీణాం చ పరం చైతల్లోకతత్త్వమనుత్తమమ్ ॥

బ్రహ్మణో యత్పురా ప్రోక్తం పురాణం జ్ఞానముత్తమమ్ ।

దేవతానామృషీణాం చ సర్వపాపప్రమోచనమ్ ॥

విస్తరేణానుపూర్వ్యా చ తస్య వక్ష్యామ్యనుక్రమమ్ ॥

ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ప్రథమే ప్రక్రియాపాదే నైమిషాఖ్యానకథనం నామ ద్వితీయోధ్యాయః॥

            శరీరులకు తేజస్సంబంధి యుపాయములను కలుగజేయుపొండు, పంచ ప్రాణములను తమతమ వ్యాపారములచే నియమించువాఁడు పంచ ప్రాణవాయువులచే శరీరంబుల నింపి శరీరుల కాధారుడైనపోఁడు, శబ్దస్పర్శములను గుణద్వయముచే నౌకాశయోనీయే (43) శబ్ద శాస్త్రవేత్తలచే వాచోరణి యని. పీలువబడును. (44) మధురము మంజులము నయిన పొక్కుచే సర్వమునులను సంతోష పరచు వానివలె పురాణజులకు, దేవతలకు, పురాణము నాశ్రయించిన యుక్తులు (పలుకులు) కోరువారికి, పురాణ నియతులకు, విప్రులకు, ద్విజసత్తములకు పూర్వము జరిగినట్టిది ఉత్తమమైనది, ఋషులకు లోకతత్వము ననుసరించినది, బ్రహ్మచే జ్ఞానప్రదమయినదీ పూర్వమేట్లు చెప్పబడినదో, దేవతలకు, ఋషులకు సర్వ పాపప్రమోచమయినట్టిది, పూర్వము జరిగిన క్రమము ననుసరించి, ఆ కథలను నేను. మీకు చెప్పెదను, అని వాయువు పలికెను.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండపురాణమున పూర్వభాగమున ప్రథమ ప్రక్రియాభాగమున నైమిషాఖ్యాన కథనమను పేరుగల ద్వితీయాధ్యాయము.