45 - అధ్యాయము

 వసిష్ఠ ఉవాచ :-

తతః కదాచిద్విపినే చతురంగబలాన్వితః

 మృగయామగమచ్ఛూరః శూరసేనాదిభిః సహ

తే ప్రవిశ్య మహారణ్యం హత్వా బహువిధాన్ మృగాన్

 జగ్ముస్తృషార్రా మధ్యాహ్నే సరితం నర్మదామను

తత్ర స్నాత్వా చ పీత్వా చ పారి నద్యా గతశ్రమాః

గచ్ఛంతో దదృశుర్మార్గే జమదగ్నేరథాశ్రమమ్

దృష్ట్వాశ్రమపదం రమ్యం మునీనాగచ్ఛతః పథి

కసేదమితి ప్రప్రచుర్భావికర్మప్రచోదితాః

 తే ప్రోచురశాంతాత్మా జమదగ్నిర్మహాతపాః

వసత్యస్మిన్ సుతో యస్య రామః శస్త్ర భృంవరః

తద్రుత్వా భీరభూతేషాం రామనామానుకీర్తనాత్

క్రోధం ప్రసహ్యానృశంస్యం పూర్వవైరమనుస్మరన్

అథ తే ప్రోచురన్యోన్యం పితృహంతుర్వధాత్పితుః

 వైరనిర్యాతనం కిం తు కరిష్యామో దిశాధునా

ఇత్యుక్త్వా ఖడ్గహస్తాస్తే సంప్రవిశ్య తదాశ్రమమ్

ప్రజఘ్నిరే ప్రయాతేషు మునివీరేషు సర్వతః

తం హత్వాస్య శిరో హృత్వా నిషాదా ఇవ నిర్దయాః

ప్రయయుస్తే దురాత్మానః సబలాః స్వపురీం ప్రతి

పుత్రాస్తస్య మహాత్మానో దృష్ట్వా స్వపితరం హతమ్

పరివార్య మహారాజ రురుదుః శోకకర్శితాః

 భర్తారం నిహతం భూమౌ పతితం వీక్ష్య రేణుకా

 పపాత మూర్ఛితో సద్యో లతేవాశనివాడితా

సా స్వచేతన సంమూర్ఛ్య శోకపావకదీపితా

దూరప్రనష్టసంజైవ సద్యః ప్రాణెర్వ్యయుజ్యత

 అనాలంత్యాం తస్యాం తు సంజ్ఞాం యాతా హి తే పునః

 వ్యపతన్ మూర్ఛితా భూమౌ నిమగ్నాః శోకసాగరే

 తతస్తపోధనా యే న్యే తత్తపోవన వాసినః

సమేత్యాశ్వాసయామాసుః తుల్యదుఃఖాః సుతాన్మునే

వసిష్ఠుఁడిట్లనెను.

అంత, ఒకప్పుడు కార్తవీర్యుని కుమారులలో నొకఁడయిన శూరుఁడు (పూర్వము హిమాలయములకు పారిపోయిన యతఁడు) చతురంగ బలాన్వితుఁడయి శూరసేనాదులతో కలిసి మృగయార్థమరిగెను. అతఁడు మహారణ్యమును ప్రవేశించి, బహువిధములయిన మృగముల జంపెను. దాహ పీడితుఁడయి మధ్యాహ్న సయమున నర్మదానది కరిగెను. అందు స్నానమాడి నదీనీరములు త్రాగి గతశ్రముఁడయ్యెను. తిరిగిపోవుచు మార్గమధ్యమున జమదగ్ని యొక్క ఆశ్రమమును చూచెను. రమ్యమయిన ఆశ్రమ పదమును చూచి మార్గము నందు వచ్చుచున్న మునులను “ఇది యెవ్వరి ఆశ్రమమని అడిగెను. “ఇందు అతి శాంతాత్ముఁడు, మహాతపస్వి, జమదగ్ని పసించును, ఆతని కుమారుఁడు రాముఁడు. శస్త్రధారులలో నగణ్యుఁడు.” అని వారు చెప్పిరి. రాజానుయాయులు భావికర్మ ప్రచోదితులు. పరశురాముని గూర్చివీనిరి. రామ నామానుకీర్తన శ్రవణములు వారందరు భయాఖీభూతులైరి. వారు రామునితో పూర్వవైరము ననుస్మరించి యధిక క్రోధావిష్ణులైరి. వారలొండొరులతో సంప్రదించుకొనిరి. పితృహంత యొక్క వధ వలన వైర నిర్యాతన మేల చేయరాదు? చెప్పుడు’ అనీ పలికి ఖడ్గ హస్తులయి, వారు ఆశ్రమమును ప్రవేశించిరి. ఆ సమయమున మునివీరులందరు వివిధ ప్రదేశముల కరిగియుండిరి. జమదగ్నిని వారు చంపి, ఆతని శీర్షమును క్రూరులయిన నిషాదులవలె నిర్దయులయి అపహరించి, దురాత్ములగు వారు బలములతో గూడి స్వపురీ కరీగిరీ. జమదగ్ని కుమారులు హతు డయిన తండ్రిని చూచి శోకకర్శితులై చుట్టును మూగి రోదించరీ. జమదగ్ని భార్య రేణుక చంపఁబడి భూమిపై పడియున్న భర్తను చూచినది. వెంటనే పిడుగుపాటు నొందిన లతవలె మూర్ఛితురాలై నేలపడెను. చైతన్యము తొలఁగి ఆమె మూర్ఛనంది, శోకాగ్నిచే దీపితురాలయ్యెను. చైతన్యము పోయిన వారివలె సంజ్ఞానష్టయై వెంటనే ప్రాణములచే విముక్తురాలయ్యేను. మూర్ఛనుండి తేరుకొనిన పుత్రులు విలపింపక సంజ్ఞా దూరులై యుండిరి. వారందరు శోకసాగర నిమగ్నులై మూర్ఛనొంది నేలపై పడిరి. తరువాత వచ్చిన ఆశ్రమమునందున్న ఇతర తపోధనులు పుత్రులతో తుల్యదుఃఖము నొంది, వారల నాశ్వాసపరచిరి.

సాంత్వ్యమానా మునిగణైర్జామదగ్న్యా యథావిధి

 ఆధక్షుద్వచసా తేషామగ్నౌ పిత్రోః కలేవరే

చక్రురేవ తదూర్ధ్వం వై యత్కర్తవ్యమవంతరమ్

పిత్రార్మరణడుఃఖేవ పీడ్యమనా దీవానిశమ్

తతః కాలో గతే రామః సమానాం ద్వాదశావధౌ

నివృత్తస్తపసః సఖ్యా సహాగాదాశ్రమం పితుః

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమాభాగే సగరోపాఖ్యానే భార్గవచరితే పంచచత్వారింశత్తమోధ్యాయః

జమదగ్ని కుమారులందరు మునీశ్వరులచే యథావిధి నూరడింపఁబడిరి. వారిమాట ప్రకారము పితృకళేబరమును అగ్నిచే దహించిరి. తరువాత వారు చేయవలసిన ఉత్తరక్రియల నాచరించిరి. వారందరు పితృమరణదుఃఖమున దీవానిశలు పీడింపఁబడిరి. అంత పండ్రెండు వత్సరములు గడచిన తరువాత స్నేహితుఁడయిన అకృతవణునితో సహా రాముఁడు తపస్సు నుండి పిత్రాశ్రమమునకు తిరిగి వచ్చెను.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమున మధ్యమభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున సగరోపాఖ్యానమున భార్గవచరితలో నలువదియైదవ అధ్యాయము.