7 -  హయగ్రీ వాగస్త్యసంవాదే లలితో పాఖ్యానే స్తేయపానకథనం

ఇంద్ర ఉవాచ :-

భగవన్ సర్వమాఖ్యాతం హింసాద్యస్య తు లక్షణమ్

స్త్యేయస్య లక్షణం కిం వా తన్మే విస్తరతో వద

బృహస్పతీరువా`చ :-

పాపానామధికం పాపం హననం జీవజాతినామ్

ఏతస్మాదధికం పాపం విశ్వస్తే శరణం గతే

విశ్వస్య హత్వా పాపిష్ఠం శూద్రం వాప్యంత్యజాతికమ్

బ్రహ్మహత్యాధికం పాపం తస్మాన్నాస్త్యస్య నిష్కృతిః

బ్రహ్మజ్ఞస్య దరిద్రస్య కృచ్ఛార్జితధనస్య చ

బహుపుత్రకలత్రస్య తన జీవితుమిచ్ఛతః

తద్రవ్యస్తేయదోషస్య ప్రాయశ్చిత్తం న విద్యతే

విశ్వస్తద్రవ్యహరణం తస్యాష్యధికముచ్యతే

విశ్వస్తే వాష్యవిశ్వస్తే న దరిద్రధనం హరేత్

తతో దేవద్వీజాతీనాం హేమరత్నాపహారకమ్

యే హన్యాయవిచారేణ సోశ్వమేధఫలం లభేత్

గురుదేవద్విజసుహృత్పుత్రస్వాత్మసుఖేషు చ

స్త్యేయదధః క్రమేణేవ దశోత్తరగుణం త్వఘమ్

అంత్యజాత్పాదజాద్వైశ్యాష్ఠత్రియాద్రాహ్మణాదపి

దశోత్తరగుజై పాపైర్లిప్యతే ధనహారకః

అత్రైవోదాహరంతీమమితిహాసం పూరాతనమ్

రహస్యాతిరహస్యం చ సర్వపాపప్రాణాశనమ్

: లలితోపాఖ్యానమున స్త్యేయపానకథనము :

ఇంద్రుడనెను : ఓ భగవత్స్వరూపుడా ; హింసాదులలక్షణమంతయు సవిస్తరముగా జెప్పుము. బృహస్పతియనెను. పాపములకంటే యధికమైన పాపము జీవజాతుల జంపుట. దీని కంటే మించిన పాపము విశ్వసించి శరణము (రక్షణము) వేడి వచ్చిన వానిని జంపుట-2 అంత్యజాతీకుడై పాపిష్టుడైన శూద్రుని రక్షించెదనని నమ్మించి చంపినచో బ్రహ్మహత్య కన్న మీంచిన పాపమునందును. కావున దానికి ప్రాయశ్చిత్తములేదు-8. బ్రహ్మజ్ఞాని, దరిద్రుడు, బహుపుత్రులు గల భార్య కలవాడు. అతికష్టముతో కోంతధనము సంపాదించి దానితో జీవయాత్రలు గడపదలచును. అట్టివానీ ఆ ధనమును దొంగిలించిన వాని దోషమునకు ప్రాయశ్చిత్తములేదు-4. తన్ను నమ్మిన వాని ద్రవ్యమును హరించుట పైదానికన్న మిక్కిలి దోషము. నమ్మినవాడుగాని, నమ్మనివాడుగాని దరిద్రుని యొక్కధనమునపహరించరాదు-5, ఆ తరువాత దేవ బ్రాహ్మణుల యొక్క బంగారమును రత్నములను అపహరించువానీని జంపినవానికి అశ్వమేధయాగముజేసిన ఫలము లభించును-6. గురువులు, దేవతలు, బ్రాహ్మణులు, మిత్రులు, పుత్రులు, తాము,-వీరికి సుఖములనిచ్చు ధనములనపహించుటచే ఉత్తరోత్తరముగా పది పదిరెట్లు మించిన పాపము గలుగును-7. అంత్యజుడు (మాలవాడు), పొదజుడు (శూద్రుడు), వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు-వీరి ధనములనపరిహంచినవానికి ఉత్తరోత్తరముగా పదిపదిరెట్లధిక పాపములంటును-8. ఈ విషయముననే పురాతనమైన యితిహాసమును పెద్దలుదాహరింతురు. అది రహస్యాతి రహస్యము సర్వపాప ప్రణాశనమును -9.

పురా కాంచీపురే జాతో వజ్రాభ్యో నామచోరకః

తస్మిన్ పురవరే రమ్యే సర్వైశ్వర్యసమన్వితాః

సర్వే నీరోరిణో దాంతాః సుఖినో దయయాంచితాః

సర్వైశ్వర్యసమృద్ధే స్మిన్నగరే స తు తస్కరః

స్తోకాస్తోకక్రమేణేవ బహుద్రవ్యమపాహరత్

తదరణ్యేఽవటం కృత్వా స్థాపయామాస లోభతః

తథోపనం నీశార్థాయాం తస్మిన్ దూరంగతే సతి

కిరాతః కశ్చిదాగత్య తం దృష్ట్వా తు దశాంశతః

జహారావిదిత్తస్తేన కాష్ఠభారం వహన్ యణా

స్కోపి తచ్ఛిలయాచ్ఛాద్య మృద్భిరాపూర్య యత్నతః

పునశ్చ తత్పురం యాయాద్వజోపి ధనతృష్ణయా

ఏవం బహుధనం హృత్వో నిశ్చిక్షేప మహీతలే

కిరాతోపి గృహం ప్రాష్య బిభాషే ముదితః ప్రియామ్

మయాకాష్ఠం సమాహర్తుం గచ్ఛతా పథి నిర్జనే

లబ్ధం ధనమిదం భీరు సమాధత్స్య ధనార్ధిని

తచ్చుత్య తత్సమాదాయ నిధాయాభ్యంతరే తతః

చింతయంతీ శతో వాక్యమిదం స్వపతీమబ్రవీత్

నిత్యం సంచరరే విప్రో మామకానాం గృహేషు యః

మాం విలోకైవమచిరాద్బహు భాగ్యవతీ భవేత్ (:)

చాతుర్వర్ణ్యాసు నారీషు ఫేయం చేద్రాజవల్లభా

కిం తు భిల్లే కిరాతే చ శైలూషే ఊంత్యజాతితే

లక్ష్మీర్న తిష్ఠతి చిరం శాపాద్వల్మీకజన్మనః

తథాపి బహు భాగ్యానాం పుణ్యానామపి పాత్రిణే

దృష్టపూర్వం తు తద్వాక్యం న కదాచిద్యథా భవేత్

అథ వాత్మప్రయాసేన కృచ్ఛాద్యల్లభ్యతే ధనమ్

తదేవ తిష్ఠతి చిరాదన్యన్గచ్ఛతి కాలతః

స్వయమాగతవిత్తం తు ధర్మా ర్జెర్వీనియోజయేత్

కురువ్వైతేన తస్మాత్వం వాపీకుపాదికాఇచ్ఛిభాన్

ఇతి తద్వచనం శ్రుత్వా భావిభాగ్యప్రబోధితమ్

దహూదకసమం దేశం తత్ర తత్ర వ్యలోకయత్

నిర్మమేఽథ మహేంద్రస్య దిగ్భాగే విమలోదకమ్

సుబహుద్రవ్యసంసాధ్యం తటాకం చాక్షయోదకమ్

దత్తేషు కర్మకారిభ్యో నిఖలేషు ధనేషు చ

అసంపూర్ణం తు తత్కర్మ దృష్ట్వా చింతాకులోఽభవత్

తం చోరం వజ్రనామానమజ్ఞాతోఽను చరామ్యహమ్

తేనైవ బహుధా క్షిప్తం ధనం భూరి మహీతలే

స్తోకం స్లోకం హరిష్యామి తత్ర తత్ర ధనం బహం

ఇతి నిశ్చిత్య మనసా తేనాజ్ఞాతసమన్వగాత్

తథైవాహృత్య తద్రవ్యం తేన సేతుమపూరయత్

మధ్యే జలావృతస్తేన ప్రాసాదశ్చాపి శార్జిణః

తత్తటాకమభూద్దివ్యమశోషితజలం మహత్

సేతుమధ్యే చకొరాసౌ శంకరాయతనం మహత్

కాననం చ క్షయం నీతం బహు సత్త్వసమాకులమ్

తేనాగ్ర్యాజీ మహారాణీ క్షేత్రాణ్యపి చకార సః

దేవతాభ్యో ద్విజేభ్యశ్చ ప్రదత్తాని విభజ్య వై

బ్రాహ్మణాంశ్చ సమామంత్ర్య దేవవ్రాతముఖాన్ బహూన్

సంతోష్య హైమవస్రాద్యైరిదం వచనమ బ్రవీత్

క్వ చొహం వీరదత్తాఖ్యః కిరాతః కాష్ఠవిక్రయీ

క్వ వా మహాసేతుబంధః క్వ దేవాలయకల్పనా

క్వ వాక్షేత్రాణి క్లుప్తిని బ్రాహ్మణాయతనాని చ

కృపయేవ కృతం సర్వం భవతాం భూసురోత్తమాః

ప్రతిగృహ్య తథైవైతద్దేవవ్రాతముఖా ద్విజాః

ద్విజవర్మేతి నామాస్మై తస్యై శీలవతీ చ

చక్రుః సంతుష్టమనసో మహాత్మానో హహౌజసః

తేషాం సంరక్షణార్థాయ ఐంధుభిః సహితో వశీ

తత్రోవ వసతిం చక్రే ముదీతో భార్యయా సహ

పురోహితాభిధానేన దేవరాతపురం స్వాతి

నామ చక్రీ పురస్యాస్య తోషయన్నఖిలాన్ ద్వీజాన్

తతః కాలవశం ప్రాప్లో ద్విజవర్మా మృతస్తదా

యమస్య బ్రహ్మణో విష్ణోర్దూతా రుద్రస్య చాగతాః

అన్యోఽన్యమభవత్తేషాం యుద్ధం దేవాసురోపమమ్

అత్రాంతరే సమాగత్య నారదో మునిరబ్రవీత్

మా కుర్వంతు మిథో యుద్ధం శృణ్వంతు వచనం మమ

అయం కిరాత శ్చార్యేణ సేతుబంధం పురాకరోత్

వాయుభూతశ్చరేదేకో యావద్రవ్యవతో మృతిః

స బహుభ్యో హరేద్రవ్యం తేషాం యావత్తథా మృతిః

గణేష్వభిలదూతేషు శ్రుత్వా నారదభాషితమ్

చచార ద్వాదశాబ్దం తు వాయుభూతోంతరిక్షగః

భార్యాం తస్యాహ స మునిస్తవ దోషో న కించన

త్వయా కృతేన పుణ్యేన బ్రహ్మలోకమితో ప్రజ

వాయుభూతం పతిం దృష్ట్వా నేచ్ఛతి బ్రహ్మమందిరమ్

నిర్వేదం పరమాపన్నా మునిమేవమభాషత

వినా పతిమహం తేన న గచ్ఛేయం పితామహమ్

ఇహైవాసే పతిర్యావత్స్వదేహం లభతే తథా

తతస్తు యా గతిస్తస్య తామేవానుచరామ్యహమ్

పరిహారోథవా కింతు మయా కార్యస్తు తేన వా

ఇతి తస్యా వచః శ్రుత్వా ప్రీతః ప్రాహ తపోధనః

భోగాత్మకం శరీరం తు కర్మ కార్యకరం తవ

మమ ప్రభావద్భవితా పరిహారం వదామి తే

నిరాహారో మహాతీర్థ స్నాత్వా నిత్యం హి సాంబికమ్

పూజయిత్వా శివ భక్తాన్ కందమూల ఫలాశనః

ధ్యాత్వా హృది మహేశానం శతరుద్రమనుం జపేత్

బ్రహ్మహా ముచ్యతే పాపైరష్టోత్తరసహస్రతః

పాపైరస్యైశ్చ సకలైర్ముచ్యతే నాత్ర సంశయః

ఇత్యాదిశ్య దదౌ తస్యై రుద్రాధ్యాయం తపోధనః

అనుగృహ్యేతి తాం నారీం తతైవాంతర్ధిమాగమత్

భర్తుః ప్రియార్థ సంకల్ప్య జజాప పరమం జపమ్

విముక్తస్తేయదోషేణ స్వశరీరమవాప సః

తత్వజ్రాభిధశ్చారః కాలధర్మముపాగతః

అన్యే తద్రవ్యవంతో పీ కాలధర్మముపాగతాః

యమస్తు తాస్సమాహూయ వాక్యం చైతదువాచ హ

భవద్భిస్తు కృతం పాపం దైవాత్సుకృతమప్యుత

కీమిచ్ఛథ ఫలంభోక్తుం దుష్కృతస్య శుభస్య వా

ఇతీ తస్యవ చః శ్రుత్వా ప్రోచుర్వజాదికాస్తతః

సుకృతస్య ఫలు త్వాదౌ పశ్చాతాపస్య భుజ్యతే

పునరాహ యమో యూయం పుత్రమిత్రకలత్రకైః

ఏతస్యైవ బలాత్సర్వే త్రీదివంగచ్ఛత ద్రుతమ్

తేఽధిరుహ్య విమానాశ్ర్యం ద్విజవర్మాణమాశ్రితాః

యథోచితఫలోపేతాస్త్రీదివం జగ్మురంజసా

ద్వీజవర్మాభిలాన్ లోకానతీత్య ప్రమదాసఖః

గాణపత్యమనుప్రాప్య కైలాసేద్యాపి మోదతే

కాంచీపురశ్రేష్ఠమున వజ్రుడను చోరుడు జనించెను. ఆ సుందరమైన పుర శ్రేష్ఠమున అందరును సర్వైశ్వర్యముతో గూడిన వారు. అందరు నీరోగులు (రోగములు లేనివారు) బ్రహ్మచర్యాది తపక్లేశములనోర్చుకొనువారు, సుఖులు, దయచేనొప్పినవారు-10. సర్వైశ్వర్యముల నిండిన యూ నగరమున నా దొంగ మొదట కొంచెము తరువాత మరికొంచెవెక్కువ-ఈ పరిమాణక్రమముతోనే బహుద్రవ్యమునపహరించెను-11. లోభము వలన నా ధనమును అరణ్యమున నొకగుంత ద్రవ్వియందులో నుంచసాగెను. ఆ ధనము దాచుటనర్థరాత్రిలో నొక కీరాతుడువచ్చిచూచెను. వజుడను దొంగ ధనమును గుంతలోదాచి దూరముపోగా, నాకిరాతుడు పదవవంతు చొప్పున అందుండీ యపహరించి గుట్టు చప్పుడుగాకుండ (ఎవ్వరికి దెలియకుండ) కట్టెలమోపును నెత్తిన బెట్టుకొని వెళ్లుచుండెను. వజుడను దొంగయు తాను దొంగిలించి తెచ్చిన ధనమును గుంతలో వేసి పైన నౌకరాతితో గప్పి మట్టిగప్పి ధనాశతో మరల పట్టణములోనికి వెళ్లుచుండెను-14. ఈ విధముగా దొంగ విశాల ధనమును దొంగిలించి భూమిలో నుంచెను. కిరాతుడు గూడా (అందులో పదవ వంతు అపహరించి) ఇంటికి వెళ్లి సంతోషముతో తన ప్రియభార్యతో నిట్లనెను-15. “కట్టెలు దెచ్చుటకు వెళ్లుచుండగా మార్గమున నీ ధనము లభించినది. ఓ పిరికిదానా! అయినను ధనమును గోరుదానా! దీనిని చక్కగా గ్రహించుము-16. అది విని యా ధనమును దీసికొని లోపల భద్రపరచి, యాలోచించున్నదై తన పతితో నిట్లనెను-17. మనయిండ్లలో నిత్యము (పురోహితుడుగా) సంచరించు బ్రాహ్మణుడు నన్ను చూచి నీవు తొందరలోనే యీ విధముగా భాగ్యవతి వగుదువు-18. బ్రహ్మ క్షత్రియ శూద్ర స్త్రీలలో రాజవల్లభవు (రాణివి) అగుదువు. కాని భిల్లునీయందుగాని, కిరాతునియందుగాని, నటునియందుగాని, అంత్యజాతీయందు బుట్టినవానియందుగాని వాల్మీకి శాపమువలన లక్ష్మీ చిరకాలముండదు-19, బహుభాగ్యములకును పుణ్యములకును స్థానమైన దాని విషయమున అనుభవముతో దృష్టపూర్వమైన యా వాల్మీకి శాపవాక్యము ఎప్పుడును వ్యర్థము కాదు-20. అంతేకాని తన ప్రయత్నముతో కష్టముతో లభించిన ధనము మాత్రము చాలాకాలము మన దగ్గర నుండును. తక్కినదీ కాలముతోబాటు వీడిపోవును-21. స్వయముగా వచ్చిన ధనమును ధర్మార్థము వినియోగపరుపవలేను. కావున ఈ ధనముతో నీవు బావి, నడబావి మొదలగువానీనీద్రవ్వించు శుభాకార్యములను జేయుము-22. అనీ భార్య కిరాతునితోననెను. రాబోవు భాగ్యమువలన ప్రబోధితమైన ఆ మాటవిని, బహుజలసమమైన ప్రదేశమును అట జూచెను-23. తరువాత తూర్పుదిక్కున స్వచ్చమై యక్షయమైన జలములు కలదియు, బహుద్రవ్యముచే సాధింపదగినదియునగు నొక చెఱువును నిర్మించెను. -4. అచట కర్మకారులకు, తన దగ్గరి మొత్తము ధనము నిచ్చెను కాని చెణువు యొక్క నిర్మాణము పూర్తి కాకపోవుటచే చింతింపసాగెను-25. వజుడను ఆ దొంగనే అనుసరించి వాని చేత ననేక విధములుగా భూమియందుచబడిన విశాల ధనములో కొద్దికొద్దిగానే బహుధనము నపహరించెదను అనీ యాలోచించి యా వజుడను దొంగను వాడు తెలియకుండగనే వెంబడించెను-27. అట్లే యా ధనమును దెచ్చి దానితో చెరువు కట్ట నిర్మాణమును పూర్తిచేసెను. ఆ చెరువు మధ్యన విష్ణు దేవాలయము నిర్మించెను-28. ఆ చేరువు ఒక నీ రెండని పెద్ద చెరువయ్యెను. కట్టనడుమ గొప్ప శివాలయమును నిర్మించేను-29, అంత, అచటి యడవి నశించి బహుప్రాణులతో వ్యాకులమయ్యెను. ఆ కారణమున. కిరాతుడు, శ్రేష్ఠములు, గొప్పవారికి దగిన క్షేత్రములనేర్పరచెను-30. వానిని దేవతలకును, ద్విజులకును (బ్రాహ్మణాదులకు) విభజించి యిచ్చెను. దేవవ్రతుడు మొదలగు బహు బ్రాహ్మణులను బిలిచి-31, వారిని బంగారు వస్త్రాదులతో సంతసింపజేసి “వీరదత్తుడను కట్టెలమ్ముకొని బ్రతుకు కిరాతుడను నేనెక్కడ-52 ఈ పెద్ద చెరువు కట్ట నిర్మాణమెక్కడ దేవాలయ నిర్మాణములు నెక్కడ! క్షేత్రముల నేర్పరచుటెక్కడ! వానిలో బ్రాహ్మణివాసముల సిద్ధము జేయుటెక్కడ!-33 ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! మీ దయ వల్లనే యిది యంతయు చేయబడినది”-అని సవినయముగా విన్నవించెను. ఆ దేవవ్రతుడు మొదలగు బ్రాహ్మణులును దానిని గ్రహించి సంతుష్టమనస్కులైరి. ఆ మహా తేజస్వులై మహాత్ములైన బ్రాహ్మణులు ఆ కిరాతునకు “ద్విజవర్మ”యనియు అతని భార్యకు “శీలవతియనీయు పేరిడిరి-35, ద్విజవర్మ వారి సంరక్షణకై ఇంద్రియ నిగ్రహముగలవాడై బంధువులతో గూడి భార్యతో బాటు అచటనే నివాసముండెను-36. బ్రాహ్మణులందరిని సంతోషపెట్టుచు పురోహితుడైన దేవవ్రతుని పేరనే యాపురమునకు కిరాతుడు (ద్విజవర్మ) దేవరాత పురమనీ పేరిడెను-37, ఆ తరువాత కొంతకాలమునకు కొలునకు వశుడై ద్విజవర్మ (కిరాతుడు) మరణించెను. అపుడు యమునియొక్కయు, బ్రహ్మయొక్కయు, విష్ణువుయొక్కయు, రుద్రునియొక్కయును దూతలువచ్చిరి-38. వారిలో నొండొరులకు' దేవదానవుల యుద్దము బోలె మహాయుద్దములు జరిగెను. ఇంతలో నారదముని వచ్చి-మీరొండొరులు యుద్ధము జేయకుడు. నా మాటవినుడు, ఈ కిరాతుడు. పూర్వము చౌర్యముచేత చేతిలువు కట్టను నిర్మించేను-40. ఆ వజుడు అనేకుల ద్రవ్యమునపహరించెను. వారందరు మరణించు వఱకు వాయువై చరింపవలె-41. నారదుని యీ మాటలు విని యఖిల దూతలు (దూతాదులు) వెడలిపోగా కిరాతుడు పండ్రెండేడులు వాయువై యాకాశమున చరించెను-42. నారదముని యా కిరాతుని భార్యతో- నీ దోషమేమియు లేదు నీవు చేసిన పుణ్యముతో (భర్తకు వాపీకూప నిర్మాణము జేయుమని చెప్పుటతో) ఆటనుండి బ్రహ్మ లోకమునకు వెళ్లుము అనేను-43, ఆమె వాయువై తన పతి చరించుచుండ తాను బ్రహ్మలోకమునకు బోనిష్టపడలేదు. మిక్కలి దుఃఖమును బొంది వారదమునితో నిట్లనెను-44. పతిని వీడి నేను బ్రహ్మలోకమునకు బోను. నాపతి స్వదేహమునందువణకు ఇచటనే యుందును-45, ఆ తరవాత నాపతి యే గతినందునో దానీనే నేనసరింతును. లేదా! నేను గానీ నా పతిగానీ దానికి పరిహారముగానేమి చేయవలెనో తెలుపుడు-46. అను . శీలవతి మాటలువిని సంతసించి తపోధనుడైన నారదుడు ఇట్లనెను. నీ శరీరము భోగాత్మకము సుఖానుభవ స్వరూపము. అది నా ప్రభావము వలన కర్మ కార్యములను జేయగలది యగును. (వాయుభూతుడైన నీ పతి యేమియు జేయుటకు వీలులేదు)-47. దానిపరిహారము ఉన్నది. దానిని నీకు జెప్పెదను, “నిరాహారవై మహా. తీర్ధమున నిత్యము స్నానమాచరించి, అంబికతో గూడిన శివుని . భక్తితో బూచించి కంద మూలములు మాత్రము . దీనీ హృదయమున మహేశ్వరుని ధ్యానించీ శతరుద్రమును (నమకమును) జపించవలెను-49. వేయి యెనిమిది (1008) మారులు జపించినచో బ్రహ్మహత్య జేసివాడును తన పాపములనుండి విముక్తుడగును. ఇతరములైన సమస్త పాపముల నుండి విముక్తుడగును. సంశయము లేదు”-50. అనీయాదేశించి నారదుడనుగ్రహించి యామెకు రుద్రాధ్యాయమునిచ్చెను. ఇట్లామెను స్వీకరింపుమని మునీ యంత్రార్థనమందెను-51. ఆమెయు భర్తయొక్క ప్రీయము కొఱకు సంకల్పము జేసి ఆయుత్కృష్టమైన రుద్రాధ్యాయ జపమును జపించెను. దానీవలన నాకిరాతుడుస్తేయ (దొంగతనపు) దోషముచే విముక్తుడై స్వశరీరమునందెను-52. ఆ తరువాత వజుడను దొంగ మరణించెను. ఆ ద్రవ్యవంతులు (యజమానులు) గూడ. మరణించిరి-53. యముడు వారినందరిని బిలిచి యిట్లనెను-54. మీ చేత పాపము జేయబడినది. దైవవశమున పుణ్యము-గూడ జేయబడినది మొదట... సుకృత ఫలమనుభవింతురా! దుష్కృతఫలముననుభవింతురా? యని యడిగెను-55 ఈ యముని మాటలు విని వజుడు మొదలగువారు సుకృత ఫలమునే మొదట ననుభవింతుము తువాత దుష్కృత ఫలమునని చెప్పిరి-56. యముడు మరల వారితో ఈ కిరాతుని పుణ్యబలమువలననే మీరందరు పుత్రమిత్ర కళత్రములతో సహ వేగముగా స్వర్గమునకు వెళ్లుడు". - అనియనేను-57. వారందరు శ్రేష్టమైన విమానమునెక్కి వారికి తగిన ఫలముతో గూడిన వారై స్వర్గమునకు వెళ్లిరి-58, ద్విజవర్మయు సీసఖుడై అఖిల లోకములను - దాటి గాణ పత్యమును బొంది కైలాసమున నేటికిని నానందించుచున్నాడు. -59.

ఇంద్ర ఉవాచ :-

తారతమ్యవిభాగంచ కథయ త్వం మహామతే

సేతుబంధాదికానాం చ పుణ్యానాం పుణ్యవర్ధనమ్

బృహస్పతి రువాచ :-

పుణ్యస్యార్ధఫలం ప్రాప్య ద్విజవర్మా మహాయశాః

వజః ప్రాప్య తదర్ధం తు తదధేన యుతాః పదే

మనోవాక్కాయచేష్టాభిశ్చతుర్దా క్రియతే కృతిః

వినశ్యతేన తేనైవ కృతైస్తత్పరిహారకైః

ఇంద్రుడనేను : ఓ మహామతీ సేతుబంధాదికములగు పుణ్యముల పుణ్యవర్ణనమైన తారతమ్యవిభాగమును జెప్పుము. బృహస్పతీయనెను : మహాశయుడైన ద్విజవర్మ పుణ్యము యొక్క సగభాగమును (1/2) బౌందెను. వజుడు దానిలో సగము పుణ్యమును బొందెను(1/4) తక్కిన వారు దానిలో సగము పుణ్యమును బొందిరి(1/8). మనస్సు-వాక్కు-శరీరము-చేష్ట-ఈనాల్గింటిచే కర్మ (దుష్కర్మ) చేయబడును. అది వరుసగా చేసినవాని మానసిక-వాచిక-శారీరక-చైష్టిక ప్రాయశ్చిత్తముల చేతనే పోవును-62. (శీలవతి పూర్తి (1) పుణ్యమునందేనని యతాత్పర్యము)

ఇంద్రఉవాచ :-

ఆసవస్య తు కిం రూపం కో దోషః కశ్చ వా గుణః

అన్నం దోషకరం కిం తు తన్మేవిస్తరతో వద

బృహస్పతిరువాచ :-

పైష్టికం తాలజం కైరం మాధూకం గుడసంభవమ్

క్రమాన్యూనతరు పాపం తదర్ధార్దార్ధతస్తథా

క్షత్రియాదిత్రివర్ణానామాసవం పేయముచ్యతే

స్త్రీమపి తృతీయాది పేయం స్యాడ్రాహ్మణీం వినా

పతిహీనా చ కన్యా చ త్యజేదృతుమతీ తథా

అభర్తృసన్నిధౌ నారీ మద్యం పిబతి లోలుపా

ఉన్మాదీనీతి సా ఖ్యాతా తాం త్యజేదంన్యజామివ

దశాష్టషట్చతస్రస్తు ద్విజాతీనామయం భవేత్

స్త్రీణాం మద్యం తదర్ధం స్యాత్పాదం స్యాద్భర్తృసజ్ఞమే

మద్యం పీత్వా ద్విజో మాహాత్ కృఛ్ఛచాంద్రాయణం చరేత్

జపేచ్చాయుతగాయత్రీం జాతవేదసమేవ వా

అంబికాహృదయం వాపి జపేచ్ఛుదో భవేన్నరః

క్షత్రియోపి త్రివర్ణానాం ద్విజాదరో ఒర్ధతః క్రమాత్

స్త్రీణామర్ధార్ధక్లుప్తిః స్యాత్కారయద్వా ద్వీజైరపి

అనలే సహస్రం వాజపేచ్ఛుద్ధిమవాప్నుయాత్

లక్ష్మీ సరస్వతీ గౌరీ చండికా త్రిపురాంబికా

భైరవో భైరవీ కాలీ మాహాశాస్త్రీ చ మాతరః

అన్యాశ్చ శక్తయస్తాసాం పూజనే మధు శస్యతే

బ్రాహ్మణస్తు వినా తేన యజేడ్వేదాజపారగః

తన్నివేదితమశ్ననస్తదనన్యొస్తదాత్మకాః

తాం ప్రవాహా గచ్చక్తి నిర్లేపాస్తే పరాం గతిమ్

కృతస్యాఖిలపాపస్య జ్ఞానతో జ్ఞానతోపీ వా

ప్రాయశ్చిత్తమిదం ప్రోక్తం పరాశక్తేః పదస్మృతిః

అనభ్యర్య పరాం శక్తిం పిబేన్మద్యం తు యోధమః

రౌరవే నరకేఽబ్దం తు నివసేదిందుసంఖ్యయా

భోగేచ్ఛయా తు యో మద్యం పిబేత్స మానుషాధమః

ప్రాయశ్చిత్తం న చైవాస్య శీలాగ్నిపతనాదృతే

ద్విజో మోహాన్న తు పిజేత్స్నేహాద్వా కామతోపివా

అనుగ్రహాచ్చ మహతామనుపాతాచ్చ కర్మణః

అర్చనాచ్చపరాశక్తేర్యమైశ్చ నియమైరపి

చాంద్రాయణేన కృచ్ఛేణ దినసంఖ్యాకృతేన చ

శుద్ధేచ్చ బ్రాహ్మణో దోషాద్ద్విగుణాద్బుద్ధిపూర్వతః

ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాస్యసంవాదే లలితోపాఖ్యానే స్తేయపానకథనం నామ సప్తమోధ్యాయః 7

ఇంద్రుడనేను : అసవము యొక్క రూపము (స్వరూపము రంగుకాదు) ఏమి? దాని దోషమేమి? గుణమేమి? ఎట్టియన్నము దోషకరము? దీనిని సవిస్తరముగా జెప్పుము-63. బృహస్పతి యనెను : పిండితోజేసినదీ, తాటి చెట్టునుండి తీసినది, కైరము (కాశ్మీర దేశపువారు చేసినది), ఇప్పపూవునుండి తీసినది, బెల్లముతో జేసినది. - అని యాసవమనేక విధము. వీనిలో వరుసగా నుత్తరోత్తరము తక్కువ తక్కువ పాపదాయకము. మొదటిదాని కన్న తరువాతది సగము దానికన్న, తరువాతిదీ సగము, ఆతరువాతిది సగము ఈ విధము ఉత్తరోత్తరము సగ - సగము పాపములు గలవి-64. క్షత్రియాది మూడు వర్ణములవారికి (క్షత్రీయ వైశ్య-శూద్రులకు) అసవము త్రాగదగినది. బ్రాహ్మణస్త్రీకి దప్ప క్షత్రియ వైశ్య శూద్ర స్త్రీలకు త్రాగదగినది-65. పతి హీనురాలు, కన్య, రజస్వలయు ఆసవమును దీసికొనరాదు. భర్త లేనపుడు లోభించి మద్యము ద్రాగిన స్త్రీ ఉన్మాదిని యనబడును. అన్యజనులే దానిని వదిలివేయవలే-67. ద్వీజాతుల కిది పది, ఎనిమిది, ఆు, నాలుగు అగును. స్త్రీలకు మద్యము దానిలో పురుషుడు త్రాగిన దానిలో సగమగును. భర్త యొక్క సంగమమున దానిలో పురుషుడు త్రాగిన దానిలో పావుభాగమగును-68, బ్రాహ్మణుడు మద్యమును త్రాగినచో కృచ్చచాంద్రాయణ వ్రతమాచరింపవలె. పదివేల గాయత్రినిగాని జాతవేదమంత్రమునుగాని చేయవలె-69. అంబికా హృదయమంత్రమును (స్తోత్రమునుగాని జపించవలె. అపుడు నరుడు శుద్దుడగును. క్షత్రియ విషయమునను, త్రివర్ణముల వారికీనీ ద్విజునినుండి సగము దానిలో సగము దానిలో సగము అనుక్రమము వర్తించును. -70. స్త్రీలకు అర్థాఠక్లుప్తి (సగ-సగము అనురీతి) వర్తించును. లేదా ద్వీజుల చేత గూడ జేయించవలెను. నీటిమధ్యన వేయి - జపించినను శుద్దినందును-71. భైరవుడు, భైరవి, కాళి, మహా శాస్త్రీ (మహాకాళి)యు మాతలు-72. తక్కినవి పైవారి యొక్క శక్తులు, వారి పూజనమున ‘మధువు’ ప్రశంసింపబడును, వేదవేదాంగపారగుడైన బ్రాహ్మణుడు ఆ మధువును వీడియే యజింప (హజింపవలె-73. దేవికి నివేదించిన దానిని భుజించువారు (స్త్రీలు) దేవికభిన్నలై దేవీస్వరూపలగుదురు. వారి యొక్క ప్రవాహములు వెడలును, నిర్లిప్తులై పరాశక్తి రూపమును బొందుదురు-74. తెలిసికాని తెలియకగాని జేసిన సమస్త పాపములకు పరాశక్తి యొక్క పదస్మరణము ప్రాయశ్చిత్తమని చెప్పబడినది-75. పరాశక్తిని పూజింపక మద్యము ద్రావినవాడు అధముడు రౌరవనరకమున నొకయేడుండును. బిందు సంఖ్యతోనుండును-76. భోగమును గోరి మద్యమును ద్రావినపోడు మానుషాధముడు. శైల శిఖర శిలపైనుండి పడుట, అగ్నిలో బడుట-ఇవి, దప్ప ఆతనికి వేరొక ప్రాయశ్చిత్తములేదు-77. బ్రాహ్మణుడు మోహము వల్లగాని, కామమువల్లగాని, మద్యముత్రాగరాదు. మహాత్ములయనుగ్రహమువల్లగాని, కర్మయొక్క యనుపాతము వల్లగాని, యమని, యమములచే పరాశక్తి యర్చన వల్లగాని, దీనసంఖ్యతో జేసిన కృచ్చ చాంద్రాయణ వ్రతముల వల్లగాని బ్రాహ్మణుడు శుద్ధిచెందును. పాన పాపము బుద్ధి పూర్వకమైన చో పైప్రాయశ్చిత్తములను ద్విగుణముగా జేసిన శుద్దినందును -79.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణముననుత్తరభాగమున హయగ్రీవాగస్త్య సంవాదమున లలితోపాఖ్యానమున స్తేయపాన కథనమను సప్తమాధ్యాయము 7.