5 - లలితోపాఖ్యానము ప్రారంభము – అగస్త్య యాత్రా జనార్దనావిర్భావము

నాలుగు భుజములు, చంద్ర కళాభూషణము, ఉన్నత కుచములు, కుంకుమరాగ శోణిమ (ఎరుపుదనము) గలిగి పుండ్రేక్షువు (శ్రేష్టమైన చెరకుగడ) పాశము, అంకుశము, పుష్పబాణము - ఇవి నాలుగు హస్తములందుగల. ఓ జగత్తునకు ఏకైక మాతయైన లలితాంబా! నీకు నమస్కారము-1. అది శివుని వామాంగమున సుందరమైన వస్తువు. దానివల్లనే విద్వాంసుల మూడవది యావిష్కరించినది. ఆ మూడవదే పరమమైన తేజము-2. అగస్త్యుడను దేవర్షి కలడు. ఆతడు వేదవేదాంగపారగుడు, సర్వసిద్ధాన్తసారముల దెలిసినవాడు,  బ్రహ్మానందరసమే యాత్మగా గలవాడు-3.

చచారాద్భుత హేతూని తీర్ధాన్యాయతనాని చ ।

శైలారణ్యాపగాముఖ్యాన్సర్వాఃనపదానపి ॥

తేషు తేష్వభిలాజంతూనజ్ఞానతిమిరావృతాన్ ।

శిశ్నోదరపరాన్జప్త్వా చిన్తయామాస తాన్ ప్రతి ॥

తస్య చింతయమానస్య చరతో వసుధామిమామ్ ।

ప్రాప్తమాసీన్మహాపుణ్యం కాజీనగరముత్తమమ్ ॥

తత్ర పోరణ శైలేంద్రమేకామ్రనిలయం శివమ్ ।

కామాక్షీం కలిదోషమ్నీమపూజయదధాత్మవాన్ ॥

ఆతడు మహాద్భుతములకు కారణములైన తీర్థములు, స్థానములు. (దేవస్థానములు), శైలములు, అరణ్యములు, నదులు మొదలగువానిని, సమస్త దేశములను సంచరించేను -4. అయా ప్రదేశములలోని ప్రాణులు అజ్ఞానాంధకారమున జుట్టబడినవారు. శిశ్నోదర (మైథున-భోజనములందు) పరాయణులు. ఇట్టివారీని చూచి యగస్త్యుడు. వారిని గూర్చి చింతపసాగెను-5. ఆ విధముగా చింతించుచు నీభూమిని సంచరించు నగస్త్యునకు కాంచీపురము ఘటించినది. ఆ కాంచీ నగరము మహాపుణ్యమైన యుత్తమ నగరము-6. అట శుద్దాత్ముడై యగస్త్యుడు వారణ శైలేంద్రమును (ఏనుగువంటి, పర్వత శ్రేష్ఠమును) ఏకామ్ర వృక్ష స్థలముననున్న శివుని (ఏకామేశ్వరుని) కలిదోషముల నశింపజేయు కామాక్షీదేవిని పూజించెను-7.

లోక హేతోర్ధయార్ధస్య ధీమతశ్చిత్తనో ముహుః ।

చిరకాలేన తపసా తోషితో ఽభూజనార్దనః ॥

హయగ్రీవాం తనుం కృత్వా సాక్షాచ్చిన్మాత్రవిగ్రహమ్ ।

శంఖచక్రాక్షవలయపుస్తకోజ్వలబాహంకామ్ ॥

పూరయిత్రీం జగత్కృత్నం ప్రభయా దేహజాతయా ।

ప్రాదుర్బభూవ పురతో మునేరమితతేజసా ॥

తం దృష్ట్వానన్దభరితః ప్రణమ్య చ ముహుర్ముహుః ।

వినయానవతో భూత్వా సంతుషావ జగత్పతిమ్ ॥

అథోవాచ జగన్నాథస్తుష్టోస్మి తపసా తమ ।

వరం వరయ భద్రం తే భవితా భూసురోత్తమః ॥

ఇతి పృష్ణో భగవతా ప్రోపోచ మునిసత్తమః ।

యది తుష్టోఽసి భగవన్నీమే పామరజస్తవః ॥

కేనోపాయేన ముక్తాః స్యురేతన్మే వస్తు మర్హసి ।

ఇతి పృష్టో ద్విజేనాథ దేవదేవో జనార్దనః ॥

ఏష ఏవ పురా ప్రశ్నః శివేన చరితో మమ ।

అయమేవ కృతః ప్రశ్నో బ్రహ్మణా తు తతః పరమ్ ॥

కృతో దుర్వాసని పశ్చాద్భవతా తు తతః పరమ్ ॥

లోక కారణుడును, దయార్ధుడును, మహాధీశాలియును, మాటిమాటికి ధ్యానించువాడును, అయిన యగస్త్యుని యొక్క తపస్సుచే జనార్దనుడైన విష్ణువు సంతసించెను-8. హయగ్రీవాకారము వహించి అమితమైన తేజముతో యగస్త్యుని యెదుట సాక్షాత్కరించెను. ఆ హయగ్రీవాకారము కన్నులయెదుట మూర్తీభవించిన కేవలం చిన్నయ రూపము, శంఖము, చక్రము, అక్షవలయము. . (జపమాల) . పుస్తకము-వీనిని ధరించుటచే నుజ్జ్వలమైన (ఉన్నతముగా ప్రకాశించిన) నాలుగు బాహువులు గలది. తన దేహమునుండి బుట్టిన కాంతితో జగమునంతయు నింపుచున్నది-10. ఆ హయగ్రీవుని జూచి యానంద భరితుడై మాటిమాటికి నమస్కరించి వినయ వినమ్రుడై యాజగత్పతిని స్తుతించెను -11, ఆ తరువాత జగన్నాథుడు - నీ తపమునకు సంతసించితిని. వరమును గోరుకొనుము. నీకు క్షేమము గలుగును. అనియనేసు-12 ఈ విధముగా నడుగబడి. యాముని సత్తముడు ఈ విధముగాననెను. ఓ భగవంతుడా! నీవు సంతసించినచో, ఈ పామర ప్రజలందరు ఏయుపాయమున ముక్తులగుదురో, దీనిని మాకు జెప్పుము - అని మునిచే నడుగబడిన దేవదేవుడైన జనార్దనుడు ఇట్లనెను -14. ఈ ప్రశ్నమునే పూర్వము శివుడడిగెను. ఆ తరువాత నీ ప్రశ్నమునే బ్రహ్మయడిగెను. తరువాత దుర్వాసుడడిగెను. ఆ తరువాత నీ వడిగితివి-16.

భవద్భిః సర్వభూతానాం గురుభూతైర్మహాత్మభిః ।

మమోపదేశో లోకేషు ప్రథితోఽస్తు వరో మమ ॥

అహమాదిర్షి భూతానామాటికర్తా స్వయం ప్రభుః ।

సృష్టిస్థితిలయానాం తు సర్వేషామపి కారకః ॥

త్రిమూర్తి స్త్రీగుణాతీతో గుణహీనో గుణాశ్రయః ॥

ఇచ్ఛావిహారో భూతాత్మా ప్రధానపురుషాత్మకః ।

ఏవం భూతస్య మే బ్రహ్మంస్త్రిజగద్రూపధారిణః ॥

ద్విధాకృతమభూద్రూపం ప్రధానపురుషాత్మకమ్ ।

మమ ప్రధానం యద్రూపం సర్వలోకగుణాత్మకమ్ ॥

అపరం యద్గుణాతీతం పరాత్పరతరం మహత్ ।

ఏవమేవ తయోర్హాత్వా ముచ్యతే తే ఉజే కిము ॥

తపోభిశ్చిరకాలోతైః యమైశ్చనీయమైరపి ।

త్యాగైర్దుష్కర్మనాశాంతే ముక్తిరాశ్వేవ లభ్యతే ॥

యద్రూపం యద్గుణయుతం తద్గుణెక్యేన లభ్యతే ।

అన్యత్సర్వజగద్రూపం కర్మభోగపరాక్రమమ్ ॥

కర్మభిర్లిప్యతే తచ్చ తత్యాగేనాపి లభ్యతే ।

దుస్తరస్తు తయోస్త్యాగః సకలైరపి తాపస ॥

అనపాయం చ సుగమం సదసత్కర్మగోచరమ్ ॥

ఆత్మస్థీన గుణేనైవ సతా చాప్యసతాపీ వా ।

ఆత్మైక్యైనైవ యజ్జ్ఞానం సర్వసిద్ధిప్రదాయకమ్ ॥

వర్ణత్రయవిహీనానాం పాపిష్టానాం నృణామపి ।

యద్రూపధ్యానమాత్రేణ దుష్కృతం సుకృతాయతే ॥

యేఽర్చయంతి పరాం శక్తిం విధినాఽవిధినా పి వా ।

న తే సంసారిణో నూనం ముక్తా ఏవ న సంశయః ॥

శీవో వా యాం సమారాధ్య ధ్యానయోగంలేన చ ।

ఈశ్వరః సర్వసిద్ధనామర్ధనారీశ్వరోఽభవత్ ॥

అన్యేఽబ్జ ప్రముఖా దేవాః సిద్దాస్తద్ద్యానవైభవాత్ ।

తస్మాదశేషలోకానాం త్రిపురారాధనం వినాః ॥

న స్తో భోగాపవర్గా తు యాగపద్యేన కుత్రచిత్ ।

తన్మనాన్తర్గతప్రాణస్తద్యాజీ తద్గతేహకః ॥

తాదాత్మ్యేనైవ కర్మాణి కుర్వన్ముక్తిమ వాప్స్యసి ।

ఏతద్రహస్యమామ్నాతం సర్వేషాం హితకామ్యయా ॥

సస్తుషేనైన తపసా భవతో మునిసత్తమ ।

దేవాశ్చ మునయః సిద్దా మానుషాశ్చ తథాఽపదే ॥

త్వన్ముఖాంభోజతోఽ వా ష్య సిద్ధిం యాంతు పరాత్పరామ్ ॥

సర్వప్రాణులకు గురుభూతులై మహాత్ములైన మీచేత నాయుపదేశము లోకములందు ప్రసిద్ధిగాంచుగాత. ఇది నా వరము-17. నేను భూతములకాదని, భూతములకాదికర్తను, నేను స్వయముగా ప్రభువును సృష్టిస్థితి లయలకును అన్నింటికీని కారకుడను-18. త్రిమూర్తి (స్వరూపుడను)నీ, సత్త్వరజస్తమో గుణముల కతీతుడను. నిర్గుణుడను, గుణములకాశ్రయమైన వానినీ-19 స్వేచ్ఛగా విహరించువానిని, భూతములకాత్మను, ప్రధాన- పురుషాత్మకుడను ఓబ్రహ్మస్వరూపుడవైన అగస్త్యమునికి ఇటువంటి శ్రీజగద్రూపధారినైన నా యొక్క రూపము ప్రధానము- పురుషుడు అని రెండు విధములయ్యెను. నా ప్రధాన మను రూపము సర్వలోక గుణాత్మకము-21 తక్కిన గుణాతీతమైన రూపము పరమునకంటెను పరతరమైనది. మహత్తైనది. ఈ విధముగా రెంటి యొక్క స్వరూపములను దెలిసి ఈ రెంటిని వదిలిపెట్టును-22. చిరకాల తపస్సుల చేత, యమ నీయముల చేతను, త్యాగముల చేతను, దుష్కర్మలు నశించిన తరువాత ముక్తి తొందరగనే లభించును-23. ఏ రూపము ఏగుణముతో గూడియున్నదో అదీ గుణీయొక్క యొక్యముతో లభించును. తక్కినది సమస్త జగద్రూపము కర్మభోగము యొక్క పరాక్రమము (ఫలితము)-24 అదీ కర్మలనంటియుండును. అది కర్మల పదిలీనను (సదసత్కర్మల - వదిలినను) ఈ వరకు జేసిన సద సత్కర్మల ఫలితము లభించుచునే యుండును. ఓ తాపస! ఎవ్వరికైనను ఆ రెంటిని (సదసత్కర్మ ఫలములను) వదలుట దుస్తరము-25. సదసత్కర్మ గోచరమైన ఫలము వీడనిదీ, సులభముగా బొందునది-26. సద సద్గుణములాత్మస్థములై వీడవు, తత్పలితములనవశ్యమనుభవింపచేయును. ఆత్మైక్యముగా గలిగిన సర్వసిద్ధులనొసంగును-27. బ్రహ్మక్షత్రియులకన్న తక్కువై పాపిష్టులైన నరులకు గూడ ఏరూపమును ధ్యానించినంత మాత్రమున దుష్కృతము గూడ సుకృతముగా మారునో అది పరాశక్తి రూపము-28. విధి విధానముతోగానీ, వీధి విధానములవదలిగానీ పరాశక్తి నర్చించిన వారు సంసారులు సంసారులుగారు, నిశ్చయముగా వారు ముక్తులే. సంశయము లేదు -29, శివుడు గూడ నామెను ధ్యానయోగ బలముతో సమారాధించి సర్వసిద్దులకీశ్వరుడై యర్ధనారీశ్వరుడయ్యెను-30. ఆ పరాశక్తి ధ్యానవైభవమున బ్రహ్మ మొదలగు దేవతలు సీదులైరి. కావున సమస్తలోకులకు త్రిపురాశక్త్యారాధనము లేక యెక్కడనైనను ఒక్కమారుగా భోగా పవర్గములు భోగమోక్షములు లేవు. కావున పరాశక్తి మనస్కుడవై, పరాశక్తి గత ప్రాణుడవై, పరాశక్తిని యజించు (పూజించు) వాడవై, కోరికలన్నింటిని నామె. యందే. నిలిపినవాడవై-32 పరాశక్త్యాత్మలో సమస్త కర్మలజేయుచు ముక్తిని బొందగలవు. మునిశ్రేష్ఠ నీ తపమునకు సంతసించి అందరి హితమును గోరి యిరహస్యము జెప్పబడినది. దేవతలు మునులు, సిద్ధులు, మానుషులు, ఇతరులును నీముఖ కమలము నుండి యీ పరాశక్తి. రహస్యమును బొంది పరాత్పరమైన . సిద్ధిని బొందుదురుగాక-34

ఇతి తస్య వచః శ్రుత్వా హయగ్రీవస్య శార్ఞిణః ।

ప్రణీపత్య పునర్వాక్యమువాచ మధుసూదనమ్॥

భగవన్ దృశం రూపం భవతా యత్పురోదితమ్ ।

కింహారం కింప్రభావమేతన్మే వస్తుమర్హసి ॥

హయగ్రీవ ఉవాచ :-

ఏ హోంఽశతో దేవర్షే హయగ్రీవో మమాపరః ।

శ్రోతుమిచ్ఛసి యద్యత్వం తత్సర్వం వస్తుమర్హతి॥

ఇత్యాదిశ్య జగన్నాథ్ హయగ్రీవం తపోధనమ్ ।

పురతః కుంభజాతస్య మునేరంతరధాద్దరిః ॥

తతస్తు విస్మయావిష్ణో హృష్టరోమా తపోధనః ।

హయగ్రీవేజ మునినా స్వాశ్రమం ప్రత్యపద్యత ॥

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే ఉత్తర భాగే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానే అగస్త్యయాత్రా-జనార్ధనావిర్భావో నామ పఞ్చమోధ్యాయః॥

విష్ణు రూపుడైన హయగ్రీవుడు చెప్పిన పై వాక్యములను వినీ నమస్కరించి యగస్త్యముని ఆ మధుసూదనునితో నిట్లనెను-35. ఓ భగవన్! నీవు పూర్వము జెప్పినది యెట్టి రూపము? ఎట్టి విహారములు గలది? ఎట్టి ప్రభావము గలది? - ఇది యంతయు మాకుజెప్పుము-36. హయగ్రీవుడనేను: - ఓ దేవర్షివైన అగస్త్యమునీ! ఈ హయగ్రీవరూపము సాయంశరూపమైన నా వేరొక రూపము. కావున నీవు వినదలచినదంతయు జెప్పగలది. అని జగన్నాథుడైన మహా విష్ణువు తపోధనుడైన హయగ్రీవుని నాదేశించి యగస్త్యముని యెదుటనే యంతర్ధానమొందెను-38. తరువాత ఆశ్చర్యము జెంది యగస్త్యుడు పులకిత గాత్రుడయ్యెను. హయగ్రీవ మునీతో స్వాశ్రమమును జేరెను-39.

ఇది బ్రహ్మాండ మహాపురాణమున నుత్తర భాగమున హయగ్రీవాగస్త్య సంవాద రూపమైన లలితోపాఖ్యానము అగస్తయాత్రా జనార్ధనావిర్భావమును అను పంచమాధ్యాయము -5