8 - మానస సృష్టి

సూత ఉవాచ :-

తతోభిధ్యాయతస్తస్య మానస్యో జజ్ఞిరే ప్రజాః

తచ్ఛరీరసముత్పన్నైః కార్త్యైస్తైః కారణైః సహ ఈఈ

క్షేత్రజ్ఞాః సమవర్తన క్షేత్రస్యైతస్య ధీమతః

తతో దేవాసురపితృన్మనుష్యాంశ్చ చతుష్టయమ్

సిసృక్షురయుతాంతాని స చాత్మానమయూయుజత్

యుక్తాత్మనస్తతస్తస్య తమోమాత్రాసముద్భవః

తదాభిధ్యాయతః సర్గం ప్రయతో భూత్రజాపతేః

తత్స్య జఘనాత్పూర్వమసురా జజ్ఞిరే సుతాః

అసుః ప్రాణః సతో విజ్ఞాస్తజ్ఞస్మానస్తతోసురాః

సృష్టి యయా సురాస్తస్వో తాం తనుం స వ్యపోహత

సాపవిద్దా తనుస్తేన సద్యో రాత్రిరజాయిత

సా తమోబహుళా యస్మాత్తతో రాత్రిస్త్రీయామికా

బ్రహ్మదేవుని మానస సృష్టి - దేవతలు, ఋషులు, పితృదేవతలు, మానవులు సృజింపఁబడిరి.

సూతుఁడిట్లు పలికెను :

బ్రహ్మ అభిధ్యానము చేయుచుండఁగనే, ఆతని శరీరము నుండి ఉత్పన్నములయిన కార్యములచే, కారణములచే మానస సృష్టియైన ప్రజలుదయించిరి.

బుద్ధిమంతుఁడయిన బ్రహ్మయొక్క విశ్వమయ శరీరము నుండి, (క్షేత్రమునుండి) క్షేత్రజ్ఞులు (ప్రత్యేక వ్యక్తులు) బయలు దేరిరి. తరువాత చతుర్విధములయిన దేవతల, అసురుల, పితరుల, మానవుల సహస్ర సహస్రములను సృజింపవలయుననీ యీతనికి కోరిక కలిగిను. ఆసృష్టి యందు నియతాత్ముఁడై ప్రజాపతి సృష్టిని గూర్చి ధ్యానించేను. అట్లు ధ్యానించుటలో ఆతనిలోని తమో మాత్ర (అజ్ఞాన భావన యొక్క మాత్ర - లేశము) సముద్భవించెను. అట్టి ప్రజాసృష్టి చేయు ప్రజాపతీ జఘన భాగము నుండి మున్ముందుగా అసురులు కుమారులుగా నుదయించిరి. (4) అసువు - అనఁగా - ప్రాణమనీ విజ్ఞులు తలంచిరి. అందుచే తన్మూలమున జన్మించిన వారు (అ + సురాః = అసురాః. ఇది ప్రసిద్దార్థము. కాని వేటిక విధముగా అర్థమీందు ప్రతిపాదింపఁబడుట గ్రహీంపఁదగినది) అసురులయిరి. అసురులయుత్పాదనమునకు కారణమయిన యా, భౌతిక శరీరమును ప్రజాపతీ విసర్జించెను. (5) ఆతనిచే పరిత్యజింపఁబడిన యా భౌతిక దేహము వెంటనే రాత్రియయ్యెను. ఆ రాత్రీ తమో బహుళము. శ్రీయామ కలితమయిన రాత్రి తమో బహుళమయ్యెను. రాత్రి - త్రియామ - యామమనంగా మూడు గంటల ప్రమాణము గల కాలము ఈ త్రియాయు కాలములో చీకటి బహుళము.(6)  

ఆవృతాస్తమసా రాత్రా ప్రజాస్తస్మాత్స్వయం పునః

సృష్ట్వాసురాంగ్రతః సోథ తనుమన్యామపద్యత

అవ్యక్తాం సత్త్వబహుళాం తతస్తాం సో భ్యయుంజత

తతస్తాం యుంజమానస్య ప్రియమాసీత్ ప్రభోః కిల

తతో ముఖాత్సముత్పన్నా దీవ్యతస్తస్య దేవతాః

యత్స్య దీవ్యతో జాతాస్తేన దేవాః ప్రకీర్తితాః

ధాతుర్దివ్యేతి యః ప్రోక్తః క్రీడాయాం స విభావ్యతే

తస్మాత్తన్వాస్తు దివ్యాయా జిజ్ఞరే తేన దేవః

దేవాన్ సృష్ట్వా తతః సో థ తనుం దిప్యామపోహత

ఉత్సృష్టా సొ తనుస్తేన అహః సమభవత్తదా

తస్మాదహః కర్మయుక్తా దేవతాః సముపాసతే

దేహన్ సృష్ట్వా తతస్సోశిథ తనుమన్యామపద్యత

సత్త్వమాత్రాత్మికామేవ తతోన్యామభ్యయుక్త వై

పితేవ మన్యమనస్తాన్ పుత్రాన్ ప్రధ్యాయ స ప్రభుః

పితరో హ్యభవంస్తస్యో మధ్యే రాత్రహయోః పృథక్

తస్మాత్తే పితరో దేహః పితృత్వం తేషు తత్ స్మృతమ్

యయా సృష్టాస్తు పితరస్తాం తనుం స వ్యపోహత

సాపవిద్ధా తనుస్తేన సద్యః సంధ్యా వ్యజాయత

తస్మాదహర్దేవతానాం రాత్య్రిర్యా సాసురీ స్మృతా

తయోర్మధ్యే తు వై పైత్రీ యా తనుస్సా గరీయసీ

అందుచే స్వయముగా ప్రజలు రాత్రి యందు చీకంటిచే ఆవృతులు. తరువాత సురలను సృష్టించి యతఁడు వేశాక శరీరము నొందెను?(7) ఆ శరీరరము సత్త్వగుణ బహుళము. తరువాత నా శరీరముతోఁ దాను కలిసియుండెను. ఆ శరీరముతో సంపృక్తుఁడు కాగా అయ్యది ఆ ప్రభువునకు ప్రియమయ్యెను. (8) అంత సత్త్వగుణ బహుళత్వముచే ప్రకాశవంతమయిన ఆ స్వయంభువుని ముఖము నుండి దేవతలు (స్త్రీ పురుషులు) ఆవిర్భవించిరి. వారందరు ప్రకాశించుచు పుట్టి యుండుటచే వారందఱు దేవతలు (దీవ్యంతే ఇతి దేవాః)గా కీర్తింపఁబడిరి. (9): (దీవ్ అనుధాతువు 'దీప్త్యాం, క్రీడాయాం' ఉపయోగీంపఁబడును. 'దివ్' అను ధాతువు 'క్రీడయందు'పయోగింపఁబడును). అందుచే దేవతలు ప్రకాశముగా దీప్తిమంతమయిన శరీరము నుండి పుట్టిరి. అందుచే దేవతలయిరి. (10) దేవతలను సృష్టించి ప్రభువు ఆ దివ్యమయిన శరీరమును. త్యజించెను. ఆతనిచే పరిత్యక్తమయిన శరీరము “అహస్సు” (పగలు) అయ్యెను. (11) అందుచేతనే పగటిపూట చేయంబడు కర్మలచే దేవతలు సేవింపఁబడుదురు. దేవతల సృష్టించి తద్రహ్మ వేతాక శరీరమును పొందెను. (12) అంతనతఁడు సత్వమాత్రాత్మికమయిన యన్యమయిన దేహమును భజించెను. (దేహమును దాల్చెను). తన్ను తండ్రిగా దలంచుచు నాతఁడు వారలను పుత్రులనుగా భావించెను. (13) ఆ శరీరము నుండి దీపోరాత్రుల సంధ్యలో పితరులుదయించిరి. అందుచే పితరులు దేవతలు. వారియందు పితృత్వము సంస్మరింపఁబడినది. (14) పితరులుదయించిన శరీరమును తాను పరిత్యజించెను. ఆతనిచే విడువఁబడిన శరీరము వెంటనే ‘సంధ్య' అయ్యెను. (15) అందుచే పగటి , ప్రొద్దు దేవతలకు సంబంధించినదిగాను, రాత్రి ప్రొద్దు రాక్షసులకు చెందినదిగాను సంస్మరింపఁబడినది.

తస్మాద్దేవాసురాశ్చైవ ఋషయో మానవాస్తథా

యుక్తాస్తనుముపాసన్తే ఉషావ్యుష్ట్యోర్యదంతరమ్

తస్మాత్ రాత్ర్యహయోః సంధిముపాసన్తే తథా ద్వీజాః

తతోఽన్యస్యాం పునర్భ్రహ్మా స్వతన్వాముపపద్యత

రజోమాత్రాత్మికా యా తు మనసాసోఽసృజత్ర్పభుః

మనసా తు సుతాస్తస్య ప్రజనాజ్ఞజ్ఞిరే ప్రజాః

మననాచ్చ మనుష్యాస్తే ప్రజనాత్ప్రథితాః ప్రజాః

సృష్ట్వా పునః ప్రజాః సోఽథ స్వాం తనుం సవ్యపోహత

సోఽపవిద్ధా తనుస్తేన జ్యోత్స్నా సద్యస్త్వజాయత

తస్మాత్ భవన్తి సంహృష్టా జ్యోత్స్నాయా ఉద్భవే ప్రజాః

ఇత్యేతాస్తనవస్తేన హ్యపవిద్ధా మహాత్మనా

సద్యో రాత్ర్యహనీ చైవ సంధ్యా జ్యోత్స్నా చ జజ్ఞిరే

జ్యోత్స్నా సంధ్యాహనీ చైవ సత్త్వమాత్రాత్మకం త్రయమ్

తమోమాత్రాత్మికా రాత్రీః సా వై తస్మాన్నియామినా

తస్మాద్దేవా దివ్యతన్వా తుష్ట్యా సృష్టా ముఖాత్తు వై

యస్మాత్ తేషాం దివా జన్మ బలినస్తేన తే దివా

తన్వా యదసురాన్ రాత్ర్యై జఘనాదసృజత్ర్పభుః

ప్రాణేభ్యో రాత్రిజన్మానో హ్యజేయా నిశి తేన తే

దివారాత్రులకు మధ్యనున్న “పైత్రీ” (పితృదేవతాత్మకమయిన శరీరము) శ్రేష్ఠతమ మయినది. (16) అందుచేతనే దేవతలు, అసురులు, ఋషులు, మానవులు యోగాభ్యాస యుక్తులయి, దివారాత్రముల మధ్య గల సంధ్యను (సూర్యోదయ రాత్రులకు మధ్య తనువును) పూజింతురు. (17) అందుచేతనే బ్రాహ్మణులు రాత్రికి దివమునకు మధ్య భాగమయిన సంధ్య యందు సంధ్యావందన మాచరించెదరు. ఆ తరువాత బ్రహ్మ మరల వేతాక తనువును నాశ్రయించెను. (18) మనసా తద్ర్బహ్మ సృజించిన యా తనువు రజోగుణమాత్రాత్మిక. మనసా సృజింపఁబడిన యాతని సంతానము ప్రజలయిరి. (19) మనుష్యులు బ్రహ్మయొక్క (ప్రజాపతియొక్క) మనస్సు యొక్క సృష్టియగుట ప్రజలుగా ప్రఖ్యాతి వహించిరి. వారు మనమున మనుష్యులు జననము వలన జపలునైరి. ప్రజలను సృష్టించి యితఁడు తన శరీరమును పరిత్యజించెను, (20) ఆ పరిత్యక్తమయిన యాతనీ తనువు నుండి వెంటనే జ్యోత్స్న (వెన్నెల) సముద్భవించెను. జ్యోత్స్న యొక్క యుద్భవము వలన ప్రజలు సంతోషవంతులగుదురు. (21) ప్రజలను సృజించిన వెనుక బ్రహ్మ తన తనువును పరిత్యజించెను. ఆతనిచే వీడువబడిన శరీరము వెంటనే రాత్రి, పగలు, సంధ్య, జ్యోత్స్న (చంద్రిక) యయ్యెను. (22) అందుచే జ్యోత్స్న, సంధ్య, పగలు - ఈ మూఁడును ఆ బ్రహ్మయొక్క సత్త్వగుణమాత్రచే సృజింపఁబడినవి. రాత్రి తమోమయాత్మికయగు మాత్రచే కేవలము సృజింపఁబడినది. అందుచే నది “నీయామిక” (ఆత్రీయామికయే 'నియామీక' గా నైయుండును) (23) అందుచే దేవతలు సంతోషముతో ప్రకాశవంతమయిన శరీరము నుండి సృజింపఁబడిరి. వారి క్రీడా పరత్వము ముఖము నుండి కలిగెను, వారీ జననము పగటియందు జరిగియుండుటచే వారు పగటి ప్రొద్దు బలవంతులు. (24) బ్రహ్మ అసురులను రాత్రివేళ తన ప్రాణముల నుండిజఘన భాగము వలన సృజించి యుండుటచే వారు రాత్రులందు దుర్ధరులయిరి.

ఏతాన్యేవ భవిష్యాణాం దేవనామసురై స్సహ

పితృణాం మానుషాణాం చ అతీతా నాగతేషు వై

మన్వన్తరేషు సర్వేషు నిమిత్తాని భవన్తి హి

జ్యోత్స్నా రాత్ర్యహనీ సంధ్యా చత్వార్యేతాని తాని వా

భాన్తి యస్మాత్తతో భాతి భాశబ్ధో వ్యాప్తిదీప్తిషు

ఆంభాంస్యేతాని సృష్ట్వా తు దేవదానవమానుషాన్

పితౄంశ్చైవ తథా చాన్యాన్వివిధాన్వ్యసృజత్ ప్రజాః

తాముత్సృజ్య తతో జ్యోత్స్నాం తతోఽన్యాం ప్రాప్య స ప్రభుః

మూర్తిం రజస్తమోద్రిక్తాం తతస్తాం సోఽభ్యయుంజత

తతోఽన్యాః సోంఽధకారేచ క్షుధావిష్టాః ప్రజాః సృజన్

తాః సృష్టిస్తు క్షుధావిష్టా అంబాంస్యాదాతుముద్యతాః

అంబాంస్యేతాని రక్షామ ఉక్తవంతస్తు తేషు యే

రాక్షసాస్తే స్మృతాస్తస్మాత్ క్షుధాత్మానో నిశాచరాః

యేఽబ్రువన్ క్షిణుమోంఽభాంసి తేషాం హృష్టాః పరస్పరమ్

తేన తే కర్మణా యక్షా గుహ్యకాః క్రూరకర్మిణః

రక్షతి పాలనే చాపి ధాతురేష విభావ్యతే

య ఏష క్షితిధాతుర్వై క్షిపణే సనీరుచ్యతే

రక్షణాద్రక్ష ఇత్యుక్తం క్షపణాద్యక్ష ఉచ్యతే

తాన్ దృష్ట్వా త్వప్రియేణాస్య కేశాః శీర్ణాశ్చ ధీమతః

తే శీర్ణ వ్యుత్థితా హ్యూర్థ్వమారోహంతః పునః పునః

జ్యోత్స్న, రాత్రి, పగలు, సంధ్య అను నీ నాలుగు భవిష్యత్కాలములో సురలతో కూడ దేవతలకు, పితృదేవతలకు, ఇంతకు బూర్వము గతించిన మన్వంతరములందు, ఇక ముందు రానున్న మన్వంతరముల యందు నిమిత్తములు ఆరంభమునకు కారణములగును. ఈ నాలుఁగును వ్యాపించి యందు ప్రకాశించు కారణమున నీటికి అంభస్సులని పేరు వచ్చినది. 'భా' అను ధాతువు వ్యాపించుట, ప్రకాశించుట యన్న అర్గములో నుపయోగింపఁబడినది, {26, 28ఎ) అంభస్సులను (నీటినీ సృష్టించి, ప్రభువు తరువాత దేవతలను దానవులను, మనుష్యులను, పితరులను అట్లే ఇతరులయిన ప్రజానీకమును సృజించెను. అంత ప్రభువు {ప్రజాపతి) తన (శరీరమును) జ్యోత్స్నను పరిత్యజించి, తరువాత ప్రధానముగా రజోగుణ తమోగుణములచే నుద్రిక్తమయిన వేటిక భౌతిక శరీరమును పొందెను. తరువాత నా శరీరమునందే యాతడుండి షోయెను. అందుచే క్షుద్బాధా పీడితులయిన ఇతర ప్రజను అంధకారమున నాతఁడు సృజించెను. (29, 30) స్పష్టింపబడిన ఆ ప్రజలు క్షుధా కృష్ణులయి అంభస్సులను గ్రహించుటకు నుద్యుక్తులయిరి. ఆ ప్రజలు “మేము అంభస్సులను రక్షించెదము' అనీన వారు రాక్షసులుగా స్మరింపం బడిరి. నిశాచరులు (రాత్రి సంచరించువారు) క్షుద్బాధితోత్ములయి, “మనమీ నీటిని అంధస్సులను) నాశనము చేయుదుము. మనము పరస్పరము (సాంగత్యమున) సంహృష్టులమగుదుము" అనిన వారు వారీ దయారహిత కర్మచే యక్షులు క్రూరకర్ములయిన గుహ్యాకులు నయిరి. 'రక్ష' అనుధాతువునకు రక్షించుటయందు, పాలనము నందు అర్థము. “క్ష్మి" అను ధాతువునకు 'క్షణము' నాశనముచేయుటయందు అర్థము. వారు రక్షించిన రక్షణాత్) కారణమున రాక్షసులనంబడిరి. 'క్షపణాత్' నాశనము చేయుటవలన వారు యక్షులనంబడిరి (31,34) క్రూరకర్ములయిన యక్షులను చూచి మనీషి యాత్మనిష్ఠుఁడయిన యా ప్రభువు అసంతుష్టుఁడయ్యెను. అసంతుష్టుఁడగుటచే ఆతని కేశములు (వేంట్రుకలు) జీర్ణములు వికీర్ణములయ్యెను. ఆ విడివడిన (కీర్ణములయిన) వెండ్రుకలు పైకి పొడమీ మరల మరల ఆరూఢములయ్యెను.

హీనా యే శిరసో బాలాః పన్నాశ్చైవాపసర్పిణః

బాలాత్మనా స్మృతా వ్యాలా హీనత్వాదహయః స్మృతాః

పన్నత్వాత్పన్నగాశ్చాపి వ్యవసర్పాచ్చ సర్పతా

తేషాం లయః పృథివ్యాం యః సూర్యాచంద్రమసౌ ఘనాః

తస్య క్రోధోద్భవో యోఽసాపగ్నిగర్భః సుదారుణః

స తాన్ సర్పాన్ సహోత్త్పన్నానావివేశ విషాత్మకః

సర్పాన్ సృష్ట్వా తతః క్రోధాత్ క్రోధార్మానో వినిర్మితాః

వర్ణేన కపిశేనోగ్రాస్తే భూతాః పిశితాశనః

భూతత్వాత్తే స్మృతా భూతాః పిశాచా పిశితాశనాత్

గాయతో గాం తతస్తస్య గంధర్వా జజ్ఞిరే సుతాః

ధయేతి ధాతుః కవిభిః పానార్ధే పరిపఠ్యతే

పిబతో జజ్ఞిరే వాచం గంధర్వాస్తేన తే స్మృతాః

అష్టాస్వేతాసు సృష్టాసు దేవయోనిష స ప్రభుః

ఛందతశ్చైవ ఛందాంసి వయాంసి వయసా సృజత్

పక్షిణస్తు స సృష్ట్వా వై తతః పశుగణాన్ సృజన్

ముఖతోజా సృజన్ సోఽథ వక్షసశ్చాష్యవీః సృజన్

గావశ్చైవోదరాద్భ్రహ్మా పార్శ్వాభ్యాం చ వినిర్మమే

పాదతోఽశ్వాన్ సమాంతంగాన్ రాసభాన్ గవయాన్ మృగాన్

ఉష్ట్రాంశ్చైవ వరాహాంశ్చ శునోఽ న్యాంశ్చైవ జాతయః

ఓషధ్యః ఫలమూలిన్యో రోమభ్యస్తస్య జజ్ఞిరే

తలనుండి రాలిపోయిన వెంట్రుకలు, చలించి పైకి ప్రాకెను (బాల, వాల పదములు శిరోజ పర్యాయ పదములు) అయ్యవి మొదట పోలములు (శిరోజములు) అగుటచే, వానిని వ్యాలములుగా స్మరించిరి. అయ్యవీశీర్షము నుండి రాలిపోయిన వగుటచే (హీనత్వాత్) అహి = పాము) అహులుగా నయినవి. అయ్యవి చలించీ, ఇటునటు కదలాడుటచే సవి పన్నగములయినవి అవి (ప్రసర్పణము) ప్రొకుటచే సర్పము అయినవి. సూర్యచంద్ర మేఘముల క్రింద షథీవీలో ఆ సర్పములకు నిలయము (37) బ్రహ్మయొక్క అగ్నిగర్భము, సుదారుణము సయిన క్రోధము నుండి యుద్భవించిన విషాత్మకమయిన (విషము) వానితో సహోత్పన్నములయిన సర్పములయందు ప్రవేశీంచెను. (38) తన క్రోధము నుండి బ్రహ్మ సర్పములను సృజించి, క్రోధాత్ములు, (భయస్వరూపులు), మాంసాశనులు, స్వభావతః ఉగ్రులు నయిన వానిని సృజించెను. వానికి కపిశ వర్ణము కలిగేను. (39) అయ్యవి ప్రభూతములయిన కారణముచే (భూతత్వాత్) భూతములుగా స్మరింపఁబడినవి. మాంసమును తినుటచే (పిశితాశనాత్) పిశాచములయిరి. బ్రహ్మపదములను గానము చేయుచుండగా పుట్టినవారు గంధర్వులు సుతులుగా నుద్భవించిరి. (40) 'ధయ్' అను ధాతువు కవులచే పానార్థము నందు చదువబడుచున్నది. (సంగీత ప్రదములయిన) పదములను వినుచు త్రాగుచు) పుట్టుటచే వారు గంధర్వులయిరి. (41) దేవయోనులందు ఆ యెనమండ్రు భూతములను సృజించి, అతఁడు సుప్రీతుఁడగుటచే (ఛందతః) ఛందస్సును కల్పించెను. తన (వయసా) వయస్సుచే పక్షులనతడు సృజించెను. పక్షులను సృజించిన పిమ్మట పశుగణముల నా బ్రహ్మ సృజించెను. అతడు మేకలను తన ముఖము నుండి గొఱ్ఱలను వక్షస్థలము నుండి యుత్పాదించెను. [43] బ్రహ్మ గోవులను తన యుదరము నుండీ, ఆశ్వములను, గాడిదలను, గషయ మృగములను, లేళ్ళను, ఒంటెలను, వారాహములను, కుక్కలను, ఏనుగులతో సహితముగా ఈ పార్వభాగముల నుండి, పాదముల నుండి సృజించెను. ఇతరములయిన జంతు సంతతులను కూడ నాతఁడు సృజించెను. ఓషధులు, మూలికలు, లశలు, ఫలములతో ప్రేక్షతో సహితముగా ఆతని శిరోజలముల నుండి ఆవిర్భవించెను.

ఏవం పంచౌషధీః సృష్ట్వా వ్యయుంజత్సోఽధ్వరేషు వై

అస్య త్వాదౌ తు కలస్య త్రేతాయుగముఖే పురా

గౌరజః పురుషోఽథావీరశ్వాశ్వతరగర్ధభాః

ఏతేగ్రామ్యాః స్మృతాః సప్త అరణ్యా: సప్త చాపరే

శ్వోదో ద్వీపినో హస్తీ వానరః పక్షిపంచము

ఔదకాః పశవః షష్టాః సప్తమాస్తు సరీసృపాః

మహిషా గచయోష్ట్రాశ్చ ద్విఖురాః శరభో ద్విషః

మర్కటః సప్తమో హ్యేషాం చరణ్యః పశవస్తు తే

యత్రీం చ ఋచం చైవ త్రీవృత్సోమరథంతరే

అగ్నిష్టోమం చ యజ్ఞానాం నిర్మమే ప్రథమాన్ముఖాత్

పూర్వము, ఈ కల్పారంభమున, త్రేతాయుగారంభమున, ఆ బ్రహ్మ ఐదు విధములయిన ఓషధులను సృజించెను. తరువాత యజ్ఞక్రియల యందు నిమగ్నుఁడయ్యెను. (46) గోవులు, మేకలు, పురుషులు, గొణేలు, అశ్వములు, గార్ధభములు, కంచర గాడిదలు - ఈ ఏడును గ్రామ్య (జంతువులుగా)ములుగా స్మరింపఁబడినవి. ఇవి కాక మరియేడు - ఆరణ్యకములు, క్రూర జంతువులు (మాంసమును దీనునవి) వ్యాఘములు, ఏనుగులు, వానరములు, ఐదవ వర్గముగను, పక్షులు, నీటి జంతువులు ఆరవ వర్గముగా, సరీసృపములు (ప్రాకు జంతువులు) ఏడవ వర్గముగా గణింపబడినవి. మహేషములు (దున్నపోతులు, గేదేలు) గవయ మృగములు, ఉష్ణములు(ఒంటెలు) డెక్కలు గల జంతువులు, శరభములు (ఎనిమిది కాళ్లు గలిగిన జంతువు), ఏనుగులు,మర్కటములతో ఏడు వర్గములు ఆరణ్యక జంతువులు. (49) బ్రహ్మ తన మొదటి ముఖము నుండి గాయత్రినీ, ఋక్కును, త్రివృత్సోమమును రథంతరమును, యజ్ఞసంబంధమయిన అగ్నిష్టోమమును సృజించెను. (50) (50 - 53 (శ్లోకములలో) వేదవాజ్మయము, వేదచ్చందస్సులు ప్రత్యేకములయిన యాగములు బ్రహ్మ ముఖము నుండి యుత్పన్నములయినీవనీ వర్ణింపం ఐడీనవీ. త్రివతోమము = వృతమయిన స్తోమము. అండు - మొదటి ప్రతి త్రిచ నుండి మొదటి మూఁడు ఋక్కులు కలిపి చదువబడును. తరువాత రెండవ సూక్తము, తరువాత తుదను మూఁడవ సూక్తము పఠింపఁబడును).

 యజూoషి త్రైష్టుభం ఛందః స్తోమం పంచదశం తథా

 బృహత్సామ తథోక్తం చ దక్షిణాత్సోఽసృజన్ముఖాత్

సామాని జగతీం చైవ స్తోమం సప్తదశం తథా

వైరూప్యమతీరాత్రం చ పశ్చిమాత్సోఽసృజన్ముఖాత్

ఏకవింశమధర్వాణమాప్తోర్యామం తథైవ చ

అనుష్టుభం స వై రాతిర చతుర్థాదస్రుజన్ముఖాత్

విద్యుతోఽశనిమేఘాంశ్చ రోహితేంద్రధనూరషీ చ

సృష్ట్వాసౌ భగవాన్ దేవః పర్జన్యమితి విశ్రుతమ్

ఋచో యజుంషి సామానీ నీర్మమే యజ్ఞసిద్ధయే

ఉచ్చావచాని భూతాని గాత్రేభ్యస్తస్య జజ్ఞిరే

బ్రహ్మణస్తు ప్రజాసర్గం సృజతోహి ప్రజాపతేః

సృష్ట్వా చతుష్టయం పూర్వం దేవర్షిపితృమానవాన్

దక్షిణ ముఖము నుండి, యజుర్వేదమును, త్రిష్టుభఛందస్సును, పంచదశ స్తోమమును, బృహత్సోమమును బ్రహ్మ సృజించెను. (51) పశ్చిమ ముఖము నుండి, సామ సూక్తములను, జగతీ ఛందస్సును, సప్తదశస్తోమమును, చైరూప్యమును, అతిరాత్రమును (ఇది జ్యోతిష్ణోమము యొక్క భాగము) సృజించెను. (82) నాలుగవ ముఖము నుండీ, ఏక వీంశ స్తోమమును, అథర్వ వేదమును, ఆస్తోర్యానమును అనుష్ట ఏ ఛందమును వైరాజ ఛందమును సృజించెను. (53) వీఖ్యాతముయన పర్జన్యమను మేఘమును సృజించిన వెనుక, మెతలుపులతో, వడగండ్లతో ఉరుములతో గర్జనలతో రోమాత (ఎని) వద్దము గలిగిన ఆంధ్ర ధనువులను గలిగిన మేఘములను సృజించినది వీశ్రుతమే కదా. (54) యజ్ఞసిద్ధికోటకు, బ్రహ్మ ఋగ్వేదయజుర్వేద సామవేద మంత్రముల సృజించేను. పెద్దవి చిన్నవి (ఉన్నతములయినవి నీచములయినవి) యగు భూతములనేకములు బ్రహ్మ గాత్రము నుండి (అవయవముల నుండి) పుట్టినవి. (56) ప్రజాపతి చతుర్విధములయిన, దేవతలను, ఋషులను, పితరులను, మానవులను మొట్టమొదట సృజించుచు, కదలడనట్టివీ, కదలడనట్టవీ (చరోచరములయిన) (రథంతరములు - సామగానము ననుసరించీ చదువబడునట్టి దిక్కులు. (ఆపస్తోమ మనునీదీ యొకక సోమాక్రతువును సృజించేను.

 తతోఽసృజత భూతానీ చరాణి స్థావరాణి చ

సృష్ట్వా యక్షపిశోపారశ్చ గంధర్వాప్సరసస్తదా

నరకిన్నరరక్షాంసి యః పశుమృగోరగాన్

అవ్యయం చ వ్యయం చైవ ద్వయా స్థావరంజంగమo

తేషాం యే యాని కర్మాణి ప్రాక్ సృష్టాని ప్రపేదిరే

తాన్యేవ ప్రతిపద్యన్తే సృజ్యమానాః పునః పునః

హింస్రాహింస్రే సృజన్ క్రూరే దర్మాధర్మవృతానృతే

తద్భావీతాః ప్రపద్యన్తే తస్మాత్ తత్తస్య రోచతే

మహాభూతేషు నానాత్వమ్మింధ్రియార్తేషు మూర్తీషు

వినియోగం చ భూతాహం ధాతైవవ్యద్దచాత్స్బయం

కేచిత్పురుషకారం ఈ ప్రాహుః కర్మ చ మానవాః

దైవమిత్యపరే విప్రాః స్వభావం భూతచింతకాః

పౌరుషం కర్మదైవం చ ఫలవృత్తస్వభావతీ

న చైవ తు పృథగ్భవమధికేన తతో విధుః

ఏతదేవం చ నైవం చ న చోభే నానుభే న చ

స్వకర్మవిషయం ప్రయు సత్త్వస్థాః సముదర్శినః

భూతములను సృజించెను. దక్షలను, శాచులను, గళర్వులను, అనురకతశు, మానవులను, కిన్నరులను, రాక్షసులను, పక్షులను, జంతువులను, హరిణములను, సళ్ళములను, స్మారీచి బ్రహ్మా తరువాత, అవ్యడుములు (మార్పు సౌందనీవీ) వ్యయములు (మార్పు చెందునట్టివి) వానీతో సహచరములు, అచరములునయిన భూతములను సృజించెను. (58) ఈ భూతములు పునః పునః సృష్టింపబడినను, వారు ఏ కర్మలను పూర్వజన్మల యందోచరించియుండిరో, వానినే యవలంబించిరి. (59) పూర్వజన్మ లక్షణములయిన హింసా హింసలు, క్రూర స్వభావము, ధర్మా ధర్మములు, సత్యానృతములు, మొదలగు వానినే వారు పొందిరి. అందుచే వారు సహజముగా పరస్పర మొండొరుల యెడ నీష్టమును (ప్రీతినీ) గలిగియుండిరి. (60) భూతములయందు నాసాత్వ గుణలక్షణమును, వోని వివిధ భౌతిక దేహములను, ఆ శరీరములు ఇంద్రియములచే వారినీ పొందుటను, వానీ విని యోగమును, బ్రహ్మయే వీధించి సృజించెను. (61) కొందఱు పురుషకారమే (మానవ ప్రయత్నమే) కర్మ సిద్ధికి కారణమందురు. పండితులయిన ఇతరులు పురుషకారము కాదు 'దైవ' మని యందురు. కొందతో భూతముల గూర్చి యాలోచించువారు అయ్యది స్వభావము, అంతర్నిష్ణమై యున్న దందురు. (62) పౌరుషమునకు దైవమునకు కార్య ప్రవృత్తి ఫలసిద్ధి విషయమై భేదము లేదందురు. ఆ ఫలవృత్తి స్వభావ సిద్ధమయి కలుగునందురు. ఇయ్యది ఒకరన్నట్లు పురుషకార జన్యము కాదు, దైవకృతముకాదు, స్వభావ ఘటితము కాదు, సత్వస్థులు సమదర్శనులు, ప్రపంచము స్వకర్మవిషయమయినదని యందురు.

నానారూపం చ భూతానాం కృతానాం చ ప్రపంచనమ్

 వేదశబ్ధేభ్య ఏవాధౌ నిర్మమే స మహేశ్వరః

 ఆర్షాణి చైవ నామాని యాశ్చ దేవేషు దృష్టయః

శర్వర్యంతే ప్రసూతానాం పునస్తేభ్యో దధాత్యజః

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ద్వితీయేఽనుషంగపాదే

 మానస సృష్టి వర్ణనం నామాష్టమోధ్యాయః

ఆరంభమున వేదశబ్దముల ననుసరించి భూతములను వివిధములయిన రూపములతో, వివిధ లక్షణములతో, మహేశ్వరుఁడు (బ్రహ్మ) సృజించెను. దేవతలయందు ఆర్షములయిన సామములు దృష్టి భేదములు ఎన్నికనవచ్చు చున్నవో, వానిని అవ్యయుఁడు, అజాతుఁడు, నయిన పరమాత్మ శర్వర్యంతమున (నిశాంతమున) ప్రసూతులయిన (పుట్టిన వారికి) నిర్ణయించును.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండ మహాపురాణమున పూర్వ భాగము నందు ద్వీతీయానుషంగపాదమున మానవ సృష్టి వర్ణనమనియెడి అష్టమాధ్యాయము సమాప్తము.