బ్రహ్మాండ మహా పురాణము
13 - శ్రాద్ధమాచరించుటకు పుణ్యప్రదేశకీర్తనము
బృహస్పతి రువాచ :-
సకృదభ్యర్చితాః ప్రీతాః భవంతి పితరో వ్యయాః ।
యోగాత్మానో మహాత్మానో విపాప్మానో మహౌజసః ॥
ప్రేత్య చ స్వర్గలోకాయ కామైశ్చ బహులం భువి ।
యేషు వాష్యనుగృహంతి మోక్షప్రాప్తిః క్రమేణ తు ॥
తాని వక్ష్యామ్యహం సౌమ్య సరాంసీ సరితస్తథా ।
తీర్థాని చైవ పుణ్యాని దేశాంశ్చైలాంస్తథాశ్రమాన్ ॥
పుణ్యో హి శ్రీషు లోకేషు సదైవామరకంటకః ।
పర్వతప్రవరః పుణ్యః సిద్ధచారణసేవితః ॥
యత్ర వర్షసహస్రాణి ప్రయుతాన్యర్బుదాని చ ।
తపః సుదుశ్చరం లేపే భగవానంగీరాః పురా ॥
యత్ర మృత్యోర్గతిర్నాస్తి తథైవాసురరక్షసామ్ ।
న భయం నైవ చాలక్ష్మీర్యావద్భూమిర్ధరిష్యతి ॥
తపసా తేజసా తస్య భాజతే స నగోత్తమః ।
శృంగే మాల్యవతో నిత్యం వహ్నిః సంవర్తకో యదా ॥
మృదవస్తు సుగంధాశ్చ హేమాభాః ప్రియదర్శనాః ।
శాంతా కుశా ఇతి ఖ్యాతాః పరిదక్షిణనర్మదామ్ ॥
దృష్టవాన్ స్వర్గసోపానం భగవానంగీరాః పురా ।
అగ్నిహోత్రే మహాతేజాః ప్రస్తారార్థం కుశోత్తమాన్ ॥
తేజ దర్భేషు యః పిండాన్ మరకంటకపర్వతే ।
దద్యాత్ సకృదపి ప్రాజ్ఞః తస్య వక్ష్యామీ సత్పలమ్ ॥
తద్భవత్యక్షయం శ్రాద్ధం పితౄణాం ప్రీతివర్ధనమ్ ।
అంతర్ధానం చ గచ్ఛంతి క్షేత్రమాసాద్య తత్సదా ॥
తత్ర జ్వాలాసరః పుణ్యం దృశ్యతే చాపి పర్వసు ।
సశల్యానాం చ సత్వానాం విశల్యకరణీ నదీ ॥
ప్రాధక్షిణాయతా వర్తా వాపీ సా సునగోత్తమే ।
కళింగదేశపశ్చాధే శృంగే మాల్యవతో విభోః ॥
సిద్ధిక్షేత్రమృషిశ్రేష్ఠా యదుక్తం పరమం భువి ।
సమ్మతం దేవదైత్యానాం శ్లోకం చాప్యుశసా జగౌ ॥
బృహస్పతి ఇట్లు చెప్పెను.
వ్యయము చెందనివారు, (అవ్యయులు) మార్పు చెందినవారు నగు పితరులు ఒక్కసారి అభరితులయినను ప్రీతిమంతులగుదురు. వారు యోగాత్ములు. మహాత్ములు. వారు పాపము కానీ చెడ్డతనము కాని లేని విగతపాపులు. మహాతేజోవంతులు. ఓ సౌమ్యుఁడా ! పితరులు తమకు గల భూసంబంధమయిన అనుబంధముతో భక్తులను, మరణానంతరము స్వర్గలోకములతోను, తరువాత కాలక్రమమున ముక్తి ప్రాప్తితోను, ఆశీర్వదింతురు. అట్టి సరస్సులను, నదులను, తీర్ధములను, పుణ్య దేశములను, శైలములను, ఆశ్రమములను గూర్చి నేను చెప్పెదను. అమర కంటక శిఖరము ఎల్లప్పుడును పవిత్రము. మూఁడు లోకముల లోను నయ్యది శ్రేష్ఠమయినది. అది పవిత్రమయినది. తరచుగా సిద్దులు చారణులు దానిని సేవించుచుందురు. (4) అందు, పూర్వము భగవంతుఁడయిన అంగిరసుఁడు సుదుశ్చరమయిన తపమును లక్షలాది కోట్లాది సంవత్సరము లాచరించెను. (5) అందు మృత్యువు లేదు. అట్లనే సురలు రాక్షసులు లేరు. భూమి యుండునంతకాలము అందు భయము లేదు. దారిద్ర్యము (అలక్ష్మి) లేదు. (6) మాల్యవంతపర్వతము యొక్క శృంగమునందు, తపస్సుచే, తేజస్సుచే ఆ పర్వతోత్తమము సంవర్తక వహ్నివలె నిత్యము ప్రకాశించును. ప్రపంచాంతక ప్రళయమునందు ప్రకాశించునది సంవర్తకాన్నీ, (7) నర్మద యొక్క దక్షిణ భాగమున, కుశదర్భలు చాల శ్రీ బ్రహ్మాండ మహాపురాణమ్ ప్రసిద్ధములయినవి. అవి మృదువులు. సుగంధయుతములు. బంగారు కాంతితో చూడ నాశ్చర్యకరములు. ప్రియదర్శనములు. మరియు శాంతములు అనీ ఖ్యాతి నొందినవి. (8) అగ్నిహోత్రమును ప్రేల్చునపుడు పూర్వము మహా తేజస్వీయగు అంగీరోమహర్షి ప్రస్తారార్థము (అగ్ని గుండమునకు చుట్టును) ఈ కుశలనుపయోగించెను. అప్పుడతఁడు అచట స్వర్గసోపానములను దర్శించెను. (9) అమర కంటక పర్వతమున ఆదర్భతృణముల యందు ఒక్కసారే యైనను పిండముల నిడిన పొందు సత్ఫలమును చెప్పెదను. (10) ఆ శ్రాద్దము పితరుల కక్షయమయినదగును. పితరులకు ప్రీతివర్ణకము. తత్పదేశమును చేరి పితరులు అంతర్జానమును చెందెదరు. (11) పర్వములయిన పుణ్య దినములందు, అగ్ని జ్యోతులతో ప్రకాశించు జ్వాలాసరస్సు కనిపించును. అచ్చటనున్న నది విశల్యకరణి (ముండ్లతో గ్రుచ్చుకొనఁబడిన కలుగు బాధను పోగొట్టునది ఆ నది) అందుచే నది విశల్యా నది. సశల్యము లయిన జంతువుల ముండ్లచే గలుగు బాధను పోగొట్టునది. అది విశల్యకరణీ నది. (12) ప్రభుతుల్యమైన మాల్యవత్పర్వతశిఖరమున, కళింగదేశము యొక్క పశ్చిమ భాగమున, ఆ పర్వతము సందు ఒక వాపీ కలదు. (13) ఆ పర్వతము యొక్క పశ్చిమార్థ భాగమునకు అపాపి కూడ వ్యాపించినది. ఓ ఋషి శ్రేష్ఠులారా ! అయ్యది యొక సిద్ధి క్షేత్రముగా వాకొనఁబడినది. అయ్యది దేవతలచే, దైత్యులచే నంగీకరింపఁబడినది. ఋషి ఉశనుఁడు ఈ సందర్భమున నీ శ్లోకమును పఠించేను. (చదివేను)
ధన్యాస్తే పురుషా లోకే యే ప్రాప్యామరకంటకమ్ ।
పితౄన్ సంతర్పయిష్యంతీ శ్రాద్ధే పితృపరాయణాః ॥
అల్పేన తపసా సిద్ధిం గమిష్యంతి న సంశయః ।
"సకృదేవార్చిస్తత్ర స్వర్గమామరకంటకే ॥
మహేంద్రః పర్వతః పుణ్యో రమ్యః శక్షనిషేవితః ।
తత్రోరుహ్య భవేళ్పూనః శ్రాద్ధం చైవ మహాఫలమ్ ॥
వైలాటశిఖరే యుక్త్వా దివ్యం చక్షుః ప్రవర్త ।
అధృష్యశ్చైవ భూతానాం దేవవచ్చరణే మహీమ్ ॥
సప్తగోదావరే చైవ గోకర్ణే చ తపోవనే ।
అశ్వమేధఫలం స్నాత్వా తత్ర దత్తా భవేత్తతః ॥
ధూతపాపస్థలం ప్రాప్య పూతః స్నాత్వా భవేన్నరః ।
రుద్రస్తత్ర తపస్తేపే దేవదేవో మహేశ్వరః ॥
గోకర్ణే విహితం దేవైర్నాస్తికాహం నీదర్శనమ్ ।
అబ్రాహ్మణస్య సావిత్రీం పఠతష ప్రణశ్యతి ॥
దేవర్షభవనే శృంగే సిద్ధచారణసేవితే ।
ఆరుహ్య తం నియమవాంస్తతో యాతి త్రివిష్టపమ్ ॥
దివ్యైశ్చందనవృకైశ్చ పాదపైరుపశోభితమ్ ।
అపశ్చందనసంయుక్తాః ప్పందంతి సతతం తతః ॥
నదీ ప్రవర్తతే తాభ్యస్తామ్రపర్ణీతి నామతః ।
యా చందనమహాఖండొద్దక్షిణం యాతీ సాగరమ్ ॥
నద్యోస్తస్యాశ్చ రామాయాస్తూహ్యమాస మహోదధౌ ।
శంఖా భవంతి శుక్యశ్చ జాయతే యాసు మౌక్తికమ్ ॥
ఉదకొనయనం కృత్వా శంఖమౌక్తికసంయుతమ్ ।
ఆధీభిద్యాధిభిశ్చైవ ముక్తా యాంత్యమరావతీం ॥
చందనేభ్యః ప్రసూతానాం శంఖానాం మౌక్తికస్య వా ।
పాపకర్తనపి పితూంస్తారయంతి యథాశ్రుతి ॥
చంద్రతీర్దే కుర్యాం చ కావేరీప్రభవే క్షయే ।
శ్రీపర్వతస్య తీర్దేషు వైకృతే చ తథా గిరౌ ॥
ఏకస్థా యత్ర దృశ్యంతే వృక్షా హ్యాశీరపర్వతే ।
పలాశాః ఖాదీరాః బిల్వాః ప్రక్షాశ్వత్థావికంకతాః ॥
'అమరకంటక' పర్వతమును చేరి ఎవ్వరు పితృ పరాయణులయి శ్రాద్ధమునందు, పితరులను తృప్తి పరచెదరో వారు ధన్యులు. (15) ఒక్కమారు పితరుల సందు శ్రాద్ధమున నభ్యర్చించిన వారు స్వర్గము నందెదరు. అల్పమయిన తపస్సుచే వారు సిద్ధిని పొందుటలో సంశయము లేదు. (16) మహేంద్ర పర్వతము పుణ్యప్రదమైనది. రమ్యమైనది. ఇంద్రునిచే అభ్యర్చింపఁబడునది. ఆ పర్వతారోహణమున జనులు పవిత్రులయ్యేదరు. అందాచరించిన శ్రాద్దము మహాఫలము నొసంగును. (17) వైలాట శిఖరమున యోగాభ్యాసము నాచరించిన, దివ్య చక్షువు యొక్క ప్రవర్తనమగును, భక్తుఁడు భూమిపై భూతములకు అదృశ్యుఁడు (చేరరానీవాఁడు) దేవుని వలె భూమి యందు సంచరించును. (18) సప్త గోదావరి యందు, తపోవనమయిన గోకర్ణము నందు, స్నానము చేసి దానము లొసంగిన, ఆ వ్యక్తి అశ్వమేధమాచరించిన వచ్చు ఫలితము లందును. (19) «ధూమపాపమను స్థలమును చేరి. మానవుఁడు స్నానము చేసిన పవిత్రుఁడగును. దేవదేవుఁడు మహేశ్వరుఁడునయిన రుద్రుఁడా ప్రదేశమున తపస్సాచరించెను. (20) గోకర్ణ క్షేత్రమున నాస్తికులకు నీదర్శన మొసంగునొక సాక్ష్యము (ప్రత్యక్షదర్శనము) దేవతలొసంగిరి, అబ్రాహ్మణుం డెవ్వఁడైన నందు సావిత్రీ మంత్రమును జపించిన, జపించుచుండగనే ఆతడు నశించును. (21) ఎవ్వండయిన నీయమవంతుఁడయి, దేవర్షి భవన (మనుపర్వత) శృంగము నధిరోహించిన ఆతఁడు తరువాత త్రివిష్టపమును పొందును (స్వర్గము). ఆ దేవర్షి భవన పర్వతము సిద్దచారణ సేవితము. (22) అందొక వనమున్నది. అది 'దివ్యమయిన చందన వృక్షములతో ఉపశోభితమయినది. చందనముతో మిశ్రమయిన ఉదకము వాని నుండి ఎల్లప్పుడు స్రవించుచుండును. (23) ఆ గంధోదకములతో గూడి యొక నది సదా ప్రవహించును. ఆ నదీ తామ్రపర్ణి, ఆ నది చందన వృక్షములు గలిగిన మహాఖండము నుండి దక్షిణముగా సముద్రమువైపు ప్రవహించును. (24) ఎందుండి ముత్యములు జనించునో నట్టి ముత్తెపు చిప్పల నుండి శంఖములు పుట్టును. ఇయ్యవి నదీ ప్రవాహము ద్వారా సముద్రమునకు తీసికొని పోవఁబడును. (25) శంఖ మౌక్తిక యుతమయిన యుదకమును సేవించినచో (అనయనంకృత్వా) వ్యాధులచేతను, మనోవ్యాధులచేతను గలుగు బాధల నుండి విముక్తులయి మానవులు అమరావతిని (స్వర్గమును) చేరుదురు. (26) చందనము నుండి యుద్భవించిన శంఖములనుగాని ముత్యములను గాని దాన మొనరించినవారు, పాపకర్తలయినను, పితరులు తరించెదరు. ఇది శ్రుతిబద్ధము. (27) చంద్రతీర్థమందు - కన్యాకుమారి యందు, కావేరీ జన్మస్థానమునందు, శ్రీ పర్వత తీర్థములందు, వికృతగిరియందు - యీ పుణ్య ప్రదేశములందు - మరియు ఒక్కచోటనే పలాశ వృక్షములు, ఖాదిర వృక్షములు, బిల్వములు, ఇక్షములు, అశ్వతములు, వీకంకతములు, ఉన్న ఉశీర పర్వతము నందు.
ఏవం ద్విమండలావిద్ధం విజ్ఞేయం ద్విజసత్తమాః ।
అస్మింస్యక్వా జనోలింగాని క్షిప్రం యాత్యమరావతీమ్ ॥
శ్రీపర్వతస్య తీర్దే తు వైకృతే చ తథా గిరౌ ।
కర్మాణి తు ప్రయుక్తాని సిధ్యంతో ప్రభవాప్యయే ॥
దుష్ప్రయుక్తా హి పితృసు సుప్రయోగా భవంత్యుత ।
పితృణాం దుహితా పుణ్యా నర్మదా సరితాం వరా ॥
యత్ర శ్రాద్ధానీ దత్తాని హ్యక్షయాణి భవంత్యుత ।
మాఠరస్య వనే పుణ్యే సిద్ధచారణసేవితే ॥
అంతర్ధానేన గచ్ఛంతి యుక్త్యా తస్మిన్మహాగిరౌ ॥
వింధ్యే చైవ గిరౌ పుణ్యే ధర్మాధర్మనిదర్శనీం ॥
ధారాం పాపాన పశ్యంతి ధారాం పశ్యంతి సాధవః ।
తత్ర తదృశ్యతే పాపం కేషాం చిత్పాపకర్మణామ్ ॥
కైలాసే యా మతంగస్య వాపీ పాపనిషూదనీ ।
స్నాత్వా తస్యాం దివం యాంతి కామాచారా వీహంగమాః ॥
శౌర్పారకే తథా తీర్దే పర్వతే పాలమంజరే ।
పాండుకూపే సముద్రాం పిండారకతటే తథా ॥
విమలే చ విపాహే చ సంకల్పం ప్రాప్య చాక్షయమ్ ।
శ్రీవృక్షే చిత్రకూటే చ జంబూమారే చ నిత్యశః ॥
అసితస్య గీరా పుణ్యే యోగాచార్యస్య ధీమతః ।
తత్రాపి శ్రాద్దమానంత్యమసితాయాం చ నిత్యశః ॥
పుష్కరేష్వక్షయం శ్రాద్ధం తపశ్చైవ మహాఫలమ్ ।
మహోదధా ప్రభాసే చ తద్వదేవ వినిర్ధికేత్ ॥
దేవికాయాం వృషో నామ కూపః సిద్ధనిషేవితః ।
సముత్పతంతీ తస్యాపో గవాం శబేన నిత్యశః ॥
యోగేశ్వరైస్సదా జుష్టః సర్వపాపబహిష్కృతః ।
దద్యాచ్ఛార్ధం తు యస్తన్మిస్తస్య వక్ష్యామి యత్పఫలమ్ ॥
అక్షయం సర్వకామీయం శ్రాద్ధం ప్రీణాతి వై పితౄన్ ।
జాతవేదః శిలాస్తత్ర సాక్షాదగ్నౌ సనాతనమ్ ॥
అన్నియును కూడియున్న ఆ ప్రదేశమును “ఉద్విమండలావీద్ధమని' ఓ ద్విజ సత్తములారా ! యెఱుంగవలయును. ఎవ్వడీ ప్రదేశమున శరీరమును త్యజించునో, వెంటనే యతఁడు స్వర్గనగరమయిన అమరావతిని చేరును. శ్రీ పర్వతము యొక్క తీర్ధముల యందు వైకృతగిరి యందు ఆచరించిన కర్మలు మొదటి నుండియు తుదివరకు ఫలించును. (31) అందు ప్రయుక్తములయిన కర్మలు దుష్ప్రయుక్తములు (యథావిధి ఆచరింపఁబడినవి కాకపోయినను) అయినను సుప్రయుక్తములయిన కర్మలవలె సత్ఫలితముల నొసంగును. నదులలో పుణ్యవతియై శ్రేష్ఠమయిన నర్మద పితరుల యొక్క దుహిత అందాచరింపఁబడిన శ్రాద్దములు అక్షయములగును. (32) పుణ్యవంతమయినది, సిద్ధులచే చారణులచే సేవింపం బడునట్టిదియునగు 'మాఠర” వన పుణ్యవనమున, యోగసంబంధమయిన అభ్యసము లాచరించిన వెనుక, భక్తులు అదృశ్యులగుదురు. స్వర్గమును జేరుదురు. (33) పవిత్రమయిన వింధ్య పర్వతమునందు, ధర్మాధర్మములకు నీదర్శనమయిన యొక జలధార (జలపాతము) కలదు. పాపులా జలపాతమును కనరు. సాధువులయిన సత్పురుషులు మాత్రమే దానిని కాంచగలరు. ఈ విధముగా దుష్కర్ముల యొక్క పాపుల యొక్క దుష్కర్మ యా ప్రదేశమున సందృశ్యమానమగును. (35) కైలాస పర్వతమున నున్న పాపనిషూదని యనెడు మతంగ పర్వతపు తటాకమున కామ గమనము గలిగి యథేచ్ఛగా సంచరింపఁగల పక్షులు, స్నానమాడి తరువాత తత్ఫలితమున స్వర్గమును చేరును. (36) పవిత్ర శౌర్ఫారక, పాలమంజర పర్వతము, సముద్రమునకు దగ్గరనున్న పాండుకూపము, విమలము పాపరహితమునగు పిండారతటము మొదలగు క్షేత్రముల యందు సత్సంకల్పయుతముగ శ్రాద్ధ మాచరించిన అతఁడు అక్షయమయిన పుణ్యమును పొందును. (38) అంతియేకాక, చిత్రకూటమున, శ్రీ వృక్షమున, జంబూ మార్గమున, పవిత్రమయిన అసిత పర్వతమున, యోగాచార్యుఁడయిన ధీమంతుఁడు శ్రాద్ధమాచరించిన అనంతమయిన పుణ్యము నందును. (39) పుష్కరము నందు పెట్టిన శ్రాద్దము అక్షయ పుణ్యము నొసంగును. అట్లే పుష్కరమున ఆచరించిన తపస్సు మహాఫల మొసంగును. సముద్ర తీరము నందును, ప్రభాస తీర్థమునందును, అట్టిదే ఫలము కలుగునని నిర్దేశింపఁబడినది. (40) ‘వృష' యను పేరింటి యొక కూపము "దేవకి' యందుఁగలదు. అందు సిద్ధులుందురు. అందు ఎల్లప్పుడు ఆవుల యొక్క వృషభముల యొక్క శబ్దములతో నీరు వచ్చుచుండును. (41) యోగీశ్వరులచే నది యెల్లప్పుడును అధివసితము సర్వపాప బహిష్కృతమయినది. అనగా పాపరహితము అందు శ్రాద్దమును పెట్టిన వారికి గలుగు ఫలితమును చేప్పెదను. శ్రాద్ధము అనంత ఆనంద మొసంగును. సర్వమయిన కోరికలను తీర్చును. ఆ శ్రాద్ధము పితరులకు ప్రీతిని కలిగించును. అందు 'జాతవేద - శిల' యను పర్వతము కలదు.
శ్రాద్ధాని చాగ్నికార్యం చ తత్ర కుర్యాత్సదా క్షయమ్ ।
యత్రాగ్నిం ప్రవిశతత్ర నాకపృష్టే ప మోదతే ॥
అగ్నిః శాంతః పునర్జాతస్తత్ర దత్తం తతో క్షయమ్ ।
దశాశ్వమేధికే తీర్థే తీర్థే పంచాశ్వమేధికే ॥
యథోద్దిష్టఫలం తేషాం క్రతూనాం నాత్ర సంశయః ।
ఖ్యాతం హరశిరోనామ తీర్థం సద్యో వరప్రదమ్ ॥
శ్రాద్ధం తత్ర సదాఖక్షయ్యం దాతా స్వర్రే చ మోదతే ।
శ్రాద్ధం సుందనిసుందే చ దేయం పాపనిషూదనమ్ !!
శ్రాద్ధం తత్రాక్షయం ప్రోక్తం జపహోమతపాంసి చ ।
అజతుంగే శుభే తీర్థ తర్పయేత్సతతం పితమ్ ॥
దృశ్యతే పర్వసు చ్ఛాయా యత్ర నిత్యం దివొకసామ్ ।
పృధివ్యామక్షయం దత్తం విరజా యత్ర పాదపః ॥
యోగేశ్వరైః సదా జుష్టః సర్వపాపబహిష్కృతః ।
దద్యాత్ఛాద్ధం తు యస్తస్మిన్ తస్య వక్ష్యామి యత్ఫలమ్ ॥
అర్చిస్తేన వై సాక్షాద్భవంతీ పితరః సదా ।
అస్మింశ్లోకే వశీ చ స్యాతైత్య స్వర్ణే మహీయతే ॥
ప్రాయశో మద్రవా పుణ్యా శివో నామ ప్రదస్తథా ।
యత్ర వ్యాససరః పుణ్యం వ్యో బ్రహ్మప్రదస్తథా ॥
ఊర్ణంతః పర్వతః పుణ్యో యత్ర యోగేశ్వరాలయః ।
అతైవ చాశ్రమః పుణ్యో వసిష్ఠస్య మహాత్మనః ॥
ఋగ్యజుస్పామశిరసః కపోతాః పుష్పసాహ్వయాః ।
ఆఖ్యానపంచమ వేదాః సృష్టి హ్యేతే స్వయంభువా ॥
గత్వైతాన్ముచ్యతే పాపార్టీతో వహ్నిం సమాశ్రయన్ ।
శ్రాద్దం ఛానంత్యమేతేషు జపహోమతపాంసి చ ॥
పుండరీకే మహాతీర్థ పుండరీకసమం ఫలమ్ ।
బ్రహ్మతీర్థ మహాప్రాజ్ఞ సర్వయజ్ఞసమం ఫలమ్ ॥
సింధుసాగర సంభేదే తదా పంచనదే క్షయమ్ ।
విరజాయాం తథా పుణ్యం మద్రవాయాం చ పర్వతే ॥
అచ్చట నాచరింపఁబడిన శ్రాద్ధములు, ఇతర పుణ్యకార్యములు అనంతమయిన, ఆనంద మొసంగును. అందు అగ్నిని ప్రవేశించు నతఁడు స్వర్గమున మోదము నొందును. (44) ఒక ప్రదేశమున్నది. అందు అగ్ని శాంతుఁడు. మరల నతఁడు పుట్టును రగులొల్పఁబడును). తత్రదేశమున దత్తమయినదీ అక్షయమగును. దశాశ్వమేధికమున పంచాశ్వమేధికమున నాచరింపఁబడిన దానములు (శ్రాద్ధములు) క్రతువులు, ఉద్దిష్ట ఫలము నొసంగుననుటలో సంశయము లేదు. (45) 'హరశిర' మను నొక ప్రసిద్ధ తీర్థము కలదు. అయ్యది వెంటనే వరముల నొసంగును. అందాచరించిన శ్రాద్దము సదా అక్షయ ఫలమొసంగును. దాత స్వర్గమున ఆనందించును. పవిత్ర ప్రదేశమయిన 'సుందనిస్తుంది మందు శ్రాద్దమును పెట్టవలయును. అయ్యది పాపనాశనము. (47) అచ్చటాచరించిన శ్రార్ధము అక్షయమని చెప్పఁబడినది. అట్లే జపహోమ తపములు కూడ. 'అజతుంగమను శుభంకరమయిన తీర్థమున తర్పణము లొసంగి పితరులను ప్రీతులను చేయవలయును. పర్వదినములలో దేవతల దృశ్యము లీక్షేత్రముననే యగుపించును. ‘విరజ'యను వృక్షమెందు వృద్ధి పొందునో, అందు ప్రదత్తమైనది. పృథివి యందక్షయమగును. (49) ఇందు యోగేశ్వరులు సదా నివసింతురు. 'ఇది సర్వపాప బహిష్కృతమయినది. అందు శ్రాద్ధమాచరించు వ్యక్తి పొందు ఫలమును చెప్పెదను. (50) వానిచే పితరులు ప్రత్యక్షముగా పూజింపఁబడిన వారగుదురు. ఆతఁడీ లోకమున ఇంద్రియ వశీగా నగును, మరణానంతర మతఁడు స్వర్గమున పూజింపఁబడును. (51) సాధారణముగా మద్ర దేశీయులు పుణ్యులు. అట్లే 'శివ' నామమునఁబరంగు హ్రదము కూడ పుణ్యమయినది. వ్యాస సరస్పునునది యందు పుణ్యమయినది. అట్లే బ్రహ్మ ప్రదము కూడ పవిత్రమయినది. (52) (ఊర్షంతమును పర్వతము పుణ్యమైనది. తత్పదేశమున యోగవిద్య యందు శ్రేష్ఠుఁడయిన యోగేశ్వరుని ఆలయము (స్థానము) కలదు. ఇందే, మహాత్ముఁడయిన వసిష్టుని ఆశ్రమమున్నది. అది పుణ్యమయినది. (53) స్వయంభువుఁడయిన బ్రహ్మచే ఋక్, యజుః, సామ, శిరస్కములు కపోతములు, పుషసాహ్వయములు, ఆఖ్యాన పంచములయిన వేదములు ఇవి బ్రహ్మచే సృజించబడినవి. (పుష్ప సాహ్వయము - పుష్పముతో సమానమైన ఇందే 'పంచమవేదము చెప్పం బడినది;) (54) ఈ ప్రదేశములను దర్శించి, అగ్నీ నాశ్రయించు (ఆగ్నికార్య మొనర్చు) నటీ ద్వీజుఁడు పాపముల నుండి విముక్తుఁడగును. ఈ పవిత్ర తీర్థములందు శ్రాద్ధముల, నాచరింప ఆనందమొసంగును. అట్లే ఇందాచరించిన జపహోమ తపస్సులు మోక్షదములు. (55) పుండరీక మహాతీర్థమున పుండరీక సమఫలము కలుగును. ఓ మహాప్రాజ్ఞ ! బ్రహ్మతీర్థ కృతశ్రాద్ధాదులకు సర్వయజ్ఞముల ఫలము సంప్రాప్తించును. పవిత్ర సింధునది సముద్రములో గలియు ప్రదేశమునను, మరియు పంచనదమునను శ్రాద్ధమాచరించిన అక్షయ పుణ్యము కలుగును. వీరజ యందు, మద్రవ పర్వతమునందు కూడ నట్టిదే పుణ్యము సంప్రాప్తమగును.
దేయం సప్తనదే శ్రాద్ధం మానసేనావిశేషతః ।
మహాకూటే హ్యనంతే చ గిరౌ త్రికకుదే తథా ॥
సంధ్యాయాం చ మహానద్యాం దృశ్యతే మహదద్భుతమ్ ।
అశ్రద్ధధానం నాభ్యేతి సా చాభ్యేతి ధృఢవ్రతమ్ ॥
సంశ్రయిత్వైకమేకేన సాయాహ్నం ప్రతి నిత్యశః ।
తస్మిన్దేయం సదా శ్రాద్ధం పితౄణామక్షయార్థినామ్ ॥
కృతాత్మా వాళికృతాత్మా చ యత్ర విజ్ఞాయతే నరః ।
స్వర్గమార్గప్రదం నామ తీర్థం సద్యోవరప్రదమ్ ॥
చీరాణ్యుత్సృజ్య యస్మింస్తు దివం సప్తర్షయో గతాః ।
అద్యాపీ తాని దృశ్యంతే చీరాణ్యంభోగాతాని తు ॥
స్నాత్వా స్వర్గమవాప్నోతి తస్మింస్తీర్ణోత్తమే నరః ।
ఖ్యాతమాయతనం తత్ర నందినః సిద్ధసేవితమ్ ॥
నందీశ్వరస్య సా మూర్తిరిరాచారైర్న దృశ్యతే ।
దృశ్యంతే కాంచనా యూఎస్వార్చిషో భాస్కరోదయే ॥
కృత్వా ప్రదక్షిణం తాంస్తు గచ్ఛంత్యానందితా దివమ్ ।
సర్వతశ్చ కురుక్షేత్రం సుతీర్ధం తు విశేషతః ॥
పుణ్యం సనత్కుమారస్య యోగేశస్య మహాత్మనః ।
కీర్త్యతే చ శీలాన్ దత్వా పితృభ్యో వై సదా క్షయమ్ ॥
ఉక్తమేవాన్షయం శ్రాద్ధం ధర్మరాజనిషేవితమ్ ।
శ్రాద్ధం దత్తమమావాస్యాం విధినా చ యథాక్రమమ్ ॥
పుంసః సన్నిహితాయాం తు కురుక్షేత్ర విశేషతః ।
అర్చయిత్వా పితృంస్తత్ర సపుత్రస్వనృణో భవేత్ ॥
సరస్వత్యాం వినశనే ప్లకప్రశ్రవణే తథా ।
వ్యాసతీర్దే దృషద్వత్యాం త్రిఫ్లక్షే చ విశేషతః ॥
దేయ మోంకారపవనే శ్రాద్ధమక్షయమిచ్ఛతా ।
శవతారే గంగాయాం మైనాకే చ నగోత్తమే ॥
యమునాప్రభవే చైవ సర్వపాపైః ప్రముచ్యతే ।
అత్యుష్ణాశ్చాతీశీతాశ్చ ఆపస్తస్మిన్ నిదర్శనమ్ ॥
యమస్య భగినీ పుష్యా మార్తండదుహితా శుభా ।
తత్రాక్షయం సదా శ్రాద్ధం పితృభిః పూర్వకీర్తితమ్ ॥
సప్తనదమందుఁగాని, మానసము నందుగాని చేసిన శ్రాద్దము విశేష ఫలప్రదము. అట్లే మహాకూటము నందు, అనంత గిరీయందు త్రికకుదముందు చేసిన విశేష ఫలితము కలుగును. (58) మహానది యందు సంధ్యా సమయమున మహాద్భుతమయిన దృశ్యము కనఁబడును, శ్రద్ద రహితునకాదృశ్యము కానరాదు. దృఢవ్రతునకు కనఁబడును. (59) పితరులకు అక్షయత్వము అర్థించువారు ఆయా తీర్థములను ఒకదాని తరువాత వేటిక్కటికి చేరి ఆశ్రయించి సాయంకాలములందు, ప్రతి నిత్యము, శ్రాద్ధమును చేయవలయును. (60) ఒక తీర్థమున్నది. దానిపేరు 'స్వర్గమార్గప్రద' స్వర్గమునకు మార్గము నొసంగునది. అది వెంటనే వరము నొసంగునది. ఆ ప్రదేశములో నరుఁడు కృతాత్ముఁడో? (ఇంద్రియ నిగ్రహణము కలిగిన ధన్యుఁడు) అకృతాత్ముఁడో తెలీయగలదు. (61) సప్తర్షులు తమ చెట్ల బెరడు నుండి నేయబడిన చీర వనసములను అచ్చట విసర్జించిన తరువాతనే స్వర్గమున కరిగిరి. (ఇది వారి జితేంద్రియత్వమునకు నిదర్శనము). ఇప్పటికి కూడ వారు వదలిన నార చీరలు నీటియందుఁగాననగును. ఇచ్చటి తీర్గోత్తమము నందు స్నానమాచరించి నరుడు స్వర్గమును పొందును. ఇచ్చటొక ఖ్యాతమయిన నందికి ఆయతనము (దేవాలయము) కలదు. ఈ ఆయతనము సిద్ధసేవితము. (63) నందీశ్వరుని యొక్క యామూర్తి సదాచార రహితులకు కనబడదు సూర్యోదయ సమయమున యజ్ఞ యూపములు (స్తంభములు) కాంతి జ్వాలా స్తంభములు బంగారు వీకారమయినవి కనఁబడును. వానికి ప్రదక్షిణ మాచరించిన వారు ఆనంద భరితులగుదురు; స్వర్గమును పొందుదురు. కురుక్షేత్రమున. యావత్పదేశము విశేష ఫలవంతమయిన యొక సుతీర్థము. (65) అయ్యది యోగేశ్వరుఁడు మహాత్ముఁడునైన సనత్కుమారుని యొక్క పుణ్యమయిన తీర్థము. అందు పితరులకు తీలలోసంగిన అక్షయ పుణ్యములు కలుగును. (66) అందు అమావాస్యనాడు విధివత్తుగా యథాక్రమము ధర్మరాజాచరించిన శ్రాద్ధము ఉత్తమము. విశేష ఫలదము. (సరస్వతీనది యందు) తత్సమీపమున అక్షయఫలము నొసంగును. కురుక్షేత్రమున కుమారుఁడు పితృ శ్రాద్ధమాచరించిన ఆతఁడు -ఋణ విముక్తుఁడగును. తండ్రి ఋణము తీర్చినవాఁడగును. సరస్వతీ తీర్థమున, వినశనమున, ప్లక్షప్రస్రవణమున, వ్యాసతీర్థమున, దృషద్వతీ తీర్థమున త్రిఫ్లక్షకము మొదలగు తీర్థముల శాశ్వత ఫలమపేక్షించువారు పితృశ్రాద్దముల నొనర్పవలయును. ఓం కార ప్రణవమున, గంగానదియందలి శక్తావతారమున, పర్వతోత్తమమయిన మైనాకమున మరియు యమునా జన్మ స్థానమున శ్రాద్ద మాచరించిన సర్వపాప విముక్తులగుదురు. జలములు అత్యుష్ఠములు అతిశీతలములుగా నుండుట అందులకు దర్శనము. యముని యొక్క అక్క సూర్యుని యొక్క శుభంకరమైన కూతురును అయినది, యొక పవిత్ర నది పుష్య (?) అందు శ్రాద్ధ మక్షయ ఫలదము. ఇయ్యది ఇంతకు పూర్వము పితరులచే కీర్తింపఁబడినది.
బ్రహ్మతుండప్రదే స్నాత్వా సద్యో భవతి బ్రాహ్మణః ।
తస్మింస్తు శ్రాద్ధమానంత్యం జపహోమతపాంసి చ ॥
స్థాణుభూతోచరత్తత్ర వసిష్ఠో వై మహాతపాః ।
అద్యాపి తత్ర దృశ్యంతే పాదపాః మణిబర్హణాః ॥
తులో తు దృశ్యతే తత్ర ధర్మాధర్మనిదర్శినీ ।
యథా వై తోలితం ఏప్రైస్తీర్ణానాం ఫలముత్తమమ్ ॥
పితృణాం దుహితా యోగా గంధకాలీతి విశ్రుతా ।
చతుర్దో బ్రహ్మణస్త్వంశః పరాశరకులోద్భవః ॥
వ్యసిష్యత్ చతుర్థి వై వేదం ధీమాస్ మహామునిః ।
మహాయోగం మహాత్మానం యా వ్యాసం జనయిష్యతి ॥
అచ్ఛోదకం నామ సరస్తత్రాచ్ఛోదాసముద్భవః ।
మత్స్యయోనౌ పునర్జాతా నియోగాత్ కారణేన తు ॥
తస్యాస్త్వాద్యాశ్రమే పుణ్యే పుణ్యకృద్ఫర్నిషేవితే ।
దత్తం సకృదపి శ్రాద్ధమక్షయం సముదాహృతమ్ ॥
నద్యాం యోగసమాధానం దత్తం యుగపదుద్భవేత్ ।
కుబేరతుంగే పాపఘ్నం వ్యాసతీర్థ తథైవ చ ॥
పుణ్యాయాం బ్రహ్మణో వేద్యాం శ్రాద్ధమానంత్యమిష్యతే సిద్।
ధిస్తు సేవితా నిత్యం దృశ్యతే తు కృతాత్మభిః ॥
అనీవర్తనం తు నందాయాం వేద్యాః ప్రాగుత్తరాదిశి ।
సిద్దిక్షేత్రం సురైర్జుష్టం యత్ర్పాప్య న నివర్తతే ॥
మహాలయే పదంన్యస్తం మహాదేవేన ధీమఖా ।
భూతానామనుకంపార్థం నాస్తికాసోం నిదర్శనమ్ ॥
విరజే త్వక్షయం శ్రాద్ధం పూర్వమేవ మహాలయే ।
నందాయాం విరజే చైవ తథైవ చ మహాలయే ॥
ఆత్మానం ఖైరయంతీహ దశపూర్వాన్ దశాపరావ్ ।
కాకహదే జాతిస్మర్యం సువర్ణమమితాజసమ్ ॥
కౌమారం చ సరః పుణ్యం నాగభోగాభిరక్షితమ్ ।
కుమారతీర్థే స్నాత్వా తు త్రిదివం యాతి మానవః ॥
బ్రహ్మ తుండ ప్రదమున స్నానము చేయు వ్యక్తి వెంటనే బ్రాహ్మణుఁడగును. అందాచరించిన శ్రాద్దము అనంత ఫలము నొసంగును. అట్లే అందాచరించిన జపహోమతపములనంతఫలదములు. (73) ఒక స్థాణువు వలె నిలబడి వసిష్ఠుఁడచ్చట మహా తపస్సాచరించెను. ఇప్పటికికూడ మణిబర్హణాలంకరణముతో వృక్షములొప్పి దృశ్యమానములగుచున్నవీ. (74) ధర్మాధర్మనిదర్శనమునకయిన తులాభారము అందుకొనగును. ఆ తులామానము ననుసరించి, పవిత్ర తీర్ధముల యొక్క ఉత్తమ ఫలము, బ్రాహ్మణులు తూచెదరు. పితరుల కూతురయిన యొక యోగిని గంధకాలి యనెడు సొమమున ప్రసిద్ధురాలు. ఆమె యందే పుట్టెను. ఆమెకు మహాత్ముడు మహాయోగి పుంగవుఁడు నయిన వ్యాసుడుదయించును. ఆ వ్యాసుఁడు పరాశర వంశమున నుదయించును. ఆతఁడు బ్రహ్మ యొక్క చతుర్థాంశము. ధీమంతుఁడయిన ఆ మహాముని వేదములను నాలుగుగా విభజించును. (77) అచ్ఛోదకమను నొక సరస్సున్నదీ, అచ్ఛోదయని యెడు నది ఆ సరస్సు నుండి జన్మించును, పితరులకూతురుయోగ గంధకాలియని ప్రసిద్ధిచెందినది. గంధకాలీ యొక మత్స్యము యొక గర్భమున మరల పుట్టేను. భగవన్నియోగమునను, ఒక ప్రత్యేక కారణమునను ఆమె యందు జన్మించెను. ఆ పవిత్రము పుణ్యవంతము నయిన ఆశ్రమమును పుణ్యమాచరించిన పుణ్యకృత్తులు సేవింతురు. ఆ పుణ్యవంతులచే సేవింపఁబడు సో యాశ్రమమున నొక్కసారి శ్రాద్ధకర్మ నాచరించిన అయ్యది అక్షయమైన ఫలమొసంగునని చెప్పబడినది. (79) అంతియేకాక ఆ నది యందు సమర్పింపబడిన (శ్రాద్ధ పిండములు) యొకే యొకసారి యోగశక్తులను మనో నిగ్రహమును ప్రసాదించును. 'కుబేరతుంగా! శ్రమమున, వ్యాస తీర్థమున ఆచరింపఁబడిన శ్రాద్ధ కలాపములు పాపఘ్నములు. (80) బ్రహ్మవేది యందాచరింపఁబడిన శ్రాద్దము అనంత ఫల మొసంగును అయ్యది సిద్ధులచే నిత్యము సేవింపఁబడును. ధన్యాత్ములయిన పుణ్యవంతులు ఆ సిద్ధుల నందు దర్శించెదరు. [61) బ్రహ్మవేధికి ఈశాన్య భాగముననున్న నందొ తీర్థము నందిదీన శ్రాద్దము అనిర్వర్తన సిద్ధి నొసంగునట్టిది. అది సిద్ది క్షేత్రము. సంసారమునకు పునః నీవర్తన ముండదు. అదీ ఆధ్యాత్మిక సిద్ది క్షేత్రము. అది దేవతలతో నున్నది మోక్షము సంపన్నము. ధీమంతుఁడయిన మహాదేవునిచే మహాలయమందు పదముంచబడినది. అయ్యది భూతముల యందుగల అనుకంపకు (దయకు) నాస్తికులకు నిదర్శనము అయినట్టిది. నాస్తికులకు తమ దోషములకు నిదర్శన మొసంగునది. వీరజ యందు ఆచరించిన శ్రాద్దము అక్షయ ఫలదము. అట్టిదే మహాలయము కూడ. నంద యందు విరజాక్షేత్రము నందెట్టి ఫలమో అట్టిదే మహాలయము నందున శ్రాద్ధ ఫలము: కలుగును. (84) నంద యందు, వీరజయందు, మహాలయ ముందు శ్రాద్ధము నాచరించిన వారు, తమ్ము తరింపఁజేసి కొందురు. అంతియేకాక పది తరముల వారినీటు పదితరముల వారీనటు తరింపచేయ కారణులగుదురు. 'కాక' ప్రదమున శ్రాద్ధమాచరించినవారు, జాతి స్మరణమును పొందెదరు. పూర్వజన్మ వివేకము గలిగి యుందురు.
దేవాలయే తపస్తస్త్వా ఏకపాదేన దుశ్చరమ్ ।
నిరాహారో యుగం దివ్యముమాతుంగే స్థితో జ్వలన్ ॥
ఉమాతుంగే భృగోస్తుంగే బ్రహ్మతుంగే మహాలయే ।
తత్ర శ్రాద్దానీ దేయాని నిత్యమక్షయమిచ్ఛతా ॥
అక్షయం తు సదా శ్రార్ధం శాలగ్రామే సమంతతః ।
దుష్కృతం దృశ్యతే తత్ర ప్రత్యక్షమకృతాత్మనామ్ ॥
ప్రత్యాదేశో హ్యశిష్టానాం శిష్టానాం చ విశేషతః ।
తత్ర దేవప్రదః పుణ్యో బ్రహ్మణో నాగరాట్ శుచిః ॥
పిండం గృష్ణతి హి సతాం న గృహొత్యసతాం సదా ।
అతిప్రదీప్లైర్భుజరైః భోక్తుమన్నం న శక్యతే ॥
ప్రత్యక్షం దృశ్యతే ధర్మతీర్థయోర్నతయోర్ద్వయోః ।
కొరవత్యాం చ శాండిల్యాం గుహాయాం వామనస్య చ ॥
గత్వా చైతాని పూతః స్యాచ్ఛాద్దమక్షయమేవ చ ।
జపో హోమస్తపో ధ్యానం యత్కించిత్సుకృతం భవేత్ ॥
బ్రహ్మచర్యం చ యో ధత్తే గురుభక్తిం శతం సమాః ।
ఏవమాద్యాస్సరిఛ్ఛేషా యత్నానాదఘమోక్షణమ్ ॥
కుమారధారా తతైవ దృష్ట్యా పాపం ప్రణశ్యతి ।
ధ్యానాసనం తు తత్రోవ వ్యాసస్యావ్యాప్తి దృశ్యతే ॥
శైలః కాంతిపురాభ్యాశే ప్రాగుహీచ్యాం దిశి స్థితః ।
పుణ్యా పుష్కరిణీ తత్ర కిరాతగణరక్షితా ॥
యస్యాం స్నాత్వా సకృద్వీపః కామానాప్నోతి శాశ్వతాన్ ।
అదృశ్యః సర్వభూతానాం దేవవచ్చరతే మహీమ్ ॥
కాశ్యపస్య మహాతీర్థం కాలసర్పిరితి శ్రుతమ్ ।
తత్ర శ్రాద్ధాని దేయాని నిత్యమక్షయమిచ్ఛతా ॥
శ్రాద్ద మాచరించినవారు సువర్ణయుత శరీర కాంతిని పొందెదరు. అంతీయేకాక అమితమయిన శక్తి సామర్థ్యము పొందెదరు. (85) పవిత్రసరమయిన కౌమారము నాగభోగములచే నభిరక్షితము. కుమార తీర్థమున స్నానమాచరించిన మానవుండు స్వర్గము నందును. (86) ఉమాతుంగ తీర్థమున ఏకపాదమున నిలబడి అందలి దేవాలయమున, క్లేశభూయిష్ఠము దుశ్చరమునయిన తపస్సును నిరాహారుఁడై ఆచరిచంచిన వ్యక్తి దివ్యము జ్వలించునట్టి తేజస్సు ఒక యుగకాలము పొందును. (87) ఉమాతుంగము నందు, భృగు తుంగము నందు బ్రహ్మ తుంగము నందు మహాలయము నందు నిత్యమక్షయత్వము వాంఛించు వారలు శ్రాద్దముల నాచరింప వలెను. (88) శాలగ్రామ తీర్థము నందు సర్వత్ర ఆచరించిన శ్రాద్దము అక్షయఫలప్రదము. అకృతాత్ముల (దుష్టుల) యొక్క దుష్కృత్యములు ప్రత్యక్షములగును. (89) అశీష్టులయిన వారికీ, శిష్ఠులయిన వారికి, ప్రత్యాదేశము హెచ్చరిక కలదు. అందు దేవప్రదము మిక్కిలి పవిత్రమయినది. పవిత్రుఁడయిన సర్పరాజయిన బ్రహ్మనాగము పవిత్రులచే సమర్పింపబడిన పిండములను స్వయముగా గ్రహించును. అది ప్రదీప్తములయిన భుజంగములకు వండిన అన్నమును భుజించుటకు శక్యము కాదు. (91) ఈ పవిత్ర ధర్మ తీర్థ ద్వయమునందు ధర్మము ప్రత్యక్షముగా కనఁబడును. శాండిలి యందలి గుహయందు, కారవతి యందు వామనము నందు శ్రాద్ధ మాచరించిన వ్యక్తి పవిత్రుఁడగును. పాపదూరుఁడగును. పవిత్ర హృదయముతో చేసిన శ్రాద్దమక్షయమగును. అచ్చట.ఏ మాత్రము జపము, తపము, హోమము ఆచరించినను, నయ్యద్ సుకృత మయినదగును. (93) ఎవ్వఁడు బ్రహ్మచర్యమును గురుభక్తిని నిర్వహించునో ఆతఁడు ఒక వంద సంవత్సరములు నివసించును. ఇవి పవిత్రమయిన నదులు. ఇందు స్నానమాచరించిన అఘమోక్షణమగును. కుమారధార అందు కలదు. భక్తుండద్ధానిని దర్శించిన మాత్రమున నతని పాపము ప్రణాశనము చెందును. (94) ఇప్పటికీ కూడ వ్యాసుని ధ్యానాసనమందు గోచరించును, కాంతీ పురమునకు సమీపమున ఈశాన్యభాగమున ఆ పర్వతమున్నది. అచ్చటొక పర్వతమయిన పద్మతటాకము (పుష్కరిణి కలదు) కిరాతగణములచే నయ్యది రక్షింపఁబడుచున్నది. విప్రుఁడు ఆ పుష్కరిణిలో ఒక్కసారి స్నాన మాచరించిన శాశ్వతముగా కామములను పొందును. సర్వజీవద్భూతములలో సద్భశుండై యతఁడు దేవుని వలె భూమీని సంచరించును. కాలసరి యనీ విశ్రుత మయిన కాశ్యపుని మహాతీర్థమొకటి కలదు. నిత్యమును అక్షయమును గోరు వ్యక్తి ఆ తీర్థమున శ్రాద్ధముల ఆచరించవలెను. (98)
దేవదారువనే వాపి ధారాయాస్తు నిదర్శనమ్ ।
నిర్దూతాని తు పాపాని దృశ్యంతే సుకృతాత్మనామ్ ॥
భాగీరథ్యాం ప్రయాగే తు నిత్యమక్షయముచ్యతే ।
కాలంజరే దశార్ణాయాం నైమిషే కురుజాంగలే ॥
వారాణస్యాం నగర్యాం చ దేయం శ్రాద్ధం ప్రయత్నతః ।
తత్ర యోగేశ్వరో నిత్యం తస్యాం దత్తమథాక్షయమ్ ॥
గత్వా చైతాని పూర్తః స్యాచ్ఛౌద్ధమక్షయ్యమేవ చ ।
జపో హోమస్తథా ధ్యానం యత్మించిత్సుకృతం భవేత్ ॥
లౌహిత్యే వైతరణ్యాం చ స్వర్గవేద్యాం తథైవ చ ।
సా తు దేవీ సముద్రాం దృశ్యతే చైవ నామభిః ॥
గయాయాం ధర్మపృష్ఠ తు సరసి బ్రహ్మణస్తథా ।
గయాం గుర్ధవటే చైవ శ్రాద్ధం దత్తం మహాఫలమ్ ॥
హిమం చ పతతే తత్ర సమంతాత్పంచయోజనమ్ ।
భరతస్యాశ్రమే పుణ్యే రణ్యం పుణ్యతమం స్కృతమ్ ॥
మతంగస్య వనం తత్ర దృశ్యతే సర్వమానుషైః ।
స్థాపితం ధర్మసర్వస్వం లోకస్యాస్య నిదర్శనమ్ ॥
యద్దండకవనం పుణ్యం పుణ్యకృశ్ఫిర్నిషేవితమ్ ।
యస్భిహుర్విశల్యేతి తీర్థం సద్యో నిదర్శనమ్ ॥
తులామానైస్తథా చాపి శాస్త్రిళ్ళ వివిధైస్తథా ।
ఉన్మజ్ఞంతి తథా లగ్నా యే వై పాపకృతో, జనాః ॥
తృతీయాయాం తథా షాదే నిరాధాయాం తు మండలే ।
మహాప్రదే చ కౌశిక్యాం దత్తం శ్రాద్ధం మహాఫలమ్ ॥
ముండపృష్టీ పద న్యస్తం మహాదేవేన ధీమతా ।
బహుదేవయుగాంస్తస్త్వా తప స్తివ్ర సుదుశ్చరమ్ ॥
అల్పేనాష్యత్ర కాలేన నరో ధర్మపరాయణః ।
పాపానముత్సృజత్యాశు జీర్ణాం త్వచమీవోరగః ॥
దేవదారు వనము నందొక జలధార కలదు. అయ్యదీ పాపప్రాణశమునకు నిదర్శనము. సుకృతాత్ములయొక్క నీర్దూత పాపములు అచట కాననగును. (99) ప్రయాగలో భాగీరథీ (గంగానది యందు శ్రాద్ధము నాచరించిన నీత్య మక్షయమగును. అట్లే కాలంజరము నందు దశార్ణము నందు, నైమిషము నందు, కురుజాంగలము నందును జరుగును. (100) వారాణసి యందు శ్రాద్దమును ప్రయత్న పూర్వకముగ నాచరింపవలెను. యోగేశ్వరుడచ్చట నేప్పుడును ప్రత్యక్షమై యుండును. అందు సమర్పింపఁబడినదీ శాశ్వతముగా అక్షయత్వ మొందును. ఈ తీర్థముల సేవించినయతం డు పూతుడగు అచ్చట నాచరించిన శ్రాద్ధ మక్షయ ఫలదము. జపముకాని, హోమముకాని, ధ్యానముకాని యేమాత్ర మాచరించినను నది సుకృతము, సుఘుకృతమయినదగును.(102) పవిత్రతీర్థములయిన రౌహిత్యము నందు, వైతరణియందు, స్వర్గమేదియందు, అందుండి చేసిన శ్రాద్ధము సుకృతము. సముద్రాంతమున దేవి వివిధములయిన నామములతో కనఁబడును. గయ యందు, ధర్మ షృష్టమున బ్రహ్మ సరముందు గృధ్ర వటమునందు కావించిన శ్రాద్దము మహాఫలదము(104) ఆ ప్రదేశమందంతటను పంచ యోజనముల ప్రాంతము మంచు పడును. భరతుని యొక్క ఆశ్రమమున్న అరణ్యము పుణ్యతమమయినదిగా చెప్పఁబడినది. (105) అక్కడ మతంగవనము సర్వమానవులచే దృశ్యమానమగును. - ధర్మమున కంతటికిని అయ్యది లోకమునకు నిదర్శనముగా స్థాపింపఁబడినది. (106) అచ్చటి దండక వనము చాల పవిత్రమయినది. పుణ్యము నాచరించిన సత్పురుషులచే నదీ తరచుగా దర్శింపఁబడును పవిత్రమయిన విశల్య తీర్థ మందున్నదని పుణ్యవంతులందురు. వివిధములయిన శాస్త్రముల చేతను, వీవీధములయిన తులామానములచేతను ఆ తీర్థము వెంటనే నీదర్శన మొసంగును. పాపము నాచరించిన వారు తత్తీర్ఘదర్శనమున పాపముల నుండి విడివడుదురు. (తులామానము కలదు, ఆ తులామానపు తక్కెడ సీబ్బులవలన పాపవంతులు తేలిపోవుదురు, పుణ్యవంతులు క్రిందకు తూగి పోవుదురు. తన్మూలమున పోరి పాపక్షయాదులు సద్యః దర్శితములగును చంద్రమానమున తృతీయాదినమున (శుక్లపక్షమున) శ్రాద్ధమును నిరాధా మండలమున (?) కౌశిక్యమను మహాప్రదమున పెట్టినచో మహాపుణ్యము. (109) ధీమంతుఁడయిన మహాదేవుడు ముండపృష్ఠము నందు కాలిడేను. బహుదేవయుగముల కాలము ఇతరులచే చేయుటకు కష్టమయిన మహాతపమును ఆతడు చేసెను. (110)
సిద్దానాం ప్రీతీజననం పాపానాం చ భయంకరమ్ ।
లేలిపోనైర్మ హాఘోరైరక్ష్యతే సుమహోరగైః ॥
నామ్నా కనకనందీతీ తీర్థం జగతి విశ్రుతమ్ ।
ఉదీచ్యాం ముండపృష్ఠస్య బ్రహ్మర్షిగణసేవితమ్ ॥
తత్ర స్నాత్వా దీవం యాంతి స్వశరీరేణ మానవాః ।
దత్తం వాపి సదా శ్రాథమక్షయ్యం సముదాహృతమ్ ॥
ఋణైస్త్రిభిస్తతః స్నాత్వా నీష్క్రీణాతీ నరస్తనుమ్ ।
మానసే సరసి స్నాత్వా శ్రాద్ధం నిర్వర్తయేత్తతః ॥
తారే తు సరసస్తస్య దేవస్యాయతనమ్ మహత్ ।
ఆరుహ్యా తు జపంస్తత్ర సిద్ధో యాతి దీవం తతః ॥
ఉత్తరం మానసం గత్వా సిద్ధిం ప్రాప్నోత్యనుత్తమామ్ ।
స్నాత్వా తస్మిన్ సర:శ్రేష్ఠే దృశ్యతే మహదద్భుతమ్ ॥
దివశ్చ్యుతా మహాభాగా హ్యంతరిక్షే విరాజతే ।
గంగా త్రిపథగా దేవీ విష్ణుపాదాచ్చ్యుతా సతీ ॥
ఆకాశే దృశ్యతే తత్ర తోరణం సూర్యసన్నిభమ్ ।
జాంబూనదమయ పుణ్యం స్వర్గద్వార మీవాయతమ్ ॥
తతః ప్రవర్తతే భూయః సర్వసాగరమండికా ।
పావనీ సర్వభూతానాం ధర్మజ్ఞానాం విశేషతః ॥
చంద్రభాగా చ సింధుశ్చ శుభే మానససంభవే ।
సాగరం పశ్చిమం యాతో దివ్యః సింధునదో వరః ॥
పర్వతో హిమవన్నామ నానాధాతువిభూషితః ।
అయతో వై సహస్రాణి యోజనానాం బహూని తు ॥
సిద్ధచారణసంకీర్ణ దేవర్షిగణసేవితా ।
తత్ర పుష్కరిణీ రమ్యా సుషుమ్నా నామ నామతః ॥
దశవర్షసహస్రాణి తస్యాం స్నాతస్తు జీవతీ ।
శ్రాద్ధం భవతీ చామంతం తత్ర దత్తం మహోదయమ్ ॥
సులువుగా తన సర్వ శరీరమును విడుచునట్లు ఇందు ధర్మ పరాయణుఁడు అత్యల్ప కాలములో పాపములను విసర్జించును. (111) ఇది సిద్దులకుఁ బ్రీతీజనకము. పాపులకు భయంకరము. తమ నాలుకలను పైకీ క్రిందికి ఆడించు నట్టి ఘోర మహా సర్పములచ్ఛేది రక్షింపం బడుచున్నది. (112) లోకమున విశ్రుతమయినదీ కనక నందీ యనెడు నామముగల తీర్థము. ఇది ముండప్పష్టమునకు ఉత్తరమున నున్న ఇయ్యది బ్రహ్మర్షి గణములచే సేవీతము. (113) ఇందు స్నానము చేసిన మానవులు తమ శరీరములతో స్వర్గమున కరుగుదురు. ఇందాచరింపం బడిన శ్రాద్ధము అక్షయఫలప్రదమని చెప్పబడినది. (114) ఇందు స్నానముచేసి మానవుఁడు శరీర సంబంధమయిన ఋణత్రయము నుండి విముక్తుఁడగును. మానస సరస్సున స్నానముచేసి తరువాత శ్రాద్దమును పెట్టవలయును. (115) ఆ సధస్తీరమున నొక గొప్పదయిన దేవాలయము కలదు. ఆ తీర్ధమున కరిగి జపమాచరించి, సిద్ధుఁడయి దీవమున కరుగును. (116) ఉత్తరమానసమును చేరి అనుత్తమమయిన సిద్ధిని మానవుఁడు పొందును, ఆ శ్రేష్ఠమయిన సరస్సున స్నానము చేసి ఆ వ్యక్తి అత్యంతాద్భుతమును సందర్శించును. (117) స్వర్గము నుండి చ్యుతమయి తేజస్వంతమైన యా మహానది అంతరిక్షమున ప్రకాశించును. అయ్యది గంగ. విష్ణు పాదముల నుండీ చ్యుతమయినది త్రిపథగ. అందు ఆకాశము నందు సూర్య సన్నిభమయిన తోరణము కాననగును. అయ్యది పుణ్యమయినది. జాంబూనదమయము. ఇయ్యది సువివృతమయిన స్వర్గద్వారమువలె నుండును. (119) తరువాత ఆ నది సముద్రము నంతటిని నలంకరించుచు, సర్వ భూతములను పవిత్రము చేయుచు, ప్రత్యేకముగా ధర్మజ్ఞలను పవిత్ర పరచుచు మరల ప్రవహించును. (120) మానస సరస్సు నుండి పుట్టినట్టివి చంద్రభాగము సింధువు అను దివ్య పవిత్రములయిన నదులు. అయ్యవీ పశ్చిమ సముద్రములోనికి ప్రవహించును. దివ్యమయిన సింధునది శ్రేష్ఠతరమయినది. (పెద్దది) (121) హిమవత్ పర్వతము. నాసాధాతువిభూషితము. ఇయ్యది చాల యోజనముల నిడివి గలిగినది. (122) అందొక రమ్యమయిన (సరస్సు) పుష్కరిణి యనునది కలదు. దానిపేరు సుషుమ్న, అయ్యది సిద్ధులచే చారణులచే నిండి యున్నది. తరచుగా నాపుణ్య సరస్సు దేవర్షి గణములచే సేవింపఁబడును. అందు స్నాన మాచరించిన వ్యక్తి పదివేల సంవత్సరములు జీవించును. అందాచరించిన శ్రాద్ధము అనంత ఫలదము, ఐశ్వర్యదము.
తారయేచ్చ సదా శ్రాద్దే దశ పూర్వాన్ద శాపరాన్ ।
సర్వత్ర హిమవాన్ పుణ్యో గంగా పుణ్యా సమంతతః॥
సముద్రగాః సముద్రాశ్చ సర్వే పుణ్యాః సమంతతః ।
ఏవమాదిషు చాన్యేషు శ్రాద్ధం నిర్వర్తయేద్బుధః ॥
పూతో భవతి వై స్నాత్వా హుత్వా దత్త్వా తథైవ చ ।
శైలసానుషు శృంగేషు కందరేషు గుహాసు చ ॥
ఉపహ్వరనీతంభేషు తథా ప్రస్రవణేషు చ ।
పులినేష్వాపగానాం చ తథైవ ప్రభవేషు చ ॥
మహోదధౌ గవాం గోష్ఠే సంగమేషు వనేషు చ ।
సుసంమృష్టోపలిప్తేషు హృద్యేషు సురభిష్యథ ॥
గోమయేనోపలిప్తేషు వివిక్తేషు గృహేషు చ ।
కుర్యాచ్చ్రాద్ధమథైతేషు నిత్యమేవ యథావిధి ॥
ప్రాగ్ధక్షిణాం ధీశం గత్వా సర్వకామచికీర్షయా ।
ఏవమేతేషు సర్వేషు శ్రాద్ధం కుర్యాదతంద్రితః ॥
ఏతేష్వేవ తు మేధావీ బ్రాహ్మీం సిద్ధిమవాప్నుయాత్ ।
త్రైవర్ణవిహితైః స్థానే ధర్మే వర్ణాశ్రమే రతైః ॥
కోపస్థానం చ సంత్యాగాత్ర్పాప్యతే పితృపూజనమ్ ।
తీర్థాన్యనుసరన్వీరః శ్రద్దధానః సమాహితః ॥
కృతపాపోఽపి శుద్ధ్యేత కిం పునః శుభకర్మకృత్ ।
తిర్యగ్యోనిం చ గచ్ఛేచ్చ కుదేశే చ నజాయతే ॥
స్వర్గీ భవతీ విప్రో వై మోక్షోపాయం చ విందతి ।
అశ్రద్ధధానః పాపాయుర్నా స్తికోఽచ్ఛిన్న సంశయః ॥
హేతునిష్ఠశ్చ పంచైతే న తీర్థే ఫలభాగినః ।
గురుతీర్థే పరా సిద్ధిస్తీర్థానాం పరమం పదమ్ ॥
ధ్యానం తీర్థం పరం తస్మార్భ్రహ్మతీర్థం సనాతనమ్ ।
ఉపవాసాత్పరం ధ్యానమింద్రియాణాం నీవర్తనమ్ ॥
ఉపవాసనబద్ధైర్హి ప్రాణైరేవ పునః పునః ।
ప్రాణాపానే వశే కృత్వా వశగానీంద్రియాణి చ ॥
ఆ ప్రదేశమున నిర్వహించిన శ్రాద్ధము 'దశాపరేషాం. దశ పూర్వేషాం” పితరుల నుద్దరించును. సర్వత్ర హిమవత్పర్వతము పుణ్యమయినది. సమంతతః గంగానది పుణ్యమయినది. సముద్రములన్నియును సముద్రమును చేరునట్టి నదులును సర్వత్ర పుణ్యప్రదములు. ఇట్టి పవిత్ర తీర్థములందు మరియు తత్తుల్యములయిన వాని యందు పండితుఁడైన వాఁడు శ్రాద్దముల నాచరించవలయును. (126) శాస్త్రము ననుసరించి యథావీధి శ్రాద్దము లాచరించవలెను. కర్తయైన భక్తుఁడు, తీర్థముల యందు స్నానము చేయుట వలన, హోమము లాచరించుటవలన, దానము లొసంగుట వలనను పవిత్రుఁడగును. శ్రాద్దములనీప్రదేశముల యందాచరించవలెను. శైలసానువులందు, శైలశృంగములందు, కందరములయందు, గుహలయందు, ఏకాంతములయిన పర్వతపు ఉపహ్వరనితంబములందు, ప్రస్రవణములందు, నదీ తీరములందు, నదులు, పుట్టు స్థానములందు, నదీపులినములయందు, సముద్రతీరమందు, గోవుల గోష్ఠములందు, నదీ సంగమ స్థానములయందు, వనములందు, మనోహర పరిమళములచే సుపరిమృష్టములు, సులీప్తములు, పరిమళవంతములగు ప్రదేశములందు, ఆవుపేడచే నలుకబడిన వివిక్త గృహములందు, శ్రాద్దముల నాచరించవలయును. (130) భక్తుడు సర్వకామములను పొందుకోరికతో, పై చెప్పఁబడిన తీర్థములందు భక్తిమంతుఁడై ప్రాధక్షిణదిశకు పోయి శ్రాద్ధ మాచరించవలయును. (131) మేధావియైన శ్రాద్ధకర్త పైచెప్పఁబడిన యన్ని క్షేత్రములందు శ్రాద్ధమాచరించి, బ్రాహ్మీ సిద్దీని పొందును. త్రివర్ణ విహిత స్థానముల నున్నట్టి వారు, ధర్మవర్ణాశ్రమరతులైనవారు, కోపస్థానమును పరిత్యజించిన వారు బ్రాహ్మీస్థితిని శ్రాద్ధ మాచరించి పితృపూజనము నొందుదురు. కృతపాపుఁడయినను, అత్యంత శ్రద్ధావంతుఁడై తీర్ణాటనమును మనో నిగ్రహముతో మనశ్శుద్దీతో చేసినచో, పరిశుద్ధి నొందుననఁగా శుభకర్మ కర్తల గూర్చి వేరే చెప్పవలయునా? అట్టి శుభకృత్తు ఎన్నడును నీచ జంతువుల యందుద్భవింపఁడు, నీచ దేశముల పుట్టఁడు, బ్రాహ్మణుఁడు స్వర్గవాసి యగును. మోక్షోపాయమును పొందును. శ్రద్దారహితుఁడు పాపవంతమయిన జీవితమును నడుపు నట్టివాఁడు నాస్తికుఁడు, తీరనట్టి సంశయములచే బాధపడువాఁడు, హేతునిష్ణుఁడు కారణవాది మొదలగువారు తీర్థ స్నానముల వలన ప్రయోజనమును పొందజాలరు. (135) గురు తీర్థమున పరా (గొప్ప) సిద్ధి కలదు. పవిత్ర తీర్థములలో నీది పరమపద స్థానము. (136)
బుద్ధిం మనసి సంయమ్య సర్వేషాం తు నీవర్తనమ్ ।
ప్రత్యాహారం కృతం విద్ధి మోక్షోపాయమసంశయమ్ ॥
ఇంద్రియాణాం మనో ఘోరం బుద్ధ్యాదీనాం వివర్తనమ్ ।
అనాహారో క్షయం యాతి విద్యాదనశనం తపః ॥
నిగ్రహే బుద్ధిమనసోరన్య బుద్ధిర్నజాయతే ।
క్షీణేషు సర్వ దోషేషు క్షీణేష్వేవేంద్రియేషు చ ॥
పరినిర్వాతి శుద్ధాత్మా యథా వహ్నిరనీంధనః ।
కారణేభ్యో గుణేభ్యశ్చ వ్యక్తావ్యక్తాశ్చ కృత్స్నశః ॥
నియోజయతి క్షేత్రజ్ఞం తేభ్యో యోగేన యోగవిత్ ।
తస్య నాస్తి గతిః స్థానం వ్యక్తావ్యక్తే చ సర్వశః ।
న సన్నాసన్న సదనన్నైవ కించిదవస్థితః॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే పోయుప్రోక్తే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే శ్రాద్ధకల్పే పుణ్యదేశానుకీర్తనం నామ త్రయోదశోఽధ్యాయః॥
'ధ్యాన' మొక గొప్ప తీర్థము. దానికంటే సనాతన బ్రహ్మతీర్థము శ్రేష్ట తరమయినది. 'ధ్యానము' ఉపవాసము కంటే గొప్పది. ఇంద్రియ నివర్తనము (బాహ్య పదార్థముల నుండి) కూడ అవసరము. (187) ఉపవాస నిబద్ధులచే, మాటిమాటికి, ప్రాణములచే, ప్రాణాపానములను వశములోనికి తెచ్చుకొని, ఇంద్రియములను వశమును పొందించుకో (185)స వలయును, బుద్దీనీ మనస్సున సంయమించవలెను. జ్ఞానేంద్రియముల వ్యాపారమును ఉపసంహరింపవలెను. ప్రత్యాహారము (ఇంద్రియ నిగ్రహము) జరిగినచో, దానినే మోక్షోపాయముగా నిస్సంశయముగా నేఱుంగుము. (137) జ్ఞానేంద్రియములలో మనస్సు ఘోరమయినది బుద్ది మొదలయిన ఇంద్రియముల నివర్తనమును, ఆహారమును మానుటవలన సాధింప వచ్చును. అనశనము అనంతమయిన తపముగా నెఱుంగవలెను. (140) బుద్దియొక్క నిగ్రహముకలిగినచో అన్యబుద్ధీ ఇఁక పుట్టదు. సర్వ దోషములు క్షీణింపఁగా ఇంద్రియములు క్షీణింపఁగా, పరిశుద్ధమైన యాత్మ అనింధనమయిన అగ్ని నుండి, వహ్నియుదయించు నట్లు మోక్షము నొందును. యోగజ్ఞుండైనవాఁడు, యోగము చేతను, క్షేత్రజ్ఞుని, అన్ని కారణముల నుండి, గుణముల నుండి వ్యక్తి వ్యక్తములయిన సర్వ ప్రపంచ పదార్థముల నుండి, దూరముగా వినియోగించును. వ్యక్తా వ్యక్తములయిన చోట్ల ఆతనికెట్టి స్థానమును లేదు. ఆతఁడు సత్గాదు అసత్తు గాదు. అంతియేకాక సదసత్తు కూడగాఁడు. ఆతడేదియును గాఁడు. కానీ అతఁడు సదా అవస్థితుఁడు. (ఉన్నవాఁడు).
ఇది వాయుప్రోక్తము, మహాపురాణము నయిన బ్రహ్మాండపురాణమున మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున శ్రాద్ధకల్పమున, పుణ్యదేశానుకీర్తనమను త్రయోదశాధ్యాయము.
Summary of chapter 51 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter describes the divine qualities and rigorous spiritual standards required of holy priests who participate in ancestral rites. It explains that only those adorned with Vedic wisdom, humility, and moral purity can serve as fit vessels for carrying ancestral offerings to heavenly realms. The faithful reader gains deep appreciation for true spiritual scholarship and character, seeking the company of the holy to elevate their own spiritual life.