బ్రహ్మాండ మహా పురాణము
8 - అష్టమోఽధ్యాయః
ఇంద్ర ఉవాచ :-
అగమ్యాగమనం కిం వా కో దోషః కాచ నిష్కృతిః ।
ఏతన్మేమునిశార్దూల విస్తరాద్వక్తుమర్హసి ॥
బృహస్పతి రువాచ :-
అగమ్యాగమనం నామ మాతృస్వసృగురుప్రియః ।
మాతులస్య ప్రియా చేతి గత్వేమా నాస్తి నిష్కృతిః ॥
మాతృసజే తు యదఘం తదేవ స్వస్థసళ్లమే ।
గురుస్రసంగమే తద్వద్గురవో బహవః స్మృతాః ॥
బ్రహ్మోపదేశమారథ్య యావర్వేదాంతదర్శనమ్ ।
ఏకేన వక్ష్యతే యేన సమహాగురురుచ్యతే ॥
బ్రహ్మోపదేశమేకత్ర వేదశాస్త్రాణ్యథైకశః ।
ఆచార్యః సతు విజ్ఞేయస్తదేకైకాస్తు దేశీకోః ॥
ఇంద్రుడనెను : అగమ్యాగమనమననేమి? దానివల్లనేమి దోషము? దానికి ప్రాయశ్చిత్తమేమీ? దీనిని విస్తరముగా చెప్పగలవు. బృహస్పతీయనెను అగమ్యాగమనమనగా సంగమింపదగని స్త్రీలతో సంగమించుట. ఆ విధముగా సంగమింపదగని స్త్రీలు-తల్లి, చెల్లెలు, గురుస్తీలు (భార్యలు) మేనమామ భార్య, వీరితో సంగమించిన మహాపాపము దానికి ప్రాయశ్చిత్తములేదు-2. తల్లితో సంగమించుచో నెంతటి పాపమో చెల్లెలితో సంగమించినప్పుడును అంతీయ పాపము. గురుభార్యాసంగమమునగూడ నంతియేపాపము, గురువులనేక విధములుగా జెప్పబడిరి-3, బ్రహ్మోపదేశము మొదలు వేదాంత దర్శనమువరకు ఒక్కడే చెప్పినచో నాతడు మహాగురువు-4 బ్రహ్మోపదేశమొకరు-వేదశాస్త్రములు మరొకరు చెప్పినచో వారు బ్రహ్మోపదేష్ఠ ఆచార్యుడు వేర్వేరుగా గురువులు-5.
గురోరాత్మాంతమేవ స్యాదాచార్యస్య ప్రియాగమే ।
ద్వాదశాబ్దం చరేత్కృఛ్ఛమైకైకం తు షడబ్దతః ॥
మాతులస్య ప్రియాం గత్వా షడబ్దం కృఛ్ఛమాచరేత్ ।
బ్రాహ్మణస్తు సజాతీయం ప్రమదాం యదిగచ్ఛతి ॥
ఉపోషితస్తిరాత్రం తు ప్రాణాయామశతం చరేత్ ॥
కులటాం తు సజాతీయాం త్రిరాత్రేణ విశుధ్యతి ॥
పంచాహాక్ష త్రీయాం గత్వా సప్తాహాద్వైశ్యజామపి ।
చక్రీ క్షీరాత కైవర్త కర్మకారాదియోషితః ॥
శుద్ధిః స్సాద్ద్వాదశాన ధరాశక్యర్చనేన చ ।
అన్యజాం బ్రాహ్మణో గత్వా ప్రమాదాదఖతః శుచిః ॥
మహాగురు భార్య సంగమమున నాత్మనాశము ఆరేండ్లు కృచ్ఛవ్రతము చేయవలె, ఆచార్యభార్యాగమనమున నారేండ్లు కృచ్ఛ వ్రతము జేయవలె-6. మేనమామ భార్యను సంగమించిన నాణేండ్లు కృచ్ఛవతము జేయవలె. బ్రాహ్మణుడు సజాతి స్త్రీని పొందినచో మూడు రాత్రులుపవాసము జేసి నూరు ప్రాణాయామములాచరింపవలె. సజాతీయమైన ఆంకులాడిని పొందినచో మూడు రాత్రులతో శుద్దినందును-8. క్షత్రియ స్త్రీని (కులటను) పొంది యైదు రాత్రులతో శుద్దినందును. అట్లే వైశ్య స్త్రీని బొంది యేడు రాత్రులలో శుద్ధినొందును. చక్రి (కుమ్మరి) కిరాత-జాలం-పనిచేయువారు-వీరి స్త్రీలను బొందినచో పండ్రెండు దినములతోను ధరాశక్తి యర్చనముతోను శుద్ధినందును. బ్రాహ్మణుడు ప్రమాదమున అంత్యజ స్త్రీని బొందినచో సంవత్సరముతో శుద్ధినందును-10.
దేవదాసీ బ్రహ్మదాసీ స్వతంత్రా శూద్రదాసికా ।
దాసీ చతుర్విధా ప్రోక్తా ద్వే చాద్యే క్షత్రియాసమే ॥
అన్యావేశ్యాణ్ణనాతుల్యా తదన్యా హీనజాతీవతి ।
ఆత్మదాసీం ద్విజో మోహాదుర్దార్థ దోషమాప్నుయాత్ ॥
స్వస్తిం ఋతుమతీం గత్వా ప్రాజాపత్యం చరేద్ర్వతమ్ ।
ద్విగుణీన పరాం నారీమ్ చతుర్భిః క్షత్రియాంగనామ్ ॥
అష్టభిర్వైశ్యనారీంచ శూద్రాం షోడశభిస్తథా ।
ద్వాత్రింశతా సంకరజాం వేశ్యాం శూద్రామివాచరేత్ ॥
దేవదాసీ, బ్రహ్మదాసీ, స్వతంత్ర, శూద్రదాసిక-అని దాసీసీ (లు) నాలుగు విధములు. మొదటి యిద్దరు. క్షత్రియస్త్రీతో సమానము-11 తక్కినది. (3వది) వేశ్యా స్త్రీతో సమానము, దానికంటే వేరైన (చివరి) ది హీన జాతి స్త్రీ వంటిది. బ్రాహ్మణుడు మోహమున తన దాసిని బొందిన దోషమునందును-12, ఋతుమతియైనపుడు తన భార్యను బొందినను ప్రాజాపత్య వ్రతమాచరింపవల, పరస్త్రీని బొందినచో పైదానీకి రెట్టింపు (2 ప్రాజాపత్యములు) చేయవలె. క్షత్రియ స్త్రీని (ఋతుమతిని) పొందినచో నాలుగు ప్రాజాపత్యములు చేయవలె-18. అట్లే వైశ్య స్త్రీనీ బొందినచో ఎనిమిది ప్రాజాపత్యములు, శూద్రస్త్రీని బొందినచో పదునాల ప్రాజాపత్యములు చేయవలె, సంకర జాతి స్త్రీని బొందినచో ముప్పది రెండు ప్రాజాపత్యములు చేయవలె, వేశ్యను బొంది శూద్రను పొందినప్పుడువలె పదునాలు ప్రాజాపత్యములు చేయవలె-14.
రజస్వలాం తు యో భార్యాం మోహతో గంతుమిచ్ఛతి ।
స్నాత్వాన్యవస్రసంయుక్తముక్తార్తేనైవ శుధ్యతి ॥
ఉపోష్య తచ్ఛేషదీనం స్నాత్వా కర్మ సమాచరేత్ ।
తథైవాన్యాంగనాం గత్వా తదుక్తార్ధం సమాచరేత్ ॥
పిత్తోరనుజ్ఞయా కన్యాం యో గచ్ఛేద్విధినా వినో త్రిరాత్రోపోషణాచ్భుద్ధిస్తామేవోద్వాహమేత్తదా ॥
కన్యాం దత్త్వా తు యోఇన్యస్మై దత్తా యశ్చానుయచ్ఛతి ।
పిత్తోరనుజ్ఞయా పాదదినార్దన విశుద్ధ్యతి ॥
ఇజ్ఞాతః పితృభ్యాం యో మాసం కన్యాభావే తు గచ్ఛతి ।
వృషలః స తు విశ్లేయః సర్వకర్మబహిష్కృతః ॥
జ్ఞాతః పితృభ్యాం యో గత్వా పరోధాం తద్వినాశనే ।
విధవా జాయతే నేయం పూర్వగంతారమాప్నుయాత్ ॥
రజస్వలయైన భార్యను మోహమున బొందగోరినవాడు, స్నానముజేసి వేరొక వస్త్రమును ధరించిన దానిని బొందగోరువాడును పై ప్రాజాపత్య వ్రతముతోనే శుద్ధిజెందును-15. రజస్వలకు మిగిలిన (శుద్ధికి) దినమును ఉపవసించి స్నానము జేసి పనియాచరింపవలె. అట్లే యన్యాంగనను బొంది దానికి పూర్వముజెప్పిన ప్రాజపత్యాది వ్రతమును జేయవలె-16, తల్లిదండ్రుల యనుమతీ బొందీయు వీధినీ విడనాడి కన్యను బొందిన వాడు మూడురాత్రుల యుపవాసముతో శుద్ధిజెందును. అప్పుడు అతడామేనే వివాహముజేసినకొవలె-17. కన్యను మొదట తనకిచ్చి తరువాత మరొకరికీయగా తల్లిదండ్రుల యనుమతితో తానామెను బొందినచో పావుదినములోని సగముతో శుద్ధిజెందును-18. తల్లిదండ్రులకు దెలిసియు కన్యాభావమున స్త్రీని మాసము వఱకు బొందినవాడు వృషలుడని తెలియవలె. ఆతడు సర్వకర్మలకు వెలివేయబడును-19. తల్లిదండ్రులకు దెలిసియు పరుడు పెండ్లాడిన స్త్రీని బొందినపుడు వాడు మరణింపగా విధవ కాదు. ఆమె తన్ను మొదటనొందిన వానిని బొందవలెను, -20.
అనుగ్రహాద్ద్విజాతీనాముద్వాహవిధినా తథా ।
త్యాగకర్మాణి కుర్వీత శ్రాతస్మార్తాదికాని చ ॥
ఆదావుద్వాపోతా వాపి తద్వినాశేఖన్యదః పితా ।
భోగేచ్చోః సాధనం సా తు న యోగ్యాఖీలకర్మసు ॥
బ్రహ్మాదిపిపీలికాంతం జగత్ స్థావరజంగమమ్ ।
పంచభూతాత్మకం ప్రోక్తం చతుర్వాసనయాన్వితమ్ ॥
ఉన్మాద్యాహారమథననిద్రాభీత్యశ్చ సర్వదా ।
ఆహారేణ విగో జంతుర్నాహారో మదనాత్సృతః ॥
దుస్తరో మదనస్తస్మాత్సర్వేషాం ప్రాజినామపి ।
పున్నారీరూపవత్కృత్వా మదనేనైవ విశ్వసృక్ ॥
ప్రవృత్తిమకరోదాదౌ సృష్టిస్థితిలయాత్మికామ్ ।
తత్రవృత్యా ప్రవర్తంతే అన్నివృత్యా క్షయాం గతిమ్ ॥
ప్రవృత్యైవ యథా ముక్తిం ప్రాప్నుయుర్యే న ధీయుతాః ।
తద్రహస్యం తదోపాయం శృణు వక్ష్యామి సాంప్రతమ్ ॥
సర్వాత్మకో వాసుదేవః పురుషస్తు పురాతనః ।
ఇయం హి మూలప్రకృతిర్లక్ష్మీః సర్వజగత్ర్పసూః ॥
బ్రాహ్మణులయనుగ్రహమునను, వివాహ విధానముతోను శ్రాతస్మార్తాదికములైన త్యాగకర్మలను జేయవలె-21. మొదట వివాహితురాలై భర్త మరణింపగా. తండ్రి యామెను. మరొకనికీచ్చును. అపుడు భోగింపగోరు నాతనికి ఆమె ఒక సాధనమే యగును గాని సమస్త కర్మలయందు సహధర్మచారిణి గానేరదు-22. బ్రహ్మ మొదలు చీమవణుకున్న పాంచభౌతికమైన స్థావరజంగమ ప్రపంచము చతుర్వాసన (నాలుగు విధములైన వాసనలు) జన్మయావన జరామరణము) లతో గూడినది-23. ఈ ప్రాణిప్రపంచమునకు జన్మమొదలగు ఆహార మథన (మైథున) నిద్రా భీతులు ఎల్లప్పుడుండును. ఆహారములేక ప్రాణి (జంతువు) ఉండడు, (ఉండలేడు), కామమువల్ల నిరాహారుడగును.-24. కావున సర్వప్రాణులకును మదనుడు దాటరాని వాడు. జగమునంతటిని పుంఖారీ (స్త్రీ పురుషు)వంతముగా జేసి విశ్వసష్టమైన బ్రహ్మ మొదట సృష్టి-స్థితీ-లయాత్మకమైన ప్రవృత్తినిజేసెను. ఆ స్మష్ట్యాది ప్రవృత్తిచే మానువులు ప్రవర్తించుచున్నారు. దాని నుండి నివర్తించుటచే అక్షయగతినీ (బ్రహ్మత్వమును) బొందుచున్నారు-26. బుద్దిలేనివారు ప్రవృత్తి చేతనే ముక్తిని బొందునట్టి రహస్యమునిప్పుడు చెప్పెదను-27. సర్వాత్మకుడైన వాసుదేవుడు పురాతనుడైన పురుషుడు. లక్ష్మియే సర్వజగత్తునకు మూలకారణమైన ప్రకృతి.
పంచాపంచాత్మతృప్యర్థం మథనం క్రీయతేతరామ్ ।
ఏవం మంత్రానుభావాత్సాన్మథనం క్రియతే యది ॥
తావుభౌమంత్రకర్మాణాన దోషో విద్యతే తయోః ॥
తపోబలవతామేతత్కేపలానామధోగతిః ।
స్వప్రీవిషయ ఏవేదం తయోరపి విధేర్బలాత్ ॥
పరస్పరాత్మైక్యహృదోర్దేవ్యా భక్యారచేతసోః ।
తయోరపి మనాక్చేన్న నిషిద్ధదివసేష్వఘమ్ ॥
ఇయమం జగద్ధాత్రీ పురుషోయం సదాశివః ।
పంచవింశతి తత్త్వానాం ప్రీతయే మథ్యతే ధునా ॥
ఏతన్మనైనుభావాచ్చ మథనం క్రియతే యది ।
తావుళెపుణ్యకర్మాణా న దోషో విద్యతే తయోః ॥
ఇదం చ శృణు దేవేంద్ర రహస్యం పరమం మహత్ ।
సర్వేషామేవ పాపానాం యాగపద్యేన నాశనమ్ ॥
భక్తిశ్రద్ధాసమాయుక్తః స్నాత్వాంతర్జలసంస్థితః ।
అష్టోత్తరసహస్రం తు జపేత్పంచదశాక్షరీమ్ ॥
ఆరాధ్య చ పరాం శక్తిం ముచ్యతే సర్వకిల్బిషైః ।
తేన నశ్యంతి పాపాని కల్పకోటికృతాన్యపి ।
సర్వాపద్భ్యో విముచేత సర్వాభీష్టం చ విందతి ॥
పంచాత్ముల యొక్కయు (పాంచభౌతిక దేహులయొక్క మానవుల యొక్క అపంచాత్ముల యొక్క (దేవతల యొక్క తృప్తికొకు మథనము (సముద్రమథనము) మిక్కిలి చేయబడును. (దానవులకమృతము దక్కకుండజేయుట దేవమానవుల తృప్తికొఱకే గదా) ఈ విధముగా మంత్ర ప్రభావము వలన మథనము చేయబడినట్లైతే-29. వారిరువురును మంత్రకర్మలు గలవారగుదురు. వారిరువురికీ దోషము లేదు-30. (పంచాత్మ- ప్రకృతి, స్త్రీ అపంచాత్మ-పురుషుడు. వీరిరువురి తృప్తికొఱకు మథనం= గాఢ మథన రూపమైన మైథనము మంత్రానుభావాత్= పరస్పర మనన భావన (భావన)తో రసైకాత్మను రక్షించు రూపమైన మంత్రము యొక్క (మననాత్ తాతయత ఇతీ మంత్రః) ప్రభావము వలన యదీ క్రియతేతరాం= మిక్కిలి చేయబడినచో ప్రకృతి పురుషులు) మంత్ర కర్మలు. (పరస్పర భావనలతో మైథునము చేయువారు) అగుదురు. అప్పుడు మైథున క్రియ ఆనందమయ సృష్టిని చేయునుగాన దోషము లేదు. మైథునము స్త్రీ పురుషులయభయులకు తృప్తిని గూర్చునదిగదా. అదీ సత్సంతామమును గలుగ జేయును. ఇది తపోబల వంతులకు వర్తించును. అదిలేని కేవలులకు అధోగతియే. ఇది కూడ స్వస్తీ విషయముననే! వారికీగూడ వీధీయొక్క బలముననే-31. దేవితో పరస్పరాత్మైక్యము జెందిన హృదయము గలవారికి, భక్తీచే ద్రవించిన హృదయములు గలవారికి, నిషిద్ధ దివసములందైనను {యోగము) స్వల్పముగానైనచో పాపములేదు -32 ఈమె జగద్ధాతియైన (ప్రకృతి)యం ఈయన పురుషుడైన సదాశీవుడు, పంచవింశతి తత్త్వముల ప్రీతికొరకిపుడు మధింపబడుచున్నదీ-38. ఈ మంత్ర ప్రభావముచే మథనము చేయబడినచో వారిద్దరు దంపతులు) పుణ్యకర్ములగుదురు. వారిరువురికి ఏదోషముండదు-34. ఓ దేవేంద్ర ఈ గొప్ప పరమ రహస్యమును వినుము. సర్వపాపములు దీనివల్ల ఒక్కమారున నశించును -35, భక్తి శ్రద్దలతో గూడిన వాడై స్నానముజేసి అంతర్జాలముననున్న వాడై పంచదశాక్షరిని నూట యెనిమిది మారులు జపింపవలె-36. పరాశక్తి నారాధించి సర్వపాపముల నుండి విముక్తుడగును. దానిచేత కోటి కల్పముల నుండి జేసిన పాపములు గూడ నశించును. సర్వాపదల నుండి విముక్తుడగును. సర్వ కామనలను బొందును-37.
(సూచన :- 23 నుండి 36 వరకు శ్లోకములు సందిగ్ధములు. సమన్వయము అస్పష్టము. యథామతి అనువాదము గూడ అస్సష్టమే. విజ్ఞులు సదన్వయమును భావింప బ్రార్ధితులు). ఇంద్ర ఉవాచ :-
భగవన్ సర్వధర్మజ్ఞ సర్వభూతహితే రత ।
సంయోగణస్య పాపస్య విశేషం వక్తుమర్హసి ॥
బృహస్పతి రువాచ :-
సంయోగజం తు యత్పాపం తచ్చతుర్ధా నిగద్యతే ।
కర్తా ప్రధానః సహకన్నిమితోనుమతః క్రమాత్ ॥
క్రమార్దశాంశతో ఘం స్యాచ్భుద్ధిః పూర్వోత్తమార్గతః ॥
మద్యం కలంజం నిర్యాసం ఛత్రాకం గృంజనం తథా ।
లశునం చ కలింగం చ మహాకోశాతకీం తథా ॥
ఓంభీం చ కవకం చైవ హస్తినీం శీకులంబీకామ్ ।
ఔదుంబరం చ వార్తాకం కతకం బిల్వమల్లికా ॥
క్రమార్దశగుణం న్యూనమఘమేషాం వినిర్ధికేత్ ।
పురస్రంగవైశ్యాంగ వేళ్యోపాయనవీక్రయీ ॥
సేవకః పురసంస్థశ్చ కుగ్రామస్థాభిఽ శస్తక ।
వైద్యో వైఖానసః శైవో నారీజీవోఽన్నవిక్రయీ ॥
శస్త్రజీవీ పరివ్రాటు వైదికాచారనిందకః ।
క్రమార్దశగుణాన్యూనమేషామన్నాదనే భవేత్ ॥
స్వతంత్రం తైలట్లుప్తం తు హ్యుక్తార్థం పొపమాదిజేత్ ।
నైరేవ దృష్టం తద్భుక్తిముక్తపాపం వినిర్దిశేత్ ॥
బ్రహ్మాక్షత్రవిశాం చైవ సశూద్రాణాం యథాదనమ్ ।
తైలపక్వమదృష్టం చ భుంజన్ పాదమఘం భవేత్ ॥
ద్విజాత్మదాసీక్లుప్తం చ తయా దృష్టి తదర్ధకే ।
వేశ్యాయాస్తు త్రిపాదం స్యాత్తథా దృష్టి వద్దనే ॥
శూద్రావత్స్యాత్తు గోపొన్నం వినా గవ్యచతుష్టయం ।
తైలాజ్యగుడసంయుక్తం పక్వం వైశ్యాన్న దుష్యతి ॥
వైశ్యావబ్రాహ్మణీ భ్రష్టా తయా దృష్టిన కించన ॥
బ్రవస్యాన్నం ద్విజో భుక్త్వా ప్రాణాయామశతం చరేత్ ।
అరవాంతర్జలే జప్త్యాద్రుపదాం వా శ్రీవారకమ్ ॥
ఇదం విష్ణుస్ర్యంబకం వా తథైవాంతర్జలే జపేత్ ।
ఉపోష్య రజనీమేకాం తతః పాపాద్విశుద్ధ్యతి ॥
అథవా ప్రోక్షయేదన్నమజ్లింగైః పావమానికైః ।
అన్నసూక్తం జపిత్వా తు భృగురై వారుణీతి చ ॥
బ్రహ్మార్పణమితిత్లోకం జప్త్వా నియమమాశ్రితః ।
ఉపోష్య రజనీమేకాం తతః శుద్దో భవిష్యతి ॥
స్త్రీ భుక్త్వా తు బ్రువాద్యన్నమేకాద్యానోజయేద్ద్విజావ్ ।
ఆపది బ్రాహ్మణో హ్యేషామన్నం భుక్త్వా న దోషభాక్ ॥
ఇదం విష్ణుంతి మంత్రేణసప్తవారాభిమంత్రితమ్ ।
సోఽహంభావేన తద్ద్యోత్వా భుక్త్వా దోషెర్న లిప్యతే ॥
అథ వా శంకరం ధ్యాయజ్ఞప్త్వా త్రియంబకం మనుమ్ ।
సోఽహంభావేన తజ్జ్ఞానాన్నదోషైః ప్రవిలిప్యతే ॥
ఇదం రహస్యం దేవేంద్ర శృణుష్వ వచనం మమ ।
ధ్యోత్వా దేవీం పరాం శక్తిం జప్త్వా పంచదశాక్షరీమ్ ॥
తన్నివేదితబుద్ధ్యాదౌ యోః శ్నోతి ప్రత్యహం ద్వీజః ।
నాస్యాన్నదోషజం కించిన్న దారిద్ర్యభయం తథా ॥
న వ్యాధిజం భయం తస్య న చ శత్రుభయం తథా ।
జపతో ముక్తిరేవాస్య సదా సర్వత్ర మంగళమ్ ॥
ఏష తే కఠితః శక్ర పాపానామపి విస్తరః ।
ప్రాయశ్చిత్తం తథా తేషాం కిషనచోతుమిచ్ఛసి ॥
ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్యసంపోదే లలితోపాఖ్యానే ష్టమోధ్యాయః ॥ 8
ఇంద్రుడనెను : సర్వధర్మములను దెలిసిన యో భగవంతుడా! సర్వప్రాణుల హితమునందాసక్తి కలవాడా! సంయోగము వలన (కలియుట వలన) కలిగిన పాపమునకు దోష ప్రాయశ్చిత్తములను విశేషముగా వివరింపుము-38. బృహస్పతీయనెను. సంయోగమున గలిగిన పాపము నాలుగు విధములు. కర్త, ప్రధానుడు, సహకరించినవాడు, నిమిత్తమైనవాడు. -వీరికి వరుసగా దశాంశ రీతిలోపాపము గలుగును. పూర్వము జెప్పిన విధమున దాని శుద్ధి గలుగును-40. మద్యము, మాంసము, మ్రానిబంక, ఛత్రాకము, పుట్టగొడుగు, విషముదీన్న పశువుయొక్క మాంసము, వెల్లుల్లి, కొడికాయ, పెద్ద పొట్లకాయ, దొండకాయ, కవకము (ఉలవలు), హస్తిని(?) శిశులంబిక (?) మేడిపండు, వంకాయ, చిల్లగింజ, మారేడుపండు, మల్లిక-వీనియోగము (తినుట) వరుసగా పదిగుణములు తక్కువ పాపమునిచ్చును. పురగ్రామాంగములను, వైశ్యాంగములను, వేళ్యోపాయనములను అమ్మువాడు, పురమునందున్న సేవకుడు, కుగ్రామమునందున్న యభిశంసకుడు (నిందకుడు), వైద్యుడు, మైఖానసుడు, శైవుడు, క్రియాధారముగా జీవించువాడు, అన్నము నమ్మువాడు-44. శస్త్రాధారముగా, జీవించువాడు, సంన్యాసి, వైదికాచార నిండకుడు, వీరీయొక్క యన్నమును దీనినచో వరుసగా పది, గుణముల కంటే తక్కువ పాపముగలుగును-45. స్వతంత్రము-తైలక్లుప్తము-వీని విషయమున పూర్వోక్త పాపమునే చెప్పవలె, వారిచే చూడబడినను భుజింపబడినను పై పాపమునే జెప్పవలెను-46. శూద్రూలతోబాటు బ్రహ్మ క్షత్రియ వైశ్యుల యన్నము వలెనే వారి తైలపక్వము: చూడబడకున్నను తినినచో పాపము గలుగును. బ్రాహ్మణ, దాసి సిద్దము జేసినదియు ఆమె చూచినదియు భుజించిన సగము పాపము. వేశ్యచే ! సిద్ధముజేయబడినదిగాని చూడబడినదిగానియైన యన్నము భుజించినచో ముప్పాలు పాపముగలుగును-48. గవ్య చతుష్టయమును విడిచిగోపాన్నము భుజించిన పాపము కలుగును, నూనె నేయి బెల్లము వీనితో గలిపి వండినది. వైశ్యుని నుండియైనను దోషముగాదు-49. భ్రష్టయైన బ్రాహ్మణి వైశ్యవంటిది, ఆమెచే చూడబడినచో అన్నము కొద్ది పాపము గలిగించును-50. పేరుకు మాత్రము పిలువబడు బ్రాహ్మణుని యన్నముదిన్న బ్రాహ్మణుడు, నూరు ప్రాణాయాములాచరించి శుద్దీకెందును. లేదా "అంతర్జాలమున ద్రుపదను మూడు మారులు జపించవలె-51. ఇదం విష్ణుర్విచ క్రమే మంత్రమునుగాని, త్ర్యంబకం యజామహే మంత్రమునుగాని ఒకరాత్రంతయు నుపవసించి యంతర్జాలమున జపించవలెను. అపుడు శుద్ధియగును-52. లేదా, అబ్లింగములైన పావమానిక. మంత్రములతో, అన్నసూక్తమును జపించి, “ఓం భృగుర్వై వారుణి” యనియుజపించి-53. నీయమునాశ్రయించి బ్రహ్మార్పణమను శ్లోకమును జపించి, యొకరాత్రియుపవసించిన శుద్దుడగును-54. బ్రువాదులయన్నము స్త్రీ భుజించి ఏకాదులను ద్వీజులను భుజింప జేయవలె. ఆపదలో వీరియన్నమును భుజించిన బ్రాహ్మణుడు దోషమునందడు-55. “ఇదం విష్ణుర్విచక్రమే” మంత్రము నేడు మారులు జపించి మంత్రించి సోహంభావముతో నాయన్నమును ధ్యానించి భుజించినచో దోషమంటదు-58, లేదా “శ్రీయంబకం యజామహే మంత్రమును శంకరుని ధ్యానించుచు జపించిన సోహంభావముతో శంకరుని జ్ఞానమువలన దోషములంటవు-57. ఓ దేవేంద్ర! ఇది రహస్యము. నామాట వినుము. పంచదశాక్షరిని జపించి పరాశక్తియైన దేవిని ధ్యానించి-58, అమె యందర్పించిన బుద్దీతో మొదట ప్రతిదినము భుజించిన బ్రాహ్మణుడు ఏ దోషమునుగానీ దానివల్ల కలుగు దారిద్ర్య భయమును గానీ పొందడు-59. అట్లే వ్యాధి భయముగాని, శత్రుభయముగానీ యాతనికుండదు. జపించు నీతనికి ముక్తియే లభించును. ఎల్లప్పుడెల్లెడల మంగళము గలుగును-60, ఓ ఇంద్రా పాపములయు వానీ ప్రాయశ్చిత్తములయు విస్తరమునీకు జెప్పితిని. మరేమి వినదలచితివీ?-61.
ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తర భాగమున లలితోపాఖ్యానమున అష్టమాధ్యాయము-8.
Summary of chapter 120 of the Brahmānda Mahā Purana is as follows:
This joyful chapter celebrates the majestic coronation of goddess Lalitā as the supreme ruler of the cosmos and her sacred marriage with lord Kāmeshvara. It details the grand divine assembly where all gods, sages, and cosmic guardians offer sacred gifts and bow before the divine couple in absolute devotion. The devoted reader's heart overflows with bliss, contemplating the eternal union of Shiva and Sakti that sustains and fills the entire cosmos with love.