7 - ప్రపంచ విజ్ఞానము

సూత ఉవాచ :-

తుల్యం యుగసహస్రం వై నైశం కాలముపాస్య సః

 శర్వర్యస్తే ప్రకురుతే బ్రహ్మా తూత్సర్గకారణాత్

బ్రహ్మా తు సలిలే తస్మిన్ వాయుర్భూత్వా తదాచరత్

అంధకారార్ణవే తస్మిన్నష్టే స్థావరజంగమే

జలేన సమనుస్లావ్య సర్వతః పృథివీతలే

ప్రవిభాగేన భూతేషు సత్యమాత్రే స్థితేషు వా

నిశాయామివ ఖద్యోతః ప్రావృట్కాలే తతస్తదా

తదా కామేన తరసా మన్యమానః స్వయం ధియా

సోపులపాయం ప్రతిష్టాయాం మార్గమాణస్తదా భువమ్

తతస్తు సలిలే తస్మిన్ జ్ఞాత్విత్వంతర్గతో మహీమ్

అంధమన్యతమం బుద్ధా భూమేరుద్ధరణక్షమః

చకార తం తు దేవోథ పూర్వకల్పాదిషు స్మృతః

సత్యం రూపం వరాహస్య కృత్వాంభోనుప్రవిశ్య చ

అద్భిః సంఛాధితామిచ్ఛన్ పృథివీం స ప్రజాపతిః

ఉద్ధృత్యోర్వీమథ న్యస్తాం సాపత్యాంఫోమతీన్యసర్

సాముద్రాశ్చ సముద్రేషు నాదేయాశ్చ నదీషు చ

పృథక్తాస్తు సమీకృత్య పృథివ్యాం సోచినోద్గిరీన్

ప్రాక్సర్లే దహ్యమానే తు పురా సంవర్తకాగ్నినా

తేనాగ్నినా విలీనాస్తే పర్వతా భువి సర్వశః

శైల్యాదేకార్ణవే తస్మిన్ వాయునా యే తు సంహితాః

 (భూమియొక్క భౌగోళిక విభాగములు - నాల్గయుగములు - వానీ కాలపరిమితి - ఖండములు - వానీ భౌగోళిక విషయము - నగరములు - గ్రామములు - వృక్షసంతతి - జంతు సంతతి - జనములు, వర్ణములు, జీవితమందలి స్థితులు).

సూతుఁడిట్లు చెప్పెను.

ఒక సహస్ర యుగమునకు తుల్యమైన కాలమానమును ఒక రాత్రిగా ఆ బ్రహ్మభావించెను. బ్రహ్మ ఆ రాత్రి కొంతమునందు, బ్రహ్మ ఉత్సర్గ కారణమున (సృష్టికోటకు) విశ్వము సృజించెను. (1) ఆ సమయమున బ్రహ్మ తదనంత జలములో, వాయువై, అంధకారావృతుఁడై (ఆ సముద్రములో) సంచరించెను. అప్పటికే స్థావర జంగమ వస్తువులన్నీ నశించియుండెను. (2) పృథివీతలము నంతటినీ నీటివరదచేనతఁడు ముంచెత్తి వైచెను. భూతములన్నియును వాని వాని విభాగములతో “సత్య” మాత్ర స్థితములై యుండెను. (3) అప్పుడాతఁడు వర్షాకాల మందలి రాత్రీ యందలి మిణుగురు పురుగువలె (ఖద్యోత) సంచరించెను. అప్పుడాతఁడు యథేచ్ఛముగా వేగముగా ధీప్రచోదితుఁడై, స్థిరీకరించుటకు (ప్రతిష్టాతయై) సంచరించెను. (5) ప్రతిష్టాపించుట కుపాయమునకై భూమీ కొజలికతఁడన్వేషించెను. అప్పుడు భూమి సలిలాంతర్గతమై యున్నదని యెఱింగేను. (5) వానిలో నొకటి గ్రుడ్డిదనీ (అంధం) తెలిసికొని, భూమిసుద్దరించుటకు సమర్ధుఁడైన యతఁడు, పూర్వకల్పము యొక్క ఆరంభ Fమయమును సంస్మరించి, సత్యమైన వరాహరూపమును దాల్చి నీటియందు ప్రవేశించెను. ఆ ప్రజాపతి, నీటిచే సంఛారివైయున్న భూమిని కలియగోరి, పృథ్వీనీ ఉద్దరించి, దానిని మరల తదపత్యముతో నటనుంచేను. (భూమిని ప్రజాపతి యుద్ధరించెను. అతఁడు మరల నీరములను భూతలముననే ప్రవర్తిల్లఁజేసెను). ఆతఁడు సముద్రోదకములను సముద్రములో, నదుల నీరములను నదులలో (8) ప్రత్యేకముగ నుంచెను. భూమీని ఎత్తు పల్లములు లేక సమీకరించి అతఁడు పర్వతములను పైకి తీసి యొకచో సమకూర్చెను. (9) పూర్వము ప్రళయకాలాగ్నిచే (సంవర్తకాగ్ని) పూర్వపు సృష్టి యంతయు దహింపఁబడి యుండుటచే, ఆ యగ్నిచేతనే భూమి యందలి పర్వతములు సంపూర్ణముగా విలీనములయ్యెను. అవి వాయువుచే విశీర్ణములయి వికీర్ణములయ్యెను.(10)

నిషిక్తా యత్ర యత్రిసంస్తత్ర తత్రాచలో భవత్

 స్కంధాచలత్వాదచలాః పర్వభిః పర్వహాః స్మృతాః

గీరయో హి నిగీర్ణత్వాదయానాతు లోచ్చయాః

తతస్తా పోసముద్ధృత్య క్షితిమంతర్జలాత్ర్పభుః

సప్త సప్త తు వర్షాణి తస్యా ద్వీపేషు సప్తసు

విషమాణి సమీకృత్య శిలాభిరభితో గిరీన్

ద్వీపేషు తేషు వర్షాణి చత్వారింశత్తథైవ తు

తావత్త: పర్వతాశ్చైవ వరానే సమవస్థితాః

స్వర్గాదే కాంతివిష్టాస్తే స్వభావేనైవ నాన్యథా

సప్తద్వీపా సముద్రాశ్చ అన్యోన్యస్యానుమండలమ్

సన్నివిష్టాః స్వభావేన సమావృత్య పరస్పరమ్

భూరాద్యాశ్చతురో లోకాశ్చంద్రాదిత్యా గ్రహైస్సహ

పూర్వవన్నిర్మమే బ్రహ్మా స్థావరాణీహ సర్వశః

కల్పస్య చాస్య బ్రహ్మా చాసృజద్యః స్థానినః సురాన్

ఆపోగ్నిం పృథివీం వాయుమంతరిక్షం దేవం తథా

స్వర్గం దిశః సముద్రాంశ్చ నదీః సర్వాంస్తు పర్వతాన్

ఓషధీనామాత్మనశ్చ ఆత్మనో వృక్షవీరుధాం

లవాకాష్టాః కలాశ్చైవ ముహూర్తాన్సంధిరాత్ర్యహాన్

అర్ధమాసాంశ్చ మాసాంశ్చ అయనాబ్దాన్ యుగాని చ

స్థానాభిమానినశ్చైవ స్థానానీ చ పృథక్ పృథక్

చల్లదనముచే ఆ శిలలు ఘనీభవించెను. కరిగిపోయి యేచ్చటెచ్చట శీలలుపడి యుండెనో అచ్చట పర్వతము లావిర్భవించెను. (11) ఆ పర్వముల స్కంధములు (శిఖరములు) పర్వములచే (కణుపులచే) కదలక అచలములై యున్న హేతువున నయ్యవి పర్వతములుగా స్మరింప బడినవి. (11) “స్కంధాచలత్వాత్ అచలా - పర్వభిః పర్వతా” ('అచల' పదమునకు పర్వత పదమునకు నిర్వచనము లీయబడినవి). వానీకి గిరులనీ పేరు వచ్చినది. కారణము అవి నిగీర్ణములయినవి. నీగీర్ణములు మ్రింగఁబడినవి. “గిరయో హీ నిశీర్ణత్వాత్" - అయసాత్తు శీలచ్చయా - ఆ పర్వతములు ఒకచో నుండి వేశాక చోటునకు ప్రయాణించుటచే (అయనము వలన) శీలోచ్చయనామము లొందినవి. (12, 14) భూమిని నీటినుండి యుద్దరించిన తరువాత, ప్రభువు (బ్రహ్మ) సప్త పర్యాయములు, సప్తద్వీపములను, సప్త వర్షముల యందు సృజించెను. విషమముగా ఎత్తు పల్లములుగా నున్న భూమినీ సమీకరించి (సమతల మొనర్చి) సర్వత్ర శిలలతో ప్రభువు సృజించెను, ఆ వర్పములలో (ప్రతి వరమునకు ఏడు ఉపద్వీపములు కలవు. అందుచే సప్త వర్షములలోని (7x7=49) ఉపద్వీపముల సంఖ్య నలుబది తొమ్మిదియైనది. వీని నామ చరిత్రాదులు మున్ముందు వర్ణింపఁబడును) నలుబది తొమ్మిది ఉపద్వీపములున్నవి, సృష్టికీఁ బూర్వము పర్వతములు సన్నివిష్టములై యున్నవి. అవి కాంతిచే స్వభావ సిద్దముగానే, వేవోక విధముగా కాక, ఆ వృతములై యున్నవి. సప్తసముద్రములు, సప్తద్వీపములు ఒకదాని నొకటి చుట్టుకొని యున్నవి. ఒకదాని నోకటి సహజముగా చుట్టుకొనియున్న పిమ్మట సమవస్థీతములై యున్నవి. (15,16) భూలోకాదులు నాలుగు; యథాపూర్వము బ్రహ్మ చంద్రుని, సూర్యుని, స్థావరములయిన వస్తువులను, ఇతరములయిన గ్రహములతో సహితము అంతటను నిర్మించెను. అంతయేకాక ఈ కల్పమునకు సంబంధించిన దేవతలను, వారి వారి నివాసములతో కూడ సృజించెను. (17) నీటిని, అగ్నిని, పృథివిని, పాయువును, అంతరిక్షమును, దీవమును (స్వర్గమును), దీకులను, సముద్రములను, నదులను, పర్వతములను, ఓషధులను (వాని శక్తులతో) వృక్షములను, లతలను (వానీ ఆత్మలతో), లవ, కాష్ఠ కల, ముహూర్తములు, మున్నగు కొలవిభాగములను, సంధ్యా సమయములను, రాత్రులను, పగళ్లను, పక్షములను, మాసములను, అయనములను, యుగములను, స్థానాభిమానులను, తత్తత్రత్యేక స్థానములను బ్రహ్మ సృజించెను. (20)

స్థానాత్మనస్తు సృష్ట్వా చ యుగావస్థానీ నిర్మమే

 కృతం త్రేతా ద్వాపరం చ తిష్యం చైవ తథా యుగమ్

కల్పస్యాదౌ కృతయుగే ప్రథమం సోమసుత్పజాః

ప్రాగుక్తాశ్చ మయా తుభ్యం పూర్వే కల్పే ప్రజాస్తు తాః

తస్మిన్ సంవర్తమానే తు కల్పే దగ్గ స్తదగ్నీనా

అప్రాప్తాయాస్తపోలోకం పృథివ్యాం యాః సమాసత

ఆవర్తనే పునస్సన్దే వీక్షార్థం ఈ భవంతి హి

వీక్షార్థం తాః స్థితాస్తత్ర పునః సర్గస్య కారణాత్

తతః స్తాః సృజ్యమానాస్తు సక్తానార్థం భవన్తి హి

ధర్మార్థకామమోక్షణామిహ తాః సాధితాః స్మృతాః

దేహాశ్చ పితరశ్చైవ క్రమశో మానవాస్తథా

తతస్తే తపసా యుక్తాః స్థానాస్యాపూరయన్ పురా

బ్రాహ్మణో మనవస్తే పై సిద్దాత్మానో భవస్తి హి

ఆసంగద్వేషయుక్తేన కర్మణా తే దివం గతాః

ఆయా స్థానములకు జీవులను (వ్యక్తులను సృజించి, బ్రహ్మ కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, (తిష్య) కలియుగమును నీర్మించెను. (21) కల్పాదీ యందు కృతయుగములో ముందుగా ప్రజలను బ్రహ్మ సృజించెను. పూర్వ కల్పమందలి ప్రజలను గూర్చి ఇంతకు పూర్వమే నేను వర్ణించి యుంటిని కదా. (22) కల్పము విలయము పొందగా (సమాప్తము చెంద) ప్రజలందరు అగ్నిచే దగ్గులయిరి. ఆ సమయమున తపోలోకమును చేరలేనట్టివారును, భూలోకమును జేరి యందున్నపోరును, పునస్సష్టియందు (ఇది తప్పని, అనివార్యమయిన కర్మ సిద్ధాంతము. కల్పాంతమున యావద్విశ్వము లయము పొందగా, కర్మవిపాకము చెందినట్టివారు తరువాత యుగమున జన్మించెదరు. ఈ విషయ మీ పురాణమున. రూఢముగా వ్యక్తీకరింపఁబడినది) వీక్షార్థము తిరిగి వచ్చిరి. కర్మపరిపక్వమొంది మోక్షము నొందనివారు అచ్చటనే వీక్షార్థము (జన్మకోకు) నిలిచియుండిపోయిరి. వారు వచ్చు సృష్టిలో నుద్భవమొందెదరు. (24) అట్లు సృజ్యమానులయిన వారు, వారి సంతతి కొణుకుండి పోయెదరు. ధర్మార్థ కామ మోక్షములను పురుషార్ధములను వారు సాధించిన వారుగా పరిగణింపఁబడెదరు. (25) పూర్వము దేవతలు, పితరులు, మానవులు క్రమముగా సృజింపఁబడిరి. తరువాతవారు తపస్సాచరించి, ఆయా స్థానములను ఆక్రమించిరి. (26) అట్టి మానవ జీవులు నిజముగా బ్రాహ్మణులగుదురు. వారే సిద్దాత్ములు. ఆధ్యాత్మిక సిద్దిమంతులు. (సంగయుక్తేన - కోరికతో గూడిన దోషయుత మయిన, ద్వేషముచే; ఆసంగద్వేషయుక్తులు - సంపూర్ణమయిన అభిమానము వాంఛ కలుగుట ఆసంగదోషము). సంగము (కోరికతో)తో కూడిన దోషయుక్తమయిన కర్మలచే వారు స్వర్గమును పొందిరి.

ఆవర్తమానాస్తే దేహే సంభవస్తి యుగే యుగే

స్వకర్మఫలశేషేణ ఖ్యాతాశ్చైవ తధాత్మకః

సంభవస్తి జనే లోకాః కల్పాగమనిబంధనాః

అప్పు యః కారణం తేషాం బోధయన్ కర్మణా తు సః

కర్మభిసైస్తు జాయనే జనలోకాచ్ఛుభాశుభైః

గృహ్లానీ తే శరీరాడి నానారూపాణి యోనిషు

దేవాద్యాః స్థావరాయీస్తు ఆపద్యనే పరస్పరమ్

తేషాం మేధ్యాని కర్మాణి ప్రాయశః ప్రతిపేదిరే

తస్మాద్యన్నామరూపాణి రాన్యేవ ప్రతిపేదిరే

పునః పునస్తే కల్పేషు జాయస్తే నామరూపిణః

తతః సర్గో హ్యుపసృష్టిం సీసృక్షోర్బహ్మణస్తు పై

ప్రజాః ధ్యాయతస్తస్య సత్యాభిధ్యాయినస్తదా

మిథునానాం సహస్రం తు ముఖాత్సమవతిల

జనాస్తే హ్యుపపద్యత్తే సత్వోద్రిక్తాః సుతేజసః

చక్షుషోఃన్యత్సహస్రం తు మిథునానాం ససర్జ హ

తే సర్వే రజసోద్రిక్తాః శుష్మిణశ్చాష్యమర్షిణః

సహస్రమన్యదసృజద్భాహూసోమసం పునః

రజస్తమోభ్యాముద్రిక్త గృహశీలాస్తతః స్మృతాః

శరీర స్థితియందు పరివర్తమానులయి వారు ప్రతియుగము నందు సంభవించుచుందురు. తామొనర్చిన స్వకర్మ ఫలశేషముచే వారు 'తదాత్మకులు'గా (తత్కర్మజాతులుగా) ప్రసిద్ధులు. (28) నూతనమయిన కల్పము యొక్క ఆగమముచే నిబంధితులయి వారు జనలోకమున సంభవము నొందుదురు. నీటియందుదయించుటకు గల కారణము వారి కర్మచే గ్రహింపనగును. ఈ విషయమే వాయు పురాణమున “ఆసత్యకర్మణాం తత్ర బోద్ధవ్యం కర్మణాం తు సు” అని యున్నది. (వారి నివాస స్థానము కారణముగా నెఱుంగనగును). (29) జన లోకము నుండి వారు శుభాశుభములయిన కర్మలచే భిన్నభిన్న యోనులయందు, భిన్నభిన్న శరీరములను ధరింతురు. (30) దేవాదులతో నారంభమయి స్థావరములతో నంతమొందు జీవులు పరస్పరము, వారి వారి పవిత్రములయిన కర్మఫలములను సాధారణముగా పొందిరి. (31) అందుచే, ఇంతకుఁబూర్వము వారే యే నామరూపములను పొందియుండిరో వానినే పొందేరీ, పునఃపునః వారట్లే ఆ నామరూపులే కల్పములందు పుట్టుచుందురు. (32) ఆ కారణముననే, ఉపసృష్టిని (వేటిక అప్రధానసృష్టిని) సృజింపవలయునను కోర్కె బ్రహ్మకు కలిగెను. సత్య ధ్యానవంతు డగుటచే బ్రహ్మ ధ్యానించుచుండఁగనే, ఆతని ముఖము నుండి సహస్ర మీథునములతో ఆ ప్రజలు పుట్టిరి. వారందరు సత్వోద్రిక్తులగుట వలన ఆ ప్రజలు సతేజస్కులై యుండిరి. (34) ఆ బ్రహ్మ తన నేత్రముల నుండి వేటిక సహస్ర మిథునములను (భార్యా భర్తల జంటలను) సృజించెను. వారందరు రజోగుణోద్రిక్తులు. వారు శుష్మిణులు (శక్తిమంతులు - ఆగ్రహవంతులు, కాంతిమంతులు) అమర్షణులు (క్షమాగుణరహితులు, కోప స్వభావులు) (35) వేటిక సహస్ర మిథునముల జంటలను మరల బ్రహ్మ సృజించెను. వారు అసత్పురుషులు. రజస్తమోగుణములచేనుదీక్తులు. వారు తరువాత గృహశీలురుగా (భోగపరాయణులుగా) చెప్పఁబడిరి. (36)

ఆయుషోత్తే ప్రసూయత్తే మిథునాన్యేవ వాసకృత్

 కూటకాకూటకాశ్చైవ ఉత్పద్యనే ముమూర్షుణామ్

కుతః కులమథోత్పాద్య తాః శరీరాణి తత్యజుః

తతః ప్రభృతి కల్పేస్మిన్ మైథునానాం చ సంభవః

ధ్యానేన మనసా తాసాం ప్రజానాం జాయతే కృతే

శబ్దాదివిషయః శుద్ధః ప్రత్యేకం పంచలక్షణమ్

ఇత్యేవం మానసైర్భావైః ప్రేష్టం తిష్టస్తి శాః ప్రజాః

తథాన్వయాస్తు సంభూతా యైరిదం పూరితం జగత్

సంత్సరఃసముద్రాంశ్చ సేవనే పర్వతానపి

తదా తా హ్యల్పసంతోషా యుద్ధే తస్మిన చరని వై

పృథ్వీ రసవతీ నామ ఆహారం వ్యాపారస్త్రీచ

తాః ప్రజాః కామచారిణ్యో మానసీం సిద్ధిమిచ్ఛతః

తుల్యమాయుః సుఖం రూపం తాసామాసీత్ కృతే యుగే

ధర్మాధర్మా తదా న స్తః కల్పాదౌ ప్రథమే యుగే

స్వేన స్వేసాధికారేణ జజ్ఞిరే తు యుగే యుగే

చత్వారీ తు సహస్రాణి వర్షాణాం దీవ్యసంఖ్యయా

ఆ యాలుమగల జంటలు తమ తమ జీవితాంతముల వకు పెక్కు మారులు మిథునములనే పుట్టించిరి. (కనిరి) వారు కూటకులను (మోసగాండ్రను) ఆకూటకులను (సజ్జనులను) పుట్టించిరి. వారందరు మృత్యు స్వభావులు. (మర్యలక్షణులు) (37) వారట్టి సంసారులను స్పజీంచీ శరీరములను బరిత్యజించిరి. అప్పటి నుండియే యాకల్పము నందు మైథునత్వము జంటలకు సంభవించినది. (38) కృతయుగమున మనస్సంబంధమయిన ధ్యానముచేతనే ఆ ప్రజానీకమునకు శబ్ద స్పర్శ రస రూప గంధాదుల శుద్ద విషయ జ్ఞానము కలిగినది. అది పంచ లక్షణము. (39) ఈ విధముగా, మానసభావములచే ప్రజలుత్పత్తి చెంది (ప్రేష్టం = ప్రియతమము; పోయుపురాణమున నీ శ్లోకమిట్లున్నది. “ఇత్యేవం మానసీం పూర్వం ప్రాక్ సృష్టి : యా ప్రజాపతిః” ఇట్లే పూర్వము మానసికముగా సాధారణ సృష్టి జరిగినది. అయ్యది మిథునక్రియచే నుత్పన్నము. ప్రపంచమంతయు దానితో నిండియున్నది.) ప్రియులైయుండిరి. వారి సంతతుల యన్వయమే సంభూతమయినది. వారిచే నీలోక మంతయు నిండియ్నుది. (40) ఆ ప్రజాసంతతి నదులను, సరస్సులను, సముద్రములను, పర్వతముల నాశ్రయించిరి. వారప్పుడల్ప సంతోషులు; తరువాత యుద్దములందు పాల్గొనిరి. (రసవతి : నీరుకలది : రసముకలది) పృథ్వీ రసవతి. పారు రసవతిని ఆహారముగా చెప్పుదురు. రసమే దొరికాహారము. మానసికమయిన సిద్దీనీ (ప్రభావమును) గోరుచు వారు (ఆ ప్రజలు) యథేచ్చా కామాచోరులయిరి. (42) కృతయుగమున ఆ ప్రజలు (మర్త్యులకు) సమానమయిన ఆయుర్దాయము, సుఖము, రూపము (సౌందర్యము) కలిగి యుండిరి. ప్రథమ యుగమున, కల్పాదియందు, ధర్మాధర్మములు వారికీ లేవు. (43) ప్రతియుగము నందు వారు వారి వారి అధికారముతో స్వామ్యములతో నుదయించిరి. దివ్య సంఖ్యచే దేవతామీనమున, కృతయుగము ఆరంభమున నాలుగువేలేండ్లు సంధ్యాకాలములు రెండును నాలుగువందల యేండ్లు పట్టినవి.

ఆదౌ కృతయుగం ప్రాహుః సంధ్యాంశా చ చతుశ్శతౌ

తతః సహస్రశస్త్రాస్తు ప్రజాసు ప్రథితాస్విహ

న తాసాం ప్రతిఘాతోస్తి న ద్వంద్వం నాపి చక్రమః

పర్వతోదధివాసిన్యో హ్యనికేతాశ్రయాస్తు తాః

విశోకాః సత్యబహుళాః ఏకొంతసుఖినః ప్రజాః

తాశ్శశ్వత్ కామచారిణ్యో నిత్యం ముదితమానసాః

పశవః పక్షిణశ్చైవ న తదాసన్ సరీసృపాః

నో ద్విజా నోత్కటాశ్చైవ ధర్మస్య ప్రక్రియా తు. సా

సమూలఫలపుష్పాణి వర్తనాయ త్వశేషతః

సర్వైకాంతసుఖః కాలో సాత్యర్ధం హ్యుష్ణశీతలః

మనోభిలషితః మస్తాసాం సర్వత్ర సర్వదా

ఉత్తిష్ఠన్తో పృథివ్యాం వై తేషాం ధ్యానై రసాతలాత్

బలవర్ణకరీ తేషాం జరా రోగప్రణాశీనీ

అసంస్కార్యైః శరీరైస్తు ప్రజాస్తాః స్థిరమౌవనాః

తాసాం వినా తు సంకల్పో జాయస్తే మిథునాత్ ప్రజాః

సమం జన్మ చ రూపం చ ప్రియనే చైవ తాః సమాః

తదా సత్యములోభశ్చ సంతుష్టిశ్చ సుఖందమః

నిర్విశేషాశ్చ తాః సర్వా రూపాయుఃశిల్పచేష్టితైః

అబుద్ధిపూర్వకా వృత్తిః ప్రజానాం భవతి స్వయమ్

అప్రవృత్తిః కృతద్వారే కర్మణః శుభపాపయోః

తరువాత సహాస్ర సంఖ్యలో ప్రజలుండిరి. వారు సుప్రథితులు. వారికి పరస్పరము సంఘర్షణముచెందు వ్యతిరేక భావములు లేవు. ఒకరి తరుపోత నొకరు రావలెననెడి క్రమము కూడ లేదు. వారికి నివసించు సక్రమమైన నికేతనములు (గృహములు) లేవు. వారందరు పర్వతములందు సముద్ర తీరములందు వసించెడి వారు. (44,45, 46) వారు సత్త్వగుణ బాహుల్యులు. వారు విశోకులు : ఆ ప్రజలందఱు ప్రత్యేకముగా సుఖవంతులు. వారెప్పుడు యథేచ్ఛా సంచారిణులు. నిత్యము సంతుష్టమనస్కులు. (47) అప్పుడు పశువులు కానీ పక్షులు కానీ, సరీసృపములు : (జెఱ్ఱులు, పాములు మొదలయినవి) కానీ లేవు. వృక్షములు లేవు. త్రాగుఁబోతులు లేరు. ఉద్విగ్నమనస్కులు లేరు. అచ్చటీ ధర్మ ప్రక్రియ యది. (48) అందు విశేషముగాతిని జీవించుటకు, సమూల ఫలపుష్పములు కలవు. కాలము సర్వైకాంత సుఖ ప్రదము. అచ్చట ఎక్కువ ఉష్ణముకాని ఎక్కువ చలికాని లేదు. (49) వారలకు మనోభిలషితములయిన కోరికలు సర్వత్ర సర్వదా ఉపపన్నములు. వారల కవి ధ్యానము వలన పృథివి నుండి రసాతలము నుండి ఉత్నములయి యుండును. (50) ఆ ఫలపుష్ప మూలాది సంపద వారలకు బలమును, శరీర సౌందర్యమును గలిగించును. ముసలితనమును రోగములను నవీయే నాశన మొనరించును. అచ్చటి ప్రజలు శరీరములను సంస్కరించి పరిశుద్ద మొనర్చు కార్యము లొనర్పకయే స్థిర యౌవనులయి యుందురు. (51) వారలకో సంకల్పములు లేకుండగనే మిథునత్వమున సంతానముదయింతురు. వారి జన్మము రూపము వారి రూప జన్మములతో సమానములు. వారందరు సంతుష్టులు. సౌఖ్యవంతులు. (52) అప్పుడు సత్యము, లోభరాహిత్యము, సంతుష్టి, సుఖము, ఇంద్రియ నిగ్రహము కలవు. ఇంక సౌందర్యము, ఆయుర్భాగ్యము, శిల్పచేష్టనములు, అన్నియును నిర్విశేషముగా నుపపన్నములు. (53) బుద్దిచే నూహింపఁ బడక, అబుద్ధిపూర్వకముగనే, ప్రజలకు స్వయముగా జీవనాధార వస్తువులు, వారి జీవన వృత్తికొలకు కలుగును. ద్వారములు వివృతములై యుండుటచే, శుభాశుభ క్రియా చరణములకు యత్నమే లేదు

వర్ణాశ్రమవ్యవస్థాశ్చ న తదాసన్న తత్కరాః

అనిచ్ఛాద్వేషయుక్తాస్తా వర్తయన్తి పరస్పరమ్

తుల్యరూపాయుషఃసర్వా అధమోత్తమవర్జితాః

సుఖప్రాయా విశోకాశ్చ ఉత్పద్యనే కృతే యుగే

లాభాలాభౌ న వా స్యాతాం మిత్రామీతొ ప్రియాప్రియా

(మనసా విషయస్తాసాం నిరీహాణాం ప్రవర్తతే

నాతో హింసక్తి పాన్యోన్యం సానుగృహ్లాని వై తదా

విజ్ఞానం పరం కృతయుగే త్రేతాయాం యజ్ఞ ఉచ్యతే

ప్రవృత్తేం ద్వాపర యుద్ధం స్త్యమేవ కలి యుగే

సత్త్వం కృతం రజత్రేతా ద్వాపరం తు రజస్తమః

కలిస్తమస్తు విజ్ఞేయం గుణవృత్తం గుణేషు తత్

కాలః కృతయుగే ల్వేష తస్యసంధ్యాం నిబోధత

చత్వారి తు సహస్రాణి వర్షాణాం తత్కృతం యుగమ్

సంధ్యాంశా తస్య దివ్యాని శతాన్యషౌ తు సంఖ్యయా

చత్వార్యేవ సహస్రాణీ వర్షాణాం మానుషాణి తు

తదా తాసు భవంత్యాశు నోక్రోశాచ్ఛ విపర్యయాః

తతః కృతయుగే తస్మిన్ స సంధ్యంశే గతే తదా

పాదాన శిష్ణో భవతి యుగధర్మస్తు సర్వశః

సంధ్యాయాస్తు వ్యతీతాయాః సాంధ్యః కాలో యుగస్య సః

పాదా మిశ్రావశిస్టేన సంధ్యాధర్మే పునః పునః

ఏవం కృతయుగే తస్మిన్నిశేషేంతర్దధే తదా

ఆ కాలమున వర్ణాశ్రమ వ్యవస్థలేదు. తస్కరులు లేరు. ఒండొరుల యెడ ద్వేషముకాని ఇచ్ఛకాని లేకయే పరస్పరము ప్రవర్తించు చుండిరి. (55) కృతయుగమున నెల్లరును తుల్యమైన సౌందర్యము, ఆయుర్భాగ్యము కలిగియుండిరి. వారు అధమోత్తమాది భేదములు వారిలో లేక యుండిరి, వారందరు సుఖప్రాయులు, శోకవీరహితులు. (56) వారికి లాభాలాభములు లేవు. మిశ్రామిత్రులు, ప్రియాప్రియులు లేరు. వారీచ్చోశూన్యులు, నిరీహులు : విషయానుభవము వారికి మనస్సులందే. వారొకరినొకరు హింసించుకొనరు. అట్లని వారిలో పరస్పరము ఒకరొక్కరికీ ప్రీతియులేదు. (57,58) కృతయుగము నందు జ్ఞానము వీస్తారము; త్రేతాయుగమున యజ్ఞాచరణము విస్తారము. ద్వాపర యుగమున యుద్దమధికము. కలియుగమున దొంగతనమధికము. (59) కృతయుగము సత్వగుణ లక్షితము. త్రేతాయుగ లక్షణము రజస్సు; ద్వాపరము రజస్తమోమిశ్రము. ఇక కలి తమోగుణేకలక్షీతము. త్రియుగములందలి గుణలక్షణములిట్టివని యెఱుంగవలయును. (60) ఇది కృతయుగమందలి కాలము. ఇతర యుగముతోడి సంధికాలము నిటైజుంగుము. కృతయుగము నాలుగు వేలేండ్ల (దేవ) సంవత్సరములు. దేవతా సంఖ్యామానమును బట్టి తత్సంధ్యాకాల భాగ పరిమితి ఎనిమిది వందల సంవత్సరములు. (61,62) అయ్యది నాలుగువేల సహసముల మానవ సంవత్సర ప్రమాణము. అప్పుడు వానియందు ఆకస్మికపుటా క్రోశధ్యానములు కాని విపర్యయములు కాని లేవు. అంత కృతయుగమున సంధ్యాంశ కాల పరిమితి గతింపఁగా, అయ్యుగ ధర్మము ఈ శ్లోకార్థమునందు స్పష్టత లోపించినది. వాయుపురాణమున నీయర్థమే పాదవశిష్టమైనది సర్వత్రయగును. (63,64) ఇట్లు సంధిసమయము యొక్క సాంధ్యకాలము జరిగిపోగా సంధ్యాధర్మము మరల మరల, పాదభాగమై మిగిలియుండును. ఈ విధముగనే కృతయుగమున నిశ్శేషముగ అంతర్థానము నొందును. (65)

తప్యాం చ సంధౌ నష్టాయాం మానసీ చాభవత్ప్రజా

 సిద్ధిరన్యయుగే తమ్మింద్రేతాశ్యటనంతరే కృతాన్

సర్గాదౌ యా మయాష్టౌ తు మానస్యో వై ప్రకీర్తితాః

అష్టా తాః క్రమయోగేన సిద్ధయో యాస్తి సంక్షయమ్

కల్పాదౌ మానసీ హ్యేకా సిద్ధిర్భవతి సా కృతే

మన్వనరేషు సర్వేము చతుర్యుగవిభాగశః

వర్ణాశ్రమాచారకృతః కర్మసిద్యుద్భవ కృతః

సంధ్యాకృతస్య పాదేన సంక్షేపేణ వశాత్తవః

కృతసంధ్యాంశకా హ్యేతే శ్రీసాదాయ పరస్పరమ్

పాయస్తే యుగధర్మాస్తే తపశ్రుతబలాయుషః

కృతే కృతాంశేతీతే తు బభూవ తదనస్తరమ్

త్రేతాయుగసముద్పత్తిః సాంశా చ ఋషిసత్తమాః

తస్మిన్ క్షీణే కృతాంశో వై తాసు శిషాసు సప్తసు

కల్పాదౌ సంప్రవృత్తాయా గ్రేతాయాః ప్రముఖే తదా

ప్రణశ్యతి తదా సిద్ధిః కాలయోగేన నాన్యథా

తస్యాం సిదొ ప్రణష్టాయామన్యా సిద్ధిరజాయత

ఆపాంతా ప్రతిగతా తదా మేఘాత్మనా తు వై

మేఘేభ్యః స్తనయితృభ్యః ప్రవృత్తం వృష్టిసర్జనమ్

సకృదేవ తయా వృష్ట్యా సంసిద్ధే షృథివీతలే

ప్రజా అసంస్తతస్తాసాం వృక్షాశ్చ గృహసంజ్ఞతాః

ఆ సంధికాలము గతింపగా మానసీ సృష్టి యారంభమయ్యెను. ఆయాధ్యాత్మిక సిద్ది కృతయుగానంతరము వచ్చెడు త్రేతాయుగమునను జరుగును. (66) సృష్టికి మున్ముందుగా నాచే ప్రకీర్తితములయిన అష్ట సంఖ్యాకమయిన మన ప్సిద్దులు క్రమముగా సంక్ష: నొందెను. (67) మన్వంతరములన్నింటిలో చతుర్విధముగ విభజనము, కల్పము యొక్క ఆదియందు కృతయుగము నందే మానసిక సిద్ధి కలదు (68) కృత యుగమున కర్మసిద్ధి వర్ణాశ్రమాచార కృతమై యొ ప్పెను. అప్పుడు కృతయుగము యొక్క సంధ్య సంక్షేపముగా పాదయాత్ర మయ్యెను. (నాలుగవ భాగము.) (69) సంధ్యాంశకములయిన తపము, బలము, వేదము శ్రుతము, ఆయుర్దాయము, అనునవి యుగధర్మములు. అవి క్షయము నొందుచున్నవి. (70) ఓ ఋషిసత్తములార! కృతయుగము సంధ్యాంశకాలము గతించిన పిమ్మట, త్రేతాయుగోత్పత్తి తదంశములతో నయ్యెను. (71) కృతయుగాంశము యొక్క భాగము గతించిన పిమ్మట మిగిలిన ఏడు సిద్ధులు, త్రేతాయుగము యొక్క ఆరంభమున కల్పముయొక్క ప్రారంభ దశలో ప్రవృత్తములయ్యెను; కొలయోగముచే మిగిలిన యొకేయొక సిద్ధియు నశించును. ఆ నాశనము కాల యోగము చేతనే కాని ఏ యితర కారణముచే కాదు. ఆ సిద్దీ ప్రణష్టము కాగా ఇతరములయిన సిద్ధులు ప్రసవించినవి. (కలిగినవి) (72,73) నీటీ యొక్క అంశలు అంశలు. ఆయపాంశలు రెండును ఆకాశమున మేఘాత్మము నందెను. (మేఘరూపములందెను.) గర్జించుమేఘముల నుండీ వర్ష సృష్టి ప్రవృత్తమయ్యెను. పృధివీతలము వర్షము వలన సంసిద్ధినీ నొకే పర్యాయము పొందెను. ఆ ప్రజలు ప్రవృత్తులయిరి. ఆ తరువాత వృక్షములు వారలకు గృహ సంజ్ఞికములయ్యెను.

సర్వః ప్రత్యుపభోగస్తు తాసాం తేభ్యో వ్యజోయత

వర్తయంతే స్మ తేభ్యస్తాస్త్రేతాయుగముఖే ప్రజాః

తతః కాలేన మహతా తాసామేవ విపర్యయాత్

సంగలోభాత్మకో భావస్తదో హ్యాకస్మికో భవత్

యత్తద్భవతి నారీణాం జీవితాస్తే తపొర్తవమ్

తదా తద్వై న భవతీ పునర్యుగబలేన తు

తాసాం పునః ప్రవృత్తం తన్మాసి మాసి తదార్తవమ్

తతస్తే నైవ యోగేన వర్తతే మైథునం తదా

తేషాం తత్కాలభావిత్వోన్మాది మాస్యుపగచ్ఛతామ్

అకాలే చార్తవోత్పత్యా గర్భోత్పత్తిస్తదా భవత్

వీపర్యమేణ తేషాం తు తేన తత్కాలభావితా

ప్రణశ్యన్తి తతః సర్వే వృక్షాస్తే గృహసంజ్ఞతాః

తతస్తేషు ప్రణషేషు విన్హా వ్యామలేంద్రియాః

అభిధ్యాయస్తి తాః సిద్ధిం సత్యాభిధ్యాయినస్తదా

ప్రాదుర్బభూవుస్తేషాం తు వృక్షాస్తే గృహసంజ్ఞతాః

వస్త్రాణి చ ప్రసూయనే ఫలాన్యాభరణాని చ

తథైవ జోయతే తేషాం గంధర్వాణాం రసాన్వితమ్

అన్వీక్షికం మహావీర్యం పుటకే పుటకే మధు

ఆ వృక్షముల నుండి వారలకు సర్వ ప్రపంచోపభోగ్యములయిన వస్తువులన్నియు సావిర్భవించెను. త్రేతాయుగము యొక్క ఆరంభమున ప్రజలు ఆ పదార్థములతోడనే తమ్ము పోషించుకొని వసించిరి, (76) తరుపోత బౌలకాలము గతించిన వెనుక, వారలలోని మార్పు కారణముగా (విపర్యయము వలన) ఆకస్మికముగా పరస్పరము సన్నిహితముగా నుండ వలయుననెడి కోరికలతో లోభమయిన భావముదయించెను. (77) (ప్రస్తుత కాలమున) స్త్రీలకు రజోదర్శన కాలము జీవితాంతము వఱకునుండును. కానీ అయ్యది యుగబలమున ఆ స్త్రీలకు కలుగలేదు. (78) తరువాత ఆ స్త్రీలకు మాసమాసమునకు రజోదర్శనము అగుట ఆరంభీంచెను. తత్కారణమున స్త్రీ పురుషులకు మైథునక్రియ. కూడ నప్పుడు కలిగెను. ప్రతిమాసము నందు వారికి కలిగిన సంగభావము వలన స్త్రీ పురుషులకు సంగమము కలిగెను. ఆ కాలము నందు రజోత్పత్తి వలన (ఆర్తనోత్పత్తిచే) వారలకు గర్భోత్పత్తి యయ్యెను. (79,80) ఆ కాలమున స్త్రీ పురుషుల యందుదయించీ విపర్యయభావముల వలన గృహ సంజ్ఞకము ల యొప్పీ వృక్షములన్నియును తరువాత నశించేను. (81) ఆ వృక్షములు నశింపఁగా వారందరు విభ్రాంతులయిరి. హ్యాకులేంద్రియులు నయిరి. (కామసక్తమయిన ఇంద్రియ వ్యాకులత్వము కలిగినది). అప్పుడు సిద్దికొఱకై ధ్యానించిరి. వారు వారి ధ్యానముల యందు సత్యాభి సంధి వహించిరి. (82) పూర్వము వృక్ష సంజ్ఞకములై యొప్పిన వృక్షములు వారి ముందు ప్రత్యక్షమయ్యెను. అయ్యవి పోరలకు వస్త్రములను, ఫలములను ఆభరణములను ప్రసాదించెను. (83) అట్లే రసాన్వితము, మహావీర్యవంతము సయిన మధువు (తేనె) ప్రతిషత్ర పుటము (మూలమున “అన్వీక్షికం” అని యున్నది), అర్థవంతముగా లేదు. వాయు పురాణమున అమక్షికమను పాఠాంతరమున్నది. దానినే గ్రహించితిని, గంధర్వాణాం రసాన్వితము ఇచట గంధవర్ణ రసాన్వితముగా నుండి యుండవలెను. గంధవర్ణ రసాన్వితమను. పాఠమును గ్రహించితిని.) నందు (అమక్షికము) ఈగలు . లేకుండుగ నుత్పత్తి యయ్యెను. అయ్యది గంధవర్ణ రసాన్వితము.

తేన తా వర్తయన్తి స్మ ముఖే త్రేతాయుగస్య వై

హృష్టపుష్టాస్తయా సిద్ధ్యా ప్రజాస్తా విగతజ్వరాః

తతః కాలాన్తరే ప్యేవం పునర్లోభావృతాః ప్రజాః

వృక్షాంస్త్రాః పర్యగృహ్లంత మధు వా మాక్షికం బలాత్

తాసాం తేనాపచారేణ పునర్లోభకృతేన వై

ప్రనష్టా ప్రభుణా సార్ధం కల్పవృక్షాః క్వచిత్ క్వచిత్

తస్యామేవాల్పశిష్టాయాం సిద్ధాం కాలవశాత్తదా

వర్తనే చానయా తాగొం ద్వంద్వాన్యత్యుత్తైతాని తు

శీతవాతాతపాస్తీప్రోస్తతస్తా దుఃఖితా భృశమ్

ద్వంద్వైస్తైః పీడ్యమానాస్తు చుక్రుశురావృణాని వా

కృత్వా ద్వంద్వప్రతీఘాతం నికేతాని విచేతసః

పూర్వం నికోమచారాస్తే హ్యనికేతా యథా భవన్

యథాయోగం యథాప్రీతి నికేతేష్వవసన్ పురా

మధు ధున్వత్సు నిషేషు పర్వతేషు నదీషు చ

సంశ్రయన్త చ దుర్గాణి ధన్వపావర్తమౌదకమ్

యథోజోషం యథాకామం సమేషు విషమేషు చ

ఆరబ్దాసన్నీకేతాన్వై కర్తుం శీతోష్ణవారణాత్

తతస్తాన్నిర్మయామాసుః భేటాని చ పురాణి చ

గ్రామాంశ్చైవ యథాభాగం తథైవ నగరాణి చ

తేషామాయామవిష్కంభాః సన్నివేశాన్తరాణి చ

 త్రేతాయుగారంభమున వారా మధువు చేతనే జీవయాత్ర గడిపిరి. ఆ సిద్ధివలన వారు సంతుష్టులయిరి. పరిపుష్టులయిరి. విగత జ్పురులయిరి, (గతేంద్రియ సంక్షోభులయిరి). (85) అటు తరువాత, కాలాంతరమున ఇతర సమయములందు ప్రజలు మరల లోభావృతులయిరీ వారా వృక్షముల పట్టుకొని బలాత్కారముగా అమృతమును తేనెను గ్రహించిరి. (86) వారొనర్చిన అపచారము చేతను, లోభాన్వితులగుట చేతను తమ ప్రభువుతో సహితము కోర్కెలనొసంగు ఆకల్ప వృక్షములు అక్కడక్కడ నశించినవి. (87) కాలవశమున సిద్దులు అల్పావశిష్టములై యుండగా, మిగిలిన వానితోడనే వారు ప్రవర్తించిరి. వారలలో ద్వంద్వ భావములు (ఈర్ష్యా ద్వేషాదులు, సుఖదుఃఖాదులు, లాభాలాభ భావములు) ఉదయించినవి. (88) శీతవాతా తపములు తీవ్రములయినవి: వాని వలన ఎండలలో చలిలో గాలులలో మిక్కిలి దుఃఖితులయిరి. వారు పరస్పర విరుద్ధములయిన ద్వంద్వ భావములచే పరిపీడితులయి ఆక్రోశించిరి, బహువ్రణములందిరి. (89) పూర్వము వారు గృహములు లేనివారు. యధేచ్చముగా సంచరించిరి. పూర్వమందు యథాయోగము యథాప్రీతి నదీతీరములందు, మధువుతో నిండియుండు పర్వతములయందు పల్లపు భూముల యందు మెట్టభూములందు, నీరున్న పట్టులందు వారు సంచరించిరి. ఇప్పుడో వాతా తపముల వలన విసిగిపోయి, వాతాతాపముల నుండి రక్షణమునకై గృహముల నిర్మించుకొనిరి. (92) వారి వారికి కావలసిన భాగముల ననుసరించి, వలసిన విస్తీర్ణములతో, వారి వారి విజ్ఞానము ననుసరించి పురములను పల్లెలను నిర్మించుకొనిరి.

చక్రుస్తదా యథాజ్ఞావం మీత్వా మీత్వాత్మనోంగుభైః

మానార్థాని ప్రమాణాని తథా ప్రభృతి చక్రిరే

యథాంగుళప్రదేశాంస్క్రీన్హస్తః కిష్కుం ధనూషి చ

దశ త్వంగుళపర్వాణి ప్రాదేశ ఇతి సంజ్ఞాతః

అంగుష్ఠస్య ప్రదేశిన్యా వ్యాసప్రాదేశ ఉచ్యతే

తాలః స్మృతో మధ్యమయా గోకర్ణశ్చాష్యమయా

కనిష్ఠయా వితస్తు ద్వాదశాంగుళ ఉచ్యతే

రత్నిరంగుళపర్వాణి సంఖ్యయా త్వేకవింశతిః

చత్వారి వింశతిశ్చైవ హస్తః స్యాదంగుళాని తు

కిష్కు స్కృతో ద్విరత్నిస్తు ద్విచత్వారింశదంగుళః

చతుర్హన్రో ధను ర్ధండో నాళికా యుగమేవ చ

ధనుస్సహస్ర ద్వే తత్ర గప్యూతినైః కృతా తదా

అష్టా ధనుః సహస్రాణి యోజనం తై ర్విభావితమ్

ఏతేన యోజనేనేహ సన్నివేశాస్తతః కృతాః

చతుర్ధామథ దుర్గాణాం స్వయముత్తాని త్రీణి చ

చతుర్థకృత్రిమం దుర్గం తస్య వక్ష్యామీ నిర్ణయమ్

సోల్సేధరంధ్ర ప్రాకారం సర్వతః ఖాతకావృతమ్

రుచకః ప్రతికద్వారం కుమారీపురమేవ చ

ద్విహస్తః ప్రోతసాం శ్రేష్ఠం కుమారీపురమంచతాన్

హస్తస్రోతో దశశ్రేష్ఠో నవహస్తోష్ట ఏవ చ

మొదటవారు వారి వారి విస్తీర్ల ప్రమాణములను తమ జ్ఞానము ననుసరించి అంగుళులతో కొలిచీకొలిచి నిర్ణయించుకొనిరి. తరువాత పరిమాణముల నెఱుంగు. మానము కొంకు ప్రమాణముల నేర్పరచుకొనిరి. (95) అంగుళము - ఒక ప్రమాణము. అంగుళము అనగా ఒక బొటన వ్రేలి వెడల్పు గలది. వారి కొలమానములివి. అంగుళము, ప్రాదేశము, హస్తము, కిష్కువు, ధనువు. (96) పది అంగుళుల పర్వములు ప్రాదేశము; అనబడును. ప్రాదేశమనఁగా బొటన వ్రేలు చూపుడు వ్రేలు - విడదీసి చాచి పట్టగా, బొటన వ్రేలి తుదినుండి తర్జని (చూపుడు) వ్రేలి చివర కొనవలకు గల దూరము. అట్లే బొటన వ్రేలి శిఖరము నుండి మధ్యమాంగుళి తుదివఱకు ‘తాల’ము అందురు. అట్లే బొటన వ్రేలి తుదినుండి ఉంగరపు వ్రేలి చివరకొన వలకు గల దూరము “గోకర్ణము”, అట్లే బొటన వ్రేలి తుదినుండి చిటిగెన వ్రేలి చివరవరకు గల దూరము 'వీతస్తి'. 'వీతస్తి'కి 12 అంగుళములు. (97) 20 అంగుళములు ఒకరతి 24 అంగుళములు ఒక ‘హస్తము’. రెండు ‘రత్నులు’ లేక 42 అంగుళములు ఒక ‘కీషువు’, నాలుగు హస్తములొక 'ధనువు'. దానినే దండమందురు. ఈ ధనుః ప్రమాణమునే నాళికాయుగము (రెండు నాళికలు), రెండు వేల ధనువులు ఒక గవ్యూతీ. ఇట్టి ‘పరిమాణ’ సన్నివేశము లానాఁడు సమకూర్చుకొనఁబడినవి. (100) (8000) ఎనిమిది వేల ధనువులు ఒక యోజనము. అని వారు నిశ్చయించుకొనిరి. ఈ యోజన ప్రమాణ నిర్ణయమయిన వేనుక వారు ఈ యోజనము కొలమానముగా తమ వసతుల భూవిస్తీర్ణములను నిర్ణయించిరి. (101) నాలుగు విధములయిన దుర్గములలో మొదటి మూడు ప్రకృతి సిద్ధములు : ఇంక నాలుగవది కృత్రిమము. ఆ దుర్గమును గూర్చి ముందు చెప్పెదను. (102) ఈ దుర్గమునకు ఉన్నతమయి (కుడ్యములు గల) ఎత్తయిన మట్టిగుట్టపై కట్టబడిన ప్రాకారముండును. ఆ ప్రాకారము నందు రంధ్రములుండును. దాని చుట్టును కాలువ వంటి అగడ్డ (పరిఖ) యుండును. దానికి సుందరమయిన ద్వారము అది కుమారీపురము.(103) అగర్తలు రెండు హస్తముల వెడల్పుతో నుండి కుమాపుర విషయమున శ్రేష్ఠములయినవి. కందకములోని నీటి ప్రవాహపు వెడల్పు ఎనిమిది లేక తొమ్మిది లేక పది హస్తములుండ వచ్చును.

భేటానాం చ పురాణాం చ గ్రామాణాం చైవ సర్వశః

త్రివిధానాం చ దుర్గాణిం పర్వతోదకధన్వీనామ్

కృత్రిమాణాం చ దుర్గాణాం విష్కంభాయామమేవ చ

యోజనాదర్ధవిషుంభమష్టభాగాధీకాయతమ్

పరమార్థార్ధమాయామం ప్రాగుదక్ప్లవనం పురమ్

ఛిన్నకర్ణవికర్ణం చ వ్యజనాకృతీసంస్థితమ్

వృత్తం వజ్రం చ దీర్ఘం చ నగరం న ప్రశస్యతే

చతురస్రయుతం దివ్యం ప్రశస్తం తైః పురం. కృతమ్

చతుర్వింశతృరం ప్రాప్వం వాస్తు వాష్ఠతతం పరమ్

అత్ర మధ్యం ప్రశంపత్తి హ్రస్వం కాస్థవివర్జితమ్

అథ కిష్కుశూన్యతో ప్రాహుర్ముఖ్యం నివేశనమ్

నగరాదర్ధవిష్కంభః ఖేలం పానం తదూర్ఖతః

నగరాద్యోజవం భేటం ఖేటాద్రార్ధయోజనమ్

ద్విక్రోశః పరమా పీవ క్షేత్రపీమా చతుర్ధనుః

వింశద్దనూషి విస్తీర్ణో దిశాం మార్గస్తులైః కృతః

వింశధనుర్ధామ మార్గః సీమామార్గో దశైవ తు

ధనూంషి దశ విస్తీర్ణః శ్రీమాన్ రాజపథః కృతః

నవాజిరథనాగానాసంబధపు సంచరః

ధనూంషి చాఫీ చత్వారి శాఖారథ్యాశ్చ తైర్మితాః

త్రికా రథ్యోపరథ్యాః స్యుర్ద్వికాశ్చాప్యుపరధ్యకాః

పల్లెల, నగరముల, ఆయతనములను, శ్రీవిధములయిన సహజ దుర్గములయొక్క అనఁగా పర్వత, నదీ, మరుభూమి, వాలుకా ప్రదేశాల యొక్కయు, కృత్రిమ దుర్గమముల యొక్కయు ఆయతనములను కూడ వివరించెదను. కానీ వ్యాసమొక యోజనము. దాని యొక్క నిడివి (1 1/8) యోజనముపై యోజనము నందలి అష్టమ భాగము. (105,106) పట్టణము యొక్క విస్తీర్ణము దొని పొడవులో సగము? దానికి తూర్పు దిశగానో ఉత్తర దీశగా ప్రవహించే నది యొకటుండవలయును. ఆ ప్రదేశమును భిన్నకర్ణముగానీ వికర్ణముగా గానీ 'వ్యజనాకృతితో నొప్పుచు, నుండవలెను. (107) నగరము దీర్ఘమైనది కానీ, వృత్తాకారముగా నున్నది కాని, వజ్రాకారముగ నున్నది కాని ప్రశస్తమైనది కాదు. చతురస్ర యుతము, స్వర్గ సదృశమైనది, సమముగా వ్యాపించిన భాగములు గలిగినదియునయిన పురము వారు నిర్మించుకొనిరి. (108) (వాస్తు = భవన ప్రదేశము, నివాస స్థలము) 24 హస్తముల కంటే నధికము కానిది ప్రస్వము, 108 హస్తముల ప్రమాణము కలిగిన నీవాసన స్థలము ఉత్తమమైనది; వీనిలో ప్రస్వమై దారు నిర్మితమైనది కాని దానిని మధ్యమ వాస్తుగా కొనియాడెదరు. (109) ముఖ్య నివేశనము 800 కిష్కువుల ప్రమాణముండవలేనందురు. పల్లె (లేక పేట) నగరము యొక్క అర్ధవ్యాసము గలిగియుండవలెను. పాన (పానశాల) అంతకు మించి యుండ వలెను. (110) (ఖేటము - పట్టణానుబంధీ భాగము - లేకపల్లె). పట్టణము నుండి భేటము యోజనదూరమునను గ్రామము. పట్టణము నుండి అర్ధయోజన దూరమునను నుండవలెను. పట్టణపు సీమ (యెల్ల) రెండు కోశములలో నుండవలెను. ఆ సీమ నాలుగు ధనువుల ప్రమాణముండవలెను. (111) వారు ఇరువది ధనువుల వెడల్పుగల, మార్గమును నలు వైపుల నేర్పరించుకొనిరి. గ్రామ మార్గము 20 ధనువుల వెడల్పు, సీమా మార్గము పది ధనువుల ప్రమాణము. (112) శుభంకరమయిన రాజపథము దశధను విస్తీర్ణము చేయబడినది. అందు మనుష్య, వాజీ, రథ నాగాదుల సంచారమునకు ఎట్టి ఆటంకముండ రాదు. (113) వానీ ఆంతర వీథులు, నాలుగు ధనువుల వెడల్పుతోలిచి వారు నిర్మించుకొనిరి. రాజ పథములకు కలుపు వీడులు మూడు ధనువుల వెడల్పు, వాని యుపవీథులు (సందులు) రెండు ధనువుల వెడల్పు గలిగియున్నవి. (114)

జంఘాపథశ్చతుష్పాదస్త్రీపదం చ గృహాంతరమ్

ధృతిమార్గసూర్ధషష్ఠం క్రమశః పదికః స్మృతః

అవస్కారపరీవారః పాదమాత్రం సమస్తతః

 కృతేషు తేషు స్థానేషు పునర్గెహగృహాణి వై

యథా తే పూర్వమాసంశ్చ వృక్షాస్తు గృహసంస్థితాః

తథా కర్తుం సమారజాశ్చింతయిత్వా పునః పునః

వృక్షస్యార్వాగతాః శాఖా ఇతశైవాషరా గతాః

అత ఊర్ధ్వం గతాశ్చాన్యా ఏవం వీర్యగతాః పరాః

 బుద్ధ్యాన్వీష్య యధాన్యాయం వృక్షశాఖా గతో యథా

యథా కృతాస్తు శైః శాఖాస్తస్మాచ్ఛాలాస్తు తాః స్మృతాః

ఏవం ప్రసిద్ధః శాఖాభ్యః శిలాశ్చైవ గృహాణీ చ

తస్మాత్తాశ్చ స్మృతాః శాలాః శాలత్వం తాసు తత్స్మృతమ్

ప్రసీదత్తీ యతస్తేషు తతః ప్రాసాదసంజ్ఞాతః

తస్మాద్ గృహాణీ శిలాశ్చ ప్రాసాదాశ్చైవ సంజ్ఞితాః

జంఘా పథము 4 పాదముల వెడల్పు. గృహాంతరముల మార్గములు మూడువదముల వెడల్పు. ధృతి మార్గము ఆరుపదములకు పైగా నుండును. ఇట్లు క్రమముగా 'పద' లేక పదిక మెఱుంగవలయును. (115) జంఘాపథము ఘంటా పథము కావచ్చును. వ్రాతలో తప్పుగా వ్రాయబడి యుండవచ్చును. ఘంటా పథము గ్రామమున ప్రధాన మయిన వీధి. అది గ్రామము నందంతట వ్యాప్తి చెందియుండును. పదము అనఁగో 15 అంగుళముల పరిమితీ. (అవస్కారము - మల విసర్జనమునకైన బాహ్యప్రదేశము) గ్రామము చుట్టు అవసారము తగ్దాము పరిమితిలో సొలుగవ భాగము విస్తీర్ణము కలిగి యుండును. ఈ విధముగా వీధులు పేటలు, రాజమార్గములు, ఉపమార్గములు, అవస్కార ప్రదేశములు - నిర్మించుకొనిన పిమ్మట నివేశన గృహములు నిర్మించుకొనషలెను. (116) పూర్వము వృక్షములు, గృహాదులెట్లున్నవో, వారు పదే పదే ఆలోచించి తద్విధముగా నిర్మింప నారంభించిరి. (117) వృక్షముల శాఖలు క్రిందికి వ్యాపించినవి. మిగిలినవి వేటిక విధముగా వ్యాపించినవి. కొన్ని పైకి వ్యాపించినవి. ఇట్లు వృక్షశాఖలు కొన్నీ ప్రక్కకు నడ్డముగా వ్యాపించినవి. (118) వారు తమ బుద్ది సుపయోగించి వృక్షశాఖ లేట్లు వ్యాపించినవో శోధించిరి. అదే విధముగా నివేశన భవనములు నిర్మింపబడినవి. అందుచే ఆ భవనములు (గృహ నిర్మాణములందు 'సాల’ (మద్ది) వృక్షములు ముఖ్యపాత్ర వహించి యుండుట గమనింపఁదగినది) 'శాల'లని స్మరింపబడుచున్నవి, (119) ఈ విధముగా భవనములు (నివేశనములు) శాఖల నుండి ప్రసిద్దము లైనవి. అందువలన వానినుండి సాలలు స్మరింపఁబడినవి. గృహములకు శాలత్వము వానీవలన వచ్చినది. (120) వానియందు ప్రజలు సంతోష ప్రసన్నులైరి. అందుచేతనే గృహములు, శాలలు, ప్రాసాద సంజ్ఞలందినవి. (121)

కృత్వా ద్వంద్వాభిఘాతాంస్తాన్వార్తోపాయమచింతయన్

నస్టేషు మధునా సార్థం కల్పవృక్షేషు వై తదా

విషాదవ్యాకులాస్తా వై ప్రజాః సృష్టిస్తు దర్శితాః

తతః ప్రాదుర్భభో తాసాం సిద్ధి స్త్రేతాయుగే తదా

సర్వార్థసాధకా హ్యన్యా వృష్టిస్తాసాం నికామతః

తాసాం వృష్యుదకానీషా యానిమీష్టగతాని చ

ఏవం నయః ప్రవృత్తస్తు ద్వితీయే వృష్టిసర్జనే

యే పరస్తాదపాం స్తోకాః సంపాతాః పృథివీతలే

అపాం భూమేస్తు సంయోగాదోషధ్యస్తాసదాభవన్

పుష్పమూలఫలిన్యస్తు ఓషధ్యస్తా హి జజ్ఞిరే

అఫాలకృష్ణాశ్చానుషా గ్రామ్యారణ్యేశ్చతుర్దశ

ఋతుపుష్పఫలాశ్చైవ వృక్షా గుల్మాశ్చ జజ్ఞిరే

ప్రాదుర్భూతాస్తు త్రేతాయాం మాయాయామౌషధస్య వా

తదౌషధేన వర్తిస్తే ప్రజాఫ్రేతాముఖే తదా

తతః పునరభూత్తాసాం రాగో లోభస్తు సర్వదా

అవశ్యభావినార్ధేన త్రేతాయుగవశేన చ

తతస్తే పర్యగృహ్ణంస్తు నదీక్షేత్రాణి పర్వతాన్

వృక్ష గుల్మౌషధీశైవ ప్రసహ్య తు యథాబలమ్

కల్పవృక్షములు మధువుతో సహితము నష్టము కాగా, సుఖదుఃఖాది ద్వంద్వ బద్ధులయిన ప్రజలు, జీవీతోపాధికి, వ్యవసాయమును గూర్చి ఇతర విధమార్గముల గూర్చి ఆలోచింప మొదలిడిరి. (122) సృజింపఁబడిన ప్రజలు విషాద వ్యాకులులయిరి. అందుచే త్రేతాయుగములోవారికి సిద్ధి కలిగెను. (123) వేడొక విధమయిన వృష్టి సర్వార్ధ సాధనమునకు ఒక సాధన మయినది. ఆ వృష్టి వలన జలములు మధురములు: అంతియేకాక జలములు వారెంత కోరిన నంత వర్షించినవి. (124) ద్వితీయ విధమయిన వృష్టి సృజింపఁబడ, క్రొత్త జీవితము చరిత్రయు నారంభమైనవి. (124) భూమిపై పడిన వర్షపు నీరు కొద్దికొద్దిగా నేల పై గుంటలలో నిలువగా, తద్వర్షపు నీటితోడి భూమీయొక్క సంసర్గమున ఓషధులు పుట్టి వృద్ధి పొందనారంభించెను. ఆ యోషధులు పుష్పింప మొదలిడినవి. ఫలము లొసంగ దొడఁగినవి. దుంపలను నొసంగీనవి. (125,126) పదునాలుగు విధములయిన గ్రామములయందలి నేలలు, వనముల యందలి నేలలు, దున్నఁబడకయే, విత్తనములు చల్లం బడయకయే ఫలింప (పంటలురాల) మొదలిడినవి. వృక్షములు పొదలు ఆయా ఋతువుల యందు ననుకూలములయిన పుష్పములను ఫలములను ప్రసవించేను. (127) త్రేతాయుగమున ఓషధులు, వృక్షములు భూమియందు తమంతతామే ప్రాదుర వింప మొదలయినవి. త్రేతాయుగారంభమున ప్రజలు తదోషధులతో జీవించిరి. (128) అందుచే, విషయప్రవృత్తి లేనందువలన, త్రేతాయుగ ధర్మవశము వలన, ప్రజలకు రాగము (ప్రీతి) లోభము (ఆశ) కలిగినవి. (129) అప్పుడు వారు, నదులను, క్షేత్రములను, పర్వతములను వృక్షములను, గుల్మములను, ఓషధులను, స్వస్వబలను గుణముగ బలాత్కారముగ పరిగ్రహించిరి. (130)

సిద్ధాత్మానస్తు యే పూర్వం వ్యాఖ్యాతా వః కృతే మయా

 బ్రహ్మణో మానసాస్తే వై ఉత్పన్నా యే జనాదిహ.

శాంతా యే శుష్మిణశ్చైవ కర్మిణే దుఃఖితాస్తథా

తత ఆవర్తమానాస్తే త్రేతాయాం జజ్ఞిరే పునః.

బ్రాహ్మః క్షత్రియా వైశ్యాః శూద్రా ద్రోహజనాస్తథా

భావితా పూర్వజాతీషు ఖ్యాత్యా తే శుభపాపయోః.

. తతస్తే ప్రబలా యే తు సత్యశీలా అహింసకాః

వీతలోభా జీతాత్మానో నివసన్తో స్కృతేషు వై.

పరిగ్రహం నకుర్వని వదన్తస్తు ఉపస్థితాః

తేషాం కర్మాణి కుర్వన్త తేభ్యశ్చైవాబలాశ్చయే.

పరిచర్యాసు వర్తనే తేభ్యశ్చాన్యేల్ప తేజసః

ఏవం ఏప్రతిపన్నేషు ప్రపన్నేషు పరస్పరమ్.

తేన దోషేణ వై శాంతా ఓషధ్యో నితరాం తదా

ప్రనష్టా గృహ్యమాణా వై ముష్టిభ్యాం సికతా యథా.

అథాస్య తు యుగబలాద్రామ్యారణ్యాశ్చతుర్ధశ

ఫలైరృష్టాంతి పుష్పైశ్చ తథా మూలైశ్చ తాః పునః.

తతస్తాసు ప్రణష్ట్రాసు విశ్రాంతాస్తా ప్రజాస్తదా

క్షుధావిష్ణాస్తదా సర్వా జగ్ముస్తా వై స్వయంభువమ్.

వృత్యర్థమభిలిప్సంత్యో హ్యాదౌ త్రేతాయుగస్య తాః

బ్రహ్మా స్వయంభూర్భగవాన్ జ్ఞాత్వా తాసాం మనీషితమ్.

ఇంతకుబూర్వము కృతయుగమున సిద్దాత్ములయిన వారిని గూర్చి నేను వ్యాఖ్యానించే యుంటిని. వారందరు బ్రహ్మయొక్క మానస పుత్రులుగా నుదయించిరి. వారీచ్చటకు జనలోకము నుండి వచ్చిరి. వారు శాంతులు, కామపర తంత్రులు. వైదిక కర్మపరులు; దుఃఖవంతులు. జనలోకము నుండి తిరిగి వచ్చుచు త్రేతాయుగమున వారు మరల జన్మించిరి. (131,132) వారి వారి శుభ పాపకర్మల ననుసరించి, వారు పూర్వజన్మలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రులుగను, ద్రోహ జనులుగను భావింపఁబడిరి. (133) అంత వారిలో కొందరు శక్తిమంతులు (ప్రబలులు) సత్యశీలురు, అహింసాపరులు, వీతలోభులు, ఇంద్రియ నిగ్రహము కలవారును. (వారు స్మృతుల ననుసరించిరి.) (134) వారు పరిగ్రహము చేసెడివారు కారు. (అపరిగ్రహులు). వారికంటే బలహీనులయిన వారు వారి కార్యముల నొనరించెడివారు. ఆ (బలహీనులయిన) ప్రజలు వారిని చేరెడి వారు. వారితో భాషించేడివారు. (135) వారీకంటే అల్పశక్తిమంతులు (అల్పతేజస్వులు) వారికి పరిచర్య చేయుచు జీవించుచుండిరి. ఇట్లు వారు అన్యోన్య సంబంధములు కలిగినవారు; పరస్పరము ఆశ్రయించుకొని యుండెడివారు. (136) ఆ కారణముచే (వారల యందలి దోషముచే) పూర్వము కంటే ఓషధులు ప్రశాంతములయినవి తగ్గిపోయినవి). పిడికిళులతో పట్టిన ఇసుకవలె వారు ప్రనష్టులయిరి. (నశించిరి.) (136, 137) అంత, యుగబలముచే, చతుర్దశ సంఖ్యాకమయిన గ్రామ్యారణ్యముల వలన మాటిమాటికీ పుష్పములను, ఫలములను, దుంపలను ప్రజలు గ్రహింప మొదలిడిరి. ఆ వృక్షములు నశింపఁగా ప్రజలు వీభ్రాంత హృదయులైరి. వారందరు ఆకలిచే బాధపడిరి. స్వయంభువుం డైన బ్రహ్మకడకు వారరిగిరి. (139) త్రేతాయుగారంభమున నా ప్రజలు జీవనోపాధిని కోరిరి. స్వయంభువుఁడైన బ్రహ్మకు వారి కోర్కె తేలిసేను.(140)

 పుష్టిప్రత్యక్షదృష్టేన దర్శనేన వీచార్య సః

గ్రస్తాః పృథివ్యా త్వోషధ్యో జ్ఞాత్వా ప్రత్యరుహత్ పునః

 కృత్వ వత్సం సుమేరుం తు దుదోహ పృథివీమిమామ్

దుగ్దేయం స్తదా తేన బీజాని వసుధాతలే

జజ్ఞిరే తాని బీజాని గ్రామారణ్యాస్తు తాః ప్రభుః

ఓషధ్యః ఫలపాకాంతాః క్షణసప్తవశాస్తు తాః

వీహయశ్చ యవాశ్చైవ గోధూమాశ్చణకాస్తిలాః

ప్రియంగవ ఉదొరాస్తే కోరదుష్టాః సమకాః

మాషా ముగ్గా మసూరాస్తు నీవారాః సుకులత్తకాః

పరీకాశ్చరకాశ్చైవ గణః సప్తదశ స్మృతాః

ఇత్యేతా ఓషధీనాం తు గ్రామ్యాణాం జాతయః స్మృతాః

శ్యామాకాశ్చైవ నీవారి ఆర్తీలోః సగవేసుకోః

కురువిందో వేణుయహస్తామతీర్కాటకొః స్మృతాః

గ్రామారణ్యాః స్మృతాః హ్యేతో ఓషధ్యస్తు చతుర్ధశ

ఉత్పన్నాః ప్రథమస్యైతా ఆదౌ త్రేతాయుగస్య హ

అపాలకృష్ణాస్తాః సర్వాః గ్రామ్యారణ్యాశ్చతుర్దశ ఈఈ

వృక్షగుల్మలపల్లో వీరుధస్తృణజాతయః

మూలైః ఫలైశ్చ రోహైశ్చాగృష్ణన్ పుష్టాశ్చ యత్ఫలమ్

పృధ్వీ దుగ్ధతు బీజాని యాని పూర్వం స్వయంభువా

ఋతుపుష్పఫలాస్తా వై ఓషధ్యో జజ్ఞిరే త్విహ

సర్వము ప్రత్యక్షముగఁ జూడఁగల బ్రహ్మ, తచ్ఛక్త్యా ఈ విషయమును గూర్చి ఆలోచించేను. ఓషధులు భూమిచే మరల గ్రసింపం బడినవని యతఁడు తెలిసికొనెను. వానిని మరల వృద్ధిపొంద చేసెను. (141) మేరు పర్వతమును వత్సగాజేసి, పృథివిని గోవుగా జేసి అతఁడు పాలు పిదీకెను. ఆ ధేనువు దుగ్గరూపమున బీజములను పృథివీతలమున కొసంగెను. (142) ఆ బీజములను ప్రభువయిన బ్రహ్మ ఓషధులుగను, ఇతరములైన మొక్కలుగ వృద్ధి పొందించెను. ఓషధులు ఫలపాక స్థితికి వచ్చి నశించేను. ఆ వృక్షములు ఓషధులు ఒకే యొకమారు ఫలించెను. తరువాత నశించెను. అయ్యవి పదియేడు విధములయిన ధాన్యములు. (143) అవి వడ్లు, గోధుమలు, యవలు, తిలలు, శనగలు, ప్రియంగువులు, ఉదారములు, కోరదుష్టములు, వామకములు, మినుములు, పెసలు, మసూరలు, నీవారధాన్యములు, ఉలవలు, హారికలు, కారీకలు. (145) (గ్రామారణ్యకములు : అడవులయందు గ్రామములయందు వృద్ధి పొందు ధాన్యములు (ఓషధులు మున్నయినవి) ఇయ్యవీ గ్రామ్య జాతులనం బడు ఓషధులు. శ్యామాకములు, నీవారములు, జర్తీలలు, గవేధుకలు కురువిందలు, (ఒక విధమయిన బార్లీ ధాన్యము). వేణుయవలు. (వెదురు బియ్యము) తామాతులు టకములు మొదలయినవి పదునాలుగు విధములయిన ఓషధులుగా స్మరింపఁబడినవి. (147) ఈ పదునాలుగు విధములయిన గ్రామ్యారణ్యక ధాన్యములు త్రేతాయుగారంభమున నుత్పన్నములు. ఆ గ్రామ్యారణ్య ధాన్యములు దున్నక చల్లకయే ఫలించినవీ. (148) వృక్షములు, లతలు, తీగెలు, పొదలు, పాదులు, మున్నగు తృణజాతులు పుష్పములను, ఫలములను, దుంపలను, వేళ్లను - ఒసంగెను. ప్రజలు తత్పలముల గ్రహించిరి. (149) స్వయంభువునిచే పూర్వము పీతుకబడిన బీజములు, మున్నగునవి ఓషధులుగ వృక్షములుగ వృద్దీ నొందెను. అయ్యవి సకాలములో ఆయా ఋతువుల పుష్పఫలముల నొసంగెను.

యదా ప్రసృష్టి ఓషధ్యో న ప్రథంతీహ యాః పునః

తతః తాసాం చ వృత్యర్దే వార్తోపాయం చకార హ

తాసాం స్వయంభూర్భగవాన్ హస్తసిద్ధిం స్వకర్మణాం

తతః ప్రభృతి చౌషధ్యః కృష్ణపచ్యాస్తు జజ్ఞిరే

సంసిద్ధకాయో వార్తాయాం తతస్తాసాం ప్రజాపతిః

మర్యాదాం స్థాపయామాస యధాశిరక్షత్పరస్పరమ్

యే వై పరిగ్రహీతారస్తాసామాసన్బలీయసః

ఇతరేషాం కృతత్రాణాన్ స్థాపయామాస క్షత్రీయాన్.

ఉపతిష్ఠస్తి తావన్తో యావన్తో నిర్మితాస్తథా

సత్యం బ్రూత యథాభూతం ధ్రువం వో బ్రాహ్మణాస్తు లాః

యే చాన్యే హ్యబలొస్తేషాం సంరక్షాకర్మణి స్థితాః

క్రితాని నాశయప్తి స పృథివ్యాం తే వ్యవస్థితాః

వైశ్యానిత్యేవ తానాహుః కీసోశాన్ వృత్తిసాధకాన్

సేవన్తశ్చ ద్రవస్తశ్చ పరిచర్యాసు యే రతాః

 నిస్తేజసోల్పవీర్యాశ్చ శూద్రింస్తానబ్రవీచ్చ సః

తేషాం కర్మాణి ధర్మాశ్చ బ్రహ్మా తు వ్యదధాత్ర్పభుః

సంస్థిత్యాం తు కృతాయాం హి చాతుర్వర్ణస్య తేన వై

పునః ప్రజాస్తు తా మోహాద్ధర్మం తం నాన్వపాలయన్

పూర్వము సృష్టింపఁబడిన ఓషధులు, మరల వృద్ధి నొందీ పలింప మానినపుడు, వారి జీవయాత్రోపాధిగ స్వయంభువు వార్తోపాయము నొనర్చెను. వార్తోపాయము వ్యవసాయము. (151) స్వయముగా భగవానుఁడయిన స్వయంభువు, వారికి స్వహస్తములతో బనిచేయునట్లు, అధికమయిన ఫలితములను సిద్ధిని వారు పొందునట్లైశీర్వదించెను. అప్పటి నుండియు ఓషధులు కృష్ణ పచ్యములయినవి. అనఁగా దున్నబడుటచే వృద్ధి పొందినవయినవి. (152) వ్యవసాయ వృత్తియందు తన ప్రయోజనమును ప్రజాపతి కల్పించనయనంతరము వారలకు కొన్ని మర్యాదల నియమించేను. తన్మూలమున వారు పరస్పరము రక్షించుకొందురు. (153) అట్లు కృషీవలత్వోపాధి గ్రహించిన వారు బలవంతులయిరి. అట్టి వారలను బ్రహ్మ క్షత్రియులనుగాఁ జేసెను. వారి ధర్మము ఇతరులను (బలహీనులను రక్షించుట. (154) ఎంతకాలము వారు క్షత్రియుల నాశ్రయించుకొని లేదా గౌరవించుకొనుచు నుందురో యంతకాలము వారు భయము లేనివారు. యథాభూతం” జరిగినది జరిగినట్లుగా, సత్యమును నిశ్చయముగా జెప్పినవారు బ్రాహ్మణులు, (155) కొందఱు అబలులయిన వారిని రక్షించు కర్మయందు సంస్థితులై యుండిరి. (క్రీతాని) క్రిములను వారు నాశన మొనరించిరి. వారు భూస్థలమున ప్రతిష్టితులైరి. (156) వృత్తి సాధకులను (వ్యవసాయము చేయువారిని) వైశ్యులనిరి. వారు వ్యవసాయము చేయుదురు. ఇతరుల సేవలో రతులయినవారు, ఇతరులకు పరిచర్య చేయువారు, (157) నిస్తేజస్కులు, అల్పవీర్యులయిన వారిని ప్రజాపతి శూద్రులని వ్యవహరించెను. వారి ధర్మములను కర్తవ్యములయిన కర్మకలాపమును బ్రహ్మ నియమించెను. (158) అట్లు బ్రహ్మచే నియమింపబడినవారై చతుర్వర్ణములవారుండిరి. కాని క్రమేణ ఆ ధర్మములను వారు పాలింపకబోయిరి.

వర్ణధర్మైశ్చ జీవంత్యో వ్యరుఢ్యస్త పరస్పరమ్

 బ్రహ్మా బుద్ధ్వా తు తత్సర్వం యాథాతథ్యేన స ప్రభుః

క్షత్రియాణాం బలం దండం యుద్ధమాజీవ్యమాదిశత్

యాజనాధ్యాపనే బ్రహ్మా తథా దానప్రతిగ్రహమ్

బ్రాహ్మణానాం విభుస్తేషాం కర్మాణ్యేతాన్యథాదీశత్

పాశుపాల్యం చ వాణిజ్యం కృషిం చైవ విశాం దదౌ

శిల్పాజీవభృతాం చైవ శూద్రాణాం వ్యదధాత్పునః

సామాన్యాని చ కర్మాణి బ్రహ్మక్షత్రవిశాం పునః

యజనాధ్యాపనే దానం సామాన్యానీతరేషు చ

కర్మాజీవం తు వై దత్త్వా తేషామీప పరస్పరమ్

తేషాం లోకాంతరే మూర్థి స్థానాని విదధే పునః

ప్రాజాపత్యం ద్విజాతీనాం స్కృతం స్థానం క్రీయావతామ్

స్థానమైంద్రం క్షత్రియాణాం సంగ్రామేష్వపలాయినామ్

వైశ్యానాం మారుతం స్థానం స్వస్వకర్మోపజీవినామ్

గాంధర్వం శూద్రజాతీనాం పరిచర్యే చ విష్ఠతామ్

స్థానాన్యేతాని వర్ణానాం యోగ్యాచారవతాం సతామ్

సంస్థిత్యాం సుకృతాయాం వై చాతుర్వర్యస్య తస్య తత్

వర్ణాస్తు దండ భయతః స్వేస్వే వర్ణే వ్యవస్థితాః

తతః స్థితేషు వర్ణేషు స్థాపయామాస హ్యాశ్రమాన్

ప్రజలు వారివారి వివిధ వర్ణధర్మముల నాచరించుచు జీవించుచున్నను, వారు పరస్పరము విరోధులయి వివాదించుకొనెడివారు. యథా తథముగా వారి విరోధములను బ్రహ్మ యెటింగెను. (160) బ్రహ్మా క్షత్రియులకు బలమును, దండనముల నొసంగుట, యుద్ధ జీవితమును నాదేశించెను. బ్రాహ్మణులకు యజ్ఞములనాచరించుట, వేదములను గఱపుట, దానములను పరిగ్రహించుట - మున్నగు కర్మలను ప్రభుఁడైన బ్రహ్మ ఆదేశించెను. పశువులను పెంచుట, వాణిజ్యము, కృషి - మొదలగు కర్మలను వైశ్యుల కొసంగెను. (162) శూద్రులకు శీల జీవనమును జీవన భృతికై బ్రహ్మ శాసించెను. బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు, యజ్ఞముల నాచరించుట, వేదమును అధ్యయన మొనర్చుట, దానముల నొసంగుట బ్రహ్మ సామాన్య కర్మములుగా నియమించెను. (163) ఇతరులకు జీవనోపాధికి పై వర్ణత్రయము వారికి కర్మల నాచరించుట నియమించెను. (164) ఈ కర్మల నాచరించిన తరువత, బ్రహ్మ లోకాంతరము నందు క్రింది స్థానములను విధించెను. (ప్రాజాపత్యమనఁగా బ్రహ్మకు సంబంధించినది), తమ పవిత్ర విధులను నిర్వర్తించిన బ్రాహ్మణులకు ప్రజాపతిలోక నివాసము స్మరింపఁబడినది. (విధింపబడినది), (165) యుద్దభూమీ నుండి పలాయనము చెందని క్షత్రియులకు ఇంద్రలోకమున స్థానము, స్వకర్మోప జీవులయిన వైశ్యులకు మారుత లోకమున స్థానము నియమింపఁబడినవి. (వాయు సంబంధమయిన లోకము మారుత స్థానము. (166) (ఇతర వర్ణముల వారికి) పరిచర్య. చేయుట యందు నిష్టులయిన శూద్రులకు గాంధర్వ లోకవాసము విధింపఁబడినది. (మరణానంతరము) సుకృతులైయుండి, యోగ్యచార ప్రతులను సజ్జనులకు (తత్తద్వర్ణోచితకర్మ లొనరించిన వారికి) ఆయా స్థానములు విధించబడినవి. (167) చాతుర్వర్య వ్యవస్థ వివిధ కర్మలతో వ్యవస్థితమై యుండ, వారు, దండన భయమున తమతమ వర్ణముల యందు స్థిరముగా నిష్ఠులైయుండిరి. వర్ణ వ్యవస్థ స్థిరీకరింపం బడిన పిమ్మట బ్రహ్మ చతుర్ధాశ్రమములను స్థాపించేను.

గృహస్థో బ్రహ్మచారీ చ వానప్రస్థో యతిస్తథా

ఆశ్రమాంశ్చతురో హ్యేతాన్ పూర్వవత్ స్థాపయస్ ప్రభుః

వర్ణకర్మాణి యే కేచిత్తేషామిహ చతుర్భవః

కృతకర్మకృతావాసా ఆశ్రమాదుపభుంజతే

బ్రహ్మా తాన్ స్థాపయామాస ఆశ్రమాన్ భ్రమమతః

నిర్దిదేశ తతస్తేషాం బ్రహ్మా ధర్మానభాషతే

ప్రస్థానాని తు తేషాం చ యమాన్సనియమాంస్తథా

చతుర్వర్ణాత్మకః పూర్వం గృహస్థస్యాశ్రమః స్థితః

త్రయాణామాశ్రమాణాం చ వృత్తియోనీతి చైవ హి

యథాక్రమం చ వక్ష్యామీ ప్రతైశ్చ నీయమైస్తథా

దారాగయశ్చాతిథయ ఇష్టాః శ్రాద్ధక్రియాః ప్రజాః

ఇత్యేష వై గృహస్థస్య సమాసార్ ధర్మసంగ్రహః

దండీ చ మేఖలీ చైవ అధఃశాయీ తథాజినీ

గురుశుశ్రూషణం భైక్ష్యం విద్యార్థి బ్రహ్మచారిణః

చీరపత్రాజినాని స్సర్వనమూలఫలౌషధైః

ఉభే సంధ్యవగాహశ్చ హోమశ్చారణ్యవాసినామ్

విపన్నముసలే భైక్ష్యమస్తేయం శాతమేవ చ

అప్రమాదోవ్యవాయశ్చ దయా భూతేషు చ క్షమా

పూర్వము వలెనే బ్రహ్మ గృహస్థ, బ్రహ్మచర్య, వానప్రస్థసన్యాస - ఆశ్రమ చతుష్టయమును స్థాపించెను. (169) నాలుగు వర్ణముల వారు వారివారి కర్మల నాచరించుచుండిరి. ఆ వాసముల నెలకోలుకొనిరి. ఆశ్రమ స్థితుల నిర్వహించిరి. సుఖించిరి. (170) ఈ ఆశ్రమ చతుష్టయమును బ్రహ్మ స్థాపించేను. ఈ ఆశ్రమముల విడనాడి భ్రమించు వారినీ, 'ఇట్లుండవలేననీ' నిర్దేశించెను. వారలకు ధర్మములను ప్రవచించెను. (171) బ్రహ్మ యమము, నియమము - మున్నగు ఇంద్రియ నిగ్రహ సోపాన క్రియులను ప్రవచించెను. చతురా శ్రమములలో ముఖ్యముగా గృహస్థాశ్రమము మిగిలిన మూఁడు ఆశ్రమములకు వృత్తియందు నీతియందు ఆధార భూతమయినందున ఇక యథాక్రమమున ఆ చతురాశ్రమస్థుల వ్రతములను నియమములను చేప్పెదను. (173) సూక్ష్మముగా నీ క్రిందివి గృహస్థాశ్రమ విధులు : ధర్మ క్రియలు, వివాహము, అగ్నిహోత్ర సంరక్షణము, అతీధి జనాదరణము, యజ్ఞాచరణము, స్వప్రజావృద్ధి యొనర్చుట. (174) బ్రహ్మచారి ధర్మములు ; మేఖల (మొలనూలు) ధరించవలెను, దండమును దాల్చవలయును; లేడి చర్మమును ధరింపవలెను. నేల పరుండవలెను; గురు శుశ్రూష యొనర్చవలెను. భైక్ష్యమున జీవింపవలెను. విద్యార్థి కావలెను. (175) వాన ప్రస్థ వ్రతదీక్షితులకు - నార చీరలు ధరించుట, వనమూల ఫలౌషధుల ఆరగించి జీవించుట, ఉభయ సంధ్యలయందు స్నానము లొనర్చుట, హోమ మాచరించుట, ఇఁక సన్యాసులకు (యత్యాశ్రమ ధారులకు) : ధాన్యమును దంపుటచే గలుగు రోకంటి పోటు ధ్వని అణగిన వెనుక బిచ్చమెత్తుట, అస్తేయము (దొంగతనము లేక యుండుట), శౌచము నూనీయుండుట.

శ్రవణం గురుశుశ్రూషా సత్యం చ దశమం స్మృతమ్

దశలక్షణకో హ్యేష ధర్మః ప్రోక్తః స్వయంభువా

భిక్షార్వతాని పంచాత్ర భైక్ష్యవేదప్రతాని చ

తేషాం స్థానాన్యశుష్మిం చ సంస్థితానామచష్ట సః

అష్టాశీతీసహస్రాణి ఋషీణామూర్ధ్వరేతసాం

స్మృతం తేషాం తు యతి స్థానం తదేవ గురువాసినామ్

సప్తర్షాణాం తు యతానం సుతం తద్వై వనౌకసామ్

ప్రాజాపత్యం గృహస్థానాం న్యాసీనాం బ్రహ్మణః క్షయమ్

యోగినామకృతం స్థానం తానజిత్వా న విద్యతే

స్థానాన్యాశ్రమీణస్తానీ బ్రహ్మ స్థానస్థితాని తు

చత్వార ఏవ పంథానో దేవయానాని నిర్మితాః

పంథానః పితృయానాస్తు సృపాశ్చత్వార ఏవ తే

బ్రహ్మణా లోకతంత్రేణ అదే మన్వంతరే పురా

పంథానో దేవయానా యే తేషాం ద్వారం రవిః స్మృతః

తథైవ పితృయానానాం చంద్రమా ద్వారముచ్యతే

ప్రమాదము (తప్పిదము) లాచరింపకుండుట; అత్యవాయిత్వము (స్త్రీ సంపర్క రహితముగ నుండుట), భూతముల యందు దయ, ఓర్పులు కలిగియుండుట, వేదాంత శ్రవణ మాచరించుట, గురు శుశ్రూష, సత్యపాలనము - ఇవి పది లక్షణములు : ఈ పది లక్షణములు సన్యాసి ధర్మములుగా బ్రహ్మవచించెను. (178) భైక్ష్య వేద ప్రతాదులైదును భిక్షువుని యొక్క ధర్మములు. వారికి ఎనిమిది స్థానములు మరణానంతరము వచింపఁబడినవి. (179) ఊర్థ్వరేతస్కులయిన శిష్టులయిన ఋషులు ఎనుబది వేలమంది కలరు. వారికేట్టి స్థానములు (మరణానంతరము) నిర్ణయింపఁబడినవో, (అస్పష్టముగా నున్నది). అట్టి స్థానములే గురు శుశ్రూషాయుతులయి గురువులతో నుండు వారికిని స్మరింపఁబడినవి. (180) వనౌకసులయిన వానప్రస్థులకు సప్తర్షి స్థానము, ప్రజాపతిలోక స్థానవాసము గృహస్థులకు, బ్రహ్మలోకవాసము సన్యాసులకు నియమింపఁబడినది. [181) యోగులకు స్థానము నిర్ణీతము కాలేదు (యోగమున పిద్ధులయిననే కాక స్థానములు నిర్ణయింపం బడువు. వారిం కను యోగ సాధకులే). వివిధములయిన ఆశ్రమస్థులయిన వారికి స్థానము బ్రహ్మ స్థానమగును. (182) నాలుగు పథములే (మార్గములే) దేవయానములు నిర్మితములు, దేవయానములు, దేవతల యొక్క మార్గములు). పితృయానములనీ నాలుగు మార్గములే స్మరింపం బడినవి. (పితృయానములు పితృదేవతల మార్గములు,) (183) పూర్వము మొదట మన్వంతరమున లోకతంత్రమును నిర్వహించిన బ్రాహ్మణులు, దేవయానముల మార్గములకు సూర్యుఁడు ద్వారముగా స్మరింపబడినాఁడు. పితృయానములకు చంద్రుఁడు ద్వారముగా చెప్పబడెను. (184)

ఏవం వర్ణాశ్రమాణాం చ ప్రవిభాగే కృతే తదా

 యదా ప్రజా వావర్ధంత వర్ణధర్మసమాసికాః

తతో న్యాం మానసీం స్వాం వై శ్రేణామధ్యే సృజత్పజాః

ఆత్మవస్తు శరీరేభ్యస్తుల్యాతైవాత్మనా తు తాః

తస్మిన్ త్రేతాయుగే త్వాద్యే మధ్యం ప్రాప్తి క్రమేణ తు

తతోన్యా మానసీక సోథ ప్రజాః స్రష్టుం ప్రచక్రమే

తతః సత్వరజోద్రిక్తాః ప్రజాః స ప్యాసృజత్ర్పభుః

ధర్మార్థకామమోక్షాణాం వార్తానాం సాధకాశ్చ యాః

దేవాశ్చ పితరశ్చైవ ఋషయో మనవస్తథా

యుగానురూషా ధరేణః మైధిమా షర్థితాః ప్రజాపి

ఉపస్థితే తదా తస్మిన్ సృష్టివర్గే స్వయంభువః

అభిధ్యాయ ప్రజా బ్రహ్మా నానావీర్యాః స్వమానసీః

పూర్వోక్తా యా మయా తుభ్యం జనానీకం సమాశ్రితాః

కల్పేఒనీతే పురాణ్యాసీద్దేవాద్యాప్తు ప్రజా ఇహ

ధ్యాయతస్తస్య తానీహ సంభూత్యర్థముపస్థితాః

మన్వన్తర క్రమేణేహ కనిష్టాః ప్రథమేన, తాః

ఖ్యాతాస్తు వంశ్యైరేతైస్తు పూర్వం యైరిహ భావిశాః

కుశలాకుశలైః కందైరక్షీణై స్తైస్తదా యుతాః

ఈ విధముగా వర్ణాశ్రమముల యొక్క విభాగము. తత్తద్ధర్మములతోఁ జేయబడినను, వర్ణ ధర్మముల యందు సంసక్తులయిన ప్రజలు వృద్ధి పొందలేదు. (185) అప్పుడు త్రేతాయుగ మధ్యలో తనయొక్క శరీరముల నుండి, మరియు తనతో తుల్యములయిన శరీరముల నుండి, స్వమనస్సంబంధమయిన అన్యమయిన సృష్టిలో ప్రజలను ప్రజాపతీ సృజించెను. (186) మొట్టమొదటిదైన త్రేతాయుగ మధ్య కాలము క్రమముగా, సంప్రాప్తముకాగా, ఇంతకు పూర్వము సృజించిన దానికంటే వేటయిన మానస సంబంధమయిన ప్రజాసృష్టి నొనర్ప బ్రహ్మ యంతట ప్రారంభించేను: (187) అంత ఆ బ్రహ్మయే సత్వ రజోగుణములచే నుద్రిక్తులయిన ప్రజలను సృజించెను. వారు ధర్మార్థ కామ మోక్షములకు, వార్తలకు (జీవితోపాధి కొకయిన వృత్తులకు) సాధకులయిరి. (188) వారు దేవతలు, పితరులు, ఋషులు, మనువులు. వారి వారి లక్షణము విషయములలో వారు యుగాను కూలములయిన ధర్మములతో ప్రజలు అభివృద్ధి నొందిరి. (189) అప్పుడు ఆ సృష్టి వర్గముప స్థితము కాగా స్వయంభువుఁ డయిన బ్రహ్మ ధ్యానించి, నానా వీర్యవంతులయిన ప్రజలను స్వమన సృష్టిచే కల్పించేను. (190) గతించిన కల్పములో జనలోకము నాశ్రయించిన ప్రజలను గూర్చి నీకు వివరించితిని. అందు పూర్వమే దేవతలు ప్రజానీకమిందుండిరి. (191) బ్రహ్మ వానిని గూర్చి ధ్యాన మొనరించెను. సృజింపఁబడిన వారందరు, (తిరిగి) జన్మించుట. కొఆకాతనిని సమీపించిరి. మన్వంతర క్రమములో మొదటి వారిని 'కనిష్ఠు'లనుగా జేసెను. . ప్రజావంశ్యులలో వారు ప్రఖ్యాతులు. వారికి తెలివి, తదితరములు కలవు. వారీవారి క్రియలచే నుత్పన్నములలన ఫలితములచే వారికి కొన్ని సామాన్యములయిన, బాధలుండెను.

తత్కర్మ ఫలదోషేణ హ్యుషబాధాః ప్రజజ్ఞిరే

దేవాసురపితౄంశ్చైవ యక్షైర్గంధర్వమానుషైః

రాక్షస్తైస్తు పిశాచైస్తైః పశుపక్షిసరీసృపైః

వృక్షనాడకకీటాద్యైస్తైస్తై సర్వైరుపస్థితాః

ఆహారార్థం ప్రజానాం వై విదాత్మానో వినిర్మమే

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ద్వితీయేనుషంగపాదే లోకజ్ఞానవర్ణనం నామ సప్తమోధ్యాయః

అందున్న వారిలో, దేవతలు, అసురులు,, పీతరులు, యక్షులు; గంధర్వులు, మానవులు, రాక్షసులు, పిశాచులు, జంతువులు, పక్షులు, నేల బ్రాకునట్టి సరీసృపములు, వృక్షములు, నారక కీటకములు మొదలయినవి. యుండెను. ప్రజల కాహరార్ధము (సర్వవిదులలో శ్రేష్ఠుఁడు) బ్రహ్మ నిర్మించెను. (195)

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమునందు పూర్వభాగమున అనుషంగపాదమున లోకజ్ఞానవర్ణనమును సప్తమాధ్యాయము.