32 -  శ్రీనగర త్రిపురా సప్త కక్షా పాలక దేవతా ప్రకాశనకథనం

అగస్త్య ఉవాచ:-

లోహాదిసప్తశాలానాం రక్షకా ఏవ సంతి వై ।

తన్నామ కీర్తయ ప్రాజ్ఞ యేన మే సంశయచ్ఛిదా ॥

హయగ్రీవ ఉవాచ :-

నానావృక్షమహోద్యానే వర్తతే కుంభసంభవ ।

మహాకాలః సర్వలోకభక్షకః శ్యామవిగ్రహః ॥

శ్యామకంచుకధారీ చ మదారుణవిలోచనః ।

బ్రహ్మాండచషకే పూర్ణం పిబన్ విశ్వరసాయనమ్ ॥

మహాకాలీం ఘనశ్యామామనంగార్రామపాంగయన్ ।

సింహాసనే సమాసీనః కల్పాంతే కాలనాత్మకే ॥

లలితాధ్యానసంపన్నో లలితాపూజనోత్సుకః ।

వితన్వంల్లలితాభక్తః స్వాయుషో దీర్ఘదీర్ఘతామ్ ॥

కాలమృత్యుప్రముఖ్యైశ్చ కింకరైరపి సేవితః ॥

మహాకాలీమహాకాలౌ లలితాబ్దాప్రవర్తనౌ ।

విశ్వం కలయతః కృత్నం ప్రథమే ధ్వని వాసినౌ ॥

కాలచక్రం మతంగస్య తొస్యైవాసనతాం గతమ్ ।

చతురావరణోపేతం మధ్యే బిందుమనోహరమ్ ॥

త్రికోణం పంచకోణం చ షోడశచ్ఛదపంకజమ్।

అష్టారపంకజం చైవం మహాకాలస్తు మధ్యగః॥

త్రికోణే తు మహాకాల్యా మహాసంధ్యా మహానిశా ।

ఏతాస్తిప్రో మహాదేవ్యో మహాకాలస్య శక్తయః ॥

తతైవ పంచకోణాగ్రే ప్రత్యూషశ్చ పితృప్రసూః ।

ప్రాజ్ఞోపరాష్ట్రమధ్యాహ్నాః పంచ కాలస్య శక్తయుః ॥

అథ షోడశపత్రాజే స్థితా శక్తీర్మునే శృణు ।

దినమిశ్రా తమిస్రా చ జ్యోత్పీ చైవ తు పక్షిణీ ॥

ప్రదోషా చ నిశీథా చ ప్రహరా పూర్ణిమాపీ చ ।

రాకా చానుమతిశ్చైవ తథైవామావస్యీకా పునః ॥

సినీవాలీ కుహూర్భద్ర ఉపరాగా చ షోడశీ ప్రతా।

షోడశమాత్రస్థాః శక్తయః షోడశ స్మృతాః ॥

కలా కాషా నిమేషాశ్చ క్షణాన్చైవ లవాస్త్రుటిః ।

ముహూర్తాః కుతపా హోరా శుక్లపక్షాస్తథైవ చ ॥

కృష్ణపక్షాయనాశ్చైవ విషువా చ త్రయోదశీ ।

సంవత్సరా చ పరివత్సరే వత్సరాపి చ ॥

ఏతాః షోడశపత్రాబ్దవాసినః శక్తయః స్మృతాః ।

ఇద్వత్సరా తతశ్చేందువత్సరావత్సరేపి చ ॥

తిధిర్వారాశ్చ నక్షత్రం యోగాశ్చ కరణాని చ ।

ఏతాస్తు శక్తయో నాగపత్రాంభోరుహసంస్థితాః ॥

కలిః కల్పా చ కలనా కాలీచేతి చతుష్టయమ్ ।

ద్వారపాలకతాం ప్రాప్తం కాలచక్రస్వభాస్వతః ॥

ఏతో మహాకాలదేవ్యో మదప్రహసీతాననాః ।

మద్రాపూర్ణచషకమశేషం చారుణప్రభమ్ ॥

దధానా: శ్యామలాకారః సర్వాః కాలస్య యోషితః ॥

లలితాపూజనధ్యానజపస్తోత్రపరాయణాః ।

నిషేవంతే మహాకాలం కాలచక్రాసనస్థితమ్ ॥

అథకల్పకవట్యాస్తు రక్షకః కుంభసంభవ ।

వసంతర్తుర్మహాతేజా లలితాప్రియకింకరః ॥

పుష్పసింహాసనాసీనః పుష్పమాధ్వీమదారుణః।

పుష్పాయుధః పుష్పభూషః పుష్పచ్ఛత్రేణ శోభితః ॥

మధుశ్రీర్మాధవశ్రీశ్చ ద్వే దేవ్యా తస్య దీవ్యతః ।

ప్రసూనమదిరామతే ప్రసూనశరలాలసే ॥

సంతానవాటికాపాలో గ్రీష్మరుసీక్షలోచనః।

లలితాకింకరో నిత్యం తస్యాస్వాళాప్రవర్తకః ॥

శుక్రశ్రీశ్చ శుచిశ్రీశ్చ తస్య భార్యే ఉభే స్మృతే ।

హరిచందనవాటీ తు మునే వర్షర్తునా స్థితా ॥ స వర్షరుర్మహాతేజా విద్యుతిమంగలలోచనః ।

వజ్రాట్టహాసముఖరో మత్త జీమూతవాహనః ॥ జీమూతకవచచ్చన్నో మణికార్ముకధారకః ।

లలితోపూజనధ్యానజపస్తోత్రపరాయణః ॥

వర్తతే వింధ్యమథనత్రైలోక్యాహ్లాదదాయకః ।

నభశ్రీశ్చ నభస్యశ్రీః స్వరస్వారస్యమాలినీ ॥

అంబా దులా రాలిశ్చాథయంతీ మేఘయంత్రికా।

వర్జయంతీ చిబుణికా వారిఫోరా చ శక్తయః ॥

వర్షన్యో ద్వాదశ ప్రోక్తా మదారుణవిలోచనాః ।

తాభిః సమం సవర్షర్తుః శక్తిభిః పరమేశ్వరమ్ ॥

సదైవ సంజపన్నాస్తే నిజోష్ఠాః పుష్పమందలైః ।

లలితాభక్తచేశాంస్తు భూషయన్ స్వస్య సంపదా ॥

 తద్వైరిణాం తు వసుధామనావృష్ట్యా నిపీడయన్ ।

వర్తతే సతతం దేవీకింకరా జలదొగమః ॥

మందారవాటికాయాం తు సదా శరదృతుర్వసన్ ।

తాం కక్షాం రక్షతి శ్రీమాంట్లోకచిత్తప్రసాదతః ॥

ఇషశ్రీశ్చ తోర్ణశ్రీసస్యర్తో ప్రాణనాయికే ।

హౌభ్యాం సంజప్రతుస్తోయం నిజోత్తైః పుష్పమండలై! ॥

అభ్యర్చయతి సామ్రాజ్జీం శ్రీకామేశ్వర యోషితమ్ ।

హేమన్తర్తుర్మహాతేజో హిమశీతలవిగ్రహః ॥

సదా ప్రసన్నవదనో లలితాప్రియకింకరః ।

నిజోతైః పుష్పసంఖారైరర్చయన్ పరమేశ్వరీమ్ ॥

పారిజాతస్య వాటీం తు రక్షతి జ్వలనార్దనః ।

సహఃశ్రీశ్చ సహస్య శ్రీస్తస్య ద్వే యోషితే శుభే ॥

కదంబవనవాట్యాస్తు రక్షకః శిశిరాకృతిః ।

శిశిరర్హుర్మునిశ్రేష్ఠ వర్తతే కుంభసంభవ ॥ సా కక్ష్యా తేన సర్వత్ర శిశిరీకృతభూతలా ।

తద్వాసినీ తతః శ్యామా దేవతా శిశిరాకృతిః ॥

తపఃశ్రీశ్చ తపస్యశ్రీస్తస్య ద్వే యోషిదుత్తమే ॥

తాభ్యాం సహారయత్యంబాం లలితాం విశ్వపావనీమ్ ।

అగస్త్య ఉవాచ :-

గంధర్వవదన శ్రీమన్నానావృక్షాదిసప్తకైః ।

ప్రథమోద్యానపాలస్తు మహాకాలో మాయా శ్రితః ॥

చతురావరణం చక్రం త్వయా తస్య ప్రకీర్తితమ్ ।

షష్ణామృతనామన్యేషాం కల్పకోద్యానపాటీషు ॥ పాలకత్వం శ్రుతం త్వతశ్చక్రదేవ్యస్తు న శ్రుతాః ।

అత ఏ వసంతాదిచక్రావరణదేవతాః ।

క్రమేణ బ్రూహి భగవన్ సర్వజ్ఞోసి యతో మహాన్ ॥

హాయగ్రీవ ఉవాచ :-

ఆకర్ణయ మునిశ్రేష్ఠ తత్తచ్చక్రస్థదేవతాః ।

కాలచక్రం పురా ప్రోక్తం వాసస్తం చక్రముచ్యతే ॥

త్రికోణం పంచకోణం చ నాగచ్ఛదసరోరుహమ్ ।

షోడశారం సరోజం చ దశారద్వితయం పునః ॥

చతురస్రం చ విజ్ఞేయం సప్తావరణసంయుతమ్ ।

తన్మధ్యే బిందుచక్రస్టో వసంతర్తుర్మహాద్యుతిః ॥

తదేకద్వయసంలగ్నే మధుశ్రీమాధవియా ।

ఉభాభ్యాం నిజహస్తాభ్యాముభయోస్తనమేకకమ్ ॥

నిపీడయున్ స్వహస్తస్య యుగలేన స్వసౌరభమ్ ।

సపుష్పమదిరాపూర్ణచషకం పిశితం వహన్ ॥

ఏవమేవ తు సర్వరుధ్యానం వింధ్యనిషూదన ।

వర్షర్తోస్తు పునరానే శక్తిద్వితయమాదిమమ్ ॥

అంకస్థితం తు విజ్ఞేయం శక్తయోఃన్యాః సమీపగాః ।

అథ వాసంతచక్రస్థదేవీః శృణు వదామ్యహమ్ ॥

మధుశుక్ల ప్రథమికా మధుశుక్లద్వితీయకా ।

మధుశుక్లతృతీయా చ మధుశుక్లచుతుర్థికా ॥

మధుశుక్లా పంచమి చ మధుశుక్లా చ షష్ఠికా।

మధుశుక్లా సప్తమి చ మధుశుక్లాష్టమి పునః ॥

నవమీ మధుకు చదశమి మధుశుక్లికా ।

మధుశుక్లైకాదశీ చ ద్వాదశీ మధుశుక్షతః ॥

మధుశుక్షత్రయోదశ్యాం మధుశుక్ల చతుర్దశీ ।

 మధుశుక్లా పౌర్ణమాసీ ప్రథమా మధుకృష్ఠికా ॥

మధుకృష్ణా ద్వీతీయా చ తృతీయా మధుకృష్ఠికా ।

చతుర్థి మధుకృష్ణా చ మధుకృష్ణా చ పంచమి॥

షష్ఠీ తు మధుకృష్ణా స్యాత్సప్తమి మధుకృష్ణతః ।

మధుకృష్ణాష్టమి చైవ నవమి మధుకృష్ణతః ॥

దశమి మధుకృష్ణా చ వింధ్యదర్పనిషూదన।

మధుకృషైకాదశీ తు ద్వాదశీ మధుకృష్ణతః ॥

మధుకృష్ణత్రయోదశ్యా మధుకృష్ణచతుర్ధశీ।

మధ్వమా చేతి విజేయాస్త్రింశదేతాస్తు శక్తయః ॥

ఏవమేవ ప్రకారేణు మాధవాఖ్యోపరిస్థితాః ।

శుక్ల ప్రతిపదాద్యాస్తు శక్తయస్త్రింశదన్యకాః ॥

మిలిత్వా షష్టిసంఖ్యాస్తు ఖ్యాతా వాసన్తశక్తయః ।

స్వైస్వైర్మంతైస్తత్ర చక్రే పూజనీయా విధానతః ॥

వాసంతచక్రరాజస్య సప్తావరణభూమయః ।

షష్టిః స్యుర్దేవతాస్తాసు షష్టిభూమిషు సంస్థితాః ॥

విభజ్య చర్చనీయాః స్యుగ్రత్తన్మంతైస్తు సాధకైః।

తథా వాసనచక్రం స్యాతధైవాన్యేషు చ త్రిషు॥

 దేవతాస్తు పరం భిన్నా శుక్రశుచ్యాదిభేదతః ।

శక్తయః షష్టిసంఖ్యోతి గ్రీష్మచక్రే మహోదయాః ॥

ఏవం వర్షాదికే చక్రే భేదాన్నభనభస్యజాన్ ।

 షష్టిషష్టిసు శక్తీనాం చక్రే చ ప్రతిష్ఠితాః ॥

గ్రంథవిస్తారభీత్యా తు తత్సంఖ్యానాద్విరమ్యతే ।

ఆర్తవ్యాః శక్తయస్త్వేతా లలితాభక్తసౌఖ్యదాః ॥

లలితాపూజనధ్యానజపస్తోత్రపరాయణాః ।

 కల్పాదివాటికాచక్రే సంచరన్యో మదాలసాః ॥

స్వస్వపుష్టాళమధుభిస్తర్పయన్యో మహేశ్వరీమ్ ।

మిలితా చైవ సంఖ్యాతాః షష్ట్యుత్తరశతత్రయమ్ ॥

ఏవం సప్తసు శాలేషు పాలికాశ్చక్రదేవతాః ।

నామకీర్తనపూర్వం తు ప్రోక్తాస్తుభ్యం ప్రపృచ్ఛతే ॥

అన్యేషామపీ శాలానాముపాదానం తు పూరకమ్ ।

విస్తారం తత్ర శక్తిం చ కథయామ్యవధారయ ॥

ఇతి శ్రీబ్రహ్మాండమహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యాన శ్రీనగరత్రిపురాసప్తకక్షాపాలకదేవతాప్రకాశనకథన నామ ద్వాత్రింశోధ్యాయః ॥

అగస్త్యుడనేను:- లోహాది సప్తశాలములకు రక్షక్షులున్నారు గదా! వారి పేరులను జెప్పి నా సంశయమును బోగొట్టుము -1. హయగ్రీవుడనెను. ఓయగస్త్యా! నానావృక్ష మహోద్యానమున సర్వలోకభక్షకుడు, నల్లని యాకారము గలవాడునైన మహాకాలుడు రక్షకుడుగా నుండును -2 అతడు నల్లని కవచమును ధరించును. మదముచే నాతని కన్నులెరుపెక్కి యుండును. బ్రహ్మాండమను. చషకమున (పానపాత్రమున) విశ్వమును రసాయనమును ద్రాగుచుండును -3. మేఘమువలె నల్లనై కామముచే మనమున ద్రవించిన మహాకాలిని క్రీగంట -జూచుచుండును. సర్వసోశాత్మకమైన కల్పాంతమను సింహాసనమున గూర్చుండును.-4. లలితాధ్యాన సంపన్నుడై లలితా పూజనముననుత్సుకుడగును. లలితా భక్తివలన తనయాయుష్యమును. దీర్ఘదీర్ఘముగా  పొడిగించుచుండును. కాలమృత్యువు మొదలగు సేవకులచే సేవింపబడుచుండును -5. మహాకాలీలు మహాకాలు లలితాదేవి యొక్క యాజ్ఞను పాటించువారు. ప్రథమ మార్గముననుండి సమస్తవిశ్వమును పాలింతురు -6. మతంగుని కాలచక్రమాతని యాసనమగును. అది నాలుగావరణములతో గూడినది, మధ్యన బిందువుతో మనోహరమైనది. మూడు కోణములు ఐదుకోణములునుగలది, పదునారుదలములు-గలకమలము. అట్లే అష్ణారములు గల కమలము. మహాకాలుడు దానీ మధ్యనుండును-8 త్రికోణమున మహాకాల (మహాకాలి) మహాసంధ్య, మహానీశ అను నీమహాకాలుని. . శక్తులు మహాదేవులు -9. అచటనే పంచకోణాగ్రమున ప్రత్యూషుడు, పీతప్రసువు, ప్రాబ్లో, షరాహ్లా, మధ్యాహ్న - అనునీల్లేదు మహాకాలుని శక్తులు -10. ఇక, ఓ మునీ! పదునారుదలములపద్మముననున్న శక్తులను వినుము. దీనమిశ్ర, తమిస్ర, జ్యోతి, పక్షిడి:-11, ప్రదోష, నిశీథ, ప్రహర, పూర్ణిమ, రాక, అనుమతి, అమావస్యీక -12. సినీవాలీ, కుహు, భద్ర, పదునారవది ఉపరాగ - ఈషోడశమాత్ర స్థలైన శక్తులు పదునాలు -13. కల, కాష్ఠ, నిమేషము, క్షణము, లవము, తృటి, ముహూర్తము, కుతపము, హోర, శుక్లపక్షము -14  కృష్ణపక్షము, దక్షిణోత్తరాయనములు, విషువ, త్రయోదశి, సంవత్సర, పరివత్సర, ఇడో వత్సర -15, వీరు పదునారుదలముల నుండుశక్తులు. ఇద్వత్సర, ఇందువత్సర, వత్సర పద్మమున-16, తిథి, వారములు, నక్షత్రములు, యోగములు, కరణములు ఇవి నాగపత్రకమలముననుండు శక్తులు -17. కలి, కల్ప, కలన, కాలీ -అనునలుగురు ద్వారపాలకత్వము ననుండినవారు. (శక్తులు కాలచక్ర స్వభావమును. ఇట్టి -16 వీరు మహాకాలునిదేవులు (భార్యలు) మదముతో నవ్వినమోముగలవారు. మదిరతోనిండి పూర్తిగా నేనైన చషకమును (పానపాత్రమును) ధరించినవారు. నల్లని యాకారములు గలవారు. వీరందరు మహాకాలుని భార్యలు -19, లలితా పూజన -ధ్యాన, జప-స్తోత్రములందు నిమగ్నలైనవారు. వీరు కాలచక్రా సనమునమన్న మహాకాలుని సేవింతురు-20. ఇక, ఓ ఆగస్యా! కల్పకవాటిని రక్షించువాడు వసంతర్తువు. ఈతడు మహాతేజస్వి లలితాదేవికి ప్రియసేవకుడు- 21. పుషసింహాసనమునగూర్చుండును. పుష్పాసవమదముననే పెక్కును. పుష్పాయుధములధరించును. పుష్పాలంకారముల బెట్టుకొనును. పుష్పములు గొడుగుగా గలవాడైశోభించును -22, విలాసముగా క్రీడించునాతనికి. మధుశ్రీ మాధవశ్రీ, (చైత్రవైశాఖములు) అనునినిరువురు భార్యలు. పుష్పాసవమున మత్తెక్కినవారు. కామలాలసలు-23. ఇక సంతాన వాటికను పాలించువాడు గ్రీషర్తువు. ! అతడు తీక్షనేత్రుడు. నీత్యము లలితాదేవికి సేవకుడు. ఆమె యాజ్ఞనాచరించువాడు -24. శుక్రశ్రీ, శుచిశ్రీ (జేషాషాడములు) ఆతని భార్యలు, హరిచందనవాటికా పాలకుడు వర్షర్తువు. ఆతడు - మహాతేజస్వి. మెఇపువలె పింగలములైన కన్నులుగలవాడు. పిడుగలేయట్టహాసములుగాగలవాడు. మదించిన మేఘమువాహనముగా - గలవాడు-26. మేఘకవచము దొడిగినవాడు. మణిధనువును ధరించినవాడు. లలితా పూజన-ధ్యాన-జప-స్తోత్రములందాసక్తిగలవాడు -27. వింధ్యమథనమున తైలోక్యాహ్లాదమునిచ్చువాడు. నభశ్రీ -సభస్యశ్రీ(శ్రావణ భాద్రపదమాసములు) స్వరస్వా, రస్యమాలినీ -28, - అంబ, దుల, నిరాలి, ఆభయంతి, మేఘయంత్రిక, వర్షయంతి, చిబుణిక, వారిధార, ఈశక్తులాతని భార్యలు-25. వీరుపండ్రెండుగురు. మదముచేవెళ్లినైన కన్నులుగలవారు. ఆ శక్తులతోగూడ నా వర్షర్తువు పరమేశ్వరి నెల్లప్పుడు జపించుచుండును -30. తనకాలమునందలి పుష్పసమూహములచేతను సర్వసంపదచేతను లలితాభక్తులదేశములనలంకరించును-31. లలితావైరుల దేశములను అనావృష్టిచే పీడించుచుండును, వర్షర్తువు ఎల్లపుడు దేవీసేవకుడైయుండును-32, మందారవాటికను శరదృతువు రక్షించును. అది లోకచిత్తముల ప్రశాంతముగానుంచును-38. ఇషశ్రీ, ఊర్జశ్రీ (ఆశ్వయుజకార్తీక మాసములు) ఆశరదృతువు భార్యలు. వీరిచే జలమును ఒక్కచోగూర్చును. - తన ఋతువునందలి పూవులతో సామ్రాజ్ఞయైన శ్రీ కామేశ్వరపతిని పూజించును-34, హేమంత ఋతువు మహాతేజస్వి హీమశీతమైనయాకారముగలది. ఎల్లప్పుడు ప్రశాంతమైన ముఖముగలియుండును. లలితాదేవికి ప్రియ సేవకుడగును-85, తన ఋతువులోని పుష్పభారములచే పరమేశ్వరినర్చించును. ఈతడు అగ్నిని శాంతింపజేసి పారిజాతవృక్షవాటికను రక్షించును-36, సహఃశ్రీ, సహాస్యశ్రీ (మార్గశీర్ష- పుష్యమాసములు) ఈతని భార్యలు. అగస్త్యా! శిశిర ఋతువు కదంబవనవాటికకు రక్షకుడు -37. ఆకదంబవనవాటికక్ష్య శిశిర ఋతువుచే చల్లగా కుంచించుకొనిపోవునట్లు చేయబడును. అచటనుండు దేవత శ్యామా, శిశిరా కృతిగలది. తపఃశ్రీ, తపస్యశ్రీ (మాఘఫాల్గునమాసములు) యాతనియుత్తమ భార్యలు. వారితోగలిసి యాఋతువు విశ్వపావనియైన లలితాంబను అర్చించును. -39. అగస్త్యుడనెను ఓ హయగ్రీవా! లక్ష్మీవంతుడా! ఏడుగానున్న నానా వృక్షములుగల ప్రథమోద్యానమునకుపాలకుడుగా నీ మహాకాలునిచే ఆశ్రయింపబడెను. -40. ఆతనిది నాలుగావరణములగల చక్రమని చెప్పితివి. కల్పకోద్యానవాటులలోనితరములైన  (మహాకాలేతరములైన) యాము. ఋతువులకు పాలకత్వమని నీవల్ల వింటిని. కాని చక్రదేవుల (స్త్రీలు) వినలేదు-41. ఓ భగవత్సర్వరూపుడా! నీవు సర్వజ్ఞుడవై గొప్పవాడవు. కావున వసంతాది చక్రములయావరణదేవతలను క్రమముగా జెప్పుము142. హయగ్రీవుడనెను. ఓ మునిశ్రేషా! అగస్త్యా ఆయా చక్రముననున్న దేవతలను వినుము-43. పూర్వము చెప్పిన కాలచక్రము వాసంతచక్రమనబడును. అది మూడుకోణములును ఐదుకోణములునుగలది. నాగదళములు గల కమలము. షోడశారము (పదునారాకులు (దళములు) గలది) ఐన కమలము. మరల ఇరువది యాకులు. (దళములుగల కమలము-44. చతురస్రమైనది. ఏడావరణములతోగూడినది. దానిమధ్యన బిందుచక్రమునన్నువాడు మహాద్యుతిగల వసంతుడు -45. ఆతని యొక్కనీలో రెండుగా గలిసినవారు మధుశ్రీ--మాధవశ్రీలు. వసంతుడు తన రెండు చేతులతో కేవలమాయిద్దరియొక్క ఒకొకసనమును పీడించుచుండును-46. తన రెండు చేతులతో వాపన - పుష్పాసవముతోనిండిన పానపాత్రను మాంసమునుధరించును -47. వింధ్యగర్వాపహరణముజేసిన యోయగస్త్యా ఈవిధముగా. నన్ని ఋతువులందలి ధ్యానముండును. వర్షర్తుధ్యానమున మొదటి శక్తిద్వయము తొడపైనున్నన్నట్లుగా దెలియవలెను. తక్కినశక్తులు సమీపముననుందురు-48, ఇక వాసంత చక్రదేవులను జెప్పేద వినుము. మధు(చైత్ర) శుక్ల ప్రథమిక (ప్రతీపత్), మధుశుక్ల ద్వీతీయిక. (విదియ) -4. మధుశుక్ల తృతీయ, మధుశుక్లచతుర్థిక, మధుశుక్లపంచమి, మధుశుక్లషష్ఠిక -50. మధుశుక్లసప్తమీ, మధుశుక్లాష్టమి, మధుశుక్లనవమి, మధుశక్లదశమి -51. మధుశుక్లికాదశి, మధుశుక్ల ద్వాదశి-52 మధుశుక్ల త్రయోదశి, మధుశుక్లచతుర్దశి మధుశుక్ల పౌర్ణమాసీ, మధుకృష్ణ (చైత్రబహుల) ప్రథమ, మధుకృష్ణ ద్వితీయ, మధుకృష్ణ తృతీయ - 53. మధుకృష్ణ చతుర్థి, మధుకృష్ణపంచమి, మధుకృష్ణ షఫీ, మధుకృష్ణ సప్తమి -54. మధుకృష్ణాష్టమి, మధుకృష్ణనవమి, మధుకృష్ణదశమి,-55. మధుకృషైకాదశి, మధుకృష్ణద్వాదశి, మధుకృష్ణ త్రయోదశి, మధుకృష్ణచతుర్దశి-56. మధ్వమా (చైత్రబహుల అమా) వాస్య, - వీరు ముప్పది దేవతాశక్తులు. ఈ విధముగానే మాధవము వైశాఖము) పైనున్న శుక్ల ప్రతి పధమొదలగు ముప్పది శక్తులు వేరైనవి. మొత్తము గలిసి వాసంతశక్తులు - అణువది. (చైత్రవైశాఖములు వసంతఋతువుగదా)-58. వారు తమ తమ మంత్రములచే నాచక్రమున విధివిధానముగ బూజింపదగినవారు. వాసంతచక్రరాజమునకు ఏడు ఆవరణభూములు -55. అందు అరువది భూములలో నలువదిదేవతలుందురు, సాధకులు వారిని వేరు పరచి వారివారి మంత్రములతో బూజింపవలెను-60. వాసంత చక్రమునందు వలెనే తక్కిన మూడు చక్రములందు ఉండును. శుక్ర (జ్యేష్ఠ శుచీ (ఆషాఢ) మొదలగు భేదములతో దేవతలు వేరుగానుందురు-61. గ్రీష్మ ఋతు చక్రమున మహోదయలైన యువది శక్తులు చెప్పబడిరి. ఈవిధముగనే పరఋతువు చక్రమున నభ (శ్రావణ) సభస్య (భాద్రపద) జములైన దేవతలను దెలియవలె-62. ప్రతి చక్రమున నువదేసి శక్తులు ప్రతీష్టతలు. గ్రంథ విస్తరభీతిచే వారి సంఖ్యానము విరమించినాను-63. వీరు ఋతువులకు సంబంధించిన శక్తులు. లలితాభక్తులకు సౌఖ్యము నిత్తురు. లలిత యొక్క పూజన-ధ్యాన-జపస్తోత్రములందు ఆసక్తిగలవారు-64. కల్పాదివాటీకా చక్రమున సంచరించు శక్తులు మదాలసలు. తమతమ వాటి కలలోని పుష్పములనుండి స్రవించిన మధువులతో (తేనెలతో-ఆసవములతో) మహేశ్వరిని తృప్తిపరచుచుందురు-65, మొత్తము గలిసి యాశక్తులు (360) మూడువందల యువది. ఈవిధముగా నేడు శాలములలో పాలకులైన చక్రదేవతలను నీవడిగితివి గావున వారీ నామములతో గూడ జెప్పితిని. ఇతర శాలముల యుపాదానమును పూరకమును, విస్తారమును దానిలోని శక్తిని గూడ జెప్పెద వినుము-67.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున శ్రీనగరత్రిపురాసప్తకక్షాపాలకదేవతాప్రకాశనకథనమను ముప్పదిరెండవ యధ్యాయము-32.