బ్రహ్మాండ మహా పురాణము
20 - కిరిచక్రరథదేవతాప్రకాశనం
హయగ్రీవ ఉవాచ:-
కిరిచక్రరథేంద్రస్య పంచ పర్వ సమాశ్రితాః।
దేవతాశ్చ శృణు ప్రాజ్ఞ నామ యచ్ఛృణ్వతాం జయః ॥
ప్రథమం పర్వ బింద్వాఖ్యం సంప్రాప్తా దండనాయికా।
సా తత్ర జగదుద్దండకంటకవ్రాతఘస్మరీ॥
నానావిధాభిర్జ్వాలాభిర్నర్తయంతీ జయశ్రీయమ్॥
ఉద్దండపోత్రనిర్ఘాతనిర్భిన్నోద్ధతదానవాః ।
దంష్ట్రాలమృగాంకాంశువిభావనవిభావరీ॥
ప్రావృషేణ్యపయోవాహవ్యూహనీలవపుర్లతా।
కిరీచక్రరథేంద్రస్య సాలంకారాయతే సదా॥
పోత్రిణీ పుత్రితాశేషవిశ్వావర్తకదంబికా।
తస్యైవ రథనాభస్య ద్వతీయం పర్వ సంశ్రితాః।
జృంభినీ మోహినీ చైవ స్తంభినీ తిస్ర ఏవ హీ: ।
ఉత్ఫుల్లదాడిమీప్రఖ్యం సర్వదానవ మర్దనాః॥
ముసలం చ హలం హాలాపాత్రం మణిగణార్పితమ్।
జ్వలన్మాణిక్యవలయైర్భిభ్రాణాః పాణిపల్లవై॥
అతితీక్షకరాలాక్ష్యో జ్వాలాభిర్దిత్య సైనికాన్ ।
దహంత్య ఇవ నిఃశంకం సేవంతే సూకరాననామ్॥
కిరిచక్రరథేంద్రస్య తృతీయం పర్వ సంశ్రితాః।
అంధీన్యాద్యాః పంచ దేవ్యో దేవీయంత్రకృతాస్పదాః ॥
కఠోరేణాట్టహాసేన భిందంత్యో భువనత్రయమ్,।
జ్వాలా ఇవ తు కల్పాగ్నేరంగనావేషమాశ్రితాః ॥
భండాసురస్య సర్వేషాం సైన్యానాం రుధిరప్లుతిమ్.।
లీలిక్షమాణ జిహ్వాభిర్లేలిహానాభిరుజ్జ్వలా:॥
సేవంతే సతతం దండనాథాముద్దందవిక్రమామ్।
కిరిచక్రరథేంద్రస్య చతుర్థం పర్వ సంశ్రితా:॥
బ్రహ్మాద్యాః పంచమివర్జ్యాః అష్టమివర్జితా అపి ।
షడేవ దేవ్యఃషట్చక్రజ్వలజ్జ్వలాకలేవరా॥
మహతా విక్రమౌఘేణ పిబంత్య ఇవ దానవాన్।
ఆజ్ఞయా దండనాధాయాస్తo ప్రదేశముపాసతే ॥
తస్యైవ పర్వణోఽధస్తాత్వరితాః స్థానమిశ్రితాః।
యక్షిణీ శంఖినీ చైవ లాకినీ హాకీనీ తథా॥
శాకినీ డాకినీ చైవ తాసామైక్యస్వరూపిణీ ।
హాకినీ సప్తమిత్యేతాశ్చండదోర్దండవిక్రమాః॥
పిబంత్య ఇవ భూతాని పిబంత్య ఇవ మేదినీమ్।
త్వచం రక్తం తథా మాంసం మేదోఽస్థి చ విరోధినామ్॥
మజ్ఞానమథ శుభ్రం చ పిబంత్యో వికటాననా: ।
నిష్ఠురైః సింహనాదైశ్చ పూరయంత్యో దిశో దశ॥
ధాతునాథా ఇతి ప్రోక్తా అణిమాద్యష్టసిద్ధిదో:।
మోహనే మారణే చైవ స్తంభనే తాడనే తథా॥
భక్షణే దుష్టదైత్యానామామూలం చ నికృంతనే।
పండితాః ఖండితాశేషప్పదో భక్తిశాలిషు॥
ధాతునాథా ఇతి ప్రోక్తా సర్వధాతుషు సంస్థితాః।
సప్తాపి వారిధీనూర్మిమాలాసంచుంబితాంబరాన్॥
క్షణార్థేనైవ నిష్పాతుం నిష్పన్న బహుసాహసాః।
శకటాకారదంతాశ్చ భయంకరవిలోచనాః॥
స్వస్వామినీ ద్రోహకృతాం స్వకీయసమయద్రుహామ్ ।
వైదికద్రోహణాదేవ ద్రోహిణెం వీరవైరిణామ్॥
యజ్ఞ ద్రోహకృతాం దుష్టదైత్యానాం భక్షణే సమా: ।
నిత్యమేవ చ సేవంతే పోత్రిణీం దండనాయికామ్॥
తస్యైవ పర్వణః పార్శ్వే ద్వితీయే దివ్యమందిరే ।
క్రోధినీ స్తంభినీ ఖ్యాతే వర్తతే దేవతే ఉభే॥
చామరే వీజయంత్యౌచ లోలకంకణదోర్లతే।
దేవద్విషాం చమూరక్తహాలాపానమహోద్దతే॥
సదా విఘూర్ణమానాక్ష్యౌ సదా ప్రహసీతాననే।
అథ తస్య రథేంద్రస్య కిరిచక్రాశ్రీతస్య చ॥ పార్శ్వద్వయకృతావాసమాయుధద్వంద్వముత్తమమ్।
హలం చ ముసలం చైవ దేవతారూపమాస్థితమ్॥
స్వకీయముకుటస్థానే స్వకీయాయుధవిగ్రహమ్ ।
ఆబిభ్రాణం జగద్ద్వేషిఘస్మరం విబుధైః స్మృతమ్ ॥
ఏతదాయుధయుగ్మేన లలితా దండనాయికా।
ఖండయిష్యతీ సంగ్రామం విషంగం నామ దానవమ్॥
తస్యైవ పర్వణో దండనాథాయా అగ్రసీమని।
వర్తమానో మహాభీమః సింహో నాదైర్ధ్వనన్నభ॥
దంష్ట్రాకటకటాత్కారబధిరీకృతదిజ్ముఖః ।
చందోచ్చంద ఇతి ఖ్యాతశ్చతుర్హస్తస్త్రిలోచనః॥
శూలఖడ్గ ప్రేతపాశాస్ దధానో దీప్తవిగ్రహః ।
సదా సంసేవతే దేవీం పశ్యన్నేవ హీ పోత్రిణీమ్॥
కిరిచక్రరథేంద్రస్య షష్ఠం పర్వ సమాశ్రితాః ।
వార్తాల్యాద్యా అష్ట దేవ్యో దిక్ష్వష్టాసూపవిశ్రుతాః ॥
అష్టపర్వతనిష్పాతఘోరనిర్ఘాతనిఃస్వనాః ।
అష్టనాగస్ఫురద్భూషా అనష్టబలతేజసః॥
ప్రకృష్ట దోష్ప్రకాండోష్మహుతదానవకోటయః।
సేవంతే లలితాం దేవ్యో దండనాథామహర్నిశమ్॥
తాసామాఖ్యాశ్చ విఖ్యాతాః సమాకర్ణయ కుంభజ।
వార్తాలీ చైవ వారాహీ సా వరాహముఖి పరా॥
అంధినీ రోధినీ చైవ జృంభిణీ చైవ మోహినీ।
స్తంభినీతి రీపుక్షోభస్తంభనోచ్చాటనక్షమాః॥
తాసాం చ పర్వణో వామభాగే సతతసంస్థితిః।
దండనాథోపవాహ్యస్తు కాసరో ధూసరాకృతిః॥
ఆర్ధక్రోశాయతః శృంగద్వితయే క్రోశవిగ్రహాః।
ఖడ్గవన్నిష్టురైర్లో మజాతైః సంవృతవిగ్రహః॥
కాలదండవదుచ్చండబాలకాండ భయంకరః।
నీలాంజనాచలప్రభ్యో వికటోన్నతరుష్టభూః॥
మహానీలగిరి శ్రేష్ఠగరిష్ఠస్కంధముండలః।
ప్రభూతోష్మలనిశ్వాసప్రసరాకంపీతాంబుధీః॥
ఘర్ఘరధ్వనినా కాలమహిషం విహసన్నివ।
వర్తతే ఖురవిక్షిప్తపుష్కలావర్తవారిదః॥
తస్యైవ పర్వణోఽధస్తాచ్చిత్రస్థానకృతాలయాని।
ఇంద్రాదయేఽనేక భేదా దీశామష్టకదేవతాః॥
లలితాయాం కార్యసిద్ధిం విజ్ఞాపయితుమాగతాః।
ఇంద్రశ్చాప్సరసశ్చైవ సచతుషష్టికోటయః॥
సిద్ధ అగ్నిశ్చ సాధ్యాశ్చ విశ్వే దేవాస్తథాపరే।
విశ్వకర్మా మయశ్చైవ మాతరశ్చ బలోన్నతాః॥
రుద్రాశ్చ పరిచారాశ్చ రుద్రాశ్చైవ పిశాచకాః।
క్రందంతి రక్షసాం నాథో రాక్షసా బహవస్తథా॥
మిత్రాశ్చ తత్ర గంధర్వాః సదా గానవిశారదాః।
విశ్వావసుప్రభృతయో విఖ్యాతాస్తత్పురోగమాః॥
తథా భృత్యగణాశ్చాన్యే వరుణ్ వాసవః పరే ।
విద్యాధరాః కిన్నరాశ్చ మారుతేశ్వర ఏవ చ॥
తథా చిత్రరథశ్చైవ రథకోరకకారకాః।
తుంబురుర్నారదో యక్షః సోమో యక్షేశ్వరస్తథా॥
దేవైశ్చ భగవాంస్తత్ర గోవిందః కమలాపతిః।
ఈశానశ్చ జగచ్చక్రభక్షకః శూలభీషణః॥
బ్రహ్మా చైవాశ్వినీపుత్రో (త్రౌ) వైద్యవిద్యావిశారదౌ।
ధన్వంతరిశ్చ భగవానథాన్యే గణనాయకాః॥
కటకాండగలనసంతర్పితమధువ్రతాః।
అనంతో వాసుకిస్తక్షః కర్కోటః పద్మ ఏవ చ॥
మహాపద్మః శంఖపాలో గులికః సుబలస్తథా।
ఏతే నాగేశ్వరాశ్చైవ నాగకోటిభిరావృతాః॥
ఏవంప్రకారా బహవో దేవతాస్తత్ర జాగ్రతి।
పూర్వాదిదిశమారభ్య పరితః కృతమందిరాః॥
తత్రైవ దేవతాశ్చక్రే చక్రాకారా మరుద్దిశః।
ఆశ్రీత్య కిల వర్తంతే తదధిష్ఠాతృదేవతాః॥
జృంభణీ స్తంభినీ చైవ మోహినీ తీస్ర ఏవ చ।
తస్యైవ పర్వణః ప్రాంతే కిరీచక్రస్య భాస్వతః॥
కపాలం చ గదాం బిభ్రదూర్ద్వ కేశో మహావపుః ।
పాతాలతలజంబాలబహులాకారకాలిమా॥
అట్టహాసమహావజ్రదీర్ణబ్రహ్మాండమండలః।
భిందన్ డమరుకధ్వానై రోదసీకందరోదరమ్॥
ఫూత్కారీత్రిపురాయుక్తం ఫణీషాశం కరే వహన్।
క్షేత్రపాలః సదా భాతి సేవమానః కీటీశ్వరీమ్॥ తస్యైవ చ సమీపస్థస్తస్యా వాహనకేసరీ।
యమారుహ్య ప్రవవృతే భండాసురవధైషిణీ॥
ప్రాగుక్తమేవ దేవేశీవాహసింహస్య లక్షణమ్।
తస్యైవ పర్వణోఽధస్తాద్దండనాథాసమత్విషః॥
దండినీసదృశాశేష భూషణాయుధమండితాః।
శమ్యాః క్రోడాననాశ్చంద్రరేఖోత్తంసితకుంతలాః॥
హలం చ ముసలం హస్తే ఘూర్ణయంత్యో ముహుర్ముహుః।
లలితాద్రోహిణాం శ్యామాద్రోహిణాం స్వామినీద్రుహామ్॥
రక్తస్రోతోభిరుత్కూలైః పూరయంతః కపాలకమ్।
నిజభక్తద్రోహకృతా మంత్రమాలావిభూషణాః॥
స్వగోష్టే, సమయాక్షేపకారిణాం ముండమండలైః।
అఖండరక్తవిచ్ఛర్దైర్బిభ్రత్యో వక్షసి స్రజః॥
సహస్రం దేవతాః ప్రోక్తాః సేవమానాః కిటీశ్వరీమ్॥
సహస్రనామాధ్యాయే తు వక్ష్యంతే నాధునా పునః॥
తాసాం నామాని సర్వాసాం దండిన్యాః కుంభసంభవ।
(‘సహస్రనామాధ్యాయే తు వక్ష్యంతే” ఇత్యనేన ప్రస్తుతపారాయణక్రమే వర్తమానః లలితాసహస్రనామాధ్యాయః అస్మివ్నేవ లలితోసాఖ్యానే వర్తతేస్మ-ఇతి గమ్యతే అధునా తదధ్యాయస్య అనుపలబ్ధేః కారణం న జానీమః)
సహస్రనామాధ్యాయే తు వక్ష్యంతే నాధునా పునః॥
తాసాం నామాని సర్వాసాం దండిన్యాః కుంభసంభవ।
అథ తాసాం దేవతానాం కోలాస్యానాం సమీపతః।
వాహనం కృష్ణసారంగో దండిన్యాః సమయే స్థితః॥
క్రోశార్ధార్ధాయతః శృంగే తదర్ధార్ధాయతో ముఖే।
క్రోశప్రమాణపాదశ్చ సదా చోద్ధూతవాలధిః॥
ఉదరే ధవలచ్ఛాయా హుంకారేణ మహీయసా।
హసన్మారుతవాహస్య హరిణస్య పరాక్రమమ్॥
తస్యైవ పర్వణో దేశే వర్తతే వాహనోత్తమమ్।
కీరిచక్రరథేంద్రస్య స్థితస్తత్రైవ పర్వణీ॥
వర్తతే మదిరాసింధుర్దేవతారూపమాస్థితా।
మాణిక్యగిరివచ్ఛోణం హస్తే పిశితపిండకమ్॥
దధానా ఘూర్ణమానాక్షీ హేమాంభోజస్రగావృతా।
మదశక్త్యా సమశ్లిష్టా ధృతరక్తసరోజయా॥
యదాయదా భండదైత్యః సంగ్రామే సంప్రవర్తతే।
యుద్ధస్వేదమనుప్రాప్తాః శక్తయః స్యుః పిపాసితాః॥
తదాతదా సురాసింధురాత్మానం బహుధా క్షిపన్।
రణే భేదం దేవతానామంజసాపాకరిష్యతి॥
తదప్యద్భుతమేవర్షే భవిష్యతి న సంశయః।
తదా శ్రోష్యసి సంగ్రామే కథ్యమానం మయా ముదా॥
తస్యైవ పర్వణోఽధస్తోదష్టదిక్ష్వథ ఏవ హి।
ఉపర్యపీ కృతావాసా హేతువాద్యా దశ స్మృతాః॥
మహాంతో భైరవశ్రేష్ఠాః ఖ్యాతా విపులవిక్రమాః।
ఉద్ధీప్తాయుతతేజోభిర్దివా దీపితభానవః॥
కల్పాంతకాలే దండిన్యా ఆజ్ఞయా విశ్వఘస్మరాః।
అత్యుదగ్రప్రకృతయో రదదష్టౌష్టసంపుటాః॥
త్రిశూలాగ్రవినిర్భన్న మహావారిదమండలాః।
హేతుకస్త్రిపురారిశ్చ తృతీయాశ్చాగ్ని భైరవః॥
యమజిహ్వైకపాదౌ చ తథాకాలకరాలకౌ।
భీమరూపో హాటకేశస్తథైవాచలనామవాస్॥
ఏతే దశైవ విఖ్యాతా దశకోటిభటాన్వితాః।
తస్యైవ కిరిచక్రస్య వర్తంతే పర్వసీమని॥
ఏవం హి దండనాథాయాః కిరీచక్రస్య దేవతాః।
జృంభిణ్యాద్యచలేంద్రాంతాః ప్రోక్తాస్త్రైలోక్యపావనాః॥
తత్రత్యైర్దేవతాబృందైర్బహవసత్ర సంగరే।
దానవా మారయిష్యంతే పాస్యంతే రక్తవృష్టయః॥
ఇత్థం బహువిధత్రాణం పర్వస్థైర్దేవతాగణైః।
కిరిచక్రం దండనేత్ర్యా రథరత్నం చచాల హు॥
చక్రరాజరథో యత్ర తత్ర గేయరథోత్తమః।
యత్ర గేయరథస్తత్ర కిరిచక్రరథోత్తమః॥
ఏతద్రథత్రయం తత్ర త్రైలోక్యమివ జంగమమ్।
శక్తి సేనాసహస్రస్యాంతశ్చచార (చ) తదా శుభమ్॥
మేరుమందరవింధ్యానాం సమవాయ ఇవాభవత్।
మహాఘోషః ప్రవవృతే శక్తీనాం సైన్యమండలే॥
చచాల వసుధా సర్వా తచ్చకరవదారితా॥
లలితా చక్రరాజఖ్యా రథనాథస్య కీర్తితాః।
షట్ సారథయ ఉద్దండపాశగ్రహణకోవిదాః॥
యత్ర గేయరథస్తత్ర కిరిచక్రరథోత్తమమ్।
ఇతి దేవీ ప్రథమతస్తథా త్రిపురభైరవీ॥
సంహారభైరవశ్చాన్యో రక్తయోగినివల్లభః।
సారసః పంచమశ్చైవ చాముండా చ తథా పరాః॥
ఏతాసు దేవతాస్తత్ర రథసారథయః స్మృతాః॥
గేయచక్రరథేంద్రస్య సారథిస్తు హసంతికా॥
కిరిచక్రరథేంద్రస్య స్తంభినీ సారథిః స్మృతా।
దశయోజనమున్నమ్ర లలితారథపుంగవః॥
సప్తయోజనముచ్చ్రాయో గీతిచక్రరథోత్తమః।
షడ్యోజనసమున్నమ్రో కిరిచక్రరథో మునే॥
మహాముక్తాతపత్రం తు దశయోజనవిస్తృతమ్।
వర్తతే లలితేశాన్యా రథ ఏవ న చాన్యతః॥
తదేవ శక్తిసామ్రాజ్యపూచకం పరికీర్తితమ్।
సామాన్యమాతపత్రం తు రథద్వంద్వేఽపి వర్తతే॥
అథ సా లలితేశానీ సర్వశక్తిమహేశ్వరీ।
మహాసామ్రాజ్యపదవీమారూఢా పరమేశ్వరీ॥
చచాల భండదైత్యస్య క్షయసిద్ధ్యభాకాంక్షిణీ ।
శబ్దాయంతే దిశః సర్వా కంపతే చ వసుంధరా॥
క్షుభ్యంతి సర్వభూతాని లలితేశావినిర్గమే।
దేవదుందుభయో నేదుర్నిపేతుః పుష్పవృష్టయః॥
విశ్వావసుప్రభృతయో గంధర్వాః సురగాయకాః।
తుంబురుర్నారదశ్చైవ సాక్షాదేవ సరస్వతీ॥
జయమంగలపద్యాని పఠంతః పటు గీతిభిః।
హర్షసంపల్లవదనాః స్ఫురత్పులకభూషణాః॥
ముహుర్జయజయేత్యేవం స్తువానా లలితేశ్వరీమ్॥
హరేణాఢ్యా మదోన్మత్తాః ప్రసృత్యంతః పదేపదే।
సప్తర్షయో వశిష్టాద్యా బుగ్యజుఃసామరూపిభిః॥
అధర్వరూపైర్మంత్రైశ్చ వర్థయంతో జయశ్రియమ్।
హవిషేవ మహావహ్నిశిఖామత్యంతపావినీమ్॥
ఆశీర్వాదేన మహతా వర్థయామాసురుత్తమాః।
తైః స్తూయమానా లలితా రాజమానా రథోత్తమే॥
భండాసురం వినిర్జేతుముద్దండైః సహ సైనికైః॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే ఉత్తరభాగే లలితోపాఖ్యానే కిరిచక్రరథదేవతాప్రకాశనం నామ వింశోఽధ్యాయః ॥
శ్రీబ్రహ్మాండ మహాపురాణముననుత్తరభాగమున లలితోపాఖ్యానమున కిరిచక్రరథదేవతాప్రకాశనమను నిరువదవద్యాయము.
ఓ ప్రాజ్ఞ! ఆగస్త్యా! కిరిచక్రరథశ్రేష్ఠము యొక్క యైదవ పర్వమునాశ్రయించిన దేవతలను వినుము. వారి నామములను విన్న వారికి జయములభించును-1. దాని మొదటి పర్వము బిందువను పేరుగలది. అక్కడికి దండనాయిక చేరును. ఆమె యచట జగముయొక్క ఉద్దండకంటకసమూహమును నశింపచజేయునది-2. అనేక విధములైన జ్వాలలతో జయశ్రీని వర్తింపజేయుచుండును-3. దండమువలె పొడవైన తన పందిమూతి దెబ్బకు ఉద్ధతదానవులు తుత్తునియలైరి. ఆమె కోరలు చంద్రవంకవలె ప్రకాశించుచున్నవి. దాని వలన రాత్రి తెల్లతెల్లనగుచున్నదీ-4. వర్షాకాల మేఘ సమూహమువలె నల్లనైన మైతీగ (శరీరలత) గలది. ఆమె కిరీ చక్రరథ శ్రేష్టము నెల్లప్పుడు నలంకరించుచుండును. ఆమె వరాహముఖము గలది. విశ్వమును జుట్టియున్న కదంబ వృక్షముల నామె తన పుత్రులనుగా జేసికోన్నది-5. ఆ కీచక్రరథపు చక్రమధ్యమున రెండవ పర్వమునాశ్రయించినవారు - జృంభిని, మోహిని, స్తంభిని - ఈ మువ్వురే. వికసించిన దానిమ్మపూవువలె సెల్లనైనవారు. సర్వరాక్షసులను మర్ధించుపొరు-6. ప్రకాశించుచున్న రత్నములు గల కంకణముల ధరించిన చివురాకువంటి చేతులచేవారు రోకలిని నాగలిని, మణిగణములు పొదిగిన పాన పాత్రమును ధరించినవారు-7. మిక్కిలి వాడియై క్రూరములైన కన్నులు గలవారు, ఆ నేత్ర జ్వాలలచే రాక్షస సైనికులను దహించుచున్నట్లున్న వారై యాసూకరాననను (వరాహముఖిని) నిత్యము సేవించుచున్నారు-8. ఇక కిరిచక్రరథశ్రేష్ఠము యొక్క మూడవ పర్వము నాశ్రయించినవారు. అంధీనీ మొదలగు నైదుగురు స్త్రీ దేవులు వారు దేవీయంత్రమున నివాసమేర్పరచికొనినవారు-9. కఠోరములైన పెద్ద పెద్ద నవ్వులతో ముల్లోకములను భేదించుచున్నారు. కల్పాన్నీ జ్వాలలవలే ఆడ వేషముతో మిశ్రితలు-10. భండాసురుని సర్వ సైన్యముల రక్తస్రావములను నాకగోరిన వారై యట్లునాకుచున్న నాలుకలతో సుజ్జ్వలలైనవారు-11. వీరు ఉద్దండ పరాక్రమముగల దండనాథను ఎల్లప్పుడు సేవింతురు. ఇక, కిరిచక్రరథశ్రేష్ఠము యొక్క నాలుగవ పర్వమునాశ్రయించినవారు-12. పంచమిని అష్టమీ వదిలిన బ్రహ్మాదులు. ఆరుగురే స్త్రీ దేవులు. వారు షట్చక్రములమండుచున్న జ్వాలలుగల శరీరములుగల వారు-13. గొప్ప పరాక్రమ సమూహముతో దానవులను ద్రాగుచున్నట్లున్నవారు. వారు దండనాథ యొక్క యాదేశముచే ఆ ప్రదేశమునుపాసించుచున్నారు-14. ఆ పర్వము యొక్క క్రిందనే, తొందరగా ఆ స్థానమునగలిసినవారు - యక్షిణి, శంఖిని, లాకిని, హాకిని-15. శాకిని, డానికి, వీరందరి మైక్య స్వరూపిణియైన యేడవదియైన హాకిని - అనువీరందరు భయంకరమైన బాహు పరాక్రమము గలవారు-16. వారు భూతములను (ప్రాణులను) త్రాగుచున్నవారివలె భూమినే త్రాగుచున్నవారి వలెను, విరోధులయొక్క చర్మమును రక్తమును, మాంసమును, మేదస్సును, ఎముకలను-17. మజ్జను, శుక్రమును త్రాగుచున్న వారై వికటమైన ముఖములుగలవారు, నిష్ఠురములైన సింహనాదములతో దశదిక్కుల నింపుచున్నవారు-18. వీరు ధాతునాథలు అనీ యనబడిరి. అణీ మాద్యష్టసిద్ధులనీచచ్చువారు. వీరు దుష్టదైత్యుల యొక్క మోహనమున మారణమున, స్తంభనమున, తాడనమున-19. భక్షణమున, ఆమూలముగ కత్తరించుటలోను పండితలు, భక్తితో నొప్పినవారి సమస్తాపదలను ఖండించినవారు-20, ఈ ధాతునాథలనబడినవారు సర్వధాతువులలో నుందురు. అత్యున్నతములైన యలల వరుసలతో నాకాశమునంటీన యేడు సముద్రములను గూడ-21 అర క్షణములో ద్రావుటకుత్పన్నమైన బహు సాహసముగలవారు, శకటాకార దంతములు గలవారు. భయంకరములైన కండ్లు గలవారు. -22. స్వస్వామినికి ద్రోహము చేయువారిని, తమ సమయ (నియమ)మునకు ద్రోహమాచరించువారిని, వైదికులకు ద్రోహమాచరించి ద్రోహులైనవారినీ, వీరులకు వైరులైన వారినీ-23. యజ్ఞములకు ద్రోహమాచరించువారిని - ఇట్టే రాక్షసులను దీనుటలో సమర్థులు. వీరందరు. వరాహముఖియైన దండ నాయికను నిత్యము సేవింతురు-24. ఆ పర్వముయొక్క రెండవ ప్రక్కన దివ్య మందిరమున క్రోధినీ, స్తంభినీ, అనునిద్దరు ప్రసిద్ధ దేవతలుందురు-25. వారు చామరములను వీచుచుందురు. కావున వారి తీవలవంటి చేతులలోని కంకణములు కదులుచుండును. దేవ ద్వేషులైన రాక్షసుల సైన్యము యొక్క రక్తమును మధువును ద్రోవుటచే మహోద్దతలగుదురు-26. ఎల్లప్పుడు త్రిప్పుచున్న కండ్లు గలవారు. ఎల్లప్పుడు పెద్దగా నవ్విన ముఖముగలవారు. ఇక కిరిచక్రాశ్రీతమైన రథ శ్రేష్ఠము యొక్క-27. యిరుపక్కలను నివాసమేర్పరచుకున్నవి రెండుత్తమాయుధములు. అని నాగలి, రోకలియును. ఇవి దేవతా రూపముల వహించినవి-28. తమ కిరీటమున తమ యాయుధరూపములను ధరించినవీ, ఇవి జగమును ద్వేషించు రాక్షసుల జంపునవనీ దేవతలచే తలపబడినవి-29. ఈ రెండాయుధములచే లలితా దండనాయిక యుద్దమున విషంగుడను రాక్షసుని ఖండపంగలదు.-30. ఆ పర్వమునందున్న దండ నాథ యొక్క ముందటి ప్రాంతమునన్నుడై మిక్కిలి భయంకరమైనది సింహము, అది తన నాదములచే నొకాశమును ధ్వనింపజేయుచున్నది-31. దానీ కోరలకటకట ధ్వనులచే దీజ్ముఖములు చెవుడు బారుచున్నది. అది చందోచ్చండమని ప్రసిద్ధి జెందినవాడు, నాలుగు చేతులు మూడుకన్నులు గలవాడు-32, శూలము, ఖడ్గము, ప్రేతము, పాశము - వీనిని నాలుగు చేతులలో ధరించినవాడు, మిక్కిలి ప్రదీప్తమైన యాకారముగలవాడు. ఈతడు వరాహముఖియైన దేవిని జూచుచునే సేవించును-33. ఇక కిరిచక్ర రథ శ్రేష్ఠము యొక్కయావ పర్వమును ఆశ్రయించినవారు వార్తాలి మొదలగువారు ఎనమండుగురు. అష్టదిక్కులలో ప్రసిద్ధలు-34. వారు ఎనిమిది పర్వతములు పడినంతటి ధ్వనులు గలవారు, ఎనిమిది నాగములతో ప్రకాశించిన యలంకారములు గలవారు. నష్టముగాని బలము తేజమును గలవారు-35. గొప్పవై విశాలములైన బాహుదండముల వేడిలో హోమము జేయబడిన కోట్ల కొలది రాక్షసులు గలవారు - ఇట్టి స్త్రీ దేవులు లలితా దండనాథను రాత్రింబవళ్లు సేవింతురు-36. ఓ యగస్త్యా! వారిపేరులు ప్రసిద్ధమైనవి. వినుము. వార్తాలి, వారాహి, ఆమె వరాహ ముఖియైన పర-37. స్తంభినీ - అనువీరు శత్రువులను క్షోభింపజేయుటలోను, స్తంభింపజేయుటలోను, ఉచ్చాటనము చేయించుటలోను సమర్థలు-38. వారు పర్వము యొక్క యెడమ భాగమున నుందురు. దండనాథయధిష్టించు మహిషము దుమ్ము బట్టినయాకారముగలదీ-39. రెండు కొమ్ములందు సగము క్రోశము వెడల్పుగలది. ఒక క్రోశము ఆకారముగలది. ఆ మహిష రోమముల నుండి బుట్టినవారు ఖడ్గములవలె కరీనులై వాడియైనవారు. ఆ మహిషము వీరితో జుట్టబడినది.-40 యమదండమువలె నున్నతమై భయంకరమై తోకయొక్క కాండముతో భయంకరముగా నున్నది. నల్లని కాటుకపర్వతమువలెనున్నది. వికటమై ఉన్నతమైరుష్టములైన భావములకు స్థానమైనదీ-41. మహానీల పర్వతశ్రేష్ఠమువలె గరిష్టమైనమూపురపు ప్రదేశముగలది. దాని మిక్కిలి వేడి నీట్టూర్పుల ప్రసారములచే సముద్రములు కంపించినవి-42. ఘర్షర ధ్వనిచే యముని దున్నపోతును వెక్కిరించుచున్నది. పుష్కలావర్తమను మేఘమును. గిట్టలచే చెల్లాచెదరు చేసినదీ-43. దానీ పర్వము యొక్క క్రిందనే చీవ్రస్థానములందు నీవాసములు ఏర్పరచుకొన్నవారు అనేక భేదములుగల ఇంద్రాదులు ఎనిమిది దిక్కుల దేవతలు-44. వీరు లలిత కార్యసిద్ధిని నివేదించుటకు వచ్చిరి. ఇంద్రుడు అటువది నాలుగు కోట్ల యప్సరసలు -45. సిద్ధాగ్ని, సాధ్యాగ్ని, విశ్వేదేవతలు. విశ్వకర్మయైన మయుడు, బలోన్నతులైన మాతృదేవతలు-46. రుద్రులు, పరిచారులు, రుద్రులు పిశాచకులు, అనేక రాక్షసనాథులు - ఆరచుచున్నారు-47. అచట మిత్రులు, నిత్యము గానవి శారదులైన గంధర్వులు. వారికి ముందుగా బోవు విశ్వావసువు మొదలైనపోరు-48. అట్లే తక్కిన సేవకగణములు, వరుణుడు, వాసవుడు, తక్కినవారు, విద్యాధరులు కిన్నరులు, మారుతేశ్వరుడును-49. అట్లే చిత్రరథుడు, రథకారకకారకులు, తుంబురుడు, నారదుడు, యక్షుడు, సోముడు, యక్షేశ్వరుడు-50. అట్లే దేవతలతో గూడిన భగవంతుడు కమలాపతియునైన గోవిందుడు (విష్ణువు) జగచ్చక్రమునుడినువాడును శూలముతో భయంకరుడునైన ఈశానుడు, బ్రహ్మ వైద్య విశారదులైన అశ్వినీ పుత్రులు, భగవంతుడైన ధన్వంతరియు, అట్లే తక్కిన గణనాయకులును-52. గండ స్థలభాగమున ప్రసరించు మద స్రావములతో తృప్తి చెందింపబడిన తుమ్మెదలుగల నాగరాజులును, అనంతుడు, వాసుకి, తక్షుడు, కర్కోటుడు, పద్ముడు, మహా పద్ముడు, శంఖపాలుడు, గలీకుడు, సువలుడు - వీరు నాగకోటులతో నావరింపబడిన నాగేశ్వరులును-54. ఈ విధములైన బహు దేవతలు అచట మేలుకొనియుందురు. తూర్పు మొదలుకొని చుట్టును నివాస మేర్పరచుకొన్నవారు-55. ఆ చక్రమునందే దేవతలు చక్రాకారముగానున్నారు. ఆ దేవదిక్కుల నాశ్రయించియే వారి యధిష్ఠాతృదేవతలుందురు-56. జృంభిణి, స్తంభిని, మోహిని - అనుమువ్వురేవారు. ప్రకాశించు కిరి చక్రము యొక్క ప్రాంతమున-57. క్షేత్ర పాలుడు వరాహముఖియైన యీశ్వరుని నిత్యము సేవించుచు ప్రకాశించును. ఆతడు కపాలమును గదను ధరించును, ఊర్వ కేశుడు మహాకాయుడు పాతాలతలము నందలి బిరుదవలే నల్లగా నుండును-58. అట్టహాసమను మహావజ్రములతో బ్రహ్మాండమండలమునే చీల్చి వేయును. తన డమరుక ధ్వనులతో ఆకాశ గుహా మధ్యమును పగులగొట్టును. -59. పూత్కారీ త్రిపురాయుక్తమైన నాగ పాశమును చేత ధరించును-60, ఈ విధముగా నుండి క్షేత్రపాలుడు వరాహములీశ్వరిని నిత్యముసేవించుచు బ్రకాశించును-60. ఆతనీ యొక్క సమీపముననే యామె వాహనమైన కేసరి (సీంహము) యున్నది. దానినెక్కి లలిత భండాసురుని వధింపగోరి బయలుదేరినది-61. దేవేశియొక్క సింహవాహన లక్షణము పూర్వమే చెప్పబడినది. ఇక యీ చక్రరథపర్వము యొక్క క్రిందనే వేయి దేవతలు వరాహములీశ్వరిని సేవించువారుగా జెప్పబడిరి. వారీకాంతులు దండనాథకాంతికి సమానములు-62. దండినికి సమానముగా సమస్త భూషణములను ఆయుధములను బాగుగా ధరించినారు. శమింపజేయదగినవారు. వరాహముఖులు, చంద్రరేఖను తలపైనలంకారముగా ధరించినవారు-63. మాటిమాటికి చేతిలో నాగలిని రోకలినీ ట్రిప్పువారు. లలితాద్రోహుల యొక్కయు శ్యామాద్రోహుల యొక్కయు, స్వామినీ ద్రోహుల యొక్కయు-64. పొంగి పొరలు రక్త ధారలచేత కపాలకమును నింపుచున్నవారు, నిజభక్త ద్రోహుల యొక్క ప్రేగుల మాలలను సొమ్ముగా ధరించువారు-65. తమ మాటల సమయము నాక్షేపించువారి తలల మాలలను అఖండముగా రక్తముల గ్రక్కుచుండగా సిదపై ధరించువారు-66-67. ఓ యగస్త్యా దండినీ యొక్కయు వారీ యొక్కయు నామములను సహస్ర నామాధ్యాయమున జెప్పెదను. మరలట జెప్పను-68. (ఈ వాక్యముతో లలితా సహస్రనామాధ్యాయము ఈ యుపాఖ్యానమందేయున్నదని తెలియును. కాని ప్రస్తుత మదియందు లేమికి కారణము పరిశోధింపదగినది) తరువాత, ఆ వరాహముఖీ. దేవతల యొక్క సమీపముగా వాహనమైన కృష్ణ సారంగము (దుప్పి) దండినీ యొక్క యదుపులోనున్నది-69. కొమ్మునందు పావుకోశము పొడవైనదీ, ముఖమునందు అర పావు క్రోశము పొడవైనది. పాదములు కోశము పొడవైనవి. ఎప్పుడును తోకయెత్తుకోనీ యుండునదీ-70. కడుపుపైన తెల్లని ఛాయ కలది. గొప్ప హుంకారము గలది. వాయు వాహనమైన హరిణము (లేడి) యొక్క పరాక్రమమును ఎక్కిరించుచుండును-71. ఆ పర్వము యొక్క ప్రదేశముననే యా వాహన శ్రేష్టమున్నది. కిరిచక్రరథశ్రేష్టము యొక్క ఆ పర్వమునందే - దేవతా రూపము వహించిన మదరాసింధువున్నది-72. ఆమె కెంపు పర్వతమువలె ఎల్లనైన మాంసపిండమును చేత ధరించినది. కన్నుల ద్రిప్పుచున్నది. బంగారు కమలముల మాలను ధరించినది. ఎఱ్ఱని కమలమును ధరించిన మదశక్తిచే బాగుగా కౌగిలించుకొనబడినదీ-74. భండాసురుడు యుద్దమునకు వచ్చినప్పుడెల్ల యుద్ధముచే చెమర్చిన శక్తులు వాని రక్తమును ద్రావుటకు దాహముగలవారగుదురు-75. అపుడు వెంట వెంటనే సురాసింధువు తన ననేక విధముగా జల్లుచు, రణమున దేవతల దుఃఖమును శీఘ్రముగా బోగొట్టును-76. ఓ మునీ! అది కూడ నొక యద్భుతముగా గలదు. యద్దములో నేను చెప్పబోవు దానిని ఆనందముతో వినెదవు-77. ఆ చక్ర రథము యొక్క పర్వముననే క్రిందను మీదను నివాసమేర్పరచుకోన్నవారు పాతుకాదులు పదుగురు చెప్పబడిరీ-78. భైరవ శ్రేష్ఠులు గొప్ప వారుగా ప్రసిద్దులు. విపులమైన పరాక్రమముగలవారు. పైకి మండుచున్న పదివేల తేజములచే పగలు ప్రకాశింపజేసిన కిరణములు (సూర్యులు) గలవారు-79. కల్పాంత కాలమున దండిని యొక్క యాజ్ఞచే విశ్వమును నశింపజేయువారు. మిక్కిలి తీవ్రమైన స్వభావము గలవారు. పండ్లతో కరచి కొన్న పెదవులు గలవారు-80. త్రిశూలాగ్రములచే మహామేఘమండలములను తుత్తునియలు చేయువారు. హేతుకుడు, త్రిపురారి, మూడవవాడు అగ్ని భైరవుడు-81. యమజిహ్వుడు, ఏకపాదుడు, కాలుడు కరాలుడును, భీమరూపుడు హాటకేశుడు, అచలనాముడు-82. ఈ పదుగురు ప్రసిద్ధులు. దశ కోటి భటులతోనున్నవారు. వీరు ఆకిరిచక్రరథము యొక్క పర్వ భాగముననే యుందురు-83. ఈ విధముగా దండనాథ యొక్క కిరిచక్రరథము యొక్క దేవతలు జృంభణి మొదలు అచలేంద్రాంతంలు చెప్పబడిరి. వారు త్రిలోకపావనలు-84. అచటనున్న దేవతో సమూహముల చేత అచటి యుద్ధమున రాక్షసులు జంపబడనున్నారు. రక్తవరములు త్రాగబడబోనున్నవి-85, ఈ విధముగా పర్వస్థ దేవతాగణముచే ననేక రక్షణలు గలిగిన కిరిచక్రమును (కిరీ చక్రరథమును) దండనాయిక నడిపించెను-86. చక్రరాజరథమున్న చోట గేయ చక్రరథముండును. గేయ చక్ర రథమున్న చోట కిరీ చక్రరథ శ్రేష్ఠముండును-87. అచట నీ రథ త్రయము కదులుచున్న మూడు లోకములవలెనున్నది. అపుడు శక్తి సేనా సహస్రము యొక్క యంతస్సులో శుభము చరించెను-88. అది మేరు -మందర - వింధ్య పర్వతముల సమూహమువలెనయ్యెను. శక్తుల యొక్క సైన్యమండలములలో గొప్ప ధ్వని సంభవించెను. ఆ రథ చక్రములచే చీల్చబడినదై భూమి కంపించేను-89. లలితాచక్రరాజమను రథ శ్రేష్ఠమునకు ఉద్దండపాశముల గ్రహించుటలో పండితులు. ఆలుగురు సారథులుగా చెప్పబడిరి-90. గేయ చక్ర రథమున్నచోట కిరీ చక్ర రథ శ్రేష్టముండును. ఈ విధముగా మొదట - దేవి, తరువాత (త్రిపుర భైరవి-91. సంహార భైరవుడు, రక్త యోగీని వల్లభుడు, సారసుడు (ఐదవవాడు) చాముండయు-92. వీరిలో దేవతలు ఆరుగురు రథ సారథులనబడిరి, గేయ చక్ర రథేంద్రమునకు హసంతిక సారథి-93. కిరి చక్ర రథేంద్రమునకు స్తంభిని సారథి. ఓ యగస్త్యా లలిత యొక్క రథ శ్రేష్ఠము పది యోజనముల యెత్తైనది -94. గీతి చక్ర రథ శ్రేష్ఠము ఏడు యోజనములయెత్తైనది. కిరి చక్ర రథ శ్రేష్ఠము ఆణు యోజనముల యెత్తైనది-95. గొప్పనైన ముత్యముల గొడుగు పది యోజనముల విశాలమైనది. లలితేశానీరథము మాత్రమే యచటనున్నది. అదీయే శక్తి సామ్రాజ్యమునకు పరిసూచకము అనబడినది. సామాన్యమైన గొడుగు రెండు రథములకు గూడ గలదు-97. ఇక, ఆ లలితేశ్వరి సర్వశక్తుల మహేశ్వరి, మహా సామ్రాజ్య పదవినధిష్టించిన పరమేశ్వరి-98. భండాసురుని వినాశమును గోరినదై రణమునకు తరలెను. అప్పుడు దిక్కులన్నియు ధ్వనించుచున్నవి. భూమియంతయు కంపించుచున్నది. -99. సమస్త భూతములు క్షోభజెందుచున్నవి. లలితేశానీ దండయాత్రకు బయలుదేరగనే దేవదుందుభులు మ్రోగినవి. పుష్ప వరములు గురిసినవి-100. విశ్వావసు మొదలగు గంధర్వులు, దేషగాయకులైన తుంబురుడు నారదుడును, సాక్షాత్తు సరస్వతీయు-101. సారవంతమైన గీతులతో జయమంగల పద్యములను పఠించుచున్నారు. సంతోషము వికసించిన ముఖములు గలవారై మొలచిన పులకాంకురములే భూషణములుగా గలవారై మాటిమాటికి “జయజయ” అని యాలలితా పరమేశ్వరిని స్తోత్రము జేయుచుండిరీ-102. సంతోషము నిండి మదోన్మత్తలై యడుగడుగన నాట్యముల జేయుచుండిరి. వసిష్ణాది సప్తర్వులు ఋగ్యజు స్సామమంత్రములతోను-103. ఆధర్వణ మంత్రములతోను లలితా విజయ శ్రీని వర్దిల్ల జేయుచుండిరి. వారు హవిస్సుచే పావనియైన మహావహ్నిశీఖను వర్ధిల్ల జేసినట్లే మహాశీర్వాదములతో లలితా పరమేశ్వరిని వర్థిల్ల జేయుచుండిరీ-104. పారిచే స్తుతింపబడుచు, లలితో దేవి రథోత్తమమున విరాజిల్లుచున్నదై-105. భండాసురుని జయించుటకు ఉద్దండ సైనికులతోసహ బయలుదేరినది-106.
ఇది శ్రీబ్రహ్మాండ మహా పురాణమున ఉత్తర భాగమున లలితోపాఖ్యానమున కిరిచక్రరథదేవతాప్రకాశనమను నిరువదియ వయధ్యాయము.
Summary of chapter 132 of the Brahmānda Mahā Purana is as follows:
This section chronicles the intense combat in which seven major demon generals were vanquished by the collective might of the Sakti commanders. It highlights the divine harmony, discipline, and absolute unity among the Sakti forces operating under goddess Lalitā's supreme will. The devoted listener reflects on the power of spiritual unity and devotion, realizing that divine grace effortlessly overcomes even the most complex obstacles.