54 - కపిలాశ్రమస్థాశ్వానయనమ్

జైమిరువాచ :-

క్రోధాగ్నిమేనం విప్రేంద్ర సద్యః సంహర్త మర్హసి

 నోచేదకాలే లోకోనియం సకల స్తేన దహ్యతే

దృష్టస్తే మహిమానేన వ్యాప్తమాసీచ్చరాచరమ్

 క్షమస్వ సంహర క్రోధం నమస్తే విప్రపుంగవ

ఏవం సంస్తూయమానస్తు భగవాన్ కపిలో మునిః

 తూర్ణమేవ క్షయం నిన్యే క్రోధాగ్నిమతిభైరవమ్

 తతః ప్రశాంతమభవజగత్పర్వం చరాచరమ్

 దేవాస్తపస్వినశ్చైవ బభూవుర్విగతజ్వరాః

 ఏతస్మిన్నేవకాలే తు భగవాన్నారదో మునిః

అయోధ్యానగమద్రాజశేవలోకాధ్యదృచ్ఛయా

తమాగతమభిప్రేక్ష్య నారడం సగరస్తదా

అర్ఘ్యపాద్యాదిభిః సమ్యక్పూజయామాస శాస్త్రతః

 పరిగృహ్య చ తత్పూజామాసీనః పరమాసనే

 నారదో రాజశార్దూలమిదం వచన మబ్రవీత్

నారద ఉవాచ :-

హయసంచారణార్ధాయ సంప్రయాతాస్తవాత్మజాః

బ్రహ్మదండహతాప్పర్వే వీనష్టా నృపసత్తమ

 సంరక్ష్యమాణెసైః సర్వైర్షయస్తే యజ్ఞయో నృప

 కేనాష్యలక్షితః క్వాపి నీతో విధివశాబ్దివి

తతో వినష్టం తురగం విచిన్వంతో మహీతలే

 ప్రాలభంత న తే క్వాపి తత్పవృత్తిం చిరాన్నృప

 తతో వనేరధస్తే శ్వం విచేతుం కృతనిశ్చయాః

 సాగరాస్తే సమారభ్య ప్రచబుర్వపధాతలమ్

ఖనంతో వసుధామశ్వం పాతాళే దదృశురృప

 సమీపే తస్య యోగీంద్రం కపిలం చ మహామునిమ్

 తం దృష్ట్వా పాపకర్మాణస్తే సర్వే కాలచోదితాః

 కపిలం కోపయామాసు ఈశ్వహరాయమిత్యలమ్

 తతస్త త్క్రోధసంభూతనేత్రాగ్నేర్ధహతో దిశః

ఇంధనీభూతదేహాస్తే పుత్త్రాః సంక్షయమాగతాః

జైమినీ ఇట్లు చెప్పెను.

 ఓ విప్రేంద్ర ! ఈ కోపాగ్నినీ వెంటనే మీరుపసంహరింప నరులరు. లేనిచో ఈ లోకమంతయు అకాలమున సర్వము దానిచే దహింపం . బడగలదు. మీ మహిమ చూడఁబడినది. అయ్యది చరాచర లోకమంతట వ్యాప్తమైనది. ఓ విప్రశ్రేష్ఠ ! మీకు నమస్కారము. క్షమించు. క్రోధము            నుపసంహరింపుము. ఈ విధముగా భగవంతుఁడయిన కపిలమహర్షి స్తోత్రము చేయబడి, వెంటనే మహర్షి భీకరమయిన తనక్రోధాగ్నిని క్షయింపం జేసెను. అంత, చరాచరమయిన జగత్తంతయును ప్రశాంతి నొందెను. దేవతలు తపస్వినులు భయరహితులయిరి. ఆ సమయముననే భగవానుండయిన నారదమహర్షి దేవలోకము నుండి యదృచ్చయా అయోధ్యానగరమున కరిగెను. నగరమునకు వచ్చిన యా నారదుని సగరుఁడు . చూచెను. శాస్త్ర సమ్మతముగ నతనిని అర్ఘ్యపాద్యాదులతో భక్తితో పూజించెను. నారదులాతని పూజలు స్వీకరించి ఉత్తమాసనమున నాసీనులైరి. రాజశార్దూలుఁడయిన సగరునితో ముని యిట్లు పలికెను.

 నారదుఁడు.

నీ కుమారులు యజ్జీశ్వసంరక్షణమునకు వెళ్లియుండిరి కదా ! ఓ నృపసత్తమ ! పోరందరు బ్రహ్మ దండముచే వినష్టులయిరి. నీ యజ్ఞాశ్వము వారిచే రక్షింపబడుచున్నను, ఎవనిచేతనో యది తీసికొని పోవఁబడినది, ఎక్కడికి పోయెనో కనపడలేదు. వినష్టమయిన తురగము కొఱకు వారు మహీతలమయంతయు వెదకిరీ. ఎంత వెదికినను ఎక్కడను వారు దానీని పొందలేకపోయిరీ, తత్రవృత్తిని గూడ తెలియలేక పోయిరి. అంత వారు భూమీకథఃప్రదేశమున పాతాళమున వెదుక కృత నిశ్చయులయిరి. సాగరులందరు కూడి, వసుధా తల మంతటిని త్రవ్వనారంభించిరి. భూమిని త్రవ్వుచుండ ఓ నృప ! పాతాళములో యజ్ఞాశ్వమును మహామునియు యోగీంద్రుఁడునైన కపిలునీ సమీపమున వారు చూచిరి. పాప కర్ములయిన వారలాతనిని చూచిరి. వారందరు కాలచోదితులై ‘ఇతఁడే అశ్వహర్త’ యని ఆతనిని క్రోధమానసుని చేసిరి. కపిలుని క్రోధ సంభూత నేత్రాగ్నిచే దిక్కులు దహింపఁబడెను. నీ పుత్రులందరు ఆ యగ్నికి ఇంధనీ భూత దేహులయి సంక్షయము పొందిరి.

క్రూరాః పాపసమాచారాః సర్వలోకోపరోధకాః

 యతస్తే తేన రాజేంద్ర న శోకం కర్తుమర్హసి

న త్వం ధైర్యధనో భూత్వా భవితవ్యతయాత్మనః

 నష్టం మృతమతీతం చ నానుశోచంతి పండితాః

 తస్మాత్పౌత్రమిమం జాలమంశుమంతం మహామతీమ్

తురగానయనార్థాయ నియుంక్ష నృపసత్తమ

 ఇత్యుక్త్వా రాజశార్దూలం సదస్యర్విక్సమన్వితమ్

 క్షణేన పశ్యతాం తేషాం నారదోంతర్దధీ మునిః

తచ్ఛ్రుత్వా వచనం తస్య నారదస్య నృపోత్తమః

 దుఃఖశోకపరీతాత్మా దధ్యో చిరముదారధీః

తం ధ్యానయుక్తం సదసీ సమాసీనమవాజ్మఖమ్

 వసిష్ఠః ప్రాహ రాజానం సాంత్వయన్ దేశకాలవిత్

 కిమిదం ధైర్యసారాణామవకాశం భవాదృశామ్

 లభతే హృది చేచ్ఛోక ప్రాప్తం ధీరతయా ఫలమ్

దౌర్మనస్యం శిధిలయన్సర్వం దిష్టవశానుగమ్

 మన్వానోనంతరం కృత్యం కర్తుమర్హస్యసంశయమ్

వసిఫేనైవముక్తస్తు రాజా కార్యార్థతత్త్వవిత్

 ధృతిం సత్వం సమాలంబ్య తథోతీ ప్రత్యభాషత

 అంశుమంతం సమాహూయ పౌత్రంవినయశాలినమ్

బ్రహ్మక్షత్రసభామధ్యే శనైరీదమభాషత

 బ్రహ్మదండహతాస్సర్వే పితరస్తవ పుత్రక

పతితాః పాపకర్మాణే నిరయే శాశ్వతీ సమాః

త్వమేవ సంతతిర్మహ్యం రాజ్యస్యాస్య చ రక్షితా

 త్వదాయత్తమశేషం మే శ్రేయోభి ముత్ర పరత్ర చ

 సత్వం గచ్ఛ మపదేశాల్పొతాళే కపిలోంతికమ్

 తురగానయనార్థాయ యత్నేన మహఠాన్వితః

 తం ప్రార్థయిత్వా వీధివత్రసాద్య చ విశేషతః

ఆదాయ తురగం వత్స ! శ్రీఘమాగంతుమర్హసి

జైమిని రువాచ :-

 ఏవముక్తాంశు మాంస్తేన ప్రణమ్య పితరం పితుః

 తథెత్యుక్త్వా మహాబుద్ధిః ప్రయయౌ కపిలాంతకమ్

వారందరు క్రూరులు; పాపసమాచారులు; సర్వలోకోపద్రవకారకులు. అందుచే, వారల కొఱకై ఓ రాజేంద్ర ! నీవు శోకింపతగవు. ధైర్య ధనుడవు కమ్ము, ఈ కార్యములన్నియు నీకనివార్యములుగా జరుగవలసినవే, పండితులైన వారు నష్టమయిన దానికి, చనిపోయినదానికి, అతీతమయిన దానికి విచారింపరు. అందుచే, ఓ రాజా ! నీ పౌత్రుఁడు బాలుఁడు నయిన అంశుమంతుని తురగమును తీసికొని వచ్చుటకు నియోగించుము. ఆతఁడు..మహామతి, అనీ సగరునీతో చెప్పి, నారదుఁడు సదస్సులు ఋత్విక్కులు సమన్వితులై, అందరు చూచు చుండగనే క్షణ కాలములో అంతర్జానుఁడయ్యెను. నృపోత్తముఁడు నారదుని వచనములు విని, దుఃఖ శోకపరీతాత్ముఁడయ్యెను. చిరకాలము రాజు ఆలోచనో నిమగ్నుడై యుండెను. ధ్యాన యుక్తుడై, సభలో అధోముఖుఁడై యున్న రాజును చూచి దేశకాల వీదుఁడైన వసిష్ఠుఁడిట్లనెను. “ఇదేమి? ధైర్య సారులయిన నీవంటి వారి హృదయములో శోకము అవకాశము: కల్పించుకొనినచో ధీరత్వము యొక్క ఫలమేమి? మనో దౌర్బల్యమును శిధిలము చేయుము. భగవద్వశానుగమయి సర్వము సంభవించును. అని యూహించుము. అంత అనంతరకృత్యమును నీవు. సంశయ రహితముగా నొనర్ప నరుఁడవు”. వసిష్ఠునిచే నీట్లు చెప్పఁబడి కార్యార్థతత్వవిదుడయిన రాజు, ధృతిని సత్వమును నవలంబించి “మీరా దేశించినట్లే' యని సమాధాన మొసంగెను. పౌత్రుఁడు, వినయశాలియునైన అంశుమంతుని పిలిపించి, రాజు, బ్రహ్మ, క్షత్ర సభామధ్యమున మృదువుగా నీట్లనెను”. ఓ వత్స ! నీతండ్రులందరు, బ్రహ్మ దండముచే హతులయిరి పాపకర్మాణులయిన వారు శాశ్వతీః సమాః (చిరకాలము) నరకమునఁబడిరి. నీవే నాకు సర్వసంతితివి; నో రాజ్య రక్షకుఁడవు నీవే. నా సర్వ శ్రేయస్సు ఇహమునందు పరత్ర పుణ్యము నీ స్వాధీనమై యున్నది. అందుచే, నా ఆదేశమునూని పాతాళమున కపిలునీ దగ్గర కరుగుము. ఎందులకన, అత్యంత ప్రయత్న మాచరించి యజ్ఞ తురగమును తోడి తెచ్చుటకు శాస్త్ర ధర్మానుగుణముగ ఆతనిని ప్రార్థించుము, వత్స ! తురగమును వెంటనే తీసికొని రమ్ము. నీవు వెంటనే తిరిగి రావలయును సుమా !

 జైమిని ఇట్లనెను :

ఈ విధముగా చెప్పుఁబడి అంశుమంతుఁడు తాతగారైన సాగరునకు నమస్కరించి, ‘అట్లే చేయుదునని మహాబుద్ధిమంతుఁడు కపిలాంతి కమునకు బయలు వెడలెను.

తముపాగమ్య విధివన్నమస్కృత్య యథామతి

ప్రశ్రయావనతో భూత్వా శనైరిదము వాచ హ

 ప్రసీద విప్రశార్దూల త్వామహం శరణం గతః

కోపం చ సంహర క్షిప్రం లోకప్రక్షయకారకమ్

 త్వయి కృద్దే జగత్సర్వం ప్రణాశముపహాస్యతీ

ప్రశాంతిముపయాహ్యాశు లోకాస్సంతు గతవ్యధాః

 ప్రసన్నోస్మాన్మహాభాగ పశ్య సౌమ్యేన చక్షుషా

 యే త్వత్రోధాగ్నినిర్దగ్ధస్తత్సంతతిమవేహి మామ్

 నామ్నాంశుమంతం నప్తారం సగరస్య మహీపతేః

 సోహం తస్య నియోగేన త్వత్రసాదాభీకాంక్షయా

 ప్రాప్తో దాస్యచేద్రహ్మంసురగానయనాయ చ

 జైమిని రువాచ :

ఇతి తద్వచనం శ్రుత్వా యోగీంద్రప్రవరో మునిః

  అంశుమంతం సమాలోక్య ప్రసన్న ఇదమబ్రవీత్

 స్వాగతం భవతో వత్స దిష్ట్యా చ త్వమీహాగతః

 గచ్ఛ శీఘం హయశ్చాయం నీయతాం సగరాంతికమ్

అధిక్షిప్తోస్య యజ్ఞోపి ప్రాగతః సంప్రవర్తతామ్

వ్రియతాం చ వర్మత్త స్వయా యస్తే మనోగతః

 దాస్యే సుదుర్లభమపి (తం) త్వద్భక్తిపరితోషితః

 ఏషాం తు సంప్రబోశం హి గత్వా వద పితామహమ్

 పాపానాం మరణం త్వేషాం న చ శోభితుమర్హసి

 తతః ప్రణమ్య యోగీంద్రమంశుమానిదమబ్రవీత్

వరం దదాసి చేన్నహ్యం వరదే త్వాం మహామునే

 వరమరామి చేత్వతః ప్రసన్నో దాతుమర్హసి

త్వద్రోషపావకఫష్టాః పితరో యే మమాభిలాః

 సంప్రయాస్యంతి తే బ్రహ్మన్నిరయం శాశ్వతః సమాః

 బ్రహ్మదండహతానాం తు న హి పిండాదికక్రియాః

 పిండోదకవిహీనానామిహ లోకే మహామునే !

 విద్యతే పితృసాలోక్యం న ఖలు శ్రుతిచోదితమ్

 అక్షయః స్వర్గవాసోస్తు తేషాం తు త్వత్రసాదతః

 వరేణానేన భగవన్ కృతకృత్యో భవామ్యహమ్

కపిలుని చేరెను. విధివత్తుగా నమస్కరించెను. వినయవంతుఁడై ఆతనితో నిట్లు పలికెను. “ఓ ఏప్రశార్దూల ! ప్రసన్నుఁడవు కమ్ము! నిన్ను నేను శరణు పొందితిని ! లోక వినాశన కారకమయిన నీ కోపమును వెంటనే ఉపసంహరింపుము. నీవు కోపగించిన, జగత్సర్వము ప్రణాశనము నొందగలదు. వెంటనే ప్రశాంతిని పొందుము. లోకములు బాధా విముక్తములగును. ప్రసన్నుఁడపై ఓ మహాభాగ ! మమ్ము సౌమ్య చక్షువులతో తిలకించుము. త్వత్రోధాగ్నిచే నిర్దగ్ధమయినవారి సంతతిగా (కుమారునిగా) నన్నెఱుంగుము. నాపేరు అంశుమంతుఁడు, సగరమహీపతి యొక్క మనుమఁడను. నేను, మాతాతయైన సగరుని నిదేశమున భవత్పదాకాంక్షినయి వచ్చితిని. ఓ బ్రహ్మర్షి ! తురంగమును నీవిచ్చిన తీసికొని పోవుటకు వచ్చితినీ.

 జైమిని ఇట్లనెను :

అంశుమంతుని వాక్కులకు యోగీంద్ర ప్రవరుఁడు మునియునైన కపిలుడు వీని, అంశుమంతుని సమాలోకించి, ప్రసన్న హృదయముతో నీట్లనెను. “ఓ వత్స ! నీకు స్వాగతము. అదృష్టవశమున నీవిచ్చటకు వచ్చితివి. ఇచ్చటి నుండి వెంటనే వెడలుము, అశ్వమును సగరాంతికమునకు తీసికొని పొమ్ము. మధ్య ఆగిపోయిన యీ యజ్ఞము చక్కగా ప్రవర్తింపఁబడుగాక. నీవు నీ మనోగతమయిన పరమును కోరుకొందువు గాక. నీ భక్తిచే పరితుపుఁడను. సుదుర్లభమయిన వర మొసంగెదను నీవు వెళ్లి ఏరియొక్క వినాశనమును గూర్చి తాతకు చెప్పుము, పాపులైన పోరియొక్క మరణమును గూర్చి నీవు విచారింపతగదు." అనిన అంత అంశుమంతుఁడు యోగీంద్రునకు నమస్కరించి యిట్లనెను. “ఓ మహాముని! నీవు నాకు వరమీయదలంచినచో నిన్ను వరము కోరుచుంటిని. నేను నీచే వరమీయఁబడుటకు అరుఁడైనచో ప్రసన్నుడవై నీవీయ అరుండవు. నీయొక్క క్రోధాగ్నిచే దగ్గులయిన నా పితరులు నరకమునకు పోవుదురు. అందు శాశ్వతముగా బహువత్సరములుందురు. బ్రహ్మ దండముచే శపులై హతులయినవారికి పిండాదిక క్రియలు లేవు. పిండోదకములు లేక మహామునీ ! ఇహలోకమున పితృ సాలోక్యము లేదు. ఇది శ్రుతి కథతము. త్వత్పసాదముచే వారలకు అక్షయ స్వర్గలోకములగుగాక, ఈ వరముచే నేను కృతకృత్యఁడనగుదును.

తత్ప్రసీద త్వమేవైషాం స్వర్గతేర్వద కారణమ్

యేనోద్ధారణమేతేషాం వహ్నేః కోపస్య వైభవేత్

 తతస్తమాహ యోగీంద్రః సుప్రసన్నేన చేతసా

 నీరయోద్దారణం తేషాం త్వయా వత్స న శక్యతే

 తైశ్చాపి నరకే తావద్వస్తవ్యం పాపకర్మభిః

 కాలః ప్రతీక్ష్యతాం తావద్యావతాత్వత్పాత్రసంభవః

 కొలాంతే భవితా వత్స పౌత్రస్తవ మహామతిః

 రాజ్ భగీరథో నామ సర్వధర్మార్థ తత్త్వవిత్

 స తు యత్నేన మహతా పితృగౌరవయంత్రితః

ఆనేష్యతి దివో గంగాం తపస్తపా మహధ్రువమ్

 తదంభసా పావీతేషు తేషాం గాత్రాస్థిభస్మసు

ప్రాప్నువంతి గతీం స్వర్గో భవతః పితరోఖిలాః

 తథేతి తస్యా మాహాత్మ్యం గంగాయా నృపనందన

 భాగీరీథీలి లోకేష్ఠినా విఖ్యాతిముపైష్యతి

 యతోయవైవితేష్వస్థిభస్మలోమనభేష్వపి

నీరయాదపి సంయాతి దేహీ స్వర్లోకమక్షయమ్

 తస్మాత్వం గచ్ఛ భద్రం తేన శోకం కర్తుమర్హసి

 పితామహాయ చైవైనమశ్వం సంప్రతిపాదయ

 జైమినీ రువాచ :-

తతః ప్రణమ్య తం భక్త్యా తథేర్యుక్త్వా మహామతిః

యయౌ తేనాభ్యనుజ్ఞాతః సాకేతనగరం ప్రతి

సగరం స సమాసాద్య తం ప్రణమ్య యథాక్రమమ్

న్యవేదయచ్చ వృత్తాంతం మునేస్తేషాం తథాత్మనః

 ప్రదదౌ తురగం చాపి సమానీతం ప్రయత్నతః

అతః పరమనుష్ఠేయమబ్రవీతిం మయేతి చ

 ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే  కపిలాశ్రమస్థాశ్వానయనం నామ చతుష్పంచాశత్తమోభిధ్యాయః

అందుచే వారి యెడ ప్రసన్నుఁడవుకమ్ము. వారికి స్వర్గము కలుగుటకు కారణము వచింపుము. భవదీయమైన కోపము యొక్క వహ్ని నుండి వారల కుద్దరణము ఎట్లు కలుగునో వచింపుము. అంత సుప్రసన్నమయిన మనస్సుతో ఆతనీతో యోగీశ్వరుఁడయిన కపిలుఁడిట్లనెను. ఓ వత్స ! నరకము నుండి వారిని ఉద్దరించుట నీకు శక్యము కాదు. పాపకర్మలచే వారు నరకమున వసింపవలసి యున్నది. నీకు మను మండుదయించు వరకు కాలమును ప్రతీక్ష చేయుము. ఆ. మనుషుఁడు మహామత్ భగీరథుఁడు, సర్వధర్మార్థతత్త్వవేత్త. ఆతఁడు పితరుల యందలి యత్యధిక గౌరవముచే యంత్రితుఁడయి అత్యద్భుతమయిన తపస్సాచరించి గంగానదిని తీసికొనివచ్చును. ఆ గంగానదీ నీరము వారి గాత్రములందు ఎముకలయందు, భస్మమందు ప్రవహించి (ప్లావితమై) నీ పితరులందరు స్వర్గగతిని పొందుదురు. ఓ నృపనందన, గంగానది యొక్క మాహాత్యము ‘భాగీరథి’ అనీ లోకమున విఖ్యాతినందును. ఆ గంగాతోయస్లావితమయిన అస్థిభస్మలోమనఖములు నరకము నుండి దేహినీ అక్షయమయిన స్వర్లోకము నొందించును. అందుచే నీవు వెళ్లుము. నీకు భద్రమగు గాక. విచారింపవలసినది. లేదు. నీవు వెళ్లి నీ పితామహునకీ అశ్వమును సమర్పింపుము. అనెను.

జైమినీ ఇట్లనెను :

 అతనికి నమస్కరించి “తథేతి” “అట్లే” యని పలికి, మహామతి అంశుమంతుఁడామహర్షిచే నభ్యనుజ్ఞాతుఁడై సాకేతనగరమునకేగెను. తాతయైన సగరుని చేరెను. ఆతనికి నమస్కరించి జరిగిన దంతయు యథాక్రమముగా మునివృత్తాంతమును నివేదించెను. ప్రయత్న పూర్వకముగా తీసికొనివచ్చిన తురగము నాతనికి సమర్పించెను. ఇంక చేయవలసినదేమి. యని యడిగెను. .

ఇది వాయుప్రోక్త మహాబ్రహ్మాండపురాణమున మధ్యమభాగమున తృతీయ ఉపోద్ఘాతపాదమున కపిలాశ్రమస్థాశ్వానయనమను ఏబది నాలుగవ అధ్యాయము.