బ్రహ్మాండ మహా పురాణము
51 - సగరచరిత్రము -అసమంజసుని త్యాగము
సగర ఉవాచ :-
కుశలం మమ సర్వత్ర మహర్షే నాత్ర సంశయః ।
యస్య మే త్వమనుధ్యాతా శమం భార్గవసత్తమః ॥
యస్తథా శిక్షితః పూర్వమస్త్రే శస్త్రే చ సాంప్రతమ్ ।
సోహం కథమశక్తః స్యామ్ సకబారివినిగ్రహే ॥
త్వం మే గురుః సుహృద్దేవం బంధుర్మిత్రం చ కేవలమ్ ।
న హ్యన్యమభిజానామి త్వామృతే పితరం చ మే ॥
త్వయోపదిష్టనాస్తేణ సకలా భూభ్ళతో మయా ।
విజితా యదనుస్మృత్యా శక్తిః సా తపసస్తవ ॥
తపసా త్వం జగత్సర్వం పునాసి పరిపాసి చ ।
స్రష్టుం సంహర్తుమపి చ శక్నోష్యేవ న సంశయః ॥
మహాననన్యసామాన్యప్రభావస్తపసశ్చ తే ।
ఇహ తస్యైకదేశోపి దృశ్యతే విస్మయప్రదః ॥
పశ్య సింహాసనే బాల్యాదుపేత్య మృగపోతకః ।
పిబత్యంభః శనైరహ్మన్నిళంకం తే తపోవనే ॥
థయత్యత్రాతివిస్రంభాన్ కృపి హరీడీ స్తనమ్ ।
కరోతి మృగశృంగాగ్రే గండకండూయసం రురుః ॥
నవప్రసూతాం హరిణీం హత్వా వృత్యై వనాంతరే ।
వ్యాప్తీ త్వత్తపసావాసే సైవ పుష్ణాతి తచ్ఛిశూన్ ॥
గజం ద్రుతమనుద్రుత్య సింహో యస్మాదిదం వనమ్ ।
ప్రవిష్టానుసరంతా త్వద్భయాదేకత తిష్ఠతః ॥
నకులస్వాఖుమార్జారమయూరశశపన్నగాః ।
వృకసూకరశార్దూలశరభరిక్షప్లవంగమాః ॥
సృగాలా గవయా గావో హరీణా మహిషాస్తథా ।
వనేత్ర సహజం వైరం హిత్వా మైత్రీముపాగతాః ॥
ఏవంవిధా తపశ్శక్తిర్లోకవిస్మయదాయినీ ।
న క్వాపి దృశ్యతే బ్రహ్మంస్వామృతే భువి దుర్లభా ॥
అహం తు త్వత్రసాదేన వీజిత్య వసుధామిమామ్ ।
రిపులిస్సహ వీపరే స్వారాజ్యం సముపాగతః ॥
వశ్యామాత్యస్త్రీవర్గేపీ తథా యోగ్యకృతాదరః ।
త్వయోపరిష్టమార్గేణ సమ్యగ్రాజ్యమపాలయమ్ ॥
సగరుఁడిట్లనియెను :
ఓ మహర్షి ! సర్వత్ర నాకు కుశలము. ఇందు సందేహము లేదు. ఓ భార్గవ సత్తమ ! మియనుధ్యానమే నాకు శాంతి. పూర్వము నీచే అస్త్రముల యందు శస్త్రములయందు సుశిక్షితుఁడనయిన నేను ఇప్పుడు సర్వశత్రు నీగ్రహము నందేట్లు అశక్తియుతుఁడనగుదును? నీవు నాకు గురుఁడవు; స్నేహితుఁడవు, బంధుఁడవు, మిత్రుఁడవే కావు నీన్ను కాక వేడొకని తండ్రినీగా నే నెఱుంగను. (3) నీవుపదేశించిన అస్త్రముచే, సకల రాజన్యులు నాచే జయింపఁబడిరి. అయ్యది మీయొక్క తపః ఫలము. దాని ననుస్మరించుచు సర్వశత్రువులు నాచే జయింపఁబడిరి. నీ తపస్సుచే, సర్వజగత్తును పవిత్రీకరించెదవు; రక్షించేదవు. ప్రపంచమునంతటిని సృష్టించుటకు సంహరించుటకు నీవు సమర్థుఁడవు. సంశయము లేదు. నీ తపస్సు గొప్పది. అనన్య సామాన్యమైనది. అందొక యేక దేశమిచ్చట కనుపించుచున్నది. అదియు విస్మయప్రదము. (6) ఓ బ్రహ్మర్షి! చిన్నతనము నుండి యీ లేడిపిల్ల సింహ. సమీపమున నిశ్శంకముగా నీతపోవనమున చూడుము నీరుత్రాగుచున్నది! అంతియేకాదు. అల్ప సత్త్వము కలిగినదయినను హరిణము. విశ్వాసముతో తన పిల్లకు పాలిచ్చుచున్నది. గురువు(ఒకవిధమైనజింక) మృగముయొక్క కొమ్ము యొక్క చీవరభాగమును రాసికొని తనదురదను తీర్చు కొనుచున్నది. వేటికవనమునందు స్వజీవిత వృత్తికి వ్యాఘ్రము నవప్రసూతమయిన హరీణమును చంపి, అవ్యాఘ్రమే నీతపోవనములో ఆలేడిపిల్లలను పోషించు చున్నది. నీతపఃప్రభావమున సింహముచేటిక వనములో ఏనుగునుతరుముచు వచ్చినది. నీవనమునందుదానిననుసరంచీప్రవేశీంచయు నీ భయమువలన ఒకచోనదీనీలంబిడిపోయినది. (10)ముంగీసలు,ఎలుకలు, పిల్లులు, మయూరములు, శుకములు, చెవులపిల్లులు)పాములు, తోడేళ్లు, ఎలుగులు, అడవిపందులు, శార్దూలములు, శరభములు, వ్యాఘములు, కోతులు, నక్కలు, గవయమృగములు, ఆవులు, హరిణములు, దున్నలు-మున్నగునవి యీ వనమునసహజవైరమును విడిచి. స్నేహమును పొందియున్నవి.(12)ఈవిధమయిన మీతపళ్ళకీ లోకవిస్మయకారిణి. ఇట్టిది మీవనమునందుతక్క వేటికచో కానరాదు. ఇట్టిదిభూమియందెక్కడనైనను దుర్లభమే.భవత్రసాదముచే నేనుఈభూమినంతటినీ జయించి, శత్రువులతో సహా స్వరాజ్యమును పొందితిని. అమాత్యులందరు నా స్వాధీనములో నుండిరి. త్రివర్గములయెడవలసిన జారూకత వహించితిని. మీరుపదేశించిన మార్గమున రాజ్యమును సక్రమముగా పాలించితిని.
ఏవం ప్రవర్తమానస్య మమ రాజ్యేవతిష్ఠతః ।
భవద్దిదృక్షా సంజాతా సాపేక్షా భృగుపుంగవ ॥
కింత్వద్య మయి పర్యాప్తమనపత్యతయైవ మే ।
పితృపిండప్రదానేన సహ సంరక్షణం భువః ॥
తదిదం దుఃఖమత్యర్థమనివార్యం మనోగతమ్ ।
నాన్యోపహర్తా లోకేఖ.స్మిన్ మమేతి త్వాముపాగతః ॥
ఇత్యుక్తః సగరేణాథ స్థిత్వా సోంతర్శనాః క్షణమ్ ।
ఉవాచ భగవానోర్వః సనిదేశమిదం వచః ॥
నియమ్య సహ భార్యాభ్యాం కించిత్కాలమహావస ।
అవాప్స్యతి తతో భీష్టం భవాన్నాత్ర విచారణా ॥
స తత్రావసత్రీతః తచ్ఛుశ్రూషాపరాయణః ।
పత్నీభ్యాం సహ ధర్మాత్మా భక్తియుక్తశ్చిరం తదా ॥
రాజపత్యా చ తే తస్య సర్వకాలమతంద్రితే ।
మునేరతనుతాం ప్రీతీం వినయాచారభక్తిభిః ॥
భక్త్యా శుశ్రూషయా చైవ తయోస్తుషో మహామునిః ।
రాజపత్స్యే సమాహూయ ఇదం వచనమబ్రవీత్ ॥
భవత్యా వరమస్మతో వియతాం కామమీప్సితమ్ ।
దాస్యామి తం న సందేహో యద్యది స్యాత్సుదుర్లభమ్ ॥
తతః ప్రణమ్య శిరసా లేఖ పుణె తం మహామునిమ్ ।
ఊచతుర్భగవాన్ పుత్రాన్ కామయావతి సాదరమ్ ॥
తతస్తే భగవానాహ భవతీభ్యాం మయా పునః ।
రాజశ్చ ప్రియకామేన మరో దత్తీయమీప్సితః ॥
పుత్రవత్యా మహాభాగే భవత్యా మత్రసాదతః ।
భవేతాం ధ్రువమన్యచ్చ శ్రూయతాం వచనం మమ ॥
పుత్రో భవిష్యత్యేకస్యామేకః సోనతీధార్మికః ।
తథాపి తస్య కల్పాంతం సంభూశ్చ భవిష్యతి ॥
షష్టిః పుత్ర సహస్రాణామపరస్యాం చ జాయతే ।
అకృతార్థాశ్చ తే సర్వే విసంక్ష్యంత్యచిందివ ॥
ఏవం విధ గుణేపేతౌ వరౌదత్తౌ మయా యువామ్ ।
అభీప్సితం తు యద్యస్యాః స్వేచ్ఛయా తత్ప్రకీర్త్యతామ్ ॥
ఇట్లు ప్రవర్తించుచు ఓ భృగుపుంగవ, రాజ్యమునందుండగా మిమ్ము దర్శింపవలెననుఅపేక్షతో కూడిన కోరిక కలిగినది. (16) సంతానము లేని కారణమున పితృపిండ ప్రదానముతో గూడ ఈ రాజ్య సంరక్షణము నాకొక్కనికే పర్యాప్తమైనదా? (నాతో నాగిపోవునా?). పిల్లలు లేనందున నయ్యదట్లగునా? ఇయ్యది అనివార్యమై సోమనోగతమయిన అత్యంతమైన దుఃఖము, నాకీలోకమున మీరుకాక వేడొక యుపకారవరుఁడు లేం డనీ యెఱింగి మీమ్ము చేరితిని. (18) సగరుఁడిట్లు చెప్పు, ఒక్క క్షణము భగవంతుఁడయిన ఔర్వమహర్షి అంతర్మనస్క్యుడై యుండి విదేశ పూర్వకముగా నీట్లు పలికెను. “నీ ఇరువురు భార్యలతో నియమబద్ధుఁడవై కొంతకాలమీ తపోవనమున నుండుము. నీవు నీయభీష్టమును పొందగలవు. ఇంక నీకా విషయమును విచారింపపనిలేదు. ఆ రోజు సంప్రీతుండై యందు- ఋషి శుశ్రూషా పరాయణుడై యుండెను. భక్తి యుక్తుఁడై పత్నీ ద్వయముతో అందు చిరముండెను. (21) ఆ రాజపత్నులును సర్వవేళలయందు శ్రద్ధాయుతులై అతంద్రలై సేవించిరి. వినయాచార భక్తులచే మునికి ప్రీతిని కలిగించిరి. మహాముని వారి భక్తికి శుశ్రూషకు వారీయందు సంతుష్ఠుఁడయ్యెను. రాజపత్నులను పిలిచి వారితో నీట్లనెను. (23) ఓ పూజ్యరాజపత్నులారా ! మీరు మీయిష్టమయిన వరమును మావలన కోరుడు. మీకదీ యొసంగెదను, సందేహములేదు. అదీ దుర్లభమైన నొసంగెదను”. అనేను ఆ మునీకి వారిరువురు శిరసా నమస్కరించి “మేము పుత్ర సంతతిని కోరుకొనుచున్నాము” అనీది.మరల మహర్షి వారలతో “మీ యిరువురకు, మహారాజునకు, ప్రియమాచరింపఁగోరి మీరు కోరిన వరమొసంగితిని. పూజ్యురాండ్రైన మీయిర్వురు మత్రసాదమున పుత్రవతులగుదురు. నిశ్చయ మనస్సుతో నా పలుకులాలకింపుఁడు. మీలో నొకతెకు ఒకే కుమారుఁడు కలుగును. అతఁడు అనతిధార్మికుఁడు. అయినను నతఁడు కల్పాంతము వరకు జీవించియుండును. ఇక రెండవయామె అరువదివేల పుత్త్రులంగనును. అకృతార్థులై యచిర కాలములో వారందరు నశించెదరు. ఇట్టి లక్షణోపేతములయిన వరములు మీ కొసంగితిని. మీలో ఎవ్వరేది కోరుదురో మీయంతట మీరే స్వేచ్ఛగా చెప్పుడు. (30) అనెను.
ఏవముక్తే తు మునీనా వైదర్భ్యాన్వయవర్ధనమ్ ।
వరయామాస తనయం పుత్త్రానన్యాంస్తథా పరా ॥
ఇతి దత్త్వా వరం రాజ్ఞే సగరాయ మహామునికి ।
సభాధ్యమనుమాన్యైనం విషసర్ణ పురీం ప్రతి ॥
మునినా సమనుజ్ఞాతః కృతకృత్యో మహీపతిః ।
రథమారుహ్య వేగేన సప్రియః ప్రయణా పురీమ్ ॥
స ప్రవిశ్య పురీం రమ్యాం హృష్టపుష్టజనావృతామ్ ।
అనందితః పౌరణనై రేమే పరమయా ముదా ॥
ఏతస్మిన్నేవ కాలే తు రాజపత్యాముఖే నృప ।
రాజే ప్రావోచతాం గర్భం ముదా పరమయా యుతే ॥
వవృదే చ తయోర్గర్భః శుక్లపక్షే యథోడురాట్ ।
సహ సంతోషసంపత్త్యా పిత్రోః పౌరజనస్య చ ॥
సంపూర్ణే తు తతః కాలే ముహూర్తే కేనీ శుభా ।
అసూయగ్నిగర్భాభం కుమారమమతద్యుతిమ్ ॥
ఊతకర్మాదికం తస్య కృత్వా చైవ యథావిధి ।
అసమంజస ఇత్యేవ నామ తస్యాకరోనృపః ॥
సుమతీశ్చాపి తత్కాలే గర్భాలాబుమసూయత ।
సంప్రసూతం తం త్యక్తుం దృష్ట్వా రాజా కరోన్మనః ॥
తడ్జ్ఞాత్వా భగవానోర్వః తత్రాగచ్ఛద్యదృచ్ఛయా ।
సమ్యక్ సంభావితో రాజా తమువాచ త్వరాన్వితః ॥
గర్భాలాబురయం రాజన్న వ్యక్తుం భవతార్షతి ।
పుత్రాణాం షష్టిసాహసబీజభూతో యతస్తవ ॥
తస్మాత్తత్సకలీకృత్య ఘృతకుంభేషు యత్నతః ।
నీక్షిష్య సపిధానేషు రక్షణీయం పృథక్ పృథక్ ॥
సమ్యగేవం కృతే రాజన్ భవతో మత్రసాదతః ।
యథోక్తసంఖ్యా పుత్రాణాం భవిష్యతి న సంశయః ॥
కాలే పూర్ణే తతః కుంభాన్ఫీత్వా నీరాం తి తే పృథక్ ।
ఏవం తే షష్టిసాహస్రం పుత్రాణాం జాయితే నృప ॥
ఇత్యుక్త్వా భగవానౌర్వః తత్రైవాంతరధాద్విభుః ।
రాజా చ తత్తథా చక్రే యధౌర్వేణ సమీరితమ్ ॥
ఇట్లు మునివచింపగా, విదర్భరాజతనయ వంశవర్ధనుఁడయిన కుమారుని కోరెను. ఇక రెండవది మిగిలిన రెండవ వరమును కోరుకొనెను. సగరునకు ఈ విధముగా వరములొసంగి మహాముని, భార్యలతో మహారాజును అనుమతించి స్వనగరమునకు పంపెను. (32) మునిచే సమనుజ్జోతుఁడు, కృతకృత్యుఁడునయిన రాజు రథమును వెంటనే ఆరోహించి, తన ప్రియురాండ్రతో పురమున కరిగెను. రాజు తుష్ట పుష్ట జనాన్వీత మైన గమ్యమగు నగరమును ప్రవేశించెను. ప్రజలానందించిరి. రోజు మిక్కిలి ఆనందయుతముగా నుండెను. (34) ఓ రాజా! తత్సమయము నందు రాజుతో ఆ రాజపత్నులిర్వురును తాము గర్భిణులమయితిమని సంతోషమున నెఱింగించిరి. శుక్లపక్ష చంద్రునివలె వారీగర్భములు వృద్ధిచెందెను. ఆ గర్భ వృద్ధితో రాజు యొక్క ప్రజల యొక్క సంతోషము వృద్ధినొందెను. (36) గర్భము సంపూర్ణమయినది. పుణ్యవతియయిన కేశిని అగ్ని గర్భాభుడు అతిద్యుతి మంతుఁడు నయిన కుమారుని కనెను. యథావిధి రాజు కుమారునకు జాతకర్మాదీకముల నొనర్చెను. అసమంజసుఁడను నామమాతనికీడెను. (38) తత్సమయముననే, సుమతి గర్భాలాబును కనెను. (సొరకాయవంటి గర్భపిండమును కనెను). ఇట్లు గర్భపిండము సొరకాయవంటిది పుట్టగా రాజు దానిని చూచి త్యజింపఁగోరెను. ఆ విషయము నౌర్వ మహర్షి యెంగేను. తనంత తానే యచ్చటీకి వెంటనే వచ్చేను. రాజు చక్కగా గౌరవించెను. వెంటనే అతనితో ఋషి ‘ఈ గర్భా లాబును ఓరాజా! నీవు వీడవరాదు. ఏలయన అదీ షష్టి సాహసపుత్ర బీజమయినది. అందుచే దానిని సకలములుగా చేసి (ముక్కలుగా) ఘృతకుంభమున ప్రయత్న పూర్వకముగా నుంచుము. వానిని కప్పియుంచవలెను. వేలు వేలుగా నొక్కొక్క శకలమును రక్షింపవలయును. ఇట్లు చక్కగా చేసినచో ఓరాజా! నాయనుగ్రహమున పూర్వము చెప్పిన సంఖ్యాయుతమయిన పుత్రులు కలుగుదురు. సంశయములేదు. కాలము పరిపూర్ణము కాగా కుంభమును. ఛేదించుకొని వేరు వేరుగా షష్టి సహస్రపుత్రులు కలుగుదురు”. అని ఔర్వుడు చెప్పి అందే అంతర్థానమందెను. ఔర్వ మహర్షి చెప్పిన విధముగా రాజాచరించెను.
తతః సంవత్సరే పూర్ణే ఘృతకుంభాత్క్రమేణ తే ।
భిత్వా భిత్వా పునర్జజ్ఞుః సహసైవానువాసరమ్ ॥
ఏవం క్రమేణ సంజాతాస్తనయాస్తే మహీపతే ।
వవధుః సంఘశో రాజన్ షష్టిసాహస్రసంఖ్యయా ॥
అపృథర్థర్మచరణా మహాబలపరాక్రమాః ।
బభూవుస్తే దురాధర్షాః క్రూరాత్మానో విశేషతః ॥
స నాతిప్రీతిమంస్తేషు రాజా మతిమతాం వరః ।
కేశినీతనయంత్వేకం బహుమానసుతం ప్రియమ్ ॥
వివాహం విధివత్తస్మై కారయామాస పార్థివః ।
స చాప్యానందయామాస స్వగుణైః సుహృదో ఖిలాన్ ॥
ఏవం ప్రవర్తమానస్య కేశినీ తనయస్య తు ।
అజాయత సుతః శ్రీమానంశుమానితి విశ్రుతః ॥
స బాల్య ఏవ మతిమానుదారైః స్వగుణెర్భృశమ్ ।
ప్రీణయామాస సుహృదః స్వపితామహమేవ చ ॥
ఏతస్మిన్నంత రాజస్తస్య పుత్రోసమంజసః ।
ఆవిష్ణో నష్టచేష్టా భూత పిశాచేన కేనచిత్ ॥
స తు కశ్చిదభూద్వైశ్యః పూర్వజన్మని ధర్మవిత్ ।
కస్యచిద్విషయే రాజ్ఞః ప్రభూతధనధాన్యవాన్ ॥
స కదాచిదరణ్యేషు విచరన్నిధిముత్తమమ్ ।
దృష్ట్వా గ్రహీతుమారేభే వణిగ్లోభపరిఫుతః ॥
తతస్తద్రక్షకో భ్యేత్య పిశాచః ప్రాహ తం తదా ।
క్షుధితోహం చిరాదసిన్నివసన్నిధిపాలకః ॥
తస్మాత్తత్పరిహారాయ మమ దభి గవామిషమ్ ।
కామతః ప్రతిగృహ్ణీష్వ నిధిమేనం మమాజ్ఞయా ॥
స తస్మై తత్పరిశ్రుత్య దాస్యామీతి గవామీషమ్ ।
ఆదత్త చనిధిం తం తు పిశాచేనానుమోదితః ॥
ఒక సంవత్సరము నిండినది. ఘృతకుంభమును ఛేదించుకొని ప్రతిదినము ఒక్కొక్క కుమారుఁడు పుట్టెను. ఈ విధముగా జన్మించిన కుమారులు షష్టి సహస్రసంఖ్య కలిగి క్రమముగా వర్గములుగా వృద్ధి పొందిరి. వారందరు మహాబలపరాక్రములు, వారందరు. ఏమిచేసినను కలిసియే చేసిరి కానీ వేరువేరుగా నెట్టి కర్మము నాచరింపలేదు. వారందరు ధురాధరులు. విశేషముగా క్రూరాత్ములు. మతిమంతులలో శ్రేష్ణుం డయిన రాజు వారియందు ప్రీతిమంతుఁడు కాదు. కేశినీ సుతునొక్కనీనే ప్రియతమునీగాను, బహుమాన పురస్సరునిగాను చూచెను. ఆతనికినిధి మంతముగా రాజు వివాహ మాచరించెను. ఆతఁడో తన సుగుణములచే తన సమస్త స్నేహితులను ఆనంద పరచెను. ఇట్లు కాలము సాగు చుండగా కేశినీ తనయుఁడయిన అసమంజసునకు ఒక కుమారుఁడు పుట్టెను, ఆతని పేరు అంశమంతుఁడు. ఆతఁడు ప్రఖ్యాతుఁడు. అంశు మంతుఁడో మతిమంతుఁడు. బాల్యము నుండియు తన యుదారములయిన గుణములచే స్నేహితుల నధికముగా సంతోష పెట్టెను. తన పితామహుని కూడ ప్రీతిమంతుని చేసెను. ఇంతలో రాజకుమారుఁడయిన అసమంజసుఁడు ఒక దుష్టవీశాచముచే ఆవేశింపఁబడి నష్ట చేష్ణుం డయ్యెను. ఆతఁడు పూర్వజన్మమున ఒక రాజుయొక్క దేశమునందు ఒక వైశ్యుఁడు. అయినను నతఁడు ధర్మమేజింగినవాఁడు. ఆతఁడో అత్యంతధనధాన్యవంతుఁడయ్యెను. ఆతఁడొకప్పుడరణ్యములో సంచరించు ఉత్తమమైన ధననిధిని చూచెను. చూచుటయే తడవుగా కోమటియొక్క లోభగుణముతో నిండీ దానిని గ్రహింపమొదలిడెను. అంత, ఆ ధన నీధి రక్షకుఁడైన యొక పిశాచమేతెంచి ఆతనితో “ఇందు నీధి పాలకునిగా చిరకాలము వసించుచు క్షుధితుఁడనయితిని. అందుచే నా ఆకలి పోవుటకు గోమాంస మొసంగుము. దానికి ప్రతిగా నీ యిష్టము వచ్చినంత ఈ నిధినీ నా యాజ్ఞ చొప్పున గ్రహించుము” అనెను. (57) గవామీషము నిచ్చెదనని యతఁడు ప్రమాణము చేసెను. పిశాచముచే నను మోదితుం డై ఆతఁడా ధన నిధినంతటిని గ్రహించెను. (58)
న ప్రాదాచ్చ తతో మౌఢ్యాత్తస్మై యత్తత్ప్రతిశ్రుతమ్ ।
ప్రతిశ్రుతాప్రదానోత్థరోషం న శ్రద్దదే నృప ॥
తమేవం సుచిరం కాలం ప్రతీక్ష్యాశనకాంక్షయా ।
అపనీతధనః సోలిపి మమార వ్యధితః క్షుధా ॥
వైశ్యోపీ బాలో మరణం సంప్రాప్య సగరస్య తు ।
బభూవ కాలే కేశిన్యాం తనయోలిన్వయవర్దనః ॥
అశరీరః పిశాచేపి పూర్వ వైరమనుస్మరన్ ।
వాయుభూతో విశద్దేహం రాజపుత్రస్య భూపతే ॥
తేనావిష్ణస్తతః సోపి క్రూరచితో భవత్తదా ।
మలివీభ్రంశమాసాద్య ముహుర్తేన బలాత్కృతః ॥
అసమంజసత్వం నగరే చక్రే సోపీ నృశంసవత్ ।
బాలాంశ్చ యూనః స్థవిరాన్యోషితశ్చ సదా ఖలః ॥
హత్వా హత్వా ప్రచిక్షేప సరయ్వామతినిర్ధయః ।
తతః పౌరజనాసర్వే దృష్ట్వా తస్యకదర్యతామ్ ॥
బహుశో నికృతాస్తేన గత్వా రాజై వ్యజిజ్ఞపన్ ।
రాజా చ తదుపశ్రుత్య తమాహూయ ప్రయత్నతః ॥
వారయామాస బహుధా దుఃఖేన మహరాన్వితః ।
బహుశః ప్రతిషిదోపి పిత్రా తేన మహాత్మనా ॥
జలే తప్తే చ సంతప్తాః సంబభూవుర్యథా యవాః ।
నాశకత్తం యథాపాపాద్వినివర్తయితుం నృపః ॥
లోకాపవాదభీరుత్వాద్విషయానత్యజత్తదా ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే సగరచరితే సమంజసత్యాగో నామైకపంచాశత్తమోధ్యాయః ॥
ఆతఁడు తన మౌఢ్యముచే ఇచ్చెదనని ప్రమాణ మాచరించి పిశాచమున కోసంగలేదు. అంతియేకాక ఇచ్చేదనని ప్రమాణము చేసిన దాని నీయకున్న పిశాచమునకు గలిగిన కోపమును గమనింప లేదు. ఆ వైశ్యుని కొఱకు చిరకాలము పిశాచము నిరీక్షించి నిరీక్షించి ఆహార కాంక్షతో ధనము గోల్పోయి, మిక్కిలి వ్యధ ననుభవించి ఆకలి బాధచే మరణించెను. ఇంక ఆ వైశ్యుఁడును కాలక్రమమున కేశినీ యొక్క తనయుఁడై అన్వయవర్గకుండయ్యెను. పిశాచము శరీరరహితుఁడయ్యు పూర్వ వైరమును అనుస్మరించి వాయుభూతుఁడయి, రాజపుత్రునియొక్క దేహము నావేశించెను (ప్రవేశించెను). ఆ భూతవాయువుచే నావిష్ణుఁడయి యాతండు క్రూరచిత్తుఁడయ్యెను. ఆతనికి మతిపోయెను, మఠీవీభ్రంశమొంది పిశాచముచే బిలాతృతుడయి, అసమంజసుఁడు ఆ రాజనగరమున సుశంసునివలె (క్రూరునివలె) బాలులను, యువకులను, ముదుసతులను, స్త్రీలను, ఆ దుర్మార్గుడు చంపి, చంపి, పాషాణ హృదయుండై ఆ బాలాదులను సరయూనదిలో పారవైచెను. అసమంజసుని కదర్యతను క్రౌర్య భావమును పౌరజనులందరు చూచిరి, పెక్కురు ఆతనిచే చంపఁబడిరి. ప్రజలు వెంటనే వెళ్లి రాజును సమీపించి తమ బాధను విన్నవించుకొనిరి. రాజు వారీ విన్నపము నాలించెను. బహం ప్రయత్నమాచరించి మహాదుఃఖ సమన్వితుఁడై యనేకమారులు వారించెను. ఉదారుఁడు మహాత్ముండు సయిన పితరునిచే పలుమార్లు అడ్డగింపఁబడి ప్రతిషిద్ధుఁడయినను రాజు ప్రయత్నములు వేయించిన బార్లీధాన్యమును నీటిలో గుమ్మరించినట్లు నీషులములయ్యెను. పాపకర్మనుండి ఆతనిని నీవర్తింపచేయ శక్తుఁడు కాక, రాజు లోకాపవాదభీతుఁడై ఆతనిని దేశము నుండి బహిష్కరించెను.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమునందు మధ్యమభాగమున, తృతీయ ఉపోద్ఘాతపాదమున సగరచరిత్రమునందు, అసమంజసబహిష్కరణమను ఏబది యొకటవ అధ్యాయము.
Summary of chapter 89 of the Brahmānda Mahā Purana is as follows:
In verses radiating pure spiritual joy, this chapter chronicles the Vṛshṇi dynasty culminating in the glorious advent of lord Kṛshṇa, the supreme personality of godhead. It details his divine birth in Mathurā, his magical childhood in Vṛndāvana, and his absolute grace that enchanted the universe. The devoted heart drowns in ecstatic love, meditating upon the enchanting form, divine flute, and boundless mercy of lord Kṛshṇa.