40 - కార్తవీర్యుని మరణము

వసిష్ఠ ఉవాచ :-

సుచంద్రే పతితే రాజన్ రాజేంద్రాణామ్ శిరోమణౌ

తత్పుత్రః పుష్కరాక్షస్తు రామం యోద్దుమథాగతః

 స రథస్థో మహావీర్యః సర్వశస్త్రాస్త్రకోవిదః

 అభివీక్ష్య రణే త్యుగ్రం రామం కాలాంతకోపమమ్

   చకార శరజాలం చ భార్గవేంద్రస్య సర్వతః

ముహూర్తం జామదగోపి బాజైః సంఛాదితోభవత్

   తతో నిష్కమ్య సహ భార్గవేంద్రో మహాబలః

శరబంధాన్ మహారాజ సముదైక్షత సర్వతః

   దృష్ట్వా తం పుష్కరాక్షం తు సుచంద్రతనయం తదా

 క్రోధమాహారయామాస దిధక్షన్నివ పావకః

   స క్రోధేన సమావిష్ణో వారుణం సమవాసృజత్

తతో మేఘాః సముత్పన్నా గర్జంతో భైరవానవాన్

 వవృషుర్జలధారాభిః ప్లావయంతో ధరాం నృప

 పుష్కరాక్షో మహావీర్యో వాయవ్యాస్త్రమవాసృజత్

తేన తేనిదర్శనం నీతాః సద్య ఏవ ఐలాహఠాః

అథ రామో భృశం క్రదో బ్రహ్మం తత్రాభిసందధే

 పుష్కరాక్షోపి తేనైవ విచకర్ష మహాబలః

బ్రహ్మం సోప్యాహితం దృష్ట్వా దండాహత ఇవోరగః

 ఘోరం పరశుమాదాయ నిశ్వసంస్తమధావత

రామస్యాధావతస్తత్ర పుష్కరాక్షో ధనుర్ధరః

 సందధే పంచవిశిఖాస్టీప్లాస్యానురగానివ

 ఏకైకేన చ బాణీన హృది శీర్ష భుజద్వయే

 శిఖాయాం చ క్రమాదిత్వో తస్తంభ భృశ మాతురమ్

 స చైవం పీడితో రామః పుష్కరాక్షేణ సంయుగే

 క్షణం స్థిత్వా భృశం ధావన్ పరశుం మూర్ఖ్యపాతయత్

శిఖామారభ్య పాదాంతం పుష్కరాక్షం ద్విథా కరోత్

 పతితే శకలే భూమౌ తత్కాలం పశ్యతాం నృణామ్

ఆశ్చర్యం సుమహజ్జాతం దీవి చైవ దీవౌకసామ్

వసిష్ఠుఁడు ఇట్లు చెప్పెను :

రాజ చూడామణీయైన సుచంద్రుఁడు మరణించెను. ఆతని పుత్రుఁడు పుష్కరాక్షుఁడు రామునితో యుద్దము సల్ప పరువెత్తుకొనివచ్చెను.. ఆతఁడు రథస్థుఁడు, మహావీర్యుఁడు, సర్వశస్త్రాస్త్రకోవిదుఁడు, రణము నందత్యంతోగ్రుఁడు, కాలాంతక తుల్యుఁడు అయిన రాముని అభివీక్షించి భార్గవేంద్రుడయిన రాముని కన్నివైపులను శరసమూహముల కురిపించెను. ఒక ముహూర్తకాలము జామదగ్యుఁడు బాణ సంధాదితుఁడయ్యెను. అంత వెంటనే బయటికి వచ్చి మహాబలుఁడయిన భార్గవేంద్రుడు తనపై నున్న శరబంధములను చూచెను. దహించుచున్న పావకుని వలే క్రోధోదగ్రుఁడయ్యెను. క్రోధ పూర్ణుఁడై రాముఁడు వారుణాస్త్రమును విడిచెను. అంత భైరవనాదములతో గర్జించుచు మేఘములు వచ్చిపడెను. భూమి నంతటిని ముంచెత్తుచు జలధారలను వర్షించెను. మహావీర్యుఁడయిన పుష్కరాక్షుఁడు వాయవ్యాస్త్రమును ప్రయోగించెను. ఆ వాయవ్యాసము చే వెంటనే మేఘములు వీడిపోయి కానరావయ్యెను అంత రాముఁడధికక్రుద్దుఁడయి బ్రహ్మాస్త్రముననుసంధీంచెను. మహాబలుఁడయిన పుష్కరాక్షుఁ డు బ్రహ్మాస్త్రము ప్రయోగించి దానితో దానిని విచకర్షించెను. దానిని విసరికొట్టెను. రాముఁడు తన బ్రహ్మాస్త్రమును నిరోధించుట చూచి దండాహత భుజంగము వలె భయంకరుఁడయ్యెను. వెంటనే తీవ్రముగ బుస్సలుకొట్టుచు నిశ్వసించుచు పరశువును చేబట్టి పుష్కరాక్షునిపైకి రాముఁడు పరువెత్తి వెళ్లాను. రాముఁడు మీదికి వచ్చి పడుటచూచి పుష్కరాక్షుడు నిప్పులను క్రక్కుచున్న సర్పములవంటి పంచవిశిఖాస్త్రములను విడిచెను, ఆ పంచదీప్తవహ్ని సర్పతుల్యశరములలో రామునికి ఒకటి హృదయమునందు నాటెను. ఒకటి శీర్వమున, రెండు భుజద్వయమునందు మిగిలినదీ రాముని శీఖయందు క్రమము నోటుకొనెను. రాముఁడు మిక్కిలి సంస్తంభితుఁడయ్యెను. సంక్షుభితుఁడయ్యెను. ఈ విధముగా యుద్దమున పుష్కరాక్షునిచే రాముఁడు పీడింపబడీ ఒక్క క్షణకాలము నేలండి వెంటనే పుష్కరాక్షుని వైపు పరువెత్తుకొని వెడలి తన పరశువుతో నాతని శీర్షమున కొట్టెను. ఆయాఘాతము పుష్కరాక్షుని శీఖనుమొదలిడి పాదాంతము రెండుగా చేసెను. పుష్కరాక్షుని శరీరశకలద్వయము నేలపడెను. ఆ సమయమున వీక్షించునట్టి దేవతలకు ఆశ్చర్యము కలిగెను.

విదార్య రామస్తం క్రోధాత్ పుష్కరాక్షం మహాబలమ్

 తతైన్యమదహత్కుద్దః పావకో విపినం యథా

 యతో యతో ధావత్ భార్గవేంద్రో మనోనిలౌజాః ప్రహరన్ పరశ్వధమ్

తతస్తతో వాజిరథేభమానవా నికృత్తగాత్రాః శతశో నిపేతుః

రామేణ తత్రాతబలేన సంగరే నిహన్యమానాస్తు పరశ్వధేన

 హాతాత మాతస్త్వితి జల్పమానా భస్మీబభూవుః సువిచూర్జితాస్తదా

 ముహూర్తమాత్రేణ చ భార్గవేణ తత్పుషరాక్షస్య బలం సమగ్రమ్

అనేక రాజన్యకులం హతేశ్వరం హతం నవాక్షౌహిణికం భృశాతురమ్

 పతితే పుష్కరాక్షే తు కార్తవీర్యార్జునః స్వయమ్

ఆ జగామ మహావీర్యః సువర్ణరథమాస్థితః

నానాశస్త్రసమాకీర్ణం నానారత్నపరీచ్ఛదమ్

దశనల్వప్రమాణం చ శతవాజీయుతం నృపః

 యుతే బాహుసహస్రణ నానాయుధధరేణ చ

బభౌ స్వర్లోకమారోక్ష్యన్ దేహాంతే సుకృతీ యథా

 పుత్రాస్తస్య మహావీర్యాః శతం యుద్ధవిశారదాః

 సేనాః సంవ్యూహ్య సంతస్థుః సంగ్రామే పితురాజ్ఞయా

 కార్తవీర్యస్తు బలవానామం దృష్ట్వా రణాజిరే

కాలాంతకయమప్రఖ్యం యోధుం సముపచక్రమే

దక్షే పంచశతం బాణాప్ వామే పంచశతం ధనుః

జగ్రాహ భార్గవేంద్రస్య సమరే జేతుముద్యతః

 బాణవర్షం చకారాథ రామస్యోపరి భూపతే

యథా బలాహకో వీర పర్వతోపరి వర్షతి

 బాణవర్షేణ తేనాజౌ సత్కృతో భృగునందనః

జగ్రాహ స్వధనుర్దిష్యం బాణవర్షం తథాకరోత్

 క్రోధముతో మహాబలుఁడయిన పుష్కరాక్షుని చీల్చి చంపి ఆతని సైన్యమును అగ్నీ అరణ్యమును భస్మీపటలము చేయునట్లు, రాముఁడు క్రోధోగ్రుఁడై దహించి వైచెను. భార్గవేంద్రుఁడు వాయుమనోవేగములతో ఎందెందు పరువెత్తి పరశుతో కొట్టెనో ఆయా ప్రదేశములలో గుర్రములు ఏనుగులు, మానవులు శరీరములు తెగి వందలాది పడిపోయిరి. యుద్దము నందు బలవంతుఁడయిన రామునిచే పరశ్వధముచే కొట్టబడి ఓ అమ్మ ! ఓ అయ్య ! యనుచు అరచుచు ఆక్రోశించుచు చూర్ణీకృతులై మానవులందరు భస్మీకృతులయిరి. ఒక ముహూర్త కాలములో అనేక రాజన్య కులములో నవాక్షౌహిణీ సంఖ్యతో సంపూర్ణముగా నున్న పుష్కరాక్షుని బలము అధీపులు చావగా హతము చేయఁబడినదీ.. పుష్కరాక్షుఁడు మరణింపగా మహావీర్యుఁడయిన కార్తవీర్యుఁడు సువర్ణ రథము నారోహించి స్వయము యుద్ధమునకు వచ్చెను. ఆ సువర్ణ రథము నానాశస్త్ర సమాకీర్ణము. నానావిధ రత్నములచే స్థగితము. 400 అడుగుల ప్రమాణము కలది. శతాశ్వములతో కూడియున్నది.  కార్తవీర్యుఁడు నానావిధ ఆయుధములతోనున్న బాహు సహస్రములతోగూడికొని, దేహాంతమునందు పుణ్యమాచరించిన వ్యక్తి సుకృతి స్వర్గము నారోహించుచున్నట్లు, ప్రకాశించెను. అతనికి నూరుగురు పుత్రులు వారందరు యుద్ధ విశారదులు వారందరు తండ్రి ఆజ్ఞచే సేనను సమాయత్తము చేసికొని యుద్దభూమియందు నీల్చీరి. మహాబలవంతుఁడు కార్తవీర్యుఁడు యుద్ధభూమిలో కాలాంతమున ప్రత్యక్షమగు యమునివలె నున్న రాముని చూచి యుద్దముచేయ ప్రారంభించెను. యుద్దమున భార్గవ రాముని జయించుటకై కుడిప్రక్క 500 చేతులలో శరములను ఎడమ ప్రక్కనున్న యైదువందల హస్తములలో ధనువులను ధరించి కార్తవీర్యుఁడు యుద్ధమునకు పూనుకొనెను. పర్వతముపై మేఘము వర్షధారల కురిపించునట్లు రామునిపై కార్తవీర్యుఁడు బాణవర్షమును కురిపించెను. బాణ వర్షముచే గౌరవింపఁబడిన భార్గవరాముఁడు స్వధనువును గ్రహించి యుద్ధమున బాణవర్షమును కురిపించేను.

తావుభౌ రణ సందృప్తా తదా భార్గవహైహయౌ

చక్రతుర్యుద్ధమతులం ముములు రోమహర్షణమ్

 బ్రహ్మాస్త్రం చ స భూపాలః సందధే రణమూర్ధని

వధాయ భార్గవేంద్రస్య సర్వ శస్త్రాస్త్రధృగ్బలీ

 రామోపీ వార్యుపస్పృశ్య బ్రాహ్మం బ్రాహ్మాయ సందధే

తతో వ్యోమ్ని సదా సకే ద్వే చాప్యస్తే నరాధిప

 వవృధాతే జగతౌంతే తేజసా జ్వలసొరవత్

 త్రయో లోకాః సపాతాలో దృష్ట్వా తన్మహదద్భుతమ్

జ్వలదస్త్రయుగం తప్తా మేనిరేస్యోపసంయమమ్

 రమస్తదా వీక్ష్య జగత్ర్పణాశం జగన్నివాసోక్తమథాస్మరత్తదా

 రక్షా విధేయాలిద్య మయాస్య సంయమో నివారణీయః పరమాంశధారణా

 ఇతి వ్యవస్య ప్రభురుగ్రతేజా నేత్రద్వయేనాథ తదస్త్రయుగ్మమ్

పీత్వాతిరామం జగదాకలయ్య తగ్గి క్షణం ధ్యానగతో మహాత్మా

 ధ్యానప్రభావేణ తతస్తు తస్య బ్రహ్మాస్త్రయుగ్మం వీగతప్రభావమ్

పపాత భూమా సహసాథ తక్షణం సర్వం జగత్వాస్థ్యముపాజము

 స జామదగ్యో మహతాం మహియాన్ స్రష్టుం తథా పాలయితుం నీహంతుమ్

విభుస్తథాపీహ నిజం ప్రభావం గోపాయితుం లోకవిధిం చకార

ధనుర్ధరః శూరతమో మహస్వాన్సదగ్రణీః సంసదీ తధ్యవర్తా

 కలాకలాపేఘ కృతప్రయత్నో విద్యాసు శాస్త్రేషు బుధో విధిజ్ఞః

ఏవం నృలోకే ప్రథయన్స్వభావం సర్వాణి కల్యానీ కరోతి నిత్యమ్

భార్గవరాముఁడు హైహయుఁడు ఇద్దరు రణగర్వితులు. వారు అసామాన్యము, తుములము, రోమర్షమును గలిగించునట్టిదియునగు యుద్ద మాచరించిరి. భార్గవేంద్రుని వధ కొలకు సర్వశస్త్రాస్త్రముల ధరించిన బలవంతుఁడగు కార్తవీర్యుఁడు బ్రహ్మ దైవతమగు బ్రహ్మాస్త్రమును సంధానించేను, రాముఁడు ఆచమనము చేసి. పవిత్రుఁడయి, వేడొక బ్రహ్మాస్తమును రాజుచే ప్రయుక్తమైన బ్రహ్మస్త్రము పై ప్రయోగించెను. రెండును ఒండొంటిని. తాకి.దాని ప్రకాశము నందధికమై జ్వలించు నగ్నివలె ప్రకాశించెను. పాతాళ లోకముతో సహా లోకత్రయము అద్బుతమయిన తన్మహస్సును చూచి జాజ్వల్యమానములయిన అస్త్రద్వయముచే వారందరు తప్తమైనట్లుగా భావించిరి. వానీ యుపశమమునకై వారెల్లరు తలపోసిరి. రాముఁడు జగత్ర్పణాశనమును తిలకించి జగన్నివాసుఁడయిన కృష్ణుడు పూర్వము చెప్పిన దానిని స్మరించెను. ఇట్లు తలంచెను? జగద్రక్ష యాచరించవలెను. ఈ బ్రహ్మాస్తము.నాచే నియమింపబడవలెను. భగవత్పగమాంశను ధరించు నేను దీనిని నీవారింపవలేను. అని నిశ్చయించుకొని, ఉగ్రతేజుడయిన రాముఁడు, తదస్త్రద్వయమును తన నేత్రద్వయముచే త్రాగెను. తన్మూలమున జగత్తును మనోహర మొనర్చెను. అప్పుడే క్షణములో మహాత్ముడు రాముఁడు ధ్యానగతుఁడయ్యెను, ధ్యాన ప్రభావము వలన ఆ రెండు అస్త్రములు విగత ప్రభావములయి శాంతి నొందెను, ఆ రెండు బ్రహ్మాస్త్రములు భూమిపై వ్రాలెను. తదుత్తర క్షణములో సర్వజగత్తు స్వాస్థ్యము నొందెను. ఆ జామదగ్న్యుడు మహనీయులలో నధికమహిమాన్వితుఁడు ఆతఁడు సృష్టించుటకు, రక్షించుటకు, నాశనమొనర్చుటకు శక్తిమద్వీభుఁడు. అయినను తన్నిజ ప్రభావమును గుప్తము చేయుట కొఱకు, సామాన్యనునీవలె లోకవీధి నాచరించెను. ఆతఁడు ధనుర్ధరుఁడు. శూరతముఁడు, మహామహస్వంతులలో నగ్రేసరుఁడు సభలలో తథ్యమునే వచించువాఁడు. సర్వలలితకలాకలాపముల యందు కృతప్రయత్నండు సిద్ధుఁడు. విద్యల యందు, శాస్త్రము లందు విధీజుం దైన పండితుఁడు. ఈ విధముగా తన స్వభావమును లోకమున ప్రకటించుచు ఆతఁడు సర్వలోకమునకును నిత్యము కళ్యాణము నాచరించును.

సర్వే తు లోకా విజితాస్తు తేన రామేణ రాజన్యనిషూదనేన

 ఏవం స రామః ప్రథితప్రభావః ప్రశామయిత్వా తు తదస్త్రయుగ్మమ్

 పునః ప్రవృత్తో నిధనం ప్రకర్తుం రణాంగణే హైహయవంశకేతోః

 తూణీరతః పత్రియుగం గృహీత్వా పుంఖే నీధాయాథ ధనుర్ఘ్యకాయామ్

ఆలక్ష్య లక్ష్యం నృపకర్ణయుగ్మం చకర్త చూడామణిహర్తుకామః

స కృత్తకర్ణో నృపతిర్మహాత్మా వినిర్జితాశేషజగత్రవీరః

 మేనే నిజం వీర్యమిహ ప్రణష్టం రామేణ భూమీశతిరస్కృతాత్మా

క్షణం ధరాధీశతనుర్వివర్ణా గతానుభావా నృపతేర్బభూవ

 లేఖ్యేవ సచ్చిత్రకరప్రయుక్తా సుదీనచిత్తస్య వీలక్ష్యంగ

 తతః స రాజా నిజవీర్యవైభవం సమస్తలోకాధికతాం ప్రయాతమ్

 విచింత్య పౌలస్త్యజయాదీలబ్ధం శోచన్నీవాసీత్స జయాభికాంక్షీ

 దద్యౌ పునర్మీలితలోచనో నృపో దత్తం తమాత్రేయకులప్రదీపమ్

 యస్య ప్రభావానుగృహీత ఓజసా తిరశ్చకారాఖిలలోకపాలకాన్

 యదాస్య హృద్యేష మహానుభావో దత్త ప్రయాతో నహి దర్శనం తదా

 ఖిన్నోతిమాత్రం ధరణీపతిస్తదా పునః పనర్ధ్యానపథం జగామ

 స ధ్యాయమానోపిన చాజగామ దతో మనోగోచరమస్య రాజన్

రాజన్యుల వధించుటచే రామునిచే సర్వలోకములు జయింపఁబడినవి. ప్రథితప్రభావుఁడయిన రాముఁడు, ఆ బ్రహ్మాస్త్ర ద్వయమును ప్రశాంత మొనర్చి మరల హైహయ వంశ పతాకమయిన కార్తవీర్యుని వధించుటకు యుద్ధరంగమున ప్రవృత్తుఁడయ్యెను. ఆతఁడు తన తూణీరము నుండి (అమ్ముల పొది నుండి) రెండు బాణములను గ్రహించెను. ఈకలుగల బాణముల భాగమును ధనుర్గుణమున నమర్చెను. కార్తవీర్యుని శిరోరత్నమును ఖండింప కోరి ఆతని కర్ణయుగ్మమును లక్ష్యము చేసెను. వానీని తరువాత ఖండించెను. కర్ణములు ఖండింపఁబడి మహాత్ముఁడు పూర్వము అశేష జగత్ర్పవీరుఁడు అయిన రాజు తన కర్ణద్వయము ఖండింపబడి తన పరాక్రమము వీర్యము ప్రణష్టమైనదిగా తలంచెను. రామునిచేతను తిరస్కృతాత్ముఁడయ్యెను. ఆతనిశరీరము ఓ రాజా ! వివర్ణమయ్యెను. గతమయిన అనుభావము ప్రతాపము గలవాఁడయ్యెను. ఆతఁడు మంచి చిత్రకారునిచే చిత్రింపఁబడిన చిత్రమువలె అయ్యెను, సుదీనచిత్తుఁ డయ్యెను. విలక్షణముగ గోచరించెను. అంత రాజు, లోకాధికతనొంది విరాజిల్లిన తన వీర్య వైభవము నష్టమై పోయినదీగా తలపోసెను. రావణునితో పూర్వము యుద్ధముచేసి చేగొన్న జయాదీకముల తలంచి విచారించెను. ఇంకను రాజు జయాభీకాంక్షియై పున ర్మీలిత నేత్రుఁడై అత్రీకుల ప్రదీపమయిన దత్తాత్రేయుని గూర్చి ధ్యానించెను. ఆ దత్త ప్రభుని ప్రభావమున అనుగృహీతమయిన తేజస్సుచే, పరాక్రమముచే అఖిల లోకపాలురను తిరస్కరించేను. జయించెను. మహానుభావుం డయిన దత్తాత్రేయుఁడతనికి దర్శన మొసంగని కారణమున కార్తవీర్యుఁడు అత్యంతము దుఃఖితుఁడయ్యెను. అప్పటికిని మరల మరల దత్తుని గూర్చి ధ్యాన పథ మొందెను. రాజు ధ్యానించినను, దత్తుఁడా తనికి మనోగోచరము కాలేదు.  

తపస్వినో దాంతతమస్య సాధోరనాగసో దుష్కుతికార్జో విభుః

ఏవం యదాత్రేస్తనయో మహాత్మా దృష్టాన చ ధ్యానపథే నృపేణ

  తదాతి దుఃఖేన విదూయమానః శోకేన మోహేన యుతో బభూవ

తం శోకమగ్నం నృపతిం మహాత్మా రామో జగదాఖిలచిత్తదర్శీ 

మా శోకభావం నృపతే ప్రయాహి నైవానుచండి మహానుభావాః

 యస్తే వరాయాభవమాడిసన్దేస ఏవచాహం తవ సాదనాయ

సమాగతస్త్వం భవ ధీరచిత్తః సంగ్రామకాలే న విషాదచర్చా

 సర్వోహి లోకః స్వకృతం భునక్తి శుభాశుభం దైవకృతం ఏపాకే

 అన్యో న కోతిష్యస్య శుభాశుభస్య విపర్యయం కర్తుమలం నరేశ

 యతే సుపుణ్యం బహుజన్మసంచితమ్ తేనేహ దత్తస్య వరార్హపాత్రమ్

 జాతో భవానద్య తు దుష్కృతస్య ఫలం ప్రభుంక్ష తమిహార్జితస్య

గురుర్విమర్యాపకృతస్త్వయా మే యతస్తతః కర్జనీకృంతనం తే

కృతం మయా పశ్య హరంతమోజసా చూడామణీం మామపహృత్య తే యశః

ఇత్యేవముక్త్వా స భృగుర్మహాత్మా నియోజ్య బాణం చ వికృష్య చాషమ్

 చిక్షేప రాజ్ఞః స తు లాఘవేన చ్ఛిత్వా మణిం రామముపాజగామ

తద్వీక్ష్య కర్మాస్య మునేః సుతస్య స చార్జునో హైహయవంశధర్తా

 దానికి కారణము రాజు, తపస్వి, అత్యంత దాంతగుణముచే ఇంద్రియ నిగ్రహ మొనర్చినవాఁడు, పాప రహితుఁడు, అయిన మునియెడ దోషమాచరించెను. అందుచే అత్రీ తనయుఁడు కార్తవీర్యుని దృష్టి పథమునకు రాలేదు. అప్పుడు రాజు అతి దుఃఖముచే దోదూయ మానుం డయ్యెను, శోకమోహయుతుఁడయ్యెను. రాముఁడు సర్వజన చిత్తవృత్తి నైజీంగినపొండు. శోక మగ్నునితో రాజుతో మహాత్ముఁడు రాముఁడు ఇట్లు పలికెను. ఓ రాజ ! శోకభావమును పొందకుము. మహానుభావులు శోకభావము నొందరు. శోకింపరు. ఈ సృష్టిలో నీకు వరము నీయ నవతరించిన వాఁడను నేను. ఆనేను ఇప్పుడు నీన్ను వధించుటకై వచ్చితినీ. మనస్సున ధైర్యము వహింపుము సమాహితుఁడవగుము. సంగ్రామ సమయమున విచార చర్చ నాచరించ కూడదు. లోకమున నెల్లరును స్వకృత కర్మ ఫలితమునే అనుభవింతురు. పరిణామమున విపాకమున శుభాశుభములు దైవకృతములు. ఓ రాజా ! శుభా శుభములకు విపర్యయము (మార్పును) కలిగింపగల పొడొకరుండు వేరుగా లేడు. బహుజన్మ సంచితమయిన యే నీ పుణ్యమున్నదో అయ్యదియే నీకు దత్తునివలన వరార్షపాత్రత్వమును కలిగించినది. ఇప్పుడో నీవొనర్చిన దుష్కృతమునకు ఫలము ననుభవింపుము. నా తండ్రి వివేకము లేని నీచే అపకృతుడయ్యెను. అందుచే నీకర్ణములు నాచే ఖండింపఁబడినవి. పరాక్రమముచే నీయొక్క చూడామణి నాచే హిరింపఁబడినది. నీయశస్సు అపహృతమైనది. ఇట్లు పలికి భార్గవరాముఁడు, బాణమును సంధించి, చాపమునులాగి, విడిచెను. రాజు యొక్క మణిని, నిపుణముగా ఛేదించి, బాణము రాముని చేరెను. ముని కుమారుఁడయిన రాముని యా కార్యమును చూచి హైహయ వంశకర్తయైన కార్తవీర్యార్జునుడు

సముద్యతో భూత్పునరప్యుదాయుథస్తం పంతుమాజౌ ద్వీజమాత్మశత్రుమ్

 శూలశక్తిగదాచక్రఖడ్గపట్టిశతోమరైః

  నాసా ప్రహరణైశ్చ్యాన్యైరాజఘాన ద్విజాత్మజమ్

స రామో లాఘవేనైవ సంప్రక్షిప్తాన్యనేన చ

 శూలాదీని చకర్తకు మధ్య ఏవ నిజాశుగైః

 స రాజా వార్యుపస్పృశ్య ససర్జిగ్నేయముత్తమమ్

అస్త్రం రామో వారుణేన శమయామాస సత్వరమ్

గాంధర్వం విదధే రాజా వాయవ్యేనాహనద్విభుమ్

నాగాస్త్రం గారుడేనాపి రామశ్చిచ్ఛేద భూపతే

దత్తేన దత్తం యచ్ఛూలమవ్యర్థం మంత్రపూర్వకమ్

జగ్రాహ సమరే రాజా భార్గవస్య వధాయ చ

తచ్ఛూలం శత సూర్యభమనివార్యం సురాసురైః

 చిక్షేప రామముద్దిశ్య సమగ్రేణ బలేన సః!

మూర్థి తద్భార్గవస్యాథ నీపపాత మహీపతే !

 తేన శూలప్రహారేణ వ్యథతో భార్గవస్తదా

మూర్ఛామవాప రాజేంద్ర పపాత చ హరిం స్మరన్

   పతితే భార్గవే తత్ర సర్వే దేవా భయాకులాః

సమాజగ్ముః పురస్కృత్య బ్రహ్మవిష్ణుమహేశ్వరాస్

 శంకరస్తు మహాజ్ఞానీ సాక్షాన్మృత్యుంజయః ప్రభుః

 భార్గవం జీవయామాస సంజీవన్యా స విద్యయా

   రామస్తు చేతనాం ప్రాప్య దదర్శ పురతః సురాన్

ప్రణనామ చ రాజేంద్ర భక్త్యా బ్రహ్మాదీకాంస్తుతాన్

 తే సుతా భార్గవేంద్రేణ సద్యో దర్శనమాగతాః

స రామో వార్యుపస్పృశ్య జజాప కవచం చ తత్

 ఆయుధము నెత్తిపట్టి యుద్దమునందు తన శత్రువైన ద్విజాత్మజుఁడైన రామునితో యుద్దముచేయ సముద్యతుఁడయ్యెను. వెంటనే రాజు, శూలము, శక్తి, గద, చక్రము, ఖడ్గము, పట్టిసము, తోమరము మొదలగు నానా ప్రహరణాస్త్ర సమూహమును విసరీ లాఘవముతో ద్విజాత్ముం డైన రాముని కొట్టెను. రాముఁడు స్వనైపుణ్యముతో లాఘవత్వముతో ఆ ఆయుధములను మధ్యలోనే ఖండించెను. ఆ రాజు ఆచమనము చేసి (వారిస్పర్శ చేసి) ఉత్తమమైన ఆగ్నేయాస్త్రమును విడిచెను, ఆ యస్త్రమును రాముడు వారుణాస్త్రముచే శమింపఁజేసెను. అంత రాజు గాంధర్వాస్త్రమును విడిచెను. దానిని రాముఁడు వాయవ్యాస్త్రముచే ఖండించెను. రాజు నాగాస్త్రమును ప్రయోగింప రాముఁడు గారుడాస్త్రముచే దానిని ఛేదించేను. రాజు యుద్ధమున రాముని చంపుటకు దత్తునిచే నీయబడిన శూలమును విసరెను. అయ్యదీ వ్యర్థముకానిది. రాజు మంత్ర పూర్వకముగా, భార్గవ రాముని వధకై యుద్దమున చేపట్టిన శూలమును శత సూర్య ప్రతాప పరాక్రమాభమయిన దానీనీ, సురాసురలచే అవార్యమైన దానిని రాముని లక్ష్యముచేసి, తనకున్న సమగ్రమైన బలముతో విసరెను. ఆ శూలము భార్గవుని మూర్థమునఁబడెను. భార్ధవుఁడా శూల ప్రహారముచే వ్యధితుఁడయ్యెను. మూర్చనొందెను, హరిని తలంచుచు రాముఁడు నేల కొరిగెను, రాముఁడు నేలకొరుగగా, దేవతలందరు భయాకులులయిరీ. బ్రహ్మవిష్ణుమహేశ్వరులను పురస్కరించుకొని ముందుంచుకొని) సమావేశమొందిరి. మహాజ్ఞాని మృత్యుంజయుఁడు, ప్రభువు, నైన శంకరుఁడు సంజీవిని విద్యచే భార్గవుని బ్రతికించెను, రాముఁడు చైతన్యమొందెను. తన ముందు దేవతలను దర్శించెను, భక్తితో నమస్కరించెను, బ్రహ్మాదులను స్తుతించెను. భార్గవునిచే స్తుతింపఁబడి వారందరు వెంటనే అదృశ్యులైరీ. రాముఁడు జలమును స్పర్శించి, కృష్ణ కవచమును జపించేను.

ఉత్తితశ్చ సుసంరబ్ధో నిర్దహన్నివ చక్షుషా

 స్మృత్వా పాశుపతం చాస్త్రం శివదత్తం స భార్గవః

 సద్యః సంహృతవాంస్తత్తు కార్తవీర్యం మహాబలమ్

స రాజా దత్తభక్తస్తు విష్ణోశ్చక్రం సుదర్శనమ్

ప్రవిష్టో భస్మసాజ్ఞాతం శరీరం బాహునందన

 ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే  కార్తవీర్య వధో నామ చతుర్వింశత్తమోధ్యాయః

సుసంరబుఁడై నేత్రములచే దహించుచు రాముఁడు ఉళితుఁడయ్యెను. శివుఁడొసంగిన పాశుపతమును రాముఁడు స్మరించెను. దానితో వెంటనే మహాబలుఁడయిన కార్తవీర్యుని రాముఁడు కొట్టెను. ఆ రాజు దత్తభక్తుఁడు. విష్ణువుని చక్రము సుదర్శనము. ఆ రాజు సుదర్శనములో ప్రవేశించెను.

ఓ రాజా!

అతని శరీరము భస్మసాత్కృతమయ్యెను.

ఇది వాయుప్రోక్తము, మహాపురాణమునయిన బ్రహ్మాండపురాణమున మధ్యమభాగమున తృతీయోపోద్ఘాతపాదమున కార్తవీర్యవధయను నలుబదవ అధ్యాయము సంపూర్ణము.