పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యము

మునులు ఇట్లు అనిరి-స్వామి! అద్భుతమయిన క్షేత్ర ప్రశంస తమ వలన వింటిమి. చాలా ఆశ్చర్యమైనది. తాము చెప్పినది ముమ్మాటికిని సత్యము. సర్వేశ్వరుడయిన విష్ణువు సర్వ దేవోత్తముడైనట్లే పురుషోత్తమ దేవుని పుణ్యతీర్థము సర్వతీర్థ రాజము. వసువులలో అగ్ని మొదలుకొని సిద్ధులలో కపిలునివరకు మూలమున చెప్పబడిన ఆయాపుణ్య పదార్థములందు పరమోత్తమ మైన పదార్థము సంసారతారకమైన ధర్మముదాక ఈ మహాక్షేత్రము సర్వశ్రేష్ఠము. ఈ విశేషములెల్ల పారాయణార్హములు, సుబోధకములు పుణ్యప్రదము అని బ్రహ్మ మునులతో చెప్పెను. (69)