బ్రహ్మ మహా పురాణము

కండుకృత బ్రహ్మ పారస్తవము

పారంపరం విష్ణురపారపారః పరః పరేభ్యః పరమార్థరూపః |

సబ్రహ్మపారః పరపారభూతః పరః పరణామపి పారపారః

సకారణం కారణం సంశ్రితోZపి తస్యాపి హేతుః పరహేతు హేతుః |

కార్యోపి చైష సహకర్మకర్తృ .... రూపైరనేకైరవ తీహసర్వమ్ ||

బ్రహ్మ ప్రభుర్భ్రహ్మ స సర్వభూతో బ్రహ్మ ప్రజానాం పతిరచ్యుతోZసౌ|

బ్రహ్మావ్యయం నిత్యమజం స విష్ణు రపక్షయాద్యైరఖిలై రసంగః ||

బ్రహ్మాక్షరమజం నిత్యం యదాZ సౌ పురుషోత్తమః

తదా రాగాదయో దోషాః ప్రయాంతు ప్రశమం మమ ||

పారం పరం విష్ణుః = సంసార మార్గమునకు సర్వోత్కృష్టము పునరావృత్తి రహితము అగు అవధి లేక గురుపరంపరచే తెలియదగిన రహస్య వస్తువు శ్రీహరి, అపార పారః = తెలియలేని అంతముగలవాడు లేక అపరిమిత శక్తి గలవాడు, పరేభ్యః పరః = ఉత్కృష్టముగా ఎంచబడు ఆకాశాదులకంటె గొప్పవాడు, (మహతో మహీయాన్), పరమాత్మ రూపః = పరబ్రహ్మ రూపుడు. బ్రహ్మపారః = బ్రహ్మ ఉద్భూతమగు ప్రధానమునకు అవసానమైన వాడు లేక సబ్రహ్మపారః = వేదములు తపస్సులతో కూడికొనినవారు సబ్రహ్మలు. అట్టివారికి గంతవ్యుడు, పరపారభూతః = ఆత్మేతరమగు అనాత్మ ప్రపంచమునకు అవధియైనవాడు పరాణా మపి పరః = ఆత్మగా ప్రతీయ మానములు అగుచున్న ఇంద్రియాదులకు అతీతుడు, పార పారః = పూరకములు, పోషకములు అయిన ఆకాశాదులకు లేక ఇంద్రాదులకు కూడ పూరకుడు పోషకుడు అయినవాడు.

ఆ విష్ణువు అన్నిటికి కారణము. సమస్త కార్యములకు కారణమైన విపంచ మహాభూతములు తన్మాత్రలు వానికి కూడ కారణమైనవాడు. అహంకారమునకు మహత్త్వము హేతువు. దానికి కూడ హేతువైన వాడు అనగా ఉపాదాన కారణభూతుడు. అతడే క్రియాకారక రూపముతో సమస్తమునకు రక్షకుడునై ఉన్నాడు. ఆతడు వేదనిర్వాహకుడు. ఆతడే వేదము. వేదాంగాదులుకూడ ఆతడే. వేదార్థస్మర్తలగు మనువు మొదలైనవారికి కూడ ప్రభువైన వాడు. అవ్యయుడు నిత్యుడు పుట్టుక లేనివాడు. షడ్భావ వికారములతో సంబంధము లేనివాడు. బ్రహ్మ పుట్టుక లేనివాడు నాశన రహితుడు నిత్యుడునై, అట్లు ఈ పురుషోత్తముడును అట్లే అని స్తుతించుచున్న నా యొక్క రాగద్వేషాదులు శమించుగాక!

అని ఇట్లు ఆముని జపించు బ్రహ్మ పారమునువిని ఆతని అచంచల భక్తి పారమ్యమును ఎఱిగి పురుషోత్తమస్వామి పరమప్రీతితో భక్తవత్సలుడు కావున అతని దగ్గరకేగి వినతాదుల నందనుడైన గరుడునిపై కూర్చుండి ఇట్లనెను.

“ఓ మునీ! నీ మదిని ఉన్న పని తెలుపుము. వరమీయ వచ్చితిని. అడుగులమన కండు ముని కనులు తెఱచి ఎదుటనున్న కమలాక్షుని అతసీ కుసుమ సంకాశుని, శంఖ చక్ర గదా హస్తుని, కిరీటాంగదధారిని పీతాంబరుని శ్రీవత్సవక్షుని, వనమాలా భూషితుని, చతుర్బాహువును, దివ్యగంధాను లిప్తుని, దివ్యమాలాభూషితుని, సమున్నత మూర్తిని చూచి వెఱగంది తనువు పులకరింప సాష్టాంగ దండప్రణామము ఆచరించెను. మఱియు ఇపుడునా జన్మ సఫలమైనది. నా తపస్సు ఫలించినదని ఆ మునివరుడు ఇట్లు వినుతింప అరంభించెను.

కండుముని చేసిన పురుషోత్తమ స్తోత్రము :

నారాయణ! హరే! కృష్ణ! శ్రీవత్సాంక! జగత్పతే!

జగద్బీజ! జగద్దామ! జగత్సాక్షిన్న మోZస్తుతే ||

అవ్యక్త! జిష్ణో! ప్రభవ! ప్రధాన | పురుషోత్తమ |

పుండరీకాక్ష | గోవింద | హృషీకేశ! నమోస్తుతే ||

హిరణ్యగర్భ! శ్రీనాథ పద్మనాభ! సనాతన!

భూగర్భ! ధ్రువ! ఈశాన! హృషీకేశ! నమోస్తుతే ||

అన్యాద్యంతామృతాజేయ! జయత్వం జయతాం వర! |

అజితాఖండ! శ్రీకృష్ణ! శ్రీనివాస! నమోస్తుతే ||

పర్జన్య ధర్మకర్తాచ దుష్పార దురధిష్ఠిత! |

దుఃఖార్తినాశన! హరే! జలశాయిన్నమోZ స్తుతే ||

భూతపావ్యక్త భూతేశ భైతత్వైరనాకుల | భూతాధివాస |

భూతాత్మన్భూతగర్భ! నమోZస్తుతే ||

యజ్ఞ! యజ్వన్యజ్ఞధర! యజ్ఞధాతాZ భయప్రద!

యజ్ఞగర్భ! హిర్యణ్యాంగ! పృశ్నిగర్భ! నమోZ స్తుతే ||

క్షేత్రజ్ఞః క్షేత్రభృతేక్షత్రీ క్షేత్రహా క్షేత్రకృద్ప్వశీ!

క్షేత్రాత్మనే క్షేత్రరహిత! క్షేత్ర స్రష్టే నమోZ స్తుతే ||

గుణాలయ! గుణావాస! గుణాశ్రయ! గుణావహ!

గుణభోక్త! గుణారామ! గుణాత్యాగిన్న మోZస్తుతే ||

త్వంవిష్ణుస్త్వంహరిశ్చ క్రీత్వం జిష్ణుస్త్వం జనార్దనః |

త్వంభూత స్త్వంవషట్కార స్త్వంభవ్య స్త్వంభవత్ప్రభుః ||

త్వంభూత కృత్త్వమవ్యక్తస్త్వం భవోభూతభృద్భద్ధవాన్!

త్వంభూతభావనో దేవస్త్వామాహుర జమీశ్వరమ్ ||

త్వంమనంతః కృతజ్ఞస్త్వం ప్రకృతి సత్త్వం వృషాకపిః |

త్వం రుద్రస్త్వం దురాధర్క్షస్త్వసత్త్వమమోఘ స్త్వమీశ్వరః ||

త్వం విశ్వకార్మజిష్ణు స్తంZ త్వంశంభు స్త్వంవృషాకృతిః |

త్వం శంకర స్త్వముశనాత్వంసత్యం త్వం తపోజనః ||

త్వం విశ్వజేతాత్వం శర్మత్వం శరణ్య స్త్వమక్షరమ్ |

త్వంశంభు సస్త్వం స్వయంభూశ్చత్వం జేష్ఠ సత్త్వంపరాయణః ||

త్వమాదిత్య సత్త్వమోంకార స్త్వం ప్రాణ స్త్వంతమిస్రహా |

తం పర్జన్య సస్త్వం ప్రథిత వేధా స్త్వంసురేశ్వరః ||

త్వ మృగ్యజుః సామ చైవత్వ మాత్మాసంమతోభవాన్ |

త్వ మగ్ని స్త్వం చపవన స్త్వ మాపోవసుధా భవాన్ ||

త్వం స్రష్టా త్వం తథా భోక్తా హోతాత్వంచ హవిః క్రతుః!

త్వం ప్రభుస్త్వం విభుః శ్రేష్ఠస్తమ లోక పతిరచ్యుతః ||

త్వం సర్వదర్శనః శ్రీమాంస్త్వం సర్వదమనో రిహా |

త్వ మహాస్త్వం తథా రాత్రిస్త్వామాహు ర్వత్సరంబుధాః ||

త్వంకాల స్త్వంకలా కాష్ఠా త్వం ముహూర్తః ఓణాలవాః |

త్వంబాల స్త్వంతథా వృద్ధస్త్వం పుమా స్త్రీ నపుంసకః ||

త్వం విశ్వయోని స్త్వం చక్షు స్త్వం వేదాంగ స్త్వ మవ్యయః |

త్వం శాశ్వత సత్త్వమజిత స్త్వముపేంద్రస్త్వముత్తమః ||

త్వం వేదవేద స్త్వం దాతా విధాతాత్వం సమాహితః |

త్వం సర్వ విశ్వసుఖదస్త్వం వేదాంగం త్వమవ్యయః ||

త్వం వేదస్త్వంధాతా విధాతా త్వం సమాహితః |

త్వం జలనిధి రామూలం త్వం ధాతాత్వం పునర్వసుః ||

త్వం వైద్య స్త్వంధృతాత్మా చ త్వ మతీంద్రియ గోచరః |

త్వ మగ్రణీ ర్గ్రామణీ స్త్వం త్వం సుపర్ణ స్త్వ మాదిమాన్ ||

త్వం సంగ్రహ స్త్వం సుమహత్త్వం ధృతాత్మా త్వ మచ్యుతః |

త్వం యమస్త్వం చ నియమ స్త్వం ప్రాంశు స్త్వం చతుర్భుజః ||

త్వమే వాన్నాంతరాత్మా త్వం పరమాత్మా త్వ ముచ్యతే ||

త్వం గురు స్త్వం గురుతమ స్త్వం వామ స్త్వం ప్రదక్షిణః |

త్వం పిప్పల స్త్వ మగమ స్త్వం వ్యక్త స్త్వం ప్రజాపతిః ||

హితణ్యనాభ స్త్వం దేవ స్త్వం శశీ త్వం ప్రజాపతిః |

అనిర్దేశ్యవపు స్త్వం వైత్వం యమ స్త్వం సురారిహా ||

త్వం చ సంకర్షణో దేవ స్త్వం కర్తా త్వం సనాతనః |

త్వం వాసుదేవో Zమేయాత్మాత్వ మేవ గుణవర్జితః

త్వం జేష్ఠస్త్వం వరిష్ఠత్వం సహిష్ణుశ్చ మాధవః |

సహస్ర శీర్షా త్వందేవ స్త్వ మవ్యక్తః సహస్రదృక్ ||

సహస్రపాద స్త్వం దేవ స్త్వం విరాట్త్వం సుప్రభుః |

త్వమేవ తిష్ఠసే భూయో దేవదేవ దశాంగులః ||

యద్భూతం తత్త్వమేవోక్తః పురుషః శక్ర ఉత్తమః

యద్భావ్యం త త్త్వ మీశానస్త్వ మృతస్త్వ తథాZమృతః ||

త్వత్తోరోహత్యయం లోకోమహీయాం స్త్వ మనుత్తమః |

త్వం జ్యాయా న్పురుషస్త్వం చ త్వం దేవ దశథాస్థితః

విశ్వభూత శ్చతుర్భాగోనవభాగోZమృతో దివి |

నవభాగోZన్తరిక్షస్థః పౌరుషేయః సనాతనః ||

భాగద్వయం చ భూసంస్థం చతుర్భాగోZప్యభూదిహ |

త్వత్తో యజ్ఞాః సంభవంతి జగతో వృష్టికారణమ్ ||

త్వత్తో విరాట్సముత్పన్నో జగతో హృది యః పుమాన్ |

సోZతిరిచ్యత భూతేభ్య స్తేజసాయళసాశ్రియా ||

త్వత్తః సురాణా మాహారః పృషదాజ్య మజాయత |

గ్రామ్యారణ్యా శ్చౌషధయ స్త్వత్తః పశుమృగాదయః ||

ధ్యేయధ్యాన పర స్త్వం చ కృతవా నసి చౌషధీః |

త్వం దేవదేవ సప్తాస్య కాలాఖ్యో దీప్తవిగ్రహః ||

జంగమాజంగమం సర్వం జగదేత చ్చరాచరమ్ |

త్వత్తః సర్వ మిదం జాతం త్వయి సర్వం ప్రతిష్ఠితమ్ ||

అనిరుద్ధ స్త్వం మాధవ స్త్వం ప్రద్యుమ్నః సురారిహా |

దేవ! సర్వసుర శ్రేష్ఠ! సర్వలోక పరాయణ! ||

త్రాహి మా మరవిందాక్ష నారాయణ నమోZ స్తుతే |

నమస్తే భగవన్విష్ణో నమస్తే నమస్తే పురుషోత్తమ ||

నమస్తే సర్వలోకేశ | నమస్తే కమలాలయ |

గుణాలయ | నమస్తేZస్తు గుణాకర ||

వాసుదేవ! నమస్తేZస్తు నమస్తేZస్తు సురోత్తమ |

జనార్దన నమస్తేZస్తు సనాతన ||

నమస్తే యోగినాం గమ్య | యోగావాస నమోస్తుZ తే |

గోపతే | శ్రీపతే | విష్ణో నమస్తేZస్తు మరుత్పతే ||

జగత్పతే జగత్సూతే నమస్తే జ్ఞానినాం పతే |

దివస్పతే నమస్తేZస్తు మహీపతే ||

నమస్తే మధుహంత్రే చ నమస్తే పుష్కరేక్షణ |

కైటభఘ్న నమస్తేZస్తు సుబ్రహ్మణ్య నమోస్తుతే ||

నమోZస్తుతే మహామీన శ్రుతి పృష్ఠధరాచ్యుత |

సముద్రసలలిలక్షోభ పద్మజాహ్లాద కారిణే ||

అశ్వశీర్ష మహాఘోణ మహాపురుష విగ్రహ |

మధుకైటభ హంత్రే చ నమస్తే తురగానన ||

మహాకమఠ భోగాయ పృధివ్యుద్ధరణాయ చ |

విధృతాద్రి స్వరూపాయ మహాకూర్మాయతే నమః ||

నమో మహావరాహాయ పృథివ్యుద్ధార కారిణే |

నమశ్చాZZ ది వరాహాయ విశ్వరూపాయ వేధసే ||

నమోZనంతాయ సూక్ష్మాయ ముఖ్యాయ చ వరాయ చ |

పరమాణు స్వరూపాయ యోగిగమ్యాయ తేనమః||

తస్త్మేనమో కారణ కారణాయ |

యోగీంద్ర వృత్తి నిలయాయ సుదుర్విదాయ ||

క్షీరార్ణవాశ్రిత మహాహిసుతల్పగాయ |

తుభ్యం నమః కనకరత్న సుకుండలాయ ||

అని ఇట్లు స్తుతింపబడి సంప్రీతుడై మాధవుడు మునివర! నావలన నీవు కోరునది ఏమో త్వరగ చెప్పుము అనగా కండుముని జగన్నాథా! తలచుకొన్నంత మేను గగుర్పొడుచునట్టి ఈ దాటరాని అనిత్య సంసారమందు బహుదుఃఖకరమై అరటాకువలె పేలవమై నశించు స్వభావముగల నిరాశ్రయము, నిరాలంబము అగు నీటి బుడగవంటి భయంకర సంసారమున మాయామోహితుడనై తిరుగుచున్నాను. విషయవాసనలచేత చెడిన మనసుతో దీని అంతు దరికాన లేకున్నాను. దీనికి దడిచి ఇపుడు నిన్ను దిక్కంటిని, కృష్ణా! నన్ను ఉద్ధరింపుము ‘నీ ప్రసాదమున పునరావృత్తిలేని దుర్లభమైన సనాతన ముక్తిపదమును పొందగోరుచున్నాను’ అనగా భగవంతుడు

“ఓ ముని శిరోమణి! నీవు నా భక్తుడవు. నిచ్చలు నన్ను ఆరాధింపుము. నా అనుగ్రహమున నిశ్చలమైన మోక్షమును పొందగలవు. నా భక్తులు ఏకులమువారైనను స్త్రీలైన పరమసిద్ధిని పొందుదురు. నీవు పొందుటలో ఆశ్చర్యమేమి. కుక్క మాంసము తినువాడైనను మిక్కిలి శ్రద్ధగొని నాయెడ భక్తి కలవాడు అభీష్టసిద్ధి పొందును. మఱి ఇతరుల మాట జెప్పనేల?” అని పలికి, భక్తవత్సలుడగు హరి అంతర్ధానము అయ్యెను.

విష్ణువు అట్లు అదృశ్యమైనంతట కండువు మహా ఆనందము పొంది, నిష్కాముడై, స్వస్తచిత్తుడై, ఇంద్రియముల నియమించుకొని అహంకారము వదలి మనస్సు నిలకడగొన నిర్లేపుడు నిర్గుణుడు శాంతుడు, సత్తామాత్రుడునైన పురుషోత్తమదేవుని ధ్యానించి అమర దుర్లభమైన పరమపదమును పొందెను. మహాత్ముడగు కండువు యొక్క కథను ఎవ్వరు చదువుదురో, విందురో వారు పాపములనును విడిచి స్వర్గలోకము పొందురు. ఓ ముని తల్లజులార! కర్మ భూమియగు భారత వర్షమును గుఱించి మోక్ష క్షేత్రముల గురించి పరమాత్మ పురుషోత్తముని గుఱించి చెప్పితిని. ఆ వరదుడైన ప్రభుని భక్తితో ఎవ్వరు ధ్యానింతురో, దర్శింతురో, స్తుతింతురో వారు పవిత్రులై రాజ్య భోగములను అనుభవించి స్వర్గసుఖములలో ఓలలాడి అవ్యయమగు ముక్తినందుదురు. (178) అని ఇంకను