అవ్వల మిక్కిలి చలువల వెదజల్లు జలముల మించుచు హేమంత శశిర ఋతు దేవతలు ఆ వివాహమునకు వచ్చిరి. హిమవంతుడు ఆ ఋతు విలాసినులు ప్రాలేయ చూర్ణముల వర్షించుచుండ రజతహర్తపగిది రాణించెను.