ఓం సూర్యోZర్యమా భగస్త్వష్టా పూషాZర్కః సవితా రవిః |
గభస్తిమా నజః కాఓ మృత్యుర్దాతా ప్రభాకరః ||
పృథివ్యాపశ్చ తేజశ్చ ఖం వాయుశ్చ పరాయణం |
సోమో బృహస్పతిః శుక్రో బుధోంZగారక ఏవచ ||
ఇంద్రో వివస్వాన్ దీప్తాంశుః శుచిః శౌరిః శనైశ్చరః |
బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ స్కందో వైశ్రవణో యమః ||
వైద్యుతో జాఠర శ్చాగ్ని రైంధన స్తేజసాం పతిః |
ధర్మధ్వజో వేదకర్తా వేదాంగో వేదవాహనః ||
కృతం త్రేతా ద్వాపరశ్చ కలిః సర్వామరాశ్రయః |
కలా కాష్ఠా ముహూర్తాశ్చ క్షపా యామా స్తథా క్షణాః ||
సంవత్సరకరోZశ్వత్థః కాలచక్రో విభావసుః |
పురుషః శాశ్వతో యోగీ వ్యక్తావ్యక్తః సనాతనః ||
కాలాధ్యక్షః ప్రజాధ్యక్షో విశ్వకర్మా తమోనుదః |
వరుణః సాగరోంZశశ్చ జీమూతో జీవనోZరిహా ||
భూతాశ్రయో భూతపతిః సర్వలోక నమస్కృతః |
స్రష్టా సంవర్తకో వహ్నిః సర్వస్యాZZది రలోలుపః ||
అనంతః కపిలో భానుః కామదః సర్వతోముఖః |
జయో విశాలో వరదః సర్వభూతనిషేవితః ||
మనః సుపర్ణో భూతాదిః శీఘ్రగః ప్రాణధారణః |
ధన్వంతరి ర్థూమకేతు రాదిదేవోZదితేః సుతః ||
ద్వాదశాత్మా రవి ర్దక్షః పితా మాతా పితామహః |
స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపమ్ ||
దేహకర్త ప్రశాంతాత్మా విశ్వాత్మా విశ్వతోముఖః |
చరాచరాత్మా సూక్ష్మాత్మా మైత్రేయః కరుణాన్వితః ||
ఏతద్వై కీర్తనీయస్య సూర్యస్యామిత తేజసః |
నామ్నా మష్టశతం రమ్యం మయా ప్రోక్తం ద్విజోత్తమాః ||
సురగణ పితృ యక్ష సేవితం | హ్యసుర నిశాకర సిద్ధవందితం |
వరకనక హుతాశన ప్రభం ప్రణిపతితోZస్మిహితాయ భాస్కరమ్ ||
గొప్ప తేజశ్శాలియగు శ్రీ సూర్యుని అష్టోత్తర శతనామములు చెప్పబడెను. సురాసుర సిద్ధపితృ యక్షగణ సేవితుడును, సువర్ణము అగ్నియొక్క కాంతివంటి కాంతి గలవాడును అగు భాస్కరుని నా శ్రేయస్సు కొరకు నమస్కరింతును. సూర్యోదయ కాలమున ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును సావధానచిత్తుడై చదివినవాడు యోగ్యమైన భార్యను పుత్రులను ధన రత్న సముదాయమును, పూర్వ జన్మస్మృతిని, జ్ఞాపక శక్తిని, గొప్ప ధారణా శక్తిని పొందగలడు. సంసార దావాగ్ని సాగరము నుండి విముక్తిని పొందును. మనోరథముల నెల్ల పొందును. (33)