ఇంకను బ్రహ్మ ఇట్లు చెప్పెను - అచమనము కావించి మౌనము బట్టి జీవర్షి పితృ తర్పణములను కావించి శ్రీమన్నారాయణ పూజ ఇట్లు చేయవలెను. మూరెడు చతురము గల మండలము లిఖింపవలెను. అందు నాలుగు కోణములు నాలుగు ద్వారములు గుర్తింపవలెను. సముద్ర తీరమున అష్టదళ పద్మాకారమున లిఖించిన అ మండల మందు నడుమ తామర పూవుదుద్దుగుర్తుగా, పసుపు కుంకుమలతో చిత్రింపవలెను. నారాయణాష్టాక్షరీ మంత్ర పూర్వకముగ ఇందు నారాయణుని పూజింపవలెను.
అష్టాక్షరీ మంత్ర సంపుటితో అంగన్యాస కరన్యాసాదులు ధ్యాన ఆవాహనాది షోడశోపచారాది పూజలు కల్పమును అనుసరించి ఆచరింపవలెను. (61)