బ్రహ్మ మహా పురాణము

ప్రతిమా నిర్మాణ విధాన పర్యాలోచనము

అని చెప్పగా విని మునులు ఇట్లు అనిరి-”దేవదేవా! ఆ ప్రతిమలు ఇంద్రద్యుమ్నునిచే ఎట్లు నిర్మింపబడినవి, ఏ ప్రకారమున మాధవుడు సంతుష్టుడయ్యెను అదియెల్ల ఆనతిమ్ము వినవలెను. మా మనసులు ఉవ్విళ్ళూరుచున్నవి” అన

బ్రహ్మ ఇట్లు అనియె-”మునివరులారా! వినుండు. వేదతుల్యమైన పురాణమిది. యజ్ఞారంభముకాగా దేవప్రాసాద నిర్మాణము జరుగగా అఱేనికి విగ్రహ నిర్మాణమును గూర్చిన ఆలోచన రేయింబవళ్ళు మనసునందు ఇరవుకొనెను. సృష్టిస్థితిలయ కర్తయైన ఆ సర్వేశ్వరుని నేనెఱుంగను. ఆస్వామిని నేనెట్లు కనుగొందునను ఊహతో రాత్రియుంపవలును పండుకొనడు. ఆ ఆవేదనలో ఆతని అష్ట ఐశ్వర్య సమృద్ధి మనస్తుష్టిని ఈయ జాలక పోయెను. రాళ్ళు మన్ను కట్టెలందేది విష్ణు ప్రతిమకు యోగ్యమగును? ఎట్టి మూర్తిని ప్రతిష్ఠించిన విష్ణువు ప్రీతుడగును అను ఆలోచనలో అతడు మునిగెను. అంతట అతడు పాంచరాత్ర విధానమున పురుషోత్తమ దేవుని బూజించి అదే ఆలోచనగొని స్వామిని స్తుతింప ఆరంభించెను. (48)