భూతాత్మయగు విష్ణువు యొక్క కేవల క్షమాలక్షణమైన అవతారము దత్తాత్రేయుడను పేరవచ్చి ప్రఖ్యాతికెందినది. వేదములు నశింప ప్రక్రియ యజ్ఞలు నశింప చాతుర్వర్ణ్యము సంకరమై, ధర్మము శిథిలమై అధర్మము పెరుగ సత్యముచెడి అసత్యము పెరుగ, ధర్మము వ్యాకులముకాగ యజ్ఞముతో క్రియలతో అతడు వేదములను పునరుద్ధరించెను. చాతుర్వర్ణ వ్యవస్థను ఆమహాత్ముడు కాపాడెను. మరియు హైహయరాజ వంశమువాడైన బుద్ధిమంతుడగు కార్తవీర్యునకు ఆయన వరమిచ్చెను. ఈ నీ బాహువులు రెండును నా నిమిత్తముగ వేయి బాహువులగును. సర్వ వసుధను పాలింతువు. యుద్ధము నందు శత్రువులకు జూడ అశక్యుడ వగుదువు అని వాగ్దానము చేసెను. ఈ అవతారము విష్ణువు యొక్క అవతారము.