బ్రహ్మ మహా పురాణము
కృష్ణావతారం
మహాత్ముడైన విష్ణువు యొక్క మరొక అవతార వర్ణనము. ఈ తరువాతి అవతారము. ఇది సర్వలోక హితమునకై మాధుర కల్పమునందు వచ్చినట్లు విఖ్యాతి గన్నది. ఇందు సాల్వ చైద్యకంస ద్వివిధ వృషభ కేశి పూతనారిష్టాదులను కువలయాపీడ చాణూర ముష్టికాదులను మానుషాకారముతో వచ్చి సంహరించెను. ఇందే బాణుని వేయి బాహువులు తెగినవి. నరకుడు కూలెను. కాలయవనుడు కడతేరెను. అనేకమంది రాజుల యొక్క సర్వ రత్నములు (సర్వ ద్రవ్యములందు సర్వ శ్రేష్ఠ వస్తువులు) ద్వారకకు కొనిరాబడినవి. దుర్గరులైన రాజులు భూతలమున కొరిగిరి. ఇది లోక హితమునకు వచ్చిన పరమాత్మయొక్క యవతారము.