బ్రహ్మ మహా పురాణము
యజ్ఞవరాహమూర్తి స్వరూప వర్ణనము
ఆయజ్ఞ వరాహమూర్తి పాదములు నాల్గు వేదములు. ఆయన కోర యూప స్తంభము. క్రతువు చేతులు, అశ్వినులు ముఖము, అగ్ని జిహ్వ, దర్భలు రోమములు, బ్రహ్మ శిరస్సు, అహో రాత్రములు కన్నులు, వేదాంగములు కర్ణ భూషణములు, ఆజ్యము నాసిక, స్రువము ముట్టి, సామధ్వని ఘర్ఘర స్వరము. సత్యధర్మములు ఆ శ్రీమంతుని స్వరూపము. ప్రాయశ్చిత్తము ఆయన ఘోరమైన ముఖము. పశువు మోకాళ్ళు ఉద్గాతి ఆయన పేరు, మంత్రము, మూవు, వేదిక, హవిస్సు వాసన (హవ్యకవ్యములు) ప్రాగ్వంశము నానాదక్షతలతో కూడినది శరీరము. ఆసనము శరీరకాంతి, పత్ని మణిమయమైన శృంగమువలె లేచి దక్షిణ, హృదయము అనేక సత్రమయము యజ్ఞ వరాహమూర్తి యొక్క స్వరూపము. ఉపాకర్మాష్టకము దంతములు, ప్రవర్గలా శరీరమందలి సుడులు, ఛందస్సులన్నియు ఆయన నడచుదారులు, గాహ్యోపనిషత్తు సశైలవనము. సాగర పర్యంతము ఏకార్ణవ మందు మునిగిన భూమిని తన కొమ్ముచివర లోకహితముకొరకు పెల్లగించి ధరించెను. ఈ విధముగ యజ్ఞ వరాహమూర్తిచేత వసుంధరాదేవి భూతహితార్ధము ఉద్ధరింపబడినది.