బ్రహ్మ మహా పురాణము
సర్వతీర్థమాహాత్మ్యము
మునులు-ధర్మజ్ఞా! భూమియందు ఎన్ని పుణ్యతీర్థములు, క్షేత్రములు ఉన్నవో వానిని గురించి వినగోరుచున్నాము. ఎఱింగింపుము అని అడుగగా వారికి
సూతుడు ఇట్లు అనియెను-
“ఏవని చేతులు, పాదములు, మనస్సు స్వాధీనములుగా ఉండునో, జ్ఞానము, తపస్సు కీర్తియు ఎవ్వనికి గల్గునో అతడు సర్వతీర్థముల సేవించిన ఫలమందును. ఎవని మనస్సు, మాట, ఇంద్రియములు పరిశుద్ధములో అవి వాని శరీరమందు ఉన్న తీర్థములే, అవి స్వర్గమార్గమును చూపగలవు. అశుచియైన కల్లుకుండ నూరుమారులు నీట కడిగినను శుచిగానట్లు అంతఃకరణము దుష్టమైన ఎడల తీర్థములందు ఎన్నింట మునిగినను, పరిశుద్ధము కానేరదు. తీర్థములు, దానములు వ్రతములు, ఆశ్రమములు, దుస్స్వభావుని, దాంభికుని, విశృంఖల సంచారములయిన ఇంద్రియములు గలవానిని పవిత్రుని జేయలేవు. ఇంద్రియముల ఒదిగించికొని మనుష్యుడు ఎందెందు ఉన్నను అదియది వానికి కురుక్షేత్రము ప్రయాగ పుష్కరమును అగును. కావున భూమిగల తీర్థ క్షేత్రములను గురించి క్లుప్తముగ దెల్పెదను వినుడు.
మహర్షులారా!
మొదటిది పుష్కరతీర్థము. నైమిశారణ్యము, ప్రయాగ, ధర్మారణ్యము, ధేనుకము, చంపకారణ్యము, సైంధవారణ్యము, పవిత్రమైన మగధారణ్యము, దండకారణ్యము, గయ, ప్రభాసతీర్థము, శ్రీతీర్థము, దివ్యమైన కనఖలము, భృగుతుంగము, హిరణ్యాక్షము, భీమారణ్యము, కుశస్థలి, లోహాకులము, కేదారము, మందరారణ్యము, మహాబలము, కోటితీర్థము, సర్వపాపహరతీర్థము, రూపతీర్థము, శూకరవతీర్థము, మహాఫలదాయక చక్రతీర్థము, యోగతీర్థము, సోమ తీర్థము, సోహోటకతీర్థము, కోకాముఖతీర్థము, పవిత్రమైన బదరీ పర్వతము, సోమతీర్థము, తుంగకూటము, స్కందాశ్రమము, కోటితీర్థము, అగ్నిపద తీర్థము పందశిఖము ధర్మోద్భవము కోటితీర్థము బాధప్రమోచన తీర్థము గంగాద్వారము పంచకూటము మధ్యకేసరము చక్రప్రభ మతంగ తీర్థము కుశదండ తీర్థము దంష్ట్రాకుండము విష్ణుతీర్థము సార్వకామిక తీర్థము మత్స్యతిల తీర్థము బదరీ సుప్రభ బ్రహ్మ కుండము, వహ్నికుండము, సత్యపద తీర్థము, చతుస్స్రోత తీర్థము, చతుశ్శృంగము ద్వాదశ ధారక శైలము, మానసము, స్థూల శృంగము, స్థూల దండము, ఊర్వశీ తీర్థము, లోకపాలము, మనువరము, సోమశైలము, సదాప్రభ మేరుకుండము, సోమాభిషేచన తీర్థము, మహాస్రోత తీర్థము, కోటరకము, పంచధారత్రిధారక సప్తధార, ఏకధార అమరకంటక తీర్థము, శాలగ్రామ తీర్థము, చక్రతీర్థము, కోటిద్రుమ తీర్థము, బిల్వప్రభము దేవహ్రదము, విష్ణుహ్రదము, శంఖప్రభ పున్నాగతీర్ధము, దేవప్రభ విద్యాధరము గాంధర్వము, శ్రీతీర్థము, బ్రహ్మహ్రదము, సాతీర్థము లోకపాల తీర్థము, మణిపూరగిరి పంచహ్రదము, పుణ్యమైన పిండారక తీర్థము, మాలవ్యతీర్థము, గోప్రభావ తీర్థము, గోవర తీర్థము, వటమూలక తీర్థము, స్నానదండతీర్థము, ప్రయాగ గుహ్యవిష్ణుపద కన్యాశ్రమ వాయుకుండ తీర్థము, జంబూమార్గ తీర్థము, అట్లే శ్రేష్ఠమైన గభస్తితీర్థ యయాతి పతన కోటితీర్థ భద్రము మహాకాలవన తీర్థప్రజ అర్బుద మహాకాలవన నర్మదాతీర్థ పింగుతీర్థ వాశిష్ఠ పృధుసంగమ దౌర్వాసిక, పిఞ్జరక, ఋషితీర్థ బ్రహ్మతుంగ వసుతీర్థ కుమారిక శత్రుతీర్థ పఞ్చనద రేణుకాతీర్థ పైతామహవిమల రుద్రపాద మణిమత్త కామ తీర్థ కృష్ణతీర్థ కుశావిల యజన యాజన బ్రహ్మవాలుక పుష్పన్యాస పుండరీక మణిపూర దీర్ఘసత్ర హయపద అనశన గంగోద్భేద, శివోద్భేద, నర్మదోద్భేద, వస్త్రాపద, దారుబల, ఛాయారోహణ, సిద్ధేశ్వర, మిత్రబల కాళికాశ్రమ వటావట భద్రవట కౌశాంబి దివాకర సారస్వతద్వీప విజయ కామద రుద్రకోట సుమనస నద్రావనామిత స్యమంతపంచక బ్రహ్మతీర్థ సుదర్శన సతత పృధివసర్వ పారిప్లవ పృథూదక దశాశ్వమేధిక సర్పిజ విషయాంతిక కోటి తీర్థ-పంచనద-వారాహ-యక్షిణీహ్రదతీర్థ పుండరీక సోమతీర్థముఞ్ఞవాట బదరీవన ఆసీన రత్నమూలక లోకద్వార పఞ్ఞ్పతీర్థ కపిలాతీర్థ సూర్య శంఖినీ గోభవన యక్షరాజ బ్రహ్మావర్త సుతీర్థ కామేశ్వర మాతృతీర్థ శీతవన స్నానలోమాపహమాన నంసరక దశాశ్వమేధ కేదార బ్రహ్మోదుంబర సప్తర్షికుండ దేవీతీర్థ సుజమ్బుక ఈహాస్పద కోటికూట కిందాన కింజప కారండవ అవేద్యన త్రివిష్టప పాణిఖాత మిశ్రక మధూవట మనోజవ కేశికీ దేవలోక ఋణమోచన దివ్య నృగధూమ విష్ణుపద అమరహద్ర కోటితీర్థ శ్రీకుంజ శాలితీర్థ నైమిశేయ బ్రహ్మస్థాన సోమకన్యాలోక బ్రహ్మతీర్థమన స్తీర్థ కారుపావన సౌగంధిక వనమణి సరస్వతి ఈశానప్రవర పావన పాఞ్చయజ్ఞిక త్రిశూలధర మాహేంద్ర దేవస్థాన కృతాలయ శాకంభరి దేవతీర్థ సువర్ణాక్ష కలిహ్రద క్షీరస్రవ విరూపాక్ష భృగు కుశోద్భవ బ్రహ్మతీర్థ బ్రహ్మయోని నీలపర్వత కుబ్జాంబ భద్రవట వశిష్ఠపద స్వర్గద్వార ప్రజాద్వార కాళికాశ్రమ రుద్రావర్త సుగంధాశ్వ కపిలావన భద్రకర్ణహ్రద శంకుకర్ణహ్రద సప్తసారస్వత ఔశసన కపాలమోచన అవకీర్ణ కామ్యక చతుస్సాముద్రిక శతిక సహస్రిక రేణుక పంచవటక విమోచన ఔజసస్థాణు కురుతీర్థ స్వర్గద్వార కుశధ్వజ విశ్వేశ్వర మాణవక కూప నారాయణాశ్రమ గంగాహ్రదవట బదరీ పాటన ఇంద్రమార్గ ఏకరాత్ర క్షీరకావాన సోమదధీచ శ్రుత కోటితీర్థస్థలీ భద్రకాళీ అరుంధతీ వనబ్రహ్మావర్త అశ్వవేదికుబ్జావన యమునా ప్రభవ వీరప్రమోక్ష సింధూత్థ ఋషికుల్యా సకృత్తిక ఉర్వీసంక్రమణ మాయావిద్యోద్భవ మహాశ్రమ వైతసికారూప సుందరికాశ్రమ బాహుతీర్థ చారునదీ విమలాశోక పంచనద మార్కండేయ సోమ సితోద మత్స్యోదరి సూర్యప్రభ సూర్యతీర్థ అశోకవన అరుణాస్పద కామదనవాలుక శుక్రపిశాచమోచన సుభద్రాహ్రద విమల దండకుండ చండీశ్వర జ్యేష్ఠ స్థానహ్రద బ్రహ్మసర జైగీషవ్యగుహా హరి కేశవన అజాముఖనర ఘంటాకర్ణహ్రద పుండరీకహ్రద కర్కోటకవాపీ సుపర్ణోదపాన శ్వేతతీర్థహ్రద ఘర్ఝరి కాకుండ శ్యామాకూప చంద్రికా శ్మశానస్తంభకూప వినాయకహ్రద, సింధూద్భవమాప బ్రహ్మనర రుద్రావాన నాగతీర్థ పులోమక భక్తహ్రద క్షీరనర ప్రేతధార కుమారక బ్రహ్మావర్త కుశార్త దధికర్ణోధపాస శృంగమహాతీర్ధ మహానదీ బ్రహ్మనగర యాశీర్ష అక్షయవట దక్షిణ గోమయ ఉత్తర గోమయ రూపశీతిక కపిలాహ్రద గృధ్రవట సావిత్రీహ్రద ప్రభాసనసీతవన యోనిద్వార ధేనుక ధన్యక కోకిలా మతఙ్గహ్రద పితృకూప రుద్రతీర్థ శక్రతీర్థ సుమాలి బ్రహ్మస్థాన సప్తకుండ మణిరత్నహ్రద కౌశిక్య భరత జ్యేష్ఠాలికా విశ్వేశ్వర కల్పనరకన్యాససంవేద్య నిశ్చీవాప్రభవ వశిష్ఠాశ్రమ దేవకూట కూపవసిష్ఠాశ్రమ వీరాశ్రమ బ్రహ్మసర బ్రహ్మవీర అవకాపిలి కుమారధార శ్రీధారా గౌరీశిఖర శునఃకుండ నందితీర్థ కుమారవాస శ్రీవాస ఔర్వసీతీర్థ కుంభకర్ణహ్రదతీర్థ కౌశికిహ్రద ధర్మకామతీర్థ ఉద్ధాలక సంధ్యా కారతోయ కపిల లోహితార్జవ శోణోద్భవ వంశగుల్మ ఋషభ కలతీర్థ పుణ్యావతీహ్రద బదరీకాశ్రమ రామతీర్థ పితృవన విరజా మార్కండేయవన కృష్ణతీర్థ వటతీర్థ రోహిణీ ప్రవరతీర్థ ఇంద్రద్యుమ్ను నరతీర్థ సానుగర్త మహేంద్రతీర్థ శ్రీనద ఇషుతీర్థ వార్షభ కావేరీహ్రద కన్యా గోకర్ణ గాయత్రీస్థాన బదరీహ్రద మధ్యస్థాన వికర్ణక జాతీహ్రద దేవకూప కుశప్రవణ సర్వదేవవ్రత కన్యాశ్రమహ్రద వాలఖిల్యమహర్షి అఖండిత హ్రద నామక తీర్థములు ఇవి.
వీనిని శ్రద్ధతో సేవించి స్నానాది విధులుచేసి ఉపవసించి జితేంద్రియుడై దేవ ఋషి పితృ తర్పణములు గావించి దేవతార్చనముచేసి మూడు రాత్రులు ఇందు ఉపవసించిన వారికి వేరువేరు ఫలములు అనంతములు కల్గును, దాన అశ్వమేధ యాగఫలము కల్గును. సంశయము లేదు. ఈ తీర్థ మాహాత్మ్యము నిత్యము విన్నను పఠించినను సర్వపాప విముక్తి గల్గును అని చెప్పెను. (25)