నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

125 - పురాణ మహిమ వర్ణనమ్

సూత మహర్షిపలికెను :- ఇట్లు నారదమహర్షి ఆకుమారులనుండీ చక్కగా అన్ని విషయములనడిగి తెలుసుకొని వారిని చక్కగా పూజించెను. అంతట ఆకుమారులు తమతమ నిత్యకృత్యములను చక్కగా పూర్తిచేసుకొని మహేశ్వరుని లోకమునకు వెళ్ళిరి. అచట అగ్నిసూర్య సన్నిభులగు వామదేవాది మునీన్తులచే సురాసురేన్రులచే పూజించబడుచున్న శంకరునికి నమస్కరించి అతని ఆజ్ఞచే భూమిపై కూర్చుండిరి. అచట శివునివలన జీవబంధమోచకము అఖిల శాస్త్రసారమగు శివాగమమును విని జ్ఞాన ఘన స్వరూపులగు ఆకుమారులు పురారికి నమస్కరించి తండ్రియగు బ్రహ్మలోకమునకు వెళ్ళిరి. బ్రహ్మపాదపద్మములకు ప్రణమిల్లి బ్రహ్మచే గౌరవించబడి, ఆశీర్వాదమును పొంది, పరమపావనలగు కుమారులు లోకములోని తీర్థములలో సంచరించుచున్నారు. తరువాత వారు బదరీవనాన్తమున సురేన్తవర్గములచే సేవించబడుచున్న, వీతరాగులగు యతలచే ధ్యానించబడు, అవ్యయమగు విష్ణుపాదపద్మములను ధ్యానించిరి నారదమహర్షి కూడా కుమారువలన విజ్ఞానసహితమగు జ్ఞానమును పొంది మిక్కిలి ప్రీతిచెందెను. అపుడు నారదమహర్షి గంగాతీరమునుండి బ్రహ్మలోకమునకు వచ్చి బ్రహ్మకు నమస్కరించి అతనిచే సత్కరించబడి కూర్చునెను. కుమారుల వలన వినిన విజ్ఞానము తమదు జ్ఞానమునంతను యధాతధముగా వినిపించెను. దానిని వినిన బ్రహ్మ కూడా సంతసించెను. అంతట నారదమహర్షి బ్రహ్మకు నమస్కరించి ఆశీర్వాదములను పొంది మునిసిద్ధని షేవితమగు కైలాసమును చేరెను. ఆకైలాసము నానాశ్యర్చమయము, సర్వఋతుపుష్పయుతవృక్షములచేమందారపారిజాత చంపకాశోకవనంబులవృక్షములచే, ఇతరములగు పలు వృక్షములచే, నానా పక్షిగణములచే ఆశ్రయించబడిన వాయువుచే ఊగుచున్న శాఖలచే బాటసారులను పిలుచుచున్నట్లున్న వృక్షములచే ఆవరించబడియున్న నానామృగగణాకీర్ణము, సిద్దకిన్నల సంకురము, స్వచ్ఛసలిలములుగల స్వర్ణపద్మప్రకాశముచే విలసిల్లుచున్న సరస్సులచే శోభించబడుచున్న సారసములచే, హంసలచే, చక్రవాకములచే ధ్వనించబడుచున్న, ఆకాశగంగాపాతధ్వనులచే కూడి యున్నది. కుచకుంకుమలచే పింగల వర్ణములు గల అలకనందా జలములలోక్రీడించు అప్పరోస్తీలచే కూడియున్న పుష్కరోద్దత ములగు జలములను పరిమళముచే మదించిన యేనుగల ఆడయేనుగులపై చల్లి స్నానము చేయించుచున్నా, తెల్లని మేఘమువంటి కైలాస పర్వత శృంగమునందు నీలమేఘునిభము శతయోజన వ్యాప్తమగు వటవృక్షమును చూచెను. ఆవటవృక్షము క్రింద యోగి మండలమధ్యమున కూర్చొనియున్న, వ్యాఘ్రచర్మాంబరధారి, కపర్ది, విరూపాక్షుడు, భూతిభూషిత సర్వాంగుడు, నాగభూషణ భూషితుడు, రుద్రాక్షమాలా శోభితుడు, చన్జశేఖరుడు, అగుశంకరుని చూచిన నారదుడు భక్తితో శిరసును వంచి జగదీశ్వరుని పాదములకు నమస్కరించెను. తరువాత వృషధ్వజుని ప్రసన్నమనసుచే, వాక్కుతో స్తోతము చేసి, యోగులచే సత్కరించబడి, శివాజ్ఞచే ఆసనముపై కూర్చెండెను. అంతట జగద్గురువు నారదుని కుశలమడిగెను. నారదుడు తమ అనుగ్రహముతో అంతా కుశలమే అని చెప్పెను. అచటి యోగులందరూ వినుచుండగా జీవబంధమోచకమగు శివాగమమును నారదుడడిగెను. అంతట శివుడు నారదుని భక్తిచే సంతోషించి ఆశ్రితవత్సలుడు కావున అష్టాంగసంయుక్తమగు జ్ఞానమును ఉపదేశించెను. లోకమంగళకరుడగు శంకరుని వలన శివజ్ఞానమును పొంది ప్రసన్నమనస్కుడై నమస్కరించి శ్రీమన్నారయణుని సన్నిధికి చేరెను. అచట కూడా నారదుడు గతాగతపరాయణుడు సిద్దయోగి సేవితుడగు నారాయణుని సంతోషపరిచెను. ఓ బ్రాహ్మణోత్తములారా? ఇట్లు మీకు నారదీయమహాపురాణమును ఉపాఖ్యాన సమన్వితము, వేదసమము, సర్వశాస్త్ర నిదర్శనము, చతుష్పాదసమాయుక్తము, వినువారికి జ్ఞానమును పెంచుదానిని చెప్పితిని. ఈ నారదీయపురాణమును శివాలయమునకాని, బ్రాహ్మణసమాజమునకాని, విష్ణ్వాలయమున కాని, మధురయందు, ప్రయాగయందు, పురుషోత్తమ క్షేత్రమున, సేతుక్షేత్రమున, కాంచియందు, ద్వారకయందు, గంగాద్వారమున, కుశస్థలమున, పుష్కరములందు, నదీతీరమున, ఏదో యొక పవిత్రప్రదేశమున భక్తికలవాడై కీర్తించినచో సర్వయజ్ఞఫలమును, సర్వతీర్థఫలమును, సర్వదానఫలమును, సర్వతపఃఫలమును, పొందును. ఉపవాసముతో, హవిస్సును భుజించి కాని, జితేంద్రియుడై చెప్పువాడు వినువాడు నారాయణ పరాయణుడుకాని, శివభక్తిపరాయణుడు కానీ సకలసిద్దులను పొందును. ఈనారదపురాణమున సకలపుణ్యములు, సకలసిద్దులు కలవు. చదువువారికి వినువారికి సకలపాపములను నశింపచేయును. మానవులకు కలిదోషమును హరించును. సర్వసంపదలను వృద్ధిపొందించును. సర్వాభీష్టప్రదము. సర్వజ్ఞానప్రకాశకము. శైవులకు,వైష్ణవులకు, శాక్తులకు, సూర్య సేవకులకు గణపతి భక్తలకు, వర్ణాశ్రమావలంబులకు, అన్ని తపస్సులకు, అన్నివ్రతములకు, కలుగు అన్ని ఫలములను ప్రకాశింప చేయునది. మంత్రముల, యంత్రముల వేదాంగముల, ఆగమముల, సాంఖ్యముల, వేదముల సంగ్రహమిది. ఈ పురాణమును భక్తితో చదువువారికి, వినువారికి, దేవాదులకు కూడా దుర్లభములగు వాంఛితకామనలు ఫలించును. వేదసమ్మితమగు ఈనారదీయ పురాణమును విని, చెప్పువానిని ధనరత్నాంశుకాదులచే, భూమిదానములచే, గోదానములచే రత్నదానములచే, హస్తి అశ్వ, రథ దానములచే పూజించవలయును. గురువును సంతోషపరచవలయును. ధర్మసంగ్రహమగు ఈ పురాణమును వ్యాఖ్యానము చేయు వాడు నరులకు చతుర్వర్గప్రదాతకావున అతనితో సమానమగు గురువెవరుండును. ఇట్లు ధర్మోపదేశమును చేయు గురువునకు కావాజ్మనస్సులతో ధనాదులతో సర్వకాలములందు ప్రియము నాచరించవలయును. పురాణమును యధావిధిగా విని హోమము నాచరించి, దేవతాపూజ గావించి మిష్టాన్నపాయసములతో నూరుమంది బ్రాహ్మణులను భుజింపచేసి శక్తికొలది దక్షిణలనిచ్చినచో వారి భక్తికి మాధవుడు ప్రీతి చెందును. నదులలో గంగానది, సరస్సులలో పుష్కరము, పురములలో కాశీ, పర్వతములలో మేరుపు, దేవతలలో నారాయణుడు, యుగములలో కృతయుగము, వేదములలో సామవేదము, పశువులలో ధేనువు, నరులలో బ్రాహ్మణులు, ఖాద్యములలో అన్నము, పానీయములలో జలము మృగములలో సింహము, పురుషుడు, అశ్వత్తము, ప్రహ్లాదుడు, ముఖము, ఉచ్చైశ్రవము, వసంతము, జపము, శేషుడు, అర్యమ, ధనువు, అగ్ని, విష్ణువు, ఇంద్రుడు, కపిలుడు, ఆకృతి, కవి, అర్జునుడు, హనుమనుడు, దర్భ, చిత్తము, చిత్రరధుడు, అంబుజము, ఊర్వశి కాంచనము ఎట్లు తమజాతిలో శ్రేష్ఠములో అట్లే పురాణములలో నారదీయము శ్రేష్ఠము. ఓ బ్రాహ్మణోత్తములారా? మీకు శాంతి కలుగుగాక. శుభము కలుగుగాక. ఇకనేను గురువుగారగు వ్యాసమహర్షి వద్దకు వెళ్ళేదను. అని చెప్పగా శౌనకాది మహర్షులు సూతమహర్షిని చక్కగా పూజించిరి. గురువును దర్శించుటకు అనుమతించిరి. ఇక శౌనకాది ఋషి వర్యులు కూడా సావధానముగా వినిన దానిని చక్కగా అనుష్టించి అచటనే ఉండిరి. కలికల్మషవిషనాశనమగు శ్రీహరిని జపపూజనవిధి భేషజములతో సేవించువాడు నిష్కల్మషమనసుతో యాగఫలమును పొంది అభీప్సిత లోకమును పొందును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వ భాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాద మున పురాణమహిమావర్ణనమను నూటా ఇరువదియైదవ అధ్యాయము సమాప్తము.

 బృహన్నారదీయ పురాణమున పూర్వభాగము సమాప్తము.